24, అక్టోబర్ 2022, సోమవారం

సూర్య గ్రహణం solar eclipse

 సూర్య గ్రహణం


ఈ సం॥ ఆశ్వయుజ బహుళ అమావాస్యా మంగళవారము 25-10-2022 నాడు స్వాతీ నక్షత్రములో తులారాశి యందు కేతుగ్రస్త సూర్య


గ్రహణం సంభవించును.


పగలు


గం 04:59 ని


సకాలం


సూర్యాస్తమయ కాలం (హైదరాబాదు) సాయంకాలం


గం. 05:45 ని


మోక్షకాలం


ఆద్యంత పుణ్యకాలం


రాత్రి


గం. 06:29 ని


గం. 00:46 ని


(మోక్షకాలం రాత్రి గం. 06:29 అయినను పుణ్యకాలము సూర్యాస్తమయము


వరకే ఉండును.)


నిత్య భోజన ప్రత్యాబ్దికాదులు


గ్రస్తావేవాస్తమానం తు రవీన్దూ ప్రాప్నుతో యది పరేడ్యు రుదయే స్నాత్వా శుద్ధో భ్యవహరే న్నరః || అహోరాత్రం న భుంజీత గ్రస్తావేవాస్తగౌ తు తౌ ||


ఇత్యాది శాస్త్రవాక్యములను బట్టి సమర్థులు ఈరోజు మొత్తం ఏ రకమైన ఆహారాదులు తీసుకొనకూడదు. 26-10-2022 నాడు శుద్ధబింబ దర్శనం చేసుకుని భోజనాదులను స్వీకరించవలెను. అశక్తులు (పిల్లలు, రోగగ్రస్థులు, గర్భిణులు, వృద్ధులు) ఈనాడు పగలు గం.12:30 లోపు భుజింపవచ్చును. అలాగే రాత్రి ముక్తి స్నానానంతరము అపక్వాహారము తీసుకున్న మంచిది.


కాగా, ఈనాటి రాత్రి కాలమున శ్రాద్ధాచరణము విశేష ధర్మ శాస్త్రమును బట్టి నిర్ణయము. భోక్తలు, కర్తలు, కర్తలపత్నులు మాత్రమే శ్రాద్ధభోజనమునకు అర్హులు. అలాగే శ్రాద్ధార్ధం మడి నీటి ఏర్పాటు, వంటచేయుట వంటివి అన్నీ కూడా కర్తలు, కర్తలపత్నులు మాత్రమే (మిగిలిన వారికి గ్రహణాశౌచము ఉన్నందున) చేసుకోవాలి. అయితే విధవాకర్తృక శ్రాద్ధ మగుచో ఈ రోజు (పగలు


- రాత్రి) ఉపవసించి మరునాడే జరుపవలసియుండును. - గ్రహణ గోచారము :- ఈ గ్రహణమును స్వాతీ నక్షత్రము వారును, అధమ


ఫలము నిచ్చు రాశుల వారును అసలు చూడరాదు.


శుభ ఫలము: వృషభ, సింహ, ధనుః, మకర రాశులవారలకు మధ్యమఫలము: మేష, మిథున, కన్య, కుంభ రాశులవారలకు


అధమ ఫలము : కర్కాటక, తుల, వృశ్చిక, మీన రాశులవారలకు

 आदरणीय बंधुवर


 आपको एवं आपके पूरे परिवार को भारत के सबसे बड़े महापर्व धनतेरस, आयुर्वेद दिवस छोटी दीपावली, दीपोत्सव, गोवर्धन पूजा विश्वकर्मा जयंती एवं भैया दूज की हार्दिक बधाई एवं शुभकामनाएं ।

आप से मधुर संबंध ही हमारा सबसे बड़ा धन है।

 

 आपका शुभ कांक्षी।

గోపాలుని దీపావళి

         🕯️దీపావళి🕯️ 


ఆదివరాహుడై హరి తొల్లి భూమిని

           కనకాక్షు చెఱనుండి కాచినపుడు

పుడమి కోరికపైన పుట్టెను నరకుండు

           విభవోన్నతుండైన విష్ణువునకు

రజ తమో గుణముల రాజిల్లి నిరతమ్ము

           సాధు జనుల నెల్ల బాధ  పెట్టె

పరమాత్మ కృష్ణుండు పత్ని సత్యను గూడి

          పరిమార్చె దానవున్ బవరమందు

జగతికంటకు డాతడు సమసినట్టి

పర్వదినమునె జనులు 'దీపావళి' గను

వేలదివ్వెలు వెలిగించి విభవ మొప్ప

జరుపి మురియుచు నుందురు జగము నందు 


    🙌అందరికి దీపావళీ శుభాకాంక్షలు🙌 


        గోపాలుని మధుసూదన రావు శర్మ

                        భాగ్యనగరము

బంధాలు నిలబడతాయి

 🌻

* మంచి నీతి కథ....*


ఒక సారి చాణిక్యుని దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను" అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణిక్యుడు ఆపి "నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం దీన్ని నేను "మూడు జల్లెడ్ల పరీక్ష *(Triple Filter Test)"* అంటాను అని అడగటం మొదలు పెట్టాడు. 


మొదటి జల్లెడ *"నిజం"* - "నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?" అని అడిగాడు.


అందుకు ఆ స్నేహితుడు "లేదు, ఎవరో అంటుండగా విన్నాను" అని అన్నాడు.

"అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట" అని చాణిక్యుడు అన్నాడు.


సరే రెండో జల్లెడ *"మంచి "* - " నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?" అని అడిగాడు చాణిక్యుడు,


"కాదు" అన్నాడు చాణిక్యుని స్నేహితుడు .


"అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయం- సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం"అన్నాడు చాణిక్యుడు.


మూడో జల్లెడ *"ఉపయోగం"* - "నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా ? " అని చాణిక్యుడు అడిగాడు.


"లేదు" అన్నాడు ఆ మిత్రుడు.


"అయితే నీవు చెప్పబోయే విషయం *నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది* కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?" అని అన్నాడు చాణిక్యుడు


నీతి : మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినేముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి, *మంచి పెంపొందుతుంది. చాడీలు నివారించబడతాయి.*

*శుభంభూయాత్...*🙏

           * * 🌷* *

ముద్గల మహర్షి

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*మన మహర్షుల చరిత్రలు..*


*🌹ఈరోజు 59 ,వ ముద్గల మహర్షి గురించి  తెలుసుకుందాము..🌹*


🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️


🍁ఇప్పుడు మనం ముద్గల మహర్షిని గురించి తెలుసుకుందాం . మనిషి ఎప్పుడూ చెయ్యాల్సిన పన్లు దానం , ధర్మం , పరోపకారం . 


☘️దాన తపాల్లో తపం కన్నా దానం గొప్పది . అదికూడ అన్యాయంగా సంపాదించినదాన్తో దానం చెయ్యకూడదు .


🍁మనం కష్టపడి సంపాదించింది దానం చేస్తేనే మంచి జరుగుతుంది . దాన ధర్మాలు చెయ్యడంలో ముద్గల మహర్షి చాలా గొప్పవాడు . 


☘️ముద్గలుడు విద్యలన్నీ నేర్చుకున్నాక పెళ్ళి చేసుకుని పిల్లల్లో కలిసి కురుక్షేత్రంలో ఉండేవాడు . 


🍁అతడు భిక్షకి వెళ్ళి వచ్చి వచ్చినదాన్తో భార్యాబిడ్డల్ని పోషించేవాడు . అతను త్యాగమే ధనమనీ , భోగం రోగమనీ , తపమే ధర్మమనీ , నిష్ఠగా ఉండడమే ఉత్సవమనీ , ఉపవాసముండడమే మహాభోగమనీ అనుకుంటూండేవాడు . 


☘️భార్య పిల్లలు కూడా ఆయన చెప్పినట్లు వినేవాళ్ళు . ముద్గల మహర్షి కుటుంబం పాడ్యమినాడు మొదలు పెట్టి పధ్నాలుగు రోజులు సంపాదించిన ధాన్యంతో ఒక పర్వదినం రోజు వండుకుని మొదట పితృదేవతలకి పెట్టి తర్వాత అతిథులకి పెట్టి వాళ్ళు తినేవాళ్ళు .


🍁తినడం కోసం జీవించడం కాదు ; జీవించడం కోసం తినాలన్నది ఆయన ఉద్దేశ్యం సందేశం కూడ . 


☘️ఒకసారి దుర్వాస మహాముని వాళ్ళింటికి భోజనానికి వచ్చాడు . తర్వాత ముద్గల మహర్షిని పరీక్షించాలని ప్రతి పర్వదినం రోజు వచ్చి తను తినకల్గింది తిని మిగిలింది విసిరేసి వెళ్ళేవాడు దుర్వాస మహర్షి .


🍁పాపం వాళ్ళకి తినడానికి మిగిలేది కాదు . అసలే వాళ్ళు తినేదే పదిహేను రోజులకి ఒకసారి కదా ! అయినా ప్రతి పర్వదినం రోజూ వచ్చి తినేసి వెళ్ళిపోయేవాడు .


☘️వాళ్ళు కూడా ఏమీ అనుకోకుండా పెట్టేవాళ్ళు . దుర్వాస మహర్షి ఒక రోజు ముద్గల మహర్షిని మహర్షీ ! నిన్ను పరీక్షించాలని ఇలా చేశాను . 


🍁నువ్వు చేసిన అన్నదానం చాలా గొప్పది . మనిషి నాలుక ఎప్పుడూ రుచుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది . 


☘️నువ్వు జీవితంలో బ్రతకడానికి అవసరమయిన అన్నాన్ని కూడా అతిథి సేవకి వదిలేశావు . ఇంతకన్నా గొప్ప వాళ్ళెవరు ? నీకు శరీరంతో స్వర్గానికి వెళ్ళగలిగే వరం ఇస్తున్నానన్నాడు .


🍁కొంతకాలం తర్వాత స్వర్గలోకం నుంచి విమానం వచ్చి ముద్గల మహర్షినీ , అతడి భార్యాపిల్లల్నీ ఇంద్రలోకం తీసుకువెళ్ళడానికి ఒక దేవదూత వచ్చాడు .


☘️ముద్గల మహర్షి దేవదూతని మహాత్మా ! మీరిలా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది . ఇక్కడ నా వ్రతాన్ని వదిలేసి నన్ను అక్కడికి రమ్మంటున్నారు .


🍁వచ్చే ముందు అసలు మీలోకంలో ఉండే గుణాలు , దోషాలు తెల్సుకోవాలనుకుంటున్నాను అనడిగాడు . 


☘️దేవదూత మహర్షీ ! మీ భూలోకం మీదే మా స్వర్గలోకం వుంది . అక్కడికి రావడానికి అందరూ అర్హులు కారు . అది ముప్ఫై వేల యోజనాలు ఆక్రమించి వుంటుంది . 


🍁గొప్ప తపస్సంపన్నులు , యజ్ఞయాగాలు చేసిన వాళ్ళు , ఇంద్రియాల్ని జయించిన వాళ్ళు , దానాలు చేసిన వాళ్ళు , దేవతలు , సాధ్యులు , ఇలా అందరూ ఉత్తమమైన వాళ్ళే వుంటారు . 


☘️అక్కడ వాళ్ళందరూ చాలా సుఖంగా ఉంటారు . దాని పైన బ్రహ్మలోకం వుంటుంది . అది శోకం లేనిది . బ్రహ్మలోకమే మిగిలిన లోకాల్ని ప్రకాశింప చేస్తుంది . 


🍁అన్ని లోకాలు నాశనమయినా కూడా బ్రహ్మలోకం అలాగే ఉంటుంది అని గుణాల గురించి చెప్పాడు దేవదూత . ఇంక దోషాలు చెప్తాను వినమన్నాడు .


☘️స్వర్గలోకంలోకి వచ్చిన మనిషి తాను చేసిన పుణ్యం అయిపోగానే మళ్ళీ భూలోకంలో పుడతాడు . 


🍁కాని కర్మఫలం మాత్రం చేసిన పుణ్యం ప్రకారమే ఉంటుంది . స్వర్గలోకంలో సుఖాలు అనుభవించి భూలోకంలో పడిన మనిషి కొంత కష్టపడతాడు .


☘️సుఖానికి అలవాటుపడ్డాడు కదా ! స్వర్గలోకంలో కూడా భూలోకంలో వున్నట్లే అహంకారం ఈర్ష్యలాంటివి ఉంటాయి . 


🍁ఒక్కమాటలో చెప్పాలంటే భూలోకం కర్మభూమి , స్వర్గలోకం ఫలభూమి అని చెప్పాడు దేవదూత . 


☘️ముద్గలుడు మహాత్మా ! మీ స్వర్గలోకానికి ఒక నమస్కారం . 

నా లోకమే నాకు బావుంది . మళ్ళీ మళ్ళీ జన్మరాకుండా శాశ్వతంగా బ్రహ్మలోకంలో వుండడమే నాకిష్టం . !


🍁అర్హత వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను . నాకు సుఖాలు వద్దు . కొంచెం కష్టపడినా తర్వాత శాశ్వతంగా సుఖంగా ఉండే బ్రహ్మలోకం కోసం ఎదురు చూస్తాను .


☘️మీరు వెళ్ళిరండి అన్నాడు . చివరికి ముద్గల మహర్షి ధర్మ సారంగా సేవలు చేస్తూ తప్పసుతో అనుకున్నది సాధించి బ్రహ్మలోకా ప్రాప్తి పొందాడు..


🍁ఇదండీ ముద్గల మహర్షి గురించి మనకు అందిన సమాచారం రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి!


సేకరణ: శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 


☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁

నరకాసురవధ దీపావళి

 ॐ నరకచతుర్దశీ, దీపావళీ శుభాకాంక్షలు 


    నరకాసురవధ జరిగాక, ఆనందంగా దీపావళి జరుపుకుంటాం. 


    మనలోని నరకుణ్ణి సంహరించి, జ్ఞాన సంపద పొంది, ఆత్మానందము అనుభవించడమే ఈ రెండు పండగల అంతరార్థం. 


       ఆశ్వయుజ మాసంలో ముగురమ్మలనూ ఆరాధిస్తాం.

       శరన్నవరాత్రులలో శక్తి స్వరూపిణిగా దుర్గాదేవినీ, 

      అందులోనే మూలా నక్షత్రంనాడు సరస్వతీదేవిగానూ, 

      ఈ మాసం చివరిలో దీపావళీ అమావాస్యనాడు లక్ష్మీదేవిగానూ ఆరాధిస్తాము.

      క్రియా - జ్ఞాన శక్తులను దుర్గా - సరస్వతులు అనుగ్రహిస్తే, సంపద లక్ష్మీ అనుగ్రహం. 

       తద్వారా ఇచ్ఛా - క్రియా - జ్ఞాన శక్తులకు సంబంధించి ముగురమ్మల రూపాలలో ఉన్న జగన్మాత అనుగ్రహం పొందుతాం. 


                    *** 


ఈరోజు దీపావళి నాడు లక్ష్మీదేవిని కొలుద్దాం 


                  శ్రీమహాలక్ష్మ్యై నమః


శ్రుత్యై నమోఽస్తు శుభకర్మ ఫలప్రసూత్యై 

రత్యై నమోఽస్తు రమణీయ గుణార్ణవాయై I 

శక్త్యై నమోఽస్తు శతపత్ర నికేతనాయై 

పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమ వల్లభాయై ॥ 

      - కనకధారా స్తోత్రమ్ (ఆదిశంకరులు) 



తాత్పర్యం: 


* సకల శుభకర్మల ఫలాలని ప్రసాదించే వేదస్వరూపిణియు, 

* మహిమాన్వితమైన గుణములకు సాగరరూపిణియైన సౌందర్య(రతి)రూపిణియు, 

* నూరురేకుల పద్మమునందు నివసించు మహాశక్తి స్వరూపిణియు, 

* పురుషోత్తముడైన శ్రీమహావిష్ణువు భార్యయు, పుష్టిరూపిణియు అయిన లక్ష్మీదేవికి నమస్కారము.


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 51by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu

ప్రహ్లాదుని మాటలు విన్న హిరణ్యకశిపుడు తెల్లబోయాడు. అటువంటి ఆలోచనలు ఎవరయినా తన కుమారునికి నేర్పారేమోనని ఆయనకు అనుమానం కలిగి “నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది నీవు రాక్షసునికి జన్మించిన వాడివి. ఇలాంటి బుద్ధులు నిజంగా నీకే పుట్టాయా లేక ఎవరయినా పిల్లలు పక్కకి తీసుకెళ్ళి రహస్యంగా నీచేత చదివిస్తున్నారా?” అని అడిగాడు. “ఈ గురువులు నిన్ను చాటుకు తీసుకు వెళ్ళి ఇలాంటివి ఏమైనా నేర్పుతున్నారా? శ్రీమహావిష్ణువు మన జాతికంతటికీ అపకారం చేసినవాడు. అటువంటి వాడిని స్తోత్రం చేస్తావా? అలా చెయ్యకూడదు” అన్నాడు. ఇవన్నీ విని ప్రహ్లాదుడు “

మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు

నిర్మల మందాకినీవీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు

లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు కోయిల జేరునే కుటజములకు

పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు

అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త

చిత్త మేరీతి నితరంబు జేర నేర్తు! వినుత గుణశీల, మాటలు వేయునేల?

ఎక్కడయినా పారిజాత పుష్పములలో ఉండే తేనె త్రాగడానికి అలవాటు పడిపోయిన తుమ్మెద ఎక్కడో ఉన్న ఉమ్మెత్త పువ్వు మీద వాలుతుందా? ఎక్కడో హాయిగా ఆకాశములో ఉండే మందాకినీ నదిలో విహరించడానికి అలవాటు పడిపోయిన రాజహంస ఎండిపోతూ దుర్గంధ భూయిష్టమయిన ఒక చెరువు దగ్గరకు వెళ్ళి ఆ నీళ్ళు తాగుతుందా? ఎక్కడయినా లేత మామిడి చిగురు తాను తిని ‘కూ’ అంటూ కూయడానికి అలవాటు పడిన కోయిల ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అడవిమల్లెలు పూసే చెట్టుమీద వాలుతుందా? పూర్ణమయిన చంద్రబింబం లోంచి వచ్చే అమృతమును త్రాగడానికి అలవాటు పడిపోయిన చకోరపక్షి పొగమంచును త్రాగడానికి ఇష్టపడుతుందా? సర్వకాలములయందు తామరపువ్వుల వంటి పాదములు కలిగిన శ్రీమన్నారాయణుని పాదములను భజించడం చేత స్రవించే భక్తి తన్మయత్వమనే మందార మకరందపానమును త్రాగి మత్తెక్కి ధ్యానమగ్నుడనై ఉండే నాకు నీవు చెప్పే మాటలు ఎలా తలకెక్కుతాయి? నేను ఇతరములయిన వాటిమీద దృష్టి ఎలా పెట్టగలుగుతాను?” అని అడిగి వేయిమాటలెందుకు? నాకు నీవు చెప్పిన లక్షణములు రమ్మనమంటే వచ్చేవి కావు’ అని అన్నాడు.

ప్రహ్లాదుడు అలా అనేసరికి హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయి గురువుల వంక చూసి ‘మీరు వీడికి పాఠం చెప్పడంలో ఏదో తేడా ఉన్నదని నేను అనుకుంటున్నాను. లేకపోతే నేను ఎంత చెప్పినా వీడు ఇలా చెపుతున్నాడేమిటి? ఈమాటు తీసుకు వెళ్ళి చాలా జాగ్రత్తగా వేయి కళ్ళతో చూస్తూ విద్య నేర్పండి అన్నాడు. చండామార్కులు పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్లకి భయం వేసింది. వాళ్ళు ప్రహ్లాదునితో “నాయనా! మేము నీకు నేర్పినది ఏమిటి? నువ్వు చెప్పినది ఏమిటి? మీ నాన్నకి మామీద అనుమానం వచ్చింది. ఇపుడు మా ప్రాణములకు ముప్పు వచ్చేటట్లు ఉన్నది. మేము ఏమి చెప్తున్నామో అది జాగ్రత్తగా నేర్చుకో. మాకు ఏమి చెప్తున్నావో అవి మీ నాన్న దగ్గరికి వెళ్ళి అప్పచెప్పు. ఇంక ఎప్పుడూ నీవు అలాంటి పలుకులు పలుకకూడదు. గురువుల మయిన మేము ఏమి చెప్పామో అది మాత్రమే పలకాలి అర్థమయిందా?” అన్నారు. ప్రహ్లాదుడు ‘అయ్యా, చిత్తం. మీరు ఏమి చెపుతారో దానిని నేను జాగ్రత్తగా నేర్చుకుంటాను’ అని చక్కగా నేర్చుకున్నాడు. ఎక్కడనుంచి ఏది అడిగినా వెంటనే చెప్పేసి చక్కా వ్యాఖ్యానం చేసేస్తున్నాడు. పిల్లవాడు మారాడని వారు అనుకున్నారు. ఎందుకయినా మంచిదని తల్లి దగ్గర కూర్చుని మాట్లాడడానికి, తండ్రి దగ్గర మాట్లాడదానికి పెద్ద తేడా ఉండదని ముందుగా అతనిని తల్లి లీలావతి దగ్గరకు తీసుకువెళ్ళారు.

లీలావతి కుమారుని ప్రశ్నించింది ‘నాయనా! బాగా చదువుకుంటున్నావా? ఏది నీవు నేర్చుకున్నది ఒకమాట చెప్పు’ అన్నది. ధర్మార్థ శాస్త్రములలోంచి కొన్ని మాటలు చెప్పాడు తల్లికి. తన కుమారుడు చాలా మారిపోయినందుకు చాలా సంతోషించింది. గురువులు కూడా సంతోషించి ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడి దగ్గరకు తీసుకువెళ్ళారు. హిరణ్యకశిపుడు కుమారుని చూసి “నీ బుద్ధి మారిందా? గురువులు చెప్పింది తెలుసుకుంటున్నావా? లేక సొంతబుద్ధితో ఏమయినా నేర్చుకుంటున్నావా?’ అని అడిగాడు. ప్రహ్లాదుడు

“చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులు నే

జదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల జదివితి తండ్రీ!!

గురువులు నన్ను చదివించారు. ధర్మశాస్త్రం, అర్థ శాస్త్రములను నూరిపోశారు. ఇవే కాకుండా నేను ఇంకా చాలా చదువుకున్నాను. చదువుల వలన తెలుసుకోవలసిన చదువేదో దానిని నేను తెలుసుకున్నాను అన్నాడు. హిరణ్యకశిపుడు నువ్వు తెలుసుకున్న మొత్తం చదువులోంచి సారభూతమై పిండి వడగడితే ఇది వింటే చాలు అన్నపద్యం ఒక్కటి నాకు చెప్పు’ అని కుమారుని అడిగాడు. ప్రహ్లాదుడు

తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా

ర్చనముల్ సేవయు నాత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనం

బనునీతొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మిస

జ్జనుడైయుండుట భద్రమంచు దలతున్ సత్యంబుదైత్యోత్తమా!!

“శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం

అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం!!

అంటారు వ్యాసమహర్షి. ‘తండ్రీ ఈ శరీరం ఉన్నందుకు మనం ఈశ్వరుడిని తొమ్మిది రకములుగా సేవించాలి. ఇదే నేను చదువుకున్న చదువుల మొత్తం సారాంశము’ అని చెప్పాడు.

ఈమాటలకు హిరణ్యకశిపుడు తెల్లబోయి ఇది గురువులు చెప్పలేదు, నేను చెప్పలేదు. అలాంటి ఆలోచన నీకు ఎక్కడినుంచి వస్తోంది? నువ్వు రాక్షస జాతిలో పుట్టావు. కంటికి కనపడని శ్రీమన్నారాయణుని మీద నీకు భక్తి ఎక్కడినుండి వచ్చింది?” అని అడిగాడు. ప్రహ్లాదుడు

తండ్రీ ! మీకందరికీ రాని ఆలోచన నాకెందుకు వస్తోందని అడిగావు కదా! ఆయనను విడిచిపెట్టి మిగిలినవి నీవు ఎన్ని చేసినా అవి అన్నీ ఎటువంటి పనులో చెపుతాను. పుట్టు గుడ్డి వాడిని తీసుకు వెళ్ళి పున్నమి చంద్రుని దగ్గర కూర్చోబెట్టి పున్నమి చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో చూడరా అంటే ఎంత అసహ్యమో ఈశ్వరుడిని విడిచి పెట్టి సంసారం చాలా బాగుంటుంది అనుకోవడం అంత అసహ్యకరం.

కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;

సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;

విష్ణు నాకర్ణించు వీనులు వీనులు; మధువైరిఁ దవిలిన మనము మనము;

భగవంతు వలగొను పదములు పదములు; పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;

తే. దేవదేవుని చింతించు దినము దినము; చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;

కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు; తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి!!

కమలముల వంటి కన్నులు ఉన్న శ్రీమన్నారాయణుని అర్చించిన చేతులు ఏవయితే ఉంటాయో వాటికి చేతులని పేరు. శ్రీ మహావిష్ణువు గురించి పరవశించి పోయి స్తోత్రం చెయ్యాలి. అర్చన చేసేటప్పుడు ఒకమెట్టు పైన నిలబడి లింగాభిషేకం చేయమన్నారు. శేషశాయికి మొక్కని శిరము శిరము కాదు. ఆ మహానుభావుడి గురించి కీర్తనము చేయని నోరు నోరు కాదు. ఆయనకు ప్రదక్షిణలు చేయని కాళ్ళు కాళ్ళు కాదు. ఆయనను లోపల ధ్యానం చేయని మనస్సు మనస్సు కాదు. ఆయనను గురించి చెప్పని గురువు గురువు కాదు” అని ఇంకొక మాట చెప్పాడు.

కంజాక్షునకు గాని కాయంబు కాయమే? పవన గుంభిత చర్మభస్త్రి గాక

వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే? ఢమఢమ ధనితోడి ఢక్క గాక

హరిపూజనము లేని హస్తంబు హస్తమే? తరుశాఖ నిర్మిత దర్వి గాక

కమలేశు జూడని కన్నులు కన్నులే? తను కుడ్య జాల రంధ్రములు గాక

చక్రిచింత లేని జన్మంబు జన్మమే? తరళ సలిల బుద్భుదంబు గాక

విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే? పాదయుగము తోడి పశువు గాక!!

ఈశ్వరుడు మహోదారుడు. ఆయన నిర్మించిన ఈ శరీరము చాలా గొప్పది. తొమ్మిది రంధ్రములు కలిగిన తోలు తిత్తియందు పది వాయువులు ఆయన శాసనము అయ్యేంతవరకు బయటకు వెళ్ళడానికి వీలులేదు. అలా నిక్షేపించి నడిపిస్తున్న పరమాత్ముని తలుచుకోని వాడు, ఆ కంజాక్షుని సేవించడానికి సిద్ధపడని శరీరము శరీరము కాదు వట్టి తోలుతిత్తి. తండ్రీ చెయ్యవలసినది ఏదయినా ఉంటే ఒక్క కైంకర్యము చేయడానికే మనిషి బ్రతకాలి. అటువంటి బుద్ధితో ఉండాలి అన్నాడు

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...

instagram.com/pravachana_chakravarthy

మీరే సంపాదించుకోవాలి

 ఈ ఔషధాలు ఎప్పటికీ మందుల షాపులలో దొరకవు!


1. వ్యాయామమే ఔషధం


2. ఉపవాసం ఔషధం


3. సహజ ఆహారమే ఔషధం


4. నవ్వు ఔషధం


5. కూరగాయలు ఔషధం


6. నిద్ర ఔషధం


7. సూర్యకాంతి ఔషధం


8. ఎవరినైనా నిస్వార్ధంగా ప్రేమించడం ఔషధం


9. ప్రేమించబడడం ఔషధం


10. కృతజ్ఞత అనేది ఔషధం


11. నేర ప్రవృత్తిని వదలడం ఔషధం


12. ధ్యానం ఔషధం


13. మంచి స్నేహితులే ఔషధం


ఈ ఔషధాలను తగినంతగా మీ అంతకు


మీరే సంపాదించుకోవాలి.. పై ఔషధాలు సంపాదించుకుంటే, బజారులో ఉండే మందులషాపులో ఉండే ఔషధాలతో 99% అవసరమే ఉండదు.


ఆరొగ్యమె మహా భాగ్యం

సదా మీరు ఆరొగ్యంగా వుండాలని

దీపావళి శుభాకాక్షలతొ మీ

భార్గవ శర్మ

న్యాయవాది Advocate

  

భళ్లున తెల్లవారుతుంది

 .


_*✅లక్షల కాపీలు అమ్ముడుపోయిన "The Sky Gets Dark Slowly"*_


    _*ఈ పుస్తకం నేను చదవలేదు కానీ గూగుల్ లో దీని సారంశం చదివాను.*_

    _*'వృద్ధాప్యంలో డబ్బు అవసరం' గురించి ప్రస్తావిస్తూ ఆ సారాoశాన్ని ప్రస్తావించాను.*_

     _*నువ్వు వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి*. ✨_

*నిన్ను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులొక్కొక్కరూ రాలిపోతూ ఉంటారు.*🌠

    *నీ ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు.* 

    *నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు.*

*నీ మీద స్పాట్‌లైట్ ప్రసరించటం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. నీ కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక.* 

*కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు. ఈ సొసైటీ నీ గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయివుంటుంది*.

     *దాహంతో దూరంగా ఎక్కడో ఒక కాకి అరుస్తూ ఉంటుంది. నీ లాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు.* 

*నీ అమూల్య అభిప్రాయాల్ని చెప్పటానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను తబ్బిబ్బు చేస్తుంది*.

     *యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టావు. మధ్య వయసులో సంపాదించినది పిల్లల్ని అమెరికా పంపించడానికి ఖర్చు పెట్టావు. అందరితో ‘నా కొడుకు అమెరికాలో, కూతురు ఆస్ట్రేలియాలో ఉన్నది’ అని గర్వంగా చెప్తూ ఉంటావు.*

*ఎన్నాళ్ళకొక ఒకసారి వాళ్ళు నిన్ను చూడటానికి వచ్చారన్నది మాత్రం చెప్పవు. అమెరికా నుంచి నీ కొడుకు సెల్ ఫోన్ లో నీ పుట్టినరోజు తేదీ చూసి ఫోన్ చేస్తుంది. నీకు నీ మనవడితో మాట్లాడాలని ఉంటుంది. వాడు చా….లా బిజీ.*

    *అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్కగదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది.*

   *పక్క మీద గంటల, రోజుల తరబడీ పడుకొని ఉండటం దినచర్య అవుతుంది. పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి సంభవిస్తుంది. ఒకటే తేడా ఏమిటంటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి తల్లి ఉంది.*

*ఇప్పుడెవరూ లేరు. అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురూ, తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ. నీ అదృష్టం బాగా లేకపోతే అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు.*

     *నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా, అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లలాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఒళ్ళు వెచ్చబడితే చలిలో తిరిగావనీ, జలుబు చేస్తే చన్నీళ్ళ స్నానం చేశావనీ, కాళ్ళు నొప్పులు పెడితే గుడికి ఎందుకు వెళ్ళావనీ నిన్ను మందలిస్తూ ఉంటారు.*

*ప్రొద్దున్న లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబో, కీళ్ళ నొప్పులో ప్రారంభం అవుతాయి. బాత్‌రూంలో పడటం, కాళ్ళు విరగటం, జ్ఞాపకశక్తి నశించటం, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్‌గా ‘నీకు కాన్సర్’ అని చెప్పటం మొదలైనవి అన్నీ నీ జీవితంలో భాగమైపోతాయి.*

   *నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే, నువ్వు సంపాదించిన డబ్బు నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా, చూసీ చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో నీ పక్క గదిలో నీ వాళ్ళు చర్చిస్తూ ఉంటారు.*

*మరేం చెయ్యాలి?*

*THE SKY GETS DARK SLOWLY అనే పుస్తకంలో రచయిత “ప్రస్తుత జీవన విధానం మార్చుకుంటే,*

*పై సమస్యల్లో ‘కనీసం కొన్ని’ తగ్గించుకోవచ్చు” అంటాడు. “ఆకాశo క్రమక్రమంగా నల్లబారుతోందనీ, ఒక్కొక్క దీపమే ఆరిపోతుందనీ గ్రహించిన వ్యక్తి జీవితపు ఆఖరి స్టేజి కోసం ఆరోగ్యవంతంగా ప్రిపేర్ అవ్వాలంటే అయిదు సూత్రాలు గుర్తుంచుకోవాలి” అంటాడు.*

*ఆకాశం పూర్తిగా నల్లబడక ముందే నీ దారి పొడుగునా లైట్లు వెలిగించి శక్తి ఉన్నంతవరకూ పని చేస్తూ ఉండు.*

*నీకన్నా అశక్తులకీ, అనాథలకీ సహాయం చేస్తూ ఉండు.*

*ఏకాంతం స్థానే శూన్యత ప్రవేశించినప్పుడు అది అతి తొందరలో ఒంటరితనం గా మారుతుందన్న విషయాన్ని నువ్వు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత బాగుంటుంది. ప్రతి మనిషి చుట్టూ ఒక ‘తావి’ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ అది సుగంధ సౌరభ పరిమళంగానో, దుర్గంధ పూరితoగానో మారుతుంది.*

*ఎలా మారుతుందనేది హుందాతనాల / నీ చాదస్త ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది.*

*పిల్లలు పుట్టగానే లావు అవటం సహజం అనుకోకు. జిహ్వ చాపల్యం తగ్గించు. ఒక వయసు వచ్చాక తిండి ఆనందం కాదు. అవసరం.*

*వయసు పెరిగే కొద్దీ శరీరం ఇచ్చే సంకేతాలు గమనించు. పెగ్గులు సిగరెట్లు తగ్గించు. ఆంధ్ర తెలంగాణాల్లో లక్షకి ఐదువేల మంది స్త్రీలు థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారని అంచనా.*

*వయసు వల్ల వచ్చిన అధికారంతో నీ చుట్టూ ఉన్నవాళ్ళని శాసించకు.*

*వీలైనంత వరకూ వారి చర్యలపై నీ అమూల్యాభిప్రాయాన్ని వెల్లడి చేయకు.*

*నీ బోధనలు ఆపి ఒక్కడివే ఉండటం ఎలాగో నేర్చుకో. లేకపోతే నీ ఇంటివారు నిన్ను మరింత దూరం పెడతారు*.

*ఒంటరిగా కూర్చొని పుస్తకాలు చదువు.📖* *ఏకాంతంలో సంగీతాన్ని విను.*📻🎼🎤

*ఓపికుంటే మొక్కల్ని పరిరక్షించు.*🌱🪴🌳

*చిన్న పిల్లలతో కొద్ది సేపు వారికి ఇంటరెస్టు ఉన్న టాపిక్స్ కబుర్లు చెప్పు.* 🪅🧸🧮

*అఫెక్షన్ బ్యాంక్ లో ఆప్యాయతని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళు.*❤️

       *“ఎప్పుడైతే నువ్వు మానసికంగా ఇలా ప్రిపేర్ అయ్యావో నీ వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాలు వాయిదా వెయ్యగలవు” అంటాడు 'The sky gets dark slowly' అన్న పుస్తక రచయిత...* 


*జీవితం భళ్లున తెల్లవారుతుంది.. మెల్లగా చీకటి పడుతుంది*

.

దీపావళి

 🌴🕯️🪔🌹🛕🌹🪔🕯️🌴

*


_*దీపావళి ఐదు రోజుల పండుగ అంటారు ? వాటి విశేషాలు ఏమిటి ?*_


*ధన్వంతరి త్రయోదశి*


వాడుకలో ధన త్రయోదశి అని అంటూ ఆ రోజు బంగారం కొనాలనే ఆశ పడుతున్నాం ! కానీ ఆరోజు *'ఆయుర్వేదానికి,* ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన *'ధన్వంతరీభగవాన్'* జయంతి. పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత భాండముతో అవతరించాడు.


*నరక చతుర్దశి*


నరక యాతనల నుండి రక్షించమని యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి. నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు ప్రాక్జ్యోతీషపురం (నేటి అస్సాము ) ను పాలించే *'నరకుడు'* నర రూప రాక్షసుడు దేవీ ఉపాసకుడు కానీ దేవిని వామాచారంలో క్షుద్రపూజలు చేసి అనేక అధ్భుతశక్తులను సంపాదించి దేవతలను కూడా ఓడించాడు. వాడు ప్రతీ అమావాస్య- పౌర్ణమికి నవ యవ్వన రాచ కన్యలను దేవికి బలి ఇచ్చే వాడు , కాముకత్వంతో అనుభవించేవాడు. నరకుని చెరసాలలో వేలాది అందమైన మహిళలు ( రాచకన్యలు ) బందీలుగా వుండేవారు. ఆది వరాహమూర్తికి - భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు తామస ప్రవృత్తితో జనించాడు. శ్రీకృష్ణ భగవానుడు - సత్యభామ ( భూదేవీ అవతారం )తో కలసి గరుడారూడుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని శక్తి ( సత్యభామ ) సహకారంతో సంహరించాడు. నరకుని పీడ విరగడైంది కావున ఇది *'నరక చతుర్దశి'.*


*దీపావళి*


రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సంధర్బంగా దీపావళి జరుపు కోవాటం , నరకుని బాధల నుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. దీపం - లక్ష్మీ స్వరూపం - ఐశ్వర్య స్వరూరం - జ్ఞాన స్వరూపం అందుకే మనం దీపావళి రోజు లక్ష్మీపూజలు చేస్తాము. వ్యాపారస్తులు కొత్త లెక్కలు వ్రాసుకుంటారు.


*బలిపాఢ్యమి*


వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలి చక్రవర్తిని *'మూడు అడుగుల'* నేలను దానమడిగాడు. వామన వటువుకు దానమిచ్చాడు బలి , *'ఇంతింతైవటుడింతైనభోరాశిపైనల్లంతై'* అన్నట్లుగా ఒక పాదంతో భూమిని , ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన 'త్రివిక్రముడు' వేరొక పాదంతో బలిని పాతాళానికి అణచాడు. సంవత్సరానికి ఒకసారి బలి పాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడి దీపకాంతులను చూసి మనమంతా సుఖశాంతులతో వుండాలని ఆశీర్వదించి వెలతాడట ఇదీ ఆయనకు వామనుడిచ్చిన వరం.


*యమద్వితీయ*


సూర్య భగవానునికి యముడు - శనిదేవుడు ఇద్దరు పుత్రులు. యమున అనే ఒక పుత్రిక కలదు. యముడు - యమున ఇద్దరూ అన్నా చెల్లెలు కదా ! తనపని ( జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశంతో ఈడ్చుక వచ్చి వారి వారి కర్మాను సారం వారి వారికి తగిన శిక్షలు విధించే పనిలో పడి పాపం చెల్లెలింటికి వెళ్ళటం లేదు యముడు. చెల్లి బతిమాలింది ఒకసారి మా ఇంటికి రా అన్నయ్యా అని బతిమాలింది చెల్లెలు కార్తీక శుద్ఘ విదియ , మంగళవారం రోజు తీరిక చేసుకుని తన చెల్లెలింటికి వెల్లి హాయిగా కొద్ది సేపు వుండి భోజనం చేసి వచ్చాడు యముడు చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగింది. ఎవరైతే ఈ రోజు చెల్లెలింటికి వెల్లి చెల్లెలికి కట్నకానుక లిచ్చి వాల్లింట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చేయి అని అడిగింది. ఈ యమునమ్మనే యమునా నది. కృష్ణుని భక్తురాలు. భగినీ హస్తభోజనం అన్న పేరుతో ఉత్తర భారతంలో ఈ పండుగ ఇప్పటికీ జరుపుకుంటారు.


గ్రహణానికి ముందు,  గ్రహణ సమయంలో,  గ్రహణం పూర్తి అయ్యాక పాటించవలసిన నియమములు ఏమిటి? 

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆


గ్రహణం అనగా పట్టుకోవడం.  సూర్యుడిని లేదా చంద్రుడ్ని, రాహువు లేదా కేతువు పట్టుకుంటే దానిని సూర్య లేదా చంద్రగ్రహణం అంటారు. ఆ సమయంలో సూర్యుడిని లేదా చంద్రుడిని  రక్షించడానికి, తగినబలం వారికి ఇవ్వడానికి  సకల దేవతలు వెళతారు. అందుకే ఇక్కడ ఉన్న ఆలయాలలో దేవతలు ఉండరు. ఆలయాలు  మూసేస్తారు. ఆ సమయంలో చేసే జపం వల్ల దేవతలకు బలం చేకూరుతుంది. వారిని రక్షిస్తుంది. ఆ పుణ్యఫలం వల్ల దేవతలు మనకు అక్షయ ఫలితాన్ని ఇస్తారు. 



*1.*  గ్రహణానికి ముందు పట్టు స్నానము చేయాలి

*2.*  గ్రహణం పూర్తి అయ్యాక విడుపు స్నానము చేయాలి.

*3.* గ్రహణ సమయంలో గురువు గారి ఉపదేశం ఉన్నవారు మంత్ర జపం చేయాలి,  ఉపదేశం లేని వారు భగవన్నామ స్మరణ చేయాలి. 

*4.* ఈ సమయంలో వీలయినంత వరకు ప్రయాణం చేయకూడదు.

*5.*  గ్రహణానికి 2 గంటల ముందే ఆహారం తీసుకోవాలి.  గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు.

*6.*  గ్రహణ సమయంలో    మంత్ర జపం,  పురాణ శ్రవణం  లేదా భగవన్నామ స్మరణ మాత్రమే చేయాలి. 

*7.* పట్టు స్నానము, విడుపు స్నానము వంటివి గంగ లేదా ఇతర నదీనదములలో    చేయడం వల్ల గొప్ప ఫలితం వస్తుంది. 

*8.*  గ్రహణం తరవాత దానం చేయడం, స్వయంపాకం దానం ఇవ్వడం వల్ల చాలా రెట్ల పుణ్యం లభిస్తుంది. 

*9.* ఇల్లు శుద్ధి అయ్యాక  ఆలయాలలో ప్రదక్షిణలు చేయడం, ఆలయాలను కడగడం అత్యంత పుణ్యప్రదం.  

*10.* ఇంటిలో, వంట సామగ్రి పైన, పూజామందిరం మొదలైన చోట్ల దర్భలు పరచాలి..



సూర్య గ్రహణం పూర్తి అయ్యాక చేసే స్నానాన్ని ఏమంటారు? సూర్య గ్రహణం పూర్తి అయ్యాక స్నానం చేస్తే, ఎక్కడ స్నానం చేసిన ఫలితం వస్తుంది?

ఈసారి దీపావళి పండుగనాడు పాక్షిక సూర్యగ్రహణం, కార్తీక పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుండడంతో ఈ పండుగలను ఎప్పుడు జరుపుకోవాలన్న దానిపై ప్రజల్లో అయోమయం నెలకొంది. ఈ నెల 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఏర్పడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే రోజున దీపావళి సెలవు ప్రకటించాయి. అయితే, 25న అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుంది. ఆ రోజు అమావాస్య ఘడియలు ఉండవు కాబట్టి దీపావళి జరుపుకోవడం సబబు కాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. 24న ఉదయమంతా చతుర్దశి ఉంటుంది. రాత్రంతా అమావాస్య ఉంటుంది. కాబట్టి 24న లక్ష్మీపూజ చేసుకుని, రాత్రి టపాసులు కాల్చి పండుగ జరుపుకోవచ్చని అంటున్నారు. 

 

కార్తీక పౌర్ణమి విషయంలోనూ ఇలాంటి గందరగోళమే నెలకొంది. నవంబరు 8న మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్ర 6.27 గంటల వరకు చంద్ర గ్రహణం ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత కాసేపటి వరకు చంద్ర గ్రహణం ఉంటుంది. అంటే, చంద్రగ్రహణం చివరి నిమిషాల్లో మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో కనిపించే అవకాశం ఉంది. నవంబరు 7 నుంచే పౌర్ణమి ఘడియలు ప్రారంభమవుతాయని, కాబట్టి అదే రోజున కార్తీక వ్రతాలు, పూజలు చేసుకోవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.....

🕯️🪔🕯️🌹🛕🌹🕯️🪔🕯️

దీపావళి పండుగ శుభాకాంక్షలు "

 శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు ! శుభోదయం !                                                          " సహనావవతు ! సహనౌ భునక్తు ! సహవీర్యం కరవావహై ! తేజశ్వినావధీతమస్తు ! మా విద్విషావహై ! ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః ! "                                                                                     విద్వేష భావాల తలపులను విడనాడి, సన్మైత్రీ భావన పెంపొందించుకుని సమన్వయ సద్భావాన్ని స్థిరీకృతం చేయాల్సిన సమయం ! విశ్వ జీవజాలపు సంరక్షణకై, విశ్వ మానవాళి అనునిత్యం సమైక్య భావనతో దివ్య సుప్రకాశ జీవన జ్యోతిగా వెలుగొందాల్సిన శుభ తరుణం ! విశ్వ మానవాళి తమ తమ మనస్సులలో సకల విశ్వ శ్రేయోదాయక సదాలోచనతో మున్ముందుకు సమీకృతంగా సాగాలన్న విషయావశ్యకం ! విశ్వ చరాచర జీవ జగత్తు ప్రశాంత జీవన సన్మార్గానికై దీపావళి పండుగ సకల విధాలా తోడ్పాటుగా నిలవాలన్నదే సదాశయం !                                                              " బంధుమిత్రులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు "                                                  🤝🌹💐🌺🤝                     గుళ్లపల్లి ఆంజనేయులు

దీపావళి శుభాకాంక్షలతో

 * దీపావళి శుభాకాంక్షలతో...*


దీపము బాపును చీకటి

దీపము నింపును వెలుగులు దేదీప్యముగా

దీపము నార్పకు నెపుడును

దీపమె నీయింట లక్ష్మి దివ్యము కృష్ణా..


✍🏼 *గోగులపాటి కృష్ణమోహన్* 🪔


ఉ॥ దీపపు కాంతులందు మన దీప మహోజ్వల వజ్రకాంతులై 

పాపహరంబుగల్గి ధర పావనరూపము బొందు దేహమై శ్రీల నొసంగెడు సిద్ధరూపియై 

దాపున జేరి బ్రోచు నినుదైన్యము మాపును ధర్మకాంతియై ||


శ్రీపరిపాలినీ! మహతి!


దైన్యము మాపును ధర్మకాంతియై ||


🕉️

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔


కందం:-

********

దీపము వెలిగించినచో

పాపము తొలగింపజేసి భాగ్యము నిచ్చున్

దీపావళి మనలందరి

తాపములను పార ద్రోలి ధనములనిడుతన్.🕉️

డా.భోగయగారి. చన్ద్రశేఖర శర్మ.

౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿

క్రాంతులు నిండగా కళల దీపావళి

 దీపావళి పండుగ శుభాకాంక్షలు


సీ.

  : పెటపెటల్ ఢమఢమల్ వెల్లువెత్తగా మిన్ను

 కంపించిపోవంగ ఘనతబొందె 

జుయ్ జుయ్ రవాలు ప్రచోదనములు గాగ 

దివికేగు చువ్వల దీప్తి వెలిగె తుస్సుబుస్సుల శబ్ద తోషాలు వెలయంగ

 క్రాంతులు నిండగా కళల బొందె 

మాటిమాటికి వెల్గు మంగళతోరణ 

వరుసల నిర్మించ పరువమొందె పిన్నపెద్దలు జేరి పెద్దపెట్టున గోల

 చేయంగ సందడిన్ చెన్ను మెఱిసె 

నోళ్ళన్ని తీపితో నోములు నోయంగ 

మాధురీస్మృతులెల్ల మమతలొలికె

 క్రొత్తయల్లుళ్ళ విలోకనాపుంజముల్

 భార్యలన్ బంధింప పరిఢవిల్లె

 తే.గీ.


దివ్యదీపావళీ పర్వదినము నేడు 

పుడమి పులకించె వేడుకన్ మురిసి తనిసి 

నవ్యవధువౌచు నర్తించె నయముతోడ 

ఇట్టి వేళ శుభాకాంక్ష లిడెద ననము!


శ్రీ శుభకృత్ దీపావళి


శ్రీశర్మద