19, జులై 2021, సోమవారం

అవధూత శ్రీ రంగన్న బాబు

 📕✍️📕✍️📕✍️📕✍️📕✍️📕శ్రీరామ అ జయ రామ జయ జయ రామ

*అవధూత శ్రీ రంగన్న బాబుగారి లీలా సంపుటి 27 వ భాగం*

_"పరీక్ష లో  📋 స్వామి అనుగ్రహం"_ ✍️

1953 చివరలో బహుశా డిసెంబర్ నెల అనుకుంటాను. బాబు గారికి పరీక్షల 📋 గురించి విన్నవించాను. దయదలిచారు. పరీక్షలలో చదువవలసిన పుస్తకాలలో📚 ఏదో ఒక్కటి 📕 తీసుకుని వారి వెంట మామూలుగానే 🛕 దేవాలయానికి రమ్మన్నారు. అలాగే చీరాలలోని వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళాము. అప్పటికే దేవాలయ అర్చకులు దేవాలయం మూసివేసి వెళ్లిపోయారు. బహుశః అప్పుడు రాత్రి 8:00 అయి ఉంటుంది. దేవాలయ ముఖద్వారం వద్ద నేను తీసుకువెళ్ళిన పుస్తకం ఉంచమన్నారు. తదుపరి కొన్ని నిమిషాల తర్వాత *"స్వామి పుస్తకం 📕 సృజించారని, తీసుకోవలసినది"* గా చెప్పారు. అలాగే చేతిలోకి తీసుకున్నాను. "స్వామి పుస్తకం సృజించినట్లు ఎలా తెలుస్తుంది?" అని బాబు గారిని అమాయకంగా ప్రశ్నించాను. పుస్తకం తెరిచి చూడమన్నారు. పుస్తకం పేజీల మధ్య భాగంలో 📖కొంత పసుపు 🟡 ఉన్నది. అదే గుర్తు అన్నారు. పరీక్షకు 📋 వెళ్లేటప్పుడు నొసట ధరించమన్నారు. అలాగే చేశాను. అత్యధిక మార్కులతో పాసయ్యాను. అదే సంవత్సరం చివరిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు కూడా పాసయ్యాను.

*అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త*

_"జయ జయ సాయి రామ్."_

🟡✍️🟡✍️🟡✍️🟡✍️🟡✍️🟡

కామెంట్‌లు లేవు: