7, ఆగస్టు 2023, సోమవారం

కవులపాట్లు

 జంట(కవుల)కోసం నాటి కవులపాట్లు!



*మనసువిప్పి కాస్సేపు…37


మన సాహితీలోకం చాలా విస్తృతమైంది.

వింతలు,విశేషాలకు లోటేలేదు.ముఖ్యం

గా మన కవులకు సంబంధించిన విషయా

లు ఎన్నోవున్నా వాటిలో రికార్డుకెక్కినవి ..

చాలా తక్కువ.మరుగున పడిన విషయా

లే ఎక్కువ..


మీకు తెలియందేమీ కాదుకానీ, మామూలు 

మనుషుల్లో మాదిరే కవుల్లోకూడా ఈర్ష్యా 

ద్వేషాలు,కుల,మతాల అంతరాలు,ప్రాంతీ

య విభేదాలు..తక్కువేం కాదు….పేరుకు

కవులైనా కూడా వాళ్ళూ మనుషులేగా.!

అదలా వుంచితే…సాహితీలోకంలో వెలుగు

లోకి రాకుండా, మరుగునపడిన కొన్ని ఆసక్తి

కరమైన విషయాలు,ను ఇలా…మనసు

విప్పి మీతో పంచుకుంటున్నాను.!!


*విశ్వనాథ..పింగళి..!!


విశ్వనాథ సత్యనారాయణ,పింగళి లక్ష్మీ….

కాంతం ఇరువురూ సహధ్యాయులు.మంచి

మిత్రులు..ఒకరంటే ఇంకొకరికి అభిమానమే.

అయితే ఎందుకోగానీ ఇద్దరి మధ్య కొంత ….

అంతరం వుండేది..


ఆరోజుల్లో జంట కవిత్వం రాయడం  ప్యాషన్

గా వుండేది..ఓరోజు విశ్వనాథవారు పింగళి లక్ష్మీకాంతం దగ్గరకెళ్ళి మనిద్దరం జంట కవి

త్వం చెబుదామన్నారట..పింగళిగారికెందుకో ఈ ప్రతిపాదన నచ్చలేదు.విశ్వనాథకు మాది

రిగానే ఆయన కూడా జగమెరిగినకవి,పండి

తుడు,విమర్శకుడు (సాహిత్య శిల్ప సమీక్ష) కూడా..జంటకవిత్వం రాద్దామన్న విశ్వనాథ

వారితో "  ఏ భాషలో అన్నారట పింగళివారు

ఎత్తిపొడుపుగా ..దానికి" తెలుగు,సంస్కృతం

లో అన్నారట విశ్వనాథ..దానికి పింగళివారు

వ్యంగ్యంగా ఓ నవ్వునవ్వారట.పింగళి వైఖరి 

విశ్వనాథవారికి తీవ్ర మనస్తాపం కలిగించింది.

ఇంతకూ పింగళివారి తిరస్కారానికి కారణం..

వైదికి..నియోగుల మధ్య గొడవే అయి వుండొ

చ్చుంటారు సాంధ్యశ్రీ.


పింగళితో జంటకవిత్వ ప్రతిపాదనకు ఫుల్

స్టాప్ పెట్టి  విశ్వనాథవారు కొడాలి ఆంజనే

యులు  గారితో కలిసి "సత్యాంజనేయులు"

పేరుతో జంట కవిత్వం రాశారు.అయితే..

ఈ జంటకవిత్వం కొన్నిరోజులు మాత్రమే

కొనసాగింది..రాసింది కూడా చాలా తక్కు

వే.అలాగే రాసిన ఆ కాస్తా,కూడా ప్రస్తుతం అలభ్యం.!


విశ్వనాథ సత్యనారాయణ,పింగళి  లక్ష్మీ కాంతం,కాటూరి,కొడాలి వేంకట సుబ్బా రావు,కొడాలి  ఆంజనేయులువేలూరి శివ

రామశాస్త్రి,గుర్రంజాషువా తదితర దిగ్గజ

కవులంతా తిరుపతి వేంకట కవుల శిష్య

రికం చేసినవారే..ఒకరంటే మరొకరికి అభి

మానం వున్న వారే..అలాగే ఈర్ష్యాద్వేషాలు 

కూడాను…!!


"కొడాలి"  బహు గొప్ప కవి…!!


"హంపీ క్షేత్రం" కావ్యం  రాసిన కొడాలి వేంకట

సుబ్బారావు గారు, విశ్వనాథవారు మంచి ..

స్నేహితులు..ఎప్పుడూ.."మా సుబ్బారావు"

అంటూ ఆప్యాయంగా పిలిచేవారు..వేంకట

సుబ్బారావు గారు పిన్నవయసులోనే కాలం

చేశారు.అప్పుడు విశ్వనాథ వారు చాలా బాధ

పడ్డారు.."మా సుబ్బారావు బతికుంటే తెలు

గు కవిత్వానికి పట్టుబట్టలు కట్టి అలంకరించే

వాడు..'అంటూ కంటనీరు పెట్టుకున్నారట..!!

"శిలలు ద్రవించి యేడ్చినవి .."అంటూ హంపీ

క్షేత్రంలోని పద్యాన్ని విశ్వనాథవారు పలుమా

ర్లు గుర్తుచేసుకునేవారట.కొడాలి చనిపోయి

న  కొన్ని సంవత్సరాల తర్వాత విశ్వనాథ వారి చొరవతో హంపీక్షేత్రం ఖండకావ్యాన్ని 

అచ్చేయించడానికి శ్రద్ధ తీసుకున్నది విశ్వ

నాథ వారే కావడం విశేషం.స్నేహితు లెవరై

నా …విశ్వనాథవారి వైఖరి ఇలానే వుండే

దట..!!


కొడాలి సుబ్బారావు సుప్రసిద్ధుడైన కవి.

హైస్కూల్ హెడ్  మాస్టరుగా, అనంతరం కళాశాలలో ఆంధ్రోపన్యాసకునిగా పనిచే

శారు. తన మేనమామ కామరాజుగడ్డ శివయోగా..నందరావు, సుబ్బారావు కలిసి జంటగా కవిత్వం రాసారు."హంపీ క్షేత్రం "

ఖండ కావ్యం రచయితలుగా ...'కొడాలి

సుబ్బారావు ,గారితో పాటు శివయోగా 

పేరు కూడా  కనిపిస్తుంది..!!


*పింగళి..కాటూరి..!!


కాగా పింగళి లక్ష్మీకాంతం‌‌, కాటూరి వేంకటేశ్వ

రరావు కలిసి "పౌలస్త్య హృదయం" అనే…

కావ్యం రాశారు..ఇందులో 39 పద్యాలుమాత్ర

మే వున్నాయి..1944లో ఈ పుస్తకం మచిలీ 

పట్నం లో అచ్చేశారు..అప్పట్లో ఈ పుస్తకం

ఖరీదు పావలా వుండేది..


మచ్చుకు..ఇందులోని ఓ నాలుగు పద్యాలు..

చూద్దాం..!!


1*నురుగుల్ గ్రక్కుచు నూర్పుసందడులు

   మిన్నుల్ ముట్ట 


   ఒక్కుమ్మడిన్ పరుగుల్ ద్రొక్కుచు    

   శీర్ణకేశముల నుద్బాహుండవై 


   వచ్చు తత్తరమున్ గాంచి ఉత్తలం

   పడెడు చిత్తంబు


  ఈ భయోద్వేగమే వారిచే నీకొనగూడె 

  అర్ణవ పతివాక్రుచ్చవయ్యా వెసన్"!


2*భృకుటి మాత్రముచే మూడు భువన

   ములకు


‌  విలయము ఘటించు  జగదక వీరుల

  మట


  నీకు మద్బాహువింశతి నాకు నీదు…


 వీచికాకోటియట కోట వెరపు ఇకేల?"!!


3*నాకున్నీకు భయంబటన్ననుడి ఎన్నండైన   

   విన్నామా నే


  డీ కంపమ్మునకున్ కతమ్ము కనరాదే

  సుంతయున్ భాస్కరుం


  డేకాకారత వెల్గు వాయువును మున్నెట్ట

  ట్టులే వీచు లే


  దే కల్పాంత పయోద గద్య కనరాదె తార

  కల్ రాలుటల్ "!!


 4*చంద్రహాసము నా చేయిజారలేదొ  ఔర్వ

  శిఖియు నీ జఠరమందారలేదు

  సద్యకార్ముకుడై రామచంద్రమూర్తి

  సింగినీ టాంకృతియు నింత సేయలేదు"!!


ఈ పద్యాలంటే విశ్వనాథవారికి ఎంతో ఇష్టం..


(దశాబ్దాలు దాటినా ధారణతో ఈ పద్యాలను

 అలవోకగా వల్లెవేసిన 'సాంధ్యశ్రీ ' గారికి కృత

 జ్ఞతలు..ఈ సందర్భాలకు ఆయనే ప్రత్యక్ష

 సాక్షీ  భూతులు)


ఇలా వుంటే దేవులపల్లి కృష్ణ శాస్త్రి,జాషువా,

పింగళి లక్ష్మికాంతం,కాటూరి వెంకటేశ్వరరావు

వేదుల సత్యనారాయణ ను ప్రశంసిస్తూ…. విశ్వనాథ సత్యనారాయణ గారు ఓ పద్యం

రాశారు..‌ఈ పద్యం ప్రతీ పాదంలో ఓ కవిని గురించి ప్రస్తావించారు.‌."ఈ కవులు ఎంత మృదు  మధురంగా కవిత్వం చెబుతారు. నాకెందుకయ్యా పలుకులో ఇంత పెళుసు

తనం,కాఠిన్యం ఇచ్చావంటూ"...స్వ నింద 

కూడా  చేసుకున్నారు విశ్వనాథ..!!


ఆపద్యం ఇది…!!


"ఒక్క  క్రైస్తవకవి ఉదిత మాధుర్య రసో

త్కటంబగు శబ్దమూది  పలుకు…


ఒక బ్రాహ్మ మత కవి యుల్లోకమగు 

కూర్పుటదుకుతో కూటస్థుడైనవాడు 


అలగౌతమీ కోకిలాక్షయౌ కవి పంచమ 

స్వరంబున‌ మాట మాటనాడు


అరయ ఇద్దరదృష్టవంతులౌ కవులు 

చిక్కగా సన్నగా పాడగలరు గీతి…


నిన్నెవరు మెచ్చుకొందురీ నేలయందు

పలుకు పెళుసైనయట్టి నిర్భాగ్య కవిని

కలిత లౌకిక సాంసారిక ప్రగాఢ దుఃఖ

దూషిత వాంఛా విధూత మతిని "!!


        *విశ్వనాథ సత్యనారాయణ.!!


చూశారుగా తన సాటి కవులను ప్రశంసిస్తూనే

తనలా "పలుకు పెళుసైనయట్టి నిర్భాగ్య కవినిఎవరు మెచ్చుకుంటారంటూ" వాపో

యాడు..అంతేకాదు..' కలిత లౌకిక సాంసారిక ప్రగాఢ దుఃఖదూషిత వాంఛా విధూతమతిని"

అంటూ తనను తాను  తక్కువచేసిచెప్పు

కున్నారు.!!


*జంటకవిత్వానికి  

పేరు కుదరలేదు..!!


దీపాల పిచ్చయ్య శాస్త్రి, జాషువా గారు … కలిసి జంటగా కవిత్వం రాద్దామనుకున్నారు , అయితే వీరి జంటకు పేరు సరిగ్గా కుదరలేదు.

ఇద్దరి పేర్లను కలిపి ఎటుతిప్పినా 'పిచ్చిజాషు

వా 'అనీ,లేక  జాషువా పిచ్చి’ అని గానీ జంట పేరు పెట్టుకోవాల్సి వస్తున్నందున,ఈ జంట

కవిత్వ ప్రయత్నాన్ని వారు విరమించుకున్నా

రట. అలా.. ఆ 'జంట'కు పేరు అచ్చిరాలేదు.


*చిలకా..గోరింక కవులు..!!


1965లో ప్రతాప వెంకట కొండయ్య  శాస్త్రి

గారితో  కలిసి కవి దస్తగిరి "ప్రతాపగిరి కవు

ల." పేరిట జంటకవిత్వం రాశారు..అలా..

రచించిన పద్యకావ్యం పేరు‌  "వర్తమానం".!!


ఈ కృతి రచనలో విశేషమేమంటే..ఒక కవి హిందూ,మరొకరు ముస్లిం, హిందూ ముస్లిం కవుల సఖ్యతకు ఈ కావ్య రచన పరాకాష్ట.

కాగా,ఈ జంట కవుల్లో ఒకరైన దస్తగిరి గారు రాయల సీమ ప్రాంత కవి కాగా,  కొండయ్య

శాస్త్రి గారు ఆంధ్రా ప్రాంత కవి.ఈ రకంగా… ప్రాంతీయ సరిహద్దుల్ని కూడా చెరిపేసింది 

ఈ 'వర్తమానం' కావ్యకవుల జంట..


ఈ జంట కవుల కలయికను చిలకా,గోరింక కలయికగా అభివర్ణించారు.కాండూరి నర

సింహా చార్యులు గారు.!!


*ఎ.రజాహుస్సేన్.!!

కామెంట్‌లు లేవు: