15, ఏప్రిల్ 2023, శనివారం

గురువు - గుహుడు

 గురువు - గుహుడు


పరమాచార్య స్వామివారి మకాం పండరీపురంలో ఉంది. మహాస్వామివారి దర్శనానికి వెళ్ళేవారు బస్సు దిగిన తరువాత చంద్రభాగ నదిని దాటి వెళ్ళాలి. మేము పండరీపురం చేరుకునే సమయానికి రాత్రి ఎనిమిదయ్యింది. ఆకాశం మేఘావృతమై చిన్నగా వర్షం కూడా మొదలైంది.


క్రమంగా పెరిగి చంద్రభాగ నదికి వరద మొదలైంది. అక్కడ ఉన్న పడవవాడు ముందు రానన్నాడు. అతను మరాఠీలో “ఇప్పుడు నది దాటడం చాలా అపాయకరం. మీరు ఉదయం వెళ్ళడం మంచిది” అని మాతో అన్నాడు. వెంటనే మేము “మేము మహాస్వామివారి దర్శనానికి వచ్చాము” అని చెప్పగానే అతడు ఆనందంతో “శంకర్ గురుజి? అచ్చా! సరే పడవ ఎక్కండి” అని చెప్పాడు.


అవతలి ఒడ్డుకు చేరగానే కొంత డబ్బు తీసి అతనికి ఇవ్వబోయాను.


ఆ పడవవాడు, ”లేదు. లేదు. నేను డబ్బు తీసుకోను. శంకర్ గురుజి మేము మా కళ్ళతో చూడగలిగే దైవం. ఆయనే మా పండరినాథుడు. మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడారు కూడా. మాకు సాక్షాత్తు ఆ విఠలుడే ఇక్కడకు వచ్చి మాతో మాట్లాడినట్టు“ అని పారవశ్యానికి లోనయ్యాడు.


భువినేలే భూపతులు, అక్షరజ్ఞానం కలిగిన పండితులు మాత్రమే స్వామివారిని ఆరాధిస్తారు అనుకున్నాను. కాని ఇక్కడ ఒక పామరుడు ఆ జగద్గురువును అత్యంత భక్తితో ఆరాధిస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం?


సమాధానం కోసం ఆలోచించడం వదిలి, పరమాచార్య స్వామివారి దివ్య చరణాలకు ప్రణమిల్లుతునాను. బహుశా సమాధానం కూడా ఇదేనేమో.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- టి.యన్. సుప్పిరమణి, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 3


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: