30, సెప్టెంబర్ 2022, శుక్రవారం

శ్రీదేవీసంస్తుతి-5

 శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీసంస్తుతి-5 


పంచమి 

9.

మత్ హృన్మందిరదివ్యధామ్నినివసత్ హ్రీంకారబీజేశ్వరీమ్ 

నిత్యానందగుణస్వరూపరుచిరాం నిత్యాం పరాదేవతామ్ 

ఆత్మజ్ఞాననియంత్రణైకకుశలా మార్యాం కలాధారిణీమ్ 

అంతర్యాగపరాయణైకసులభాం వందే జగన్మాతరమ్ 


10. కాలిక 

విద్యానుగ్రహశాలినీం స్తుతమతిం కామ్యప్రదాం కాలికామ్ 

శత్రూణాం ప్రవిమర్దినీం ధృతిమతీం సామ్రాజ్యలక్ష్మీప్రదామ్ 

ప్రజ్ఞాం నిర్గుణపూజనప్రియమతీం కామ్యార్థకల్పద్రుమామ్ 

దుష్టారిష్టతమోంఽధకారశమనాం స్తోతాస్మహే దేవతామ్ 

*~శ్రీశర్మద*

గోత్రమని అంటే

 *గోత్రం అంటే ఏమిటి?* 

సైన్సు ప్రకారము  మన పూర్వీకులు గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో గమనించండి.


మీరు పూజలో కూర్చున్న ప్రతిసారీ, పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? మీకు తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు??


గోత్రం వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు- 

*జీన్-మ్యాపింగ్* అని ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన అధునాతన శాస్త్రమే!


గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి ?

మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది? 

వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనము ఎందుకు భావిస్తాము? 


కొడుకులకు ఈ గోత్రం  ఎందుకు వారసత్వంగా వస్తుంది మరి కుమార్తెలు ఎందుకు రాదు?

వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా / ఎందుకు మారాలి? తర్కం ఏమిటి?


ఇది మనము అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం. మన గోత్ర వ్యవస్థ వెనుక జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం!


గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది. మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం

గోత్రం అంటే 'గోశాల' అని అర్ధం.


జీవశాస్త్రపరంగా, మానవ శరీరంలో  23 జతల క్రోమోజోములు ఉన్నాయి, వీటిల్లో సెక్స్ క్రోమోజోములు (తండ్రి నుండి ఒకటి మరియు తల్లి నుండి ఒకటి) అని పిలువబడే ఒక జత ఉంది. ఇది వ్యక్తి(ఫలిత కణం) యొక్క లింగాన్ని (gender) నిర్ణయిస్తుంది.


గర్భధారణ సమయంలో ఫలిత కణం XX క్రోమోజోములు అయితే అమ్మాయి అవుతుంది, అదే XY అయితే అబ్బాయి అవుతాడు.


XY లో - X తల్లి నుండి  మరియు Y తండ్రి నుండి తీసుకుంటుంది.


ఈ Y ప్రత్యేకమైనది మరియు అది X లో కలవదు.  కాబట్టి XY లో, Y X ని అణచివేస్తుంది , అందుకే కొడుకు Y క్రోమోజోమ్‌లను పొందుతాడు. ఇది మగ వంశం మధ్య మాత్రమే వెళుతుంది. (తండ్రి నుండి కొడుకు మరియు మనవడు ముని మనవడు ... అలా..).


మహిళలు ఎప్పటికీ Y ను పొందరు. అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో Y కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ Y ను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినది అవుతుంది. అలా తన కూతురి గోత్రం వివాహం తరువాత మార్పు చెందుతుంది. 


ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి...

గోత్రం ప్రకారం సంక్రమించిన Y క్రోమోజోమ్‌లు ఒకటిగా  ఉండకూడదు. ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాలను సక్రియం చేస్తుంది.


ఇదే కొనసాగితే, ఇది పురుషుల సృష్టికి కీలకమైన Y క్రోమోజోమ్ పరిమాణం మరియు బలాన్ని తగ్గిస్తుంది. కొన్ని సందర్భాలలో నశింపజేస్తాయి.


ఈ ప్రపంచంలో Y క్రోమోజోమ్ లేనట్లయితే, మగజాతే అంతరించిపోయేలా చేస్తుంది.


కాబట్టి గోత్రవ్యవస్థ జన్యుపరమైన లోపాలను నివారించడానికి మరియు Y క్రోమోజోమ్‌ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే స్వగోత్రం. అందుకనే స్వగోత్రీకుల మధ్య వివాహం నిషేధించారు...


మన మహాఋషులచే సృష్టించబడ్డ అద్భుతమైన బయోసైన్స్ గోత్రం. ఇది మన భారతీయ వారసత్వ సంపద అని నిస్సందేహంగా చెప్పవచ్చు.


మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే _ "GENE MAPPING" _ క్రమబద్ధీకరించారు.


అందుకనే ఈసారి ఎవరైనా గోత్రమని అంటే చాదస్తం అని కొట్టి పడేయకండి.

ఇలా వివరణతో సహా చెప్పండి. షేర్ చేయండి

నిబంధన తీసుకురావాలి._*

 🌼🌼💧🌿🌿🌿☄️

*_18 ఏళ్లకే డ్రగ్స్, గంజాయి, ఆల్కహాల్ ,సిగరెట్లకి బానిసలుగా మారుతున్న  యువతను కాపాడేదెట్ల?_*


  *_ఇనుప కండలు, ఉక్కు నరాలతో ఉండాల్సిన యువత  మత్తు పదార్థాలకు బానిసై పెలుసుగా మారి  సమయం వృధా చేస్తూ  దేశ భవిష్యత్తు ని ప్రమాదంలోకి నెడుతున్న నేటి పరిస్థితుల్లో యువత ని కాపాడే బాధ్యతను తల్లిదండ్రులు ప్రజలు ..ఉపాధ్యాయులు,ప్రభుత్వాలు  తీసుకొని  తగు ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది._*


*_ఇప్పుడు ఎందుకు చెపుతున్నాను అంటే ఈ రోజు  విచారిస్తే  అతని కస్టమర్స్ లో  90 శాతానికి పైగా  విద్యార్థులే ఉన్నారని ఇది బాధాకరమని  చెప్పడం విన్నాను, పోలీసులు, ప్రభుత్వం ఎంత కట్టడి చేసిన ఎక్కడో ఒక దగ్గర డ్రగ్స్& గంజాయిని యువత  దొరికించుకోగలరు?  అందుకే దీనికి  అడ్డుకట్ట ఎట్లా ?అంతం ఎక్కడ....? అని నేను ఆలోచిస్తే  నా మదిలో కొన్ని ఆలోచనలు   మెదిలాయి._*




*_1) విద్యార్థుల కు   ఇంటర్ నుండి  పరీక్షలు రాయాలన్నా.. పై చదువులకు  అర్హత , అడ్మిషన్స్  పొందాలన్నా  ఆల్కహాల్ &  డ్రగ్స్ టెస్ట్ చేసి  అందులో క్లీన్ గా ఉన్నవారికే  అనుమతి ఇవ్వాలి అనే నిబంధన తీసుకురావాలి._*


*_2). ప్రభుత్వ  ఉద్యోగాలకు   పరీక్షలు రాయాలన్న మరియు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత  సాధించాలంటే అన్ని అర్హతలతో పాటు ఆల్కహాల్ & డ్రగ్స్ క్లీన్  సర్టిఫికేట్  కూడా  ఉండాలి  అనే నిబంధనలు పెట్టాలి._*


*_3)  IT, BT, ఇతర ప్రైవేట్ రంగ ఉద్యోగాలకు  కూడా  డ్రగ్స్ సర్టిఫికెట్   తప్పనిసరి చేయాలి._*


*_4). స్వయం ఉపాధికి ప్రభుత్వ రుణాలు ,సబ్సిడీలు పొందాలంటే  కూడా డ్రగ్స్ సర్టిఫికెట్   సమర్పించాలి అనే నిబంధనలు పెట్టాలి._*


*_5). పెళ్ళిళ్ళకి కూడా డ్రగ్స్ క్లీన్ సర్టిఫికెట్  నిబంధన పెట్టాలి_*


*_నేను పైన చెప్పిన కొన్ని ఆలోచనలు కొంత వరకైనా  యువతను  కాపాడగలదని  అనుకుంటున్నాను.లేదంటే  దేశాభివృద్ధి కి తీవ్ర విఘాతం కలుగుతుంది. మీరు కూడా కొంత ఆలోచన చేసి  డ్రగ్స్ ,ఆల్కహాల్ భారీ నుండి యువతకి ఎలా కాపడవచ్చో  మీకున్న ఆలోచనలు పంచుకోండి._*

🙏🙏🙏🙏

శారదదాంబా

 🪷శృంగేరి పీఠం శంకరమఠము, *శారదదాంబా* 

 తేది 30 సెప్టెంబరు, 2022 శుక్రవారం (భృగువాసరే)    

*శరన్నవరాత్రుల* - ఐదవ రోజు *ఇంద్రాణి*

*(శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి)* అలంకరణ విద్యానగర్ - నల్లకుంట, హైదరాబాదు....🙏


*కిరీటిని మహావజ్రే సహస్రనయనోజ్జ్వలే |వృత్రప్రాణహరే చైంద్రి నారాయణి నమోఽస్తుతే* ||


*చక్రాకారం మహత్తేజః తన్మధ్యే పరమేశ్వరీ ! జగన్మాతా జీవదాత్రీ నారాయణీ పరమేశ్వరీ* !!


*వ్యూహతేజో మయీ బ్రహ్మానందినీ హరిసుందరీ ! పాశాంకుశేక్షుకోదండ పద్మమాలాలసత్కరా !!*


*దృష్ట్వా తాం ముముహుర్దేవాః ప్రణేముర్విగతజ్వరాః ! తుష్టువుః శ్రీమహాలక్ష్మీం లలితాం వైష్ణవీం పరాం !!*


🌹🌷🙏🪷🪷🙏🌷🌹

మోక్షద్వారాలు

 #మోక్షద్వారాలు తెరిచే... ఈ దానాలు తప్పక చేయండి!

పూర్వ జన్మలో మనం చేసిన దాన ధర్మాల ఫలితమే ఈ జన్మ అనేది, చాలా మంది విశ్వాసం. ఈ జన్మ లో చేసిన దాన ధర్మాలు వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగ పడతాయి అనే మాటలు మనం వింటూ ఉంటాము. అయితే, శాస్త్రాలు, పురాణాలు కూడా, దానం చేయడం వలన సకల పుణ్య ఫలాలూ ప్రాప్తిస్తాయని చెబుతున్నాయి. ఈ కారణంగానే చాలా మంది గుడిలో దైవ దర్శనం చేసుకున్న తరువాత, గుడి దగ్గర నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని మాత్రమే అర్హులుగా భావించి, తమకి తోచిన విధంగా బియ్యం, డబ్బులు, పళ్ళు, వస్త్రాలు, ఇలా దాన ధర్మాలు చేస్తుంటారు. అయితే, పేదవానికి మీ శక్తి కొలదీ చేసే ద్రవ్య సహాయము కానీ, వస్తు సహాయము కానీ, ‘ధర్మం’ అంటారు. ఇలా ‘ధర్మం’ చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం, ఇహ లోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది. మనకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు. కానీ, ఏదైనా దానంగా ఇవ్వడానికి వీలు లేదు. దానం చేయడానికి కొన్ని పరిధులున్నాయి. ఏది పడితే అది దానం చేయడానికి వీలులేదు. శాస్త్ర నియమానుసారంగా, దాన యోగ్యమైనవి కొన్ని ఉన్నాయి. వాటిని మాత్రమే దానం చేయాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు. ఇవి మొత్తం 10 దానాలు: 1. దూడతో కూడుకున్న ఆవు: ఇదే గోదానం, 2. భూ దానం, 3. నువ్వులు, 4. బంగారము, 5. ఆవునెయ్యి, 6. వస్త్రములు, 7. ధాన్యము, 8. బెల్లము, 9.వెండి, 10. ఉప్పు.. ఈ పదింటినీ దశ దానములుగా శాస్త్రం నిర్ణయించింది. వీటినే మంత్ర పూర్వకంగా దానం చేయాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. అన్నదానం, వస్తద్రానం, జలదానం గోదానం, కన్యాదానం, సువర్ణదానం, భూదానం మొదలైనవన్నీ చాలా విశిష్టమైనవి. మనిషిని సంతృప్తి పరచేది అన్నదానము. దాహార్తిని తీర్చేది జలదానం. ముఖ్యంగా వేసవికాలంలో బాటసారుల దాహార్తిని తీర్చటం ద్వారా, వారికి మనమెంతో మేలుచేసిన వారమౌతాం. వస్త ద్రానం చేస్తే, సాక్షాత్తూ ఆ భగవంతుడికే వస్త్రాన్నిచ్చిన పుణ్యం కలుగుతుంది. ఎండా, వానా, చలినుండి, పేదలను కాపాడిన తృప్తి మనకు దక్కుతుంది. ఇక కన్యా దానం చేయటం ద్వారా, ఆ కన్య ద్వారా ఒక వంశం వృద్ధి చెందుతుంది. తద్వారా కొన్ని తరాల పరంపర కొనసాగుతుంది. గోదానం మహిమ, చెప్పనలవికానిది. గోవునూ దూడనూ కలిపి దానం చేస్తే, మన పితృదేవతలను వైరతరణీ నదిని దాటించి, స్వర్గలోక గతులను చేసిన పుణ్యం దక్కుతుంది. దానాలన్నింటిలోకీ ఉత్కృష్టమైనది, భూదానం. భూమిని మన పెద్దలు రత్నగర్భ అని పిలిచేవారు. సువర్ణ, జల, నవరత్న ఖచిత మణి మణిక్యాదులన్నీ, భూమిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి, భూమిని దానం చేయటంవల్ల, భూమితోపాటుగా, పైవాటినన్నింటినీ కూడా దానం చేసిన ఫలితం ఉంటుంది. ఆ భూమిలో పొందే పంటల వలన మానవులకే కాక, పశు పక్ష్యాదులకన్నింటికీ ఆహారం చేకూర్చిన వాళ్లమవుతాం. పేదలకు జీవన భృతి దొరుతుంది. చేసిన దాన ధర్మాల వలన, ఆజన్మాంతరం అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రత్యుపకారమునాశింపక చేసే దానము పుణ్యప్రదము. కానీ, ప్రతిఫలాన్ని ఆశించి దానం చేస్తే, అది దానంగా గ్రహించబడదు. అంటే, ఇదిగో ఈ దానం చేస్తున్నాంగనుక, ఈ ఫలం తప్పక రావాల్సిందే.. అనిగాక, ఎదుటివారి అవసరాన్ని ఎరిగి, వారికి కావలసిన వస్తువులను దానం చేయడం, ఉత్తమం. దాని వల్ల మంచి ఫలితమే వస్తుందని, మన పురాణాలు చెబుతున్నాయి. ఏమి చేస్తామో, ఏమి ఆలోచిస్తామో, అవే ఎదురవుతుంటాయి. ఆకలిగొన్నవారినీ, అనాధలనూ, రోగులనూ, అసమర్థులనూ, అన్న, వస్త్ర, ఓషధులు మొదలైనవి లేనివారినీ, విద్వాంసులనీ, బ్రాహ్మణులనీ, ధనాదులచే ఆదుకొనుటా, సత్కరించుట కూడా దానమనే చెప్పవచ్చు...

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

పార్వతి పేర్లు

 శ్లోకం:☝️అమరకోశంలో పార్వతి పేర్లు

*ఉమా కాత్యాయనీ గౌరీ కాళీ హైమవతీశ్వరీ*

*శివా భవానీ రుద్రాణీ శర్వాణీ సర్వమఙ్గళా l*

*అపర్ణా పార్వతీ దుర్గా మృడానీ చణ్డికాఽమ్బికా*

*ఆర్యా దాక్షాయణి చైవ గిరిజా మేనకాత్మజా ll*


భావం: ఉమా = ఉ+మా = ఉ అంటే ఎవరినైనా పిలుచుట, మా = వద్దు, పార్వతి శివుని కొరకు తపస్సు చేయడానికి బయలుదేరగా ఆమె తల్లియైన మేనక పార్వతిని ‘‘ఓయి ! వద్దు’’ అని వారించెను.

పార్వతీ; కాత్యాయనీ = జగన్మాత కాత్యాయన మహర్షి కూతురుగా జన్మించెను. అందువలన పార్వతీదేవి కాత్యాయనీ అనే పేరుతో కూడా పిలవబడుచున్నది. 

గౌరీ = సహజముగా పార్వతి రంగు నలుపు, ఐతే ఆమె బ్రహ్మకోసం తపస్సు చేసి బంగారు రంగుకు మార్పు చెందింది.

కాళీ = పార్వతి యొక్క ముదురు నలుపు రూపాన్ని కాళీగా పిలుస్తారు. ఆమె అశుభమైనవి నాశనం చేస్తారు;

హైమవతీ = పర్వతరాజైన హిమవంతుని కూతురు;

ఈశ్వరీ = భగవతీ, జగన్మాతా;

శివా = పార్వతి శివుని యొక్క ఉనికి. అందుకని పార్వతిని శివా మరియు శివానీ అని పిలుస్తారు.

భవానీ = ఉత్పత్తి జేయగల శక్తి కలిగిన మాత; 

రుద్రాణీ = రుద్రుని (శివుడు) యొక్క దేవేరి ;

శర్వాణీ = శర్వా (నలుపు) అవతారం లో శివుని యొక్క దేవేరి ; 

అపర్ణా = అ+పర్ణ = పార్వతి శివుని కోసం ఏమీ (కనీసం ఆకులైన ) తినకుండా తపస్సు చేస్తుంటే అక్కడ ఉన్న సాధువులు ఆమెను అపర్ణా అని పిలిచేవారు.

పార్వతీ = పర్వతరాజు కూతురు; 

దుర్గా = పార్వతి యొక్క రూపం, అజేయురాలు;

మృడానీ = ఆనందాన్నిచ్చే పార్వతి రూపం;

చండికా = కాళీ, సరస్వతీ, లక్ష్మీ ఈ కలిపిన రూపం, ఆ రూపం భయకరమైనది దరి చేరడానికి అసాధ్యమైనది;

అంబికా = పార్వతియొక్క మరొక రూపం, 8 చేతులతో వివిధములైన ఆయుధములతో పులిని గాని సింహముని గాని అధిరోహిస్తున్నట్టుగా ఉన్న రూపం;

దాక్షాయణీ = దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవి యొక్క మరియొక అవతారము;

గిరిజా = గిరి+జ= పర్వతం +పుట్టుట= పర్వతము యొక్క (హిమవంతుని) కూతురు;

మేనకాత్మజ = మేనక + ఆత్మజ = హిమవంతుని భార్య మేనక కూతురు.🙏

ఆటిజం జైగాంటిజం కారణాలు

 మాంసం తినే పాశ్చాత్య ఆవులు

=====

అమెరికాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్న ఆటిజం (పిల్లలలో బుద్ధిమాంద్యం), జైగాంటిజం (చిన్నపిల్లలు కూడా రాక్షసులలాగా పెరిగిపోవడం), ఒబెసిటీ (ఊబకాయం), ప్రికోసియస్ ప్యూబర్టీ (తొమ్మిదేళ్లకే ఆడపిల్లలు రజస్వలలు కావడం, ఎనిమిదేళ్లకే అబ్బాయిలకు గడ్డాలు మీసాలు రావడం), 25 ఏళ్లకే వస్తున్న రకరకాల కేన్సర్లు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇవన్నీ ఎందుకొస్తున్నాయా అని తెగ పరిశీలించా చాలాసార్లు. వీటన్నిటికీ కొన్ని కారణాలు కనిపించాయి. అవి, 


1. జీవనవిధానాలు లేదా లైఫ్ స్టైల్స్. అంటే, ఒక వేళకు నిద్ర లేవడం, నిద్రపోవడం లాంటి ఒక నియమిత జీవనవిధానం లేకపోవడం. 


2. ఆహారదోషాలు. అంటే, ప్రాసెస్ చేసినవి, ఫ్రోజెన్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, రెడ్ మీట్ లాంటివి తెగ తినడం.


3. సిగరెట్లు, త్రాగుడు, వీడ్ మొదలైనవి వివరీతంగా తీసుకోవడం.


4. ఉద్యోగ టెన్షన్లు. విపరీతమైన పని ఒత్తిడితో, టెన్షన్ తో, బాగా చేయకపోతే ఉద్యోగం పోతుందేమో అన్న భయంతో ఏళ్లకేళ్లు పనిచేయడం.


5. మోడ్రన్ మెడిసిన్ లో వాడబడుతున్న సింథటిక్ డ్రగ్స్, ఇంకా స్టెరాయిడ్స్ మొదలైన వాటి వాడకం. ప్రతి చిన్నదానికీ భయపడి హై పవర్ మందులు వాడెయ్యడం. 


6.. వందలాది టీకాలను పుట్టినప్పటినుండీ పిల్లలకు విచక్షణారహితంగా వేయించడం.


ఇలా చాలా కారణాలు నాకు కనిపించాయి. కానీ వీటిని చెప్పినా కూడా ఎవరూ నమ్మనంతగా జనం తయారయ్యారు. పైగా, 'ఇవి కారణాలు కాదులే' అని తేలికగా కొట్టిపారేస్తున్నారు. సరే ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు? అని నేనూ వదిలేస్తూ ఉంటాను.


మూడేళ్ళ క్రితం మావాడు నాతో ఫోన్లో మాట్లాడుతూ, 'నాన్నా నేను పాలు పెరుగు మానేశాను.  వీగన్ నయ్యాను' అన్నాడు.


నేను షాకయ్యాను.


'అదేంటి నాన్నా? పాలూ పెరుగూ మానేస్తే ఎలా? మనం తినే ఆహారంలో కాస్త ప్రోటీన్ అదే కదా? పైగా పెరుగేమో ప్రో బయాటిక్. గట్ హెల్త్ కి అది చాలా అవసరం. అది మానేస్తే ఎలారా?' అని కొంచం గదిమినట్లే అన్నాను.


మావాడు తేలికగా, 'నువ్వు ఇక్కడికొచ్చినపుడు నీకర్థమౌతుందిలే నాన్నా' అన్నాడు.


'సరే. అక్కడి పరిస్థితులేంటో మనకు తెలీవు కదా. వెళ్ళినపుడు చూద్దాం' అనుకోని నేనూ ఊరుకున్నాను.  


ఇక్కడికొచ్చి నలభై రోజులయ్యాయి. ఈ నలభై రోజులలో అరుగుదలలో చాలా తేడా వచ్చింది.  ముందు నీళ్ల తేడా అనుకున్నాను. కానీ రోజురోజుకూ కొన్ని సమస్యలు ఎక్కువౌతున్నట్లు అనిపిస్తున్నది.  మొదటిరోజునుంచీ ఇక్కడ పాలు, పెరుగుల మీద నాకేదో అనుమానంగానే ఉంది. అవి సహజంగా ఉన్నట్లు అనిపించవు. రుచి తేడాగానే ఉంటుంది, అదీగాక వాటిని తీసుకున్న తర్వాతే అరుగుదల సమస్యలు ఎక్కువౌతున్నట్లు అనిపించింది.  అందుకని ఈ మధ్యనే అవి రెండూ మానేశాను. వెంటనే అప్పటిదాకా కనిపిస్తున్న డైజెషన్ సమస్యలన్నీ మంత్రం వేసినట్లుగా మాయమయ్యాయి. ఈ రెండే అసలైన దొంగలని అర్ధమైంది. వీటిమీద ఇంకాస్త రీసెర్చి చేద్దామని నిర్ణయించుకున్నాను. 


ఈ లోపల డెట్రాయిట్ రిట్రీట్ వచ్చింది. నాలుగైదు రాష్ట్రాల నుండి సభ్యులు వచ్చారు. ఒకరోజున  మాటల మధ్యలో ఇదే టాపిక్ వచ్చింది.


'డైరీ ప్రాడక్స్ ఇక్కడివాళ్లకు అసలైన చేటు చేస్తున్నాయని నా ఉద్దేశ్యం' అన్నాను.


సభ్యులలో ఒక డాక్టర్ ఉన్నారు. ఆమె గత ముప్పై ఏళ్ళనుంచీ ఇక్కడ డాక్టర్ గా ఉన్నారు. ఆమె నా మాటలతో ఏకీభవించడమే గాక, ఇలా అన్నారు.


'ఇక్కడ ఆవులకు మాంసం తినిపిస్తున్నారు. వాటి పాలను కల్చర్ చేసి, చాలా మార్చేసి మార్కెట్లో పెడుతున్నారు. వాటిని త్రాగిన పిల్లల్లో మీరు చెప్పిన రోగాలన్నీ వస్తున్నాయి. చిన్నచిన్న పిల్లల్లో కూడా కేన్సర్లు వస్తున్నాయి. ఇక్కడి తిండే ఇక్కడి రోగాలకు కారణం, పాలు బాగా త్రాగాలని ఇక్కడి పిల్లలకు మనవాళ్లు తెగ తాగిస్తారు. అవే వాళ్ళ కొంప ముంచుతాయి. కానీ ఆ విషయం అర్ధమయ్యేసరికి చేయి దాటిపోతుంది.'


నేను నిర్ఘాంతపోయాను.


'ఆవులకు మాంసమా?' అన్నాను నోరెళ్ళబెట్టి. కానీ అమెరికాలో ఆమె చాలా సీనియర్ డాక్టర్ అవడం చేత ఆమె చెప్పినది నమ్మక తప్పలేదు.


తరువాత రీసెర్చి చేస్తే దిమ్మెరపోయే నిజాలు బయటపడ్డాయి.


ఇక్కడ స్టోర్స్ లో, 'గ్రాస్ ఫెడ్ కౌ మిల్క్' అని విడిగా పాలపేకెట్లు దొరుకుతాయి. అంటే, 'గడ్డి తినే ఆవుల పాలు' అన్నమాట. మొదటిసారి స్టోర్స్ లో ఈ పాల పాకెట్స్ చూసినపుడు నాకు మళ్ళీ మతిపోయింది. 


'ఆవులు గడ్డి తినక ఇంకేం తింటాయి?' అనడిగాను.


'అలా కాదు, బలం కోసం, మరిన్ని పాలివ్వడం కోసం వాటికి బీన్స్ పెడతారు. అంతేగాక హార్మోన్  ఇంజక్షన్లు ఇస్తారు' అని నాకు చెప్పారు.


ఇప్పుడు, ఆ బీన్స్ తో బాటు, మాంసాన్ని బాగా ఎండబెట్టి, పొడిచేసి, అందులో కలిపి ఆవులకు తినిపిస్తున్నారన్న దిగ్భ్రాంతికరమైన వాస్తవం బయటపడింది. అందులో పందిమాంసం కూడా ఉంటుందట. అందుకే ఇక్కడి పాలు ఏదోగా ఉంటాయి. పెరుగేమో బంక బంకగా సాగుతూ ఉంటుంది. సహజమైన రుచి వాటిలో ఉండదు.


అంటే, అలాంటి మాంసం తిని, హార్మోన్ ఇంజక్షన్లు చేయించుకున్న ఆవుల పాలు, డబల్ పాశ్చరైజేషన్, కల్చర్ చెయ్యబడిన తర్వాత, మనం త్రాగుతున్నాం. అదే పెరుగును తింటున్నామన్న మాట !


మరి పైన చెప్పిన నానా రోగాలు రాక ఇంకేమొస్తాయి?


అమెరికాలో అడుగుపెట్టిన మొదటిరోజునుంచీ నాకీ పాలంటే, పెరుగంటే ఎందుకు అసహ్యంగా ఉందో ఇప్పుడర్థమైంది. వాటిని మానేశాక, ఎందుకు హాయిగా ఉందో ఇంకా బాగా అర్ధమైంది.


ఇవీ ఫుడ్ మాఫియా లీలలు !


అందుకేనేమో, అమెరికాలో ఎక్కడ చూసినా వీగన్ కల్చర్ బాగా ఎక్కువైంది. ఇప్పుడు ఇండియాలో కంటే అమెరికాలోనే శాకాహారులు ఎక్కువగా ఉన్నారు. ఇండియాలో మనం పాలు పెరుగులు కూడా తీసుకుంటాం. ఇక్కడ వీగన్స్ అవి కూడా తినరు. పూర్తిగా మొక్కల నుండి తయారైన ఆహారాన్నే వీళ్ళు వాడతారు.  వీగనిజం అనేది ప్రస్తుతం ఇక్కడొక ఉద్యమంలా వ్యాపిస్తోంది. ఎక్కడచూచినా వీగన్ రెస్టారెంట్లు కనిపిస్తున్నాయి. ఇండియాలో తినే శాకాహారమే అన్నిటికంటే బెస్ట్ బేలన్సుడ్ ఫుడ్ అని అమెరికన్లు చాలామంది అంటున్నారు.


చావుకొస్తుంటే చస్తారా మరి?


ఒకే ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను.


బాక్సింగ్ రంగంలో ఎప్పటికీ గుర్తుండే పేరు - మైక్ టైసన్. రెడ్ మీట్ లేనిదే అతనికి ముద్ద దిగదు, అతనితో రింగ్  లోకి దిగాలంటే భయపడి చచ్చేవాళ్ళు ప్రత్యర్ధులు. కానీ ప్రస్తుతం అతను వీగన్.


'ఎందుకిలా అయ్యావు? అని ఎవరో అడిగితే అతనిలా చెప్పాడు.


'రెడ్ మీట్ నాకు చేసిన హానిని నా బాడీ నుంచి క్లిన్ చేసుకోవడానికి ఇంతకంటే నాకు మార్గం కనిపించలేదు, అందుకే వీగన్ నయ్యాను. ఇప్పుడు నాకు హాయిగా ఉంది' అన్నాడు. 


మైక్ టైసన్ నుండి ఈ మాటను ఊహించగలమా? కానీ ఇది నిజం. యూట్యూబ్ లో ఉంది చూడండి.


అమెరికా నాశనమౌతున్నది ఫుడ్డు, మందులు, జీవన అలవాట్ల నుంచి మాత్రమే. ఇప్పుడు ఈ జాడ్యం మన ఇండియాకి కూడా దిగుమతి అవుతున్నది. ఇప్పటిదాకా లేని రోగాలను మనం  ఇండియాలో కూడా చూస్తున్నాం. ముఖ్యంగా యువతలో. ముప్ఫైకే అన్నీ ఉడిగిపోయి జీవచ్ఛవాలైపోతున్నారు.


ప్రపంచ వినాశనం అణ్వస్త్రాలతో కాదుగాని, ఆహారపు అలవాట్లతోనే వచ్చేటట్టు ఉంది.


విపరీతంగా డబ్బు చేతిలో ఉన్నా, ఆకులూ అలములూ తినాల్సి రావడం ఎంత విచిత్రమో కదా? ఆ డబ్బు ఎందుకు సంపాదిస్తున్నట్లో మరి?? ఎటు పోతోంది మానవజాతి?


వేపచెట్టుకు తియ్యటి పండ్లు కాస్తాయి, చింతచెట్టు నుంచి పాలు కారతాయి. అని బ్రహ్మంగారు వ్రాశారు.


'ఆవులు మాంసం తింటాయి, మానవజాతి వినాశనానికి అదొక గుర్తు'. అని కూడా వ్రాశారో లేదో మరి. కాలజ్ఞాన పండితులు చెప్పాలి.


ఏదేమైనా పాలూ పెరుగూ తినడం మానేశాక నాకు చాలా హాయిగా ఉంది. నేనూ వీగన్నయ్యానా? చూడబోతే అలాగే ఉంది మరి !


సేకరణ                 *బాబ్ లాల్*

Saidulu song


 

29, సెప్టెంబర్ 2022, గురువారం

దీర్ఘతమ మహర్షి

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*మన మహర్షుల చరిత్రలు...*


*🌹ఈ రోజు 38,వ దీర్ఘతమ మహర్షి గురించి తెలుసుకుందాము.🌹*


🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️


🌿ఈ మహర్షి ఉతథ్య మహర్షికి మమతకి పుట్టినవాడు. బృహస్పతి ఇతని తమ్ముడు. 


🌸ఉతథ్యుడికి ఎప్పుడూ తపస్సు చేయడం, తీర్థయాత్రలు చేయడం, అంటే చాలా ఇష్టం.


🌿గొప్ప జ్ఞానవంతుడై వుండేవాడు.  దేవతల గురువు బృహస్పతి ఈ మహర్షికి సోదరుడున్న మాట.


🌸ఉతథ్యుడి భార్య మమత గర్భవతిగా వున్న రోజుల్లో బృహస్పతి తన సోదరుణ్ణి చూడ్డానికి వచ్చాడు.


🌿మమత అతనికి అతిథి సత్కారాలు చేసింది.  శాపగ్రస్థుడైన బృహస్పతి అన్న భార్య అని కూడ చూడకుండా ఆమెని బలవంతం చేశాడు .


🌸మమత కడుపులో వున్న పిల్లవాడు బృహస్పతిని అవమానించాడు.  బృహస్పతి ఆపిల్లవాణ్ణి గుడ్డివాడుగా పుట్టమని శపించాడు. 


🌿అలా పుట్టు గుడ్డివాడిగా పుట్టిన వాడే మన దీర్ఘతమ మహర్షి.  దీర్ఘతముడు గ్రుడ్డివాడుగా పుట్టినా వేదవేదాంగాలు చదివి విజ్ఞానవేత్త , కీర్తిగలవాడు, తపశ్శాలి అయ్యాడు .


🌸తండ్రి దీర్ఘతముడికి ప్రద్వేషిణిని ఇచ్చి పెళ్ళి చేశాడు.  పేరుకి తగ్గట్టే ప్రద్వేషిణి అందర్నీ ద్వేషించడంలో గొప్పది.


🌿దీర్ఘతముడికి ప్రద్వేషిణి యందు చాలా మంది కొడుకులు పుట్టారు . ఒకసారి దీర్ఘతముడు ఒక్కడూ తపస్సు చేసుకుంటూ వున్నాడు. 


🌸అక్కడికి కామధేనువు కొడుకు వచ్చి దీర్ఘతముణ్ణి నువ్వు గ్రుడ్డివాడివైనా శక్తిమంతుడివి. 


🌿నీకు నేను పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని పుట్టించగల విద్యని నేర్పిస్తాను. 


🌸దీనివల్ల వంశనాశనం అయిపోతున్న వాళ్ళ వంశం నిలబెట్టినవాడ వవుతావని చెప్పి ఆ విద్యని దీర్ఘతముడికి నేర్పించాడు. 


🌿ఈ విద్య ఎలా పనిచేస్తుందో చూద్దామని భార్యని సహకరించమంటే తిట్టింది. 


🌸అది ఆవిడ జన్మ హక్కు కదా. సరే ఈ విద్యని పరీక్షించుకోవాలి కదా పిల్లలులేని వాళ్ళ దగ్గరకి వెళ్ళి తాను నేర్చుకున్నది పనిచేస్తోందని నిరూపించుకున్నాడు. 


🌿తన భర్త అందరితో తిరుగుతున్నాడనుకుని ప్రద్వేషిణి అసహ్యించుకుని ఇంట్లోంచి పొమ్మంది.


🌸విషయం తెలుసుకోకుండా భర్తనని చూడకుండా నన్నవమానించావు కాబట్టి ఇక మీదట ప్రతిస్త్రీకి జీవితాంతం ఒక్క భర్తె ఉండాలి. 


🌿వాడు ఉన్నా, చచ్చిపోయినా ఇంకొకణ్ణి పెళ్ళి చేసుకోకూడదు.   అలా చేస్తే ఆమెకి అపకీర్తి, నింద వస్తాయని శపించాడు దీర్ఘతముడు.


🌸ప్రద్వేషిణి పిల్లల్ని పిలిచి మీ తండ్రి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు, తీసుకువెళ్ళి గంగలో పడెయ్యమంది.


🌿పిల్లలు అలాగే చేశారు.   దీర్ఘతముడు కాళ్ళు చేతులు కట్టేసి బుట్టలో గంగా నదిలో పడేసినా దాంట్లోనే వేదాలు వల్లె వేసుకుంటున్నాడు.


🌸అలలు ఎటువైపు వెడితే అటువైపు ఆ బుట్ట కొట్టుకుపోతోంది.  కొన్నాళ్ళ తర్వాత బలి అనే మహారాజు గంగాభిషేకం చేద్దామని వచ్చి, 


🌿నదిలో కొట్టుకువస్తున్న దీర్ఘతముణ్ణి చూసి ఇంటికి తీసుకెళ్ళి అతని గురించి మొత్తం తెలుసుకుని, అంతటి మహర్షిని చూడగల్గినందుకు ఎంతో సంతోషించాడు.  


🌸దీర్ఘతముణ్ణి రాజసౌధానికి తీసికెళ్ళి సపర్యలు చేసి బలిమహారాజు తనకి పిల్లలు లేరని పిల్లలు కలిగేటట్లు చూడమని ప్రార్థించాడు. 


🌿తన భార్య సుధేష్ణని మహర్షి దగ్గరకు వెళ్ళమన్నాడు.  కాని సుధేష్ణ ఆ మహర్షి రూపం చూసి అసహ్యించుకుని పనిమనిషిని పంపింది.  


🌸ఆపనిమనిషికి పదకొండుమంది కొడుకులు పుట్టారు. ఆ పదకొండుమంది తన పిల్లలే అనుకుని


🌿 బలిరాజు ఆ పిల్లలకి వేదం నేర్పించాలని దీర్ఘతముడి దగ్గరకు తీసుకువచ్చాడు.  


🌸మహర్షి ఈ పిల్లలు సుధేష్ణకు పుట్టిన వాళ్ళు కాదని పనిమనిషి పిల్లలని చెప్పాడు.  బలి బాధపడి మళ్ళీ సుధేష్ణని మహర్షి దగ్గరకి పంపాడు.  


🌿సుధేష్ణ వలన బలిమహారాజుకి అయిదుగురు కొడుకులు పుట్టారు.   వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయి అంగదేశం, కళింగదేశం, వంగదేశం, పుండ్రము, సుహ్మము అనే | రాజ్యాలు పాలించారు. 


🌸ఈ రకంగా దీర్ఘతమ మహర్షి చాలా రాజవంశాల్ని నిలబెట్టాడు.  

దీర్ఘతమ మహర్షి ఋగ్వేదంలో తన తాత్విక శ్లోకాల ద్వారా చాలా బాగా ప్రసిద్ధుడు. 


🌿ఋగ్వేదం సంహితలోని మొదటి మండలం లోని 140 నుండి 164 వరకు గల సూక్తము (శ్లోకాలు) లకు ఇతను రచయిత,


🍂ఋగ్వేదం ఆరవ మండల యొక్క ప్రవక్త అయిన ఋషి భరద్వాజుడు, సోదరుడుగా భావిస్తారు...


🍃ఇదండీ మహర్షి గురించి మనం తెలుసుకున్న విషయాలు రేపు మరెన్నో విశేషలతో మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి..


*సేకరణ:* కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 


🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

మోకాలి కీళ్ల నొప్పుల నుండి

 ఢిల్లీ కి చెందిన ఓ వైద్యుడు మోకాలి కీళ్ల నొప్పుల నుండి వేలాది మంది రోగులను ఎలా నయం చేసి రక్షించాడో చూపిస్తున్నాడు ..!  ఇప్పుడు అతని వీడియో వైరల్ అయ్యింది మరియు వేలాది మంది మోకాలి రోగులు ఈ క్లిప్ కోసం శోధిస్తున్నారు.  కాబట్టి ఈ క్లిప్ చూడండి  అతని ప్రతి మాట వినండి మరియు ఈ వ్యాయామం ప్రయత్నించండి లేదా మోకాలి నొప్పులు ఉన్నవారికి దీన్ని సూచించండి.  చాలా మంది తమ వెన్నునొప్పి, మోకాలి నొప్పులు కేవలం 7 రోజుల్లోనే మాయమయ్యాయని పేర్కొన్నారు ....!  గుర్తుంచుకోండి, మోకాలి కీలు మార్పిడి నిజమైన పరిష్కారం కాదు.  ఇది మన ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రమే ఆహారం ఇస్తుంది.


https://youtu.be/XH5EmGiFM-M

 శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీసంస్తుతి-4 


చవితి 

7.

శ్రీమాత్రే సురపూజితే గుణనికే కాంతారవాసప్రియే 

బ్రహ్మేంద్రాదిమునీంద్రసేవితపదే విద్యాప్రభాశోభితే 

మాణిక్యాదిమణీంద్రబృందవిలసద్రాణ్మందిరాంతస్స్థితే 

నిత్యే కాంచనభూషితే నమ ఇదం కాదంబసద్వాహనా 

 

(గుణనిక=గుణవృద్ధి;  కాదంబ=కలహంస)


8. రోహిణి 

ఆయుష్కామసుశక్తికీర్తివరదాం అష్టైశ్వర్యదాం మాతరం 

ఆనందామృతవర్షిణీం ప్రియమతీం స్తోత్రప్రియాం శాంకరీమ్ 

నిర్భేదాం శుభపంచవర్షతిలకాం సంభావితాం భాసురామ్ 

సర్వార్థప్రదరోహిణీం శుభకరీం విశ్వేశ్వరీం భావయే


*~శ్రీశర్మద*

28, సెప్టెంబర్ 2022, బుధవారం

మధుమేహ రోగులలో

మధుమేహ రోగులలో   కంటి చూపు తగ్గడం , నరాల బలహీనతకోరకు - రెడ్డివారి నానుబాలు .


      మధుమేహంతో బలహీనం అయ్యి , నేత్ర రోగాలతో కంటి చూపు మందగించి , నరాల జబ్బులతో రోజురోజుకి కృశించి పోయే వారికి ఇది అమృత వర్షిని లా పనిచేస్తుంది . 







                  ఈ మొక్కలను సమూలంగా వేరుతో సహా తెచ్చి కడిగి ముక్కలు చేసి నీడలో ఆరబెట్టి జల్లించి ఆ పొడిని నిలువ చేసుకోవాలి . రోజు ఆహారానికి అరగంట ముందు అరచెంచా పొడిని అరగ్లాస్ నీటితో సేవిస్తూ ఉంటే మదుమేహం అదుపులోకి రావడమే కాకుండా నేత్రాలకు వెలుగు వస్తుంది. నరాలకు బలం కలుగుతుంది. 


               పుచ్చిన గోరు మీద దీని పాలు వేస్తున్నచో కొత్తగోరు వస్తుంది. 


      మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

మహాభారత పుస్తకములు 62 అన్నీ ఒకే దగ్గ

 TTD వారు ప్రచురించిన మహాభారత పుస్తకములు 62 అన్నీ ఒకే దగ్గర.... ఉచిత డౌన్ లోడ్...

ఈ లింక్ లో  TTD వారు ప్రచురించిన 18పర్వముల పుస్తకముల తో పాటు మహాభారతము కు సంభందించిన అనేక పుస్తకాలు ... మహాభారతము మరింత అర్థం చేసుకొనేందుకు వ్రాసిన వ్యాఖ్యానాలు...దాదాపు 60 పై న ఒకే దగ్గర ఉంచాము... లింక్ పై క్లిక్ చేస్తే ఆ పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ మీకు పుస్తకాల పేర్లు కనపడతాయి.... మీకు ఇష్టమైన పుస్తకం పేరుపై క్లిక్ చేసి pdf ను మీ gmail అకౌంట్ తో ఓపెన్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి....

👇👇👇

https://tinyurl.com/mynht85r

🙏🙏🙏

మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి.. అవి చాలా మందికి ఉపయోగపడాలి...

గాయత్రీమాత స్తుతి

 గాయత్రీమాత స్తుతి


ముక్తా విద్రుమ హేమ నీలధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్ష ణైః

యుక్తాం ఇన్దునిబద్ధ రత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్ ౹

గాయత్రీం వరదాభ యాంకుశ కశా శ్శుభ్రం కపాలం గదాం

శంఖం చక్ర  మదారవింద యుగళం హస్తైః  ర్వహంతీం భజే ౹


సీ.  విమలముక్తా హేమ  విద్రుమ సిత నీల 

               పంచముఖంబులు పరిఢవిల్ల,

     శిఖ యందు విధురేఖ చెలువార గల్గియు

               ఘనరత్నమకుటంబు కాంతులీన,

     తత్త్వార్థ వర్ణముల్ , త్రయలోచనంబులున్

               ఘనవిశిష్టత తోడ కల్గియుండ,

     వరదాభయమ్ములౌ నురుదివ్య ఘనముద్ర ,

               లరవింద యుగళంబు, నంకుశంబు, 

తే. శంఖ, చక్ర , కశా, గదా, సహిత యగుచు 

     శుభ్రమైన కపాల, సంశోభ నున్న 

     మాత 'గాయత్రి' నెన్నుచు మదిని నేను

     భక్తి భజియింతు నవ్యయ ముక్తి గోరి

కావలిసిన పుస్తకాలు

 ఈ మెసేజ్ save చేసి ఉంచుకోండి... ఎన్ని లక్షలు వెచ్చించినా ఇలాంటి సమాచారం మీకు లభించక పోవచ్చు...

ఇది అత్యంత విలువైన పుస్తక భాండాగారం... 

ఇందులో రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత, అష్టాదశపురాణాలు, పిల్లల నీతి చంద్రికలు, పంచతంత్రం, బాలానందం, పేదరాశి పెద్దమ్మ కథలు, కాశీ మజిలీ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, అందరికీ ఆయుర్వేదం....

లాంటి ఎన్నో ఉపయోగ కర  పుస్తకాలు ఉన్నాయి... ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఎంత సమయం వెచ్చించినా ఇంత విలువైన సమగ్రమైన సమాచారాన్ని ఒకే క్లిక్తో పొందలేరు...  

 భగవద్గీత... https://tinyurl.com/yrw54twr

మహా భారతము .. https://tinyurl.com/mynht85r

రామాయణము... https://tinyurl.com/cb8h94ss

భాగవతము ... https://tinyurl.com/r8uxjhbb

వేదములు ... https://tinyurl.com/y2haxbad

అష్టాదశ పురాణములు... https://tinyurl.com/4a69k9tk

పిల్లల నీతి కథలు... https://tinyurl.com/482ed93y

అందరికీ ఆయుర్వేదం... https://tinyurl.com/nnybunhe

🙏🙏🙏🙏

ఒకసారి చూడండి మీకు నచ్చిన పుస్తకాలు మీ మిత్రులతో తప్పనిసరిగా షేర్ చేసుకోండి.... 

కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏

మూడు జన్మల ముష్టివాడు*

 *శాస్త్రం చెపుతోంది:*


_*మానవులు, ఎందుకు బిచ్చగాళ్ల లాగా అవుతారు !!?*_  


ఒక గ్రామంలో ఒక  బిచ్చగాడు ప్రతి ఇంటికి వెళ్లి బిచ్చమెత్తుకుంటూ ఉండేవాడు. ఒక రోజు ఒక ఇంటి వద్ద  *భవతీ భిక్షాం దేహి, మాతా! అన్నపూర్ణేశ్వరీ* అని అడిగాడు. 


ఆ ఇంటి యజమాని పండితుడు. అతను అరుగు మీద కూర్చుని పారాయణ చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఇల్లాలికి వినిపించలేదేమో!! అని బిచ్చగాడు గట్టిగా మళ్లీ *"భవతీ భిక్షాం దేహి, మాతా! అన్నపూర్ణేశ్వరి"* అని అన్నాడు. 


*పండితుడికి కోపం వచ్చింది*.  నేనిక్కడ ఉంటుండగా నాతో మాట్లాడకుండా, నాకు చెప్పకుండా ఇంత నేను సంపాదిస్తుంటే! ఆమెను పిలిచి బిచ్చం అడుగుతాడా ?? వీడికి తగిన శాస్తి చేస్తాను !! 


అని అనుకుని, వెంటనే ఏమేవ్!! *మూడు జన్మల ముష్టివాడు* వచ్చాడు బిచ్చం వెయ్యి అని గట్టిగా అరిచాడు. ఆ గొంతు పోల్చుకున్న ఆమె, భర్తకి కోపం వచ్చిందని గ్రహించి, వెంట వెంటనే బియ్యం తీసుకొచ్చి బిచ్చగాడి పాత్రలో వేసి ఆవిడ వెంటనే లోపలకు వెళ్లిపోయింది. 


కానీ బిచ్చగాడు మాత్రం కదల్లేదు. అతని చేతిలో కర్ర కూడా ఉంది. 


అప్పుడు పండితుడికి అనుమానం అలజడి మొదలయ్యింది. 


అకారణంగా నేను అన్న మాటలు వీడికి బాధ కలిగించాయి.  వీడిపుడు ఏం చేస్తాడు !!?తిడతాడా!! లేదా !! ఇంకా ఏమన్నా చేస్తాడా ?! అని లోలోపల బాధ పడుతూ చూస్తున్నాడు. 


ఇంతలో బిచ్చగాడు ఏమండీ అని పిల్చాడు. 


ఆ !! అంటూ, చిన్న అహంకారాన్ని ప్రదర్శించాడు పండితుడు.  


ఏం లేదు, మీరు నన్ను మూడు జన్మలు ముష్టివాడన్నారు. అది ఎలాగా !? అన్నాడు. 


అదా !! దానికేం ఉంది !! తెలుసుకోవాలనుకుంటున్నావా ?!  అయితే, ఇలా కూచో అన్నాడు. 


ఫరవాలేదు, చెప్పండి !! నిలబడతాను అన్నాడు.


*శ్లోకం:*


*అదత్త దానాచ్చ భవేత్ దరిద్రః*

*దరిద్ర దానాచ్చ కరోతి పాపం*। 

*పాప ప్రభావాత్ పునర్దరిద్రః*

*పునర్దరిద్రః పునరేవ పాపీ*॥


అని శ్లోకం చదివాడు. 


వెంటనే బిచ్చగాడు, అయ్యా !! మీరు చదివిన శ్లోకానికి అర్థం నాకు తెలియదు. నాకు అర్ధమయ్యేటట్లు మాటల్లో చెప్పండి అన్నాడు.  


నువ్వు గత జన్మలో ఎవరికీ ఏమీ ఇవ్వలేదు. అంటే రెండు కారణాలు: 


ఒకటి, నీకు లేకపోయి వుండొచ్చు. లేదా, ఉండి కూడా దానం చేయకపోయుండచ్చు. 


లేకపోతే, గతజన్మలో నువ్వు ముష్టి వాడివి. కాబట్టి ఆ ఫలితంగా నువ్వు ఈ జన్మలో కూడా ముష్టి వాడుగా అయిపోయావు. 


అంటే రెండు జన్మలు ముష్టివాడివి అయ్యావు. 


అర్థమైంది !! మరీ చెప్పొద్దన్నాడు బిచ్చగాడు. 


ఎందుకు అన్నాడు పండితుడు? 


ఈ జన్మలో కూడా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి వచ్చే జన్మ కూడా !! అని గొణుక్కుంటూ వెళ్లిపోయాడు. 


మర్నాడు అదే సమయానికి ఆ బిచ్చగాడు పండితుని ఎదురుగా నిలబడి, అయ్యా, ఇందులోంచి బయటపడే మార్గం ఏమీ లేదా !!? నేనిలాగే జన్మజన్మలకు బిచ్చగాడి గానే ఉండిపోవాలా? అని అడిగాడు. 


*జ్ఞానం, సమయం, వ్యక్తిత్వ విలువలు తెలిసిన పండితుడు* ఇలా కూచో అన్నాడు. 


పెద్దవారు మీ దగ్గర నేను కూర్చోవడం !! అన్నాడు. 


ఫర్వాలేదు కూచో *జిజ్ఞాసా పరులకు శాస్త్రం చెప్పొచ్చు, అలాగే చెప్పాలి* కూడా !! అందుకే ఈ శాస్త్రాలన్నీ అన్నాడు. 


కూర్చున్నాడు బిచ్చగాడు. 


ఇప్పుటికైనా దానం చేయడం మొదలు పెట్టాలి అన్నాడు పండితుడు. 


నేను దానం ఎలా చేస్తాను !!?  నా దగ్గర ఏముంది గనుక ??


అన్నీ ఉన్నాయి. లేకపోవడమనేది లేదు. నీలో దాన గుణం ఉంటే చాలు. నీ దగ్గర ఉన్నదే దానం చెయ్. ఈ రోజు నుంచి నీ కడుపుకి ఎంత కావాలో -- అంత మాత్రమే బిచ్చమెత్తుకుని, అందులో సగం దానం చేస్తుండు. *తనకు అవసరమున్నాసరే అందులోంచి మిగిల్చి ఇవ్వడమే దానం తాలూకు ముఖ్యోద్దేశ్యం* _(తను వాడుకోగా మిగిలినది ఇవ్వడం కాదు)_. 


బిచ్చగాడికి విషయం అర్థమైంది. వెంటనే ఇక ఆ రోజు నుంచి ఓ నియమం పెట్టుకున్నాడు. 


*తనకి ఎంత అవసరమో అంతే అడుక్కుని, అందులోంచి సగం దానం చేయాలి.*


_మరి ఇది ఎలా తెలుస్తుంది !!?_ 


దాని కోసం తన చేతిని భిక్షాపాత్రగా చేసుకుని, అందులో పట్టినంత మాత్రం తీసుకుంటూ, అందులో  సగం దానం చేస్తూ, సగం మాత్రమే తిన్నాడు. దాంతో ఈ బిచ్చగాడికి, బిచ్చమెత్తుకునే ఇళ్ల సంఖ్య తగ్గిపోయింది. అలాగే తిరగడం శ్రమ, కాలం కూడా తగ్గిపోయింది. అతనికి ఒక గుర్తింపు లాంటిది వచ్చింది. కొద్ది రోజుల్లోనే ఇతను ఎవరి దగ్గర పడితే వారి దగ్గర బిచ్చమెత్తుకోడు !! ఇతను మన ఇంటికొస్తే ఈ రోజు బాగుణ్ణు !! అనేటటువంటి భావాలు జనాల్లో కూడా వచ్చాయి. అంతేకాదు మొన్న వాళ్ళింటి కెళ్ళాడు. నిన్న వీళ్ళింటికి వచ్చాడు.  ఇవ్వాళ మనింటికి తప్పకుండా వస్తాడని వాళ్లు ఆ బిచ్చగాడి కోసం మరికొంచెం పవిత్రంగా ఇవ్వాల్సిన పదార్థాల్ని సిద్ధం చేసేవాళ్లు. అందరికీ ఇచ్చే బిచ్చం కంటే ఇతనికి వేసే బిచ్చం చాలా ప్రశస్తంగా ఉండేది. సాత్వికంగా ఉండేది. మంచి ఆహారం లభించేది. పుచ్చుకున్న దాంట్లో ఇతడు దానం చేయడం అందరూ చూశారు. అతనిలో ఏదో గొప్పతనం ఉందని చెప్పి పది మంది బిచ్చగాళ్లు చుట్టూ చేరి నువ్వే మా గురువన్నారు. ఇతడికది అంగీకారం లేదు. 


ఇదే నియమం పెట్టుకుని నేనెందుకు  కాశీ వెళిపోకూడదు !!? అని అనిపించింది. 


వెంటనే బయలుదేరాడు. వెడుతున్నప్పుడు కూడా ఇదే నియమాన్ని పాటించాడు. తన చేతుల్లో ఎంత పడితే అంత ఆహారం తీసుకోవడం అందులోనున్న సగం దానం చేయడం. మిగిలినదే తినడం *అంటే అర్థాకలి* తన *ఆకలి కడుపుని* భగవదర్పణంగా జీవనం సాగిస్తున్నాడు. మొత్తం మీద  *కాశీ పట్టణాన్ని చేరాడు*. 


అతను ఇదే నియమాన్ని అక్కడ కూడా పాటిస్తూ ఓ చెట్టు కింది ఎక్కువసేపు కూచునేవాడు.  ఆతడు అందరిలాగా ఒక అరగంట కూర్చుని ఏదో వస్తే తీసుకుని వెళ్లిపోవడం ప్రసక్తి లేదు. లేదా సాయం-ధర్మం చేయండి, దానం చేయడం వంటి మాటలు కూడా అతని నోట ఎప్పుడూ వినిపించేవి కాదు. ఎప్పుడూ, ఏదో ఒక ధ్యానంలో ఉంటూ ఉండేవారు. అతని దగ్గర పడిన డబ్బులు లేదా బియ్యం ఇవన్నీ కూడా అతను వెళ్లాక ఎవరో తీసుకునే వాళ్లే తప్ప అతడు ఏనాడు అవి ఆశించలేదు. ఇలా కొన్నాళ్లు గడిచేసరికల్లా అతని మీద పదిమంది దృష్టి పడింది. 


*అతనొక సాధకుడని, కారణజన్ముడనీ*  అతనికి ఏం చేసినా మంచి జరుగుతుంది అని చెప్పి అతని పేరుతో ఒక వేద పాఠశాల ఒక సత్రం కూడా నిర్మించారు. ఆ సత్రం పేరు *కరపాత్ర సత్రము.* 


అతని పేరును *కరపాత్ర స్వామీజీ* అని ప్రజలే ఆ పేరు పెట్టారు. కరమే(చెయ్యి) పాత్రగా కలిగినటువంటివాడు అని అర్థం. ఇలాగ వేదవిదులు వేదాభ్యాసం చేస్తున్నారు. పిల్లలకు వేదం, శాస్త్రం, పురాణం, ఇతిహాసాలు చెప్తున్నారు. సత్రాల్లో బస చేస్తున్నారు, వచ్చే-పోయే వాళ్లు కూడా భోజనం చేస్తున్నారు. కానీ ఇతనికీవిషయాలు ఏవీ తెలియవు. ఇతడు మాత్రం రోజు నదికి వెళ్లి స్నానం చేసి ధ్యానం చేయడం, మధ్యాహ్నం బిచ్చమెత్తుకోవడం, తనకు వచ్చిన దాంట్లో సగం దానం చేస్తుండడం యథాతథంగా జరుగుతోంది. కొన్నాళ్లయింతర్వాత అక్కడ అతని దగ్గర కూర్చునే వాళ్లు, నిలబడే వాళ్ళు, చూసేవాళ్ళు, దండం పెట్టుకునే వాళ్లు పెరిగారు. వారి కోసం అన్నట్టుగా అక్కడ నీడని కల్పించడం, పందిళ్లు వేయడం మొదలుపెట్టారు. పెద్ద తీర్థ యాత్రగా మారిపోయింది. 


ఇంకొన్నాళ్లయినాక  ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఈయన్ని పెద్దగా పిలవాలని అనిపించి ఆ సభా బాధ్యత అంతా వాళ్లే భరిస్తూ *కరపాత్ర స్వామీజీని* పిలిచారు. అందులో మాట్లాడుతున్న పెద్దవాళ్లందరూ కూడా నాకు ఈయన 15 ఏళ్లుగా తెలుసు. వీరిని చూసిన తరువాత నాలో చాలా మార్పు వచ్చిందని, అంతేకాదు కొన్ని కుటుంబాల వాళ్లయితే మేమీయనకి దండం పెట్టిన తర్వాత మొక్కుకున్న తర్వాత మా పిల్లకి పెళ్లయిందన్నవారు, మాకు ఉన్న అప్పులన్నీ తీరాయి, కష్టాలు తీరాయి అన్నవాళ్లు, మాకు ఏ ఇబ్బందులు లేకుండా అయిపోతున్నాయి, పరమేశ్వరుని దర్శిస్తే ఎంత పుణ్యమో !! అంత పుణ్యమూ, వీరిని దర్శిస్తే నాకు ఇలా జరిగింది ! అని అనేక రకాలుగా చెబుతున్నారు. కానీ ఒకటి మాత్రం అందరూ చెప్తున్నది, ఈయనే గురువు నాకు. మా గురువు గారు కాశీ వెళ్లమని చెప్పారు. అందుకే ఇక్కడ వేదాదులు అధ్యయనం చేశాను. ఇలా అనేక మంది అనేక విషయాలు చెప్తున్నారు.


మన *కరపాత్ర స్వామీజీకి* అర్థం కాని విషయాలు రెండు. ఇంతకీ, 


1) *కరపాత్ర స్వామిజీ* ఎవరు.!!? *ఇన్నాళ్లు కాశీలో వుండి వారిని దర్శించుకోలేక పోయాను* ఎంత దౌర్భాగ్యుణ్ణి !! 

2) *నాకు గురువు ఎవరు* !? 


ఈ రెండు ప్రశ్నలను ఆయనను బాధిస్తున్నా అక్కడికొచ్చే వారికి ఏమి చెప్పాలో తెలియక భగవదనుగ్రహంతో ఏవో చెప్పేసి, నాకు భిక్షా సమయమయింది !! నేను వెళ్లాలి అన్నాడు. ఆయన్ని ఎవరూ అడ్డుకోలేదు. అతడు సరాసరి భిక్ష ఐన తర్వాత ఒక్కసారి తన గురువు ఎవరు ఆలోచించు కున్నాడు. ప్రశ్నించుకుంటూ ఉంటే, తనకొక విషయం తట్టింది. 


*తనలో మార్పునకు కారణమైన వ్యక్తే గురువు* అని నిర్ణయించుకున్నాడు.


అంతే, వెంటనే తను ఎక్కడైతే మొట్టమొదట బిక్షాటన చేసుకున్నాడో ఆ గ్రామం గూర్చి విచారించుకొని బయలుదేరాడు.  దారిలో ఇతన్ని గుర్తించిన వాళ్లు, కలసి-చూసి వచ్చిన వాళ్లు అక్కడ వేదం చదువుకున్న వాళ్లే కాదు ఆ సత్రంలో భోంచేసిన వాళ్లు అందరూ ప్రతి గ్రామంలోని వారు గుర్తించి ఇతనికి స్వాగతం పలకడం, అయనకేదో ఇవ్వడం, అతను ఆ ధనాన్ని ఆ గ్రామంలోనే ఖర్చుపెట్టమని చెప్పి పెద్దలకు  ఇచ్చేస్తుంటే తానేమీ తీసుకోకపోవడం ఈయన ఖ్యాతి  ఆనోట-ఇనోట ప్రతి గ్రామానికి చేరింది. అందరూ ఇతని కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అతను తన మొదటి గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామంలో వాళ్ళు కూడా చాలా ఆనందంతో *కరపాత్ర స్వామిజీ* వారు వచ్చారు అని చెప్పి అక్కడికి ఆ గ్రామంలో ఉంటున్న పండితుడిని పిలిచారు. ఆయన కూడా వెంటనే అంగీకరించాడు. *పండితుడు వెళుతూనే పాద నమస్కారం చేసాడు* ఆయనని మంత్ర పూర్వకంగా తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టారు. ఆయన గురించి, నేను చూశానంటే, నేను చూశాను! నేనక్కడ సత్రంలో పనిచేశాను! అక్కడ వేద పండితులు శాస్త్ర పండితులు శాస్త్రములు అని నేర్చుకుంటారు! నేనక్కడున్నాను! వీరిని మళ్లీ ఇక్కడ చూడ్డానికి చాలా ఆనందంగా ఉందంటే ఆనందంగా ఉంది. ఇలా చాలా మంది మాట్లాడారు. స్వామీజీ కూడా మాట్లాడటం ఐపోయిన తరువాత నాకు *భిక్షా సమయం* అయింది నేను వెళ్లిపోతానని చెప్పాడు. *పండితుల వారు మా ఇంటికి భిక్షకి దయచేయండి* అని పిలిచారు. వెంటనే ఆయన అంగీకరించాడు. వాళ్ళింటికి వెళ్ళాడు. ఇద్దరు లోపల కూర్చున్నారు. ఆయన నియమం ముందే ఎరిగిన *ఆ తల్లి అతనికి సంప్రదాయ ప్రకారంగా కరతల భిక్ష పెట్టింది.* ఆవిడ ఆ భిక్ష పెడుతున్నప్పుడు ఆమెకు ఏదో మాతృత్వం తొణికిసలాడింది. ఇదేం గమనించని స్వామీజీ భిక్ష కోసం దోసిలి చాపాడు. 


ఆవిడకు ఎందుకో అనుమానం వచ్చింది. చూస్తున్నప్పుడే కొంత అనుమానము, ఇలా అడిగేసరికి ఇంకా అనుమానం వచ్చింది. సరే అని ఆయన నియమాన్ని భంగపరచకూడదని కరతలంలో  భిక్ష పెట్టింది. 


అమ్మా, నేను ఇది ఎవరికైనా దానం చేసుకోవచ్చు కదా !! అని అడిగాడు స్వామిజీ. అయ్యో ! అదెంత మాట అన్నది ఆ ఇల్లాలు. వెంటనే *పండితుడు*: *స్వామీజీ ఆ  భాగం నాకు ప్రసాదంగా ఇవ్వండని చెయ్యి పట్టాడు*. స్వామిజీ ఇచ్చేశాడు. 


ఆ ఇంటి అన్నపూర్ణ వడ్డిస్తోంది. గృహ యజమాని ఐన పండితుడు, అతిథి ఐన స్వామీజీ ఇద్దరు కూడా భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో స్వామిజీ అడిగాడు, పండితులవారు *నన్ను గుర్తు పట్టారా* అని ? అబ్బే నేనెప్పుడూ కాశీ మహానగరం రాలేదండీ.. నాకు అంత అవకాశం రాలేదు అన్నాడు. 


సరే నేనెవరో చెప్తా వినండి అన్నాడు పండితుడు. వద్దండీ *శాస్త్ర ప్రకారమూ ఏరుల (నదుల), శూరుల, మహనీయుల మహాత్ముల జన్మరహస్యం అడగకూడదు*. సరే మీరు అడగలేదు నేనే చెప్తున్నాను వినండి. *నా గురుదేవులు మీరు*. అన్నాడు స్వామి. అబ్బే నేను పండితుడను. అంత వరకే అన్నాడు. 


అయ్యా ముందు వినండి. *నేను ఎవరో కాదు  మీ మూడు జన్మల ముష్టివాణ్ణి* అని చెప్పాడు. పండితుడు ఒక్కసారిగా  భోజనం మానేసి నిశ్చేష్టుడయ్యాడు. ఆ ఇల్లాలైతే ఏకంగా కన్నీరు పెట్టుకుంటూ వచ్చి స్వామి పాదాలపై పడి *పతి భిక్ష పెట్టమని ప్రార్థించింది*. 


అంత మాటలొద్దు అమ్మా. ధర్మం చెప్పేవాడు *నిష్కర్షగా* చెప్పాలి. 

ఆనాటికే కాదు ఈనాటికీ నేను సామాన్యుడినే. కానీ *ఆ రోజు పండితుల వారు అంత తీవ్రంగా అంత కఠినంగా* చెప్పకపోతే నాలో మార్పు వచ్చేది కాదు. నేను ఈనాడు ఈ స్థితికి వచ్చే వాణ్ణి కాదు. అంచేత మీరే *నా గురువు అంటూ నమస్కరించారు స్వామీజీ*. లేదు లేదు.. మీరే నాకు జ్ఞానోపదేశం చేశారు. నేను *మహా అహంకారిని, పండితుడని గర్వం ఉండేది* నా గర్వాన్ని పోగొట్టారు కాబట్టి మీరే నాకు గురువు అన్నాడు పండితుడు. అహంకారాలు పోయాయి గనక 

ఇద్దరి భావాలు ఒకటయ్యాయి. ఇద్దరూ హాయిగా పరమానందానుభూతిని పొందారు. 


*బెనారస్ యూనివర్శిటీ (కాశీ విశ్వవిద్యాలయం) లో ఇప్పటికీ ఈ కరపాత్ర స్వామీజీ పేరుతో అవార్డ్ ఇస్తున్నారు*.

వృద్దురాలు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

,*బస్సు కండక్టర్ మరియు వృద్దురాలు*( ఒక వాస్తవ గాథ )

అది రాత్రి సమయం . 'దేవ్ గడ్' కి వెళ్లే ఆఖరు బస్సు సమయం మించి పోయినా, ఇంకా కదలటం లేదు. బస్సు స్టాండు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ముగ్గురు నలుగురు ప్రయాణికులు మాత్రమే అక్కడక్కడ తిరుగాడుతున్నారు. బస్సులోని పది పన్నెండుగురు ప్రయాణికులు మాత్రమే బస్సు ఇంకా ఎందుకు కదలటం లేదని

తబ్బిబ్బులు పడుతున్నారు. ఇంతట్లో ఒకతను బస్సు టైయర్ పంచర్ అయిందని కబురు తెచ్చాడు.

పంచర్ పని కాగానే బస్సు కదులుతుందట. సరిగ్గా పది గంటలకు బస్సు కదిలింది.

ప్రయాణికులందరూ దేవ్గడ్ కు వెళ్లేవాళ్ళే. ఒక చేతిన

పెద్ద మూటను పట్టుకొని కూర్చున్న వృద్ధురాలును టికెట్టు తీసుకోమని కండక్టర్ అడుగగా ఆమె బస్సు బాటలో ఉన్న 'కాత్వన్ 'ఊరి గేటు వరకు టికెట్టు ఇవ్వమని అడిగింది - ఆ ఊరి గేటు నుండి ఒక కిలో మీటరు దూరాన తన ఊరు ఉందని కూడా అంది. బస్సు కండక్టర్ ఆలోచనలో పడ్డాడు. ఈ వృద్ధురాలు

వయసు ముదిరింది. ఒక్కతే దిగనుంది . వానకాలపు దట్టమైన మబ్బులో ఆమె తన ఇంటిని ఎలా చేరుకుంటుందో....?

అతడు ఆ వృద్ధురాలిని కొద్దిగా మందలించాడు- "నీవు ఒంటరిగా ఉన్నావు, నీకు కళ్లు కనపడటం లేదు, సరిగా నడవటం కూడా రాదేమో ?, ఇంత ఆలస్యం ఎందుకు చేశావు? వెలుతురు ఉండగానే ఇంటికి చేరు కోవాలి కదా ? "ముసలామెకు సరిగా వినపడటం కూడా లేదు. గొణుగుతూ ఏదో జవాబు ఇచ్చింది!

కండక్టర్ ఆమె ఊరికి టికెట్టు ఇచ్చి తన స్థలం వద్దకు వచ్చి కూర్చున్నాడు.

బస్సులోని ఇతర ప్రయాణికులు నిద్ర కూనుకులు తీస్తున్నారు. డ్రైవర్ బస్సు లోని లైట్లు తీశాడు. కండక్టర్ వృద్ధురాలి గూర్చి ఆలోచిస్తున్నాడు. ఆ ముసలవ్వను ఆ ఊరి గేటు దగ్గర దింపుతే ఆమె కిలో మీటరు దూరం లో ఉన్నా తన ఇంటిని ఈ వాన మబ్బులో ఎలా చేరుకుంటుంది ? ఆమె కు నడవటానికే రాదు. కంటి చూపు సరిగా లేదు. ఆమె ఊరి బాటలో వాగులు వంపులు గుంతలు ఉంటే ఎలా దాటి పోగలదు....?

ఒంటరిగా ఉన్నా ఆమె పై ఏదైనా అడవి మృగం దాడి చేస్తే....?

ఇంతలో ముసలామె దిగు ఊరి గేటు వచ్చింది. కండక్టర్ బెల్ కొట్టాడు. డ్రైవర్ బస్సు ఆపాడు .

కండక్టర్ లేచి ముసలవ్వ మూటను ఒక చేత్తో పట్టుకొని రెండవ చేత్తో అవ్వ చేతిని పట్టుకొని ఆమెను బస్సు దింపాడు. కొద్దిగా శ్రమ అని పించింది.

బయట చిట్ట చీకటి. ఏమీ కనపడుట లేదు. కండక్టర్

అవ్వ మూటను తలపైకి ఎత్తుకొని అవ్వ భూజాన్ని చేత్తో పట్టుకొని ఆమె ఊరి బాట పట్టాడు. అవ్వను ఒంటరిగా వదలక ఏదో విధంగా ఆమెను ఇంటికి సురక్షితంగా చేర్చాలని

కండక్టర్ గట్టి  పట్టు పట్టాడు.

అవ్వకు ఆశ్చర్యమేసింది! ఆమె తన శక్తి మేర కండక్టర్ అడుగుల్లో  అడుగులు వేస్తూ బిరబిరా  నడవ సాగింది.

"పది పదిహేను నిమిషాలు గడిచినా కండక్టర్ ఎక్కడి వెళ్ళాడు? " అని ఇటు ప్రయాణికులు అటు డ్రైవర్ల ల కావ్ కావ్ లు మొదలయ్యాయి. డ్రైవర్ బస్సు దిగి బండి చుట్టూ తిరిగాడు. అతడు లఘు శంక లేదా దీర్ఘ శంకకు వెళ్లి ఎక్కడైనా పడిపోయాడేమో నని గాలించాడు. కూతవేశాడు . అయినా, జాడ లేదు. అతడు ముసలవ్వ ను వదలటానికి ఆమె ఇంటికి వెళ్లి ఉంటాడని

అనుకున్నాడు. మనసులో విసుక్కున్నాడు. ఇంత రాత్రిన నిర్జన స్థలంలో బస్సు ను వదిలి వెళ్లిన కండక్టర్ని ప్రయాణికులు కూడా కస్సుబుస్సుమని కరిచారు.. "కండక్టర్ ఎక్కడున్నా ఉండనీయండి ! బస్సును నడపండి! " అని కొందరు ప్రయాణికులు డ్రైవర్ కి

ఆదేశాలు ఇచ్చారు.

"నాయనా! నీ పేరేంటి ?" అని కండక్టర్ని అడిగింది ముసలామె .

"అవ్వా! నా పేరుతో నీకేమి పని?..... నా   పేరు మహాదూ వేంగుర్లే కర్ ."

"ఏ డిపో లో పని చేస్తున్న వయ్యా? "

" మాల్‌ వన్ ." అన్నాడు కండక్టర్ .

" నీకు సంతానం ఎంత మంది ?"

" ఇద్దరు " అన్నాడు కండక్టర్ .

ఇంతట్లో ముసలవ్వ ఇంటిని (పూరి గుడిసె ను ) చేరుకున్నారు.. రెండు మూడు కుక్కలు ఆరుస్తూ అక్కడి నుండి పారిపోయినవి. ముసలవ్వ కండక్టర్ కు తన ఇంటి తాళం చెవి ఇచ్చింది. అతడు ఆమె ఇంటి తాళం తెరిచి ఆమె చేతికిచ్చి పరుగు పరుగున బస్సు దారి పట్టాడు.

ఆ ముసలవ్వ ఆ ఊరి కొన భాగంలో ఒంటరిగా  ఉంటుంది . ఆమెకు దగ్గరి బంధువులు అనువాళ్ళే లేరు! ఆమెను ప్రేమించే వాళ్లు లేదా ఆమె బాగోగులు అడిగే వాళ్లే లేరు!!

ఆమె ఎప్పుడూ ఎవరి వద్దకు వెళ్లేదే కాదు. ఎవరైనా ఆమె దగ్గరకు వస్తే వాళ్ళు స్వార్ధ పరులని సందేహించేది . అలా వచ్చే వాళ్ళు తన సంపద పైన కన్ను వేసే వచ్చారని అనుమానిస్తుంది! ఆ వయసులో అలా అనుమానం  స్వాభావికం మరియు వాస్తవం కూడా ! ఊరు శివార్లో ఆమె పేరట రెండు ఎకరాల  భూమి ఉంది. అట్టి భూమిని ఊరి వారికి కౌలుకు ఇచ్చి  వచ్చిన డబ్బుతో పొట్ట పోషించు కుంటుంది.

ఒక రోజు ముసలవ్వ ఎందుకో చాలా జబ్బు పడింది. అట్టి స్థితిలో ఆమె తన ఊరి సర్పంచ్ మరియు కార్యదర్శిని రమ్మని

పిలుపునిచ్చింది. అది విని వాళ్ళు ముందుగా కొద్దిగా అనుమాన పడ్డారు. అయినా,వాళ్లు ఆమె ఇంటికి వచ్చారు. ముసలవ్వ లేచి కూర్చుంది. వచ్చిన వారితో  "గ్రామ పెద్దళ్లారా! ఇక నా ఆరోగ్యం చాలా క్షీణించింది. నేను ఎక్కువ రోజులు బ్రతకను .

కావున నా దగ్గర ఉన్న ఈ రెండున్నర  తులాల బంగారం, నా భూమి మరియు నా ఇల్లును 'మాల్‌ వన్‌ 'బస్సు డిపో లోని కండక్టర్ మహాదూ వేంగుర్లే కర్ పేరట నా వీలునామా వ్రాయండి. ఇదిగో నా దగ్గర పొదుపు చేసిన ఈ ఇరవై వేల

రూపాయలు తీసుకొండి. ఇందులోంచి నేను గతించిన తరువాత నా క్రియ ఖర్మల

కోసం వాడుకోండి . నేను ఇక ఎక్కువ రోజులు బ్రతకను ." అని

అంది. సర్పంచ్ మరియు కార్యదర్శి ముసలవ్వ మాటలు విని ముందుగా ఆవాకయ్యారు.

ఇదేంటి సమస్య? ఈ మహాదు

వేంగుర్లే కర్ ఎవరు ? ఈ పేరు ముందు ఎప్పుడూ విన లేదే? అతడి పేరట ఈ ముసలామె ఎందుకు తన సంపదను వ్రాస్తుంది? ఏదో సంబంధం ఉండి ఉంటుందనుకొని ముసలవ్వ తో సెలవు తీసుకొని

వెళ్లి పోయారు.                 రెండు మూడు రోజుల తరువాత ముసలవ్వ

కన్నుమూసింది.

ముసలవ్వ కోరిక మేరకు సర్పంచ్ మరియు కార్యదర్శి అన్నీ క్రియ కర్మలు జరిపించారు. అన్నీ పనులు పూర్తి చేసి వాళ్లు 'మాల్‌ వన్ ' బస్సు డిపో కి వెళ్లి మహాదూ వేంగుర్లే కర్,కండక్టర్ ని కలిసి ముసలవ్వ వివరాలు వివరించారు.

ఒక ఏడాది క్రిందటనే జరిగిన సంఘటన కావున కండక్టర్ కి అన్నీ విషయాలు జ్ఞాప్తికి వచ్చాయి. ముసలవ్వ తన 

పేరట వీలునామా వ్రాసిన 

విషయాలు తెలిసిన తరువాత కండక్టర్ కళ్ళు కన్నీళ్ళతో నిండాయి. అతడు ఆ రోజు రాత్రి జరిగిన ఘటన వాళ్ళకు వివరించాడు. అది వినిన సర్పంచ్ మరియు కార్యదర్శి లకు చాలా ఆశ్చర్యమేసింది. వాళ్లు తాము నిర్ధారించిన తారీఖున కండక్టర్ ని తమ ఊరికి రమ్మని పిలుపునిచ్చారు.

మహాదూ వేంగుర్లే కర్ పిలిచిన తారీఖున ఊరును చేరుకున్నాడు. వందలాది గ్రామస్తులు గుమిగూడి ఉన్నారు. సర్పంచ్ గారు కండక్టర్ మెడలో ఒక పూలమాల వేశాడు. బాజా బజంత్రీలతో అతడిని గ్రామ పంచాయితీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

అందరూ సభగా కూడిన తరువాత సర్పంచ్ గారు ముసలవ్వ తన పొలం మరియు ఇల్లు కండక్టర్ పేరట వ్రాసిన పత్రాలు మరియు రెండున్నర తులాల బంగారు కండక్టర్ చేతుల్లో ఉంచారు. అవి అందుకొని కండక్టర్ తన     దుఃఖాన్ని ఆపుకోలేక పోయాడు.

ముసలవ్వ కు తాను చేసిన చిన్నపాటి సహాయం తో ఆమె ఇంత విలువైన సంపదను తన

పేరట వ్రాయటం అతడికి మతి

పోయినట్లు అయింది.!

అక్కడ సమీపం లో పిల్లల గోల

వినపడింది. "ఇక్కడ ప్రక్కన బడి ఉందా? " అని అడిగాడు

కండక్టర్.

"ఔను, ఈ బడి కోసం స్వంత స్థలం లేదు మరియు భవనం కూడా లేదు. అందుకే మా

 కాత్వాన్ గ్రామ పంచాయితీ అధీనంలో ఉన్న ఈ స్థలం లో సరిపోని ఇరుకు గదుల్లో మా

హైస్కూల్ నడుస్తుంది. " అని

చెప్పాడు సర్పంచ్ . 

" ఏం..? దగ్గర్లో బంజరు భూమి లేదా? ఊర్లో ఎవరో ఒకరు బడి

నిమిత్తం తమ భూమి లోని కొంత భూమి బడి కోసం దానం యిచ్చే వాళ్లు లేరా?" అని మళ్ళీ అడిగాడు కండక్టర్.

" ఊర్లో బంజరు భూమి లేదు. బడి కోసం తమ పొలం ఇవ్వటానికి ఊర్లో ఎవరూ

ముందుకు రావటం లేదు." అని

జవాబిచ్చాడు సర్పంచ్ .

వెంటనే కండక్టర్ తన కుర్చీ లోంచి లేచి నిలబడ్డాడు. టేబల్ పైన ఉంచిన ముసలామె కాగితాలు సర్పంచ్ కు అందిస్తూ -" ఇదిగో సర్పంచ్ గారు పాఠశాల నిర్మాణానికి ముసలవ్వ పొలం మరియు ఇంటి కాగితాలు తీసుకొండి. ఈ పొలం మరియు ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుతో పాఠశాల నిర్మాణ పనులు మొదలు పెట్టండి. ఇదిగో అవ్వ ఇచ్చిన

బంగారం తీసుకొండి . దీన్ని అమ్మి వచ్చిన డబ్బుతో అవ్వ పేరట బడికి ఒక భవ్యమైన ప్రవేశద్వారం నిర్మించండి మరియు దాని పైన అవ్వగారి పేరు అందమైన అక్షరాలతో లిఖించండి. " గ్రామస్తుల చప్పట్లతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. సర్పంచ్ మరియు ఊరు జనం భావుకులయ్యారు. "పాఠశాల  కు అవ్వ పేరు పెట్టుకుందాం!!" అని అందరూ మురిసి పోయారు.

కండక్టర్ మహాదూ వేంగుర్లేకర్ అందరికి ధన్యవాదాలు చెప్పి వెళ్లటానికి సెలవు పుచ్చుకుని నడవసాగాడు. ఊరి జనం అతడిని కొంత దూరం వెంబడించింది.

చినిగిన సంచి భుజాన ఉన్నా, కండక్టర్ ఊరి సంపదను అదే

ఊరికి ఇచ్చి వెళ్లి పోయాడు. మరో ప్రక్కన అవ్వ పేరును శాశ్వతంగా నిలబెట్టి పోయాడు.

మనం జీవితం లో ఒకరికి చేసిన

చిన్న పెద్ద సహాయం ఎప్పుడూ వృధా కాదు. ముందటి వ్యక్తి  కృతఘ్నుడైనా, మనం మన పరోపకార బుద్ధిని వదల కూడదు.

మనిషి మనిషి కి మధ్య మన మానవత్వం ఎల్లప్పుడూ బతకాలని ఈ పోస్టు ఒకరికొకరం పంపుకుందాం!!👍🙏


A.V. రామారావు గారి వాట్సాప్ పోస్ట్

చిట్టికథ

 *✍️...నేటి చిట్టికథ*


తనని నమ్మిన భక్తులని కాచి రక్షించెందుకు ఆ పరమేశ్వరి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది..


అలా ఎన్నో సంఘటనలు జరిగాయి వాటిలో ఇదొకటి...


తిరుకడైవూర్ క్షేత్రంలొ "అభిరామి అమ్మవారు" సాత్విక రూపంలో వెలిసి ఉన్నారు అదే క్షేత్ర పరిధిలో అభిరామ భట్టు అనే భక్తుడు కూడా ఉండేవాడు ఈయన ప్రతి రోజు అమ్మవారి ఆలయంలొ ధ్యానంలోనే ఎక్కువ సమయం ఉండేవాడు.


ఆయన ధ్యానస్థితిలో ఉండగా అమ్మవారు ఆయనకి తరచూ దర్శనం ఇచ్చేది.


ఒకనాడు ఆలయంలొ ఆయన ధ్యానం చేసే సమయంలో తంజావూరు చక్రవర్తి అయిన తుందిరా మహారాజు అమ్మవారి దర్శనానికి వచ్చాడు.


అందరు లేచి నిలబడి స్వాగతం పలికారు ఒక్క అభిరామ భట్టు తప్ప, అయన మౌనంగా లోపలకి వెళ్లిపోయాడు.


పూజా కార్యక్రమం ముగించుకొని బయటకు వస్తూ ఉండగా మళ్ళీ అందరు లేచి నిలబడ్డారు ఈయన తప్ప దాంతో మహారాజుకి కోపం వచ్చి ఎవరితను అనగా ఆలయ అర్చకులు పరుగు పరుగున వచ్చి ఈయనొక ఉన్మాది ప్రభూ.. మధిరా పానం వల్ల బాహ్య సృహ లేదు అన్నారు కానీ రాజుకి అనుమానం వచ్చింది.. కారణం ఆయన మొహంలో అమ్మవారి దర్శనం తాలూకా ఆనందం కళ రూపంలో మొహం వెలిగి పోతోంది వెంటనే ఆయన్ని లేపమని చెప్పాడు తుందిరా మహారాజు... భటుడు వెళ్లి కదపగా ధ్యానం నుండి బయటకి వచ్చాడు అభిరామ భట్టు.


వెంటనే మహారాజు ఆయన్ని ఇవాళ తిధి ఏంటి అన్నాడు దానికి అభిరామ భట్టు తడుముకోకుండా పౌర్ణమి అన్నాడు కారణం ఇప్పటి వరకు తను ధ్యానంలొ చంద్రబింబం లాంటి అమ్మవారి మోము చూడటమే చుట్టుపక్కల అందరు ఒక్కసారిగా తలలు పట్టుకున్నారు ఎందుకంటే ఆ రోజు అమావాస్య.. మహారాజు వెంటనే సరే నేను సాయంత్రం వస్తా నాకు చంద్ర దర్శనం చేయిస్తావా అన్నాడు దానికి ఒప్పుకున్నాడు అభిరాముడు.. ఒకవేళ సాయంత్రం చంద్ర దర్శనం నాకు కలుగక పోతే నిన్ను శిక్షిస్తాను అన్నాడు మహారాజు.


సాయంత్రం అయ్యింది అభిరామ భట్టు స్నానాధి కార్యక్రమాలు ముగించుకుని ఆలయంలోకి వచ్చి అమ్మవారికి అంతాది రూపక ప్రార్ధన చేయటం మొదలెట్టాడు (అంటే ఒక శ్లోకం ఏ పదంతో ముగుస్తుందో తర్వాత శ్లోకం ఆ పదంతో మొదలెట్టడం అలా ఆయన ఎన్నో శ్లోకాలు రాసాడు వాటిని అభిరామ అంతాది అంటారు)


అలా శ్లోకాలు చెప్తూ ఉండగా చీకటి పడింది మహారాజు వచ్చాడు నాకు చంద్ర దర్శనం చేయించు అన్నాడు అభిరామ భట్టుతో.. అభిరామ భట్టు శ్లోకం చెప్పడం ఆపలేదు. రాజు మరొక్కసారి అడిగాడు కానీ అభిరామ భట్టు అలాగే చెప్పుకుంటూ పోతున్నాడు..


మహారాజుకి కోపం వచ్చి ఈ దూర్తుడిని శిక్షించండి అనబోతు ఉండగా ఆశ్చర్యంగా ఆకాశంలొ ఒక అద్భుతం జరిగింది అప్పటి వరకు చిమ్మ చీకటిగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా వెలుగులు సంతరించుకుంది.


అక్కడ నిండు చందమామ రూపంలొ అమ్మవారి చెవి తాటంకం ఉంది దాన్ని దర్శించిన తుందిరా మహారాజు, ప్రజలు ఒక్కసారిగా అభిరామ భట్టుకు.. అభిరామి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసారు.


అందుకే అనేది సర్వ సృష్టికి తల్లి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే దేనికి కొదవ ఉండదు అని🙏


శ్రీమాత్రేనమః🙏🏻


🔹🔸🔹🔸🔹🔸🔹

దేవతల కోసమే తెరవాలి

 పరమహంస యోగనంద గారు తమ  గ్రంధంలో జ్ఞాపకశక్తిని పెంపొందించుకునే విధానాలను విపులంగా వివరించారు  ఇలా

   మానవుని శక్తులలో జ్ఞాపకశక్తి ముఖ్యమైనది. జ్ఞాపకశక్తి  లేకపోతే మనం చిన్నపిల్లల్లా ఉండిపోతాము. Remember (జ్ఞాపకం )అనేపదం re అంటే 'తిరిగి ' మరియు memorari అంటే గుర్తుచేసుకోవడం అనే మాటలనుండి వచ్చింది.జ్ఞాపకం అంటే ప్రతి ఆలోచన, పని లేక  అనుభవం మొదటిసారి జరిగినపుడుదా ని మౌలికమైన మానసిక జ్ఞాపకార్ధ లేఖనం, ప్రతి జ్ఞాపకం మెదడులో ఒక ప్రత్యేక భావ నమూనా లాగ నమోదు అవుతుంది. లెక్కలేనన్ని ఈ నమూనాలలో దేనినయినా చైతన్యపు జాగరూ కత లోనికి గుర్తు తెచ్చుకోవడమే జ్ఞాపకం.

     మనిషి స్మృతిలో అతడు రూపొందించు కున్న మంచి చెడు అలవాట్లు ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి. అతడువాటిని గుర్తుంచుకున్నా లేకపోయినా అవన్నీ అతడి మెదడులో  ఉన్నాయి.మీరెవరికైనా మంచి చేసినా , హాని చేసినా ప్రతిసారి, ఆ స్మృతి మీ మెదడులో నిక్షిప్త మౌతుంది. అలాగే మీరెవరికన్నా హాని చేసిన ప్రతీసారి, ఈ జ్ఞాపకం మీ మానసిక కోశాగారంలో భద్రపారాచబడుతుంది. మంచి గాని, చెడు గాని ఇతరులకి బుద్ధి పూర్వకంగా చేసిన దేదైనా గుర్తు పెట్టుకోబడుతుంది. మీ ప్రస్తుత చర్యలు మీకు తెలియకుండానే ఈ పాత చర్యల మూలంగా ప్రభావితం మౌతాయి. గత జన్మనుంచి మంచి అలవాట్లున్న ఒక మంచి వ్యక్తి మంచి పని చేసినప్పుడు, గతంలోని మంచి యొక్క ప్రభావం వెంటనే ఆ క్రియను మంచి అలవాటుగా మారుస్తుంది. అలాగే ఒక చెడ్డ మనిషి తప్పు పని చేసినప్పుడు, అతని పాత చెడు అలవాట్లు కారణంగా పటిష్ట పరచబడిన దాని ప్రభావం ఆ పనిని వెంటనే చెడ్డలవాటుగా మారుస్తుంది. గత జన్మలనుండి వచ్చిన ఈ జన్మలో ఏర్పడిన చెడు ప్రవృత్తులను వదిలిపెట్టాలని గట్టిగ తీర్మానించుకోండి. మీ మంచి పనులనీగుర్తుంచుకోండి. అప్పుడే మీకు మనఃశాంతి లభిస్తుంది.కొద్దిపాటి మంచి తనమైన ఏ జన్మలోదయినా మీ రెన్నాడూ కోల్పోరు. ఆ మంచి జ్ఞాపకాలను మీ ప్రస్తుత చర్యలను ప్రభావితం చేసేలా ఉపయోగించండి. ఇతరులకు కూడా వారి లోని మంచి చేయగల సామర్ధ్యాన్ని గుర్తు చేయండి. మంచిని పెంపొందించే వాహకులుగా మనం నిరంతరం  అందరం కృషి చేస్తుంటేనే చెడుని సమూలంగా నాశనం చేయగలుగుతాము. పాశ్చాత్య దేశా లు క్రమశిక్షణ తో వరవలంబించే  మౌలికసూత్రమిదే. మనలో కొరవడిందీ ఇదే..

    భగవంతుడు ఇచ్చిన జ్ఞాపక శక్తికి  ప్రయోజనం ప్రతికూల విషయాలు ఆలోచించడం, పదే పదే తలచుకొని బాధ పడడంకాదు. అది ఆరోగ్యాన్ని దెబ్బతీసి మనల్ని మానసికంగా కూడా క్రుంగ దీస్తుంది. మంచిని, అనుకూల విషయాలను తలచుకుని దీనినే అభ్యసించాలి. అందువల్ల మనము ప్రశాంతంగా మానసిక దృఢాత్త్వంతో జీవించా గలుగుతాము. మనసు బంధించిన పాశా లను జ్ఞానమనే ఖడ్గంతో చేదించడం లేక బందీ గానే ఉండిపోవడం అనేది మన మీదే ఆధారపడి ఉంది.

జ్ఞాపకాన్ని పెంపొందించుకునే margalu---

1. ఆహారం.: తాజా పాలు, పెరుగు మంచి జ్ఞాపకానికి సహాయపడతాయి. ఏమితంగా తింటే దుష్ప్రభావము చూపుతుంది. కొవ్వు పదార్ధాలు అధికంగా తింటే జీర్ణక్రియ మందగించి చివరకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. వేపుళ్ళు, కొవ్వు పదార్ధాలు మితంగా తినాలి. పంది మాంసం పూర్తిగా విడిచిపెట్టాలి. అది జ్ఞాపకాశక్తిని న సింపజేస్తుంది.

2, చల్లని నీటి లో స్నానం జ్ఞాపక శక్తికీ నాడు లకూ మంచిది. నరాలను చల్ల బరిస్తే మానసిక ప్రశాంతత వృద్ధి చెందు . తుంది..

3. భోగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆత్మనిగ్రహం  ఉన్నవారు మహాత్తర మైన జ్ఞాపక శక్తిని, అద్భుతమైన మనోబలాన్ని సాధించగలరు..

4. గతస్మృతులను ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవడం వలనకూడా జ్ఞాపకశక్తి అభివృద్ధి చెందుతుంది. మానసికంగా వ్యాయామంతో కూడికలు, తీసివేతలు లాంటి చిన్న కసరాత్తులతో జ్ఞాపకాశక్తిని పెంపొందించుకోవచ్చు.

5.జ్ఞాపకశక్తి పేంపొందించుకునే ఇంకొక పద్ధతి తలమీద నెమ్మదిగా చేతివేళ్ల కణు పులతో కొట్టుకోవడం.

6. చేసేప్రతిపనీ గాధమైన శ్రద్ధ తో ఏ కాగ్రత తో  చెయ్యాలి.చాదస్తాన్ని వదులుకోవాలి.

7. సాహిత్యము, చిత్రాలేఖనము వంటి లలిత కళల అభ్యాసంతో కూడా జ్ఞాపకాశక్తిని పెబచుకోవచ్చు.

8. చివరగా మానసిక అనుభూతుల్ని మరచిపోకుండా గుర్తుము తెచ్చుకోవాలి. అవికూడా మంచివిషయాలే అయి ఉండాలి.

మీ మనో మందిరాన్ని భగవంతుడి స్మరణతో నిత్యం పవిత్రంగా ఉంచుకోవాలి. దుష్ట జ్ఞాపాకాలనే దోపిడీ దొంగలుణితరిమికొట్టాలి. ఆ మందిరాన్ని మంచి తనమనే దేవతల కోసమే తెరవాలి.


⬆️ Vissapragada Ramalingeswara Rao:9490195+91 94901 95303

విద్యయొక్క పరమార్థాన్ని

 శ్లోకం:☝️

*జ్ఞానవిద్యా విహీనస్య*

   *విద్యాజాల నిరర్థకం |*

*కణ్ఠసూత్రం వినా నారీ*

   *అనేకాభరణైర్యుతా ||*


భావం: విద్య నేర్వగానే సరికాదు. ఆ విద్యయొక్క పరమార్థాన్ని గ్రహించడమే కాక అందలి జ్ఞానాన్ని తెలుసుకోవలెయును. జ్ఞానం పొందకుండా విద్యలెన్ని నేర్చినను ప్రయోజనంలేదు. స్త్రీకి మంగళసూత్రమే సతీత్వము నిచ్చును గానీ మిగిలిన ఆభరణములేవీ ఇవ్వవు కదా?

అందుకే మాయాబజార్ లో ఘటోత్కచుడంటాడు " _చిన్నమయ! పాండిత్యం కంటే జ్ఞానమే ముఖ్యం. వెయ్యండి వీడికి వీరతాడు._ "


విద్య లెన్ని నేర్చి విద్వాంసు డైనను

వృథగ నుండు 'జ్ఞానవిద్య' లేక 

కంఠసూత్ర మొకటి కలికికి లేకుండి

భూష లెన్ని యున్న భూతి లేదు


గోపాలుని మధుసూదనరావు

          భాగ్యనగరము

        9959536545


చదువది యంత నేర్చినను సారపుజ్ఞానము లేకయున్న యా

చదువు నిరర్థకంబగును,సాధ్వికి నెన్నియు భూషలుండినన్

పదిలముగూర్చునిండయిన బంగరుమంగళ సూత్రముండినన్

సదమలశోభ చేర్చునది, సాటికిరావు మరెన్ని భూషలున్

27, సెప్టెంబర్ 2022, మంగళవారం

కూరిమి గల దినములలో

 కూరిమి గల దినములలో

నేరము లెన్నడును గలుగ నేరవు 

మఱి యా కూరిమి విరసంబైనను

నేరములే తోచు చుండు నిక్కము సుమతీ


మనుషులు స్నేహముగా ఉన్నప్పుడు ఎదుటివారిలో అన్నీ ఒప్పులే కనిపిస్తాయి. ఒకవేళ వారు తప్పులు చేసినా కూడా మంచిగానే అనిపిస్తాయి. అదే వ్యక్తులు శత్రువులుగా మారినప్పుడు వారు చేసే మంచి పనులు కూడా చెడ్డవిగానే కనపడును

స్వర్గప్రాప్తి

 ప్రపంచ జనాభా ఇప్పుడు దాదాపు 800 కోట్లు పైబడట్టు అంచనా. అంటే రెండవ ప్రపంచ యుద్ధం దరిదాపుల్లో ఈ జనాభా లెక్కలు దాదాపు 150 నుండి 200 కోట్ల దాకా ఉండేవని. 


అంటే సుమారు 80 ఏళ్ళ తరువాత జనాభా నాలుగింతలైనట్టు. 


మనిషి సగటున 80 ఏళ్ళు బతుకుతాడు అని అనుకుంటే ఇప్పుడు ఉన్న జనాభా అంతా 1940 తరువాత పుట్టినవాళ్ళే కదా


పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం 1940 దాకా ఉన్నవారందరు మళ్ళీ పుట్టుంటే జనాభా లెక్కలు 200 కోట్లకు దాటకపోదును. కాని 800 కోట్లు ఎలా ఐనట్టు. 


అంటే మనుషులే కాకుండే ఇతర జీవులు కూడా మనుషులుగా పుట్టి తమ తమ మంచి కర్మల ద్వారా మోక్షం పొందగలరని కదా. 


కాని మనిషి కన్నా ఇతర జీవులకు మానవ జన్మ పొందడానికి అవకాశాలు తక్కువ అని విన్నాను. 


కాని ఆ ఇతర జీవులు ఏం చేసాయో గాని మనుషుల జనాభాను అతిక్రమించి మనుషులుగా జీవం పొంది స్వర్గప్రాప్తి సంపాదించుకుంటున్నాయి అని చెప్పడంలో సందేహము లేదు. 


పైన చెప్పిన వివరాలలో ఏవైనా తప్పులు ఉన్న యెడల మన్నించగలరు.

తాను సృష్టించిన మనిషి

 దేవుడు తాను సృష్టించిన మనిషి ఇంకా మంచివాడనే నమ్ముతున్నాడు. అలసి సొలసి పోతున్న మనిషి ముఖంలో చిరునవ్వు చూడాలని ఆశపడ్డాడు భగవంతుడు. నువ్వేం కావాలో కోరుకో అన్ని ఇస్తాను అని అన్నాడు. 


మనిషి డబ్బు బంగారం వజ్రాలు కావాలి అని అన్నాడు. దేవుడు ఎంత అమాయకుడో అవన్నీ ఇచ్చేస్తే మనిషి నవ్వుతాడని అనుకున్నాడు. తన చూపుడు వేలును ఇంట్లో వస్తువుల వైపు తిప్పాడు. అంతే,  అంతా బంగారంగా మారిపోయి మెరుస్తున్నది. 


అయినా మనిషి ముఖంలో నవ్వు కనిపించలేదు. ఇంటినే బంగారు భవనంలా మార్చేసాడు. అయినా ఆ మనిషి ముఖంలో నవ్వు కనిపించలేదు. ఇంకా ఏం కావాలి అని అడిగాడు భగవంతుడు.


మీ చూపుడు వేలు కావాలి అని అడిగాడు మనిషి. దేవుడు అప్పుడు తేరుకున్నాడు.


తాను సృష్టించిన మనిషి మనిషి కాడని *మనీ* షిగా మారిపోయాడని. అతడు ఆరోగ్యం కోరుకోలేదు. అందమైన కుటుంభం కోరుకోలేదు. వెలకట్టలేని సంతోషం కోరుకోలేదు. కోరుకున్న వాటిలోనూ తృప్తి చెందలేదు. సాయం చేయడానికి వస్తే ఆ చేతినే నరికేస్తున్నాడు.


మనిషి అమాయకుడు కాదు ఆ *మాయకుడు* అని. అతడిని నమ్మినందుకు తానే అమాయకుడని తలచి ఆ రోజూ నుండి మాటలు కట్టిపెట్టి మౌనంగా నల్లరాయిలో శిలలా మారి జరుగుతున్న అన్యాయాన్ని కూడా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నాడు

పాపం అమాయకుడైన ఆ భగవంతుడు.


 🙏🙏🙏

భూతకోటిని పాలించు

 సర్వ భూతములను

 శ్లోకం:☝️సద్యోముక్తి

*పాలినీ సర్వభూతానాం*

  *తథా కామాంగహారిణీ l*

*సద్యోముక్తిప్రదా దేవీ*

  *వేదసారా పరాత్పరా ll*

భావం: సర్వ భూతములను శాసించే మూలప్రకృతి, నిటలాక్షుడు మన్మథుని భస్మము చేసినట్టు మనలోని అరిహడ్వర్గాలను నాశమొనర్చి తత్ క్షణమే ముక్తిని ప్రసాదించే తల్లి, వేదమంత్రములు (వాక్కులు) పరమేశ్వరుడైతే అర్థము అమ్మవారు ( *వాగర్థావివ సంపృక్తౌ* ). ఆమె అన్ని తత్త్వములకు అతీతము. అంటే పోతనగారు చెప్పినట్టు _"లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెంజీకటి కవ్వల నేకాకృతిన వెలుగునని"_ భావం.🙏

భూతకోటిని పాలించు భువనవంద్య!

సకల కామాంగహారిణీ నిఖిల నిలయ!

ముక్తి తలచిన మాత్రానె మొగి నొసంగు 

వేదసారా ! పరాత్పరా ! వినుతి సేతు


గోపాలుని మధుసూదనరావు

9959536545

మాయం మాయం

 *అంతా మాయం మాయం మటుమాయం*


పనిలోకి వచ్చేవారు మాయం

కూలీలు మాయం

పోస్టుమాన్ మాయం,

ఆసాంతం వినే వైద్యుడు మాయం

ఫామిలీ డాక్టరు మాయం.

కోడళ్ళ పనితనం మాయం,

అత్తమామల మాటసాయం మాయం,

అల్లుళ్ళ గౌరవ హోదా  మాయం.

లంగా, ఓణీ మాయం,

చీర, రవిక, మాయం,

నల్లటి జడ మాయం,

జడలో పువ్వులు మాయం, 

గోచీ మాయం, 

పంచా గావంచా మాయం.

పుస్తక పఠనం మాయం

ఎక్కాలు మాయం,

గుణింతాలు మాయం,

పెద్దబాలశిక్ష మాయం,

చందమామ మాయం.

రేడియోకి శ్రోతలు మాయం

బాలానందం మాయం.

పెరడు, బావి అరటి మొక్కలు మాయం.

ఎండావకాయ మాయం 

కుంపటిపై దిబ్బరొట్టి మాయం 

మట్టివాసన మాయం 

పిడతకిందపప్పుబండి మాయం 

వందరోజులాడే సినిమాలు మాయం,

నాటకాలు బొత్తిగా మాయం. 

నిశ్శబ్దత లేని నిశిరాత్రులు మాయం 

ఉపాధ్యాయుడు మాయం 

కుంకుడుకాయ సీకాకాయ మాయం 

వాకిట ముందు కళ్లాపులు,ముగ్గులు మాయం ( అందరి విషయంలో కాదులే)

పిచ్చుక, సీతాకోకచిలుక మాయం 

సత్తుగిన్నె చారు మాయం 

స్కూల్లో మైదానం మాయం 

సంఘంలో నిదానం మాయం

తరవాణి దబ్బాకు వాము పప్పునూనె మాయం 

వానపాము మాయం 

చెరువుల్లో ఈతలు మాయం 

బిళ్ళా కర్రా మాయం,

కోతికొమ్మచ్చి, కబడ్డీ మాయం 

సైకిలు మాయం,

ఎద్దులబండి మాయం,

గుఱ్ఱపు బండి మాయం

రిక్షాలు మాయం చింతపిక్కలు మాయం,

గచ్చకాయలు మాయం

నేలబండాట మాయం 

గుడుగుడుగుంచం మాయం

వానా వానా చెల్లప్ప మాయం, 

వైకుంఠపాళి మాయం

తల్లులు పిల్లలకు లాలించి బువ్వ పెట్టడం మాయం

ఈ టెక్నాలజీ మయం

లో అంతా అయోమయం ఈ జీవినగమనం లో

ఇంకా ఇంకా చాలా చాలా మాయం మటుమాయం!

చివరికి మనమూ అవుతాం మాయం!!

శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీసంస్తుతి

 శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీసంస్తుతి 

పాడ్యమి 

1.

 శ్రీమచ్ఛంకరగేహినీం 

వినుతదృగ్దేదీప్యతేజోనిధిమ్

బ్రహ్మోపేంద్రహరాద్యనేకసురభృత్యాచారసంశోభినీమ్

చంద్రార్కానలలోచనత్రయముఖీం లోకత్రయారాధితామ్

శ్రీదేవీం ప్రణమామి తాం శుభకరీం శశ్వచ్ఛుభాకారిణీమ్

(భృత్యాచారము=సేవాభావము)


శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీసంస్తుతి 

2. కుమారి 

కౌమారీం భవదుఃఖనాశనకరీం దారిద్ర్యసంహారిణీమ్ 

ఆయుర్భాగ్యప్రదాయినీం గుణయుతాం సద్వీర్యదాత్రీం శుభామ్ 

విశ్వైకోన్నతశక్తిరూపవపుషీం లోకైకవంద్యాం శివామ్ 

వందే తాం నవకన్యకాంతరసఖీ మాద్యాం ద్వివర్షాత్మికామ్ 



విదియ

3.

శ్రీదేవీనవరాత్రపర్వవిలసద్దీవ్యత్ప్రభాశోభితామ్ 

భావాతీతగుణాన్వితాం బహువిధైః భక్త్యన్వితైర్భావితామ్ 

పూజాహోమవిభూషితాం సరభసాం సర్వాఘసంహారిణీమ్ 

శ్రీదేవీం ప్రణమామి నిత్యమతులాం సంస్తుత్యవార్తాకులామ్ 

4. త్రిమూర్తి 

ధనధాన్యప్రవివర్థినీం సురనుతాం వర్షత్రయీం విక్రమామ్ 

త్రిగుణాతీత గుణాన్వితాం సధవళాం విజ్ఞానరూపోజ్జ్వలామ్ 

శుభదాం సత్కులవృద్ధిదాం ధృతిమయీం త్రైలోక్యసంసేవితామ్ 

కరుణాపూరహృదంతరాళలసితాం వందే త్రిమూర్త్యాహ్వయామ్ 

*~శ్రీశర్మద*

సర్వ భూతములను

 శ్లోకం:☝️సద్యోముక్తి

*పాలినీ సర్వభూతానాం*

  *తథా కామాంగహారిణీ l*

*సద్యోముక్తిప్రదా దేవీ*

  *వేదసారా పరాత్పరా ll*


భావం: సర్వ భూతములను శాసించే మూలప్రకృతి, నిటలాక్షుడు మన్మథుని భస్మము చేసినట్టు మనలోని అరిహడ్వర్గాలను నాశమొనర్చి తత్ క్షణమే ముక్తిని ప్రసాదించే తల్లి, వేదమంత్రములు (వాక్కులు) పరమేశ్వరుడైతే అర్థము అమ్మవారు ( *వాగర్థావివ సంపృక్తౌ* ). ఆమె అన్ని తత్త్వములకు అతీతము. అంటే పోతనగారు చెప్పినట్టు _"లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెంజీకటి కవ్వల నేకాకృతిన వెలుగునని"_ భావం.🙏

పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్

 PCOD ( పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ) - 


       స్త్రీలలో హార్మోన్ సమస్య వలన వచ్చే ప్రధాన సమస్య ఇది. ఈ వ్యాధి లో ప్రధాన కారణం అండాశయం లొ నీటిబుడగలు ఏర్పడటం . ఈ నీటిబుడగలని నీటితిత్తులు అని కూడా అంటారు. దీనివలన సంతానలేమి సమస్య ప్రధానంగా స్త్రీలలో ఏర్పడుతుంది.  


 దీని ప్రధాన లక్షణాలు  - 


 *  నెలసరి సరిగ్గా రాకపోవడం  . 


 *  రుతుస్రావం తక్కువ కావడం లేదా ఎక్కువ కావడం జరుగును. 


 *  ముఖం మీద మచ్చలు వస్తాయి . 


 * జుట్టు రాలిపోతుంది . 


  PCOD  సమస్య రావడానికి ప్రధాన కారణం - 


       ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం హార్మోన్స్ అసమతుల్యత అని చెప్పవచ్చు . సహజంగా స్త్రీలలో ఈస్ట్రోజన్ హర్మోన్ తో పాటు ఆండ్రొజన్ అనే పురుష హర్మోన్ ఉత్పతి అవుతుంది . PCOD సమస్య వచ్చిన స్త్రీలలో ఆండ్రొజన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనివలన హర్మోన్స్ అసమతుల్యత లోపించి బరువు పెరిగి పాంక్రియాస్ నుంచి ఉత్పతి అయ్యే ఇన్సులిన్ హర్మోన్ శరీరంలో నిలువ ఉండే గ్లూకోజ్ మీద ప్రభావం చూపించదు. దీనివల్ల రక్తంలో చక్కర నిలువలు పెరిగిపోతాయి. కాలక్రమేణా మదుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. 

 

 గమనిక - 


  ఈ PCOD సమస్యకు ఆయుర్వేదం నందు అత్యద్భుత పరిష్కారం కలదు . ఈ సమస్యతో ఇబ్బంది పడువారు 9885030034 నంబర్ నందు సంప్రదించగలరు .


      మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                

26, సెప్టెంబర్ 2022, సోమవారం

చండీ యాగం

 #చండీ యాగం ఎందుకు చేస్తారు??


యాగం అంటే అదో పెద్ద క్రతువు. వేదకాలంలో మాత్రమే సాధ్యమయ్యే ఆచారం. కానీ యాగానికి వచ్చే ఫలితం దృష్ట్యా ఇప్పటికీ కొందరు ఎన్ని వ్యయప్రయాసలకి ఓర్చయినా సరే యాగం చేయాలని సంకల్పిస్తూ ఉంటారు. వాటిలో ప్రముఖంగా వినిపించేది చండీయాగం!


చండి అంటే ‘తీవ్రమైన’ అన్న అర్థం వస్తుంది. అందుకనే సానుకూలమైన, ప్రతికూలమైన మాటలు రెండింటికీ ఈ పదాన్ని వాడతారు. చండి అన్న దేవత గురించి పురాణాలలో అనేకమైన ప్రస్తావనలు కనిపిస్తాయి. పూర్వకాలంలో శుంభ, నిశుంభులు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు, చండి అవతారాన్ని ధరించిందట. తన శౌర్యంతో ఆమె శుంభ, నిశుంభులనే కాకుండా వారి సేనాధిపతులైన చండముండాసురులను కూడా సంహరించింది


చండీదేవినీ, ఆమె తేజోరూపమైన చాముండీదేవినీ కొలిచేందుకు దేశంలో చాలా ఆలయాలే ఉన్నాయి. హరిద్వార్లో ఆదిశంకరాచార్యులు నిర్మించినట్లుగా చెబుతున్న ఆలయం దగ్గర నుంచీ, మైసూరు పాలకులు నిర్మించిన ఆలయం వరకూ ఈ తల్లిని కొలుచుకునేందుకు ప్రత్యేకమైన క్షేత్రాలు ఉన్నాయి. ఆంతేకాదు! గ్రామదేవతగా, కులదేవతగా కూడా చండీదేవికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఇక సప్తమాతృకలలో ఒకరుగా, 64 తాంత్రిక దేవతలలో ముఖ్యురాలిగా... తంత్ర విద్యలలో కూడా చాముండేశ్వరిది ప్రత్యేక స్థానం.


మార్కండేయ పురాణంలో దుర్గాదేవిని స్తుతిస్తూ సాగే ఏడువందల శ్లోకాల స్తుతిని దుర్గాసప్తశతి అంటారు. దీనికే చండీసప్తశతి అని కూడా పేరు. హోమగుండంలో అగ్నిప్రతిష్టను గావించి ఈ దుర్గాసప్తశతి మంత్రాలను జపించడంతో చండీయాగం సాగుతుంది. చండీదేవికి ప్రీతిపాత్రమైన నవాక్షరి వంటి మంత్రాలను కూడా ఈ సందర్భంగా జపిస్తారు. యాగంలో ఎన్నిసార్లు దుర్గాసప్తశతిని వల్లెవేస్తూ, అందులోని నామాలతో హోమం చేస్తారో... దానిని బట్టి శత చండీయాగం, సహస్ర చండీయాగం, ఆయుత (పదివేలు) చండీయాగం అని పిలుస్తారు.


పూర్వం రాజ్యం సుభిక్షంగా ఉండాలనీ, ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలనీ, ఆపదలు తొలగిపోవాలనీ, శత్రువులపై విజయం సాధించాలనీ.... చండీయాగం చేసేవారు. రాచరికాలు పోయినా, చండీయాగం పట్ల నమ్మకం మాత్రం ఇంకా స్థిరంగానే ఉంది. అందుకే ఇప్పటికీ స్తోమత ఉన్నవారు, రాజకీయ నాయకులు ఈ యాగాన్ని తలపెడుతూ ఉంటారు....


#శ్రీమాత్రే నమః 🙏🙏

కూర్మి యడిగెదరందరు

 కూర్మి యడిగెదరందరు కుశలములను

ఎచట కుశలమ్ము లుండు ? తా నెంచి చూడ 

మనుజునకు సత్య మరయంగ మహిని యెపుడు

దిన దినమ్ముల యాయువు తీరుచుండ ?

_నువ్వెళ్ళినా

 *_నువ్వెళ్ళినా నీ పాట మాతోనే.._*


🎼🎼🎼🎼🎼🎼🎼


ఒకటా..రెండా..

*_నలభై వేల పాటలు.._*

సుమారు నాలుగు తరాలు..

పరవశించిపోయిన 

*_కోట్లాది హృదయాలు.._*

ప్రతి మనిషి జ్ఞాపకంలో 

ఆయన పాట..

ఏ వయసు వారికి 

ఆ అనుభూతి..

బాల్యమా.. యవ్వనమా..కౌమారమా.. వార్ధక్యమా..జీవితంలోని 

అన్ని దశలకు 

అన్ని రకాల పాటలు..

ప్రేమా.. విషాదమా.. ఆవేశమా..రౌద్రమా.. సరదానా.. సంతోషమా..

ఎప్పుడు ఏదడిగినా 

చిటికెలో 

తీసి ఇచ్చేస్తుందా స్వరపేటిక..

*_అసలు పాటకు_* 

*_ఆయనే పీఠిక...!_*


ఇక భక్తి గీతాలా..

*అయ్యప్ప దేవాయన మహ..*

అంటే పలకడా 

శబరిగిరీశుడు...

*జయజయ వినాయకా* 

*శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక..*

అని స్తుతిస్తే

నీ రూపంలోనే కదిలి రాలేదా గణపయ్య..

*నీవూ మా వలె మనిషివని..నీకూ మరణం ఉన్నదని తెలిసీ ఎలా బతికేది..*

అంటే సమాధి చీల్చుకురాడా

షిర్డీ సాయిబాబా..

ఆ గళం విని 

మురిసిపోలేదా మల్లన్న..

ఏడుకొండలూ 

దిగిరాడా వెంకన్న.. 

మీటింగులో నీ గీతమే..

పెళ్ళిలో నీ గొంతే..

గుడిలో నీ పాటే..

మా గుండె గుడిలో 

నీ గళమే...

నువ్వు మా హృదయాలలో నింపిన జాలమే..

మా బ్రతుకులో 

*_నీ పాటలు కలకాలమే..!_*

         

*చేయెత్తి జై కొట్టు తెలుగోడా..*

ఈ ఒక్క పాట రాష్ట్రం మొత్తం మీద ప్రకంపనై..

తెలుగుదేశం పార్టీకి అలంబనై..

*ఎన్టీఆర్ విజయగీతికై..*

ఆ యుగపురుషుడి 

రాకకు సంకేతమై.. మారుమ్రోగిపోయి..

పల్లె..పట్నం ఊగిపోయి..

నాటి చరిత్రలో 

*నందమూరి మాట..*

*బాలసుబ్రమణ్యం పాట...* 

కూలిపోయె తెలుగునాట కాంగ్రెస్ కంచుకోట..!


*సంగీతమే నీ ప్రపంచం..*

మాకు వినిపించేవి 

నలభై వేల పాటలే..

వాటి వెనక 

ఎన్ని లక్షల రిహార్సల్స్ ..

ఎంత సాధన..

ఇంకెంత శోధన..

నిదురలో..మెలకువలో

*నీ గొంతు కువకువ..*

*నీ పాట మెళకువ..* 

సంగీత ప్రపంచానికి 

*_నీ స్వరమే వేకువ.._*

సంగీత సరస్వతికి 

*_దొరకునా ఇటువంటి సేవ.._*

*_నీ పదరాజీవముల చేరు_* 

*_నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ..!_*

         

నువ్వెళ్లిపోయావంటే 

చెప్పలేని బాధ..

గుండెలు పిండేస్తున్న ఆవేదన.. మౌనరోదన..

అంతలో నీ పాట.. 

నేల నలు చెరగులా 

అదే ప్రతిధ్వని.. 

అరె..అన్ని చోట్లా నువ్వున్నావే..

ఎక్కడ విన్నా 

నీ గొంతే..

అంటే నువ్వున్నావు..ఉంటావు. 

నేనున్నంత కాలం 

నా గుండెలో..

నా తర్వాత నా బిడ్డ గొంతులో..

సినిమా ఉన్నంత కాలం 

ప్రతి పాటలో..సంగీతమనే 

ఒక పాఠంలో..

ప్రతి పుటలో..!


షాదీలో..షామియానాలో..

ఖానాలో..ఖాందాన్లో..

హాల్లో..హల్లోలో..

షోలో..సోలోలో..

*తానాలో..*

*ప్రతి మనిషి* 

*తానా తందానాలో.!*


*అమర గాయకుడు ఘంటసాల

తరవాత, నిరంతర గాయకుడు బాలసుబ్రమణ్యం..*


*మనిషికే మరణం..*

*గొంతుకు కాదు..*


బాలు కనిపించరేమో

ఆయన పాట వినిపిస్తూనే ఉంటుంది.


*ఎక్కడికి వెళ్ళినా* 

*ఏదో ఒక భాషలో..!*

         

మూగవాడి గొంతులో కూడా *భలేభలే మగాడివోయ్*

అంటూ..అనిపిస్తూ..

తనలో తనకే వినిపిస్తూ..

బాలూ పాట..తేనెల ఊట..

చిన్నప్పటి నుంచి నాతోనే..

*ప్రతి వయసులో..*

*ప్రతి శ్రుతిలో..*

*నేను పాడే* 

*అపశృతిలో..*

*నిరంతరం నా స్మృతిలో..!*


**************

గానగంధర్వుడు దూరమై

రెండేళ్లు..

ఇది నా నివాళి..

✍️✍️✍️✍️✍️✍️✍️

     

*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

           9948546286

ఆయుర్యాతి దినేదినే

 శ్లోకం:☝

*లోకః పృచ్ఛతి సద్వార్తాం*

  *శరీరే కుశలం తవ ।*

*కుతః కుశలమస్మాకం*

  *ఆయుర్యాతి దినేదినే ॥*


భావం: లోకంలో బంధువులు, ఆత్మీయులు, మిత్రులు ఎదురైనప్పుడు _‘క్షేమంగా ఉన్నారా?’_ అని ఆప్యాయంగా కుశల ప్రశ్నలడుగుతుంటారు. అనుదినం పగలు రాత్రి మన ఆయువు తరిగిపోతుంటే ఇంకా కుశలమేమిటి? దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రాణముండగానే అపరోక్షజ్ఞానం సంపాదించుకోవాలి. లేకపోతే కనీసం మళ్ళీ మానవజన్మ వచ్చేలా పుణ్యకార్యాలు ఆచరించాలి. *ఆయుర్యాతి దినేదినే* అనే సంస్కృత నానుడి చాలా ప్రసిద్ధం.

లంకాయాం శాంకరీదేవి*

 *లంకాయాం శాంకరీదేవి*                 


*ఇది 18వ శతాబ్దంలో జరిగిందట.*

       *శ్రీలంక కూడ అప్పట్లో భారతదేశపు అనుబంధమే.*


*అనేక పల్లెకారులు సముద్రమార్గం ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు శ్రీలంకకు వెళ్లి చేసుకుంటుండేవారు.* 


*ఒక సమయంలో తమిళపులులుగా కొన్ని ఉద్యమాలు , అల్లరులు, గొడవలు జరిగిన విషయం మనందరికి తెలిసినదే!!!*


*ఆసమయంలో జరిగిన సంఘటన ఇది. హఠాత్తుగ జరిగిన ఈ సంఘటనతో భయభ్రాంతులైన పల్లెజనం తమ తమ వర్తకసామగ్రిని హుటాహుటిన ఓడలలోనికి ఎక్కించి ఉరుకులు పరుగులమీద స్వస్థలాలకు చేరుకుని’బతుకుజీవుడా’ అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు.*


*అయితే తూర్పుగోదావరి కాకినాడ దగ్గర తాళ్లరేవు అనే ఒక కుగ్రామంకు చెందిన ఒక ఓడలోని వస్తువులను తాళ్లను ఖాళీ చేస్తుండగా అందులోనుండి ఒక అమ్మవారి విగ్రహం తాళ్లమధ్యలో పడుకుని కనిపించిందట.*


*గ్రామస్తులంతా తెల్లబోయి “ఈ విగ్రహం ఎక్కడిది?ఎలా వచ్చింది?ఎవరీఅమ్మ?ఏంచెయ్యాలి?” అని ధర్మమీమాంసలో పడ్డారు.* 


*పల్లెజనం.....అమాయకులు.. ఇప్పటంత communication లేదు. మాయలు, కుతంత్రాలు తెలియవు. ఊరిపెద్దలను కలిశారు. శ్రీలంకనుండి వచ్చిన ఓడలలో వచ్చింది ‘శాంకరీదేవి’ అని తెలుసుకునేటంత విజ్ఞానులు కారు వాళ్లు.*


*“అమ్మ తనంత తానుగా మనలను కాపాడటంకోసం వచ్చిన దేవీస్వరూపం“ అని మాత్రమే వాళ్లకు అర్ధమైంది.*


*గురువారంనాడు (లక్ష్మీవారంనాడు) దొరికింది కనుక మహాలక్ష్మి అని పేరు పెట్టి అదే ప్రదేశంలో ప్రతిష్ఠించుకుని పూజలు చేసుకోవటము మొదలు పెట్టారు.*


*అప్పటినుండి 2016 ఫిబ్రవరి వరకు శ్రీలంకలో శాంకరీదేవి పీఠంలో పీఠంమాత్రమే వున్నది......విగ్రహం లేదన్న విషయం మనందరికీ తెలుసు.* 


*శక్తిపీఠంకోసమే శ్రీలంకకు (తీసుకు) వెళ్తున్న యాత్రికులను తృప్తిపరచటం కోసంశ్రీలంక ప్రభుత్వంవారు (commercial purpose &income కోసం) ఆ పీఠంపై శాంకరీదేవి పేరుతో2016 ఫిబ్రవరిలో మరొక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.*


*అసలు “శాంకరీమాత” లంక రాక్షసులమధ్య, సీతామాత అన్నికష్టాలుపడ్డ ఆప్రదేశంలో“ వుండటానికి ఇష్టపడక మనవాళ్లతో మనదేశానికి తనంత తానుగా తరలివచ్చింది.*


*తూర్పుగోదావరిజిల్లా కాకినాడనుండి యానాం వెళ్లేరోడ్డులో తాళ్లరేవు దగ్గర “మట్లపాలెం మహాలక్ష్మి”పేరుతో కొలువై వున్నది.* 


*కేవలం శక్తిపీఠంకోసమే యాత్ర చేయాలనుకున్నవారు యానం వెళ్లి దర్శించుకోండి. ఈ విషయం 9 వ తరగతి పాఠ్యాంశాలలో కూడ వున్నది.*

25, సెప్టెంబర్ 2022, ఆదివారం

నిజకర్మల ద్వారా లభించిన విత్తంతో

 

“మూఢ జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్! 

 యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం||”

“ఓయీ మూఢుడా! ‘ధనం రావాలి’, ‘రావాలి’ అన్న దురాశను విడిచిపెట్టు .. సత్యంతో నిండిన బుద్ధితో మనస్సును తృష్ణారహితంగా చేసుకో! నీ నిజకర్మల ద్వారా లభించిన విత్తంతో తృప్తిపడి మనస్సును ఆనందింప చేసుకో!”

“ఎంతసేపూ ‘డబ్బు’ .. ’డబ్బు’” ..! అదే మూఢుల ‘పరిజ్ఞానం’. ఈ మూఢుల పరిజ్ఞానాన్ని వెంటనే వదిలిపెట్టేయాలి. ఈషణత్రయంలో ధనేషణ అన్నిటికన్నా దారుణమైనది. ఈ ధన తృష్ణను సత్యమైన బుద్ధితో వధించాలి. కష్టపడి చెమటోడ్చి, నిజాయితితో సంపాదించిన ధనంతో చక్కగా వినోదంలో ఓలలాడవచ్చు. అంతేకానీ అన్యాయార్జితమైన, అక్రమమైన ధనం మనిషి మానసిక ఆధ్యాత్మిక పతనానికి రాచబాట వేస్తుంది. సద్భుద్ధి అనేది ‘ధ్యానం’ ద్వారానే, అంటే ‘భజగోవిందం’ ద్వారానే సాధ్యం.”

దేవి నవరాత్రులు ప్రారంభం

 🎻🌹🙏26-09- 2022 నుంచి  రేపటి నుండి ఆశ్వయుజ మాసం దేవి నవరాత్రులు ప్రారంభం ..!!


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌷ఆశ్వయుజమాసం యొక్క విశిష్టత🌷


🌿త్రిముర్తులైన బ్రహ్మ , విష్ణు, మహేశ్వరుల దేవేరులైన..,


🌸సరస్వతి,మహాలక్ష్మీ ,పార్వతిదేవిలకు అత్యంత ప్రీతికరమైన వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఆశ్వయుజం !


🌿జగన్మాత అయిన పార్వతిదేవి దుష్ట శిక్షణ , శిష్ట రక్షణార్ధం , తొమ్మిది అవతారలను ధరించిన మాసం...


🌸ఆయుర్వేద దేవుడు అయిన ' ధన్వంతరీ , త్రిమతాచార్యులలో ద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీ మధ్వాచార్యులు జన్మించిన మాసం. 


🌿దుష్ట దానవుడైన నరకాసురుడు అంతమొందింపబడి ప్రజలందరికి ఆనందాల వెలుగులను పంచిన దివ్య మాసము ఇది !


🌸ఈ మాసం లోని తొలి తొమ్మిది రోజులు "దేవి నవరాత్రులు ". సంప్రదాయబద్ధంగా పూజలు చెయ్యాలి అనుకున్న భక్తులు కలశాన్ని స్థాపించి , ముగ్గురు అమ్మల మూలపుటమ్మను 

ఈ నాటి నుండి తొమ్మిది రోజుల పాటు నియమముగా ఆరాధించాలి .


🌿దేవి పూజను ఆశ్వీయుజ మాసం అష్టమి, నవమిలలో పూజించిన భక్తులను ఎటువంటి శోకాలు దరిచేరవు. 


🌸దేవి పూజకు ఉత్కృష్టమైన ఈ రోజులలో అమ్మవారిని పూజించి రోజుకొక నైవేద్యం చొప్పున సమర్పించడం మంచిది. 


🌿కలశ స్థాపనాదులతో పూజించలేని వారు, అమ్మవారి పటానికి గాని, విగ్రహానికి గాని , పుస్తకాలను గాని పూజిస్తూ స్తోత్ర , నామ పారాయణలను చేయవచ్చు.


🌸ఈ విధముగ దేవి నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించడం వల్ల ఆ దేవి సంతృప్తురాలు అవుతుంది.


🌿 అంతే కాకుండా దుష్ట , గ్రహ పీడలు నశించి అమ్మవారి కృప కటాక్షలు కలుగుతాయని చెప్పబడుతోంది. 


🌸అలాగే, ఈ మాసం లో సప్తమి రోజున గోపూజ చెయ్యవలెను. కపిల గోవును పూజించాలని, కేవలం పంచగవ్యములను మాత్రం స్వీకరించి ఉపవాసము ఉండవలెను. 


🌿పూర్ణిమ నాడు " నారదీయ పురాణము"ను పండితులకు తాంబూలములో వుంచి దానము ఇవ్వవలేను.


🌸పూర్ణిమ నాడు స్త్రీలు జాగరణ చెయ్యటం వలన లక్ష్మి దేవి సంతోషించి, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది అని శాస్త్ర వచనం.


🌿ఈ నెలలోని బహుళ పక్షములో చతుర్దశి , అమావాస్య తిధులలో దీపాలను దేవాలయం ,మఠము ప్రాకారాల్లోను , 


🌸వీధులు , ఇంటి ముందు సాయంత్రము సమయములో వెలిగించుకోవడంవల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారని చెప్పబడుతోంది. 


🌿ఈ విధముగ ఎన్నో విశిష్టతలను సొoతం చేసుకున్న మాసం -- ఆశ్వయుజ మాసం !


🌿ఈ మాసం లో చేసే పూజలు, విధుల ఆచరణ వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి.


🌸అనంత రూపాలలో విలసిల్లే శక్తిస్వరూపిణి అయిన ఆ తల్లి ఏ రూపములోనైనా , ఏ నామంతోనైనా ఆరాధించవచ్చు. ఆ తల్లి అమ్మలగన్న అమ్మ !.


🌿తనను నమ్మిన భక్తులను ఎట్టి పరిస్థితులలో విడవకుండా కాపాడే కల్పవల్లి ...

కరుణామయి..ఆ తల్లి !!!..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

వివిధ దేశాలకు సంకల్పం*

 *వివిధ దేశాలకు సంకల్పం*                                



*Sankalpam for US / U*


క్రౌంచ ద్వీపే , రమణక వర్షే, ఐన్ద్ర ఖండే. ప్రశాంత సాగరే, పుష్కర క్షేత్రే ,  రాకీ మిక్కిలిని పర్వతయోర్ మధ్యే , మిస్సిసిప్పీ మిస్సోరి ఇత్యాది షోడశ జీవ నదీనాం మధ్యే ఇండియానా రాష్ట్రే , మిన్నిసోటా జీవ నది తీరే ,  బ్లూమింగ్టన్నగరే, వసతి గృహే .....,

( Above is for Bloomington city in Indiana state . pla make required changes to your city) 



*Australia* 


శాల్మాలి ద్వీపే, ఐల వర్షే, నవ ఖండే, మేరో:  దక్షిణ దిగ్భాగే, అస్త్రాలయ దేశే,  భరతదేశే ఆగ్నేయ దిగ్గబాగే  హిందూ మహా సముద్ర తీరే సిద్ధిపుర్యామ్


*UK region*


విన్ధ్యస్య  పశ్చిమ దీక్భాగే, శాల్మలీ ద్వీపే, సముద్రమధ్యస్థిత బృహదారణ్య క్షేత్రే , ఐరోపా వ్యవహార నామ ఖండే, థేమ్స్  నదీ తీరే , లండన్   నగరేౌ


*Africa* 


ప్లక్ష ద్వీపె , వింధ్యస్య నైరుతి దిక్భాగె , తామ్ర ఖండె , కెన్య దెసె ...... నగరె ....... లక్ష్మి నివాస గ్రుహె 


*SINGAPORE* 


మేరొ: ఆగ్నేయ దిక్భాగే,

మలయ ద్వీపస్య దక్షిణ భాగెఁ,

పూర్వ సముద్ర తీరే,

సింహపురి మహా ద్వీపే,

సెరంగూన్ నదీ పరివాహక ప్రదేశే,

వసతి గృహే/ 

లక్ష్మీ నివాస గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నీధౌ...And so on.....

 



*Middle East*


జంబూ ద్వీపె భరత వర్షె భరత ఖండే వింధ్యస్య  పస్చిమ  దిక్భాగె , అరబీ మహాసాగర పస్చిమ తటె , కతార్ దెసె , దొహా నగరె .......... గ్రుహె 


*South Korea*


జంబూ ద్వీపె, అఖండ భరత వర్షె , మేరొ: పూర్వ దిక్భాగే, హరిద్రా సాగర తటె , కొరియా నామ ద్వీపె వసతి గృహే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ


*Mumbai*


వింధ్యస్య పశ్చిమ దిక్భాగె , సహయాద్రి పర్వత ప్రాంతె, అరబీ మహా సాగర తీరె , ముంబాయి నగరె ....   లక్ష్మి నివస / స్వ     గ్రుహె 


*Delhi* 


మెరొహ్ దక్షిణ పార్స్వె , వింధ్యస్య పశ్చిమ దిక్భాగె , ఆర్య వర్తైక ప్రదెశె , యమునా తటె , ధిల్లీ నగరె ... గ్రుహె  


*VARANASI*


వింధ్యస్య పశ్చిమ దిక్భాగె , అశీ వరుణయొర్ మధ్యె , మహాస్మశానె , ఆనందవనె , త్రికంటక విరాజితె , అవిముక్త వారణాశీ క్షెత్రె , ఉత్తరవాహిన్యా భాగీరధీ పశ్చిమ తటె , వసతి గ్రుహె , విశ్వెస్వర విశాలాక్షీ ఇత్యాది త్రయస్త్రిగిం శత్కొటి దెవత , గొ బ్రహ్మణ గురుచరణ సన్నిధౌ ,


*Bengaluru* 


శ్రీసైలస్య నైరుతి ప్రదెశె , తుంగ భద్ర కావెరి మధ్య ప్రదెసె , శ్రీ శ్రుంగగిరి సమీప ప్రాంతె , ..... గ్రుహె ..... సమస్త దెవతా .....


*Chennai*


...శ్రీ శైలస్య ఆగ్నేయ ప్రదేసే కృష్ణ కావేరి మధ్య ప్రదేశ...


*Vishakhapatnam* 


శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి మధ్య ప్రదేశే.....                                *ఓం నమః శివాయ*

హారతులు

 *హారతులు ఎన్ని రకాలు*   సర్వేశ్వరునికి వేదమంత్రోక్తంగా సశాసీ్త్రయంగా ఇచ్చే సర్వమంగళ నీరాజనమే హారతులు. ఇవి పలురకాలు

1ఏక హారతి

ప్రతిదీ ఒకేవిధంగా ఉండడానికి ప్రత్యేకించి అంతరంగాలు ఒక నిశ్చల స్థితిలో ఉండేందుకు దోహదం చేసేదే ఏక హారతి. ఇది నదుల్లోని ఔషధగుణాలు పెరగడానికి కూడా తోడ్పడుతుంది.

2,నేత్రహారతి

దివ్యస్వరూపమైన పరమాత్మ అనుగ్రహం అందరికీ లభించాలని ఇచ్చేదే నేత్రహారతి. దీనివల్ల సమస్త దృష్టిలోపాలు తొలగిపోతాయి.

3,బిల్వహారతి

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఇచ్చే నీరాజనమిది. మనం చేపట్టిన ప్రతి పనినీ త్రికరణ శుద్ధితో చేసే ప్రేరణనిచ్చి అన్నింటా విజయాల్ని సాధించే శక్తినిస్తుంది.

4,పంచహారతి

ఇది పంచభూతాలకు ఇచ్చే హారతి. ప్రత్యేకించి పంచభూతాల్లోని జలానికి ఇచ్చే నీరాజనం. ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా సమస్త మానవాళి కాపాడబడాలని ఇచ్చే హారతి.

5,సింహ హారతి

ఇది ప్రతి ఒక్కరూ విజయశిఖరాలకు చేరాలని ఇచ్చే హారతి. ప్రత్యేకించి ప్రభుత్వాలు ప్రారంభించే కొత్త కార్యక్రమాలన్నీ నెరవేరాలని ప్రజలు, ప్రభుత్వం సుభిక్షంగా ఉండడానికి ఇచ్చే హారతి.

6,రుద్ర హారతి

రుద్ర అంటే శివుడు అని కాదు. రుద్ర అంటే ఇక్కడ మంగళం అని అర్థం. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఇచ్చే హారతి ఇది.

7,చక్రహారతి

చక్రం విష్ణుమూర్తి కుడి చేతిలో ఉంటే ఇది గురువు ఎడమ చేతిలో ఉంటుంది. ఈ హారతి వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానం లేకపోతే కైవల్యమే ఉండదు కాబట్టి ఈ హారతిని ఎంతో ఉత్కృష్టమైనదిగా భావిస్తారు.

8,నవగ్రహ హారతి

మన జీవితాల్ని నడిపే నవగ్రహాలే దోషాల పాలైతే జీవితం సాఫీగా సాగదు. అందుకే నవగ్రహాల దోషాలను తొలగించేందుకు ఈ హారతి పడతారు.

9,కుంభహారతి

ప్రతి మంచి పనికీ స్వాగతం పలకడానికి, నరఘోషతో పాటు సమస్త దిష్టి దోషాలు తొలగిపోవడానికి ఈ హారతి పడతారు.

10,నృత్యహారతి

పరమేశ్వర స్వరూపమైన సమస్త కళలూ దేదీప్యంగా వెలుగొందడానికి ఇచ్చేదే ఈ నృత్యహారతి. నృత్యం జీవచైతన్యానికి ప్రతీక కాబట్టి నృత్య హారతి ఇవ్వడం ద్వారా మానవ జీవితాలు సమస్తం నిత్యం చైతన్యంతో వెలుగొందుతాయి.

11,రథహారతి

ద్వైమూర్తులందరికీ రథాలు ఉంటాయి. రథహారతి ఇవ్వడం వల్ల అందరికీ రథాలు అంటే వాహనాలు కలిగేందుకు దోహదం చేసేదే ఈ రథహారతి.

12,వృక్షహారతి

సమస్త వృక్షసంపదంతా అపారంగా పెరిగి స్వచ్ఛమైన ప్రాణవాయువును ఇవ్వడం ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతూ ఇచ్చేదే వృక్షహారతి.

13,నాగహారతి

సంతాన లోపాలు, కాలసర్పదోషాలు తొలగిపోవడానికి ఇచ్చేదే నాగహారతి.

14,ధూపహారతి

భూలోకంలో ఉండే సమస్త కాలుష్యాల్ని తొలగించి సూర్యకిరణాలు సంపూర్ణంగా భూమిమీద పడాలని పర్యావరణం చక్కగా ఉండాలని ఇచ్చేదే ధూపహారతి

15,అఖండ కర్పూర హారతి

సమస్త లోకాలు శాంతిసీమలు కావాలని కర్పూరంతో పట్టేదే అఖండ కర్పూర హారతి

16,నక్షత్ర హారతి

ప్రతి మనిషిలోనూ నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలనే దోషాలు ఆవరిస్తే సమస్యలు మొదలవుతాయి. ఆ దోషాలన్నీ తొలగిపోవాలని ఇచ్చేదే నక్షత్ర హారతి.

🙏🙏🙏🙏

ధర్మాకృతి

 ధర్మాకృతి : పట్టాభిషేకము


శంకర పీఠాధిపతులు సన్యాసులే అయినప్పటికీ బహుకాలంగా అనేకమంది సంస్థానాధీశులకు గురువులుగా, ఆధ్యాత్మిక సార్వభౌములుగా పరిగణింపబడడం వల్ల అనూచానంగా వారికి చక్రవర్తి సహజమయిన మర్యాదలు ఏర్పాటు చేయబడి ఉన్నవి. వెండి అంబారీతో కూడిన భద్రగజం, పెద్ద వెండి సింహాసనం, దంతపు సింహాసనాలు, ఛత్ర చామరాది రాజ చిహ్నములు, స్వామివారి ముందు వెండి దండాలను పట్టుకొని నడిచే బ్రాహ్మణ పరివారం, ఆ ముందు కాగడాలు పట్టుకొని వెళ్ళే పరిచారక వర్గం, దాని ముందు వెండి బాకాల వారు, గౌరీ వాయిద్యం మ్రోగించేవారు ఈ రకంగా ఎన్నో రాజ లాంఛనాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. క్రొత్తస్వామి పట్టణానికి వచ్చినప్పుడు చక్రవర్తులకు జరిగే మాదిరి పట్టాభిషేకం జరుగుతుంది. 67వ పీఠాధిపతులకు ఈ పట్టాభిషేకం జరగనే లేదు.


ఆ ఆచారాన్ననుసరించి మహాస్వామివారు పట్టణానికి వచ్చినప్పుడు కూడా పట్టాభిషేకోత్సవం జరిపించాలని పీఠభక్తులయిన సంస్థానాధీశులు, మిరాసీదారులు, పండితులు ఉత్సాహపడ్డారు. 1907మే 9వ తేదీన స్వామివారిని మహాసింహాసనాధిష్ఠితులను చేసి వేదఘోష నడుమ నదీ జలాలతోనూ, మల్లెపూలతోనూ, అభిషేకం చేశారు. కంచికామకోటి పీఠంతో అత్యంత సన్నిహిత సంబంధమున్న కంచి కామాక్షీ తిరునావైక్కాల్ అఖిలాండేశ్వర దేవాలయముల ప్రధాన అర్చకులు తొలుదొలుత నదీజలాలతో స్వామివారిని అభిషేకించగా తంజావూరు మొదలైన సంస్థానాధీశులు ఒడయార్ పాళెం మొదలైన జమీందారులు స్వామిని మల్లెపూలతో అభిషేకించారు. వివిధ దేవాలయములనుంచి వచ్చిన ప్రసాదాలు, వివిధ సంస్థానాల భక్తుల వద్దనుండి వచ్చిన కానుకలు సమర్పించబడినాయి. సింహాసనాధీశులైన స్వామివారికి పీఠభక్తులందరూ తమ భక్తి ప్రపత్తులను తెలియజేశారు. స్వామి తమ తొలి అనుగ్రహ భాషణము చేశారు. పండితులకు యధోచితమైన సత్కారములు చేయబడినాయి. భూరి అన్నదానం జరిగింది. 


ఆరోజు రాత్రి తంజావూరు సంస్థానాధీశులు పంపిన బంగారు అంబారీ కూర్చిన భద్రగజంపై పట్టణ వీధులలో స్వామివారిని ఊరేగించారు. వీధులన్నీ రంగవల్లులతోనూ, ప్రత్యేక దీపాలతో అలంకరించబడి ఉన్నాయి. దారి పొడుగునా వేలాది భక్తజనులు స్వామివారికి తమ భక్తి ప్రపత్తులు తెలియజేశారు. ఈవిధంగా స్వామివారి 87ఏళ్ల ఆధ్యాత్మిక సార్వభౌమత్వము ఆరంభమయింది. 


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

అక్షరాలు వేరైన

 తే గీ.

అమ్మహృదిలోని మాధుర్యమంత యొదిగి

అత్త్వమై ఆంధ్రభాషాది నమరి మెఱసె

అదియె ఆసుపత్రి ముఖాన నలరుచుండి

తల్లి పిల్లల రక్షణే తమ విథి యని

తెలుప గర్వించె నలుదెసల్ తెలియగాను

తే.గీ.

దేశభాషలేవైన సందేశమొకటె

అక్షరాలు వేరైన నారంభమొకటె

తల్లిబిడ్డల హృదిలోని తనివి యొకటె

అందుకే దైవరూపాలు అక్షరములు

*~శ్రీశర్మద* 

జీవితం నాకు నేర్పింది

 🙏🕉️శ్రీ మాత్రే నమః శుభోదయం 🕉️🙏.                    🌹జీవితం నాకు నేర్పింది దేనికి ఎదురు చూడవద్దు అని...ముందుకు సాగిపోమ్మని..ఎవరి మీద ఆధార పడవద్దు అని..ఆత్మవిశ్వాసమే నీ ఆయుధమని నీకు నువ్వే తోడు అని..ఎదుటి వారికి నీడగా ఉండమని..🌹మనసు చెడుతో నిండిపోయినప్పుడు మాంచి చెప్పేవారు శత్రువు గాను చెడు చెప్పే వారు శ్రేయోభిలాషులు గాను కనబడతారు🌹అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు...మనది కాని రోజున మౌనంగా ఉండాలి.. మనదైన రోజున అన్నింటికీ సమాధానం దొరుకుతుంది🌹కొందరి కోసం మనం బరించలేని బాధని కూడా భరిస్తాం ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి కానీ వారికి వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు..!🌹 కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది.. మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది.. మనం నిజాయితీగా ఉన్నంతవరకు ఒకరు ముందు నటించాల్సిన అవసరం లేదు🌹🌹🌹మీ అల్లంరాజు భాస్కర రావు

శ్రీ విజయ ఆయుర్వేదిడ్

గోకవరం బస్ స్టాండ్

Rajhamundry

9440893593

9182075510

944🙏🙏🙏🙏🙏

గుండె ఆరోగ్యానికి

 కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ కార్డియాలాజీ    డాక్టర్  శాంత గారు

 ఇచ్చిన సలహాలు:(ప్రశ్నలు -జవాబులు)


 *ప్రశ్న 1* : గుండె ఆరోగ్యానికి చెయ్యవలసిన పనులు ఏమిటి ? 

 *జవాబు* : 1)తక్కువ కార్బోహైడ్రేట్లు , ఎక్కువ ప్రోటీన్స్ , తక్కువ నూనె.

2)వారానికి కనీసం 5 రోజులు రోజుకు ఒక అరగంట చొప్పున నడక , లిఫ్ట్ ఎక్కడం మానడం , ఎక్కువ సేపు కూర్చోకుండా ఉండడం

3)ధూమ పానం మానడం.

4)బరువు కంట్రోల్ లో ఉంచుకోవడం.

5)బి పి. షుగరు కంట్రోల్ లో ఉంచుకోవడం.


 *ప్రశ్న 2.* కొవ్వును కండగా మార్చుకొగలమా ?


 *జవాబు* : ఇది ఒక ప్రమాదకరమైన అపోహ ! కొవ్వు - కండ ఈ రెండూ వేరు వేరు కణజాలాలు.

కొవ్వు అసహ్యకరం ప్రమాదకరం.

కొవ్వు కండగా మారదు.


 *ప్రశ్న 3 :* ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి కూడా ఒక్కోసారి హార్ట్ ఎటాక్ కి గురి అవుతున్నాడు . ఇది ఆశ్చర్యం కదా ! దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? 


 *జవాబు* : దీనినే సైలెంట్ ఎటాక్ అంటారు. అందుకే 30 సంవత్సరాలు దాటినా ప్రతీ వ్యక్తీ హెల్త్ చెకప్ చేయించుకోవాలి.


 *ప్రశ్న 4 :* గుండె పోటు వంశ పారం పర్యమా?

 *జవాబు* : అవును 

.

 *ప్రశ్న 5 :* గుండె పై ఒత్తిడి ఎలా వస్తుంది?

ఒత్తిడి తగ్గించుకోవడం ఎలా ? ( స్ట్రెస్ )


 *జవాబు :* జీవితం పట్ల మీ వైఖరి మారాలి.

ఏదీ పూర్తి పర్ఫెక్ట్ గా ఉండక పోవచ్చు అనేది గుర్తుంచుకోవాలి.


 *ప్రశ్న6* : ఆరోగ్యవంతమైన గుండె కోసం జాగింగ్,నడక రెండింటిలో ఏది ఉత్తమం?


 *జవాబు* : నడక మంచిది.

జాగింగ్ లో జాయింట్స్ మీద ఒత్తిడి పెరిగి ప్రమాదం జరగవచ్చు.


 *ప్రశ్న 7:* మీరు పేదలకు , అవుసరమైన వారికీ సేవ చేస్తున్నారు. మీకు స్ఫూర్తి ఎవరు?


 *జవాబు* : మదర్ తెరెసా !


 *ప్రశ్న 8:* లో (low) బ్లడ్ ప్రెషర్ వారికి గుండె పోటు వచ్చే అవకాశం ఉందా ?

 *జవాబు* : చాలా తక్కువ

.


 *ప్రశ్న 9 :* కొలెస్టరాల్ బాల్యం నుండే పోగుపడుతూ వస్తుందా ? 

(నా వయసు 22).

30 సంవత్సరాల తర్వాత మాత్రమె దాని గురించి వర్రీ అవ్వాలా?


 *జవాబు* : చిన్నతనం నుండే పేరుకుంటూ వస్తుంది.


 *ప్రశ్న 10* : అకాల భోజనాలు గుండె మీద ప్రభావం చూపిస్తాయా?


 *జవాబు* : మీరు అకాల భోజనాలు చెయ్యడం వలన జంక్ ఫుడ్ తింటారు.

ఆ ఆహారం జీర్ణం కావడానికి ఊరవలసిన ఎంజైములు కన్ఫ్యూజ్ అవుతాయి.


 *ప్రశ్న 11:* మందులు వాడకుండా కొలెస్టరాల్ కంట్రోల్ చెయ్యడం ఎలా ?

 *జవాబు* : ఆహార నియంత్రణ , నడక , వాల్ నట్స్ తినడం ద్వారా.


 *ప్రశ్న 12:* గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం ఏది?

చెడ్డ ఆహారం ఏది?


 *జవాబు :* పళ్ళు , కాయగూరలూ మంచివి.

నూనెలు చెడ్డవి.


 *ప్రశ్న 13:* ఏ నూనె మంచిది ?

సన్ ఫ్లవర్,

వేరుశనగ నూనె,

ఆలివ్ ఆయిల్ ?


 *జవాబు* : అన్ని నూనెలూ చెడ్డవే.


 *ప్రశ్న 14:* ఏమేమి టెస్టులు చేయించుకోవాలి 

ఏదైనా ప్రత్యెక టెస్ట్ ఉందా?


 *జవాబు* :

రొటీన్ షుగర్,

బి.పి,కొలెస్టరాల్ చాలు .

ఎకో టెస్ట్ చేయించుకుని ట్రెడ్ మిల్ చేయించుకోండి.


 *ప్రశ్న 15* : గుండె పోటు వచ్చిన వారికి చెయ్యవలసిన తక్షణ సహాయం ఏమిటి?


 *జవాబు* : గుండె పోటు వచ్చిన వ్యక్తిని పడుకోబెట్టండి.

ఒక *ఆస్ప్రిన్* మాత్ర నాలుక కింద పెట్టండి .

 *సోర్బిట్రేట్* మాత్ర అందుబాటులో ఉంటె అది కూడా పెట్టండి .

వీలయినంత త్వరగా గుండె వ్యాధి నిపుణుడి దగ్గరకి తీసుకు వెళ్ళండి.

మొదటి గంట లోపులోనే మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ . 


 *ప్రశ్న : 16 :* గ్యాస్ట్రిక్ నొప్పికీ - గుండె నొప్పికీ తేడా తెలుసుకోవడం ఎలా ? 


 *జవాబు* : ఈ.సి.జీ చూస్తే గానీ చెప్పలేము.


 *ప్రశ్న 17:* యువకులలో వ్యాధులూ , హార్ట్ ఎటాక్ లో పెరిగి పోవడానికి కారణం ఏమిటి ?

( 30 - 40 మధ్య యువతలో హార్ట్ ఎటాక్ లు , గుండె వ్యాధులూ ఈ మధ్య ఎక్కువ అయ్యాయి )


 *జవాబు* : యువతలో అవేర్నెస్ పెరిగింది.

అందు వలన కేసులు కనిపిస్తున్నాయి.

జీవన విధానం ( బద్ధకం ),

జంక్ ఫుడ్,

వ్యాయామం లేక పోవడం, 

పొగ తాగడం.

మన దేశం లో జెనెటికల్ గా అమెరికా యూరోప్ దేశాలతో పోలిస్తే గుండెపోటు అవకాశాలు 3 రెట్లు ఎక్కువ.


 *ప్రశ్న 18 :* బి. పి 120 /80 కంటే ఎక్కువ గా ఉండి పూర్తి ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు ఉంటారా? 


 *జవాబు* : ఉంటారు.


 *ప్రశ్న 19 :* దగ్గర సంబంధాలు చేసుకోవడం వలన పిల్లలకు గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటారు.

వాస్తవమా?


 *జవాబు* : వాస్తవమే!

దగ్గర సంబంధాల వలన కంజెనిటల్ ఎబ్నార్మాలిటీ ఉన్న పిల్లలు పుట్టవచ్చు. 


 *ప్రశ్న 20* : మాలో చాలా మందిమి ఒక క్రమ బద్ధమైన రొటీన్ గడపము నైట్ ఎక్కువ సేపు ఆఫీసు లో ఉంటాం. 

ఇది మా గుండె మీద ప్రభావం చూపుతుందా ?


 *జవాబు* : మీరు యువకులుగా ఉన్నంత సేపూ మీ శరీర ప్రకృతి మిమ్మలి కాపాడుతుంది

ఇటువంటి అసంబద్ధ జీవిత విధానాల నుండి.

కానీ పెద్దవారు మీ బైయోలాజికల్ క్లాక్ ని అనుసరించండి.


 *ప్రశ్న 21:* ఆంటి హైపర్టేన్సివ్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ? 

( దీర్ఘ కాలం లో కానీ / స్వల్పకాలం లో కానీ )


 *జవాబు* : చాలా మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

ఇప్పుడు వస్తున్న కొన్ని మందులు చాలా వరకూ సేఫ్.


 *ప్రశ్న 22* : కాఫీ/టీ ఎక్కువ తాగడం వలన గుండెకు ఏమైనా ప్రమాదం ఉందా ? 


 *జవాబు* : లేదు.


 *ప్రశ్న 23* : ఆస్థమా వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా ?


 *జవాబు* : లేదు 


 *ప్రశ్న 24 :* మీ దృష్టిలో జంక్ ఫుడ్ అంటే ఏమిటి?


 *జవాబు :* వేపుళ్ళు -- ఉదాహరణ కెంటకీ , మెక్ డొనాల్డ్స్ , సమోసాలు , మసాలా దోశలు కూడా.


 *ప్రశ్న 25 :* భారతీయులు గుండె జబ్బులకు గురి అయ్యే అవకాశం 3 రెట్లు ఎక్కువ అమెరికా , యూరోపు వారితో పోల్చితే అన్నారు . వాళ్ళు కూడా జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు కదా!


 *జవాబు* : ప్రతీ జాతీ కొన్ని జబ్బులకు గురిఅవుతూ ఉంటుంది (అనుకూలత ఉంటుంది) దురదృష్టవశాత్తూ భారతీయులు ఖరీదైన గుండె జబ్బులకు గురి కావడం జరుగుతున్నది.


 *ప్రశ్న 26 :* అరటి పళ్ళు తింటే గుండె జబ్బు తగ్గుతుందా ?


 *జవాబు* : నో.


 *ప్రశ్న 27 :*  గుండె జబ్బు వచ్చిన వ్యక్తి తనకు తనే ఏదైనా చేసుకోవచ్చా?


 *జవాబు* : వెల్లకిలా పడుకోవాలి .

నాలుక కింద ఏదైనా బ్రాండ్ ఒక ఆస్ప్రిన్ మాత్ర పెట్టుకుని , అంబులెన్స్ వచ్చే వరకూ వేచి చూడకుండా దగ్గరలోని డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి.

అంబులెన్స్ రావడం త్వరగా జరగదు.


 *ప్రశ్న 28 :* లో వైట్ బ్లడ్ సెల్స్ (తక్కువ తెల్ల రక్త కణాలు), హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం గుండె జబ్బులకు కారణాలు అవుతాయా?


 *జవాబు :* కావు.

కానీ నార్మల్ హిమోగ్లోబిన్ వలన మీరు ఎక్సేర్సైజ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది.


 *ప్రశ్న 29 :* మా బిజీ షెడ్యుల్ వలన మేము ఎక్సర్‌సైజ్ చెయ్యడానికి టైం ఉండదు.

ఇంట్లో నడవడం,

మేడ మెట్లు ఎక్కడం వంటివి కూడా ఎక్సర్సైజ్ గా అనుకోవచ్చా?


 *జవాబు* : తప్పకుండా ! ఒకే కుర్చీలో అరగంట కంటే ఎక్కువ కూర్చోకుండా ఈ కుర్చీ లో నుండి ఇంకో కుర్చీ లోకి మారి కూర్చోవడం కూడా చెయ్యవచ్చు.


 *ప్రశ్న 30 :* షుగరుకూ, గుండె జబ్బులకూ సంబధం ఉందా?


 *జవాబు* : ఉంది.

షుగర్ పేషెంట్ కి గుండె జబ్బులు వచ్చే అవకాశం మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ.


 *ప్రశ్న 31* : గుండె ఆపరేషన్ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?


 *జవాబు* : 

ఆహారం, ఎక్సేర్సైజ్ , మందులు సకాలం లో వేసుకోవడం , కొలెస్టరాల్ , బరువు , బిపీ లను కంట్రోల్ లో ఉంచుకోవడం.


 *ప్రశ్న 32 :* రాత్రి షిఫ్ట్ లో పని చేసే వారికి, డే షిఫ్ట్ వారికంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా?


 *జవాబు* : నో .


 *ప్రశ్న 33 :* Anti-hypertensive డ్రగ్స్ ఏమిటి?


 *జవాబు* :

కొన్ని వందలు ఉన్నాయి .

మీకు అనుకూలమైనది మీ డాక్టర్ ఎంపిక చేసి చెబుతారు.

కానీ నా సలహా మందుల కన్నా ప్రాకృతిక విధానం లో బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంచుకోవడం (నడక).

ఆహారం విషయం లో జీవిత వైఖరులలో మార్పు తెచ్చుకోవడం.


 *ప్రశ్న 34 :* డిస్పిరిన్ లేదా ఏదైనా తలనొప్పి మాత్రలు గుండె జబ్బులకు దోహదం చేస్తాయా ?


 *జవాబు* : నో 

.


 *ప్రశ్న 35 :* ఆడవాళ్ళల్లో కంటే మగవాళ్ళల్లో గుండె జబ్బుల రేటు ఎక్కువ ఎందువలనా ?


 *జవాబు* : ప్రకృతి ఆడ వాళ్ళను 45 సంవత్సరాల వరకూ రక్షిస్తూ ఉంటుంది ( ఇప్పడు వెలువడిన గణాంకాల ప్రకారం ఆడవాళ్ళల్లో ప్రస్తుతం ఈ రేటు మగవాళ్ళల్లో కన్నా ఎక్కువగా ఉంది)


 *ఆఖరు ప్రశ్న :* గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా ? 


 *జవాబు* :

ఆరోగ్య వంత మైన ఆహారం తినండి.

ప్రతి రోజూ ఎక్సేర్సైజ్ చెయ్యండి.

జంక్ ఫుడ్ తినకండి.

స్మోకింగ్ మానండి.

30 సంవత్సరాల తర్వాత ప్రతీ ఆరు నెలలకూ హెల్త్ చెక్ అప్ చేయించుకోండి ( రికమెండేడ్ ).


మీకు ఇతరులకు మేలు చెయ్యాలి అనే హృదయం ఉంటే మీరు చదువుతున్న ఈ మెసేజ్ మీ మిత్రులకు, బందువులకు షేర్ చేయండి.🙏🌹


సేకరణ: కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.

మన మహర్షుల చరిత్ర.

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

       *మన మహర్షుల చరిత్ర..*              


*🌹ఈ రోజు 34,వ తండి మహర్షి గురించి తెలుసుకుందాము..🌹*


🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂


🌸 పూర్వం తండి అనే పేరుగల బ్రాహ్మణుడుండేవాడు.  అతడు బ్రహ్మచర్యం తీసుకుని అన్ని వేదాలు శాస్త్రాలు చదివి యోగి,  జ్ఞాని, మహర్షి అయ్యాడు. 


🌸 సమాధిలో ఉండి పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు . పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు . తండి పరమేశ్వరుడ్ని చూసి ఆనందంతో,


🌸 "ఓ పరమేశ్వరా! యోగీశ్వరులు ఎప్పుడూ ఎవరినైతే గొప్పవాడని స్తోత్రం చేసి, ప్రధానమైనవాడని భావించి, పురుషుడని పూజచేసి, అధిష్టాన దేవతని అర్చన చేసి, ఈశ్వరుడని ఎంచి ఊహిస్తారో అతడే నువ్వు."


🌸 నువ్వు అజుడివి, అనాదినిధనుడివి, విభుడివి , ఈశానుడివి, అత్యంతసుఖివి , అనఘుడివి.  నిన్ను నేను భక్తితో శరణు కోరుతున్నాను అన్నాడు.


🌸 పరమేశ్వరుణ్ణి చూసిన తండికి ఇంకా ఆనందం తగ్గక పరమేశ్వరా! కామ క్రోధాలు నువ్వే, ఊర్థ్వ అధోభాగాలు నువ్వే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నువ్వే, నిత్యానందుడవు.


🌸 పరమపదమవు, దేహకర్తవు, దేహభర్తవు, దేహివి, ప్రాణగతివి అన్నీ నువ్వే.  జనన మరణాలు కలిగించేది నువ్వే.


🌸 దిక్కులు, యుగాలు, అయనాలు నువ్వే . రాత్రి పగలు చెవులు, కళ్ళుగా, పక్షాలు శిరస్సుగా మాసాలు భుజాలుగా, ఋతువులే వీర్యముగా, మాఘమాసం ధైర్యంగా, సంవత్సరాలు పాదాలుగా అంతట నువ్వే నిండి వున్నావు.


 🌸 ఈ విధంగా స్తోత్రం చేసిన తండి మహర్షి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు వత్సా!  నువ్వు తేజశ్శాలివి, కీర్తిమంతుడివి, జ్ఞానివి, ఋషుల్లో గొప్పవాడివి అవుతావు. 


🌸 నీకేం కావాలో అడగమన్నాడు.   ఈశ్వరా!  నీ దయకంటే నాకు కావలసింది ఏమీ లేదు.  ఎప్పుడూ నాకు నీ పాదాల దగ్గరే భక్తితో ఉండేటట్లు అనుగ్రహించమన్నాడు తండి మహర్షి. 


🌸తర్వాత తండి ఒక ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు.  ఉపమన్యు మహర్షి తండి దగ్గరకు వచ్చి పరమేశ్వరుడి సహస్ర నామాలు చెప్పమని అడిగాడు.


🌸 ఇంతకు ముందు దేవతలకి పదివేల నామాలు బ్రహ్మ చెప్పాడు.    వాటి నుండి వెయ్యి నామాలు స్వర్గలోకంలో వున్న వాళ్ళకోసం బ్రహ్మ ఇచ్చాడు.


🌸 భూలోక వాసుల కోసం తండి వెయ్యి నామాలు భూలోకంలోకి తెచ్చాడు.  దీన్నే *'తండికృత శివసహస్రనామస్తోత్రం'* అన్నారు . 


🌸 ఆ వెయ్యి నామాల గురించి తండి మహర్షి ఉపమన్యుకి చెప్పాడు.

అందులో నామాలు మనం కూడా పలుకుదాం.  అన్నీ ఎలాగూ చెప్పుకోలేం కదా ... 


🌸 స్థిరుడు, స్థాణువు, ప్రభువు, భీముడు, ప్రవరుడు, వరదుడు , వరుడు, సర్వాత్మ, జటి చర్మా శిఖండి, ఖచరుడు, గోచరుడు మొదలైనవి.  ఇలా వెయ్యి నామాలు జపిస్తే అనుకున్న పనులు జరిగి ముక్తి పొందుతారు. 


🌸 చూశారా!  మనకి కష్టం లేకుండా, ముక్తి వచ్చే ఉపాయం తండి మనకి చెప్పాడు. వాళ్ళందరు అంతంత తపస్సులు చేసి మన కోసం శివసహస్రనామస్తోత్రం ఇచ్చి మనం సులభంగా ముక్తి పొందేలా చేశాడు, తండి మహర్షి!


🌸 ఇదండీ తండి మహర్షి గురించి మనకు అందిన సమాచారం రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి...


సేకరణ: కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 


🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃