మలబద్ధక సమస్య గురించి వివరణ - 2 .
అంతకు ముందు పోస్టు నందు మలబద్దకం మరియు దాని లక్షణాల గురించి వివరించాను. ఇప్పుడు మీకు మలబద్దకం నివారణ గురించి వివరిస్తాను .
నివారణా యోగాలు -
* ఎక్కువుగా పాలిష్ చేయబడిన బియ్యాన్ని
ఆహారముగా వాడరాదు. వీలులేని పరిస్థితుల్లో పాలిష్ బియ్యాన్ని వాడవలసి వచ్చినపుడు ప్రతిరోజు తవుడు ( Rice bran ) రెండు స్పూనులు చక్కెరతోగాని , తేనెతో గాని కలుపుకుని తినవలెను . లేదా తవుడుకు కొంచం నీరు చేర్చి చారులో కలుపుకుని లోపలికి తీసుకోవాలి .
* బజారు నందు లభ్యం అయ్యే గోధుమపిండి మరియు మైదాపిండి నందు పీచుపదార్థాలు పుష్కలంగా లేవు . కావున బజారులో దొరుకు గోధుమపిండికి బదులుగా గోధుమలు తెచ్చుకుని శుభ్రపరచి మనమే మిల్లులో పట్టించుకుని వాడుకోవడం మంచిది .
* పైన చెప్పిన విధముగా పాలిష్ తవుడు , మిల్లులో పట్టించిన గోధుమపిండి వాడటం వలన మలబద్దకం నివారణ అగుటయే కాకుండా B1 , B2 , నియాసిన్ విటమిన్లు కూడా సమృద్దిగా లభ్యం అగును.
* వరి అన్నం మరియు గోధుమపిండితో చేసిన చపాతీలు , రొట్టెలు వాడునప్పుడు వీలైనంత అధికంగా ఆకుకూరలు , కూరగాయలు వాడాలి . దీనివలన మలబద్దకం తగ్గుటయే కాకుండా ఖనిజ లవణాలు , విటమిన్లు కూడా లభ్యం అగును .
* భోజనము చేసిన అర్థ గంట తరువాత 2 గ్లాసులు , రాత్రి పడుకునే ముందు 2 గ్లాసులు , ఉదయాన్నే పండ్లు తోముకున్న తరువాత 2 గ్లాసుల నీటిని తాగవలెను . ఉదయాన్నే నీటిని తాగి కొంచంసేపు నడవటం లేదా వ్యాయామం చేయుట ద్వారా సుఖవిరేచనం అగును.
* కాఫీ , టీ అలవాటు ఉన్నవారు క్రమముగా అలవాటును తగ్గించుకోవాలి. రోజుకు రెండుసార్ల కన్నా ఎక్కువసార్లు కాఫీ , టీలు సేవించరాదు .
మలబద్ధక సమస్యతో బాధపడువారు త్రిఫలా చూర్ణం రెండు స్పూన్లు మోతాదులో ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో కలిపి రాత్రిపూట పడుకునే ముందు తీసుకొనుచున్న ఉదయాన్నే సుఖవిరేచనం అగును. నేను ఇంతకు ముందు చెప్పిన విధముగా ఔషధాలు వాడుటయే కాక ఆహారం నందు ముఖ్యముగా మార్పులు చేసుకొనవలెను . మలబద్దకం మొదలయింది అంటే మీయొక్క అనారోగ్య సమస్యలు మొదలవుతున్నట్లే కావున మొదటిలోనే సమస్య నివారించుకోవడం ఉత్తమం .
మరింత విలువైన సమాచారం మరియు అనేక రోగాలకు సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
9885030034
అనువంశిక ఆయుర్వేద వైద్యులు