25, సెప్టెంబర్ 2024, బుధవారం

ధర్మ సందేహాలు*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

         *ధర్మ సందేహాలు*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 *పంచకోశాలు అంటే ఏమిటి?*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఉల్లిపాయ ఎలా పొరలు పొరలుగా ఆచ్చాదింపబడి ఉంటుందో అలాగే ఆత్మ చుట్టూ పంచకోశాలు అనే పొరలు చేత కప్పబడి ఉంటుంది.*


*అవి ఆత్మకు తెలుసుకోనియక, పైనున్న పొరలతో ఆత్మ తాదాత్మ్యం చెంది ఆ కోశములనే తానుగా భావించి దుఖములకు లోనగుచున్నది.*


*ఈ ఆత్మ మానవుడి యందు అయిదు కోశాలచేత ఆవరించబడి ఉంటుంది, అవి...*


*1. శరీరం "అన్నమయ కోశం"*


*2. జీవశక్తులచేత ఏర్పడిన "ప్రాణమయ కోశం"*


*3. మనస్సు "మనోమయ కోశం"*


*4. బుద్ధి "విజ్ఞాన మయ కోశం"*


*5. అజ్ఞానంచేత ఏర్పడిన "ఆనందమయ కోశం"*


*పైన చెప్పిన అయిదు కోశములే మనయందు మూడు శరీరాలుగా వ్యవహరింపబడుచున్నవి.*



*1. స్థూల శరీరం- అనగా అన్నమయ కోశం,*

*2. సూక్ష్మశరీరం అనగా ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు.*

*3. కారణ శరీరం- అనగా ఆనందమయ కోశం.*


*మానవుడు జీవించి వున్నపుడు ఆత్మ (జీవాత్మ) కారణ శరీరంలోనూ, కారణ శరీరం సూక్ష్మ శరీరంలోనూ, సూక్ష్మ శరీరం స్థూల శరీరంలోనూ నిబిడమైయున్నందున ఆత్మ మూడు శరీరాలలోను యున్నదని అర్థమవుతోంది.*


*అయితే మరణమనగా ఏమిటి అని విచారించినపుడు స్థూల శరీరం నుండి సూక్ష్మ, కారణ శరీరాలు వేరుకావడమే.*


*తిరిగి జన్మాంతర ప్రాప్తికి సూక్ష్మశరీరమే కారణమవుతున్నది. అంటే మరణం తరువాత జీవాత్మ ప్రాణం వద్దకు అనగా సూక్ష్మ శరీరంలోని ప్రాణమయకోశం వద్దకు మరణ సమయంలో ఏ మనోభావంతో వుంటుందో అదే మనోభావంతో వస్తుందని ఉపనిషద్వువాచ.*


*ఆ విధంగా ఆత్మ(జీవాత్మ) తనకు తగినపుడు పునర్జన్మను పొందుతోంది. మరణం శరీరానికే కాని ఆత్మకు కాదు. జననం మరణానికి ప్రారంభమే తప్ప మరేమి కాదు. పునర్జన్మ లేదంటే తిరిగి మరణించవలసిన అవరంలేదని అర్థం. ఈ విధంగా ప్రాణం యొక్క రాకపోకలను ''పునరపి జననం పునరపి మరణం - పునరపి జననీ జఠరే శయనం''* *అంతఃప్రకృతిని - సత్యం తెలుసుకొన్న ప్రాజ్ఞుడు పునరావృత్తి రహిత కైవల్యాన్ని పొందుతున్నాడని ఉపనిషద్ద్వచనం.*


*కొందరు పెద్దలు మానవ శరీరము సప్తకోశ నిర్మితమని చెప్పియున్నారు. ఇట్టి సప్తకోశములను ఒకదానియందు మరియొకటి అయస్కాంత క్షేత్రమందు అయస్కాంతమున్నట్లు అమర్చబడినవని చెప్పియున్నారు.*


*అన్నమయ కోశమునే భౌతిక దేహముగా కొందరు చెప్పియున్నారు. జ్ఞానమయ విజ్ఞానమయ కోశములను విజ్ఞానమయ కోశముగా చెప్పిరి. ఏ విధముగా చెప్పినను 'నేను' అను జీవప్రజ్ఞ ఈ కోశముల యందు మేల్కొనినప్పుడు ఆయా కోశములకనుగుణముగా ప్రతి స్పందించుచుండును. ఆవేశమునకు ఆనందమునకు లోనైనప్పుడు ఆనందమయ కోశమునందున్న వాడిగాను వ్యక్తమగుచున్నాడు. జీవప్రజ్ఞ ఏ కోశమునందు ప్రధానముగా మేల్కొనియుండునో ఆ కోశమే మిగిలిన కోశములపై ఆధిపత్యము కలిగియుండును.*


*గం గం గం గం గణేశాయ నమః।*

*ఓం నమో భగవతే వాసుదేవాయ।*

*ఓం నమః శివాయ।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

దత్తాత్రేయ స్వామి చరిత్ర*

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

   *దత్తాత్రేయ స్వామి చరిత్ర*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*మసక చీకటిలో త్రాడును చూచి పామని భ్రమించి భయపడతాము. కాని తర్వాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి, భయము తోలుగుతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మా ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము, ఆశ, దుఃఖము కల్గుతాయి. ఆత్మజ్ఞానమనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము, ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవమవుతుంది. అపుడు భయానికి, దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది. అంటే ఈ జగత్తు మిధ్యయని తేలిపోతుంది. సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్త్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయ పూర్వక నమస్కారము.*


*ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్త్వాన్ని బోధించడానికి అత్రి మహాముని పుత్రుడై జన్మించి, శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు.*


*భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు, యదువు మొ||న వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుండి ఉద్దరించాడు. ఆయననే మరల శ్రీ పాదవల్లభుడుగాను, తరువాత శ్రీ నృసింహసరస్వతియనే పేరుతోనూ అవతరించి, తన శిష్యులైన సిద్దాదులనుద్దరించాడు.*


పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనేరాజు నిరంతరము హరి చింతన, అతిథి సేవలతోపాటు నిష్టతో ఏకాదశి వ్రతము ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశీ తిథి ఒక్క ఘడియ మాత్రమే ఉండగా దుర్వాస మహర్షి, శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు. అంబరీషుడు ఆయనను పూజించి, త్వరగా అనుష్టానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్ధించాడు.


అపుడా మహర్షి, స్నానానికి నదికి వెళ్లి పారణ సమయం మీరిపోతున్నాగాని రాకుండా ఆలస్యం చేయసాగారు. తిథిమించి పొతే అంబరీషునికి వ్రతభంగమవుతుంది. అలాగని అతడు భోజనం చేస్తే, అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది. అందుకని అతడు ఆ రెండింటిని పరిరక్షించుకోదలచి,కొద్ది తీర్థం మాత్రం త్రాగాడు. ఇంతలో దుర్వాసుడొచ్చి కోపించి, ‘రాజా, నీవు నానాయోనులలో జన్మింతువు గాక!’ అని శపించాడు. 


అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణువేడాడు. అపుడాయన సాక్షాత్కరించి దుర్వాసునితో, ‘మహర్షీ, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతనిని రక్షించడం నా ధర్మం. అయినా మహర్షులైన మీ శాపం వ్యర్దం కాకూడదు కనుక, ఆ శాపాన్ని నాకు వర్తింపజేయి’ అన్నారు. అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దుర్వాషుడు సరే అన్నాడు. స్వామీ అంతా మీ అభీష్టం ప్రకారమే కానీ అన్నాడు. ఆ విధంగా శ్రీహరి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు.    


దత్తాత్రేయుని జననం :  


దేవహుతి మరియు కర్ధముని కుమార్తె అనసూయ . అనసూయాదేవి అత్రిమహర్షికి భార్యయై, మహా పతివ్రతగా ప్రసిద్దికెక్కింది. ఒకసారి త్రిలోక సంచారియైన నారదమహర్షి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాసాలకు వెళ్లి, అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి యెంతగానో ప్రశంసించాడు. అప్పుడు త్రిమూర్తుల భార్యలు అసూయచెంది, ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్భందించారు. అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అతిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అనసూయదేవి వారికి యెదురేగి స్వాగతం చెప్పి, ఆర్ఘ్య – పాదాదులు సమర్పించి, మీకు నేనేమి చేయాలో సెలవియ్యండి. అత్రి మహర్షి తపస్సుకోసం అరణ్యంలోకి వెళ్లారు. అపుడు అతిథులు ‘అమ్మా! మాకెంతో ఆకలిగా ఉంది, నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము గదా? మాకు వెంటనే భోజనం పెట్టు’ అన్నారు. ఆమె లోపలకు వెళ్లి విస్తర్లు వేసి, అయ్యలారా! భోజనానికి దయజేయండి. అని ప్రార్ధించింది. అపుడు వారు ‘సాధ్వీ, మాదొక షరతు ఉన్నది. నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము. లేకుంటే యిలా ఆకలితోనే వెళ్లిపోతాము’ అన్నారు.


వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది. అంతేగాక, ఆకలితో తిరిగిపోయిన అతిథి, గృహస్థుల పుణ్యాన్ని, తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం. కాని పరపురుషుల యెదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది! పరస్పర విరుద్దమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోజూచిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది. వారి విచిత్రమిన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది. అయ్యలారా అలానే చేస్తాను, భోజనానికి లేవండి! అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్లి, అత్రిమహర్షి పాదుకలతో, స్వామి, ‘నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను.’ అని చెప్పుకొన్నది. ఆమెయొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు. ఆమె భావాన్ననుసరించి ఆమెకు బాలింతరాలకు వలె స్తన్యమొచ్చింది.ఆమె ఆ వెంటనే వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు పాలిచ్చింది. ఆ మహా పతివ్రత తన దివ్యద్రుష్టివలన వారు త్రిమూర్తులు అని తెలుసుకొని ఊయాలలో పెట్టి, ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది.


ఇంతలో అత్రి మహర్షి వచ్చి, ఆమె నుండి సర్వము తెలిసుకొని ఊయలలొని త్రిమూర్తులను దర్శించి, ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను యిలా స్తుతించాడు. ‘ఓ మహావిష్ణు! నీవు సృష్టి-స్థితి-లయ కారణుడవు. జగత్సాక్షివి, విశ్వమయుడవు. విశ్వాధరుడవు. ఓ పరమేశ్వర! నీవు సహజంగా ఒక్కడవే అయినా నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు. వాస్తవానికి ఈ జగత్తు నీ కంటే వేరు గాకపోయిన, మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు , ‘నేను-నాది’ అనే మాయతో గూడిన భావన వలన నీకంటె వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది.   


ఊయలలొని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తిచెంది, తమ నిజరూపాలతో ప్రత్యక్షమై. వరం కోరుకోమన్నారు. అప్పుడు అత్రి మహర్షి భార్యవైపు చూస్తూ ‘సాధ్వీ, వీరు మనస్సు చేతగూడ పొందడానికి వీలుగానివారు. అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు. నీ అభీష్టమేమిటో నివేదించుకో అన్నాడు.’ అప్పుడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడడ్డారు. కనుక ఈ మూడు మూర్తులగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది, మీ అవతారకార్యం నేరవేర్చుకోవడమే నా అభీష్టము అన్నది. అత్రిమహర్షి సంతోషించి , మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ముద్దరించండి.అని కోరాడు. అపుడు వారు మహర్షీ మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము. ఆ తర్వాత అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు జన్మిస్తాడు. ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే; శ్రుతులకు గూడ అందని సచ్చిదానంద స్వరూపుడు; మానవుల అభీష్టాలు నెరవేర్చి యోగము, జ్ఞానము ప్రసాదించేవాడు. స్మరించిన తక్షణం లోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూఉంటాడు.*


ఓం శ్రీ దత్తాత్రేయ నమః

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

పూర్తి శ్లోకాలు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*వాడుకలోని సంస్కృత వాక్యాలు*

      *వాటి పూర్తి శ్లోకాలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

    *యథా రాజా తథా ప్రజా*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పూర్తి శ్లోకం:~*


*రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా,*

*పాపే పాప పరా: సదా*


*రాజాను మను వర్తంతే,*

*యథా రాజా తథా ప్రజా !*


*భావం :~*


*రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.*


*శ్రీ గురుభ్యో నమః।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

చిత్ర పద్యం*

 *చిత్ర పద్యం* 



కం. బరువేమియు కాదిక్కడ

పరుగెత్తుతు వాహనమును బాధ్యత తోడన్

చెరగని ప్రేమను పంచుచు

కరములతో భార్య కొడుకు కాపాడుటకై


*పద్య కవితా శిల్పకళానిధి* 

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు* 

 *మిట్టాపల్లి*

ఆయుర్వేదము నందు పరిమళం గల ఔషధాలు -

 ఆయుర్వేదము నందు పరిమళం గల ఔషధాలు -

1

     

        అంతకు ముందు పోస్టులో ప్రాచీన కాలంలో వైద్యములో పరిమళములను యే విధముగా వాడేవారో మీకు తెలియచేశాను. ఇప్పుడు మనకి చుట్టుపక్కల లభ్యం అయ్యే కొన్ని మొక్కల యెక్క వాసనను చూడటం వలన ఏయే వ్యాధులు నయం అవుతాయో మీకు మొక్కలతో సహా వివరిస్తాను.


 * చేమంతి -


       ఈ చెట్టు జాతిలో అడివి చేమంతి అని మరియొక రకం కూడా కలదు. ఈ చెట్టు పూలతో అరకు తయారు చేసిన అరకు మూర్చ , శ్వాస , తాపము మరియు అరుచి ని పోగొట్టును . దీని పువ్వులు మరియు ఆకులలో చామాజులెన్ , కుమారిక్ , కాంఫర్ , బోర్నియోల్ , టర్పెనిస్ మున్నగు ముఖ్యమైన చేదు తైలాలు కలవు. వాటికి అలర్జీని అరికట్టు గుణములు ఉన్నవి. కావున జేబు రుమాలుకు దీని అత్తరును అంటించి వాసన చూచుచుండిన యెడల అలర్జీ వారికి రక్షణ కవచముగా ఉండును.


 * తులసి -


         దీని దళములను , పుష్పములను గుచ్చముగా కట్టి వాసన పీల్చుచుండిన యెడల తలభారం , తలనొప్పి , పడిసెము , రొమ్ము నందు జలుబు , గొంతునొప్పి , తలతిరుగుడు , పైత్యవికారం , ముక్కునందు క్రిములు నశించును.


 * నీలగిరి -


           దీని ఆకులను , పువ్వులను నలిపి వాసన చూచుచుండిన యెడల వగర్పు , దగ్గు , తలనొప్పి , ముక్కుదిబ్బడ , చెవులదిబ్బడ , దంతశూల , పడిసెము , ముక్కు వెంట ఆగకుండా నీరు కారుట ( పీనస రోగం ) నశించును.


 * కుంకుమపువ్వు -


         నాలుగైదు చుక్కలు గులాబీ అరకులో రెండు మూడు రేకుల స్వచ్చమైన కుంకుమపువ్వును అరచేతిలో తీసుకుని బాగుగా రుద్ది వాసన చూచుచుండిన యెడల తీవ్రమైన తలనొప్పులు , కంటిమంట , ముక్కు నుంచి వెలువడు దుర్గన్ధము , చిత్తచాంచల్యము , జలుబు దోషము , మూర్చవ్యాధి నశించును.


 * ఉల్లిపువ్వు - 


          ఉల్లిపూవ్వు లేదా గడ్డను ముక్కలుగా తరిగి వాసన చూచిన యెడల తేలు , కందిరీగ , జెర్రి విషములు నశించును. దీనికి తోడుగా తాంబూలపు సున్నం , నవాసారము శనగ గింజ అంత ప్రమాణం కలిపి అరచేతిలో నలిపి వాసన చూచిన యెడల తక్షణమే బాధ తగ్గును. జలుబు , తలభారం , దంతశూల , నేత్రశూల కూడా హరించును . 


 * వెల్లుల్లి -


           దీనిలో సల్ఫర్ ఆక్సయిడ్ , సల్ఫర్ అయొడిన్ , గార్చిసిన్ మున్నగు రసాయనాలు , A , B1 , B2 విటమిన్లు కలవు. ఇది మిక్కిలి ఘాటైన వాసన కలిగినది . ఇది ఇంత దుర్గన్ధమో అంతకంటే ఎక్కువ రెట్లు మేలు చేయును . దీనిని దంచి లేదా నలిపి వాసన చూచుచుండిన యెడల తలభారము , పడిసెము , మూర్చ వలన కలుగు పోటు , నేత్రశూల నివారణ అగును. తులసి ఆకులు అల్లముతో కలిపి ముక్కులో కలిపి పిండిన మూర్చరోగముల యందు విశేష లాభం కలుగును. దీనిని కడుపులోకి వాడిన కృమి రోగం , ఉదరశూల , గ్యాస్ , కీళ్ళపట్లు , ఆస్తమా , రక్తపోటు నివారణ అగును.


            మరికొన్ని సువాసన మొక్కల ఔషధాల గురించి మరియు గాడనిద్రను తెచ్చు సువాసనల గురించి తరవాతి పోస్టులో వివరిస్తాను. 


    

      మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

Panchaag


 

ప్రణయ రాయబారం !

 



ప్రణయ రాయబారం  !

--------------------------------

కావ్యరచన ఒక శిల్పం. తిక్కనకూడా ఇదేమాట యన్నాడు." అమలోదాత్త మనీష నేనుభయ కావ్య ప్రౌఢిఁ బాటించు శిల్పమునన్ బారగుడన్ అన్నాడు. (చూ: భారతం విరాటపర్వం అవతారిక) అనల్పరచనా విన్యాసమే శిల్పం. అట్టిరచనతో రసజ్ఙులను మెప్పించిన కవులరుదు. అట్టివారిలో ప్రథమ గణ్యుడు శ్రీనాధుఁడు.


అతని రచన లనువాదములే ! అయిన నేమి ?స్వతంత్ర రచనలను దలపింపఁజేయును. నిజమారసినచో అనువాదము బహు కష్టమైనపని. మూలాను సరణము చేయక తప్పదు. ఇక యనువాదకుని ప్రతిభ కనఁడునవకాశములెవ్వి? అయినను శ్రీనాధరచనలు అనువాదములే యైనను స్వతంత్రగ్రంధముల వలెభాసించు చున్నవి.దానికాతని ప్రతిభా వ్యుత్పత్తులే కారణమనక తప్పదు.


ఆంధ్ర సాహిత్యమున కొన్ని వింతలున్నవి. అట్టివానిలో తిర్యక్కులైన పక్షులొనర్ఛిన ప్రణయ రాయభారములు. పేర్కొన దగినవి .శృంగార నైషథములోని హంస రాయభారము మొదటిది.కాగా పింగళిసూరనగారి ప్రభావతీ ప్రద్యుమ్నములోని శుచిముఖియను చిలుక రాయభారము రెండవది. మనమిప్పుడు హంసరాయభారమును తెలిసికొందము.


నైషధమున హంస ప్రణయ రాయభార ఘట్టము రసజ్ఙుల మన్ననల నందుకొన్నది. అదిమామూలు పక్షికాదు.మాటలు నేర్చిన పక్షి! మనుజుల హృదయాలలో మరులు నింపఁగల దిట్ట. నిషధ రాజు ఉద్యావమున నతనిచే బట్టువడి యతవినిని మాటలతో మెప్పించి యాయందగానికి తగిన యందగత్తె కుండిన పురాధీశుని కుమార్తె దమయంతియేనని యామెసౌందర్యమును బొగడి నలున కామెపై ప్రేమరగిల్చి, వారిరువురకు పెండ్లి గూర్చెద నని నమ్మబలికినది. తోడనే పెండ్లిండ్ల పేరయ్యవలె కార్యాచరణమున కుపక్రమించినది.


నిషధ లోనెగిరి , విదర్భలో దమయంతి యంతః పురమున వ్రాలినది. రమణీయమైన దానినడకలకు ముచ్చట పడి దమయంతి చెలికత్తెలచే దానిని  తెప్పించినది. ఇక నక్కడితో దాని చాతుర్యము ప్రారంభమైనది. "ఏమమ్మో! దమయంతీ! నేను చతుర్ముఖుని వాహనమగు హంసను. మంచివారితో స్నేహమే నానైజము. నీకు మహదుపకారమొనర్ప కుతూహల మగుచున్నది. నాసామర్ధ్యమును తక్కువగా నెంచకుము.


మ: స్మర వాత్స్యాయన కూచిమార కృత శాస్త్ర గ్రంధ సందర్భముల్ 

పరిశీలించిన వాఁడ; దంపతుల కుత్పాదింతు సారస్యముల్ ;

మురి పంబొప్పగ మంద మంద గమనంబుల్ నేర్పుదున్ మేదినీ

శ్వర శుధ్ధాంత నితంబినీ జనులకున్ ; సంపూర్ణ చంద్రాననా!


శృం: నైషధము 2 ఆశ్వా 56 పద్యం ; శ్రీనాధమహాకవి;


నాకు మన్మధశాస్త్రృసంబంధమైన విషయాలన్నీ తెలుసు. ఆలుమగల మధ్య యనురాగ మును పెంపుజేయు సామర్ధ్యము గలవాఁడను. అంతఃపుర కాంతలకు మంద గమనంబులను నేర్పు సామర్ధ్యము గలవాడను. నన్ను తక్కువగా నెంచబోకుమీ? అవును నీకు ఉపకారమేదైన చేయవలె ననుకొంటిని గదా!


కన్నియలకు ప్రియమైనదేమైయుండును? వేరేమి యందాల మగడే గదా!'కన్యావరయతేరూపం'. ఆహాఁ! గుర్తువచ్చినది. అందాల రాకుమారీ! నీకొఱకొక యందాల రాకుమారుని వెదకి యుంచితి నమ్మా! నిషధ నేలు నలుఁడే నీకు తగిన భర్త. ఆయందము. ఆవైభవము నింతింతని యనజాలము.నీభాగ్యము పండినదిలెమ్ము. 


నలుని వరించి తరింపుము. బ్రహ్మకు సరూప ఘటన చేయజాలని వాడను నపనింద గలదు.దానిని తొలగింప గోరి యతడేమీ యిరువురకు సంగతిని కూర్చుటకు నిర్ణయించినాడమ్మా ! నామాట నమ్ముము. నేడోరేపో ప్రకటింపగలఁడు.


చ: అడిగితి నొక్కనాడు ,కమలాసను తేరికి వాహనంబ నై

నడచుచు , నుర్విలో నిషధ నాధున కెవ్వతె యొక్కొ భార్యయ

య్యెడునని , చక్ర ఘోషమున నించుక యించుక గాని, యంత యే

ర్పడ విన నైతి ' నీవ యను చందము తోచెడి నమ్మ భామినీ!


శృం; నైష : 2ఆశ్వా 58 పద్యం -శ్రీనాధుఁడు;


హంస యెంత చమత్కారం చేసిందో చూడండి. " మేంప్రయాణంలో ఉండగా విరించిని స్వయంగా నేనడిగానమ్మా ఈధరలో నలునకు భార్యగా నెవరిని సృష్టించితిరని. మాయదారిమోత రథచక్రాలు నీవేనని చెప్పినట్లు గుర్తు.


ఉ: నిర్ణయ మానృపాలునకు నీకును సంగతి ; నెల్లి నేటిలోఁ

దూర్ణము సేయఁగా గలఁడు తోయజ సూతి ; తదన్యధా వృధా

దుర్ణయ వృత్తికిన్ మనసు దూర్చిన యేని ,జగజ్జనాపవా

దార్ణవ ముత్తరించుటకు నాతని కెయ్యది తెప్ప చెప్పుమా?


నీకు , నలునికీ బ్రహ్మముడి పడిపోయింది. తప్పించుకోవాలని జూచావో మధ్యలో బ్రహ్మగారి పరువు పోతుంది. బ్రహ్మ వ్రాతకు తిరుగు లేదు అనేమాట వట్టిదే నని ప్రజలు నిందిస్తే, ఆ అపవాద సముద్రమును దాటేందుకు బ్రహ్మకు తెప్పేది?దారేముంటుంది. అందువల్ల నలుని పెండ్లాడి బ్రహ్మ మాట నిలబెట్టవమ్మా! "- అంటోంది రాయభారి హంస!


మాటలతోనే సరిపెట్టక " నలుని మాత్రమే పెండ్లాడెద నని"- యామెచేత ప్రమాణమునుగూడ చేయించి హంస తనమాటను నెగ్గించుకొన్నది .

                     స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

తిలకం అనేది

 హిందూమతంలో, తిలకం అనేది ఒక వ్యక్తి యొక్క మతపరమైన, భక్తి  మరియు దైవిక సంబంధాన్ని సూచించే నుదుటిపై లేదా శరీరంలోని ఇతర భాగాలపై ధరించే గుర్తు. మరియు ఒక నిర్దిష్ట దేవత పట్ల భక్తి. రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశానికి తిలకం పూస్తారు. ఈ ప్రాంతాన్ని అజ్ఞా చక్రం అంటారు. అజ్ఞా చక్రం విద్య, శక్తి ,అలోచన, దృష్టి, స్వీయ-అవగాహన, జ్ఞానం మరియు మేధస్సు వంటి లక్షణాలకు బాధ్యత వహిస్తుంది.మానవ శరీరం విద్యుదయస్కాంత శక్తిని  విడుదల చేస్తుందనే వాస్తవాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఎవరైనా ఒక పనిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు,  కొంత స్థాయి శక్తిని కోల్పోవలసి వస్తుంది.అందువల్ల, ఒక వ్యక్తి తన ఆలోచనలను సమతుల్యం చేసుకోలేనప్పుడు, రెండు కనుబొమ్మల మధ్య తిలకం పెట్టుకోవడం వల్ల,కొన్ని నాడులు ఉత్తేజితము పొంది శక్తి నష్టాన్ని తగ్గిస్తుంది మరియు ఆజ్ఞా చక్రం ప్రచోదనమైతే జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది

జై శ్రీ రామ్ జై జై హనుమాన్ కంచెర్ల వెంకట రమణ

అహింసా పరమో ధర్మః

 అహింసా పరమో ధర్మః (अहिंसा परमो धर्मः)

ధర్మ హింసా తధీవచ (धर्म हिंसा तथीव च)


అహింస అన్ని ధర్మాల్లో కెల్లా పరమోత్తమమైనది.

కానీ

ధర్మోద్దరణకై హింస ప్రయోగం అనునది అంతే పరమోత్తమం.


ఇదీ పూర్తి శ్లోకం దాని అసలు అర్ధం. 


ఎప్పుడూ పై సగం ముక్క ఎవరైనా చెబితే దానితో బాటుగా రెండో ముక్క కూడా చెప్పి ఇంతకాలం చేసిన తప్పులు సరిదిద్దుకుందాం.


నీ సంస్కృతి, నీ ధర్మం, నీ సంస్కారం అంటూ ఎవరైనా సుద్దులు నీతులు చెప్పడానికి వస్తే ఎవరికి ఏ రీతిలో బుద్ది చెప్పాలో నాకు తెలుసు, నా సంస్కృతి, నా ధర్మం నాకు నేర్పిన సంస్కారం ఇదే అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పండి. 


అవతల మనిషి జాతి, నీతి, ఆ మనిషి సంస్కారం బట్టి చెప్పాల్సిన బాధ్యత నాది అని నొక్కి వక్కాణించండి. ఆయుధం లేని దేవుడు ఉన్నాడా ఆయుధం లేని దేవత ఉందా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ భారం ముందు మనది తరువాతనే దైవం బాధ్యత వహిస్తుంది. 


- శూర్పణఖ లాంటి వాళ్ళని స్త్రీ అయినా కూడా, లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి సంస్కరించాడని అబ్బే దాని పాపాన అదే పోతుందని లక్ష్మణుడు వదిలేయలేదని చెప్పండి. 


- స్త్రీ అయినా తాటకి, పూతన లాంటి రాక్షసులను కృష్ణ పరమాత్మ సంహరించి మోక్షం ప్రసాదించిన సంస్కారం నాదని చెప్పండి. 


- సోదరుడని తెలిసి కూడా, ధర్మ రక్షణకై కర్ణుణ్ణి సంహరించి ఉద్ధరించిన అర్జునుడు నేర్పిన సంస్కారం నాదని చెప్పండి. 


- మనిషికో మాట గొడ్డుకో దెబ్బలాగా మనిషి తత్వాన్ని బట్టి బుద్ది గడ్డి తౌడు పెట్టి సంస్కరించే సంస్కారం నాదని చెప్పండి. 


- అవతల వాడు ఎలా వాగినా వాడి పాపాన వాడే పోతాడనే ఎర్రిబాగుల చాతకాని తనం వీడి. నీ గుళ్లోకి చెప్పులేసుకు వచ్చే దౌర్భాగ్యులను, నీ ఇంటికి శవార్త అంటూ దిగబడే ధూర్తులను, నీ సోదరులను/సోదరీ మనులును మాయమాటలతో, మతమార్పిడి గావించే దుర్మార్గులను, నువ్వు నిలదీయకపోతే 

నీ తాత వస్తాడా

నీ నాయనమ్మ వస్తుందా

నీ అయ్య వస్తాడా

నీ అమ్మ వస్తుందా


లేచి రెండు దవడలు వాయించి చెప్పు మొదట...... బుద్ది గడ్డి తౌడు పెట్టేవాళ్ళు నీతో జేరతారు. 


కొత్త గా మతం మారిన వారికి కొత్త మతం హడావుడి, తను వదిలేసిన మతం పై ద్వేషం కాస్తంత ఎక్కువ ఉంటుంది. 


అడగడానికి మొహమాటం దేనికి నువ్వు కాకపోతే ఎవరు రక్షించేది ధర్మాన్ని ???


ధర్మో రక్షతి రక్షితః సారం ఇదే....


నీ ఇంట్లో నీకు రక్షణ లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, నీతి లేదని బాధ పడుతూ అనుభవిస్తున్న వ్యధను వీడి ఆలోచించు...... 

కావలసింది మొదటి అడుగు మాత్రమే సోదరా..... 

ప్రభంజనం అదే, దానికదే మొదలౌవుతుంది. 


సర్వేజనా సుఖినోభవంతు..

గో బ్రాహ్మణేభ్యః శుభం భవంతు..


స్వస్తి..

నేను--నీవు




 అవసాన దశలో నేను

ఆరంభ దశలో నీవు

అనుభవాలతో నేను

అమాయకత్వంతో నీవు


వడలిన మేనుతో నేను

చిగురాకు కాయంతో నీవు

చదివిన పుస్తకం నేను

తెరవని గ్రంథం నీవు


పుట్టెడు జ్ఞాపకాలతో నేను

తెల్లని కాగితంలా నీవు

బాధ్యతల చెరలో నేను

బంధాల కౌగిట్లో నీవు


పండిపోయిన తలతో నేను

పండు వెన్నెల నవ్వుతో నీవు

బరువైన బంధంగా నేను

ప్రియమైన బాధ్యతగా నీవు


ఊసులు చెప్తూ నేను

ఊ కొడుతూ నీవు

బోసి నవ్వులతో నేను

పాల బుగ్గలతో నీవు


ఆరిపోయే దివ్వె నేను

వెలిగే దీపం నీవు

రాలిపోయే పువ్వు నేను

వికశించే కుసుమం నీవు...


(ఎవరి రచనో తెలియదు కానీ వారికి అభినందనలు💐💐💐...నాకు  వచ్చింది.)

జన్మించినప్పుడు

 జన్మించినప్పుడు శిశువు నుంచి వచ్చే మొదటి శబ్దం 'ఏడుపు' అని అందరికీ తెలుసు. ఆ ఏడుపు తొలి శ్వాస తీసుకుని జీవించడానికి దోహదపడుతుంది. కానీ, ఆధ్యాత్మికంగా ఆ 'ఏడుపు' తల్లి గర్భంలో బొడ్డుతాడులో ఉండే ఆ సర్వశక్తిమంతుడి(దైవం) నుంచి విడిపోవడం అనే జ్ఞానం నుంచి వచ్చింది. చిత్రం! ఆ 'ఏడుపు' జీవితాంతం మనిషిని అంటిపెట్టుకునే ఉంటుంది. జీవితంలో ప్రతి మనిషి, బాల్యం నుంచీ వివిధ ఒత్తిళ్లకు గురువుతుంటాడు. ఆ ఆటంకాలను అధిగమించడానికి నిరంతరం పోరాడుతుంటాడు.


జీవితం అంటే చాలామందికి అసంతృప్తి, నెరవేరని కలలు, హడావుడి... ఇలా జాబితా అంతులేనిది. | కొద్దిమంది అసలు విలువను గ్రహించినవారు మాత్రమే జీవితమంటే భగవంతుడు ప్రసాదించిన గొప్ప బహుమానం అనుకుంటారు. ప్రతి చిన్నదాంట్లో అందాన్ని చూస్తారు. అద్భుతాలు గ్రహిస్తారు... సంతృప్తిని పొందుతారు. దైవానికి కృతజ్ఞతలు చెప్పుకొంటారు.


జీవితం అనేది సహజమైన, ఆకస్మిక మార్పుల పరంపర. దాన్ని ఎదిరించాలని చూడకూడదు. అది దుఃఖాన్ని మాత్రమే కలిగిస్తుంది. వాస్తవాన్ని వాస్తవంగానే చూడాలి... సహజంగా ముందుకు సాగిపోవాలి.

మనుష్యులు నాలుగు రకాలు

 ```

లోకంలో మనుష్యులు నాలుగు రకాలు

ఉంటారని శాస్త్రం చెప్పిందని పెద్దలమాట.


స్వార్ధ, పరార్ధ, పరమార్ధ, వ్యర్ధ జీవులని!```



*స్వార్ధ*:-```

తనూ , భార్యాపిల్లలు, కోసమే నాలుగురాళ్ళసంపాదనే ధ్యేయంగా జీవిస్తుండేవారు స్వార్ధ జీవులు.```


*పరార్ధ*:- ```

తమకోసం కాకుండా కేవలం పరహితమే ధ్యేయంగా జీవిస్తుంటారు.```

*ఉదా :-*``` 

వృక్షములు , నదీనదములు, గోవులు వగైరా.```


 *పరమార్ధ*:- ```

కనిపించే ప్రతీ వస్తువూ అశాశ్వతమనే పరమార్ధ భావనతో జీవిస్తూ మానవాళిని ఉద్ధరించడమే ధ్యేయంగా జీవిస్తుంటారు.```

*ఉదా:-*```

ఆదిశంకరులు, మహర్షి రమణులు, రామకృష్ణ పరమహంస వంటివారు.```


*వ్యర్ధ* :- ```

అసలు తామెందుకు పుట్టామో, ఏమి చేస్తున్నామో, ఏంచేయాలో కనీసం తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయకుండా జీవిస్తుండేవారు వ్యర్ధజీవులు.`

బుధవారం*🪷 🌷 *సెప్టెంబర్,25, 2024*🌷 *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🪷 *బుధవారం*🪷

🌷 *సెప్టెంబర్,25, 2024*🌷

     *ధృగ్గణిత పంచాంగం*                    


          *ఈనాటి పర్వం*    

           *అనఘాష్టమి*   

   *అవిధవా నవమీ శ్రాద్ధం*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం - కృష్ణపక్షం*


*తిథి : అష్టమి* మ 12.10 వరకు ఉపరి *నవమి*

*వారం :బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం : ఆరుద్ర* రా 10.23 వరకు ఉపరి *పునర్వసు*


*యోగం  : వరీయాన్* రా 12.18 వరకు ఉపరి *పరిఘ*

*కరణం : కౌలువ* మ 12.10 *తైతుల* రా 12.12 ఉపరి *గరజి*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 08.00 - 10.00 మ 02.30 - 03.30*

అమృత కాలం  :*మ 11.11 - 01.49*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*


*వర్జ్యం : ఉ 06.28 - 08.06*

*దుర్ముహూర్తం : ప 11.35 - 12.23*

*రాహు కాలం : మ 11.59 - 01.29*

గుళికకాళం : *ఉ 10.28 - 11.59*

యమగండం : *ఉ 07.27 - 08.58*

సూర్యరాశి : *కన్య* 

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 05.57* 

సూర్యాస్తమయం :*సా 06.01*

*ప్రయాణశూల : ఉత్తరం దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 05.57 - 08.22*

సంగవ కాలం  :      *08.22 - 10.46*

మధ్యాహ్న కాలం  :*10.46 - 01.11*

అపరాహ్న కాలం: *మ 01.11 - 03.36*

*ఆబ్ధికం తిధి   : భాద్రపద బహుళ నవమి*

సాయంకాలం  :  *సా 03.36 - 06.01*

ప్రదోష కాలం  :  *సా 06.01 - 08.24*

రాత్రి కాలం : *రా 08.24 - 11.35*

నిశీధి కాలం     :*రా 11.35 - 12.23*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.21 - 05.09*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🪷 *శ్రీ సరస్వతీ స్తోత్రం*🪷


*దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభైరక్ష మాలాందధానా*

*హస్తేనైకేన పద్మం సితమ పిచశుకం పుస్తకం చాపరేణ |*


*భాసా కుందేందుశంఖ స్ఫటికమణినిభా భాసమానాఽసమానా*

*సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా ||* 

           

🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷🪷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🪷🪷🌷🌹

      *న్యాయపతి వేంకట*

     *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌷🌷🌹🌷

 🌹🍃🌿🪷🪷🌿🍃🌹

పాదారవిందశతకం

 శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి

శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన

పాదారవిందశతకం

🙏🌸🙏🙏🙏🌸🙏

శ్లోకము:-

జపాలక్ష్మీశోణో జనిత పరమఙ్ఞాన నలినీ

వికాస వ్యాసంగో విఫలిత జగజ్జాడ్య గరిమా|

మనః పూర్వాద్రిం మే తిలకయతు కామాక్షి తరసా

తమస్కాండద్రోహీ తవ చరణ పాథోజరమణః ||17||

 

భావము:

జ్యోతి స్వరూపుడైన సూర్యుని ధర్మాలన్నీ కామాక్షీదేవి చరణములకు కలవు. సూర్యుడు చీకట్లను పారద్రోలి పరార్ధజ్ఞానదాయకుడైనట్లు శ్రీచరణాలు కూడా భక్తులకు ఉపాదేయాలు. సూర్యోపాసనలా శ్రీచరణ ఉపాసన చేస్తే సిద్ది కలుగుతుంది. మూకకవి తన మనస్సు అనే ఉదయాద్రియందు దేవీ చరణము పొడచూపాలని కాంక్షిస్తున్నాడు.

 

 

*********

 

🔱 ఆ తల్లి 

పాదపద్మములకు నమస్కరిస్తూ 🔱                                                                                                                                                                                             🙏🌸🌸🌸🌸🌸🙏

పంచాంగం 25.09.2024

 ఈ రోజు పంచాంగం 25.09.2024 Wednesday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష అష్టమి తిధి సౌమ్య వాసర: ఆర్ద్ర నక్షత్రం వరీయాన్ యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం. ఇది ఈరోజు పంచాంగం.


అష్టమి మధ్యాహ్నం 12:15 వరకు.

ఆర్ద్ర రాత్రి 10:27 వరకు.


సూర్యోదయం : 06:09

సూర్యాస్తమయం : 06:07


వర్జ్యం : ఉదయం 06:32 నుండి 08:10 వరకు.


దుర్ముహూర్తం : పగలు 11:44 నుండి మధ్యాహ్నం 12:32  వరకు.


అమృతఘడియలు : మధ్యాహ్నం 12:15 నుండి 01:53 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.



శుభోదయ:, నమస్కార:

*శ్రీ కాళహస్తీశ్వర శతకము

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏


  *మునునేఁ బుట్టినపుట్టులెన్ని గలవో మోహంబుచేనందుఁ జే*

  *సినకర్మంబులప్రోవు లెన్నిగలవో చింతిచినం గాన నీ*

  *జననంబే యని యున్న వాఁడ నిదియే చాలింపవే నిన్నుఁ గొ*

  *ల్చినపుణ్యంబునకుం గృపారతుఁడవై శ్రీకాళహస్తీశ్వరా!!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 47*


*తాత్పర్యము:* *ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ముందు నేను ఎత్తిన జన్మలెన్నో, వాటిలో నేను చేసిన కర్మలెన్నో నాకు తెలియదు...ఎంత ఆలోచించినా నేను తెలుసుకోనలేకున్నను... ఈ జన్మమే పారమార్థికమని భావించుచున్న నాకు ఈ జన్మలో చేసిన నీ ధ్యానపుణ్యముచేత ఇదియే కడగొట్టు జన్మ గావింపుము ప్రభో*


✍️🌷🌷🌹🙏

హైందవం వర్ధిల్లాలి 11*

 *హైందవం వర్ధిల్లాలి 11*




*ఆధునికత మరియు నాగరికత పేరుపై మహోన్నత, ఆరోగ్య హిందూ ఆచారాలను విస్మ రించరాదు* iv):- ఈ మధ్యన రాజకీయ నాయకులు. ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తూ ప్రత్యర్థులకు *భారతీయ మహిళల అవసర మరియు అలంకార వస్తువులు అనగా చీర, జాకెట్టు, గాజులు , బొట్టు పంపుతామని బీరాలు పలుకుతూ* అతివలను అబలులుగా చిత్రీకరిస్తున్నారు.   రాజకీయ నాయకుల ఇటువంటి ప్రకటనలు *అర్థరహితమే* గాకుండా హిందూ సంప్రదాయాలను *కించ పరుస్తున్నట్లుగా* ఉన్నందుకు ఈ ప్రకరణ అవసరమైనది. 


భారతీయ మహిళల గురించి దైవిక, సాంస్కృతిక, చారిత్రక మరియు వర్తమాన సమాచార జ్ఞానము లోపించినవారే  ఇటువంటి అసంబద్ధ ప్రకటనలకు ఒడిగడ్తుంటారు. మహిళలు ధరిస్తున్న పై వస్తువులలో కొన్ని బాహ్య వాతావరణ నుండి రక్షణ నిమిత్తము మరికొన్ని దేహారోగ్య నిమిత్తము అవసరము. 


అనాదిగా ప్రజలు భారతీయ స్త్రీలను శక్తి స్వరూపులుగా, త్రిగుణాత్మక శక్తిగా, ఆది పరాశక్తిగా, అపరకాళీగా భావిస్తున్నారు, భక్తితో సేవిస్తున్నారు, గౌరవిస్తున్నారు.


భారత దేశ చరిత్ర అవగాహన ఉన్న వారికి *రాణి  రుద్రమ దేవి, ఝాన్సీ లక్ష్మీ బాయి, సావిత్రి భాయి ఫూలే, దుర్గాభాయి దేశ్ ముఖ్, సరోజిని నాయుడు, సంఘం లక్ష్మీ బాయి* లాంటి ధీరవనితల సమాచారము ఉంటుంది. 


నేటి స్త్రీలు  సాధారణ వృత్తుల నుండి విద్యావంతులుగా  మరియు ఉన్నత ఉద్యోగస్తులుగా అంటే *అంగన్ వాడి నుండి అంతరిక్ష కార్యక్రమముల వరకు మహిళలు లేని రంగాలు లేవు*. స్వదేశంలోనే గాకుండా విదేశాలలో గూడా గౌరవాలు పొందుతున్నారు.

*మన అత్త్యుమ భారతీయ ధర్మంలోని స్త్రీల, స్త్రీ దేవతా మూర్తుల ప్రధాన వస్త్రధారణలో, అలంకరణల్లో చీర గాజులు అత్యంత ప్రధానమైనవి...చీర గాజులు పూలు కాటుక, బొట్టు,గజ్జెలు, బంగారు ఆభరణాలు లేని స్త్రీలను,  స్త్రీ మూర్తులను  గానీ మనం ఊహించలేము*.


ఈ ఇరవయ్యవ శతాబ్దంలో మహిళలు విద్య, ఉద్యోగ, సాంకేతిక, పరిశోధనా, వైద్య, సాహిత్య, జ్యోతిష్య, వాస్తు, సాహిత్య, కళా రంగ, వ్యాపార వాణిజ్య, రాజకీయ రంగాలలో దక్షులుగా ఉన్నారు, నిరూపించుకున్నారు. వర్తమాన మహిళా శ్రేష్టుల వివరాలు చూద్దాము. ప్రస్తుత  రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, కీ  శే  సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్, కిరణ్ బేడీ, కల్పనా చావ్లా (ఇండో అమెరికన్ వొమ్యగామి) మున్నగువారు. *మహిళలు సాహసించని రంగాలు లేవు*. IAS లు గా IPS లు గా ఉన్నతోద్యోగాలు చేయడమే గాకుండా *మహిళలు సైనిక దళాలలో గూడా ప్రధాన స్థానాలలో అనగా  కేంద్ర రైజర్వ్డ్ పోలీసు ఫోర్స్, కోబ్రా  కమాండ్, జడ్ ప్లస్ కమాండో విభాగాలలో కూడా ఉన్నారు*.  


స్త్రీలలో ఉండే సహజ ప్రేమ, కరుణ, దయ, శాంతి స్వభావాలు మానవతా చిహ్నాలే గాని శారీరక, మానసిక దుర్భల లక్షణాలు కనె కావు. *స్త్రీలు బలహీనులు కారు.  శక్తి స్వరూపిణులు.  వారు ధరించే  మరియు ఉపయోగించే చీర, జాకెట్టు,  కుంకుమ, గాజులు ఇత్యాది అవసరం మరియు అలంకార వస్తువులు బలహీనతకు సూచనలు కావు*. హైందవ సంప్రదాయాలు పాటించవలసినవే.  మహిళల గురించి  వారి అవసర మరియు అలంకార వస్తువుల గురించి అవాకులు చవాకులు కూడదు.  *కావున మన హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*.


ధన్యవాదములు.

*(సశేషం)*

26. " మహా దర్శనము

 26. " మహా దర్శనము "--ఇరవై ఆరవ భాగము --ఉపనయనము- 2


26. ఇరవై ఆరవ భాగము  -- ఉపనయనము- 2



         బుడిలులు కులపతుల ముఖములు చూచి , వారు ’ సరియే’ అని తలలూపగా , మరలా కొనసాగించినాడు :


         " ఇదంతా అయిన తర్వాత  వటువు  ,  ’ ఈ గోత్రము వాడినైన నేను అభివాదనము చేసెదను ’ అని ఆచార్యుడికి అభివాదనము చేసి , తన ఎడమ చేతితో ఆచార్యుడి ఎడమ పాదమును , కుడి చేతితో కుడి పాదమును తాకి నమస్కరించును . పాదములనుండీ ఎల్లపుడూ తేజస్సు రక్షకమై వెలువడుతూ ఉండును . కాబట్టి పాదములను ముట్టినవాడు అనుగ్రాహ్యుడగును . ఇటుల పాదాభివందనము చేసి వటువు ఆచార్యుని ’ నాపై కృపతో సావిత్రిని నాకు చెప్పవలెను ’ అని ప్రార్థించును . అప్పుడు ఆచార్యుడు , ఎడమ అరచేతిలో కుడి అరచేతిని ఉంచుకొని , రెండింటినీ తన కుడి తొడపై పెట్టుకున్న వటువును , తన కుడివైపు తొడపై కూర్చోబెట్టుకొని , ఆ అంజలిని తన చేతిలోకి తీసుకొని  ప్రణవ  వ్యాహృతుల పూర్వకముగా సావిత్రిని అనుగ్రహించును . అందులోనూ ఒక రహస్యముంది . పాదముల నుండీ రక్షకమై బయల్వెడలు తేజస్సు , అరచేతులనుండీ కూడా బయల్వెడలు చుండును. అయితే , నిస్సంకల్పముగా వెడలునది రుద్రుడై ఇతరులను చంపును . : అందుకే ,   సంకల్ప పూర్వకముగా వటువు యొక్క అంజలిని తన అంజలిలోకి తీసుకొనునది . 


          " గాయత్రి యొక్క మూడు పాదములనుండీ మూడు వేదములను ఇచ్చి , ఆచార్యుడు మరలా , ’ నీ హృదయము నా వ్రతములో చేరనీ ! నీ చిత్తము నా చిత్తానుసారమవనీ . ! నువ్వు నామాటను వినువాడగుము . బృహస్పతి నిన్ను నాకు ఇవ్వనీ " అని ప్రార్థన చేసి , బృహస్పతి నుండీ అతడిని తీసుకొనును. అనంతరము రక్షణార్థమై శృంఖలను కట్టును .( దీనినే మేఖల అంటారు , మగవారికి కట్టునది శృంఖల అయితే ఆడువారికి కట్టునది మేఖల )   : అప్పటి మంత్రములలో ఇది ప్రధానమైనది , " ఈ శృంఖల చెడ్డ మాటలనుండీ కాపాడుచూ మనలను పవిత్రము చేస్తూ సుఖకరముగా ఉండుగాక ! ప్రాణాపానముల నుండీ బలమును తీసుకురానీ ! సౌభాగ్య సంపన్నమైన శృంఖల దేవతలకు ప్రియమవనీ ! "  ముంజ దర్భలతో చేయబడిన శృంఖలను( మొల త్రాడు ) ఇలాగ ప్రార్థన చేయుటకన్నా ఇంకా అవమానము ఉంటుందా ? అంటారేమో . స్వారస్యమంటే అదే ! అందరూ కట్టెపుల్ల అని తిరస్కారముతో చూచు దానిని మనము ’ సమిధ ’ అంటాము . ఎక్కడ చూసినా దొరకెడు మంట ను మంత్రపూతము చేసి ’ అగ్ని ’ అంటాము . సదా సర్వత్రా వీస్తున్న గాలిని సర్వ కర్తయైన " మాతరిశ్వ ’ అంటాము . ఎక్కడో మునిగిపోయే సూర్యుడిని ’ ఆదిత్య ’ మొదలుగానూ , ’ ఆత్మా జగతః తస్థుషశ్చ ’ - జంగమ స్థావరముల ఆత్మ- అంటాము . ఇలాగ ముంజదర్భను మొలత్రాడుగా చేసి కట్టుకుంటే ఏమేమి చేయవచ్చును అంటే మమ్మల్ని చూడండి , అసూయపడు ఇతరుల దుర్భాషణముల నుండీ మనలను కాపాడును . అదెలాగు ? ఆ దుర్భాషల శక్తిని తగ్గించి దానిని సహించ గల మన శక్తిని ఎక్కువ చేయడము ద్వారా ! . మీరు రాజపుత్రుల శిక్షణమును చూసినారు కదా ? వారి ఒళ్ళు ఉక్కు శకలమై , సహన శక్తియే రూపము పొందినదా అన్నట్టూ , బాణ ఖడ్గముల ఆఘాతములను ఎదిరించునది . దాని వలెనే ఇది కూడా ! అలాగ ఇది మనలను పవిత్రము చేయును . మన ప్రాణాపానముల నుండే బలమును సంగ్రహించి మనకు ఇచ్చును . దేవతలను పిలుచుకు వచ్చును , అనగా , మనకు దేవతలు వచ్చి పోవుటను చూడగల శక్తిని ఇచ్చును . అయితే ఇదంతా ఎప్పుడగును ? ఆ ముంజదర్భ శృంఖలలో ప్రాణ ప్రతిష్ఠ చేసి కట్టినపుడు మాత్రమే . దీనికంతకునూ పూర్వ సిద్ధత కావలెనా , వద్దా ? " 


         బుడిలుల మాటకు ఎవ్వరూ ప్రతి చెప్పలేక పోయినారు . అప్పుడు బుడిలులు మరలా కొనసాగిస్తూ అన్నారు , " ఆచార్యుడిది అదృష్టము . పూర్వపుణ్యము అతనికి జాతవేదుడి నొకడిని కొడుకుగా ఇచ్చినది . ఏదైనా కొంచము ఎక్కువ తక్కువయితే , ’ అహ , అది అలాగు కాదు  ’ అని చెప్పగల చైతన్యముందా బాలుడిలో . ఇప్పుడే విప్రుడైనాడన్న తర్వాత ఇక చెప్పవలసిన దేమున్నది ? దానివల్లనే ఆచార్యుడికి పూర్వ సిద్ధత ను గురించి చెప్పితిని . ఏమిటి ఆచార్యా ?  నాపైన కోపము వచ్చెనా ? " 


         ఆచార్యుడు వినయ పూర్వకముగా , " మాకు కొంత తెలిసిననూ , ఇంత వివరముగా తెలియదు . తమరు అనుజ్ఞ ఇచ్చినది మాకు అనుగ్రహమైనది . " అన్నాడు . 


         బుడిలులు అంతా ముగిసినది అని ధ్వనించేటట్లు అన్నాడు , " సరే , ఇక దండ గ్రహణము . అనంతరము వ్రతోపదేశము . అక్కడికి ఉపనయనములోని ప్రధాన కర్మలన్నీ ముగిసినట్లే . దాని తర్వాత మూడు రాత్రులైనా వ్రతమైన తర్వాత మేధా జననము . చూడు , మేధా జననము సరిగా అయితే , ఏక సంతగ్రాహి యగును . అటుల కాకుండిన , త్రివేది , చతుర్వేదులు అగుటకు అవకాశమేది ? అది చాలదన్నట్టు , పురాణేతిహాసాలు , వేదాంగములు , ఇతర శాస్త్రాలు , వీటన్నిటినీ సమన్వయము చేసుకొని , ఒకదానికొకటి అవిరోధము అగునట్లు చూచుకొనుట , ఆ తరువాత తనకు తగ్గ సాధనమిది , తన సిద్ధి ఇదీ అని నిర్ధారణ చేసుకొని గృహస్థుడగుట --ఇంత ఉన్నపుడు వీటిని వదలగలమా ? "


         అందరూ మౌనముగా ఉన్నారు . కులపతులిద్దరూ ఆనందముతో కళ్ళ నీరు తిరుగాడుతుండగా ఏదో భావనలో యున్నారు . అప్పుడు శాండిల్యుడు తండ్రి వద్దకు వచ్చి , ఏదో గుసగుసలాడి , లేచి బుడిలులకు నమస్కారము చేసి పలికెను , " తమరు చెప్పినదంతయూ నిజమే , ఔను , అయితే ఇదంతా ఆస్తికులైన బ్రాహ్మణులకు మాత్రమే . నాస్తికులైన వారి గతి యేమి ? అబ్రాహ్మణుల గతి యేమి ? వర్ణాశ్రమ ధర్మమే లేని దేశముల వారి గతి యేమిటి ? " 


          బుడిలులు నవ్వి అన్నారు , " వారి స్థితియేమిటి అంటే , మన సమాజములోని పలు దారులను యోచించి చెప్పవలెను . మొదటిది , మనము జన్మాంతరములను ఒప్పుకున్నవారము . దేవతలున్నారు అనువారము . ధర్మము జగత్తుకంతటికీ ఒకటే అయిననూ , దేశ కాల పరిస్థితులను బట్టి భిన్నముగా కనపడునది యనువారము . బ్రాహ్మణుడైనా , అబ్రాహ్మణుడైనా తనకు విహితమైన , తనకు విధించబడిన కర్మను చేసిన , ఒకటే ఫలము లభించును అనువారము . విహితమైన కర్మములో దోషములున్ననూ అన్య కర్మలకన్నా శ్రేష్ఠము అనువారము . దానితోపాటు , విహిత కర్మ త్యాగము వలన ప్రత్యవాయము కలుగును అని చెప్పు వారము .


         ఇక , నాస్తికుల , అబ్రాహ్మణుల , వర్ణాశ్రమ ధర్మ రహితుల వారి స్థితి యేమిటి ? అనుమాట -- నాస్తికులకు భవిష్యత్తు ఉంటే కదా , వారు అది అలాగుండవలెను , ఇలాగుండవలెను అనవలసినది ? నాస్తికులలో కూడా భవిష్యత్తు ఉంటుంది అనువాడు , దానికి అనుకూలమగునట్లు రూపించు విధానమును తానే వెదకుకొనును . అలాగు , తన బుద్ధినీ , అది విధించిన ప్రమాణములనూ అనుసరించువాడిని మనము ’ అసురుడు ’ అంటాము . వాడికి మీమాటే అవసరము లేదు . అటువంటివి చర్చకు వస్తే వాటి రూపమే మారిపోవును . ఇక బ్రాహ్మణుల స్థితి , ఫలముల ఐక్యతను  బోధిస్తూ , సమాజమనెడి వృక్షములో ఒకదానినొకటి ఆశ్రయించుకొని బ్రతుకవలెను అను మతములో , వ్యవహారమున కోసమై బ్రాహ్మణ , బ్రాహ్మణేతర భేదముందే కానీ , పారమార్థికంగా  కాదు . 


        ఇక , వర్ణాశ్రమ ధర్మము లేని వారి స్థితి యేమిటి ? అంటే , వారిలో వర్ణాశ్రమ రూప వ్యవస్థ లేకున్ననూ , వారిలో ఉత్తమాధమ ధర్మము లేదు అనవద్దు . వారిలో కూడా ఉఛ్చ నీచ భేదములుంటాయి . అది అధికారము వలన కావచ్చు , ఐశ్వర్యము వలన కావచ్చు , ప్రేయో మార్గమును ఎక్కువగా పట్టి , కామహేతుకముగా వారు నడచినా , అప్పుడపుడు వారిలో కూడా ఎవరో ఒకడు పుడతాడు ., అతడు దైవ సాక్షాత్కారము పొంది , తన లోకమును దైవము వైపుకు తిప్పుటకు పెనుగులాడును . ఆ లోకమంతా అతనికి తల వంచి అతని ధర్మమును అంగీకరించినను , మరలా తనకు తోచినట్లే ప్రవర్తించుట సాధారణము . మొత్తానికి చెప్పవలెనంటే , ... నీ పేరేమి ? మరచాను ? "  


" నన్ను శాండిల్యుడు అంటారు "


         " శాండిల్యా , మనము దేశమును ఊషరమనీ ( చవిటి నేల )  , నదీ మాతృకమనీ , దేవమాతృకమనీ అంటాము . అయితే , దైవానుగ్రహ వంచితమని , ఊషరము , అప్రత్యక్షముగా దైవమాతృకమైనది . నదీ మాతృకము , ప్రత్యక్షముగా వర్షము వలన పెరుగునది . దైవమాతృకమంటే అర్థమైనదా ?  ఒకసారి భయంకర క్షామము వచ్చి , పన్నెండు సంవత్సరములు వానలే లేక గంగాది సరిత్తులలో కూడా నీరే లేకపోయినదట . అప్పుడు అత్రి పత్ని యైన అనసూయ తాను , గంగనూ , సర్వులనూ అనుగ్రహించినదట ! ఇది మనకు అర్థమవుతుందా ? అలాగే , నాస్తిక , అబ్రాహ్మణ , వర్ణాశ్రమ రహిత దేశముల వారి స్థితులు సామాన్యముగా అర్థము కావు . కాబట్టి , మనకు అనుసరించ వలసిన దేమిటనిన , ’ బ్రాహ్మణుడు సర్వధా సర్వథా మైత్రుడై నేను చూచునదంతా భద్రము కానీ , నేను చెప్పునదంతా భద్రము కానీ , అని అంతటినీ భద్రీకరణ చేయువాడై , స్పర్శశీలుడై బ్రతుకవలెను . ఇంకొకమాట , సావధానము , మనము నాస్తికులను అసురులు అనిననూ , ప్రాజాపత్యులు అంటాము . అంటే , వారు కూడా మన దైవ సంతానమే . అలాగే , మనుష్యుడు మాత్రమే కాదు , పుట్టిన ప్రతియొక్క భూతమూ లోనూ ఈశ్వరాంశ ఉన్నది . కాబట్టి , ఒకదానివల్ల ఇంకొకదానికి బాధ కలుగకుండా నడుచుకోవలెను . అంతేనా , నువ్వు దినదినమూ సంధ్యావందనములో చెప్పునదేమిటయ్యా ? ’ సర్వేషామవిరోధేన బ్రహ్మ కర్మ ’ అని కదా ? బ్రహ్మ కర్మ ఎవరికీ విరోధము కాకూడదు . ..."  మరి , బ్రాహ్మణులు చేయు చాలా కర్మలు ఇతరులకు విరోధములగుచున్నాయి కదా ? " అంటావా ? 


         " ఇది కూడా అడగవలెనా , ప్రపంచం మొత్తం లో చీకటి వెలుగులు ఒకదానినొకటి తిరస్కరించకుండా బ్రతుకుటెట్లు ? అదే వాస్తవిక స్తితియని , దాన్నే లక్ష్యముగా చేసుకోరాదు . సర్వభూత హితము కోరునపుడు గురి కొంచము హెచ్చుతగ్గులు కావచ్చును . ఒకటి ఆదర్శవాదము , ఇంకోటి వాస్తవవాదము . మనము ఆదర్శవాదులము . 


        " చెప్పుతూ ఉంటే ఇంకో పదిరోజులైనా అవుతుంది , శాండిల్యా , అయితే , ఇంటిలో బియ్యము కావలసినంత ఉన్నా , దినుసులు బళ్ళకొద్దీ నిండి ఉన్నా , భోజనము చేయునపుడు కొంతే తిన్నట్లే ఇది కూడా . ఆవు ఎంత గడ్డి తిన్నది అన్నదానిపైనే దాని వెల అని పెద్దపెద్ద గురువులు చెప్పేవారంట  ! . అలాగే , పర్వతములవంటి ఆదేశములను గురించి మాట్లాడుతూ , ఆచారములో దానిలో ఒక అంశమును కూడా పాటించనివాడికి బ్రాహ్మణ ధర్మమెందుకు ? చివరి మాటగా చెప్పెదను , విను . ఇవన్నీ కేవలము ఆదర్శాలు మాత్రమే అని వాటికో నమస్కారము చేసి వదిలేసిన వాటిని తన ఆచరణ లోకి తెచ్చుటకు త్రికరణశుద్ధిగా ప్రయత్నించువాడు బ్రాహ్మణుడు . శ్రేయస్సు - ప్రేయస్సులలో శ్రేయస్సు కోసము ప్రేయస్సును బలి ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నవాడు బ్రాహ్మణుడు . విశ్వమంతా ఒకటి . తన కర్మ స్వల్పమైనదిగానీ , పెద్దది ఐనా కానీ , దానివలన  విశ్వస్థితి మారితీరును అని నమ్మినవాడు బ్రాహ్మణుడు . విశ్వానికి బయట అవ్యక్తముగా నున్న సత్యమును సతతమూ లక్ష్యముగా పెట్టుకొన్నవాడు బ్రాహ్మణుడు . ఇతరులు అర్థకామములు జీవనపు లక్ష్యములు అంటే , ఇహములో ధర్మము , పరములో మోక్షము అను మహా లక్ష్యమున్నవాడు బ్రాహ్మణుడు . చాలా , ఇంకా చెప్పవలెనా ? "


శాండిల్యుడు మరలా నమస్కారము చేసి , " పరమానుగ్రహమైనది " అని చేతులు జోడించినాడు . 


         బుడిలులు , " నా మాటలను వినియే సంతోషముతో పరమానుగ్రహమైనది అంటున్నారు . మన యాజ్ఞవల్క్యుడు ప్రవచనము ప్రారంభించనీ ! అప్పుడు ఏమి చెపుతాడో చూడవలెను ! . కేవలము నా నోటి మాటగా వచ్చిన మహా దర్శనమును సాక్షాత్కరించి ఇవ్వగల మహానుభావుడతడు . " అన్నారు . వారికి ఆమాట అంటూ కంట నీరు వచ్చినది . 

Janardhana Sharma

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - వర్ష ఋతువు - భాద్రపద మాసం - కృష్ణ పక్షం - అష్టమి - ఆర్ధ్ర -‌‌ సౌమ్య వాసరే* (25.09.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*