6, డిసెంబర్ 2023, బుధవారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



అప్పట్లో అడవిలో ఏమీ దొరక్క నేనూ ఇబ్బంది

పడ్డాను.

ఒకనాడు ఆకలి తట్టుకోలేక ఒక శ్వపచుడి గుడిసెలోకి దొంగతనానికి దూరాను. అతడు

నిద్రపోతున్నాడులే అని నడి చెయ్యకుండా ఉట్టినుంచి కుండదించి మూకుడు తెరిచాను. వండిన కుక్క

మాంసం కనిపించింది. ఏదో ఒకటిలే, ముందు ప్రాణాలు నిల్పుకోవాలికదా అని తినబోయాను.

సరిగ్గా అదే సమయానికి ఆ శ్వపచుడుకి మెలకువ వచ్చింది. ఎవరు నువ్వు? ఈ అర్ధరాత్రివేళ

ఇంటిలోకి ఎందుకు ప్రవేశించావు? కుండ దింపావు కారణం ఏమిటి ? నిజంచెప్పు అంటూ గద్దించాడు.

సుందరాంగీ! ఆ క్షణంలో నిజంగా నాకు నోరు పెగలలేదు. తడి ఆరిపోయింది. ఎలాగో తెములు

భయంతో వొణికిపోతూన్న గొంతుకతో మెల్లగా అన్నాను మహాభాగా! నేను బ్రాహ్మణుడివి. తాపపిని.

ఆకలి తట్టుకోలేక ఇలా దొంగతనానికి దిగాను. ఈ కుండలో తిండి కనిపించింది. తినబోతున్నంతలో

నువ్వు లేచావు. మహానుభావా! నన్ను అతిథిగా భావించు. అనుమతిస్తే ఈ వండిన మాంసం తింటాను.

ప్రాణాలు కడబట్టేట్టున్నాయి. అనుమతించు అని బిక్కచచ్చిపోయి అభ్యర్థించాను.

అప్పుడు ఆ శ్వపచుడు ఏమన్నాడో తెలుసా ! నువ్వు బ్రాహ్మణుడివి. అగ్రజన్మ వీది. వేమ

చండాలుడిని. మా ఇంటిలో మాంసం నువ్వు తినడానికి వీలులేదు. మానవజన్మయే దుర్లభమంటారు.

అందులోనూ ద్విజత్వం మరీ దుర్లభం. ద్విజుల్లోనూ బ్రాహ్మణత్వం అంతకన్నా దుర్లభంట. నీకు ఈ

మాత్రం తెలీదా ? దుష్టాహారం నువ్వు తినకూడదు. కర్మలనుబట్టి ఏడు జాతులను అంత్యజులుగానూ

అగ్రాహ్యులుగానూ చెప్పాడు ధర్మశాస్త్రకర్త మనువు. కర్మచేత నేను శ్వపచుణ్ణి కనక త్యాజ్యుడివి. కాబట్టి

నువ్వు మా ఇంటిలో ఏమీ తివడానికి వీలులేదు. నీకు ఇంత పెట్టడానికి లోభించి నేను ఇలా

నివారిస్తున్నానని భావించకు. వర్ణసంకరదోషం నీకు రాకుండుగాక అనేదే నా ఆకాంక్ష

ఆదిపర్వము

 శ్రీమహాభారత విజ్ఞాన సర్వస్వము

               ఆదిపర్వము 


మంజరీ ద్విపద :


శ్రీకరుల్ విప్రుల సేవించుటందు

ననయంబు తృప్తిని ననుభ వించుటయు

భాసురంబైనట్టి భారత గాథ

నత్యంత ప్రీతితో నాలకించుటయు

పార్వతీపతియైన పరమాత్మ శివుని

ననయంబు ధ్యానించి నర్చించు టయును

సతతదానంబులు సల్పుట యందు

మదినుంచి తృప్తిగా మసలుట యున్ను

సాధుసాంగత్యాన సతత ముండుటయు,

నీ యైదు తనమది కిష్టంబు లనుచు

నన్నయ్యభట్టును సన్నుతి చేసి

యాస్థాన మందున ననె రాజరాజు


                                ఆది.  1-12


✍️గోపాలుని మధుసూదన రావు🙏

భాసురంబైనట్టి భారత గాథ

 శ్రీమహాభారత విజ్ఞాన సర్వస్వము

               ఆదిపర్వము 


మంజరీ ద్విపద :


శ్రీకరుల్ విప్రుల సేవించుటందు

ననయంబు తృప్తిని ననుభ వించుటయు

భాసురంబైనట్టి భారత గాథ

నత్యంత ప్రీతితో నాలకించుటయు

పార్వతీపతియైన పరమాత్మ శివుని

ననయంబు ధ్యానించి నర్చించు టయును

సతతదానంబులు సల్పుట యందు

మదినుంచి తృప్తిగా మసలుట యున్ను

సాధుసాంగత్యాన సతత ముండుటయు,

నీ యైదు తనమది కిష్టంబు లనుచు

నన్నయ్యభట్టును సన్నుతి చేసి

యాస్థాన మందున ననె రాజరాజు


                                ఆది.  1-12


✍️గోపాలుని మధుసూదన రావు🙏

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



అప్పట్లో అడవిలో ఏమీ దొరక్క నేనూ ఇబ్బంది

పడ్డాను.

ఒకనాడు ఆకలి తట్టుకోలేక ఒక శ్వపచుడి గుడిసెలోకి దొంగతనానికి దూరాను. అతడు

నిద్రపోతున్నాడులే అని నడి చెయ్యకుండా ఉట్టినుంచి కుండదించి మూకుడు తెరిచాను. వండిన కుక్క

మాంసం కనిపించింది. ఏదో ఒకటిలే, ముందు ప్రాణాలు నిల్పుకోవాలికదా అని తినబోయాను.

సరిగ్గా అదే సమయానికి ఆ శ్వపచుడుకి మెలకువ వచ్చింది. ఎవరు నువ్వు? ఈ అర్ధరాత్రివేళ

ఇంటిలోకి ఎందుకు ప్రవేశించావు? కుండ దింపావు కారణం ఏమిటి ? నిజంచెప్పు అంటూ గద్దించాడు.

సుందరాంగీ! ఆ క్షణంలో నిజంగా నాకు నోరు పెగలలేదు. తడి ఆరిపోయింది. ఎలాగో తెములు

భయంతో వొణికిపోతూన్న గొంతుకతో మెల్లగా అన్నాను మహాభాగా! నేను బ్రాహ్మణుడివి. తాపపిని.

ఆకలి తట్టుకోలేక ఇలా దొంగతనానికి దిగాను. ఈ కుండలో తిండి కనిపించింది. తినబోతున్నంతలో

నువ్వు లేచావు. మహానుభావా! నన్ను అతిథిగా భావించు. అనుమతిస్తే ఈ వండిన మాంసం తింటాను.

ప్రాణాలు కడబట్టేట్టున్నాయి. అనుమతించు అని బిక్కచచ్చిపోయి అభ్యర్థించాను.

అప్పుడు ఆ శ్వపచుడు ఏమన్నాడో తెలుసా ! నువ్వు బ్రాహ్మణుడివి. అగ్రజన్మ వీది. వేమ

చండాలుడిని. మా ఇంటిలో మాంసం నువ్వు తినడానికి వీలులేదు. మానవజన్మయే దుర్లభమంటారు.

అందులోనూ ద్విజత్వం మరీ దుర్లభం. ద్విజుల్లోనూ బ్రాహ్మణత్వం అంతకన్నా దుర్లభంట. నీకు ఈ

మాత్రం తెలీదా ? దుష్టాహారం నువ్వు తినకూడదు. కర్మలనుబట్టి ఏడు జాతులను అంత్యజులుగానూ

అగ్రాహ్యులుగానూ చెప్పాడు ధర్మశాస్త్రకర్త మనువు. కర్మచేత నేను శ్వపచుణ్ణి కనక త్యాజ్యుడివి. కాబట్టి

నువ్వు మా ఇంటిలో ఏమీ తివడానికి వీలులేదు. నీకు ఇంత పెట్టడానికి లోభించి నేను ఇలా

నివారిస్తున్నానని భావించకు. వర్ణసంకరదోషం నీకు రాకుండుగాక అనేదే నా ఆకాంక్ష

తలచియు దలచని తలపుకు*

 *#కృష్ణా_నీ_మీద_మనసాయెరా   #గోపికావిలాపము* 


 ( కందములలో శతకము - 07 )


🌺🍃 *----------------* 🍃🌺


🌹🙏🌹


*తలచియు దలచని తలపుకు* 

*వలచియు వలవని వలపులె వరముగ దక్కున్ !*

*దలచితి సంపూర్ణముగా*

*వలపంతయు గోరుచున్న వనితను గృష్ణా !*

    

(  61 ) 


🌹🙏🌹( భావము )


ఏదో తలచామా తలచలేదా అన్న తలపులకు ,

దక్కినదా దక్కలేదా అన్నట్లుగానే నీ ప్రేమము దక్కుట సమంజసమే ! 🙏


*కానీ కృష్ణా !* 

పరిపూర్ణముగా నేను నీ ధ్యాసలోనే బ్రతుకుచున్నాను . మరి నీ సంపూర్ణమైన ప్రేమను ఈ వనిత కోరుకొనుట ఉచితమే కదా *కృష్ణా ?*🙏


🌹🙏🌹


*ఆవిరులైనది  తనువున-*

*నీ విరులన్నియును వాడె నిట్టే కృష్ణా ,*

*పావురములెగిరి పోయెను*

*నా విరహపు వేదనగని ననువిడి కృష్ణా !*


(  62 )  


🌹🙏🌹( భావము )


తనువంతా వేడి ఆవిరులుగా ఉండుటచే ,

నా మీద నున్న ఈ పువ్వులన్నీ, ఇట్టే వాడి పోయి నేలరాలి పోతున్నాయి *కృష్ణా !*🙏


నా చెంతనే ఎంతో మచ్చికతో ఉండే పావురాలూ , గువ్వలు అన్నీ,

 నా విరహ తాపమునోర్వలేక , నన్ను విడిపోయి ఎక్కడికో ఎగిరిపోయాయి *కృష్ణా !*🙏


🌹🙏🌹


*ఘననీలి మేఘ మాకస-*

*మున నున్నను వర్షముబడు ముంగిట నందే !*

*కనరా మేఘశ్యామా ,*

*మనసున ప్రేమ కురిపించు మనవిదె కృష్ణా !!*  


( 63 )


🌹🙏🌹( భావము )


ఎంత గొప్ప నల్లటి మేఘమైనా ఆకాశములోనే వర్షాన్ని కురిపించదు కదా !  🙏

అది చక్కగా నేల మీద ఉన్న వనాలపై ,మొక్కలపై ,పూవులపై చిగురులపై అతి ప్రేమముతో చినుకులు కురిపించును కదా ! 🙏


నీవు నీలమేఘశ్యాముడవైన దయ అనబడే నల్లటి మేఘము లాంటి వాడవు .🙏

నిన్ను కోరుకున్న నా వంటి వనిత హృదయముపై వర్షించరా నీ దయనంతయూ ! ఇదియే నా మనవి *కృష్ణా !*🙏


🌹🙏🌹


*కొలనున గువలము నవ్వుచు*

*గలువలఱేని మురిపెమున కడువిర బూసెన్ ,*

*జెలికాడు లేని యీ నా*

*చెలువము విరబూయు టెపుడొ చెప్పర కృష్ణా  !!*  


( 64 )


🌹🙏🌹( భావము )


అదిగో ఆ కొలునులో ఉన్న కలువ ,

ఆ కలువరేడు చూపించిన ప్రేమకు మురిసిపోయి ,

ఎంత గొప్పగా విరబూసినదో !🙏


నా చెలికాడవైన నీవు లేని ఈ నా సౌందర్యము ,

ఎప్పుడు విరబూస్తుందో కాస్త చెప్పు *కృష్ణా ?*🙏


🌹🙏🌹


*నాటకమా నీ చేతలు ?*

*బూటకముల ? మాటలు మరి పొందులు కృష్ణా ?*

*మాటల మాయాజాలమ ?*

*తేటగ నొకతీరునుండు దిరముగ కృష్ణా !* 

   

( 65 )


🌹🙏🌹( భావము )


అసలు నువ్వు చేసే పనులన్నీ నాటకాలేనా ?

నీ మాటలు , నీ సహచర్యమూ అంతా అసత్యమేనా ?🙏


లేక మాట్లాడుచున్నట్లుగా , చేతలు చేయుచున్నట్లుగా అగుపించే ఇంద్రజాలమా ?🙏


అవన్నీ వద్దు *కృష్ణా !*  సారముగా ఒకే రీతిలో ప్రేమిస్తూ చక్కగా స్థిరముగా నా యెడల ఉండు *కృష్ణా !*🙏


🌹🙏🌹


*గుట్టుగ నుండెడి దానను,*

*బట్టనురా పంత మెపుడుఁ బదుగురి యెదుటన్ !*

*దట్టముగ నిను బొగడుటకె*

*కట్టుబడి మసలుచు నుండు , గాంతను కృష్ణా !*


( 66 )


🌹🙏🌹( భావము )


సడి సేయక మౌనంగా ఉండే దానను ! 

నీ మీద బాహాటముగా పదుగురి ఎదుటా ఏ పంతములకూ పోను ! 🙏


బహువిధముల సారముగా నిన్నే పొగుడుచూ ఉండెడి దానను ! 🙏

ఈ విధముగానే నేను నీకు కట్టుబడి , జీవనము సాగించుచున్న కాంతను *కృష్ణా !*🙏


🌹🙏🌹


*పొగడంగ నుబ్బిపోదువు*

*మగువలు నిన్నెరిగితిరయ , మల్లడవన్చున్*

*దెగపొగడి రతులు సల్పిరి !*

*తగునైన వనితను విడువ దగునా కృష్ణా !!*

 

( 67 ) 


🌹🙏🌹( భావము )


కొద్దిగా పొగిడితే చాలు ఉబ్బిపోతావు !


ఈ కిటుకు ఎరిగి అదిగో అ నెరజాణలందరూ ,

 నిన్ను మల్లడవని ( గట్టి  పట్టు కలవాడవని ) బాగుగా పొగిడి,

వారి వాంఛలన్నీ తీర్చుకుంటున్నారు .🙏


అటువంటి నేర్పులు నేర్వని తగునైన గుణవంతురాలిని నేను . నన్ను విడచుట నీకు తగునా *కృష్ణా ??*🙏


🌹🙏🌹


*ఎన్నడు దెలియునురా? నీ-*

*కెన్నడు నా మనసు తెలియు నింపుగ కృష్ణా ?*

*మన్నన నుండిన యింతిని*

*మన్నించగ నది కరుగని మనసా కృష్ణా ??*  


(  68 )


🌹🙏🌹( భావము )


ఏనాటికి తెలుస్తుందిరా నీకు ?

ఎప్పటికి నా మనసును నీవు అందముగా అర్థము చేసుకుంటావు *కృష్ణా ?*🙏


మర్యాదగా నిన్ను తలచుకునే ఆడదానిని ,

ఆదరించలేక పోతున్నావు ! నీది రాయి వంటి కరుగని మనసా *కృష్ణా ??*


🌹🙏🌹


*తెగువను జూపగ లేనయ ,*

*తగుమర్యాదలు గలిగిన తరుణిని కృష్ణా !*

*జగడము లాడగ లేనయ*

*తెగడనని యలుసు తగదయ తెలియుము కృష్ణా !*


( 69 )


🌹🙏🌹( భావము )


తెగించి ధైర్యముగా బయటపడలేని దానను .🙏

సరియైన మర్యాదలు గలిగిన భయస్తురాలనైన కోమలిని *కృష్ణా !*🙏


నీతో తగవులు పడలేను అస్సలు .

నిన్ను ఏమీ చెడ్దమాటలు అననని ,నన్ను అలుసుగా చూచుట నీకు తగని పని ! ఇది తెలుసుకో *కృష్ణా !!*🙏


🌹🙏🌹


*కోతులకు బంచ వెన్నను ,*

*నీ తీరది  చిన్న నాడె నిజముగ దెలిసెన్*

*నాతిని నీకై యుండగ,*

*బ్రీతిగ గోకుల వనితలె  ప్రియమయె కృష్ణా !!*


( 70 ) 


🌹🙏🌹( భావము )


అవునులే నీ సుద్దులేమిటో  నీ చిన్ననాడే తెలిసిపోయాయి .🙏


కోతులన్నిటినీ పిలిచి మరీ ముద్దుగా వెన్న పంచావటకదా !🙏


చక్కనైన దానిని నేనుండగా  గొల్లభామలే నీకు , ఇష్టసఖులగుటలో ఆశ్యర్యమేమునదిలేవయ్యా *కృష్ణా !*


🌹🙏🌹


*హరే కృష్ణ ! హరే కృష్ణ !!*🙏


పద్యములు  71 to 80  రేపటి శీర్షికలో .....


మీ ఆశీర్వాదములను కోరుకొనుచూ ..


మీ సూచనలు అభిప్రాయములు సదా స్వాగతిస్తూ ...


భవదీయుడు 

✍ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది*

Pulusu podi


 

Nimmakaya thokku

 


శ్రీమహాభారత విజ్ఞాన సర్వస్వము

 శ్రీమహాభారత విజ్ఞాన సర్వస్వము



               యది హాస్తి తద న్యత్ర

              యెన్నే హాస్తి నతత్ క్వచిత్ 



తే. ఎన్నగా భారతంబున యయ్యదుండు

     యయ్య దుండును వెదుకంగ నన్నిటందు

     నెంచ భారతమందున యేది లేదొ

     యెచ్చటను లేదు నయ్యది యెంచి చూడ


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

రాశి ఫలితాలు

 రాశి ఫలితాలు

06-12-2023

సౌమ్య వాసరః (బుధవారం)



మేషం

వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. కీలక సమయంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. చాలకాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.

--------------------------------------

వృషభం

ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఒత్తిడికి గురిచేస్తాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు.

---------------------------------------

మిధునం

వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు  తప్పవు. ముఖ్యమైన పనులలో  శ్రమకు తగిన ఫలితం ఉండదు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. దైవదర్శనం చేసుకుంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారమున సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.

---------------------------------------

కర్కాటకం

వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  ఉద్యోగాలలో జీతభత్యాలు విషయంలో అనుకూలత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందువినోదాది  కార్యక్రమాలలో  పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది.

--------------------------------------

సింహం

భూ సంబంధిత వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.  మానసిక చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ నిర్వహణలో లోపం వలన అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.

---------------------------------------

కన్య

చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక వృద్ధి,పాత ఋణాలు తీర్చగలుగుతారు. నూతన వస్తు  వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు తగిన అవకాశాలు లభిస్తాయి.

---------------------------------------

తుల

ఉద్యోగమున అధికారులతో వాదాలకు వెళ్లకపోవడం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు.

---------------------------------------

వృశ్చికం

చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి,ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

ధనస్సు

సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి.  బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

--------------------------------------

మకరం

వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమౌతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణ యత్నాలు కలసిరావు. ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు.

---------------------------------------

కుంభం

ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలుతో కాని  పూర్తికావు.  వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

---------------------------------------

మీనం

వ్యాపారపరంగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశములు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు తరువాత కాలానికి ఉపయోగపడతాయి.

---------------------------------------

 ఈ రోజు పంచాంగం 06.12.2023  Wednesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు  కార్తీక మాస కృష్ణ పక్ష: నవమి తిధి సౌమ్య వాసర: ఉత్తరఫల్గుని  నక్షత్రం ప్రీతి యోగ: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.


నవమి రాత్రి 03:03 వరకు 

ఉత్తరఫల్గుని  రా.తె 06:27 వరకు 

సూర్యోదయం : 06:37

సూర్యాస్తమయం : 05:37

వర్జ్యం : పగలు 11:40 నుండి 01:27 వరకు.

దుర్ముహూర్తం : పగలు 11:45 నుండి 12:29 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.


శుభోదయ:, నమస్కార:

 శుభోదయం🙏



కృతిపతి కాశీస్సులు!


            శా:  శ్రీవక్షోజ  కురంగనాభ  మెదపైఁ  జెన్నొంద ,విశ్వభరా


                   దేవిన్  దత్కమలా   సమీపమున  బ్రీతిన్  నిల్పినాడో యనం


                   గా ,వందారు  సనందనాది  నిజభక్తశ్రేణికిన్   దోచు   , రా


                  జీవాక్షుండుఁ   గృతార్ధుసేయు  శుభ దృష్టిన్  కృష్ణరాయాధిపున్. 


                   మనుచరిత్ర ప్రారంభ పద్యము-  అల్లసాని  పెద్దన  గారు!


                 అర్ధము:   శ్రీ-  లక్ష్మీదేవియొక్క; వక్షోజ  -స్తనముల యందలి;  కురంగ నాభము- కస్తూరి ; ఎదపై-  వక్షస్థలమందు;  చెన్నొందన్- ప్రకాశింపఁగా;  విశ్వంభరాదేవిన్ - భూదేవిని;  తత్- ఆ;  కమలాసమీపమున- లక్ష్మి సన్నిధానమునందు;  ప్రీతిన్- ప్రేమతో;

నిల్పినాడో  యనంగా- నిల్పెపెనాయని ;  వందారు- నమస్కరించు ;  సనందనాది- సనందనుడు మున్నగు; నిజభక్తశ్రేణికిన్- తన భక్త

సముదాయమునకు  తోచు- కనబడు;  రాజీవాక్షుండు- విష్ణువు;  శుభదృష్టన్- శుభములనొసగు చూపులతో; కృష్ణరాయాధిపున్-

శ్రీకృష్ణరాయ  సార్వభౌముని;  కృతార్ధు  సేయున్- కోరికలు దీర్చి గాపాడుగాక!


                   భావము: లక్ష్మీదేవి  వక్షోజములకు గల కస్తురి  విష్ణువక్షస్థలమునకు అంటగా  ,నమస్కరింప వచ్చిన  సనక సనందనాదిభక్తిలకు " శ్రీహరి  లక్ష్మిదేవితోబాటు  భూదేవిని గూడ తనహృదయమున  ధరించెనా? " యను భ్రమను కల్గించుచుండెను.

అట్టి శ్రీహరి కృష్ణరాయల కోరిక లీడేర్చి రక్షించుగాక.! యనిభావము.


              విశేషాంశములు: విష్ణువక్షాలయా"- అని కమలాదేవికి బిరుదు. శ్రీహరి వక్షస్థలమామెకు స్వంతము. అక్కడ మరెవ్వరికి తావులేదు. కానీ చూచు సనకాది భక్తులకు  భ్రమకలుగుచున్నది. యేమని?  లక్ష్మి ప్రక్కన  శ్రీదేవినిగూడ (శ్రీహరి) చేర్చెనేమోయని. సవతుల నొక్కచోటఁజేర్చుటా!అమ్మో!యెంతయాశ్చర్యము!దానికి కారణముగూడ కనిపించుచున్నది. లక్ష్మీదేవి తన స్తనమండలమున  కస్తూరీ ద్రవ్యము నలదుకొని  వచ్చినది. శ్రీహరి ప్రణయ పారవశ్యమున

కమలను కౌగిలింప  ఆకస్తురి యంతయు నతని  వక్షస్థలమున  కంటినది. కస్తురి  నల్లనిది. భూమియు నల్లనిదే  ఆకారణమున సనకాదుదులకు  అనుమానము  గలిగినది.ఆవిధముగా  యిరువురి  భార్యలను రంజింపజేయు సామర్ధ్యముగల హరి కృష్ణరాయల కాపాడుగాక !యనిపెద్దన యాశీర్వాదము..


                         దీని వెనుక  రాయల కథయు వ్యంగ్య రీతిని జోడించినాడు. రాయలకు  తిరుమలదేవి, చిన్నాదేవి యను నిరువురు

భార్యలు. నావిష్ణుః పృధివీపతిః - అన్నారుగనుక రాయలుగూడ విష్ణుతుల్యుడే! భార్యలును  శ్రీదేవి భూదేవులే.హరి భార్యలను ఏలినట్టు  గా నీవును దేవేరులను రంజింప జేయవలెననుట  యొకసందేశము. 


                   రాజ్యాధికారమునకు  మూలమైనవి భూమి ,ధనము , ఈరెంటిని  తనయధీనమున నుంచుకొన్నహరి ,ఆరెంటిని నీకొసంగి

రక్షించునుగాక! అనియాశీర్వాద ఫలితమును వెల్లడించుట. పర్యాయముగా ఆఇద్దరి ఇల్లాండ్ర మగడు ఈఇద్దరు ఇల్లాండ్ర మగనిని బ్రోచుగాత!

అని ఆశీస్సులు!!


                              మహా కవుల  కవితల లోని మతలబు  లిట్లుండును. 


                                              స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

 వ్యాస భారతంలో లేకపోయినా, ప్రచారంలో ఉండి చాలామంది నమ్ముతున్న మహాభారత విషయాలు.

(ఇవి Quora నుండి సేకరించబడినవి.  వీటి రచయిత: శ్రీ శివరామ ప్రసాద్ మాచవోలు యం.ఎ. తెలుగు 1972;  పి.హెచ్ డి 2000 శ్రీ వేంటేశ్వర యూనివర్సిటీ ; నివాసము నెల్లూరు.

తెలుగు లెక్చరర్ గా రిటైర్ అయి తెలుగు సాహిత్యం లోనే పరిచయం పెంచుకొంటూ ఉన్నారు. సంస్కృత ఆంధ్ర భారతాల మీద , వాల్మీకి రామాయణం మీద భక్తి తాత్పర్యాలు కలిగి కాళిదాసు శాకుంతలంపై విశేష కృషి చేశారు.

శ్రీ పుండ్ల రామకృష్ణయ్య (1860–1904 ) వేదం వారికి వ్రాసిన సాహిత్యలేఖలను ప్రచురించారు.)



వ్యాస భారతంలో లేకపోయినా సినిమాలు, సీరియళ్ళ వలనో, మరొక రకంగానో, పాత్రల ఔచిత్యాన్ని ఇష్టమొచ్చినట్టు దిగజార్చేసి, అవే నిజాలు అనుకునేలా చాలా విషయాలు ప్రచారంలో ఉన్నాయి. విన్నవి విన్నట్టు, చూసినవి చూసినట్టు నమ్మేస్తామే కానీ, మూల గ్రంథాలు చదవం. అలాంటి కల్పిత మహాభారత విషయాల జాబితా--


1. దానవీరశూరకర్ణ మొదలగు సినిమాలలో చూపించినట్టుగా ద్రౌపది కర్ణుడిని ఆరవ భర్తగా కోరుకుంది అనేది తప్పు. తన పరాభవానికి కారణమైన వాడిని, జారస్త్రీ అని తూలనాడిన వాడిని ఆవిడ ఎన్నటికీ వరించదు. కర్ణుడు అర్జునుడి చేతిలో మరణించాలని కోరుకుంది.


2. ద్రౌపది పుట్టడం ద్రుపదుడికి నచ్చలేదు, ఆవిడని దుఃఖాలనుభవించమని శపించాడు అనేది తప్పు. ద్రుపదుడికి ద్రౌపది అంటే ఎనలేని ప్రేమ, ఆమెని అర్జునుడికిచ్చి వివాహం చేయాలని ఆయన కోరిక.


3. ద్రౌపది స్వయంవరంలో ఆవిడ ఒక్క మాట కూడా అనదు. కర్ణుడిని సూత పుత్ర అని ఆవిడ సంబోధించలేదు. కర్ణుడు మత్స్య యంత్రాన్ని ఛేదించలేకపోయాడని భారతంలో స్పష్టంగా ఉంది.


4. కర్ణుడు పాండవుల వైపు యుద్ధం చేస్తే ద్రౌపదిని కర్ణుడికిచ్చి కట్టబెడతానని కృష్ణుడు అనలేదు.


5. ద్రౌపదీ దేవి మయసభలో దుర్యోధనుడిని చూసి నవ్వలేదు. అసలు ఆ సందర్భంలో ఆవిడక్కడ లేనే లేదు.


6. పాండవుల ఇతర భార్యలు ఇంద్రప్రస్థంలో ఉండరాదని ద్రౌపది షరతు విధించలేదు.


7. ద్రౌపదీ దేవి యుద్ధం అయ్యేంతవరకు జుట్టు విరబోసుకుని ఉండటం, దుశ్శాసనుడి రక్తంతో ఆమె కురులను తడపటమనేది వ్యాసభారతంలో లేదు.


8.  కృష్ణుడి వేలు తెగి రక్తం కారితే ద్రౌపది వస్త్రం చించి కట్టింది అన్న కథ వ్యాసభారతంలో లేదు.


9. ద్రౌపదికి కృష్ణుడికి మధ్య స్వచ్ఛమైన స్నేహం తప్ప ఇంక ఏ సంబంధం లేదు. కృష్ణుడితో విడదీయరాని అనుబంధం ఉన్న అర్జునుడి ద్వారానే (పెళ్ళైన తర్వాత) ఆమె కృష్ణుడి గురించి తెలుసుకున్నది.


10. సహదేవుడికి భవిష్యత్తు సంఘటనలు తెలుసు కానీ తన సోదరులకు చెప్పలేదని, అటువంటి శక్తులు పాండు రాజు మెదడో, చిటికిన వేలో తినటం వలన వచ్చాయన్న కథ కల్పితం. పాండు రాజు చనిపోయినప్పుడు, సహదేవుడు చంటి పిల్లాడు. సహదేవుడికి అటువంటి శక్తులు లేవు.


11. ఐదు గ్రామాలు అడగమని సహదేవుడు ధర్మరాజుకు సూచించలేదు. అది ధర్మజుని ఆలోచనే.


12  నకుల సహదేవులకు ఎటువంటి దివ్య శక్తులు లేవు, అశ్వినీ దేవతలలా వైద్యం తెలియవు.


13. ద్రోణాచార్యుడు కర్ణుడిని శిష్యునిగా చేర్చుకోవటానికి నిరాకరించాడన్నది తప్పు కథ. కర్ణుడు కృపుడు, ద్రోణుడు నుండి నేర్చుకుని తరువాత వారి ఆశ్రమం వదిలి బ్రహ్మాస్త్రం కోసం పరశురాముడిని ఆశ్రయించాడని భారతంలో స్పష్టంగా ఉంది. అంతే కాదు, ద్రోణుడికి గురుదక్షిణ ఇవ్వటం కోసం ద్రుపదుడి మీద సలిపిన పోరులో కర్ణుడు కూడా పాల్గొన్నాడు.


14. కర్ణుడికి, దుర్యోధనుడికి స్నేహం గురుకుల వాసం నుండే ఉంది. రంగభూమిలోనే వారిద్దరి స్నేహం ఏర్పడటం అన్నది కట్టు కథ.


15. గాంధారి వ్రత సమయంలో శరీరం బలం చేయటానికి దుర్యోధనుడిని నగ్నంగా రమ్మని అనలేదు.


16. శకుని కౌరవ వంశాన్ని నాశనం చేయాలని ఏనాడూ అనుకోలేదు.


17  ధృతరాష్ట్రుడితో గాంధారి వివాహాన్ని శకుని వ్యతిరేకించలేదు. తానే హస్తినాపురానికి వెళ్ళి గాంధారినిచ్చి పెళ్ళి చేసాడు.


18. సినిమాలలో, సీరియళ్ళలో చూపించినట్టు శకుని ఎప్పటికీ హస్తినాపురంలోనే ఉండిపోలేదు. ధృతరాష్ట్రునికి బహుమతులు ఇచ్చిన తరువాత తన గాంధార రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు.


19. భీష్మునితో శకునికి ఎటువంటి శత్రుత్వము లేదు. ఏనాడూ వారిద్దరు వాదించుకోలేదు.


20. కృష్ణుడు మరియు శకుని మధ్య ఇతిహాసంలో ఏ విధమైన సంభాషణ లేదు, ఆఖరికి శ్రీ కృష్ణుడు హస్తినాపురానికి రాయబారిగా వచ్చినప్పుడు కూడా లేదు.


21. కురుసభలో మాట్లాడటానికి శకుని ఎన్నడూ సాహసించలేదు. ఎప్పుడూ భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మాత్రమే మాట్లాడేవారు. అలా కురు సభలో ఇష్టానుసారంగా మాట్లాడింది కర్ణుడు ఒక్కడే. శకుని ధృతరాష్ట్ర, దుర్యోధనులు ముందు మాత్రమే మాట్లాడేవాడు.


22. పాండవులపై అన్ని కుట్రలలో శకుని భాగమే తప్ప, వాటి వెనుక సూత్రధారి శకుని కాదు.


23  భీముడికి విషం పెట్టి చంపటం, లాక్షా గృహ దహనం అనేవి దుర్యోధనుడి ఆలోచన, శకునిది కాదు. మేనల్లుడి పై మమకారంతో అందులో భాగం పంచుకున్నాడు శకుని.


24. దుర్యోధనుడు రాజసూయ యాగంలో పాండవుల వైభవాన్ని చూసి అసూయపడగా, శకుని అతనికి ఉన్నదానితో సంతృప్తి చెందమని సలహా ఇచ్చాడు.


25. దుర్యోధనుడు ఆ సలహాను అంగీకరించకపోగా, పాండవులతో యుద్ధం చేయాలనే కోరికను కూడా వ్యక్తం చేశాడు. అప్పుడు శకుని పాండవుల పరాక్రమాన్ని వివరించి, దుర్యోధనుడికి వాస్తవాలు చెప్పి కళ్ళు తెరిపించటానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు.


26. అల్లుడి మీద మమకారంతో, దుర్యోధనుడి మొండి పట్టుదల కారణంగా మాత్రమే, శకుని పాచికల ఆటలో పాండవుల రాజ్యాన్ని గెలుస్తానని అతనికి వాగ్దానం చేశాడు.


27  ద్రౌపదికి జరిగిన అవమానంలో శకుని ఎలాంటి పాత్ర పోషించలేదు. ద్రౌపది వస్త్రాపహరణంలో కీలక పాత్రలు కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు మాత్రమే.


28. ధర్మరాజుపై శకుని విజయంలో ఎలాంటి మాయాజాలం లేదు. జూదంలో శకుని నేర్పరి, అంతే.


29. శకుని ఉపయోగించిన పాచికలు అతని తండ్రి బూడిద లేదా ఎముకలతో తయారు చేయబడలేదు. ఇది ఎలాంటి ప్రామాణికమైన ఆధారం లేని కల్పిత కథ.


30. దుర్యోధనుడి భార్య భానుమతితో కర్ణుడు ఆట ఆడాడని, ఆ ఆటలో తాళం గుత్తి తీసాడన్న కథ నిజం కాదు. అసలు ఆమె పేరు భానుమతి అని ఎక్కడా చెప్పబడలేదు.


31  దుర్యోధనుడికి ఇద్దరు భార్యలు, ఒకరు కాశీరాజు కుమార్తె, మరోకరు కళింగ రాజు కుమార్తె. వారిద్దరి పేర్లు భారతంలో ఇవ్వబడలేదు.


32. అర్జునుడికి చిత్రాంగదకి మధ్య ప్రేమకథ నడవలేదు. ఆమెనిచ్చి వివాహం చేయమని అర్జునుడు నేరుగా ఆమె తండ్రిని అడిగాడు.


33. ఖాండవ వన దహనం సమయంలో కృష్ణార్జునులతో పాటుగా సత్యభామ, ద్రౌపది, సుభద్ర కూడా అక్కడే ఉన్నారు.


34. అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉండగా పద్మవ్యూహం నేర్చుకున్నాడని భారతంలో లేదు.


35. పద్మవ్యూహ ప్రవేశం అభిమన్యుడికి (వయస్సొచ్చాక) అర్జునుడే నేర్పాడు, శ్రీకృష్ణుడు కాదు.


36. బార్బరీకుడు అనేవాడు అసలు లేనే లేడు.


37. అభిమన్యుడు పద్మవ్యూహం నుంచి తప్పించుకుని బయటకు వచ్చివుంటే అతడిని సంహరించడానికి తాను మరొక అవతారం ఎత్తవలసి వస్తుందని కృష్ణుడు అన్నట్టు ఎక్కడా లేదు.


38. కృష్ణుడు మహాభారతం జరిగిన 18 రోజులూ కేవలం వేరుసెనగ గుళ్ళే తిన్నాడని భారతంలో లేదు.


39. కురుక్షేత్ర యుద్ధం ముహూర్త సమయాన్ని నిర్దేశించింది శ్రీకృష్ణుడు. ముహూర్తం నిర్ణయించమని దుర్యోధనుడు సహదేవుడిని అడగలేదు, సహదేవుడు నిర్ణయించలేదు.


40. అభిమన్యుడు పూర్వ జన్మలో రాక్షసుడనేది తప్పు. ఆయన చంద్రుని కుమారుడి అంశతో జన్మించాడని స్పష్టంగా చెప్పబడింది.


41. అభిమన్యుడికి యుద్ధవిద్యనంతటినీ నేర్పింది అర్జునుడే, శ్రీకృష్ణుడు కాదు.


42. శిశుపాలుడి నుండి ద్రౌపదిని కర్ణుడు కాపాడినట్టు భారతంలో లేదు. అది నిజం కాదు.


43. ద్రౌపది వస్త్రాలు తీయమని దుశ్శాసనుడిని ప్రేరేపించింది కర్ణుడే.


44. కర్ణుడు చేతిలో ఏ ఆయుధం లేకపోయినా అర్జునుడు చంపాడన్నది తప్పు. ఆఖరి క్షణం వరకు కర్ణుడు ఆయుధాలతో పోరాడుతూనే ఉన్నాడు.


45. కర్ణుడు ఆఖరి నిమిషంలో బంగారు పన్ను దానం చేసాడని వ్యాస భారతంలో లేదు.


46. కర్ణుడు తనదేం తప్పని శ్రీకృష్ణుడిని అడగలేదు. శ్రీకృష్ణుడు యుద్ధ భూమిలో కర్ణుడు చేసిన తప్పిదాలన్నీ గుర్తుచేస్తే కర్ణుడు తన తప్పులకు మౌనంగా తలదించుకున్నాడు అని భారతంలో ఉంది.


47. కర్ణుడి చేతిలో అర్జునుడు ఒక్కసారైనా ఓడిపోయినట్టు భారతంలో లేదు.


48. కర్ణుడికి పరశురాముని శాపం కేవలం బ్రహ్మాస్త్రం గుర్తుకురాదని మాత్రమే. దాని ప్రకారమే అది అతనికి గుర్తురాలేదు. అయితే, అతను మళ్ళీ గుర్తు తెచ్చుకుని బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి మీదికి ప్రయోగించగా, అర్జునుడు తిరిగి దానిని శమింపజేసాడని భారతంలో ఉంది.


49. యుద్ధంలో శల్యుడితో వాదులాడుతున్నప్పుడే కర్ణుడు తనకన్నా అర్జునుడి ఆధిపత్యాన్ని, ఉత్తర గోగ్రహణంలో తన ఓటమిని అంగీకరిస్తాడు.


50. అర్జునుడు పాశుపతాన్ని జయద్రథుడి మీదనే కాదు, అసలు ఎవరిమీద కూడా వాడలేదు.


51. శిఖండి చాటునుండి అర్జునుడు భీష్ముడిపై బాణం వేసాడనేది కూడా తప్పు. అసలు అర్జునుడు, శిఖండి ఒక రథంలో నిలబడినట్టు లేనే లేదు.


52. శిఖండిని చూసి భీష్ముడు విల్లంబులు వదిలి పెట్టాడన్నది కూడా నిజం కాదు. శిఖండితో యుద్ధం మాత్రమే చేయకుండా అర్జునుడితో యుద్ధం చేసాడు.


53  శిఖండిని పట్టించుకోకుండా అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు శిఖండి వేసిన బాణాలు భీష్ముడికి ఏ మాత్రం ఆనలేదు.


54. భీష్ముడు అస్త్ర సన్యాసం చేయలేదు. ఆఖరి క్షణం వరకు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. దుర్యోధనుడికి ఇచ్చిన మాట ప్రకారం పదవరోజు కూడా పదివేల మంది సైన్యాన్ని భీష్ముడు చంపాడు.


55. కర్ణుడు అర్జునుడి రథాన్ని ఎత్తాడన్నది ఎక్కడా లేదు.


56. హనుమంతుడు, అర్జునుడు కలిసినట్టు భారతంలో లేదు.


57. తనకి తెలిస్తే, ఆహ్వానం లేకపోయినా వచ్చి జూదం ఆడటం వల్ల వచ్చే అనర్థాలు, మనిషి ఎలా ఒక్క పూటలో తన సర్వస్వం కోల్పోగలడో చెప్పి ఆట ఆడనించేవాడు కాదని, అందుకోసం ధృతరాష్ట్రుడిని ఒప్పించటానికి భీష్మ, ద్రోణ, కృపాదుల సహాయం తీసుకునేవాడినని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో స్పష్టంగా వనపర్వంలో చెప్పాడు. అప్పటికి ఒప్పుకోకపోతే, అవసరమైతే బలప్రయోగం చేసైనా ఆ ఆటని అడ్డుకునేవాడినని శ్రీకృష్ణుడు అన్నాడు. ఆయనే అక్కడ ఉండుంటే, ఆ ఆట ఆడనిచ్చేవాడు కాదు.


(వారి) సవరణలు:


కర్ణుడు బంగారు పన్ను దానము చేసే కథ భాసకవి ప్రణీతమైన కర్ణభారము అనే నాటకం లోనిది.


భీముడు ద్రౌపది కురులను దుశ్శాసనుడి రక్తంతో తడపటమనే కథ భట్టనారాయణ ప్రణీతమైన వేణీసంహారము అనే సంస్కృత నాటకం లోనిది.

                             *****

పులిచర్మం.. స్వామివారి లీల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*పులిచర్మం.. స్వామివారి లీల..రెండవభాగం..*


*(నలభై తొమ్మిదవ రోజు)*


కందుకూరు నుంచి తన బాబాయి గారింటినుంచి..శ్రీధరరావు గారు వారిస్తున్నా వినకుండా  ప్రభావతి గారు పులిచర్మాన్ని తీసుకొని మొగలిచెర్ల చేరారు..అప్పటికీ ఆవిడ బాబాయి గారు పెద్దరికంగా.."అమ్మాయీ..స్వామివారి తపస్సుకోసం అంటున్నావు కనుక ఈ పులిచర్మాన్ని తీసుకుని వెళ్లి..స్వామివారు పదిరోజులో.. పక్షం రోజులో దీనిమీద కూర్చుని తపస్సు చేసుకోమని..ఆతరువాత మళ్లీ మాకు తీసుకొచ్చి ఇచ్చేయి..శ్రీ స్వామివారు తన తపోసాధనకు ఈ పులిచర్మాన్ని వాడుకున్నారనే తృప్తి మాకూ ఉంటుంది.." అన్నారుకూడా..ఇవేవీ ప్రభావతి గారి మనసుకు పట్టలేదు..


మొగలిచెర్ల చేరిన ప్రక్కరోజు ఉదయాన్నే..గూడు బండి లో పులిచర్మాన్ని పెట్టుకొని ప్రభావతి గారు, శ్రీధరరావు గార్లు శ్రీ స్వామివారి ఆశ్రమానికి చేరుకున్నారు..వీళ్ళకోసమే ఎదురు చూస్తున్నట్లుగా శ్రీ స్వామివారు ఆశ్రమ వరండాలో నిలుచుని వున్నారు..ప్రభావతి గారు పులిచర్మాన్ని చేతులతో పట్టుకుని గబ గబా శ్రీ స్వామివారి వద్దకు వచ్చి..

"నాయనా..ఇదిగో పులిచర్మం..మొత్తానికి పట్టుకొచ్చాను.. ఇక ఆ ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో నా కనవసరం..మీకు పులిచర్మం వచ్చేసింది.." అన్నారు..శ్రీధరరావు గారు మాత్రం..ప్రభావతి గారు తొందరపడ్డారనీ..పాపం వాళ్ళెంత నొచ్చుకున్నారో అని శ్రీ స్వామివారితో చెప్పేసారు..


ఇద్దరు చెప్పింది విన్న శ్రీ స్వామివారు..పెద్దగా నవ్వారు..కొద్దిసేపు నవ్వుతూనే వున్నారు..నవ్వడం ఆపి.."ఎంత వెఱ్ఱి తల్లివమ్మా నువ్వు!..పులిచర్మం మహాత్యం గురించి మాటవరసకు మీతో చెప్పాను..మీరు ఇంత ప్రయాస పడతారని అనుకోలేదు..నువ్వెంత బాధపడ్డావో.. పాపం మీ బాబాయి గారి ఇంట్లో వాళ్ళను యెంత బాధపెట్టావో..ఎప్పుడూ ఇటువంటి యాతన పడవద్దు..నాకంతగా కావాలని కోరుకుంటే..నా వద్దకు  రాదా తల్లీ?..ఈ పాటికి వచ్చేస్తూ వుండాలి..తీసుకెళ్లు తల్లీ..దీనిని జాగ్రత్తగా తీసుకెళ్లి..వాళ్ళది వాళ్లకు ఇచ్చేసెయ్యి..మనస్ఫూర్తిగా ఇచ్చిన వస్తువు తీసుకోండి కానీ..ఇలా బలవంతపెట్టి ఎప్పుడూ తీసుకొనిరాకు..నాకోసం శ్రమ పడవద్దు..ఇలా ఇతరుల నుంచి లాక్కోవద్దు..వెనక్కు ఇచ్చేయమ్మా.." అన్నారు..


ప్రభావతి గారు తీవ్రంగా నిరాశపడ్డారు.."అది కాదు నాయనా..ఇంతదూరం తీసుకొచ్చాను.. పోనీ ఓ వారమో.. పదిరోజులో మీరు దీనిమీద తపస్సు కొనసాగించండి..వాళ్లకు తిరిగి ఇచ్చేద్దాము..వాళ్లకూ పుణ్యం ఉంటుంది..ఇంత ఆర్భాటంగా తెచ్చిన నాకూ తృప్తి ఉంటుంది.." అన్నారు..


"వద్దమ్మా..ఒద్దు!..ఇది పట్టుకెళ్లి..వాళ్లకు ఇచ్చేసేయండి.." అన్నారు శ్రీ స్వామివారు దృఢంగా..


ప్రభావతి గారికి కన్నీళ్లు వచ్చాయి..తానింత శ్రమపడీ.. వాళ్ళను శ్రమపెట్టి..తీసుకొని వస్తే..ఇలా జరిగింది..ఇక చేసేదేమీలేదు..శ్రీ స్వామివారు ససేమిరా ఒప్పుకోలేదు..పైగా.."వీలయినంత త్వరగా వాళ్లకు చేర్చండి..వాళ్ళూ బాధపడుతుంటారు.." అన్నారు..అతి కష్టంమీద తన వేదనను లోపలే అణచుకున్నారు.."సరే నాయనా..మీ ఇష్టం.." అన్నారు దుఃఖం తో..


"అమ్మా!..నువ్వు బాధపడకు!..చెప్పాను కదా..నాకు కావాల్సింది నాకు చేరుతుంది..నువ్వేమీ దీనిగురించి ఎక్కువగా ఆలోచించకు..అన్నీ సర్దుకుంటాయి..పట్టుకు పోయి వాళ్ళది వాళ్లకు ఇచ్చేసెయ్యి.." అన్నారు..


శ్రీధరరావు గారు ఆ పులిచర్మాన్ని జాగ్రత్తగా చుట్ట చుట్టి తమ గూడు బండిలో పెట్టేసారు..దంపతులిద్దరూ శ్రీ స్వామివారికి వెళ్ళొస్తామని చెప్పి..మొగలిచెర్ల కు బయలుదేరారు..

తమ ఇంటికి చేరుకునేసరికి..వాళ్లిద్దరూ ఆశ్చర్యపోయే ఒక సంఘటన జరిగింది..ఇంటి వరండాలో శ్రీ చెక్కా కేశవులు గారబ్బాయి కృష్ణ ఒక పెద్ద చెక్క పెట్టెతో సహా వీళ్లద్దరి కోసం ఎదురుచూస్తూ కూర్చొని వున్నాడు..


శ్రీ స్వామివారి లీల ఏమిటో ఆ దంపతులకు కొద్దిసేపటి లోనే తెలిసి వచ్చింది..


పులిచర్మం..శ్రీ స్వామివారి లీల..మూడోభాగం..రేపు..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

భక్తి మకరందం

 భక్తి మకరందం


(శృ౦గేరి శారదా పీఠం 35వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్ధ మహాస్వామి వారి బోధనలు)


పరమాత్మ దయ అందరిమీద ప్రసరిస్తుంది. విభీషణుడిని తమతో చేర్చుకోవద్దని సలహా ఇచ్చినప్పుడు రాముడు సుగ్రీవునికి “నన్ను శరణాగతి చేసినవాడిని ఎవరికైనా నిర్భయత్వం పరిపూర్ణ రక్షణ ప్రసాదిస్తానని” చెప్పలేదా? పరిపూర్ణ శరణాగతుడికి దేనిగురించి దిగులు చెందవలసిన అవసరం లేదు ఎందుకంటె వాని బాగోగులు స్వయంగా స్వామి చూసుకుంటాడు. నన్నే నిరతం నమ్ముకున్నవాడిని నేను వెన్నంటి వుంటాను అని ఉద్దవునికి కృష్ణుడు చెప్పాడు కదా.


దేవుడిని నమ్ముకున్నవాడికి ఏమాత్రం కష్టాలు వుండవనడం కూడా అసమంజసమే. ఆయన కేవలం దయాగుణ పూర్ణుడే కాదు ధర్మ చక్రవర్తి. అతడి పూర్వజన్మలలో ఘోరమైన పాతకాలు చేసుంటే అతడికి ఈ జన్మలో నామమాత్రం శిక్ష లేకుండా వదలడు. ఆయన కర్మ సాక్షి. ఒక న్యాయమూర్తి ఎందరినో పొట్టన పెట్టుకున్న ఒక కరుడు గట్టిన దోషిని శిక్షించకుండా వదిలేస్తే అతడు సంఘానికి అన్యాయం చేసినవాడు అవుతాడు. కానీ అతడు చేసిన పుణ్యాలను, అతడు చేసిన పరిస్థుతులను, దాని తర్వాత అతడు పొందిన క్షోభను పరిగణలోకి తీసుకుని శిక్షను తగ్గించవచ్చును. అలాగే భగవంతుడు కూడా అతడి నిబద్ధతను పరిశీలించి పెద్ద శిక్షను చిన్నగా చేసి అతడిని కరుణించవచ్చును. ఒక తల్లి తన బిడ్డ వక్రమార్గంలో వెడుతుంటే దండించదా, అలా అని అతడి మీద ప్రేమ లేదంటారా?


భగవంతుడు సర్వవ్యాపి, సర్వసాక్షి, దయాసముద్రుడు. కావున దేవునికి తెలియనిది ఏమి వుండదు. మన అవసరాలన్నీ ఆయనకు తెలుసు. నాకిది కావాలి అది కావాలి అని ఆయన్ను విసిగించకూడదు. మనల్ని పుట్టించినవాడికి తెలియదా మనకు ఏమి కావాలో? అతగాడికి భక్తి లోపం ఉన్నట్టయితే ఆయన మీద నమ్మకం తక్కువగా ఉన్నట్టయితే అపుడు తన కోర్కెల చిట్టాను ప్రస్తావిస్తూ కోరికలు కోరుకుంటాడు. వారు ఆశించినది వచినప్పుడు మోదం, రానప్పుడు ఖేదం పొందుతూవుంటారు. కానీ భగవంతుడు తనకు ఏమిచ్చినా అది ఆయన అనుగ్రహం అని స్వీకరించినవాడి బాగోగులు దగ్గరుండి చూసుకుంటాడు. బాధ బెంగ కేవలం మనం అనుభవిస్తున్న ఖేదానికి సహాయకారులే కానీ వాటిని తగ్గించే లక్షణాలు కాదు. కావున కేవలం ఆయన మీద పరిపూర్ణ విశ్వాసంతో ఆయన మనకు ఏమి చేసినా ఆయన దయ అని సరిపెట్టుకుని నిత్యతృప్తులుగా వుండి ఆయనను సేవించడo మనకు అన్ని విధాల శ్రేయోదాయకం.

 *కార్తిక పురాణము - 24*

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

*కార్తిక పురాణము - ఇరవై నాలుగవ అధ్యాయము*


అత్రి ఇట్లు పల్కెను. అగస్త్య మునీంద్రా! నీకు కార్తీకవ్రతమందును, హరిభక్తి యందును ఆసక్తి ఉన్నది. కాన కార్తీకకమహాత్మ్యమును చెప్పెద వినుము. సావధానముగా విన్న ఎడల పాపములు నశించును.


కార్తీకమాసమందు శుక్ల ద్వాదశి హరి బోధిని, ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలమును ఇచ్చును.అన్ని ద్వాదశులలో అధిక ఫలము ఇచ్చునది.సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరిబోధిని యగు ద్వాదశి ఇచ్చును.ఇది కాక ఈ ద్వాదశి హరియందును, ఏకాదశియందును, భక్తినిచ్చును. కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది.ద్వాదశి సూర్య చంద్ర గ్రహణముల కంటే అధిక పుణ్యప్రదము. ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువది.సమస్త పుణ్యమును ఇచ్చునది. ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రెట్లగును.ద్వాదశి పుణ్యదినము గనుక కొంచెముగా ఉన్నను పారణకు ఉపయోగించవలెను.కానీ ద్వాదశిని విడిచి పారణ చేయకూడదు. ఇతర నియమములన్నింటిని విడిచి ద్వాదశి స్వల్ప కాలమందు పారణ చేయవలెను.కానీ పుణ్యమును కోరువారు ద్వాదశిని విడువ కూడదు.

ఏకాదశియందు ఉపవాస మాచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించక భోజనము చేయవలెను.


ఉపవాసముండి మరునాడు ద్వాదశి భోజనము చేయుట పారణ అనబడును.ఈ విషయము తెలిసియె పూర్వమందు పరమ భాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని విడువలేదు.ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నం భుజించుట పారణ అనబడును.అంతలో దుర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమను వంక చేత భోజనమును యాచించెను. అంబరీషుడు సరేనని ద్వాదశి పారణకు దుర్వాసుని రమ్మనెను.దుర్వాసుడు పారణకు అంగీకరించి అనుష్ఠానము కొరకు వెళ్ళెను. ఆనాడు ద్వాదశి అతిస్వల్పముగా ఉండెను.దుర్వాసుడు రాకపోయెను. ద్వాదశి పోవుచున్నది.ఇట్టి సంకటము సంభవించినది.అపుడు హరిభక్తుడైన అంబరీషుడు విచార పడసాగెను.ఈ దుర్వాసుడు ముని శ్రేష్ఠుడు.పారణ కొరకు అంగీకరింపబడినాడు. ఇంతవరకు రాలేదు. ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మమగును.


బ్రాహ్మణుని కంటె ముందు భుజించిన యెడల కోపించి అగ్నితో సమానుడై ముని శాపమిచ్చును గనుక ఇప్పుడు ఏది కుశలము? ఉపవాసమందెట్లు ఏకాదశిని విడువరాదో అట్లే పారణయందును ద్వాదశిని విడువరాదు.ద్వాదశిని విడిచిన యెడల హరిభక్తిని విడిచిన వాడనగుదును. ఏకాదశినాడు ఉపవాసము చేయక ఏ దోషమునకు పాత్రుడనగుదునో ద్వాదశిని విడిచినయెడల అట్టి దోషమే సంభవించును.ఇదిగాక ద్వాదశీ పారణాతిక్రమణము పన్నెండు ఉపవాసముల ఫలమును పౌగొట్టును.కాన ద్వాదశిని విద్వాంసుడు విడువకూడదు. హరివాసరము పుణ్యదినము గాన విద్వాంసుడు విడువరాదు. దానిని విడిచెనేని పురుషునకు పుణ్యసంచయము చేకూరదు.అనేక జన్మములందు చేసిన పుణ్యము హరివాసరమును విడిచిన యెడల నశించును.అందువలన గలిగెడి పాతకమునకు నివృత్తి లేదు. ఒక్క ద్వాదశి అయినను విడువకూడదు.దీనికి ప్రతీకారము లేదు. అనేక వాక్యాలతో పనియేమున్నది.ఇది నిజము.


హరిభక్తిని విడుచుట యందు నాకు మహా భయమున్నది.కాబట్టి యట్టి సంకటమందు హరిభక్తిని విడుచుట కంటే పారణమే ముఖ్యము.బ్రాహ్మణ శాపమువలన నాకేమియు భయములేదు. శాపము వలన కల్పాంతము దుఃఖము రానిమ్ము. ద్వాదశిని విడిచినచో హరివాసరము (ఏకాదశులు) 10 విడువబడినవియగును.హరివాసరమును విడిచిన యెడల హరిభక్తి లోపించును. గనుక హరిభక్తిని విడుచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెము మంచిది. కాబట్టి హరిభాక్తికి లోపము తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసి ద్వాదశి హరివాసరమును పోనివ్వక తద్ద్వారా హరిభక్తిని నిలుపుకొనుట మంచిది. అట్లయిన యెడల హరియే కష్టాలు రాకుండా కాపాడును. అంబరీషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకొని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఓ బ్రాహ్మణోత్తములారా! దుర్వాసుడు భోజమునకు వచ్చెదననెను. నేనట్లంగీకరించితిని.ఇప్పటికినీ రాలేదు.ద్వాదశి పోవుచున్నది.గనుక బ్రాహ్మణుని కంటే పూర్వము భోజనము చేసినందున భ్రాహ్మణాతిక్రమణము, ద్వాదాశిలో పారణము చేయకపోతే ద్వాదశ్యతిక్రమణము గలుగును.గనుక మీరు బలాబలమును విచారించి రెండింట్లో ఏది యుక్తమో చెప్పుడు అని అడిగెను.


ఆమాట విని ఆ బ్రాహ్మణులు ధర్మ బుద్ధితో ద్వాదశి యొక్కయు అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్కయు గౌరవ లాఘవములను విచారించి సమస్త భూతములయందును అగ్ని రూపుడైన ఈశ్వరుడే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూపమైన అన్నమును భుజించుచున్నాడు. ప్రాణ వాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలితమగుచుండగా జంతువులకు అన్నమును గోరెడి ఆకలి కలుగుచుండును. ప్రాణ వాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపమును చేయుటకే క్షుత్పిపాసలనబడును.కాబట్టి ప్రాణ సహితముగా అగ్ని సర్వ సుర పూజితుడగుచున్నాడు. సర్వ భూతములయందున్న అగ్నిని నిత్యమూ పూజించవలెను. తన ఇంటికి వచ్చిన శూద్రుని గానీ, చండాలుని గానీ విడిచి భుజించ రాదు. సాక్షాత్ ప్రథమ వర్ణమైన బ్రాహ్మణుని విడిచి భుజించరాదని చెప్పవలసినది ఏమున్నది? గృహస్థుడు స్వయముగా అతిథిని పిలిచి అతిథికంటే ముందుగా తాను భుజించిన యెడల బ్రాహ్మణావమానమగును. బ్రాహ్మణావమానము చేత ఆయువు, ఐశ్వర్యము, కీర్తి, ధర్మము, ఇవన్నియూ నశించును. ఇది ఏమి, అది ఏమి మనస్సులో ఉండే కోరికై అనగా సంకల్పితమంతయూ నశించును.

బ్రాహ్మణులందరూ స్వర్గమందుండెడి దేవతలే అని చెప్పబడుడురు. దేవతలను తిరస్కరించుట చేత అంతయూ నశించును. జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు. ఈ దుర్వాసుడు తపోవంతుడు. ఇతని విషయమందు చెప్పునదేమున్నది? ఓ రాజా! ఈ బ్రాహ్మణుడు కోపము చేయక పోయిననూ బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు.ఈ బ్రాహ్మణునకును ద్వాదశి పారణకు వచ్చెదనని చెప్పి సమయానికి రాకుండుట అన్యాయమై ఉన్నది. ద్వాదశీ పారణను విడిచి పెట్టిన ఏకాదశ్యుపవాసమునకు భంగము వచ్చును. ఏకాదశి త్యాగమునకు ప్రాయశ్చిత్తము లేదు.బ్రాహ్మణాజ్ఞకు ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి ఈ రెండునూ సమానములుగా నున్నవి.ఇందు గురుత్వము, లఘుత్వము మాకు కనిపించుట లేదు. ద్వాదశి కాలమందు పారణ చేయని యెడల హరి భక్తి లోపించును. పారణ చేసిన దుర్వాసుడు శపించును.ఎట్లైనను అనర్థము రాక తప్పదు.అదియు కొద్దిది కాదు.గొప్ప కీడు కలుగును.బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యదార్థమును ఆలోచించి రాజుతో ఇట్లనిరి.


ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తిక మహాత్మ్యే చతుర్వింశాధ్యాయ సమాప్తః.

 🕉️🪔  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔


*శ్లో* 𝕝𝕝 

*సంసారయోగి సకలేప్సిత నిత్యకర్మ*

*సంప్రాప్యదు:ఖ సకలేంద్రియ మృత్యునాశ* 

*సంకల్ప సింధుతనయాకుచకుంకుమాంక*

*లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్* ॥


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం - 13_* _


*తా*: ఓ దేవా! లేనిపోని కోరికలకు సంసారమే కారణము. ఆకోరికలు నేరవేరుటకై నిత్యమూ ఏవో చేయవలసి వచ్చుచున్నది. అందువలన నీవు సంకల్పించినచో అవి అన్నియు నశించును. లక్ష్మీ దేవి యొక్క కుచకుంకుమచే చిహ్నితమగు వక్ష

స్థలముకల నృసింహదేవా! నా సంసార బాధలను పోగొట్టి నన్ను రక్షింపుము. *లక్ష్మీదేవితో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము*.

 ॐశుభోదయం, పంచాంగం ॐ  

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

   *_డిసెంబరు 6, 2023_* 

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం**శరదృతువు*

*కార్తీక మాసం**కృష్ణ పక్షం*

తిథి: *నవమి* రా12.43

వారం: *సౌమ్యవాసరే*

(బుధవారం)

నక్షత్రం: *ఉత్తర* తె5.04

యోగం: *ప్రీతి* రా11.00

కరణం: *తైతుల* మ1.40

*గరజి* రా12.43

వర్జ్యం: *ఉ10.31-12.17*

దుర్ముహూర్తము: *ఉ11.28-12.12*

అమృతకాలం: *రా9.07-10.53*

రాహుకాలం: *మ12.00-1.30*

యమగండం: *ఉ7.30-9.00*

సూర్యరాశి: *వృశ్చికం*

చంద్రరాశి: *సింహం*

సూర్యోదయం: *6.20*

సూర్యాస్తమయం: *5.21*

   లోకాః సమస్తాః*

 *సుఖినోభవంతు*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *98వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*శుక్రగ్రహ చరిత్ర - 10*


శుక్రుడు కచుడికి ఆశ్రమ గోవుల ఆలనా పాలనా అప్పగించాడు. అనధ్యయన సమయంలో ఆవులను అరణ్యానికి తోలుకు వెళ్ళి మేపడం , పూలూ , పళ్ళూ , సమిధలూ , దర్భలూ తీసుకురావడం కచుడికి నిత్య కృత్యమైపోయింది.


ఏ పని అయినా సరే , అది ఎంతటి పని అయినా సరే , గురువు కాలితో చెప్తే , చేత్తో చేస్తూ ఆయన వాత్సల్యాన్ని అచిరకాలంలోనే సొంతం చేసుకున్నాడు కచుడు. వినయంతో , విధేయతతో , సంయమనంతో - త్రికరణశుద్ధిగా శుశ్రూష చేస్తున్న కచుడికి తన హృదయంలో ప్రత్యేక స్థానం యిచ్చాడు శుక్రుడు.


అనునిత్యమూ మధురమైన ఫలాలూ , మనోహర సుగంధాలు వెదజల్లే పువ్వులూ తెస్తూ దేవయానికి అత్యంత సన్నిహితుడయ్యాడు కచుడు. ఆశ్రమ కార్యకలాపాలలో , గోశాలను తీర్చిద్దిడంలో దేవయానికి సహాయం చేస్తూ మృదుమధురంగా ఆమెతో సంభాషిస్తూ ఆమె అభిమానాన్నీ చూరగొన్నాడు.


ఆశ్రమానికి మొట్టమొదటిసారి వచ్చిన క్షణాలలోనే , కచుడి పట్ల ఆకర్షితురాలైన దేవయాని , అతడి సాన్నిహిత్యాన్నీ , సంభాషణలనూ తనలో అంకురించిన ప్రేమకు ప్రోత్సాహక లక్షణాలుగా అర్థం చేసుకుంది. అచిరకాలంలోనే ఆమె కచుడిని ప్రాణప్రదంగా ప్రేమించసాగింది. తండ్రి శుక్రుడు కచుడికి తన హృదయంలో స్థానం కల్పిస్తే , దేవయాని కచుడికి తన హృదయాన్నే యిచ్చివేసింది !


కచుడి పట్ల గురుదేవుల వాత్సల్యమూ , గురుపుత్రి ప్రేమా పెరుగుతున్న విధంగా , వాటితోబాటే - కచుడిపట్ల అసుర శిష్యులతో ద్వేషమూ పెరగ సాగింది ; నీడలాగా ! కచుడు గురువు గారికి ప్రియ శిష్యుడు కావడం ; గురువుగారు అతన్ని అమిత వాత్సల్యంతో చూడడం వారికి నచ్చలేదు.


*"కచుడు మన శత్రువుల గురువు పుత్రుడు. ఆగర్భ విరోధాన్ని విస్మరించి మన గురువుగారు ఆ మోసగాణ్ని మనకన్నా మిన్నగా చూసుకుంటున్నారు. ఈ దారుణాన్ని సాగనివ్వకూడదు"* అన్నాడు వయసులో పెద్దవాడైన అసుర శిష్యుడు.


*"ఏం చేద్దాం ?”* ఇతర శిష్యులు అడిగారు.


*“ఈ రోజు ఆ కచుడు గోవులతో అరణ్యంలోకి వెళ్ళాక , చాటుగా వెళ్ళి , చంపేద్దాం !”*


*"ఔనౌను ! ఈ సమస్యకు అదొక్కటే పరిష్కారం !"* ఇతర అసుర శిష్యులు ఉత్సాహంగా అన్నారు.


అనుకున్నట్టుగానే ఆ రాక్షసులు - హోమధేనువులను కాస్తున్న కచుణ్ణి ఒక చెట్టు బోదెకు బంధించి , వధించి వెళ్ళిపోయారు !


చీకటి పడుతోంది. అరణ్యానికి కచుడితోపాటు వెళ్ళిన ధేనువులు ఆశ్రమానికి తిరిగి చేరాయి. అయినా , కచుడు రాలేదు. కచుడికోసం ఆశ్రమ ప్రాంగణంలో ఆత్రుతగా నిరీక్షిస్తున్న దేవయాని కచుడు ఇంకా రాకపోయే సరికి భయపడి పోయింది. అరణ్య మధ్యంలో కచుడికి ఏదైనా ఆపద సంభవించిందా ? క్రూరమృగాల వల్లగాని , విష సర్పాల వల్ల గానీ , నిశాచరుల వల్లగానీ అతడికి ప్రమాదం జరిగిందా ? ఆందోళన కలిగించే ఆలోచనలతో దేవయాని హృదయం తల్లడిల్లి పోయింది.


ఆమె తండ్రి వద్దకు పరుగు పెట్టింది. *“నాన్నా... ధేనువులన్నీ తోడు లేకుండా అరణ్యం నుండి తిరిగి వచ్చాయి. సూర్యాస్తమయమై పోయింది. గాడాంధకారం అలముకుంది. కచుడు రాలేదు ! ఏదైనా ఆపద పాలయ్యాడేమో , నాన్నా ! నాకు భయంగా వుంది !"* అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ.


శుక్రుడు కూతురివైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. *"ఏడుస్తున్నావా , దేవయానీ !”*


*"అవున్నాన్నా ! కచుడు నా ఆరోప్రాణం నాన్నా ! అతడికి ఏమైందో చెప్పు నాన్నా !”* శుక్రుడు ఏకాగ్రతతో , అర్ధనిమీలిత నేత్రాలతో దృష్టిని జ్ఞానోన్ముఖం చేశాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి , కూతురి ముఖంలోకి చూశాడు.


*“కచుడు మరణించాడు... అరణ్యంలో ఎవరో అతన్ని చెట్టుకు కట్టి , వధించారు...”* 


*"నాన్నా !"* దేవయాని బావురుమంది.


*"భయపడకమ్మా ! కచుడు బ్రతుకుతాడు ! మృతసంజీవని ఉందిగా తల్లీ !"* శుక్రుడు వోదార్పుగా అన్నాడు. *"నువ్వు వెళ్ళి ఆ కన్నీటిని కడిగి , ముఖాన్ని ప్రసన్నం చేసుకో !"*


దేవయాని నవ్వు ముఖంతో చూసి , ఉత్సాహంగా ఆశ్రమం వైపు వెళ్ళింది. శుక్రుడు మృతసంజీవని విద్యను ఆవాహన చేశాడు. 'మృతసంజీవనీ విద్యాదేవత' ప్రసన్నమైన , ప్రశాంతమైన ఆకారంతో ఆయన ముందు సాక్షాత్కరించింది.


*"సంజీవనీ ! కచుడు నా ప్రియశిష్యుడు. అతని శవం అరణ్యంలో వుంది. అతనికి ప్రాణం పోసి తీసుకురా !"* శుక్రుడు ఆజ్ఞాపించాడు.


ఆ వెంటనే మృతసంజీవనీ విద్యాదేవత వాయువేగంతో అరణ్యం వైపు వెళ్ళింది. పునర్జీవితుడిని చేసిన కచుడిని వెంట బెట్టుకుని వచ్చింది. అతన్ని శుక్రుడి ముందు నిలిపి అదృశ్యమైంది.


దేవయాని ఉత్సాహంతో పరుగెట్టుకుంటూ అక్కడికి వచ్చింది. చిరునవ్వులు చిందుతున్న ఆమె ముఖం ఆనంద బాష్పాలతో తడుస్తోంది. క్షణకాలం కచుడిని ప్రేమగా చూసింది. మెల్లగా తండ్రి వైపు తిరిగింది. శుక్రుడు సగర్వంగా చిరునవ్వు నవ్వుకున్నాడు.


*“నాన్నా !”* అంటూ దేవయాని శుక్రుణ్ని కౌగిలించుకుంది. శుక్రుడి అరచెయ్యి వాత్సల్యభారంతో ఆమె వీపు మీద నెమ్మదిగా కదులుతూ , నిమురుతోంది.


*“కచా ! నువ్వు రాకపోయేసరికి దేవయాని భయ విహ్వల అయిపోయింది సుమా ! నిన్ను పునర్జీవితుణ్ణి చేస్తానని మాట యిచ్చేదాకా నన్ను వదల లేదు ! నా తల్లికి నువ్వంటే ప్రాణం !"* శుక్రుడు దేవయాని వీపు నిమురుతూ , ఆమె భుజం మీద నుంచి చూస్తూ అన్నాడు.


*“అది నా అదృష్టం గురుదేవా !”* కచుడు కృతజ్ఞతాభావంతో అన్నాడు.


*“అమ్మ నీ కోసం ఎదురు చూస్తోంది కచా ! రా ! వెళ్లాం !"* అంది ప్రేమగా దేవయాని.


**********************************


కచుడు ఆశ్రమ కుటీరంలో కూర్చుని , ఉదయం శుక్రాచార్యుడు బోధించిన సూక్తం వల్లె వేసుకుంటున్నాడు. గాలి ఒక్కసారిగా విసురుగా వీచింది. ప్రమిదలో దీపం రెపరెపలాడింది. కచుడు ద్వారం వైపు చూశాడు. తలుపు తెరిచి , లోపలికి వచ్చిన దేవయాని తలుపు మూస్తోంది. గాలి వీచిన కారణం అర్థమైంది కచుడికి.ఛ


దేవయాని అతని వైపు తిరిగింది. శ్వేత వస్త్రాలలో , దేవ కన్యలా ధగధగలాడుతోందామె. పొడుగాటి జుత్తు , గుండ్రటి ముఖం. సూర్యరశ్మిలో తళుక్కుమనే జంట సరోవరాల్లా మెరుస్తున్న కళ్ళు...


*"కచా ! ఏం జరిగింది అరణ్యంలో... ?"* వయ్యారం వొలికే నడకతో అతన్ని సమీపిస్తూ అడిగింది దేవయాని.


*"తెలీదు...”*


*"నిన్ను... నిన్ను... వధించిన వాళ్ళు ఎవరు ?”* దేవయాని అతని సమీపంలో కూర్చుంది.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 22*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*కురుంబ నాయనారు*


శివదీక్షాపరులై, విభూతిధారులై విరాజిల్లుతున్న ప్రజలతో కూడిన పెరుమిళలై అనే గ్రామంలో శివభక్తుడైన కురుంబనాయనారు

అవతరించాడు. శివభక్తులు ఏదడిగినా లేదనకుండా ఇస్తూ వాళ్లను భోజన  మజ్జనాదులతో సంతృప్తి పరుస్తుండేవాడు. శివభక్తులముందు తననొక

సేవకుడుగా భావించుకొని వినయంగా ప్రవర్తిస్తూ వచ్చాడు.


'తిరుతొండ తొగై' రచించిన సుందరమూర్తి నాయనారును సదా ధ్యానంచేస్తూ రావడం వలన కురుంబనాయనారుకు అష్టమసిద్ధులు

కైవశమైనది. శివ పంచాక్షరియే తన సర్వస్వంగా భావించి శివభక్తులకు

సేవచేయడంలో కాలం గడుపుతుండగా సుందరమూర్తి నాయనారు

కొడుంగోళూరు చేరుకున్నారు. 


వారు తిరువంజి కళంలో వెలసిన పరమేశ్వరుని ప్రస్తుతించి కైలాసాన్ని అనుగమిస్తున్నారనే విషయాన్ని తన

యోగబలంచే కురుంబ నాయనారు తెలుసుకున్నారు. “సుందరమూర్తి

నాయనారును ఎడబాసి గుడ్డివారి వలె నేను జీవనం సాగించలేను.


అందువలన యోగబలంచే ఇప్పుడే నేను కైలాసానికి వెళ్తాను” అని కురుంబ

నాయనారు నిశ్చయం చేసుకున్నాడు. తనకున్న యోగశక్తిచే బ్రహ్మరంధ్రాన్ని

తెరుచుకొని పరమేశ్వరుని తిరుచరణాల సన్నిధిని సుందరమూర్తి నాయనారు

చేరుకోవడానికి పూర్వమే తాను వెళ్లి చేరుకోగలిగాడు.


*ఇరవై రెండవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                    *భాగం 108*


స్వామీజీ హృదయం సదా ఏకాంతవాసాన్నే అభిలషించింది. రెండుసార్లు చేసిన తీర్థయాత్రలు ఆయన మనస్సులో గాఢమైన ఆలోచనలను లేవనెత్తాయి. అధిక కాలం ఇటువంటి జీవితం గడపాలనే ఉత్సుకత ఆయనలో పెరుగసాగింది.


కాని గురుదేవులు అప్పగించిన బాధ్యత స్వామీజీ ఉత్సుకతకు అడ్డుకట్ట వేసింది. చరిత్రలోనే వినూత్న సన్న్యాస సంప్రదాయాన్ని రూపొందించి, దాని బాధ్యతను స్వామీజీకి అప్పగించారు శ్రీరామకృష్ణులు. తక్కిన యువ సన్న్యాసులు బాధ్యత కూడా స్వామీజీదేనన్న విషయం విడిగా చెప్పనక్కరలేదు. వారి సర్వతో ముఖమైన వికాసానికి స్వామీజీ బాధ్యత వహించారు. ఈ పరిస్థితిలో వారితోపాటు జీవించడం తప్పనిసరి అయింది. ఆసక్తి, బాధ్యతల మధ్య స్వామీజీ మనస్సు ఊగిసలాడింది.


అలాగే శ్రీరామకృష్ణులు తమకు అప్పగించిన మహత్కార్యంలోని మరో భాగమూ ఆయన మనస్సులో మెదలింది. ఇలా అనడం కన్నా అదే ఆయన మనస్సును ప్రధానంగా ఆక్రమించిందని చెప్పవచ్చు - శ్రీరామకృష్ణుల సందేశాన్ని లోకమంతటా ప్రచారం చేయడమే అది. 


చేప ఒకటే; కాని దానిని పిల్లలు జీర్ణశక్తి ప్రకారం పులుసు, పచ్చడి, వేపుడులాగ పలు రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వండి పెడుతుంది తల్లి - ఇది శ్రీరామకృష్ణులు చెప్పే ఉదాహరణ. అదేరీతిలో శ్రీరామకృష్ణుల సందేశాన్ని లోకమంతటా చాటాలి. 


కాని అందరికీ ఒకే విధంగా దానిని అందించడం సబబు కాదు. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకో కుండా దానిని ఎవరికి, ఎలా అందించాలో నిర్ణయించడం అసాధ్యం. కనుక వారిని తప్పనిసరిగా కలుసుకోవాలని స్వామీజీ నిశ్చయించుకొన్నారు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

.                   *శ్లోకం - 98*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం*

*పిబేయం విద్యార్ధీ తవ చరణ నిర్జేజనజలమ్*

*ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా*

*కదాథత్తే వాణీముఖ కమల తామ్బూల రసతామ్.ll*



అమ్మా! బ్రహ్మ విద్యను అర్ధించు నేను లత్తుక రసము కలుపబడిన నీ పాదోదకము ఎప్పుడు త్రాగుదునో కదా ! ఆ నీరు చెవిటి వారికి విను శక్తిని, మూగ వారికి మాట్లాడు శక్తిని ఇచ్చును కదా !


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

 🌹ఓం నమః శివాయ 🌹


హాలాహలమును గాంచియు

గోలను సురవర్గ మెల్ల గోడను చుండ న్నే

లీలను గ్రోలితివో నీ 

లీలలు నెఱుగంగ లేము నిక్కము నీశా.      06*


ఎన్నడు నిను నే గాంతును ?

కన్నుల పండువుగ మాత గౌరీసతి తోన్ .

తిన్నని కన్నులు గోరియు

మన్నన జూపించి నట్టి మహనీయ శివా !       07*


త్రిభువనముల జీవమ్ముల

కభయమ్మది నీయ నెంచి హాలాహలము

న్నిభచర్మాంబరధర !

యభయమ్ముగ గ్రోలినావె యభవా ! యీశా !    08*


సిరియాళుని రక్షించిన

కరివసనా ! కామదహన ! కామిత దాతా !

నిరతము నిను పూజింతును 

కరములు జోడించి నన్ను కావగ నీశా !         09*


నిత్యము నిను నే గొలుతును

సత్యాత్మక విశ్వరూప ! సద్యోజాతా !

భృత్యుని నను నిరతము కృత

కృత్యునిగా చేయుమయ్య భృంగీ శీశా !       10*


✍️గోపాలుని మధుసూదన రావు 🙏