19, మార్చి 2025, బుధవారం

పుణ్యం వెల*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

          *పుణ్యం వెల*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

 *కాశీ పట్టణంలో ధనవంతుడు అయిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు.*


*అతను ప్రతీ రోజు దాన ధర్మాలు చేసేవాడు. దానికి తోడు మిక్కిలి దైవ భక్తి కలవాడు మరియు యజ్ఞ యాగాదులు కూడ చేసేవాడు.*


*ఒక యాగంలో అన్నీ దానం చేయటంతో కుటుంబ పోషణకు అతడి వద్ద డబ్బులు లేకుండా పోయాయి.*


*పక్క ఊరిలో ఒక పెద్ద సేఠ్ నివసిస్తున్నాడని అతడు ఇతరుల పుణ్యంను కొని ధనం ఇస్తాడని బ్రాహ్మణుడి భార్య అతనికి చెప్పి వారి వద్దకు వెళ్లి మీ పుణ్యాలు అమ్మి కొంత డబ్బు తీసుకు రండి, తద్వారా వ్యాపారం కొత్తగా మళ్లీ ప్రారంభం చేయవచ్చును అని సలహా ఇస్తుంది.*


*బ్రాహ్మణుడు మాత్రం తను చేసిన పుణ్యం అమ్మడానికి ఇష్టపడలేదు, కానీ భార్య ఒత్తిడి మరియు పిల్లల బాధల కారణంగా అతను పుణ్యం అమ్మడానికి సిద్ధపడక తప్పలేదు.*


*దారిలో తినడానికి భార్య ఇచ్చిన నాలుగు రొట్టెలు తీసుకొని ప్రయాణం అవుతాడు.*


*అతను నడుచుకుంటూ అడవిలో నుండి పోయే వేళ ఆకలి కావటంతో ఊరికి చేరే లోపు భోజనం ముగించాలి అనుకుని రొట్టె తీయగానే ఒక కుక్క వచ్చి తన మూడు కుక్క పిల్లలతో ఎదుట నిలబడుతుంది. పిల్లలు చాలా చిన్నవి కావడంతో వాటిని వదిలి ఊరులోకి వెళ్లలేకపోయింది.*

 

*బ్రాహ్మణునికి బాధగా అనిపించి అతను కుక్క పై కుక్కపిల్లల కోసం జాలిపడి, తన దగ్గర ఉన్న రొట్టెల నుండి ఒక రొట్టెను కుక్కకు ఇస్తాడు.*


*కుక్క చాలా రోజులుగా ఆకలితో ఉండటంతో, కుక్క త్వరగా రొట్టె తినేసింది, కానీ ఇంకా ఆకలితో ఉండటంతో బ్రాహ్మణుడి వైపు చూడసాగింది.*


*బ్రాహ్మణుడు జాలిపడి రెండవది, తరువాత మూడవది, చివరి నాల్గవది అలా మొత్తం రొట్టెలు కుక్కకు వేసి తను మాత్రం కేవలం నీరు త్రాగి సేఠ్ ఉన్న ఊరికి చేరుకొంటాడు.*


*బ్రాహ్మణుడు సేఠ్‌తో తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చానని చెప్పుతాడు.*

 

*అప్పుడు సేఠ్ ‘నేను చాలా పనిలో ఉన్నాను, సాయంత్రం రండి, నేను కొంటాను!’ అని అంటాడు.*


*మధ్యాహ్నం సేఠ్ తన ఇంటికి భోజనానికి వెళ్లి ‘తన పుణ్యాన్ని విక్రయించడానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడని భార్యతో చెప్పుతాడు. అతని దగ్గర నేను ఏ పుణ్యం కొనాలి చెప్పు!’ అని సలహా అడుగుతాడు.*


*సేఠ్ భార్య చాలా మంచి పతివ్రత స్త్రీ. ఈ రోజు బ్రాహ్మణుడు రొట్టెలన్నీ కుక్కకు ఇచ్చి చాలా పుణ్యం సంపాదించుకున్నా డని కండ్లు మూసుకొని ధ్యానం చేసి తెలుసుకొంటుంది.*


*కుక్కలకు రొట్టెలు వేసి సంపాదించిన పుణ్యాన్ని బ్రాహ్మణుడి నుండి కొనమని తన భర్తకు చెబుతుంది.*


*సాయంత్రం బ్రాహ్మణుడు తన పుణ్యాన్ని విక్రయించడానికి వచ్చినపుడు సేఠ్ ఇలా అంటాడు…*


’*ఈరోజు నువ్వు చేసిన యజ్ఞం యొక్క పుణ్యాన్ని నేను కొనాలని అనుకొంటున్నా ను.*


*బ్రాహ్మణుడు నవ్వి ఇలా అంటాడు… ’నా దగ్గర యజ్ఞానికి సరిపడ ధనం ఉంటే నీకు పుణ్యం అమ్మడానికి వచ్చేవాడినా?’ అని.*


’*ఈరోజు ఆకలితో ఉన్న కుక్కకు ఆహారం పెట్టి ఆ కుక్కను, దాని పిల్లలను నువ్వు రక్షించావు. అదే యజ్ఞం!’ అని సేఠ్ అంటాడు.*


’*నువ్వు సంపాదించిన ఆ పుణ్యాలన్నీ నేను కొనాలని అనుకొంటున్నాను!’ అని అంటాడు.*


*బ్రాహ్మణుడు పుణ్యం అమ్మడానికి అంగీకరిస్తాడు. దానికి బదులుగా నీకు నాలుగు రొట్టెల బరువుకు సమానంగా వజ్రాలు, ముత్యాలు ఇస్తానని సేఠ్ అనటం దానికి బ్రాహ్మణుడు కూడ అంగీకరించడం జరిగిపోతాయి.*


*నాలుగు రొట్టెలు తయారు చేసి త్రాసులో కాటాకు ఒక ప్రక్కన ఉంచబడతాయి.*

  

*రెండవ దానిలో, సేఠ్ ఒక సంచీ నిండా వజ్రాలు, ముత్యాలు, ఆభరణాలు ఉంచుతాడు. త్రాసు యొక్క కాటా కొంచెం కూడ కదలదు.*


*రెండవ సంచీ ఉంచినా కూడా కాటా కొంచెం కూడ కదలకపోయేసరికి సేఠ్ తన దగ్గర వున్న ఆభరణాలు అన్నీ రెండో దిక్కున ఉంచినా కూడ కాటా అసలుకే కదలదు.*


*అది చూసిన తర్వాత అక్కడ వున్న వారందరు ఆశ్చర్యపోతారు*.

 

*అప్పుడు బ్రాహ్మణుడు సేఠ్‌తో, "నేను నా మనసు మార్చుకున్నాను. ఇప్పుడు నా పుణ్యాన్ని నీకు అమ్మడం ఇష్టం లేదు!” అని రిక్త హస్తాలతో తన ఇంటికి ప్రయాణం అవుతాడు.*


*ఇంట్లోకి అడుగుపెట్టగానే భార్య తనతో గొడవ పడుతుందేమోనని భయపడి, దారిలో కుక్కకి రొట్టెలు ఇచ్చిన చోటు నుంచి కొన్ని గులకరాళ్లు, రాళ్లను ఏరుకుని దానితో ఒక మూటనూ తయారు చేసి ముడి వేస్తాడు.*


*ఇంటికి చేరుకోగానే అతని భార్య పుణ్యాన్ని అమ్మి ఎంత సంపాదించావు అని అడగటంతో ఆ రాళ్ల మూటను భార్యకు ఇచ్చి అప్పు దొరుకుతుందేమో నని గ్రామం లోకి వెళతాడు.*


*ఇక్కడ అతని భార్య ఆ మూటను చూసి ఆగలేక, భర్త వెళ్లగానే ఆ మూట తెరిచి చూస్తుంది. ఆ మూట నిండా వజ్రాలు, నగలు ఉండటంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండాపోతాయి.*


*బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి రాగానే అతని భార్య మీ పుణ్యానికి ఇంత మంచి ధర ఎవరు చెల్లించారని అడుగుతుంది. మీకు ఇన్ని వజ్రాలు మరియు ఆభరణాలు ఎక్కడ నుండి వచ్చాయి? అంటుంది.*


”*వజ్రాలు, నగలా ? ఎక్కడ ఉన్నాయో చూపించు!” అని అంటాడు బ్రాహ్మణుడు.*

 

*భార్య తన ముందు ఉన్న మూటను విప్పగానే అందులోంచి విలువైన ఆభరణాలు బయటపడటంతో వాటిని చూసి బ్రాహ్మణుడు కూడా చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడు అతను తన భార్యకు జరిగిన విషయాలు అన్నీ పూస గుచ్చినటుల చెబుతాడు.*

 

*విపత్తు సమయంలో తన పుణ్యాన్ని విక్రయించమని అతనిని బలవంతం చేసినందుకు అతని భార్య చాలా బాధపడుతుంది.*

 

*నీతి* 


*నిజానికి ఇది కథ కాదు. జీవితం! ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి. ఆపదలో ఉన్న వారికి సాయంచెయ్యండి. మీకు ఎంత డబ్బున్నా ఇహలోక ప్రయాణానికే. మీ డబ్బును ఎవరైనా దొంగిలించవచ్చు. కానీ, మీ పుణ్యాన్ని ఎవరూ దొంగిలించలేరు*.


*అందుకే, మీ దగ్గర ఉన్న డబ్బును పుణ్యంగా మార్చుకోండి.*.

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(78వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

          *కృష్ణావతారం* 

 *కంసుడు*, *శ్రీకృష్ణ జననం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*కొన్నాళ్ళకి నారదమహర్షి, కంసుణ్ణి సందర్శించాడు. ఆ మాటా ఈ మాటా చెబుతూ వసుదేవాది యాదవులూ, దేవకీ మొదలయిన యదు వనితలంతా దేవతలని చెప్పాడు.*


*దేవకి గర్భాన శ్రీమహావిష్ణువు జన్మించనున్నాడని చెప్పి, అతడే కంససంహారానికి పూనుకుంటాడని తెలియజేశాడు.*


*తట్టుకోలేకపోయాడు కంసుడు. గతజన్మలో తాను కాలనేమి అని తెలుసుకున్నాడతను. రాక్షసుణ్ణని కూడా తెలుసుకున్నాడు. రాక్షసులకూ, దేవతలకూ ఉన్న బద్ధవైరాన్ని తలచుకున్నాడు. తప్పదు, వసుదేవాది యాదవులందరినీ తుదముట్టించాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం, దేవకీ వసుదేవుల్ని బంధించాడతను. సంకెళ్ళు వేసి, చెరసాలలో ఉంచాడు. చంపకుండా వదలివేసిన దేవకి తొలి సంతానం కీర్తిమంతుణ్ణి అప్పుడు నిర్దాక్షిణ్యంగా సంహరించాడు.*


*లంబుడు, ప్రలంబుడు, చాణూరుడు, ముష్టికుడు, తృణావర్తుడు, అఘాసురుడు, అరిష్టుడు, ద్వివిదుడు, కేశి, ధేనుకాసురుడు, పూతనలాంటి రాక్షసులను చేరదీసి తనని తాను కాపాడుకునేందుకు ప్రయత్నించసాగాడు కంసుడు.*


*కారాగారంలో జన్మించిన దేవకీ వసుదేవుల బిడ్డలు ఒకొక్కరినీ పొట్టన పెట్టుకుంటూ రాసాగాడు. అంతటా కట్టుదిట్టం చేసుకున్నాడు. చెరసాలలో భటుల్ని కాపలా పెట్టాడు. దేవకికి బిడ్డ పుట్టీపుట్టగానే ఆ వార్తను తనకి చేర్చాలి. వార్త చేరిన మరుక్షణం కంసుడు అక్కడకి వచ్చేవాడు. తన ఖడ్గానికి ఆ బిడ్డను బలి చేసేవాడు.*


*పుత్రశోకంతో దేవకీ వసుదేవులు కుమిలిపోసాగారు. నీవే దిక్కు అంటూ శ్రీమహావిష్ణువుని ధ్యానించసాగారు.*


*కంసుని హింసలు భరించలేక యాదవులు చాలా మంది మధురానగరం విడచిపెట్టేశారు. కురు, పాంచాల, కేకయ, సాల్వ, విదర్భ, నిషధ, విదేహ, కోసలదేశాలకు తరలిపోయారు.*


*ఏడవసారి గర్భం ధరించింది దేవకి. భగవంతుని ఆజ్ఞానుసారం ఆదిశేషుడు భువిలో అవతరించాల్సి ఉంది. ఆ కారణంగానే అతడు, దేవకి గర్భంలో ప్రవేశించాడు.*


*యోగమాయను పిలిచాడప్పుడు విష్ణుమూర్తి. ఇలా చెప్పాడామెకు.‘‘నువ్వు తక్షణం వ్రేపల్లెకు వెళ్ళు. అక్కడ వసుదేవుని భార్య రోహిణి ఉన్నది. ఆమె గర్భంలో దేవకి గర్భాన ఉన్న తేజస్సును చేర్చు. త్వరలో నేను దేవకి గర్భాన జన్మిస్తాను. నేను జన్మించకముందే నువ్వు, నందుని భార్య యశోదగర్భాన జన్మించు.’’*


*వసుదేవుని భార్య రోహిణి, ఇంకొందరు కంసుడికి భయపడి, వ్రేపల్లెలో తలదాచుకున్నారు.*


*యోగమాయ వ్రేపల్లెకు చేరుకుంది. దేవకీ గర్భాన ఉన్న ఆదిశేషుని తేజస్సును ఆకర్షించి, దానిని రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. ఆ విధంగా రోహిణికి జన్మించినవాడే బలరాముడు. కృష్ణుడికి అగ్రజుడయ్యాడతను. దేవకి గర్భం నుండి సంకర్షించి, రోహిణికి చేర్చడంతో అతనికి ‘సంకర్షణుడు’ అని పేరు వచ్చింది. లోకరమణీయుడు కావడంతో ‘రాముడు’ అని, మహాబలాఢ్యుడు కావడంతో ‘బలుడు’ అని అతన్ని వ్యవహరిస్తూ వచ్చారు.*


*గర్భంలోని తేజస్సు పోవడంతో తనకి గర్భస్రావం అయిందని తలచింది దేవకి. అందుకు చాలా దుఃఖించిందామె. కొంతకాలానికి అష్టమగర్భం ధరించింది. శ్రీమహావిష్ణువు ఆమె గర్భంలో ప్రవేశించాడు. ఫలితంగా దేవకి అమిత తేజస్సుతో ప్రకాశించసాగింది. దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న దేవకిని చూసి అంతా ఆశ్చర్యపోసాగారు.*


*ఆ వెలుగు చూసి కంసుడు భయపడ్డాడు. దేవకి గర్భంలో విష్ణుమూర్తి ప్రవేశించిన కారణంగానే ఆమె అంతటి వెలుగులీనుతున్నదని గ్రహించాడతను. పుట్టగానే ఆ బిడ్డను సంహరించాలనుకున్నాడు. కారాగారం దగ్గర కాపలాను మరింత కట్టుదిట్టం చేశాడు. దేవకి ప్రసవించిన మరుక్షణం తనకి ఆ సంగతి తెలియజేయాల్సిందిగా ఆజ్ఞాపించాడు. మహావిష్ణువు మాయలు అంతు చిక్కవని, వేయికళ్ళతో జాగ్రత వహించమని పదే పదే చెప్పాడు.*


*దేవకిగర్భాన మహావిష్ణువు జన్మించనున్నాడని బ్రహ్మాది దేవతలు తెలుసుకున్నారు. ఇంద్రాదులు, నారదుడు సహా వారంతా అదృశ్యంగా భూలోకానికి తరలివచ్చారు. దేవకి గర్భంలో ఉన్న విష్ణుమూర్తిని స్తుతించారు. అనేక విధాల కీర్తించారతన్ని. భూలోకంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ జరుగుతుందని సంతోషించి నిష్క్రమించారు.*


*దేవకికి నవమాసాలూ నిండాయి. శ్రావణమాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథినాడు అర్ధరాత్రి రోహిణీనక్షత్రయుక్త వృషభలగ్నంలో కృష్ణుడు జన్మించాడు.*


*గ్రహ నక్షత్ర తారకలన్నీ సౌమ్యులై వెలిగిన మహాద్భుత క్షణం అది. సకలలోకాలకూ మంగళప్రదమయిన సమయం అది. కృష్ణుడు అవతరించగానే దేవదుందుభులు మ్రోగాయి. పూలవాన కురిసింది. గంధర్వులు గానం చేశారు. విద్యాధరాంగనలు, అప్సరసలు నాట్యం చేశారు. పరిమళభరితంగా గాలి వీచింది. సకలప్రాణి కోటీ సంతోషించింది. ఎందుకు ఆ సంతోషం అన్నది అంతుచిక్కలేదెవరికీ.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*తన మనస్సు అనే రాజహంసను, ఈశ్వరుని పాదపద్మములు అనే సౌధాంతరాళములో అనగా దివ్యభవనము లోపల నివసించుమని ఈ శ్లోకంలో శంకరులు కోరారు.*


*శ్లోకం  :   46*


*ఆకీర్ణే నఖరాజి కాంతి విభవై రుద్యత్సుధా వైభవైః*

                   

*ఆధౌతే పిచ పద్మరాగ లలితే హంస వ్రజై రాశ్రితే,*

                   

*నిత్యం భక్తి వధూ గణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు*

                   

*స్థిత్వా మానస రాజ హంస! గిరినాథాంఘ్రి సౌధాంతరే !!*


*పదవిభాగం :~*


*ఆకీర్ణే _ నఖరాజికాంతివిభవైః _ ఉద్యత్సుధావైభవైః _ ఆధౌతే _ అపి _ చ  _ పద్మరాగలలితే _ హంసవ్రజైః _ ఆశ్రితే _ నిత్యం _ భక్తివధూగణైః _ చ_ రహసి _ స్వేచ్ఛావిహారం _ కురు _ స్థిత్వా _ మానసరాజహంస _ గిరిజా నాథాంఘ్రిసౌధాంతరే॥*


*తాత్పర్యము:~*


*మనస్సనే ಓ రాజహంసమా! నీవు గోళ్ళ వరుసల కాంతి సంపదలచే కూడినదియూ, ప్రసరించు అమృత ప్రవాహముచే కడుగబడినదియూ, (సున్నపు కాంతులచే తెల్లనైనదియూ,* *పద్మరాగమణులచే పద్మముయొక్క కెంపు వర్ణముచే సుందరమైనదియూ, పరమహంసలచే (హంసల గుంపుతో) ఆశ్రయింపబడినదియూ, పార్వతీపతియైన శివుని పాదము అనే మేడ లోపలి భాగములో ఉండి , రహస్యముగా భక్తి అనే స్త్రీల ( హంసాంగనల) సమూహంతో కలసి, ఎల్లప్పుడునూ ఇష్టం వచ్చినట్లు విహరించు.*


*వివరణ :~*


*శంకర భగవత్పాదులు, ఈ శ్లోకంలో పరమేశ్వరుని పాదపద్మము ఆశ్రయింపదగిన దివ్య భవనంగా ఉన్నదని చెప్పారు.  మనస్సు రాజ హంస వలె ఉన్నదని చెప్పారు. భక్తి పద్ధతులు ఆడు హంసలుగా చెప్పబడ్డాయి. శంకరులు తన మనస్సు నుద్దేశించి ఇలా చెప్పారు.*


*" ಓ మనస్సా ! నీవు శ్రేష్టమైన హంస వంటి దానవు. నీవు ఈశ్వరుని పాదములు అనే భవనం లోపల సుఖంగా ఇష్టానుసారంగా విహరించు. ఈశ్వరుని కాలి గోళ్ళ కాంతులు ఈశ్వరుని పాదాలను ధగధగ లాడిస్తున్నాయి. ఆపాదం మేడ అనుకుంటే , శివుని గోటి కాంతులే ఆ మేడలో వేల దీపాల కాంతులై , వెలుగులను వెదజల్లుతూ ఉంటాయి. శివుని జటాజూటంలో ఉన్న చంద్రుని  నుండి అమృతము స్రవించి , మెల్లగా వచ్చి ఆ పాదాలను కడుగుతుంది.  ఆ కాంతులు ఆ భవనానికి పూసిన తెల్లని సున్నపు పూత కాంతులుగా నున్నవి.  స్వామి పాదాలు పద్మరాగ కాంతులతో ౘూడ ముచ్చటగా ఉన్నాయి.* *అందువల్ల ఆభవనం పద్మరాగమణులు గూర్చిన వైభవాలతో  ప్రకాశిస్తోంది.  స్వామి పాద సన్నిధిలో , హంసమంత్ర జప పరాయణులెందరో ఉన్నారు. వాళ్ళు నీతోడి హంసలవలె ఉంటారు‌ .అక్కడ భక్తి వధువులు , ఎందరో ఉన్నారు. వారు నీకు ప్రియురాండ్రై, నీ హృదయానికి ఆనందాన్ని సమకూరుస్తారు.*


*కాబట్టి ಓమనసా! నీవు ఆ సుందర శివపాద దివ్య భవనంలో ప్రవేశించు. నీవు ఆ భగవంతుని పాదాలనాశ్రయించి వాటిని భక్తితో సేవిస్తూ పరమ సుఖాన్ని హాయిగా అనుభవించు.*


*మనం మనకు బాగా ఇష్టమైన వ్యక్తుల వద్ద ఉంటే మనకెంతో సుఖంగా ఉంటుంది కదా! అటువంటిది , నీవు భగవంతుని పాద సన్నిధి లోనే ఉంటే , ఇంకా ఎంత సుఖంగా ఉంటుందో ఆలోచించుకో.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

ప్రియ బాంధవా మేలుకో 14*

 *ప్రియ బాంధవా మేలుకో 14*

సభ్యులకు నమస్కారములు.


గత వ్యాసాలలో పోలీసు భద్రతా చర్యల గురించి వివరణలు చూసాము. దేశంలోని మరొక  చట్టం గురించి  గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. *అనైతిక మరియు అక్రమ రవాణా చట్టము*. ఈ చట్టం ఆధారంగా ప్రభుత్వం దిగువ చూపబడిన నేరాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతోంది. 

1) *అక్రమ రవాణా* ఈ చట్ట విరుద్ధ కార్యక్రమాలలో ఇసుక మట్టి  అక్రమ రవాణాతో మొదలిడి స్వార్థపరులు బియ్యం, కలప దుంగలు, గంధపు చెక్కలు, బియ్యం, మాదక ద్రవ్యాలు,  చారిత్రక, సాంస్కృతిక పురా వస్తువులు, కళాఖండాలు, ఔషధాలు, ఆయుధాలు.  *ఇటువంటి న్యాయ విరుద్ధ, చట్ట విరుద్ధ కృత్యాలనిటిని వ్యవస్తీకృత నేరాలుగా పరిగణిస్తారు*. ఇటువంటి నేరాల వెనుక బలమైన సంఘ నీతి బాహ్యులు మరియు దారుణమైన నేరస్తులుంటారు. ఒక్కొక్క సారి వీరందరికీ దేశ ద్రోహులతో  గూడా సంబంధాలుంటాయి. 


ఈ నేరాలకు తోడుగా స్థానిక నేరాలను గూడా పరిశీలిద్దాము. 

భూదంధాలు, అక్రమ నిర్మాణాలు,  దొంగ నోట్ల, నకిలీ ధ్రువ పత్రాల (certificates) ముద్రణ, మూడు ముక్కలాటలు, మట్కా జూదాలు, కోడి పందాలు, క్రికెట్ బెట్టింగులు, గంజాయి విక్రయాలు, నల్ల మందు మూఠాలు, నకిలీ బిల్లు సిద్ధ హస్తులు. ఇవన్నిటికి తోడు పదార్థాలను అనగా ముడి సరుకులతో పాటు ఆహార పదార్థాలను కల్తీ చేయు సంస్థలు. *వింటుంటేనే, చదువుతుంటేనే కంపరం కల్గించే దోష భూయిష్టమైన సమాజంలో జీవిస్తున్నాము*. 


ఈ దురాగతాలన్ని చేసే మాఫియా గ్రూప్ లన్ని ఆధునిక సాంకేతిక ప్రక్రియలలో ఆరితేరి ఉంటారు.  వీళ్ళ వ్యాపారాలు కొన్ని కోట్ల రూపాయలతో ప్రారంభమై వేల కోట్ల వరకు విస్తరించి ఉండవచ్చుననుటలో అతిశయోక్తి ఉండక పోవచ్చును. 


2) *అనైతిక అక్రమ రవాణా*:- ఈ తరహా అక్రమ రవాణాలో మానవ మరియు జీవ సంబంధమైన అంశాలు అక్రమ రవాణా కనబడుతాయి.  మహిళలు, బాలికలు, పసికందులు, మానవ అవయవములు ఇత్యాది.  బాల బాలికలను మరియు మహిళలను  తమ తమ సంస్థలలో నిర్బంధించి బలవంతంగా పని చేయించుట గూడా ఈ అనైతిక అక్రమ రవాణా చట్టంలోనే చేర్చబడి ఉన్నది. 


*అవినీతి నిరోధక చట్టం* 2018 వ సంవత్సరంలో కాలానుగుణంగా సవరించబడినది. *అనైతిక రవాణా చట్టం* PITA (Prevention of Immoral Traffic Act) మరియు SITA (Suppression of Immoral Traffic Act) 1980 సంవత్సరం నుండియే అమలులో ఉన్నది. 


పైన తెలుపబడిన అక్రమ రవాణాల వలన దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు వాటిల్లనున్నది. ఇటువంటి వ్యవస్థీకృత నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనుటకు ప్రభత్వ విభాగాలు ఏర్పడినాయి. సదరు విభాగాలు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి.


విస్తారమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ దేశం మొత్తంలో *ఈ దుర్మార్గాలన్నీ మటు మాయ మయ్యాయని విజ్ఞులెవరైనా చెప్పగలరా*. భద్రత మరియు రక్షణ వ్యవస్థలు చతికిల పడ్డాయని కూడా చెప్పలేము.


ప్రజలు దేశ సమస్యల పట్ల చైతన్యులై, ఐకమత్యంతో ప్రభుత్వంతో సహకరించినప్పుడు *మాత్రమే* ఫలితాలు మరింత మెరుగ్గా ఉండి, అకృత్యాలు తగ్గు బాట పడతాయి.


ధన్యవాదములు

*(సశేషం)*

ప్రియ బాంధవా మేలుకో 13*

 *ప్రియ బాంధవా మేలుకో 13*


సభ్యులకు నమస్కారములు.


దేశ మరియు సామాజిక భద్రత, సుఖ, శాంతియుత జీవనానికి హానికారక అంశాల మరియు కృత్యాల నిరోధక శాఖలు లేదా విభాగాల పరిశీలనలో పోలీసు శాఖ బాధ్యతలను గత వ్యాసంలో తెలుసుకున్నాము. 

తదుపరి శాఖ ..

*ఆవినీతి నిరోధక శాఖ* :-

1988 సంవత్సరంలో పార్లీమెంటులో ఆమోదింపబడినది. 

ముఖ్య అంశములు. 

1) చట్ట విరుద్ధమైన మార్గాల ద్వారా *ప్రజలు* ప్రభుత్వ ఉద్యోగులను *ప్రభావితం చేయరాదు*.

2) తమ విధులలో 

*ప్రభుత్వ ఉద్యోగుల* 

నేర పూరిత, ప్రేరిత *దుష్ప్రవర్తనలను* 

చట్టం అరికట్టాలి. 


ఇందుకుగాను అవినీతి నిరోధక  ప్రభుత్వ శాఖలు/విభాగాలు ఏర్పడినవి. ఈ సంస్థలు *అవినీతిని ప్రోత్సహించే ప్రజలను* మరియు *అవినీతికి పాల్పడే ఉద్యోగులపై* వచ్చిన ఆరోపణలకు సంబంధించిన విచారణలు చేపట్టి, తదనంతరం న్యాయ పరిమితులకు లోబడి శిక్షలు అమలు చేస్తున్నవి. 


సభ్య సమాజ స్థాయిలో ఆలోచిస్తే....

  1) ముందుగా ప్రజలు నైతికత అలవర్చుకోవాలి. 

2) తమ స్వార్థ ప్రయోజనాల కొరకు ప్రభుత్వ గాని ఇతర సంస్థలు ఉద్యోగస్తులకు ఆకర్షణలు చూపరాదు. సాధారణంగా లంచం రూపంగా ధనం, వస్తువులు, మద్యం మరియు సభ్య సమాజం ఆమోదించని ఇతర ఆకర్షణలు ఉంటూ ఉంటాయి. ప్రజలు గమనించాల్సిన ముఖ్య విషయం *లంచం తీసుకోవడం మాత్రమే నేరం కాదు, ఇవ్వడం అంతకంటే పెద్ద నేరం*. నిజాయితీగా ఉన్న *ఉద్యోగస్తులను తప్పు త్రోవ  పట్టించే  ప్రజలే అసలైన నేరస్థులు*. ముందు వీరే శిక్షార్హులు. 


1) లంచం ఇవ్వజూపే ప్రజలకు శిక్షలు. 

*అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7, 9 మరియు 10* ప్రకారం 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల జైలు మరియు తీవ్రతను బట్టి జరిమానా కూడా. కానీ నేటి వరకు  ప్రభుత్వ ఉద్యోగులు ఫలానా వారు నాకు లంచం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడని ఒక్క కేసు కూడా నమోదు కాలేదు..,.అంటే ప్రజలు  నీతిమంతులుగా ఉన్నారని భావించాలా...లేక ఉద్యోగుల ఉదాసీనతా?

2) లంచం అంగీకరించిన ఉద్యోగులకు *సెక్షన్ 12, 13 మరియు 14* ప్రకారం Suspension, జైలు, జరిమానా మరియు ఉద్యోగాల నుండి తొలగింపు. 


ఈ శిక్షలు మన దేశంలో చట్టాలు ఏర్పడినప్పటి నుండి అమలులో ఉన్నవి. అవుతే, *లంచగొండితనం ప్రస్తుతం సమాజంలో లేదు* ఎప్పుడో *రూపుమాసినది అని ఎవరైనా చెప్పగలరా*. సామాన్యుడు  కూడా ఈ లంచగొండితనం *ఇంకా ఇంకా ప్రబలుతూనే  ఉన్నది అని తెలియజేస్తాడు.*


సమాజంలో  ఉన్న అనేక దుష్కృత్యాల నివారణకు ప్రజల ప్రమేయమెందుకు పాలకులు ఉన్నారు కదా అను పరిస్థితి లేదు.


ప్రాంతమేదైనా, దేశమేదైనా ప్రజల జాగృతి, చైతన్యము మాత్రమే సమాజానికి శ్రీ రామ రక్ష.  *సమాజ సంఘటిత తత్వమే దుష్టులకు సింహస్వప్నము*


ధన్యవాదములు

*(సశేషం)*

చిన్నబోయె నేమొ

 చిన్నబోయె నేమొ చిన్నవాని మనసు


తలను వంచి చూసె తల్లివంక


అలక తీర్చవలయు నందరు ప్రేమతో


మొలక నవ్వు విరియు ముఖము మీద.

*అన్ననుc దండ్రినిన్ జనని నంతమొనర్చిన వారె వంద్యులౌ*

ఈ సమస్యకు నా పూరణ.


ఎన్ని విధంబులున్ తమకు నేదియు లాభమొ గద్దెనెక్కగాన్


అన్నివిధంబులున్ సలిపి యందరి ద్రొక్కుటె రాజకీయమై


సున్నము బెట్టి పంపుటయె - సూక్ష్మ మెరింగియు నిట్లు చెప్పరే


అన్ననుc దండ్రినిన్ జనని నంతమొనర్చిన వారె వంద్యులౌ.



అల్వాల లక్ష్మణ మూర్తి.

ప్రియ బాంధవా మేలుకో 12*

 *ప్రియ బాంధవా మేలుకో 12*




దేశాభివృద్ధికి ఆయా రంగాల అధినేతలు శ్రమిస్తూ దేశాన్ని అంతర్జాతీయంగా ప్రముఖ స్థానానికి చేర్చడమే గాకుండా ప్రజలకు పలు సౌకర్యాలు కల్పిస్తూ  దైనందిన జీవితంలో వెసులుబాట్లు కల్పిస్తున్నారు. అలాగే దేశంలో  అనైతికతను, అకృత్యాలను నివారించుటకు, నిర్మూలించుటకు తగిన/కఠినమైన అధికార వ్యవస్థ ఉన్నప్పుడు, *సామాజిక ఇబ్బందుల దిద్దుబాటులో  ప్రజల ప్రమేయమేమిటి* అని సభ్యులు అభిప్రాయపడవచ్చును. 


దేశంలోని అధికారిక వర్గం గురించి ఒకసారి సమీక్షించుదాము. భారత ప్రభుత్వ అత్యున్నత స్థానంలో *రాష్ట్రపతి*, భారత రక్షణ వ్యవస్థలో అతి ప్రధానమైనది

 *భారత  సైనిక దళం*, 

ఈ  దళం *రాష్ట్రపతి* ఆధీనంలో ఉంటుంది. భారత సర్వ సైన్యాధ్యక్షుడు *రాష్ట్రపతి*. ఆ తదుపరి పార్లమెంట్ సభ, వరుసగా *ప్రధాన మంత్రి*, కేంద్ర మంత్రి  మండలి, అనుబంధ మంత్రి వర్గము, కేంద్ర కార్యదర్శుల కార్యాలయము *(సెంట్రల్ సెక్రటేరియట్)*, అనుబంధ అధికార సిబ్బంది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అందులో *రాష్ట్ర గవర్నర్*, శాసన సభ, *ముఖ్య మంత్రి* మంత్రి మండలి, రాష్ట్ర కార్యదర్శుల కార్యాలయము *( State Secretariat)*, అనుబంధ అధికార యంత్రాంగము. *స్థానిక పరిపాలనా సంస్థలలో* నగర పంచాయతీ కార్యాలయము, పురపాలక సంస్థ, జిల్లా పరిషత్తు ఇత్యాది పాలనా సంస్థలు తత్సంబంధ  అధికార సిబ్బంది.


దేశ మరియు సామాజిక భద్రతా, సుఖ మరియు శాంతియుత జీవనానికి హానికారక అంశాల మరియు కృత్యాల నిరోధక శాఖలు లేదా విభాగాల గురించి *మాత్రమే* పరిశీలిద్దాము.


1) *పోలీసు శాఖ* శాంతి భద్రతల సంరక్షణ, నేరాల, విధ్వంసాల కట్టడి, పౌరుల మరియు వారి ఆస్తుల రక్షణ, పకడ్బందీగా చట్టం అమలు,  ప్రజా భద్రత నేరాల నిరోధము, విధులలో భాగంగా దివా రాత్రముల పెట్రోలింగ్, అనుమానితులను ప్రశ్నించడం, సాక్షాలను సేకరించడం. అవసరమైనప్పుడు  సామాజిక రక్షణకు ఆయుధాలను ఉపయోగించడం. *విధ్వంసాలు ఆగినాయా. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలగడం లేదా*.  అన్ని రకాల ఇబ్బందులకు ప్రజలు దూరంగా ఉన్నారు అని ఘంటాపథంగా  చెప్పగలమా!!.

 *ప్రస్తుతము గూడా సామాజిక నేరాలకు, ఘోరాలకు కొదవలేదు* అనునది ప్రజా వాక్యం. *పోలీసు విభాగం పని చేయుట లేదా అంటే.. ఇంగిత జ్ఞానమున్న వారెవరైనా లేదు అని చెప్పరు...చెప్పలేరు.* పోలీసు విభాగము తమ విధులు నిర్వహించుచునే ఉన్నది. పోలీసు శాఖ మరింత ప్రతిభావంతంగా, క్రియాశీలంగా వృత్తి ధర్మాలు నిర్వహించాలంటే ప్రజల సహకారం కావాలి.

 నైతికంగా ప్రజా చైతన్యం వెల్లి విరిసిన  మరియు జన సమైక్యత బలపడిన చోట, *ప్రభుత్వ విభాగాలలో కూడా అనైతికులు, స్వార్థపరులు లేనినాడు, దుర్మార్గులు, దుష్టులు భయపడతారు.*


ధన్యవాదములు

*(సశేషం)*

ప్రియ బాంధవా మేలుకో 11*

 *ప్రియ బాంధవా మేలుకో 11*




వస్తు గుణాల మరియు పరిస్థితుల ప్రాబల్యం ఏలా ఉంటుందంటే.....ఎండాకాలం భూమి వేడి నుండి రక్షించే పాదరక్షలే (చెప్పులు), వానాకాలం నడుస్తున్నప్పుడు ఆ భూమిపై ఉండే బురదనే మనపైకి చల్లుతాయి. అలాగే వంటకాలను రుచిగా మార్చే *ఉప్పు*, పాలలో వేస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి.


గత వ్యాసంలో భారత దేశ అభివృద్ధిని అమృత  తుల్యమైన క్షీర  భాండంతో పోలుస్తూ, అక్కడే ఉన్న ఉప్పు కళికలను గూడా  సామాజిక రచయితలు గమనిస్తూ ఉంటారని తెలుసుకున్నాము. క్షీరమును  = పాలను,  విరుచునది= చెడుపు చేయునది *ఉప్పు*  అను విషయము జన సామాన్య జ్ఞానము. భారత కీర్తి కిరీటానికి మూలకారణమైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, దేశ సుఖ శాంతులకు హాని (ఉప్పు లాంటి) కారక ఘటనలను పరిశీలిద్దాము. 


ఒక వర్గపు దేవాలయాల ఆదాయము, ఆస్తులు మరియు భూములపై ప్రభుత్వ ఆజమాయిషి. మరి,అన్యమత మందిరాలపై, ఆదాయలపై అజమాయిషీ ఉండదు. అది  *ప్రజాస్వామ్యానికే మచ్చ*. బొట్టు పెట్టుకున్నారని బడిలో పిల్లలను దండించే యాజమాన్యాలు. పరీక్షా కేంద్రాల వద్ద ఒక వర్గం వారిని తరచి తరచి, తడిమి తడిమి పరీక్ష చేయుట. నిండుగ వస్త్రములు ధరించి వచ్చిన మరో వర్గం వారికి నామ మాత్రపు తనిఖీలు. ఇవి *ప్రజాస్వామ్యానికే మచ్చ*.

ఒక వర్గపు పండుగలు, ఊరేగింపులప్పుడు వందల వందల భద్రతా సిబ్బంది. కనీస జ్ఞానమున్న వారెవరికైనా విశదమే ఎవరివలన ఎవరికి అపాయము, ప్రమాదమని. దేశంలోని  కొన్ని ప్రాంతాలలో భద్రతా సిబ్బందికే భద్రత కరువు. కొన్ని రాష్ట్రాలలో అందులో ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలలో విద్యుత్, నీటి పన్నుల వసూలులకు ఆటంకము, ప్రభుత్వ సిబ్బంది నిస్సహాయ స్థితి. ఇది *ప్రజాస్వామ్యానికే మచ్చ*. చిన్నారి బాలికలు మరియు  మహిళల మాన భంగాలు. ఏటా 4.50 లక్షల అఘాయిత్యాలు. ఆసుపత్రుల నుండి పసికందుల అపహరణ మరియు అమ్మకాలు. లంచగొండితనము ప్రత్యేక వివరణ అవసరంలేని అంశము. జనన మరణ ధ్రువ పత్రాలకు, కుల, నివాస ధ్రువీకరణకు, భూమి పత్రాలు పొందుటకు, అధిక శాతం ప్రభుత్వ అనుమతులకు.. వెయ్యేల...సర్వత్రా లంచగొండితనం వ్యాపించి ప్రజలను పీడిస్తున్నది. ప్రహ్లాద చరిత్రలోని *ఇందుగలడందు లేడను* పద్యం జ్ఞాపకము వస్తున్నది. ఇంకొక మాటలో చెప్పాలంటే లంచగొండితనం సామాజిక జీవనంలో భాగమైఉన్నది. చట్టాలు ఎన్ని ఉన్నా ఏమి ఉపయోగము. అధిక శాతం ప్రజలు నైతికత కోల్పోయి ఉన్నారు.


*ప్రజా చైతన్యం వెల్లి విరిసిన చోట మరియు జన సమైక్యత వల్ల మాత్రమే దుష్టులు భయపడతారు, అరాచకాలు మానుతారు*.


ధన్యవాదములు

*(సశేషం)*

వర్ణన

 *వర్ణన*

(విదేశాలలో సంతానం భారతంలో తల్లిదండ్రుల మనోవేదన.) 


పిల్లలుండ విదేశ మందున పెద్దలుండిరి యిక్కడే


కల్లలయ్యెను ప్రేమలన్నియు కాంచలేమని పిల్లలన్


తల్లడిల్లిరి  తోడులేకను తల్లి దండ్రులు యింటనే


ఎల్లవేళల వారి ధ్యాసలె యింతకింతకు పెద్దవౌ


ఉల్లమందున బాధలున్నవి ప్రేమలన్నియు వ్యర్థమే.


అల్వాల లక్ష్మణ మూర్తి.

చాటుకథలు / శ్లోకాలు 🙏

 🙏కాళిదాస మహాకవి చాటుకథలు / శ్లోకాలు 🙏 


కాలిదాసు గురించి ఎంత చెప్పుకొన్నా తనివి తీరదు. 

1. ఒక సారి కాలిదాసు, భోజరాజుల మధ్య ఏదో వైషమ్యం వలన ఆయన ఒక వేశ్య యింట రహస్యంగా ఉన్నాడు (కాలిదాసు వేశ్య యింటనా అనుకోనవసరం లేదు. ఆయన జీవించిన దేశకాల పరిస్థితులు వేరు). ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి భోజుడు "కుసుమే కుసుమోత్పత్తిః; శ్రూయతే నతు దృశ్యతే" అన్న పద్యాన్ని చక్కగా పూరించినవారికి వంద బంగారు కాసులు ఇవ్వబడుతుందని చాటింపు వేయించాడు. కాలిదాసుకు ఆశ్రయమిచ్చిన వేశ్య ఆ విషయం చెప్పి అదేదో పూరించి యిస్తే తాను వెళ్లి ఆ బహుమానం తెచ్చుకొంటానని అర్థించింది. ఆయన ఇలా పూరించాడు.


కుసుమే కుసుమోత్పత్తిః

శ్రూయతే నతు దృశ్యతే

బాలే తవ ముఖాంబోజే

దృశ్యమిందీవరద్వయం


(పువ్వులోనుండి ఇంకో పూవు పుట్టుతుందని వినడమేకాని ఎన్నడూ చూడలేదు. కానీ ఓ అమ్మాయీ! నీ ముఖమనే తామరపూవులో నాకు రెండు నల్లకలువలు కనిపిస్తున్నాయి).


ఇంకేముంది! ఈ శ్లోకం ఆమె పట్టుకువెళ్లి రాజు ముందు చదవడం, ఆయన ఇది కాలికాసుదేనని గుర్తించి ఆమె వెంట వెళ్లి ఆయనను బ్రతిమాలి మళ్లీ తన వద్దకు రప్పించుకోవడం జరిగాయి.


ఒకసారి కాలిదాసు ఆలయ మండపంలో విశ్రమిస్తుంటే అక్కడ యిద్దరు బాటసారులు మాట్లాడుకోవడం విన్నాడు. వారిరువురూ సోదరులు. పాండిత్యం సంపాదించినవారు. దూరదేశం నుండి వస్తున్నారు. భోజునికి కవిత్వమంటే ప్రీతి అని విని ఏదైనా కవిత వినిపించి కొంత సొమ్ము యాచించాలని వారి ఆలోచన. కానీ వారి పండితులే గానీ కవులు కారు. ఐనా సరే ఏదైనా ఒక్క శ్లోకమైనా తయారుచేసుకొని వెళ్లి రాజుగారిని మెప్పించాలని వారి ప్రయత్నం. చిన్నవాడన్నాడు - 'నువ్వోపాదం చెప్పు, నేనో పాదం చెబుతా. మళ్లీ నువ్వు, తరువాత నేను. ఒక శ్లోకం అయిపోతుంది' అని. మంచి ఆకలి వేళ, దూరం నుండి ప్రయాణించి వచ్చారు. వారికి మరో అలోచన రాలేదు. పెద్దవాడు ప్రారంభించాడు, 'భోజనం దేహి రాజేంద్ర' ఒక పాదం అయిపోయింది. చిన్నవాడు అందుకొన్నాడు, 'ఘృత సూప సమన్వితం' . (అన్నం పెట్టించు మహా ప్రభూ, నెయ్యి పప్పుతో సహా అని అర్థం). మళ్లీ పెద్దవాడి వంతు. ఇంకేం చెప్పాలో తోచడం లేదు. చిన్నవాడికీ ఏమీ తట్టడం లేదు. ఇదంతా వింటూ నవ్వుకొంటున్న కాలిదాసుకు ఈ పండిత సోదరులమీద జాలి కలిగింది. 'తరువాతి రెండు పాదాలు నేను చెబుతాను వ్రాసుకొండి' అని శ్లోకం ఇలా పూరించి యిచ్చాడు.

మాహిషంచ శరచ్చంద్ర

చంద్రికా ధవళం దధిః

(శరత్కాలపు చంద్రుని వెన్నెల వలే తెల్లని ఆవు/గేదె పెరుగు [కూడా పెట్టించు] అని అర్థం)


ఈ శ్లోకం విన్న భోజుడు ఇది కాలిదాసు పూరణగా గుర్తించడం, ఆ పూరణను ఆయన చేసిన సిఫారసుగా భావించి ఆ సోదరులకు యథోచితంగా ధనసహాయం చేయడం తరువాతి కథ.


మరోసారి భోజుడు సరదాగా 'క,ఖ,గ,ఘ' అని ఒక ముక్క చెప్పి దీన్ని ఒక శ్లోకంగా పూరించగలరా అని అడిగాడట. దీనితో ఏం శ్లోకం వస్తుందా అని అలోచిస్తూ ఇంటికి వస్తున్న కాలిదాసు అక్కడి గణిక వీథిలో ఎదురుగా వస్తున్న చిన్న పిల్లను చూసి ముచ్చటపడి పలకరించాడు.


'ఎవరమ్మాయీ నువ్వు?'


'నా పేరు కాంచన మాల అండి'


'అలాగా. ఎవరమ్మాయివో?'


'కనకలత కుమార్తెను'


'ఓహో! ఏమిటో చేతిలో జాగ్రత్తగా తీసుకొని వెళ్లుతున్నావు?'


'తాళ పత్రమండీ. చదువుకోవడానికి తీసుకెళుతున్నాను.'


'మంచిది. ఏం వ్రాసుందో అందులో!'


'క,ఖ,గ,ఘ'.


ఇంకేం. మాటల్లోనే పద్యం పూర్తయిపోయింది.


కా త్వం బాలే? కాంచన మాలా


కస్యా పుత్రీ? కనక లతాయా


హస్తే కిం తే? తాలీ పత్రం


కావా రేఖా? క, ఖ, గ, ఘ


(ఇది ఏ ఛందస్సులో ఉందో, అసలుందో లేదో తెలియడం లేదు. నేను వ్రాసిన దానిలో కూడా తప్పు ఉండవచ్చు).


కాలిదాసుకు, ఇతర కవులకు ఉండే మాత్సర్యంపై కూడా కథలున్నాయి. వీటిలో నిజం ఉండకపోవచ్చు కాని, ఇలాంటి పుకార్లు వినడానికి రంజుగా ఉంటాయి కదా.


కాలిదాసు, దండిలలో ఎవరు గొప్ప వారు అన్న గొడవ వచ్చిందట. అప్పుడు ఉజ్జయినిలోని సరస్వతీ ఆలయంలోనో ఎక్కడో ఇద్దరి రచనలనూ పెట్టి ఎవరు గొప్పకవియో చెప్పమని దేవిని ప్రార్థించారట. ఆ విగ్రహంనుండి "కవిర్దండిః,కవిర్దండిః, కవిర్దండిః నసంశయః" అని వినిపించిందట. అది విని, అందరి ముందు జరిగిన అవమానంతో కోపం పట్టలేక కాలిదాసు "కోఽహం రండే?" అని అరిచాడట. అప్పుడు సరస్వతి "త్వమేవాహం, త్వమేవాహం, త్వమేవాహం" అని ముమ్మారు పలికిందట. కాలిదాసు సరస్వతీ స్వరూపుడని చెప్పడానికి అతని నోట అంతటి పరుషవాక్యాలను పలికించినదెవరో కానీ అది ఆతని స్వభావానికి పూర్తిగా విరుద్ధమైనట్టి మాట.


కాలిదాసు, భవభూతి కవుల మధ్య కూడా స్పర్థ ఉండేదని, వారి వారి శిష్యులు ఇప్పటి మన సినిమా హీరోల అభిమానుల్లా కొట్టుకొనేవారని కథలు ఉన్నాయి.


కవయాః కాళిసాద్యాః


భవభూతిర్మహాకవిః


(కవులు అంటే కాలిదాసు మొదలైనవారు. భవభూతి మహాకవి) అని భవభూతి శిష్యులు విర్రవీగితే

తరవః పారిజాతాద్యాః

స్నుహీ వృక్షం మహాతరుః


(చెట్లు అంటే పారిజాతం మొదలైనవి. స్నుహీ వృక్షం మహావృక్షం) అని కాలిదాసు శిష్యులు బదులిచ్చేవారట. ఈ స్నుహీ వృక్షం అన్నది ఆయుర్వేద పరంగా ఎందుకూ పనికి రాని చెట్టు అట. కనుక దీనిని వ్యంగ్యంగా 'మహావృక్షం' అని ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొంటారట.


"ఏకో రసః, కరుణ ఏవ" అని భవభూతి పలికినా, సంస్కృత కవిత్వం లో రసం, సరసం అంటే వాల్మీకి తరువాత కాలిదాసే.


కాళిదాసు పేరిట ఉన్న చాటువుల్లో సింహభాగం భోజరాజీయం కథలు. క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దంలో ధారానగరాన్ని భోజుడనే రాజు పరిపాలించాడు. స్వయానా అయన చాలా గొప్ప కవి.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

అమ్మ చేతి వంట అనుబంధం

 *🍚అమ్మ చేతి వంట అనుబంధం....🍚* 

🥄🍽️🍴🥣🍚🍜🍲🍛🫕


"ఇంట్లో వండుకోకపోతే ఆత్మీయ సంబంధాలు 100% దెబ్బతిన్నట్లే..!! " 

ఈ వాక్యం లోని అంతరార్ధం

అర్థమైతే చాలు..


ఇంటివంట అంత గొప్పదా..!! ?


Yes గొప్పది కాదు అది

అమృతం... !!


స్విగ్గి, జొమాటో తదితర సేవల ద్వారా వచ్చేది కేవలం

 food packet !

ఏ వాతావరణంలో వండాడో...

ఏమి వేసి వండాడో...

శుభ్రతపాలు ఎంతో

ఆ ఆహారం తెచ్చేటప్పుడు 

ఏ వీధుల్లో తిరిగాడో ‌‌...

ఏ వైరస్లు ఏ బ్యాక్టీరియా లు మోసుకొచ్చాడో !!....

ఎవడికి తెలుసు.. ???


ఇంట్లో అందించేది ప్రేమామృతం !! 

భర్తకు ఇష్టమైనవి ఒకరోజు ,

కొడుకుకు ఇష్టమైనవి ఒకరోజు ,

కూతురుకోసం మరొకరోజు !!

 అందరికోసం వండినవే తనకోసమని తనకోసం తాను ప్రత్యేకంగా ఏమీ వండుకోకపోయినా తనవారు తృప్తిగా భుజిస్తే చాలని ఆనందంగా ఉంటుంది ప్రతి గృహిణి 

తనుచేసేవంట లొట్టలేసుకుంటూ తనవారు తింటే ఆ గృహిణికి (తల్లిగా లేదా భార్య గా) అంతకంటే ఆనందం ఇంకేముంటుంది...


మా ఆవిడ చేతివంట అమృతం అంటూ ఇంటికి వచ్చిన అతిథులకు ఆ గృహస్థు కొసరికొసరి వడ్డిస్తుంటే... వచ్చినవారు తృప్తిగా తింటుంటే... వంటచేసిన గృహిణి ఆనందాన్ని ఏ మీటర్ తో కొలవగలం.. ?

 ఏ ⭐ స్టార్

రేటింగ్ ఇవ్వగలం.. ?


వంట బాగుందని పొగిడితే పొంగే ఆనందాలు

ఉప్పు ఎక్కువైందంటే వచ్చే పోట్లాటలు

ఇవి మిస్సవుతాం !!


అమ్మా ! ఈకూర ఇంతబాగుంది !! తక్కువే వండావేమి నాకు సరిపోలేదు అంటే మరలా చేస్తానులే అనే బుజ్జగింపులు !!


నాకు ఇష్టం లేదు ఎప్పుడూ చెల్లికోసమే చేస్తావు అనే అలకలు తీర్చి రేపు నీకు ఇష్టమైనది చేస్తా అంటూ అలకలు తీర్చడాలు !!


ఎన్ని ఆత్మీయతలు వెల్లివిరుస్తాయో !!

అలకలు , బుజ్జగింపులు , పొగడ్తలు ఎన్ని కోల్పోతామో!!


ఇవి అన్నీ మాయం..!! వాటితోపాటు జేబులో డబ్బులూ మాయం..


జీవన మాధుర్యం కోల్పోతాం 

స్విగ్గీ జొమాటోలను ప్రోత్సహిస్తే.. !!


తనవారికోసం ప్రేమను వొంపి వండుతుంది ఇల్లాలు..!! 

అప్పుడు అది అమృతతుల్యమైన ఆహారం

తనలాభం కోసం లెక్కలువేసుకొని హోటల్ వాడు వండిపంపేది 

food packet..

 అది కేవలం ఒక product.. !


*కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారన్నట్లు...* *"అమ్మ నీ చేతి తాలింపు కమ్మదనము భరతదేశాన గుమగుమ పరిమళించే..!! "*


*అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటే దానికి ఏది సాటి.. ?*

*అమ్మచేతి వంట రుచిని కోల్పోయే దౌర్భాగ్యం నుంచి మన పిల్లలను కాపాడుకుందాం ...!!*


ఇంట్లో వంటగదిని కాపాడుకుందాం..

కుటుంబంలో ఆనందాలు పెంచుకుని పంచుకుందాం.. !

🙏🙏🍚🍛🍚🙏🙏

*...🖊️రంగినేని మహేంద్ర*

విశ్రాంత ప్రధానోపాధ్యాయులు

నిర్వాణషట్కమ్

 *శ్రీ ఆదిశంకర కృత   నిర్వాణషట్కమ్*




*3. న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ*

 *మదో నైవ మే నైవ మాత్సర్య భావః*

*న ధర్మో న చార్థో న కామో న మోక్ష*

*శ్చిదానన్దరూప శ్శివోహం శివోహమ్*


*రాగద్వేషములు గాని, లోభమోహములు గాని, మదమాత్సర్యములు గాని నాకు ( ఆత్మకు ) సంబంధించినవి కావు. ఇవి పాంచభౌతికమగు అంతఃకరణమునకు సంబంధించినవి. నేను సర్వాత్మకుడను, నిత్యముక్తుడను. కాబట్టి, ధర్మార్థ కామమోక్షములు, పురుషార్ధములు నావి కావు. అవి అజ్ఞానదశయందున్న జీవాత్మలచే కోరబడునవి. కాని, జ్ఞానియగువానిచే కోరబడునవి కావు. సర్వమును తానని గుర్తించిన జ్ఞానికి తనచే పొందబడనిదియు, ప్రార్థింపదగినదియు అయిన వస్తువు ఏదియూ ఉండదు. నేను మాత్రం చిదానంద స్వరూపుడైన పరశివ ( పరబ్రహ్మ ) స్వరూపుడనై వున్నాను.*



🙏🙏🙏

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


*శ్లో𝕝𝕝 ప్రణవో ధనుః శరో హ్యాత్మా* 

*బ్రహ్మా తల్లక్ష్యముచ్యతే।*

      *అప్రమత్తేన వేద్ధవ్యం* 

*శరవో త్తన్మయో భవేత్॥*


                 *... _ముణ్డకోపనిషత్_ …*


*తా𝕝𝕝 "ఓంకారమే ధనుస్సుగా, ఆత్మయే బాణంగా, బ్రహ్మమే లక్ష్యముగానుంచుకొని అప్రమత్తుడై, ఏకాగ్రత కలిగిన మనుజుడే ఆత్మోన్నతిని పొందగలడు*......

*కావున శరమువలె తన్మయుడవగుము!"*


 ✍️🌹🪷💐🙏

⚜ శ్రీ మలమక్కవు అయ్యప్ప దేవాలయం

 🕉 మన గుడి : నెం 1054


⚜ కేరళ  : పాలక్కడ్ 


⚜ శ్రీ మలమక్కవు అయ్యప్ప దేవాలయం



💠 మలమక్కవు అయ్యప్ప దేవాలయం కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని అనక్కర పంచాయితీలో ఉన్న అయ్యప్ప కు అంకితం చేయబడిన ప్రసిద్ధ హిందూ దేవాలయం.  

సాంప్రదాయకంగా దేవతకు నైవేద్యంగా ఉపయోగించే "చెంగజినీర్ పూవు" అనే ప్రత్యేక పుష్పం గుడి చెరువులో మాత్రమే కనుగొనబడింది మరియు పెంచబడుతుంది.  


 💠 ఆలయ పేరు 'మాల-మేల్-కావు', 'మాల-మల్-కావు' లేదా 'మాల-యిల్-కావు' అని పలు రకాలుగా వ్రాయబడింది.  వీటన్నింటికీ అర్థం "ఒక చిన్న కొండ (మాల) పైన (మెల్) ఉన్న ఆలయం (కావు)".  ఇది పర్వతం మీద ఉందని పేరు సూచిస్తున్నప్పటికీ, ఇది మైదాన ప్రాంతంలో మాత్రమే ఉంది. 



💠 ఈ ప్రాంతం ఆలయ ఉత్సవాల్లో ఉపయోగించే సాంప్రదాయిక పెర్కషన్ సంగీత వాయిద్యమైన థాయంబకకు ప్రసిద్ధి చెందింది.


💠 ఈ దేవాలయం కేరళలోని అనేక ఇతర దేవాలయాలతో పంచుకునే పురాణగాథ ఏమిటంటే, అనేక వందల సంవత్సరాల క్రితం ఒక నిమ్న జాతి స్త్రీ పశువులను మేపడం కోసం ఇక్కడికి చుట్టుపక్కల ఉన్న అడవికి వెళ్లిందని నమ్ముతారు, ఆమె తన కత్తిని ఒక బండపై పదును పెట్టినప్పుడు రక్తస్రావం మొదలైంది. 

వెంటనే సమీపంలోని గ్రామం వారు ప్రశ్న ద్వారా ఆ శిల స్వామిని కనుగొన్నారు. వారు వెంటనే ఒక గర్భగుడిని నిర్మించి ఆ శిలను అయ్యప్పగా పవిత్రం చేశారు. 

ఇది సుమారు 300 సంవత్సరాల క్రితం జరిగింది. 


💠 ప్రత్యేకంగా తయారు చేయబడిన గర్భగుడిలో దేవత అధికారికంగా స్థాపించబడింది.  విగ్రహం చుట్టూ చిన్న దేవాలయం (కావు) ఏర్పాటు చేయబడింది.  

ఆలయ పురాతనత్వాన్ని ధృవీకరించడానికి చాలా చారిత్రక రికార్డులు లేవు, కానీ ఆలయం 300 సంవత్సరాల కంటే పాతదని రుజువు చేసే వ్రాతపూర్వక రికార్డులు ఉన్నాయి.


💠 కేరళలోని 108 అయ్యప్ప దేవాలయాలలో ఈ ఆలయం ఒకటి.  దీని ప్రధాన విగ్రహం, అయ్యప్పన్ తూర్పు వైపున ఉంటుంది కాబట్టి నైవేద్యాలు సమర్పించవచ్చు.  

ఇతర విగ్రహాలు భగవతి మరియు శివుడు.  


💠 ఆలయ పండుగ, "తలపోలి" ధను మాసం చివరి శనివారం నాడు జరుపుకుంటారు.  

ఈ ఆలయం పడింజరేపట్ నంబియార్ కుటుంబానికి చెందినది మరియు నిర్వహించబడింది.  ఆలయ చెరువు ప్రాంగణానికి తూర్పున ఉంది.


💠 అయ్యప్ప స్వామి పాదాల చెంత నిండు మనసుతో ప్రార్థిస్తే, ఆ మరుసటి రోజు ఆలయ చెరువులో "నీలతామర" అని పిలువబడే "చెంగజి నీరు" పువ్వు వికసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.   


💠 అయ్యప్పన్ ఆలయంతో పాటు అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆలయంలో భగవతి మరియు శివుడు. ఆలయంలో ప్రతిష్టించబడిన రుదిరమహా కాళి, వెట్టకోరుముగన్ మరియు నాగలు కూడా ఉన్నాయి .

ఇది కేరళలోని ధర్మ శాస్తా యొక్క 108 దేవాలయాలలో ఒకటిగా గుర్తించబడింది మరియు దీనిని పడింజరేపట్ నంబియార్ కుటుంబం నిర్వహిస్తుంది. 


💠 ఆలయంలో ప్రధాన పండుగ ధనుమాసం చివరి శనివారం నాడు జరుపుకునే తాళ్లపొలి .

ఆలయంలోని చెరువు ఆలయ ప్రాంగణంలోనే ఉంది. ఒక భక్తుడు ఎంతో భక్తితో ధర్మ శాస్తా పాదాల చెంత చెంకాజునీర్ పువ్వును సమర్పిస్తే, మరుసటి రోజు ఆలయ చెరువులో నీలి కమలం (నీల తామర) వికసిస్తుందని నమ్ముతారు. 


💠 ఈ ఆలయాన్ని  గురువాయూర్ నుండి గంటలోపు చేరుకోవచ్చు


రచన

©️ Santosh Kumar

15-02-గీతా మకరందము

 15-02-గీతా మకరందము

         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఆ సంసారవృక్షమునే ఇంకను వర్ణించుచున్నారు - 

 

అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్యశాఖా 

గుణప్రవృద్ధా విషయప్రవాలాః | 

అధశ్చ మూలాన్యనుసన్తతాని 

కర్మాను బన్ధీని మనుష్యలోకే || 

 

తాత్పర్యము:- ఆ (సంసార) వృక్షముయొక్క కొమ్మలు (సత్త్వరజస్తమో) గుణములచే వృద్ధిబొందింపబడినవియు, (శబ్దాది) విషయములనెడు చిగుళ్లుగలవియునై, క్రిందికిని (స్థావరము మొదలుకొని) మీదికిని (బ్రహ్మలోకమువఱకు) వ్యాపించియున్నవి. మనుష్యలోకమునందు కర్మసంబంధమును (కర్మవాసనలను) గలుగజేయునవియగు దాని వేళ్ళు క్రిందను (మీదనుగూడ) బాగుగ విస్తరించి (దృఢముగ నాటుకొని)యున్నవి. 


వ్యాఖ్య:- ఈ సంసారవృక్షము స్వల్పమైనదికాదు. అతివిశాలమైనది. అనాదికాలమునుండి కోట్లకొలది జన్మలనుండి బాగుగ దృఢపడుచువచ్చి, వేళ్ళు తన్నుకొని శాఖోపశాఖలుగ విస్తరించియున్నది. కర్మవాసనలే దీని వేళ్ళు. సత్వరజస్తమోగుణములచే దీని శాఖలు బలపడుచున్నవి. శబ్దాది విషయములయొక్క సేవనముచే దీని చిగుళ్లు  వృద్దియగుచున్నవి. దీనినిబట్టి త్రిగుణరాహిత్యముచేత శాఖలు, విషయవిరక్తిచేత చిగుళ్ళు వాసనారాహిత్యముచేత వేళ్ళు ఈ సంసారవృక్షమునకు తప్పక నిర్మూలితములు కాగలవని స్పష్టమగుచున్నది. చెట్టునకు ముఖ్యాధారము మూలమే అయినట్లు ఆ సంసారవృక్షమునకు కర్మవాసనలే మూలము. కావున విజ్ఞుడు వైరాగ్యవిచారణాదులచే ప్రయత్నపూర్వకముగ ఆ వాసనలను తొలగించివేసికొని సంసారబంధవిముక్తుడు కావలయును. అట్లు కాకుండ, రాగద్వేషాదులచే ఆ వాసనలను ఇంకను బలపఱచుచు పోయినచో సంసారదుఃఖ మెన్నటికిని జీవుని వదలనేరదు. 


ప్రశ్న:- సంసారవృక్షమును ఇంకను వర్ణించి చెప్పుము?

ఉత్తరము:- (1) దానికొమ్మలు (సత్త్వరజస్తమో) గుణములచే వృద్ధిబొందింపబడినవియు, (శబ్దాది) విషయములను చిగుళ్ళుగలవియునై క్రిందికి మీదికి అంతటను వ్యాపించియున్నవి. (2) మనుష్యలోకమున కర్మసంబంధమును గలుగజేయునవియగు దానివేళ్ళుగూడ క్రిందను మీదను బాగుగ వ్యాపించి దృఢపడియున్నవి.

తిరుమల సర్వస్వం- 182*

 *తిరుమల సర్వస్వం- 182*



*సప్తగిరులు -1*


 *ఏడు పడగలే ఏడుకొండలు* 


 ఎన్నో యుగాల నుండి, వైకుంఠం లోని క్షీరాబ్ధిలో శయ్యగా, తల్పంగా, ఛత్రంగా, మరెన్నో రకాలుగా శ్రీమహావిష్ణువుకు సేవలందిస్తున్న ఆదిశేషుడు, శ్రీవేంకటేశ్వరుని రూపంలో వెలసిన విష్ణుమూర్తిని భూలోకంలో కూడా సేవించదలచి, తన ఏడుపడగలను ఏడుకొండలుగా అవతరింపజేసి, వాటిపై శ్రీనివాసుణ్ణి కొలువుంచుకొన్నాడని పురాణాల్లో చెప్పబడింది.


 వందలకొద్దీ మైళ్ళ పొడవున్న శేషాచల పర్వతశ్రేణులలో..... *తిరుమల ప్రాంతాన్ని ఆదిశేషువు శిరస్సు లేదా పడగలు గాను; అహోబిలం, మహానంది, త్రిపురాంతకం ప్రాంతాన్ని ఆదిశేషువు యొక్క నడుము భాగంగానూ : శ్రీశైలశిఖరాలను ఆదిశేషువు యొక్క తోకగాను భక్తులు భావిస్తుంటారు.*


 శేషాచలసానువులన్నీ శ్రీవారికి నెలవులే! ఆ పర్వత ప్రాంతాలన్నింటినీ తరచూ పర్యటిస్తూనే ఉంటారు. పద్మావతీపరిణయ సందర్భంలో, పెండ్లిభోజనాల పంక్తులు శేషాచలశ్రేణుల్లో తిరుమలనుండి, అహోబిలం మీదుగా శ్రీశైలం వరకు విస్తరించి యున్నట్లు మనం ఇంతకుముందే తెలుసుకున్నాం.


*కట్టెదుర వైకుంఠము కాణాచయినకొండ* 

*తట్టెలాయ మహిమలే తిరుమల కొండ ||* 

*వేదములే శిలలై వెలసిన కొండ* 

*యేదెస పుణ్యరాసులే యేరులైనదికొండ* 

*గాదిలి బ్రహ్మది లోకముల కొనలకొండ* 

*శ్రీ దేవుడుండేటి శేషాద్రి యీకొండ*


అన్న కీర్తనలో అన్నమాచార్యుడు సప్తగిరుల పౌరాణిక ప్రాశస్త్యాన్ని, మహత్యాన్ని కళ్ళకు కట్టినట్లు ఇలా వర్ణించాడు - 


 *కళ్ళెదుటే కానవచ్చే కలియుగవైకుంఠం లాంటి తిరుమలకొండ మహా మహిమాన్వితమైనది. బ్రహ్మాది లోకాలతో సమమైన ఈ కొండపై చతుర్వేదములు బండశిలలు గాను, సమస్తదేవతల యొక్క పుణ్యరాశులు సెలయేళ్ళు గాను అవతరించి ఉన్నాయి. ఈ శేషాద్రిపర్వతంపై దేవదేవుడు వెలసియున్నాడు. పూర్వపు యుగాలలో సైతం అంజనాద్రిగా పిలువబడే ఈ పొడవాటి కొండపై సర్వదేవతలు, గంధర్వులు మృగజాతుల, వృక్షాల రూపంలో అవతరించి యున్నారు. కోరిన వరాల నొసగే ఈ కొండ స్వర్ణకాంతులీనుతూ, సర్వసంపదలకు ఆలవాలమైన గుహలతో నిండి ఉండి, 'వెంకటాద్రి' నామంతో అలరారుతున్నది.*


 శ్రీవేంకటేశ్వర సుప్రభాతం లోనూ, శ్రీనివాస గద్యంలోనూ సప్తగిరుల ప్రస్తావన కానవస్తుంది. 


 ఈ కొండలు....

 

 *శేషశైలము,* 

 *గరుడాచలము,* 

 *వెంకటాచలము,* 

 *నారాయణాచలము,* 

 *వృషభాచలము,* 

 *వృషాచలము,*

 *అంజనాచలము.*


- అనే లోక ప్రసిద్ధమైన నామాలతో ఒప్పారుతున్నాయి. 


 'అచలము' అనగా 'చలించనిది' లేదా 'పర్వతము' అని అర్థం. పర్వతానికి 'అద్రి' అనే మరో పేరు కూడా ఉండటం వల్ల, వీటిని 'శేషాద్రి', 'గరుడాద్రి' మొదలగు పేర్లతో కూడా పిలుస్తారు. పూర్వ యుగాలన్నింటి లోనూ కొద్దిపాటి మార్పులతో, సప్తగిరులన్నీ ఇవే పేర్లతో పిలువబడుతుండేవి.


 సప్తగిరులలో ప్రతి పర్వతానికి యుగయుగాల ప్రశస్తి, అయా యుగాలలో వినతికెక్కిన పుణ్యపురుషులతో విడదీయరాని అనుబంధం ఉన్నాయి. వివిధ పురాణాల్లో విస్తృతంగా వర్ణించబడ్డ ఆయా గిరిరాజాల వైశిష్ట్యాన్ని ఒక్కొటొక్కటిగా పరికిద్దాం.


 *వృషభాద్రి లేదా వృషభాచలం* 


 ఒకానొకప్పుడు, వెయ్యి వృషభాల శారీరక దృఢత్వం కలిగిన 'వృషభుడు' అనే దైత్యుడు ఈ కొండపై నివసించేవాడు. శ్రీమహావిష్ణువుకు పరమభక్తుడైన ఆ అసురుడు తన ఇష్టదైవాన్ని కటాక్షింప జేసుకోవడం కోసం ఘోరమైన తపస్సునాచరించాడు. ప్రతిదినము తుంబుర తీర్థంలో స్నానమాడి, నిరాహారుడై, ఐదువేల సంవత్సరాలు తపమాచరించడం వల్ల విష్ణువు కృపతో ఆ రాక్షసుడు మరింత శక్తివంతుడయ్యాడు. ఆ రాక్షసుడు శ్రీహరిని అర్చించే విధానం విలక్షణంగా, అద్వితీయంగా ఉండేది.


 ప్రతి దినము తన శిరస్సును తన ఖడ్గచాలనంతో తానే స్వయంగా తెగనరకుకొని, ఆ శిరస్సును భగవంతునికి భక్తితో సమర్పించేవాడు. తదనంతరం తన తపఃశక్తితో, శ్రీహరి కటాక్షంతో; విగతజీవి అయిన తన మొండానికి తలను తిరిగి జత చేసేవాడు. అతని అచంచల భక్తికి, ప్రాణాధారమైన శిరస్సును సైతం తృణప్రాయంగా అర్పించ గలిగిన అతని చొరవకు ముగ్ధుడైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై భక్తవాత్సల్యంతో, కావలసిన వరాన్ని కోరుకోమన్నాడు. 


 ఇహలోక సంపదలు, జన్మరాహిత్యము, కైవల్యము ఇవేమీ కోరకుండా; తన సహజసిద్ధమైన దౌత్యప్రవృత్తితో, అహంభావంతో శ్రీమహావిష్ణువును తనతో ద్వంద్వయుద్ధం చేయవలసిందిగా వరం కోరాడు. తాను ఇచ్చిన వరానికి కట్టుబడిన శ్రీమహావిష్ణువు, రాక్షసుని కోర్కె తీర్చే నిమిత్తం అతనితో ఇరవయ్యేడేళ్ల పాటు సలిపిన యుద్ధంలో ఆ అసురుడు పరాజితుడవుతాడు. శ్రీహరి చేతిలో మరణం పొందటం కూడా తన సుకృతంగా భావించిన వృషభాసురుడు, తన చిట్టచివరి కోరికగా తాను 5000 సంవత్సరాలు తపమాచరించి, శ్రీమహావిష్ణువును ప్రత్యక్షం చేసుకొని, శ్రీహరితో యుద్ధం చేసిన సంగతి సమస్త లోకాలకు, భావితరాల వారికి తెలిసేటట్లుగా, వారిరువురు యుద్ధం చేసిన ఆ పర్వతరాజానికి తన పేరు వచ్చేటట్లుగా అనుగ్రహించమని శ్రీహరిని వేడుకున్నాడు. భక్తసులభుడైన శ్రీమహావిష్ణువు దైత్యభక్తుని కోరిక నెరవేర్చడంతో; అప్పటినుండి ఈ పర్వతం వృషభాద్రిగా పేరుగాంచింది.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము తృతీయాశ్వాసము*



*321 వ రోజు*


ధర్మరాజును మూడు బాణములతోను ఉపపాడవులను, సహదేవుడిని, ఘటోత్కచుడిని ఇరవై అయిదు బాణములతో కొట్టి సింహనాదం చేసాడు. ఘటోత్కచుడు అలంబసుడి రథాశ్వములు చంపి, సారథిని చంపి, రథమును విరిచాడు. తన రథము విరిగి పోగా అలంబసుడు నేల మీదకు దూకి తన మాయాజాలముతో పాండవ సేనపై మాయాశరములను వేసాడు. ఘటోత్కచుడు కూడా రథము దిగి అలంబసుడితో మాయా యుద్ధముకు తలపడి అలంబసునిపై మాయాసరములు గుప్పించాడు. అలంబసుడు ఖడ్గం తీసుకుని ఆకాశానికి ఎగిరాడు. ఘటోత్కచుడు కూడా ఖడ్గపాణి అయి ఆకాశానికి ఎగిసాడు. ఇద్దరూ మేఘాలపై ఒకరిని ఒకరు చుట్టుకుంటూ చిత్ర విచిత్రంగా యుద్ధం చేస్తున్నారు. తరువాత ఇద్దరూ భూమి మీద పడి ఒకరిపై ఒకరు కత్తులు విసురుకున్నారు. ఒకదానికి ఒకటి కొట్టుకొని అవి పడి పోగానే ఇద్దరు ద్వంద యుద్ధానికి తలపడ్డారు. ఒకరిని ఒకరు తోయుచూ, పొడుచుకుంటూ, కొట్టుతూ అనేక విధముల పోరు సాగించారు. చివరకు అలంబసుడు అలిసి పోగానే ఘటోత్కచుడు తగిన సమయం వచ్చిందని అలంబసుని కిందకు తోసి మీద కూర్చుని చేతులతో, కాళ్ళతో తన్ని పొడిచి, కుమ్మి యుద్ధం చేసాడు. చివరకు అలంబసుడు ఘటోత్కచుడి చేతిలో ప్రాణాలు విడిచాడు. ధర్మరాజు ఘటోత్కచుడిని కౌగలించుకుని అభినందించాడు.


*ధర్మరాజు సాత్యకిని అర్జునుడికి సాయంగా పంపుట*


సాత్యకి కౌరవ సేనలను దొరికిన వాడిని దొరికినట్లు చంపుతూ తరుముతున్నాడు. అది చూసిన ద్రోణుడు సాత్యకిని ఎదుర్కొన్నాడు. సాత్యకి ద్రోణునిపై ఇరవై అయిదు బాణములతో కొట్టాడు. ద్రోణుడు సాత్యకిని మూడు బాణములతో కొట్టాడు. సాత్యకి ద్రోణుడిని ఏభై నారాచములతో కొట్టాడు. ద్రోణుడు వాటిని తొమ్మిది బాణములతో ఎదుర్కొన్నాడు. వాటిని సాత్యకి ఎదుర్కొంటున్న సమయంలో ద్రోణుడు సాత్యకిపై నూరు బాణములు వేసాడు. సాత్యకి నిస్సహాయంగా నిలబడ్డాడు. అది చూసి నీ కుమారులు సింహనాదం చేసారు. ధర్మరాజు అది చూసి " యోధులారా ! రండిసాత్యకి ఆపదలో ఉన్నాడు రక్షించండి " అని అరిచాడు. ఆ మాటలు విన్న భీముడు ఒక్క పరుగున సాత్యకి వద్దకు వచ్చాడు. మిగిలిన పాండవ వీరులు సాత్యకిని దాటిపోయి ద్రోణుని ఎదుర్కొన్నారు. వారిని చూసి ద్రోణుడు చిరు నవ్వు నవ్వి వారిపై వాడి అయిన శరములు వేసి పాంచాలురు ఇరవై మందిని కేకయ రాజులను నూరు మందిని తలలు నరికి యమసదనానికి పంపాడు. పాండవసైన్యం ద్రోణుని దాటి ఒక్క అడుగు ముందుకు వేయ లేదు. ఇంతలో పాంఛజన్య ఘోష వినపడింది. అది విన్న ధర్మరాజు సాత్యకిని చూసి " సాత్యకీ ! అర్జునుడి దేవదత్తము వినిపించకనే పాంఛజన్య ఘోష వినవస్తుంది. అశ్వత్థామ, కర్ణ, శల్య, కృప, శల్య, భూరిశ్రవసులు అర్జునుడిని చుట్టుముట్టినట్లున్నారు. అర్జునుడు ఆపదలో ఉన్నట్లున్నాడు. ఈ సమయంలో నాకు నీవు తప్ప ఎవ్వరూ లేరు. నీవు వెళ్ళి అర్జునుడిని కాపాడు " అన్నాడు. సాత్యకి ధర్మజునితో " నీవు చెప్పినది సత్యము. కాని అర్జునుడు నన్ను నీ రక్షణకై నియోగించి " సాత్యకీ ! నేడు శకునము బాగుంది. నేను సైంధవుని వధించడానికి వెళుతున్నాను. నీవు నా బదులుగా ధర్మజుని రక్షిస్తూ ఉండు. సైంధవ వధ ఎంత ముఖ్యమో ధర్మజుని రక్షణా అంత ముఖ్యము. నా పక్కన కృష్ణుడు ఉన్నట్లు నీవు ధర్మజుని పక్కన ఉండు " అన్నాడు. ద్రోణుడు మిమ్ము బంధించాలని చూస్తున్నాడు. ద్రోణుడు తమను బంధిస్తే అర్జునుడు సైంధవుని వధించినా ఏమి ప్రయోజనం. శ్రీకృష్ణుడు తోడుగా ఉన్నంత వరకు అర్జునుడికి భయం ఏమి లేదు. కనుక నేను మిమ్ము విడిచి వెళ్ళలేను " అన్నాడు సాత్యకి. ధర్మరాజు " సాత్యకీ నీవు చెప్పినది యధార్ధమైనా నీవు ఇప్పుడు అర్జునుడికి సాయంగా వెళ్ళడం యుక్తమైనదిగా నాకు అనిపిస్తుంది. అర్జునుడు క్షేమముగా ఉంటేనే మనకందరికి రక్షణ. కనుక నీవు నా మాట కాదనక అర్జునుడికి సాయంగా వెళ్ళు. నాకు ఇక్కడ ద్రోణుని చంపడానికే పుట్టిన ధృష్టద్యుమ్నుడు, విరాటరాజు, ద్రుపదుడు, ఉపపాండవులు, కేకయరాజులు, శిఖండి ఇంకా యోధాను యోధులనేకులు ఉన్నారు. నాకేమి భయం లేదు " అన్నాడు. ధర్మజుని మాటకు బదులు చెప్పలేక సాత్యకి భీముని ధర్మజునికి రక్షణగా ఉంచి ధర్మజుని అనుమతి పొంది సైంధవుని చంపి విజయుడినై తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేసి అర్జునుడికి సాయంగా వెళ్ళాడు.

*ద్రోణ పర్వము తృతీయాశ్వాసము సమాప్తం *


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: మూడవ అధ్యాయం

కర్మయోగం: అర్జున ఉవాచ


యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే௨ర్జున 

కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే (7)


నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః 

శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః (8)


అర్జునా... మనసుతో జ్ఞానేంద్రియాలను స్వాధీనంలో వుంచుకుని, కర్మేంద్రియాల ద్వారా నిష్కామకర్మ చేస్తున్నవాడు ఉత్తముడు. నీ కర్తవ్యకర్మ నీవు ఆచరించవలసిందే. కర్మలు విడిచిపెట్టడం కంటే చేయడమే శ్రేయస్కరం. కర్మలు చేయకుండా నీవు జీవయాత్ర కూడ సాగించలేవు.

దేవుడు

 *దేవుడు మన కళ్ళకు…*

             *ఎందుకు కనబడడు….?* 

                   

*ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవు తున్నారో…,         అతనినే ‘దేవుడు’ అని అన్నారు మన ఋషులు. మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు…అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు.* 


*నిజాన్ని పరిశీలిస్తే… పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం.*

*ఉదాహరణకు…*


*మన కాళ్ళు…ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు.*


*మన చేతులు..కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు.*


*మన కళ్ళు…అతి విసృతమైన పదార్ధాన్నిగానీ.. అతి సూ‌క్ష్మమైన పదార్ధాన్నిగానీ… చూడలేవు. వాటికి అంత శక్తి లేదు.*


*ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే… మనం సూక్ష్మదర్శినిని ఆశ్రయించవలసి వస్తుంది.*


*మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారుకదా..అని మీరు అడగవచ్చు.*


*కళ్ళు భౌతికమైన పదార్ధాలను మాత్రమే చూడగలవు.*


*మనోనేత్రం అభౌతికమైన పదార్ధాలను దర్శిస్తాయి.*

*‘దేవుడు’ మనోనేత్రానికి దర్శనమిస్తాడు. తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమౌతాడు. చూడడానికి, దర్శించడానికి ఉన్న తేడా అది.*


మరి *మనోనేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా?* అన్నదే ఈనాటి మన ప్రశ్న!


*పంచభూతాల శక్తుల సమ్మిళితమే…భూలోక జీవుల శరీర నిర్మాణం.* *అందుకే… ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ…, వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు.* 

*ఆ దేవదేవుని దర్శించాలంటే…పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు…అంటే….*


*ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.!*


*వాయువు కు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ!*


*అగ్ని* కి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.


*’జలము’ కు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.*


*’భూమి’ కి ఉన్న గుణాలు ఐదు శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు. ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.*


*’జలము’…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటిని మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.*


*’అగ్ని’…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.*


*’వాయువు’…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.*


*’ఆకాశం’…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.*


*కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు?             అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే.  ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే.*

వివాహ జీవితములో

 మనము గడిపే ఇక్కడి వివాహ జీవితములో, ఇక్కడ అనుభవించే సుఖములు, సత్సంతానము- ఇవన్నీ కూడా నశ్వరములే! నశించే వస్తువులే! సీతారాములు దాంపత్యము అనశ్వరమైనది, నశించేది కాదు. 


భూలోక దృష్టితో చూస్తే వారు దాలా కష్టపడినారు. వారు కాపురము చేసినది పట్టుమని పదిరోజుల లేదు. వశిష్ఠుడు. రామపట్టాభిషేకమునకు గొప్ప ముహూర్తము పెట్టినాడు. ఆయన జ్యోతిష శాస్త్రము తెలియకుండా ముహూర్తము పెట్టుతాడా? అవతార కార్యక్రమములో మొట్టమొదట సింహాసనము మీద కూర్చునే ముందు లోకమును నిష్కంటకము చేయాలి కదా! సింహాసనము మీద కూర్చున్న మరునాడే యుద్ధమునకు బయలు దేరుతాడా? కాబట్టి ముందు నిష్కంటకము చేసిన తరువాత ధర్మప్రతిష్ఠ అప్పుడు చేసి, అప్పుడు పట్టాభిషికుడు కావటము అనేది దాని అర్థము. ప్రతిష్ఠుడైన ముహూర్తమునకు చాలా అంతరార్ధము ఎక్కువగా ఉంటున్నది. 


సాధారణముగా మనము ఏమి అనుకుంటున్నాము అంటే, "బ్రాహ్మణుడు పెండ్లికి చాలా మంచి ముహూర్తము పెట్టినాడండి. చాలా బాగా జరిగింది. చాలామంది బంధువులు వచ్చినారు. వర్షము రాలేదు. ఏ ఆటంకమా కలుగలేదు. అందరూ మంచి విందు భోజనము చేసినారు" అంటాము. పెళ్ళి ముహూర్తము అందుకోసము పెడతారా? వధూవరులు నూరేండ్లు సుఖముగా ఉండాలి. పిల్లపాపలను కని మనుమల పెండ్లిండ్లు కూడా వారు చూడవలెనని కదా అనుకునేది! పెళ్ళిలో ఏమీ లేకపోయినా, ఎవరూ రాకపోయినా ఫరవాలేదు. దానికి ఒక పరమార్ధము అంటూ ఉంటుంది.



సద్గురు శ్రీ శివానందమూర్తి గారు

సంగీత విద్య, పేజీ: 234

శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ వరంగల్

వారణాసి

 వారణాసి (కాశీి) గురించి తెలియని కొన్ని విషయాలు

కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం:


1.  కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు.


2.  విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం.


3. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచ సాంస్కృతిక నగరం.

4. స్వయంగా శివుడు నివాసముండె నగరం.


5. ప్రళయ కాలంలో మునుగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు.


6. కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది.


7. పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.


8. కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం....


9. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు.


10. కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.


11. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....


12. డిండి గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...


13. కాబట్టే కాశీలో కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.


14. కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యం తో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.


15. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.


16. అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు.


17. మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.


18. గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది


19. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.


 శివుని కాశీలోని కొన్ని వింతలు......


1. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.


2. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.


3. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.


4. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు.


5. అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?


6. అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు


7. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.


8. కాశీి విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనం తో పూజ ప్రారంభిస్తారు .


9. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.


10. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.


11. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.


12. ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.


13.  ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.


కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి......


ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని :


1) దశాశ్వమేధ ఘాట్:

బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.


2) ప్రయాగ్ ఘాట్:

ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.


3) సోమేశ్వర్ ఘాట్:

చంద్రుని చేత నిర్మితమైనది.


4) మీర్ ఘాట్:

సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం.

ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.


5) నేపాలీ ఘాట్:

పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.


6) మణి కర్ణికా ఘాట్:

ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.


7) విష్వేవర్ ఘాట్:

ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.


8) పంచ గంగా ఘాట్:

ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.


9) గాయ్ ఘాట్:

గోపూజ జరుగుతున్నది.


10) తులసి ఘాట్:

తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది.


11) హనుమాన్ ఘాట్:

ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది

ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.


12) అస్సి ఘాట్:

పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.


13) హరిశ్చంద్ర ఘాట్:

సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...


14) మానస సరోవర్ ఘాట్:

ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది.

ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.


15) నారద ఘాట్:

నారదుడు లింగం స్థాపించాడు.


16)చౌతస్సి ఘాట్:

ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు.

ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం... ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.


17) రానా మహల్ ఘాట్:

ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.


18)అహిల్యా బాయి ఘాట్


ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ

విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము.


కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.


పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.


కానీ మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము.


విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు.


నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, మసీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.


అక్కడే శివుడు త్రిశూలం తో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.


ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు


కాశీ స్మరణం మోక్షకారకం!


కాశీ విశ్వనాధాష్టకం


గంగాతరంగ రమణీయ జటా కలాపం,

గౌరీ నిరంతర విభూషిత వామ భాగం;

నారాయణ ప్రియ మదంగ మదాప హారం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||1||


వాచామ గోచర మనేక గుణ స్వరూపం,

వాగీశ విష్ణు సుర సేవిత పాద పీఠం;

వామేన విగ్రహవరేణ కళత్ర వంతం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||2||


భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం,

వ్యాగ్రాజిలాం భరధరం జటిలం త్రినేత్రం;

పాశాంకుసాభయ వర ప్రద శూల పాణిం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||3||


సితాంసుశోభిత కిరీట విరాజ మానం,

పాలేక్షణానల విశోసిత పంచ భానం;

నాగాధిపారచిత భాసుర కర్ణ పూరం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||4||


పంచానలం దురిత మత్త మతంగ జానాం,

నాగాంతకం దనుజ పుంగవ పన్న గానాం;

దావానలం మరణ శోక జరాట వీణా,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||5||


తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం,

ఆనంద కంద మపిరాజిత మప్రమేయం;

నాగాత్మకం సకల నిష్కలమాత్మ రూపం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||6||


ఆశాం విహాయ పరిహృత్య పరస్యనింత,

ఉపేరతించ సునివార్య మనఃసమాదౌ;

ఆదాయ హృత్కమల మధ్య గతం ప్రదేశం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||7||


నాగాధి దోష రహిత స్వజనానురాగం,

వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం;

మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||8||


వారాణసీ పురపతేః స్థవనం శివస్య,

వ్యాసోత్త మిష్ఠక మిదం పఠితా మనుష్య;

విద్యాం శ్రియం విపుల సౌక్య మనంత కీర్తిం,

సంప్రాప్య దేహ నిలయే లభతేచ మోక్షం.||9||


విశ్వనాధాష్టక మిదం యః పఠేచిత శివ సన్నిదౌ,

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

కురుక్షేత్ర యుద్ధం

 🙏🌞🙏🌞🙏

కురుక్షేత్ర యుద్ధం - ప్రముఖమైన వ్యూహాలు.



మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ఏడు అక్షౌహిణీలు, కౌరవులు పదకొండు అక్షౌహిణీల సైన్యంతో యుద్ధాన్ని ప్రారంభించారు. రోజుకొక వ్యూహం నిర్మించి ఆ ఆకారంలో తమ సైన్యాలను నిలిపేవారు. అందులో కొన్ని ప్రముఖమైన వ్యూహాలు..


*1. క్రౌంచారుణ వ్యూహం :* పాండవ సేనాని దృష్టద్యుమ్నుడు క్రౌంచపక్షి ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు.


*2. గరుడ వ్యూహం :* యుద్ధం మొదలైన మూడవ రోజున భీష్ముడు గరుడపక్షి ఆకారంలో ఈ వ్యూహాన్ని నిర్మించాడు. దీనినే సువర్ణ వ్యూహం అని కూడా అంటారు.


*3. శకట వ్యూహం :* మహాభారత యుద్ధ పదకొండవ రోజున ద్రోణుడు బండి ఆకారంలో ఈ వ్యూహాన్ని నిర్మించి సైన్యాన్ని నిలిపి తాను కేంద్ర స్థానంలో నిలబడ్డాడు.


*4. చక్ర వ్యూహం :* పదమూడవ రోజు ద్రోణుడు ఈ వ్యూహాన్ని రచించాడు. దీనినే పద్మవ్యూహం అని కూడా అంటారు. చక్రాకారంలో సైన్యాన్ని నిలుపుతారు. దీనిని చేదించడం అందరికీ సాధ్యం కాదు. అభిమన్యుడు ఈ వ్యూహంలో ప్రవేశించినా బయటకు రాలేక కౌరవుల మోసానికి బలయ్యాడు.


*5. మకర వ్యూహం :* ఐదవ రోజున భీష్ముడు ఈ వ్యూహాన్ని నిర్మించి మకరాకారంలో సైన్యాన్ని నిలిపి యుద్ధరంగంలో చెలరేగిపోయి పాండవులకు చాలా నష్టాన్ని కలిగించాడు.


*6. బార్హస్పత్య వ్యూహం :* పదిహేడవ రోజున బృహస్పతి సహకారంతో కర్ణుడు ఈ వ్యూహాన్ని పన్నుతాడు.


*7. శృంగాటక వ్యూహం:* ఎనిమిదవ రోజు భీష్ముని వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు ఈ వ్యూహాన్ని నిర్మించి త్రికోణాకారంలో సైన్యాన్ని నిలుపుతారు.


*8. శ్యేన వ్యూహం:* ఈ వ్యూహాన్ని కూడా భీష్ముడి మకర వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు డేగ ఆకారంలో నిర్మించాడు. ఐదవరోజు నిర్మించిన ఈ వ్యూహాన్ని డేగ వ్యూహం అని కూడా అంటారు.


*9. అర్ధచంద్ర వ్యూహం :* మూడవ రోజు భీష్ముడు పన్నిన గరుడ వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు అర్ధచంద్ర వ్యూహాన్ని నిలుపుతాడు.


*10. మండల వ్యూహం :* ఏడవ రోజున భీష్ముడు మండలాకారంలో వ్యూహాన్ని రచించి కౌరవ సైన్యాన్ని నిలుపుతాడు.


*11. మండలార్ధ వ్యూహం :* పన్నెండవ రోజు ద్రోణుడు పన్నిన గరుడ వ్యూహానికి ప్రతిగా ధర్మరాజు మండలార్ధ వ్యూహాన్ని నిర్మించి పాండవ సేనను నిలుపుతాడు.


*12. వజ్ర వ్యూహం :* ఏడవ రోజున భీష్ముడు కౌరవ సేనను మండల వ్యూహంలో నిర్మించగా ధర్మరాజు పాండవ సేనను వజ్ర వ్యూహంలో రచిస్తాడు.


*13. సూచీ ముఖ వ్యూహం :* ఆరవరోజు దృష్టద్యుమ్నుడు పాండవ సేనను మకర వ్యూహంలో నడిపింపగా భీష్ముడు కౌరవసేనను క్రౌంచ వ్యూహంలో నిలుపుతాడు. కాని ఈ రెండు వ్యూహాలు భంగపడదంతో అభిమన్యుడు సూచీ ముఖ వ్యూహాన్ని రచించి సూది ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు.


*14. వ్యాల వ్యూహం :* నాలుగవ రోజు భీష్ముడు కౌరవ సేనను చుట్ట చుట్టుకున్న పాములా నిలుపుతాడు. ఇది చాలా కష్టమైన వ్యూహం. ఈ వ్య్హూహం ద్వారా సైన్యాల స్తంభనను అంచనా వెయ్యడం కష్టం.


*15. సర్వతోభద్ర వ్యూహం :* తొమ్మిదవ రోజు భీష్ముడు సైన్యాన్ని సర్వతోభద్ర వ్యూహంలో నిలిపాడు.


*16. మహా వ్యూహం :* భీష్ముడు

రెండవ రోజు ఈ వ్యూహాన్ని నిర్మించి అజేయుడై శత్రు సైన్యాన్ని హడలగొట్టించాడు.

🙏🙏🙏🙏🙏

సుదర్శన శతకము*

 *సుదర్శన శతకము* 

*అనువాద పద్యరచన* : 

*పద్య కవితా శిల్పకళానిధి* 

 *మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు* *మిట్టాపల్లి* 

*100.  యస్మిన్ విన్యస్య భారం*


*సీ. శ్రీ లక్ష్మీదేవితో స్థిరముగా కూర్చుండి*     

                     *నారాయణుల జంట నడిపె జగతి*


 *శ్రీ సుదర్శనమును జీవుల రక్షించు*                       


*కంకణంబుగ పట్టె కరమునందు*


 *రాక్షసు బాధించి శిక్షల వేయుచు*


 *స్వాంతన పరచును జనుల కెల్ల* 


*ఆశ్రితాళి కెపుడు నాకాంక్ష తీర్చుచు*

 *ఆయురారోగ్యంబు నందజేయు*


 *సర్వలోకంబుల సంతోష మందించి*


 *రక్షణ భారంబు లక్షణముగ*


 *ఆ వె. మనసులోని కోర్కె ననుగుణముగ తీర్చ*


 *ఆయుధముల యందు నగ్రగామి*


 *భయము చూపు చుండి భక్తిని కలిగించు* 


*చక్ర రాజు నుండి స్వామి చెంత*


*---------------*

*101 పద్యానాం తత్వ విద్య*


*సీ. అక్షనేమి, నాభ్యక్ష మవయవ విషయాన్ని*


*వైభవంబుగ తెలిపె పాఠకులకు* 


*స్తోత్ర పారాయణ శుభములనిచ్చును* 


*శత్రుభయము  లేక సాగిపోవు*

 

*నిశ్చల భక్తితో నేర్పుతో చదివిన* 


*విష్ణు పదము నందు వెళ్ళుకొరకు*

 *చక్రసాయుజ్యము సక్రమమయ్యెను* 

*మోక్ష మార్గము నిచ్చులక్షణముగ*

*ఆ వె. ఆత్మ త్యాగమైన నవసాన దశలోన* 


*నరక బాధ తప్పు నరుల కెపుడు* 


*స్వామి చెంత నుండి సాయుజ్య మందించు*

 

*చరమదశను పొందు పరమపదము*


*102 .ఆ వె. కూర్చె శతక మొకటి కూర నారాయణ*


*భక్తి శ్రద్ధ కలిగి  పఠన సేయ*


*చక్ర నారసింహ సర్వ రక్షకుడిగ*  


*కాచి యొసగుచుండు కామితముల*


*జై జై సుదర్శన నారసింహాయ నమః*

*సుదర్శన నరసింహ అనుగ్రహం వలన శతక అనువాదము సంపూర్ణమైనది*

✍🏽🌹🪷🙏🙏🙏

కలిపెడిది యావకాయట

 *సరదాకోసం మాత్రమే*

*కం*

కలిపెడిది యావకాయట

కలిపించెడినాడు కలుగు కన్నీరట నే

కలుపగ రుచికరమట మరి

కలుపగ వేరొండు కాయ కలుగునె పుడమిన్.

Kopam


 

పంచాంగం 18.03.2025

 ఈ రోజు పంచాంగం 18.03.2025

Tuesday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాస కృష్ణ పక్ష చతుర్థి తిథి భౌమ వాసర స్వాతి నక్షత్రం వ్యాఘాత యోగః: బవ తదుపరి బాలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.



రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 

యమగండం: పగలు 09:00 నుండి 10:30  వరకు.

 



శుభోదయ:, నమస్కార:

జడ ఎందుకు వేసుకుంటారు

 స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు, జడకి మూడు

పాయలే ఎందుకు అల్లుతారు మీకు తెలుసా ???


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿ఇప్పుడు అంటే ఫ్యాషన్ పేరిట జుట్టుని వదలివేయటం ఎక్కువ అయింది కానీ ఒకప్పుడు అందరు మహిళలు వయసుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు. ఈ జడ కూడా మూడు విధములుగా వేసుకుంటారు.


🌸రెండు జడలు వేసుకోవడం 

(రెండు జడలు వేసుకుంటే ఆమె ఇంకా చిన్నపిల్ల అని, పెళ్లికాలేదని అర్ధం. అంటే ఆ అమ్మాయిలో జీవ + ఈశ్వర సంబంధం విడివిడిగా ఉందని అర్ధము)


🌿ఒక జడ వేసుకోవడం (పెళ్లి అయ్యిన ఆడపిల్లలు మొత్తం జుట్టుని కలిపివేసి ఒకటే జడగా వేసుకునేవారు. అంటే ఆమె తన జీవేశ్వరుడినిచేరి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోందని అర్ధం)


🌸ముడి పెట్టుకోవడం (జుట్టుని ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుంది అంటే ఆమెకు సంతానంకూడా ఉందని, అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అర్ధం)


🌿అయితే ఒక జడ వేసుకున్నా, రెండు జడలు వేసుకున్నా చివరకు కొప్పు పెట్టుకున్నా కూడా జుట్టుని మూడు పాయలుగా విడతీసి త్రివేణీసంగమంలాగ కలుపుతూ అల్లీవారు. 


🌹ఈ మూడు పాయలకు అర్ధాలు ఏందమ్మ అంటే....!!🌹


🌸1. తానూ, భర్త, తన సంతానం అని ఈ మూడు పాయలకు అర్ధం.


🌿2. సత్వ, రజ, తమో గుణాలు,


🌸3. జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అని అర్ధములు.


🌿అమ్మాయిలు వేసుకున్న జడనిబట్టి వారు వివాహితులా, అవివాహితులా, పిల్లలు ఉన్నవారా, లేని వారా అన్న విషయం తెలిసిపోయేది.


🌸 ఇంత అర్ధం ఉంది కాబట్టే, మన సంస్కృతి సంప్రదాయాలు నేటికీ పూజించబడుతున్నాయి 


🌿జుట్టు విరబోసుకుని ఉండటం అరిష్టం జ్యేష్టాదేవికి ఆహ్వానం..పలికినట్టే.....🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

మానవల్లి రామకృష్ణ కవి 🙏

 🙏మానవల్లి రామకృష్ణ కవి 🙏

రామకృష్ణ కవి 1866లో మద్రాసు లోని నుంగంబాక్కంలో తెలుగు బ్రాహ్మణ పండిత కుటుంబంలో జన్మించారు. ఈయన త్యాగయ్య, గంగాధరశాస్త్రి, నరసింహశాస్త్రి వంటి సంస్కృత పండితుల వంశానికి చెందినవారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి తెలుగు, సంస్కృతం లలో ఎం.ఏ. పట్టా పొందారు. పదహారేళ్ళ వయసులో మృగవతి అనే కవితను వ్రాసి, కవి అనే బిరుదును పొందారు. కొన్నాళ్ళ పాటు మద్రాసులోని ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములోనూ, ఆ తరువాత వనపర్తి సంస్థానంలో ఆంతరంగిక కార్యదర్శిగానూ పనిచేశారు. తాళపత్రాలను సేకరించడం ప్రారంభించి అభినవ భారతి వంటి అనేక కనుమరుగైన కృతులను వెలుగులోకి తెచ్చారు. 1916 లో నిడదవోలు వెంకటరావు ఇంట్లో బసచేసి, నాట్యశాస్త్రాన్ని, దాని టీకా తాత్పర్యాన్ని నకలు వ్రాశారు. 1916 లో ప్రాచ్యలిఖిత భాండాగారము యొక్క అసిస్టెంట్ క్యూరేటర్ పదవిని పొందారు. 1940 లో శ్రీవేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థలో రీడరుగా నియమించబడి, అక్కడే 1951 దాకా కొనసాగారు.


రామకృష్ణ కవి 1957లో 91 యేళ్ళ వయసులో తిరుపతిలో మరణించారు. అవసానదశలో కఠిన దారిద్ర్యాన్ని అనుభవించి వీధుల వెంట భిక్షాటన చేస్తూ తిరిగారు.


రాయలసీమ ప్రాంతానికి ఉద్యోగ రీత్యా వచ్చి స్థిరపడిన రామకృష్ణ కవి 1933లో టీటీడీ విద్యాశాఖాధికారిగా పనిచేశారు. ఈయన సంస్కృతంలో శూద్రకుని 'వత్సరాజు చరిత్రమ్'ను మానవల్లి 'వత్సరాజు చరిత్ర' అన్న నవలగా వ్రాశారు. రామకృష్ణ కవి తాళపత్ర గ్రంథాల సేకరణకు ఊరూరా తిరిగేవారు. కొందరు యజమానులు ఆ గ్రంథాలను ఇవ్వటానికి ఒప్పుకునేవారు కాదు. అప్పుడు ‘ఊరికే చూసి ఇస్తాన’ని చెప్పి, వాటిని ఏకాగ్రతతో చదివి, బసకు వచ్చిన తర్వాత తాను చదివినదాన్ని అక్షరం పొల్లుపోకుండా రాసేవారట.


కుమార సంభవం

కుమార సంభవం కావ్యాన్ని కనుక్కొని, పరిష్కరించి అజ్ఞాత వాసంనుంచి బయటకు తీసుకువచ్చి, ప్రచురించిన ఖ్యాతి మానవల్లి రామకృష్ణ కవికి చెందుతుంది. అప్పటివరకు వరకూ తెలుగు సాహిత్యంలో నన్నెచోడుడనే కవి ఒకడున్నాడనే సంగతే ఎవరికీ తెలియదు. ఇతర కవులెవ్వరూ నన్నెచోడుని గురించి గానీ, అతని కుమార సంభవ కావ్యం గురించి గానీ, పూర్వ కవి ప్రశంసల్లో గానీ మరెక్కడా గానీ ఒక్క ముక్క కూడా వ్రాయలేదు. తంజావూరులోని సరస్వతీ మహల్ గ్రంథాలయంలో ఒక మూలపడి ఉన్న తాళపత్ర గ్రంథాన్ని కనుగొని, దానిని పరిష్కరించి 1909లో ఈ గ్రంథాన్ని ప్రకటిస్తూ నన్నె చోడుడు నన్నయ కంటే ముందువాడని రామకృష్ణ కవి చేసిన ప్రతిపాదన పండిత లోకాన్ని ఎంతటి ఆశ్చర్యానికి గురి చేసిందంటే, ఈ ప్రతిపాదన మీద చర్చలూ, ఉపచర్చలూ, వాదోపవాదాలూ బాగానే జరిగాయి.

కుమార సంభవం లో పోర్చుగీసు పదాలు, డచ్చి పదాలు ఉన్నాయి పోర్చుగీసు వారు 17 శతాబ్దం వచ్చారు. అని కోర్లపాటివారు సోదాహరణంగా వివరిస్తూ నన్నెచోడుని కుమారసంభవము ప్రాచీన గ్రంథమూ!  అనే పుస్తకం వ్రాశారు.కుమార సంభవం  మానవల్లి వారే వ్రాశారు అని నాకు అనిపించింది. ఆ పుస్తకం నేను చదివాను 

 -రామకృష్ణ కవి రాసి నన్నెచోడుని పేరు పెట్టాడని కొర్లపాటి శ్రీరామమూర్తి పుస్తకం వ్రాసినా చాలామంది పరిశోధకులు ఆమోదించలేదు. ఇప్పటికి ఇంకా వివాదాస్పదంగా ఉంది..  కుమారసంభవంపై ఇంకా పరిశోదనలు జరిపి నిజనిర్దారణ చెయ్యాలి. ముఖ్య విషయం ఏమిటంటే మానవల్లి వారు కుమార సంభవం తాళపత్ర ప్రతిని ఎవ్వరికి చూపలేదు .కొంతమంది పండితులు అడిగినా దాటావేశారు ఇది నిజం.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

సైన్ధవ లవణం

 సైన్ధవ లవణం యొక్క ఉపయోగాలు - 


 * ఈ సైన్ధవ లవణం కొంచం మధురంగా ఉండును. 


 * శుక్రాన్ని వృద్దిచేయును .


 * హృదయముకు బలమును ఇచ్చును. 


 * శరీరం నందు వాత,పిత్త,కఫ దోషములను పొగొట్టును.


 * శరీరం నందు కొంచం ఉష్ణం కలుగచేయును .


 * నేత్రములకు మంచి ఉపకారం చేయును . 


 * శరీరం నందు జీర్ణశక్తిని వృద్దిచేయును .


 * వాతాన్ని హరించును .


 * వ్రణాలను తగ్గించును . 


 * శరీరం నందు పైత్యం హరించును . 


 * దీనిని వాడటం వలన మలబద్దకం హరించును . 


 * గ్యాస్ పట్టినప్పుడు దీనిని గోరువెచ్చటి నీటిలో కలిపి త్రాగించి వాంతి చేయించిన ఉదరం శుభ్రపడును . 


 * ఒక చెంచా చనుబాలలో చిటికెలో పావు వంతు సైన్ధవ లవణం కలిపి కంటిలో 2 చుక్కలచొప్పున వేయుచుండిన కంటి సమస్యలు నివారణ అగును. 


  గమనిక - 


      దీనిని అమితముగా పుచ్చుకున్న పైత్యం చేయును . అతిసార వ్యాధిని కలుగచేయును . 



          ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


             కాళహస్తి వేంకటేశ్వరరావు  


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                     9885030034

నిద్రలేమికి

 నిద్రలేమికి సులభ పరిష్కారాలు  -


    ప్రస్తుతపరిస్థితుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధానకారణం మనయొక్క జీవితములో ఎదుర్కొనే ఒత్తిళ్లు కావచ్చు మిగిలిన సమస్యలు ఏవైనా కారణం కావచ్చు. నిద్ర మనిషి జీవితంలో అత్యంత ప్రధానం అయినది. నిద్ర తక్కువ అవ్వడం రోగాలు రావడానికి ప్రధాన కారణం . నిద్ర తక్కువైన మనిషికి త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చును.


        కావున వీలయినంత వరకు శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచిది . అలాంటి విశ్రాంతి కేవలం మంచి నిద్రతోనే లభిస్తుంది. మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారి కోసం ఇప్పుడు నేను చెప్పబోయే యోగాలు చాలా మంచిఫలితాన్ని ఇస్తాయి .


 *  నిద్రపట్టనప్పుడు ఒక స్పూన్ గసగసాలు వేడిచేసి ఒక గుడ్డలో వేసి మూటకట్టి వాసన చూస్తున్న త్వరలో మంచినిద్ర వచ్చును.  మంచి గసగసాలనే వాడండి. మార్కెట్లో తొటకూర విత్తనాలను గసగసాలుగా అమ్ముతున్నారు.


 *  వెలక్కాయ చిప్పను బియ్యపు కడుగు నీటితో అరగదీసి ఆ గంధాన్ని కణతలకు , నుదురుకు వ్రాసి పడుకున్న నిద్రపట్టును .


 *  ఉదయం , సాయంత్రం సర్పగంధి వేళ్ళ చూర్ణం పావుస్పూన్ అరకప్పు నీళ్ళలో వేసి తాగుచున్నచో మంచిఫలితం కనిపించును. రక్తపోటు ఉన్నవారికి చాలా అద్భుతంగా పనిచేయును .


 *  రాత్రి సమయంలో మజ్జిగ లో రెండు నీరుల్లిపాయ ముక్కలను కలుపుకుని లోపలికి తీసుకొండి. మంచి నిద్ర వచ్చును.


 *  నిద్రపోవడానికి ముందు కప్పు వేడిపాలల్లో అరచెంచా మిరియాల కషాయం కలుపుకుని తాగుచున్న సుఖనిద్ర కలుగును.


 *  అశ్వగంధ చూర్ణము కూడా బాగా పనిచేయును . ఒక స్పూన్ అశ్వగంధ చూర్ణం ఒక చిన్న గ్లాసు పాలల్లో కలిపి నిద్రపొవడానికి ముందు ప్రతినిత్యం సేవించవలెను .


       పైన చెప్పిన యోగాలలో మీకు అత్యంత సులభమైన యోగాన్ని తీసుకుని పాటించవచ్చు. సర్పగంధ వేళ్ళ చూర్ణం మీకు ఆయుర్వేద పచారీ సామానులు అమ్మే దుకాణాలలో లభ్యం అగును.


          ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

బుధవారం🪷* *🌷19, మార్చి, 2025🌷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

       *🪷బుధవారం🪷*

 *🌷19, మార్చి, 2025🌷*

      *దృగ్గణిత పంచాంగం*                  


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః*

*ఫాల్గుణ మాసం -  కృష్ణపక్షం*


*తిథి      : పంచమి* రా 12.36 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : బుధవారం* ( సౌమ్యవాసరే )

*నక్షత్రం  : విశాఖ* రా 08.50 వరకు ఉపరి *అనూరాధ*


*యోగం  : హర్షణ* సా 05.38 వరకు ఉపరి *వజ్ర*

*కరణం   : కౌలువ* ఉ 11.24 *తైతుల* రా 12.36 ఉపరి *గరజి*


*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 06.00 - 08.00 సా 04.00 - 05.00*

అమృత కాలం  : *ఉ 10.57 - 12.44*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*


*వర్జ్యం          : రా 01.17 - 03.04*

*దుర్ముహూర్తం  : ప 11.51 - 12.39*

*రాహు కాలం   : మ 12.15 - 01.46*

గుళికకాళం      : *ఉ 10.44 - 12.15*

యమగండం    : *ఉ 07.43 - 09.14* 

సూర్యరాశి : *మీనం*

చంద్రరాశి : *తుల/వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 06.12* 

సూర్యాస్తమయం :*సా 06.18*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 06.12 - 08.37*

సంగవ కాలం         :      *08.37 - 11.03*

మధ్యాహ్న కాలం    :      *11.03 - 01.28*

అపరాహ్న కాలం    : *మ 01.28 - 03.53*


*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ బహుళ పంచమి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.18*

ప్రదోష కాలం         :  *సా 06.18 - 08.41*

రాత్రి కాలం          :  *రా 08.41 - 11.52*

నిశీధి కాలం          :*రా 11.51 - 12.39*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.36 - 05.24*

_________________________________

        *🌷ప్రతినిత్యం🌷*       

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ సరస్వతి స్తోత్రం🪷*     

       *(అగస్త్య కృతం)*


*యోగానార్య ఉమాదేవ్యై* 

*యోగానందే నమో నమః |*

*దివ్యఙ్ఞాన త్రినేత్రాయై* 

*దివ్యమూర్త్యై నమో నమః*


*🌷ఓం సరస్వత్యై నమః🌷*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌷🌹🌷🌹

ఏకడఁ జూడ స్వార్థమె

 ఉ.ఏకడఁ జూడ స్వార్థమె సహింపగ రాని అరాచకమ్ములన్

సాకెడు ధర్మ రక్షకులె! సైపగ రాని దురాగతమ్ములే! 

పోకల వోయినన్ భువిని పూర్తిగ నిండు వినాశనమ్ములే!

ఈ కలి కాల దౌష్ట్యముల నెట్లు భరింపగ నౌను భారతీ!౹౹ 93


ఉ.ప్రాకట మైన యోగ్యమగు వస్తువులన్ గొన లేని అజ్ఞతన్

తేఁకువ తోడ దుర్మతుల తీరు గ్రహింపగ లేమి బేలలై

చౌకగ నేది గాంచినను సత్వర రీతి గ్రహింప నెంచు నా

మూకలు వొందు బన్నముల మోషలనెట్లు సహింప? భారతీ!౹౹94

(మోషలు=మోసములు)

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం  - పంచమి - విశాఖ -‌‌ సౌమ్య వాసరే* (19.03.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*