14, జనవరి 2025, మంగళవారం

సంక్రాతి పండుగ శుభాకాంక్షలు!*

 *🙏శుభోదయం🙏*శుభ మంగళవారం 


* సంక్రాతి పండుగ శుభాకాంక్షలు!*


*సంక్రాంతి అంటే? కేవలం పండగ మాత్రమే కాదు. అది మన సంస్కృతి, సాంప్రదాయం.*


*మన పూర్వీకులు, మనం జీవనం ఎలా గడపాలలో ప్రత్యక్షంగా నేర్చుకోవడానికి, ఇలాంటి పండుగలను మనకు అందించారు.*


*సంక్రాంతి సమయంలో బసవన్న (ఎద్దు) ని తీసుకొస్తారు. దీని వెనుక ఒక పరమార్థం ఉందని ఎంత మందికి తెలుసు?.*


*మన ఇంటి ముందు ఆ బసవన్న ఆడుతుంటే, మన ఇంటి ముంగిళ్లలో సంక్రాంతి శోభ కలుగుతుంది. దానివల్ల మన మనసులకు ఆహ్లాదం కలిగి ఉత్తేజం పొందుతాము.*


*బలంగా ఉండే ఎద్దులనే గంగిరెద్దులుగా వాడతారు. గంగిరెద్దు ఎంత బలిష్టంగా ఉంటుందో అంత పనిచేస్తుందని, సోమరిగా ఎంతమాత్రం ఉండదని. అంటే మనం కూడా ఆ గంగిరెద్దు లాగా బలంగా అంటే ఆరోగ్యాంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని మరియు ఏ పని పాట లేకుండా తిరుగొద్దు అని పరోక్షంగా చెప్పడం.*


*అదే కాదు, ఎద్దు శివుని వాహనంగా, పూర్తి ధర్మ స్వరూపంగా భావిస్తారు. మనిషి మనసు చంచలమైనది. అందువల్ల ఎటువంటి చెడు ఆలోచనలవైపు ఆకర్శించకుండా, ఏకగ్రతతో ఉండేందుకు దేవునిపై మనసును కేంద్రీకరించమని చెప్పడం కోసం.*


*అసలు సంక్రాంతి అంటే! రైతు పండుగ. తొలికరి చినుకు పడిన నాటి నుంచి పంట ఇంటికి వచ్చేవరకూ రైతుకు అండగా శ్రమించే ఎద్దు, సంక్రాంతి వేళ తానే స్వయంగా ఇంటి ముందుకు భిక్షకు వస్తుంది.*


*అంటే! మీకు ఇంత కష్టపడి ధాన్యం పండించింది నేనే అనే అహంకారం ఎంతమాత్రం ఉండదు అని చాటి చెబుతునట్టు. అంటే మనం కూడా ఎంత సంపాదించినా అణిగి మణిగి ఉండాలని గ్రహించడం కోసమే!.*


*ఒకప్పుడు బసవన్న ఇంటి ముందుకు వస్తే వారికి తోచిన దక్షిణ ఇచ్చి, ఇంట్లో పాతవి ఏమైనా బట్టలు ఉంటే ఇచ్చేవారు. లేకుంటే దోసిట్లో బియ్యం అయిన దానం చేసేవారు. వారు వచ్చేది సంవత్సరానికి ఒకసారి. కాస్త బియ్యం పది రూపాయలు ఇస్తే మన ఇంట్లో సంపద తరిగిపోదు, మనకున్నదాంట్లో కొంత మేరకు దానం చేయడం ద్వారా మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడమని అంతే!.*

🌹🌷🌹🕉️🕉️🕉️🌹🌷🌹


కామెంట్‌లు లేవు: