మేలుకో శ్రీ సూర్యనారాయణా!
శ్రీ సూర్యనారాయణా.. మేలుకో హరిసూర్యనారాయణా
పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ పొన్నపువ్వూ మీద పొగడ పూవుఛాయ
ఉదయిస్తూ భానుడు ఉల్లిపువ్వు ఛాయ ఉల్లిపువ్వూ మీద ఉగ్రంపు పొడిఛాయ
గడియెక్కి భానుడు కంబపువ్వు ఛాయ కంబపువ్వూ మీద కాకారి పూఛాయ
జామెక్కి భానుడు జాజిపువ్వు ఛాయ జాజిపువ్వూ మీద సంపెంగ పూఛాయ
మధ్యాహ్న భానుడు మల్లెపువ్వు ఛాయ మల్లెపువ్వూ మీద మంకెన్న పొడిఛాయ
మూడుఝాముల భానుడు మునగపువ్వుల ఛాయ మునగపువ్వూ మీద ముత్యంపు పొడిఛాయ
అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయ ఆవపువ్వూ మీద అద్దంపు పొడిఛాయ
వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయ వంగపువ్వూ మీద వజ్రంపు పొడిఛాయ
గుంకుతూ భానుడు గుమ్మడిపూఛాయ గుమ్మడీ పువ్వూ మీద కుంకంపు పొడిఛాయ
(ఈ పాటను 1956లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం కోసం రచయిత, సంగీత దర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు స్వరపరిచారు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి