🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
. *శ్లోకం - 85*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*నమోవాకం బ్రూమో నయనరమణీయాయ పదయోః*
*తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాఽలక్తకవతే |*
*అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే*
*పశూనా మీశానః ప్రమదవనకంకేళితరవే ‖*
ఈ శ్లోకములో అమ్మవారి పాదముల రమణీయతను స్మరిస్తున్నారు శంకరులు .
నమో వాకం బ్రూమో నయనరమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ = అమ్మా, కనులకు ఆనందమునొసగే నీ పాదద్వయమును స్తుతిస్తున్నాను.
ఆ పాదములు ఎలా వున్నాయి?
స్ఫుటరుచిరసాఽలక్తకవతే = అలదబడిన యెర్రని పారాణితో మెరుస్తున్నాయి.
పశూనా మీశానః"= పశుపతి అయిన నీ భర్త ఈశ్వరుడు,
యదభిహననాయ ప్రమదవనకంకేళితరవే = అందమైన నీ వనములోని అశోక వృక్షమును, నీ రమణీయమైన పాదములతో మృదువుగా తన్నుతూ ఉండగా
స్పృహయతే = తన ధ్యానము నుండి వెలికి వచ్చినవాడై,
అసూయత్యత్యంతం = అత్యంతమైన అసూయను పొందాడట.
ఏమిటి ఇందులోని భావం? భారతీయ మహర్షులు దర్శించిన పుష్పలావికా శాస్త్రం ప్రకారం వృక్షములకు జీవముంటుందనీ, వాటికీ స్పందనలుంటాయనీ తెలిపారు. ఏ వృక్షమునకు ఎలాటి పోషణ చేయాలో, ఆ ప్రకారం అవి పుష్పించటం, ఫలించటం జరుగుతుందని చెప్పారు. ఆ శాస్త్రము ప్రకారం పద్మినీ జాతి స్త్రీలు పాదములకు, లక్కతో చేయబడిన ఒక విధమైన పారాణిని అలదుకొని ఆ తడి ఆరకముందే ఆ పాదములతో అశోకవృక్షముల మొదళ్లలో మృదువుగా స్పృశిస్తే, ఆ వృక్షములు పులకరించి వేగంగా పెరుగుతాయట.
అమ్మవారు ఆ విధంగా ఆ అశోక వృక్షములను (ఇవి మనం చూసే ఎత్తైన వృక్షములు కావు అశోక వృక్షములు హిమాలయములలో పెరుగుతాయట. వీటికి మృదువైన ఆకులు, యెర్రని పూలు ఉంటాయట. రవీంద్రనాథ టాగోర్ ఈ మొక్కలను హిమాలయముల నుండి తెప్పించి శాంతినికేతనంలో పెంచారట) తన తడియారని పారాణి పాదములతో2 మృదువుగా స్పృశించగా, అయ్యవారికి అసూయ కలిగిందట. ఆయనకు ఆమె పాదములను ప్రేమగా స్పృశించవలెనని కోరిక. పతివ్రతా ధర్మాన్ననుసరించి ఆమె ఆయనకు ఆ అవకాశం ఇవ్వటం లేదు. ఆ అదృష్టం ఆ అశోక వృక్షాలకు కలిగిందని స్వామికి అసూయ అని శంకరులు చమత్కరిస్తున్నారు.
అట్టి రమణీయ పాదములకు నమోవాకములు అంటున్నారు ఆయన. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవలసి వుంది. నమోవాకం బ్రూమో అంటున్నారు. అనగా నమోవాకములు చెప్తున్నాను అని. స్తుతి వాక్యములు స్తోత్రములు, శ్లోకములు నామములు, మంద్ర స్థాయిలో ఉచ్చరింపవలెనట.*స్తవః స్తోత్రం స్తుతిర్నుతిః* మంత్రము మౌనముగా చేయవలెనట. *వేదభేదే గుప్తవాదే మంత్రః* అందుకే రహస్యాలోచనకు మంత్రాoగము అని.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి