29, జనవరి 2025, బుధవారం

*కంచి పరమాచార్య వైభవం.180*

 *కంచి పరమాచార్య వైభవం.180* 


*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం* 

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।* 


*🌸గుజరాతీ బ్రాహ్మణుడు - నిప్పుల కొలిమి🌸* 


చాలా ఏళ్ల క్రితం తమిళ సంవత్సరాది అయిన చిత్తిరై నెల మొదటి రోజున శ్రీమఠంలో చాలా రద్దీగా ఉంది. మెల్లిగా కదులుతున్న ఆ వరుసలో మహాస్వామి వారి దర్శనార్థమై ఒక పదహారు సంవత్సరాల పిల్లవాడు కూడా ఉన్నాడు. దాదాపు పది గంటల సమయంలో ఆ అబ్బాయి మహాస్వామి వారు కూర్చున్న వేదిక వద్దకు వచ్చాడు. స్వామి వారు అతన్ని చూసారు. తన అష్ట అంగములు నేలకు తగిలేట్టు స్వామి వారిని సాష్టాంగం చేసాడు కాని ఎంతసేపటికి పైకి లేవలేదు. కొద్దిసేపటి తరువాత మహాస్వామి వారే లెమ్మన్నారు.


అతను లేచినిలబడి తన రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసాడు. కలిగిన అనుభూతి ఇంకా వీడలేదు. కళ్ళ నుండి నీరు కారుతూ ఉంది. స్వామి వారు దగ్గరికి రమ్మన్నారు. అతను అలాగే స్వామి వారి వద్దకు వెళ్ళాడు.


స్వామి వారు అతన్ని “బాబూ నువ్వు ఎవరు? నీ పేరేమి? ఎక్కడినుండి వస్తున్నావు?” అని అడిగారు. ఆ అబ్బాయి చాలా వినయంతో, తన కుడి అరచేతిని నోటి వద్దకు తెచ్చి, “స్వామి నా పేరు బాలకృష్ణ జోషి. నేను మద్రాసు నుండి వచ్చిన గుజరాతీ బ్రాహ్మణున్ని. నా స్వస్థలం గుజరాత్” అని చెప్పాడు.


”మద్రాసులో ఏ ప్రాంతం?”


“హనుమంతనారాయణన్ కోయిల్ వీధి స్వామి” జోషి సమాధానమిచ్చాడు.


”ఎంతదాకా చదువుకున్నావు?”


“ఎనిమిది దాకా పెరియవ” చిన్న స్వరంతో చెప్పాడు.


”సరే!! ఈ రోజు సంవత్సరాది కావున ఇక్కడ ఉన్న అన్ని దేవాలయాలలో స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చావు కదూ” అని అడిగారు.


”అది కాదు పెరియవ. నేను పెరియవ దర్శనం చేసుకోవడానికి వచ్చాను”


వెంటనే మహాస్వామి వారు “అపచారం అపచారం నువ్వు అలా చెప్పకూడదు. మనం వేరే ప్రదేశం వెళ్ళినప్పుడు అక్కడున్న శివాలయములు, విష్ణ్వాలయములు, అమ్మవారి ఆలయములు దర్శించుకోవాలి. నేను కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మొదట దేవాలయ దర్శనం చేసిన తరువాతనే ఏపనైనా అర్థమైందా?” అని స్వామి వారు నవ్వారు.


”ఇప్పుడు అర్థమైంది పెరియవ” జోషి అణుకువగా చెప్పాడు. ”మంచిది. అచార్యులు ప్రసాదం ఇచ్చిన తరువాత నువ్వు అన్ని దేవాలయాలను చూసి మద్రాసు బస్సు ఎక్కాలి. తెలిసిందా?” అని స్వామి వారు చెప్పారు


కొద్దిగా ధైర్యం తెచ్చుకున్న బాలకృష్ణ జోషి, “నాకు బాగా అర్థమైంది పెరియవ. మీ ఆజ్ఞ ప్రకారం నేను అన్ని దేవాలయాలను చూసిన తరువాత మీ అనుగ్రహం కోసం మఠానికి వస్తాను” అని అన్నాడు.


పరమాచార్య స్వామి వారు నవ్వుతూ, “అదే అదే నేణు చెప్తున్నది. ఇప్పుడే నీకు ప్రసాదం ఇస్తాను. మళ్ళా ఇక్కడికి రావడం ఎందుకు? ఓహో దేవాఅలయ దర్శనానంతరం మఠంలో భోజనం చేసి వెళ్తావా?మంచిది మంచిది అలాగే” అని స్వామి వారు తమ సమ్మతిని తెలిపారు.


జోషి కొద్దిగా సొంకోచిస్తూ నిలబడ్డాడు. అతని కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.

“ఏమిటి విషయం?” అని స్వామి వారు ప్రేమతో అడిగారు. జోషి కళ్ళు తుడుచుకుంటూ “నేను ఇక్కడ కొద్దికాలం ఉండాలనుకుంటున్నాను. అందుకని...”

అతను ముగించేలోపలే స్వామి వారు అడ్డుపడుతూ,


“ఇక్కడ అంటే? నాకు అర్థం కాలేదు”


“ఇక్కడే మఠంలో పెరియవ” అని వినయంతో చెప్పాడు. ”ఏంటి మఠంలోనా? ఇది సన్యాసులు ఉండే చోటు. నీలాంటి యువకులకు ఇక్కడేం పని?” కొంచం దృఢమైన స్వరంతో “స్వామి దర్శనం చేసుకుని నీ చోటికి వెళ్ళిపో” అన్నారు.


జోషి కదలలేదు. స్వామి వారికి మళ్ళా సాష్టాంగం చేసి అసలు విషయం బయటపెట్టాడు. “పెరియవ అలా ఆజ్ఞాపించకండి. మఠంలో కొద్దికాలముండి మిమ్మల్ని సేవించుకోవాలని నా కోరిక”


పరమాచార్య స్వామి వారికి పరిస్థితి అర్థమైంది.


జోషి అమ్మయకపు మాటలు, అతని భక్తి తత్పరత మహాస్వామి వారిని ఆకర్శించాయి. కాని అది బయటపడనీయకుండా, “నన్ను సేవించడానికి ఇక్కడ చాల మంది యువకులు ఉన్నారు. చిన్న పిల్లాడివి నీకెందుకు ఇవన్నీ. మద్రాసుకు బయలుదేరు” అన్నారు.


జోషి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కాని మఠం నుండి వెళ్ళిపోలేదు. అతను మఠంలోనే భోజనం చేసి, స్వామి వారు విశ్రాంతి తీసుకునే గది ముందు ఒక మూలన కూర్చున్నాడు. సాయింత్రం స్నానం తరువాత మహాస్వామి వారు బయటకు వచ్చి జోషిని చూసారు కాని ఏమి మాట్లాడక వెళ్ళిపోయారు.


నాలుగురోజులపాటు అవకాశం వచ్చినప్పుడల్లా స్వామివారి కనుచూపులో పడుతున్నాడు జోషి. నాలుగు రోజులు వైరాగ్య భక్తితో అక్కడే ఉండిపోయాడు. ఐదవ రోజు ఉదయం పరమాచార్య స్వామి వారు శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్తానం పుష్కరిణిలో కాల స్నానానికి వెళ్ళారు. స్నానం ముగించి వస్తూ జోషిని చూసి, “నువ్వు మద్రాసుకు వెళ్ళలేదా?” అని అడిగారు.


”లేదు పెరియవ. నా సంకల్పం సిద్ధించేవరకు నేను వెళ్ళను” అని బదులిచ్చాడు.


”ఏమిటి నీ సంకల్పం?” అని తెలియనట్టు అడిగారు.


”కొద్దికాలం పాటు మీ పాద కమల చరణ సేవ చేసుకోవాలి” ఆశావహంగా బదులిచ్చాడు జోషి.


”అసాధ్యమైన సంకల్పం చేయరాదు” అని పరమాచార్య స్వమి వారు వెళ్ళిపోయారు.


జోషి పట్టు వీడలేదు. స్వామి వారి గది ముందు నిలబడ్డాడు. స్వామి వారు భక్తుల దర్శనార్థమై బయటకు వచ్చారు. ఆ కుర్రవాని వైరాగ్యానికి స్వామి హృదయం మెత్తబడింది. అతన్ని దగ్గరకు పిలిచారు.


”మీ తండ్రి గారిది ఉద్యోగమా లేక వ్యాపారమా?” అని అడిగారు.


”వ్యాపారం పెరియవా. వజ్రాల వ్యాపారి. వజ్రాలను కొనడం అమ్మడం” జోషి బదులిచ్చాడు.


”నీకు ఉన్న స్వభావం చేత నీవు పెద్ద వ్యాపారి అవుతావు. అప్పుడు నువ్వు మంచి నమ్మకమైన నిజాఅయితీపరుడవైన వజ్రాల వ్యాపారి కావాలి. సరే నీ ఇష్ట ప్రకారం ఇక్కడున్న అబ్బాయిలతో కలిసి కొద్దికాలం నన్ను సేవించుకో” అని చివరికి తమ అమోదాన్ని తెలియజేసారు.


జోషి అక్కడున్న నలుగురైదుగురు యువకులతో స్వామి వారి సేవలో చేరాడు. స్వామి వారి దర్శనం, వారు చెప్పిన పనులు చేయడంతో రెండు రోజులు గడిచిపోయాయి. ఆ రెండు రోజులు పరమాచార్య స్వామి వారు నిద్రపోయే గదిలోనే మిగిలిన యువకులతో పాటు జోషి కూడా నిద్రపోయేవాడు. అది తనకు కలిగిన పరమ అదృష్టంగా భావించేవాడు.


మూడవ రోజు రాత్రి నిద్రపోయే ముందు స్వామి వారు జోషిని పిలిచి, “బాలకృష్ణ జోషి ఇప్పటి నుండి నువ్వు ఒక పని చేయాలి. వీరిలాగే నువ్వు కూడా నాతో ఉండు పగలంతా నా సేవ చేసుకో. కాని రాత్రి పూట నువ్వు ఇక్కడ పడుకోవద్దు” అన్నారు.


జోషి వెంటనే స్వామి వారి మాటలకు అడ్డు పడుతూ, “నా మీద దయ ఉంచి స్వామి వారు అలా ఆజ్ఞాపించవలదు. నేను కూడా ఈ అబ్బయిలతో పాటు ఇక్కడే పడుకునే వరం ఇవ్వండి” అని ఆత్రుతగా అడిగాడు.


”దీని వెనుక ఒక కారణం ఉంది” స్వామి వారు దృఢమైన స్వరంతో అన్నారు.“నువ్వు నా మాట వినాలి”


జోషి స్థాణువైపోయాడు. “అలాగే పెరియవ. మిరు ఏమి చెప్తే అది చేస్తాను”.


పరమాచార్య స్వామి వారు నవ్వి, “అలా చెప్పు. రాత్రి పూట నువ్వు వంటగదిలోకి వెళ్ళు. అక్కడ కట్టెల పొయ్యి వద్ద ఒక చెక్కబల్ల ఉంటుంది. ఆ బల్ల పైన హాయిగా నిద్రపోయి, ఉదయమే లేచి స్నానాదులు ముగించుకొని ఇక్కడకు రా. ఏంటి అర్థమైందా?” అని అన్నారు.


జోషి మరల ఏమి మాట్లాడలేదు. కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ, “మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాను పెరియవ” అని వెళ్ళిపోయాడు. అక్కడున్న ఇతర యువకులు ఇదంతా చూసి నవ్వుకుంటున్నారు.


మహాస్వామి వారు ఎందుకు తనని ఒంటరిగా వంటగదిలో కొలిమి దగ్గర పడుకోమన్నారో జోషికి అర్థం కావటం లేదు. జోషి బయటకు రాగానే అక్కడున్న కుర్రవాడితో తనకు ఎప్పుడైనా ఇలా పడుకోమని చెప్పారేమో అని అడిగాడు. అతను లేదు ఎవరికి ఇలా చెప్పలేదన్నాడు.

జోషి ఇది అవమానంగా భావించాడు.


అప్పుడు రాత్రి పదిగంటలైంది. ఏడుస్తూ, నిర్మానుష్యంగా ఉన్న వంటగదిలోకి వెళ్ళి కట్టెల పొయ్యి దగ్గర ఉన్న చెక్కబల్ల పైన పడుకున్నాడు. ఆ రాత్రి అతను ఏమి తినలేదు. మనసంతా ఆందోళనగా ఉండి బాధ, ఏడుపు వల్ల గొంతు తడారిపోయింది. చాలాసేపు నిద్రపట్టలేదు. ఎప్పుడో మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు.


తెలతెలవారుతుండగా మఠం మేల్కొంది. వెంటనే మఠంలో వేదపారాయణం భజనలు మొదలయ్యాయి. జోషి లేచి స్నాదులు ముగించుకుని, శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి అక్కడ కూర్చుండి పోయాడు. ఆరోజు స్వామివారి సేవకు వెళ్ళాలనిపించలేదు.


మద్యాహ్నం మఠానికి వచ్చి భోజనం చేసి మళ్ళా అమ్మవారి ఆలయానికి వెళ్ళాడు. రాత్రి వచ్చి వంటగదిలోని నిప్పుల కొలిమి దగ్గర పడుకున్నాడు. స్వామివారి దగ్గరికి అసలు వెళ్ళలేదు.


రెండు రోజులు ఇలాగే గడిచిపోయాయి. మూడవరోజు ఉదయం స్వామివారు ఒక సేవకుణ్ణి పిలిచి కంగారుగా అతణ్ణి అడిగారు “నాలుగు రోజుల క్రితం బాలకృష్ణ జోషి అనే కుర్రవాడు నా సేవకై ఇక్కడికి వచ్చాడు. రెండు రోజులుగా అతను కనపడ్డం లేదు. నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడా?”


ఆ సేవకుడు సంకోచిస్తూ, “లేదు పెరియవ అతను మఠంలోనే ఉన్నాడు” అని చెప్పాడు.


”మరి రెండు రోజులుగా ఎందుకు నా వద్దకు రావడం లేదు?”


“తెలియదు పెరియవ”


అంతలో మరొక సేవకుడు రావడంతో అతణ్ణి ఆ గుజరాతీ అబ్బాయి గురించి అడిగారు. అతనికి కూడా ఏమి తెలియదన్నాడు. ”సరే. జోషి ఎక్కడున్నాడొ వెతికి వెంటనే నేను రమ్మన్నానని తీసుకురండి” అని ఆజ్ఞాపించి వారి గదిలోకి వెళ్ళిపోయారు.


జోషి మహాస్వామి వారిముందు నిలబడ్డాడు. ”రా వత్సా! ఎందుకు రెండు రోజులుగా కనిపించటం లేదు. నీ అరోగ్యం బాఉన్నది కదా?” పరమాచార్యస్వామి వారు అపారమైన వాత్సల్యంతో అడిగారు.


జోషి మౌనంగా ఉన్నాడు.


”ఏదైనా దిగులా? లేక నా పైన కోపమా?” స్వామి వారు చిన్నపిల్లాడిలా అడిగారు.


జోషి చిన్నగా నోరు విప్పాడు. “అపచారం. అపచారం. కోపం ఏమి లేదు పెరియవ. నా మనస్సుకు చిన్న క్లేశం అంతే”


స్వామి వారు జోషి వంక ఆశ్చర్యంగా చూస్తూ, “బాధ. . . నా వల్ల?”. జోషి మౌనంగా ఉన్నాడు. స్వామి వారు వదల లేదు.


“రా ఇటు. ఇప్పుడు చెప్పు. నేను కూడా నీ బాధ ఏమిటో తెలుసుకోవాలి కదా?”

మహాస్వామి వారి ఒత్తిడి వల్ల జోషి నోరు తెరిచాడు. అక్కడున్న మిగిలిన యువకులు చేతులు కట్టుకుని నిలబడ్డారు. స్వామి వారికి సాష్టాంగం చేసి, తన కుడిచేతిని నోటికి అడ్డంగా పెట్టుకుని, జోషి మాట్లాడడం మొదలుపెట్టాడు.


”ఏమి లేదు పెరియవ. మొదటి రెండు రాత్రులు మీరు అందరి లాగే నన్ను కూడా మీ గదిలో పడుకోనిచ్చారు. నాకు చాలా ఆనందం వేసింది. హఠాత్తుగా నన్ను పిలిచి, వంటింట్లోని కట్టెల పొయ్యి వద్ద పడుకోమన్నారు. నేను గుజరాతీ బ్రాహ్మణుడను కావడం చేత ఇక్కడి వాణ్ణి కాకపోవడం చేత మీరు అలా ఆజ్ఞాపించారు అనే విషయం నన్ను కలచివేసింది. దయచెసి నన్ను క్షమించండి పెరియవ...” జోషి చిన్నపిల్లాడిలా గట్టిగా ఏడుస్తూ, స్వామి వారి పాదములపై పడ్డాడు.


మహాస్వామి వారు పరిస్థితి అర్థం చేసుకున్నారు. కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. నిశబ్ధం రాజ్యమేలుతోంది అక్కడ. అతణ్ణి ఒక్కడే వదిలెయ్యమని ఇతర యువకులను పంపించారు.


జోషిని దగ్గరకు పిలిచి పుత్రవాత్సల్యంతో అపారమైన కరుణతో


“అడడా బాలకృష్ణ. . . నేను నిన్ను నిప్పుల కొలిమి వద్ద పడుకోమన్నది నీవు ఇలా అర్థం చేసుకున్నావా? నేను అటువంటి అలోచనలతో నీకు అలా చెప్పలేదు. నీవు చిన్న పిల్లవాడివి అందుకే నన్ను అపార్థం చేసుకున్నావు”. ఈ మాటలు చెప్పి స్వామి వారు జోషిని తన వద్ద కూచోమన్నారు. జోషి సంకోచించి కింద నేలమీద కూచున్నాడు.


స్వామి వారు వాత్సల్య పూరితమైన మాటలతో “నిన్ను వంటింట్లో కట్టెల పొయ్యి వద్ద ఉన్న చెక్క బల్లపై పడుకోమని చెప్పడంలో నాకు అలాంటి ఉద్దేశము లేదు. అందుకు కారణం ఒక్కటే. జోషి ఇక్కడ చూడు” స్వామి వారు వారి వస్త్రాన్ని తొడ భాగం కనపడేలా పైకెత్తారు. స్వామి వారి తెల్లటి చర్మంపై దోమ కాట్ల వల్ల ఏర్పడిన ఎర్రటి దద్దుర్లు.


“వత్సా జోషి! ఇవి రాత్రిపూట నేను పడుకున్నప్పుడు దోమకాటు వల్ల ఏర్పడినవి. నేను సన్యాసిని కాబట్టి తట్టుకోగలను. నువ్వు చిన్న పిల్లాడివి ఆ బాధను నీవు భరించలేవు. మొదటి రెండు రాత్రులు నువ్వు దోమల వల్ల ఇబ్బంది పడడం నేను గమనించాను.


నువ్వు నాలాగే తెల్లగా ఉన్నావు. కనీసం నువ్వైనా మంచి స్థలంలో పడుకోవాలని భావించి అందుకని నిన్ను అక్కడ పడుకోమన్నాను. అక్కడి వేడి వల్ల దోమలు ఉండవు. నీవు హాయిగా నిద్రపోవచ్చు కదా. నిన్ను అలా ఆజ్ఞాపించడానికి కారణం అదొక్కటే. కాని నువ్వు నా మాటలను అపార్థం చేసుకున్నావు” అని స్వామి వారు గట్టిగా నవ్వుతున్నారు.


జోషి గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టాడు. ఏడుస్తూ, కనుల నీరు తుడుచుకుంటూ, వెక్కిళ్ళతో మాట తడబడగా “పెరియవ!!! దయచేసి నన్ను మన్నించానని చెప్పండి. మీ అవ్యాజమైన కరుణని అర్థం చేసుకోలేక నోటికివచ్చినట్టు మాట్లాడాను. నన్ను క్షమించండి” అంటూ సాగిలపడ్డాడు.


ఆ కరుణాస్వరూపులూ ప్రేమస్వరూపులు నవ్వుతూ, రెండు చేతులనూ పైకెత్తి జోషిని ఆశీర్వదించారు.


”జోషి నువ్వు భవిష్యత్తులో మంచి వజ్రాల వ్యాపారివి అవుతావు. న్యాయంగా ధనమార్జిస్తూ ధర్మంగా బ్రతుకు” అని స్వామి వారు మళ్ళా అశీర్వదించారు.


తరువాతి కాలంలో, బాలకృష్ణ జోషి మంచి దక్షత కలిగిన వ్యాపారవేత్తగా స్వామి వారి శిష్యుడుగా మెలిగాడు. స్వమి వారి తరువాత కొంత కాలానికి వారి పాదాలు చేరుకున్నాడు.


 *--- శ్రీ రమణి అణ్ణా, శక్తి వికటన్ ప్రచురణ* 



 *#Kanchiparamacharya vaibhavam* *#కంచిపరమాచార్యవైభవం*

భాగవతావతరణము

 శు భో ద యం 🙏


-భాగవతావతరణము!


"ధాతవు, భారతశ్రుతివిధాతవు, వేదపదార్థజాతవి

జ్ఞాతవు, కామముఖ్యరిపుషట్కవిజేతవు, బ్రహ్మతత్త్వని

ర్ణేతవు, యోగినేతవు, వినీతుఁడ వీవు చలించి చెల్లరే!

కాతరుకైవడిన్ వగవఁ గారణ మేమి? పరాశరాత్మజా!"


టీకా:

ధాతవు = బ్రహ్మ దేవుడివి; భారత = భారతమనే; శ్రుతి = వేదము; విధాతవు = సృష్టించిన వాడివి; వేద = వేదము లందలి; పదార్థ = విషయముల నుండి; జాత = పుట్టిన; విజ్ఞాతవు = విజ్ఞానము కలవాడివి; కామ = కామము {అరిషడ్వర్గములు - 1కామము 2క్రోధము 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు; ముఖ్య = మొదలగు; రిపు = శత్రు; షట్క = షట్కమును (6); విజేతవు = జయించినవాడివి; బ్రహ్మ = బ్రహ్మజ్ఞానము యొక్క; తత్త్వ = స్వభావమును; నిర్ణేతవు = నిర్ణయించిన వాడవు; యోగి = యోగులలో; నేతవు = నాయకుడవు; వినీతుఁడవు = జితేంద్రియుడవు; ఈవు = నీవు; చలించి = చలించి పోయి; చెల్లరే = తగునా; కాతరు = దీనుని; కైవడిన్ = వలె; వగవన్ = దుఃఖ పడుటకు; కారణము = కారణము; ఏమి = ఏమిటి; పరాశరాత్మజా = వ్యాసా {పరాశరాత్మజుడు - పరాశరుని పుత్రుడు, వ్యాసుడు}.


భావము:

“పరాశరుని పుత్రుడా! వ్యాసమునీంద్రా! నీవు బ్రహ్మదేవుడివి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాల్ని జయింనిన వాడివి. పరబ్రహ్మ తత్త్వాన్ని నిర్ణయించిన వాడివి,వేదాలని నాలుగుగా విభజించి వ్రాసినవాడివి. యోగులలో అగ్రేసరుడివి, వినయసంపన్నుడివి. ఇటువంటి నీవు ఈ విధంగా చలించిపోయి పిరికివాడి లాగ విచారించటం ఆశ్చర్యంగా ఉంది. కారణమేమిటయ్యా?”


హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ

సురుచిభ్రాజితమైన మానస సరస్స్ఫూర్తిన్ వెలుఁగొందుఁ శ్రీ

హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం బయ్యు శ్రీ

కరమై యుండ; దయోగ్యదుర్మదనదత్కాకోల గర్తాకృతిన్.


నీవు శ్రీహరిని స్తుతిస్తూ కావ్యాలను వ్రాస్తే బంగారు హంసలు విహరించే మానస సరోవరం మాదిరి మాహృదయాలు ప్రకాశిస్తాయి. 

   శ్రీహరినామ స్తుతి చేయని కావ్యము ఎంత చిత్రవిచిత్ర ఆర్థాలున్నదైనా శ్రీకరమై వుండదు. అందుకని శ్రీహరి చరిత్రమగు భాగవతమును రచియింపుమని నారదుడు వ్యాసునకు బోధించాడు.


           స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

చొల్లంగి అమావాస్య…

 రేపు మహా పర్వదినం చొల్లంగి అమావాస్య…


పుష్య కృష్ణ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానాం రోడ్డు మీద మూడు మైళ్ళ దూరాన ‘చొల్లంగి’ అనే గ్రామం ఉంది. గోదావరి ఏడు పాయలలో ఒకటైన ‘తుల్యభాగ’ ఇక్కడ సముద్రంలో కలుస్తుంది.

ఈ రోజు ఇక్కడ గోదావరి నదీ స్నానం అత్యంత పవిత్రమైనదని చెప్తారు.

”ఆద్యాతు గౌతమీ గంగా పశ్చాద్భాగిరధీ

స్మృతా తయోరేకతరా సేవ్యాగౌతమీ తత్రపావనీ ”

గోదావరి గంగా జలాన్ని కూడా పవిత్రం చేయగలదు. అందువలననే కాశీకి పోయిన వారు గంగా జలము తెచ్చి గోదావరిలో కలిపే ఆచార ము అనాదిగా ఆచరిస్తున్న సాంప్ర దాయమై ఉంది.

జీవనదియైన గోదా వరి పాయల్లో ఒకటి సా గరాన్ని సంగమించే చోటు కావడంవల్ల చొల్లం గి సమీపాన స్నానం చేస్తే, నదిలోను, సము ద్రంలోనూ ఏకకాలం లో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. ఈ దినా న జీవనది గోదావరి, సముద్రం లో కలిసే చోటు వద్ద స్నానమాచరించి, పితృ తర్పణం గావిస్తే వారి పితరులు 21 తరాల వారు నరక లోక యాతనల నుండి విముక్తులు కాగలరని, తత్ఫలితంగా స్వర్గ లోక… స్వర్ణలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు. గౌతము డు కొని తెచ్చిన గోదావరి జలాలను ఏడుగురు ఋషులు ఏడు పాయలుగా తీసుకొనిపోయి ఏడు స్థలాలలో సంగమించే విధంగా చేశారు. గౌతముడు స్వయంగా కొనిపోయిన శాఖ ”గౌతమి” నామాంకితయై గోదావరి అగ్రము వద్ద మాసా నితిప్ప చోట సముద్రంలో  కలుస్తుంది. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికు డు, జమదగ్ని వసిష్ఠుడు ఆరుగురు ఋషులు కొనిపోయిన శాఖలు వారివారి పేర్లతో పరమగు తున్నాయి. తుల్యుడు కొనిపోయిన శాఖ చొల్లంగి చెంత, ఆత్రేయ శాఖ కోరంగి సమీపాన, భరద్వాజ భైరవపాలెం/తీర్థాల మొండి వద్ద, కౌశిక నత్తల నడక సమీపాన, జమదగ్ని కుండలేశ్వరం వద్ద, వశిష్ఠ అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తున్నాయి.


”రేవా తీరే తప: కుర్యాత్‌ మరణం జాహ్నవి తటే

దానం దద్యాత్‌ కురుక్షేత్రే గౌతమీ మ్యాంత్రిత యం పరం”

”రేవా నది తీరాన తపస్సు చేస్తే ముక్తి. గంగా తీరాన మరణం ముక్తి. కురుక్షేత్రంలో దానం ముక్తి. గోదావరిలో స్నానం చేస్తే ఈ మూడు పుణ్యాలు లభిస్తాయి.” అని పై శ్లోకానికి అర్థం.

గోదావరి నదీమ తల్లి వల్ల మూడు వరాలు ప్రాప్తిస్తాయి కనుక ఏడు స్థలాలకు వెళ్ళి స్నానాలు ఆచరించి రావడాన్ని ‘సప్త గోదావరుల సాగర సంగమ యాత్ర” లేదా ”సప్త సాగర యాత్ర” అం టారు. సంతానం, తదితర కోరికలు ఈడేర డానికి సప్తసాగర యాత్ర చేయడం సంప్రదాయ సిద్ధం గా వస్తున్నది. సప్త సాగర యాత్ర పుష్య బహుళ అమావాస్య నాడు చొల్లంగి స్నానంతో ప్రారంభం అవుతుంది.

ఏడు తావులు చూసుకుని, ప్రాయ కంగా మాఘ శుక్ల ఏకాదశి నాటి కి వశిష్టా సాగర సంగమ స్థానమైన ”అంతర్వేది చేర తారు. ఆ దినం అక్కడ గొప్ప తీర్థం. ఆ ఏకాదశి ని ఆ ప్రాంతంలో ”అంతర్వేది ఏకాదశి” అని పిలవడం పరిపాటి. ఇలా సప్త సాగర యాత్రకు ఆది, తుది దినాలు పర్వదినాలుగా పరిగణింపబడతాయి. చొల్లంగి అమావాస్య అనే పేరు రావడానికి మహత్తు గల చొల్లంగికి ప్రసిద్ధి, తుల్యభాగ వల్ల కలుగు తున్నది.


”మహోదయ నామాలభ్య యోగ పుణ్యకా ల:

అమావాస్యా సోమ వాసర వ్రతమత: పద్మ యోగ పుణ్యకాల”మని పేర్కొనబడింది.

రవి శ్రవణ వ్యతీపాతము ఈనాడు జరిగితే అది మహోదయ యోగము, పద్మయోగ పుణ్య కాలము కలుగుతుంది. పుష్యమాసంలో వచ్చిన అమావాస్య మహోదయ అమావాస్య. అమావాస్య, ఆదివారం, శ్రవణా నక్షత్రం మూడు కలిసి వస్తే దానిని అర్ధోదయ అమావాస్య అంటారు. ఈ మూడింటిలో ఏదో ఒకటి లోపించి మిగిలిన రెండు కలిస్తే దానిని మహోదయం అంటారు.  పుష్య బహుళ అమావాస్య పర్వకాలం, మహత్తర దినం.  పుణ్యప్రద మైనందున సమస్త దోష నివారణకై నదీ స్నానం, పితృ తర్పణం, పిండ ప్రదానం, శివాలయ అంతర్భాగమైన రావి చెట్టు ప్రదక్షిణలు, శివారాధన చేయాలని, తద్వారా సకల జాతక దోషాలు తొలగించుకోవాలని శాస్త్రం చెబుతోంది.

ధర్మసూత్రములు

 పశుసంబంధమైన ధర్మసూత్రములు  -


 *  పశువుల కాపరికి యజమాని కూలి ఇవ్వనిచో యజమానికి పది ఆవుల పాలు పిండి ఇచ్చి తానొక్క ఆవుపాలు కూలికింద తీసుకొనవచ్చు . జీతము లేనప్పడుదియే కూలి .


 *  కంటికి కనపడనిది , పురుగులచే , కుక్కలచే తినబడినది , పల్లపు గుంటలు మొదలగు వానిలో పడి చచ్చినది , కాపరి లేనప్పుడు పారిపోయినది అయిన పశువులకు పశుకాపరిదే భాద్యత. కాపరి తెచ్చి ఇవ్వవలెను.


 *  దొంగలు దొమ్మిచేసి పశువులను అపహరించుకు పోయిన విషయము కాపరి వెంటనే యజమానికి దగ్గరలో ఉన్నప్పుడే చెప్పినచో కాపరి యజమానికి పశువులను ఇచ్చుకోవాల్సిన బాధ్యత లేదు .


 *  చచ్చిన పశువు చెవులు , చర్మం , తోక , వెంట్రుకలు , గోరోచనము వీటిని యజమానికి ఇవ్వవలెను. తక్కిన గిట్టలు , కొమ్ములు మున్నగునవి అన్నియు యజమానికి చూపించి మరలా తాను తీసికొనవలెను.


 *  దారిలోను , బూడిదలోను , గోవుల మందలోను మలమూత్రాలను విసర్జించరాదు . గోవుకి ఎదురుగా మలమూత్రాలను విసర్జించరాదు.


 *  నీరు తాగుచున్న ఆవును గాని , పాలు తాగుచున్న దూడను గాని నివారించరాదు. పాలు తీయునప్పుడు మూత్రం పోయుటను నివారించవచ్చు. ఇతరుల దూడలు పాలు తాగుచున్నప్పుడు వారికి చెప్పకూడదు. ఇంద్రధనుస్సును ఆకాశమున చూచి ఆ దోషమును ఎరిగిన వాడై ఉండి ఇతరులకు చూపరాదు.


 *  తుంటరివి , ఆకలిరోగములు గలవి , కొమ్ములు లేనివి , గుడ్డివి , గిట్టలు లేనివి , తోకలేనివి అగు వృషభములను కట్టిన బండ్లలో ప్రయాణం చేయరాదు .


 *  మచ్చికపడినవి , వడిగా నడుచునవి , శుభలక్షణాలు కలిగినవి , వన్నెయు , ఆకారం కలిగి ఉండునవి అగు ఎద్దులను గట్టిన బండ్లలో మునికోలతో పొడవవలెను.


 *  చతుష్పాద జంతువు విషయమై అపద్ధం చెప్పినవాడు అయిదుగురు బంధువులను , గోవు విషయమై అపద్ధం చెప్పినవాడు పదిమందిని, గుఱ్ఱముల విషయమై అపద్ధం చెప్పినవాడు వంద మందిని , మానవుల విషయమై అపద్ధం చెప్పినవాడు వెయ్యిమంది బంధువులకు చంపిన పాపమును పొంది నరకమునకు పోవును .


 *  ఈని పది దినములు గూడ గడవని గోవులను , చక్రము , శూలము మొదలగు గుర్తులు వేసి విడిచిన ఎద్దులను , హరిహరాదుల ముద్రలు వేసి ఉన్న ఎద్దులను , కాపరులతో ఉన్నను లేక పొలము నందు ప్రవేశించి నస్యములను తినుచున్నను వానిని దండింపరాదు.


 *  గోవుల పైన కూర్చుని స్వారి చేయరాదు . కాని బండికి కట్టవచ్చు.


 *  ఎవడు జంతువులను కట్టుట, చంపుట, వంచుట చేయుటకు ఇష్టపడడో అతడు సకల భూతములకు హితము గోరువాడు ఎల్లప్పుడూ తరగని మోక్షరూపం అగు ఆనందమును పొందును.


 *  బ్రాహ్మణుల గోవులను అపహరించినప్పుడు , గొడ్డుటావులతో బరువులు మోయించుటకై ముక్కుత్రాడు వేసినప్పుడు , యాగముల కొరకు పశువులను అపహరించినప్పుడు వెంటనే అపహరించినవాని కాలు సగము నరికివేయవలెను .


 *  మార్గములో గ్రామ సమీపేతర ప్రదేశమునందలి పొలములలో గోవులు మేసినచో  కాపరి కి జరిమానా వేయవలెను . తరువాత గోవులు తినిన మేతఫలమును కాపరి గాని , యజమానిగాని పొలము యజమాని కి ఇవ్వవలెను.


 *  వెంటనే ఊడ్చుట, గోమయముతో అలుకుట , గోమూత్రము మున్నగునవి చల్లుట , పైమట్టి ఎత్తి తవ్వి ఎత్తిపోయుట , గోవుని ఒక రాత్రి , ఒక పగలు కట్టివేయుట  ఈ అయిదింటిచేత భూమి పరిశుద్ధతనొందును.


 *  వర్షం కురియుట వలన నేలను చేరునవి , పశువుల తాగగానే దప్పిక తీరునవి , గంధము , రసము , రంగు వానితో కూడిన ఉదకములు అనగా నీళ్లు పరిశుద్ధములు.


 *  సకల జంతువుల ప్రాణ సంరక్షణార్థమై రాత్రిగాని , పగలుగాని ఎల్లప్పుడూ తన శరీరముకు కష్టం కలిగినను భూమిని చూచుచు  నడవవలెను .


 *  ఒక గ్రామము చుట్టును నూరు ధనువులంతా ( ధనువు అనగా నాలుగు మూరలు ) ప్రదేశము పశువుల మేతకును , గాలి మొదలగు వీచుటకు భూమి బీడుగా వదలవలెను. పట్టణం అయినచో దీనికి మూడురెట్లు ప్రదేశం బీడుగా వదలవలెను .


 *  పైన చెప్పిన బీడు భూమి చుట్టూ ఆవరణ లేక పైరు సరిగ్గా లేని స్థలము నందు గోవు మేసిన యెడల ఆ కాపరిని గాని , యజమానిని గాని దండించరాదు.


 *  పశువుల మేయు బీడు భూమి చుట్టు నుండు ఆవరణ ఒంటెలు తలయెత్తి చూచిన లోపలి ప్రదేశము కనపడని యంతఎత్తున చుట్టూ రక్షణ ఏర్పరచవలెను . కుక్కలు , పందులు లోపల దూరకుండా కిందవైపు సందులను మూయవలెను .


 *  గ్రామసమీపాన దారికి దగ్గరగా ఉండు చుట్టూ వేసిన ఆవరణలో గోవులు దూరి మేసినచో ఆ గోవుని దండింపక గోపాలకునికి జరిమానా విధించవలెను .


 *  ఎండకాయుచున్నను , వర్షం కురియుచున్నను , ముందుగా శక్తికొలది గోవులను సంరక్షించిన తరువాతయే తన్ను రక్షించుకొనవలెను .


 *  గోవును దర్భ తాళ్లతో , రెల్లు తాళ్లతో దక్షిణాభిముఖముగా కట్టివేయవలెను . ఈ తాళ్లకు నిప్పు అంటుకొని కాలిపోయినను గోవు చిన్న గాయాలతో బయటపడును . కట్టివేసినప్పుడు గోవు అగ్నిచేత దగ్ధం అయినపుడు ప్రాయశ్చిత్తం ఏమియును లేదు .


 *  రాజ్యము నందు గోవులు దీనంగా ఉన్నయెడల రాజులకు అశుభం. కాళ్లతో భూమిని గోకిన రోగములు సంభవించును . కనుల నుంచి నీరు కార్చుచున్న మృత్యువు కలుగును. యజమాని చూచి భయపడి అరిచినచో దొంగలు వస్తారు.


 *  కారణం లేకుండా గోవు అరుచుచున్న అనర్థం కలుగును. రాత్రివేళ అయినచో భయం కొరకగును. ఎద్దు అరిచినచొ శుభం కలుగును. ఈగలచే గాని , కుక్కలచేగాని మిక్కిలి విరుద్ధమై అరిచినచో వెంటనే వర్షం కురియును.


 *  గోవులు అంబా అనుచూ ఇంటికి వచ్చిన గోశాల వృద్ది అగును. గోవులను సేవించుచూ వచ్చిననను గోశాల వృద్ది అగును. తడిసిన అవయవములతో గాని , నిక్కబొడిచిన వెంట్రుకలతో గాని సంతసించుచూ వచ్చిన గోవులు మంచివి. ఈ రీతినే గేదెలు కూడా ఉండును .


 *  చూలుతో ఉన్నట్టియు, తగిన వెలకు దొరికినట్టియు , దానము వలన దొరికినట్టియు , కూలి సొమ్ముల వలన దొరికినట్టియు , యుద్ధాదులలో గెలిచి తెచ్చినవియు , ఇంటబుట్టినవియు , ఏదేని వ్యాధిచే యజమాని వలన విడకాబడినవియు , తానుపోషించునవియగు గోవులు మిక్కిలి మంచివి.


 *  దూడలేని ఆవుపాలు , గర్భముతో ఉన్న గోవుని పితకరాదు. ఈనిన పది దినముల వరకు పాలు పితికినవాడు నరకమునకు పోవును .


 *  బలం లేనిదియు , వ్యాధిగ్రస్తం అయినదియు , పొర్లినదియు , కవల దూడలు పెట్టినదియు అగు గోవు పాలు పితకరాదు .


 *  పుట్టిన రెండు నెలల వరకు దూడను తీయకుండానే పాలు పితకవలెను . మూడొవ నెలలో రెండు చన్నులు దూడకు వదిలి రెండు చన్నులు పితకవలెను. నాలుగొవ నెలలో మూఁడు భాగములు యజమాని తీసుకుని ఒక భాగము దూడకు విడిచిపెట్టవలెను . అటు తరువాత పశువు యొక్క బలాబలాలను బట్టి పాలు తీసుకొనుట మంచిది .


 *  ఆషాడ పౌర్ణమి, ఆశ్వయుజ పౌర్ణమి, పుష్యపౌర్ణమి , మాఘపౌర్ణముల యందు పాలు పితకక దూడలకు వదలవలెను .


                            సమాప్తం 



ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034


   

భవిష్యపురాణం నుంచి సేకరించటం

 *ఈ కథను భవిష్యపురాణం నుంచి సేకరించటం జరిగింది.*


*ఒక ముసలివాడు ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మేడలో రుద్రాక్ష హారం ధరించాడు.*


*ఈ "ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రం చదవడం వలన ఆ తరంగాలు కలిపురుషుడుని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్ర శబ్దం అని చుట్టూ చూడసాగాడు.*


*గంగానది తీరంలో ఒక బక్కచిక్కిన ముసలివాడు ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి అర కిలోమీటరు దూరంలో పడ్డాడు. కొంతసేపు ఏమి జరిగిందో అస్సలు అర్దం కాలేదు, కాసేపయ్యకా చుస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు.*


*పట్టుకోబోతే ఈసారి మరింత దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. ఇతను చుస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు, కాని పట్టుకుందామనుకొంటే నేను ఎక్కడో పడిపోతున్నాను.*


*ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా? కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యం అయింది. ఇదేమైన శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవ్వడు. శివుడా? విష్ణువా? అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న ''వేదవ్యాసుడు'' కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడు దగ్గరికి వెళ్లి "మహానుభావ, సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చేయండి" అన్నాడు.*


*వేదవ్యాసుడు నవ్వి "ఇది నీరాజ్యం,  ఈ కలికాలం నీది, నీకేసందేహమా? ఇక్కడ ఏ ఇద్దరిని సక్రమంగా ఉండనివ్వవు. ఎవరైనా కలిసున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది? ఇంతకి నువ్వు కుశలమే కదా!" అని అడిగాడు.*


*"కుశలమే! నా రాజ్యంలో నేను కాకా, నువ్వు అయితే పాలించవు కదా! అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి" అని వేడుకున్నాడు.*


*వేదవ్యాసుడు నవ్వి "ఓహో అదా, నీ సందేహం అర్దమయింది, ఆయన పరమ విష్ణు భక్తుడు. ఆయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వటం లేదు. పట్టుకోవాలని ప్రయత్నించవా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు.*


*త్రికరణ శుద్దిగా నిత్యం ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు. కనుక ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో, లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు" అని చెప్పి వెళ్ళిపోయాడు.*


*ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి.*


*ఓం నమో భగవతే వాసుదేవాయ.*

ప్రాణ శక్తి

 .🙏ప్రాణ శక్తి -- శాస్త్ర పరిశీలన🙏 

ఇది ఒక అద్భుతమైన వ్యాసం జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి.

భారతావనిపై జన్మించినందుకు గర్వపడాలి. భారతదేశంలో హిందువుగా జన్మించడం పూర్వ జన్మ సుకృతం.అందులోనూ ఆధ్యాత్మికత పొందడం ఇంకా అదృష్టం.

భారతీయ వేద శాస్త్రాలలో మాత్రమే చెప్పబడిన అద్భుతమైన విషయం ప్రాణ శక్తి. ఇది ఏ ఇతర మత గ్రంథాలలోనూ లేదు. ఇదే హిందూ మత ప్రత్యేకత.పంచ ప్రాణముల గురించి, ఉప ప్రాణముల గురించి సుస్పష్టంగా వేదాలు వివరించాయి.అసలు ప్రాణం అంటే ఏమిటి? దాని విశృతి ఏమిటి? ఈ వ్యాసంలో చూద్దాము.

ప్రాణ" అనే పదానికి సంస్కృత మూలపదం "అన్". "ప్రా"అనే ఉపసర్గ జోడించబడింది. "అన్" అంటే ఊపిరి పీల్చుకోవడం. "ప్రా" ఉపసర్గను జోడించినప్పుడు ప్రాణం కేవలం శ్వాసతో పాటు చాలా విస్తృతమైన అర్థాన్ని పొందుతుంది. ప్రాణం అంటే విశ్వ జీవశక్తి లేదా వ్యక్తిగత ప్రాణశక్తి అని అర్థం. ఇది మనల్ని "సజీవం గా" ఉంచే ప్రాణశక్తి.

ప్రాణమంటే జీవులు బ్రతకడానికి కావలసిన చైతన్య శక్తి. ప్రాణమనే దాన్ని అర్ధం చేసుకోడానికి, ప్రాణ శక్తిని గురించి తెలుసుకుందాం. జ్ఞానేంద్రియాలు బయటనుండి విషయాలని తెస్తే వాటిని గ్రహించాలంటే, అవి మనస్సుతో సంబంధపడి పడి ఉండాలి. గాఢ నిద్రలో ఉన్నపుడు మనస్సు, జ్ఞానేంద్రియాలూ పనిచెయ్యవు. అప్పుడు మనలను జీవింప జేసే శక్తి ఒకటి ఉంటుంది. అది శ్వాస రూపంలో ప్రాణమని చెప్పబడుతుంది. జీవానికి, శరీరానికీ, ప్రాణానికి పరస్పరం సంబంధం ఉంటుంది. ప్రాణం యొక్క చైతన్యశక్తి వల్లనే మనస్సు బాహ్య విషయాలను గ్రహిస్తుంది. శరీరానికి కండర చలనం ద్వారా చైతన్యాన్ని కల్గించేది ఈ ప్రాణమే. ప్రాణం బ్రహ్మము యొక్క ప్రకాశం చేత ప్రవర్తిస్తుంది. శరీరంలో ఈ ప్రాణశక్తి 5భాగాలుగా విభజించ బడింది ముఖ్య ప్రాణం, చేసే పనుల భేదాన్ని బట్టి ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానమని చెబుతారు.


1) ప్రాణము – ఇది ముక్కు రంధ్రాల నుండి హృదయం వరకు వ్యాపించిఉన్న శ్వాశకోశాన్ని జ్ఞానేంద్రియాలని నియంత్రిస్తుంది. మన వాక్కును, మ్రింగటాన్ని శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతుంది. ఇది శరీరంలో ఊర్ధ్వచలనం కల్గి ఉంటుందని చెప్పబడింది.


2) అపానము - ఇది నాభి నుండి అరికాళ్ళ వరకు వ్యాప్తిచెంది అధోచలనం కల్గి విసర్జన కార్యకలాపాలకు తోడ్పడుతుంది. ఉదాహరణకు మల మూత్ర విసర్జన, వీర్యము, బహిష్టు మరియు శిశు జననము మొదలైన వాటిని నిర్వర్తిస్తుంది.


3) సమానము - నాభి నుంచి హృదయం వరకు వ్యాప్తిచెంది, మనం తినే ఆహారాన్ని జీర్ణమయ్యేటట్లు చేసి, ఒంటబట్టడానికి సహకరిస్తుంది. దాని ద్వారా అవయవాలకు శక్తి కల్గుతుంది.


4) ఉదానము - ఇది గొంతు భాగం నుంచి శిరస్సు వరకు వ్యాపించి, శరీరాన్ని ఊర్ధ్వ ముఖంగా పయనింప జేయడానికి ఉపకరిస్తుంది. అంటే మనలోనుండి శబ్దం కలగడానికీ, వాంతులు చేసుకునేటపుడు బహిర్గతమవడానికీ, మన దైనందిత కార్యాల్లో తూలి పడిపోకుండా సమతులనంగా ఉండటానికి దోహదం చేస్తుంది.


5) వ్యానము - ఇది ప్రాణ, అపానాలను కలిపి ఉంచి, శరీరంలో ప్రసరణ కార్యక్రమాన్ని జరిపిస్తుంది. నాడీమండలం మొత్తం పనులను నడిపిస్తుంది. మన ప్రాణమయ కోశంలో సుమారు 72,000 సూక్ష్మ నాడులున్నట్లుగాను, అవిగాక వాటిని నియంత్రించే నాడీ కేంద్రాలూ (చక్రములు) ఉన్నట్లు పెద్దలు చెబుతారు.


హృదయమున ప్రాణము, గుద స్థానమున అపానము, నాభి ప్రదేశమున సమానము, కంఠ మధ్యమునందు ఉదానము, సర్వశరీరము నందు వ్యానము ఉన్నట్లు పంచ ప్రాణముల స్థాన నిర్ణయం చెప్పబడింది. ఈ ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానములనే పంచ ప్రాణములు ; నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయము లనెడి పంచ ఉపప్రాణములు కలసి నాడీ మండల మంతా వ్యాపించి, దేహవ్యాపారములకు కారణమవుతోంది. నాగమను ఉపవాయువు వల్ల కక్కుకొనుట ; కూర్మమను ఉపవాయువు వల్ల కను రెప్పలు విచ్చుట, మూయుట ; కృకర మను ఉపవాయువు వల్ల తుమ్ముట, దగ్గుట ; దేవదత్తమను ఉపవాయువు వల్ల ఆవులింత చెప్పబడ్డాయి. ధనుంజయ మనే ఉపవాయువు శరీరమంతా వ్యాప్తించి, మరణానంతరం శరీరం లావెక్కడానికి తోడ్పడుతుంది. ఇలా దశవిధ వాయువులు దశేంద్రియ సంబంధము కల్గి, రాగ ద్వేషాది అనుభవాలకు అధోముఖమవు తున్నాయి.


 మనస్సును సాధనముగా చేసుకొని, దశ విధ వాయువుల చివర నుండేది, కర్తృత్వ భోక్త్రుత్వ గుణములను కల్గి ఉండేది బుధ్ధి అనే చిద్బిందువు. ఇదే సర్వ కార్య కారణాలకూ ఆశ్రయమై , వాసనలతో ఇంద్రియములతోను స్థూల సూక్ష్మ కారణ శరీరములనే ఉపాధుల సంబంధం కల్గి, విషయానుసారముగా సంచరిస్తుంటుంది. ఇలా పంచ ప్రాణములు పంచ కర్మేంద్రియాలు కలసి క్రియాశక్తి బలము కల్గి ఉన్నాయి. పంచ ఉపప్రాణములు పంచ జ్ఞానేంద్రియాలు కలసి జ్ఞాన శక్తి బలం కల్గి ఉన్నాయి. దశవిధ ప్రాణములు; మనస్సు బుధ్ధి చిత్తము అహంకారములనే అంతః కరణ చతుష్టయంతో కలసి ఇచ్ఛాశక్తి బలం కల్గి సమస్త ఇంద్రియ వ్యాపారాలకూ కారణంగా ఉన్నాయి.

ప్రాణాయామంలో కుంభకం వల్ల శరీరంలో నాడులన్నీ వాయువుచే పూరించబడి, ఈ దశవిధ వాయువుల యొక్క చలనం వేగవంత మవుతుందని తద్వారా హృదయ కమలం వికసిస్తుందనీ చెప్పబడింది. పంచ ప్రాణాలు, పంచ ఉప వాయువులు కలిపి దశవిధ వాయువులుగా చెప్పబడ్డాయి. 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

మహాభారతం

 🙏మహాభారతం శాంతి పర్వం 🙏

                      పదవ భాగం 

 వంధిమాగదులు ధర్మరాజు గుణగణాలను కురువంశ చరిత్రను కీర్తిస్తున్నారు. వేదపండితులు వేదపాఠాలను భోధిస్తుండగా ధర్మరాజు హస్థినాపుర ప్రవేశం చేస్తున్నాడు.

ధర్మరాజు వచ్చేవేళకు హస్థినాపురప్రజలు నగరమంతా పచ్చనితోరణాలు కట్టి, గుమ్మాలకు అరటిచెట్లు కట్టి, పూర్ణకళశాలను ఇంటి ముందు అలంకరించి, వాకిట కళ్ళాపిచల్లి ముత్యాలముగ్గులు పెట్టారు. ఆ బాలగోపాలం కొత్తబట్టలు కట్టుకున్నారు. అంతటా పండుగవాతావరణం నెలకొంది. ధర్మరాజు రాజవీధిలో ప్రవేశించాడు. హస్థినాపుర వాసులు తమలోతాము " నలుదిక్కులా రాజులను జయించిన అజాతశత్రువు ఇతడే. రాజసూయయాగము చేసి బ్రాహ్మణులకు ధన, కనక, రత్నములను దానంగా ఇచ్చినది ఇతడే. ధర్మనిరతుడు అని చెప్పతగిన వాడు, శత్రురాజులను జయించి, విజయలక్ష్మిని వరించినది ఇతడే " అని ధర్మరాజును పొగడసాగారు. మరి కొందరు భీమార్జున నకులసహదేవులను పొగడుతున్నారు. వ్రతములు ఆచరించుటలోనూ, అదృష్టంలోను, పాతివ్రత్యంలోనూ ద్రౌపదికి సాటి ద్రౌపదియే నని పాండవసతిని పొగడుతున్నారు. ధర్మరాజు రాజమందిర ముఖద్వారం వద్దకు రాగానే బ్రాహ్మణులు, పుణ్యస్త్రీలు శోభనద్రవ్యములు తీసుకుని ఎదురువచ్చారు. వారు ఇచ్చినవి పుచ్చుకుంటూ ధర్మరాజు గజశాల వద్ద తనరధమును దిగాడు. పురోహితుడైన ధౌమ్యుడు పెదనాన ధృతరాష్ట్రుడు మున్నగు వారితో సహా అంతఃపురప్రవేశం చేసాడు. గృహదేవతలకు పూజచేసాడు. బ్రాహ్మణ సంఘములను పిలిచి వారికి బంగారం గోవులను దానంగా ఇచ్చాడు. వారి ఆశీస్సులు తీసుకున్నాడు.


ఆ సమయంలో దుర్యోధనుడి మిత్రుడైన చార్వాకుడు అనే రాక్షసుడు బ్రాహ్మణవేషంలో వచ్చి మిగిలిన బ్రాహ్మణులతో కలిసాడు. అతడు ధర్మరాజుతో " ఓ ధర్మరాజా ! సకలబ్రాహ్మణులు నన్ను తమ ప్రతినిధిగాపంపారు. వారిసందేశం విను. మహాపాపములు చేసిన వాడు ఇతడు ఎలా రాజౌతాడు. తండ్రులను, అన్నలను, పుత్రులను శంకలేకుండా చంపాడు. విద్యనేర్పిన గురువు అని చూడక ద్రోణుడిని చంపాడు. వీడిజన్మ ఎందుకు కాల్చనా ! ఈ విధంగా అందరూ నిన్ను అసహ్యించుకుంటున్నారు. ఇంకా నీకీ రాజ్యమెందుకు ? బంధువులను అందరినీ చంపి రాజ్యభోగాలు అనుభవిస్తున్నావు. నీకు మహాపాపం చుట్టుకుంటుంది " అని పలికాడు. చార్వాకుడి మాటలను విన్న బ్రాహ్మణులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ధర్మరాజు వారివంక చూసి చేతులుజోడించి " బ్రాహ్మణోత్తములారా ! నేను మీకు మొక్కి వేడుకుంటున్నాను. నన్ను మీరు నిందించకండి. ఆదరించండి వ్యాసుడు నారదుడు మొదలగు మహా మునులు నన్ను ఆజ్ఞాపిస్తేనే నేను ఈ రాజ్యపాలనకు ఒప్పుకున్నాను " అని ప్రార్థించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు " మహారాజా ! ఈ మాటలు మావి కాదు. ఇవి ఎలా వచ్చాయో మాకు తెలియడం లేదు. నీవు ఉత్తమక్షత్రియ ధర్మంతో సముపార్జించిన ఈ రాజ్యలక్ష్మి సుస్థిరతను పొందుతుంది " అని ఆశీర్వదించాడు. వెంటనే చార్వాకుని వంక చూసి దివ్యదృష్టితో అతడు సుయోధనుడి అనుయాయుడు అని తెలుసుకున్నారు. " మహారాజా ! వీడు బ్రాహ్మణుడు కాదు. సుయోధనుడి అనుయాయుడు అయిన రాక్షసుడు. కపటసన్యాసివేషంలో వచ్చి మిమ్మలిని అనరానిమాటలు అన్నాడు. వీడు కుక్కలాగా మొరిగినంత మాత్రాన మీ కీర్తికి కళంకంరాదు. ధర్మాత్ములైన నీ తమ్ముల సాయంతో మీరు రాజ్యలక్ష్మిని చేపట్టవచ్చు " అని పలికారు. వెంటనే బ్రాహ్మణులంతా చార్వాకుడిని చూసి ఒక్కసారి హుంకరించారు. ఆ హూంకారానికి భయకంపితుడై చార్వాకుడు నిజస్వరూపం ధరించి భస్మం అయ్యాడు. ధర్మరాజు ఆ బ్రాహ్మణులందరిని ఆదరించి పంపాడు.


అప్పుడు శ్రీకృష్ణుడు " ధర్మనందనా ! కృతయుగంలో చార్వకుడు అనే రాక్షసుడు బ్రహ్మను గురించి తపమాచరించాడు. బ్రహ్మ ప్రత్యక్షం కాగానే తనకు సకల భూతములవలన భయంలేకుండా వరం ఇమ్మని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు " నీవు బ్రాహ్మణులకు ఇష్టంలేని పనులు చేయకు. వారికి కోపంతెచ్చినప్పుడు మాత్రమే నీకు మరణం సంభవించగలదు " అని అన్నాడు. ఆ ప్రకారం బ్రహ్మ వరంపొంది చార్వాకుడు దేవతలను పీడించ సాగాడు. దేవతలంతా బ్రహ్మ వద్దకు వెళ్ళి చార్వాకుడి నుండి రక్షణ కల్పించమని ప్రార్ధించాడు. బ్రహ్మదేవుడు దేవతలతో " ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకని నేను తగినఏర్పాటు ముందే చేసాను. ద్వాపరయుగంలో చార్వాకుడు సుయోధనుడు అనే రాజుకు మిత్రుడుగా ఉంటాడు. సుయోధనుడి మరణం తరువాత ఈ చార్వాకుడు బ్రాహ్మణులకు మనోవ్యధ కలిగించే పనులు చేసి ఆకారణంగా వారి ఆగ్రహానికి గురి అయి భస్మంఔతాడు " అని చెప్పాడు. శ్రీకృష్ణుడు తరువాత " ధర్మరాజా ! నిన్ను ఎదిరించిన వారిని నాశనం చెయ్యి. ప్రజలను కన్నబిడ్డలవలె కాపాడు. బ్రాహ్మణులను ఆదరించు. బంధుమిత్రులను సుఖంగా ఉండేలాచేయి. కురుసామ్రాజ్యముకు పట్టాభిషిక్తుడివి కమ్ము " అని పలికాడు.

పట్టాభిషేకముకు తగు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కురుమహాసభలో ఎత్తైన బంగారు సింహాసనం ఏర్పాటు చేసారు. పెద్దలకు, మంత్రులకు, సామంతులకు సైన్యాద్యక్షులకు ఎవరికి తగిన ఆసనములు వారికి ఏర్పాటు చేసారు. ఒక శుభముహూర్తాన ధర్మరాజు మనసులోని బాధను దిగమింగుకుని బంగారుసింహానం మీద తూర్పుముఖంగా కూర్చున్నాడు. అతడికి ఎదురుగా బంగారు ఆసనమున శ్రీకృష్ణుడు సాత్యకి సమేతంగా కూర్చున్నాడు. ధర్మరాజు ఇరు పక్కలా మణిమయ పీఠముల మీద భీమార్జునులు కూర్చున్నారు. వెనుక పక్క బంగారు పీటముల మీద నకులసహదేవులు కూర్చున్నారు. వారిపక్కన ఉచితాసనం మీద కుంతీదేవి కూర్చుంది. శ్రీకృష్ణుడి దక్షిణభాగంలో ఒక ఉజ్వలమైన ఆసనంమీద ధృతరాష్ట్రుడు కూర్చుని ఉన్నాడు. అతడికి తూర్పు పడమర దిక్కున విదురుడు, ధౌమ్యుడు కూర్చుని ఉన్నారు. ధృతరాష్ట్రుని వెనుక భాగాన అర్హమైన ఆసనముల మీద గాంధారి, యుయుత్సుడు, సంజయుడు కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన కృపాచార్యుడికి ధర్మరాజు ధౌమ్యుడి పక్కన ఉచితాసనాన్ని ఇచ్చి సత్కరించాడు. ధర్మరాజు తెల్లని పూలతోను, అక్షితలతోను, బంగారుతోను, వెండితోను భూదేవిని పూజించి ఆమెను తాకాడు. పండితులు, వివిధ దేశాధీశులు, మంత్రులు, ఉన్నతోద్యోగులు, వ్యాపారవేత్తలు, పరిచర్యలు చేసే సేవకులు, వైశ్య ప్రముఖులు, పౌర సంఘాలు, కర్షకులు, జానపదులు, గాయకులు, విదూషకులు, వేశ్యలు మున్నగు వారంతా ధర్మరాజుని సందర్శించారు. ధర్మరాజు వారికి ఉచితమైన కానుకలు ఇచ్చి సత్కరించాడు. ఇంతలో అభిషేకద్రవ్యములు సిద్ధం అయ్యాయి. శ్రీకృష్ణుడి అనుమతితో ధౌమ్యుడు ఈశాన్య దిక్కుగా ఉన్న వేదికను అలంకరించాడు. అందు నవరత్నఖచిత సింహాసనమును ప్రతిష్టించాడు. దానిమీద పులితోలు కప్పాడు. శంఖమును స్థాపించి పూజించాడు. దాని చుట్టు గంగాజలం నింపి వాటిని మంత్రసహితంగా ఆవుపెరుగు, ఆవునెయ్యి, ఆవుపంచితం, గోమయము మొదలగు పంచగవ్యములతో శుద్ధి చేసాడు. ధర్మరాజు చుట్టూ బ్రాహ్మణులు మంత్రపఠనం చేస్తున్నారు. ధౌమ్యుడు ధర్మరాజును తీసుకు వెళ్ళి సింహాసనం మీద కూర్చుండ చేసాడు. ఎదురుగా అగ్నినివేల్చి దేవతాయజ్ఞం చేసాడు. ఇంతలో శుభముహూర్తం సమీపించగానే శ్రీకృష్ణుడు ధర్మరాజును సమీపించి శంఖం పైకెత్తి" ధర్మజా ! నీవు ఈ కురుసామ్రాజ్యానికి అధిపతివి కమ్ము " అని అభిషేకించాడు. ఆ సమయంలో ప్రశాంత చిత్తుడై ధౌమ్యుడు అందించిన బంగారుకలశం లోని గంగాజలాన్ని ధృతరాష్ట్రుడు ధర్మరాజు మీద అభిషేకించాడు. ఆ తరువాత వారి వారి ప్రాధాన్యతను అనుసరించి అందరూ ధర్మరాజును అభిషేకించారు. శంఖములు, భేరీ మృదంగ నాదములు మిన్నంటేలా మ్రోగాయి. ఇలా ధర్మరాజు కురు సామ్రాజ్య పట్టాభిషిక్తుడయ్యాడు.

                      సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

లక్ష్మీనాథుడు

 *లక్ష్మీనాథుడు నంది వాహనముపై లంకాపురిం జేరెcబో*

ఈ సమస్యకు నాపూరణ. 


*శకారుడు*

ఈ క్ష్మా నేలుదు నేను శ్యాలకుడనే నేనుంగు పైనెక్కుదున్


పక్ష్మం బింతయు  మూయకే తిరిగెదన్ పండింతు నే పంటలన్


లక్ష్మీనాథుడు నంది వాహనముపై  లంకాపురిం జేరెcబో


సూక్ష్మంబున్ గ్రహియించి స్వాగతమనన్ చూపింతు నా ప్రజ్ఞలన్.



అల్వాల లక్ష్మణ మూర్తి

సమస్య పూరణ.

 *అర్ధాంగీ! కృతి వ్యర్థమై చనియె లక్ష్యంబయ్యొ దుర్లభ్యమౌ*

ఈ సమస్యకు నాపూరణ. 


దుర్ధర్షంబయి  మేలు బంతి యయినన్ దుర్నీతిగా పాదుషా


ఆర్ధం బర్ధము కూడ నీయడయె యన్యాయంబె ఫిర్దౌసికిన్


గర్ధంబెంతయొ కృంగదీసె - కినిసెన్ - గర్హించుచున్ చెప్పె నో


"అర్ధాంగీ! కృతి వ్యర్థమై చనియె  లక్ష్యంబయ్యొ దుర్లభ్యమౌ".


(దుర్దర్షం= తిరస్కరింప దగనిది

ఆర్ధము =సొత్తు

గర్ధం =పేరాస)


అల్వాల లక్ష్మణ మూర్తి