16, డిసెంబర్ 2025, మంగళవారం

దండము

 దండము వి. నమస్కారము.


నీ... మ్రొక్కు దండము కేలుమో డ్పెఱఁగుడు, నాఁగఁ జెన్నొందును నతి...ఆం. భా. 2. 175.


వ...శివా నీకు నవాంజలి భవా నీకు నభివాదనంబు పాండురంగా నీకు దండంబు రాజ శేఖరా నీకు .... 3.211.


దండము సం. వి. అ. వుం. న. 1. లగుడము, కఱ్ఱ.


2. ప్రకాండము, చెట్టు బోదె. 3. వీణా దండము.


4. మంథన దండము, కవ్వము. 5. దమనము,


అడఁచుట (వాగ్దండము, మనో దండము, కాయ దండము). 6. దండనము, రాజు ప్రజలకు చేయు శాసనము, రాజ శిక్ష. 7. దండుగు, అధికారి అప రాధి వలన అపరాధమునకై పుచ్చుకొను సొము. 8. రాజు శత్రువుల యెడఁ బ్రయోగించు చతు రుపాయములలో నాల్గవది (ఇది వధించుట, ధన మపహరించుట, పీడించుట యని మూఁడు విధము లుగ నుండును). 9. సైన్యము, దండు. 10. అడ్డ ముగా పన్నిన వ్యూహము. 11. భూమిని గొలుచు


నాలుగు హస్తముల కొలఁది గల మానము, బార.


12. మగ గుఱి.


13. అభిమానము.


14. దేహము.


15. సూర్య కిరణములు గాని వాయువు గాని మేఘ ములు గాని దండాకారముగ ఆకాశమునఁ గనఁ బడుట (ఇది రాజాదులకు అశుభ సూచకము). ఘటిక, గడియ, అఱువది విఘటికలు. 19.


16. వరుస; సమూహము. 17. గుఱ్ఱము. 18.


కోణము, మూల (సుధ.).

పంచాంగం

 


అంబలి తాగే వారికి

 11:04 AM


Vo


72


శ్రీ మాత్రే నమ :'s post


2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా


3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ


4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు


5. అనువు గాని చోట అధికులమనరాదు


6. అభ్యాసం కూసు విద్య


7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి


8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం


9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం


10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత


11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు


12. ఇంట గెలిచి రచ్చ గెలువు


13. ఇల్లు పీకి పందిరేసినట్టు


14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు


15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు


16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు


17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు


18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ


19. కోటి విద్యలూ కూటి కొరకే


20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు


21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం


22. పిట్ట కొంచెం కూత ఘనం


23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు


24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక


25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు


26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె


27. ఆడబోయిన తీరము యెదురైనట్లు


Comment as Cheruvela Bhargava Sarma


GIF

గోవింద పదారవింద మహిమ!

 శు భో ద యం 🙏


గోవింద పదారవింద మహిమ!


                  ఉ: పొందరు దుఃఖముల్, భయము పొందరు, పొందరు దైన్య మెమ్మయిన్,


                       పొందరు తీవ్ర దుర్దశలు , పొందు ప్రియంబులు , పొందు సంపదల్


                      పొందు సమగ్ర సౌఖ్యములు , పొందు సమున్నత కీర్తు లెందు,, గో


                       వింద పదారవింద పదవీ పరిణధ్ధ గరిష్ట చిత్తులన్;


                            నృసింహ పురాణము- ఎఱ్ఱాప్రెగ్గడ;


                      

                 గోవింద పదారవింద ధ్యాన పరాయణులకు దుఃఖములు రావు. (దుఃఖములకు వెరువరని భావము) భయముండదు.

జీవన దైన్యముండదు. దుర్దశలు దాపురించవు. ప్రియములు కలుగుచుండును. సంపదలు కలుగును. సంపూర్ణమైన సుఖములు కలుగును. సర్వోన్నతమైన కీర్తికలుగును.ననిభావం!


                         ఈపద్యంలో ఒక చమత్కారం ఉన్నది. గోవిందుని గొలచినవారికి కలుగని కీడులు ఒకవరుసగాను, కలిగెడు

లాభములను మరియొక వరుసగాను వివరించుట.


                      నవ విధ భక్తి మార్గాలలో పాద సేవ సముచిత మైనది. అహంకార రాహిత్యము నొనగూరిచి, మనో విశుధ్ధిని కలిగించుటకు అది చక్కనిమార్గం. సనక సనందనాది భక్తులు గోరిన దదియే! నేడు మనమందరం

ఆదేవదేవుని పై మనసు నిలిపి ధ్యానం చేద్దాం. ముక్తిమాట యేమైనా కనీసం చిత్త శాంతితో ప్రశాంతంగా బ్రతికే అవకాశం కోసం

ప్రయత్నం చేద్దాం!


                                                           స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

జ్యేష్ట.బ. త్రయోదశీ

 *శ్రీ విశ్వావసు* నామ సంవత్సరం *జ్యేష్ట.బ. త్రయోదశీ తత్కాల చతుర్దశీ.. సోమవారం అనగా 23-06-2025.వ తేదీన... తృతీయ మాసం* లో 

*గ్రీష్మ ఋతువు* లో... అనగా *జ్యేష్ట మాసం* లో

*మాస శివరాత్రి* రోజున....ఇంకొక *విశేషము* ఈ రోజున *సోమవారము* అయిన సందర్భంగా...

*

#కల్పవృక్షం..🌳 #మునగ…

 సేకరణ 👇




#కల్పవృక్షం..🌳  #మునగ…🌿


మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రుకునే మునక్కాడల రుచే. కానీ ఆఫ్రికన్‌ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం.

 

భూగోళం మీదున్న సమస్త పోషకాహార లోపాల్నీ సకల రోగాల్నీ నివారించడానికి మునగను మించినది లేదని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికా దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లులూ పిల్లలకు మందులతోబాటు మునగాకు పొడినీ బోనస్‌గా ఇస్తున్నాయి. అందుకే మునగాకు టీ తాగడం వల్ల మధుమేహం తగ్గిందనీ పొడి తినడం వల్ల పాలు బాగా పడ్డాయనీ చెప్పే ఆఫ్రికన్ల సంఖ్య కోకొల్లలు.


 

ఆనోటా ఈనోటా ఇది మనవరకూ వచ్చింది. ‘పెరటి చెట్టు వైద్యానికి పనికిరాద’న్నట్లు నిన్నమొన్నటివరకూ మనం మునగ చెట్టుని పెద్దగా పట్టించుకోలేదు. తలపైకెత్తి దానివైపే చూడలేదు- సాంబారులోకి నాలుగు కాయలు అవసరమైనప్పుడు తప్ప. కానీ అమెరికాకి చెందిన ‘ద ట్రీస్‌ ఫర్‌ లైఫ్‌’ స్వచ్ఛంద సంస్థ మునగ చెట్టులోని అణువణువూ ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. దానికి పలు అంతర్జాతీయ సంస్థలూ శృతి కలిపాయి. ప్రపంచ దేశాలకు ఆ సంజీవని గురించి కథలుగా చెప్పడం ప్రారంభించాయి.


ఐక్యరాజ్యసమితి కూడా మునగ ప్రాధాన్యతను గుర్తించి ఆ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. దాంతో మన దృష్టీ అటు మళ్లింది. న్యూట్రిషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ సి.గోపాలన్‌, డాక్టర్‌ కమలా కృష్ణస్వామిలు మునగాకు లోగుట్టుని విప్పారు. వారికి ఆయుర్వేద వైద్యులూ తోడయ్యారు. అంతా కలిసి మరీ ‘మునగ’ మహత్యాన్ని కొనియాడుతున్నారు.


ఏముంది మునగాకులో..?

 

‘బతికుంటే బలుసాకు తినొచ్చు’... ఓ పాత నానుడి. ఆ బలుసాకు ఏమోగానీ, ‘రోజూ కాస్త మునగాకు తింటే చాలు, వందేళ్లు బతకొచ్చు అన్నది కొత్త సామెత. ఎందుకంటే...

 

వంద గ్రా. తాజా మునగాకుల్లో... నారింజల్లోకన్నా ఏడు రెట్లు సి-విటమిన్‌, క్యారెట్లలోకన్నా నాలుగింతల కాల్షియం, అరటిపండ్లలోకన్నా మూడు రెట్లు పొటాషియం, పాలకూరలోకన్నా మూడింతల ఐరన్‌, బాదంలోకన్నా మూడు రెట్లు విటమిన్‌- ఇ, పెరుగులోకన్నా రెండింతల ప్రొటీన్లూ ఉంటాయి.


అంటే ఇరవై గ్రా.మునగాకు నుంచి మనిషికి నిత్యం అవసరమయ్యే ఎ,సి-విటమిన్లూ, వంద గ్రా.ఆకు నుంచి కాల్షియం, మూడొంతుల ఐరన్‌, సగం ప్రొటీన్లూ దొరుకుతాయి.

 

అందుకే పోషకాహార లోపాన్ని నివారించడానికి దీన్ని మించినది లేదు. అంతెందుకు... ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు లక్షల మంది విటమిన్‌-ఎ లోపం కారణంగానే అంధులవుతున్నారు. దీనికి మునగాకే మహత్తరమైన పరిష్కారం అంటున్నారు పోషక నిపుణులు. 

ఆ కారణంతోనే క్యూబా అధ్యక్షుడు ఫిడేల్‌ క్యాస్ట్రో మునగ చెట్లను పెంచి, ఆ కాయల్ని రోజూ తినేవాడట. ‘ఒమేగా-3, 6, 9 ఫ్యాటీఆమ్లాలూ, సకల విటమిన్లూ, అన్ని రకాల అమైనో ఆమ్లాలు... మొత్తంగా 96 పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగ...పేదవాడి ఆహారం’ అంటూ దాని గొప్పతనం గురించి పత్రికల్లో వ్యాసాలూ రాశాడు క్యాస్ట్రో. ఇప్పుడు క్యూబా వాసులు మునగాకుని పండించి, పొడి చేసి విక్రయిస్తున్నారు. భారత్‌ కూడా మునగ ఆకుల పొడిని ఎగుమతి చేయడం ప్రారంభించింది. కానీ ఆకుని తినడం పట్ల ఇప్పటికీ మనదగ్గర అలసత్వమే.

 

నిజానికి ప్రాచీన కాలం నుంచీ ఆఫ్రికా దేశాల్లోనూ భారత్‌లోనూ తాజా మునగాకుల్ని తినే అలవాటు ఉంది. మధ్యలో మాయమై, మళ్లీ తెరమీదకొచ్చింది. టైమ్‌ మ్యాగజైన్‌ ‘ద నెక్స్ట్‌ క్వినోవా’గా అభివర్ణించింది. దాంతో పాశ్చాత్య దేశాల్లో ఎండిన ఆకుల పొడిని స్మూతీలూ సలాడ్ల మీద చల్లుకోవడం, టీ, సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. 

ఎందుకంటే... 


100 గ్రా. ఎండిన ఆకుల్లో... పాలల్లో కన్నా 17 రెట్లు కాల్షియం, అరటిపండ్లలోకన్నా 15 రెట్లు పొటాషియం, క్యారెట్లలోకన్నా 10 రెట్లు విటమిన్‌-ఎ, పాలకూరలోకన్నా 25 రెట్లు ఐరన్‌... ఇలా చాలా లభిస్తాయి. 

మునగాకుని ఎండబెట్టి పొడి చేసుకునే తినాల్సిన అవసరం మనకి లేదు. తాజా మునగాకు పుష్కలం. ఒకప్పుడు శుభసూచకం కాదన్న కారణంతో పెరట్లో మునగ పెంచేవారు కాదు. కాలం మారింది. పట్టింపూ పోయింది. దాంతో కాయలకోసం చాలామందే పెంచుతున్నారు. కాబట్టి ఇతర ఆకుకూరల్లానే మునగాకుతో పప్పూ కూరలూ పచ్చళ్లూ పొడులూ రైస్‌ వెరైటీలూ కోఫ్తాలూ... అన్ని రకాలూ వండుకోవచ్చు. దోసెల్లో రొట్టెల్లో దట్టించినా రుచే. పొడిని టీ రూపంలో తాగొచ్చు, సూపుల్లో అన్నంలో కూరల్లో... ఎలా కావాలంటే అలా తినొచ్చు. అయితే ముదిరిన ఆకుల్లో పీచెక్కువ. కాబట్టి కుక్కర్‌లో ఉడికించాలన్నది నిపుణుల సలహా.


ఔషధగుణాలెన్నో... 

మరే చెట్టు ఆకులకీ లేనంత మహత్తు మునగాకుకి ఉంది. ఇది 300 వ్యాధుల్ని నివారించగలదు. మునగాకులో రోగనిరోధకశక్తిని పెంచే 46 యాంటీఆక్సిడెంట్లూ అనేకానేక బయోయాక్టివ్‌ పదార్థాలూ ఉండటంతో శాస్త్రవేత్తలు దీనిమీద పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇందులోని ఓషధుల ప్రభావానికి శరీరంలోని బ్యాక్టీరియా, ఫంగస్‌లన్నీ పలాయన మంత్రం పఠిస్తాయి. క్యాన్సర్లూ అల్సర్లూ కనుచూపుమేర కనిపించవు. ఆల్జీమర్స్‌ ఎగిరిపోతుంది. బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్‌ దరి చేరడానికి భయపడతాయి. గాయాలన్నీ మునగాకు పేస్టుతో గాయబ్‌.

 

అంతేనా... రక్తహీనతతో బాధపడుతుంటే కాస్త వండిన మునగాకునో లేదా టీస్పూను పొడినో రోజూ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఐరన్‌ వృద్ధి, రక్తం సమృద్ధి. ఈరోజుల్లో పసివయసు దాటకుండానే కంటిజబ్బులనేకం. రేచీకటి బాధితులూ ఎక్కువే. వాటన్నింటినీ మునగాకులోని బీటాకెరోటిన్‌ నివారిస్తుందని ఇంటర్నేషనల్‌ ఐ ఫౌండేషన్‌ అంటోంది.

 

ఇంటాబయటా అంతటా ధూళిమేఘాలే... కాలుష్యకాసారాలే. మరి ఆస్తమా, బ్రాంకైటిస్‌, ట్యుబర్‌క్యులోసిస్‌ పిలవకుండానే పలుకుతున్నాయి. ఊపిరితిత్తుల్లో తిష్ట వేస్తున్నాయి. అందుకే ఆకుల్ని సూపులా చేసుకుని రోజుకి రెండుసార్లు తీసుకుంటే లంగ్సులోని టాక్సిన్లు తొలగి, ఆ వ్యాధులన్నీ పారిపోతాయి. 

రజస్వలానంతరం అమ్మాయిలకి ఎన్ని కష్టాలో... కొందరిలో నెలసరి సమయంలో గడ్డలు పడుతుంటాయి. అప్పుడు ఆకులతో చేసిన సూపుని 21 రోజులపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే సరి. మునగాకు రసం తాగితే గర్భసంచి సాగకుండా ప్రసవం సులభంగా అవుతుంది. పాలుపడని బాలింతలకి కాసిని నీళ్లలో ఉప్పు, మునగాకులు వేసి కాసేపాగి ఆ నీటిని వంపేసి ఆకుల్ని నేతితో తినిపిస్తే ఫలితం ఉంటుంది. పొడి రూపంలో ఇచ్చినా పాలు పుష్కలమే. 

డయేరియా, కామెర్లూ, కలరా బాధితుల బాధ కాదు. ఒకటే దాహం. నీరసం. అప్పుడు రోజుకి రెండుమూడుసార్లు గ్లాసు కొబ్బరినీళ్లలో టీస్పూను మునగాకు రసం, కొద్దిగా తేనె కలిపి తాగితే సరి. మూత్ర సమస్యలకీ మునగ బెస్ట్‌ మెడిసినే. ఆకుల్ని ముద్దలా చేసి క్యారెట్‌ రసంలో కలిపి పదిగంటలకోసారి తీసుకుంటే హానికర బాక్టీరియా, వైరస్‌లన్నీ తొలగిపోతాయి.

 

ఆకుల్ని కణతలకి రుద్దితే తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ ఆకుల రసాన్ని నిమ్మరసంతో కలిపి మొటిమలమచ్చలు, బ్లాక్‌హెడ్స్‌ మీద రాస్తే అవి మాయమై చర్మం మెరుస్తుంది. స్కర్వీ, చర్మవ్యాధులు, ఆందోళనలకి 

మునగాకు టీ రుచికరమైన పరిష్కారం.


వహ్వా... మునక్కాడ! 

సీజన్‌లో చిటారుకొమ్మ వరకూ చిగురు కనబడకుండా కాసిన కాయలు చూసేవాళ్లకి కన్నులపండగ అయితే, ఆ కాయల రుచి తెలిసినవాళ్లకి విందుభోజనమే. దక్షిణాదిన సాంబారు, పులుసు, అవియల్‌ వంటల్లో మునక్కాడ కనిపించాల్సిందే. ఇక, బియ్యప్పిండి, బెల్లం లేదా అల్లంవెల్లుల్లి వేసి వండే మునగగుజ్జు కూర ఎవరికైనా నోరూరాల్సిందే. మునక్కాడలతో పట్టే నిల్వ పచ్చడి మహారుచి. మటన్‌లో మునక్కాడ పడితే నాన్‌వెజ్‌ ప్రియులకి పండగే. ఆకులతో పోలిస్తే కాయల్లో పోషకాల శాతం తక్కువే. కానీ మిగిలిన కూరగాయలతో పోలిస్తే ఎక్కువే. 

‘ఈ ఒక్క మునక్కాడ తినవూ బోలెడు బలం’ అంటూ బామ్మలు బతిమిలాడి తినిపించడం చాలామందికి అనుభవమే. తెలిసి చెప్పినా తెలియక చెప్పినా అది నిజమే. మునక్కాడల్లోని యాంటీబయోటిక్‌ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తే; కాల్షియం, ఐరన్‌లు ఎముకబలాన్నీ బరువునీ పెంచుతాయి. రక్తంలో చక్కెర శాతాన్నీ తగ్గిస్తాయి. పిత్తాశయం యమా జోష్‌గా పనిచేస్తుంది.

 

శస్త్రచికిత్సానంతరం మునగాకునీ, మునక్కాడలనీ తింటే త్వరగా కోలుకుంటారని చెప్పడం తెలిసిందే. దానిక్కారణం మరేంటో కాదు, మునక్కాడల్లోని ఐరన్‌వల్ల హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుందట. మునక్కాడల్ని మరిగించిన నీళ్లతో ఆవిరిపట్టడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలూ తగ్గుతాయి. వీటిని ఉడికించిన నీరు తాగితే చర్మం మెరుస్తుందట.

 

‘తరచూ జలుబు చేస్తోందా... జ్వరమొస్తోందా... అయితే రోజూ మునక్కాడలు తినండొహో’ అంటూ చాటింపు వేస్తున్నారు ఆధునిక వైద్యులు. వాటిల్లోని విటమిన్‌-సి జలుబూ ఫ్లూ జ్వరాలకి ట్యాబ్లెట్‌లా పనిచేస్తుందట. వీటిని ఎక్కువగా తినేవాళ్లకి పొట్టలో నులిపురుగుల బాధ ఉండదు. ఈ ముక్కలను ఉడికించిన సూప్‌ డయేరియాకి చక్కని నివారణోపాయం. కీళ్లనొప్పులయితే పరారే. కాలేయం, ప్లీహ సంబంధిత వ్యాధులన్నీ హాయ్‌ చెప్పడానికే సందేహిస్తాయి. 

‘ఏమోయ్‌... ఇంకా పిల్లల్లేరా... అమ్మాయిని మునక్కాయ కూర వండమనోయ్‌...’ అని ఏ పెద్దాయనో అంటే సరదాగా తీసుకోవద్దు. వీటిల్లోని జింక్‌ స్త్రీ, పురుషుల్లో వంధ్యత్వాన్ని తగ్గిస్తుంది. వీర్యం చిక్కబడుతుంది.


 

నియాసిన్‌, రిబోఫ్లేవిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పైరిడాక్సిన్‌ వంటి బి-కాంప్లెక్స్‌ విటమిన్లు మునక్కాడల్లోనూ సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి సంక్లిష్ట పిండిపదార్థాలూ ప్రొటీన్లూ 

జీర్ణమయ్యేలా చేస్తాయి.

 

ఏదేమైనా మునక్కాడలు ఎక్కువగా తినేవాళ్లలో రోగనిరోధకశక్తి ఎక్కువ. శ్వాససంబంధ సమస్యలు తక్కువ. వీటిల్లోని ప్రొటీన్లూ పీచూ కారణంగా పోషకాహార లోపమూ ఉండదు. నాడీవ్యవస్థా భేషుగ్గా పనిచేస్తుంది.


పూలు... తేనెలూరు..! 

పచ్చదనంతో కళకళలాడే దీని ఆకులూ కాయలే కాదు, సువాసనభరితమైన తెల్లని పూలూ ఔషధ నిల్వలే. ఆయుర్వేద వైద్యంలో వాడదగ్గవే. పూలతో కాచిన కషాయం లేదా టీ పిల్లతల్లుల్లో పాలు బాగా పడేలా చేస్తుంది. ఇది మూత్రవ్యాధుల నివారణకూ దోహదపడుతుంది. ఈ పూలను మరిగించిన తేనీరు జలుబుకి మంచి మందు. కొన్ని ప్రాంతాల్లో ఈ పూలను సెనగపిండిలో ముంచి పకోడీల్లా వేస్తారు, కూరలూ చేస్తారు. మునగ పూలలో తేనె ఎక్కువ. దాంతో ఇవి తేనెటీగల్ని ఆకర్షించి, తేనె ఉత్పత్తికీ తోడ్పడతాయి.


విత్తనంతో నీటిశుద్ధి..! 

విరగ్గాసిన కాయలు ఎండిపోయాయా... ఫరవాలేదు, ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. విటమిన్‌-సి పుష్కలంగా ఉండే వీటిని వేయించి పల్లీల్లా తినొచ్చు. నూనె తీయొచ్చు. దీన్ని వంటనూనెగానూ సౌందర్యసాధనంగానూ ల్యూబ్రికెంట్‌గానూ వాడుతుంటారు. 

రక్షిత నీటి పథకాలు కరవైన ప్రాంతాలకు మునగ విత్తనాలే నీటిశుద్ధి పరికరాలు. కఠిన జలాల్ని సైతం ఈ గింజలు ఉప్పు లేకుండా తేటగా మారుస్తాయి. సూడాన్‌, ఇండొనేషియా వాసులు ఆ కారణంతోనే విత్తనాలను ప్రత్యేకంగా సేకరించి, ఆ గింజల్ని పొడిలా చేసి, కప్పు నీళ్లలో కలిపి, వడగడతారు. ఇప్పుడు ఈ నీళ్లను బిందెలోని నీళ్లలో కలిపి, ఓ ఐదు నిమిషాలు గరిటెతో కలుపుతారు. తరవాత ఓ గంటసేపు కదపకుండా ఉంచితే మలినాలన్నీ కింద పేరుకుని పైనున్న నీరంతా తేటగా అవుతుంది. వీటిని విడిగా పాత్రలో పోసుకుని తాగుతారు. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ పొడి కలిపిన ద్రవాన్ని నీటిలో కలపగానే అది పాలీ ఎలక్ట్రోలైట్‌గా పనిచేసి నీటిలోని మలినాలను అయాన్లుగా మార్చడం ద్వారా వాటిని ఆకర్షించి కింద పేరుకునేలా చేస్తుంది.ఇంకా... ఇంకా...! 

మునగాకు మనుషులకే కాదు, పశువులకీ బలవర్థకమైనదే. పశువుల మేతగానూ పంటలకు ఎరువుగానూ వాడతారు. చెట్టు కాండం నుంచి వచ్చే గుజ్జుని కాగితం తయారీకి వాడతారు.  ఆగ్రో ఫారెస్ట్రీకి మునగ చక్కగా సరిపోతుంది. ఈ మొక్కల్ని కంచె చుట్టూ పెంచవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీన్ని పెంచుతున్నా మునగ పంటలో మనదేశమే ఫస్ట్‌. ఏటా 13 లక్షల టన్నుల కాయల్ని పండిస్తున్నాం. రాష్ట్రాలకొస్తే ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మునగ ఉత్పత్తుల విలువ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.27వేల కోట్లు. వాటిల్లో 80 శాతం మనవే. కాయలతోబాటు పొడినీ 

ఎగుమతి చేస్తున్నాం. కాయల్ని శీతలీకరించి చక్కెరపాకంలో వేసి ఎగుమతి చేస్తారు. 

మునగలో రకాలనేకం. కుండీల్లో కాసే హైబ్రిడ్‌ రకాలూ ఉన్నాయి. జాఫ్నా రకం కాయలు 60 నుంచి 120 సెం.మీ. వరకూ కాస్తే, ఆరునెలలకే పూతొచ్చి, కాయలు కాసే కెఎం-1, పీకేఎం-1, పీకెఎం-2, పీఏవీఎం రకాలూ వస్తున్నాయి. నేలతీరు, వాతావరణాన్ని బట్టి ఆయా రకాలని ఎంపికచేసుకుని ఈ చెట్లను పెంచి ఎకరాకి కనీసం లక్ష రూపాయల లాభాన్ని పొందుతున్నారు రైతులు. వ్యవసాయపరంగానే కాదు, 

ఇంటి అవసరాలకోసం పెరట్లోనో లేదంటే కుండీల్లోనో మునగను పెంచితే, రోజూ ఓ గుప్పెడు తాజా ఆకుల్ని కూరల్లో వేస్తే మీ ఆహారంలో సూపర్‌ఫుడ్‌ చేరినట్లే, మీకు డాక్టరుతో పనిలేనట్లే..!

తిరుమల గురించి

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🏵️ తిరుమల గురించి ఎలా ఆపలేమె .. అలాగే మనసుని కూడా ఆపడం సాధ్యం కాదు.. ఒక్క క్షణంలో దానికి కావలసిన చోటికి ప్రయాణం చేయగలదు..దానికి తోడు మనసుకు చంచలత్వం ఎక్కువ.. ముల్లు గుచ్చుకున్న కోతి వంటిది..మరియు కల్లు తాగిన కోతి వంటిది..మనసుకి ఏ క్షణాన ఏమి చేయాలన్నా తనకు కూడా తెలియకుండా చేయగలదు.. మనసుని కంట్రోల్ చేయడం ఒక్క ధ్యానం వల్లనే సాధ్యం*🏵️మనిషి స్వభావం నీరు లా ఉండాలి.. అక్కర్లేని చోట వేళ్ళ మధ్య నుండి జరిపోయాలా.. అవసరమైన చోట యుద్ధ నౌక నైనా నిలబెట్టేలా ఉండాలి..మనిషి కృషి త్రికరణ శుద్ధిగా ఉండాలి.. ఆలోచనలు, ఆచరణ మమేకం చెయ్యాలి. చేయగలిగేదే చెప్పాలి🏵️శుభ కరమైన ఆలోచనలను చేస్తూ మనసును మంచి ముత్యాల మూటగా చేసుకోవాలి.. ముత్యపు వంటి మనసున్న వారి మాటలు రత్నాల రాసుల వలె ఉంటాయి..మనసు ఎంత నిర్మలంగా ఉంటే దానిని నియంత్రించడం అంత సులభం🏵️🏵️మీ అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్

*శ్రీమద్భాగవత కథలు*


*మహాకవి బమ్మెర పోతనామాత్య*

``

     *శ్రీమద్భాగవత కథలు*

               ``

       *2.1. రఘువంశము*


విశుద్ధమగు సూర్యవంశమున పరమ ప్రతాపుడును, యశస్వియును, దీర్ఘబాహుడును, పుణ్యశ్లోకుడును అగు ఖట్వాంగుడను రాజు పృథివిని పాలించుచుండెను. అతని పరిపాలన ప్రజలకానందము కలిగించుటయేకాక, ప్రజలు ప్రభువునే దైవముగా భావించి, విశ్వసించి గౌరవించుచుండిరి. మహారాజునకు ఏకైక పుత్రుడు కలడు. అతడే దిలీపుడు. 

కుమారుడైన దిలీపుడు దినదినాభివృద్ధిగాంచుచు, 

మహా తేజోవంతుడై తండ్రితో పాలన విషయాదులందు పాల్గొనుచు, దేశమందలి మంచిచెడ్డలను గమనించుచు, విచారించుచు, అతిశ్రద్ధాళుడై ప్రజలమధ్య పెరుగుచుండెను. కుమారుడు పెద్దవాడగుట చూచి యుక్తవయస్సుననే వివాహముజేసి కొంత పరిపాలనా బాధ్యత అతని తలపై పెట్టవలెనని సంకల్పించి, అన్నింటికీ సరిపడునట్టి కోడలు కావలెనని విచారించి, కడకు మగధ నందినియగు సుదక్షిణ అను కన్యతో అత్యంత వైభవముగా వివాహము జరిపించెను. సుదక్షిణ మహాగుణవంతురాలు. సాధ్వియును, సరళ హృదయయునై, పతిననుసరించుచు, ప్రాణసమముగ ప్రేమించి సేవించుచుండెను. పతియగు దిలీపుడు కూడను, మహా గుణవంతుడగుటచే ఆమెకెట్టి లోటునూ లేకుండ చూచుకొనుచు, పరిపాలనా విషయమున తండ్రిననుసరించుచు క్రమక్రమముగా తండ్రి బాధ్యతలన్నింటిని తానే చూచుకొనుచు కొంత విశ్రాంతిని కలిగించుచుండుట ఖట్వాంగుడు గమనించి తనలో తాను కుమారుని తెలివితేటలకును, శక్తి సామర్థ్యములకును ఎంతో సంతసించుచుండెడివాడు.


ఈవిధముగ కొంతకాలము గడచెను. ఖట్వాంగుడు సుముహూర్తమును నిర్ణయించి దిలీపునకు రాజ్యపాలనా పట్టము గావించెను. నాటినుండియు దిలీపు మహారాజను నామముతో సప్తద్వీపవతియగు వసుంధరకు ప్రభువై ధర్మపాలన జరుపుచుండ, సకాల వర్షము కురిసి, సస్యశ్యామలమై సమృద్ధిగా పండి పాడిపంటలకెట్టి కొరతయు లేక నిత్యకల్యాణములతో, వేద పారాయణములతో, శాస్త్రసమ్మతమైన యజ్ఞయాగాది క్రతువులతో అన్ని జాతులవారు హాయిగా జీవించుచుండిరి.


కానీ మహారాజునకు దినములు సంవత్సరములు గడచుకొలది తనలో ఏదో అశాంతి బాధించుచుండినటుల అతని ముఖవర్చస్సు తెలుపుచుండెడిది. కొన్ని సంవత్సరములు గడచెను. ఇచ్ఛ నెరవేరునను ఆశ దినదినమునకు నీరసించెను.


ఒకనాడు తన రాణియగు సుదక్షిణతో తనలోని చింతను ఈరీతిగా వెలిబుచ్చెను: “ప్రియా! మనకింత వరకును సంతానము లేకపోవుటచే కొడుకులు లేరను చింతకంటెను ఇక్ష్వాకు వంశ ప్రసారమెట్లు కాగలదను విచారము నన్ను మరింత బాధించుచున్నది. దీనికి నేనొనరించిన ఏ పాపఫలమో కారణమయి ఉండ వచ్చును. దాని పరిహారార్ధమై ఏమి చేయవలెనో నాకు తోచుటలేదు. దైవ కరుణా కటాక్షమును అందుకొనుటకు తగిన మార్గమేదియో మన కులగురువగు వసిష్ఠులవారిని అడిగి తెలిసికొన వలెనని ఈనాడు నా మనసు తత్తరపడుచున్నది. ఇందుకు నీ ఉద్దేశ్యమేమి?” అని దిలీపుడు అడుగ సుదక్షిణ ఆలస్యము చేయక, ఆలోచించక, “నాథా! ఇదే ఆలోచన నాలోను చాలా దినములనుండి బాధించుచున్నప్పటికిని పతి ఆజ్ఞ లేక నా తలంపును బైట పెట్టుట తప్పగునేమో అని నాలోనే నేను అణచుకొంటిని. తమ ఇచ్ఛననుసరించుటకు నేనెల్లప్పుడు సిద్ధమే అనునది తమకు విదితమే కదా. ఇందుకు ఆలస్యమెందుకు?” అని రాణి తన అంగీకారమును తెలుపగనే, దిలీపుడు రథమును సిద్ధము చేయించి, “ఈనాడు నావెంట పరివారము, రక్షక భటు లెవ్వరును రానక్కరలేద”ని ఆజ్ఞాపించి తానే రథమును నడుపుకొని గురుదేవులగు వసిష్ఠులవారి ఆశ్రమము చేరెను.


రథ శబ్దము వినగనే వెలుపలనున్న ఆశ్రమవాసులు లోనికి వెళ్లి గురువుగారికి తెలుప, వసిష్ఠులవారు ద్వారము చెంతకు వచ్చి దిలీపుని ఆశీర్వదించి కుశల ప్రశ్నలు గావించుచుండ, రాణి సుదక్షిణ చెంతనేయున్న అరుంధతీదేవికి నమస్కరించెను. అంత అరుంధతి ఆమెను ఆశీర్వదించి, ప్రేమతో కుశల ప్రశ్నలు గావించుచు లోనికి తీసుకొని వెళ్లెను. అంత, రాజుకూడను ప్రభు ధర్మము ననుసరించి, “ఆశ్రమ జనులకుకానీ, యజ్ఞ యాగాది సత్కర్మలకుకానీ, లేక ఆహార విహారములకుకానీ, ఎట్టి ఇబ్బందియు లేక అరణ్యమునందు క్రూర మృగముల బాధలులేక, తమతమ నిత్యానుష్ఠానములు సక్రమముగ జరుగుచున్నవి కదా?” అని గురువైన వసిష్ఠులవారిని, ఆశ్రమవాసులను కుశల ప్రశ్నలు గావించుచు, లోనికి వెళ్లి వారివారి ఆసనములు వారు స్వీకరించిరి.


అంత వసిష్ఠులవారు అచటున్న ఆశ్రమవాసులను తమతమ వసతులకు వెళ్ళమని ఆజ్ఞాపించి, రాజు తన ఆశ్రమమునకు రాణీ సమేతుడై వచ్చిన కారణమును తెలుపుమని అడుగ, రాజు తనకుగల కొరతను, విచారమును, వినయముతో విన్నవించి, తమ అనుగ్రహము తప్ప, ఇందుకు అన్యమార్గము లేదని ప్రార్థించెను.``


                  *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*

      *జ్వాలా వారి విశిష్ట*     

      *వ(ర)చనామృతం*  

  *‘శ్రీమద్భాగవత కథలు’* ``

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

భక్త🙏భక్త కవి -- బమ్మెర పోతన🙏

 🙏భక్త🙏భక్త కవి -- బమ్మెర పోతన🙏 

                       రెండవ భాగం 

శ్రీమహాభాగవత ప్రారంభంలో పోతన 'మహా నందాంగనా డింభకు'డైన శ్రీకృష్ణుని చరిత్రను "శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్" అని చెప్పుకొన్నాడు.మనం కూడా ఆ ప్రయత్నాన్నే కొనసాగిద్దాం.


"శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్‌ లోకర

క్షైకారంభకు భక్తపాలనకళా సంరంభకున్‌ దానవో

ద్రేక స్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాలసంభూతనా

నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్‌."


పోతన భాగవతాన్ని తెలుగులో వ్రాయటానికి కారణం ‘ శ్రీ కైవల్య పదం’ అనగా మోక్షాన్ని చేరటానికి వ్రాస్తున్నాను అంటాడు. కావ్య ప్రయోజనం ఇంతకంటే ఏముంటుంది. “పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుండట, పలికిన భవహరమగునట” ( పలికితే పాపాలు పోతాయిట ) కనుక భాగవతాన్ని మనకందించేడు పోతన. మరి శ్రీకైవల్య పదం చేరటానికి ఎవరిని ప్రార్థించాలి! “లోకాలని రక్షించేవాడు, భక్తులను పాలించేవాడు, దానవులను శిక్షించేవాడు, తన కేళీ (ఆట) లీలావిలాస దృష్టితో సమస్తలోకాలని సృజించే వాడు” అయిన శ్రీకృష్ణుని ప్రార్థించాలి అంటాడు. అలా సామాన్యంగా శ్రీకృష్ణుడు అని చెపితే ఎలా! అందుకే ‘ మహానందాంగనా డింభకున్’ అంటే మహానందుని యొక్క అంగన (భార్య) అయిన యశోదాదేవి కుమారుడట. ఈ పదంలో ఇంకో అందమైన అర్థం ఉంది మహా + ఆనంద= తలచి నంతనే గొప్ప ఆనందాన్ని కలిగించేవాడుట కృష్ణుడు. కృష్ అనగా అపరిమిత ణ అంటే ఆనందాన్ని అనే అర్థం కృష్ణ అనే పదం లోనే ఉంది. అది ‘ సహజ కవి, భక్త కవి’ అయిన పోతన కవితా చమత్కారం

సాధారణంగా నాటక లక్షణాలలో నాందీశ్లోకంగాని పద్యంగాని ఉంటుంది. పోతన గారు ఆ లక్షణాన్ని గ్రహించారు.

ఇది నాందీశ్లోకం వంటి పద్యం. ఆశీర్నమస్క్రియా వస్తునిర్దేశాలలోని ఒక లక్షణం నిక్షేపించడం దీని లక్ష్యం. "శ్రీవాణీగిరిజా శ్చిరాయ" అని నన్నయ అన్నాడు. "శ్రీయన గౌరి నాఁబరగు" అని తిక్కన అన్నాడు. "శ్రీకైవల్యపదంబు"ను పోతన్న ప్రస్తావించినాడు. ఈపద్యంలో నమస్క్రియతో పాటు వస్తునిర్దేశం కూడా ఉండటం విశేషం. భాగవత కథానాయకుడు నందనందనుడు. అత డవతార పురుషుడు. లోక రక్షణం ఆ అవతారానికి ప్రేరణం. అతడు గజేంద్రాది భక్తులను పాలించినవాడు. హిరణ్యకశిపు ప్రభృతి దానవుల ఉద్రేకాలను స్తంభింప జేసినవాడు. ఈ రెండు అంశాలు శ్రీమన్నారాయణుని శిష్టరక్షణకూ దుష్టశిక్షణకూ మూలకందాలు. భాగవత కథాచక్రం ఈ రెండు అంశాలచుట్టే చంక్రమించింది. ఈ రకంగా పోతన్న పై పద్యంలోని పాదచతుష్కంలో భాగవతంలోని పన్నెండు స్కంధాల పరమార్థాన్ని నిర్దేశించినాడు. మరొకవిశేషం ఈ పద్యంలోని నందాంగనా డింభకుడు కేవల స్థితికారుడే కాడు, సృష్టికారుడు కూడా. "కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు" అనే ప్రయోగంలో అది ధ్వనించింది. "దానవోద్రేకస్తంభకు" అనే మాటలో అతని లయ కారత్వం స్ఫురించింది. అంటే ఈ పద్యంలో నందింప బడిన పరమాత్ముడు త్రిగుణాత్ముడు. అయితే విశ్లేషించుకుంటే బోధపడే అర్థమిది. ఒక మహోర్మికలా ఉప్పొంగి వచ్చే మూర్తి మాత్రం సత్త్వానిది. కాష్ఠంకంటే ధూమం, ధూమంకంటే త్రయీమయమైన వహ్ని విశేషమైనది. అలాగే తమోగుణం కంటే రజోగుణం, రజోగుణంకంటే బ్రహ్మప్రకాశకమైన సత్త్వం విశిష్టమైనది. (ప్రథమ స్కంధం 59) అందుకే తొల్లిటి మునులు సత్త్వమయుడని భగవంతుడైన హరినే కొలిచినారు. ఆ భగవంతుని సత్త్వనిర్భర స్వరూపమే పైపద్యంలో ఉల్లేఖింపబడింది.


అవతారికలోని రచనాలక్ష్యాన్ని పరికించినా, నాందీపద్యాన్ని పరిశీలించినా పోతన్న ధ్యేయం కైవల్యమేనని బోధపడుతుంది. భవబంధరాహిత్యం, జన్మసాఫల్యం కైవల్యం వల్లనే సాధ్యం. ఆ కైవల్యం పోతన్న వాంఛించిన పరమపదం; పురాజన్మ తపఃఫలం. ఈ కైవల్యకాంక్ష ప్రవృత్తిలా భాసించే నివృత్తి; భాగవతంలోని ప్రధాన రసమైన భక్తికి ఆదిలోనే ఎత్తిన వైజయంతిక.


ఇంచుమించుగా సమకాలీనులైన శ్రీనాథ పోతనామాత్యుల వ్యక్తిత్వాల వాసి ఇక్కడే ఉంది. శ్రీనాథుడు శృంగారిగా ఎంత వ్యాపృతుడైనా 'ఈశ్వరార్చన కళాశీలుండ'ననే చెప్పుకున్నాడు. భోగినీదండకం వంటి పరమశృంగార కృతి రచించినా పోతన్న మహాభక్తుడుగానే పేరొందినాడు. కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మాహాత్మ్యం వంటి భక్తిప్రబంధాలు వ్రాసినా, నైషధంలోని రక్తివల్లనూ, చాటుపద్యాలలోని శృంగార ప్రసక్తివల్లనూ శ్రీనాథుడు శృంగారసనాథుడుగా స్థిరపడినాడు. రుక్మిణీకల్యాణం, రాసక్రీడాభివర్ణనం వంటి ఘట్టాలలో ఎంతటి శృంగార వర్ణనలు చేసినా పోతన్న తెలుగుల పుణ్యపేటిగానే కీర్తింప బడుతున్నాడు. ఇందుకు ఒకకారణం - కాలం గడిచినకొద్దీ వీరిచుట్టూ అల్లుకున్న కట్టుకథలు. మరొకకారణం - కావ్యావతారికల్లో వీరి వ్యక్తిత్వాలు వేసుకున్న ముద్రలు. శ్రీనాథుని కృతులన్నీ నరాంకితాలు. అతని జీవితంలోని ఉజ్జ్వల ఘట్టాలన్నీ రాచకొలువులకే సమర్పితాలు. పట్టెడు వరిమెతుకులు, గుక్కెడు మంచినీళ్ళు పుట్టని దుర్దశలో కూడా ఆ రాజస మూర్తి అటు కృష్ణుణ్ణో, ఇటు శివుణ్ణో దుయ్యబట్టినాడు. ఇరవై సంవత్సరాలు కొండవీటిలో విద్యాధికారిగా ఒక వెలుగు వెలిగి అంతటితో యశోభిలాష సన్నగిల్లక, ఎక్కడో కర్ణాటరాయల కొలువులో, నిక్కిపడే గౌడ డిండిమభట్టును ఉద్భట వివాదప్రౌఢితో ఓడించి, అతని కంచుఢక్కను పగులగొట్టించి, రాయల సభాగారంలో స్వర్ణస్నానం చేయించుకునే దాకా తృప్తిపడని మత్యహంకృతి అతనిది. దిక్కూమొక్కూ లేని అవసానదశలో దివిజకవివరుని గుండియలు దిగ్గురనేటట్టు కడ ఊపిర్లో గూడా కవిత లల్లగల్గిన ప్రౌఢవ్యక్తిత్వం అతనిది. మరి పోతన్న వ్యక్తిత్వం ఇందుకు భిన్నం. అతడు నరాధిపులను కొలువలేదు; సిరులకై ఉరుకులాడలేదు; అధికారాన్ని ఆశించలేదు; అహంకారాన్ని ప్రకటించలేదు. పూర్వకవులతోపాటు, వర్తమాన కవులతో పాటు భావికవులను గూడా బహూకరించిన వినయభూషణు డతడు. సమకాలీనకవులను సంభావించడమే ఒక విశేషం. పుట్టని కవులకు జేకొట్టడం పోతన్న సహనశీలానికి నిదర్శనం. సహనగుణం సత్త్వం పాదులో పుట్టేదే కదా! ఈ సత్త్వగుణాన్ని ఆధారంగా చేసుకునే పోతన్న నిరాడంబర వ్యక్తిత్వాన్ని గూర్చీ, నరాధిప పరాఙ్ముఖత్వాన్ని గూర్చీ కొన్ని చాటు కథలు ఆ నోటికానోటి కెక్కి నేటికీ తెలుగునాట వాడుకలో ఉన్నాయి. భాగవతాన్ని తన కంకిత మివ్వవలసిందని సర్వజ్ఞసింగ భూపాలుడు కోరడం, పోతన్న కాదనడం, భూపాలునికి కోపం వచ్చి దానిని నేలపాలు చేయడం - ఇదోకథ. శ్రీనాథుడూ పోతన్నా స్వయానా బావమరదులు.ఇది వాస్తవం కాదు. శ్రీనాథునకు పోతన అనే బావమరిది ఉన్నమాట నిజమే కానీ అతను దగ్గుపల్లి పోతన.దగ్గుపల్లిదుగ్గన సోదరుడు. అంతవరకూ ఎందుకు? శ్రీనాథుని తొంబై సంవత్సరాల వయస్సులో పోతన ఏడు ఎనిమిది ఏళ్ల బాలుడు. ఇది కాలాలను బట్టి చరిత్ర చెబుతున్న సాక్ష్యం. ప్రస్తుత విషయం చూడాలి.పోతన్న పొలం దున్నుతుంటే ఆ'నాథన్న' పల్లకిలో రావడం, అటు బోయీలు లేకుండా పల్లకి తేలిపోవడం, ఇటు ఎడ్లు లేకుండా నాగలి సాగిపోవడం - ఇది మరోకథ. ఇవే కాక 'కర్ణాటకిరాటకీచకు' లెవరో అతని కృతిని కాజేయాలని వస్తే ఆ తల్లి సరస్వతి 'కాటుక కంటి నీరు చనుకట్టు' మీద పడేటట్టు బావురు మనడం, "అమ్మా! ఏడువకమ్మా! నిన్ను ఎవరికీ అమ్మనమ్మా!" అని ఈ పరమభక్తుడు ఓదార్చడం - ఇదో పిట్టకథ. కృతిని ఇక్కడ 'ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి', అక్కడ 'కాలుచే సమ్మెటవ్రేటులం బడక' బమ్మెర పోతరాజు భాగవతాన్ని 'సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె'నని అవతారిక లోని మరోపద్యం ఇచ్చే సాక్ష్యం. పోతన్న పేరు చెప్పితేనే సగటు సాహితీ బంధువులకు ఈ పద్యమే గుర్తు కొస్తుంది. ఈ పద్యం పోతన్నది కాదంటే చాలా మందికి గుండెల్లో కలుక్కుమంటుంది. నిజానికి ఈ పద్య రచనలో ఏ కోశానా పోతన్న శైలీవాసన లేదు. 'సొమ్ములు కొన్ని పుచ్చుకొని', 'సొక్కి', 'శరీరము వాసి', 'కాలుచే సమ్మెటవ్రేటులు' 'సమ్మతి', 'ఇచ్చిచెప్పె' ఈ 'బమ్మెరపోతరా జొకఁడు' - ఇదీ ధోరణి. ఇవి పోతన్న పలుకులేనా? భావికవులను బహూకరించిన, భవబంధవిమోచనం ఆశించిన భక్తశిరోమణి మాటలేనా? కాదన వలసిన అవసరం లేకుండానే మరొక అంతస్సాక్ష్యం ఉంది. ఈ పద్యానికి ముందుమాట 'ఉభయ కావ్యకరణ దక్షుండనై' అన్నది. ఇది ఉత్తమపురుషంలో ఉంది. వెంటనే 'ఇమ్మనుజేశ్వరాధముల' పద్యంలో 'బమ్మెరపోతరాజొకఁడు' అంటూ ప్రథమ పురుషం దూకుడుంది. ఆ పద్యం తరువాత మరొక పద్యం. తరువాత 'అని మదీయ' అంటూ మళ్లీ ఉత్తమపురుషం దర్శనం ఇచ్చింది. పద్యశిల్పాన్నిబట్టే కాక అన్వయ దోషాన్ని బట్టి చూసినా ఇది పోతన్న పద్యం కాదనే అనిపిస్తుంది. అతని భక్తులో, అనురక్తులో తదనంతర కాలంలో ఈ పద్యాన్ని జొప్పించి ఉంటారు. ఎవరో ఎందుకు? అతని శిష్యుడు సింగయ్యే వ్రాసి ఉంటాడేమో? సింగయ్య భాగవతంలోని షష్ఠ స్కంధాన్ని రచించినాడు. పోతన్న పోతలోనే ఇతనూ ఒక అవతారిక సంతరించుకున్నాడు. పూర్వకవిస్తుతిలో శ్రీనాథునితోపాటు బమ్మెరపోతరాజును స్మరించినాడు. పోతరాజును స్తుతిస్తూ చెప్పిన పద్య మిది:


"ఎమ్మెలు సెప్పనేల? జగమెన్నఁగఁ బన్నగరాజశాయికిన్‌

సొమ్ముగ వాక్యసంపదలు నూఱలు చేసినవాని భక్తిలో

నమ్మినవాని భాగవతనైష్ఠికుఁడై తగువానిఁ బేర్మితో

బమ్మెర పోతరాజు కవి పట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్‌."

ఈ పద్యంలో ఒకటి రెండు అంశాలు గమనింపదగినవి ఉన్నాయి. 'ఇమ్మనురాజేశ్వరాధముల' పద్యంలో 'సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె' 'ఈబమ్మెర పోతరా జొకఁడు భాగవతంబు' అని ఉంది. 'ఎమ్మెలు సెప్పనేల' పద్యంలో 'పన్నగరాజశాయికిన్‌', 'సొమ్ముగ ... భాగవత నైష్ఠికుఁడై ... తగువాని ... బమ్మెర పోతరాజు.' అని ఉంది. ఆ పద్యంలో ప్రాసస్థానంలో 'సొమ్ములు' 'బమ్మెర' ఉన్నాయి. ఈ పద్యంలోనూ ఆ మాటలే ఉన్నాయి. అక్కడ 'జగద్ధితంబుగన్‌' అని ఉంటే ఇక్కడ 'జగమెన్నఁగ' అని ఉంది. 'సమ్మతి శ్రీహరి కిచ్చి' చెప్పడం అని అందులో ఉంటే ఆ స్వామికి 'సొమ్ముగ వాక్యసంపదలు నూఱలు' చేయడం ఇందులో ఉంది. ఈ రెండు పద్యాల్లోనూ పోతన్న భక్తి తత్పరతే ఉగ్గడింపబడింది. పైగా రెండుపద్యాల గతికూడా ఒకేస్థితిలో ఉంది. కనుకనే ఈ సింగయ్యే ఆ పద్యం రచించి పోతన్న అవతారికలో చేర్చి ఉంటాడేమో అనే సందేహం కలుగుతుంది. అలాకాదు. పోతన్న పద్యానికే సింగన్న పద్యం అనుకరణమేమో అని ఎవరైనా వాదించవచ్చు. . పద్యశిల్పంలో గానీ, పదప్రయోగంలో గానీ, భావశుద్ధిలోగానీ ఈ పద్యంలో పోతన్నముద్ర ఏమాత్రం లేకపోవడమే. ఇంకా 'హాలికులైననేమి, గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి' అంటూ ప్రాసస్థానంలో గుప్పించిన అనుప్రాస సౌరభం ఇందుకు సాక్ష్యం.

                 సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ 


             

కవితల నల్లగ వచ్చును

 కవితల నల్లగ వచ్చును 

మూగకు మాటలు నేర్పను వచ్చును 

వైరిని చేరి ప్రియభాషణలాడగ వచ్చును 

దైవమ్ము వెన్నంటి ఉంటే భార్గవ 

“కాల్‌ మెర్జింగ్ స్కామ్

 *_“కాల్‌ మెర్జింగ్ స్కామ్”: ఫోన్‌లోనే జరిగే కొత్త తరహా దొంగతనం – తెలుసుకోకపోతే క్షణాల్లో ఖాతా ఖాళీ!_* 


_ఇంటర్నెట్ యుగంలో సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త రూపాల్లో మన ముందుకొస్తున్నాయి._

_చదువుకున్నవారు, టెక్నాలజీ తెలిసినవారు కూడా ఈ మోసాలకు బలి అవుతున్నారు._ _ఇలాంటి తెలివైన నేరాల్లో తాజాగా ఎక్కువగా జరగుతున్నదే కాల్ మెర్జింగ్ స్కాం. ఈ స్కాం ఎంత ప్రమాదకరమో, ఎలా పనిచేస్తుందో, ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం._ 



*_కాల్ మెర్జింగ్ స్కాం అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?_* 


_సాధారణ కాల్‌సెంటర్ మోసాల్లా కాకుండా ఇది చాలా ప్లాన్ చేసి, మన నమ్మకాన్ని ఉపయోగించుకునే విధంగా జరుగుతుంది._ 


*_1️⃣ మొదటి వల — అజ్ఞాత వ్యక్తి నుంచి కాల్_* 


_ఒక తెలియని వ్యక్తి మీకు కాల్ చేసి,_ 

_“మీ ఫ్రెండ్ నాతో మాట్లాడాలని చెప్పారు… మీ నెంబర్ ఆయనిచ్చారు” అని చెబుతాడు._ 

_మనసులో అనుమానం రాకుండా మాటలతో నమ్మిస్తాడు_ .


*2️⃣ _రెండో వల — ఫేక్ ఫ్రెండ్ కాల్_* 


_అదే సమయంలో మీ ఫ్రెండ్ పేరు చెప్పి వేరే నెంబర్ నుంచి మరో కాల్ వస్తుంది._ 

_ఆ వాయిస్ కూడా ఫ్రెండ్‌లాగే ఉండేలా వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ వాడే అవకాశం ఉంది._ 


*_3️⃣ క్లైమాక్స్ — “కాల్ మెర్జ్ చెయ్యండి” అన్న డిమాండ్_* 


_ఇద్దరి కాల్స్‌ను మెర్జ్ చేయమని అడుగుతారు._ 


_మీరు మెర్జ్ చేసిన క్షణానికే గేమ్ ముగుస్తుంది._ 


*_4️⃣ బ్యాంక్ ఓటీపీ కాల్‌కు క్రిమినల్స్‌ను కనెక్ట్ చేస్తారు_* 


_మీ పేరుతో బ్యాంక్‌లో వారు ట్రాన్సాక్షన్ ట్రై చేస్తారు._ 

_బ్యాంక్‌ నుంచి వచ్చే OTP Call / Voice OTP / IVR Verification నేరుగా క్రిమినల్ చెవుల్లోకి వెళుతుంది._ 


*_5️⃣ క్షణాల్లోనే ఖాతా ఖాళీ_* 


_మీరు ఏమి జరిగిందో అర్థం చేసుకునేలోపే, మీ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతాయి._ 


*_ఇలాంటి మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలి?_* 


_1) OTP ఎప్పుడూ చెప్పొద్దు_ 


_OTPని అడిగే వారు ఎవరైనా సరే — ఫ్రెండ్, రిలేటివ్, బ్యాంక్ అని చెప్పినా — ఇవ్వొద్దు._ 


_2) అజ్ఞాత కాల్స్‌ను మెర్జ్ చేయకండి_ 


_తెలియని వ్యక్తులు, వేరే నెంబర్ నుంచి వచ్చే ఫ్రెండ్ కాల్స్ — వీటిని కనెక్ట్ చేయడం ప్రమాదం._ 


_3) ఫ్రెండ్ నుంచి వేరే నెంబర్ వచ్చినా వెంటనే నమ్మవద్దు_ 


_ముందుగా మీరు తెలిసిన అసలు నెంబర్‌కు కాల్ చేసి నిర్ధారించుకోండి._ 


_4) అనుమానం వచ్చిన వెంటనే చర్య_ 


_1930 – నేషనల్ సైబర్ ఫ్రాడ్ హెల్ప్‌లైన్_ 


_cybercrime.gov.in – వెంటనే కంప్లైంట్ పెట్టండి_ 


_మీ బ్యాంక్‌కు కాల్ చేసి Card/Account Freeze చేయించండి_ 



_గోల్డెన్ అవర్: మోసం జరిగిన మొదటి 1–2 గంటల్లో రిపోర్ట్ చేస్తే డబ్బు రికవరీ అవకాశాలు ఎక్కువ._ 



*_చివరి మాట.._* 


_కాల్ మెర్జింగ్ స్కాం కొత్తదైనా, దాని లక్ష్యం పాతదే — మీ డబ్బు._ 


 *_“OTP ఇవ్వకండి, కాల్స్ మెర్జ్ చేయకండి… అప్పుడు మీ ఖాతా సురక్షితం.”_*

నిన్నేభజింతు నెవరే

  నిన్నేభజింతు నెవరే

మన్నను,రక్షించువాడవభవా!నీవే

అన్నెము,పున్నెం బెరుగను

క్రన్నన సుజ్ఞానమిమ్ము ఘనగౌరీశా! 106


కరుణాసాగర!శంకర!

వరదా!శ్రీభీమలింగ!పార్వతిరమణా!

పురహర!ఫాలవిలోచన!

పరమేశా!నీలకంఠ!వరగౌరీశా! 107


వర గౌరీశా శతకము

పరమేశా!నీవుచెప్పి పలికించినదే

ఎరుగనునే నీమహిమలు

కరుణనుకాచుదువు సతము ఘనగౌరీశా! 108


సర్వమ్ శ్రీపరమేశ్వరార్పణమస్తు

            ఓమ్ తత్ సత్


           🙏ప్రయాగ🙏

*ఆచార్య సద్బోధన*



               *ఆచార్య సద్బోధన*

                  ➖➖➖✍️


```

ప్రతి జీవియు ఆనందము కొరకై తహతహలాడుతున్నాడు.


దుఃఖమును పోగొట్టుకొనుటకై తీవ్రముగ అభిలషించుచున్నాడు.


బంధ విముక్తికై ఉత్కంఠను వెలిబుచ్చుతున్నాడు. మోక్షమునకై అర్రులు చాచుచున్నాడు.


కాని ఆ మోక్షము ఎట్లు లభించును? 


మోక్షమునకు ఆత్మ జ్ఞానము అవసరము. ఆత్మ జ్ఞానమునకు చిత్తశుద్ధి అవసరము. చిత్తశుద్ధికి సచ్ఛీలము అవసరము.


అట్టి సచ్ఛీలము, సచ్చరిత్ర మనుజునకు కలుగవలెను అనిన, అతడు పుణ్యకార్య తత్పరుడై, పాపవిముఖత్వము కలిగి ప్రవర్తించవలెను.


సద్గుణావలంబియై, దుర్గుణములకు లవలేశమైనను తన హృదయమున చోటీయక పాప భీతి కలిగి ప్రవర్తింపవలయును.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```


దాతలకు సౌకర్యాలు*

 *తిరుమలలో విరాళం ఇచ్చే దాతలకు సౌకర్యాలు*: తిరుమల శ్రీవారికి లక్ష నుండి కోటి రూపాయలు కు పైగా డోనేషన్ ఇచ్చేవారికి కల్పించే సౌకర్యాలు


*లక్ష - ఐదు లక్షల రూపాయల డొనేషన్*:-తిరుమలలో లక్ష నుంచి 5 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒకరోజు 5 మందికి సుపథం దర్శనం కల్పిస్తారు. 1 రోజు 100/- రూమ్ ఇస్తారు. 6 చిన్న లడ్డులు ఒక దుప్పటి ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు. 


*ఐదు - పది లక్షల రూపాయల డొనేషన్*:- తిరుమలలో ఐదు నుంచి 10 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మూడు రోజులు 5 మందికి సుపథం దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 100/- రూమ్ ఇస్తారు. 10 చిన్న లడ్డులు మరియు ఒక మహా ప్రసాదం ఒక దుప్పటి ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు.


*పది - 25 లక్షల రూపాయల డొనేషన్*:- తిరుమలలో 10 - 25 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మూడు రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 500/- రూమ్ ఇస్తారు. 20 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 సిల్వర్ కాయిన్ (50 గ్రాములు).


*25 - 50 లక్షల రూపాయల డొనేషన్*:- తిరుమలలో 25 - 50 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒక రోజు సుపథం దర్శనం మరియు మూడు రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 1500/- రూమ్ ఇస్తారు. 4 పెద్ద లడ్డులు 5 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 గోల్డ్ డాలర్ (5 గ్రాములు) + ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రాములు).


*50 - 75 లక్షల రూపాయల డొనేషన్*:- తిరుమలలో 50 - 75 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒక రోజు సుప్రభాత సేవ మరియు 2 రోజులు సుపథం దర్శనం మరియు మూడు రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 2000/- రూమ్ ఇస్తారు. 6 పెద్ద లడ్డులు 10 చిన్న లడ్డులు మరియు 10 మహా ప్రసాదాలు ఒక దుప్పటి ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 గోల్డ్ డాలర్ (5 గ్రాములు ) + ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రాములు).


*కోటి రూపాయలు డొనేషన్*:- తిరుమలలో 75 లక్షలు నుంచి 1 కోటి రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం రెండు రోజులు సుప్రభాత సేవ మరియు 3 రోజులు సుపథం దర్శనం మరియు 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 2500/- రూమ్ ఇస్తారు. 8 పెద్ద లడ్డులు 15 చిన్న లడ్డులు మరియు 10 మహా ప్రసాదాలు, ఒక దుప్పటి ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు. మరియు 1 గోల్డ్ డాలర్ (5 గ్రాములు ) + ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రాములు).


*కోటి రూపాయలు పైన డొనేషన్*:- తిరుమలలో 1 కోటి రూపాయల పైన డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం 3 రోజులు సుప్రభాత సేవ మరియు 4 రోజులు సుపథం దర్శనం మరియు 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 3000/- రూమ్ ఇస్తారు. 10 పెద్ద లడ్డులు 20 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు ఒక దుప్పటి ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 గోల్డ్ డాలర్ (5 గ్రాములు) + ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రాములు) మరియు వేద ఆశీర్వచనం.

పంచాంగం 16.12.2025 Tuesday,

 ఈ రోజు పంచాంగం 16.12.2025 Tuesday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస కృష్ణ పక్ష ద్వాదశి తిథి భౌమ వాసర స్వాతి నకత్రం అతిగండ యోగః కౌలవ తదుపరి తైతుల కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 

యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు. 

  

 

శ్రాద్ధ తిథి: , ద్వాదశి

 


నమస్కారః , శుభోదయం