ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
12, ఏప్రిల్ 2025, శనివారం
నొప్పించరాదు
*"మంచిమాటలు"*
*తెలిసిగానీ, తెలియకగానీ, స్ఫురణ ఉండి గానీ, లేక గానీ, ఇష్ట పూర్వకంగా గానీ, ఇతరుల ప్రేరణ చేతగానీ - ఏ విధంగానైనా సరే భగవన్నామ స్మరణ చేసే వాడు అమృతత్వాన్ని పొందుతాడు.*
*ముఖం ముడుతలు పడింది, జుట్టు నెరసిపోయింది, కళ్ళు, చెవులు పనిచేయడం లేదు, అవయవాల బిగి సడలింది, కానీ తృష్ట మాత్రమే పరువం చెడకుండా ఉంది.*
*ప్రారంభంలో కష్టంగా ఉన్నప్పటికీ, కాలక్రమంలో మీకు మేలు చేసే మార్గాన్నే స్వీకరించండి. సుఖంగా ఉన్నప్పటికీ చివరికి కష్టాలను కొనితెచ్చే మార్గాన్ని వదిలివేయండి.*
*కళ్ళున్నవారు కూడా రాత్రి వేళ స్పష్టంగా చూడ లేక పోయినప్పటికీ, దీపం తీసుకురాగానే దారి చక్కగా కనబడినట్లు, భగవంతుడి పట్ల భక్తి ఉన్న వారికి ఆ శ్రీహరే స్వయంగా దర్శనం ఇస్తాడు.*
*జన్మనిచ్చిన తల్లిదండ్రుల్నీ, వేదాభ్యాసం చేయించిన ఆచార్యుల్నీ, వేదాలకు భాష్యం చెప్పే విద్వాంసుల్నీ, విద్యనేర్పిన గురువుల్నీ, అతిథిల్నీ, యోగులనూ, గోవుల్నీ నొప్పించరాదు.*
=========================
హనుమద్విజయోత్సవం
🕉️ *హనుమద్విజయోత్సవం, చైత్రపూర్ణిమ, రౌచ్యమన్వాది*🕉️
*గురుబోధ:*
సదా రామ రామేతి రామామృతం తే | సదా రామమానందనిష్యందకందం ||
పిబంతం సమంతం హసంతం సుదంతం | హనూమంతం అంతర్భజే తం నితాంతం ||
"ఎల్లవేళలా రామనామాన్ని గ్రోలుతూ, నమస్సులు అర్పిస్తూ, తద్వారా పెల్లుబికిన ఆ ఆనందంతో స్వచ్ఛమైన తన దంతముల కాంతిని నలు దిశలా వ్యాపింప జేస్తూ చిరునవ్వులు చిందిస్తూ, రామ నామమే శ్వాసగా జీవించే హనుమంతుణ్ణి నేను నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను"
శ్రీ ఆది శంకరాచార్యులవారు రచించిన శ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రంలోని ఈ శ్లోకంతో హనుమంతుని స్తుతించి ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తే విజయం లభిస్తుంది.
ధార్మిక కర్మాచరణము
*2069*
*కం*
ధార్మిక కర్మాచరణము
నిర్మలమొనరించు నీదు నెలగములిలలో.
ధర్మమునకు చేయువ్యయము
శర్మము కలిగించు నీకు సతతము సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ధార్మిక కర్మ లు చేయడం ద్వారా ఈ లోకంలో నీ సిరిసంపదలు (నెలగము= ధనము) దోషాలను పోగొట్టుకొనును. ధార్మిక ముగా చేసే వ్యయం వలన నీ మనస్సు కు ఆనందం (శర్మ ము) కలిగించును.
*సందేశం*:-- ధనార్జన ఎంత గొప్ప అయిన నూ అందులో కొంత అయినా ధార్మిక వ్యయం చేయకపోతే మనశ్శాంతి ఉండదు. ధార్మిక వ్యయమే మనశ్శాంతి కి హేతువు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
చతుస్సాగర పర్యంతం
*చతుస్సాగర పర్యంతం అంటే...*
ఉన్నవి సప్తసముద్రాలైతే. చతుస్సాగర పర్యంతం' అంటారు ఎందుకో తెలుసుకుందాం.
'చతుస్సాగర పర్యంతం' అంటే, ఈ నాలుగు సముద్రాల 'పర్యంతం' చుట్టబడిన జంబూద్వీపంలో మనం వుంటున్నాం...ఆ నాలుగు సముద్రాలే కాలాంతరంలో 'ఏడు సముద్రాలు'గా మారాయని 'దేవీ భాగవతం' చెపుతున్నది....
'చాతుర్వర్ణస్య సౌవర్ణో మేరుశ్చోల్బమయః స్మృతః' అన్న వేదోక్తి ప్రకారం మేరువుకు నాలుగు వర్ణాలు {రంగులు} ఉన్నాయని మన పూర్వీకులు చెప్తారు....అవి తూర్పున తెలుపు రంగు, దక్షిణాన పసుపు రంగు, పశ్చిమాన నలుపు రంగు, ఉత్తరాన ఎరుపు రంగుగా చెప్పారు... ఇక్కడ తెలుపు శాంతికి ప్రతీక. అందుకే, తూర్పు సముద్రాన్ని 'ప్రశాంతో ధధి'గా పేర్కొన్నారు... అలాగే, పసుపు పవిత్రతకు చిహ్నం... కాబట్టి, దక్షిణ సముద్రాన్ని 'అతులాంతకం' {సరి లేనిది}గా పేర్కొన్నారు....ఇక, సింధువు అంటేనే జలరాశి.... నీరు స్వతహాగా నలుపు రంగులో ఉంటుంది.... కనుక, పశ్చిమాన ఉన్న సముద్రాన్ని 'సింధు సముద్రం' అన్నారు. ఉత్తరాన ఉన్న సముద్రం రక్తవర్ణంతో ఉండటం వల్ల దానిని 'అర్క సముద్రం'గా పిలిచారు.... అలాగే, పసిఫిక్ మహాసముద్రాన్ని 'ప్రశాంత సముద్రమని', అట్లాంటిక్ మహాసముద్రాన్ని 'అతులాంతక సముద్రమని', ఆర్కిటిక్ సముద్రాన్ని 'అర్క సముద్రమ ని', ఇండిక్ లేదా హిందూ సముద్రాన్ని 'సింధూ సముద్రమని' కూడా పిలుస్తారు.... పురుషార్ధాః సాగరాః అన్నది 'భావనోపనిషత్తు'. ఎలాగైతే, 'సాగరాలు సర్వవ్యాపకాలో అలాగే, పురుషార్థాలు కూడా సర్వవ్యాపకాలే' అంటూ, ధర్మార్థకామ మోక్షాలను ఆధ్యాత్మిక వేత్తలు సాగరాలతో పోలుస్తారు.... అంతేకాక, పిండాండాన్ని బ్రహ్మాండాన్ని సమన్వయం చేయడంలో బ్రహ్మాండంలోని సాగరాలను పిండాండాలలోని పురుషార్థాలకు ప్రతీకలుగానూ భావించారు.
చతుర్విధ ముక్తులు
చతుర్విధ ముక్తులు
1.సాలోక్యం అంటే విష్ణు
లోకమందుండుట
2. సామీప్యం అంటే విష్ణు దగ్గరుండుట
3. సారూప్యం అంటే విష్ణు రూపుడు అయి ఉండుట
4. సాయుజ్యం అంటే విష్ణువులో చేరిఉండుట
నవ్వకపోతే మీకే నష్టం*
*నవ్వకపోతే మీకే నష్టం*
నవ్వవయ్యా బాబూ….నీ సొమ్మేం పోతుంది…….నీ సోకేం పోతుంది.. అంటూ ఓ చిత్రంలో పాట బాగా పాపులర్ అయింది. సాధారణంగా ఎవరైనా నవ్వుతూ మాట్లాడుతుంటే చాలా ముచ్చటేస్తుంది. వాళ్లను చూస్తే కాస్తా రిలీఫ్‌గా కూడా ఉంటుంది. అరె వాడు చూడు..రోజంతా నవ్వుతూనే ఉంటాడు…వాడు మన పక్కన ఉంటే పొట్టచెక్కలైనట్టే అనే మాటలూ తరచూ వింటుంటాం. నవ్వుకు ఉన్న పవర్ అంతా ఇంతా కాదు. నవ్వుతూ ఉంటే ఏ రోగం దరిచేరదు. ఎంత ఒత్తిడినైనా నవ్వుతో జయించవచ్చు.
*మీకు ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది-*
ఔను నేను చెబుతుంది మీ కోసమే.. పని ఒత్తిడి ఉన్నా…బాగా అలసిపోయినా…టీవీలో వచ్చే కామెడీ స్కిట్స్ గానీ, ఆయా చిత్రాలలో కామెడీ క్లిప్పింగ్స్ కానీ చూస్తే చాలా రిలాక్స్ అయిపోతాం. రిఫ్రెష్ అవుతాం. నవ్వుకు అంత బలం ఉంది. బలహీనతలను అధిగమించే పవరూ ఉంది. ఇంకెందుకు ఆలస్యం నవ్వుతూ చదువుకుందాం.
*నవ్వుతో ఒత్తిడి ఉపశమనం* -
మంచి హాస్యం అన్ని చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అనారోగ్యాలను నయం చేయదు, కానీ నవ్వడం వల్ల కలిగే సానుకూల దృక్ఫథం మారుతుంది. ఒత్తిడి నుంచి బయటపడే వెసులుబాటు దొరుకుతుంది. చేసే పనిని సులువు చేస్తుంది.
*నవ్వితే నవ్వినంత కేలరీస్*-
నవ్వితే నవ్వినంత కేలరీస్ పెరుగుతాయి. నవ్వడంతో మీలో తెలియని వైబ్రేషన్ వస్తాయి. మనకు తెలియకుండా అంతర్గత వ్యాయామం జరుగుతుంది. ఎంత ఎక్కువసేపు నవ్వితే, ప్రభావాలు అంత ఎక్కువగా ఉంటాయి.
*తాత్కాలిక ప్రయోజనాలు*-
మంచి నవ్వు తాత్కాలికంగా గొప్ప ప్రభావాలను కలిగి ఉంటుంది. మీరు నవ్వడం ప్రారంభించినప్పుడు, అది మీ మానసిక భారాన్ని తగ్గించడమే కాకుండా, మీ శరీరంలో శారీరక మార్పులను కూడా కలిగిస్తుంది. నవ్వు:
*అవయవాలు ఉత్తేజం*-
నవ్వితే మన అవయవాలు ఉత్తేజంగా మారతాయి. నవ్వు ఆక్సిజన్ రిచ్ గాలిని మీ శరీరంలోకి తీసుకుంటుంది. మీ గుండె, ఊపిరితిత్తులు, కండరాలు ఉత్తేజ పరుస్తాయి. మెదడు నుంచి విడుదల చేసే ఎండార్పిన్‌లను పెంచుతుంది.
*దీర్ఘకాలిక ప్రభావాలు*-
మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ప్రతికూల ఆలోచనలు రసాయన ప్రతిచర్యలుగా మారి, మీ వ్యవస్థలోకి ఎక్కువ ఒత్తిడిని తీసుకురావడం ద్వారా మీ రోగనిరోధక శక్తిని తగ్గించడం ద్వారా మీ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. దీనికి విరుద్ధంగా, సానుకూల ఆలోచనలు వాస్తవానికి న్యూరోపెప్టైడ్‌లను విడుదల చేస్తాయి, ఇవి ఒత్తిడి మరియు తీవ్రమైన అనారోగ్యాలతో పోరాడటానికి సహాయపడతాయి.
*మీకేది ఇష్టమో గుర్తించండి*-
మీరు ముభావంగా ఉంటున్నారా? అందరూ నవ్వుతూ మాట్లాడుతుంటే మీరు నవ్వలేకపోతున్నారా? ఇలాంటి వారు చాలా మంది మనకు ఎదురయ్యే ఉంటారు. ఇలాంటివాళ్లు ముందుగా వారు నవ్వలేకపోవడానికి గల కారణాలు తెలుసుకోవాలి. నవ్వించే కొన్ని సాధారణ అంశాలను ఎంపిక చేసుకోండి. ఫన్నీ సినిమాలు, టీవీ షోలు, పుస్తకాలు, పత్రికలు లేదా కామెడీ వీడియోలను అందుబాటులో ఉంచండి. జోక్ వెబ్‌సైట్‌లు లేదా ఫన్నీ వీడియోలను ఆన్‌లైన్‌లో చూడండి. హాస్యభరితమైన పోడ్‌కాస్ట్‌లను వినండి. కామెడీ క్లబ్‌కు వెళ్లండి.
*మీరు నవ్వితే లోకమే నవ్వుతుంది*-
ఒక్కసారి నవ్వుతూ మాట్లాడి చూడండి.. మీ చుట్టూ ఉన్నవాళ్లు మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారో అర్థమవుతుంది. మీరు నవ్వుతూ మాట్లాడితే లోకమే నవ్వుతుంది. నవ్వు రాకపోయినా నవ్వడానికి ప్రయత్నించండి. ప్రాక్టిస్ చేయండి. ఇది శరీరానికి మంచి చేస్తుంది.
*నవ్వు..లవ్వు*-
మీరు సమూహంలో నవ్వుతూ ఉండండి. మీకు కావాల్సిన వారు పసిగడతారు. ప్రతి బంధం వెనుక నవ్వు కీలకం. నవ్వు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. కలిసి నవ్వే వ్యక్తులు కలిసి బాగా పని చేస్తారు. మీరు కార్యాలయంలో సరదా వాతావరణాన్ని కలిగి ఉన్నప్పుడు, ఎక్కువ మంది పనికి రావడానికి సంతోషిస్తారు. వారి కమ్యూనికేషన్, ఒకరి పట్ల ఒకరి సహనం మెరుగ్గా ఉంటాయి.
*నవ్వు..కుటుంబానికి ఇవ్వు*-
ఇంట్లో నవ్వుతూ గడపండి. ఉదయం నవ్వుతూనే నిద్ర లేవండి…రాత్రి పడుకునే ముందు నవ్వుతూనే పడుకోండి. చిన్న చిన్న విషయాలకు చిరాకు పడొద్దు…ఏ విషయమైనా నవ్వుతూ చెప్పండి. జీవితం మనకు అనేక ఆసక్తికరమైన విషయాలను విసురుతుంది . నవ్వుతూ జయించాలి.
*లవ్ రిలేషన్*-
మీ భాగస్వామితో నవ్వడం కంటే మంచిది మరొకటి లేదు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. నిన్నటికి నేటికీ తేడా మీరే గమనిస్తారు. ఇది మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది.. ఆ క్షణంలో నిజంగా ఉండటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కలిసి నవ్వే చాలా జంటలు వారి సంబంధంలో అద్భుతంగా సాగుతుంది.
🙏🌷🙏 శుభోదయం 🙏🌷🙏
శివానందలహరి
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగద్గురు ఆదిశంకరాచార్యులు*
*విరచిత*
*”శివానందలహరి”*
*రోజూ ఒక శ్లోకం*
*తాత్పర్యం, ఆడియోతో*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*ఈశ్వర స్మరణ చేత పాపములు పూర్తిగా పోయి విద్వాంసుడు శివసారూప్యమును పొందుతాడని శంకరులు ఈ శ్లోకమున చెప్పారు.*
*శ్లోకం : 71*
*ఆరూఢ భక్తి గుణ కుంచిత భావ చాప*
*యుక్తైః శివ స్మరణ బాణగణై రమోఘైః*
*నిర్జిత్య కిల్బిషరిపూ న్విజయీ సుధీంద్రః*
*సానంద మావహతి సుస్థిర రాజలక్ష్మీమ్ !!*
*తాత్పర్యము :-*
*లోకములో ఒకరాజు ధనుర్బాణాలతో శత్రు రాజులను జయించి, ఆ రాజలక్ష్మిని పొంది సార్వభౌముడైన విధంగానే, పండిత శ్రేష్ఠుడు, ఆరూఢమైన భక్తిని అల్లెత్రాడుగానూ, అంతఃకరణ వృత్తిని ధనస్సుగానూ, అమర్చికొని అందు ఈశ్వర స్మరణమును బాణంగా ఎక్కుపెట్టి, పాపములనే శత్రువులందరినీ జయించి పరమానందంతో పరమేశ్వర సారూప్యలక్ష్మిని పొంది దుష్టనిగ్రహ, శిష్ట పరిపాలన రూపంగా సర్వశాసకుడౌతాడు.*
*వివరణ :-*
*పై తాత్పర్యాన్ని క్రింది విధంగా సమన్వయం చేసుకోవాలి. పండిత శ్రేష్ఠుడనే ప్రభువు ఎక్కుపెట్టబడిన భక్తి అనే నారితో పంపబడిన చితాతమనే ధనస్సునందు సంధింపబడిన తిరుగులేని శివనామ స్మరణమనే బాణసమూహంతో కామ క్రోధాదులనే శత్రువులనోడించి, విజయ శోభితుండై శాశ్వతమైన మోక్షమనే రాజ్యలక్ష్మిని మహానంద సహితుడై అనుభవిస్తాడు.*
*పై శ్లోక భావం పూర్థిగా అర్థం చేసుకోవడానికి మరి కొంత వివరణ అవసరమవుతుంది.*
*మనలో పాపాలున్నంత వరకూ మనం పవిత్రులం కాలేము. ముందు మన పాపాలను పోగొట్టు కోవాలి. ఈ పాపాలు శత్రువుల వంటివి. ఈ పాప శత్రువులను జయించాలి. అందుకు అమోఘమైన అనగా తిరుగులేని అంటే వృథాకాని బాణాలవంటివి కావాలి.*
*శివనామ స్మరణము అంటే "నమశ్శివాయ" అనే పంచాక్షరీ మంత్ర జపం, అమోఘమైన బాణాల వంటిది. ఆ శివ నామోచ్చారణను చేసి శత్రువుల వంటి పాపాలను పోగొట్టుకొని సుస్థిరమైన మోక్ష సామ్రాజ్య లక్ష్మిని పొందవచ్చునని శంకరులు చెప్పారు.*
*మోక్షసామ్రాజ్యలక్ష్మిని పొందాలంటే 1) పరిశుద్దమైన అంతరంగము 2) పాదుకొన్న భక్తి 3) శివ నామ స్మరణమనే సాధనలు కావాలి అని సారాంశం.*
*"యావద్ధి పాతకం దేహే , తావత్ సిద్ధిః న జాయతే " అనగా శరీరంలో పాపములున్నంతవఱకూ, సిద్ధిచిత్తశుద్ధి, జ్ఞానసిద్ధి, మోక్షసిద్ధి కలుగవు.*
*"కషాయే కర్మభిః పక్వే, తతో జ్ఞానం ప్రవర్తతే " అనగా సత్కర్మల ద్వారా ,శాస్త్ర విహితములైన ధర్మానుష్ఠానములద్వారా, మన దోషాలు పోతాయి. హృదయం నిర్మలమవుతుంది. అప్పుడు భగవత్తత్త్వము అనుభవానికి వస్తుంది.*
*ఈవిధంగా ఈశ్వరనామస్మరణ ప్రాముఖ్యమును గూర్చి ఈ శ్లోకం చెప్పింది.*
*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*
*ఓం నమఃశివాయ।*
*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
హనుమత్ విజయోత్సవం
🌺 హనుమత్ విజయోత్సవం
శుభాకాంక్షలు🌺
శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, గుంతకల్లు మండలంలోని "కసాపురం" గ్రామంలో ఉన్న ప్రసిద్ధ ఆంజనేయ స్వామి క్షేత్రం. ఇక్కడ వెలిసిన ఆంజనేయ స్వామి తన కుడి కన్నుతో భక్తులను అనుగ్రహిస్తున్నందున, ఈ ప్రదేశాన్ని "నెట్టికంటి" అని పిలుస్తారు. భక్తులు ఇక్కడ వెలిసిన ఆంజనేయ స్వామి కోర్కెలు తీర్చి కల్పతరువుగా, వరప్రదాతగా పూజిస్తారు.
ఈరోజు మనం హనుమద్ విజయోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా హనుమను కీర్తించే "కీర్తనలు" విని తరిద్దాం.
ఈ క్రిందిలింకులో అద్భుతమైన "ఆంజనేయస్వామి" భజనలు ఉన్నాయి.
మీరు వినండి, మీవారికి పంపండి. తప్పకుండా LIKE చేయండి. PLEASE.
మీ రాధాకృష్ణ
రామ నామ మహిమ*
157c5.104e5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రామ నామ మహిమ*
➖➖➖✍️```
-తులసీదాసు.
భక్త శిఖామణి, శ్రీమద్రామాయణ గ్రంధకర్త తులసీ దాసు మఠంలో ఒక మధ్యాహ్న వేళ భోజనాలు చేస్తున్న బంతిలో కలకలంరేగింది.
“ఏమిటి సంగతి?” అని తులసీ దాసు అక్కడివారిని అడిగారు.
భోజన బంతిలో ఒక పాపాత్ముడున్నాడు. అతని సరసన కూర్చొని భోజనాలు చేయడానికి కొందరు పెద్దలు తిరస్కరిస్తున్నారని కార్యకర్తలు చెప్పారు.
“పాపాత్ముడని” చెప్పబడుతున్న వ్యక్తిని తన దగ్గరకు పిలిచాడు తులసీదాసు…. “నాయనా!.. రామ్..రామ్..రామ్ అని ముమ్మార్లు జపించు”
“రామ్..రామ్..రామ్..!” అంతే. ఆ వ్యక్తి రామనామం జపించాడు.
“ఈ వ్యక్తి పాపాలు అన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు అందరూ అతనితో కలసి సహపంక్తి భోజనం చేయవచ్చు.” అని అన్నాడు తులసీ దాసు.
కాని ఆ పెద్దలు ఒప్పుకోలేదు…”ఈ వ్యక్తి కి వడ్డించిన విస్తరిలోని భోజనాన్ని విశ్వనాధుని ఆలయంలో వున్న నందికి నివేదన చేస్తాము. నందిదేవుడు అంగీకరిస్తే అప్పుడు యీ వ్యక్తి పాపాత్ముడు కాదని ఒప్పుకుంటాము” అని అన్నారు.
అందరూ విశ్వనాధుని ఆలయంలోని నందీశ్వరుని ముందు నిలబడ్డారు.
తులసీదాసు… “నందీశ్వరా! శ్రీరామ నామం సకల పాపాలను తొలగిస్తుందనే మాట నిజమైతే నీవు ఈ నైవేద్యాన్ని స్వీకరించాలి" అని అన్నారు.
నంది కదిలింది. లేచివచ్చి విస్తరిలోని భోజనాన్ని తృప్తిగా భోజనం చేసి మళ్ళీ శిలగా మారిపోయింది.
ఈ అద్భుతం చూసి తులసీదాసు ను శంకించిన వారంతా శిలలుగా నిలబడి పోయారు.
ఈ కలికాలంలో భగవన్నామ స్మరణమే మానవుల దుఃఖాలు తీర్చే సన్మార్గం అని శ్రీ తులసీదాసు నిరూపించాడు.✍️
'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే' ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.✍️```
*ఓం శ్రీరామాయ నమః!!*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏
కనకవిశాలచేల
కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స
జ్జనపరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాండకాండ సం
జనిత పరాక్రమక్రమ విశారద శారద కందకుంద చం
దన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 10 ॥
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం - పూర్ణిమ - హస్త - స్థిర వాసరే* (12.04.2025)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*