*మకర సంక్రమణము :-*
🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃
మకర సంక్రమణప్రవేశము తరువాత 40 గడియల వరకును పుణ్యకాలము. (హేమాద్రిమతమున)
“త్రింశత్కర్కాట కే నాడ్యో మకరేతు దశాధికాః" (బ్రహ్మవైవర్తపురాణం) కాని మాధవ - వృద్ధపరాశరుల మతములో ప్రవేశము తర్వాత 20 గడియల వరకు పుణ్యకాలము.
“త్రింశత్కర్కాటకే పూర్వా మకరే వింశతిః పరా" (వృద్ద పరాశరుడు)
పై యిద్దరి మతములందును సూర్యాస్తమయమునకు ముందే మకరమున రవి ప్రవేశించినచో ఆదినముననే సంక్రాంతి. ప్రదోషమందుగాని, అర్ధరాత్రియందుగాని మకరప్రవేశము జరిగినచో ఆ మరునాడు సంక్రమణ పర్వము. దక్షిణ దేశీయులీ పద్ధతినే ఆదరింతురు. (మాథవుడు, వృద్ధగార్యుడు, భవిష్యపురాణము)
గుజరాతువారును, ఉత్తరాదివారును, బీహారు-బెంగాలు ప్రాంతము వారును, ప్రదోషమందుగాని, రాత్రియందుగాని మకర ప్రవేశమైనచో పూర్వ దినము సాయంకాలము 5 గడియలును, మరునాటి ఉదయమున 5 గడియ లును పుణ్య కాలముగా పాటింతురు. (బౌధాయన, అనంత భట్టుల మతమున)
ప్రదోషమనగా సూర్యాస్తమయము తర్వాత మూడు గడియల కాలము,
ఉత్తరాయణ ప్రవేశ సమయమున దాన విశేషములు :-
మకర సంక్రమణ సమయమున వస్త్రదానము మహాపుణ్యము నిచ్చును. బ్రాహ్మణులకు తిలదానము చేయుటగూడ చాలమంచిది. (విష్ణుధర్మము)
నల్లనువ్వుల పొడితో ఒడలికి నలుగు పెట్టుకొని స్నానము చేసినచో శుభ మగును. (శివరహస్యము)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి