18, జూన్ 2023, ఆదివారం

పితృ దేవో భవ* .🌸

 ✨💧🐋🐢🐗🔥✨


*_నాన్నే నారాయణుడు...!!!_* 


*సమయాన్ని సందర్భాన్ని బట్టి తానే దశావతారుడు అవుతాడు...!*


_*పాకడానికి మనం ప్రయత్నించేటప్పుడు "మత్స్యం"🐋 అవుతాడు..*_

_*ఆటలాడే సమయానికి "కూర్మం"🐢 అవుతాడు..*_

_*కాస్త పెరగగానే తల మీద ఎత్తుకొని వేసే చిందుల్లో "వారాహుడు "🐗 అవుతాడు.*_

_*అల్లరి ఎంత చేసిన పైకి మాత్రమే కోపం నటించే "నారసింహుడు "🦁 అవుతాడు.*_

_*తాహతు తేలీక అడిగే కోర్కెల కోసం తాను తగ్గి వేరే వాళ్ల ముందు చేయ్యి చాచే వెర్రి "వామనుడు "☂️ అవుతాడు.*_

_*వెయ్యి కష్టాలు వచ్చిన అలవోకగా నరుక్కొంటూ వెళ్ళే"భార్గవుడు "🪓 అవుతాడు.*_

*_జీవిత విలువల నడక నేర్పే "రాముడు "🏹 అవుతాడు._*

*_జీవన యుద్దపు నడత నేర్పే "కృష్ణుడు "*అవుతాడు_*

_*చివరికి ఏదేమైనా.. మన నాన్నే మనకు ఆ నారాయణుడు అవుతాడు!!*_


🌸 *పితృ దేవో భవ* .🌸 


*_పితృ దినోత్సవ శుభాకాంక్షలు...!!!_*💐


 🧜‍♀️⛄🎈🌻🎈☃️🧜‍♂️

పురుషుడు ఎలా ఉండాలి ???

 పురుషుడు ఎలా ఉండాలి ???


స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...

పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది


కానీ ఎందుచేతో ఈ పద్యం జన

బాహుళ్యం లో లేదు


కార్యేషు యోగీ, కరణేషు దక్షః

రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః,

సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు

ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)


1. *కార్యేషు యోగీ* 

పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి


2. *కరణేషు దక్షః* 

కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.


3. *రూపేచ కృష్ణః* 

రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా,

సంతోషంగా ఉండాలి.


4. *క్షమయా తు రామః* 

ఓర్పులో రామునిలాగా ఉండాలి.పితృవాక్య పరి

పాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి


5. *భోజ్యేషు తృప్తః* 

భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.


6. *సుఖ దుఃఖ మిత్రం* 

సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.


ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు....

భార్యా భర్తల లక్షణాలు

 మన పూర్వికులు చెప్పిన నీతి శాస్త్రాను సారం ఉత్తములైన భార్యా భర్తల  లక్షణాలు  క్రింది విదంగా ఉంటాయి .!! 


(1) శ్లో॥    కార్యేషు యోగీ, కరణేషు దక్షః

         రూపేచ కృష్ణః క్షమయా తు రామః

         భోజ్యేషు తృప్తః  సుఖదుఃఖ మిత్రం

         షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (ఉత్తమ భర్త  లక్షణాలు )


కార్యేషు యోగీ :

పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.

 కరణేషు దక్షః 

కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో  నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.

 రూపేచ కృష్ణః

రూపంలో కృష్ణుని వలె ఉండాలి.

 క్షమయా తు రామః

ఓర్పులో రామునిలాగా ఉండాలి.

 భోజ్యేషు తృప్తః

భార్య వండినదాన్ని సంతృప్తిగా  భుజించాలి.

 సుఖదుఃఖ మిత్రం

 సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.


ఈ  ఈ ఆరు పనులు సక్రమంగా చేసే  పురుషుడు ఉత్తమ భర్త  కొనియాడబడతాడు.


(2). శ్లో॥కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,

         రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,

         భోజ్యేషు మాతా, శయనేషు రంభా

         షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ. (ఉత్తమ భార్య లక్షణాలు)


 కార్యేషు దాసీ

పనులు చెయ్యడంలో దాసి లాగా బద్ధకించకుండా పొందికగా, ఒద్దికగా, నిదానంగా పనులు చెయ్యాలి.

కరణేషు మంత్రీ

మంచి సలహాలు, సూచనలు అందించడంలో మంత్రిలాగా ఉండాలి.

    రూపేచ లక్ష్మీ

 రూపంలో లక్ష్మీ దేవి లాగా ఎల్లప్పుడూ కళకళలాడుతూ, చిరునవ్వు చిందిస్తూ సంతోషంగా ఉండాలి.

క్షమయా ధరిత్రీ

కష్ట సమయాలలో, కుటుంబ నిర్వహణలో భూదేవి అంత ఓర్పును కలిగి ఉండాలి. తొందరపడి ఏ పని చేయకూడదు.

భోజ్యేషు మాతా

  భోజనం పెట్టేటప్పుడు తల్లి వలె ప్రేమగా పెట్టాలి.

శయనేషు రంభా

పడకటింటి లో రంభ లాగా ఉండాలి.

 ఈ 6 పనులు సక్రమంగా చేసే స్త్రీ ఉత్తమ స్త్రీగా, ధర్మపత్నిగా కొనియాడబడుతుంది.

భస్మధారణ వర్ణనము

 *భస్మధారణ వర్ణనము*

🙏🔥🚩🇮🇳✍️👉

సూత ఉవాచ |


ద్వివిధం భస్మ సంప్రోక్తం సర్వ మంగలదం పరమ్‌ | తత్ర్ప కారమహం వక్ష్యే సావధానతయా శృణు || 1


ఏకం జ్ఞేయం మహాభస్మ ద్వితీయం స్వల్పసంజ్ఞకమ్‌ | మహాభస్మ ఇతి ప్రోక్తం భస్మ నానా విధం పరమ్‌ || 2


తద్భస్మ త్రివిధం ప్రోక్తం శ్రౌతం స్మార్తం చ లౌకికమ్‌ | భస్మైవ స్వల్ప సంజ్ఞో వై బహుధా పరికీర్తితమ్‌ || 3


శ్రౌతం భస్మ తథా స్మార్తం ద్విజానామేవ కీర్తితమ్‌ | అన్వేషా మపి సర్వేషా మపరం భస్మ లౌకికమ్‌ || 4


సూతుడిట్లు పలికెను -


భస్మ మంగళములనన్నిటినీ కలిగించును, ఉత్తమమైనది . అను రెండు విధములుగానున్నది. ఆ వివరములను చెప్పెదను శ్రద్ధగా వినుము (1). భస్మ మహాభస్మ, స్వల్ప భస్మ అని రెండు రకములుగా నున్నది. మహాభస్మ యందు మరల భేదములు గలవు (2). మహాభస్మ శ్రౌతము, స్మార్తము, లౌకికము అని మూడు విధములుగా నున్నది. స్వల్ప భస్మయందు కూడ అనేక భేదములు గలవు (3). శ్రౌత, స్మార్త, భస్మలను ద్విజులు మాత్రమే ధరించవలెననియు, ఇతరులందరు లౌకిక భస్మను ధరించవలెననియు చెప్పబడినది (4).


ధారణం మంత్రతః ప్రోక్తం ద్విజానాం మునిపుంగవైః కేవలం ధారణం జ్ఞేయమన్యేషాం మంత్రవర్జితమ్‌ || 5


ఆగ్నేయ ముచ్యతే భస్మ దగ్ధ గోమయ సంభవమ్‌ | తదపి ద్రవ్యమిత్యుక్తం త్రిపుండ్రస్య మహామునే || 6


అగ్ని హోత్రోత్థితం భస్మ సంగ్రాహ్యం వా మనీషిభిః | అన్య యజ్ఞోత్థితం వాపి త్రింపుండ్రస్య చ ధారణ || 7


అగ్నిరిత్యాదిభిర్మంత్రై ర్జాబాలో పనిషద్గతైః | సప్త భిర్దూలనం కార్యం భస్మనా సజలేన చ || 8


వర్ణానామాశ్రమాణాం చ మంత్రతోs మంత్రతోsపి చ | త్రిపుండ్రోద్దూలనం ప్రోక్తం జాబాలై రాదరేణ చ || 9


భస్మనోద్ధూలనం చైవ యథా తిర్యక్‌ త్రిపుండ్రకమ్‌ | ప్రమాదాదపి మోక్షార్ధీ న త్యజేదితి విశ్రుతిః || 10


ద్విజులు మంత్ర పూర్వకముగను, ఇతరులు మంత్రము లేకుండా భస్మను ధరించవలెనని మహర్షులు చెప్పిరి (5).ఓమహర్షీ! గోమయమును కాల్చగా లభించిన భస్మకు ఆగ్నేయ భస్మయని పేరు. అది త్రిపుండ్రమునకు యోగ్యమగు భస్మయని చెప్పబడినది (6). విద్వాంసులు అగ్ని హోత్రములోని భస్మను గాని, ఇతర యజ్ఞములలో లభించు భస్మను గాని భద్రము చేసుకొని, దానిని త్రిపుండ్ర ధారణమునకు వినియోగించవలెను (7). జాబాలో పనిషత్తు నందలి 'అగ్నిః' ఇత్యాది ఏడు మంత్రములను ఉచ్చరిస్తూ, భస్మను నీటితో కలిపి, శరీరావయవములయందు ధరించవలెను (8). అన్ని వర్ణముల వారు, ఆశ్రమముల వారు మంత్రముతో గాని, మంత్రము లేకుండా గాని, భస్మను శరీరావయవముల యందు, త్రిపుండ్రముగా లలాటమునందు శ్రద్ధతో ధరించవలెనని జాబాల ఋషి యొక్క అనుయాయులు చెప్పిరి (9). మోక్షమును కోరువాడు శరీరావయములయందు భస్మధారణమును, లలాటము నందు అడ్డముగా భస్మతో త్రిపుండ ధారణమును పొరపాటునైననూ విడువరాదని వేదములు చెప్పుచున్నవి (10).


శివేన విష్ణునా చైవ తథా తిర్యక్‌ త్రిపుండ్రకమ్‌ | ఉమా దేవీ చ లక్ష్మీశ్చ వాచాన్యాభిశ్చ నిత్యశః || 11


బ్రాహ్మణౖః క్షత్రియైర్వైశ్యై శ్శూద్రైరపి చ సంకరైః | అపభ్రంశైర్ధృతం భస్మ త్రిపుండ్రో ద్దూలనాత్మనా || 12


ఉద్దూలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరన్తి యే | తేషాం నాస్తి సమాచారో వర్ణాశ్రమ సమన్వితః || 13


ఉద్దూలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరంతి యే | తేషాం నాస్తి వినిర్ముక్తి సస్సంసారాజ్ఞన్మ కోటి భిః || 14


ఉద్ధూలనం త్రింపుండ్ర చ శ్రద్ధయా నాచరంతి యే | తేషాం నాస్తి శివజ్ఞానం కల్పకోటి శతైరపి || 15


శివుడు, విష్ణువు, ఉమాదేవి, లక్ష్మీ, సరస్వతి మరియు ఇతర దేవతలు నిత్యము లలాటమునందు అడ్డముగా త్రిపుండ్రమును ధరింతురు (11). బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులే గాక, సర్వ మానవులు భస్మను శరీరావయవముల యందు, లలాటమునందు త్రిపుండ్రముగను ధరించవలెను (12). ఉద్ధూలన (శరీరావయవముల యందు భస్మను ధరించుట), త్రిపుండ్రములను శ్రద్ధగా ధరించని వారికి వర్ణాశ్రమధర్మములు సిద్ధించవు (13). అట్టి వారికి కోటి జన్మలెత్తిననూ సంసారమునుండి విముక్తి కలగదు (14). వందల కోట్ల కల్పముల తరువాత కూడ వారికి శివజ్ఞానము కలుగదు (15).


ఉద్ధూలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నా చరంతి యే | తే మహాపాతకైర్యుక్తా ఇతి శాస్త్రీ య నిర్ణయః || 16


ఉద్ధూలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరంతి యో | తేషామా చరితం సర్వం విపరీత ఫలాయ హే || 17


మహా పాతక యుక్తానాం జంతూనాం శర్వ విద్విషామ్‌ | త్రిపుండ్రోద్ధూలన ద్వేషో జాయతే సుదృఢం మునే || 18


శివాగ్ని కార్యం యః కృత్వా కుర్యాత్త్రియాయుషాత్మ విత్‌ | ముచ్యతే సర్వపాపైస్తు స్పృష్టేన భస్మనా నరః || 19


ఉద్దూలన త్రిపుండ్రములను ఎవరైతే శ్రద్ధతో ఆచరించరో, వారు మహా పాపులని శాస్త్రముల నిర్ణయము (16). వారు చేయు కర్మలన్నియు విపరీత ఫలముల నిచ్చును (17). ఓ మహర్షీ! శివుని ద్వేషించే మహా పాపులకు భస్మతో ఉద్ధూలన, త్రిపుండ్రముల ననుష్ఠించుటయందు ధృఢమగు ద్వేషము కలుగును (18). ఆత్మవేత్తయగు భక్తుడు త్రియాయుషాది మంత్రములతో శివాగ్ని కార్యమును చేసి సర్వపాపముల నుండి విముక్తుడగుటయేగాక, ఆ అగ్ని యొక్క భస్మను స్పృశించిన మానవుడు పాపవిముక్తుడగును (19).


సితేన భస్మనా కుర్యాత్‌ త్రిసంధ్యం యస్త్రిపుండ్రకమ్‌ | సర్వపాప వినిర్ముక్తః శివేన సహ మోదతే || 20


సితేన భస్మనా కుర్యాల్లలాటే తు త్రిపుండ్రకమ్‌ | యోసావనాది భూతాన్‌ హి లోకానాప్తో మృతో భవేత్‌ || 21


ఆకృత్వా భస్మనా స్నానం జపేద్వై షడక్షరమ్‌ | త్రిపుండ్రం చ రచిత్వా తు విధినా భస్మనా జపేత్‌ || 22


ఆదయో వాధమో వాపి సర్వపాపాన్వితోsపివా | ఉషః పాపాన్వితో వాపి మూర్ఖో వా పతితోsపివా || 23


యస్మిన్‌ దేశే వసేన్నిత్యం భూతి శాసన సంయుతః | సర్వతీర్థైశ్చ క్రతుభిః సాన్నిధ్యం క్రియతే సదా || 24


త్రిసంధ్యల యందు తెల్లని భస్మతో త్రిపుండ్రమును ధరించు భక్తుడు పాపములన్నింటి నుండి విముక్తుడై, శివునితో కూడి యానందించు (20). తెల్లని భస్మతో లలాటమునందు త్రిపుండ్రమును ధరించు భక్తుడు మరణించినతరువాత శాశ్వత లోకములను పొందును (21). భస్మ స్నానము (భస్మను దరించుట ) చేయకుండగా 'ఓం నమశ్శివాయ' అను మంత్రమును జపించరాదు. భస్మతో త్రిపుండ్రమును యథావిధిగా ధరించి, మంత్రమును జపించవలెను(22).దయలేని వాడు, అధముడు, పాపుములనన్నిటినీ చేసిన వాడు, సూర్యోదయ కాలమునందు నిద్రించువాడు, మూర్ఖుడు, పతితుడు అయిననూ (23), విభూతిని ధరించి ఏ స్థానములో నివసించునో, అచట అన్ని తీర్థములు, క్రతువులు అతని సన్నిధిలో నుండును (24).


త్రిపుండ్ర సహితో జీవః పూజ్యస్సర్వై స్సురాసురైః పాపాన్వితోsపి శుద్ధాత్మా కిం పునః శ్రధ్ధయా యుతః || 25


యస్మిన్‌ దేశే శివజ్ఞానీ భూతిశాసన సంయుతః | గతో యదృచ్ఛయాద్యాపి తస్మింస్తీర్థాస్సమాగతాః || 26


బహునాత్ర కిముక్తేన ధార్యం భస్మ సదా బుధైః | లింగార్చనం సదా కార్యం జప్యో మంత్రః షడక్షరః || 27


బ్రహ్మణా విష్ణునా వాపి రుద్రేణ మునిభిస్సురైః | భస్మధారణ మహాత్మ్యం న శక్యం పరిభాషితుమ్‌ || 28


త్రిపుండ్రమును ధరించు జీవుడు పాపాత్ముడైననూ, దేవతలచే, రాక్షసులచే, సర్వులచే పూజనీయుడు. శ్రద్ధతో గూడిన ధర్మాత్ముని గురించి చెప్పునదేమున్నది? (25).విభూతిని ధరించు శివజ్ఞాని అనుకోకుండానైననూ ఏ స్థానమునకు వెళ్లునో, అచట తీర్థములన్నియూ సమకూడును (26). ఈ విషయములో అధికముగా చెప్పనేల? విద్వాంసులు సదా భస్మను ధరించవలెను. లింగార్చనను చేయవలెను. 'ఓం నమశ్శివాయ' మంత్రమును జపించవలెను (27). బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మునులు మరియు దేవతలు కూడా భస్మధారణ మహిమను వర్ణింపజాలరు (28).


ఇతి వర్ణాశ్రమాచారో లుప్త వర్ణ క్రియోsపి చ | పాపాత్స కృత్త్రిపుండ్రస్య ధారణాత్సోsపి ముచ్యతే || 29


యే భస్మధారణం త్యక్త్వా కర్మ కుర్వన్తి మానవాః | తేషాం నాస్తి వినిర్మోక్ష స్సంసారాజ్ఞన్మ కోటి భిః || 30


తేనాధీతం గురోస్సర్వం తేన సర్వమనుష్ఠితమ్‌ |యేన విప్రేణ శిరసి త్రిపుండ్రం భస్మ నా కృతమ్‌ || 31


యే భస్మధారిణం దృష్ట్వా నరాః కుర్వంతి తాడనమ్‌ | తేషాం చండాలతో జన్మ బ్రహ్మన్నూహ్యం విపశ్చితా || 32


వర్ణాశ్రమాచారములను పాటించువాడు గాని, పాటించని వాడు గాని ఒక్కసారి త్రిపుండ్రమును ధరించినచో, పాపము నుండి విముక్తుడగును (29). భస్మ ధారణను వీడి కర్మను చేయు మానవులకు కోటి జన్మలెత్తిననూ సంసారము నుండి విముక్తి లభించదు. (30). ఏ విప్రుడైతే లలాటము నందు భస్మతో త్రిపుండ్రమును ధరించునో, అతడే గురువు వద్ద సర్వమును అధ్యయనము చేసినట్లు, సర్వకర్మలను అనుష్ఠించినట్లు అగును (31). ఓ మహర్షీ! భస్మమును ధరించు వ్యక్తిని అవమానించు మానవులకు అతి నీచమగు జన్మ లభించునని తెలియవలెను (32).


మానస్తోకేన మంత్రేణ మంత్రితం భస్మ ధారయేత్‌ | బ్రాహ్మణః క్షత్రియశ్చైవ ప్రోక్తేష్వంగేషు భక్తిమాన్‌ || 33


వైశ్య స్త్రి యంబకేనైవ శూద్రః పంచాక్ష రేణు తు | అన్యేషాం విధవాస్త్రీణాం విధిః ప్రోక్తశ్చ శూద్రవత్‌ || 34


పంచ బ్రహ్మాది మనుభిర్గృహస్థస్య విధీయతే | త్రియంబకేన మనునా విధిర్వై బ్రహ్మ చారిణః || 35


అఘోరేణాథ మనునా విపినస్థవిధిః స్మృతః | యతిస్తు ప్రణవేనైవ త్రిపుండ్రా దీని కారయేత్‌ || 36


బ్రాహ్మణ క్షత్రియులు 'మానస్తోకే తనయే' అను మంత్రముతో భస్మను మంత్రించి, భక్తితో, నిర్దిష్టములైన అవయవముల యందు ధరించవలెను (33). వైశ్యుడు త్ర్యం బక మంత్రముతోను, శూద్రుడు పంచాక్షర మంత్రముతోను, భస్మను ధరించవలెను. ఇతరులు, భర్తృహీనలగు స్త్రీలు పంచాక్షరితో ధరించవలెనని విధింపబడినది (34).గృహస్థుడు బ్రహ్మాది అయిదు మంత్రములతో, బ్రహ్మచారి త్ర్యం బక మంత్రముతో (35), వానప్రస్థుడు అఘోరమంత్రముతో, సన్న్యాసి ఓంకారముతో త్రిపుండ్రమును ధరించవలెనని ఋషులు వాక్రుచ్చిరి (36).


అతి వర్ణాశ్రమీ నిత్యం శివోsహం భావనాత్పరాత్‌ | శివయోగీ చ నియత మీ శానేనాపి ధారయేత్‌ || 37


న త్యాజ్యం సర్వ వర్ణైశ్చ భస్మధారణ ముత్తమమ్‌ | అన్యైరపి యథా జీవైస్సదేతి శివశాసనమ్‌ || 38


భస్మస్నానేన యావంతః కణాస్స్వాంగే ప్రతిష్ఠితాః | తావంతి శివలింగాని తనౌ ధత్తే హి ధారకః || 39


బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శ్శూద్రాశ్చాపి చ సంకరాః | స్త్రియోsథ విధవా బాలాః ప్రాప్తాః పాఖండిన స్తథా || 40


బ్రహ్మచారీ గృహీ వన్యః సన్న్యాసీ వా వ్రతీ తథా | నార్యో భస్మ త్రిపుండ్రాంకా ముక్తా ఏవ న సంశయః || 41


సర్వకాలములయందు 'శివుడను నేనే' అను పరమభావన వలన వర్ణాశ్రమములకు అతీతుడైన శివయోగి తప్పనిసరిగా ఈశానమంత్రముతో భస్మను దరించవలెను (37). సర్వ వర్ణముల వారేగాక, సర్వ మానవులు ఏనాడూ ఉత్తమమగు భస్మధారణను మానరాదని శివుని యాజ్ఞ (38). భస్మస్నానముచే ఎన్ని భస్మకణములు దేహమునందు ధరింపబడునో, అన్ని శివలింగములను ఆ భక్తుడు తన దేహమునందు ధరించుచున్నట్లు అగును (39). బ్రాహ్మణ క్షత్రియ వేశ్య శూద్రులు, ఇతరులు, స్త్రీలు, భర్తృహీనలు, కన్యలు, పాపాత్ములు (40), మరియు బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్న్యా సి, వ్రతదీక్షయందున్నవాడు మొదలగు వారందరు భస్మతో త్రింపుడ్రమును ధరించినచో, ముక్తులగుదురనుటలో సంశయము లేదు (41).


జ్ఞానతోsజ్ఞానతో వాపి వహ్నిదాహసమం యథా | జ్ఞానా జ్ఞానధృతం భస్మ పావయేత్సకలం నరమ్‌ || 42


నాశ్నీ యజ్ఞలమన్న మల్ప మపి వా భస్మాక్ష ధృత్యా వినా


భుక్త్వా వాథ గృహీ వనీ పతి యతిర్వర్ణీ తథా సంకరః |


ఏనో భుజ్‌ నరకం ప్రయాతి స తదా గాయత్రి జాపేన తత్‌


వర్ణానాం తు యతేస్తు ముఖ్య ప్రణవా జాపేన ముక్తం భవేత్‌ || 43


త్రిపుండ్రం యే వినిందంతి నిందంతి శివమేవ తే | ధారయంతి చ యే భక్త్యా ధారయంతి తమేవ తే || 44


ధిగ్భస్మ రహితం భాలం ధిగ్గ్రామమ శివాలయమ్‌ | ధిగనీశార్చనం జన్మ ధిగ్విద్యా మశివాశ్రయమ్‌ || 45


తెలిసి స్పృశించినా, తెలియక స్పృశించినా, నిప్పు సమానముగా కాల్చును. అటులనే, తెలిసి గాని, తెలియకుండా గాని, భస్మను ధరించినచో, అది ఆ వ్యక్తిని పూర్ణ పవిత్రుని చేయును (42). భస్మను రుద్రాక్షలను ధరించుకుండా నీరు త్రాగరాదు. కొద్దిగానైననూ భుజించరాదు. గృహస్థుడు, వాన ప్రస్థుడు, సన్న్యాసి, చతుర్వర్ణములవారు, లేక ఇతరులు ఎవరైనా గాని, అట్లు చేసినచో పాపమును భుజించినట్లగును. అట్టివాడు నరకమును పొందును. గాయత్రీ జపముచే ఆ పాపము తొలగును. సన్న్యాసియైనచో ప్రణవమును జపించవలెను (43). త్రిపుండ్రమును నిందించువారు శివుని నిందించినట్లగును. దానిని భక్తితో ధరించువారు శివుని ధరించినట్లగును (44). భస్మలేని లలాటము, శివాలయములేని గ్రామము, శివుని పూజించని జన్మ, మరియు శివ సంబంధములేని విద్య నిందనీయములు (45).


యే నిందంతి మహేశ్వరం త్రిజగతా మాధారభూతం హరం యే నిందంతి త్రిపుండ్రధారణకరం దోషస్తు తద్దర్శనే |


తే వై సంకర సూకరా సుర ఖరశ్వక్రోష్టు కీటోపమా జాతా ఏవ భవంతి పాపపరమాస్తే నారకాః కేవలమ్‌ || 46


తే దృష్ట్వా శశిభాస్కరౌ నిశి దినే స్వప్నేsపి నో కేవలం పశ్యంతు శ్రుతి రుద్రసూక్త జపతో ముచ్యేత తేనాదృతాః |


సత్సం భాషణ భవేద్ధి నరకం నిస్తారవానాస్థితం యే భస్మాది విధారణం హి పురుషం నిందంతి మందాహి తే || 47


న తాంత్రికస్తధికృతో నోర్థ్వపుండ్రధరో మునే| సంతప్త చక్ర చిహ్నోsత్ర శివయజ్ఞే బహిష్కృతః || 48


తత్రైతే బహవో లోకా బృహజ్ఞాబాల చోదితాః | తే విచార్యాః ప్రయత్నేన తతో భస్మరతో భవేత్‌ || 49


ముల్లోకములకు ఆధారమైన, పాపహరుడగు మహేశ్వరుని, త్రిపుండ్రమును ధరించువానిని ఎవరు దూషిస్తారో, అట్టి వారిని చూచినచో దోషము కలుగును. ఆ పాపాత్ములు నరకము ననుభవించి, పంది, రాక్షసుడు, గాడిద, కుక్క, నక్క, కీటకము మొదలగు జన్మలను పొందెదరు (46). వారు పగలు సూర్యుని, రాత్రి చంద్రుని చూడలేని అంధుల వంటివారు. వారు స్వప్నములో నైననూ వేదమునందలి రుద్రసూక్తమును జపించినచో అది వానిని రక్షించి మోక్షమునొసంగును. సత్పురుషులతో సంభాషించు మానవుడు నరకమును దాటివేయును. భస్మను ధరించు వ్యక్తిని నిందించువారు మూర్ఖులు(47). ఓ మహర్షీ! తాంత్రికునకు, ఊర్థ్వ పుండ్రమును ధరించువానికి, కాల్చిన ఇనుముతో శరీరముపై చక్రాంకితము వేసుకున్న వారికి శివయజ్ఞము నందు అధికారము లేదుగాన, వారు బహిష్కరింపబడుదురు (48). మానవుడు బృహజ్ఞాబాలో పనిషత్‌ లోని వివిధ మంత్రములను శ్రద్ధతో విచారణ చేసినచో, భస్మధారణ యందు అనురక్తి కలుగును (49).


యచ్చందనైశ్చందనకేsపి మిశ్రం ధార్యం హి భస్మైవ త్రిపుండ్ర భస్మనా |


విభూతి భాలోపరి కించ నా పి ధార్యం సదా నో యది సంతి బుద్ధయః || 50


స్త్రీ భిస్త్రి పుండ్ర మలకావధి ధారణీయం భస్మ ద్విజాదిభిరథో విధవా భిరేవమ్‌ |


తద్వత్సదాశ్రమవతాం విశదా విభూతిః ధార్యాపవర్గ ఫలదా సకలాఘహంత్రీ || 51


త్రిపుండ్రం కురుతే యస్తు భస్మనా విధిపూర్వకమ్‌ | మహాపాతక సంఘూతైర్ముచ్యతే చోపపాతకైః || 52


బ్రహ్మచారీ గృహస్థో వా వానప్రస్థోsథవా యతిః | బ్రహ్మక్షత్రాశ్చ విట్‌ శూద్రాస్తథాన్యే పతితాధమాః || 53


ఉద్ధూలనం త్రిపుండ్రం చ ధృత్వా శుద్ధా భవంతి చ | భస్మనో విధినా సమ్యక్‌ పాపరాశిం విహాయ చ || 54


గంధమును ధరించ గోరు వారు దానిని భస్మయందు కలిపి త్రిపుండ్రమును ధరించవలెను. విభూతిని లలాటమునందు ధరించి, దానిపైన మరియొక పదార్ధమును ధరించరాదు. అట్లు ధరించువారు మూర్ఖులు (50). స్త్రీలు ముంగురులు ఉండు స్థానము వరకు లలాటము నందు త్రిపుండ్రమును ధరించవలెను. ద్విజులు, ఇతరులు, మరియు భర్తృహీనలగు స్త్రీలు ఇదే తీరున భస్మను ధరించవలెను. భస్మ పాపములనన్నిటినీ పోగొట్టి మోక్షఫలమునిచ్చును (51). భస్మతో యథావిధిగా త్రిపుండ్రమును ధరించు మానవుడు మహా పాతకముల సమూహముల నుండియు, మరియు ఉపపాతకముల నుండియు విముక్తిని పొందును (52). బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, మరియు యతి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులు, మరియు పతితులు, అధములు (53) భస్మతో శరీరావయవముల యందు లేపమును, లలాటము నందు త్రిపుండ్రమును ధరించినచోపరిశుద్ధులగుదురు. భస్మధారణ విధి పాపరాశులను పూర్తిగా తొలగించును (54).


భస్మధారీ విశేషేణ స్త్రీ గోహత్యాదిపాతకైః | వీరహత్యాశ్వహత్యాభ్యాం ముచ్యతే నాత్ర సంశయః || 55


పరద్రవ్యాపహరణం పరదారాభి మర్శనమ్‌ | పరనిందా పరక్షేత్రహరణం పరపీడనమ్‌ || 56


సస్యారామాదిహరణం గృహదాహాది కర్మ చ | గో హిరణ్య మహిష్యాది తిలకంబల వాససామ్‌ || 57


అన్నధ్యాన్య జలాదీనాం నీ చేభ్యశ్చ పరిగ్రహః | దశవేశ్యా మతంగీషు వృషలీషు నటీషు చ || 58


రజస్వలాసు కన్యాసు విధవాసు చ మైథునమ్‌ | మాంస చర్మరసాదీనాం లవణస్య చ విక్రయః || 59


పైశున్యం కూటవాదశ్చ సాక్షి మిథ్యా భిలాషిణామ్‌ | ఏవమాదీన్య సంఖ్యాని పాపాని వివిధాని చ || 60


సద్య ఏవ వినశ్యంతి త్రిపుండ్రస్య చ ధారణాత్‌ |


భస్మమును ధరించు భక్తుడు స్త్రీహత్య, గోహత్య, వీరపురుష హత్య, అశ్వహత్య ఇత్యాది పాతకముల నుండి విముక్తుడగును. సందేహము లేదు (55). ఇతరుల ధనమును అపహరించుట, పరుని భార్యను కామించుట, ఇతరులను నిందించుట, ఇతరుల భూమిని అపహరించుట, ఇతరులను పీడించుట (56), పంట, గృహము ఇత్యాదుల నపహరించుట, ఇళ్లను తగులబెట్టుట, నీచుల నుండి గోవు, బంగారము, గేదె, నువ్వులు, కంబళి, వస్త్రము (57), అన్నము, ధాన్యము, నీరు మొదలగు వాటిన స్వీకరించుట, వేశ్యలు, అవివాహితలు, నాట్యకత్తెలు (58), రజస్వలలు, భర్తృహీనలు అగు స్త్రీలతో సంభోగించుట, మాంసము, చర్మము, పాదరసము, ఉప్పు మొదలగు వాటిని అమ్ముట (59), కొండెములను చెప్పుట, కూట సాక్ష్యమును చెప్పుట, చెప్పించుట మొదలగు వివిధములైన లెక్కలేనన్ని పాపములు (60) త్రిపుండ్రమును ధరించిన వెనువెంటనే నశించును.


శివద్రవ్యాపహరణం శివనిందా చ కుత్రచిత్‌ || 61


నిందా చ శివభక్తానాం ప్రాయశ్చిత్తైర్న శుధ్యతి | రుద్రాక్షం యస్య గాత్రేషు లలాటే చ త్రిపుండ్రకమ్‌ || 62


స చాండాలేsపి సంపూజ్య స్సర్వ వర్ణోతత్తమోత్తమః | యాని తీర్థాని లోకేsస్మిన్‌ గంగాద్యా స్సరితశ్చ యాః || 63


స్నాతో భవతి సర్వత్ర లలాటే యస్త్రి పుండ్రకమ్‌ | సప్తకోటి మహామంత్రాః పంచాక్షర పురస్సరాః || 64


తథాన్యే కోటిశో మంత్రాశ్శైవకైవల్య హేతవః | అన్యే మంత్రా శ్చ దేవానాం సర్వ సౌఖ్య కరా మునే || 65


తే సర్వే తస్య వశ్యాస్స్యు ర్యో బిభర్తి త్రిపుండ్రకమ్‌ |


శివ ధనమును అపహరించుట, శివుని నిందించుట (61), శివభక్తులను నిందించుట అను పాపములకు పాయశ్చిత్తము లేదు.ఎవని లలాటమునందు త్రిపుండ్రము ఉండునో (62), వానిని, ఏ వర్ణమువాడైననూ, అన్ని వర్ణములలో శ్రేష్ఠమైన వానినిగా పూజింపవలెను. లలాటమునందు త్రిపుండ్రమును ధరించు భక్తుడు ఈ లోకములో గల గంగాది తీర్థములన్నిటియందు (63) స్నానము చేసిన ఫలమును పొందును. ఓ మహర్షీ! పంచాక్షరి ఇత్యాది ఏడు కోట్ల మహామంత్రములు (64), మోక్షదాయకములగు కోట్లాది ఇతర మంత్రములు, మరియు సుఖములనన్నిటినీ ఒసంగు ఇతర దేవతా మంత్రములు (65), త్రిపుండ్రకమును ధరించువానికి వశమగును.


సహస్రం పూర్వజాతానాం సహస్రం జనయిష్యతామ్‌ || 66


స్వ వంశ జానం జ్ఞాతీనా ముద్ధరేద్యస్త్రి పుండ్రకృత్‌ | ఇహ భుక్త్వా ఖిలాన్‌ భోగాన్‌ దీర్ఘాయుర్వ్యాధివర్జితః || 67


జీవితాంతే చ మరణం సుఖేనైవ ప్రపద్యతే | అష్టైశ్వర్య గుణోపేతం ప్రాప్య దివ్యవపుశ్శివమ్‌ || 68


దివ్యం విమానమారుహ్య దివ్య త్రిదశసేవితమ్‌ | విద్యాధరాణాం సర్వేషాం గంధర్వాణాం మహౌజసామ్‌ || 69


ఇంద్రాదిలోకపాలానాం లోకేషు చ యథాక్రమమ్‌ | భుక్త్వా భోగాన్‌ సువిపులాన్‌ ప్రజేశానాం పదేషు చ || 70


త్రిపుండ్రమును ధరించువాడు తన వంశములో వేయి పూర్వ తరములకు, వేయి రాబోవు తరములకు చెందు (66) జ్ఞాతులను ఉద్ధరించును. అట్టివాడు ఈ లోకములో దీర్ఘాయుర్దాయమును కలిగి, వ్యాధులు లేనివాడై, భోగములనన్నిటినీ అనుభవించి (67), ఆయుర్దాయము పూర్తి అయిన తరువాత అనాయాస మరణమును పొందును. తరువాత ఆ భక్తుడు అష్టైశ్వర్యములతో, గుణములతో కూడిన మంగళకరమగు దివ్యదేహమును పొంది (68), దేవతా విమానమునధిరోహించి, దేవతలచే సేవింపబడుచున్నవాడై, విద్యాధరులు, తేజశ్శాలురగు గంధర్వులు, ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు మొదలగు దేవతల లోకములలో వరుసగా విస్తృతమగు భోగములననుభవించి, ప్రజాపతుల లోకములను పొందును (70).


బ్రహ్మాణః పదమాసాద్య తత్ర కన్యాశతం రమేత్‌ | తత్ర బ్రహ్మాయుషో మానం భుక్త్వా భోగాననే కశః || 71


విష్ణోర్లోకే లభేద్భోగం యావద్బ్రహ్మ శతాత్యయః | శివలోకం తతః ప్రాప్య లభ్ద్వేష్టం కామమక్షయమ్‌ || 72


శివసాయుజ్యమాప్నోతి సంశయో నాత్ర జాయతే | సర్వోప నిషదాం సారం సమాలోక్య ముహుర్ముహుః || 73


ఇదమేవ హి నిర్ణీతం పరం శ్రేయస్త్రిపుండ్రకమ్‌ |


అతడు బ్రహ్మలోకమును పొంది వందమంది కన్యలతో రమించును. అచట బ్రహ్మ యొక్క ఆయుర్దాయమునకు సమమగు కాలము అనేక భోగములననుభవించి (71), విష్ణులోకమును పొంది, వంద బ్రహ్మలు గతించు వరకు భోగములను పొందును. తరువాత శివలోకమును పొంది, క్షయము లేని అభీష్టములననుభవించి (72), శివసాయుజ్యమును పొందును. దీనిలో సందేహము లేదు. ఉపనిషత్తులనన్నింటినీ అనేక పర్యాయములు పరిశీలించగా (73), త్రిపుండ్రము సర్వ శ్రేష్ఠమగు శ్రేయస్సాధనమని వాటి సారముగా నిర్ణయింపబడినది.


విభూతిం నిందతే యో వై బ్రాహ్మణస్సోsన్య జాతకః || 74


యాతి చ నరకే ఘోరే యావద్బ్రహ్మా చతుర్ముఖః | శ్రాద్ధే యజ్ఞే జపే హోమే వైశ్వదేవే సురార్చనే || 75


ధృత త్రిపుండ్రః పూతాత్మ మృత్యం జయతి మానవః | జలస్నానం మలత్యాగే భస్మ స్నానం సదా శుచి || 76


మంత్ర స్నానం హరేత్పాపం జ్ఞానస్నానే పరం పదమ్‌ | సర్వ తీర్థేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్‌ ఫలమ్‌ || 77


తత్ఫలం సమవాప్నోతి భస్మస్నానకరో నరః | భస్మస్నానం పరం తీర్థం గంగాస్నానం దినే దినే || 78


భస్మరూపీ శివస్సాక్షాద్భస్మ త్రైలోక్య పావనమ్‌ |


బ్రాహ్మణుడు గాని, ఇతరుడుగాని విభూతిని నిందించినచో (74), చతుర్ముఖ బ్రహ్మ ఉన్నంత వరకు ఘోరనరకములో నుండును. శ్రాద్ధము, యజ్ఞము, జపము హోమము, వైశ్వదేవము, దేవపూజ అను వాటియందు (75) త్రిపుండ్రమును ధరించు మానవుడు పవిత్రమగు అంతఃకరణము గలవాడై, మృత్యువును జయించును. కాలకృత్యముల తరువాత నీటితో స్నానమును చేయవలెను. భస్మస్నానము (భస్మను ధరించుట)ను చేయు వ్యక్తి సదా శుచి గలవాడగును (76). మంత్రస్నానము (మంత్రజపము) పాపమును పోగొట్టును. జ్ఞాన స్నానము (జ్ఞాన ప్రాప్తి) వలన మోక్షము లభించును. భస్మ స్నానమును చేయు వ్యక్తి సర్వ తీర్థముల యందు గల పుణ్యమును, ఫలమును (77) పొందగల్గును. భస్మ స్నానము పవిత్ర తీర్థస్నానముతో సమానమైనది. నిత్యము భస్మను ధరించుట వలన నిత్యము గంగా స్నానమును చేసిన ఫలము లభించును (78). శివుడు స్వయముగా భస్మరూపమును ధరించి యుండును. భస్మ ముల్లోకములను పవిత్రము జేయును.


న తత్‌ స్నానం న తద్ధ్యానం తద్ధ్యానం జపో న సః || 79


త్రిపుండ్రేణ వినా యేన విప్రేణ యుదనుష్ఠితమ్‌ | వానప్రస్థస్య కన్యానాం దీక్షాహీన నృణాం తథా || 80


మధ్యాహ్నా త్ర్పాగ్జలైర్యుక్తం పరతో జలవర్జితమ్‌ | ఏవం త్రిపుండ్రం యః కుర్యాన్నిత్యం నియత మానసః || 81


శివభక్తస్స విజ్ఞేయో భుక్తిం ముక్తిం చ విందతి | యస్యాంగే నైవ రుద్రాక్ష ఏకేsపి బహుపుణ్యదః || 82


తస్య జన్మ నిరర్థ స్స్యాత్‌ త్రిపుండ్రరహితో యది |


త్రిపుండ్రమును ధరించకుండగా విప్రుడు చేయు తీర్ధ స్నానము స్నానము కాదు, ధ్యానము ధ్యానము కాదు, దానము దానము కాదు, జపము జపము కాదు (79). వానప్రస్థుడు, కన్యలు, దీక్షలేని మానవులు (80) మధ్యాహ్నమునకు ముందు జలముతో కలిపి, తరువాత జలము లేకుండగా భస్మను ధరించవలెను. ఈ విధముగా మనస్సును నియమించి నిత్యము త్రిపుండ్రమును ధరించు మానవుడే (81)శివభక్తుడని తెలియవలెను. అతడు భుక్తిని, ముక్తిని, పొందును. గొప్ప పుణ్యమునిచ్చే రుద్రాక్ష ఒక్కటియైననూ దేహము నందు లేని వానికి (82), త్రిపుండ్రమును ధరించని వానికి జన్మ వ్యర్థము.


ఏవం త్రిపుండ్రమాహాత్య్మం సమాసాత్కథితం మయా || 83


రహస్యం సర్వజంతూనాం గో పనీయమిదం త్వయా | తిస్రో రేఖా భవంత్యేవ స్థనేషు ముని పుంగవాః || 84


లలాటాదిషు సర్వేషు యథోక్తేషు బుధైర్ముననే | భ్రువోర్మధ్యం సమారభ్య యావదంతో భవేద్ర్భువోః || 85


తావత్ర్పమాణం సంధార్యం లలాటే చ త్రిపుండ్రకమ్‌ | మధ్య మానామికాంగుల్యా మధ్యే తు ప్రతిలోమతః || 86


అంగుష్ఠేన కృతా రేఖా త్రిపుండ్రాఖ్యాsభిధీయతే | మధ్యేంsగులిభిరాదాయ తిసృభిర్భస్మ యత్నతః || 87


త్రిపుండ్రం ధారయేద్భక్త్యా భుక్తి ముక్తి ప్రదం పరమ్‌ |


ఇంతవరకు నేను త్రిపుండ్ర మహిమను సంగ్రహముగా చెప్పితిని (83). ఇది అందరికీ తెలిసేది కాదు. దీనిని నీవు రహస్యముగా నుంచవలెను. ఓ మునిశ్రేష్ఠులారా! మహర్షులచే నిర్దిష్టమైన లలాటము మొదలగు స్థానములన్నింటిలో మూడు రేఖలు ఉండునట్లు భస్మను ధరించవలెను (84). లలాటమునందు కనుబొమ్మల మధ్య నుండి కనుబొమ్మల అంతము వరకు త్రిపుండ్రమును ధరించవలెను. మధ్యవ్రేలు, మరియు అనామికతో భస్మమును ధరించి, ఆరేఖల మధ్యలో విలోమముగా (86) బొటన వ్రేలితో మరియొక రేఖను ధరించినచో, దానికి త్రిపుండ్రమని పేరు. లేదా, మూడు వ్రేళ్ళతో భస్మను త్రింపుండ్ర రూపముగా ధరించవచ్చును (87). భక్తితో త్రిపుండ్రమును ధరించువానికి భుక్తి, ముక్తి లభించును.


తిసౄణామపి రేఖానాం ప్రత్యేకం నవ దేవతాః || 88


సర్వత్రాంగే షు తా వక్ష్యే సావధానతయా శృణు | అకారో గార్హపత్యాగ్ని ర్భూర్దర్మశ్చ రజో గుణః || 89


ఋగ్వేదశ్చ క్రియాశక్తిః ప్రాతస్సవనమేవ చ |


మహాదేవశ్చ రేఖయాః ప్రథమాయాశ్చ దేవతాః | విజ్ఞేయా ముని శార్దూలాశ్శివ దీక్షా పరాయణౖః || 90


ఉకారో దక్షిణాగ్నిశ్చ నభస్తత్వం యజుస్తథా | మధ్యందినం చ సవనమిచ్ఛా శక్త్యంతరాత్మ కౌ || 91


మహేశ్వరశ్చ రేఖాయా ద్వితీయాయాశ్చ దేవతా | విజ్ఞేయా ముని శార్దూల శివదీక్షాపరాయణౖః || 92


శరీరమంతటా ఉండే ఈ మూడు రేఖలలో ప్రతి రేఖకు తొమ్మిది దేవతలు గలరు (88). ఆ వివరములను చెప్పెదను. శ్రద్ధగా వినుడు. ఓ మునిశ్రేష్ఠులారా!అకారము,గార్హపత్యాగ్ని, భూమి, ధర్మము, రజోగుణము (89), ఋగ్వేదము, క్రియాశక్తి, ప్రాతస్సవనము, మరియు మహా దేవుడు మొదటి రేఖకు దేవతలు అని శివదీక్షా పరాయణులు తెలియవలెను (90). ఓ మునిశ్రేష్ఠా! ఉకారము, దక్షిణాగ్ని, ఆకాశతత్త్వము, యజుర్వేదము, మాధ్యందిన సవనము, ఇచ్ఛాశక్తి, అంతరాత్మ (91) మరియు మహేశ్వరుడు రెండవ రేఖకు దేవతలని శివదీక్షా పరాయణులు తెలియవలెను (92).


మకారాహావనీ¸చ పరమాత్మ తమోదివౌ | జ్ఞానశక్తి స్సామవేద స్తృతీయం సవనం తథా || 93


శివశ్చైవ చ రేఖాయాస్తృతీయాయాశ్చ దేవతా | విజ్ఞేయా మునిశార్దూల శివదీక్షా పరాయణౖః || 94


ఏవం నిత్యం నమస్కృత్య సద్భక్త్యా స్థానదేవతాః | త్రిపుండ్రం దారయేచ్ఛుద్దో భుక్తిం ముక్తిం చ విందతి || 95


ఇత్యుక్తాః స్థానదేవాశ్చ సర్వాంగేషు మునీశ్వర | తేషాం సంబంధినో భక్త్యా స్థానాని శృణు సాంప్రతమ్‌ || 96


ఓ మునిశ్రేష్ఠా! మకారము, ఆహవనీయము, పరమాత్మ తమోగుణము, ద్యులోకము, జ్ఞానశక్తి, సామవేదము, తృతీయ సవనము (93), మరియు శివుడు మూడవ రేఖకు దేవతలని శివ దీక్షా పరాయణులు తెలుసుకొనవలెను (94). ఈ విధముగా స్థాన దేవతలకు నిత్యము భక్తితో నమస్కరించి, శుద్ధుడై త్రిపుండ్రమును ధరించు భక్తుడు భుక్తిని, ముక్తిని కూడ పొందును (95). ఓ మునిశ్రేష్ఠా!నేను ఇంతవరకు వివిధ అవయవముల స్థాన దేవతలను గురించి చెప్పితిని. ఆ స్థానముల వివరముల నిప్పుడు చెప్పెదను. భక్తితో వినుము (96).


ద్రాత్వింశత్‌ స్థానకే వార్థం షోడశస్థానకేపి చ | అష్టస్థానే తథా చైవ పంచస్థానేSపి వా న్యసేత్‌ || 97


ఉత్తమాంగే లలాటే చ కర్ణయోర్నేత్రయోస్తథా | నాసా వక్త్ర గ లేష్వేవం హస్తద్వయ అతః పరమ్‌ || 98


కూర్పరే మణి బంధే చ హృదయే పార్శ్వయోర్ద్వయోః | నాభౌ ముష్కద్వయే చైవ మూర్వో ర్గుల్ఫే చ జానుని || 99


జంఘాద్వయే పదద్వంద్వే ద్రాత్రింశత్‌ స్థానముత్తమమ్‌ |


ముప్పది రెండు, పదునారు, ఎనిమిది, లేదా ఐదు స్థానములలో భస్మను ధరించవలెను (97). శిరస్సు లలాటము, చెవులు, కన్నులు, ముక్కు, నోరు ,కంఠము, రెండు చేతులు (98), మోచేతులు, మణికట్టు, హృదయము, రెండు పార్శ్వములు, నాభి, గుహ్యము, ఊరువులు, మోకాళ్ళు, పిక్కలు (99) మోకాలి క్రింది భాగము, రెండు పాదములు వెలసి ముప్పది రెండు ఉత్తమ స్థానములలో భస్మను ధరించవలెను.


అగ్న్యబ్‌ భూవాయుదిగ్దేశ దిక్పాలాన్‌ వసుభిస్సహ | 100


ధరా ధ్రువశ్చ సోమశ్చ ఆపశ్చై వానిలోSనలః | ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవోSష్ట ప్రకీర్తితాః || 101


ఏతేషాం నామమాత్రేణ త్రిపుండ్రం ధారయేద్బుధాః | కుర్యాద్వా షోడశస్థానే త్రిపుండ్రంతు సమాహితః || 102


అగ్ని, జలము, భూమి, వాయువు, దిక్కులు, దిక్పాలకులు మరియు ఎనమండుగురు వసువులను (100) ఆయా నామములతో స్మరించి, విద్వాంసులు త్రిపుండ్రమును ధరించవలెను. ధర, ధ్రువుడు, సోముడు, జలాధిష్ఠాన దేవత, అగ్ని, వాయువు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అనువారు అష్టవసువవులనబడుదురు (101). భక్తుడు శ్రద్ధతో త్రిపుండ్రమును పదునారు స్థానములలో ధరించవలెను (102).


శీర్షకే చ లలాటే చ కంఠే చాంసద్వయే భుజే | కూర్పరే మణి బంధే చ హృదయే నాభిపార్శ్వకే || 103


పృష్ఠే చైవం ప్రతిష్ఠాయం యజేత్తత్రాశ్వి దైవతే | శివం శక్తిం తథా రుద్రమీశం నారదమేవ చ || 104


వామాదినవశక్తీశ్చ ఏతాః షోడశదేవతాః | నాస్యతో దస్రకశ్చైవ అశ్వినౌ ద్వౌ ప్రకీర్తితే || 105


తల, లలాటము, కంఠము, రెండు భుజస్కంధములు, రెండు భుజములు, రెండు మోచేతులు, రెండు మణికట్టులు, హృదయము, నాభి, రెండు పార్శ్వములు (103), వెనుక భాగము అను స్థానములలో భస్మను ధరించవలెను. ఆ స్థానములలో అశ్వినీ దేవతలు, శివుడు, శక్తి, రుద్రుడు, ఈశుడు, నారదుడు (104), వామా మొదలగు నవశక్తులు వెరసి పదునారు దేవతలను భావన చేయవలెను. నాసత్యుడు, దస్రుడు అను దేవతలకు అశ్వినీ దేవతలని పేరు (105).


అథవా మూర్ధ్ని కేశే చ కర్ణయోర్వదనే తథా | బాహుద్వయే చ హృదయే నాభ్యామూరుయగే తథా || 106


జానుద్వయే చ పదయోః పృష్ఠభాగే చ షోడశ | శివశ్చంద్రశ్చ రుద్రః కో విఘ్నేశో విష్ణురేవ వా || 107


శ్రీశ్చైవ హృదయే శంభు స్తథా నాభౌ ప్రజాపతిః | నాగశ్చ నాగకన్యాశ్చ ఉభయోర్‌ ఋషి కన్యకాః || 108


పాదయోశ్చ సముద్రాశ్చ తీర్థాః పృష్ఠే విశాలతః | ఇత్యేవ షోడశస్థాన మథోచ్యతే || 109


పదునారు స్థానములను, దేవతలను మరియొక విధముగా చెప్పవచ్చును. శిరస్సు, కేశములు, రెండు చెవులు, ముఖము, రెండు బాహువులు, హృదయము, నాభి, రెండు ఊరువులు (106), 

రెండు మోకాళ్లు, రెండు పాదములు, వెనుక భాగము అను పదునారు స్థానములలో భస్మను ధరించవలెను. ఈ స్థానముల యందు క్రమముగా శివుడు, చంద్రుడు, రుద్రుడు, బ్రహ్మ, విఘ్నేశ్వరుడు, విష్ణువు (107), లక్ష్మి, శంభువు, ప్రజాపతి, నాగదేవత, ఇద్దరు నాగకన్యలు, ఇద్దరు ఋషికన్యలు (108),

సముద్రము, తీర్థములు గలవు (109).


గుహ్యస్థానం లలాటశ్చ కర్ణద్వయమనుత్తమమ్‌ | అంసయుగ్మం చ హృదయం నా భిరిత్యేవమష్టకమ్‌ || 110


బ్రహ్మాచ ఋషయస్సప్త దేవతాశ్చ ప్రకీర్తితాః | ఇత్యేవం తు సముద్దిష్టం భస్మవిద్భిర్మునీశ్వరాః || 111


అథవా మస్తకం బాహూ హృదయం నాభిరేవ చ | పంచస్థానాన్యమూన్యాహుర్ధారణే భస్మవిజ్జవాః || 112


యథా సంభవనం కుర్యాద్దేశ కాలాద్యపేక్షయా | ఉద్ధూలనే ప్యశక్తశ్చేత్త్రిపుండ్రాదీని కారయేత్‌ || 113


గుహ్యము, లలాటము, రెండు చెవులు, రెండు భుజములు, హృదయము, నాభి అనే ఎనిమిది స్థానములలో భస్మను ధరించవలెను (110)


 ఓ మహర్షులారా! ఆ స్థానములకు బ్రహ్మ, సప్తర్షులు దేవతలని భస్మజ్ఞానము గల ఋషులు చెప్పియున్నారు(111). 


లేదా, శిరస్సు, రెండు బాహువులు, హృదయము, నాభి అను అయిదు స్థానములలో భస్మను ధరించవచ్చును (112).


దేశకాలముల ననుసరించి భక్తుడు యథాసంభవముగా భస్మను దరించవచ్చును. భస్మతో అంగలేపనము చేయుటలో అశక్తుడైన భక్తుడు త్రిపుండ్రమును ధరించవలెను (113).


త్రినేత్రం త్రిగుణాధారం త్రిదేవ జనకం శివమ్‌ | స్మరన్నమశ్శివాయేతి లలాటే తు త్రిపుండ్రకమ్‌ || 114


ఈ శాభ్యాం నమ ఇత్యుక్త్వా పార్శ్వయోశ్చ త్రిపుండ్రకమ్‌ | బీజాభ్యాం నమ ఇత్యుక్త్వా ధారయేత్తు ప్రకోష్ఠయోః || 115


కుర్యాదధః పితృభ్యాం చ ఉమేశాభ్యాం తథోపరి | భీమాయేతి తతః పృష్ఠే శిరసః పశ్చిమే తథా || 116


ఇతి శ్రీ శివ మహా పురాణే విద్వేశ్వర సంహితాయాం భస్మధారణవర్ణనం నామ చతుర్వింశోSధ్యాయః (24)


ముక్కంటి, త్రిగుణాత్మక ప్రకృతికి ఆశ్రయము, బ్రహ్మ, విష్ణు రుద్రులకు తండ్రియగు శివుని 'నమశ్శివాయ' అని స్మరించి, లలాటమునందు త్రిపుండ్రమును ధరించవలెను  'ఈశాభ్యాం నమః' అని ఉచ్చరించి పార్శ్వములయందు, 'బీజాభ్యాం నమః'అని ముంజేతులయందు  'పితృభ్యాం నమః' అని శరీరములోని క్రింది అవయముల యందు, 'ఉమేశాభ్యాం నమః' అని శరీరము యొక్క పైభాగము నందు , 'భీమాయ నమః' అని పలికి శిరస్సునకు వెనక భాగమునందు భస్మను ధరించవలెను!! 


శ్రీశివ మహాపురాణములోని విద్యేశ్వర సంహిత యందు భస్మధారణ వర్ణనము అనే ఇరువది నాలుగవ అధ్యాయము సమాప్తము (24)

🙏💖🌷

శ్రీ కర్కటేశ్వరస్వామి ఆలయం

 🕉 మన గుడి : 



⚜ కడప జిల్లా : గుండాలకొన


⚜ శ్రీ కర్కటేశ్వరస్వామి ఆలయం


💠అడవుల అందాలు చెప్పలేనివి. ఎందుకంటే చుట్టూరా విస్తరించిన పచ్చిక బయళ్లు, ప్రకృతి సోయగాలు వీటి సొంతం.వీటిని చూస్తేనే తెలీని ఆనందం ప్రతీ అణువులోనూ ప్రసరిస్తుంది. 


💠 మన దగ్గర ఉన్న అడవుల విషయానికొస్తే శేషాచలం అడవులు, నల్లమల్ల అడవులు. శ్రీశైల మల్లికార్జునుడు నల్లమల్ల అడవులలో,

 శ్రీ వెంకటేశ్వరుడు శేషాచలం అడవులలోనే కొలువై ఉన్నారు. 


💠 అందమైన జలపాతాలకు నెలవైన కడప జిల్లాలో ప్రకృతి అందాలకు కొదవే లేదు. 

ఎత్తైన కొండలు, లోతైన జలపాతాలు..ఇక అడవుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వీటితో పాటు దర్శనీయ రమణీయ స్థలాలు చాలా ఉన్నాయి.

దక్షిణ భారతదేశంలోనే పేరెన్నికగన్న దేవుని కడప ఆలయం కొలువైంది కడపలోనే. 

అంతే కాదు, జిల్లాలోనే ఎత్తైన జలపాతం కూడా ఇక్కడే ఉంది. అదే పాలకొండ జలపాతం. అలాగే లంకమల జలపాతం. తౌలాంతపూరం జలపాతం, గుండాలకోన జలపాతం.


💠 ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలోని చిట్వేలి మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన గుండాలకోనలో గుండాలఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో ప్రత్యక్షంగా దర్శనం ఇస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం..


💠 విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన గుండాలేశ్వరస్వామి ఆలయ ప్రాంతమే గుండాలకోనగా ప్రసిద్ధి చెందింది. 

ఈ గుండంలో మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని, దెయ్యాలు వదులుతాయని, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ గుండం పక్కనే గుహ వుంది.

ఈ గుహలో గుండాల ఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. 

గుహ ద్వారంలో భక్తులు పూజలు, ఫలాలు ఉంచుతారు. వాటిని ఎండ్రకాయ లోనికి తీసుకుపోతే తమ కోర్కెలు నెరవేరినట్లుగా భక్తులు భావిస్తారు. 


💠 ఈ కర్కాటకం ఒకొక్క సందర్భంలో ఒక్కొక్క సైజులో కూడా కనిపిస్తూ కోరిన వారి కోర్కెలు తీరుస్తాడు. ఇక్కడి గుండంలో మునిగి దేవున్ని దర్శించుకుంటే పాపాలు పోతాయని పూర్వీకులు నమ్మకం. ఒక్కసారి గుండాలలో స్నానమాచరిస్తే అప్పటి వరకు ఉన్న బడలిక మటుమాయమవుతుందని వైద్యులు సైతం అంటున్నారు.


💠 పార్వతీపరమేశ్వరుల నిలయమైన 'గుండాలకోన’ అత్యంత పవిత్రమైన స్థలంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశంలో కర్కాటకం రూపంలో సజీవంగా దర్శనమిచ్చే స్వామిని దర్శించుకోవడానికి కార్తీక మాసంలోని సోమవారాల్లో అధిక సంఖ్యలో వెళుతుంటారు. ప్రత్యేకించి 3వ సోమవారం ఎక్కువ మంది వెళుతుంటారు.


💠 గుండాల కోనలో ఆ పరమేశ్వరుడు కర్కాటక రూపంలో ఎన్నో సంవత్సరాల నుండి ఉండటం ఒక పెద్ద విశేషం. తుంగా రాఘవయ్య మరియు మరికొందరు భక్తులు కలసి ఈ ప్రదేశంలో రాత్రుళ్ళు నిద్రచేయగా తెల్లవారు జామున స్వామివారి పుటు దగ్గర నుంచి మంగళ వాయిద్యాలు వినిపించాయని అంటారు.


⚜ స్థల పురాణం ⚜


💠  శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి మనుమరాలైన శ్రీ ఈశ్వరమ్మను వివాహం చేసుకోగోరి నిరాకరణకు గురైన రంగరాజు (నగరిపాడు రంగనాయకుల స్వామి) కొంతకాలం ఈ గుండాలకోనలోనే తపస్సు చేశారు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఎండ్రకాయరూపంలో భక్తులకు దర్శనమిస్తానని చెప్పాడని చెబుతారు. అయితే స్వామిని దర్శించుకోవాలంటే ఎన్నో ప్రయాసాలకోర్చి భక్తులు 9కిలోమీటర్లు అడవి బాటలో వెళ్ళాలి.

 కాని దట్టమైన అడవుల్లో దారి తప్పి క్రూరజంతువులకు బలైన సంఘనటలు కొన్ని జరిగాయి చెబుతారు. అందుకే అటవీ అధికారుల అనుమతి, సహాయంతో ప్రయాణం సాగించటం మంచిదంటారు అధికారులు.

  

💠 ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలోని చిట్వేలి మండలంలోని చిట్వేలి మండలం వెంకటరాజు పల్లి,పెద్దూరు, అనుంపల్లె గ్రామాల నుంచి దాదాపు 9 కిమీ దూరంలో రిజర్వుఫారెస్టులో కొండ కోనల నడుమ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ గుండాలకోన ఉన్నది. 


💠 వెంకటగిరి కొండలమీదుగా 6గుండాలను దాటుకుని 7వ గుండంలోనికి సుమారు 30 అడుగుల ఎత్తునుంచి ఉధృతంగా నీరు ప్రవహిస్తున్నది.


💠 గుండాలకోన సెలయేరు పైభాగాన ఆకారాన్ని బట్టి 7 గుండాలు ఉన్నాయి. 

చదును గుండం,

బూడిద గుండం, 

సమారాధన గుండం, 

పసుపుగుండం, 

గిన్నెగుండం, 

అక్కదేవతల గుండం, 

స్నాన గుండం... ఇలా 7గుండాలు కనిపిస్తాయి. సాధారణ గుండాల కంటే ఎక్కువ లోతుగా ఉండటం వీటి ప్రత్యేకత.


💠 చదునుగుండంగా చెప్పే చోట నుండి నీరు గిన్నె ఆకారంలో ఉన్న బండలపై పడుతుంది. దీనినే గిన్నె గుండంగా పిలుస్తున్నారు. 

ఇక్కడే స్నాన గుండం కూడా ఉంది.

గిన్నె గుండంలోని నీరు ఇక్కడికి చేరుతుంది. 

ఈ నీరు మరో గుండంలోకి పడగానే పసుపు రంగులోకి మారుతుంది. అందువల్లనే దీనికి పసుపు గుండం అని పిలుస్తారు. 

ఆ తర్వాత ఈ నీరు మరో గుండంలో పడగానే బూడిదరంగుగా మారడంతో దాన్ని బూడిదగుండం అంటున్నారు. 

ఈ నీరు సమారాధన గుండంలోకి వెళుతుంది. ఇక్కడే భక్తులు స్నానమాచరిస్తారు.


💠 శతాబ్దాలుగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయక్కడ. భక్తుల రద్దీ పెరిగాక ఆర్టీసీ అధికారులు ఆ ఒక్క రోజు మాత్రం రైల్వేకోడూరు నుంచి వై.కోట మీదుగా గుండాలకోనకు బస్సులు నడుపుతున్నారు. ఇక్కడి నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో కూడా యేటా మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

ఆవు గొప్పదనం

 *ఆవు గొప్పదనం తెలియజేసిన చ్యవన ముని*


చంద్ర వంశానికి చెందిన  పురూరవ చక్రవర్తికి, ఊర్వశికి ఆయువు అనే కుమారుడు పుట్టాడు. ఈ ఆయువుకు  నహుషుడు అనే కొడుకు పుట్టాడు. నహుషుడు తన రాజ్యాన్ని ఎంతో బాధ్యతగా పాలించేవాడు. ఒకరోజు గంగా యమునా నదుల సంగమ ప్రాంతంలో కొంతమంది చేపలు పట్టేవాళ్ళు చేపలు పడుతుండగా వారికి చేపలతో పాటు ఓ ఋషి కూడా వలలో పడ్డాడు. ఆ ఋషి 12 సంవత్సరాల నుండి నీళ్లలో సమాధి స్థితిలో ఉంటూ తపస్సు చేసుకుంటున్నాడు. అలాంటి ఋషి తపస్సుకు భంగం కలిగించామని ఆ చేపలు పట్టేవాళ్ళు బాధపడ్డారు. అలా నీటిలో తపస్సు చేసుకుంటున్న ఋషి పేరు చ్యవనుడు. 


చేపలు పట్టేవాళ్ళంతా చ్యవణుడితో క్షమించమని కోరారు. అయితే చ్యవనుడు మాత్రం వాళ్ళతో "నేను చేపలతో కలిసి ఇన్నాళ్లు బ్రతికాను ఇప్పుడు వాటితో పాటు మీకు దొరికాను. మీరు నన్ను కూడా చేపలతో పాటు అమ్మేసి డబ్బు కూడబెట్టుకోండి" అన్నాడు.


ఋషి ఆజ్ఞను అమలుపరచడం ఎలాగో తెలియక జాలరులు ఆ సమస్యను నహుషుని దృష్టికి తీసుకొని వచ్చారు. నహుషుడు విషయం తెలిసిన వెంటనే మంత్రి పురోహితులు అందరితో కలిసి  చ్యవనమహర్షి వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసాడు. మత్స్యకారులు పొరపాటు చేశారు క్షమించండి అని క్షమాపణ అడిగాడు.  అయితే చ్యవనుడు నహుషునితో జాలరులకు చెప్పినమాటే చెప్పాడు. 'చేపలతో పాటు నన్ను కూడా తగిన వెలకు అమ్మండి' అని అన్నాడు.  


చ్యవనుడు అలా  చెప్పిన తరువాత నహుషుడు చేపలు పట్టేవాళ్లకు వేయి మాడలు ఇవ్వబోయాడు.  అయితే చ్యవనుడు 'రాజా! నా వెల వేయి మాడలా? సరియైన వెల ఇవ్వవయ్యా!' అన్నాడు.


చక్రవర్తి లక్షమాడలన్నాడు. చ్యవనమహర్షి సంతృప్తి చెందలేదు. కోటి మాడలన్నాడు. ఋషికి అంగీకారం కాకపోవడంతో సగం రాజ్యమివ్వడానికి సిద్ధపడ్డాడు నహుషుడు. అదీ సరియైన వెల కాదన్నాడు ముని. మొత్తం రాజ్యాన్ని మునికోసం సమర్పించడానికి సిద్ధపడ్డాడు నహుషుడు. అప్పటికీ చ్యవనమహర్షి ఒప్పుకోకపోవడంతో నహుషుడికి ఏం చేయాలో తోచలేదు. 


చివరకు చ్యవన మహర్షి నహుషునితో  'రాజా! వెళ్ళి నీ మంత్రులతో సంప్రదించి తగిన వెలనునిర్ణయించు' అని ఆదేశించాడు.


సకలసంపదలు కలిగిన రాజ్యం కూడా చ్యవనుడికి సరితూగకపోవడంతో  ఏం చేయాలా అని బాధపడుతున్న నహుషుని వద్దకు గవిజాతుడనే ముని వచ్చి పరిష్కారం చెప్పాడు. 'బ్రాహ్మణుని, గోవును - ఆ బ్రహ్మ దేవుడు సమాన విలువ కలిగినవిగా సృష్టించాడు. బ్రాహ్మణుడు అఖిల మంత్రాలకు అధిష్టానమైతే గోపు హవిస్సుకు మూలం. కనుక చ్యవనునికి సాటి రాగలది గోవు తప్ప మరేదీలేదు. కాబట్టి  అతనికి ఆవు నిమ్మను ఇవ్వమని మార్గం చెప్పాడు గవిజాతముని.


నహుషుడు చ్యవనమహర్షి దగ్గరకు వెళ్లి, 'మహాత్మా! తమకు వెల కట్టగల శక్తి మాకెక్కడిది? నన్ను కనికరించి మీకు తగిన మూల్యంగా ఈ ఆవును అంగీకరించండి'. అని ప్రార్ధించాడు. చ్యవనమహర్షి నహుషుని భక్తిశ్రద్ధలకు, వినయ విధేయతలకు ఎంతో సంతోషించాడు. 'రాజా! అవు అగ్నిమయం, అమృత స్వరూపం, స్వర్గానికి సోపానం. దేవతలకైనా పూజనీయమైనది. హోమ విధాన సంపద్వాహినియైన గోవు నాకు తగిన వెల' అని అంగీకరించాడు.  


ఆవు గొప్పదనానికి ఇదొక గొప్ప ఉదాహరణ.

నాన్న

 నాన్న  🙏

🌷🌷


మళ్ళీ ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక జన్మలో

నేను నువ్వుగా ,  నువ్వు నేనుగా ఎదురవుతాం


 నీలా బడికెందుకెళ్ళలేదంటూ చెవి మెలెయ్యను

పదమూడోఎక్కం  ఇంకా ఎందుకు రాలేదంటూ  అస్సలు కన్నెర్రజెయ్యను 


ఎండలో  ఆడకు , వానలో తడవకు అంటూ

అస్తమానం నీ వెనుకేపడను


ఇంకెప్పడూ నన్నొదిలి వెళ్ళొద్దంటూ

నీకాళ్ళని చుట్టేసుకుంటాను 

నా కన్నీళ్ళతో నీ కాళ్ళను కడిగేసుకుంటాను .


నువ్వు లేని రేపులు నాకొద్దు  

నువ్వున్న నిన్నల్లోకి వచ్చెయ్ నాన్నా !


నీ ఙ్ఞాపకాలు కంటి నుండి రాలుతున్నై 

నా తలను నిమిరే  నీ చేతి వేళ్ళకోసం ఎక్కడని వెతకను


నువ్వున్న  ప్రపంచమేదో చెప్పెయ్ నాన్నా !

 నువ్వు లేని కాలాన్ని  గాలికొదిలేస్తా


నీలా చూసుకునే నాన్ననై నీదగ్గరే ఉండిపోతా .

నన్ను నీలో చూసుకుంటూ నువ్వు నేనై మిగిలిపోతా  .

.

బాదరాయణసంబంధము

 *బాదరాయణ సంబంధము*


వెనకటికి ఒక పెద్దాయన తన ఊరునుండి పనిమీద మరొక ఊరు వెడుతూ ఉండగా.... మధ్యదారిలో సాయంసంధ్యా సమయము అయినది. సకాలసంధ్యావందనం అప్పట్లో కచ్చితంగా చేసేవారు కదా! త్వరగా ప్రయాణం చెయ్యగా ఒక ఊరు వచ్చింది. అక్కడ ఒక బ్రాహ్మణోత్తముని ఇల్లు చూచుకొని బండి దిగి ఆ ఇంటి తలుపు కొద్దిగా తెరచి లోపలకు తొంగిచూచి అయ్యా.! లోపల ఎవరు ఉన్నారు? అని గట్టిగా కేక పెట్టాడు ఆ బాటసారి బ్రాహ్మణుడు. ఆ కేకకు ఆ ఇంటి యజమాని బయటకు రాగా.... ఏమాత్రమూ మొగమాటం చూపించకుండా చాలా స్వతంత్రంగా యజమానితో కులాసా కబుర్లు మాట్లాడి... కాసేపు ఇక్కడ ఉండి సంధ్యావందనం చేసుకుంటాననగా...ఆ యజమాని సంధ్యావందనానికేమి భాగ్యం? రాత్రిభోజనం కూడా మాతోనే చేసి ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయం మీ ప్రయాణం సాగించవచ్చు. అని సెలవీయటం జరిగింది. దానికి ఈ బాటసారి బ్రాహ్మణుడు అంగికరించి సంధ్యావందనం తరువాత భోజనాలు కూడా వారు పూర్తిచేశారు. 


ఈ బాటసారి బ్రాహ్మణుడు చాలా చాలా స్వతంత్రంగా వ్యవహరించటం, మాట్లాడటం చూచి ఆ ఇంటి యజమాని పరిచయం లేని ఈ బ్రాహ్మణుడు ఇంత స్వతంత్రంగా ఉన్నాడు. ఇతడు ఎవరో కూడా తెలియలేదు. నేను ఇంతకు ముందు చూడని చుట్టమేమో అనుకొంటూ...  పలుకరించి చూద్దాం. బంధుత్వముంటే బయటపడుతుంది.అని అనుకొని... ఆ బాటసారి బ్రాహ్మణుడితో.... అయ్యా! తమరిని గతంలో ఎప్పుడూ చూచినట్లు లేదు. మీకూ మాకూ బంధుత్వము కూడా ఉన్నట్లు నాకు గుర్తుకు రావటం లేదు. ఇంతవరకూ మనం మాట్లాడుకున్నాము. మీరేమో అపరిచితులు వలె వ్యవహరించటంమూ లేదు. ఇంతకూ మనమధ్య నాకు తెలియని బంధుత్వమేమైనా ఉన్నదా? ఉంటే సెలవియ్యండి. అన్నాడు. 


దానికి ఆ బాటసారి బ్రాహ్మణుడు... అయ్యో! మనకు బంధుత్వము లేకపోవటమేమండీ? 

*అస్మాకం బదరీచక్రం యుష్మాకం బదరీ తరుః ౹*

*బాదరాయణ సంబంధం యూయం యూయం వయం వయం ॥*

నా బండి చక్రాలలో ఒకటి బదరీనృక్షపు కలపతో చేయబడినది. మీ ఇంటి ముందరేమో ఏకంగా బదరీవృక్షమే ఉన్నది. కనుక మనిద్దరిదీ ఈ బదరీ సంబంధమైన బంధుత్వము. కనుక ఇది బాదరాయణసంబంధము. అన్నాడు. దానితో ఆ ఇంటి యజమాని తెల్లముఖం వేశాడు. 


అప్పటి నుండి ఈ *బాదరాయణసంబంధము* ప్రచారంలోకి వచ్చింది.

ఫాదర్స్ డే

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*పితృ దినోత్సవం ఎలా వచ్చిందో తెలుసా?*

             🌷🌷🌷

**జూన్ 3వ ఆదివారం అంతర్జాతీయ పితృ దినోత్సవం*(fathers day)


💝అంతర్జాతీయ పితృ దినోత్సవమును ప్రతీ సంవత్సరం జూన్ నెలలో మూడో ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం పాటిస్తున్నాయి. తల్లుల పట్ల గౌరవాన్ని చూపే మాతృవందన దినోత్సవం ఉండగా బాధ్యతకు మారుపేరుగా నిలిచే నాన్నలకూ ఒకరోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్  ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు అనుగుణంగా  1910లో ఫాదర్స్ డే జరుపుకున్నారు. ఆ తర్వాత ఆదరణ పెరుగుతూ రాగా ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్ లో వచ్చే మూడో ఆదివారాన్ని పితృ వందన దినోత్సవముగా ప్రకటించి జరుపుతున్నాయి.


*💖18-06-2023 ఆదివారం అలా పితృ దినోత్సవమైంది.*


💓వేదం ‘పితృదేవోభవ’ అంటూ తండ్రిని దైవంగా చూడాలని చెబితే, శాస్త్రాలు ఆయనకి విష్ణు స్థానమిచ్చాయి. జగత్తును పాలించి పోషించేది విష్ణుమూర్తి. అందువల్ల కుటుంబాన్ని పోషించే తండ్రిని విష్ణు సమానుడిగా చెప్పాయి.


💖’నమో పిత్రే జన్మధాత్రే సర్వదేవమయాయచ। సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే।।

దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మయావపుః। సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః’ ఇలా సాగుతుంది “బృహద్ధర్మ పురాణంలో” “పితృస్తుతి”.


❤️కనీ, పెంచీ కడుపు చూసేది అమ్మైతే నడిపించి భవిష్యత్తుని చూసేవాడు నాన్న. అమ్మ కనిపించే వాస్తవమైతే, నాన్న ఓ నమ్మకం. లాలించేది అమ్మ ఒడి, నాన్న భుజం లోకాన్ని చూపే బడి. అమ్మ జోల పాట ఎలాగో.. నాన్న నీతి పాఠం కూడా అలాగ. తమకన్నామిన్నగా బిడ్డ తయారు కావాలని కలలు కనేది కన్నవారే.


💞నాన్న మనకోసం జీవితాన్ని త్యాగంచేసే త్యాగమూర్తి. మనం ఓడినప్పుడు నేనున్నా అంటూ ఓదార్చే ఎమోషన్ నాన్న. మనం గెలిచినప్పుడు పదిమందితో చెప్పుకునేవాడే నాన్న. మన నుంచి కృతజ్ఞతలు ఆశించని అమాయక చక్రవర్తి నాన్న. ప్రపంచంలో అమ్మకు ఎంత గొప్ప స్థానం ఉందో నాన్నకు కూడా అంతే గొప్ప స్థానం ఉంది. అటువంటి నాన్నకు ప్రతీఒక్కరు రుణపడి ఉండాలి.


💕టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పొస్టులు పెట్టి చేతులు దులుపుకోవడం, వాట్సాప్ లో స్టేటస్ పెట్టి ప్రపంచాన్ని జయించినట్టు ఫీలయ్యే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అయితే నాన్నకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి శుభాకాంక్షలు చెప్పడం కాకుండా మన పక్కనే ఉండే నాన్నతో కాసేపు మాట్లాడితే నాన్న ఎంతో సంతోషంగా ఫీలవుతారు.


💓మహిళలు పురుషులకు సరి సమానంగా ఉద్యోగాలకు వెళ్తున్న తరుణంలో కుటుంబ బాధ్యతలతోబాటు పిల్లల పెంపకం, ఇంటి పనుల్ని కూడా పురుషులీనాడు సమానంగా పంచుకుంటున్నారు. పిల్లల ఆలనాపాలనా చూసుకోవడంలో తండ్రులే ప్రస్తుతం ముందు ఉంటున్నారు. ‘ఫాదర్స్ డే’ జరుపుకోవాలనే సంప్రదాయం మనదేశానికి కొత్తదే. పాశ్చాత్య దేశాల నుంచి భారత్‌కు వచ్చిన ఈ పండుగ మన భారతీయుల్లో ఉన్న సహజ సెంటిమెంట్ రీత్యా విశేష ఆదరణను పొందింది.


💖చదువులూ, ఉద్యోగాలూ, వివాహాల్లో పిల్లల మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే తండ్రి మనస్సును నొప్పించక ప్రవర్తించాల్సిన బాధ్యత పిల్లలపై ఉందనేది గుర్తించాలి. నేటి నవ నాగరికత ముసుగులో పిల్లలు అమ్మానాన్నల్ని నిర్లక్ష్యం చేస్తున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. ప్రేమలు, పెళ్లిళ్ల విషయాల్లో అమ్మానాన్నల మనోభావాలను పిల్లలు తప్పక గౌరవించాలి.


💖సక్రమమైన ఆలోచనల్లేక ప్రేమలూ పెళ్లిళ్ల విషయంలో సొంతనిర్ణయాలు తీసుకోక తల్లిదండ్రుల అభిప్రాయాలను గుర్తించాలి. కంటికిరెప్పలా భావించి పెంచి పోషించిన అమ్మానాన్నలను ప్రేమ కోసమో, పెళ్లి కోసమో విస్మరించడం ఆత్మహత్యా సదృశ్యం.


💖తలవెంట్రుకలంత మంది బంధు మిత్రులున్నప్పటికీ అమ్మానాన్నలు మాత్రమే నిజమైన శ్రేయోభిలాషులని పిల్లలందరూ గుర్తించి వారి మాటలకు గౌరవమిచ్చి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి.


💖ఉద్యోగాల నెపంతో ఇతర ప్రాంతాలకో, విదేశాలకో వెళ్లిపోయి అమ్మానాన్నలను విస్మరించడమంటే పిల్లలు తమ బాధ్యతల నుంచి మనస్పూర్తిగా తప్పుకున్నట్లే. అమ్మానాన్నలపై నిర్లక్ష్యంవహిస్తే…భవిష్యత్‌లో తమకూ ఇంతకంటే దుర్భరమైన పరిస్థితే తప్పదన్న కఠోర వాస్తవాన్ని గుర్తించాలి. “ఫాదర్స్ డే” అంటూ ఏడాదికోసారి హడావుడి చేయడం, గొప్ప కోసం బహుమతులు కొనివ్వడం వల్ల కృత్రిమత్వం కనబడ్డమే తప్ప నిజంగా ఒరిగేదేమీ ఉండదు.


💖ఈ ప్రపంచంలో తమకంటూ ఓ గుర్తింపునిచ్చిన  తండ్రిని గౌరవించేందుకు ప్రత్యేకించిన ఈ పండుగ సందర్భంగా అందరికీ పితృదినోత్సవ శుభాకాంక్షలు.🙏

పితృసమానులు

 జనితా చోపనేతా చ యశ్చ విద్యా౦ ప్రయచ్ఛతి|

అన్నదాతా భయత్రాతా పంచైతే పితరః స్మృతాః||


కన్న తండ్రి, ఉపనయనము చేసినవాడు, విద్యనెర్పినవాడు, అన్నము పెట్టినవాడు, భయపడినప్పుడు కాపాడెడివాడు ఈ ఐదుగురూ తండ్రులని చెప్పబడు చున్నారు....

--------------------

అన్నదాతా భయత్రాతా విద్యాదాతాతథైవచ|

జనితాచోఽపనేతాచ పఞ్చైతే పితరస్స్మృతాః||

[చాణక్య నీతి] 

ఆకలిగొన్నవానికి అన్నంపెట్టినవాడు, ఆపదలోఉన్నవాని భయంపోగొట్టిన వాడు, అజ్ఞానాంధకారంలో ఉన్నవానికి జ్ఞాన దానము(విద్యాదానం)చేసినవాడు, నీపుట్టుకకు కారణమైన వాడు, ఆచార్యత్వం వహించి ఉపనయనాది సంస్కారాలు చేసినవాడు, ఈ ఐదుగురూ పితృసమానులు.....

బలిష్టులు అగుట కొరకు

 శరీరం కృశించిన వారు బలిష్టులు అగుట కొరకు - 


         ఏదైనా వ్యాధి మూలాన కాని లేక ఎల్లప్పుడూ బలహీనంగా ఉండేవారు ఈ యోగముని ఉపయోగించడం వలన మంచి బలవంతులుగా తయారు అవ్వొచ్చు. 


               గొధుమలు , సీమ బాదం పప్పు, నల్లతుమ్మ బంక, పటికబెల్లం సమాన బాగాలుగా చేసి నిలువ చేసుకొని ఉంచుకోవాలి . రోజు రెండు పూటలా పూటకు ఒక లడ్డు తిని అనుపానంగా ఒక గ్లాస్ ఆవుపాలు తాగుతూ ఉంటే సన్నగా అస్థిపంజరంలా క్రుశించిపోయిన వారు తిరిగి బలిష్టులు అగుదురు. 


      మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథాలను చదవగలరు.


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   

యోగవాసిష్ఠ రత్నాకరము*

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము


2-5


సాధూపదిష్టమార్గేణ యన్మనోఙ్గవిచేష్టితమ్‌ 

తత్పౌరుషం తత్సఫలమన్యదున్మత్త చేష్టితమ్‌. 


మహాత్ములగు సాధువు లుపదేశించు మార్గము ననుసరించుచు గావించు మనోవాక్కాయ ఇంద్రియాదుల చేష్టయే పురుషప్రయత్న మనఁబడును. అట్టి ప్రయత్నమే సఫలమగును. తద్వ్యతిరిక్తమైనది ఉన్మత్తుని(పిచ్చివాని) చేష్టయే యగును. 


2-6


యో యమర్థం ప్రార్థయతే తదర్థం చేహతే క్రమాత్‌ 

అవశ్యం స తమవాప్నోతి న చేదర్ధాన్నివర్తతే.


ఎవ రే పదార్థమును గోరుదురో, వారు దానికొరకై శాస్త్రోక్త క్రమమున చేష్టలు సలుపుచు, మధ్య ప్రయత్నమును విరమింపకున్నచో క్రమముగ నద్దానిని తప్పక పొందుదురు. 


2-7


ప్రాక్తనం చైహికం చేతి ద్వివిధం విద్ధి పౌరుషమ్‌ 

ప్రాక్తనోఽ ద్యతనేనాశు పురుషార్థేన జీయతే.


ఓ రామచంద్రా! పూర్వజన్మకృతము, ఇహజన్మకృతము అని పురుషప్రయత్నమును రెండు విధములుగ నెఱుఁగుము. అందు పూర్వజన్మకృత పురుషప్రయత్నము ఈ జన్మయందు గావింపబడిన పురుషప్రయత్నముచే శీఘ్రముగ జయింపబడుచున్నది.


2-8


యత్నవద్భిర్ధృఢాభ్యాసైః ప్రజ్ఞోత్సాహ సమన్వితైః మేరవోఽ పి నిగీర్యన్తే కైవ ప్రాక్పౌరుషే కథా.


ప్రయత్నవంతులును, దృఢభ్యాసానిరతులును, ఉత్సాహవంతులును నగు వారు మేరువునుగూడ జీర్ణమొనరించుకొనగలరు. ఇక వారికి అదృష్ట మొక లెక్కలోనిదా?


2-9


శాస్త్రనియత్రిత పౌరుష పరమా పురుషస్య పురుషతా యా స్యాత్‌ 

అభిమతఫలభరసిద్ధ్యై భవతి హీ సైవాన్యథా త్వనర్థాయ. 


శాస్త్రానుశాసితములగు కర్మల నాచరించుటయే, శుభఫలప్రదమగు పురుష ప్రయత్నము; తదితరములు అనర్థదాయకములు; వ్యర్థములు అయియున్ననవి.


2-10


యథా సంయతతే యేన తథా తేనానుభూయతే స్వకర్మైవేతి చాస్తేఽ న్యా వ్యతిరిక్తా న దైవదృక్‌. 


ఎవడెట్లు ప్రయత్నించునో, ఆతడు దానిఫలము నట్లే యనుభవించును, పూర్వజన్మలందలి స్వకర్మయే (ఫలావస్థయందిపుడు) 'దైవ' మని, “ప్రారబ్ధ'మని చెప్పబడుచున్నది. అట్లు తన కర్మకంటె వేఱుగా 'దైవము' గాని, 'ప్రారబ్ధము' గాని యేమియు లేదు.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-11

ఉచ్ఛాస్త్రం శాస్త్రితం చేతి ద్వివిధం పౌరుషం స్మృతమ్‌ తత్రోచ్ఛాస్త్రమనర్థాయ పరమార్థాయ శాస్త్రితమ్‌.


పురుష ప్రయత్నము శాస్త్ర విరుద్ధమని శాస్త్రానుకూలమని రెండు విధములుగ చెప్పబడినది. అందు శాస్త్రవిరుద్ధ మైనది అనర్థము కొఱకును, శాస్త్రానుకూలమైనది పరమార్థము (మోక్షము) కొఱకునై యున్నది. 


2-12

ద్వౌ హుడావివ యుద్ధ్యేతే పురుషార్థౌ సమాసమౌ ప్రాక్తనశ్చైహికశ్చైవ శామ్యత్యత్రాల్పవీర్యవాన్‌.


పూర్వజన్మ యొక్కయు, ఈ జన్మయొక్కయు సమాన, అసమాన పురుష ప్రయత్నములు రెండు పొట్టేళ్ళవలె పరస్పరము యుద్ధము చేసికొనును. అందు అల్పబలము కలది ఓడిపోయి క్షయించును. 


2-13

అతః పురుషయత్నేన యతితవ్యం యథా తథా 

పుంసా తన్త్రేణ సద్యోగాద్యేనాశ్వద్యతనో జయేత్‌. 


కాబట్టి మనుజుడు శాస్త్రోక్తనియమ సత్సాంగత్యాది పురుష ప్రయత్నముచే, పూర్వజన్మ పురుష ప్రయత్నము జయింపబడులాగున యత్నింపవలయును.


2-14

పరం పౌరుషమాశ్రిత్య దన్తైర్దన్తాన్విచూర్ణయవ్‌ శుభేనాశుభముద్యుక్తం ప్రాక్తనం పౌరుషం జయేత్‌.


ప్రబల పురుషప్రయత్నము నాశ్రయించి పండ్లచే పండ్లను కొఱికి (ఏవిధముగనైనను) విఘ్నమొనర్ప నుద్యుక్తమగు పూర్వపు అశుభ పురుషప్రయత్నమును, ఇప్పటి శుభప్రయత్నములచే జయింపవలయును. 


2-15

తావత్తావత్ర్పయత్నేన యతితవ్యం సుపౌరుషమ్‌ ప్రాక్తనం పౌరుషం యావదశుభం శామ్యతి స్వయమ్‌. 


పూర్వపు అశుభయత్నము స్వయముగ శమించిపోనంతవరకు ఉత్తమ పురుషప్రయత్నము ద్వారా మనుజుడు యత్నించుచునే యుండవలెను. 


2-16

దోషః శామ్యత్యసందేహం ప్రాక్తనోఽ ద్యతనైర్గుణైః 

దృష్టాన్తోఽ త్ర హ్యస్తనస్య దోషస్యాద్యగుణైః క్షయః.


ఈ జన్మయందలి శుభపురుషప్రయత్నముచే పూర్వజన్మపు అశుభపురుషప్రయత్నము  నిస్సందేహముగ శమించిపోవును. గత దినమందలి అజీర్ణాది దోషములు నేటి ఔషధాది గుణములచే క్షయించుటయే ఇచట దృష్టాంతము.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-23

ప్రత్యక్షమావముత్సృజ్య యోఽ నుమానము పైత్యసౌ స్వభుజాభ్యామిమౌ సర్పావితి ప్రేక్ష్య పలాయతే. 


ప్రత్యక్ష శ్రుతి ప్రమాణమును, ప్రత్యక్షమగు ఇహజన్మ పురుష ప్రయత్నమును వీడి అనుమానసిద్ధమగు పూర్వజన్మపు “అదృష్టము” నెవడు ఆశ్రయించునో అట్టివాడు తన భుజములనే సర్పములని తలంచి పరుగిడువాడే యగును. (పిచ్చివాడని భావము). 


2-24

దైవం సంప్రేరయతి మామితి దగ్ధధియాం ముఖమ్‌ 

అదృష్టశ్రేష్ఠ దృష్టీనాం దృష్ట్వా లక్ష్మీర్నివర్తతే. 


పురుష ప్రయత్నము చేతనే తమయొక్క లక్ష్యమును బొందినట్టి (విశ్వామిత్రాది) శ్రేష్ఠపురుషులయొక్క దృష్టిని తెలిసికొననివారును, “అదృష్టము” నన్ను ప్రేరేపించుచున్నది, అని తలంచువారునగు బుద్ధిహీనుల ముఖమును జూచి లక్ష్మి (సంపద) పారిపోవుచున్నది. 


2-25

తస్మాత్పురుషయత్నేన వివేకం పూర్వమాశ్రయేత్‌ 

ఆత్మజ్ఞానమహార్థాని శాస్త్రాణి ప్రవిచారయేత్‌. 


కాబట్టి పురుషప్రయత్నముచే మొదటనే వివేకమును (సాధన చతుష్టయ సంపత్తి మున్నగువానిని) ఆశ్రయించవలెను. మఱియు ఆత్మజ్ఞాన (ప్రతిపాదకములును, గంభీరార్థ యుక్తములుగు శాస్త్రములను బాగుగ విచారింపవలయును.


2-26

చిత్తే చిన్తయతామర్థ యథాశాస్త్రం నిజేహితైః 

అసంసాధయతామేవ మూఢానాం ధిగ్దురీప్సితమ్‌. 


శాస్త్ర ప్రకారము శ్రవణ మననాది చేష్టలచే పరమార్థభూతమగు ఆత్మతత్త్వమును చింతింపనివారును, కావుననే అట్టి ఆత్మతత్త్వమును సాధింపనివారునగు మూఢులయొక్క మహా నరకాది ప్రదమగు దుష్టభోగేచ్ఛకు ధిక్కారమగుగాక! 


2-27

దైన్యదారిద్ర్యదుఃఖార్తా అప్యన్యే పురుషోత్తమాః పౌరుషేణైవ యత్నేన యాతా దేవేంద్రతుల్యతామ్‌. 


ఉత్తమ పురుషులు కొందఱు దైన్య దారిద్ర్యాది దుఃఖములచే పీడితులై యున్నను, తమయొక్క పురుషప్రయత్నము చేతనే దేవేంద్రునితో సమానులైరి.


2-28

ఆబాల్యాదలమభ్యస్తైః శాస్త్రసత్సఙ్గమాదిభిః 

గుణైః పురుషయత్నేవ స్వార్థః సంప్రాప్యతే యతః.


బాల్యకాలము నుండియు బాగుగ అభ్యసింపబడిన శాస్త్ర సత్సాంగత్యాది గుణములచేతను పురుషప్రయత్నముచేతను ఆత్మప్రాప్తి రూపఫలము సిద్ధించును.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-17

అసద్దైవమధః కృత్వా నిత్యముద్రిక్తయా ధియా 

సంసారోత్తరణం భూత్యై యతేతాఽ ధాతుమాత్మని. 


అసత్యమగు అదృష్టమును క్రిందకు త్రోచివైచి నిరంతరము అధికోత్సాహముతో గూడిన బుద్ధితో సంసారసాగరమును దాటు నిమిత్తము శమ దమ శ్రవణ మననాది సంపత్తి కొరకై పురుష ప్రయత్నము గావింపవలెను. 


2-18

న గన్తమమద్యోగైః సామ్యం పురుషగర్దభైః 

ఉద్యోగస్తు యథా శాస్త్రం లోకద్వితయసిద్ధయే. 


గర్దభ (గాడిద) సమానులగు ప్రయత్నరహితులైన మనుజులవలె ఎన్నటికిని ఉండరాదు. ఇహలోక పరలోక (మోక్ష) సిద్ధి కొరకై శాస్త్రానుసారము ప్రయత్నము సలుపుచుండవలెను. 


2-19

సంసార కుహరాదస్మాన్నిర్గన్తవ్యం స్వయం బలాత్‌ పౌరుషం యత్నమాశ్రిత్య హరిణేవారిపంజరాత్.


ఉత్తమ పురుషప్రయత్న మాశ్రయించి, ఈ సంసారమను గోతినుండి శత్రు (మనుష్యనిర్మిత) పంజరమునుండి సింహమువలె స్వయముగ బలపూర్వకముగ బయల్వెడలవలెను.


2-20

ప్రత్యహం ప్రత్యవేక్షేత దేహం నశ్వరమాత్మనః సంత్యజేత్పశుభిస్తుల్యం శ్రయేత్సత్పురుషోచితమ్‌.


ప్రతిదినము 'ఈ శరీరము నశ్వరమైనది' అను విషయమును చింతన చేయవలెను. కావుననే పశువులవలె విషయభోగములందాసక్తి గలిగియుండుటను త్యజించవలెను. మఱియు సత్పురుషోచితములగు సాధుజన సాంగత్య

సచ్ఛాస్త్రాదుల నాశ్రయించవలెను.


2-21


కించిత్కాన్తాన్నపానాదికలిలం కోమలం గృహే 

వ్రణే కీట ఇవాస్వాద్య వయః కార్యం న భస్మసాత్.

వ్రణమందు కీటకమువలె, ఇంటియందు అల్పములగు స్త్రీ, అన్నపానాది కోమల పదార్థములను ఆస్వాదించుచు ఆయువును నాశమొనర్పరాదు. 


2-22


శుభేన పౌరుషేణాశు శుభమాసాద్యతే ఫలమ్‌ అశుభేనాశుభం నిత్యం దైవం నామ న కించన. 

శుభపురుష ప్రయత్నముచే శుభఫలమున్ను, అశుభప్రయత్నముచే అశుభఫలమున్ను శీఘ్రముగ సదా లభించుచున్నది. అంతేగాని అదృష్టము అనునది మధ్య  ఒకింతైనను లేదు.

[18/06, 11:15 am] K Sudhakar Adv Br: *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-29

ఆలస్యం యది న భవేజ్జగత్యనర్థః 

కో న స్యాదృహుధనికో బహ్యశ్రుతో వా ఆలస్యాదియమవనిః ససాగరాన్తా  

సంపూర్ణా నరపశుభిశ్చ నిర్ధనైశ్చ


ఈ ప్రపంచమున అనర్థహేతువైనట్టి 'సోమరితనము' అనునది లేనిచో ఎవరు మహాధనికుడు, మహావిద్వాంసుడు కాకయుండును? సోమరితనమునలననే ఈ సముద్రపర్యంతమగు పృథివి ఆత్మజ్ఞానరహితులగు నరపశువులచేతను, ధనహీనులగు మనుజుల చేతను పూర్ణమై యున్నది.


2-30

బాల్యే గతేఽ విరతకల్పితకేలిలోలే 

దోర్దండ మండితవయః ప్రభృతి ప్రయత్నాత్ సత్సంగమైః పదపదార్థ విశుద్ధ బుద్ధిః 

కుర్యాన్నరః స్వగుణదోషవిచారణాని.  


కల్పిత క్రీడలతో నిరంతరము చంచలమై తనరు బాల్యము గడచినతోడనే, గురుశుశ్రూషాది సహితముగ నిత్యానిత్య వస్తువివేకాది సుగుణముల నలవరచు కొని, యౌవనమునుండియే సత్సంగ మొనర్చుచు స్వకీయ గుణదోషములను పరీక్షించుకొనుచుండవలెను. 


2-31

తస్మాత్ర్పాక్పౌరుషాద్దైవం నాన్యత్తత్ర్పోజ్ఝ్యదూరతః సాధుసంగమసచ్చా స్త్రైర్జీవ ముత్తారయేద్బలాత్‌. 


పూర్వజన్మయందలి పురుషప్రయత్నముకంటె వేఱుగ అదృష్టము అనునది లేదు. అద్దానిని దూరముగ తొలగించివైచి సాధుజన సాంగత్య, సచ్ఛాస్త్రాదులచే జీవుని సంసారసాగరము నుండి బలవంతముగ తరింపజేయవలెను.


2-32

ప్రాక్స్వకర్మేతరాకారం దైవం నామ న విద్యతే 

బాలః ప్రబలపుంసేవ తజ్ఞేతుమిహ శక్యతే.


పూర్వపు స్వకర్మలు కాక అదృష్ట మనునది వేరొకటి లేదు. బలశాలియగు పురుషుఁడు బాలుని లోబర్చుకొనఁ గలిగినట్లు అనాయాసముగా అదృష్టమును జయించవచ్చును. 


2-33

హ్యస్తనోదుష్ట ఆచార ఆచారేణాద్య చారుణా 

యథాశు శుభతామేతి ప్రాక్తనం కర్మ తత్తథా.  


నిన్నటి దుష్ట ఆచరణము నేటి ఉత్తమ ఆచరణద్వారా ఎట్లు శీఘ్రముగ శుభత్వమును బొందుచున్నదో, పూర్వకర్మయున్ను ఇప్పటికర్మచే శుద్ధత్వమును బొందుచున్నది. 


2-34

తజ్జయాయ యతన్తే యే న లోభలవలంపటాః

తే దీనాః ప్రాకృతా మూఢాః స్థితా దైవపరాయణాః. 


ఆ పూర్వజన్మకృతకర్మను జయించుటకొఱకు యత్నింపనివారును, 'అదృష్ట' పరాయణులు నగు విషయసుఖలేశ లంపటులైన మనుజులు దీనులును, పామరులును, మూఢులు నగుదురు.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-35

పౌరుషేణ కృతం కర్మ దైవాద్యదభినశ్యతి 

తత్ర నాశయితుర్‌జ్ఞేయం పౌరుషం బలవత్తరమ్‌. 


ఇప్పటి పురుష ప్రయత్నము విఫలమైనచో పూర్వజన్మమందలి పురుష ప్రయత్నము ప్రబలముగ నున్నదని గ్రహింపవలెను. 


2-36

తస్మాత్పౌరుషమాశ్రిత్య సచ్ఛా స్త్రై స్సత్సమాగమైః 

ప్రజ్ఞామమలతాం నీత్వా సంసారజలధిం తరేత్‌.


కాబట్టి పురుష ప్రయత్నము నాశ్రయించి, సచ్ఛాస్త్ర, సత్సాంగత్యాదుల ద్వారా బుద్ధిని నిర్మల మొనర్చి సంసార సాగరమును దాటి వేయవలెను. 


2-37

యస్తూదార చమత్కారః సదాచార విహారవాన్‌

స నిర్యాతి జగన్మోహాన్మృగేన్ద్రః సంసారజలధిం తరేత్


ప్రయత్న మొనర్చుటయందు కుశలుడును సజ్జనులగు జ్ఞానులైన మహాత్ముల యొక్క సదాచారములందు విహరించువాడునగు మనుజుడు పంజరము (బోను) నుండి సింహమువలె ఈ జగత్తు యొక్క మాయామోహము నుండి బయటకు వెలువడును.


2-38

కశ్చిన్మాం ప్రేరయత్యేవమిత్యనర్థకుకల్పనే 

యః స్థితో దృష్టముత్సృజ్య త్యాజ్యోఽ సౌ దూరతోఽ ధనుః.


పురుష ప్రయత్నమును విడచి, “ ఎవరో నన్ను ప్రేరేపించుచున్నారు” అని అనర్థకల్పనలందు ఊగులాడు అధముడగు వ్యక్తిని దూరముగ పరిత్యజించుటయే మేలు. 


2-39

వ్యవహార సహస్రాణి యాన్యుపాయాన్తి యాన్తి చ 

యథా శాస్త్రం విహర్తవ్యం తేషు త్యక్త్వా సుఖాసుఖే. 


ఏ అనేక వ్యవహారములు మనుజునియొద్దకు వచ్చుచు పోవుచు నున్నవో, వానియందు ప్రియ, అప్రియముల యెడల రాగ, ద్వేషములు లేనివాడై, సుఖదుఃఖ భావనను వీడి, సమబుద్ధి గల్గి శాస్త్రానుసారము ప్రవర్తింపవలెను. 


2-40

యథాశాస్త్రమనుచ్ఛిన్నాం మర్యాదాం స్వామనుజ్ఝతః 

ఉపతిష్ఠన్తి సర్వాణి రత్నాన్యంబునిధావివ.


శాస్త్రానుసారమగు అఖండితమైన తన మర్యాదను (ప్రయత్నమును) త్యజింపనివానికి, సమస్త అభీష్టములును సముద్రమునందు రత్నమువలె సంప్రాప్తించుచున్నవి.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-48

ప్రాప్య వ్యాధివినిర్ముక్తం దేహమల్పాధి వేదనమ్‌ తథాత్మని సమాదధ్యాద్యథా భూయో న జాయతే.  


రోగరహిత మైనట్టియు, స్వల్పమానసిక దుఃఖముతో గూడినట్టియు దేహమును బొంది జీవుడు మరల జన్మింపకుండులాగున ఆత్మజ్ఞానము కొఱకును, చిత్తసమాధానము కొఱకును యత్నింపవలెను.


2-49

దైన్యదారిద్ర్యదుఃఖార్తా అపి సాధో నరోత్తమాః 

పౌరుషేణైవ యత్నేవ యతా దేవేంద్రతుల్యతామ్‌.


సాధూ! రామచంద్రా! దైన్యదారిద్ర్య దుఃఖములచే పీడింపబడియు, ప్రయత్నశీలురగు మనుజు లనేకులు పురుష ప్రయత్న బలముచే ఇంద్రసములైరి. 


2-50

భావాభావ సహస్రేషు దశాసు వివిధాసు చ స్వపౌరుషవశాదేవ నివృత్తా భూతజాతయః. 


జీవులు, వేలకువేలుగ సంభవించు ఆపదలను, సంపదలను, ఇతరములగు దశలను తమ పురుషప్రయత్న బలమువలనే అవలీలగ దాటివైచిరి.


2-51

శాస్త్రతోగురుతశ్చైవ స్వతశ్చేతి త్రిసిద్ధయః 

సర్వత్ర పురుషార్థస్య న దైవస్య కదాచన.


శాస్త్రవిచారణ, గురూపదేశము, స్వప్రయత్నము అను ఈ మూడింటి సాయమువలననే పురుషార్థము సర్వత్ర సిద్ధించుచున్నది. దీనికి అదృష్టముతో సంబంధము లేదు. 


2-52

అశుభేషు సమావిష్టం శుభేష్వేవావతారయేత్‌ ప్రయత్నాచ్చిత్తమిత్యేష స్సర్వశాస్త్రర్థసంగ్రహః. 


అశుభకార్యములందు ప్రవేశించిన చిత్తమును ప్రయత్నముచే శుభకార్యములందే లగ్న మొనర్పజేయవలెను. ఇదియే సర్వశాస్త్రముల యొక్క సిద్ధాంత సంగ్రహము. 


2-53

యత్ శ్రేయో యదతుచ్ఛం చ యదపాయ వివర్జితమ్‌ 

తత్తదాచర యత్నేన పుత్రేతి గురవః స్థితాః. 


“ఓ పుత్రులారా! (శిష్యులారా!) ఏది శ్రేయోదాయక మైనదో, ఏది పరమార్థ సత్య మైనదో, ఏది నాశరహిత మైనదో, దానినే ప్రయత్నముచే నాచరింపుడు!” (అట్టి నిత్య, సత్య, శుద్ధ ఆత్మ కొరకే ప్రయత్నించుడు!) అని మహాత్ములగు గురుజనులు హెచ్చరిక చేయుచున్నారు.

[ *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-41

క్రియయా స్పన్దధర్మిణ్యా స్వార్థసాధకతా స్వయమ్‌ 

సాధుసంగమ సచ్ఛాస్త్రతీక్ష్ణ యోన్నీయతే ధియా. 


గురుశుశ్రూషా, శ్రవణాది క్రియలచేతను; సాధు సాంగత్య, సచ్ఛాస్త్రాదుల చేతను తీక్ష్ణ మొనర్పబడిన బుద్ధిచే స్వయముగ ఆత్మ ఉద్ధరింపబడుచున్నది. ఇదియే అద్దాని 'స్వార్థసాధకత్వము'. 


2-42

అనన్తం సమతానన్దం పరమార్థం విదుర్బుధాః 

స యేభ్యః ప్రాప్యతే నిత్యం తే సేవ్యాః శాస్త్రసాధవః. 


ఆత్మజ్ఞానముచే అజ్ఞానకృత వైషమ్యము నివృత్తి కాగా, ఏ అనంతమై, సమమై పరిపూర్ణమైనట్టి ఆనందము ప్రాప్తించుచున్నదో దానినే విజ్ఞులు పరమార్థమని చెప్పుదురు.అయ్యది యెవరి వలన పొందబడుచున్నదో,అట్టి శాస్త్రములను,సాధువులను నిరంతరము సేవించవలెను.


2-43

నిత్యం స్వపౌరుషాదేవ లోక ద్వయహితం భవేత్‌ 

హ్యస్తనీ దుష్క్రియాభ్యేతి శోభాం సత్క్రియయా యథా


2-44

అద్యైవం ప్రాక్తనీ తస్మాద్యత్నాద్యః కార్యవాన్‌ భవేత్ 

కరామలకవద్ధృష్టం పౌరుషాదేవ తత్ఫలం 

మూఢః ప్రత్యక్షముత్సృజ్య దైవమోహే నిమజ్జతి. 


నిజపురుష ప్రయత్నబలముననే ఇహపరలోకముల రెండిటియందు మంచి చేకూరును. పూర్వపు దుష్కర్మలు ఇప్పటి ప్రాయశ్చిత్తాది సత్కార్యములచే శుభములుగ మారి, శోభను గూర్చుకొనును. కాబట్టి మనుజుడు కార్యశీలుడు కావలెను; పురుష ప్రయత్న బలముచే ఫలము, అరచేతియందలి ఉసిరి కాయవలె లభించును. మూఢుడే ప్రత్యక్షమును బరిత్యజించి అదృష్టరూప మోహమున నిమగ్ను డగును.


2-45

బుద్ధైవ పౌరుషఫలం పురుషత్వమేత 

దాత్మప్రయత్నపరతైవ సదైవ కార్యా 

నేయా తతః సఫలతాం పరమామథాసౌ 

సచ్ఛాస్త్రసాధుజనపండితసేవనేన.


పురుష ప్రయత్నముచే ఆత్మజ్ఞానమను ఫలమును బొందుటయే ఈ పురుషజన్మ యొక్క ఫలము; లేనిచో ఈ పురుషజన్మ నిరర్థకము - అని యెఱింగి సదా ఆత్మజ్ఞానమును గూర్చిన ప్రయత్నమందే తత్పరుడై యుండి అట్టి ప్రయత్నమును సచ్ఛాస్త్ర, సాధుజన పండిత సేవనము ద్వారా ఆత్మజ్ఞానఫలలాభముచే పూర్ణముగా సఫల మొర్పవలెను. 


2-46

దైవపౌరుషవిచారచారుభి

శ్చేదమాచరిత మాత్మపౌరుషమ్‌ 

నిత్యమేవ జయతీతి భావితైః 

కార్య ఆర్యజనసేవయోద్యమః.


అదృష్ట పురుష ప్రయత్నముల రెండిటి బలముల నిట్లు విచారించి, పురుష ప్రయత్నము నాశ్రయించియే ఆర్యులు ఫలము నొందుచున్నారు. కనుక ఆర్యజన సేవితమగు ప్రయత్నరూప శ్రవణమననాదుల నాశ్రయించి జ్ఞానమును బడయనగును. 


2-47

జన్మ ప్రబన్ధమయమామయమేష జీవో 

బుద్ధ్యైహికం సహజపౌరుషమేవ సిద్ద్యై 

శాన్తిం నయత్వవితథేన వరౌషధేన 

మృష్టేన తుష్టపరపండిత సేవనేన.


జీవు డీ జన్మయందు గావింపబడిన శాస్త్రబోధితమగు పురుష ప్రయత్నమే మోక్షసిద్ధికి సాధనమని యెఱింగి; నిత్యసంతుష్టులును, సర్వోత్కృష్టులు నగు 

బ్రహ్మవేత్తలయొక్క సేవనమను అమోఘ, మధుర, ఉత్తమ ఔషధముచే జన్మపరంపరాయమగు సంసారరోగమును శమింపజేసుకొనునుగాక!

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-66

అశుభేషు సమావిష్టం శుభేష్వేవావతారయ 

స్వం మనః పురుషార్థేన బలేన బలినాం వర.


బలవంతులలో శ్రేష్ఠుఁడవగు ఓ రామచంద్రా! అశుభ కార్యములందు ప్రవేశించి నీ మనస్సును అటునుండి త్రిప్పి పురుష ప్రయత్న బలముచే శుభకార్యములందే ప్రవేశపెట్టుము.


2-67

అశుభాచ్చాలితం యాతి శుభం తస్మాదపీతరత్‌ జన్తోశ్చిత్తంతు శిశువత్తస్మాత్త చ్ఛాలయేద్బలాత్‌.


మనుజుని చిత్తము బాలుని చందమున అశుభమార్గము నుండి నివారింపబడినచో, శుభమార్గమున రెండింతలు వేగముగ జనును. అట్లే శుభమార్గము నుండి నివారింపబడిన, అశుభమార్గమున రెండింతలు వేగముగ జనును. కాబట్టి ఆ చిత్తమును బలాత్కారముగ అశుభమార్గమునుండి నివారించి శుభమార్గముననే ప్రవేశపెట్టవలెను. 


2-68

సమతా సాంత్వనేనాశు నద్రాగితి శనైః శనైః 

పౌరుషేణైవ యత్నేన పాలయేచ్చిత్త బాలకమ్‌. 


ఈ ప్రకారముగ చిత్తమను బాలకుని శీఘ్రముగ రాగద్వేషాది వైషమ్యు త్యాగముచే స్వాభావిక సమత్వమందు నియోగించి పురుష ప్రయత్నముచే మెల్లమెల్లగ దానిని ఓదార్చుచు ఆత్మస్వరూపమున లగ్న మొనర్పవలెనేగాని హఠముగా నిరోధింపరాదు.


2-69

ఇదానీమపి తే యాతి ఘనతాం వాసనానఘ అభ్యాసవశత స్తస్మాచ్ఛుభాభ్యాస ముపాహర. 


పాపరహితుడవగు రామచంద్రా! ఈ జన్మయందును అభ్యాసవశమున నీయొక్క వాసనలు గట్టిపడును. కాబట్టి శుభవాసనలనే మరల మరల అభ్యసింపుము. 


2-70

శుభవాసనయా యుక్తస్తదత్ర భవ భూతయే 

పరం పౌరుషమాశ్రిత్య విజిత్యేంద్రియపంచకమ్‌.


  కావున, నీవు మోక్షమను ఐశ్వర్యముకొరకై గొప్ప పురుష ప్రయత్నము నాశ్రయించి పంచేంద్రియములను జయించి యిట శుభవాసనలతోనే కూడి యుండుము.


2-71

అవ్యుత్పన్నమనా యావద్భవానజ్ఞాత తత్పదః 

గురుశాస్త్రప్రమాణైస్తు నిర్ణీతం తావదాచర.


ఎంతవఱకు నీకు బోధ కలుగకుండునో, ఎంతవఱకు నీవు ఆత్మపదము నెఱుఁగకుందువో, అంతవఱకు గురు, శాస్త్ర ప్రమాణముల (యుక్తి, అనుభవాదులచే) నిర్ణయింపబడినదానినే ఆచరింపుము. (శుభవాసనలనే అభ్యసింపుమని భావము.)

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-60

విశ్వామిత్రేణ మునినా దైవముత్సృజ్య దూరతః పౌరుషేణైవ సంప్రాప్తం బ్రాహ్మణ్యం రామ నాన్యథా. 


(ఇటనున్న ఈ) విశ్వామిత్ర మునీంద్రుడు ఆదృష్టమును దూరముగ తొలగించివైచి తన పురుషప్రయత్నముచేతనే బ్రాహ్మణత్వమును బొందెనుగాని మఱియొక విధముగ కాదు. 


2-61

ద్వివిధో వాసనావ్యూహః: శుభశ్చైవాశుభశ్చ తే 

ప్రాక్తనో విద్యతే రామ ద్వయోరేకతరోఽథవా.


ఓ రామచంద్రా! వాసనాసమూహము శుభమని, అశుభమని రెండు విధములు. పూర్వజన్మపువాసనా

సమూహము ఈ రెండిటిలో ఏదియో యొకటై యుండును. 


2-62

వాననౌఘేన శుద్ధేన తత్ర చేదద్యనీయసే 

తత్క్రమేణ శుభేనైవ పదం ప్రాప్స్యపి శాశ్వతమ్‌.


అందు పూర్వపు శుద్ధవాసనా సమూహముచే నీవిపుడు ప్రేరితుడనగుచో, క్రమముగ ఇప్పటి శుభప్రయత్నముచేతనే నీవు శాశ్వతపదమగు మోక్షమును పొందగలవు.


2-63

అథచేదశుభో భావస్త్వాం యోజయతి సంకటే 

ప్రాక్తనస్తదసౌ యత్నాద్‌ జేతవ్యో భవతా బలాత్‌. 


ఒకవేళ పూర్వజన్మపు అశుభవాసన నిన్నిపుడు సంకటము వైపునకు ఈడ్చుచో, అద్దానిని నీవిపుడు ఇప్పటి అధిక శుభ పురుష ప్రయత్నముచే బలపూర్వకముగ జయించవలెను. 


2-64

ప్రాజ్ఞశ్చేతనమాత్రస్త్వం న దేహస్త్వం జడాత్మకః 

అన్యేన చేతసా తత్తే చేత్యత్వంక్వేవ విద్యతే.


ఓ రామచంద్రా! నీవు ప్రజ్ఞారూపుఁడవు, చైతన్యమాత్రుఁడవే కాని జడమగు దేహము కావు. నీవు స్వప్రకాశుఁడవు. అట్టి చిన్మాత్ర రూపుఁడవగు నీవు మఱియొక చైతన్యముచే ప్రకాశింపబడుటలేదు. 


2-65

శూభాశుభాభ్యాం మార్గాభ్యాం వహన్తీ వాసనాసరిత్‌ 

పౌరుషేణ ప్రయత్నేన యోజనీయా శుభే పథి.


వానన యనునది శుభ, అశుభ మార్గముల రెండిటియందును ప్రవహించుచున్నది. అద్దానిని పురుషప్రయత్నముచే శుభమార్గము నందే త్రిప్పవలెను.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-54

భోక్తా తృప్యతి నాభోక్తా గన్తా గచ్ఛతి నాగతిః 

వక్తా వక్తి న చావక్తా పౌరుషం సఫలం నృణామ్‌.


భుజించినవానికే తృప్తి కలుగుచున్నది. భుజింపనివానికి తృప్తి ఎట్లు చేకూరగలదు? నడచుచున్నవాడే అరుగ గలడు; నడువనివాడెట్లు చనగలడు? వక్తయే చెప్పగలడు; మౌని కాదు గదా? కావున పురుషప్రయత్నమే జనులకు సిద్ధిదాయకమని స్పష్టమగుచున్నది. 


2-55

పౌరుషేణ దురన్తేభ్యః సంకటేభ్యః సుబుద్ధయః 

సముత్తరన్త్యయత్నేన న తు మోఘతయానయా. 


బుద్ధిమంతులగువారు పురుషప్రయత్నము నాశ్రయించియే అనాయాసముగా గొప్ప సంకటములనుండి విడివడుచున్నారు. అదృష్టమును నమ్మి ఊరక కూర్చుండిన వారిపట్ల నియ్యది సంభవ మగునది కాదు. 


2-56

క్రీయయా స్పందధర్మిణ్యా స్వార్థసాధకతా స్వయమ్‌ సాధుసంగమసచ్ఛాస్త్రతీక్ష్ణ యోన్నీయతే ధియా.


సత్సాంగత్యము, సచ్ఛాస్త్ర విచారణల వలన బుద్ధి తీక్షణము కాగ అట్టి బుద్ధితో గూడిన ప్రయత్నముచే మనుజునకు తానిచ్ఛగించినది లభించును.


2-57

అనంత సమతానందం పరమార్థం స్వకం విదుః 

స యేభ్యః ప్రాప్యతే యత్నాత్‌ సేవ్యాస్తే శాస్త్ర సాధవః.


అనంతమైన సమరూప మైనట్టి అఖండానంద ప్రాప్తియే పరమ పురుషార్థమని పెద్దలందురు. ఇట్టి పరమార్థము వేనివలన లభించునో అట్టి శాస్ర్తములను, సత్పురుషులను తప్పక సేవించవలెను. 


2-58

అబాల్యాదలమభ్యస్తైః శాస్త్ర సత్సంగమాదిభిః

గుణైః పురుషయత్నేన స్వార్థః సంప్రాప్యతే యతః


బాల్యకాలము నుండి సత్సాంగత్య సచ్ఛాస్త్రముల నభ్యసించినచో వీని వలననే అనగా పురుష ప్రయత్నము వలననే, హితకరమగు మోక్షము సంపాదింపబడును. 


2-59

హ్యస్తనీ దుష్క్రియాభ్యేతి శోభాం సత్క్రియయా యథా 

అద్యైవం ప్రాక్తనీ తస్మాద్యత్నాత్‌ సత్కార్యవాన్భనేత్‌.


నిన్న చేసిన చెడ్డపని నేటి సత్కార్యమువలన మంచిగ మారునట్లు పూర్వపు కర్మగూడ ఇప్పటి సత్ర్పయత్నముచే శుభప్రదము కాగలదు. కాబట్టి ప్రయత్నపూర్వకముగ సత్కార్యముల నాచరింపవలెను.

 *యోగవాసిష్ఠ రత్నాకరము*


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము


2-72

అవాన్తరనిపాతీని స్వారూఢాని మనోరథమ్‌ పౌరుషేణేంద్రియాణ్యాశు సంయమ్య సమతాం నయ. 


ఇంద్రియములన్నియు విషయాభిలాషయందు మిగుల ఆరూఢములై, ఐహిక సుఖములందు విశేషముగ వ్రాలుచున్నవి. వానిని పురుషప్రయత్నముచే శీఘ్రముగ సంయమ మొనర్చి మనస్సును సమత్వ మొందింపుము. 


2-73

అపునర్గ్రహణాయాన్తస్త్యక్త్వా సంసారవాసనామ్‌ సంపూర్ణౌ శమ సంతోషావాదాయోదారయా ధియా.


మరల ఎన్నటికిని తిరిగి గ్రహించకుండులాగున సంసార వాసనలు త్యజించివైచి, ఉదారబుద్ధిచే శమ సంతోషములను పూర్ణముగ గ్రహింపుము. 


శ్రీ వాల్మీకీచే రచింపబడిన మోక్షోపాయమగు యోగవాసిష్ఠరత్నాకరంలో ముముక్షు ప్రకరణమున పురుషప్రయత్న వివరణమనే రెండవ అధ్యాయము సమాప్తము.

** 


ముముక్షు ప్రకరణము

*మూడవ అధ్యాయము*

మోక్షసాధనము


శ్రీ వసిష్ఠ ఉవాచ :- 


3-1

నిర్వాణం నామ పరమం సుఖం యేన పునర్జనః 

న జాయతే న మ్రియతే తజ్జ్ఞానాదేవ లభ్యతే.


శ్రీ వసిష్ఠుడు :- ఓ శ్రీరామచంద్రా! దేనిచే జీవుడు మరల ఈ సంసారమున జన్మింపడో, మరణింపడో, అట్టి పరమసుఖమే నిర్వాణము. అయ్యది కేవలము జ్ఞానముచేతనే లభించును. 


3-2

సంసారోత్తరణే జన్తోరూపాయో జ్ఞానమేవ హి 

తపో దానం తథా తీర్థమనుపాయాః ప్రకీర్తితాః.


జీవుడు సంసారమును తరించుటకు జ్ఞానమే ప్రధానమగు ఉపాయము; తపో, దాన, తీర్థాది ఉపాయములు పరంపరాసాధనములే యగునని చెప్పబడినది. 


3-3

రాజవిద్యా రాజగుహ్య మధ్యాత్మజ్ఞానముత్తమమ్‌ జ్ఞాత్వా రాఘవ రాజానః పరాం నిర్దుఃఖతాం గతాః.


మొట్టమొదట రాజుల కుపదేశింపబడుటచే, లేక విద్యలలో శ్రేష్ఠమైన దగుటచే రాజవిద్యయని పిలువబడిన ఈ ఉత్తమ మైనట్టియు, మహారహస్య మైనట్టియు, అధ్యాత్మజ్ఞానమును పూర్వము రాజు లెఱిఁగి పూర్ణముగ దుఃఖరాహిత్యము నొందిరి.


(రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ | 
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్।। భగవద్గీత 9-2


ఈ రాజ విద్య అన్ని రహస్యాలలో అత్యంత లోతైనది. అది విన్నవారిని శుద్ధి చేస్తుంది. ఇది నేరుగా గ్రహించదగినది, ధర్మానికి అనుగుణంగా, ఆచరణలో సులభం మరియు ప్రభావంలో శాశ్వతమైనది అని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పారు.)

సంధ్యావందనం_ఆవశ్యకత

 #సంధ్యావందనం_ఆవశ్యకత


పూర్వం ఒకసారి బ్రాహ్మణ వటువు శృంగేరి జగద్గురువుల దర్శనానికి వచ్చినప్పుడు జగద్గురువులు మంత్రాక్షతలు ప్రసాదిస్తూ అలంకార ప్రాయంగా కనిపిస్తున్న యజ్ఞోపవీతం చూసి సంధ్యావందనం చేస్తున్నావా లేదా అని ఆయనను ప్రశ్నవేస్తే, యజ్ఞోపవీతం ధరించియున్నామే కానీ, సంధ్యావందనం చేయలేకపోతున్నామని ఆ వటువులు జవాబిస్తే జగద్గురువులు ప్రాయశ్చిత్తం చేయించి పునఃసంధ్యావందనం ఆచరించే విధంగా వారిని ఆశీర్వదించి పంపేవారు.


ఇప్పటి పరిస్థితి ఎలా ఉన్నదంటే తమ దర్శనానానికి వచ్చే ఉపనయనం అయిన వటువులు సంధ్యావందనం చేయడం మాట అటుంచి కనీసం యజ్ఞోపవీతం లేకుండా వస్తున్నారు. యజ్ఞోపవీతం ఏమైంది అని ప్రశ్నిస్తే చొక్కా తీసేటప్పుడు బయటకు వచ్చేసిందనో, లేక జీర్ణమయిందనో బదులిస్తున్నారు. ఆరునెలలనుండో, సంవత్సరంనుండో ఇలా యజ్ఞోపవీతం ఒంటిపై లేకుండా తిరుగుతున్న వాళ్ళ పరిస్థితిని చూసి ఆశ్చర్యం వేసింది. ఇప్పటికే ఒకసారి ఉపనయనం అయ్యి ఒంటిమీద యజ్ఞోపవీతం లేకుండా తిరుగుతున్న వటువునకు మరల యజ్ఞోపవీతం వేయించి పంపించే పరిస్థితి వచ్చింది.


ఈ విధంగా శాస్త్ర ధిక్కారం చేసి ధర్మభ్రష్టులై తిరుగుతున్నవారు తప్పకుండా దానికి తగిన ప్రతిఫలము అనుభవించి తీరవలసిందే. దాని ఫలితాలు అనుభవించే సమయములో చింతించవలసి వస్తే ఏ ప్రయోజనమూ ఉండదు. వెనువెంటనే ఆ దుష్ఫలితం కనిపించకపోయినా ఎప్పటికైనా తప్పదు. కాబట్టి జగద్గురువులు ఆదేశాన్ని శిరసావహించి ఉపవీతులందరూ సంధ్యావందనాదులు చేస్తు విధ్యుక్తధర్మాన్ని ఆచరించవలసిన ఆవశ్యకత మనపై ఎంతైనా ఉంది.


--- జగద్గురు శ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారు.

నిత్యాన్వేషణ

 నిత్యాన్వేషణ:



శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అంటే ఎవరు? నిజమైన పాత్రేనా లేక కల్పితమా? వారి గురించి తెలుపగలరు.


శ్రీకాకుళం'పేరుతో రెండు ఊర్లు ఉన్నాయి,ఉత్తరాంధ్ర లో,కృష్ణాజిల్లాలో.ఆంధ్ర' అని ఒక జాతికి కలుపుతూ మహా విష్ణువు' గుడి ఉండుట ఒక ప్రత్యేకమైన విషయమే.ఎందుకనగా మరాఠీ విష్ణు, కన్నడ విష్ణు తమిళ విష్ణు లేదా కళింగ విష్ణు అనే జాతిపేర్లతో విష్ణుమూర్తి గుడులు ఎక్కడా లేవు.

మధ్య భారతంలో క్రీ.శ6 నుండి 14శతాబ్దం వరకు కాలచూరులన రాజవంశం పరిపాలించింది. 6శతాబ్దం ముందు వీరు ఎక్కడ ఉండేవారో తెలియదు.కల్ చురి' అంటే కల్లి' అంటే మీసాలు, చురి 'అనగా కత్తి'అని చరిత్రకారులు వివరణ.బహుశా 'చురకత్తి లాంటి మీసాలు'కలిగిన రాజులు అయిఉండవచ్చు.వీరికే 'కాలాభ్ర' 'హైహయ' ముదిరాజ్' అని కూడా అంటారు.తమిళ రాజ్యాలను బహుశా 3,4 శతాబ్దాలలో అల్లకల్లోలం చేసిన కాలాభ్ర' రాజవంశం వీరే. ఈ హైహయ' వంశస్థులకు. అనగా రాజులకు 'కొక్కుల' లేదా 'కొక్కోల' లేదా 'కోకుల' కొక్కొలని' అని 'బిరుదు' లేదా 'వంశనామం' ఉన్నది.కల్ చూరి' రాజ్యస్థాపకుడు 'కొక్కుల'లేదా 'కొక్కోల'గా భావిస్తారు. 6శతాబ్ది నుండి 14 వరకు వీరి పాలన గుజరాత్,మాళవ,మధ్య ప్రదేశ్,కర్ణాటక,ఆంధ్ర మొదలగు ప్రాంతాలలో సాగింది.వీరు కార్తవీర్యార్జుని వంశస్థులుగా, పరుశు రాముని చేతిలో మరణం తప్పించుకొనుటకు మీసాలు,గడ్డాలు పెంచుకుని మారువేషాలలో తిరిగారని,అందువల్లనే 'కల్ చురి' అని పిలిచేవారని ఒక వదంతి ప్రాచుర్యంలో ఉన్నది.

వీరి ఇష్టదైవం శివుడు,మహామాయ.మహిష్మాతి వారి జన్మస్థానం.బహుశా 'శ్రీకాకుళం' పేరు 'కొక్కుల,కొక్కోల, కోకల్ల,కోకోల,కోకోలు అని పిలవబడే 'హైహయ' వంశరాజుల పేరు మీదగా వచ్చి ఉండవచ్చునని అనిపిస్తుంది.వీరు బహుశా శాతవాహనులకు పూర్వం ఆంధ్ర ప్రాంతం 'శ్రీకాకుళం'రాజధానిగా పరిపాలించి ఉండవచ్చు. క్రీస్తు పూర్వం 2 -3 మధ్యఆంధ్ర శాతవాహనులు వారినిజయించి 'మీసాల దైవాన్ని (బహుశా ఉజ్జయిని శంకరునిలా మీసాలు గల) తమ జాతి పేరున 'ఆంధ్ర మహావిష్ణు' గా మార్చి ఉండవచ్చు.వైశాఖ పూర్ణిమ' ఉత్సవాలు వైష్ణవ మతంలో 'వల్లభ సాంప్రదాయం'స్థాపించిన వల్లభా చార్యుని జన్మోత్సవాలయి ఉండవచ్చు.ఇక్కడ గల ప్రాచీనరాజీవలోచన మందిరంలో కూడా వైశాఖ ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతాయి.శ్రీ వల్లభా చార్యులు ఆంధ్రులు.జన్మస్థానం 'చంపారణ్' ఛత్తీస్ గడ్.గుజరాతీలలో అత్యధికులు వల్లభాచార్యుల అనునూయిలు.

సుభాషితమ్

 .       

                  _*సుభాషితమ్*_


*విత్తేన రక్ష్యతే ధర్మో* 

*విద్యా యోగేన రక్ష్యతే।*

*మృదునా రక్ష్యతే భూపః*

*సత్స్త్రియా రక్ష్యతే గృహమ్‌॥*


తా𝕝𝕝 

ధనముతో ధర్మము రక్షింపబడును. యమనియమాది యోగము ద్వారా విద్య రక్షింపబడును. కోమలత్వముతో, మధురతతో రాజు రక్షింపబడును. సాధ్వియైన స్త్రీచేత గృహము రక్షింపబడును.

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 94*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.         ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 94*


చంద్రగుప్తుని పట్టాభిషేక విశేషాలు తెల్సుకుని అజ్ఞాతంలో వున్న రాక్షసమాత్యుడు ఆగ్రహావేశాలతో రగిలిపోయాడు. 


"ఆహా ! ఏమా చాణక్యుని దుస్తంత్రము ...? తాను శ్రీకృష్ణ పరమాత్మునితో సమానుడా...? తాను ధర్మప్రతిష్టాపనార్థమే కుతంత్రాలు పన్ని ఇంతటి మారణ హోమాన్ని జరిపించాడా ? చంద్రగుప్తుని రాజ్యాధికార అర్హతను పదుగురిలో ఒప్పించడానికి ఎంత నాటకమాడాడు ? నందులను శిక్షించడం ధర్మసమ్మతమైతే.... మరి చంద్రగుప్తునికి సహాయంగా వచ్చిన పర్వతక, వైరోజనులు ఏం నేరం చేశారు ? విషకన్యని ప్రయోగించి అన్ననీ, విజయయాత్ర పేరుతో తమ్ముడిని దారుణంగా హతమార్చడం ధర్మ సమ్మతమా....?" అంటూ ఆవేశకావేశంతో ఉడికిపోయాడు రాక్షసుడు. 


"ధర్మమట ధర్మం .... చాణక్యా... నువ్వు చేసిందంతా ధర్మమైతే ... నీ ధర్మాన్ని నీకే తిప్పి కొడతాను... సహాయంగా వచ్చిన వారిని సంహరించడం నీ ధర్మమైతే.... అదే ధర్మమైతే... నేనూ నీ మార్గాన్నే అనుసరించి నీ వ్రేలితో నీ కంటినే పొడుపిస్తాను. ఆనాడు నాకు ప్రాణదానం చేసిన చంద్రుని ప్రాణాలు తీసి... నీ ధర్మపన్నాలు నీకే అప్పచెబుతాను. అంతవరకూ నేను ఈ పాటలీపుత్రంలో అడుగుపెట్టను" అని ప్రతిజ్ఞ చేశాడు రాక్షసామాత్యుడు. 


పాటలీపుత్రంలో ప్రముఖ వాణిజ్యవేత్త అయిన చందనదాసు శ్రేష్టి అమత్య రాక్షసునికి ప్రాణమిత్రుడు. రాక్షసుడు తన భార్యను, కుమారుడిని చందనదాసు రక్షణలో ఉంచి "మిత్రమా ! విధిలేని పరిస్థితుల్లో రాజ్యం విడిచి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేంతవరకూ నావారి సంరక్షణభారం నీదే" అని చెప్పాడు. 


చందనదాసు అతని చేతిలో చెయ్యి వేసి "నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ మీ వాళ్లకు ఏ హాని రానివ్వను. క్షేమంగా వెళ్లి విజయులై తిరిగి రండి అమాత్యా..." అంటూ ప్రమాణం చేశాడు. 


రాక్షసామాత్యుడు ఆనందాశ్రవులు విడుస్తూ చందనదాసుని ఆలింగనం చేసుకుని, భార్య పుత్రుల వద్ద వీడ్కోలు తీసుకుని ఆ రాత్రికి రాత్రే పాటలీపుత్రం విడిచి వెళ్లిపోయాడు. 


ఆ మన్నటి ఉదయమే రాక్షసుని పలాయన వార్త విని సాలోచనగా భృకుటి ముడిచాడు చాణక్యుడు. 

(ఇంకా ఉంది)...


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻


👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పెళ్లి భోజనాలు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

పెళ్లి భోజనాలు - ఆ రోజుల్లో - ఈ రోజుల్లో ———-

***************

            ఈ రోజుల్లో పేరుకు పెళ్లే కానీ వేదిక మీద ఏమి జరుగుతుందో మనకు కనిపించదు చాలా పెళ్లిళ్లలో!!!

వారికి నలువైపులా ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు చుట్టు - ముట్టి ఉంటారు. మంగళ వాయిద్యాలను బట్టి తాళికట్టే శుభవేళ అయిందని అర్ధం చేసుకోవడమే . 

             ఆ తరువాత వీలయితే స్టేజ్ ఎక్కి  వధూవరుల మీద నాలుగు అక్షింతలు చల్లడం... తదుపరి పెళ్లిపెద్దలు చెప్పినా, చెప్పకపోయినా  భోజనశాలలోకి దూరడం, బరువైన పింగాణీ ప్లేటును పట్టుకుని యాచకుల్లా వరుసలో నిలబడటం, కావలసిన పదార్ధాలు వడ్డించు  కోవడం, నిలబడి చెమటలు కక్కుకుంటూ తినడం, ఎక్కడో దూరాన ఉన్న మంచినీళ్ళకోసం పరుగెత్తడం సర్వసాధారణం. అతిధులు ఎవరు వస్తున్నారో, ఎవరు తింటున్నారో ఎవ్వరూ గమనించరు. తోసుకుంటూ వెళ్లడం, ఒక్కోసారి బట్టల మీద ఆహార పదార్ధాలు ఒలకడం కూడా చాలా మందికి అనుభవమే.  

            చాలా పెళ్ళిళ్ళలో మనల్ని పెళ్ళికి పిలిచిన కుటుంబం వారు అక్కడ ఒక్కరు కూడా ఉండరు, అందరూ ఫోటో షూట్ లలో బిజీ బిజీ.. అతిధుల్లో ఎనభై, తొంభై శాతం మంది మనకు పరిచయం ఉండరు. కొంత మంది విలువైన పదార్ధాలను ఎంత తిన్నారో అంతకు రెట్టింపు పారేస్తారు.  ఎవరు ప్లేటును చెత్తబుట్టలో వేస్తున్నప్పుడైనా చూడండి... దానిలో దాదాపుగా మరో మనిషికి సరిపోయే పదార్ధాలు ఉంటాయి. 

మా చిన్నతనంలో.......

           అనగా సుమారు  ముప్ఫయి అయిదు, నలుభై ఏళ్ళక్రితం ఇలా ఉండేది కాదు. పెళ్లిళ్లకు వెళ్తే భోజనాలు  నేలమీదనే.  కూర్చోడానికి  చాపలు ఏర్పాటు చేసేవారు.  అందరూ వరుసలో చిరుచాపల మీద కూర్చున్న తర్వాత   అరిటాకులు లేదా మోతుకు ఆకులతో, మద్ది ఆకులతో కుట్టిన విస్తర్లు  వేసేవారు.  

ఆ తరువాత.... 

           ముందుగా పచ్చడి, పప్పు, కూరలు, లడ్డూ లేదా బాదుషా, అరటికాయ బజ్జీలు, కమ్మనిపొడి, వడియాలు, అప్పడాలు, ఊరమిరపకాయలు వడ్డించేవారు.  ఆ తరువాత పులుసు, సగ్గుబియ్యంపాయసాన్ని అభికరించే వారు. అభికరించడం అంటే గరిటెతో పులుసు, పాయసాన్ని విస్తరిలో ఒక చుక్క పడేట్లుగా అంటించే  వారు. అనగా ఆ విందులో ఆ రెండు పదార్ధాలు కూడా ఉన్నాయని అర్ధం.  ఆ తరువాత నెయ్యి కొమ్ము  చెంబులతో పోసేవారు.  (వేసేవారు కాదు) అప్పుడు 

          అక్కడున్న ఒక పెద్దాయన ఔపోసనపట్టి ఓమంత్రం చెప్పి "ఇక కానివ్వండి"  అనగానే అందరూ భోజనాలకు ఉపక్రమించేవారు.  ముద్ద నోటిలో పెట్టుకునే ముందు చాలా మంది కళ్ళకు అద్దుకునే వారు. 

          ఇక వడ్డించే వారు (యువతీయువకులు)  యమా హుషారుగా పోటీలు పడి పదార్ధాలను మళ్ళీ మళ్ళీ తెస్తూ "ఇంకొంచెం వేసుకో మామా... ఈ కూర కాస్తెసుకో బాబాయి.. బావా... ఈ గుత్తి వంకాయ వేసుకుంటే ఇక ఇక్కడినుంచి కదలవు"  అని చిన్నా పెద్దా తేడా లేకుండా సరదాగా ఆటలు పట్టిస్తూ  వడ్డనలు చేసేవారు. 

          వీరు వడ్డనలు చేస్తుంటే పెళ్లి పెద్ద అతిధుల మధ్య తిరుగుతూ ఎలా ఉన్నాయి వంటలు ?  అని ప్రశ్నిస్తూ  కుశలప్రశ్నలు వేస్తూ "వడియాలు కాసిని తెండ్రా... అదిగో పెదనాన్నకు రెండు అప్పడాలు వేయి.. తాతకు నెయ్యి ఇంకొంచెం పొయ్యారా"  అంటూ ఆప్యాయతను వడ్డించేవాడు కుటుంబ పెద్ద. అక్కడ మనతో భోజనం చేసేవారంతా మన బంధువర్గంలోని వారే అయ్యుంటారు.  

           90 శాతం మంది భోజనాలు ముగించాక....ఇంకా ఎవరైనా భోజనం చేస్తూ కనిపిస్తే...అతిధులు కొందరు పాండవోద్యోగ విజయాలు, కురుక్షేత్రం, చింతామణి  నాటకాలలోని పద్యాలను రాగయుక్తంగా, శ్రావ్యంగా ఆలపించేవారు.  

          ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం, పద్దతి. అయిదు, ఆరు పద్యాలు అయ్యాక అంతలో ఒకాయన "భోజనకాలే హరి నామస్మరణ .......... గోవిందా గోవిందా"  అనేవాడు, అప్పుడు మాత్రమే  అందరూ లేచేవారు.   

          మనం కూర్చున్న వరుసలో ఇంకా ఎవరైనా పెరుగు  అన్నంలోనే ఉంటే వారు పూర్తిగా భుజించాకే లేచేవారు. ఇదే బంతి భోజనం.. భోజనాలు చేసిన తరువాత వారు తిన్న విస్తళ్ళన్నీ  కడిగారా అన్నట్లుగా శుభ్రంగా ఉండేవి.  ఒక్క మెతుకు కూడా కనిపించేది కాదు.  

          చేతులు కడుక్కోగానే అక్కడే ఏర్పాటు చేసిన నులక మంచాల మీద కూర్చుని పళ్ళాలలో సిద్ధంగా ఉంచిన తమలపాకులు, వక్కపొడి, సున్నం ఎవరికి కావలసిన మోతాదులో వారు తీసుకుని మళ్ళీ పెళ్లి  పనులలో మునిగిపోయేవారు.  

          ఇక భోజనం చెయ్యడం అనే మహత్తర కళ అతి కొద్దిమందికే తెలుసు. కొందరు తింటుంటే అతి  చూడ ముచ్చటగా ఉంటుంది. సున్నితంగా మునివేళ్లతో కలిపి తింటారు.  కొందరు చపాతీ పిండిని పిసికినట్లు పిసుకుతారు.


           కొంత మంది తిన్న తరువాత విస్తరి ఎలా ఉంటుందంటే  అది కొత్త విస్తరి అంటే నమ్మాలి, ఒక్క మెతుకు కనిపించదు. పదార్ధాల తాలూకు అవశేషం కూడా కనిపించదు. మరి  కొందరు తిన్న తరువాత విస్తరి చూస్తే ఆ అన్నాన్ని మనుషులు తిన్నారా లేక ఎలుకలు తిన్నాయా అన్నట్లు చిందరవందరగా, విస్తరిని ఎత్తేసేవారికి కూడా అసహ్యం కలుగుతుంది.  కొందరు భోజనం చేస్తున్నప్పుడు గ్లాసులు గ్లాసులు నీళ్లు తాగుతుంటారు.  కొంతమంది పెరుగన్నం తిన్నదాకా గ్లాస్ ముట్టుకోరు. నిజానికి భోజనం చేసే మధ్యలో మంచినీరు తాగకూడదు. కొందరు వడ్డించిన పదార్ధాలన్నీ  భుజిస్తారు. కొందరు అన్నీ వేయించు  కుంటారు కానీ  సగం  కూడా తినకుండా వ్యర్ధంగా వదిలేస్తారు.  

            భోజనం చేసే పద్ధతిని బట్టి కూడా వ్యక్తుల మనస్తత్వాన్ని అంచనా వెయ్యవచ్చు.  కావలసిన పదార్ధాలను మాత్రమే వడ్డించుకుని, శుభ్రంగా తినేవారు జీవితంలో పొదుపరులు అనీ, అవసరం లేని వాటిని కూడా వడ్డించుకుని మొత్తం అవతల పారేసే వారు అతిపెద్ద దుబారా మనుషులుగా అంచనా వెయ్యవచ్చు అంటారు పెద్దలు.  

            భోజనం చేయడము ఒక పెద్ద శాస్త్రం. ఎప్పుడైతే బఫె సిస్టం వచ్చిందో... అప్పటినుంచి పెళ్ళిభోజనం అనే మాటకు విలువ లేకుండా పోయింది.  అలనాటి మధుర దృశ్యాలు మాయమై పోయాయి.  

             ఒకప్పటి పెళ్ళిభోజనం అంటే షడ్రసోపేతమైన విందు. పదార్ధాలు నాలుగైదే ఉన్నా అది కడుపుకు మహాపసందు. కడుపారా తిని త్రేన్చుతాము.  ఇప్పటి పెళ్ళిభోజనం అంటే మొక్కుబడి. వంద రకాల పదార్ధాలు కనిపిస్తుంటాయి.  నాలుగు రకాలు కూడా తినలేము.   

     మనల్ని తినమని అడిగేవారే ఉండరు. భోజనం చేశారా అని అడిగే దిక్కు ఉండదు.


సేకరణ:- శ్రీ గిరిధర్ గారి వాట్సాప్ పోస్ట్

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం

 🕉 మన గుడి : 







⚜ కడప జిల్లా : వెయ్యినూతుల కోన


⚜ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం


💠 వెయ్యి నూతులు (బావులు) ఉన్న ప్రదేశం కావడంతో వెయ్యినూతుల కోన అనే పేరు వచ్చింది. క్రమంగా నూతుల కాస్తా నూతల అయింది.

వైఎస్‌ఆర్‌ జిల్లా పెండ్లిమర్రి మండలం చిన్నదాసరిపల్లె గ్రామంలో వెయ్యినూతలకోన క్షేత్రం ఉంది. 


💠 హిరణ్యకశిపుడిని ఆసాధరాణమైన రీతిలో సంహరించి అహోబిల క్షేత్రం నుంచి మొట్టమొదటిగా విచ్చేసింది ఇక్కడికే. 

 శ్రీ మహాలక్ష్మీ రూపమైన చెంచులక్ష్మీతో విహరించింది ఈ మనోహర క్షేత్రంలోనే. అంతేకాదు హిరణ్యకశిపుని వధ సందర్భంగా తాను ప్రదర్శించిన 32 ఛాయల్లో రెండింటిని శాశ్వతంగా నిలిపింది ఈ మహిమాన్విత క్షేత్రంలోనే. 

అందువల్ల ఇది మన రాష్ట్రంలోనే గాక యావద్భారతంలోని నరసింహ క్షేత్రాల్లోనే అగ్రశ్రేణి క్షేత్రంగా అలరారుతోంది. 


💠 వివాహాలు కుదిర్చే స్వామిగా, అపర ధన్వంతరిగా పూజలు అందుకుంటున్నాడు వెయ్యినూతుల కోనలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి. 

శాంత రూపంలో దర్శనమిచ్చే ఈ స్వామిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయనేది భక్తుల నమ్మకం. 

వివాహ దోషాలనూ తొలిగించే ఈ స్వామి ఆలయం చుట్టుపక్కల కాకులూ గద్దలూ తిరగవనీ చెబుతారు.


⚜ స్థలపురాణం ⚜


💠 నుయ్యి అంటే బావి. 

ఈ ప్రాంతంలో సుమారు వెయ్యి బావులు ఉండటం వల్లే ఆలయానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.

 వాల్మీకి మహర్షి ఈ స్వామిని దర్శించుకుని ఆలయానికి సమీపంలోని ఓ పర్వతం పైన ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేశాడనీ, రామాయణంలో కొంత భాగాన్ని ఇక్కడే రాశాడనీ చెబుతారు. 


💠 హిరణ్యకశిపుడిని సంహరించిన స్వామి తరువాత ఉగ్రరూపంలో అడవుల్లో సంచరిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నాడట. అప్పటికే ఇక్కడ తపస్సు చేసుకుంటున్న కొందరు మహర్షులు స్వామిని పూజించి ప్రసన్న రూపం దాల్చమని కోరారట. అయినా ఫలితం లేకపోవడంతో అంతా కలిసి ఇక్కడున్న వెయ్యినూతుల నుంచి నీటిని తెచ్చి స్వామికి అభిషేకం చేశారట. 

ఆ తరవాత స్వామి ఇక్కడ కొలువు దీరమంటూ వేడుకున్నారట.


💠 ఈ ఆలయం దగ్గరికి చేరుకోగానే

శాంతించడంతో మహర్షుల కోరికను మన్నించిన స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని కథనం. ఈ క్షేత్రంలో కాకులూ, గద్దలూ సంచరించకపోవడం వెనకా మరో ఆసక్తికరమైన కథనం ఉంది. 


💠 రాముడు సీతాసమేతంగా ఈ క్షేత్రానికి వచ్చి సేద తీరుతున్న సమయంలో కాకాసురుడు అనే రాక్షసుడు వచ్చి తన ముక్కుతో సీతాదేవిని పొడిచి నిద్రాభంగం కలిగించాడట.

దాంతో రాముడు ఆగ్రహించి కాకాసురుడిపైన బ్రహ్మాస్త్రం సంధించాడట. దాన్నుంచి తప్పించుకునేందుకు దేవతలందరి దగ్గరకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో ఆ అసురుడు చివరకు రాముడినే శరణు కోరాడట. అప్పుడు రాముడు ఈ క్షేత్రం చుట్టూ గిరిగీసి.. లోపలికి ప్రవేశించవద్దంటూ ఆజ్ఞాపించాడట. అప్పటినుంచీ ఇక్కడ కాకులు తిరగవని అంటారు.


💠 గర్భాలయంలో స్వామి శంఖచక్రాలూ, అభయముద్రతో లక్ష్మీసమేతంగా దర్శనమిచ్చినా ఈ ఆలయానికి కొద్ది దూరంలో లక్ష్మీదేవికి ప్రత్యేక ఆలయం కూడా ఉంటుంది. స్వామిపైన అలిగిన లక్ష్మీదేవి ఆలయానికి కొద్దిగా దూరం జరిగి శిలగా మారడంతో అక్కడే ఆమెకు ఆలయాన్ని నిర్మించారని చెబుతారు.


💠ఈ ఆలయంలో అర్ధరాత్రి మహర్షులూ, దేవతలూ స్వామిని దర్శించుకుంటారనీ.. అందుకే ఆ సమయంలో గంటలు వాటంతట అవే మోగుతాయనీ చెబుతుంటారు స్థానికులు. 

ఈ కోనలో నేటికీ మహసిద్ధులు ప్రతి నిత్యం ఏకాంత సమయంలో అదృశ్యరూపంలో స్నానంచేసి తపమాచరించి స్వామిని దర్శిస్తారని ఇక్కడ చెపుతుంటారు. 

ఇందుకు నిద్శనంగా లక్ష్మీదేవి స్వామి వారి పాదాల చెంత అర్చక ద్రవ్యాలు కనిపిస్తాయి. 


💠 40 రోజులు స్వామిని పూజించి ఈ ప్రాంగణంలో నిద్రిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయనేది భక్తుల విశ్వాసం. 

అదే విధంగా కుజదోషం ఉన్నవారు ఇక్కడున్న అమ్మవారికి కుంకుమపూజలు చేస్తే త్వరగా వివాహం జరుగుతుందట. 


💠 ఇక్కడి స్వామికి రోజువారీ చేసే పూజలతోపాటు వైశాఖ మాసంలో వచ్చే నృసింహ జయంతి సందర్భంగా బ్రహ్మోత్సవాలను జరిపిస్తారు. 


💠 తాళ్ళపాక అన్నమాచార్యులు స్వామి వారిమీద 10 కీర్తలను రచించారు. 

ఈ దేవాలయానికి ఏక్కడాలేని మరో.ప్రత్యేకత కూడా వుంది. 

సాధారణంగా ఏ గుడిలోనైనా విగ్రహలు ఉత్తరం లేదా తూర్పు ముఖం వుంటారు.

 కానీ మహలక్ష్మీ ఆలయంలో విగ్రహం మాత్రం పడమర ముఖంగా వుంటుంది. 

దీని కారణంగా ఎక్కువ సంఖ్యలో మహలక్ష్మి అమ్మవారిని మహిళలు దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 


💠 ఈ పుణ్య క్షేత్రంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు రాత్రికి గరుడ సేవ, మరుసటి రోజు కల్యాణం జరపడం అనవాయితీ.

 

💠 ఈ ఆలయం కడప నుంచి 25 కిమీ దూరం.

ఓ హిందూ మేలుకో-1

ఓ హిందూ మేలుకో-1

ఈ రోజుల్లో మన సమాజంలో రోజు రోజుకు మన సాంప్రదాయాలమీద, మన ఆచారాల మీద ఆదరణ తక్కువ అవుతున్నది.  దానికి దారుణం ఏదయినా కావచ్చు.  ముఖ్యంగా ప్రతి హిందువు తన ధర్మం ఏమిటి తన కర్తవ్యం ఏమిటి తన్ను తాను ఎలా ఉద్దరించుకోవాలి అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించి తన దైనందిక జీవితాన్ని కొనసాగిస్తే ప్రతిహిందువు ఒక చక్కని వ్యక్తిత్వం వున్న ఆదర్శమూర్తిగా నిలుస్తాడు మన హిందూ ధర్మాన్ని కలకాలం నిలపటానికి తోడ్పడుతాడు.  

ప్రతి హిందువు తానూ ఏకులానికి చెందినవాడైన కానీ తాను ముందుగా హిందువునని కాబాట్టి తన ధర్మాన్ని నిలపెట్టాలని అనుకోవాలి.  పూర్వం ఎప్పుడో మనం చూడని సమాజం ఇప్పుడు లేదు.  ఇప్పుడు అందరు చక్కగా చదువుకుంటున్నారు అనేక విషయాలను తెలుసుకొని విద్యావంతులుగా రాణిస్తున్నారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి "విద్య దదాతు వినయం " అని ఆర్యోక్తి అంటే విద్యవలన వినయము కలగాలి వినయం అంటే దేని పట్ల  వినయం అంటే అది శాస్త్రం పట్ల శాస్త్రం అంటే మనకు జ్ఞనాన్ని ప్రసాదించేది శాస్త్రం. 

హిందువులు విగ్రహారాధకులు అని కొందరు ఏదారి మతస్తులు అభిప్రాయపడుతుంట్టారు.  నిజా నిజాలు తెలియని అమాయక హిందువులు అది నిజమని అనుకుంటారు.  మిత్రమా ప్రపంచంలో ఏ మతం కూడా హిందూ ధర్మాన్ని మించినది లేదు. అందుకే అనేక తప్పుడు ప్రచారాలను చేసి ఇతరులు హిందువులను చులకన చేసే ప్రయత్నాలను చేస్తున్నారు అందులో భాగమే ఈ తప్పుడు ప్రచారం ఒకటి. 

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్యంనుండే చక్కగా నీతి శతకాలను నేర్పాలి, మన మాతృ భాషయిన తెలుగు పట్ల చక్కని అవగాహన కల్పించాలి. శ్రీకృష్ణ భగవానులు ఉపదేశించిన శ్రీమత్ భగవత్గీతను ప్రతి వారు పఠించి , అందులోని విషయాలను పాటించి తమ జీవితాలను ఆదర్శవంతంగా చేసుకోవాలి. 

హిందూ ధర్మంలో శవాల బొమ్మలు, సమాధులను పుజెంచమని ఎక్కడా చెప్పదు.  పొరపాటునకూడా అటువంటి తప్పుడు పనులు చేయకూడదు. 

అవతారపురుషులు మనకు శ్రీ రాముడు, శ్రీ కృష్ణ భగవానులే ప్రధానంగా గోచరిస్తారు. ఒక అవతార పురుషుడు మరల ఇంకొక అవతారపురుషుడుగా ఎప్పుడు మరల మరల జన్మలు తీసుకోరు.  ఈ విషయం ప్రతి హిందువు తెలుసుకోవాలి. మన ధర్మాన్ని ఆచరించే వారిని, మన దేముళ్ళను ఆరాధించే వారిని మాత్రమే మనం గురువులుగా భావించాలి.  ఎట్టి పరిస్థితిలోను తత్ బిన్నంగా నడవకూడదు. 

మన ఆచారాలను పాటిద్దాము, మన ధర్మాన్ని కాపాడుదాము. 

జై హిందూ జై జై హిందూ 

ఆచంద్ర తారార్కం మన ధర్మం వెలసిల్లేలా మనమంతా కృషి చేద్దాం.  

మార్పు నానుండే మొదలు అని ప్రతివారం ఉద్యమిద్దాం. 

జై  శ్రీరామ్,జై శ్రీ కృష్ణ 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

భార్గవ శర్మ