14, జనవరి 2025, మంగళవారం

తిరుప్పావై 30వ పాశురం*

 *తిరుప్పావై 30వ పాశురం*

🕉🌞🌏🌙🌟🔥

🔥🕉🌞🌏🌙🌟


*30.పాశురం*


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


       *వఞ్గక్కడల్ కడైన్ద మాడవనై క్కేశవనై*

        *త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళ్ళై యార్ శేన్ణిఱైఞ్ఙి*

     *అఞ్గప్పఱైకొణ్ణవాత్తై, యణిపుదువై*        *పైఙ్గమలర్ త్తణ్దెరియల్ పట్టర్ పిరాన్ కొదైశొన్న*

        *శజ్ఞత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే*

        *ఇఙ్గిప్పరిశురైప్పా రీరిరణ్దు మాల్వరైత్తోళ్*

        *శేఙ్గిణ్ తిరుముగత్తు చ్చెల్వ* *త్తిరుమాలాల్*

        *ఎఙ్గమ్* *తిరువరుళ్ పెత్తుఇంబరువరెమ్బావాయ్*

        *ఆణ్దాల్ తిరువడిగళే శరణమ్!!*


*ॐॐॐॐॐॐॐ*


*భావం*   

 

*ॐॐॐॐॐॐॐ*


ఓడలు గల పాల సముద్రమును దేవతలకోసం మధించి, వారికి అమృతాన్ని ప్రసాదించినవాడును, బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణుని చంద్రముఖిలైన గోపికలు ఆలంకృతులై చేరి, మంగళాశాసనము చేసి, గోకులమునందు 'పఱై' అను వంకతో స్వామీ కైంకర్యమును పొందారు.


వీరు పొందిన యీ కైంకర్య విధమునంతను అలంకారమైన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించినట్టియును, తామర పూసల మాలలను ధరించిన పెరియాళ్వార్ల (విష్ణుచిత్తుల) పుత్రికయైన గోదాదేవి (అండాళ్ తల్లి) సాయించింది. ఇది గోపికలు గుంపులు గుంపులుగ కూడి అనుభవించిన ప్రబంధమై, ద్రావిడ భాషలో పాశుర రూపంగా ప్రవహించింది.


ఈ ముప్పది పాశురాలను ఒక్కటిని కూడా విడువకుండ యీ సంసారమున అనుసంధించువారు గొప్ప పర్వతవలెనున్న నాల్గు భుజములును ఆశ్రిత వాత్సల్యముచే ఎఱ్ఱబారిన కనుదోయిగల శ్రీముఖమును. ఉభయ విభూతి ఐశ్వర్యములందునుగల శ్రియ: పతియొక్క సాటిలేని దివ్య కృపను పొంది, బ్రహ్మనందముతో కూడినవారై యుండగలరు.


 శ్రీ గోదా రంగనాథుల అవ్యాజకృపచే యీ 'తిరుప్పావై' ద్రవిడ దివ్య ప్రబంధమును తెలుగున' శ్రీసూక్తిమాలికగా ప్రవహింపచేసి పాడించుకున్న వారి దివ్యవాత్సల్యమునకు యీ దాసుడు రంగనాథుడు ఆజన్మ కృతజ్ఞతాంజలులు ఘటిస్తున్నాడు.


        *శ్రీ సూక్తి మాలిక సంపూర్ణమ్*   

        *శ్రీ అండాళ్ దివ్య తిరువడిగళే శరణమ్*


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


*అవతారిక*

 *ॐॐॐॐॐॐॐॐॐॐ*


గోదాదేవి -- గోపికలు ఆచరించిన వ్రతమును తానూ అనుకరించి వ్రతసమాప్తి చేసి, వ్రత ఫలమును తాను కూడా పొందినది. శ్రీకృష్ణసమాగమును ఆనాడు గోపికలు పొందినట్లే మన గోదాదేవి తన ప్రియతముడగు శ్రీరంగనాథుని భర్తగా పొందినది.


శ్రీరంగము నుండి శ్రీరంగనాథుడు వ్రతసమాప్తి సమయమునకు తమ అంతరంగభక్తులను ఆండాళ్ తల్లి ఉన్న శ్రీవిల్లిపుత్తూరునకు పంపి ఆమెను శ్రీరంగమునకు తోడి తెమ్మని ఆజ్ఞాపించెను. అంత శ్రీభట్టనాథులు వారి శిష్యులుగా వల్లభరాయలతో సహా శ్రీరంగమునకు ఆండాళ్ తల్లిని తీసుకొని వెళ్ళెను.


 అచ్చట స్వామి శ్రీరంగనాథుడు అందరి సమక్షమున శ్రీగోదాదేవిని తమతో చేర్చుకొనెను. అందుచేతనే గోదా - శ్రీరంగనాథ కళ్యాణ దినమునకు 'భోగి' అను వ్యవహారము కలిగెను. భోగము అనగా పరమాత్మానుభవమే. దానిని పొందిన దినము అగుటచే *భోగి* అనుట ఈ పండుగకు సార్థకము. 


ఈ వ్రతము అందరు ఆచరింపదగినది. ఈ వ్రతమును ఆచరింపలేకపోయినను, నిత్యము ఈ ముప్పది పాశురములు తప్పక అభ్యాసము చేయు వారికి కూడా తాను వ్రతము చేసి పొందిన ఫలము లభింపవలెనని గోదాదేవి ఈ పాశురమున ఆశించుచున్నది. 


గోదాదేవి తాను గోపికగానే వ్రతము చేసినది. ఫలము భగవత్ప్రాప్తి. అట్టి భగవానుడే అమ్మవారిని పొందుటకై చేసిన యత్నము పాలసముద్రమును ఆనాడు మధించుటలో కాననగును.


అందుచే మనము స్వామిని పొందవలెనని ప్రయత్నము చేయుటకంటే, స్వామియే మనను పొందుటకు ప్రయత్నము చేయునట్లు ఆనాటి అమృతమథన వృత్తాంతము ఇందు కీర్తించుచున్నారు. ఈ ముప్పది పాశురములు పఠించినవారిని ఆనాడు పాలసముద్రమును మథింప చేసి లక్ష్మిని పొందినట్లు సర్వేశ్వరుడు తనంత తానే ప్రయత్నించి పొందును. 

ఈవిధంగా ఈ పాశురమున  

ఫలశృతి చెప్పబడినది.      


ఇది ధనుర్మాస వ్రతంలోని 30వ (మాలిక) ఈ వ్రతాన్ని చేసినవారికి లభించే ఫలాన్ని గూర్చి వివరించిన మాలిక. ఎన్నడో ద్వాపర యుగంలో వ్రేపల్లెలోని గోపికలాచరించిన కాత్యాయనీ వ్రతాన్ని శ్రీ అండాళ్ తల్లి కలియుగంలో తానాచరించి తరించింది. ఈ 30 రోజుల వ్రతానుష్టానం వలన _ భక్తి ప్రవత్తులతో భగవంతుని సాన్నిధ్యాన్ని పొందవచ్చునని నిరూపించింది తల్లి.


అత్యంత నిష్టతో ఆచరించిన యీ వ్రతంవలన అజ్ఞానులు సైతం భగవత్సాక్షాత్కారాన్ని పొందగలరని నిరూపించింది. తాను అనుసరించి, యితరులచే అనుసరింపచేసి మార్గదర్శుకురాలై, ఆచార్య పురుషకారాన్ని వహించి మనబోటివారలను తరింపచేయ సమకట్టి, తల్లి మనకనుగ్రహించినదీ వ్రతాన్ని. ఈ 'తిరుప్పావై' దివ్య ప్రబందాన్ని అనుసంధించి మనమూ తరిద్దాం! అమ్మ ఋణాన్ని తీర్చుకొందాం శ్రీ సూక్తి మాలికలు పాడుకుందాం!


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


*శంకరాభరణము _ ఝుంపెతాళము*

    

*ॐॐॐॐॐॐॐॐॐॐ*


ప.     శ్రీసూక్తి మాలిక! ఆనంద డోలిక!

        కేశవుని వ్రతకల్ప ద్రవిడ సుమ మాలిక!

        

    అ..ప..    పాశురపు పేటిక ముప్పదుల కానుక!

        ఆశువుగ గోదపాడిన గీతమాలిక!

    

    1. చ..    పాలకడలిక ఓడలున్నను సురలకై

        లీలగ మధించిన కేశువుని జేరి 

        గొల్లెతలు చంద్రముఖులా యలంకృతులు 

        నల్లనయ్యకు కృపా పాత్రులైన విధమ్ము

        ఉల్లమలరగ గోద గీతముల పాడినది

        శ్రీ సూక్తి మాలిక......


    2.చ..    ఈ పాశురమ్ములను ముప్పదిని విడువక 

        గోపాల సన్నిధిని నిత్యమనుసంధింప

        గోపదేవుని పూర్ణా కృపగల్గు గాక! యని 

        గోపతిని కొలిచిన విష్ణుచిత్తుని తనయ

        శ్రీ పాదములే మనకు శరణమని చూపినది.

        శ్రీ సూక్తి మాలిక! ఆనంద డోలిక!

        కేశవుని వ్రతకల్ప ద్రవిడమును మాలిక!


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


    *పుష్పములతో ఈ క్రింది కృష్ణాష్టోత్తర, గోదాష్టోత్తర శతనామములు చెప్పుచూ హృదయమును పుష్పమును చూపిస్తూ దానియందు ప్రేమనింపి అర్చన చేయాలి* 

 

*ॐॐॐॐॐॐॐॐॐॐ*


ఓం   కేశవాయ నమః            

ఓం   నారాయణాయ నమః    

ఓం వాసుదేవాయ నమః

  ఓం ప్రధ్యుమ్నాయ నమః

ఓం  మాధవాయ నమః          

 ఓం అనిరుద్దాయ నమః

ఓం  గోవిన్డాయ నమః             

ఓం పురుషోత్తమాయ నమః

ఓం విష్ణవే నమః                  

ఓం అధోక్షజాయ నమః

ఓం మధుసూదనాయ నమః   

 ఓం నారసింహియ నమః

ఓం  త్రివిక్రమాయ నమః          

ఓం అచ్యుతాయ నమః

ఓం వామనాయ నమః          

 ఓం జనార్దనాయ నమః

ఓం శ్రీ ధరాయ నమః              

ఓం ఉపేంద్రాయ నమః

ఓం హృషీకేశాయ నమః          

 ఓం హరయే నమః

ఓం పద్మనాభాయ నమః          

ఓం శ్రీ కృష్ణాయ నమః

ఓం దామోదరాయ నమః          

ఓం  సంకర్షణాయ నమః


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


*మంచి మార్గంలో అడుగు పెట్టడం - సంక్రాంతి*

*ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం*     


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


తిరుప్పావై ముప్పైవ రోజు సంక్రాంతి. సంక్రాంతి మన దక్షిణ దేశం వారికి ముఖ్యమైన పండగ.

 మన వాళ్ళంతా ఆనందంతో ఉత్సాహంతో ఒక పెద్ద పండగ చేసుకుంటారు. ప్రకృతిలో వసంత ఋతువు ఆహ్లాదాన్ని ఇచ్చినా, ఈ కాలం మనకు పంటలతో ఒక నిండు తనాన్ని కల్గించే కాలంగా మనం అనుభవిస్తుంటాం.


నెలరోజులు ధనుర్మాస వ్రతం ఆచరించిన గోదాదేవి, తనను ఒక గోపికగా భావించి శ్రీరంగంలో వేంచేసి ఉన్న శ్రీరంగనాథుణ్ణి వివాహమాడాలని అనుకుంది. తత్ ఫలితంగా శ్రీవిల్లిపుత్తూర్ నుండి గోదాదేవిని రప్పించుకొని శ్రీరంగనాథుడు విగ్రహస్వరూపంతోనే వివాహమాడాడు. గోదాదేవి వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి పొందిన రోజుని భోగి అంటారు.


రంగనాథుణ్ణి భోగరంగడు అని అంటారు. భగవంతుణ్ణి వివాహమాడి వైభోగ్యాన్ని పొందింది కనుక ఆ రోజుకి భోగి అని పేరు. భోగి దాటిన మరునాడే సంక్రాంతి. తరువాత రోజు కనుమ. ఈ మూడు రోజులు కలిపితే ఒక అందమైన పండగ. 


దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణం వస్తుంది. దక్షిణాయనం దేవతలు రాత్రి, ఉత్తరాయణం పగలు. రాత్రి మనం విశ్రాంతి తీసుకొని పగలు లోకంలో ప్రవర్తిస్తుంటాం. మనలో ఎలాగైతే పగలు ప్రవృత్తి ఇక రాత్రి నివృత్తి అయ్యినట్లుగనే దేవతలకు  ఉత్తరాయణం ప్రవృత్తి ఇక దక్షిణాయణం నివృత్తి.


 దేవతలు మేల్గాంచి ఉన్నప్పుడు మనుష్యులలో దైవీ శక్తులు మేలుకొని ఉంటాయి, దక్షిణాయనంలో  అసురీ ప్రవృత్తులు మేలుకొని ఉంటాయి. రోజులో బ్రహ్మ ముహూర్తం ఎట్లా అయితే తెల తెల వారే సమయంలో ఉంటుందో, ధనుర్మాస కాలం సత్వగుణాన్ని పెంచేదిలా ఉంటుంది, ఇప్పుడు చేసిన ఆచరణ ఏడాది కాలం మనల్ని మంచి మార్గంలో నడిచేట్టు చేస్తుంది.


ఈ భావనతోనే మనం ధనుర్మాస వ్రతం ఆచరిస్తాం. తిరుప్పావై ఒక్కో పాశురాన్ని తెలుసుకొని ఆ జ్ఞానంతో బాగుపడేట్టు మనల్ని తయారుచేసుకుంటాం, తద్వార చుట్టూ ఉండే లోకాన్ని ఎట్లా చూడాలి, మన చుట్టు ఉండే సమాజంతో ఎట్లా ప్రవర్తించాలి అనేది తెలుస్తుంది.


మనలో చక్కని సంస్కారం ఏర్పడుతుంది.  మంచి మార్గంలో అడుగు పెట్టడం అన్నమాట, క్రాంతి అంటే అడుగు పెట్టడం, సం అంటే మంచిగా అని అర్థం. ఈ రకంగా మంచిగా బ్రతకటానికి తీసుకున్న నిర్ణయం కాబట్టి అది *"సంక్రాంతి"* అయ్యింది.


సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారే సమయం కూడా, ధనుఃరాశి నుండి మకర రాశికి మారుతాడు కనుక కొందరు ఈ రోజు శుభకార్యాలు చెయ్యరు. సంక్రమణం ఏర్పడ్డప్పుడు పితృదేవతలకు తృప్తి కలిగించటానికి నువ్వులు మొదలైన వాటితో తర్పణాదులు చేస్తుంటారు.


అందుకే మరునాడు కనుమ పండుగ, తమ బంధువులను, అల్లుల్లను ఇంటికి రప్పించుకొని వివిద సత్కారాలు చేస్తారు. ఎందుకు చేస్తుంటారంటే తిరిగి గోదాదేవి ఆచరణయే కారణం. శ్రీరంగనాథుడు గోదాదేవిని వివాహమాడటంచే విష్ణుచిత్తులవారికి ఆల్లుడైయ్యాడు. శ్రీరంగంలో వివాహం జరిగి, కనుమ నాడు గోదాదేవితో కలిసి శ్రీవిల్లిపుత్తూర్ చేరి ఆరాధన అందుకున్నాడు.


ఇవన్నీ భావించి మన పూర్వులు మనకొక పండగను అందించారు. ఈ పండగలో గొబ్బిల్లను పూజిస్తారు, గొబ్బిల్లు వ్రతం ఆచరించిన గోపికల ప్రతీక. గోపికలు శ్రీకృష్ణుడిని కోరినవారు, వేరొకరు వారికి తెలియదు. శ్రీకృష్ణుడు ఏది చెబితే అది వారికి వేదం. ఆయన చెప్పినదాన్ని పాటించాలి అని కోరుకుంటారు.


ప్రతి వ్యక్తి ఈ గోపీ ప్రవృత్తితో గోదాదేవి ఎలాగైతే భగవంతుణ్ణి పొందిందో, మనంకూడా భగవత్ ప్రవృత్తి కల్గి లోకంలో ప్రవర్తించాలని తెలియడానికి మన పెద్దలు మనకు ఈ అందమైన పండగను ఏర్పాటు చేసి ఇచ్చారు.

మనం ఆచరించే ప్రతి పండగకీ పై పై కి ఆనందాన్ని ఇచ్చేవిగా అనిపించినా, దాని వెనకాతల ఆధ్యాత్మిక సందేశం మన ప్రతీ పండగలో కనిపిస్తుంది.

 


*ప్రతి పండగలో మూడు విషయాలు సూచిస్తారు.*

 

*1. ఆధ్యాత్మిక ఉన్నతి*

*2. శారీరక ఆనందం*

*3. మన దోషాలు* *తొలగటం*


మామూలుగా మనం వంట వండేప్పుడు కూరగాయలు తరిగేప్పుడో, అన్నం ఉడికించేప్పుడో మనకు తెలియకుండా కొన్ని సూక్ష్మ జీవులని సంహరిస్తుంటాం. అలా చేసినందుకు మనకు పంచ మహా పాతకాలు చుట్టుకుంటాయి అంటుంటారు. మనం అన్నం మాని నివృత్తి చేయలేం, అందుకే పంచ మహా యజ్ఞాలు చెయ్యాలని అంటారు.


అవి మనం దేవతలని ఆరాదించటం, మనకు శరీరం ఇచ్చినందుకు పితృ దేవతలను ఆరాదించటం, మన చుట్టూ ఉండే ప్రాణికోటితో భూతదయతో ప్రవర్తించటం, ధానధర్మాలు చెయ్యటం ఇలా మంచ మహా యజ్ఞాలు చెయ్యాలని అంటారు.


ఇక ఒక రైతు పంట పండించేందుకు భూమి దున్నిన మొదలుకొని, క్రిమికీటాదులని సంహారం చేస్తాడు కాబట్టి రైతు తప్పని సరి పంచమహా యజ్ఞం చెయ్యాల్సి వస్తుంది. ఇండ్లముందు వివిద ధాన్యాలను చల్లటం, ఇలా తమ వృద్దిని చూపటంతో పాటు లోపల భూత దయ ఇమిడి ఉంది. పంట ఇంటికి తెచ్చేముందు ప్రకృతి దేవతలకు ఆరగింపు చేస్తారు.


వివిద ధానధర్మాలు చెతనైనంతవరకు చేస్తారు.  బసవన్నలను సత్కరిస్తారు. రంగనాథుణ్ణి సత్కరించినట్లా అన్నట్లు తమ తమ అల్లుళ్లను సత్కరిస్తారు. అలాంటి ఈ పండగ మనలోని దోషాలని తొలగించి పుష్టిని ఇచ్చుగాక.


ఈ రోజు పాశురం ఈ దివ్య ప్రబంధాన్ని రాసిందెవరు అని తెలిపే పాశురం. ఇక ఫలశృతిని తెలుపుతుంది ఈ పాశురం. ఈ ముప్పై పాశురాలను రోజు చదవాలి, లేని పట్ల చివరి రెండు అయినా తప్పని సరి అనుసంధానం చేయాలి. ద్వాపరంలో గోపికలు ఈ వ్రతం ఆచరించి కృష్ణుణ్ణి పోందారు. కలియుగంలో గోదాదేవి ఈ వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి చేరింది.


 

 *"వంగ క్కడల్"* అలలతో కూడిన ఆ పాలసముద్రాన్ని "కడైంద" చిలికినప్పుడు  *"మాదవనై"* ఆయన లక్ష్మీదేవిని పొందినవాడైయ్యాడు. ఆయనే *"క్కేశవనై"*  కేశవుడు, అందమైన కేశపాశం కల వాడు.


దేవలోక ఐశ్వర్యాన్ని వెలికి తీయడానికి పాల సముద్రంలో మందర పర్వతాన్ని వాసుకీ అనే పాముతో దేవతలు అసురులు మైత్రితో చిలికారు. ఆనాడు స్వామి వారి మైత్రిని కాపాడటానికి ఎన్నో రూపాలు ధరించాడు. పర్వతం క్రిందకు పడి పోకుండా కూర్మంగా ఒక రూపం, పైన పర్వతం నిలిచి ఉండటానికి పైన ఒక రూపం, ఇటు  దేవతలకు అటు అసురులకు బలాన్నిచ్చేలా మరో రెండు రూపాలు ధరించాడు. కలిసి చేసే పనికి పరమాత్మ తనదిగా భావించి చేస్తాడనే దానికి ఇది నిదర్శణం.


అలా మనం కలిసి ఆచరించే తిరుప్పావైకి ఫలితం ఆయన తప్పక ఇస్తాడు. ఆలా చిలికినందుకు అమృతానికి అమృతమైన అమ్మవారిని పొంది ఆయన మాధవుడైనాడు. అసలు సాగర మధనం స్వామి జరిపింది అమ్మను తన వద్దకి చేర్చుకోవడానికే అని ఆండాళ్ అమ్మ *"మాదవనై"* అంటూ రహస్యం చెబుతుంది.


*"శేయిరైయార్"* భగవత్ కైంకర్య రూపమైన ఆభరణాలు కల *"శెన్ఱిఱైంజి"* ఆ గోపికలు *"అంగ ప్పఱై కొండవాత్తై"* చంద్రుడివలె ప్రకాశించే  *"తింగళ్ తిరుముగత్తు"*  ఆ శ్రీకృష్ణుడి దివ్య అనుగ్రహం పోందారు.


 *"అణి పుదువై"* భూమికి అలంకారమైన శ్రీవిల్లిపుత్తూర్ లో *"ప్పైంగమల త్తణ్ తెరియల్"* చల్లటి తులసి మాలను ధరించి ఉన్న *"పట్టర్బిరాన్"*  విష్ణుచిత్తుల వారి కూతురైన *"కోదై"* గోదాదేవి *"శొన్న"*  చెప్పిన *"శంగ త్తమిర్ మాలై"* తీపైన ఈ పాటల మాలయైన *"ముప్పదుం తప్పామే"* ముప్పై పాటలను, ఒక్కటీ వదలకుండా చెప్పాలి. తిరుప్పావై ఒక మాలిక కదా, మాలలో ఏ ఒక్క రత్నం లేకున్నా ఆ మాల అందం లేకుండా పోతుంది. మరియూ ఈ తిరుప్పావై భగవంతుణ్ణి చేరే క్రమమైన మెట్ల మాదిరివి, ప్రతి మెట్టూ అవసరం. *"శెంగణ్ తిరుముగత్తు"*  వాత్సల్యమైన ఆ ముఖంతో *"చ్చెల్వ త్తిరుమాలాల్"* ఉభయ విభూది అనే ఐశ్వర్యం కల నాథుడు, *"ఇంగిప్పరిశురైప్పర్"* ఆయన చల్లని చూపులు తిరుప్పావై చదివే వారిపై ఉంటాయి.


 *"ఈరిరండు మాల్ వరైత్తోళ్"* రెండు హస్తాలతో ఉన్న ఆయన నాలుగు హస్తాలు చేసుకొని  నాలుగు పురుషార్థాలను ఇస్తాడు. *"ఎంగుం తిరువగుళ్ పెత్త్"* అన్ని చోట్ల దివ్య అనుగ్రహాన్ని పొంది *"ఇన్బుఱువర్"* ఆచరించిన వారు  ఆనందాన్ని అనుభవిస్తారు.


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


*తిరుప్పావై 30వ పాశురము /అనువాద పద్యం*

*రచన* 

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి* 

*ॐॐॐॐॐॐॐॐॐॐ*


*సీసమాలిక*

*క్షీరాబ్ధి మధియించి క్షీరాబ్ధి కన్యను*

        *పత్నిగా గైకొన్న పరమ పురుష* 

*విల్లిపుత్తూరున విష్ణు చిత్తుని పుత్రి*

      *ముప్పది పాటలు మురిపమంది*

*ద్రావిడ భాషలో తన్మయముగ పాడి*

        *కృతులను వెలయించె శృతుల వోలె*

*ఏ రీతి పూజించి యీవర మందిరో*

         *తెలిసిన వారికి దివియు భువియు* 

*పర్వతశిఖరాల బాహు శిరములున్న*

       *నారాయణుని సేవ నలరు చుండ*

*శుభములు నందించి సుఖములు గూర్చును* 

      *ఆభరణములన్ని యందజేయు*

*తులసి మాలికలతో తోయజాక్షునిపూజ*

      *శ్రీపెరియాళ్వారు శ్రీలనోము* 

*తే.గీ. మంచి మాటలు మూటగా పంచినట్టి*

*శూడి కొడుత నాంచారుకు శుభము గలిగె*

*వ్రతము చేసిన వారికి వారిజాక్షు*

*సుఖము సౌభాగ్య సంపదల్ శుభము లిచ్చు*

 *శ్రద్ధ భక్తులు కల్గించి బుద్ధినిమ్ము*

*శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!*!


🕉🌞🌎🌙🌟

⚜ శ్రీ కలరివతుక్కల్ భగవతి ఆలయం

 🕉 మన గుడి : నెం 989


⚜ కేరళ  : కన్నూర్


⚜ శ్రీ కలరివతుక్కల్ భగవతి ఆలయం



💠 కలరివతుక్కల్ భగవతి ఆలయం, వలపట్టణం నదికి సమీపంలో ఉన్న భద్రకాళి పుణ్యక్షేత్రం, చిరక్కల్ రాజ కుటుంబానికి చెందిన కుటుంబ పుణ్యక్షేత్రం.  


💠 ఈ క్షేత్రంలోని దేవత ఉగ్రరూపం భద్రకాళి.  కలరివతుక్కల్ భగవతి పురాతన యుద్ధకళ కలరిప్పయట్టుకు తల్లిగా పరిగణించబడుతుంది, అందుకే ఈ పేరు వచ్చింది. 

 ఈ మందిరం మలబార్ దేవస్వోమ్ బోర్డ్ ద్వారా నిర్వహించబడుతుంది మరియు బోర్డు యొక్క A కేటగిరీ ఆలయంగా వర్గీకరించబడింది.  కలరివాతుక్కల్ అనేది కలరి వాటిల్కల్ అనే పదం నుండి వచ్చింది.


💠 ఈ పవిత్ర క్షేత్రం ఒకప్పుడు చిరక్కల్ రాజ్యానికి చెందిన దేవి ఆలయ త్రయంలో భాగం. ఈ త్రయంలోని ఇతర రెండు ఆలయాలు చెరుకున్ను అన్నపూర్ణేశ్వరి ఆలయం మరియు తిరువర్కాడు భగవతి ఆలయం (మదాయికావు). 


💠 పురాణాల ప్రకారం, అన్నపూర్ణశ్వరి తన సహచరులైన కలరివటుక్కలమ్మ మరియు మడాయిక్కావిలమ్మలతో కలసి పడవలో కాశీ నుండి చిరక్కల్ చేరుకుంది. 

వారి ఉద్దేశ్యం కృష్ణుని ఆలయాన్ని సందర్శించడం, మరియు వారు తిరిగి రాలేదు.


💠 చిరక్కల్ రాజులు కోలాతిరి వారసులు, వీరు మూషిక రాజుల ప్రత్యక్ష వారసులు. 

ఉత్తరాదికి చెందిన మూషిక రాజవంశం మరియు దక్షిణాదికి చెందిన అయ్ రాజవంశం కేరళలోని పురాతన రాజవంశాలు.

 ఆయ్ రాజవంశం చివరికి మూషిక రాజవంశం అంతరించిపోయింది. మూషిక రాజు తరువాత కోలాతిరిప్పాడ్ అనే పేరును స్వీకరించాడు. కోలాతిరీలు తమ రాజధానిని ఎజిమల నుండి వలపట్టణం నదికి సమీపంలోని చిరక్కల్‌కు మార్చారు.

ఈ ఆలయం మొదట వడక్కెఇల్లం యాజమాన్యంలో ఉంది మరియు తరువాత చిరక్కల్ కోవిలకోమ్ యాజమాన్యంలోకి వచ్చింది.


💠 ఆలయ నిర్మాణం : 

ఈ ఆలయం కేరళ సంప్రదాయ నిర్మాణ శైలిలో ఉంది.  ఆలయ రూపకల్పన రురుజిత్ విధానమ్ (కౌల శక్తేయ సంప్రదాయం) ఇక్కడ 4 గర్భాలయాల్లో శివ, సప్త మాతృకలు, గణపతి, వీరభద్ర మరియు క్షేత్రపాలకన్ (భైరవ) మందిరాలు ఉన్నాయి.  


💠 ప్రధాన దేవత పశ్చిమ ముఖంగా ఉంటుంది.  శివుని మందిరం తూర్పు ముఖంగా, సప్త మాతృకల (మాతృశాల) మందిరం ఉత్తరాభిముఖంగా మరియు క్షేత్రపాలక (భైరవ) మందిరం తూర్పు ముఖంగా ఉన్నాయి.  మాతృశాలలో సప్తమాతృకలు (బ్రాహ్మణి, వైష్ణవి, శాంకరి, కౌమారి, వారాహి, చాముండి, ఇంద్రాణి), వీరభద్ర మరియు గణపతి విగ్రహాలు ఉన్నాయి.  

ప్రతిరోజు ఉదయం పూజల అనంతరం పవిత్ర ఖడ్గాన్ని మాతృశాల పక్కనే ఉన్న మండపానికి తీసుకెళ్లి, సాయంత్రం పూజల అనంతరం తిరిగి తీసుకువెళ్లారు.  


💠 ప్రధాన విగ్రహం కడుశర్కరాయోగంతో తయారు చేయబడింది, కాబట్టి పూజలు మరియు ఆచారాలను నిర్వహించడానికి దేవి యొక్క అర్చన బింబాన్ని పూజలు మరియు అభ్యంగనానికి ఉపయోగిస్తారు.

 ఆలయం ఏడాది పొడవునా తెరిచి ఉంటుంది, ఉదయం ఉష పూజ, మధ్యాహ్నం పంథీరాది పూజ మరియు సాయంత్రం శక్తి పూజ ఉంటుంది.


💠 పండుగలు : 

ఈ క్షేత్రంలో రెండు ప్రధాన పండుగలు ఉన్నాయి.  పూరం పండుగ మార్చి-ఏప్రిల్‌లో 9 రోజులు;  మలయాళ క్యాలెండర్ నెల మీనంలోని కార్తీక నక్షత్రంలో ప్రారంభమై ఉత్రం నక్షత్రంలో ముగుస్తుంది.  

7వ రోజు విగ్రహాన్ని 8న శ్రీ శివేశ్వరం ఆలయానికి, కడలై శ్రీకృష్ణ ఆలయానికి, 9న బాణాసంచా కాల్చి తిరిగి తీసుకువెళతారు.  


💠 కలరిప్పయట్టు ప్రదర్శన ద్వారా పండుగ ప్రారంభమవుతుంది.

తాయంబక, పూరకళి వంటి సంగీత, సంప్రదాయ కళా ప్రదర్శనలు నిర్వహిస్తారు.  జూన్‌లో మరొక ఉత్సవం కలశం ఒక సంవత్సరం తెయ్యం కాలాన్ని ముగించింది. ఇతర పండుగలు నవరాత్రి, శివరాత్రి, విషువిళక్కు.


💠 ఆలయం రెండు ప్రధాన పండుగలను జరుపుకుంటుంది. 

ఒకటి పూరం మహోత్సవం, రెండోది తిరుముడి ఉత్సవం. 

పూరం మహోత్సవం మలయాళ నెల మీనం (మార్చి-ఏప్రిల్)లో జరుగుతుంది. 

కలరిపయట్టు, తాయంబక మరియు పూరక్కళి ప్రదర్శనలు వేడుకలకు గుర్తుగా ఉంటాయి.

తిరుముడి ఉత్సవం మలయాళ నెల ఎడవం (మే-జూన్)లో జరుగుతుంది. ఇది ఉత్తర మలబార్‌లో తెయ్యం సీజన్ ముగింపును సూచిస్తుంది. తిరుముడి ఉత్సవంలో ఏడు తెయ్యాలు ప్రదర్శనలో ఉన్నాయి. 

థెయ్యములు పెద్ద తలపాగా ( ముడి ) ధరిస్తారు. కళరివతుక్కల్ భగవతి యొక్క తలపాగా కన్నూర్‌లోని థెయ్యమ్‌లలో ఎత్తైనది.


రచన

©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం 118-*

 *తిరుమల సర్వస్వం 118-*

*తాళ్ళపాక అన్నమాచార్యుడు 6*

ఓం నమో వేంకటేశాయ*


*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన* 

*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*



 ‌ *శ్రీవేంకటేశ్వరుని నిత్యకళ్యాణోత్సవం* 



 అన్నమయ్య, ఉత్సవాల్లో శ్రీవారి శోభను కర్ణపేయంగా వర్ణించడమే కాకుండా అత్యంత భక్తి ప్రపత్తులతో ఎన్నో ఉత్సవాల్లో స్వయంగా పాల్గొనేవాడు. తిరుమల క్షేత్రంలో శ్రీనివాసునికి నిత్యకళ్యాణోత్సవం ప్రవేశపెట్టింది అన్నమాచార్యుడే! శ్రీవేంకటేశ్వరుడు, అన్నమాచార్యుడు స్వగోత్రీకులు. ఇద్దరిదీ భారద్వాజస గోత్రమే! అయినా కట్టుబాట్లను త్రోసిరాజని, శ్రీనివాసునికి కన్యాదానం చేసి, సాక్షాత్తు ఆ శ్రీవారిని అల్లునిగా చేసుకున్నారు అన్నమాచార్యుల వారు!


 ఆ పరంపరను కొనసాగిస్తూ నేటికీ నిత్యకళ్యాణోత్సవంలో అన్నమయ్య వంశీయులే కన్యాదాతగా వ్యవహరిస్తున్నారు. అంతే గాకుండా, ఉగాది, శ్రీరామనవమి, ఆణివార ఆస్థానాల యందు, వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, పుష్పయాగం వంటి సేవలలోనూ ఈ వంశీయులు పాల్గొని ఘనంగా సత్కరించబడుతున్నారు. శ్రీనివాసునికి అన్నమయ్య మనసావాచా కర్మణః సమర్పించుకున్న సేవల ఫలితంగా, గత ఆరు శతాబ్దాలుగా వారి వంశస్థులందరూ శ్రీవారిసేవలో తడిసి ముద్దవుతున్నారు. ఈ నాటికీ వారి వారసులే సుప్రభాత సమయంలో మేలుకొలుపు మొదలుకొని ఏకాంతసేవలో జోలపాట వరకు పాడుతారు. ఆశ్రిత పక్షపాతి అయిన శ్రీవేంకటేశ్వరుని కటాక్షంతో అన్నమాచార్యుని వంశీయులందరికీ ఆచంద్రతారార్కం ఈ భాగ్యం లభిస్తూనే ఉంటుంది.



 *స్త్రీదేవతలపై కీర్తనలు* 


 శ్రీమహావిష్ణువు యొక్క వివిధ అవతారాలనే కాకుండా, స్త్రీ దేవతా మూర్తులను కూడా అన్నమయ్య స్తుతించాడు. 


ఉదాహరణకు:


‌ శుక్రవార అభిషేకం సందర్భంగా అలమేలుమంగను..


 *కంటి శుక్రవారం గడియ లేడింట* 

*అంటి అలమేల్మంగ అండనుండే స్వామి* 


 రంగనాథుని సేవలో తరిస్తున్న గోదాదేవిని -


*చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ* 

*కూడున్నది పతి చూడి కుడుత నాంచారి;* 


 పెండ్లికూతురి ముస్తాబులోనున్న సీతమ్మవారిని - 


*సిగ్గరి పెండ్లికూతుర సీతమ్మ* 

*అల్లనాడే రాఘవుడు హరివిల్లు విరిచెను*

*యెల్లి నేడే పెండ్లాడి నిదవో నిన్ను;*


అంటూ అమ్మవార్లందరినీ రాయలసీమ గ్రామీణ నుడివడి ఉట్టిపడేలా వర్ణించాడు.



 *పెనుగొండ ఆస్థానంలో అన్నమయ్య* 


 ఇలా తన సంకీర్తనా యజ్ఞాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్న అన్నమయ్య యశస్సు నలుదిక్కులా వ్యాపించడంతో, అప్పటి పెనుగొండ ప్రభువైన నరసింహరాయలు అన్నమయ్యను సత్కరించి, రాజగురువుగా తన ఆస్థానంలో నియమించుకున్నాడు. ఆ సమయంలో అలమేలుమంగా శ్రీనివాసుల శృంగారలీలలు వర్ణిస్తూ అన్నమయ్య ఓ కీర్తనను ఆలపించాడు -


*ఏమెకొ! చిగురు టధరమున యెడనెడ కస్తూరి నిండెను* 

*భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు గదా!*


 ఈ కీర్తనను విన్న నరసింహరాయలు యుక్తాయుక్త విచక్షణను మరచి, కీర్తికండూతితో, అత్యాశతో, తనపై కూడా అలాంటి కీర్తన చెప్పమని కోరాడు. పూర్తిగా శ్రీవారి సేవకే అంకితమైన అన్నమయ్య, నారాయణుని కీర్తించిన తన నోటితో ఒక నరుని స్తుతించలేనని చెబుతూ, నరసింహరాయలు కోర్కెను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. దానికి కోపోద్రిక్తుడైన సాళువరాజు *"మూరురాయరగండ"* అనే బంగారు సంకెళ్ళతో అన్నమయ్యను బంధించి ఖైదు చేయించాడు. అన్నమయ్య ఆర్తితో వేడుకొనగా, ఆనందనిలయుని కటాక్షంతో సంకెళ్ళు కకావికలం అయ్యాయి. భటులు చెప్పిన విషయం నమ్మని రాజుగారు తానే స్వయంగా దగ్గరుండి మరోసారి సంకెళ్లు వేయించాడు. అన్నమయ్య సంకీర్తనాలాపనతో సంకెళ్లు రెండవసారి కూడా విడిపోయాయి. ఆ వింతను స్వయంగా చూసిన నరసింహరాయల అహంకారం తగ్గి అన్నమయ్యను క్షమాభిక్ష వేడుకున్నాడు. ఆ రాజు అజ్ఞానాన్ని మన్నించి, ఇకమీదట భాగవతులను అవమానించవద్దని హెచ్చరించి, రాజాస్థానం తన గమ్యం కాదని గుర్తెరిగిన అన్నమయ్య, సకుటుంబంగా తిరిగి వేంకటాచలం చేరుకున్నాడు.


 *ఇతర వాగ్గేయకారులతో అన్నమయ్య* 


 తన వృద్ధాప్యాన్ని తిరుమల క్షేత్రంలో, స్వామివారిని కీర్తిస్తూ గడుపుతున్న సమయంలో, అన్నమయ్యకు నాలుగు లక్షల యాభదివేల కీర్తనలు వ్రాసినట్లుగా చెప్పబడుతున్న పురందరదాసుతో పరిచయమేర్పడింది. ఆ భాగవతోత్తముడు అన్నమయ్యను తన గురువుగానూ, హరి అవతారంగానూ భావించి, ఇలా కీర్తించాడు -


*హరియవతార మీతడు అన్నమయ్య* 

*అరయ మా గురుడీతడు అన్నమయ్య* 

*వైకుంఠనాథుని వద్ద వడిపాడుచున్నవాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య*


 పురందరదాసే కాకుండా, గొప్ప గొప్ప వాగ్గేయకారులైన త్యాగయ్య, రామదాసు, క్షేత్రయ్యలు కూడా ఇతని భక్తిప్రభావానికి లోనై, అన్నమయ్య కవితాఝరికి జేజేలు పలికారు. 


 కవితాదృష్టితో పరికిస్తే... 


‌ క్షేత్రయ్య పదాలు నృత్యానికి అనువుగా, లయబద్ధంగా గోచరిస్తాయి; 


 త్యాగరాజ కీర్తనలు సంగీత భరితంగా సవ్వడి చేస్తాయి; 


 రామదాసు పాటలు భక్తిభావాన్ని పుణికిపుచ్చు కుంటాయి; 


 జయదేవుని అష్టపదులు శృంగారభావాన్ని తొణికిస లాడిస్తాయి;

కానీ, అన్నమయ్య కీర్తనలు మాత్రం – *నృత్యం, సంగీత సాహిత్యాలు, భక్తితత్వం, శృంగార భావనల – మేళవింపై శ్రోతలను ఆనందడోలికల్లో విహరింపజేస్తాయి.*


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మకర సంక్రమణము

 *మకర సంక్రమణము :-* 

🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃


మకర సంక్రమణప్రవేశము తరువాత 40 గడియల వరకును పుణ్యకాలము. (హేమాద్రిమతమున)


“త్రింశత్కర్కాట కే నాడ్యో మకరేతు దశాధికాః" (బ్రహ్మవైవర్తపురాణం) కాని మాధవ - వృద్ధపరాశరుల మతములో ప్రవేశము తర్వాత 20 గడియల వరకు పుణ్యకాలము.


“త్రింశత్కర్కాటకే పూర్వా మకరే వింశతిః పరా" (వృద్ద పరాశరుడు)


పై యిద్దరి మతములందును సూర్యాస్తమయమునకు ముందే మకరమున రవి ప్రవేశించినచో ఆదినముననే సంక్రాంతి. ప్రదోషమందుగాని, అర్ధరాత్రియందుగాని మకరప్రవేశము జరిగినచో ఆ మరునాడు సంక్రమణ పర్వము. దక్షిణ దేశీయులీ పద్ధతినే ఆదరింతురు. (మాథవుడు, వృద్ధగార్యుడు, భవిష్యపురాణము)


గుజరాతువారును, ఉత్తరాదివారును, బీహారు-బెంగాలు ప్రాంతము వారును, ప్రదోషమందుగాని, రాత్రియందుగాని మకర ప్రవేశమైనచో పూర్వ దినము సాయంకాలము 5 గడియలును, మరునాటి ఉదయమున 5 గడియ లును పుణ్య కాలముగా పాటింతురు. (బౌధాయన, అనంత భట్టుల మతమున)


ప్రదోషమనగా సూర్యాస్తమయము తర్వాత మూడు గడియల కాలము,


ఉత్తరాయణ ప్రవేశ సమయమున దాన విశేషములు :-


మకర సంక్రమణ సమయమున వస్త్రదానము మహాపుణ్యము నిచ్చును. బ్రాహ్మణులకు తిలదానము చేయుటగూడ చాలమంచిది. (విష్ణుధర్మము)


నల్లనువ్వుల పొడితో ఒడలికి నలుగు పెట్టుకొని స్నానము చేసినచో శుభ మగును. (శివరహస్యము)

చక్కటి సంక్రాంతి

 


శ్రీభారత్ వీక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు 🌹 సంక్రాంతి అంటేనే సంబరాలు. పిల్లలు, పెద్దలు అందరూ ఆనందంగా జరుపుకునే పెద్ద పండుగ. ఇంటి ముందు వేసే ముగ్గులు, కోలాటాలు, హరిదాసుల భజనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కొత్త అల్లుళ్లు, వారిని ఆట పట్టించే మరదళ్లు, పిండి వంటలు, పంట చేతికి వచ్చి రైతుల కళ్లలో విరిసే ఆనందం.. ఇలా సంబరం కానిది ఏముంటుంది! చక్కటి సంక్రాంతి పాటలతో ఆ ముచ్చట్లన్నీ వినిపించారు ప్రముఖ గాయని శ్రీమతి పార్వతి ఆకెళ్ల గారు. ఆస్వాదించండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

సంక్రాతి పండుగ శుభాకాంక్షలు!*

 *🙏శుభోదయం🙏*శుభ మంగళవారం 


* సంక్రాతి పండుగ శుభాకాంక్షలు!*


*సంక్రాంతి అంటే? కేవలం పండగ మాత్రమే కాదు. అది మన సంస్కృతి, సాంప్రదాయం.*


*మన పూర్వీకులు, మనం జీవనం ఎలా గడపాలలో ప్రత్యక్షంగా నేర్చుకోవడానికి, ఇలాంటి పండుగలను మనకు అందించారు.*


*సంక్రాంతి సమయంలో బసవన్న (ఎద్దు) ని తీసుకొస్తారు. దీని వెనుక ఒక పరమార్థం ఉందని ఎంత మందికి తెలుసు?.*


*మన ఇంటి ముందు ఆ బసవన్న ఆడుతుంటే, మన ఇంటి ముంగిళ్లలో సంక్రాంతి శోభ కలుగుతుంది. దానివల్ల మన మనసులకు ఆహ్లాదం కలిగి ఉత్తేజం పొందుతాము.*


*బలంగా ఉండే ఎద్దులనే గంగిరెద్దులుగా వాడతారు. గంగిరెద్దు ఎంత బలిష్టంగా ఉంటుందో అంత పనిచేస్తుందని, సోమరిగా ఎంతమాత్రం ఉండదని. అంటే మనం కూడా ఆ గంగిరెద్దు లాగా బలంగా అంటే ఆరోగ్యాంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని మరియు ఏ పని పాట లేకుండా తిరుగొద్దు అని పరోక్షంగా చెప్పడం.*


*అదే కాదు, ఎద్దు శివుని వాహనంగా, పూర్తి ధర్మ స్వరూపంగా భావిస్తారు. మనిషి మనసు చంచలమైనది. అందువల్ల ఎటువంటి చెడు ఆలోచనలవైపు ఆకర్శించకుండా, ఏకగ్రతతో ఉండేందుకు దేవునిపై మనసును కేంద్రీకరించమని చెప్పడం కోసం.*


*అసలు సంక్రాంతి అంటే! రైతు పండుగ. తొలికరి చినుకు పడిన నాటి నుంచి పంట ఇంటికి వచ్చేవరకూ రైతుకు అండగా శ్రమించే ఎద్దు, సంక్రాంతి వేళ తానే స్వయంగా ఇంటి ముందుకు భిక్షకు వస్తుంది.*


*అంటే! మీకు ఇంత కష్టపడి ధాన్యం పండించింది నేనే అనే అహంకారం ఎంతమాత్రం ఉండదు అని చాటి చెబుతునట్టు. అంటే మనం కూడా ఎంత సంపాదించినా అణిగి మణిగి ఉండాలని గ్రహించడం కోసమే!.*


*ఒకప్పుడు బసవన్న ఇంటి ముందుకు వస్తే వారికి తోచిన దక్షిణ ఇచ్చి, ఇంట్లో పాతవి ఏమైనా బట్టలు ఉంటే ఇచ్చేవారు. లేకుంటే దోసిట్లో బియ్యం అయిన దానం చేసేవారు. వారు వచ్చేది సంవత్సరానికి ఒకసారి. కాస్త బియ్యం పది రూపాయలు ఇస్తే మన ఇంట్లో సంపద తరిగిపోదు, మనకున్నదాంట్లో కొంత మేరకు దానం చేయడం ద్వారా మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడమని అంతే!.*

🌹🌷🌹🕉️🕉️🕉️🌹🌷🌹


అన్నిట్లోను విజయమే

 🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏              🏵️ఆవేశం ఆరోగ్యానికి మంచిది కాదు.. అంతే కాక ఆత్మీయుల మధ్య అనుభందాలను తుంచి వేస్తుంది.. ఆవేశంతో వచ్చే ప్రకంపనాల పొగ, మంచి చెడుల తారతమ్యాలను కప్పివేస్తుంది🏵️నోటి నుండి వచ్చే అప శబ్దాలు తుటాలు కోలుకోలేని వెనుకకు తీసుకోలేని భారీ కష్ట నష్టాలను తెచ్చిపెడతాయి.. కనుక చెప్పుడు మాటలను, చెడు లేదా వ్యర్థ విషయాలను వినవద్దు..కనుక చెప్పుడు మాటలు విని ఆవేశపడే కంటే మనసును చైతన్య పరిచే మంచి ఆలోచనలు చేయండి🏵️మనము  కోపంలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం మౌనం గా ఉండగలిగితే ఆది కొన్ని వందల పశ్చాత్తాపాలని  నివారించవచ్చు...జీవితంలో అన్నింటి కన్నా ముఖ్యమైనది సహనం ఆలోచించేలా చేస్తుంది.. ఆవేశపడకుండా అపుతుంది🏵️ఒకరి మనసు బాధ పెట్టి మనం సంతోషంగా ఉండటం జీవితం కాదు.. మనం బాధలో ఉన్నా మరొకరికీ సంతోషం ఇచ్చేదే అసలైన జీవితం.. మనిషి విజయ రహస్యమంతా ఓర్పు, సహనం లోనే దాగి ఉంది.. ఇవి రెండు లేనివారి కృషి ఫలాప్రదం కాదు.. ఓర్పు, సహనం ఉన్న వారికి అన్నిట్లోను విజయమే🏵️🏵️మీ * * అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్& జనరల్ ఏజన్సీస్. D.N.29-2-3. గోకవరంబస్టాండ్ దగ్గర. స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి. వైద్య సలహాలు ఉచితం. మందులు అయిపోయిన వారు రాలేని వారు కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును.94408 93593.91820 75510*  🙏🙏🙏

అయిదు కథలు

 _*🚩సంక్రాంతి వెనుక ఎవరికీ తెలియని అయిదు కథలు🚩*_


🕉🌞🕉🌞🕉🌞🕉🌞🕉🌞🕉


సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి... 


- పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ, వారి ఆత్మశాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట! 


- సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు.

శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్నీ పట్టుకుని, నందికితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. ఇంకేముంది! తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే, ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు.


- కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి ‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’ అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు. ‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’ అని శపించాడు.

అప్పటి నుంచి ఎద్దులు, వ్వవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు.


- సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా! దీనికి కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.


- సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే, హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర, ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. ఇవండీ సంక్రాంతి గురించి ఓ అయిదు కథలు. ఇంకా గొబ్బెమ్మలు దగ్గర నుంచి భోగిపళ్ల వరకు... సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికీ ఓ కథ ఉంది.

*🙏🙏🙏🙏🙏🙏*

మేలుకో శ్రీ సూర్యనారాయణా!

 మేలుకో శ్రీ సూర్యనారాయణా!


శ్రీ సూర్యనారాయణా.. మేలుకో హరిసూర్యనారాయణా


పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ పొన్నపువ్వూ మీద పొగడ పూవుఛాయ


ఉదయిస్తూ భానుడు ఉల్లిపువ్వు ఛాయ ఉల్లిపువ్వూ మీద ఉగ్రంపు పొడిఛాయ


గడియెక్కి భానుడు కంబపువ్వు ఛాయ కంబపువ్వూ మీద కాకారి పూఛాయ


జామెక్కి భానుడు జాజిపువ్వు ఛాయ జాజిపువ్వూ మీద సంపెంగ పూఛాయ


మధ్యాహ్న భానుడు మల్లెపువ్వు ఛాయ మల్లెపువ్వూ మీద మంకెన్న పొడిఛాయ


మూడుఝాముల భానుడు మునగపువ్వుల ఛాయ మునగపువ్వూ మీద ముత్యంపు పొడిఛాయ


అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయ ఆవపువ్వూ మీద అద్దంపు పొడిఛాయ


వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయ వంగపువ్వూ మీద వజ్రంపు పొడిఛాయ


గుంకుతూ భానుడు గుమ్మడిపూఛాయ గుమ్మడీ పువ్వూ మీద కుంకంపు పొడిఛాయ


(ఈ పాటను 1956లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం కోసం రచయిత, సంగీత దర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు స్వరపరిచారు)

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం  - ప్రతిపత్ - పునర్వసు -‌‌ భౌమ వాసరే* (14.01.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

శుభాకాంక్షలు

 శుభోదయం. శుభమస్తు.. శివోహం


ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభ శుభ సందర్భ శుభాకాంక్షలు..


▶️ పుష్యమాసంలో సూర్యుడు మకరరాశి లోకి ప్రవేశించే పుణ్యదినం మరియు మన తెలుగు వారికి మంచి అభ్యుదయాన్ని ఇచ్చే పెద్ద పండుగ రోజైన ఈ సంక్రాంతి పండుగ మన జీవితాలలో కొత్త వెలుగులు తేవాలని...*


*▶️ మన తెలుగు వారి ఇండ్ల లోగిళ్ళు రంగు రంగు ముగ్గులతో... అందమైన గొబ్బెమ్మలతో... ఆనంద నిలయాలుగా మారి... సమస్త మానవాళి నిత్యం సుఖ సంతోషాలతో ఉండాలని..*


*▶️ మన రైతులకు, పంటలకు, ప్రతి ఒక్కరికీ   పండుగ రోజైన ఈ ఆనందాల సంక్రాంతి రోజు మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని కోరుకుంటూ...సకల శుభాలు కలుగవలేనని పరమేశ్వర ప్రార్థన తో...*


*మీకు, మీ  కుటుంబ సభ్యులందరికీ  మి శ్రేయోభి లాషులకు మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు..!!*

              

మీ *

Bhargava Sarma

Blogger

సంక్రాతి లక్ష్మి

                సంక్రాతి లక్ష్మి 


మార్తాండు డెప్పుడు  మకరరాశిని జేరు

          ఉత్తరాయణ మగు నుర్వి నపుడు

సకల జనాళియున్ సంక్రాంతి పండువన్ 

          సంతోష చిత్తాన జరుపు కొంద్రు

కర్షకుల్ పంటను కడు తోషమున పొంది

           పొంగలి నొండియు పొంగు చుంద్రు

ఆడపడచులెల్ల ఆనంద డోలల

          ముంగిట గొబ్బిళ్ళ మురియు చుంద్రు

ముదము గూర్చెడి  ముత్యాల ముగ్గులలర

గాలి పటముల సందడి గోల లందు 

సకల జనులకు నొనగూర్చ సంతసంబు

ఘనముగా వచ్చె నేడు  సంక్రాంతి లక్ష్మి 


         మీకు, మీ కుటుంబ సభ్యులందరికి 

  హృదయపూర్వక  సంక్రాంతి శుభాకాంక్షలు 

                          

    గోపాలుని మధుసూదన రావు, సులోచన