24, నవంబర్ 2023, శుక్రవారం

శ్రీ వివేకానందస్వామి

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 95*


శ్రీరామకృష్ణుల గృహస్థ శిష్యులలో ముఖ్యమైన వారిలో సురేంద్రనాథ్ మిశ్రా ఒకరు. నరేంద్రుడు ఇతడి ఇంట్లోనే ప్రప్రథమంగా శ్రీరామకృష్ణులను దర్శించాడు. అతడు ఒక రోజు కార్యాలయం నుండి తిరిగి వచ్చాక అలవాటు ప్రకారం పడు కొన్నాడు. హఠాత్తుగా “సురేన్" అంటూ ఎవరో పిలవడం వినిపించింది. ఎవరా అని చూడగా 


శ్రీరామకృష్ణులు - సజీవంగా నిలబడి ఉన్నారు. ప్రశాంతంగా సురేంద్రుణ్ణి చూస్తూ, “నా బిడ్డలు ఇటూ అటూ తిరుగాడుతున్నారు. నువ్వు వారి కోసం ఏమీ చేయవా?" అని అడిగి, మాయమయ్యారు. సురేంద్రుడు తక్షణమే లేచి నరేంద్రుని ఇంటికి పరుగుతీశాడు. అతడితో, "సోదరా! మనం వెంటనే ఒక ఇల్లు బాడుగకు తీసుకొందాం.


 అక్కడ గురుదేవులకు ఆలయం రూపొందించి, ఆయనను ఆరాధించుకొందాం. మేం భార్యాబిడ్డలంటూ సంసార జీవితంలో కొట్టు మిట్టాడుతూ ప్రశాంతత కోసం అక్కడకు వస్తాం. కాశీపూర్ ఉద్యాన గృహంలో గురుదేవులు నివసించినప్పుడు నేను ప్రతి నెలా ఒక మొత్తం ఇస్తూవచ్చాను. అదే మొత్తాన్ని ఇప్పుడు సంతోషంగా మీకు అందజేస్తాను. అది మీ ఖర్చులకు ఉపయోగపడుతుంది" అని చెప్పాడు. సురేంద్రుని వాగ్దానం విని నరేంద్రుడు ఆనందభరితుడయ్యాడు.


వెంటనే ఇంటి కోసం అన్వేషణ మొదలయింది. వరాహ నగర్ లో పది రూపాయల బాడుగకు ఒక పాడుపడిన ఇల్లు కుదిరింది. ఇదే కాలాంతరంలో సన్న్యాసుల నివాస స్థలంగా, సన్న్యాసుల మఠంగా పరిణమించింది. ఈ విధంగా ప్రపంచ మత చరిత్రలో నూతన యుగారంభానికి సురేంద్ర పునాది వేశాడు. చరిత్రలో శాశ్వతస్థానం పొందాడు. 


సురేంద్రుని గురించి ఉద్వేగభరితంగా 'మ' ఈ విధంగా వ్రాస్తున్నారు:


"సురేంద్రా, నువ్వు ధన్యుడవు! మొట్టమొదట ఈ మఠం నీచే స్థాపించ బడింది. దీని స్థాపనకు నీ ఇచ్చే కారణం. నిన్ను పరికరంగా చేసుకొని శ్రీరామ కృష్ణుల మూలమంత్రమైన కామినీ కాంచన పరిత్యాగ చిహ్నం అమరింది. పరి శుద్ధాత్ములైన నరేంద్రుడు మొదలైన యువ సన్న్యాసుల ద్వారా అమరమైన హైందవ ధర్మాన్ని జనం ముందు నెలకొల్పారు శ్రీరామకృష్ణులు.  


ప్రపంచ ఖ్యాతిగాంచిన రామకృష్ణ మఠం ఈ విధంగా 1886 సెప్టెంబర్/అక్టోబర్ లో ప్రారంభించబడింది.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: