15, ఏప్రిల్ 2023, శనివారం

గురువు - గుహుడు

 గురువు - గుహుడు


పరమాచార్య స్వామివారి మకాం పండరీపురంలో ఉంది. మహాస్వామివారి దర్శనానికి వెళ్ళేవారు బస్సు దిగిన తరువాత చంద్రభాగ నదిని దాటి వెళ్ళాలి. మేము పండరీపురం చేరుకునే సమయానికి రాత్రి ఎనిమిదయ్యింది. ఆకాశం మేఘావృతమై చిన్నగా వర్షం కూడా మొదలైంది.


క్రమంగా పెరిగి చంద్రభాగ నదికి వరద మొదలైంది. అక్కడ ఉన్న పడవవాడు ముందు రానన్నాడు. అతను మరాఠీలో “ఇప్పుడు నది దాటడం చాలా అపాయకరం. మీరు ఉదయం వెళ్ళడం మంచిది” అని మాతో అన్నాడు. వెంటనే మేము “మేము మహాస్వామివారి దర్శనానికి వచ్చాము” అని చెప్పగానే అతడు ఆనందంతో “శంకర్ గురుజి? అచ్చా! సరే పడవ ఎక్కండి” అని చెప్పాడు.


అవతలి ఒడ్డుకు చేరగానే కొంత డబ్బు తీసి అతనికి ఇవ్వబోయాను.


ఆ పడవవాడు, ”లేదు. లేదు. నేను డబ్బు తీసుకోను. శంకర్ గురుజి మేము మా కళ్ళతో చూడగలిగే దైవం. ఆయనే మా పండరినాథుడు. మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడారు కూడా. మాకు సాక్షాత్తు ఆ విఠలుడే ఇక్కడకు వచ్చి మాతో మాట్లాడినట్టు“ అని పారవశ్యానికి లోనయ్యాడు.


భువినేలే భూపతులు, అక్షరజ్ఞానం కలిగిన పండితులు మాత్రమే స్వామివారిని ఆరాధిస్తారు అనుకున్నాను. కాని ఇక్కడ ఒక పామరుడు ఆ జగద్గురువును అత్యంత భక్తితో ఆరాధిస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం?


సమాధానం కోసం ఆలోచించడం వదిలి, పరమాచార్య స్వామివారి దివ్య చరణాలకు ప్రణమిల్లుతునాను. బహుశా సమాధానం కూడా ఇదేనేమో.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- టి.యన్. సుప్పిరమణి, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 3


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

 1711.    1-5.  130423-7.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


              *అశ్వినీ దేవతలు*

                ➖➖➖✍️


*అశ్వినీ దేవతలు సూర్యపుత్రులు. వీరు కవలలు. వీరిసోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుందట.*


*ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పుదిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన.*


*వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం. అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది.*


*ఆ రథం చాలా బృహత్తరమైనది. అది హిరణ్యంతో నిర్మించబడింది. ఆ రథానిని మూడు గుర్రాలు నడుపుతుంటాయి. అద్వరాశ్వాలనే ఆగుర్రాలు తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతో అత్యంత ఉత్సాహంతో ఉంటాయి.*


*చిత్రమైన ఈ రథానికి చక్రాలూ మూడే. సారథి కూర్చోవడానికి త్రిఫలకాలు, త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి.* 


*ఆరథంలో ఒకవైపు ధనం మరొకవైపు తేనె, సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి. రథం పైభాగంలో వేయిపతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి.*


*అశ్వినీ దేవతల కంఠధ్వని... శంఖనాదంలా మధురంగా ఉంటుంది. ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు. ఉపాసకుల మంత్రాలలోని సత్యాన్ని మాత్రమే గ్రహించి వారిని అనుగ్రహిస్తుంటారు.* 


*వీరి చేతిలో తేనె, సోమరసం, మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు.*


*వేదాలలో అశ్వినీ దేవతల వర్ణన ఉంది. వేదాలలో వీరి గురించి దాదాపు నూరు సూక్తాల వరకు ఉంది. వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి.*


*ఈ దేవతలు దయార్ధ హృదయులు, ధర్మపరులు, సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి.*


*వీరు ఆరోగ్యసమస్యలు ఉన్నవాళ్ళను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు పురాణ వర్ణన.* 


*వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడిచేతిలో అభయముద్ర ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృతసంజీవిని విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఎడమవైపు అమృతకలశాన్ని పట్టుకున్న ధన్వంతరీ కలిగి ఉంటారని పురాణాలలో వర్ణించబడింది.*


*ఈ దేవతలు విరాట్పురుషుని నాశికాభాగంలో ఉంటారు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

* గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

అన్నదోషము అంటదు

 శ్లోకం:☝️

*అన్నం బ్రహ్మ రసో విష్ణుః*

 *భోక్తా దేవో మహేశ్వరః l*

*ఇతి సంచింత్య భుంజానః*

 *అన్నదోషైర్న లిప్యతే ll*


భావం: ఈ అన్నమే బ్రహ్మ, ఇందులోని సారమే విష్ణువు, దీనిని భుజించేవాడు సాక్షాత్తూ మహేశ్వరుడే. ఇలా భావించి భుజించేవారికి అన్నదోషము అంటదు.🙏

ఆదిశేషుడిని

 శ్లోకం:☝️

*అకర్ణమకరోచ్ఛేషం*

 *విధిర్బ్రహ్మాండ భంగథీః ।*

*శ్రుత్వా రామకథాం రమ్యాం*

 *శిరః కస్య న కంపతే ॥*


భావం: "ఆనందకరమైన శ్రీరామకథను విని ఎవరు (సంతోషంతో) తల ఆడించరు?" అందుకే విశ్వం నాశనమవుతుందనే భయంతో భూమికి ఆధారమైన ఆదిశేషుడిని చెవులు లేకుండా చేసాడుట బ్రహ్మదేవుడు.

పసిపిల్లలు పుట్టగానే చేయవలసిన పని



పసిపిల్లలు పుట్టగానే చేయవలసిన పని మరియు పుట్టగానే ఏడవని బిడ్డలకు ప్రాణం పోసే విధానం - 


  పసిపిల్లలు పుట్టగానే చేయవలిసిన పని  - 


      సహజమయిన కాన్పు జరిగినప్పుడు తల్లికి చీకట్లు కమ్మినట్లుగా ఉండి తన ఒళ్లు తనకే తెలియనట్లుగా ఉంటుంది. ఆ స్థితిలో ఆమెకి గట్టిగా నడుము బిగించి కట్టి వెల్లికిలా పడుకొపెట్టి ఉంచాలి. పక్కన సహాయకులుగా ఉన్నవారు బిడ్డని జాగ్రత్తగా ఎత్తుకొని గోరువెచ్చటి నీరుతో శుభ్రంగా కడిగి స్నానం చేయించి మెత్తని పొడి గుడ్డల్లో పడుకోపెట్టాలి. పక్కన ఉన్నవారు తమ చేతులకు నిప్పుసెగని కాచుకొని ఆ చేతులను బిడ్డ శిరస్సు , కడుపు భాగాలకు వేడి కలిగేలా చేయాలి . తరువాత ఆ చేయి శుభ్రంగా కడుక్కొని చూపుడు వ్రేలితో అతి కొద్ది ఆముదాన్ని తీసుకుని బిడ్డకు నాకించాలి.


  పుట్టగానే ఏడవని బిడ్డకు ప్రాణం పోసే విధానం  -


     

      కొన్ని సమయాలలో బిడ్డ పుట్టగానే ఏడవకుండా ఉండటం జరుగును. అట్టి సమయాలలో గాబరా పడకుండా మావిత్రాడు ని సవరిస్తూ ఉండాలి. దానివలన ఆ మావిత్రాడు లొని ప్రాణవాయువు బిడ్డ గర్భములొకి చేరి వెంటనే శరీరానికి చైతన్యం కలిగి అంటే ప్రాణం చేరి బిడ్డ కదులుతూ ఏడుస్తుంది. ఇంకా బిడ్డని అటుఇటు కదిలించి వేడివేడి చేతులతో తాకుట వలన బిడ్డ తుంటి పైన మెల్లగా సుతారంగా తట్టుట వలన ప్రాణం శరీరంలోకి ప్రవేశించి బిడ్డ ఏడుస్తుంది . 


        ఒకవేళ బిడ్డ ఎడవకపోతే పైన చెప్పిన పనులు చేసిన తరువాత బిడ్డ క్షేమంగా సజీవంగా ఉందని తెలిసిన తరువాతే బొడ్డు కోయాలి. పదిపదిహేను నిమిషాల పాటు పైన చెప్పినట్టుగా చేస్తూ ఉంటే నిర్జీవంగా ఉన్న బిడ్డలో ప్రాణం వస్తుంది. ఆముదం తడిపిన వ్రేలు బిడ్డ నోటిలో పెట్టడం వలన కూడా బిడ్డలో ప్రాణం చేరి ఉలిక్కిపడి ఏడుస్తుంది . మావిత్రాడులో ప్రాణ నాడి కొట్టుకుంటూ ఉంటుంది. ఆ ప్రాణం బిడ్డ శరీరంలో చేరి బిడ్డకు చైతన్యం కలిగి ఏడ్చే వరకు మావిత్రాడుని కదిలిస్తూ ఉండాలే కాని ఎట్టి పరిస్థితులలో మావిత్రాడు కోయడం కాని , ముడి వేయడం కాని చేయకూడదు .


           వైద్యులు , పురుడు పోసే మంత్రసానులు ఈ విషయాన్ని తప్పక గుర్తు ఉంచుకోవాలి .


           మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  : మధుమేహం లో పనిచేసే ప్రధాన మూలికలు  - 


 *  పొడపత్రి ఆకు  - 


     దీన్నుంచి తీయబడ్డ ఒక ఎంజైమ్ కు గ్లూకోజ్ ద్రావణాన్ని బలహీనపరిచే గుణం ఉన్నట్లుగా కనుగొన్నారు. దీన్ని తిన్న తరువాత తీపి రుచిని కొంతసేపటి వరకు కనిపెట్టలేక పోవడం ఈ మొక్కకి ఉన్న ప్రత్యేకత . దీని ఆకుల నుంచి తీయబడిన జిమ్నిమిక్ ఆసిడ్ కి ఇన్సులిన్ ఉత్పత్తికి కారణం అయిన బీటా కణాలను బలోపేతం చేసే నైజం ఉన్నట్లుగా కనుగొన్నారు . 


 *  కాకర  - 


       కాకర కాయల నుంచి విత్తనాలు నుంచి తీసే పాలి పెప్టైడ్ కు బోవైన్ ఇన్సులిన్ తో సమానం అయిన గుణ ధర్మం ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఇది రక్తంలోని గ్లూకోజ్ ని శరీర కణాలు గ్రహించేలాగా చేస్తుంది . 


 *  పెద్దేగి  - 


       ప్రయోగశాలల్లో జాగిలాలకు ఎల్లోక్సాన్ అనే పదార్ధంతో కృత్రిమంగా మధుమేహాన్ని కలిగించి పెద్దేగి సారాన్ని ఇచ్చినప్పుడు బ్లడ్ ప్రెషర్ గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. అలాగే ఎలుకల మీద ప్రయోగించినప్పుడు వాటి అన్నవాహిక నుంచే గ్లూకోజ్ శరీరంలోకి వెళ్ళకుండా ఆగిపోవడం గమనించారు.


              పెద్దేగి మూలిక  విషయంలో ఇంకా ఆసక్తి గొలిపే విషయం ఏమిటంటే ఇది ఇన్సులిన్ కి అవసరం అయిన ప్రో ఇన్సులిన్ నిర్మాణంలో సహాయపడగలదు అని కనుగొన్నారు . ఇది కొలెస్ట్రాల్ ని సమర్ధవంతంగా నియంత్రిస్తుంది.


 *  నేరేడు  - 


       నేరేడు పండ్లకు , విత్తనాల చూర్ణం కి మధుమేహానికి వ్యతిరేకంగా పనిచేసే గుణం ఉన్నట్లు కనుగొన్నారు . 


 *  తులసి  - 


       ప్రయోగశాలల్లో ఎలుకలకు streptojotosin అనే పదార్థంతో మదుమేహాన్ని కలిగించి తులసి సారాన్ని ఇథనాల్ సహయంతో తీసి ప్రయోగించి చూసినప్పుడు రక్తంలో షుగర్ నిలువలు గణనీయంగా తగగినట్లు గుర్తించారు.


 *  శిలాజిత్   - 


        అష్టాంగ హృదయం అనే ఆయుర్వేద గ్రంధం శిలాజిత్ ని మదుమేహ నివారణకి ప్రముఖ ఔషధంగా చెప్పింది. దీనిని ప్రతిరోజూ 500 మిల్లి గ్రాముల చొప్పున రెండు పూటలా తీసుకుంటూ ఉంటే వ్యాధి శమించడమే కాకుండా ధాతు స్థిరత్వం  ఏర్పడి వృద్ధాప్య  చాయలు రాకుండా కాపాడుకోవచ్చు అంటుంది. ఈ గ్రంథరాజం. 


     అదే విధంగా మదుమేహంలో స్వర్ణమాక్షిక భస్మాన్ని గూర్చి కూడా ప్రముఖంగా చెప్పారు. అయితే మదుమేహానికి శిలజిత్ ని కాని , స్వర్ణమాక్షిక భస్మాన్ని గాని తీసుకుంటున్నప్పుడు జీవితాంతం ఉలవలు, పావురం మాంసాన్ని వాడకూడదు అని షరతు విధిస్తుంది. శాస్త్రం . 


  మధుమేహం పైన పనిచేసే కొన్ని ప్రయొగాలు  - 


 *  వసంత కుసుమాకరం 100 మి.గ్రా , శిలాజిత్తు 500 మి.గ్రా , పొడపత్రి చూర్ణం 500 మి.గ్రా , తేనేతో కలిపి రోజుకీ రెండు సార్లు భోజనం చేసిన తరువాత తీసుకోవాలి . ఇక్కడ తేనే అన్నప్పుడు మదుమేహంలో తీసుకోవచ్చా అన్న సందేహం కలగవచ్చు. తేనే సహజమైనంత వరకు దాని మోతాదు 5 మి.లి మించనంత వరకు తేనే ని తీసుకోవడాన్ని శాస్త్రం సమ్మతిస్తుంది.


 

 *  నాగభస్మం  125 మి.గ్రా , శిలజిత్ 250 మి.గ్రా , తేనేతో రోజుకి మూడు సార్లు తీసుకోవాలి . ఇది తీసుకున్న తరువాత , తిప్పతీగ నుంచి తీసిన రసాన్ని తాగితే మంచిది.


 *  జాతీపలాది వటి 100 మి.గ్రా మాత్రలని పొడపత్రి ఆకుల చూర్ణం తో సహా తీసుకోవాలి .


 *  అష్టాంగ హృదయం ప్రమేహంలో పచ్చిపసుపు , ఉచిరికవలపు కాంబినేషన్ ని అత్యంత గుణకారిగా చెప్పింది. ఈ రెండింటిని పొడి చేసుకోని డబ్బాలో భద్రపరచుకొని ప్రతిరోజూ భోజనానికి ముందు చెంచాడు చొప్పున తీసుకుంటే సరిపోతుంది.


    మధుమేహ చూర్ణం కొరకు నన్ను సంప్రదించగలరు. 


   ఫొన్ నంబర్ - 9885030034 .        


గమనిక  - 


   భస్మాలు ఉపయోగించేప్పుడు అనుభవ వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడవలెను. విషముష్టి వంటి కొన్ని మూలికలు వాడేప్పుడు శరీరతత్వాన్ని బట్టి డొసేజ్ తీసికొనవలెను . మిగిలిన మూలికలు నిరపాయకరమైనవి ...


 

          మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక  -


     నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

ముందు పద్మావతీ కల్యాణం చెయ్యి

 ముందు పద్మావతీ  కల్యాణం చెయ్యి


కంచి పరమాచార్య స్వామివారిలో ఉన్న ఒక యోగి లక్షణాలను, అనన్యసామాన్యమైన నిరాడంబరతను కలిపి చూడడం మా అదృష్టం. వారి అవతార రహస్యాన్ని తెలుసుకున్న ఎందఱో భక్తులను స్వామివారు అనుగ్రహించారు.


ఆ ప్రత్యక్ష దైవాన్ని ప్రత్యక్షంగా సేవించి తరించే భాగ్యం పొందినవారిలో శ్రీమఠం బాలు ఒకరు. ప్రతిరోజూ వారి అవతారాన్ని తెలిపే అన్నో సంఘటనలను ప్రత్యక్షంగా చూశాడు. ఈ సంఘటను కూడా అతను చెప్పిన అనుభవాల్లో ఒకటి.

మరవక్కాడు రామస్వామి అనే భక్తునికి నలుగురు కూతుళ్ళు, ఇద్దరు కుమారులు. యుక్తవయస్సులో అతను ఏ విషయంలోనూ ఆసక్తి చూపకుండా, ఊరికే అక్కడా ఇక్కడా తిరుగుతుండడంతో, నెలవారీ ఆదాయం అంటూ ఏమి లేదు. వైదిక కర్మలలో పండితులకు సహాయం చెయ్యడంవల్ల లభించే కొద్ది మొత్తమే అతని కుటుంబానికి ఆసరా.


అతను నివసిస్తున్న గృహం తాతలనాటిది కావడంతో ఇంటికి అద్దె కట్టాల్సిన అవసరం లేదు. గ్రామ శివార్లలో అతనికి ఒక కొబ్బరితోట ఉంది. దాని నుండి వచ్చే ఆదాయమే వారికి తిండి పెడుతోంది.


పెద్దమ్మాయికి ఇరవైరెండేళ్ళు. తరువాతి అమ్మాయికి ఇరవైయ్యేళ్ళు. ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తంలో జరిపించేస్తే ఖర్చు కొద్దివరకు తగ్గుతుందని అతని ఆలోచన. కాని జరుగుతున్న సంఘటనలు దానికి ఊతమియ్యడంలేదు. పెద్దమ్మాయికి మంచి సంబంధం కుదరడంతో, త్వరగా పెళ్లిచేయ్యాలనే అతను ఇష్టపడడంతో, కొబ్బరితోట అమ్మడానికి నిశ్చయించుకుని ఒకరి వద్ద ధర కూడా నిర్ణయించేశాడు.


కాని అతను చేస్తున్న ఈ పని అన్నగారికి నచ్చలేదు. ఆ కొబ్బరితోట తరతరాలుగా వస్తున్నది కావడంతో, అందులో ఇతనికి భాగం ఉన్నది కాబట్టి, కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. రామస్వామి అయ్యర్ కు ఏమీ పాలుపోలేదు. అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎలాగో కుమార్తె పెళ్లి జరిపించాలి అనుకున్నాడు. కాని అతని అన్న కొబ్బరితోట అమ్మకానికి అడ్డుపడ్డాడు. రామస్వామి చాలా చాలా బాధలో ఉన్నాడు.


ఇక తను చేసేదేంలేక కరుణా సముద్రుడైన పరమాచార్య స్వామివద్దకు పరిగెత్తుకుని వచ్చాడు. స్వామివారికి సాష్టాంగం చేసి నిల్చుని, గద్గదమైన స్వరంతో, కళ్ళ నీరు కారుతుండగా మొత్తం విషయం అంతా స్వామివారికి విన్నవించాడు. పరమాచార్య స్వామివారు అయిదు నిముషాల పాటు అతనివైపు చూసి, ఏమీ చెప్పకుండా ప్రసాదం ఇచ్చి పంపేశారు.


పెద్ద దుఃఖభారంతో వచ్చిన ఆ భక్తుడు నిరాశాపడ్డాడు. పరమాచార్య స్వామివారు కనీసం చిన్న మాట సాయంగా బాధపడకు అని కూడా చెప్పకుండా పంపించివేశారు అన్న బాధతో బయటకు వచ్చాడు. అతను బయటకు రాగానే, మహాస్వామివారిని సేవించుకునే అదృష్టం కల్గిన బాలు కనపడ్డాడు. దుఃఖం తన్నుకురావడంతో తన బాధను బాలుకు చెప్పుకున్నాడు. “పరమాచార్య స్వామివారు తలచుకుంటే ఏమైనా చెయ్యగలరు. మా అన్నకు అన్నీ ఉన్నాయి; పెద్ద ఇల్లు, ఆస్తి, ఐశ్వర్యం; ఎప్పుడూ యాత్రలలో ఉంటాడు; నేను ఎప్పుడూ ప్రత్యక్షంగా కలవలేను; నా వల్ల చెయ్యడం కాకపోయినా ఎపుడూ మా న్నాన్నగారి ఆబ్దికానికి కూడా పిలవడు; ఎంతో కష్టపడి నా కుమార్తె పెళ్లి చేద్దామనుకుంటే, ఇలా చేశాడు”


మొత్తం విన్న తరువాత “ఇదంతా ఎందుకు స్వామివారితో చెప్పలేదు?” అని అడిగాడు బాలు. “నేను మొత్తం చెప్పాను, పరమాచార్య స్వామివారు సాంతం విన్నారు. కేవలం విభూతి ప్రసాదం ఇచ్చారు కాని ఏ ‘అనుగ్రహం’ ఇవ్వలేదు” అని బదులిచ్చాడు రామస్వామి.


ఎంతో బాధతో తన గోడు చెప్పుకున్న రామస్వామిని చూసి, పెరియవా ఇలా చెయ్యకుండా ఉండాల్సింది అనుకున్నాడు బాలు. అందరిపై కరుణను ప్రసరించే మహాస్వామి, రామస్వామిని ఇలా వదిలేయరాడు కదా! అందునా పేదవాడైన రామస్వామిపై స్వామివారి కరుణ దయ అపారమైనవి కదా! అని అనుకున్నాడు.


“ఏమి బాధపడవద్దు. నీ సమస్యను స్వామివారికి వదిలి ఏం జరగాలో అది చూడు. ఎలాగో స్వామివారే నిన్ను కాపాడుతారులే” అని అతణ్ణి స్వాంతనపరచి పంపాడు బాలు.


కొన్ని రోజులు గడిచిపోయాయి. ‘ఉపన్యాస చక్రవర్తి’ శ్రీ మార్గబంధు శాస్త్రి పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చారు. అతని ఐశ్వర్యము, యశస్సు అతను ధరించిన తెల్లని పట్టుపంచె, జరి అంచు ఉన్న అంగవస్త్రం, బంగారుతో అల్లిన రుద్రాక్షమాల, నవరత్నాల హారంలో కనపడుతోంది. మహాస్వామివారు గంటల తరబడి వివిధ అంశాలపై వారితో మాట్లాడేవారు. వారు ఎప్పుడు వచ్చినా సాయింత్రాలు ఉపన్యాసం చెప్పమని స్వామివారు అడిగేవారు.


కాని ఈసారి ఎందుకనో ఎప్పటిలాగా లేదు. భార్యతో, ఇద్దరు శిష్యులతో కలిసి, చేతిలో ఉన్న పళ్ళెం నిండా పళ్ళతో వచ్చి నిల్చున్న ఆయన్ని పట్టించుకోకుండా స్వామివారు ఇతరులతో సంభాషిస్తున్నారు. “ఎందుకు ఇవ్వాళ ఇలా జరుగుతోంది. దేశంలోనే ప్రఖ్యాతిచెందిన ఉపన్యాస చక్రవర్తి వేచియున్నాడు; సరే స్వామివారికి చెబుదాం” అనుకుని, గట్టిగా స్వామివారికి వినపడేటట్లు, “మార్గబంధు శాస్త్రి వచ్చారు” అని చెప్పాడు.


స్వామివారి చూపు ఇటువైపు పడ్డట్టుగా అన్పించడంతో, అటువంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న మార్గబంధు శాస్త్రి పళ్ళ తట్టను స్వామివారికి సమర్పించి, “చాలాకాలం తరువాత ఏడెనిమిది రోజులదాకా నాకు ఎటువంటి కార్యక్రమాలు లేవు. అందుకేనే తిరుమలకు వెళ్తున్నాను. ‘శ్రీనివాస కల్యాణం’ చేయించాలని నా భార్య కోరిక. అందుకనే వెంటనే బయలుదేరాము. పరమాచార్యుల వారి అనుగ్రహంతో మేము ‘శ్రీనివాస కల్యాణం’ చేయించాలని అనుకుంటున్నాము” అని చెప్పాడు.


పరమాచార్య స్వామివారు అతనివైపు చూడనుకూడా లేదు. కనీసం అతని మాటలు కూడా వినలేదు. చుట్టూ ఉన్నవారితో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతున్నారు, కాని దాదాపు అరగంటపాటు మార్గబంధు శాస్త్రితో మాట్లాడలేదు.


స్వామివారికి గుర్తుచేయాలని “శాస్త్రి అక్కడ నిలబడి ఉన్నారు” అని మరలా చెప్పాడు బాలు.


‘పరమాచార్య స్వామివారు నన్ను ఆశీర్వదించి, తిరుమలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాళ నన్ను ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారని’ తలచి, “అవును. పెరియవా నన్ను అనుగ్రహించాలి. ‘శ్రీనివాస కల్యాణం’ చేయించడానికి ఈరోజే తిరుమలకు వెళ్తున్నాను” అని అర్థించాడు.


వెంటనే మహాస్వామివారు లేచి, “ముందు పద్మావతీ  కల్యాణం చెయ్యి” అని చెప్పి లోపలకు వెళ్ళిపోయారు. దీనంతటినీ గమనిస్తున్న అక్కడున్నవారికి ఇది విపరీతంగా తోచింది.


‘శ్రీనివాస కల్యాణం’ అంటే ‘పద్మావతీ  కళ్యాణమే’ కదా! అంటే “తిరుమలలో శ్రీనివాస కల్యాణం చేయించేవారందరూ తిరుచానూరు వెళ్లి పద్మావతీ కల్యాణం చేయించమనా స్వామి వారి ఆదేశం”


దీనికి అర్థమేంటో మార్గబంధు శాస్త్రికి కూడా అర్థం కాలేదు. “ఎందుకు పరమాచార్య స్వామివారు ఇటువంటి ఆదేశాన్ని ఇచ్చి లోపలకు వెళ్ళిపోయారు” అని ఆలోచిస్తూ నిలబడిపోయాడు. కాని వెంటనే దాని అర్థమేంటో, అంతరార్థమేంటో స్వామివారే స్ఫురింపచేశారు.


మరో రెండు నెలలు గడిచిపోయాయి. పరమ సంతోషం నిండిన మొహంతో రామస్వామి అయ్యర్ పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. తన కుమార్తె పెళ్లి పత్రికను స్వామివారికి సమర్పించడానికి వచ్చాడు ఈసారి.


“అంతా పరమాచార్య స్వామివారి అనుగ్రమ వల్లనే. నా కుమార్తె పెళ్లి ఖర్చు మొత్తం భరించడానికి మా అన్న ఒప్పుకున్నాడు. కేవలం కన్యాదానం చెయ్యడం మాత్రమే నా బాధ్యత అని మిగినదంతా తను చూసుకుంటానని నాతో చెప్పాడు. కొబ్బరితోట పైన వేసిన కోర్టుకేసు కూడా వెనక్కుతీసుకున్నాడు. నా చిన్న కుమారునికి ఉపనయనం చేసి, తన శిష్యునిగా తీసుకుంటానని చెప్పాడు. మా అన్నయ్య ఇలా మారిపోతాడని నా కలలో కూడా అనుకోలేదు. ఇదంతా పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్లనే సాధ్యమయ్యింది” అని చెప్పుకుంటూపోయాడు. కాని పరమాచార్య స్వామివారు ఎలా అనుగ్రహించారో అతనికి తెలియదు.


మహాస్వామివారు చెయ్యెత్తి ఆశీర్వదించి, ప్రసాదం ఇచ్చి పంపారు. రామాస్వామి అయ్యర్ బయటకు రాగానే, మరలా బాలు తారసపడ్డాడు. “రామస్వామి! ఏంటి నీ చేతిలో? పెళ్లి పత్రికా? నీ కుమార్తెదా? నీవద్ద ఒక్క పైసా కూడా లేదని చెప్పావు కదా?” అని అడిగి, రామస్వామి ఇచ్చిన పత్రిక తీసుకున్నాడు.


ఇది ఇలా ఉంది, “. . . . . సౌభాగ్యవతి పద్మావతి, మరవక్కాడు జగదీశ్వర శాస్త్రి మనవరాలు, నా తమ్ముడు చిరంజీవి రామస్వామి పెద్ద కుమార్తె. . .” చివరన ఇట్లు “మీ భవదీయుడు, మార్గబంధు శాస్త్రి”


బాలు ఆశ్చర్యంతో నోట మాటరాక నిశ్చేష్టుడయ్యాడు. 


రెండు నెలల క్రితం పరమాచార్య స్వామివారు మార్గబంధు శాస్త్రికి చెప్పినదానికి అర్థం ఇదా! రామస్వామి అన్న ఈయనే అని స్వామివారికి తెలిసి ఉండవచ్చు. కాని రామస్వామి పెద్ద కుమార్తె పేరు పద్మావతి అని ఎలా తెలుసు?


పరమాచార్య స్వామివారికి అంతా తెలుసు అన్న నిజంలో ప్రత్యేకత ఏమి లేదు. ఆ ప్రత్యక్ష దైవానికి అనుగ్రహించడం తప్ప ఇంకేం తెలుసు. ఇటువంటి అనుగ్రహానికి పాత్రులైన ఆ భక్తులు ఎంతటి యశస్సును పొందుతారో మనం ఊహించగలమా?


కరుణాసముద్రుల కరుణ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది.


--- “శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా మహిమై” పత్రిక నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


 #కంచిపరమాచార్యవైభవం

పంచభూతాల ప్రాణశక్తి...

 #పంచభూతాల ప్రాణశక్తి.....


ఆయురారోగ్యాలు ఉంటేనే మనిషి జీవితాన్ని సఫలం చేసుకోగలడు. సిరిసంపదలు, పదవీ వైభవాలు, ఎన్ని ఉన్నా, వాటిని అనుభవించాలంటే మనిషికి ఆయువు ఉండాలి, ఆరోగ్యవంతుడయ్యీ ఉండాలి. ఈ దేహమనే యంత్రం దృఢంగా పదికాలాలపాటు సక్రమంగా పనిచేయాలంటే దేహాన్ని నడిపేది ప్రాణమని గ్రహించి, దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. విద్యుత్తు ప్రసరణపైనే యంత్రం పనితీరు ఆధారపడినట్లు, ప్రాణంపైనే దేహం పనితీరు ఆధారపడి ఉంటుంది.


మనలోని చూపు, మాట, శ్వాస, వినికిడి, రక్తప్రసరణ వంటి అన్ని శారీరక కార్యకలాపాలకు కావలసిన శక్తి ప్రాణంనుంచే లభిస్తుంది. మనిషి నిద్రపోయినా ప్రాణం మెలకువగానే ఉండి, జీర్ణ శ్వాసక్రియలకు శక్తినిస్తుంది. మనసును కలల ప్రపంచంలోకి తీసుకుపోతుంది.


.....


.....


ఇంతటి దివ్యశక్తి కలిగిన ప్రాణం మనిషిలో ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది.. హృదయగుహలో పురీతత్‌ అనే నాడీమండలంలో ఆత్మనీడగా, ఆత్మను అనుసరించి, మనసుతో అనుసంధానమై, జ్యోతిరూపంగా ప్రాణం ఉంటుందంటాయి ఉపనిషత్తులు. సృష్టిలో అది రెండు మహాకార్యాలు నిర్వహిస్తుందంటుంది శాస్త్రం. సృష్టికి ఆధారమైన ఆకాశ, పృథివి, వాయువు, అగ్ని, జలం వంటి స్థూల పంచభూతాలను సూక్ష్మాంశాలైన ఇంద్రియ మనోబుద్ధులను సమైక్యపరచి, జీవసృష్టి చేయడం వాటి మనుగడకు కావలసిన శక్తిని అందించడం. ఈ రెండు పనుల్లో భాగంగానే ప్రాణం శరీరధారణ, శ్వాసధారణ చేస్తుంది.


శరీరాన్ని అంటిపెట్టుకున్న ప్రాణం ఆ శరీరాన్ని కాపాడేందుకు విశ్వమంతా నిండిఉన్న మహాప్రాణంతో అనుక్షణం అనుసంధానమవుతుంది. ప్రకృతిలో సమృద్ధిగా దొరికే ప్రాణవాయువును శ్వాసరూపంలో గ్రహిస్తుంది. సూర్యుడి ప్రాణశక్తితో ఉత్పత్తి అయిన ఆహారాన్ని జీర్ణంచేసి, దేహాన్ని పరిపుష్టీకరిస్తుంది. ఈ ప్రక్రియలన్నీ  సజావుగా సాగేందుకు వీలుగా ప్రాణం తనను తాను అయిదు విభాగాలు చేసుకుంటుంది. ఏ రంగూ లేని సూర్యకిరణం పట్టకంలో ప్రవేశించి వివిధ వర్ణాలుగా వెలువడినట్లు ప్రాణం శరీరాన్ని దాలిస్తే, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పంచవాయువులుగా మారుతుంది. వీటినే వాయుపంచకమని, పంచప్రాణాలని అంటారు.


వాయుపంచకంలో మొదటిదైన మూలప్రాణాన్ని ఊపిరిగా చెబుతారు. అది మనిషి హృదయస్థానంలో ఉండి చూపు, మాట, శ్వాస, వినికిడి పనులకు సహకరిస్తుంది. అపానవాయువు శరీరంలోని అధోభాగంలో సంచరిస్తూ, మలమూత్రవీర్య విసర్జనక్రియలు సాఫీగా జరిగేలా చూస్తుంది. శారీరక సమతౌల్యాన్ని కాపాడుతుంది. వ్యానవాయువు వేలకొద్దీ నాడుల్లో సంచరిస్తూ, ప్రాణశక్తిని శరీరమంతా నింపుతుంది. ఉదానవాయువు కంఠస్థానంలో ఉండి, మనసును గాఢనిద్రలోకి దించి, సేదదీర్చి శాంతిని అందిస్తుంది. సమానవాయువు నాభిస్థానంలో ఉండి, జీర్ణక్రియకు జఠరాగ్నిని ప్రజ్వలింపజేసి, అన్నసారాన్ని శరీరానికి అందిస్తుంది.


శరీరంలో ప్రాణశక్తి సమంగా ప్రసరిస్తేనే ఆరోగ్యం, లేకపోతే అనారోగ్యం. ప్రాణశక్తి క్షీణిస్తే  మరణం తప్పదు. దీర్ఘకాలం మనిషి ఆయురారోగ్యాలతో ఉండాలంటే, ప్రాణశక్తిని పెంచుకోవాలి. ప్రాణచలనాన్ని నిరోధిస్తేనే ఇది సాధ్యం. శ్వాసను నియంత్రిస్తేనే ప్రాణచలనాన్ని నిరోధించగలం. ఈ క్రియను బోధించేదే ప్రాణాయామం. దీర్ఘశ్వాసను తీసుకోవడం, దాన్ని బంధించడం, తిరిగి నెమ్మదిగా వదలడం అనే ప్రక్రియనే ప్రాణాయామమంటారు. పూజలు యజ్ఞయాగాదుల ఆరంభంలోను, ధ్యానయోగ ప్రక్రియల్లోను దీన్ని తప్పక ఆచరిస్తారు. మనిషికి ప్రాణాయామం మూడు మహోపకారాలు చేస్తుంది. దీర్ఘాయువును ఆరోగ్యాన్ని ప్రసాదించడంతోపాటు, చిత్తచాంచల్యాన్ని నిరోధిస్తుంది. తపస్సు, ధ్యానాన్ని సిద్ధింపజేస్తుంది...