6, డిసెంబర్ 2023, బుధవారం

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                    *భాగం 108*


స్వామీజీ హృదయం సదా ఏకాంతవాసాన్నే అభిలషించింది. రెండుసార్లు చేసిన తీర్థయాత్రలు ఆయన మనస్సులో గాఢమైన ఆలోచనలను లేవనెత్తాయి. అధిక కాలం ఇటువంటి జీవితం గడపాలనే ఉత్సుకత ఆయనలో పెరుగసాగింది.


కాని గురుదేవులు అప్పగించిన బాధ్యత స్వామీజీ ఉత్సుకతకు అడ్డుకట్ట వేసింది. చరిత్రలోనే వినూత్న సన్న్యాస సంప్రదాయాన్ని రూపొందించి, దాని బాధ్యతను స్వామీజీకి అప్పగించారు శ్రీరామకృష్ణులు. తక్కిన యువ సన్న్యాసులు బాధ్యత కూడా స్వామీజీదేనన్న విషయం విడిగా చెప్పనక్కరలేదు. వారి సర్వతో ముఖమైన వికాసానికి స్వామీజీ బాధ్యత వహించారు. ఈ పరిస్థితిలో వారితోపాటు జీవించడం తప్పనిసరి అయింది. ఆసక్తి, బాధ్యతల మధ్య స్వామీజీ మనస్సు ఊగిసలాడింది.


అలాగే శ్రీరామకృష్ణులు తమకు అప్పగించిన మహత్కార్యంలోని మరో భాగమూ ఆయన మనస్సులో మెదలింది. ఇలా అనడం కన్నా అదే ఆయన మనస్సును ప్రధానంగా ఆక్రమించిందని చెప్పవచ్చు - శ్రీరామకృష్ణుల సందేశాన్ని లోకమంతటా ప్రచారం చేయడమే అది. 


చేప ఒకటే; కాని దానిని పిల్లలు జీర్ణశక్తి ప్రకారం పులుసు, పచ్చడి, వేపుడులాగ పలు రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వండి పెడుతుంది తల్లి - ఇది శ్రీరామకృష్ణులు చెప్పే ఉదాహరణ. అదేరీతిలో శ్రీరామకృష్ణుల సందేశాన్ని లోకమంతటా చాటాలి. 


కాని అందరికీ ఒకే విధంగా దానిని అందించడం సబబు కాదు. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకో కుండా దానిని ఎవరికి, ఎలా అందించాలో నిర్ణయించడం అసాధ్యం. కనుక వారిని తప్పనిసరిగా కలుసుకోవాలని స్వామీజీ నిశ్చయించుకొన్నారు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: