18, జనవరి 2021, సోమవారం

అన్నమాచార్య చరితము

     🌹అన్నమాచార్య చరితము 🌹


తదుప రన్న మయ్య తాళ్లపాకందున 

వాస ముండె యిల్లు వదలకుండ 

సతత విష్ణుసేవ సాగించు చుండగా 

కాలమందు యేండ్లు గడచి పోయె 


తరుణ వయసునందు తలి దండ్రు లతనికి 

పరిణయంబు సేయ భావ మొంది 

వధువు కొఱకు బంధు వర్గంబు నందున 

వెదుక సాగి రంత వేడ్క తోడ 


అక్కమ్మ తిమ్మక్క లను వధూరత్నముల్ 

            యాత్మబంధువులింట నరయ నుండ 

నవ్వారి స్థితిగతులధ్యాత్మచింతన

            సాత్వికగుణముల సమ్మతించి 

గ్రామ పెద్దలెదుట ఘన విప్రులెదుటను 

            వేదోక్తపద్ధతిన్ విహిత రీతి 

యన్నమాచార్యుకు యాతని తలి దండ్రి 

             పెండిలి జేసిరి ప్రేమ తోడ 

సకల జనములు విప్రులు సన్నుతించ 

బంధువర్గంబు సర్వము ప్రస్తుతించ 

యాత్మగురువులు యాశీస్సు లందజేయ 

యన్నమయ్యయ్యె భువిని గృహస్తు నిగను 


కాపురము కొచ్చి కోడండ్రు కదలు చుండ 

లలిత లావణ్య మస్తిష్క లక్కమాంబ 

పుత్రు విభవంబు నకు హృది పొంగి పోవ 

హరిని దలచుచు యానంద దరిని నుండె 


 అన్నమయ్య తిరుమల పునర్దర్శనము

 

అన్నమయ్యారీతి యర్ధాంగి ద్వయముతో 

             నానంద డోలల నరయ నుండి 

హరిసేవ మరువక ననయంబు సల్పుచూ 

             కాలంబు గడిపెను ఘనము గాను 

కలియుగ దైవంబు ఘన కల్పతరువగు 

             వేంకటేశ్వరు జూడ వేడు కయ్యు 

తీర్థరాజంబైన తిరుమల కొండకు

              యర్ధాంగు లిద్దఱు యనుసరించ

భక్తి భావంబు తోడను పయన మయ్యు  

పాద రక్షలు లేకుండ పావనముగ 

కాలి నడకన నెక్కియు కదలి కదలి 

చేరె వేంకట శిఖరంబు తృప్తి గాను


గోపాలుని మధుసూదనరావు 🙏

ఏకాదశ రుద్రులు

 ఏకాదశ రుద్రులు:

శివుడు మనకు పదకొండు అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిచ్చును. ఓంనమస్తేస్తు భగవన్ "విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమః" అని రుద్రనమకంలో చెప్పబడినది. దీనిప్రకారం ఏకాదశ రుద్రులపేర్లు 1. విశ్వేశ్వరుడు, 2.మహాదేవుడు,3. త్ర్యంబకుడు, 4.త్రిపురాంతకుడు, 5.త్రికాగ్నికాలుడు, 6.కాలాగ్నిరుద్రుడు, 7.నీలకంఠుడు, 8.మృత్యుంజయుడు, 9.సర్వేశ్వరుడు,10. సదాశివుడు మరియు 11. శ్రీమన్మహాదేవుడు. ఏకాదశ రుద్రులు మరియు వారిభార్యలైన ఏకాదశ రుద్రాణుల పేర్లు క్రింద ఈయబడినవి. 

1.అజపాదుడు- ధీదేవి

2.అహిర్భుద్న్యుడు- వృత్తిదేవి

3.త్ర్యంబకుడు- ఆశనదేవి

4.వృషాకపి- ఉమాదేవి

5.శంభుడు- నియుత్ దేవి

6.కపాలి- సర్పిదేవి

7.దైవతుడు- ఇల దేవి

8.హరుడు- అంబికాదేవి

9.బహురూపుడు- ఇలావతీదేవి

10.ఉగ్రుడు- సుధాదేవి

11.విశ్వరూపుడు- దీక్షాదేవి 

అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభలతీర్థంలో ఏకాదశ రుద్రులతోకూడిన ప్రభలు సంక్రాంతి పండుగలలో కనుమరోజు భక్తజనులకు దర్శనమిచ్చి తరింపజేయుచున్నారు. వాటి వివరాలు మనంతెలుసుకుందాము.

1. విశ్వేశ్వర రుద్రుడు- వ్యాఘ్రేశ్వరం (శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి):

పూర్వకాలంలో ఒకబ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని (పులి) శివునిగా భావించి బిళ్వపత్రాలతో అర్చన చేయటంవల్ల ఆపులి శివలింగరూపాన్ని పొందిందని కధనము కలదు. వ్యాఘ్రము శివునిగా అవతరించుటచే వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడెను.

2. మహాదేవరుద్రుడు- కె. పెదపూడి (శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి):

పూర్వకాలంలో విశ్వామిత్రుని తపోభంగముకొరకు ఇంద్రుడు మేనకను పంపెను. విశ్వామిత్రునకు, మేనకకు శకుంతల జన్మించెను. తరువాత మేనక స్వర్గమునకు పోవుదమని ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయినది. అపుడు ఆమె శివుని ప్రార్ధించగా ఆయన ఒకశివలింగమును మేనకకు ఇచ్చి ఆప్రదేశములో ప్రతిష్ఠింపుమనెను. అపుడు మేనక కృష్ణరాయుడు పెదపూడి (కె.పెదపూడి) నందు శివలింగమును ప్రతిష్ఠించి స్వర్గమునకు పోయెనని కధనముకలదు. మేనకచే ప్రతిష్ఠింప బడుటచే మేనకేశ్వరస్వామి అని పిలువబడెను. 

3. త్ర్యంబకేశ్వరుడు- ఇరుసుమండ (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి):

రావణుని సంహరించిన తరువాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పకవిమానంలో అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి పుష్పకవిమానం కదలకుండా నిలిచిపోయినది. అపుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్ధించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించెనని కధనము కలదు. అపుడు వారి పుష్పకవిమానము ముందుకు కదలగా వారందరూ ఆనందభరితులైరి. రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే ఆనందరామేశ్వరుడని పిలువబడెను. 

4. త్రిపురాంతక రుద్రుడు- వక్కలంక (శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి):

తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడుపురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు. దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపుమని శివుని ప్రార్ధించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామము నందు శివలింగరూపంలో ఆవిర్భవించెనని కధనము కలదు. అపుడు ఆగ్రామపు బ్రాహ్మణోత్తములచే శివలింగము ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలువబడెను.  

5. త్రికాగ్నికాల రుద్రుడు- నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి):

మూడు అగ్నులయందు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించి శివుడు లింగరూపమును పొందుటచే త్రికాగ్ని కాలునిగా పిలువబడి అగస్త్యమహర్షిచే నేదునూరు గ్రామమున ఈశివలింగము ప్రతిష్ఠింపబడినది. శ్రీ ఉమాచెన్నమల్లేశ్వర స్వామిగా సర్వజనులచే కొలువబడుచున్నాడు.

6. కాలాగ్ని రుద్రుడు- ముక్కామల (బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి):

రావణ సంహారం తరువాత అగస్త్య మహాముని అయోధ్యకేగుచున్న రామునిచే ఈప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసెను. కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రములను, ఖడ్గమును ప్రసాదించెను. రాఘవునిచే ప్రతిష్ఠింపబడుట వల్ల రాఘవేశ్వరస్వామిగా పిలువబడెను.

పాండవ వనవాస కాలంలో శివుడు అర్జునుని పరీక్షింపదలచి కిరాతునివేషంలో అర్జునుని ధైర్యపరాక్రమములను చూచి పాశుపతాస్త్రమును ప్రసాదించెనని, ఆయనే ఈ కాలాగ్నిరుద్రుడని మరియొక కధనముకలదు. 

7. నీలకంఠ రుద్రుడు- మొసలపల్లి ( శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి ):

దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మధన సమయంలో వెలువడిన విషవాయువులను ఎవ్వరికీ హానికలిగించకుండా చేయుటకు శివుడు తనకంఠమునందు నిక్షిప్తముచేసికొని నీలకంఠుడైనాడు. ఆగరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. తనను కొలిచినవారికి అనంతభోగాలను అందించేవాడు, మరియు అనేక భోగులను (పాములను) ఆభరణములుగా ధరించినవాడు అగుటవల్ల అనంత భోగేశ్వరస్వామిగా పిలువబడెను.

8. మృత్యుంజయ రుద్రుడు- పాలగుమ్మి (శ్యామలాంబా సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):

శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యుముఖమునుండి రక్షించి, యముని జయించి "మృత్యుంజయుడు" అయ్యెను. ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మిగ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించి చెన్నమల్లేశ్వర స్వామిగా పిలువబడెను. 

9. సర్వేశ్వర రుద్రుడు- గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత శ్రీవీరేశ్వర స్వామి): 

దక్షుని యజ్ఞంలో సతీదేవి తనతండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తనకాలితో నేలపై వ్రాయుటవల్ల ఏర్పడిన అగ్నిజ్వాలలందు కాలిబూడిద అయినపుడు శివుడు ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యముచేసి తనజటాజూటములో ఒక జటను తీసి నేలపై కొట్టుటవల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించెను. వీరభద్రుడు అపుడు దక్షయజ్ఞమును ధ్వంసముచేసెను. ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వరస్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారమునందు వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను. 

10. సదాశివ రుద్రుడు- గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):

పూర్వం బ్రహ్మవిష్ణులు తమలో ఎవరుగొప్పవారని వాదనకుదిగి శివుని వద్దకు వచ్చిరి. అపుడు శివుడు ఆద్యంతములులేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణువును తన పాదములను చూచిరమ్మని పంపెను. విష్ణువు శివుని పాదములను కనుగొనలేక తిరిగివచ్చి చూడలేకపోయితినని చెప్పెను. కాని బ్రహ్మమాత్రము శివుని శిరస్సును చూడకపోయినను ఒకఆవును, మొగలిపువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూచితినని చెప్పెను. శివునికి ఆగ్రహము వచ్చి బ్రహ్మకు పూజాపునస్కారములు లేకుండా శపించివిష్ణువే అగ్రగణ్యుడని చెప్పెను. ఆలింగధారియైన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను. 

11. శ్రీమన్మహాదేవ రుద్రుడు- పుల్లేటికుర్రు (శ్రీబాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు):

పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్రకమలాలతో సహస్రనామాలతో పూజించెను. దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించెను. ఆమహాదేవుడు పుల్లేటికుర్రు గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. పుల్లేటికుర్రు గ్రామానికి "పుండరీకపురము" అని పూర్వకాలంలో పేరు ఉండెడిది. పుండరీకము అనగా వ్యాఘ్రము(పులి) అని అర్ధము కలదు. వ్యాఘ్రేశ్వరమునందు వ్యాఘ్రేశ్వరస్వామి ఉండుటచేత ఈ గ్రామమునందు శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అనుపేరుతో పిలువబడెను.

శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈకార్తీకమాస పుణ్యదినములలో

ఏకాదశ రుద్రులకు మాకుటుంబ సభ్యులందరి తరపున శతసహస్ర వందనములు. 

ప్రతీ సంవత్సరం వలెనే ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా ఏకాదశ రుద్రుల సమూహము అత్యంత వైభవోపేతంగా ప్రభల ఉత్సవం గావించుకోబోతున్నారు అని చెప్పడానికి ఆనందిస్తున్నాను......

యావత్ కోనసీమ వాసులందరికీ జగ్గన్నతోట ప్రభల తీర్థం ముందుగానే ఆహ్వానం పలుకుతోంది....

సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అనుగ్రహ ప్రాప్తిరస్తు........ సర్వేజనాః సుఖినోభవంతు.......... సమస్త సన్మంగళాని సంతు........ స్వస్తి.


ఈ పోస్ట్ ను మనకు ఇంత విపులంగా క్షుణ్ణంగా మనందరికీ అర్ధమయ్యేలా ఏకాదశ రుద్రుల గురించి దేవాలయాల గురించి విషయ సేకరణ చేసిన వారు శ్రీ Nemani Vvsn Murty గారు...

వారి పోస్ట్ కు నా ఆలోచనలు కూడా జోడించి ఈ పోస్ట్ పెట్టడదమైనది

మహామృత్యుంజయస్తోత్రం

 మహామృత్యుంజయస్తోత్రం


రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠముమాపతిమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧ ||


నీలకంఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౨ ||


నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రదమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౩ ||


వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౪ ||


దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౫ ||


గంగాధరం మహాదేవం సర్వాభరణభూషితమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౬ ||


త్ర్యక్షం చతుర్భుజం శాంతం జటామకుటధారిణమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౭ ||


భస్మోద్ధూళితసర్వాంగం నాగాభరణభూషితమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౮ ||


అనంతమవ్యయం శాంతం అక్షమాలాధరం హరమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౯ ||


ఆనందం పరమం నిత్యం కైవల్యపదదాయినమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౦ ||


అర్ధనారీశ్వరం దేవం పార్వతీప్రాణనాయకమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౧ ||


ప్రళయస్థితికర్తారమాదికర్తారమీశ్వరమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౨ ||


వ్యోమకేశం విరూపాక్షం చంద్రార్ధకృతశేఖరమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౩ ||


గంగాధరం శశిధరం శంకరం శూలపాణినమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౪ ||


అనాథః పరమానందం కైవల్యఃపదగామినమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౫ ||


స్వర్గాపవర్గదాతారం సృష్టిస్థిత్యంతకారణమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౬ ||


కల్పాయుర్దేహి మే పుణ్యం యావదాయురరోగతామ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౭ ||


శివేశానాం మహాదేవం వామదేవం సదాశివమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౮ ||


ఉత్పత్తిస్థితిసంహారకర్తారమీశ్వరం గురుమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౯ ||


మార్కండేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ |

తస్య మృత్యుభయం నాస్తి నాగ్నిచౌరభయం క్వచిత్ || ౨౦ ||


శతావర్తం ప్రకర్తవ్యం సంకటే కష్టనాశనమ్ |

శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకమ్ || ౨౧ ||


మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతమ్ |

జన్మమృత్యుజరారోగైః పీడితం కర్మబంధనైః || ౨౨ ||


తావకస్త్వద్గతః ప్రాణస్త్వచ్చిత్తోఽహం సదా మృడ |

ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యమనం జపేత్ || ౨౩ ||


నమః శివాయ సాంబాయ హరయే పరమాత్మనే |

ప్రణతక్లేశనాశాయ యోగినాం పతయే నమః || ౨౪ ||

దశావతారాల ఆవిర్భావం

 🙏దశావతారాల ఆవిర్భావం ఏమాసాలలో జరిగింది వారిజయంతి వివరాలు...🙏


🙏1 మత్స్యజయంతి ;- చైత్ర శుద్ధ పంచమి అపరాహ్నంలో విష్ణువు మత్స్యావతారంగా అవతరించాడు.(ఎప్రియల్ లో వస్తుంది)🙏


🙏2 కూర్మజయంతి ;- జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజు ప్రదోషవేల కూర్మావతరం జరిగింది.(జూన్ లో వస్తుంది)🙏


3 వరాహ జయంతి;- చైత్ర శుద్ధ నవమి అపరాహ్నంలో అంటే మాధ్యాహ్నంకాలంలో జరిగింది.


4 నరసింహ జయంతి ;- వైశాఖ శుద్ధ త్రయోదశి ప్రదోష కాలంలో జరిగింది🙏


🙏5 వామన జయంతి;- భాద్రపద శుద్ధ ద్వాదశి మధ్యాహ్నంలో అభిజిత్ లగ్నంలో జరిగింది🙏


🙏6 పరుశురామ జయంతి;- వైశాఖ శుద్ధ తదియనాడు సాయంకాలం 6 నుండి 9 గంటల మధ్య జరిగింది🙏


🙏7 శ్రీరామ జయంతి ;- (శ్రీరామనవమి)శ్రీరాముడు పుట్టింది చైత్ర శుద్ధ నవమి మధ్యాహ్నాం 12 గంటలకు కర్కాటలగ్నంలో పునర్వసు నక్షత్రంలో 5 గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండగా జన్మిచాడు కావున శ్రీరామ నవమి ఎప్రియలో ఆచరించాలి.🙏


🙏8బలరామ జయంతి;- భాద్రపద శుద్ధ తదియ నాడు మధ్యాహ్నం అవతారం జరిగింది🙏


🙏9 శ్రీకృష్ణ జయంతి ;- శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి మధురలో రోహిణి నక్షత్రం వృషభలగ్నంలో జరిగింది(19-7-3227 బి .సి)🙏


🙏10 బుద్ధజయంతి వైశాఖ శుద్ధ పూర్ణమి నాడు జరిగింది🙏


🙏11 కల్కిజయంతి;- వైశాఖ శుద్ధ తదియ ప్రదోష సమయంలో కల్కి అవతారము జరిగింది ఆధార గ్రంధము సూర్య సిద్దాంతము.( ఇది ఈ గ్రంథ ఆధారంగా చెప్పబడినది కానీ ఈ ప్రస్తావన ఇంక ఎక్కడా లేదు).🙏


శుభోదయం🌹🌹🌹

చర్మరోగాలు

 సాధారణ చర్మరోగాలు నశింపచేయు సులభ యోగాలు  -


 *  వావింటి చెట్టు సమూలం నీటిలో నూరి ముద్దచేసి నువ్వుల నూనె లో ఉడికించి ఆ నూనెని రాయుచున్న సాధారణ చర్మరోగాలు అన్నియు నశించును.


 *  వేపచెట్టు బెరడు కషాయం సేవించుచున్న చర్మరోగాలు నయం అగును.


 *  మెట్టతామర ఆకు పసరు , నిమ్మకాయ రసం కలిపి పూసిన సాధారణ చర్మరోగాలు నయం అగును.


 *  నేలవేము కషాయం సేవించుచున్న సాధారణ చర్మరోగాలు తగ్గును.


 *  మోదుగ విత్తనాలు నిమ్మరసంతో కలిపి అరగదీసిన సాధారణ చర్మరోగాలు నయం అగును.


 *  నల్ల ఉమ్మెత్త రసం రాసిన చర్మరోగాలు నయం అగును.


 *  కొబ్బరినూనెలో గంధకం పొడిని కలిపి పూసిన చర్మరోగాలు నశించును.


 *  పచ్చగన్నేరు వేరు పైన చర్మం నేతిలో వేసి కాచి ఆ తైలమును రాసిన చర్మవ్యాదులు నశించును.


 *  ఎర్రగన్నేరు వేరు నేతిలో వేసి మరిగించి ఆ తైలమును పూసిన చర్మరోగాలు నయం అగును.


 *  కసివిందాకు రసం రాసిన గజ్జి , చిడుము వంటి చర్మరోగాలు నివారణ అగును.


 *  జిల్లేడాకు రసం, ఆవనూనె , పసుపు కలిపి రాయుచున్న చర్మరోగాలు నశించును.


 *  నల్లజీలకర్ర, నీలి ఆకులు మెత్తగా నూరి చర్మంపైన పూయుచున్న చర్మరోగాలు నశించును.


 *  పనస చెట్టు ఆకులు నూరి చర్మవ్యాధులు పైన రాయుచున్న చాలా రకాల చర్మవ్యాదులు నశించును.


 *  తాటి కల్లుతో బియ్యపు పిండి కలిపి పులియబెట్టి వ్రాస్తుంటే దూరదతో ఉండే చీముపొక్కులు నశిస్తాయి . 


      పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా అనిపిస్తే దానిని ప్రయత్నించండి. నా గ్రంథాలలో ఇంకా వివరణాత్మకంగా ఇచ్చాను. ప్రతివ్యాధికి హెడ్డింగ్ పెట్టి కింద చిట్కాలు ఇచ్చాను.


    

    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

అవయవాల..గ్రహాల ప్రభావం

 మనుష్య శరీర అవయవాల పైన ఉండు గ్రహాల ప్రభావం  -


      మన యొక్క శరీరంలో అయస్కాంత క్షేత్రాలు ఉన్న విషయం ఇటు భారతదేశంలోనే కాక పాశ్చాత్య శాస్త్రవేత్తల పరిశోధనలో కూడా తేలింది. మనిషి మెదడులో మాగ్నటిక్ శక్తి విడుదల అవుతుంది అని లండన్ లొని డాక్టర్లు పరిశోధించి తేల్చారు. మనదేశంలో కూడా పూనాలోని డాక్టర్ ఖరే గారి పరిశోధన గురించి దూరదర్శన్ లో కూడా చూపించారు. డాక్టర్ ఖరే గారు పరిశోధించి మనిషి మెదడు, గుండె, కాలేయం మొదలయిన అవయవాలన్నిటికి అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయి అని నిరూపించడమే కాకుండా వాటిని కొలిచే పరికరం కూడా తయారుచేశారు.


                 యోగశాస్త్రం వివరించే మూలాధారం వంటి చక్రాలు కూడా మనిషి శరీరంలో ఇమిడి ఉన్న అయస్కాంత శక్తి కేంద్రాలు మాత్రమే .ఈ విధంగా అయస్కాంత శక్తి నిలయం అయిన మానవ శరీరం వివిధ గ్రహాల నుంచి వస్తున్న విద్యుతయస్కాంతాల తరంగాల వైబ్రేషన్లకు అనుగుణంగా మార్పుచెందును. 


             ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు వివరిస్తాను. జ్యోతిష్య శాస్త్రంలో తెలిపినట్లు చంద్ర కుజుల వలన స్త్రీల ఋతుధర్మం , గురుని వలన కాలేయం , రవి వలన హృదయము , బుధుని వలన నరములు , శుక్రుని వలన మూత్రపిండములు ప్రభావితం అవ్వడం గురించి మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు . పైత్యరసం పసుపు రంగులో ఉండటం కూడా గురుని ప్రభావం అని ఎప్పుడో నిరూపితం అయింది. చంద్రుని యొక్క ప్రభావం గర్భాశయం పైన , ప్రసవం పైన ఉంటుంది అని నిరూపితం అయిన విషయమే. అక్కడివరకు ఎందుకు మనపెద్దవారు పౌర్ణమి నాడు పిచ్చి ఎక్కువ అవుతుందని అమావాస్యకు తగ్గుతుంది అని ఎప్పుడో చెప్పారు . ఆ తరువాత అమెరికా వారు ఎన్నో రోజులు పరిశోధించి అది నిజమే అని ఒప్పుకున్నారు. శరీరంలోని సంపూర్ణ ద్రవ మరియు పార్షిక ద్రవ పదార్ధాలు ఏవైతే ఇనుమును కలిగి ఉన్నాయో అవన్ని చంద్రుని ఆకర్షణ శక్తికి లోనవుతున్నాయి అని అట్టి చర్యల వలన మానసిక భావోద్రేక సమస్యలకు మనుష్యుడు లోనవుతున్నాడు అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు .


         బృహజ్జాతకం వంటి పురాతన జ్యోతిష్య గ్రంథాలను పరిశీలిస్తే గర్భస్థ శిశువు పిండం దశ నుండి ప్రసవం వరకు ఏ గ్రహం వలన ఏయే అవయవాలు ఏర్పడుచున్నవో కూడా వివరణ ఇవ్వబడుచున్నది. పాతకాలంలో చాలా మంది వైద్యులకు జ్యోతిషం తెలిసి ఉండేది. రోగము కనపడిన రోజు నక్షత్రమును బట్టి ఆ రోగం ఎన్ని రోజులకు పోతుందనే లెక్కలు ఆయుర్వేద గ్రంథాలలో కనిపిస్తాయి.


       ఇప్పుడు మీకు మనిషి శరీరంలోని ఏయే అవయవాల పైన ఏయే గ్రహాల ప్రభావం ఉంటుందో ఇప్పుడు మీకు తెలియచేస్తాను.


 రవి  -


   రక్తం, గుండె , పురుషుల కుడికన్ను , స్త్రీల ఎడమకన్ను.


 చంద్రుడు  -


   స్తనములు, పాలు , గర్భాశయం, ప్రసవం, లింఫ్ గ్రంథులు, పురుషుల ఎడమ కన్ను, స్త్రీలకు కుడికన్ను , అండములు , కడుపు, ఆహారనాళం .


 కుజుడు  -


    ఎముకలలోని మజ్జ, కండరములు, బాహ్య జననేంద్రియములు, మూత్రకృచ్చం .


 బుధుడు  -


    మెదడు, శరీరంలోని నరాలు అన్ని బుధుడుకి సంబంధించినవి . చర్మము, నాలుక , వోకల్ కార్డు నరాలు , స్వరపేటిక, మాటలు , తెలివితేటలు .


 గురుడు  -


     కాలేయం, గాల్ బ్లాడర్ , సంతానం దాని ఉత్పత్తికి సంబంధించిన భాగాలు , శరీరంలోని కొవ్వు, కఫం, తొడలు, మూత్రపిండాలు.


  శుక్రుడు  -


     వీర్యము, లోపలి జననేంద్రియాలు , కామమునకు సంబంధించిన అన్ని అవయవములు, మూత్రపిండములు, శరీరంలోని గ్లూకోజ్ , పాంక్రీయాస్ , శరీరంలోని నీరు , రతిక్రియ , యోని లొపలి భాగములు .


  శని  -


     ఎముకలు, చర్మం, విసర్జన కార్యము , మలము , గుదము , రెక్టమ్ , చెమట , గోళ్లు , శరీరం పైన గల వెంట్రుకలు , పెద్దప్రేగులు , వాతం .


         పైన చెప్పిన విధంగా ఆయా అవయవాల పైన ఆయా గ్రహాల ప్రభావం ఉంటుంది.  


   

    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

స్వర్ణభస్మం

 స్వర్ణభస్మం ఉపయోగాలు  - సంపూర్ణ వివరణ . 


      కొన్నిరకాల వ్యాధులలో మరియు కొన్ని మొండి జబ్బులలో ఔషధాలుగా మూలికలు కు బదులుగా భస్మాలు ఉపయోగించడం జరుగుతుంది. వీటి ఫలితం కొన్ని సమయాలలో ఎలా ఉంటుంది అంటే అల్లోపతి వైద్యవిధానంలో ఇంజక్షన్ మందు పనిచేసే సమయంకంటే లోపలే ఈ భస్మ ఔషధం అత్యంత వేగంగా ఫలితాన్ని ఇవ్వగలదు . 


                 ప్రస్తుత పరిస్థితులలో కూడా ఇంకా భస్మాలు తయారు చేసే ప్రక్రియ మరియు తయారుచేసే వ్యక్తులు ఇంకా ఉన్నారు . మూలికలు ఉపయోగించి ఔషదాలు తయారు చేసే ప్రక్రియకు పూర్తి బిన్నదిశలో ఈ భస్మ తయారి ప్రక్రియ ఉంటుంది.  


    మొదట మనం తయారు చేయాలి అనుకుంటున్న భస్మానికి మూల ధాతువుని సేకరించుకోవాలి . ఉదాహరణకి చెప్పాలంటే స్వర్ణభస్మ తయారి విధానం గురించి మీకు వివరిస్తాను .


         మంచి స్వర్ణపు రేకులను సేకరించుకొనవలెను . అది అత్యంత స్వచ్ఛమైనది అయి ఉండవలెను . ఆ రేకులను మొదట కాల్చి నువ్వులనూనె , పుల్లటి మజ్జిగ , ఉలవ కట్టు , ఆవుపంచితం వీనిలో 7 పర్యాయములు వేసిన శుద్ది అగును. లేదా ఎర్రటి ముండ్ల తోటకూర నూరి ఆ రసము నందు బంగారు రేకులను 2 దినములు నానబెట్టినను స్వర్ణం శుద్ది అగును. 


                   ఆ విధంగా శుద్ది అయినటువంటి స్వర్ణపు రేకులను చిన్న కుండ యందు ఉంచి పైన ఒక మట్టిచిప్ప బోర్లించి లోపలికి వాయుప్రసారం జరగకుండా చుట్టూ చీల మన్ను ఉపయోగించి సీలు వేయవలెను . దానిని నడుము వరకు తీసినటువంటి గొయ్యి మధ్యభాగం నందు ఉంచి అన్నివైపులా సెగ తగిలేవిధంగా చుట్టూ ఆవుపిడకలని పేర్చుకుంటూ రావలెను . ఆ పిడకల సంఖ్య 500 వరకు ఉండవలెను . దీనినే ఆయుర్వేద పరిభాషలో            " గజపుటం " అంటారు . 


                 ఈ విదంగా అన్నివైపుల సమానంగా పేర్చిన తరువాత మన ఇష్టదైవాన్ని మరియు ధన్వంతరిని ప్రార్ధించి ఒక క్రమ పద్దతిలో ఆ పిడకలని వెలిగించవలెను . ఆయొక్క పిడకల వేడికి లోపల ఉన్నటువంటి స్వర్ణపు రేకులు భస్మంగా మారతాయి.  ఆ తరువాత దానిని జాగ్రత్తగా సేకరించుకుని తగిన మోతాదుల్లో ఔషదాల్లో వాడుకోవచ్చు .  ఇది అత్యద్బుతంగా పనిచేయును . తరుచుగా కొన్ని ప్రత్యేక ఔషధాలలో నేను దీనిని వాడుతాను. 


            దీనిని ఉపయోగించుట వలన త్రిదోషములు అనగా వాత ,పిత్త ,కఫములు దోషం పొందడం వలన కలుగు వ్యాదులను పొగొట్టును. ముఖ్యంగా వాతవ్యాధులను హరించుటలో చాలా ఉపయోగపడును. లొపలికి తీసుకోవడడం వలన నేత్రవ్యాధులను హరించును . ఆయుషుని వృద్ధిపరుచును. బుద్దిని పెంచును. నేను ఇప్పటివరకు దీనిని చాలా రోగాలపై ప్రయోగించి విశేషమైన ఫలితాలు పొందాను. క్షయరోగం నివారించుటలో ఇది నాకు చాలా సహాయపడింది.  అజీర్ణం వలన కలుగు జ్వరాన్ని నివారించును. ఎంతో బలమైన ఔషదాలు వాడినను తగ్గని మొండి వ్యాదులను ఈ స్వర్ణభస్మ సేవన వలన తగ్గించవచ్చు.  


     

                  విషము తిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ముందు తామ్రభస్మంతో ముందు వాంతిని చేయించి  ఒక పావుతులం స్వర్ణ భస్మమును లొపలికి ఇచ్చిన విషము కంటే వేగముగా హృదయమును చేరి హృదయం నకు విషమును చేరకుండా అడ్డుకొనును . కాని పావుతులం ఒకేసారి ఒక్క మోతాదుగా ఇవ్వవలెను . 


              ఈ స్వర్ణభస్మముని 10 గ్రాములను 60 మోతాదులుగా లేదా 100 మోతాదుగా విభజించి వాడుకోవచ్చు . దీనిని ఎంత పెద్ద మోతాదులో వాడినను ఎటువంటి విపరీత పరిణామాలు సంభవించవు. మీకు ఎటువంటి సమస్యలు లేకున్నను ధనమును ఖర్చుపెట్టగలవారు వాడుకొనవచ్చు. 


          మంచి ఆరోగ్యం , మేధాశక్తి, హృదయమునుకు బలమునిచ్చును. రక్తపోటు వ్యాధి ఉన్నవారు దీనిని వాడటం వలన మంచిఫలితాన్ని పొందవచ్చు. ఇది పూర్తిగా రసాయన ఔషదం దీనిని ఉపయోగించువారికి పెట్టుడు మందులు మరియు విషములు వారిపై పనిచేయవు.  ఆపకుండా 20 సంవత్సరములు ఉపయొగించువారికి "కాయసిద్ధి " కలగచేయును . అనగా వయస్సు పెరుగుతున్నా ముసలి లక్షణములు కలగవు. 


           ఈ స్వర్ణభస్మానికి మరికొన్ని భస్మాలు కలిపి మధుమేహరోగులు తీసుకోవచ్చు. ఈ స్వర్ణభస్మ సేవించడం వలన మధుమేహ రోగులలో అంతర్గత అవయవాలు మధుమేహం పెరగటం వలన దెబ్బతినకుండా కాపాడవచ్చు. అదేవిధముగా స్త్రీలకు , పిల్లలకు లేహ్యాలలో కలిపి ఇవ్వడం ద్వారా వయస్సురీత్యా వచ్చు హార్మోనల్ సమస్యలకు మరియు శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందించుటకు అద్భుతముగా పనిచేయును . పిల్లలకు మంచి తెలివితేటలు కలుగును. మేధస్సు పెరుగును . శరీరదోషాలు పోగొట్టును. 


           మరికొన్ని ఉపయోగాలు కూడా మీకు వివరిస్తాను.


   *  స్వర్ణభస్మం త్రిదోష జనితవ్యాధులను పోగొట్టును . విశేషముగా వాతవ్యాధులను హరించును . 


 *  శరీరం నందలి వాత, పిత్త , శ్లేష్మాలను సమానస్థితి యందు ఉంచును. 


 * వీర్యమును అభివృద్ది చేయును . బలాన్ని కలిగించును. గొప్ప రసాయనఔషధము . 


 * స్వర్ణసేవన వలన నేత్రరోగములు హరించి నేత్రాలకు బలము కలుగును. 


 *  ఆయుష్షుని పెంచడంలో దీనికిదే సాటి . ఆయువుని వృద్ధిచేయు ఔషధములు లోకము నందు బహు అరుదుగా ఉన్నవి. ఆ ఔషధములలో స్వర్ణభస్మం ప్రధానమైనది. 


 *  ఇది అత్యంత శ్రేష్టమైనది  బుద్ధిబలాన్ని , జ్ఞాపకశక్తిని , ఆలోచనాశక్తిని అనగా బుద్ది , స్మృతి , మతిని కలిగించును. 


 *  ఉన్మాదం వంటి మానసిక రోగములను పోగొట్టును . 


 *  రక్తాన్ని  శుభ్రపరచును. శరీరకాంతి కలిగించును. 


 *  పాపము వలన సంక్రమించు రోగములను పోగొట్టు శక్తి కలిగినది . 


 *  క్షయరోగమును పోగొట్టటంలో శక్తివంతముగా పనిచేయును . 


 *  వ్యాధివలన కాని లేక మరేదైనా కారణం వలన శరీరం చిక్కిపోయినవారికి శరీరాన్ని బాగుచేసి కండపుష్ఠి కలిగించును. 


 *  రక్తము నందలి , ఉపిరితిత్తుల యందలి క్రిములను నాశనం చేయును . 


 *  జ్వరములను హరించును . 


 *  ఇతర ఔషధముల వలన తగ్గని మొండివ్యాధులు ఈ స్వర్ణభస్మ సేవన వలన తగ్గును . 


 *  పంచకర్మలు చేసినప్పుడు ఇది ఉపయొగించవలెను . 


 *  స్వర్ణభస్మ సేవన చేయువానికి పెట్టుడు మందులు , విషాలు ఎక్కవు. 


 * ఇది ఎంత పెద్ద మోతాదు వాడినను ప్రమాదము లేదు . వ్యాది బలాన్ని అనుసరించి 1 తులము 60 మోతాదుల నుండి 100 మోతాదులుగా వాడుకోవచ్చు . 


.*  శరీరం నందలి కండరాలు , ఎముకలు , నరాలకు అత్యంత శక్తికి ప్రసాదించును. 


 *  రక్తపోటు ( BP ) సమస్య నివారించును . 


 *  ఇది ఆపకుండా వాడిన ముసలితనమును దగ్గరకు రానివ్వదు. సమస్త  వాతరోగములను హరించును . 


       పైన చెప్పిన యోగాలు మాత్రమే కాకుండా మరికొన్ని ఔషధాలలో స్వర్ణాన్ని కలపడం ద్వారా ఔషధ బలం పెరిగి ఫలితం త్వరగా రావటం నేను గమనించాను. స్త్రీలకు , పిల్లలకు దీనికి మూలికాలేహ్యములలో కలిపి ఇవ్వవచ్చు. ముఖ్యముగా స్త్రీలలో గర్భశయ దోషాలు , నెలసరి సమస్యల నివారణ జరిగింది. ముత్యభస్మమునకు దీనికి కలిపి ఇవ్వడం వలన స్త్రీలలో శరీరబలం పెరిగి స్త్రీలు ఎదుర్కొనే క్యాల్షియం సమస్య నివారణ అగును. శరీరకాంతి పెరుగును . ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో శిశువుకు చేయు స్వర్ణప్రాసన గురించి చాలా చక్కగా వివరించారు . పుష్యార్కయోగం అనగా గురువారం పుష్యమి నక్షత్రం లేదా ఆదివారం పుష్యమి నక్షత్ర సమయాన శిశువునకు స్వర్ణప్రాసన చేయించవలెను . 


            స్వర్ణప్రాసన అనగా ప్రస్తుతం చేతికి ఉన్న ఉంగరం తీసి శిశువు నాలికమీద రాస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. ఒక గుండుపిన్ను లేదా ఏదైనా సన్నటి వస్తువు తీసుకుని తేనె తగిలించి ఆ తరువాత ఆవునెయ్యి తగిలించి తరువాత స్వర్ణభస్మానికి తగిలించి అప్పుడు శిశువు నాలిక మీద అంటించి లొపలికి ఇవ్వవలెను. కొన్ని ఆయుర్వేద గ్రంథాలలో తల్లి కడుపు నుంచి శిశువు బయటకి వచ్చిన తరువాత శుభ్రపరచి తేనెతో  పాటు స్వర్ణభస్మాన్ని నాలికపైన రాయవలెను అని ఉన్నది. ఈ స్వర్ణభస్మం నిత్యం పిల్లలకు వాడించుచున్న బ్రహుస్పతితో సమానమైన తెలివితేటలు కలవారు , ఏకసంధాగ్రాహుకులుగా తయారగును . 


         ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి రోగనిరోధకశక్తి అత్యంత అవశ్యము.  రోగనిరోధకశక్తి పెరగడానికి స్వర్ణభస్మ సేవన చేయుట అత్యంత ప్రధానం. ఈ స్వర్ణభస్మం కొంచం ఖరీదు ఎక్కువుగా ఉండును. అవకాశం ఉన్నవారు , ధనమును వెచ్చించ గలిగినవారు తప్పక స్వర్ణభస్మ సేవన చేయదగిన సూచన . అనుభవ వైద్యుల సలహా ప్రకారం మాత్రమే వాడగలరు . 



 గమనిక  - 


        ఈ స్వర్ణభస్మాన్ని సరైన ఆయుర్వేద వైద్యుల చేత చేయించుకోండి. ఖరీదు ఎక్కువగా ఉండును. 


  


  గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు