శ్లోకం:☝️
*సత్పాత్రాయ ప్రదాతవ్యమ్*
*అపాత్రాయ కదాపి న |*
*పాత్రాఽపాత్రం ప్రసంగేషు*
*నియోక్తుం ధర్మసంకటమ్ ||*
భావం: మనం సహాయం అందించాల్సినది అత్యంత అర్హత పాత్రత కలిగిన వ్యక్తికి. కానీ ఒక్కొక్కసారి అటువంటి వ్యక్తిని గుర్తించడం చాలా గమ్మత్తైనది కావచ్చు. (వీరిలో మీరు ఎవరికి సహాయం చేస్తారు? ఎందుకు?)
: 🔥బూరుగుచేట్టు🔥
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
హిమాలయ పర్వత శిఖరాల మీద ఒక బూరుగు చెట్టు ఉండేది. విశాలమైన శాఖలతో, విస్తారమైన కాండంతో ఆ బూరుగు చెట్టు తన తెల్లటి దూదితో మరో మంచుకొండను తలపిస్తూ ఉండేది.
ఒక రోజు అటువైపుగా వెళ్తున్న నారదుని దృష్టి ఆ బూరుగు చెట్టు మీద పడనే పడింది.
‘వేల అడుగుల ఎత్తున ఇంతటి మహావృక్షం మనుగడ సాగించడం సాధ్యమేనా!’ అనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా బూరుగు చెంతకు వెళ్లి...
‘‘నువ్వు అల్లంత ఎత్తున ఇంతగా విస్తరించి ఉన్నావు కదా! మరి నీకు ఏనాడూ ఆ వాయుదేవుని వల్ల నష్టం వాటిల్లలేదా? ఆయన తన పవనాలతో నిన్ను విరిచేందుకు ప్రయత్నించలేదా! నీకూ వాయుదేవునికీ మధ్య ఏమన్నా బాంధవ్యం ఉందా ఏం?’’ అని అడిగాడు నారదుడు.
నారదుని మాటలతో బూరుగు చెట్టుకి పౌరుషం పొడుచుకువచ్చింది- ‘‘వాయుదేవుని స్నేహంతోనో, అతని దయాదాక్షిణ్యాలతోనో నేను మనుగడ సాగించడం లేదు. నన్ను కూల్చేంత సామర్థ్యం వాయుదేవునికి లేనే లేదు. నా బలంతో పోలిస్తే ఆయన బలం ఒక మూలకు కూడా సరిపోలదు,’’ అంటూ పరుషమైన మాటలెన్నో పలికింది.
బూరుగు చెట్టు మాటలను వినగానే కలహభోజనుడైన నారదునికి, మరో కథ నడిపేందుకు అవకాశం చిక్కింది. ‘‘నువ్వు ఇలా మాట్లాడటం సబబుగా లేదు! ఆ వాయుదేవుడు తల్చుకుంటే కొండలనైనా కదిలించేయగలడు. మరి నువ్వు ఇన్నేసి మాటలు అన్న విషయం తెలిస్తే ఆయన నీకు కీడు చేయక మానడు,’’ అంటూనే బూరుగు చెట్టు గర్వంతో వదరిన మాటలన్నింటినీ పూసగుచ్చినట్లుగా వాయుదేవునికి చేరవేశాడు.
బూరుగు చెట్టు తనని కించపరచడాన్ని వాయుదేవుడు సహించలేకపోయాడు.
వెంటనే ఆగమేఘాల మీద బూరుగుని చేరుకుని ‘‘ఒకనాడు బ్రహ్మదేవుడు నీ చెంత సేదతీరాడన్న కారణంగా, ఇన్నాళ్లూ దయతలచి నీ జోలికి రాలేదు. నేను చూపిన కరుణ నీలో కృతజ్ఞతను కలిగించకపోగా, గర్వాన్ని రగిలించింది. రేపు ఈపాటికి నిన్ను ఏం చేస్తానో చూడు!’’ అంటూ విసురుగా వెళ్లిపోయాడు.
వాయుదేవుని మాటలకు బూరుగు నిలువెల్లా వణికిపోయింది. ‘ఇప్పటివరకూ తనకు ఎదురులేదన్న పొగరుతో అనకూడని మాటలన్నీ అనేసింది. వాయుదేవునితోనే వైరం తెచ్చుకుంది. నారదుడు చెప్పినట్లు వాయుదేవుడు తల్చుకుంటే కొండలు కూడా కదిలిపోయే మాట వాస్తవమే! అలాంటి తాను మాత్రం ఆ ప్రభంజనుడికి ఎదురొడ్డి ఎలా నిలబడగలదు. ఇప్పుడేం చేయడం!’- ఇలా పరిపరి విధాలా ఆలోచించిన బూరుగు చివరికి ఓ నిశ్చయానికి వచ్చింది. వాయుదేవుడు తనకు నష్టం కలిగించే లోపుగా తానే తన కొమ్మలనీ విరిచేసుకుంది, రెమ్మలన్నింటినీ తుంచేసుకుంది, పూలన్నింటినీ రాల్చేసింది. చిట్టచివరికి ఒక మోడుగా మారింది. ‘ఇప్పుడిక వాయుదేవుడు నష్టపరిచేందుకు నా వద్ద ఏమీ మిగల్లేదు’ అన్న నమ్మకంతో పవనుడి రాక కోసం ఎదురుచూసింది.
మర్నాడు వాయుదేవుడు రానేవచ్చాడు. మోడులా నిలిచిన బూరుగుని చూసి జాలిపడ్డాడు. ‘‘నేను విధించాలనుకున్న శిక్షను నువ్వే స్వయంగా అమలుచేసుకున్నావు. ఇక మీదనైనా అహంకారాన్ని వీడి నమ్రతతో జీవనాన్ని సాగించు!’’ అంటూ సాగిపోయాడు.
పెద్దాచిన్నా తారతమ్యం లేకుండా, తన పరిమితుల గురించి ఆలోచించకుండా ఎవరితో పడితే వారితో విరోధం పెట్టుకుంటే ఏం జరుగుతుందో బూరుగు కథ తెలియచేస్తోంది.
గర్వం ఎప్పటికీ పనికిరాదనే నీతిని పదే పదే వినిపిస్తోంది...
మహాభారతంలోని శాంతిపర్వం నుండి..
👉ఈ గుడికి వెళ్ళాలంటే ప్రాణాలపై ఆశ వదులు కోవాల్సిందే..
👉మరణించిన వారిని బ్రతికించగలిగే మహా శక్తి ఉన్న సంజీవని పర్వతం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా ?
గుడి అంటే రోజూ పూజలు,నైవేద్యాలు ఇవన్నీ రోజూ మామూలే!
కానీ ఓ దేవాలయం కేవలం 5 రోజులు మాత్రమే తెరచివుంటుంది.
ఆ 5 రోజులులూ దేవుడికి పూజలు చేసి గుడిని మూసేస్తారు.
మళ్ళీ తెరిచేది యాడాది తర్వాతే.
ఎందుకంటే ఈ గుడికి వెళ్ళటం ఆషామాషీ వ్యవహారం కాదు.
అక్కడికి వెళ్ళాలంటే గుండెలు అరచేత్తో పట్టుకుని అడుగులు వేయాల్సిందే.
అడుగడుగునా పొంచివున్న ప్రమాదాలతో ఓ సాహసయాత్రను తలపించే ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే భక్తి ఒక్కటే చాలదు.
గుండె ధైర్యం కూడా పుష్కలంగా వుండాలి.
ఇంతకీ ఆ గుడి ఎక్కడ వుంది?
అక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలని వుంది కదూ!
సలేశ్వరం శ్రీశైలం దగ్గరలోని ఒక యత్రా స్థలము.
ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం,
చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం,
ఆధ్యాత్మిక ప్రదేశం.
ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యాత్రా స్థలము.
ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది.
ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తోలి పౌర్ణమికి మొదలగుతుంది..
🙏 సర్వేజనాసుఖీ నో భవంతు 🙏
:
*చలించని హార్దికభక్తి ఒక్క భగవద్గీత అధ్యయనం తోనే సాధ్యం!*
జీవులను ఉద్ధరించడానికి, భగవంతుడే స్వయంగా ఈ భూమిపై జన్మను తీసుకుని,
వివరించిన యోగ సముదాయము, ప్రబోధ ఈ గీత......
భగవద్గీత శ్లోకాలను విడివిడిగా లేదా క్రమానుసారముకాక భావరీత్యా పరస్పర సమ్మతిగల శ్లోకాలను పఠించితే శ్రీకృష్ణపరమాత్ముని పరమభావం మరింత లెస్సగా స్పష్టంగా గ్రహించగల్గుతాము.
తద్వారా ఆ పరమభావాన్ని మన దైనందిక జీవితంలో వీలైంతమేరకు అనుకరించుట రోజురోజుకీ మరింత సులభమౌతుంది.
పదవ అధ్యాయపు ఈ రెండు శ్లోకాలను చూడండి :
*యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున*
*న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరమ్ (10:39)*
సర్వప్రాణులలో దివ్యమైన బీజమును నేనే. నేను లేకున్నచో చరాచరప్రాణి ఏదియునూ ఒక్క క్షణమైనా జీవించి ఉండలేదు.
*అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున*
*విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్ (10 :42)*
ఈ విశ్వమంతటా స్థితమొనర్చిన (వ్యాపింపజేసిన) నాయొక్క ఒక్క అంశతోడనే ఈ విశ్వాన్ని నేను ధరిస్తున్నాను -ఇంతకన్నా వివరంగా తెలుసుకొను అవసరం ఏముంది అర్జునా నీకు ?
*వివరణ:*
ఈ విశ్వంలో ఉన్నదంతటినీ ఆ పరమాత్ముడు తనయొక్క ఒక్క అంశతో ధరిస్తున్నానని చెప్పడమేకాకుండా, ఇక్కడ ఈ విశ్వమందు తనలో జీవిస్తున్న ప్రతీ చరాచరజీవియొక్క జీవబీజం - అంటే ప్రతీ జీవియొక్క జన్మకు కారణం అవ్యక్త అక్షర పరమభావమైన - తానేనని స్పష్టంగా వెల్లడిస్తున్నట్లేకదా *(7:10)* శ్లోకంలోకూడా ఈ విషయాన్నే వెల్లడిచేసాడు ఆ పరమాత్ముడు - *(బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనామ్)*
అలాంటప్పుడు కారణజన్ములు అన్న ఊతపదాన్ని వినియోగిస్తూ కొందరే కారణజన్ములని మిగతా మనం అందరమూ ఎందుకూ పనికిరాని అతి సామాన్యులం అని మరి ఎలా అంటున్నాము మనం ఈనాటికీ ?! అలా కొందరిని కారణజన్ములుగా సృష్టించి మరికొందరిని సామాన్యులుగా ఆ పరమాత్ముడు సృష్టించియుంటే తన అంశాలపై తానే నిష్పాక్షికము నిండియున్న సమభావదృష్టి కోల్పోతూ - *స మో హం సర్వభూతేషు న మే ద్వేష్యో స్తి న ప్రియహ్ (9:29) -* పక్షపాతవైఖరి కల్గియున్నాడని మనం ఆరోపిస్తున్నట్లు అర్థం రాటల్లేదా
అదికూడా నశ్వరమైపోయే ప్రాణులలో నశ్వరముకాని పరమేశ్వరుడు సమంగా కొలువైయున్నట్లు చూడగల్గుటయే - ఆ ప్రాణి సామాన్య చండాలుడైతేనేమి విద్యా వినయ సంపన్నుడైతేనేమి *(5:18) -* నిజమైన దృష్టి కలిగియుండుట -
*సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి (13 :27 ) -* అని స్వయానా ఆ పరమాత్ముడే స్పష్టంగా చెబుతున్నప్పటికీ ?!
*(10 :42)* శ్లోకంలో - ఈ విశ్వమంతటా వ్యాపింపజేసిన నాయొక్క అంశను ఆధారం చేసుకొని ఈ విశ్వములో జీవిస్తున్న సర్వ చరాచర ప్రాణులలో జీవబీజమును - *(10 :39)* - నేనే అన్న వాస్తవ సత్యాన్ని తెలిసికొంటూ నన్నే భజించితే నువ్వు తప్పకుండా నన్ను చేరగలవు. ఇంతకు మించి తెలుసుకునే అవసరం ఏముంది అని ఈనాడు మనలనుకూడా ఆ పరమాత్ముడు ప్రశ్నిస్తున్నట్లేకదా ?
ఇదేకదా *2:46* శ్లోకపు భావం. ఇక్కడ ఈ విశ్వమంతా పరమాత్ముడే - పరబ్రహ్మమే - సజీవమైయున్న సర్వప్రాణులలో ఆత్మరూపాన్న ఇంకా ప్రాణుల బయట విశ్వమంతటా తన అవ్యక్తరూపాన్ని *(9:4 - మయా తతమిదం జగదవ్యక్తమూర్తినా)* వ్యాపించియున్నాడని తెలుసుకోగల్గిన బ్రహ్మజ్ఞానికి వేదాలు ఇంకా ఆవశ్యకమా -
*యావానర్థ ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః - ?!*
ఇప్పుడు పైన పేర్కొనబడిన *10 :39 , 42* శ్లోకాలలో ఉన్న భావమే *8 :22* మరియు *15 :7* శ్లోకాలలో ఎలా వెల్లడవుతోందో చూడండి :
*పురుషాహ్ స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా*
*యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతం (8 :22)*
*మమైవాంశో జీవలోకే* *జీవభూతః సనాతనః*
*మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్తాని కర్షతి (15:7)*
ఈ రెండు శ్లోకాలను కలిపి చదివితే :
ప్రకృతినుండి ఆరు ఇంద్రియములను తనయొక్క అంశతో ఆకర్షించి(నపిమ్మట) ఈ జీవలోకమున ప్రాణులలో సనాతన జీవాత్మగా నెలకొల్పి జీవింపజేసిన ప్రాణులన్నియునూ *(15:7)* ఏ పరమాత్మయందు నివసించుచున్నాయో (మరియు) ఏ పరమపురుషునిద్వారా ఈ సమస్త జగత్తు వ్యాపింపబడియున్నదో ఆ పరమపురుషుడు చలించని హార్దిక (హృదయపూర్వక) భక్తితో మాత్రమే పొందశక్యము *(8:22).*
అంటే పరమాత్ముడను భజించితే కేవలం అవ్యక్త అక్షర పరమాత్మగాకాక
సర్వప్రాణులలో ఆత్మగా కొలువైయుంటూ (అలా ఆ పరమాత్ముడను ఆత్మగా కలిగియున్న) ఆ సర్వప్రాణులనూ దారమునందు మణులవలె - *మత్తహ్ పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ *(7:7) -*
తనలో కూర్చుకొనియున్న పరమాత్మునిగా వాస్తవ్య జీవితంలో వీక్షిస్తూ - అంటే ఎవరిని చూసినా మొట్టమొదట మనలో ఆ పరమాత్ముని అవ్యక్త రూపం దిద్దుకొనేటటువంటి భక్త్గి కల్గియుంటే ఆ పరమాత్ముడు నిశ్చితంగా నిస్సందేహముగా లభ్యమౌతాడని ఆ పరమాత్ముడే చెబుతున్నట్లు స్పష్టంకదా.
అయితే ఈ విధమైనటువంటి భక్తి కల్గియుండాలంటే ముందుగా మనలో ఉన్న పరమాత్మ అంశం సర్వవిశ్వవ్యాప్తమై సర్వప్రాణులకూ ఆశ్రయమిస్తున్న పరమపురుషుడు మాత్రమేకాకుండా సర్వప్రాణులలో ఆత్మగా కొలువైయున్న పరమాత్ముని అంశం అని గ్రహించాలికదా.
అంటే మన కంటికి ఎవరు కనపడుతున్నా (ఏ జీవి కనపడుతున్నా) వారి స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ వారిలో ఉన్న శ్రీకృష్ణపరమాత్ముడే నాలోనూ ఉన్నాడు గనుక వారందరి స్థితులలో నన్నునేను (అంటే వారి దేహాన్న ఉన్న వారి ఆత్మ స్థానంలో నా ఆత్మను) ఉహించుకోగల్గుతూ వారందరినీ నేనున్న స్థితిలో (నా దేహమందున్న ఆత్మ స్థానంలో వారి ఆత్మను) ఉహించుకోగల్గాలికదా. అప్పుడే మన భక్తి *8:22* శ్లోకంలో ఆ పరమాత్ముడు కల్గియుండమని ఆదేశిస్తున్న భక్తితో సరితూగే భక్తి అవుతోందని భావించగలముకదా.
అంటే, ఒక విధంగా ఆ అవ్యక్త అక్షర పరమపురుషుడు తననే - సర్వప్రాణులకూ ఆశ్రయమివ్వగల తన పరమతత్త్వాన్నే - అనుకరించమంటున్నాడని స్పష్టంకదా.
ఇదే *6:29* శ్లోకముయొక్క తాత్పర్యం చూడండి :
*సర్వభూతస్థమాత్మానం* *సర్వభూతాని చాత్మని*
*ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్రా సమదర్శనః*
యోగముతో గూడుకొనిన మనస్సుగలవాడు సమస్త ప్రాణులయందును సమదృష్టిగలవాడై తనను సర్వప్రాణులయందున్న వానిగాను సర్వప్రాణులను తనయందున్నవిగాను చూచుచున్నాడు. (విద్యా ప్రకాశానందగిరి స్వాములవారి అనువాదం, కొన్ని మార్పులతో)
యోగమందు పరిపక్వతపొందిన యోగి ఎక్కడైనాకూడా నిష్పాక్షికముగానే ప్రవర్తించును గనుక తననుతాను ఇతరులైన అందరిలోనూ మరియు ఇతరులైన అందరినీ తనలో చూచును.
అంటే మోక్షం పొందతలంచువారు ఆ పరమాత్ముని ఈ తత్త్వాన్నే అనుకరించమని -
*జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్త్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున* - *4:9* శ్లోకంలో ఆ పరమాత్ముడు బోధిస్తున్నాడని స్పష్టంగా వెల్లడౌతోందికదా...
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు...
🙏🙏
🙏 *ఓం నారాయణ- ఆది నారాయణ* 🙏
*గ్రంథం:* భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు
*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్
*ఓం నిత్యసత్యాయనమః*
ఆలపాటి శ్రీనివాస పూర్ణచంద్రరావు, మచిలీ పట్నం- పేర్ని కృష్ణమూర్తి కాలనీ, గవర్ణమెంటు హాస్పిటల్ వెనుక - తన దివ్యానుభవాన్ని ఇలా వివరిస్తున్నారు. వీరి అనుభవం *"చచ్చిబూడిదైనా రమ్మంటే వచ్చేదే గదయ్యా!"* అన్న శ్రీ స్వామివారి మాట అక్షరాల నిజమని సూచిస్తుంది.
1994 సం|| నాటికి నా కుమారుడు నాగ వెంకటచక్రవర్తి నాలుగు సంవత్సరముల పిల్లవాడు. విపరీతమయిన జ్వరం వల్ల మెదడు ఫెయిలయింది. ఎవరినీ గుర్తించలేడు, ఏమీ తినలేడు, ముక్కు ద్వారా ట్యూబు పెట్టి ద్రవాహారం పోస్తున్నాము. ఇరవైరోజులు ఎమ్.బి.బి.ఎస్. డాక్టరు గారి ఆస్పత్రిలో ఉంచినా ఏమినయంకాలేదు. విజయవాడకు తీసుకు వస్తే స్కానింగ్ చేయాలని వేల రూపాయలడిగారు. శక్తిలేక ఇంటికి వెళ్ళాము.
మచిలీ పట్నం డాక్టర్లు మేమేమి చేయలేమని ఆశవదిలేశారు. మా స్నేహితుని సలహాపై శ్రీ వెంకయ్యస్వామి వారి భక్తురాలి దగ్గరకు తీసుకుపోతే ఆమె వెంటనే గొలగమూడికి పోండి బాగవుతుందని చెప్పారు. గొలగమూడి ఎక్కడుందో?, ఎలా పోవాలో?, ఎంతఖర్చవుతుందో తెలియక యోచనలో పడ్డాను. శ్రీ స్వామివారి దయవలన అక్కడున్న భక్తులు ఐదువందల రూపాయలిచ్చి వెంటనే గొలగమూడికి వెళ్ళి బిడ్డను బ్రతికించు కోమన్నారు. అది శ్రీ స్వామివారి దయయని గొలగమూడి చేరాను.
అంతస్పృహలేని పరిస్థితిలో నున్నబిడ్డకు తలనీలాలు తీయించుటకు రెండు గంటలు పట్టింది. పిల్లవాని తలంతా గాయాలే. గాయాలకు విబూతి మాత్రం పూశాను. రెండుగంటలలో ఒక్క గాయం కూడా కనిపించకుండా పోవడమే చిత్రం. తెల్లవారి శనివారం విపరీత మైన రద్దీ. పిల్లవానిని ఎత్తుకొని కూర్చొని యున్నాను. ఒక్క క్షణంలో కళ్ళు మూతలు పడి మందిరం ముందు శ్రీ స్వామివారి దగ్గరున్నాను. ఆకరుణామయుడు కనిపించి *"బిడ్డకు బాగుంటుంది. నామార్గంలో నడుస్తావా?"* అని అడుగుతున్నాడు. నేను సరేననగానే నాకు మెలుకువ వచ్చింది. తెల్లవారినుండి పిల్లవాడు చిత్రంగా ఇడ్లీ దగ్గరనుండి సర్వం తింటూ చక్కగా నడిచి తిరుగుతున్నాడు. ఇన్నాళ్ళు ఆహారం లేక బలహీనంగా ఉండవలసిన వానికి ఆ లక్షణాలే లేవు. ఐదురోజులుండి ఇల్లు చేరాను.
శ్రీ స్వామివారి మార్గంలో ఎలా నడవాలో తెలియక స్నేహితుని సలహా పై శ్రీ స్వామి వారి మాల వేసుకొని నలబైరోజులు దీక్ష చేయాలనుకున్నాను. దీక్షా వస్త్రములతో సాయి మందిరానికి పోయాను. అక్కడ పూజారులు లేక నా మాల నేనే ధరించాలని బాదపడుతున్నాను. పట్టపగలే ఆశ్చర్యంగా శ్రీ స్వామివారు నాముందు కనిపించి *"ఆ డాలరు నామెడలో వేయయ్యా!"* అని చెప్పగా అలానే వేశాను. *"ఇప్పుడు తీసి నీమెడలో వేసుకో!"* అన్నారు. అలాగే వేసుకున్నాను. *“నలభై రోజులు బిక్షచేసి వచ్చిన డబ్బుతో పచ్చిగడ్డికొని ఆవులకు పెట్టు"* అని చెప్పి అదృశ్యమయ్యారు. ఇదంతా స్వప్నం కాదు, పట్టపగలు జరిగిన సంగతి. వారిదయవలన నేనలాగే నలబైరోజులు బిక్షచేసి ఆవులకు పచ్చిగడ్డి పెట్టాను. ఇలాంటి దివ్య అనుభవం ప్రసాదించినన్ను వారి భక్త కోటిలో చేర్చుకున్న శ్రీ స్వామివారికి నేను జీవితాంతం ఋణగ్రస్తుడను.
🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
భగవంతుని సంపూర్ణంగా విశ్వసించి, నిరంతరమూ గుర్తుంచుకుని, మన జీవితమంతటినీ ఆయనకు తృప్తికరమైన రీతిన గడుపుకోవడమే సర్వమతాల సారము. దీనిని సంపూర్ణంగా సాధించినవారే మహాత్ములు. ఆ స్థితి సాధించాకనే దుఃఖం, శాశ్వతంగా అంతమొందగలదని అన్ని మత గ్రంథాలు, అందరు మహాత్ములూ చెబుతున్నారు. ఎట్టి దుఃఖమూ, అసంతృప్తి లేకుండా వుండగలగాలనే జీవులన్నీ కోరేది. కాని దానిని సాధించే మార్గమెంతో సూక్ష్మమైనది. అది తెలియాలంటే దానిని తెలిసి సాధించినవారిని ఆశ్రయించాలి. కాని వారినాశ్రయించినా వారు మనకివ్వదలచినదంతా మనం పొందగలగాలంటే వారిని సేవించే పద్ధతి కూడా తెలియాలి. దానిని గూడా పూర్ణుడైన గురువు సరియైన పద్ధతిన సేవించి, వారి అనుగ్రహంతో ఆత్మజ్ఞానం పొందిన మహాత్ములే మనకు తెల్పాలి. అలా జరగకుండా వుండాలంటే మనం మరికొంతమంది సద్గురువుల చరిత్రలు, బోధలు చదవాలి. అనేకమంది సద్గురువులను దర్శించాలి. వారందరి రూపాలలోనూ ఒకే దైవమెలా ప్రకటమయ్యాడో వారి చరిత్రలనుండి మనం గమనించాలి, వారు మనకు తెలిపిన సద్గురు సేవా విధానం తెలుసుకొని మనమనుసరించాలి. టిబెట్్యగి మిలారేపా అట్టి సద్గురువులలో ఒకరు. ఈ మహనీయుని అద్భుత చరిత్ర చదివితే మానవ జీవిత లక్ష్యమేమిటో గమ్యమేమిటో, ఆ గమ్యం చేరడానికి మనం గురువును ఎలా సేవించాలో, ఎలా సాధన చేయాలో మనకు సంపూర్ణంగా తెలియగలదు. సాధన సక్రమంగా జరగడానికై తీసుకోవలసిన జాగ్రత్తలు ఆయన బోధలలో మనకు లభిస్తాయి. సామాన్య మానవునిలా జన్మించి, ఉత్తమ సాధకునిలా సాధన చేసి, గొప్ప మహాత్మునిగా రూపొందిన మిలారేపా దివ్య చరిత్ర మనలను సాధనకు, సద్గురు సేవకూ ఉన్ముఖులను చేస్తుంది.
- రచయిత
ఆన్లైన్ లో చదువు కొనుటకు పరిశీలించగలరు. జై సాయి మాస్టర్🙏
http://www.saibharadwaja.org/books/readbook.aspx?book=20
శ్రీ శివ స్తుతి: ...!!
వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిమ్,
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. ... 1
వందే సర్వజగద్విహారమతులం వందేఽ న్ధక ధ్వంసినం
వందే దేవ శిఖామణిం శశినిభం వందే హరే ర్వల్లభమ్
🙏🙏
:
*చలించని హార్దికభక్తి ఒక్క భగవద్గీత అధ్యయనం తోనే సాధ్యం!*
జీవులను ఉద్ధరించడానికి, భగవంతుడే స్వయంగా ఈ భూమిపై జన్మను తీసుకుని,
వివరించిన యోగ సముదాయము, ప్రబోధ ఈ గీత......
భగవద్గీత శ్లోకాలను విడివిడిగా లేదా క్రమానుసారముకాక భావరీత్యా పరస్పర సమ్మతిగల శ్లోకాలను పఠించితే శ్రీకృష్ణపరమాత్ముని పరమభావం మరింత లెస్సగా స్పష్టంగా గ్రహించగల్గుతాము.
తద్వారా ఆ పరమభావాన్ని మన దైనందిక జీవితంలో వీలైంతమేరకు అనుకరించుట రోజురోజుకీ మరింత సులభమౌతుంది.
పదవ అధ్యాయపు ఈ రెండు శ్లోకాలను చూడండి :
*యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున*
*న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరమ్ (10:39)*
సర్వప్రాణులలో దివ్యమైన బీజమును నేనే. నేను లేకున్నచో చరాచరప్రాణి ఏదియునూ ఒక్క క్షణమైనా జీవించి ఉండలేదు.
*అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున*
*విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్ (10 :42)*
ఈ విశ్వమంతటా స్థితమొనర్చిన (వ్యాపింపజేసిన) నాయొక్క ఒక్క అంశతోడనే ఈ విశ్వాన్ని నేను ధరిస్తున్నాను -ఇంతకన్నా వివరంగా తెలుసుకొను అవసరం ఏముంది అర్జునా నీకు ?
*వివరణ:*
ఈ విశ్వంలో ఉన్నదంతటినీ ఆ పరమాత్ముడు తనయొక్క ఒక్క అంశతో ధరిస్తున్నానని చెప్పడమేకాకుండా, ఇక్కడ ఈ విశ్వమందు తనలో జీవిస్తున్న ప్రతీ చరాచరజీవియొక్క జీవబీజం - అంటే ప్రతీ జీవియొక్క జన్మకు కారణం అవ్యక్త అక్షర పరమభావమైన - తానేనని స్పష్టంగా వెల్లడిస్తున్నట్లేకదా *(7:10)* శ్లోకంలోకూడా ఈ విషయాన్నే వెల్లడిచేసాడు ఆ పరమాత్ముడు - *(బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనామ్)*
అలాంటప్పుడు కారణజన్ములు అన్న ఊతపదాన్ని వినియోగిస్తూ కొందరే కారణజన్ములని మిగతా మనం అందరమూ ఎందుకూ పనికిరాని అతి సామాన్యులం అని మరి ఎలా అంటున్నాము మనం ఈనాటికీ ?! అలా కొందరిని కారణజన్ములుగా సృష్టించి మరికొందరిని సామాన్యులుగా ఆ పరమాత్ముడు సృష్టించియుంటే తన అంశాలపై తానే నిష్పాక్షికము నిండియున్న సమభావదృష్టి కోల్పోతూ - *స మో హం సర్వభూతేషు న మే ద్వేష్యో స్తి న ప్రియహ్ (9:29) -* పక్షపాతవైఖరి కల్గియున్నాడని మనం ఆరోపిస్తున్నట్లు అర్థం రాటల్లేదా
అదికూడా నశ్వరమైపోయే ప్రాణులలో నశ్వరముకాని పరమేశ్వరుడు సమంగా కొలువైయున్నట్లు చూడగల్గుటయే - ఆ ప్రాణి సామాన్య చండాలుడైతేనేమి విద్యా వినయ సంపన్నుడైతేనేమి *(5:18) -* నిజమైన దృష్టి కలిగియుండుట -
*సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి (13 :27 ) -* అని స్వయానా ఆ పరమాత్ముడే స్పష్టంగా చెబుతున్నప్పటికీ ?!
*(10 :42)* శ్లోకంలో - ఈ విశ్వమంతటా వ్యాపింపజేసిన నాయొక్క అంశను ఆధారం చేసుకొని ఈ విశ్వములో జీవిస్తున్న సర్వ చరాచర ప్రాణులలో జీవబీజమును - *(10 :39)* - నేనే అన్న వాస్తవ సత్యాన్ని తెలిసికొంటూ నన్నే భజించితే నువ్వు తప్పకుండా నన్ను చేరగలవు. ఇంతకు మించి తెలుసుకునే అవసరం ఏముంది అని ఈనాడు మనలనుకూడా ఆ పరమాత్ముడు ప్రశ్నిస్తున్నట్లేకదా ?
ఇదేకదా *2:46* శ్లోకపు భావం. ఇక్కడ ఈ విశ్వమంతా పరమాత్ముడే - పరబ్రహ్మమే - సజీవమైయున్న సర్వప్రాణులలో ఆత్మరూపాన్న ఇంకా ప్రాణుల బయట విశ్వమంతటా తన అవ్యక్తరూపాన్ని *(9:4 - మయా తతమిదం జగదవ్యక్తమూర్తినా)* వ్యాపించియున్నాడని తెలుసుకోగల్గిన బ్రహ్మజ్ఞానికి వేదాలు ఇంకా ఆవశ్యకమా -
*యావానర్థ ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః - ?!*
ఇప్పుడు పైన పేర్కొనబడిన *10 :39 , 42* శ్లోకాలలో ఉన్న భావమే *8 :22* మరియు *15 :7* శ్లోకాలలో ఎలా వెల్లడవుతోందో చూడండి :
*పురుషాహ్ స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా*
*యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతం (8 :22)*
*మమైవాంశో జీవలోకే* *జీవభూతః సనాతనః*
*మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్తాని కర్షతి (15:7)*
ఈ రెండు శ్లోకాలను కలిపి చదివితే :
ప్రకృతినుండి ఆరు ఇంద్రియములను తనయొక్క అంశతో ఆకర్షించి(నపిమ్మట) ఈ జీవలోకమున ప్రాణులలో సనాతన జీవాత్మగా నెలకొల్పి జీవింపజేసిన ప్రాణులన్నియునూ *(15:7)* ఏ పరమాత్మయందు నివసించుచున్నాయో (మరియు) ఏ పరమపురుషునిద్వారా ఈ సమస్త జగత్తు వ్యాపింపబడియున్నదో ఆ పరమపురుషుడు చలించని హార్దిక (హృదయపూర్వక) భక్తితో మాత్రమే పొందశక్యము *(8:22).*
అంటే పరమాత్ముడను భజించితే కేవలం అవ్యక్త అక్షర పరమాత్మగాకాక
సర్వప్రాణులలో ఆత్మగా కొలువైయుంటూ (అలా ఆ పరమాత్ముడను ఆత్మగా కలిగియున్న) ఆ సర్వప్రాణులనూ దారమునందు మణులవలె - *మత్తహ్ పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ *(7:7) -*
తనలో కూర్చుకొనియున్న పరమాత్మునిగా వాస్తవ్య జీవితంలో వీక్షిస్తూ - అంటే ఎవరిని చూసినా మొట్టమొదట మనలో ఆ పరమాత్ముని అవ్యక్త రూపం దిద్దుకొనేటటువంటి భక్త్గి కల్గియుంటే ఆ పరమాత్ముడు నిశ్చితంగా నిస్సందేహముగా లభ్యమౌతాడని ఆ పరమాత్ముడే చెబుతున్నట్లు స్పష్టంకదా.
అయితే ఈ విధమైనటువంటి భక్తి కల్గియుండాలంటే ముందుగా మనలో ఉన్న పరమాత్మ అంశం సర్వవిశ్వవ్యాప్తమై సర్వప్రాణులకూ ఆశ్రయమిస్తున్న పరమపురుషుడు మాత్రమేకాకుండా సర్వప్రాణులలో ఆత్మగా కొలువైయున్న పరమాత్ముని అంశం అని గ్రహించాలికదా.
అంటే మన కంటికి ఎవరు కనపడుతున్నా (ఏ జీవి కనపడుతున్నా) వారి స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ వారిలో ఉన్న శ్రీకృష్ణపరమాత్ముడే నాలోనూ ఉన్నాడు గనుక వారందరి స్థితులలో నన్నునేను (అంటే వారి దేహాన్న ఉన్న వారి ఆత్మ స్థానంలో నా ఆత్మను) ఉహించుకోగల్గుతూ వారందరినీ నేనున్న స్థితిలో (నా దేహమందున్న ఆత్మ స్థానంలో వారి ఆత్మను) ఉహించుకోగల్గాలికదా. అప్పుడే మన భక్తి *8:22* శ్లోకంలో ఆ పరమాత్ముడు కల్గియుండమని ఆదేశిస్తున్న భక్తితో సరితూగే భక్తి అవుతోందని భావించగలముకదా.
అంటే, ఒక విధంగా ఆ అవ్యక్త అక్షర పరమపురుషుడు తననే - సర్వప్రాణులకూ ఆశ్రయమివ్వగల తన పరమతత్త్వాన్నే - అనుకరించమంటున్నాడని స్పష్టంకదా.
ఇదే *6:29* శ్లోకముయొక్క తాత్పర్యం చూడండి :
*సర్వభూతస్థమాత్మానం* *సర్వభూతాని చాత్మని*
*ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్రా సమదర్శనః*
యోగముతో గూడుకొనిన మనస్సుగలవాడు సమస్త ప్రాణులయందును సమదృష్టిగలవాడై తనను సర్వప్రాణులయందున్న వానిగాను సర్వప్రాణులను తనయందున్నవిగాను చూచుచున్నాడు. (విద్యా ప్రకాశానందగిరి స్వాములవారి అనువాదం, కొన్ని మార్పులతో)
యోగమందు పరిపక్వతపొందిన యోగి ఎక్కడైనాకూడా నిష్పాక్షికముగానే ప్రవర్తించును గనుక తననుతాను ఇతరులైన అందరిలోనూ మరియు ఇతరులైన అందరినీ తనలో చూచును.
అంటే మోక్షం పొందతలంచువారు ఆ పరమాత్ముని ఈ తత్త్వాన్నే అనుకరించమని -
*జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్త్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున* - *4:9* శ్లోకంలో ఆ పరమాత్ముడు బోధిస్తున్నాడని స్పష్టంగా వెల్లడౌతోందికదా...
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు...
🙏🙏
:
శ్లోకం:☝️
*వేదన్తానామనేకత్వాత్*
*సంశయానాం బహుత్వతః l*
*వేదాస్యాప్యతిసూక్ష్మత్వాత్*
*న జానాతి గురుం వినా ll*
భావం: ఆధ్యాత్మికవిద్య గురుముఖతా రావాలి. వేతాంతమార్గములు అనేకములగుటచేతను, సంశయములు అనేకములగుటచేతను, తెలియదగిన బ్రహ్మము మిక్కిలి సూక్ష్మమగుటచేతను గురుదేవుడు వినా ఇది గోచారం కాజాలదు.
భక్తులను తరింపజేయుటకోసం ఆ సర్వాంతర్యామి తన దివ్యత్వాన్ని గురురూపంలో వ్యక్తపరుస్తాడు.🙏
:
ఓం నమః శివాయ
నవ_దిన_కాశీ_యాత్ర
కాశీలో 9 రోజులు ఉండాలి అనడంలో ఆంతర్యం ఏమిటి
మనిషి తల్లి గర్భం లో తొమ్మిది నెలలు ఉంటాడు. జన్మ రాహిత్యం ఇచ్చేది కాశి ఒక్కటే.. అందుకని వ్యాస మహర్షి కాశీ లో తొమ్మిది నెలలు దీక్ష లో ఉండి, అ తర్వాత స్వగ్రామం చేరి మంచి రోజు చూసి పూజ చేయాలి అని చెప్పాడు..
అయితే కలికాలం లో ఇంత శ్రద్ధతో అంతకాలం ఉండలేమని ఇంకేదైనా ఉపాయం చెప్పమని సామాన్యులు కోరారు.. దానికి అయన తొమ్మిది రోజులుంటే ఆ ఫలితం ఢోకా లేకుండా వస్తుంది అని చెప్పాడు. అలానే ఇప్పుడు సమయం ఉన్న వారందరూ కాశి లో తొమ్మిది రోజులుండి వస్తున్నారు
మరి ఆ రోజుల్లో ఏం చెయ్యాలి
విశ్వేశ్వర నామ స్మరణ,
దానాలు చేయటం,
ధర్మ ప్రసంగాలు వినటం,
ఏక భుక్తం,
ప్రాతఃకాల స్నానం,
ఉదయం, రాత్రి విశ్వేశ్వర దర్శనం,
కోపం లేకుండా ఉండటం,
అబద్ధమాడకుండా ఉండటం,
అనే ఎనిమిది అంశాలు ఖచ్చితంగా అమలు చేయాలి
మొదటి రోజు కార్యక్రమం
ఆగత్య మణి కర్న్యామ్తు –
స్నాత్వా దత్పధనంబహు –
వపనం కారయిత్వాతు –
స్నిత్వా శుద్ధాహ్ వయోవ్రతః
సచేల మభి మజద్యా ధ–
కృతా సంధ్యాధిక క్రియాహ్
సంతర్ప్య తర్మ్యాద పిత్రూన్ –
కుశ గంధ తిలొదకైహ్’’
మొదటిగా మనసులో ముప్పది మూడు కోట్ల దేవతలు, తీర్ధాలతో సర్వ పరివారంతో సేవింప బడుతున్న... శ్రీ కాశీ విశ్వేశ్వరా !శరణు !అనుజ్ఞ ! అని స్మరించుకొని మణి కర్ణికా తీర్దానికి వెళ్ళాలి. దీనినే చక్ర తీర్ధం అంటారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మహా దేవుని సేవలో ఇక్కడ ధన్యమైనాడు. శివుడికి పార్వతి తర్వాత ఇష్టమైన వాడు విష్ణువే . అందుకే ‘’నారాయణీ సహా చరయ నమశ్శివాయ ‘’అన్నారు..
విష్ణు సేవా ఫలితం గా ఏర్పడిన మణికర్ణిక కు గొప్పదనాన్ని ఆపాదించాడు విశ్వేశుడు.
యాత్రీకులు మణికర్ణిక లో స్నానం చేయాలి. బ్రాహ్మణులకు దానాలు చేయాలి..
కేశఖండనం చేసుకొని మళ్ళీ స్నానం చేయాలి..
మహేశ్వరాదులను అర్చించి మళ్ళీ స్నానం చేయాలి..
రుద్రాక్ష మాల ధరించి ఈ కింది శ్లోకం చదువు కోవాలి.
’కిము నిర్వాణ పదస్య భద్ర పీతం – మృదులం తల్ప మదోను మోక్ష లక్స్యః
అధవా మణి కర్ణికా స్థలీ పరమానంద సుకాండ జన్మ భూమి చరా చరేషు సర్వేషు- యావంతస్చ సచేతనః –తావంతిహ్ స్నాంతి మధ్యాహ్నే – మణి కర్నీజతే మలే..
ఆ గంగా కేశవస్చైవ –
ఆ హరిన్ద్రస్చ మండ పాత్ –
ఆ మద్ధ్యా ద్దేవ సరితః
స్వర్ద్వారా న్మణికర్ణికా
నమస్తే నమస్తే నమః‘’
అని నమస్కరించి అక్కడ నుండి డుండి వినాయకుడిని దర్శించి 21 గరికలను ,
21 కుడుములను సమర్పించి , 21 సార్లు గుంజీలు తీసి 21 రూపాయలు దక్షిణ గా సమర్పించాలి.
దున్దీ రాజ గణేశాన –
మహా విఘ్నౌఘనాశన –
నవాఖ్యాదిన యాత్రార్ధం –
దేహ్యాజ్ఞానం కృపయా విభో’’
అని ప్రార్ధించాలి . తర్వాతా అన్నపూర్ణా దేవిని సందర్శించాలి. ఆ తర్వాతా విశాలాక్షి , జ్ఞానవాపి, సాక్షి గణపతులను చూడాలి..
ఇది పూర్తీ చేసి నివాసం చేరి భోజనం చేయాలి. రాత్రికి విశ్వనాదుడిని దర్శించాలి..
ఫలాలు, పాలు ఆహారంగా గ్రహించాలి.
‘’హర సాంబ హర సాంబ సాంబ సాంబ హరహర –హర శంభో హర శంభో –శంభో శంభో హరహర మహాదేవ మహాదేవ విశ్వనాధ శివ శివ –
మహాకారి మహా కారి రక్ష రక్ష హరహర ‘’
అంటూ పదకొండు సార్లు భజన చేసి నిద్రపోవాలి.
రెండవ రోజు కార్యక్రమం
రెండో రోజు ఉదయానే గంగా స్నానం చేసి విశ్వేశ్వర , అన్నపూర్ణా దర్శనం చేయాలి.
మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణి కర్ణికా
ఘట్టం లో స్నానం చేయాలి. తీర్ధ శ్రాద్ధం చేయాలి. వెయ్యి సార్లు గాయత్రీ జపం చేయాలి.. గురు ఉపదేశం తో ....
‘’శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః ‘’ అనే మంత్రాన్ని వెయ్యి సార్లు జపించాలి. మధ్యాహ్నం విశ్వేశుని దర్శించి సాయంత్రం కూడా మళ్ళీ దర్శించాలి. రాత్రి ఫలహారం చేసి పడుకోవాలి
మూడవ రోజు కార్యక్రమం
తెల్లవారక ముందే అసీ ఘాట్ లో సంకల్ప స్నానం చేసి అక్కడున్న సంగమేశ్వర స్వామిని దర్శించాలి.. తర్వాత దశాశ్వ మేధ ఘాట్ కు చేరాలి. దీనికి ‘’రుద్ర సరోవర తీర్ధం ‘’అనే పేరు కూడా ఉంది.. ఇక్కడ స్నానం చేసి శీతలా దేవిని దర్శించాలి .
వరుణా ఘాట్ కు వెళ్లి స్నానం చేసి ఆదికేశవ స్వామిని దర్శించాలి. పంచనదీ తీర్ధమైన బిందు మాధవ ఘట్టం లో సంకల్ప స్నానం చేయాలి.
కిరణ దూత పాపాచ – పుణ్య తోయా సరస్వతీ గంగాచ యమునా చైవ –
పంచ నద్యోత్ర కీర్తితః ‘’
అని స్మరిస్తూ స్నానం చేయాలి .
తర్వాతా బిందు మాధవ సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి. మణి కర్నేశుని, సిద్ధి వినాయకుని దర్శించి పూజించాలి.. అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం కావించి నివాస స్థలం చేరి భోజనం చేయాలి. రాత్రికి పాలు , పండ్లు మాత్రమె స్వీకరించాలి .
నాల్గవ రోజు కార్యక్రమం
ఉదయమే గంగా స్నానం విశ్వేశరుడి దర్శనం చేసి డుండి వినాయకుడిని చూసి దండ పాణి అయిన కాల భైరవుని పూజించాలి..
కాశీ క్షేత్ర రాజ్యాన్ని మనసు లో స్మరించి..‘’ఓం కాశ్యై నమః ‘’అని 36 సార్లు అనుకోవాలి. తర్వాత బిందు మాధవుని దర్శించాలి.. గుహను, భవానీ దేవిని దర్శించాలి. ఇలా మధ్యాహ్నం వరకు తొమ్మిది దర్శనాలు చేసి మణి కర్ణిక చేరి మట్టి లింగాన్ని పూజించి మళ్ళీ అన్నపూర్ణా విశ్వేశులను దర్శించి భోజనం చేయాలి.
రాత్రి నామ స్మరణ పాలు,పండ్లు ఆహారం... అంటే ఈ రోజు పది దర్శనాలన్న మాట.
అయిదవ రోజు కార్యక్రమం
ప్రాతఃకాలమే గంగా స్నానం చేసి కేదారేశ్వరుని దర్శించి అక్కడే రుద్రాభిషేకం నిర్వహించాలి.. తర్వాతా తిలా భాన్దేశ్వర , చింతామణి గణపతిని సందర్శనం చేయాలి.. దుర్గా దేవిని చూసి ఒడి బియ్యం దక్షిణా సమర్పించి గవ్వలమ్మ ను చేరి అదే విధంగా పూజ చేయాలి.. ఈమెనే కౌడీబాయి అంటారు..
అన్నపూర్ణా విశ్వనాధ దర్శనం చేసి, భోజనం చేసి రాత్రి పాలు, పండ్లు తీసుకోవాలి.
ఆరవ రోజు కార్యక్రమం
సూర్యోదయానికి పూర్వమే గంగా స్నానం చేసి బ్రాహ్మణ ముత్తైదువులకు పూజ చేసి ఆశీస్సులు పొంది, వైధవ్యం ఎన్ని జన్మలకైనా రాకూడదని దీవెనలు పొంది మూసి వాయన చేటల దానాన్ని చేసి, బేసి సంఖ్యలో జనానికి వాయన దానాన్ని చేయాలి..
వ్యాస కాశీ చేరి వ్యాసుని, రామలింగేశ్వరుని,
శ్రీ శుకులను దర్శించి.., కాశీ వచ్చి అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేయాలి.. తర్వాత భోజనం చేయాలి.. రాత్రి సంకీర్తనతో కాలక్షేపం చేసి పాలు, పండ్లను స్వీకరించాలి.
ఏడవ రోజు కార్యక్రమం
గంగాస్నానం, నిత్య పూజా చేసి వెయ్యి గరిక లను ఏరి సిద్ధం చేసుకోవాలి. దొరక్కపోతే నూట ఎనిమిది తో సరి పెట్టుకోవాలి. ఇరవై ఒక్క ఉండ్రాళ్ళను, నూట ఎనిమిది యెర్ర పూలతో పూజించాలి.. ముగ్గురు బ్రాహ్మణ ముత్తైదువు లకు భోజనం పెట్టి తాంబూలాలు ఇవ్వాలి..
డుండి వినాయకుడిని అర్చించి , అన్నపూర్ణా ఆలయంలో కుంకుమ పూజ చేయించాలి. అమ్మవారికి చీరా జాకెట్టు, ఒడిబియ్యం , గాజులు సమర్పించాలి... ఇలాగే విశాలాక్షి కీ చేయాలి . విశ్వేశునికి అభిషేకం చేయాలి. సహస్ర పుష్పార్చన.., సహస్ర బిల్వార్చన ,
హారతి ఇచ్చి తీర్ధ ప్రసాదాలను స్వీకరించాలి. హర సాంబ హర సాంబ అంటూ పదకొండు సార్లు జపం చేయాలి.
ఎనిమిదో రోజు కార్యక్రమం
గంగాస్నానం, నిత్యపూజా తర్వాత కాల భైరవుడిని దర్శించి వడలు, పాయసం నివేదించాలి. ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి. ఆ రోజంతా కాల భైరవ స్మరణతో నిష్టగా గడపాలి.. అయిదుగురు యతులకు, ముగ్గురు బ్రాహ్మణ స్త్రీలకూ భోజనం పెట్టాలి.
దక్షిణా తాంబూలం సమర్పించాలి... భోజనం చేసి రాత్రి కాల భైరవ స్మరణ చేస్తూ
నిద్ర పోవాలి.
తొమ్మిదో రోజు కార్యక్రమం
గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం చేసి అన్నపూర్ణా దేవిని దర్శించి, పూజించి,
నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి.. జ్ఞానులైన దంపతులను పూజించి భోజనం పెట్టి దక్షిణ లివ్వాలి.. ఆశీస్సులు పొందాలి..
రాత్రి అన్నపూర్ణాష్టకం చేసి నిద్ర పోవాలి
పదవ రోజు కార్యక్రమం
నవ దిన యాత్ర పూర్తీ చేసి పదవ రోజు గంగా స్నానం చేసి గంగను పూజించి సహస్ర నామ పూజ చేసి, అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేసి తలిదండ్రులను, గురు దంపతులను పూజించాలి.. అందరి ఆశీర్వాదాలు పొంది ఇంటికి ప్రయాణమవ్వాలి.
ఇలా చేస్తే విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.
ఓం శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః