28, మార్చి 2023, మంగళవారం

సంప్రదాయంలో జడ ప్రాముఖ్యత

 *మన సంప్రదాయంలో జడ యొక్క ప్రాముఖ్యత*


గమనిక:- _*మన సంప్రదాయము వెనుక ఉన్న రహస్యమును తెలియజేసే ప్రయత్నమే తప్ప ఏ ఒక్కరినీ విమర్శించటం లేదా తప్పుపట్టటం నా ఉద్దేశ్యం కాదని మనవి.*_



            మానవశరీరము నుండి నిరంతరము విద్యుత్తు వంటి శక్తి విడుదల అవుతూ ఉంటుంది. దీనిని గమనించటానికి ఒక చిన్న పరీక్ష ఉన్నది. *మీ అరచేతిని వ్రేళ్ళను దూరంగా ఉంచకుండా ఒకవ్రేలికి మరొకవ్రేలు ఆనుకొనే విధంగా ఉంచి గమనించండి. మీ అరచేతి మధ్యభాగంలో ఒకరకమైన (దురద వంటి) స్పర్శ మీకు తెలుస్తుంది. అదే విధంగా రెండవ అరచేతిని కూడా సిద్ధపఱచండి. ఈ రెండు చేతులను ఒకదానికి ఒకటి ఎదురెదురుగా కొంతసేపు ఉంచి చూడండి. మీ రెండు చేతులమధ్య తేలికపాటి వికర్షణను మీరు గమనిస్తారు. అంటే మీ రెండు అరచేతుల నుండి శక్తి విడుదల అవటాన్ని మీరు గుర్తించారన్నమాట. ఇప్పుడు చేతులను అదేవిధంగా ఉంచి వ్రేళ్ళను దూరం చెయ్యండి. చేతులమధ్య ఏర్పడిన వికర్షణ శక్తి ఇప్పుడు ఉండదు.* దీనిని బట్టి ఏమి అర్థమైనది? *(చేతి వ్రేళ్ళ) కొసలు కలసి ఉన్నప్పుడు చేతులలో విడుదల అవుతున్న శక్తి నిలిపి ఉంచబడినది. వ్రేళ్ళు దూరంగా ఉంచినప్పుడు చేతులనుండి విడుదల అయిన శక్తి గాలిలో కలసిపోయినది.* మన పెద్దలు పిన్నలను ఆశీర్వదించే విధానంలో చేతివ్రేళ్ళను కలిపి ఉంచే ఆశీర్వదిస్తారు కదా! అంటే ఈ అరచేతులలోని శక్తిచేత పిన్నల తలభాగంలో ఉండే సహస్రారచక్రాన్ని ఉత్తేజితం చేస్తున్నారన్నమాట. 


          ఇదే విధంగా వస్త్రధారణ చేసేటప్పుడు వస్త్రముల కొసలను బయటకు వ్రేలాడకుండా దోపుకోవటమనేది సంప్రదాయంలో ఉన్నది. మన పెద్దలు కూడా ఆవిధంగా వస్త్రధారణ చేయాలని చెబుతూ ఉంటారు. దీని అంతరార్థం ఏమంటే?... మన శరీరమును ఆవరించి ఉన్న వస్త్రపుకొనలనుండి కూడా మన శరీరంలో ఉత్పన్నమయ్యే శక్తి బయటకు వెళ్ళిపోతుందన్నమాట. ఆవిధంగా శక్తి నష్టం జరుగకుండా వస్త్రధారణలో జాగ్రత్తలు అవసరం. 


           అదేవిధంగా జుట్టును విరబోసుకొన్నప్పుడు జుట్టు కొనలనుండి శరీరములోని శక్తి... ప్రథానంగా సహస్రారచక్రముతో సంబంధమున్న జుట్టు నుండి శక్తి నష్టం జరుగుతుంది. యోగవిధానంలో మన శరీరంలోని చక్రాలన్నిటిలో తలలో ఉండే సహస్రారచక్రం అత్యంత ప్రాధాన్యత కలది. ఈ సహస్రారచక్రము మన మెదడు(మనస్సు) తో సంబంధాన్ని కలిగి ఉంటుంది. జుట్టుకొనలనుండి శక్తిని మనం నష్టపోయినప్పుడు మెదడు (మనస్సు) ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రమాదం జరుగకుండా మన పెద్దలు జుట్టును అల్లుకొని కొనలను వదిలేయకుండా మడతపెట్టి కట్టుకోవటం లేదా ముడి (చుట్ట) చుట్టుకోవటం వంటి పద్ధతులను నేర్పారు. 


జడను అల్లుకోవటంలో మరొక సూత్రం ఉన్నది. జడను అల్లినప్పుడు మూడు పాయలు ఏర్పడతాయి. ఈ మూడు పాయలు మన వెన్నుద్వారా మూలాధారము నుండి సహస్రారము వరకు వ్యాపించి ఉన్న ఇళ పింగళ సుషుమ్న నాడులకు సంకేతములు. మూలాధార చక్రమునందు ఉండే కుండలినీశక్తి సహస్రారమునకు వెన్నులో వ్యాపించి ఉన్న ఇళ పింగళ సుషుమ్న నాడుల ద్వారానే సహస్రారమునకు ప్రయాణము చేస్తుంది. ఇటువంటి యోగరహస్యములను ముడిబెట్టి మన పెద్దలు జడలను అల్లుకోవలెనని, విరబోయకూడదని, జడను చుట్టగా చుట్టుకోవాలని చెప్పటం జరిగింది. 


ఈ రహస్యజ్ఞానాన్ని అందుకొన్నవారు అనుసరిస్తున్నారు. అనుసరించనివారు వారిదైన వాదములను వినిపిస్తున్నారు. ఎవరికీ ఏమీ చెప్పలేము కదా! అందరికీ నమస్కరించి ఊరుకోవటమే మన పని. 

మీ 

*~శ్రీశర్మద*

8333844664

కామెంట్‌లు లేవు: