24, నవంబర్ 2023, శుక్రవారం

Sewing tools


 

Truck driver girl


 

Useful knot


 

Sewing technique


 

Panchaag


 

Best sewing tip


 

Shocking magic


 

Great jump


 

Stitching technique


 

Nile River


 

భల్లూకము కడుపులోన

 👍 మాడుగుల నాగఫణి శర్మ గారు సహస్రావధానం చేశాక, మేడసాని మోహన్ గారు పంచ సహస్రావధానం చేశారు. దానికి, పులివర్తి శరభాచారి గారు చేసిన గణితావథానానికి, ఆ మధ్య ఘంటసాల గాి పాటల మీద ఒక Doctor చేసిన అవధానానికి నేను వెళ్ళాను.

“భల్లూకము కడుపు లోన భానుడు క్రుంగెన్”

అన్న సమస్యకు ఒక కవిగారు చేసిన👇ఈ

“అల్లంత పొద్దు కాడను

విల్లందుక వేటగాడు వేయదొడంగెన్

విల్లంపు నొక్క బాణము

భల్లూకము కడుపులోన, భానుడు క్రుంగెన్” అన్న అధ్భతమైన పూరణలు ఇంకా నాకు గుర్తున్నాయి.

 ఎన్ని భోగాలు అనుభవించినా ఆత్మకు దూరంగా ఉన్నంతకాలం నీ బంధనం తొలగిపోదు.


ఇంత పని చేశాను, ఇంకా ఇంత పని మిగిలి ఉంది అనే ద్వందాలనుండి బయటపడు.


మోక్షాన్ని పొందాలనే కోరికతో సహ అన్ని కోరికలు త్యజించు.


ఆత్మశక్తి శరణు పొందు.

అప్పుడు నిజమైన విశ్రాంతి లభిస్తుంది. అప్పుడు నువ్వు ముక్తానందుడివి అయిపోతావు.


చూస్తూ, తాకుతూ, వింటూ, తింటూ తాగుతూ, ఎల్లవేళలా ఆత్మస్పృహ కలిగి ఉన్నట్టయితే నిన్ను ఏ పాపము అంటదు, మనస్సు ఎన్నడూ దుఃఖించదు.


ఈ విధంగా ఉన్నవాడు జీవన్ముక్తుడే.


ప్రపంచం దృష్టిలో నిద్రపోతూ, ఆత్మలో మేల్కొని ఉన్నవారు 

అదృష్టవంతులు.


వారు పరమానందాన్ని అనుభవిస్తారు.


తనలోని తనని ఆత్మగా తెలుసుకుని, తనలోనే అంటే ఆత్మలోనే లీనమై, తనలోనే తృప్తి పొంది, తనలో తానే తగ్నమౌతాడు.

Daring wings suit


 

Striching technique


 

 ||శ్రీమాత్రేనమః||

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*అద్వైతదర్శనము - ఉపనిషత్సిద్ధాంతము*

------------------కర్మసిద్ధాంతమును తదనుగుణమైన పునర్జన్మ సిద్ధాంతమును తొలుదొలుత లోకమునకు ఉపదేశించినది వేదము. 

   లోకమున దుఃఖమునకు కారణము జన్మ. జన్మకు కారణము సంసారమందు ప్రవర్తించుట. సంసారమున ప్రవృత్తికి కారణము రాగద్వేషములు. వీనినే దోషములని శాస్త్రజ్ఞులు వ్యవహరింతురు. రాగద్వేషమునకు కారణము మిత్యాభూతమైన జగత్తు సత్యమని , యథార్థమని భ్రమించి ప్రవర్తిల్లుట. 

        జగత్తు ' మిథ్య'యని దృఢనిశ్చయము కలిగినవానికిమిథ్యాభూత ప్రపంచమును గూర్చిన రాగద్వేషములుదయింపవు. రాగద్వేషములు లేనివారికి సంసారమున ప్రవృత్తియుండదు  సంసారమున ప్రవృత్తి లేనివారికి జన్మ యుండదు. జన్మలేనిచో దుఃఖమేలేదు. దుఃఖము లేనివానికి అద్వయానందాత్మ స్వరూపస్థానమే మోక్షము. 

            ఉపనిషత్తులు స్థూల సూక్ష్మ కారణ శరీరములు మూడు ఉండునని చెప్పుచున్నవి. జాగ్రద్దశయందు స్థూలశరీరాభిమానముతో పురుషుడు ప్రవర్తించును. అట్టి జీవునకు ' విశ్వు ' డనిపేరు. స్వప్నదశ యందు స్థూలశరీరాభిమానముండదు. తైజసమైన అంతఃకరణ తాదాత్మ్యముండదు. తైజసరూపుడై మనోవిలాసములగు స్వాపనికపదార్థానుభవము తత్ప్రయుక్తమైన సుఖదుఃఖాద్యనుభవము కలిగియుండును. ఈ స్థితి యందు సూక్ష్మశరీరాభిమానియై జీవుడు ' తైజస ' నామముతో వ్యవహరింపబడును. గాఢ సుషుప్తి యందు ఇంద్రియములతోపాటు మనస్సుకూడా లయముచెందును. జీవుడు కారణ శరీరాభినివిష్ఠుడై యుండును. దీనిని సంప్రసాదావస్థయందురు. ఈ అవస్థయందు ' ప్రాజ్ఞ ' నామముతోజరుగును. " నకించి దవేదిషం - సుఖ మహ మస్వాప్సం " యనెడి అనుభూతులు కలిగి యుండును. మరల ప్రాక్తన సంస్కారవశమున జాగ్రత్ప్రపంచమునను ; మరల స్వప్న ప్రపంచమునను తిరిగి కారణావస్థను పొందుచుండును. సుషుప్తియే దైనందిన ప్రళయము. జీవుడు స్థూలదేహమును విడచి సూక్ష్మ శరీరమును సుక్శ్మశరీరమును విడచి కారణశరీరమును మరల ఆ శరీరమును విడచి స్థూలాది శరీరమును బొందుట అనుభవసిద్ధమైన విషయము. అట్లే శరీరపాతానంతరము జీవుడు సూక్ష్మ శరీరముతో పుణ్యపాపానుభవ భోగసాధకములైన శరీరములనుదాల్చి , ఆ యా పుణ్యలోకముల చరించుచుండును. తిరిగిభోగానుభవానంతరం కర్మఫలానుభవయోగ్యము లైన నా యా శరీరముల దాల్చును. మానవుని శరీర పాతానంతరం తిరిగి నరజన్మ పాండునంతవరకు జీవుడే యే దశలయందు ఏ యే రూపమున ఏ యే యవస్థల గాంచునో పంచాగ్ని విద్యా ప్రకరణము ఉపనిషత్తులు విపులుగా వివరించినవి.

విదురనీతి

 విదురనీతి

శ్లో)విరోచన సుధన్వాయం ప్రాణానామీశ్వరస్త వ సుధన్వన్పున రిచ్ఛామి త్వయాదత్తం విరోచనమ్॥


అ)విరోచనా! ఈసుధన్వుడు నీ ప్రాణాలకధిపతి. సుధన్వా! విరోచనుణ్ణి నాకప్పగించుమని నిన్ను కోరుతున్నాను

 ఉద్ధవగీత

శ్లో)ఆత్మావ్య యో గుణః శుద్ధః స్వయంజ్యోతిరనానృత, | అగ్ని వద్దారువదచిద్దేహః కస్యేహ సంసృతిః ॥


అ)ఆత్మ నాశనము లేనిది, రాగాదిశూన్య మైనది, శుద్ధమైనది పాప పుణ్యాది రహితమైనది), అగ్నివలె స్వప్రకాశమైనది, ఆవరణశూన్యమైనది, కాని దేహము కాష్ఠమువలె అచేతనమైనది, కనుక ఈ రెండింటిలో దేనికి సుఖదుఃఖాద్యనుభవ ముండును

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


పుట్టిన బిడ్డడు రోదిస్తున్నాడు. తల్లి ఉంటే చన్ను కుడిపేది. ఇప్పుడు ఏమిటి చెయ్యడమా అవి

మంత్రులు మల్లగుల్లాలు పడుతున్నారు. అప్పుడు ఇంద్రుడు తన చూపుడు వేలిని (దేశిని) అందించి

మామ్ (నన్ను) ధాతా (నా చేతివేలిని చీకును) అన్నాడు. అప్పటినుంచీ అతడికి అదే నామధేయమయ్యింది.

అందరూ మాంధాత మాంధాత అన్నారు. మహాబలిష్ఠుడై చాలాకాలం భూగోళాన్ని పరిపాలించాడు.

(అధ్యాయం - 9, శ్లోకాలు - 630

కం ధాస్యతి కుమారో యం మంత్రిణశ్చుక్రుశుర్భృశమ్ |

తథేంద్రో దేశవీం ప్రాదా న్మాంధాతేత్యవదద్వచః

సోఽభవద్బలవాన్ రాజా మాంధాతా పృథివీపతిః

తదుత్పత్తిస్తు భూపాల ! కథితా తవ విస్తరాత్


ఆ మాంధాత సర్వభూగోళాన్ని జయించి చక్రవర్తి అయ్యాడు. దస్యులు ఇతనికి భయపడి

గాఢారణ్యాలలోకి పారిపోయి కొండగుహలలో దాక్కున్నారు. ఈ లోకోపకారానికి సంతోషించి దేవేంద్రుడు

త్రవదస్యుడు అనే బిరుదునిచ్చి గౌరవించాడు.

శశబిందు మహారాజుగారి గారాల కూతురు బిందుమతి ఇతనికి పట్టమహిషి ఈ దంపతులకు

ఇద్దరు తనయులు కలిగారు. పురుకుత్సుడు - ముచుకుందుడు. వీరిలో పురుకుత్సుడికి అరణ్యకుడు

జన్మించాడు. పరమధార్మికుడు. ఇతని కుమారుడు పితృభక్తి పరాయణుడైన బృహదశ్వుడు. ఇతనికి

హర్యశ్వుడు తనయుడు. హర్యశ్వుడి కొడుకు త్రిధన్వుడు. త్రిధన్వుడి సంతానం అరుణుడు.

సత్యవ్రతుడు త్రిశంకుడైన తీరు

ఈ అరుణుడి సుపుత్రుడు సత్యవ్రతుడు. మహాపాపాత్ముడు. కామలోలుడు. ఒక విప్రకన్యను

పెళ్ళిపీటలమీదనుంచి అపహరించాడు. బ్రాహ్మణులంతా కలిసి హాహాకారాలు చేస్తూ అరుణుడికి

మొరపెట్టుకున్నారు. తనయుడు చేసిన దుర్మార్గానికి అరుణుడు మండిపడ్డాడు. దేశబహిష్కారం

విధించాడు. శ్వపచులతో కలిసి అడవుల్లో నికృష్టంగా జీవించమని గెంటేశాడు. వాడు అడవుల్లోకి పోయి

కవచమూ ధనుర్బాణాలూ ధరించి శ్వపచులతో జీవించసాగాడు.

వెడుతూ వెడుతూ కులగురువులుగదా వసిష్ఠులవారు తండ్రికి చెప్పి కోపం చల్లారుస్తారేమోనని

ఆశపడి అభ్యర్థించాడు. వసిష్ఠుడు నిష్కర్షగా తిరస్కరించడమేకాదు అరుణుడి చర్యను సమర్థించాడు. ఈకఠినశిక్షకు తండ్రిని ప్రేరేపించింది ఈయనగారేనని గ్రహించి సత్యవ్రతుడు వసిష్ఠులపై అలిగి

గత్యంతరంలేక శిక్షను శిరసావహించి అరణ్యాలకు వెళ్ళాడు.

Shooting


 

Stitching technique


 

Target

 https://youtube.com/shorts/v-NhcR6ZdyA?si=BCWDOCirccJ97om5


యుద్ధం

 యుద్ధం యుద్ధం యుద్ధం

మానవజీవనమేవ

ఏకం యుద్ధం


భార్యాయాః జీవనం ఏకం యుద్ధం

భర్తుః జీవనం ఏకం యుద్ధం

పుత్రస్య జీవనం ఏకం యుద్ధం

పుత్ర్యాః జీవనం ఏకం యుద్ధం


యుద్దం యుద్ధం యుద్ధం

మానవజీవనమేవ 

ఏకం యుద్ధం


జననమ్ ఏకం యుద్ధం

జీవనమ్ ఏకం యుద్ధం

మరణమ్ ఏకం యుద్ధం

దహనమ్ ఏకం యుద్ధం


యుద్దం యుద్ధం యుద్ధం

మానవజీవనమేవ 

ఏకం యుద్ధం


కార్యకర్తుః జీవనమ్ 

ఏకం యుద్ధం

యం.ఎల్.ఏ జీవితం

ఏకం యుద్ధం

రాజకీయనేత జీవితం

ఏకం యుద్దం 

మానవజీవనమేవ

ఏకం మహా యుద్ధం


యుద్దం యుద్ధం యుద్ధం

మానవజీవనమేవ 

ఏకం యుద్ధం


సమ్భాషణ సంస్కృతమ్

(వార్తావాహినీ)

పార్వతి సుందర రూపం !

 పార్వతి సుందర రూపం !


          చ:  జిలుగగు  వల్కలాంచెలము  చెన్నయి  చన్నులమీఁద  జాఱఁగా


                 నలుకఁ  దుషార శైలసుత   యవ్వలి మోమయి , నాలుగేన్  పదం


                 బులు  సని , భ్రూకుటీ  కుటిల  ముగ్ధ లలాట  ముఖేందు  బింబయై


                 మలఁగి  కనుంగొనెన్  భుజగ   మండనుఁడైన   శఠ ద్విజోత్తమున్.


                  హరవిలాసము--4  ఆ--35 వ  పద్యము;  శ్రీనాధమహకవి. 


                         పార్వతి  తపమును గాంచి  యామెమనో నిశ్చమును  తెలిసికొనఁగోరి  మాయా బ్రహ్మచారియైపరమేశ్వరుడు

అరుదెంచిన సందర్భము.


                       కఠినపదములకు అర్ధములు:  జిలుగు- తళుకు : వల్కలాంచలము-నాఱచీర కొంగు;చెన్నయి- అందగించి;  తుషారశైలసుత- హిమవత్పర్వత కుమారి; అవ్వలి - అటువైపు; భ్రుకుటీ- నుదిటిపై బొమముడిపాటు;కుటిలము-వంపుదిరుగుట;

మగ్ధ-చూడచక్కని ;లలాట-నుదురు; ముఖేందు బంబమై-చంద్రునిబోలు  ముఖముగలదియై;  మలగి-వెనుదిరిగి; మండనుడు- అలంకారములు గలవాడు; శఠ ద్విజోత్తమున్-  శఠుడైన ( అప్రియ వచనములు చెప్పు) ద్విజోత్తమున్- బ్రాహ్మణుని;


                భావము:-  మెఱపులీనే  నారచీర చెంగు  అందముగా  స్తనముల  పైనుండి జారగా, కోపవశమున  పార్వతి  యటుమోమయి, నాలుగైదు  అడుగులు ముందుకు నడచి, బొమ ముడిపాటుతో  నందగించిన  చందమామనుబోలు 

ముఖముగలదియై  సర్పభూషణుడై  నిలచిన యా  విప్రియ వాక్కులుబల్కు  బ్రహ్మచారిని  వెనుదిరిగి  చూచినది.


                విశేషాంశములు: "చక్కనమ్మ చిక్కినా అందమే!"  అనేది సామెత. అదిపార్వతి యెడల చక్కగా సరిపోయినది.తపఃకృశయై

యున్న నగజ మనోనిశ్చయమును బరీక్షింప మాయామాణవకుడై శివుడరుదెంచు  సమయమునకామె మిగుల చిక్కియుండుట నీ

పద్యము సూచించుచున్నది.


                     రాచ కన్నెయే యైనను  వల్కలమును దాల్చుట  యామె తపోనుష్ఠాన విధాయకమగు వస్త్రధారణను సూచించు చున్నది.

బ్రహ్మచారిమాటలకు కోపము వచ్చినది. సంవాదమును ముగించి ఆవలిమొగమై నాలుగైదు పదములు నడచుట ఆమెవైముఖ్యమును

సూచించుచున్నది. లాలాటమునందు బొమముడితో నందగించిన మోము ,ఆమెమదిలో రేగుచున్న యాలోచనలను సూచించుచున్నది. మలగిచూచుట- ఆమెలోని ఆశక్తిని దెలుపుచున్నది.పరమేశ్వరుడు భుజగ మండనుడై యగుపించుట. ఆమెను పరీక్షించుట పూర్తియగుటకు సంకేతము. 


             స్తనమండలమునుండి  జిలుగ పైటజారుట, అందమొలుక నడచుట , బొమముడిపాటుతో  వెనుదిరుగుట, మొన్నగునవి


                               శ్రీనాధుని శృంగార రసావిష్కరణమునందలి చిట్కాలు.


             మొత్తానికి  యీపద్యంలో  శ్రీనాధుని రచనా శిల్పం అనల్పమై  పార్వతి  సౌందర్యానికి మెఱుపులు దిద్దిందనక తప్పదు.


                                                                                  స్వస్తి!

 ||శ్రీమాత్రేనమః||

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*అద్వైతదర్శనము - ఉపనిషత్సిద్ధాంతము*

------------------కర్మసిద్ధాంతమును తదనుగుణమైన పునర్జన్మ సిద్ధాంతమును తొలుదొలుత లోకమునకు ఉపదేశించినది వేదము. 

   లోకమున దుఃఖమునకు కారణము జన్మ. జన్మకు కారణము సంసారమందు ప్రవర్తించుట. సంసారమున ప్రవృత్తికి కారణము రాగద్వేషములు. వీనినే దోషములని శాస్త్రజ్ఞులు వ్యవహరింతురు. రాగద్వేషమునకు కారణము మిత్యాభూతమైన జగత్తు సత్యమని , యథార్థమని భ్రమించి ప్రవర్తిల్లుట. 

        జగత్తు ' మిథ్య'యని దృఢనిశ్చయము కలిగినవానికిమిథ్యాభూత ప్రపంచమును గూర్చిన రాగద్వేషములుదయింపవు. రాగద్వేషములు లేనివారికి సంసారమున ప్రవృత్తియుండదు  సంసారమున ప్రవృత్తి లేనివారికి జన్మ యుండదు. జన్మలేనిచో దుఃఖమేలేదు. దుఃఖము లేనివానికి అద్వయానందాత్మ స్వరూపస్థానమే మోక్షము. 

            ఉపనిషత్తులు స్థూల సూక్ష్మ కారణ శరీరములు మూడు ఉండునని చెప్పుచున్నవి. జాగ్రద్దశయందు స్థూలశరీరాభిమానముతో పురుషుడు ప్రవర్తించును. అట్టి జీవునకు ' విశ్వు ' డనిపేరు. స్వప్నదశ యందు స్థూలశరీరాభిమానముండదు. తైజసమైన అంతఃకరణ తాదాత్మ్యముండదు. తైజసరూపుడై మనోవిలాసములగు స్వాపనికపదార్థానుభవము తత్ప్రయుక్తమైన సుఖదుఃఖాద్యనుభవము కలిగియుండును. ఈ స్థితి యందు సూక్ష్మశరీరాభిమానియై జీవుడు ' తైజస ' నామముతో వ్యవహరింపబడును. గాఢ సుషుప్తి యందు ఇంద్రియములతోపాటు మనస్సుకూడా లయముచెందును. జీవుడు కారణ శరీరాభినివిష్ఠుడై యుండును. దీనిని సంప్రసాదావస్థయందురు. ఈ అవస్థయందు ' ప్రాజ్ఞ ' నామముతోజరుగును. " నకించి దవేదిషం - సుఖ మహ మస్వాప్సం " యనెడి అనుభూతులు కలిగి యుండును. మరల ప్రాక్తన సంస్కారవశమున జాగ్రత్ప్రపంచమునను ; మరల స్వప్న ప్రపంచమునను తిరిగి కారణావస్థను పొందుచుండును. సుషుప్తియే దైనందిన ప్రళయము. జీవుడు స్థూలదేహమును విడచి సూక్ష్మ శరీరమును సుక్శ్మశరీరమును విడచి కారణశరీరమును మరల ఆ శరీరమును విడచి స్థూలాది శరీరమును బొందుట అనుభవసిద్ధమైన విషయము. అట్లే శరీరపాతానంతరము జీవుడు సూక్ష్మ శరీరముతో పుణ్యపాపానుభవ భోగసాధకములైన శరీరములనుదాల్చి , ఆ యా పుణ్యలోకముల చరించుచుండును. తిరిగిభోగానుభవానంతరం కర్మఫలానుభవయోగ్యము లైన నా యా శరీరముల దాల్చును. మానవుని శరీర పాతానంతరం తిరిగి నరజన్మ పాండునంతవరకు జీవుడే యే దశలయందు ఏ యే రూపమున ఏ యే యవస్థల గాంచునో పంచాగ్ని విద్యా ప్రకరణము ఉపనిషత్తులు విపులుగా వివరించినవి.

శ్రీ శ్రీహరి మందిర్

 🕉 మన గుడి : నెం 248



⚜ గుజరాత్ : పోర్‌బందర్


⚜ శ్రీ శ్రీహరి మందిర్  



💠 శ్రీహరి మందిర్ గుజరాత్‌లోని పోర్‌బందర్‌లోని వీర్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రసిద్ధ దేవాలయం.

భారతదేశంలో వేద విద్యను అందించే ప్రధాన విద్యా సంస్థలలో ఒకటి మరియు పోర్‌బందర్‌లో తప్పక సందర్శించవలసిన ప్రదేశాలలో ఒకటి.


💠 సాందీపని విద్యానికేతన్ అని కూడా పిలుస్తారు, శ్రీ హరి మందిర్ వాస్తవానికి వేద విద్య మరియు హిందూ మతం యొక్క ఆచారాలలో ఆచరణాత్మక శిక్షణను రిషికుల విద్యార్థులకు అందించే సంస్థ.


💠 ఇది రాజస్థాన్ నిర్మాణ శైలిలో నిర్మించబడింది, అనేక మంది విద్యార్థులు తమను తాము నమోదు చేసుకున్నారు మరియు వివిధ హిందూ ఆచారాల గురించి వేద జ్ఞానాన్ని పొందారు.  

వేద జ్ఞానాన్ని పొందుతున్న విద్యార్థులకు ఇది ఇల్లుగా, పాఠశాలగా మరియు కార్యస్థలంగా ఉపయోగపడుతుంది.


💠 సాందీపని విద్యానికేతన్ అని కూడా పిలువబడే శ్రీహరి మందిర్ 85 ఎకరాల భూమితో 1992లో స్థాపించబడింది.


💠 ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ నారాయణుడు,

 శ్రీ రాధా కృష్ణుడు, కరుణామయిమా దేవత, శ్రీ జానకీ వల్లభుడు, హనుమంతుడు, గణేశుడు మరియు శ్రీవేదదేవి దేవతలు ఉన్నారు.


💠 ఋషికుల విద్యార్థులకు హిందూ ఆచారాలను అమలు చేయడానికి ఆచరణాత్మక శిక్షణను అందించడానికి ఆలయం నిర్మించబడింది.  

ప్రస్తుతం, ఈ ఆలయం వేద విద్యను అందించే ప్రధాన విద్యా సంస్థలలో ఒకటి.  

ఆలయం 2006లో పూర్తయింది మరియు మందిర ప్రారంభోత్సవానికి గుర్తుగా ‘సాందీపని మందిర్ మహోత్సవ్’ అనే కార్యక్రమం నిర్వహించబడింది.  

ఆలయంలో 2000 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఆడిటోరియం ఉంది;  

ఇది సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఉపయోగించబడుతుంది. 


💠 ఇటీవల పూజ్య బాపు మహాత్మా గాంధీజీ మరియు కస్తూర్బా మరియు సుదామ మరియు సుశీల విగ్రహాలు మందిర్ సముదాయంలో చేర్చబడ్డాయి.  

ఎత్తైన విగ్రహాలు ప్రతి సందర్శకుడికి సత్యం మరియు అహింస మరియు సుదాము యొక్క విశ్వాసం మరియు భక్తి గురించి గాంధీజీ బోధనలను గుర్తు చేస్తాయి.


💠 85 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం రాజస్థానీ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. 

ఈ స్మారక చిహ్నం 105 అడుగుల పొడవు మరియు దాని మొత్తం సముదాయం మొత్తం 66 స్తంభాలను కలిగి ఉంది.


💠 శ్రీ హరి మందిర్ ఒక హిందూ పుణ్యక్షేత్రం మరియు విద్యా సంస్థ. 

ఈ ప్రదేశాన్ని సందర్శించే ముందు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. 

ఈ పవిత్ర స్థలంలోకి తోలు వస్తువులు, మద్యం, మందుగుండుసామగ్రి సరఫరా మొదలైన వాటికి అనుమతి లేదు.


💠 పోర్‌బందర్ రైల్వే స్టేషన్ నుండి 8 కి.మీ దూరం

క్షీరాబ్ధి ద్వాదశి

 🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

*క్షీరాబ్ధి ద్వాదశి (చిల్కు ద్వాదశి)*

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔



క్షీరాబ్ధి ద్వాదశి (చిల్కు ద్వాదశి) ...రేపే ఈ పర్వదినం 

కార్తీక మాసము అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది. శివ కేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే! అయితే ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ధి ద్వాదశి (చిలుకు ద్వాదశి) అత్యంత పవిత్రమైంది. 

కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని ప్రారంభం చేసిన రోజు కనుక ఈ రోజును" క్షీరాబ్ధి ద్వాదశి "అని పిలుస్తారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరమథనం ప్రారంభించినది ఈరోజే. అందుకే ఈ రోజుకి" మధన ద్వాదశి" అని, అమృతం కోసం సాగరాన్ని మందర పర్వతంతో చిలికారు. కనుక చిలుకు ద్వాదశి అని అంటారు. ఈ రోజునే "దామోదరద్వాదశి", "యోగీశ్వరద్వాదశి "అని కూడా అంటారు. 


"ఉత్థానైకాదశి" అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాడ శుద్ధ ఏకాదశినాడు తన యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశినాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే "ఉత్థాన ఏకాదశి "అనే పేరు. ఉత్థాన ఏకాదశి( రేపు) నాడు శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. అందుచేతనే తులసి మొక్క వద్ద క్షీరాబ్ధి ద్వాదశి నాడు దీపములు వెలిగించి పూజలను జరపడం అనాదిగా వస్తున్న ఆచారం. కనుక స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీ ధాత్రి (తులసికోట) దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలతో తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు. 


ఈ రోజున తులసి మొక్క వద్ద శ్రీమహావిష్ణువు స్వరూపంగా ఉసిరి మొక్కను ఉంచి పూజలు చేస్తారు. ముఖ్యంగా చాలామంది చేసే పెద్దపొరపాటు ఉసిరి చెట్టులేదని బజార్లలో అమ్మే ఉసిరి కొమ్మలను తీసుకొని వెళ్లి తులసి వద్ద పెట్టి పూజ చేస్తుంటారు. అది శాస్త్ర విరుద్ధం. ఉసిరి చెట్టు వద్దనే పూజ చేసుకోవడం లేదా నర్సరీ (చెట్టు పెంచే)వద్ద చిన్న కుండీల్లో ఉసిరి చెట్టును తెచ్చుకునైనా పూజచేసుకుంటే మంచిది. కార్తీకమాసంలో ఎట్టిపరిస్థితుల్లో ఉసిరి చెట్టు కొమ్మలను విరవడం, నరకడం వంటి పనులు చేయకూడదని శాస్త్రవచనం. క్షీరసాగర మధనములో జన్మించిన తేజోభరితమైన అమృతకలశహస్తయై సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు దేవ దానవ సమక్షములో వివాహమాడుతాడు . అందుకనే కొన్ని ప్రాంతాలలో ఆచారమును బట్టి శ్రీ మహాలక్ష్మికి, శ్రీమన్నారాయుణునికీ వివాహము చేసెదరు. 


బృందా దేవి శాపము వల్ల లోకానికి మహోపకారం జరిగి శ్రీమహావిష్ణువు సాలగ్రామ రూపమును ధరించినది .ఈ మహోత్కృష్టమైన రోజే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి.

క్షీరాబ్ధి ద్వాదశి నాడు శివకేశవ అభేదంగా ఉదయం శ్రీమహావిష్ణువును కార్తీక దామోదరునిగా భావించి పూజలను చేసి, సాయంత్రం తులసి, ఉసిరి మొక్కలకు సభక్తి పూర్వకంగా పూజలనుచేసి సాలగ్రామ, దీపదానములను చేయుటవల్ల గత జన్మలలో చేసిన పాపరాశి ధ్వంసం అవుతుందని ప్రతీతి.

చిన్ననాటి ముచ్చట్లు.

 *చిన్ననాటి ముచ్చట్లు..*


" మాది కౌశికస గోత్రము..మేము ఆరువేల నియోగి బ్రాహ్మణులము..నాపేరు తలుపూరు కామసుందర రావు..మేము కామాక్షీఅమ్మవారి భక్తులం..అందువల్ల నాకు మా తల్లిదండ్రులు కామ సుందరరావు గా నామకరణం చేసారు..మాది నెల్లూరు జిల్లా..ఆనంతసాగరం మండలం లోని రేవూరు మజరా ఇసుకపల్లె గ్రామం..అంటే..ఈ దత్తాత్రేయ స్వామివారి మేనమామ గారి ఊరు..మా పెదతండ్రి గారు ఆవూరికి కరణం గా పనిచేసేవారు..రేవూరు మజరా ఇసుకపల్లె గ్రామం గా రికార్డులలో ఉంటుంది.. నేను సంస్కృత లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయ్యాను..ఇప్పటికీ మేము అక్కడే నివాసం వుంటున్నాము.." 


ఈమధ్య ఒక ఆదివారం నాడు పై మాటలు చెప్పిన శ్రీ కామసుందర రావు గారు దంపత్సమేతంగా మొగలిచెర్ల గ్రామం లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..వారిని చూడటం అదే మొదటిసారి...శ్రీ దత్తాత్రేయ స్వామివారి మేనమామ నుంచి వచ్చారు కనుక..సహజంగానే శ్రీ స్వామివారి బాల్యం గురించి కొంత సమాచారం తెలిసి వుంటుందనే ఉద్దేశ్యంతో వారిని ఆనాటి విశేషాలు చెప్పమని అడిగాను..


"ఈ స్వామివారు చిన్నతనం నుంచీ మాకు బాగా తెలుసు.. వాళ్ళ మేనమామ గారైన నారా వెంకటప్ప నాయుడు గారి పెద్ద కుమారుడు నారా బలరామానాయుడు గారు ఆ ఊరు మునసబు గా పనిచేస్తుండేవారు..మా పెదనాన్నగారు కరణం.. కనుక మా రెండు కుటుంబాలకు..అదే విధంగా శ్రీ స్వామివారి కుటుంబం తోనూ బాగా సాన్నిహిత్యం వుండేది..వాళ్ళు మొత్తం ఐదుగురు అన్నదమ్ములు..స్వామివారి తండ్రిగారు వేమయ్య నాయుడు..కొంతకాలానికి ఆ కుటుంబం నెల్లూరు జిల్లా లోని తూర్పు ఎర్రబల్లె గ్రామం వద్ద కొంత పొలం కొనుక్కొని..అక్కడే స్థిరపడి వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు..శ్రీ స్వామివారు చిన్నతనం నుంచీ మా ఇంటికి వస్తూ పోతూ వుండేవారు..తూర్పు ఎర్రబల్లె కు వెళ్లిన తరువాత..ఈయన సన్యాసం తీసుకున్నారు..ఏర్పేడు వ్యాసాశ్రమం లో ఉన్న రోజుల్లో కూడా ఒకటి రెండు సార్లు మా గ్రామానికి స్వామివారు వచ్చి వెళ్లారు..అప్పుడు కూడా మా ఇంటికి వచ్చారు..ఇక్కడ మీకోక ముఖ్య విషయం చెప్పాలి...మాకు తెలిసిన ఒక స్త్రీమూర్తి క్షయ వ్యాధితో బాధ పడుతూ ఉండేది..ఆమె కోసం స్వామివారు ప్రత్యేకంగా పూజ చేసారు.. సహజంగా స్వామివారు ఎవ్వరికీ జాతకాలు చెప్పడం..పూజలు చేయడం చేసినట్లు మా దృష్టికి రాలేదు కానీ..ఈ మనిషి కోసం పూజ చేసారు.." 


"శ్రీ స్వామివారు మా పెద నాన్నగారి ఇంటికి వచ్చినప్పుడు..ఆ ఇంటిముందు ఒక రాతి బండ ఉండేది..ఆ రాతి బండ క్రింద రాళ్లు పేర్చి అరుగులా వుంచాము..దానిమీద కూర్చునే వారు..ఆరోజుల్లో మేము బ్రాహ్మణులము కనుక..ఇతర కులస్తులు మా ఇళ్లకి వస్తే నేల మీద కూర్చునే వారు..స్వామివారు ఈ రాతి బండ మీద కూర్చునే వారు..ఇప్పుడు మేము మా ఇల్లు అంతా ఆ పాత రూపు రేఖలు మార్చివేసి..మళ్లీ కొత్తగా కట్టుకున్నాము కానీ..శ్రీ స్వామివారు కూర్చున్న రాతి బండ ను మాత్రం భద్రంగా మా ఇంటి ఆవరణలోనే వుంచాము..నేను వయసులో చిన్నవాడిని..నన్ను ఆశీర్వదించారు" 


"ఏది ఏమైనా..ఈ మహానుభావుడితో మాకూ కొంత అనుబంధం..సాన్నిహిత్యం ఉండటం మా పూర్వజన్మ సుకృతం..ఇన్నాళ్లకు ఆయన సమాధి మందిరాన్ని దర్శించుకోగలిగాము..చాలా ఆనందంగా ఉంది..మళ్లీ మళ్లీ ఇక్కడకు వస్తుంటాము.." అని శ్రీ కామ సుందరరావు గారు ఎంతో సంతోషంతో చెప్పుకొచ్చారు..


శ్రీ దత్తాత్రేయ స్వామి గా కొలువబడుతున్న ఈ అవధూత గురించి ఏదైనా సమాచారం తెలుసుకుంటున్నప్పుడు మా దంపతులము ఒకరకమైన ఆహ్లాదానికి గురవుతూ ఉంటాము..ఆ అనుభూతి ఎవరికి వారే అనుభవించాలి..కానీ మీబోటి దత్త భక్తులతో పంచుకుంటే..మరింత ఆనందంగా వుంటుంది..


సర్వం..

శ్రీ దత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలము..వయా కందుకూరు..SPSR నెల్లూరు జిల్లా..పిన్ కోడ్ : 523 114..సెల్ : 99089 73699 & 94402 66380)

సుభాషితం

 *జైశ్రీరామ్*


                       7-5-2020

                      అభ్యాసం-9


                    *సుభాషితం* 


"కాలః పచతి భూతాని

  కాలం సంహరతే ప్రజాః |

  కాలః సుప్తేషు జాగర్తి

  కాలోహి దురితక్రమః"||


                        *భావం* 


కాలమే సకల ప్రాణులను సృష్టిస్తుంది, కాలమే సర్వప్రాణులను సంహరి‌స్తుంది.లీనమై నిదురించిన కాలమే తిరిగి మేల్కొంటుంది,సృష్ఠిక్రమాన్ని ప్రారంభిస్తుంది.అందుకే కాలదర్మాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు.

       విత్తు మొలకెత్తటానికి, మొక్క చిగురించటానికి, చిగురించిన మొక్క మొగ్గ తొడగటానికి, మొగ్గ పుష్పంలా వికసించటానికి, పువ్వు కాయలా మారటానికి,కాయ పండుగా మారటానికి కాలమే కారణం.

      కాలం మహా వేగవంతమైనది. దానికి పురోగమనమే గాని, తిరోగమనం లేదు.


                    *అమృతవచనం* 


*మాననీయ*దత్తోపంత్*ఠేంగ్డీ** జీ (1920-2004) స్వదేశీ జాగరణ మంచ్, భారతీయ మజ్దూర్ సంఘ్ మరియు  భారతీయ కిసాన్ సంఘ్ సంస్థల  వ్యవస్థాపకులు) ఇలా అన్నారు:

 *అనుశాసనం* గురించి వారు మాట్లాడుతూ చాలామంది నిర్భంధం ద్వారా అనుశాసనం ఏర్పడుతుందని భావిస్తారు.కాని సంఘంలో పై స్థాయి అధికారులు స్వయంగా అనుశాసనాన్ని పాటిస్తూ, తమ స్వీయ ఉదాహరణ ద్వారా అందరిలోనూ అనుశాసనబద్ధతను నిర్మాణం చేస్తూ వచ్చారు.దీనినే ఠేంగ్డే జీ *పారివారిక* *అనుశాసనం* అన్నారు.సంఘంలో స్వయం ప్రేరణతోనే అనుశాసనం పాటించబడుతుంది."సమాజ సంఘటన,రాష్ఠ్రీయ పునర్నిర్మాణం అనే మన ధ్యేయాన్ని సాధించడానికి సంఘ కార్యపద్ధతి స్వయం పూర్ణమైనదని మన విశ్వాసం.దానికి పరిపూరకమైన మరొక కార్యపద్దతి ఏదీ అవసరం లేదు.దానికి ప్రత్యామ్నాయం కూడా లేదు.


                  శ్రీవేంకటేశ్వర్లు వబిలిశెట్టి


.

రోగాలకూ కారణమూ

 🅄🅂🄴🄵🅄🄻 🄸🄽🄵🄾🅁🄼🄰🅃🄸🄾🄽

*అన్ని రోగాలకూ కారణమూ... "మనస్సే", విరుగుడూ... "మనస్సే"    “జపాన్ శాస్త్ర వేత్తలు చేసిన వివిధ ప్రయో గాలలో ఆశ్చర్య కర విషయాలు వెలుగు చూశాయి.*


 *ఇంత కాలం మనం "గుడ్డి"గా నమ్ముతున్న అనేక ఆరోగ్య సమస్యలకు మూలాలు మనం తీసుకునే ఆహారం లో లేవని,"మనం జీవించే విధానం లోనే ఉన్నాయని"*

*మనసును హాయిగా ఉంచు కున్న వారికి     ఏ రోగాలు రావని వారు తేల్చి చెబు తున్నారు. అమెరికాలో జరిగిన మరో సర్వేలో కూడా మనసు బాగున్న వారు ఎక్కువ కాలం జీవిస్తున్నారని తేల్చారు.          మనసు కలత బారితే లేని పోని ఆలోచనలు చోటు చేసుకుని వాటి నుంచి బైటపడ డానికి "బలహీనతలు" పెంచు కోవడం, వాటికి బానిసలై "దురలవాట్ల" పాలై పోవడం వంటివి చేస్తున్నారని వారు తేల్చారు.           ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి, "జీవన శైలి"ని సరి దిద్దే పనిలో పడ్డారు.*


      _అందుకే డయాబిటిక్, బిపి వంటి నిరంతర అనారోగ్యకర అంశాలకు డాక్టర్లు ట్రీట్‌ మెంట్ ఇచ్చే పద్ధతి మార్చు కున్నారు._

    

*ఇది వరకు తిన కూడదు*

     *అన్న అన్ని రకాల*

     *ఆహారాన్ని నిరభ్యంతరంగా*

    *తిన మంటున్నారు.*


_పొద్దుటే వాకింగ్ వెళ్ళే వారు ప్రశాంతమైన మూడ్‌లో ఉండాలని అందు కోసం నచ్చిన పాటలు విన మంటున్నారు._


*ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయ మంటున్నారు. కొందరు "వాకింగ్" ఇష్టపడితే మరి కొందరు జిమ్‌కు వెళ్ళాలను కుంటారు. ఇంకొందరు "బ్రిస్క్‌వాక్" చేయాలనుకుంటే, ఇంకొందరు "స్టెయిర్ కేస్  వాక్"  చేయాలను కుంటుంటారు. అందుకని డాక్టర్లు పేషెంట్ల ఇష్టానికే విడిచి పెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయ మని సూచిస్తున్నారు.*


      ఒక్క సారిగా వీరి వైఖరి

      ఇలా మారి పోడానికి

      కారణం సరికొత్త

      అధ్యయనాలలో

      వెలుగు చూస్తున్న అంశాలే

      కారణం. 

*ఇలా వెల్లడైన అనేక పరి శోధనల ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన, అధ్యయనం సరికొత్తది.          దీనిలో పాల్గొన్న సైంటిస్టులు ఏం చెబు తున్నారో చూద్దాం.*  


*➢    "మానసిక ఒత్తిడి" వల్ల గ్యాస్ ::*

       కడుపులో  గ్యాస్ సమస్యను వాయువు అంటారు.                ఇది రావ డానికి, ముదర డానికి కారణం  ఆహార లోపాల వల్ల కాదట.  

"మానసిక ఒత్తిడి" వల్ల ఎక్కువ వస్తుందట !


*➢  "ఆవేశ కావేశాల" వల్లే అధిక రక్తపోటు ::*


     ఉప్పు ఎక్కువగా తినే వారి కంటే 

"ఆవేశ కావేశాలను" అదుపులో పెట్టుకోని వారిలోనే  "అధిక రక్తపోటు" ఎక్కువట !


*➢   "అతి బద్ధకం" వల్ల చెడు కోలెస్టరాల్ ::*


        కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే  అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలోనే చెడు కోలెస్టరాల్ ఎక్కువట!


*➢   "మధుమేహం" సమస్య: తీపి పదార్థాలు అధికంగా తినే వారిలో కంటే,*

       "అధిక స్వార్ధం", 

       "మొండితనం"

*ఉన్నవారి లోనే ఎక్కువట !*


*➢  "అతి విచారం" వల్ల ఆస్త్మా  ::*


    ఊపిరి తిత్తులకు గాలి అందక పోవడం కంటే, 

అతివిచారం వల్లనే ఊపిరి తిత్తులలో మార్పులు వచ్చి ఆస్త్మా వస్తుందట... 


*➢   "ప్రశాంతత" లేక గుండె జబ్బులు ::*


ధమనుల్లో రక్తం ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లనే గుండె కొట్టు కోవడంలో మార్పులు వస్తున్నాయట.


అందువల్ల మనిషికి గుండెజబ్బులు వస్తున్నాయట. 


*మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు "మూల కారణాలు" తరచి చూస్తే "ఆహార అలవాట్ల" వల్లకాదని లైఫ్‌ స్టయిల్ సంబంధ మైన వేనని తెలుస్తోంది. అందుకు వారు వివిధ కారణాలను చూపించారు.         వారి అధ్యయనం ప్రకారం-* 


  *  50% ఆధ్యాత్మికత

      లోపంవల్ల

  *  25% మానసిక కారణాల

      వల్ల

  *  15% సామాజిక,

      స్నేహబాంధవ్యాల లోపం

      వల్ల

  *  10% శారీరక కారణాల

       వల్ల...

*రోగాలు వస్తున్నాయి. అందువల్ల "కడుపు మాడ్చుకుని" ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడేకన్నా, "జీవన శైలి"ని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలని జపాన్ సైంటిస్టులు అంటున్నారు.* 


*వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండా లంటే* 


       -  స్వార్ధం, 

       -  కోపం, 

       -  ద్వేషం, 

       -  శత్రుత్వం, 

       -  ఆవేశం, 

       -  అసూయ,

       -  మొండితనం, 

       -  బద్ధకం, 

       -  విచారం, 


*వంటి "వ్యతిరేక భావాల"ను వదిలించు కోవాలి.*


       -  కారుణ్యం, 

       -  త్యాగం, 

       -  శాంతం, 

       -  క్షమ, 

       -  నిస్వార్ధం, 

       -  స్నేహభావం,

       -  సేవాభావం, 

       -  కృతజ్ఞత, 

       -  హాస్య ప్రియత్వం,

       -  సంతోషం , 

       -  సానుకుల దృక్పథం

పెంచు కోవాలి.”☝️


🌼💝💝🌼


👏👌👌👏

మన అద్దంకోడు

 *మన అద్దంకోడు!*


🎬🎼📽️


అది 1945 ప్రాంతం. మధ్యాహ్నం రెండు గంటలైంది. అద్దంకి లోని రామాటాకీసు వద్ద

జనాలు గుమికూడి ఉన్నారు. ఎడ్లబళ్ళల్లా కట్టుకోని సినిమా చూడటానికి జనం వచ్చారు. కలవకూరు నుంచి వచ్చిన ఆసామి "మా రామయ్య పంతులు తెర మీద కనపడ్తారుట" అన్నాడు. ప్రక్కన ఉన్న అద్దంకి శెట్టి గారు శాంతయ్యతో..

 

“ఒరే శాంతయ్య, మన అద్దంకోడు, అదేరా! మన వెంకట్రాయుడు కొడుకు, అయిదోవాడు శ్రీరామ్మూర్తి సినిమాల్లో చేరాడట్రా ." అన్నాడు.


తిమ్మాయపాలెం కన్నయ్య పంతులు "అవునన్నా! పాదుకా పట్టాభిషేకం సినిమాలో దశరథుని వేషం వేస్తున్నాడు." అన్నాడు.


అవున్రా ఎంత పెద్దోడయ్యాడ్రా!వీడు. ఈ పిల్లగాడు చిన్నప్పుడు మన బుజ్జయ్య హార్మోనియం వాయిస్తే పద్యాలు పాడేవాడు. పద్యాలు నేర్చుకోవడానికి కలవకూరు నుండి మన తిమ్మాయపాలెం వచ్చేవాడ్రా!" అంటూ మన చల్లా సుబ్రహ్మణ్యం సినిమాకు టిక్కెట్లు ఇవ్వడేంటిరా! శాస్త్రుర్లు” అన్నాడు కన్నయ్య పంతులు తమ్మునితో.


అప్పడే జట్కా బండి నుండి దిగి వస్తున్న సినిమా హాలు యజమాని చల్లాసుబ్రహ్మణ్యం కన్నయ్య పంతుల్ని "బాబాయి" అని

పలకరించి, సినిమా హాలులో కూర్చోబెట్టి, సినిమా ప్రారంభ సూచకంగా గంటను మ్రోగించమని, గుమస్తాకు చెప్పి, మరో గుమస్తా నాగయ్యకు టిక్కెట్లమ్మటానికి పురమాయించాడు. సినిమా ఆపరేటర్ కాంతారావు రీలు ఎక్కించాడు.


ఈ లోపు జనాలు తోసుకుంటూ లోపలకు వచ్చారు. నేల టిక్కెట్లు పుల్ అయినాయి. బెంచి టిక్కెట్లు కూడా పూర్తిగా అమ్ముడు పోయాయి. మనూరోడి సినిమా కదరా, హాలు నిండిపోతుంది. కేబిన్ టిక్కెట్లు కూడా అమ్ము” అన్నాడు చల్లా సుబ్రహ్మణ్యంగారు. 


నేల టిక్కెట్టు పావలా, బెంచి టిక్కెట్టు అర్థ రూపాయి, కుర్చీ టికెట్టు ముప్పావల, కాబిన్ టిక్కెట్టు రూపాయి. కాబిన్ లో అద్దంకి డాక్టర్ ఉప్పలపాటి సుబ్రహ్మణ్యం, డాక్టర్ వెంకట రత్నం గారు, మునుసుబ్ పాపయ్యగారు, ఎస్సై గారు, తాసిల్దారు గారు ఉన్నారు. మన ఊరి అబ్బాయి సినిమాల్లోకి వెళ్ళాడని, గొప్పోడయ్యాడని, చిత్తూరు నాగయ్య, సి.యస్ ఆర్, కన్నాంబ, బొమ్మరాజు వారి అడపడుచు భానుమతి వాళ్ళతో నటిస్తున్నా డని తెలిసి, చిన్నా, పెద్ద అందరూ సినిమా చూడటానికి వచ్చారు. 


ఇంతలో గంట మ్రోగింది. లైట్లాపారు. తెల్లటి గుడ్డ పైన లైటు ఫోకస్ పడింది. తమాషాగా పేర్లు ఎగిరెగిరి తెర మీద పడుతున్నాయి.

వింత వింత శబ్దాలు చెవికి చేరుతున్నాయి. తారాగణం అన్న టైటిల్ పడగానే మన అద్దంకి శ్రీరామ్మూర్తి పేరు పడింది. జనాలు ఈలలు వేశారు. చప్పట్లకొట్టారు. శ్రీరామ్మూర్తి నటన అద్భుతమని మెచ్చుకున్నారు. 


ఇంటర్వెల్ అయ్యింది. 


“అబ్బూర్ని మించి పోయాడ్రా మనోడు” అన్నాడు కన్నయ్య పంతులు శాస్త్రుర్లయ్య తో.


“అవునన్నా” అని గుప్పెడు వేయించిన శెనక్కాయలు అన్న చేతీలో పోసి, మళ్ళా హాల్లోకి వెళ్ళారు. కైక వరాలడగడం జరిగింది, రాముణ్ణి అడవులకు పంపాలనటం, భరతు నికి పట్టాభిషేకం చేయాలనే సీను వచ్చింది. దశరథుని పాత్రలో జీవించాడు శ్రీరామ్మూర్తి గారు. సినిమాలో దశరథునితో పాటు హాల్లో ఉన్న వాళ్ళు గొల్లుమన్నారు. తమ పిల్లాణ్ణి అడవులకు పంపించినట్లుగా జనం బాధపడ్డారు. సినిమా అయిపోయింది. అందరూ దశరథుని పాత్ర గూర్చే మాట్లాడుకుంటున్నారు.


అద్దంకి కి కొత్తగా వచ్చిన ఎస్సైకి గ్రామ మునుసుబు పాపయ్య గారు అద్దంకి వారి గూర్చి అంతా వివరంగా ఇలా చెప్పసాగాడు. తెలుగు నాటక రంగాన దశరథ పాత్రకు పేటెంట్ అద్దంకి శ్రీరామ్మూర్తి. నాటకరంగాన ఒక ధ్రువతారగా వెలుగొంది, సినీ రంగాన ప్రవేశించిన గాయకుడు, నటుడు అద్దంకి శ్రీరామ్మూర్తి. అద్దంకి వెంకట్రాయుడు, లక్ష్మీ నరసమ్మల అయిదవ సంతానం వీరు. వెంకట్రాయుడు గారిది అద్దంకి. వృద్ధాప్యంలో వెంకట్రాయుడు గారు కల్వకూరులో స్థిరపడ్డారు.


దశరథునిగా,ధర్మరాజుగా, రాజరాజ నరేంద్రు నిగా, శివయోగిగా, కణ్వమహర్షిగా, హరిశ్చంద్రునిగా, మహరాష్ట్రంలోనే గాక ఇతర రాష్ట్రాలలో కూడా తన వాచికం, అభినయంతో మెప్పించి జన్నభూమి అద్దంకికి 

ఖ్యాతి తెచ్చిన తొలితరం రంగస్థల నటుడు అద్దంకి. గజారోహణ,గండ పెండేరాది సత్కారాలు అందుకున్నారు. సంగీత విద్వాన్, నాట్రకళావిశారద బిరుదులు పొందారు. 1935 లో చిత్రరంగంలో ప్రవేశించారు.1945 లో పాదుకాపట్టాభిషేకం విడుదలైంది. ఈ సినిమా శ్రీరామ్మూర్తి గారికి పేరు ప్రఖ్యాతలు సాధించిపెట్టింది.


పాపయ్య గారి ద్వారా శ్రీరామ్మూర్తి గారి విషయాలు విన్న ఎస్సైగారు ఆనందానికి లోనయ్యారు. అద్దంకికి ఘనత తెచ్చిన అద్దంకి వారిని స్మరిస్తూ వారి విగ్రహం అద్దంకి లో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అది వారికిచ్చే గౌరవమని ఎస్సై గారు తలపోశారు.


- పుట్టంరాజు

 చుకోవాలి; కాని నోరు మూసుకొని ఉండాలి. శరీర ఆరోగ్యం బాగుపడుతుంది. మనసు నిర్మలంగ ఉంటుంది. భగవంతుడు నిన్ను కలుసుకోవడానికి ఆతృత పడిపోతుంటాడు.     ***** సత్యం ఇది. దాని మానాన దాన్ని ఉండనివ్వు. మొదట నిన్ను నీవు క్షమించడం నేర్చుకో. జరిగిన సంఘటనను సానుభూతితో పరిశీలించు. పరిస్థితులను సక్రమంగా అంచనా వెయ్యి. అంతవరకు నీవు ముందుకు సాగిపోలేవు.        ***** చివరగా మూడు (అ)సాధారణ సూత్రాలు.      1* నువ్వు కోరుకున్నదానివెంట పడకపోతే అది నీ జీవితకాలంలో నీకు లభించదు.                           2* నీవు ప్రశ్నించనంతవరకు, నీకు సరియగు సమాధానం లభించదు.                          3* నీవు ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యనంతకాలం నువ్వు ఉన్నచోటనే వుంటావ్!            - - - - - - - - - - - - - - - - - - - - - - -                                      Answers to ""Sharpen your mind!                           1* Mount Everest has always been the tallest mountain, even before being discovered!                        2* A ship's anchor.          3* Time table & Multiplication table(s).                               4* Wake up.                     5* Fire.                                ~~~~~~~~~~~~~~~~~~.                                  తెలుగు వారి పొడుపు కథలు మరియు విడుపులు.                           1* నేను సంధ్యవేళలో వికసిస్తాను. ఆపై గుబాళిస్తాను. నేనెవరిని? (మల్లెపువ్వు)                          2* నిండు నీళ్ళబావి; దారే లేదు. ఏమిటది? (టెంకాయ లేదా కొబ్బరికాయ)                       3* సావిటిలో సద్దుకర్ర; కరణాల చేతిలో ములుగర్ర.( వ్రాత కలం)        4* వెయ్యికళ్ళ జంతువు; నీళ్ళలో వేటాడబోయింది. ఏమిటది? (చేపలు పట్టే వల)                                     5* శాస్త్రం చెన్నప్ప; నేల గీరప్ప; అవసరం తీరింతర్వాత మూలన నక్కప్ప. ఏమిటది? ( పార)   తేది 24--11--2023, శుక్రవారం, శుభోదయం.

ఆలోచనాలోచనాలు

 ///// ఆలోచనాలోచనాలు /////        (అక్షర రూపం దాల్చిన ఒక సిరాచుక్క; లక్ష మెదళ్ళకు కదలిక)                                * కంటితో చూచిన దానిని సగం నమ్మవచ్చు; మరి చెవులతో విన్నదానిని పూర్తిగా విడిచివేయవచ్చు.    ***** శ్రమించడాన్ని విడిచి జీవించడం అంటే "ఓటమికి" పట్టాభిషేక ఏర్పాట్లలో మునిగితేలడమే!                         ***** నన్ను నేను విశ్లేషించుకొనే తీరుబడి నాకు దొరికితే, ప్రస్తుతం నేనున్న స్థితి, నేను చేరవలసిన స్థితి, దానికి గల మార్గదర్శనం సుస్పష్టంగా నాకు గోచరిస్తుంది.                         ***** జీవితాన్ని ప్రేమించేవారెవరైనా కాలాన్ని వ్యర్థపరచరు.           ***** తన స్వంత జీవితాన్ని ఒక సాక్షిలాగా దర్శించగల వ్యక్తిని ఐహిక బాధల వలలు బంధించలేవు. ( శ్రీ రామకృష్ణ పరమహంస, భగవాన్ రమణమహర్షులు  వంటి మహనీయులు చేసిందదే!)                           ***** మన ఆలోచనలు మానవత్వంతో పరిపూర్ణమై ఉంటే మనం ఆరోగ్యవంతులుగ పరిగణింపబడతాం!                ***** భగవాన్! నన్ను నరకంలో ఉంచు. నేను బాధపడను. కానీ మంచిమిత్రులు, మంచి పుస్తకాలు, జాగృతమైన అంతరాత్మ --- వీటిని మాత్రం నా నుండి తొలగించకు!                         ***** ప్రతి రోగి మోసుకుంటూ తిరిగేది తన డాక్టర్ల సూచనలను.             ***** నోటిలో లోహాన్ని ఉంచి, జేబునుండి నోట్లను వెలుపలికి తీయగల నైపుణ్యం, ఒక్క దంతవైద్యునికే సాధ్యం.         ***** నయం చెయ్యడం కాలానికున్న ప్రభావం; డబ్బును,కీర్తిని స్వంతం చేసుకోవడం వైద్యుని నేర్పరితనం.                             ***** ఒక మంచి సూచన. మీకు, నాకు మరియు మన అందరికీ! వీలయినంత ఎక్కువగా కండ్లు తెరచివుం

టచ్‌తోనే జీవితం...

 నిజమే కదా మరి...  

1. ఇది గడియారాన్ని తినేసింది 

2. ఇది టార్చ్ లైట్‌ను తినేసింది 

3. ఇది పోస్టు కార్డుల్ని తినేసింది 

4. ఇది పుస్తకాల్ని తినేసింది 

5. ఇది రేడియోను మింగేసింది 

6. ఇది టేప్‌రికార్డర్‌ను తినేసింది 

7. ఇది కెమెరాను మాయం చేసింది 

8. ఇది కాలిక్యులేటర్‌ను తినేసింది 

9. ఇది ఇరుగుపొరుగుతో దోస్తీ తినేసింది 

10. ఇది బంధుత్వాల్ని తినేసింది 

11. ఇది మన మెమొరీని తినేసింది 

12. థియేటర్ లేదు నాటకం లేదు, 

టీవీ లేదు, ఆట లేదు, పాట లేదు...  

ఇదే బ్యాంకు,

ఇదే హోటల్,

ఇదే కిరాణ షాపు...  

ఇదే డాక్టర్, 

ఇదే జ్యోతిష్కుడు...  

అసలు మార్కెట్ అంటేనే ఇది...  

బయటికి వెళ్తే కదా... 

అంతా వర్క్ ఫ్రమ్ ఫోన్...  

అంతా స్మార్ట్ ఫోన్‌దే రాజ్యం...  

మనిషి పిచ్చోడవుతుంటే ఫోన్ స్మార్ట్‌గా మారుతోంది. 

వేలు ప్రపంచాన్ని, మనిషి జీవితాన్ని శాసిస్తోంది...

నోరు మ్యూట్‌లో ఉంది...  

ఎస్, నిజమే... టచ్‌తోనే జీవితం...  

కానీ ఎవరూ టచ్‌లో లేరు..!

రాశి ఫలితాలు

 *24-11-2023*

*రాశి ఫలితాలు*

*భృగు వాసరః శుక్రవారం*

*మేషం*

చేపట్టిన  వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ధన పరంగా చేసే ప్రయత్నాలు కలసి రావు. వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగమున  స్థానచలన సూచనలున్నవి. ఇతరులతో వాతావరణ  విభేదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

*వృషభం*

 ప్రయాణాలలో  ఆర్థిక లాభాలు కలుగుతాయి.  ఉద్యోగమున  అధికారుల అనుగ్రహంతో  ఉన్నత హోదాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

*మిధునం*

వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు మిత్రులతో రాకతో గృహమున సందడి వాతావరణం నెలకొంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మికసేవ కార్యక్రమాల్లో  పాల్గొంటారు. ఉద్యోగమున  పని ఒత్తిడి ఉన్నప్పటికీ  సకాలంలో పూర్తి చేస్తారు.

*కర్కాటకం*

విలువైన గృహోపకరణాలు  కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల  నుండి తెలివిగా బయట పడతారు. అనుకున్న సమయానికి పనులు  పూర్తి చేస్తారు.   కుటుంబమున  శుభకార్యా ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగ విషయంలో అధికారుల   సహాయం లభిస్తుంది.

*సింహం*

వృత్తి వ్యాపారాలలో అది కష్టంతో స్వల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగమున  అదనపు బాధ్యతలు నిర్వహించడం కష్టం అవుతుంది.   కుటుంబ సభ్యులతో  మాట పట్టింపులు ఉంటాయి. సంతాన పరంగా ఊహించని సమస్యలు  కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది.

*కన్య*

ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సౌకర్యాలు లోటు ఉండదు. విలువైన వస్తువులు  కొనుగోలు చేస్తారు. నూతన వాహన లాభం కలుగుతుంది. మిత్రుల సహాయంతో  కొన్ని  పనులు  పూర్తిచేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమౌతాయి. స్ధిరాస్తి  సంభందిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

*తుల*

ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తా. చేపట్టిన పనులలో ఆటంకాలుతొలగుతాయి. చిన్ననాటి మిత్రులకు  శుభకార్య విషయాలు చర్చిస్తా. ఆదాయం మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో  కీలక  నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

*వృశ్చికం*

 ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తికావు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది  కాదు. భాగస్వామ్య వ్యాపారాలలో  విభేదాలు  కలుగుతాయి. వృత్తి, ఉద్యోగమున అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు   భాదిస్తాయి.

*ధనస్సు*

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో  జాప్యం కలుగుతుంది. ఆకస్మిక  ప్రయాణాల వలన  శారీరక శ్రమ తప్పదు. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలుసందర్శిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

*మకరం*

దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం  ఆనందం కలిగిస్తుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ముఖ్యమైన  వ్యవహారాలు నిదానంగా  సాగుతాయి. విద్యార్దులు నూతన విద్యావకాశాలు పొందుతారు. వ్యాపారమున ఆటంకాలు తొలగుతాయి. వృత్తి, ఉద్యోగమున కష్టానికి తగిన గుర్తింపు పొందుతారు.

*కుంభం*

చేపట్టిన  వ్యవహారాలలో   స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. ఇంట బయట ఊహించిన సమస్యలు కలుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక  మార్పులు చోటు చేసుకుంటాయి.  బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపార వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి  ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

*మీనం*

ఆత్మీయుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. పాత  మిత్రులతో విహారయాత్రలలో పాల్గొంటారు. చేపట్టిన  వ్యవహారాలు సజావుగా  సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

🕉️

భక్తిసుధ

 🕉️🪔  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️

🪔 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 🪔


*శ్లోకం*


*శ్రీమత్ప యోనిధి నికేతన చక్రపాణే* ! 

*భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే* !

*యోగీశ శాశ్వత శరణ్య! భవాబ్ది పోత* ! 

*లక్ష్మీ నృసింహ ! మమదేహికరావలమ్బమ్* ||


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం-01_* _


*తా:: పాలసముద్రము నివాసముగా గల ఓ దేవా! హస్తమున చక్రమును ధరించినవాడా ! ఆది శేషుని పడగలయందలి రత్నములచే ప్రకాశించు దివ్య దేహము కలవాడా! యోగులకు ప్రభువైన వాడా! శాశ్వతుడా! సంసార సాగరమునకు నావయగువాడా లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము.

నవగ్రహా పురాణం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *86వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*గురుగ్రహ చరిత్ర - 2*


*"పాపిష్టిదానా ! ఎంతకు తెగించావు నువ్వు ? నన్ను ఘోరపాపం చేయమంటున్నావా ? ఎంత ధైర్యం నీకు ?”*


పుంజికస్థల చిన్నగా నవ్వింది. *"మీరు అమాయకులు స్వామీ ! మీ భార్య తారాదేవి. ఆశపడి అందుకున్న సుఖం మీరు అందుకుంటే పాపమెలా అవుతుంది స్వామీ ! అన్ని సుఖాలూ అక్కడే వదిలిపెట్టి , ఇక్కడ మీ సేవకే అంకితమైపోయి , పందిరిలేని తీగలా ఎండిపోతూ ఉండిపోయాను. నా పరిచర్యలతో బాటు నా శరీరాన్నీ మీకు అర్పిస్తాను. స్వీకరించండి ! చేరదీసి ప్రియురాలిగా ఆదరించండి ! ఈ అప్సరస కోరిక తీర్చండి !"*


బృహస్పతి ఆశ్చర్యంతో , ఆగ్రహంతో ఆమె ముఖంలోకి చూశాడు. పుంజికస్థల కళ్ళల్లో కామం ఎర్రగా మండుతూ కనిపిస్తోంది. ఉబ్బినట్టున్న ఎర్రటి పెదవులు కోరికతో అదురుతున్నాయి. తడిగా మెరుస్తూ , బృహస్పతి చూపులు అసహ్యంగా , అప్రయత్నంగా కిందకి జారాయి. ఇంకా పైట వేసుకోని పుంజికస్థల శరీరం మీద ఆవేశం కెరటంలా పొంగుతూనే ఉంది. ఆయన చూపుల్ని అపార్ధం చేసుకున్న పుంజికస్థల ఉద్రేకంగా బృహస్పతి వైపు రాబోయింది.


*"ఆగు !"* బృహస్పతి కేక కాదు , గుహలో సింహనాదం ! 


పుంజికస్థల ఉలిక్కిపడి ఆగి , ఆందోళనగా చూసింది.


*"పాపాత్మురాలా ! నీది అసహజ కామం ! అక్రమ ఉద్రేకం ! నీతి బాహ్యమైన కోరిక ! ఆరని దాహంతో సరితూగే వానరకామం నీది ! ఆ కామానికి సరిపోయేలా వానర స్త్రీవి అయిపో !"* బృహస్పతి శాపం ఆశ్రమంలో ప్రతిధ్వనించింది.


అది పుంజికస్థల చెవుల్లో , గుండెలో ఉండిపోయింది. ఆమె సర్వస్వంలో ప్రతిధ్వనిస్తూ


*"వానర స్త్రీ అయిపో !"* పుంజికస్థల శరీరం ఒక్కసారిగా జలదరించింది. ఇందాకా కామోద్రేక స్వేదంతో తడిసిన ఆమె తనువు ఇప్పుడు భయ స్వేదంతో తడిసి , చల్లబడిపోయింది. అప్సరస అయిన తను వానరం కావడమా !?


పుంజికస్థల శరీరం వణకసాగింది. అప్రయత్నంగా ఆమె పైటను తీసి తన శరీరాన్ని కప్పుకుంది. ఉన్నట్టుండి ఏడుస్తూ , బృహస్పతి పాదాల ముందు కుప్పకూలి పోయింది. ఆమె చేతులు వణుకుతూ ఆయన పాదాల్ని స్పృశిస్తున్నాయి.


*"స్వామీ... స్వామీ... నేను వానరకాంత అయిపోవాలా ? అయ్యో... నా అపరాధాన్ని మన్నించండి. గంధర్వుల శృంగారలీల నాలో కామరోగానికి కారణమైంది స్వామీ ! నన్ను క్షమించి శాపం ఉపసంహరించండి. మీ సేవకురాలిని కాపాడండి"* పుంజికస్థల దీనంగా ప్రార్థించింది.


అంతలో ఆవేశం ! అంతలో ఆవేదన ! పుంజికస్థల స్థితి బృహస్పతిలో జాలి పుట్టించింది.


*"పుంజికస్థలా ! లే !"* బృహస్పతి ముక్తసరిగా అన్నాడు. పుంజికస్థల లేచి , కన్నీళ్ళతో చూసింది. *"నా శాపాన్ని నువ్వు అనుభవించి తీరాలి. దానికి తిరుగులేదు..."*


*"స్వామీ..."*


*"అయితే నా శాపం , యథార్ధ దృష్టిలో శాపం కాదు - వరం..."* 


*"స్వామీ..."*


*"ఔను ! నా శాపం నీకు వరం , పుంజికా ! వానరకాంత జన్మలో నీకు మహావీరుడైన వానరశ్రేష్ఠుడు భర్త అవుతాడు. అతనితో నువ్వు ఇప్పుడు వాంఛించిన మహదానందాన్ని అనుభవిస్తావు. నీకు జితేంద్రియుడూ , మహావీరుడూ , చిరంజీవీ అయిన కుమారుడు జన్మిస్తాడు ! శ్రీమహావిష్ణువు త్రేతాయుగంలో ధరించే అవతార రూపాన్ని సేవించుకొని , లోకాల చేత ఆరాధించబడతాడు. నీ నామధేయాన్ని శాశ్వతం చేస్తాడు."* బృహస్పతి చెయ్యెత్తి అన్నాడు.


పుంజికస్థల కన్నీళ్ళు తుడుచుకుంటూ చూసింది. ఆమె ముఖం మీద చిరునవ్వు మెరిసింది. *"ధన్యోస్మి, స్వామీ !"*


నువ్వు నిజంగానే ధన్యురాలివి , పుంజికా ! వెళ్ళిరా !”


పుంజికస్థల బృహస్పతి పాదాలకు నమస్కరించి , పైకి లేచి , ప్రశ్నార్థకంగా చూసింది. *"స్వామీ... నేను ఎక్కడికి వెళ్ళాలి ?".*


*"ఎక్కడికైనా సరే ! స్వేచ్ఛగా , యధేచ్చగా వెళ్ళు ! నీ అంతరంగం నీకు దారి చూపుతుంది. ఆత్మ మార్గదర్శకత్వాన్ని అంగీకరించి , ప్రస్థానం సాగించు , శుభం భూయాత్ !"*


పుంజికస్థల మెల్లగా ద్వారం వైపు తిరిగింది. అడుగులో అడుగు వేస్తూ , ఆశ్రమం నుండి వెలుపలికి వెళ్ళింది.


బృహస్పతి ఆమెను చిరునవ్వుతో చూస్తున్నారు.


*************************


నదీతీరం నుండి ఆశ్రమానికి తిరిగి వచ్చిన తార పూజాదికాలు నిర్వర్తించకుండా ఉన్న భర్తనూ , చెల్లాచెదరుగా పడిఉన్న పువ్వుల్నీ ఆశ్చర్యంగా చూసింది. పువ్వుల్ని ఎవరు పారబోశారని ఆయనను అడిగింది.


*"అవి భక్తి కుసుమాలు కావు , రక్తి కుసుమాలు అంటూ నీ పరిచారిక పుంజిక నా మీద వర్షించింది."* అంటూ బృహస్పతి నవ్వుతూ జరిగిందంతా వివరించాడు.


*"అయ్యో పాపం , పుంజికస్థల ! శాపం పెట్టకుండా ఉంటే బాగుండేదేమో , స్వామీ..."* తార జాలిగా అంది.


*"శపించడం , ఆగ్రహించడం - ఇలాంటివి ఆలోచించి చేసే ప్రతిక్రియలుకావు. అయితే నేను ఆలోచించే , ముందు చూపుతో పుంజికస్థలను శపించాను."* బృహస్పతి నవ్వుతూ అన్నాడు.


*"ముందు చూపా ?"* తార ప్రశ్నార్థకంగా చూసింది.


*"ముందు చూపే ! గంధర్వ మిథునాన్ని శృంగారకేళిలో చూసి , వొళ్ళు తెలియని విపరీత కామంతో పుంజికస్థల నా మీద విరుచుకు పడింది. ఆమె ఎప్పుడూ నన్ను కామంతో చూడలేదు. మనసులోంచీ , తనువులోంచీ క్రమంగా ఉద్భవించేది సహజ కామం. అది ప్రణయ పరాకాష్ఠ ! ఇతరులు కామవికార ప్రవర్తన చూసినప్పుడు , పుట్టేది అసహజ కామం ! అది ప్రణయ కామం కాదు , ప్రేమా కాదు. పుంజికస్థల వాంఛించింది. విపరీత , అసహజ కామానుభవం ! అదుపాజ్ఞలలో ఉండని అతి కామం అది. అది వానరజాతికి సహజం ! అందుకే ఆమె వానర స్త్రీగా జన్మించేలా శపించాను. ఆ రూపంలో ఆమె విపరీతమైన నిరంతరమైన శారీరక సుఖాన్ని అనుభవిస్తుంది !"* బృహస్పతి ఓపికగా వివరించాడు.


*"ఇన్ని ధర్మ సూక్ష్మాలు తెలుసు గనుకనే మిమ్మల్ని ఆ దేవతలు గురువుగా స్వీకరించారు ,”* తార చిరునవ్వు నవ్వింది.


*************************


రాత్రి వాతావరణం ప్రశాంతంగా ఉంది. చల్లటి గాలి వీస్తోంది. శయనాగారంలో తార భర్త కోసం ఎదురు చూస్తోంది. ఇంద్రసభకు వెళ్ళిన భర్త ఇంకా రాలేదు. ఆలస్యమైనా వస్తారు. మాతలి రథం మీద తీసుకువస్తాడు. ఆలోచిస్తూ , ప్రమిదలో వెలుగుతున్న జ్యోతిని కొద్దిగా ఎగసనదోసింది తార. శయనాగారంలో కాంతి రెండింతలైంది.


*"తారా !"*


భర్త పిలుపు విని తార ద్వారం వైపు చూసింది. ఆయనతో పాటు ఏదో సరికొత్త సువాసన శయనాగారంలో ప్రవేశించి , వ్యాపిస్తోంది.


బృహస్పతి దీపం దగ్గరగా నిలుచున్న తారనే చూస్తూ ఉండిపోయాడు. గాలికి అటుఇటూ చలిస్తున్న దీపకళిక తార శరీరాన్ని కొత్తగా చూపిస్తోంది. ఆమె శరీరం మీద అక్కడక్కడా ఆమె శరీరావయవాల నీడే పడుతోంది , అందంగా ! వెలుగు , నీడా రెండూ స్వాభావికంగా ఆమెను అలంకరిస్తూ , ఆకర్షణను ఇనుమడింపజేస్తున్నాయి. వెలుగు నీడల వింత కలయికలో తార కళ్ళని లాగి పట్టి , శరీరాన్ని కూడా లాగుతున్నట్టుంది !


అందానికి పట్టిన అద్దంలాంటి ముఖం ! అందమైన నుదురు మీద వంకీలు తిరిగి , కళ్ళను రక్షిస్తున్నట్టున్న కనుబొమలు ! వాటి కింద - సమీపంలో ఉన్న జ్యోతిని పరిహాసం చేస్తున్నట్టు - ప్రశాంత కాంతిగోళాల్లాంటి కమనీయ నేత్రాలు. ధ్వనిలేని భాషలో కోరికను వ్యక్తం చేస్తున్నట్టు స్పందిస్తున్న అధరం ! అది , మధురం తనకు తెలుసు. 


బృహస్పతి తార సౌందర్యాన్ని నేత్రచషకాలతో త్రాగుతూ ఆమె దగ్గరగా అడుగులు వేశాడు. ఆయన వద్ద నుండి వెలువడుతున్న ఏదో సౌరభం - ఆయన కన్నా ముందుగా పరుగెడుతోంది.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

పెరియ పురాణం⚜️

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 09*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

 *9. కణ్ణప్ప నాయనారు*


'పొత్తపినాడు' లో 'ఉడుప్పూరు' అనే పేరుతో ఒక ప్రాచీన గ్రామం ఉంది. ఆ గ్రామంలో నివసించేవారందరూ గిరిజనులే. వారికి రాజుగా

‘నాగడు' అనే పేరుతో ఒక వేటగాడు ఉండేవాడు. అతనికి జీవన సహచరిగా

దత్తె అనే యువతి తోడైంది. మురుగదేవుని అనుగ్రహం వలన వారికి ఒక

కుమారుడు జన్మించాడు. ఆ పిల్లవాడికి తిన్నడు అనే పేరుపెట్టి అల్లారు.

ముద్దుగా పెంచారు. 


కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత విలువిద్య

నేర్చుకునే పరువాన్ని తిన్నడు సమీపించాడు. కొద్దికాలంలోనే విలువిద్యను,

ఇతర యుద్ధకళలకు సంబంధించిన విద్యనూ పూర్తిగా నేర్చుకుని తిన్నడు

వాటిలో ప్రావీణ్యతను సంపాదించాడు.


ఆ సమయంలో అక్కడున్న కొండలలో పంటలు పండించే ప్రాంతాలలో

పందులు, పులులు, ఎలుగుబంట్లు, అడవి పశువులు మొదలైన క్రూర

మృగాలు వచ్చి పంటలకు ప్రజలకు హాని కలిగించాయి. ప్రజలందరూ

తమరాజైన 'నాగడు' దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు. 


నాగడు తన  కుమారుడైన తిన్నని ఆహ్వానించి “ఈ బోయకులాన్ని సంరక్షించే బాధ్యతను

స్వీకరించి క్రూర మృగాల బారినుండి వీరిని కాపాడు" అని చెప్పగా తిన్నడు

విల్లంబులను ధరించి వేటగాళ్లతో అడవిలోపలికి ప్రవేశించాడు, అడవి

పందులు, జింకలు, ఎలుగుబంట్లు, దుప్పులు, అడవి దున్నలు, ఏనుగులు,

క్రూరమైన పులులు మొదలైన వాటిపై బాణాలను ప్రయోగించి వాటిని నేల కూల్చాడు. 


ఆ సమయంలో తిన్ననికి వేగంగా పరిగెత్తుతూ ఉండే ఒక

పంది కనిపించింది. తిన్నడు దానిని వదలకుండా వెన్నంటి వెళ్లి తన కరవాలంతో ఆ పంది శరీరం రెండు తునకలయ్యేలా ఖండించాడు.


కొంతసేపు విశ్రామం తీసుకున్న తరువాత తిన్నడు పక్కనే ప్రవహిస్తున్న

స్వర్ణముఖి (పొన్ ముగలి) నదిలో స్నానంచేసి పక్కనున్న కొండ సమీపించాడు.

పూర్వజన్మలో చేసిన తపోఫలం కారణంగా తిన్నడు శ్రీకాళహస్తి కొండ

మీద లింగాకారంతో నెలకొని ఉన్న పరమేశ్వరుని చూశాడు. ప్రేమ ఉప్పొంగగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని ఆలింగనం చేసుకున్నాడు.


"స్వామీ! క్రూర మృగాలు సంచరించే ఈ అడవిలో తోడెవరూ లేక నీవిలా

ఒంటరిగా కొండమీద ఉండడం తగునా! నీవు తిని ఎంతకాలమైందో

కదా!" అని హృదయావేదనతో పలికాడు. వెంటనే తాను చంపిన పంది

మాంసాన్ని ఎర్రటి నిప్పులో పక్వంగా కాల్చి వాటి రుచిని ముందుగా తాను

తెలుసుకోవడానికై కొంత నోటిలో వేసుకొని రుచిచూసి వాటిని ఒక దొన్నెలో

పెట్టుకొన్నాడు. 


పరమేశ్వరునికి స్నానం చేయించాలనే ఉద్దేశంతో తన

నోటిలో స్వర్ణముఖీ నదిలోని నీటిని తీసుకున్నాడు. అక్కడి పుష్పాలను కోసి

తలమీద పెట్టుకున్నాడు. “నా దేవుడు ఆకలితో సొమ్మసిల్లి ఉంటాడు”

అంటూ వేగంగా వచ్చి తన నోటిలోని నీటిని పరమేశ్వరుని శిరసుపై వదిలాడు. తలమీద ఉన్న పుష్పాలను దేవుని శిరసుపై అలంకరించాడు.


ఆకులదొన్నెలోని మాంసాన్ని శివుని ముందు పెట్టి "స్వామీ! మేలైన మాంసం  తీసుకు వచ్చాను. మీరు దీనిని భుజించండి" అని చెప్పి మృదువైన మాటలు

మాట్లాడుతూ పరమేశ్వరునికి తిన్నడు మాంసాన్ని తినిపించాడు. తనతో

వచ్చిన వేటగాళ్లు ఇంటికి పోదామని చెప్పినప్పటికీ వాళ్ల మాటలను తిరస్కరించి తిన్నడు ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు. 


సూర్యోదయానికి

ముందుగానే లేచి శివునికి మంచి మాంసం తెచ్చి ఇవ్వాలనే ఉద్దేశంతో

వేటకు వెళ్లాడు.

శ్రీకాళహస్తీశ్వరునికి సూర్యోదయాత్పూర్వమే నియమం తప్పక

పూజాదికాలు నిర్వర్తించే ఒక మునీశ్వరుడు అక్కడికి వచ్చాడు. 


శివుని సన్నిధిలోపడి ఉన్న మాంసపు ముక్కలను, ఎముకలను చూసి "అయ్యో!

అసహ్యమైన ఈ పదార్థాలను ఇక్కడ ఎవరు పెట్టారో కదా! అని బాధపడి

ఆ ప్రదేశాన్ని శుభ్రంగా నీటితో కడిగాడు. స్వర్ణముఖి నది పవిత్రజలాలతో,

తాను తీసుకు వచ్చిన వస్తువులతో అభిషేకం మొదలైన పూజలు చేశాడు.

తరువాత తాను తపస్సు చేసుకుంటున్న ప్రాంతానికి వెళ్లిపోయాడు.


మునీశ్వరుడు వెళ్లిన తరువాత తిన్నడు దొన్నెలో తేనె కలిపిన మాంసాన్ని

పెట్టుకొని పుష్పాలను, అభిషేకార్ధమై నీటిని తీసుకొని వేగంగా వచ్చాడు.

అక్కడ మునీశ్వరుడు చేసిన పూజాద్రవ్యాలను తొలగించి తాను తెచ్చిన

మాంసాహారాన్ని స్వామికి తినిపించాడు.


ఆ రోజు రాత్రి మునీశ్వరుని కలలో శివుడు కనిపించి “నీకు ఆ వేటగాని భక్తిని చూపిస్తాను" అని చెప్పాడు. మునీశ్వరుడు యధాప్రకారం

సూర్యోదయాత్పూర్వమే స్వామికి పూజలు సలిపి వెనుకభాగంలో ఎవరికీ

కనిపించకుండా దాక్కున్నాడు. తిన్నడు జింకను వేటాడి చంపి దాని మాంసాన్ని తీసుకొని వేగంగా స్వామి సన్నిధికి వచ్చాడు. 


మునీశ్వరునికి

తిన్నని భక్తి విశేషాలు తెలియజేయడానికై పరమేశ్వరుడు తన నేత్రములలో  ఒకదాని నుండి రక్తం కారేటట్లు చేశాడు. దానిని చూసి తిన్నడు తీవ్ర సంతాపంతో మూర్ఛిల్లాడు. అరణ్యమంతా గాలించి మూలికలను సేకరించి

వాటి రసాన్ని కంటికి పూశాడు. అయినప్పటికీ రక్తం కారడం మానలేదు.


‘దీనికి పరిహారంగా ఏంచేయాలి' అని ఆలోచించిన తిన్నడు ఒకరి

అవయంలో ఏర్పడిన వ్యాధిని పోగొట్టడానికి దానిని పోలిన అవయవాన్ని

ఇవ్వాలి అనే పెద్దల వాక్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. స్వామి సన్నిధి

ముందు నిలబడి తన కంటిని అమ్ముతో పెకలించి స్వామి కంటిలో పెట్టాడు.


వెంటనే స్వామి కంటినుండి రక్తం కారడం ఆగిపోయింది. తిన్నడు సంతోషంతో గంతులు వేశాడు. తిన్నని శివభక్తిని లోకానికి తెలియజేయాలనే

తలంపుతో శ్రీకాళహస్తీశ్వరుడు తన మరొక కంటినుండి కూడ రక్తం కారేలా చేశాడు. 


దానిని చూడగానే తిన్నడు పరమేశ్వరుని ఎడమకన్నులో తన ఎడమకన్నును పెట్టడానికి ఆ కన్ను ఉన్నచోటు మారకుండా ఉండడానికై

తన ఎడమకాలిని స్వామి కన్ను ఉన్నచోట ఊన్చి బాణంతో తన కన్నును

పెకలించబోయాడు. 


తన కంటిని పెకలించడానికి ఎత్తిన కన్నప్పచేతిని

శ్రీకాళహస్తీశ్వరుడు తన చేతితో పట్టుకొని “అసమానమైన భక్తిని గలవాడా!

నీవు నా కుడివైపున నిత్యమూ ఉండాలి" అని ఆశీర్వదించాడు.

  *తొమ్మిదవ చరిత్ర సంపూర్ణం*   


  *సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

శివానందలహరీ – శ్లోకం – 10*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 10*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*నరత్వం దేవత్వం నగవనమృగత్వం మశకతా*

*పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననమ్ |*

*సదా త్వత్పాదాబ్జస్మరణపరమానందలహరీ*

*విహారాసక్తం చేద్ధృదయమిహ కిం తేన వపుషా ?  10*


మనుష్యుడుగాగానీ, దేవుడుగాగానీ, పర్వతముగాగానీ, అడవిగాగానీ, మృగముగాగానీ, దోమగాగానీ, పశువుగాగానీ, పురుగుగాగానీ, పక్షులుమొదలగువానిగా ఎలా పుట్టినా ఫరవాలేదు. కానీ ఎల్లప్పుడూ నా మనస్సు నీ పాదపద్మముల స్మరణలో పరమానందముగా విహరించుటయందు ఆసక్తి కలిగిఉన్నచో ఇంక ఏ జన్మ వచ్చినా బాధ లేదు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

శ్రీ వివేకానందస్వామి

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 96*


*నరేంద్రుని ప్రయత్నాలు*


వరాహ  నగర మఠ ప్రారంభానికి ముందే సమయం చిక్కినప్పుడల్లా వెళ్లి వారిని కలుసుకొని  భగవదానుభూతి పొందకపోతే జీవితమే వ్యర్థమని,గురుదేవుల మహత్వాన్ని , సన్న్యాస జీవితపు ఔన్నత్యాన్ని గురించి మాట్లాడేవాడు. వ్యతిరేకత, నింద, అవమానాదులను వేటినీ అతడు ఖాతరు చేయలేదు. ఎందుకంటే గురుదేవులు అప్పగించిన కార్యం ఒక్కటే అతని మనస్సును నింపి ఉంచింది. పేదరికం, న్యాయస్థానం, వ్యాజ్యాలు లాంటి కుటుంబ సమస్యల భారం అణగద్రొక్కిన సమయంలో, ఈ విధంగా పలువురి నిందలను, అవమానాలను భరించీ అతడు అందరినీ సమైక్యపరిచాడు.


చివరికి నరేంద్రుని ప్రేమకూ, ఎడతెగని ప్రయత్నాంతో 1886 డిసెంబర్ లో దాదాపు అందరినీ  సమైక్యపరచగలిగాడు. దీని తరువాతే నిజానికి మఠ జీవితం ప్రారంభమయింది. తాము తిరస్కరించీ, తల్లితండ్రులు తిరస్కరించీ, ప్రతిఘటనలను, అవమానాలను ఖాతరు చేయక తమను ఈ జీవితానికి అంకితం చేసిన నరేంద్రుని పట్ల తక్కిన యువ శిష్యుల హృదయాలలో కృతజ్ఞతాభావం పొంగిపొరలింది; అతణ్ణి అందరూ మనఃస్ఫూర్తిగా తమ నేతగాను, మార్గదర్శిగాను అంగీకరించారు. పలువురు అతణ్ణి గురువుగా గౌరవించారు.


"వరాహ నగర మఠంలో" ఈ యువ సన్న్యాసులు గడపిన కఠోర ఆధ్యాత్మిక జీవితం గురించి ఏం చెప్పాలి! బాహ్య ప్రపంచం నుండి నిష్క్రమించిన శ్రీరామకృష్ణులను తన హృదయాంతరాళంలో ఆవాహనం చేయాలనే ఉద్విగ్నతలో వారు మునిగివున్నారు. అప్పుడప్పుడు వారు గాంచిన దివ్యదర్శనాలు ఎంతటి దారిద్ర్యాన్ని, ఆవేదనను, బహిష్కరణను, ఎకసెక్కాలను లెక్కించక పదే పదే ప్రయత్నించే స్థితికి వారిని పిచ్చివారిని చేసినవి. బాహ్యచైతన్యరహితులై భక్తి గీతాలను ఆలపించడంలో, నృత్యం చేయడంలో రుచి గలిగినవారై అహర్నిశలూ ప్రార్థనలలోను, ధ్యానంలోను, శాస్త్రాధ్యయనంలోను ఆసక్తిపరులై వారు విరా జిల్లారు. 


భగవద్దర్శనమే వారి జీవిత ఏకైక లక్ష్యంగా మారింది. వేదపురాణ తంత్ర గ్రంథాలలో పేర్కొన్న సన్న్యాస జీవిత నియమాలు తు.చ. తప్పక మనఃస్ఫూర్తిగా పాటించసాగారు. పగటి వేళ మఠంలోను, చెట్టు క్రింద, అర్ధరాత్రి వేళ సమీపంలోని శ్మశానంలోను, గంగాతీరంలోను ఆధ్యాత్మిక సాధనలు అనుష్టించారు; తపస్సు ఆచరించారు. శ్రీరామకృష్ణులు అనుష్ఠించి చూపిన అనుపమాన తపస్యాదుల గురించి జ్ఞాపకం వారి తపోగ్నిని ప్రజ్వలనం చేసింది. ధ్యానం కొనసాగించడానికై ఆ యువకులు పస్తులు వుండి చావడానికైనా సిద్ధమైనారు."🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

.                   *శ్లోకం - 86*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


  *మృషా కృత్వా గోత్ర స్ఖలన మథ  వైలక్ష్యనమితం*

  *లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే |*

    *చిరా దంత శ్శల్యం దహనకృత మున్మూలతవతా*

  *తులాకోటి క్వాణైః కిలికిలిత మీశానరిపుణా ‖*



మృషా కృత్వా గోత్రస్ఖలనమ్ = (ప్రణయ సల్లాపములలో) ఉన్నట్టుండి, పొరపాటున నీ సవతి పేరును పలికి, 


అథ వైలక్ష్యనమితం భర్తారం = తరువాత అమితమైన తడబాటుతో కళవళబడిన నీ భర్తను, 


లలాటే చరణకమలే తాడయతి తే = ఆయన లలాటముపై నీ మృదువైన పాద కమలముతో తాడనం చేయగా, 


చిరాదంత శ్శల్యం దహనకృతమున్మూలతవతా = శివుని త్రినేత్రముచే దహింపబడి, చిరకాలముగా దుఃఖిస్తున్న 


ఈశాన రిపుణా = ఈశ్వరుని శత్రువైన మన్మధుడు,


 తులాకోటి క్వాణైః కిలికిలితమ్ = అతడు చేసిన కిలకిలారావములు, శివుని లలాటముపై నీ పాదముంచినప్పుడు కలిగిన నీ పాదమంజీరముల కింకిణీ ధ్వనులవలె నున్నది. 


క్రిందటి శ్లోకములో చెప్పుకున్నాము కదూ, పార్వతీదేవి అశోక వృక్షమును తన పాదముతో తాడనము చేయగా శివునకు అసూయ కలిగిందని. ఇప్పుడు ఆయన ఎలాగైనా ఆమె పాదస్పర్శను పొందాలనే కోరికతో, కావాలనే పార్వతీదేవి వద్ద గంగ పేరు ఎత్తాడనీ, ఆ మిషతో తన ఈప్సితం నెరవేర్చుకున్నాడనీ, శంకరుల చమత్కార కవనం ఇది. 

నిజానికి వారిద్దరూ ఒకటే. *శివశక్త్యైకరూపిణీ* అని లలితా సహస్ర నామములలో అన్నారు కదా! ఆమె శివా. శివప్రియ కూడా. వారిద్దరినీ విడిగా ఆరాధించటం సగుణరూపారాధనే అవుతుంది. వారిద్దరూ నిజంగా విడిపోతే ఈ ప్రపంచమే అంతమవుతుంది. వారిద్దరి సమరస, సమన్వయ సంబంధము గురించి *సౌందర్యలహరి 34 వ శ్లోకంలో ఇంతకు పూర్వం చెప్పుకున్నాము*.


*ఈ 86 వ శ్లోకము లలితా సహస్ర నామములలోని 20 వ శ్లోకమును స్మరింపజేస్తుంది*.


*శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజా |*

*మరాళీ మందగమనా, మహాలావణ్య శేవధిః ‖*



           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *85వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*గురుగ్రహ చరిత్ర - 1*


బృహస్పతి ప్రాతఃకాల పూజ చేయడానికి సిద్ధమై కూర్చున్నాడు. తార ఆయన వద్దకు వచ్చింది.


*"పువ్వుల కోసం వెళ్ళిన పుంజికస్థల ఇంకా రాలేదు. మరెక్కడికైనా వెళ్ళిందా , తారా ?"* తారను అడిగాడు బృహస్పతి.


*"లేదు , స్వామీ ! పువ్వుల కోసమే వెళ్ళింది. వచ్చేస్తుంది లెండి. నేను నదికి వెళ్తున్నాను. స్నానం చేసి నీళ్ళు తీసుకుని వస్తాను."* అంటూ భర్త సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది తార.


పుంజికస్థల రాక కోసం ఎదురు చూస్తూ , అటూ ఇటూ తిరగడం ప్రారంభించాడు బృహస్పతి.


పుంజికస్థల పూల తోటలో నెమ్మదిగా నడుస్తోంది. రంగురంగుల పువ్వులు పూచే మొక్కలున్న ఒక చోట ఆగి , రెమ్మ వంచి పువ్వుల్ని కోయబోయింది.


ఉన్నట్టుండి ఓ మూల నుండి నవ్వులు ఆమె వైపు గాలిలో దూసుకువచ్చాయి. పుంజికస్థల చెయ్యి పువుల్ని ముట్టుకోకుండా అల్లంత దూరంలో స్తంభించింది. గాలి మళ్ళీ నవ్వుల్ని ఆమె వైపు రువ్వింది. ఇద్దరి నవ్వులు. స్త్రీ , పురుష నవ్వులు ! ఆశ్రమవనంలోకి ఎవరొచ్చారు ? ఎందుకు నవ్వుతున్నారు ? పుంజికస్థల చప్పుడు చేయకుండా నవ్వులు వినవస్తున్న దిశగా అడుగులు వేసింది.


ఇప్పుడు నవ్వులు స్పష్టంగా , దగ్గరగా వినిపిస్తున్నాయి. ఎవరో స్త్రీ ఎవరో గిలిగింతలు. పెట్టినట్టు నవ్వుతోంది. ఆగి , ఆగి... నవ్వుతోంది... ఆగి , ఆగి... నవ్వుతోంది. పుంజికస్థల తన ముందు గుబురుగా ఉన్న కొమ్మను కిందికి వంచి , చూసింది. ఆమె ఎడమచేతిలోని పూలసజ్జ తటాలున జారి కింద పడింది. పుంజికస్థల ఒక్కసారిగా ఊపిరి బిగపట్టింది. మరుక్షణం ఆమె గుండె దడదడ కొట్టుకోవడం ప్రారంభించింది.


ఎదురుగా , పొదరింటి నీడలో.... ఇద్దరు స్త్రీపురుషులు... ఒకరి చేతుల్లో ఒకరు వొదిగి... సరససల్లాపాలలో ఉన్నారు. చూడగానే ఆ జంట ఎవరో అర్ధమైపోయింది. పుంజికస్థలకు , గంధర్వ మిథునం ! మైథునానందంతో మైమరచి నవ్వుతున్న గంధర్వ మిథునం !


గాలికి కదులుతున్న పల్చటి వస్త్రాల చాటులో , వాళ్ళ శరీరాలు నివురుచాటున నిప్పుల్లా అవుపిస్తున్నాయి. తాంబూలంతో ఎరుపెక్కిన పెదవుల గుర్తులు వాళ్ళ శరీరాలు మీద అక్కడక్కడా... కనిపిస్తున్నాయి.


పుంజికస్థల తాను వచ్చిన పనిని మరిచి పోయింది. కాలాన్ని మరిచిపోయింది. స్థలాన్ని మరిచిపోయింది. ఏ ఆనందం తనకు దూరంగా ఉందో , ఏ ఆనందానికి తాను దగ్గర కాలేకపోయిందో ఆ రసానందం తన కళ్ళ ముందు రూపం ధరించి దర్శనమిస్తోంది. పుంజికస్థల దృష్టిలో అక్కడ గాలి స్తంభించింది. కాలం స్తంభించింది. సమస్త విశ్వమూ తన చలనం కోల్పోయి స్తంభించింది.


ఒక్కసారిగా పుంజికస్థల కళ్ళు చెదిరాయి. సరససల్లాపాలలో మునిగితేలిన గంధర్వమిథునం అంతర్ధానమైంది ! నెమ్మది నెమ్మదిగా పుంజికస్థల వర్తమానంలోకి వచ్చింది. ఆమె శరీరం చెమటతో తడిసి పోయింది. ఏదో ఆవేశం , ఏదో ఆశ ఆమెలో సుడిగాలిలా తిరుగుతున్నాయి. వణుకుతున్న శరీరాన్ని అదుపు చేసుకుంటూ నేల మీద పడిన పూలసజ్జను అందుకుంది. వణుకుతున్న కుడిచేయి పువ్వుల్ని దూసిపోస్తోంది. సజ్జలో ! పుంజికస్థల దూస్తున్న పువ్వులు సగం నేలపాలవుతున్నాయి.


అంతర్ధానమైన గంధర్వ దంపతులు ఇంకా ఆమె మనోయవనిక మీద సయ్యాటలు ఆడుతూనే ఉన్నారు. ఆమెకు హఠాత్తుగా బృహస్పతి గుర్తుకు వచ్చాడు. ఔను ! తనకు అందుబాటులో ఉన్న పురుషుడు ఆయనే ! భర్త లేని తనకు భర్త యజమానే.


పుంజికస్థల మంత్రముగ్ధలాగా ఆశ్రమం వైపు నడిచింది. ఆమెను రకరకాల ఆలోచనలు చుట్టుముట్టుతున్నాయి. వెనక నుంచి గంధర్వ దంపతులు ఆమెను తరుముతున్నారు. యజమాని బృహస్పతి ఇప్పుడు ఆశ్రమంలో వొంటరిగా ఉంటారు. తనకు తెలుసు. తార నదీతీరానికి వెళ్ళి ఉంటుంది. ఆమె ఇప్పుడప్పుడే తిరిగిరాదు.


పుంజికస్థల ఆశ్రమంలో ప్రవేశించింది. ఆమె తెచ్చే పువ్వుల కోసం అసహనంగా ఎదురు చూస్తున్న బృహస్పతి , ఆమెను చూడగానే , అటూ ఇటూ తిరగడం ఆపివేశాడు. 


*"పుంజికా ! ఏమిటీ ఆలస్యం ? పూజా సమయం దాటిపోతోంది తెలుసా ?"* బృహస్పతి కోపంగా అన్నాడు.


పుంజిక సమాధానం చెప్పకుండా , చిరునవ్వుతో ఆయనను సమీపించింది.


*"ఏమిటిది ? సచేల స్నానం చేశావా ?"* చెమటతో తడిసి , పుంజిక శరీరానికి వంపులు తిరుగుతూ అతుక్కుపోయిన ఆమె వస్త్రాలను చూస్తూ , అన్నాడు బృహస్పతి. 


పుంజికస్థల పెదవి కదపలేదు. ఆమె కళ్ళు తీక్షణంగా , వెర్రిగా బృహస్పతినే చూస్తున్నాయి. హఠాత్తుగా సజ్జలోని పూలని పైట చెరగులో పోసుకుని , ఆయన వైపు అదో రకంగా నవ్వింది. ఆమె చేతులు తటాలున కదిలాయి. పైటలోని పువ్వులు బృహస్పతి మీద వర్షించాయి. పైట పూలతో బాటు నేలకు వాలిపోయింది. 


*"ఆ పువ్వులు... భక్తి కోసం కాదు , రక్తి కోసం ! అవి... భక్తి కుసుమాలు కావు , రక్తి కుసుమాలు !”* పుంజికస్థల మత్తుగా అంది , పైట సర్దుకునే ప్రయత్నం చేయకుండానే. 


*"పుంజికా !"* బృహస్పతి అరిచాడు కోపంగా , ఆమె చర్యతో బిత్తరపోయి. *"ఏమిటీ అహంకారం ?"*


పుంజికస్థల మత్తుగా నవ్వింది. *"ఇది అహంకారమా ? కాదు... మమకారం ! అనురాగం ! నా తనువు మీ కోసం... మీ పొందు కోసం తపించిపోతోంది. రండి !"* అంటూ తనే ముందుకు వెళ్ళి బృహస్పతిని గట్టిగా కౌగిలించుకుంది.


కామజ్వరంతో కాలిపోతున్న పుంజికస్థల శరీరస్పర్శ బృహస్పతిని ఆశ్చర్య పరిచింది. ఆమెను దూరంగా తోసే ప్రయత్నం చేశారాయన. అయితే చెట్టు బోదెను అల్లుకున్న తీగల్లా తన చుట్టూ ఆతుక్కుపోయిన పుంజికస్థల చేతుల్ని విడదీయలేకపోతున్నారాయన. 


*“స్వామీ... నేను మీదాననే ! స్వీకరించండి ! మన ఐక్యత ఆ గంధర్వ దంపతుల ఐక్యత కన్నా బాగుంటుంది."* పుంజికస్థల కలవరిస్తున్నట్లు మత్తుగా అంది.


*"పుంజికా !”* బృహస్పతి అరిచాడు. వదిలించుకునే ప్రయత్నం చేస్తూ. *"ఆ గంధర్వుల జంటలాగే , అదే పొదరింటిలో ప్రతీ రోజూ మీరూ , నేనూ... ఒకరికి ఒకరై... వాళ్ళలాగా ఇద్దరూ ఒక్కరై...”*


కళ్ళు మూసుకుని పారవశ్యంతో కలవరిస్తున్న పుంజికస్థల ముఖాన్ని చూశాడు. బృహస్పతి. ఆయనకు అంతా అర్థమైపోయింది. ఈ పిచ్చిపిల్ల తోటలో గంధర్వ శృంగారం తిలకించినట్టుంది !


*"స్వామీ... కాలిపోతోంది నా దేహం. ఆ తాపాన్ని మీరే చల్లార్చాలి. ఆ తాపం మీ కౌగిలిలోనే చల్లారాలి ! రండి ! రండి , స్వామీ !”*


బృహస్పతి శరీరం ఆగ్రహంతో వణికిపోయింది. పుంజికస్థల పట్టు నుండి తన శరీరాన్ని బలంగా విడదీశాడు. 'అగ్నిలత'ను విసిరి వేస్తున్నట్లు ఆమెను దూరంగా తోశాడు. నేల మీద విసురుగా పడిన పుంజికస్థల లేచి నిలబడింది. మత్తుగా , ప్రాధేయ పూర్వకంగా ఆయనవైపు చూసింది. ఆమె కళ్ళు వశం తప్పిన కామంతో ఎర్రగా ఉన్నాయి.


*"పుంజికా !”* బృహస్పతి హుంకరించాడు.


పుంజిక కామాగ్నిగోళాల్లా ఉన్న కళ్ళతో ఆయనను తదేకంగా చూసింది. *“రండి... . ఇక్కడ కాదు... పొదరిల్లు మన కోసం కాచుకుంది...”*

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

పెరియ పురాణం

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 08*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

*8. ఏనాది నాథ నాయనారు*


ఏననల్లూరు అనే అందమైన గ్రామంలో ఏనాది నాధుడు జన్మించాడు. ఇతడు గొప్ప శివభక్తుడు.  ఖడ్గవిద్య శిక్షణలో నైపుణ్యాన్ని సంపాదించి ఆ వృత్తిలో తనకు తిరుగులేని నాయకుడుగా ప్రసిద్ధిచెందాడు. ఆ కాలంలో అతి శూరుడనే పేరుగల వాడు ఖడ్గవిద్యను నేర్పించే వృత్తిని అనుసరిస్తూ

ఆ వృత్తిలో ఈ భూ ప్రపంచంలో తనకు మించినవారు ఎవరూ లేరని

విర్రవీగుతూ ఉండేవాడు.


 కొంత కాలానికి ఖడ్గ శిక్షణ ఇచ్చే అతిశూరుని ఆదాయం రోజురోజుకు

తగ్గిపోతూ వచ్చింది. ఏనాది నాథుని ఆదాయం మాత్రం పెరుగుతూ

వచ్చింది. దీనిని చూసి అతిశూరుడు ఏనాదినాథునిపై తీరని పగను పెంచుకున్నాడు. 


బంధుమిత్రులతో ఏనాదినాధుని ఇంటిముందుకు వెళ్లి యుద్ధానికి రమ్మని ఆహ్వానించాడు. ఏనాదినాధుడు కూడ ఒక చేతిలో కరవాలాన్ని, మరొక చేతిలో డాలును పట్టుకొని యుద్ధం చేయడానికి

బయలుదేరాడు.


 "ఈ యుద్ధంలో ఎవరైతే విజయాన్ని సాధిస్తారో వారు

మాత్రమే ఖడ్గవిద్యా శిక్షణ వృత్తి హక్కును పొందగలరు" అని ఇరువురూ

ఒడంబడిక చేసుకున్నారు. ఇరువైపులకు చెందిన వీరులు ఎదురెదురుగా

నిలిచి కత్తులను, బల్లెములను ధరించి భయంకరంగా యుద్ధం చేశారు. అతిశూరుడు ఏనాది నాధుని చేతిలో ఓడిపోయి వెన్ను చూపి యుద్ధరంగం నుండి పారిపోయాడు. 


ఓడిపోయిన అవమానాన్ని తలచుకొని అతడు

నిద్రపోలేక పోయాడు. వంచనామార్గంతో ఏనాది నాధుని జయించాలని

ఒక కుతంత్రాన్ని పన్నుతాడు.

“మనం ఇరువురం ఏకాంతంగా ద్వంద్వ యుద్ధం చేద్దాం. నీవు

యుద్ధానికి రావలసింది" అని అతిశూరుడు ఏనాదినాధుని దగ్గరికి తన

మనిషిని ఒకరిని పంపించాడు. 


ఏనాదినాథుడు దీనికి సమ్మతించాడు.

నొసట విభూతి ధరించిన వారికి ఏనాదినాధుడు ఎలాంటి కీడు చేయడని

తెలుసుకొన్న వాడై అంతకుపూర్వం విభూతి పూసుకోవడం తెలియని

వాడైనప్పటికీ అతిశూరుడు తన ఫాలభాగమంతా విభూతిని పూసుకొన్నాడు.


అది కనిపించకుండా తన చేతిడాలుతో మరుగు పరిచి ఏనాదినాధుని

ముందుకు వెళ్లాడు. ఏనాదినాధుడు అతిశూరుని చంపడానికి కత్తి

దూసినపుడు అతిశూరుడు తాను మరుగు పరుచుకొన్న కెడయాన్ని పక్కకు

తీశాడు. అప్పుడు అతిశూరుని ఫాల భాగమందున్న విభూతిని ఏనాది  నాధుడు చూశాడు. "అయ్యో! నేనెంతటి పాపం చేశాను. 


ఇతడు శివభక్తుడని

తెలియక ఇతనితో యుద్ధం చేశాను” అని తన చేతిలోని ఖడ్గాన్ని జారవిడవాలని అనుకున్నాడు. కాని ఆయుధాలు లేనివాడిని చంపాడనే

అపకీర్తి ఇతనికి రాకుండా ఉండాలని భావించి చేతిలో పట్టుకొన్న వాడిలాగ

కనిపిస్తూ ఎదురుగా నిలిచాడు. అతిశూరుడు ఆ సమయంలో తన ఖడ్గంచే ఏనాదినాధుని సంహరించాడు. 


ఏనాదినాధుని భక్తి తత్పరతకు పరవశుడైన

పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఎదురుగా నిలిచాడు. మహాభక్తుడైన ఏనాదినాధుని

తనను ఎన్నడూ ఎడబాయకుండా శివగణాలలో ఒకడుగా తన సన్నిధిలోనే

ఉండమని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు.


 *ఎనిమిదవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

శ్రీ వివేకానందస్వామి

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 95*


శ్రీరామకృష్ణుల గృహస్థ శిష్యులలో ముఖ్యమైన వారిలో సురేంద్రనాథ్ మిశ్రా ఒకరు. నరేంద్రుడు ఇతడి ఇంట్లోనే ప్రప్రథమంగా శ్రీరామకృష్ణులను దర్శించాడు. అతడు ఒక రోజు కార్యాలయం నుండి తిరిగి వచ్చాక అలవాటు ప్రకారం పడు కొన్నాడు. హఠాత్తుగా “సురేన్" అంటూ ఎవరో పిలవడం వినిపించింది. ఎవరా అని చూడగా 


శ్రీరామకృష్ణులు - సజీవంగా నిలబడి ఉన్నారు. ప్రశాంతంగా సురేంద్రుణ్ణి చూస్తూ, “నా బిడ్డలు ఇటూ అటూ తిరుగాడుతున్నారు. నువ్వు వారి కోసం ఏమీ చేయవా?" అని అడిగి, మాయమయ్యారు. సురేంద్రుడు తక్షణమే లేచి నరేంద్రుని ఇంటికి పరుగుతీశాడు. అతడితో, "సోదరా! మనం వెంటనే ఒక ఇల్లు బాడుగకు తీసుకొందాం.


 అక్కడ గురుదేవులకు ఆలయం రూపొందించి, ఆయనను ఆరాధించుకొందాం. మేం భార్యాబిడ్డలంటూ సంసార జీవితంలో కొట్టు మిట్టాడుతూ ప్రశాంతత కోసం అక్కడకు వస్తాం. కాశీపూర్ ఉద్యాన గృహంలో గురుదేవులు నివసించినప్పుడు నేను ప్రతి నెలా ఒక మొత్తం ఇస్తూవచ్చాను. అదే మొత్తాన్ని ఇప్పుడు సంతోషంగా మీకు అందజేస్తాను. అది మీ ఖర్చులకు ఉపయోగపడుతుంది" అని చెప్పాడు. సురేంద్రుని వాగ్దానం విని నరేంద్రుడు ఆనందభరితుడయ్యాడు.


వెంటనే ఇంటి కోసం అన్వేషణ మొదలయింది. వరాహ నగర్ లో పది రూపాయల బాడుగకు ఒక పాడుపడిన ఇల్లు కుదిరింది. ఇదే కాలాంతరంలో సన్న్యాసుల నివాస స్థలంగా, సన్న్యాసుల మఠంగా పరిణమించింది. ఈ విధంగా ప్రపంచ మత చరిత్రలో నూతన యుగారంభానికి సురేంద్ర పునాది వేశాడు. చరిత్రలో శాశ్వతస్థానం పొందాడు. 


సురేంద్రుని గురించి ఉద్వేగభరితంగా 'మ' ఈ విధంగా వ్రాస్తున్నారు:


"సురేంద్రా, నువ్వు ధన్యుడవు! మొట్టమొదట ఈ మఠం నీచే స్థాపించ బడింది. దీని స్థాపనకు నీ ఇచ్చే కారణం. నిన్ను పరికరంగా చేసుకొని శ్రీరామ కృష్ణుల మూలమంత్రమైన కామినీ కాంచన పరిత్యాగ చిహ్నం అమరింది. పరి శుద్ధాత్ములైన నరేంద్రుడు మొదలైన యువ సన్న్యాసుల ద్వారా అమరమైన హైందవ ధర్మాన్ని జనం ముందు నెలకొల్పారు శ్రీరామకృష్ణులు.  


ప్రపంచ ఖ్యాతిగాంచిన రామకృష్ణ మఠం ఈ విధంగా 1886 సెప్టెంబర్/అక్టోబర్ లో ప్రారంభించబడింది.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* . *శ్లోకం - 85*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

.                   *శ్లోకం - 85*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*నమోవాకం బ్రూమో నయనరమణీయాయ పదయోః*

*తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాఽలక్తకవతే |*

*అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే*

*పశూనా మీశానః ప్రమదవనకంకేళితరవే ‖*



ఈ శ్లోకములో అమ్మవారి పాదముల రమణీయతను స్మరిస్తున్నారు శంకరులు .


నమో వాకం బ్రూమో నయనరమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ = అమ్మా, కనులకు ఆనందమునొసగే నీ పాదద్వయమును స్తుతిస్తున్నాను.


ఆ పాదములు ఎలా వున్నాయి? 

స్ఫుటరుచిరసాఽలక్తకవతే = అలదబడిన యెర్రని పారాణితో మెరుస్తున్నాయి.


పశూనా మీశానః"= పశుపతి అయిన నీ భర్త ఈశ్వరుడు, 


యదభిహననాయ ప్రమదవనకంకేళితరవే = అందమైన నీ వనములోని అశోక వృక్షమును, నీ రమణీయమైన పాదములతో మృదువుగా తన్నుతూ ఉండగా


 స్పృహయతే = తన ధ్యానము నుండి వెలికి వచ్చినవాడై, 


అసూయత్యత్యంతం = అత్యంతమైన అసూయను పొందాడట.


ఏమిటి ఇందులోని భావం? భారతీయ మహర్షులు దర్శించిన పుష్పలావికా శాస్త్రం ప్రకారం వృక్షములకు జీవముంటుందనీ, వాటికీ స్పందనలుంటాయనీ తెలిపారు. ఏ వృక్షమునకు ఎలాటి పోషణ చేయాలో, ఆ ప్రకారం అవి పుష్పించటం, ఫలించటం జరుగుతుందని చెప్పారు. ఆ శాస్త్రము ప్రకారం పద్మినీ జాతి స్త్రీలు పాదములకు, లక్కతో చేయబడిన ఒక విధమైన పారాణిని అలదుకొని ఆ తడి ఆరకముందే ఆ పాదములతో అశోకవృక్షముల మొదళ్లలో మృదువుగా స్పృశిస్తే, ఆ వృక్షములు పులకరించి వేగంగా పెరుగుతాయట.


అమ్మవారు ఆ విధంగా ఆ అశోక వృక్షములను (ఇవి మనం చూసే ఎత్తైన వృక్షములు కావు అశోక వృక్షములు హిమాలయములలో పెరుగుతాయట. వీటికి మృదువైన ఆకులు, యెర్రని పూలు ఉంటాయట. రవీంద్రనాథ టాగోర్ ఈ మొక్కలను హిమాలయముల నుండి తెప్పించి శాంతినికేతనంలో పెంచారట) తన తడియారని పారాణి పాదములతో2 మృదువుగా స్పృశించగా, అయ్యవారికి అసూయ కలిగిందట. ఆయనకు ఆమె పాదములను ప్రేమగా స్పృశించవలెనని కోరిక. పతివ్రతా ధర్మాన్ననుసరించి ఆమె ఆయనకు ఆ అవకాశం ఇవ్వటం లేదు. ఆ అదృష్టం ఆ అశోక వృక్షాలకు కలిగిందని స్వామికి అసూయ అని శంకరులు చమత్కరిస్తున్నారు.


అట్టి రమణీయ పాదములకు నమోవాకములు అంటున్నారు ఆయన. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవలసి వుంది. నమోవాకం బ్రూమో అంటున్నారు. అనగా నమోవాకములు చెప్తున్నాను అని. స్తుతి వాక్యములు స్తోత్రములు, శ్లోకములు నామములు, మంద్ర స్థాయిలో ఉచ్చరింపవలెనట.*స్తవః స్తోత్రం స్తుతిర్నుతిః* మంత్రము మౌనముగా చేయవలెనట. *వేదభేదే గుప్తవాదే మంత్రః* అందుకే రహస్యాలోచనకు మంత్రాoగము అని.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


*శ్లోకం*


*శ్రీమత్ప యోనిధి నికేతన చక్రపాణే* ! 

*భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే* !

*యోగీశ శాశ్వత శరణ్య! భవాబ్ది పోత* ! 

*లక్ష్మీ నృసింహ ! మమదేహికరావలమ్బమ్* ||


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం-01_* _


*తా:: పాలసముద్రము నివాసముగా గల ఓ దేవా! హస్తమున చక్రమును ధరించినవాడా ! ఆది శేషుని పడగలయందలి రత్నములచే ప్రకాశించు దివ్య దేహము కలవాడా! యోగులకు ప్రభువైన వాడా! శాశ్వతుడా!* *సంసార సాగరమునకు నావయగువాడా లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము*


🧘‍♂️🙏🪷 ✍️🙏

అద్వైతదర్శనము

 ||శ్రీమాత్రేనమః||

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*అద్వైతదర్శనము - ఉపనిషత్సిద్ధాంతము*

------------------కర్మసిద్ధాంతమును తదనుగుణమైన పునర్జన్మ సిద్ధాంతమును తొలుదొలుత లోకమునకు ఉపదేశించినది వేదము. 

   లోకమున దుఃఖమునకు కారణము జన్మ. జన్మకు కారణము సంసారమందు ప్రవర్తించుట. సంసారమున ప్రవృత్తికి కారణము రాగద్వేషములు. వీనినే దోషములని శాస్త్రజ్ఞులు వ్యవహరింతురు. రాగద్వేషమునకు కారణము మిత్యాభూతమైన జగత్తు సత్యమని , యథార్థమని భ్రమించి ప్రవర్తిల్లుట. 

        జగత్తు ' మిథ్య'యని దృఢనిశ్చయము కలిగినవానికిమిథ్యాభూత ప్రపంచమును గూర్చిన రాగద్వేషములుదయింపవు. రాగద్వేషములు లేనివారికి సంసారమున ప్రవృత్తియుండదు  సంసారమున ప్రవృత్తి లేనివారికి జన్మ యుండదు. జన్మలేనిచో దుఃఖమేలేదు. దుఃఖము లేనివానికి అద్వయానందాత్మ స్వరూపస్థానమే మోక్షము. 

            ఉపనిషత్తులు స్థూల సూక్ష్మ కారణ శరీరములు మూడు ఉండునని చెప్పుచున్నవి. జాగ్రద్దశయందు స్థూలశరీరాభిమానముతో పురుషుడు ప్రవర్తించును. అట్టి జీవునకు ' విశ్వు ' డనిపేరు. స్వప్నదశ యందు స్థూలశరీరాభిమానముండదు. తైజసమైన అంతఃకరణ తాదాత్మ్యముండదు. తైజసరూపుడై మనోవిలాసములగు స్వాపనికపదార్థానుభవము తత్ప్రయుక్తమైన సుఖదుఃఖాద్యనుభవము కలిగియుండును. ఈ స్థితి యందు సూక్ష్మశరీరాభిమానియై జీవుడు ' తైజస ' నామముతో వ్యవహరింపబడును. గాఢ సుషుప్తి యందు ఇంద్రియములతోపాటు మనస్సుకూడా లయముచెందును. జీవుడు కారణ శరీరాభినివిష్ఠుడై యుండును. దీనిని సంప్రసాదావస్థయందురు. ఈ అవస్థయందు ' ప్రాజ్ఞ ' నామముతోజరుగును. " నకించి దవేదిషం - సుఖ మహ మస్వాప్సం " యనెడి అనుభూతులు కలిగి యుండును. మరల ప్రాక్తన సంస్కారవశమున జాగ్రత్ప్రపంచమునను ; మరల స్వప్న ప్రపంచమునను తిరిగి కారణావస్థను పొందుచుండును. సుషుప్తియే దైనందిన ప్రళయము. జీవుడు స్థూలదేహమును విడచి సూక్ష్మ శరీరమును సుక్శ్మశరీరమును విడచి కారణశరీరమును మరల ఆ శరీరమును విడచి స్థూలాది శరీరమును బొందుట అనుభవసిద్ధమైన విషయము. అట్లే శరీరపాతానంతరము జీవుడు సూక్ష్మ శరీరముతో పుణ్యపాపానుభవ భోగసాధకములైన శరీరములనుదాల్చి , ఆ యా పుణ్యలోకముల చరించుచుండును. తిరిగిభోగానుభవానంతరం కర్మఫలానుభవయోగ్యము లైన నా యా శరీరముల దాల్చును. మానవుని శరీర పాతానంతరం తిరిగి నరజన్మ పాండునంతవరకు జీవుడే యే దశలయందు ఏ యే రూపమున ఏ యే యవస్థల గాంచునో పంచాగ్ని విద్యా ప్రకరణము ఉపనిషత్తులు విపులుగా వివరించినవి.

నిర్వాణ షట్కము

 శ్రీశంకరాచార్య విరచిత 

       **నిర్వాణ షట్కము** 


01

మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం

న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే

న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః

    చిదానందరూపః శివోహం శివోహం

    చిదానందరూపః శివోహం శివోహం



ఘనత గల్గిన చిత్తమ్ము  మనసు కాను 

అరయ బుద్ధిని గాను నే నహము కాను 

చెవులు కన్నులు నాసిక  జిహ్వ  కాను

అవని వ్యో మాగ్ని  వాయువు నరయ కాను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను    01


02                                                                 

న చ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయుః

న వా సప్తధాతుః న వా పంచకోశః

న వాక్పాణిపాదం న చోపస్థపాయుః

           చిదానందరూపః శివోహం శివోహం

           చిదానందరూపః శివోహం శివోహం 


ప్రాణ  సంజ్ఞను  భావింప కాను నేను 

పంచ వాయువు లరయంగ నెంచ కాను

రక్త రస మాంస  మేదాస్థి  యుక్త మైన 

సప్తధాతువులను గాను  సంభ్రమముగ

పంచకోశాధివాస సంపత్తి గాను 

కర చరణ మాట లేమియు న్నరయ కాను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను  02 


03                                                                 

న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ

మదో నైవ మే నైవ మాత్సర్యభావః

న ధర్మో న చార్థో న కామో న మోక్షః

    చిదానందరూపః శివోహం శివోహం

    చిదానందరూపః శివోహం శివోహం



అరయ ద్వేషానురాగ  విహారి గాను 

మోహలోభంబులును కూడ మొదలు లేవు 

మరియు ధర్మార్థ  కామముల్ మహిత ముక్తి

యేవియును లేవు నాకు నే నేమి కాను

      శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను   03



04                                                                 

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం

న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా

అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా

            చిదానందరూపః శివోహం శివోహం

            చిదానందరూపః శివోహం శివోహం



ఎన్నగా పుణ్య పాపంబు లేవి లేవు 

సుఖము దుఃఖము లనునవి చూడ లేవు 

తీర్థ మఖములు మంత్రముల్ తెలియ లేవు

అనుభవమ్మది  లేదు నా కనుభవించ

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను   04     

05                                                                 

న మే మృత్యుశంకా న మే జాతి భేదః

పితా నైవ మే నైవ మాతా న జన్మః

న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యం

           చిదానందరూపః శివోహం శివోహం

           చిదానందరూపః శివోహం శివోహం



చనెడుభయమది  లేదింక  జాతిలేదు 

జనని జనకులు మరి లేరు జన్మలేదు

కాను  బంధువు  నరయంగ  కాను సఖుడ

కాను నే శిష్యుడను మరి  కాను గురువు

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను   05  


 06                                                             

అహం నిర్వికల్పో నిరాకార రూపః

విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణాం

సదామే సమత్వం న ముక్తిర్న బంధః

           చిదానందరూపః శివోహం శివోహం

           చిదానందరూపః శివోహం శివోహం



లేదు  రూపమ్ము చూడగన్  లేదు మార్పు

ఇల ప్రదేశమ్ము లందు సర్వేంద్రియముల

వ్యాప్తి చెందియు ననయమ్ము వరలు చుందు,

నరయ సమదృష్టి నుందు నే నన్నిటందు 

ముక్తి బంధమ్ము లవిలేవు రక్తి లేదు

      శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను   06



అనువాద రచన..

గోపాలుని మధుసూదన రావు