28, సెప్టెంబర్ 2022, బుధవారం

విద్యయొక్క పరమార్థాన్ని

 శ్లోకం:☝️

*జ్ఞానవిద్యా విహీనస్య*

   *విద్యాజాల నిరర్థకం |*

*కణ్ఠసూత్రం వినా నారీ*

   *అనేకాభరణైర్యుతా ||*


భావం: విద్య నేర్వగానే సరికాదు. ఆ విద్యయొక్క పరమార్థాన్ని గ్రహించడమే కాక అందలి జ్ఞానాన్ని తెలుసుకోవలెయును. జ్ఞానం పొందకుండా విద్యలెన్ని నేర్చినను ప్రయోజనంలేదు. స్త్రీకి మంగళసూత్రమే సతీత్వము నిచ్చును గానీ మిగిలిన ఆభరణములేవీ ఇవ్వవు కదా?

అందుకే మాయాబజార్ లో ఘటోత్కచుడంటాడు " _చిన్నమయ! పాండిత్యం కంటే జ్ఞానమే ముఖ్యం. వెయ్యండి వీడికి వీరతాడు._ "


విద్య లెన్ని నేర్చి విద్వాంసు డైనను

వృథగ నుండు 'జ్ఞానవిద్య' లేక 

కంఠసూత్ర మొకటి కలికికి లేకుండి

భూష లెన్ని యున్న భూతి లేదు


గోపాలుని మధుసూదనరావు

          భాగ్యనగరము

        9959536545


చదువది యంత నేర్చినను సారపుజ్ఞానము లేకయున్న యా

చదువు నిరర్థకంబగును,సాధ్వికి నెన్నియు భూషలుండినన్

పదిలముగూర్చునిండయిన బంగరుమంగళ సూత్రముండినన్

సదమలశోభ చేర్చునది, సాటికిరావు మరెన్ని భూషలున్

కామెంట్‌లు లేవు: