29, జనవరి 2025, బుధవారం

చొల్లంగి అమావాస్య…

 రేపు మహా పర్వదినం చొల్లంగి అమావాస్య…


పుష్య కృష్ణ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానాం రోడ్డు మీద మూడు మైళ్ళ దూరాన ‘చొల్లంగి’ అనే గ్రామం ఉంది. గోదావరి ఏడు పాయలలో ఒకటైన ‘తుల్యభాగ’ ఇక్కడ సముద్రంలో కలుస్తుంది.

ఈ రోజు ఇక్కడ గోదావరి నదీ స్నానం అత్యంత పవిత్రమైనదని చెప్తారు.

”ఆద్యాతు గౌతమీ గంగా పశ్చాద్భాగిరధీ

స్మృతా తయోరేకతరా సేవ్యాగౌతమీ తత్రపావనీ ”

గోదావరి గంగా జలాన్ని కూడా పవిత్రం చేయగలదు. అందువలననే కాశీకి పోయిన వారు గంగా జలము తెచ్చి గోదావరిలో కలిపే ఆచార ము అనాదిగా ఆచరిస్తున్న సాంప్ర దాయమై ఉంది.

జీవనదియైన గోదా వరి పాయల్లో ఒకటి సా గరాన్ని సంగమించే చోటు కావడంవల్ల చొల్లం గి సమీపాన స్నానం చేస్తే, నదిలోను, సము ద్రంలోనూ ఏకకాలం లో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. ఈ దినా న జీవనది గోదావరి, సముద్రం లో కలిసే చోటు వద్ద స్నానమాచరించి, పితృ తర్పణం గావిస్తే వారి పితరులు 21 తరాల వారు నరక లోక యాతనల నుండి విముక్తులు కాగలరని, తత్ఫలితంగా స్వర్గ లోక… స్వర్ణలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు. గౌతము డు కొని తెచ్చిన గోదావరి జలాలను ఏడుగురు ఋషులు ఏడు పాయలుగా తీసుకొనిపోయి ఏడు స్థలాలలో సంగమించే విధంగా చేశారు. గౌతముడు స్వయంగా కొనిపోయిన శాఖ ”గౌతమి” నామాంకితయై గోదావరి అగ్రము వద్ద మాసా నితిప్ప చోట సముద్రంలో  కలుస్తుంది. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికు డు, జమదగ్ని వసిష్ఠుడు ఆరుగురు ఋషులు కొనిపోయిన శాఖలు వారివారి పేర్లతో పరమగు తున్నాయి. తుల్యుడు కొనిపోయిన శాఖ చొల్లంగి చెంత, ఆత్రేయ శాఖ కోరంగి సమీపాన, భరద్వాజ భైరవపాలెం/తీర్థాల మొండి వద్ద, కౌశిక నత్తల నడక సమీపాన, జమదగ్ని కుండలేశ్వరం వద్ద, వశిష్ఠ అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తున్నాయి.


”రేవా తీరే తప: కుర్యాత్‌ మరణం జాహ్నవి తటే

దానం దద్యాత్‌ కురుక్షేత్రే గౌతమీ మ్యాంత్రిత యం పరం”

”రేవా నది తీరాన తపస్సు చేస్తే ముక్తి. గంగా తీరాన మరణం ముక్తి. కురుక్షేత్రంలో దానం ముక్తి. గోదావరిలో స్నానం చేస్తే ఈ మూడు పుణ్యాలు లభిస్తాయి.” అని పై శ్లోకానికి అర్థం.

గోదావరి నదీమ తల్లి వల్ల మూడు వరాలు ప్రాప్తిస్తాయి కనుక ఏడు స్థలాలకు వెళ్ళి స్నానాలు ఆచరించి రావడాన్ని ‘సప్త గోదావరుల సాగర సంగమ యాత్ర” లేదా ”సప్త సాగర యాత్ర” అం టారు. సంతానం, తదితర కోరికలు ఈడేర డానికి సప్తసాగర యాత్ర చేయడం సంప్రదాయ సిద్ధం గా వస్తున్నది. సప్త సాగర యాత్ర పుష్య బహుళ అమావాస్య నాడు చొల్లంగి స్నానంతో ప్రారంభం అవుతుంది.

ఏడు తావులు చూసుకుని, ప్రాయ కంగా మాఘ శుక్ల ఏకాదశి నాటి కి వశిష్టా సాగర సంగమ స్థానమైన ”అంతర్వేది చేర తారు. ఆ దినం అక్కడ గొప్ప తీర్థం. ఆ ఏకాదశి ని ఆ ప్రాంతంలో ”అంతర్వేది ఏకాదశి” అని పిలవడం పరిపాటి. ఇలా సప్త సాగర యాత్రకు ఆది, తుది దినాలు పర్వదినాలుగా పరిగణింపబడతాయి. చొల్లంగి అమావాస్య అనే పేరు రావడానికి మహత్తు గల చొల్లంగికి ప్రసిద్ధి, తుల్యభాగ వల్ల కలుగు తున్నది.


”మహోదయ నామాలభ్య యోగ పుణ్యకా ల:

అమావాస్యా సోమ వాసర వ్రతమత: పద్మ యోగ పుణ్యకాల”మని పేర్కొనబడింది.

రవి శ్రవణ వ్యతీపాతము ఈనాడు జరిగితే అది మహోదయ యోగము, పద్మయోగ పుణ్య కాలము కలుగుతుంది. పుష్యమాసంలో వచ్చిన అమావాస్య మహోదయ అమావాస్య. అమావాస్య, ఆదివారం, శ్రవణా నక్షత్రం మూడు కలిసి వస్తే దానిని అర్ధోదయ అమావాస్య అంటారు. ఈ మూడింటిలో ఏదో ఒకటి లోపించి మిగిలిన రెండు కలిస్తే దానిని మహోదయం అంటారు.  పుష్య బహుళ అమావాస్య పర్వకాలం, మహత్తర దినం.  పుణ్యప్రద మైనందున సమస్త దోష నివారణకై నదీ స్నానం, పితృ తర్పణం, పిండ ప్రదానం, శివాలయ అంతర్భాగమైన రావి చెట్టు ప్రదక్షిణలు, శివారాధన చేయాలని, తద్వారా సకల జాతక దోషాలు తొలగించుకోవాలని శాస్త్రం చెబుతోంది.

కామెంట్‌లు లేవు: