25, సెప్టెంబర్ 2024, బుధవారం

హైందవం వర్ధిల్లాలి 11*

 *హైందవం వర్ధిల్లాలి 11*




*ఆధునికత మరియు నాగరికత పేరుపై మహోన్నత, ఆరోగ్య హిందూ ఆచారాలను విస్మ రించరాదు* iv):- ఈ మధ్యన రాజకీయ నాయకులు. ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తూ ప్రత్యర్థులకు *భారతీయ మహిళల అవసర మరియు అలంకార వస్తువులు అనగా చీర, జాకెట్టు, గాజులు , బొట్టు పంపుతామని బీరాలు పలుకుతూ* అతివలను అబలులుగా చిత్రీకరిస్తున్నారు.   రాజకీయ నాయకుల ఇటువంటి ప్రకటనలు *అర్థరహితమే* గాకుండా హిందూ సంప్రదాయాలను *కించ పరుస్తున్నట్లుగా* ఉన్నందుకు ఈ ప్రకరణ అవసరమైనది. 


భారతీయ మహిళల గురించి దైవిక, సాంస్కృతిక, చారిత్రక మరియు వర్తమాన సమాచార జ్ఞానము లోపించినవారే  ఇటువంటి అసంబద్ధ ప్రకటనలకు ఒడిగడ్తుంటారు. మహిళలు ధరిస్తున్న పై వస్తువులలో కొన్ని బాహ్య వాతావరణ నుండి రక్షణ నిమిత్తము మరికొన్ని దేహారోగ్య నిమిత్తము అవసరము. 


అనాదిగా ప్రజలు భారతీయ స్త్రీలను శక్తి స్వరూపులుగా, త్రిగుణాత్మక శక్తిగా, ఆది పరాశక్తిగా, అపరకాళీగా భావిస్తున్నారు, భక్తితో సేవిస్తున్నారు, గౌరవిస్తున్నారు.


భారత దేశ చరిత్ర అవగాహన ఉన్న వారికి *రాణి  రుద్రమ దేవి, ఝాన్సీ లక్ష్మీ బాయి, సావిత్రి భాయి ఫూలే, దుర్గాభాయి దేశ్ ముఖ్, సరోజిని నాయుడు, సంఘం లక్ష్మీ బాయి* లాంటి ధీరవనితల సమాచారము ఉంటుంది. 


నేటి స్త్రీలు  సాధారణ వృత్తుల నుండి విద్యావంతులుగా  మరియు ఉన్నత ఉద్యోగస్తులుగా అంటే *అంగన్ వాడి నుండి అంతరిక్ష కార్యక్రమముల వరకు మహిళలు లేని రంగాలు లేవు*. స్వదేశంలోనే గాకుండా విదేశాలలో గూడా గౌరవాలు పొందుతున్నారు.

*మన అత్త్యుమ భారతీయ ధర్మంలోని స్త్రీల, స్త్రీ దేవతా మూర్తుల ప్రధాన వస్త్రధారణలో, అలంకరణల్లో చీర గాజులు అత్యంత ప్రధానమైనవి...చీర గాజులు పూలు కాటుక, బొట్టు,గజ్జెలు, బంగారు ఆభరణాలు లేని స్త్రీలను,  స్త్రీ మూర్తులను  గానీ మనం ఊహించలేము*.


ఈ ఇరవయ్యవ శతాబ్దంలో మహిళలు విద్య, ఉద్యోగ, సాంకేతిక, పరిశోధనా, వైద్య, సాహిత్య, జ్యోతిష్య, వాస్తు, సాహిత్య, కళా రంగ, వ్యాపార వాణిజ్య, రాజకీయ రంగాలలో దక్షులుగా ఉన్నారు, నిరూపించుకున్నారు. వర్తమాన మహిళా శ్రేష్టుల వివరాలు చూద్దాము. ప్రస్తుత  రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, కీ  శే  సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్, కిరణ్ బేడీ, కల్పనా చావ్లా (ఇండో అమెరికన్ వొమ్యగామి) మున్నగువారు. *మహిళలు సాహసించని రంగాలు లేవు*. IAS లు గా IPS లు గా ఉన్నతోద్యోగాలు చేయడమే గాకుండా *మహిళలు సైనిక దళాలలో గూడా ప్రధాన స్థానాలలో అనగా  కేంద్ర రైజర్వ్డ్ పోలీసు ఫోర్స్, కోబ్రా  కమాండ్, జడ్ ప్లస్ కమాండో విభాగాలలో కూడా ఉన్నారు*.  


స్త్రీలలో ఉండే సహజ ప్రేమ, కరుణ, దయ, శాంతి స్వభావాలు మానవతా చిహ్నాలే గాని శారీరక, మానసిక దుర్భల లక్షణాలు కనె కావు. *స్త్రీలు బలహీనులు కారు.  శక్తి స్వరూపిణులు.  వారు ధరించే  మరియు ఉపయోగించే చీర, జాకెట్టు,  కుంకుమ, గాజులు ఇత్యాది అవసరం మరియు అలంకార వస్తువులు బలహీనతకు సూచనలు కావు*. హైందవ సంప్రదాయాలు పాటించవలసినవే.  మహిళల గురించి  వారి అవసర మరియు అలంకార వస్తువుల గురించి అవాకులు చవాకులు కూడదు.  *కావున మన హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*.


ధన్యవాదములు.

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: