25, సెప్టెంబర్ 2024, బుధవారం

జన్మించినప్పుడు

 జన్మించినప్పుడు శిశువు నుంచి వచ్చే మొదటి శబ్దం 'ఏడుపు' అని అందరికీ తెలుసు. ఆ ఏడుపు తొలి శ్వాస తీసుకుని జీవించడానికి దోహదపడుతుంది. కానీ, ఆధ్యాత్మికంగా ఆ 'ఏడుపు' తల్లి గర్భంలో బొడ్డుతాడులో ఉండే ఆ సర్వశక్తిమంతుడి(దైవం) నుంచి విడిపోవడం అనే జ్ఞానం నుంచి వచ్చింది. చిత్రం! ఆ 'ఏడుపు' జీవితాంతం మనిషిని అంటిపెట్టుకునే ఉంటుంది. జీవితంలో ప్రతి మనిషి, బాల్యం నుంచీ వివిధ ఒత్తిళ్లకు గురువుతుంటాడు. ఆ ఆటంకాలను అధిగమించడానికి నిరంతరం పోరాడుతుంటాడు.


జీవితం అంటే చాలామందికి అసంతృప్తి, నెరవేరని కలలు, హడావుడి... ఇలా జాబితా అంతులేనిది. | కొద్దిమంది అసలు విలువను గ్రహించినవారు మాత్రమే జీవితమంటే భగవంతుడు ప్రసాదించిన గొప్ప బహుమానం అనుకుంటారు. ప్రతి చిన్నదాంట్లో అందాన్ని చూస్తారు. అద్భుతాలు గ్రహిస్తారు... సంతృప్తిని పొందుతారు. దైవానికి కృతజ్ఞతలు చెప్పుకొంటారు.


జీవితం అనేది సహజమైన, ఆకస్మిక మార్పుల పరంపర. దాన్ని ఎదిరించాలని చూడకూడదు. అది దుఃఖాన్ని మాత్రమే కలిగిస్తుంది. వాస్తవాన్ని వాస్తవంగానే చూడాలి... సహజంగా ముందుకు సాగిపోవాలి.

కామెంట్‌లు లేవు: