🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹
*మన మహర్షుల చరిత్రలు..*
*🌹ఈరోజు 59 ,వ ముద్గల మహర్షి గురించి తెలుసుకుందాము..🌹*
🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️
🍁ఇప్పుడు మనం ముద్గల మహర్షిని గురించి తెలుసుకుందాం . మనిషి ఎప్పుడూ చెయ్యాల్సిన పన్లు దానం , ధర్మం , పరోపకారం .
☘️దాన తపాల్లో తపం కన్నా దానం గొప్పది . అదికూడ అన్యాయంగా సంపాదించినదాన్తో దానం చెయ్యకూడదు .
🍁మనం కష్టపడి సంపాదించింది దానం చేస్తేనే మంచి జరుగుతుంది . దాన ధర్మాలు చెయ్యడంలో ముద్గల మహర్షి చాలా గొప్పవాడు .
☘️ముద్గలుడు విద్యలన్నీ నేర్చుకున్నాక పెళ్ళి చేసుకుని పిల్లల్లో కలిసి కురుక్షేత్రంలో ఉండేవాడు .
🍁అతడు భిక్షకి వెళ్ళి వచ్చి వచ్చినదాన్తో భార్యాబిడ్డల్ని పోషించేవాడు . అతను త్యాగమే ధనమనీ , భోగం రోగమనీ , తపమే ధర్మమనీ , నిష్ఠగా ఉండడమే ఉత్సవమనీ , ఉపవాసముండడమే మహాభోగమనీ అనుకుంటూండేవాడు .
☘️భార్య పిల్లలు కూడా ఆయన చెప్పినట్లు వినేవాళ్ళు . ముద్గల మహర్షి కుటుంబం పాడ్యమినాడు మొదలు పెట్టి పధ్నాలుగు రోజులు సంపాదించిన ధాన్యంతో ఒక పర్వదినం రోజు వండుకుని మొదట పితృదేవతలకి పెట్టి తర్వాత అతిథులకి పెట్టి వాళ్ళు తినేవాళ్ళు .
🍁తినడం కోసం జీవించడం కాదు ; జీవించడం కోసం తినాలన్నది ఆయన ఉద్దేశ్యం సందేశం కూడ .
☘️ఒకసారి దుర్వాస మహాముని వాళ్ళింటికి భోజనానికి వచ్చాడు . తర్వాత ముద్గల మహర్షిని పరీక్షించాలని ప్రతి పర్వదినం రోజు వచ్చి తను తినకల్గింది తిని మిగిలింది విసిరేసి వెళ్ళేవాడు దుర్వాస మహర్షి .
🍁పాపం వాళ్ళకి తినడానికి మిగిలేది కాదు . అసలే వాళ్ళు తినేదే పదిహేను రోజులకి ఒకసారి కదా ! అయినా ప్రతి పర్వదినం రోజూ వచ్చి తినేసి వెళ్ళిపోయేవాడు .
☘️వాళ్ళు కూడా ఏమీ అనుకోకుండా పెట్టేవాళ్ళు . దుర్వాస మహర్షి ఒక రోజు ముద్గల మహర్షిని మహర్షీ ! నిన్ను పరీక్షించాలని ఇలా చేశాను .
🍁నువ్వు చేసిన అన్నదానం చాలా గొప్పది . మనిషి నాలుక ఎప్పుడూ రుచుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది .
☘️నువ్వు జీవితంలో బ్రతకడానికి అవసరమయిన అన్నాన్ని కూడా అతిథి సేవకి వదిలేశావు . ఇంతకన్నా గొప్ప వాళ్ళెవరు ? నీకు శరీరంతో స్వర్గానికి వెళ్ళగలిగే వరం ఇస్తున్నానన్నాడు .
🍁కొంతకాలం తర్వాత స్వర్గలోకం నుంచి విమానం వచ్చి ముద్గల మహర్షినీ , అతడి భార్యాపిల్లల్నీ ఇంద్రలోకం తీసుకువెళ్ళడానికి ఒక దేవదూత వచ్చాడు .
☘️ముద్గల మహర్షి దేవదూతని మహాత్మా ! మీరిలా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది . ఇక్కడ నా వ్రతాన్ని వదిలేసి నన్ను అక్కడికి రమ్మంటున్నారు .
🍁వచ్చే ముందు అసలు మీలోకంలో ఉండే గుణాలు , దోషాలు తెల్సుకోవాలనుకుంటున్నాను అనడిగాడు .
☘️దేవదూత మహర్షీ ! మీ భూలోకం మీదే మా స్వర్గలోకం వుంది . అక్కడికి రావడానికి అందరూ అర్హులు కారు . అది ముప్ఫై వేల యోజనాలు ఆక్రమించి వుంటుంది .
🍁గొప్ప తపస్సంపన్నులు , యజ్ఞయాగాలు చేసిన వాళ్ళు , ఇంద్రియాల్ని జయించిన వాళ్ళు , దానాలు చేసిన వాళ్ళు , దేవతలు , సాధ్యులు , ఇలా అందరూ ఉత్తమమైన వాళ్ళే వుంటారు .
☘️అక్కడ వాళ్ళందరూ చాలా సుఖంగా ఉంటారు . దాని పైన బ్రహ్మలోకం వుంటుంది . అది శోకం లేనిది . బ్రహ్మలోకమే మిగిలిన లోకాల్ని ప్రకాశింప చేస్తుంది .
🍁అన్ని లోకాలు నాశనమయినా కూడా బ్రహ్మలోకం అలాగే ఉంటుంది అని గుణాల గురించి చెప్పాడు దేవదూత . ఇంక దోషాలు చెప్తాను వినమన్నాడు .
☘️స్వర్గలోకంలోకి వచ్చిన మనిషి తాను చేసిన పుణ్యం అయిపోగానే మళ్ళీ భూలోకంలో పుడతాడు .
🍁కాని కర్మఫలం మాత్రం చేసిన పుణ్యం ప్రకారమే ఉంటుంది . స్వర్గలోకంలో సుఖాలు అనుభవించి భూలోకంలో పడిన మనిషి కొంత కష్టపడతాడు .
☘️సుఖానికి అలవాటుపడ్డాడు కదా ! స్వర్గలోకంలో కూడా భూలోకంలో వున్నట్లే అహంకారం ఈర్ష్యలాంటివి ఉంటాయి .
🍁ఒక్కమాటలో చెప్పాలంటే భూలోకం కర్మభూమి , స్వర్గలోకం ఫలభూమి అని చెప్పాడు దేవదూత .
☘️ముద్గలుడు మహాత్మా ! మీ స్వర్గలోకానికి ఒక నమస్కారం .
నా లోకమే నాకు బావుంది . మళ్ళీ మళ్ళీ జన్మరాకుండా శాశ్వతంగా బ్రహ్మలోకంలో వుండడమే నాకిష్టం . !
🍁అర్హత వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను . నాకు సుఖాలు వద్దు . కొంచెం కష్టపడినా తర్వాత శాశ్వతంగా సుఖంగా ఉండే బ్రహ్మలోకం కోసం ఎదురు చూస్తాను .
☘️మీరు వెళ్ళిరండి అన్నాడు . చివరికి ముద్గల మహర్షి ధర్మ సారంగా సేవలు చేస్తూ తప్పసుతో అనుకున్నది సాధించి బ్రహ్మలోకా ప్రాప్తి పొందాడు..
🍁ఇదండీ ముద్గల మహర్షి గురించి మనకు అందిన సమాచారం రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి!
సేకరణ: శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.
☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి