27, జూన్ 2021, ఆదివారం

యాభై రూపాయలు

 పోయిన యాభై రూపాయలు ..


🍂🍂🍂🧘‍♀️🧘‍♀️🧘‍♀️🍂🍂🍂


ఇంటికి  వెడుతున్నా  నడుచుకుంటూ 

.

దారిలో  ఒక  కరంటు స్థంభానికి  ఒక  కాగితం  కట్టి  ఉంది .  

.

"దయచేసి  చదవండి "    అని  రాసి  ఉంది . ఖాళీ  గానే  ఉన్నాను  కదా  అని  దగ్గరకు  వెళ్లి  చూశాను . 

.

.

" ఈ  రోడ్డులో  నేను  నిన్న  ఒక  50 రూపాయల  నోటు  పారేసుకున్నాను . నాకు  కళ్ళు సరిగా  కనబడవు .  మీకు  దొరికితే  దయచేసి  ఈ  ఎడ్రెస్  దగ్గరకు  తెఛ్చి  ఇవ్వగలరు,  దయచేసి   ఈ  సహాయం  చెయ్యండి  "  అని  రాసి  ఉంది  .

.

.

నాకు  ఎందుకో  ఆ  ఎడ్రెస్  ఉన్న  చోటుకు   వెళ్ళాలి  అనిపించింది

.

అడ్రెస్   గుర్తుపెట్టుకున్నాను .

.

అది   ఆ  వీధి  చివరన  ఉన్న  ఒక  పూరి  పాక   .  దగ్గరకు  వెళ్లి పిలిస్తే పాక  లో నుండి  ఒక వృధ్ధురాలు  వచ్చింది .   ఆమె  కు  కళ్ళు  సరిగా  కనబడటం  లేదు .ఆ  పాకలో  ఆమె  ఒక్కర్తే  ఉంటోంది అని  అర్ధం  అయ్యింది .  చేతి  కర్ర  సహాయం  తో  తడుము  కుంటూ   బయటకు  వచ్చింది   

.

.

"ఏమీ  లేదమ్మా !   నువ్వు  పోగొట్టుకున్న  50 రూపాయల  నోటు  నాకు  కనబడింది  .  అది  ఇఛ్చి  పోదామని  వచ్చాను "  అన్నాను 

.

.

  .

ఆమె  ఏడుస్తోంది .  

.

"బాబూ !  ఇప్పటికి   ఇలా  దాదాపు   50-60   మంది   వఛ్చి  ఒక్కొక్కరూ  ఒక  50  రూపాయలు   ఇస్తున్నారు .   నాకు  కళ్ళు  కనబడవు .   నాకు  చదవడం   రాయడం  రాదు .నేను  అది  రాయలేదు  బాబూ !  ఎవరో  నాకు  సహాయం  చెయ్యాలి  అనిపించి  అలా   రాశారేమో !"  

.

.

" పోన్లే  అమ్మా  ఇదిగో  ఈ  యాభై   నోటు  తీసుకో  ! " 

.

.

బాబూ  !  అది  నేను  రాయలేదు . నా   ఇబ్బంది  చూసి  ఎవరో   మహానుభావుడు   ఇలా  రాసిపెట్టి  ఉంటాడు .   వెళ్ళేటపుడు   అది  కాస్త   చించెయ్యి  బాబూ !   అంది 

.

.

ఆమె  ఇలాగే  అందరికీ  చెప్పి  ఉంటుంది .  ఒక్కరూ  చించెయ్యలేదు .  ఆమె  రాయలేదు .  ఎవరో  ఆమెకు  సహాయపడటం  కోసం  ఇలా  రాశారు . 

.

.

 ఆ  రోడ్డున  వెడుతున్న   ఎందరిలోనో  కొందరు అది  చూస్తారు  .  అలా  చూసిన  ఎందరిలోనో  కొందరు  ఆమెకు     సహాయ  పడాలని  అనుకుంటారు .   అలా  అనుకున్న   ఎందరిలోనో   కొందరు   ఆమె  ఇంటికి  వఛ్చి   ఆమెకు  సహాయ  పడతారు .  నేను  అది  చించేస్తే  ఆమెకు   అలాంటి  సహాయం  దూరం  చేసిన  వాడిని అవుతాను ............  ఇలా  సాగుతున్నాయి   నా  ఆలోచనలు ..... అది  చింపెయ్యనా  ?   ఉంచెయ్యనా ? నాకు చెప్పినట్టే  ఇంతకు  ముందు  వాళ్లకు  కూడా  చెప్పి  ఉంటుంది  కదా !  వాళ్ళెవరూ  చింపెయ్యలేదు .  అంటే  అందరూ  ఆమెకు   ఈ  రకంగా  సహాయం  అందాలి  అని  కోరుకుంటున్నారు ........ మరి  నేను  ఎందుకు  అది  చింపెయ్యడం ....... ఇలా  అనుకుంటూ   వస్తున్నాను .

.

.

ఒక  పెద్దావిడ చేతిలో చిన్న  కాగితం  పట్టుకుని   ఎదురుపడ్డారు..

.

.

.

సర్ !  ఈ ఎడ్రెస్   చెప్పగలరా ?  నాకు  ఒక  50  నోటు దొరికింది  .  వాళ్లకి  ఇచ్ఛేద్దామని ఎడ్రెస్  అడుగుతున్నాను .

.

.

.

ఆమె  ఎడ్రెస్ 

.

.

.

నాకు  అనిపించింది  "మానవత్వం  చచ్చిపోలేదు"  .

.

అది  రాసిన  వారికి  మనసులోనే  కృతజ్ఞతలు  చెప్పుకున్నాను .  ఎవరికయినా    సహాయం  చెయ్యాలి  అంటే  ఎన్నో  మార్గాలు  .  ఈ  మార్గం  ఎంచుకున్న  వ్యక్తిని  మనసులోనే  అభినందించాను . . 

అది  చింపడం   భావ్యం   కాదు అనిపించింది ..నేను  అది  చింపేయాలా ?   అలా  వదిలేయాలా ? 

.

.

వదిలేశాను ….

🥀శ్రీ కృష్ణ లీలలు

 🌹🌷💐🥀శ్రీ కృష్ణ లీలలు🥀🌹🌷💐


     ఒకసారి అర్జునుడు, శ్రీ కృష్ణుడు ఒక వృద్ధ విధవరాలి ఇంటికి అతిథులుగా వెళ్లారు. ఆ వృద్ధ విధవరాలు శ్రీకృష్ణునికి పరమ భక్తురాలు. ఆమె నిత్యం కన్నయ్యను స్మరిస్తూ తన జీవితాన్ని గడుపుతోంది. ఆమెకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు. ఆమె ఉండేది ఒక పూరి గుడిసెలో... ఆమె వద్ద ఒక ఆవు ఉండేది. ఆమె ఆ గోమాత ప్రసాదించిన పాలను గ్రామంలో అమ్మి కాస్తో కూస్తో డబ్బు సంపాదించేది. ఆమె తన జీవనాధారమైన ఆవును బాగా చూసుకునేది. తాను ఎంతగానో అభిమానించే కన్నయ్య తన ఇంటికి రావడం చూసి, ఎంతగానో సంతోషపడింది. కన్నయతో పాటు విశ్వంలోకెళ్ళా శ్రేష్ఠ దనుర్థారి అయిన పార్థుడు కూడా తన వెంట రావడం చూసి తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 


       అతిథి దేవునితో సమానం అంటారు..అలాంటిది ఏకంగా దేవుడే అతిథిగా వచ్చాడు. ఆ ముసలామె తన ఇంటిలో ఉండే ఆహార పదార్థాలను అన్నిటినీ కృష్ణార్జునులకు నివేదించింది. శ్రీకృష్ణుడు ఆమె ఆతిథ్యానికి, అలాగే ఆమె నిష్కల్మషమైన భక్తికి మెచ్చాడు. అలా కొద్దిసేపు ఆమెతో మాట్లాడి గోవిందుడు, పార్థుడు వెళ్లిపోయారు. బయటికి వచ్చిన పిమ్మట అర్జునుడు మాధవునితో ఇలా అన్నాడు..." మాధవా..! మీరు ఆమె భక్తికి మెచ్చారు కదా..మరి ఆమెకు ఒక వరాన్ని ఎందుకు ఇవ్వలేదు ? ".... దీనికి సమాధానంగా గోపాలుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు... " అర్జునా..! నేను ఆమెకు ఎప్పుడో వరాన్ని ప్రసాదించాను.. ఆమె ఎంతగానో ప్రేమించే తన ఆవుకు రేపు మరణాన్ని ప్రసాదించాను.. ఆ గోవు రేపటి సూర్యోదయానికి పూర్వమే తుదిశ్వాస విడుస్తుంది.."  సంభ్రమాశ్చర్యాలకు లోనైన పార్ధుడు తిరిగి కన్నయతో " మాధవా..ఇది వరమా, లేక శాపమా..?  గోవు మరణిస్తే తన కడుపు నిండేదెలా..? అసలు ఆమె ఆవు సహకారం లేకుంటే ఈ ధరిత్రి పై జీవించగలదా...?  మళ్లీ కృష్ణయ్య నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చారు... " కౌంతేయా..! నీవు నన్ను అర్థం చేసుకోలేదు. ఆమె ఆవు గురించి ఎక్కువగా ఆలోచిస్తోంది. ఆవును ఎలా పోషించాలి, ఆవుకు మేత ఎలా సేకరించాలి, ఆవు శుచిగా, శుభ్రంగా ఉండటానికి ఎలా నీటితో స్నానం చేయించాలి....ఇలా పలు విధాలుగా ఎక్కువ సమయం ఆ గోవు గురించే ఆలోచిస్తూ, నన్ను స్మరించడం మర్చిపోతోంది. అదే ఆ ఆవు కనుక లేకపోతే, ఆమె రోజంతా నన్ను సేవిస్తూ, స్మరిస్తూ ఉంటుంది కదా..! సరైన సమయం వచ్చినప్పుడు నేను తనని ఈ భూమి నుంచి తీసుకు వెళ్ళిపోతాను.. నా సేవలో తరించి తన జన్మను ధన్యం చేసుకుంటుంది. మరణానంతరం తాను తప్పక నా లోకాన్ని చేరుకుంటుంది..."

                    వాసుదేవుని మాటలు విన్న పార్థుడు ఎంతగానో సంతోషించాడు...

             

  చూశారా..మనకు ఎన్నో కష్టాలు వస్తుంటాయి..ఆ కష్టాలు అనేవి భగవంతుడు పెట్టే పరీక్ష వంటిది.. కష్టాలు నశించిన పిమ్మట మనకు తప్పక ఆనందం లభిస్తుంది.. ఎన్ని కష్టాలు వచ్చినా కృష్ణయ్య లీలలోని భాగమేనని సర్దుకుపోవాలి.. ఆ తర్వాత అంతా ఆ పరమాత్ముడే చూసుకుంటాడు....

దేనికి విలువ ఇస్తే

 *💥దేనికి విలువ ఇస్తే అదే దొరుకుతుంది💎*

🕉️🌞🌎🏵️🌼🚩


 *👉🏻ఒక రాజు ఉండేవాడు.* *అతడు న్యాయం అంటే చాలా ప్రీతి కలవాడు. ప్రజలంటే వాత్సల్యము కలవాడు. ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యం భగవంతుడిని ప్రార్థించేవాడు. చాలా శ్రద్ధగా భగవంతుని పూజ స్మరణం చేసుకునేవాడు. ఒకరోజు భగవంతుడు ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చి ఇట్లా అన్నాడు- “రాజా, నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు.”* 

 *అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమ గల ఆ రాజు ఇట్లా అన్నాడు- “భగవన్, నా దగ్గర నీవు ఇచ్చిన సంపదలన్నీ ఉన్నాయి. నీ కృపవల్ల నా రాజ్యంలో అన్ని సుఖసంతోషాలు ఉన్నాయి. అయినప్పటికీ నాకు ఒకటే కోరిక ఏంటంటే- మీరు నాకు కనిపించినట్టే, నన్ను ధన్యుణ్ణి చేసినట్టే, నా ప్రజలందరినీ కూడా కృపతో ధన్యులను చేయండి. వారికి దర్శనాన్ని ఇవ్వు.”* 

 *భగవంతుడు రాజును చూసి “ఇది సంభవం కాదు కదా” అని ఏదో చెప్పబోయాడు. కాని రాజు మాత్రం చాలా పట్టుదల బట్టి “ఈ కోరికను తీర్చు వలసిందే.” అన్నాడు భగవంతుడు చివరకు భక్తుడి కోరికనుతీర్చక తప్పలేదు. ఆయన అన్నాడు- “సరే, రేపు నీ ప్రజలందరిని తీసుకుని ఆ కొండ దగ్గరకు రా నేను కొండమీద అందరికీ దర్శనమిస్తాను.” అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై, భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుని, మరుసటిరోజు నగరంలో దండోరా వేయించాడు. “రేపు అందరూ కొండ దగ్గరకు నాతోపాటు వచ్చి చేరవలసింది. అక్కడ భగవంతుడు మీకందరికీ దర్శనం ఇస్తాడు.”* 

 *రెండవ రోజు రాజు తన ప్రజలందరిని, స్వజనులతో పాటు తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు, నడుస్తూ నడుస్తూ దారిలో ఒకచోట రాగి నాణేల కొండ కనిపించింది. ప్రజలలో నుండి కొంతమంది అటువైపు పరిగెత్తటం మొదలుపెట్టారు. అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు అందరిని* *సమాధానపరచి, “అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు. ఎందుకంటే మీరు అందరూ భగవంతుడిని కలవటానికి వెళ్తున్నారు. ఈ రాగి నాణాలు వెనకాల మీ అదృష్టాన్ని కాల తన్ను కోకండి.” అన్నాడు. కానీ లోభం ఆశ వల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణేల దగ్గరే ఆగిపోయి ఆ నాణాలను మూటకట్టుకుని, తమ ఇంటివైపు వెళ్ళిపోయారు. వాళ్ళు మనసులో అనుకున్నారు- మొదలు ఈ రాగి నాణాలను ఇల్లు చేర్చుకుందాము.* *భగవంతుడిని తర్వాతైనా* *చూసుకోవచ్చు కదా అని.* 

 *రాజు ముందుకు సాగాడు కొంతదూరం పోయాక వెండినాణాల కొండ కనిపించింది. మిగిలిన ప్రజలలో* *కొందరు అటువైపు పరిగెత్తారు. వెండి నాణేల మూట కట్టుకుని ఇంటివేపు వెళ్ళిపోయారు.* *వాళ్ళకు ఈ అవకాశం మళ్ళీ* *మళ్ళీ దొరకదు అని అనిపించింది. ‘వెండి నాణేలు* *మళ్ళీ దొరుకుతాయో తెలియదు..* *భగవంతుడు అయితే మళ్ళి అయినా దొరుకుతాడు.’ ఈ విధంగా కొంత దూరం వెళ్లిన తర్వాత బంగారపు నాణేల పర్వతం కనిపించింది. ప్రజలలో మిగిలినవారంతా, రాజు* *బంధువులతో సహా అటువైపే పరుగెత్తడం మొదలుపెట్టారు. వాళ్లు ఇతరుల లాగే ఈ నాణేలను మూటలు కట్టుకొని సంతోషంగా తిరిగి వెళిపోయారు.* 

 *ఇంక కేవలం రాజు రాణి మిగిలారు. రాజు రాణి తో అన్నాడు- “చూడు, ఈ జనాలు ఎంత ఆశపోతులో!* *భగవంతుడు లభించటం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటం లేదు. భగవంతుడు ఎదుట మొత్తం ప్రపంచం లోని ధనమంతా కూడా ఒక లెక్క కాదే.” నిజమేనని రాణి రాజు మాటలను సమర్థించింది.* *వారిద్దరూ ముందుకు సాగారు. కొంతదూరం వెళ్లాక రాణికి, రాజుకు ఏడురంగుల లో మెరుస్తూ వజ్రాల పర్వతం కనిపించింది. ఇక రాణి కూడా ఆగలేకపోయింది.* 

*ఆమె వజ్రాల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి, వజ్రాలన్నీ మూట కట్టుకోవటం ప్రారంభించింది.* 

 *అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు.* 


*మనసు విరక్తి చెంది, చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు. నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు- “ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ బంధువులు?* 


*నేను ఎప్పటి నుంచి ఇక్కడే నిలబడి వారి కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను.” రాజు చాలా సిగ్గుతో ఆత్మగ్లానితో తన తల దించుకున్నాడు. అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు-* 


*“ఓ రాజా, ఎవరు తమ జీవితంలో భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని* *భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను. వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎన్నటికీ పొందలేరు.”* 

 *సారం- ఏ ప్రాణులు తమ మనస్సు, బుద్ధి, అంతరాత్మతో భగవంతుని శరణు వేడుతారో, ఎవరు లౌకిక మోహాలను అన్నిటినీ విడిచి పరమేశ్వరుని తన సొంతం అనుకుంటారో, వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు.🙏* 


 *ఓం నమో నారాయణాయ🙏*

 🕉️🌞🌎🏵️🌼🚩

🚩మన తెలుగు లోగిళ్లు..

 🕉️⚜️🚩 ఓం నమో వేంకటేశాయ 🙏


🚩మన తెలుగు లోగిళ్లు...

            "కౌసల్యా సుప్రజా రామా".  అను... 

సుప్రభాతం తో మేల్కొంటాయి. 


⚜️🚩"విశ్వామిత్రుడు" శ్రీ రాముడిని నిద్ర లేపుతూ...


కౌసల్యా సుప్రజా రామా! పూర్వాసంధ్యా ప్రవర్తతే !

    ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం!


...అంటాడు.


🚩అసలు సుప్రభాతం... ఈ శ్లోకము తోనే ఎందుకు మొదలైంది!!? అని ఆలోచిస్తే...

ఇందులో మనకు ఒకటి అర్థమవుతుంది.


⚜️🚩  👉  "కౌసల్యా సుప్రజా రామా!"... 

అంటే ఇక్కడ రాముడు🙏... అనగా మేలుకోబోయే వ్యక్తి... అతడిని మేలుకొలపాలి. 

♦️గాఢముగా నిద్ర పోతున్న వ్యక్తిని... ఉన్నట్టుండి మేల్కొలపడం ప్రమాదకరం. 

♦️ఎటువంటి వ్యక్తి అయినా తన తల్లి పేరు విన్నంతనే... తన దృష్టిని అటువైపు త్రిప్పుతాడు. అందువల్ల మొదట తల్లి పేరు పలికినారు. 

♦️అంతే కాక ప్రత్యక్ష దైవమైన తల్లిని మొదట అతడికి గుర్తు చేస్తూ... తర్వాత ఆ మేల్కోబోయే వ్యక్తి  పేరు  ("రామా!") పిలుస్తున్నాము. 

👉"సుప్రజా" అంటే... మంచి బిడ్డవు అని అర్థము.


⚜️🚩తర్వాత మాత్రమే...

          👉    "పూర్వాసంధ్యా ప్రవర్తతే"...  

అంటే తెల్లవారుతోంది నాయనా అంటున్నారు. 

♦️అంటే ఇంకా సూర్యుడు ఉదయించలేదు... ఉదయించడానికి తయారుగా ఉన్నాడు. ♦️తెల్లవారుఝామునే లేవడం ఎంతో మంచిది అని మన అందరికీ తెలుసు.అందుకే ఆ సమయానికే ఇక్కడ మేల్కొల్పడం జరుగుతోంది.


 ⚜️🚩   👉   "ఉత్తిష్ఠ నరశార్దూలా"... 

అంటే "ఓ మనుషులలో పులి లాంటి వాడా లెమ్ము" అంటున్నారు. 

♦️మనము చూస్తూనే ఉంటాము పిల్లలను లేపేటప్పుడు... లేవరా " బారెడు పొద్దెక్కినా ఇంకా పడుకొనే ఉన్నావు... 

♦️పక్కింటి అబ్బాయి చూడు మంచి ర్యాంకు తెచ్చుకొన్నాడు... నువ్వూ ఉన్నావు ఎందుకు... తినడానికి..నిద్రపోయేదానికి ఎప్పుడూ తయారుగా ఉంటావు" అంటూ తిడుతూ... లేపుతుంటారు 

అందువలన లేచేటప్పుడే పిల్లలు ఒక విధమైన బాధతో లేస్తుంటారు. 

♦️అలాకాకుండా తన శక్తి సామర్థ్యాలను గుర్తు చేస్తూ... ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ... 

మేల్కొల్పితే ఎంత ఆనందముగా,ఉత్సాహము తో మేల్కొంటారు. 

♦️తర్వాత ఆ రోజు ఎంత ఉత్సాహముగా తమ పనులను చేసుకొంటారు. 

అందుకే ఈ విధంగా మేల్కొల్పాలని మనకు నేర్పుతున్నారు.


⚜️🚩   👉"కర్తవ్యం దైవమాహ్నికం"...  

అంటే నీకు దైవం చే విధించబడిన...అంటే నీవు చేయవలసిన పనులు... 

(చదువుకోవడం కావచ్చు లేక ఉద్యోగం కావచ్చు లేక మరే వ్యాపారమో,సేద్యమో ఏదైనా కావచ్చు) చేయవలసి ఉంది అని గుర్తుచేస్తున్నారు.

♦️అందుకని తెల్లవారుఝామునే లెమ్ము నాయనా అంటూ ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలిగిస్తూ మేల్కొల్పడం చేయాలి.


⚜️🚩రాముడిని నిమిత్తముగా చేసుకుని... 

సకల జీవరాశులను ఇలా మేల్కొలుపుతున్నారు

అనమాట 🙏

        🌷🌷ఓం నమో వేంకటేశాయ 🌷🌷

                  ⚜️♦️⚜️♦️⚜️♦️

India has abolished the Roshni Act

 The Government of India has abolished the Roshni Act of Jammu and Kashmir.


 *Think till date no media has told us about the Roshni Act.*


 * This Roshni Act was a conspiracy made by Farooq Abdullah to give away the houses, shops and land and farms of the Hindus who fled Kashmir, in which the Congress was also involved.


 * In the 1990s, all the Hindus who fled from Kashmir were not killed by the Muslims of Pakistan, but their own neighbors with whom they used to eat vermicelli in their childhood, used to celebrate festivals, used to drink tea, the same neighbors Abdul, Aslams, Ghaffars killed them.  .*


 After that, when the entire Kashmir valley became empty of Hindus, then some Muslims went to Farooq Abdullah and said that you should make some rules to give these houses, shops, lands, fields, barns of Hindus to Muslims.


 * Then Farooq Abdullah made a Roshni Act and through this Roshni Act, in just ₹ 101, the land of any Hindu, the farm house or shop became that of a Muslim.


 * It was omitted that the houses around the houses of Muslims, which belonged to Hindus, are not there, due to the disconnection of the electricity connection, there is darkness around them, which can be a danger to them, so it is necessary to light such houses.


  * In this way the fabric of the Roshni Act was made.*


 * * because when the Hindus left everything and ran away, due to not being able to pay the electricity bill, the electricity connection of their fields or shops or houses was cut off.... Then Farooq Abdullah made a light act.  By which, by paying only ₹ 101 fee, any Muslim could fill an application in his name to get electricity connection for that Hindu's farm, barn, house, shop.


 In this way, first the electricity bill was generated in the name of that Muslim, after that in a few years, the full ownership of the Hindu's house, shop or farm was given to that Muslim.


 In this way, by this blasphemous light act, Farooq Abdullah gave the valuable property of thousands of Hindus of Kashmir Valley to the Muslims for just Rs 101.*


 * And most surprisingly, the Left media of India never discussed this Roshni Act.*


 * Make others aware by sharing....*

 @thefactfileindia

Comparison between two "Generations" .

 What a beautiful answer! 

Comparison between two  "Generations" ....... Everyone must read 👌👌


A youngster asked his father: "How did you people live before with-

No access to technology

No aeroplanes

No internet

No computers

No dramas

No TVs

No air cons

No cars

No mobile phones?"


His Dad replied:

"Just like how your generation lives today with -


No prayers

No compassion

No honor

No respect

No character

No shame

No modesty

No time planning

No sports 

No reading

No more consulting with elders and drawing on their first hand experience and instead referring to Google for all their queries fir assistance" 


"We, the people that were born between 1940-1985 are the blessed ones. Our life is a living proof:


👉 While playing and riding bicycles, we never wore helmets.

👉 After school, we played until dusk. We never watched TV.

👉 We played with real friends, not internet friends.

👉 If we ever felt thirsty, we drank tap water not bottled water.

👉 We never got ill although we used to share the same glass of juice with four friends.

👉 We never gained weight although we used to eat a lot of rice everyday.

👉 Nothing happened to our feet despite roaming bare-feet.

👉 our mother and father never used any supplements to keep us healthy. 

👉 We used to create our own toys and play with them.

👉 Our parents were not rich. They gave us love, not worldly materials.

👉 We never had cellphones, DVDs, play station, XBox, video games, personal computers, internet chat - but we had real friends.

👉 We visited our friends' homes uninvited and enjoyed food with them.

👉 unlike your world, we had relatives who lived close by so family time and ties were enjoyed together. 

👉 We may have been in black and white photos but you will find colourful memories in those photos.

👉 We are a unique and, the most understanding generation, because *we are the last generation who listened to their parents*. 

*Also , the first who have had to listen to their children.* 

and we are the ones who are still smarter and helping you now to use the technology that never existed while we were your age!!!


We are a *LIMITED* edition! 


So you better -

Enjoy us. 

Learn from us.

Treasure us.

Before we disappear from Earth and your lives.

నిజానికి *వాస్తవానికి* *తేడా

 *నిజానికి* మరయు *వాస్తవానికి* చాలా *తేడా* ఉంది. 


ఉదాః సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమర అస్తమిస్తాడు అనేది *"నిజం*

సూర్యుడు ఉదయించడు అస్తమించడు,  తిరిగేది భూమి అనేది *"వాస్తవం "* 

నిజానికి వాస్తవానికి మధ్య ఆ సన్నని గీతను  తెలుసు కోవడమే మన మేధస్సు!


అలాగే భగవంతుడు ఎక్కడో ఉంటాడు  మనం పూజలు వ్రతలు ఉపవాసాలు హోమాలు చేస్తేనే వస్తాడు మనలను చల్లగా చూస్తాడు అనేది *"నిజం"* భగవంతుడు ఎక్కడో లేడు మనలోనే మనతోనే ఉన్నాడు. మనలను ప్రతి నిమిషం గమని స్తున్నాడు అనేది *"వాస్తవం"*

ఆదిత్యం

 ఆదిత్యం  ప్రధమం నామ ద్వితీయం తు దివాకరః

తృతీయం భాస్కరః ప్రోక్తం చతుర్డంతు ప్రభాకరః

పంచమంతు సహస్రాంశు: షష్టం చైవ త్రిలోచనః

సప్తమం హరి దశ్వశ్చ అష్టమం తు విభవసు:

నవమం దినకృత్పోక్తం దశమం ద్వాదశాత్మకం

ఏకాదశం త్రయీమూర్తి ర్ధ్వాదశం సూర్య ఏవచ.

Third Wave to hit india

 *Urgent Announcement; Third Wave to hit india*

 

*Please do a self-lockdown immediately.*


*1.* Do not go out unless absolutely necessary. 

*2.* Double mask when you go out and at no time should the mask come off. 

*3.* Do not eat outside your house. 

*4.* Do not allow people to come inside your house-whether they are relatives or close friends. 

*5.* Do not go to relatives or friends’ houses. 

This is very very important. People are taking this very lightly in Indo-Pakistan. A significant part of the population will be wiped out if we don’t take precautions now. *Covid does not discriminate.* Please listen.

*Forward as received.👆*

*Canada* bans flights in and out, and the daily death toll exceeds 1,000.

*Saudi Arabia* is blocked and there are no inbound and outbound flights.

*Colombia* is completely blocked.

*Brazil* fell into its deadliest chapter, with more than 4,100 deaths today.

 *Spain* has announced that the state of emergency can be extended.

*The United Kingdom* announced a one-month lockdown.

*France* Locked for 2 weeks.

 *Germany* Sealed for 4 weeks.

 *Italy* followed closely today.

 *All* these countries/regions have confirmed *the third wave of COVID19* is more deadly than the first wave.  Therefore, we must be very careful and *take all precautions*.

      Become an alert communicator between friends and family.  *Save everyone from the third wave*.

      *Don't judge by the second wave of blockade nothing happened*...

      *History tells us that like the Spanish flu of 1917-1919, the third wave is more dangerous than the first and second waves.*

      *Protect yourself and your family*.

      *Maintain biosafety measures, wear masks, maintain social distancing, wash hands frequently, etc.*


     History will not lie, let us look back.

      __________

      *Don't keep this information for yourself, share it with family and friends.*


     *Please do not keep this information for yourself and do share it with family and friends.*

నిజ స్వరూపం.

 ఒకసారి గాంధీ వాల్మీకి బస్తీ ఆలయంలో ఖురాన్ పఠిస్తున్నారు.?!


 అప్పుడు జనం నుండి ఒక మహిళ లేచి గాంధీని అలా చేయవద్దని కోరింది.


 గాంధీ అడిగారు: ఎందుకు?


 అప్పుడు ఆ మహిళ అది మన మతానికి విరుద్ధమని అన్నారు.


  గాంధీ అన్నారు.  నేను అలా నమ్మను.  ..


 మతం లో ఆర్డర్ ఇవ్వడానికి మేము మిమ్మల్ని అర్హులుగా పరిగణించలేమని ఆ మహిళ బదులిచ్చింది.


 ఇక్కడ ఉన్న ప్రజల ఓటు తీసుకోవాలని గాంధీ అన్నారు.


 ఓట్ల ద్వారా మతాన్ని నిర్ణయించవచ్చా? అని ఆ మహిళ బదులిచ్చింది.


 మీరు నా మతాన్ని అడ్డుకుంటున్నారని గాంధీ అన్నారు ..


 కోటి హిందువుల మతంలో మీరు చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకుంటున్నారని ఆ మహిళ బదులిచ్చింది.


 గాంధీ ఇలా అన్నారు: నేను ఖురాన్ వింటాను.


 ఆ స్త్రీ ఇలా చెప్పింది: నేను దానిని వ్యతిరేకిస్తాను.


 ఆపై వందలాది వాల్మీకి యువకులు ఆ మహిళ వైపు నిలబడి, ఆలయంలో ఖురాన్ పఠనం చేసే ముందు, ఒక మసీదులో గీత లేదా రామాయణాన్ని పఠించిన తర్వాతనే ఈ ఆలయంలో ఖురాన్ చదవండి అన్నారు.!


  పెరుగుతున్న నిరసనలను చూసి గాంధీ పోలీసులను పిలిచాడు.  పోలీసులు వచ్చి నిరసనకారులను పట్టుకున్నారు. మరియు వారిపై 107 కేసు నమోదైంది.      ఆ తర్వాత గాంధీ పోలీసుల రక్షణలో అదే ఆలయంలో ఖురాన్ చదివారు.!!!

ఇదీ గాంధీ యొక్క నిజ స్వరూపం.

 * (దేశం యొక్క విభజనపై రాసిన 'బెట్‌చార్' పుస్తకం నుండి) ** రచయిత - గురు దత్.


 హిందువుల పట్ల మీరు దేశ పితామహుడిగా భావించే వారి ఆలోచన ఏమిటో ఇప్పుడు మీరు  ఊహించవచ్చు.  దేశానికి తండ్రి లేరు, దేశపు కుమారులు అందరూ.


 మా హిందూ వాల్మీకి సోదరుల గురించి మేము గర్విస్తున్నాము.


 జై శ్రీ రామ్.💪

జీవిత (అనంతర) భీమా*

 *జీవిత (అనంతర) భీమా*


 మన శరీరాన్ని పురము అని గృహము అని శరీరానికి ఉన్న రంధ్రాలను ద్వారాలని పిలవడం వేదాంత శాస్త్రంలో ఒక పరిపాటి. భాగవతంలోని పురంజనో పాఖ్యానము లో ఈ వర్ణన కనిపిస్తుంది. చాలా వేదాంత గ్రంథాలలో కూడా ఈ ఈ విధమైన వర్ణన కనిపిస్తుంది.


కఠోపనిషత్తులో యముడు నచికేతుని తో ఈ శరీరము పదకొండు ద్వారాలున్న పురము అని అంటాడు. అందరికీ నవ రంధ్రాలు లెక్క సరిపోతుంటే యముడికి రెండు ద్వారాలు ఎక్కువ  ఎక్కడినుంచి వచ్చాయి అనేది ప్రశ్న.  యముడు జీవుల యొక్క పుట్టుక మరణము వీటిని గురించిన పూర్తి వివరాలు తెలిసినవాడు.  ఆ కఠోపనిషత్తు కు వ్యాఖ్యానం రాస్తూ శంకరులవారు మనకు కనపడనివీ యముడికి మాత్రమే కనపడిన, ఆ మిగిలిన రెండు ద్వారాలను వివరిస్తారు.


తల్లి కడుపులో పిండ రూపంలో ఉన్న జీవుడికి ఆహారం బొడ్డు ద్వారా వెళుతుంది. ఆ జీవుడికి అప్పటికి మిగిలిన నవరంధ్రాలు ఏర్పడవు. అందువల్ల జీవుడికి మొదటి రంధ్రం బొడ్డు (నాభి).  ఇది జీవుడు పుట్టగానే మూసుకుపోతుంది. జీవులందరికీ ప్రాణం పోయేటప్పుడు నవరంధ్రాలలో ఏదో ఒక రంధ్రం నుంచి ప్రాణవాయువు బయటకు వెళ్ళిపోతుంది. ఇది సాధారణమైన మరణము. మహాయోగులకు బ్రహ్మజ్ఞానులకు ప్రాణవాయువు మరణ సమయంలో తల పైన ఉన్న బ్రహ్మరంధ్రం గుండా బయటకు వెళుతుంది. అది కూడా ఒక ద్వారమే. అందరు జీవులకు దానిని తెరిచే విధానం తెలీదు. మరణ పర్యంతం ఆ ద్వారము మూసుకొని ఉంటుంది. నాభి,  బ్రహ్మరంధ్రము రెండు కలిపితే కఠోపనిషత్తులో యముడు చెప్పిన ఏకాదశ ద్వారాల లెక్క తేలుతుంది.


ఏకాదశ ద్వారా లైనా నవ ద్వారా లైనా కింద  వివరింప బోయే విషయంలో తేడా రాదు.


వాస్తు శాస్త్ర ప్రకారం మామూలు ఇల్లు  కట్టినా రాజభవనం నిర్మించినా ద్వారాలు ఎప్పుడూ సరి సంఖ్యలో ఉండాలి. బేసి సంఖ్య లో ఉండకూడదు. బేసి  సంఖ్యలో ఉంటే అరిష్టము. ఆ ఇల్లు కాని ఆ పురము కానీ ఎక్కువ కాలం ఉండవు. ఢామ్మని కూలిపోతాయి.


భగవంతుడు మన శరీరాన్ని నిర్మించేటప్పుడు వాస్తు పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. దీనివల్ల ఈ ఇల్లు లేదా ఈ పురము ఎప్పుడైనా కూలి పోయేటట్లు ఏర్పాటు జరిగింది. కూలడం తధ్యం. ఎప్పుడు కూలు తుందో మాత్రం సరిగ్గా లెక్క చెప్పలేము. భగవంతుడు నిర్లక్ష్యంగా చేశాడా కావాలనే అలా చేశాడో తెలీదు. ఏదైతేనేమి డిజైన్ లో లోపము వచ్చింది. ఇప్పుడు ఇంక చెయ్యగలిగింది కూడా ఏమీ లేదు. కానీ గుడ్డిలో మెల్ల.  భగవంతుడు నష్టాన్ని తగ్గించుకోడానికి ఇన్సూరెన్సు ప్రణాళిక ఒకటి ఏర్పాటు చేశాడు.


అందరికీ తెలిసిన విషయమే. కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ ఇన్సూరెన్సు యాక్సిడెంట్లను ఆపదు. ప్రమాదం జరిగిన తర్వాత వచ్చే నష్టాన్ని కొంత వరకు పూడుస్తుంది. 


భగవంతుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఈ ఇన్సూరెన్సు విషయం కూడా అంతే. మరణం ఆగదు. కానీ దాని తర్వాత వచ్ఛే కష్టాలు తగ్గుతాయి కొన్ని సౌకర్యాలు వస్తాయి. 


*ఈ ఇన్సూరెన్సు తాలూకు ప్రీమియము భగవంతుడికి మనం భక్తితో చేసే పూజయే. కాబట్టి ఆ ఇన్సూరెన్సు తీసుకుని క్రమం తప్పకుండా అందరూ రోజూ ప్రీమియం చెల్లిస్తూ ఉండండి..* 


భీమా ఉంటే ధీమా ఉంటుంది. ఇందులో లోపం ఒక్కటే. పక్కవాడి ఇన్సూరెన్స్ కోసం మనమూ, మనకోసం పక్క వాళ్ళూ ప్రీమియం కట్టడానికి వీలు లేదు. ఎవరి ప్రీమియం వాళ్లే కట్టుకోవాలి. తస్మాత్ జాగ్రత జాగ్రత. 


*పవని నాగ ప్రదీప్*

కథావల్లరి కొత్తకథ

 👆“ భామాకలాపం”#కథావల్లరి కొత్తకథ


“ బాబూ! నువ్వా! నిజంగానే నువ్వే? ఏమిట్రా ఇలా చెప్పాపెట్టకుండా అకాల దర్శనం”…. సంభ్రమం, సంబరం, సంశయం సుజాత గొంతులో! “ సాన్వి ఏది నాన్నా?”…. అడిగింది…..అతని వెనకాలకు మోర సాగించి చూస్తూ… కోడలి కోసం! 


“ సాన్వీని వాళ్ళింటి దగ్గర దించి వచ్చానమ్మా. లోపలికి రానిస్తావా? లేక ప్రశ్నలతో చంపేస్తావా?”…. కొడుకు గొంతులో చికాకుకు ఉలిక్కిపడింది సుజాత! “ రా రా లోపలకు!”…. అంటూ, పక్కకు తొలిగి దారిచ్చింది కొడుక్కు! అప్పటికే నిద్ర లేచి వచ్చిన తండ్రికి…” హాయ్ నాన్నా! రేపు మాట్లాడుకుందాం! ముప్ఫై గంటల ప్రయాణం కదా! డేమ్ టైయర్డ్!”…. అంటూ పెట్లు లాక్కుంటూ, మేడమీదకు వెళ్ళిపోయాడు శౌరి! “ కాఫీ ఇవ్వనా బాబూ!”… అంటున్న తల్లికి, వద్దని సైగ చేసి… గట్టిగా తలుపేసుకున్నాడు! మొహామొహాలు చూసుకున్నారు భార్యాభర్తలు. “వియ్యలారికి ఫోన్ చేసి, సాన్వీని పలకరించనా … అన్న భార్యను..” ప్రస్థుతం వద్దు”… అంటూ ఆపాడు ఆమె భర్త రమణ! 


        శౌరీ, సాన్వీ జెట్ లాగ్ తో అలిసిపోయి పడుకున్న ఆ పదిగంటల సమయంలో …ఇరువైపుల తల్లితండ్రుల మధ్యా చాలా మంతనాలే అయ్యాయి. ఇరువైపుల వారూ సున్నితమనస్కులు, సంస్కారవంతులూ, ఎంతో సరదాపడి, సాంప్రదాయాలు చూసుకుని వియ్యమందినవారు! ఈ పరిస్థితి కొంత ఆశ్చర్యంగానూ, ఆందోళనగా ఉంది. అందుకే ఒప్పందంగా కొన్ని నిర్ణయాలు … పిల్లల పరోక్షంలో తీసుకున్నారు. “ పిల్లల మధ్య ఎంత పెద్ద గొడవలయినా… సర్ది చెప్పుకోవాలి తప్పా, విడిపోయే పరిస్థితులు కల్పించుకోకూడదని, ఎవరి  బిడ్డ పక్షాన తప్పున్నా, అవతలివారు అపార్ధాలు చేసుకోకూడదని, పిల్లలిద్దరికీ నచ్చే పరిష్కారం చూడాలని “… అనుకున్నారు! 


సాన్వీ తల్లయితే… “ మా అమ్మాయి వలన ఏం తప్పు జరిగినా మీరు క్షమించి, కడుపులో పెట్టుకోవాలి వదినగారూ!”…అంటూ బ్రతిమాలుతున్నట్టు అంటుంటే, సుజాత..” మీరలా అంటే కోపం వస్తుంది సరోజా నాకు! చాలా కష్టంగా ఉంది మనసుకు! ఏం శౌరి నుండి కూడా తప్పులుండచ్చు కదా! పాతతరం తల్లిలా మీరు మాట్లాడద్దు. నా మటుకు నేను, సాన్వీ నుండే సమస్యను ఆలోచించి, నిర్ణయం తీసుకుంటా! దయచేసి మీరు బేలగా మాట్లాడద్దు!”… అంటూ సాంత్వనిచ్చి, ఫోను పెట్టేసింది! 


       పిల్లలిద్దరూ వచ్చి, మూడురోజులయింది. ఒక్కముక్క వాళ్ళ నోటి నుండి ఊడిపడలేదు! ఎవరి మూడ్స్ లో వాళ్ళు కూరుకుపోయారు! ఆరోజు ఉదయం ఐదింటికి… ధ్యానంలో కూర్చుందే కానీ… సుజాత మనస్సంతా సాన్వీ మీదే ఉంది. శౌరి మీద కోపం ఉండచ్చు, కానీ ఎంతో ప్రేమగా ఉండే తనను ఒక్కసారయినా పలకరించనంత కోపమా ఆ అమ్మాయికి “….అనుకుంది! 


“సాన్వి… ఇరవై ఆరేళ్ళ సౌందర్యరాశి! అందానికి తగ్గ వ్యక్తిత్వం! అన్నిటికీ మించి కూచిపూడి నాట్యంలో ఇరవై యేళ్ళ కఠోర సాధన, పిన్నవయసులోనే వందలకు పైగా నాట్యప్రదర్శనలిచ్చి….పలు సాంస్కృతిక సంస్థలనుండి పురస్కారాలూ, బిరుదులూ అందుకున్న “ నాట్యమయూరి”! ఆమె తన కోడలు అనుకుంటేనే తన మనసు గర్వంతో ఉప్పొంగిపోతుంది”…. సుజాతకు ఆలోచనల్లో ధ్యానం కుదరలేదు. లేవబోతుంటే…. రెండు కాఫీకప్పులతో వచ్చాడు శౌరి! 


తల్లికొక కప్పు అందించి….నాందీ, ప్రస్థావన లేకుండా….” అమ్మా! నీకు పంజరంలో బంధించిన ఒక మనిషికి  …స్వేచ్ఛ పోయి, ఊపిరాడక గింజుకుపోతుంటే ఎలా ఉంటుందో తెలుసా? “…. అంటూ సూటిగా అడిగాడు తల్లిని! “ ఏమయింది బాబూ?”… అంది ఆమె! “ సాన్వీని పెళ్ళి చేసుకున్నాకా, నా పరిస్థితి అలాగే అయిపోయిందమ్మా! నాకంటూ సొంతంగా…జీవితం లేకుండా….అన్నీ ఆమెతో ముడిపెట్టేసుకుంది! “…. అన్నాడు! 


“ భార్య జీవితం భర్తతో కాకుండా ఎవరితో ముడిపెట్టుకుంటుంది శౌరీ! చాలా వింతగా మాట్లాడుతున్నావే! “…. అన్న తల్లితో… “ నీకు అలా అర్ధమయ్యిందా! వివరంగా చెప్తా విను! 


            ************************


“ శౌరీ! ఈ వీకెండ్ మనం సరదాగా మీ తెలుగు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దామా? చాలా బోర్ గా ఉంది!”


“ సాన్వీ! నాకు మామూలుగానే ఫ్రెండ్స్ తక్కువ! అందులో తెలుగువాళ్ళు మరీ తక్కువ. లాస్ట్ వీక్ వెళ్ళాం కదా … లంచ్ కు! ఇక్కడ అలా ఇన్విటేషన్ లేనిదే వెళ్ళకూడదు. సరదాగా ఇంటిపని చేసుకుందాం! గ్రోసరీ తెచ్చుకుందాం!  వంట నేను చేస్తా ! సరేనా!”-


“ అమెరికా అంటూ ఏవేవో వూహించుకుని వచ్చేసా! లైఫ్ చాలా నిస్సారంగా ఉంది! ఈపాటికి ఇండియాలో ఎన్ని ఆక్టివిటీస్ ఉండేవి! వినాయక చవితి , దసరా నుండి సంక్రాంతి వరకూ ఎంత బిజీగా ఉండేదాన్నో… ఊపిరి సలపని ప్రదర్శనలతో! ఇక్కడ బయటకెడితే చలి, ఇన్నేసి బట్టలు కప్పుకుని ఏం ఎంజాయ్ చేస్తాం? అయినా ఏమున్నాయి ఇక్కడ…పెద్దగా చూడడానికి. అవే మాల్స్, అన్నీ ఒకేలా ఉండే ఇళ్ళూ, మనని చూసి, హలో అని పలకరించి మొహం తిప్పేసుకునే అమెరికన్స్! నాకు అస్సలు నచ్చలేదు శౌరీ అమెరికా! మనం ఇండియా వెళ్ళిపోతే హాయిగా ఉండచ్చు కదా!”


“ సాన్వీ! ఇవన్నీ నీకు పెళ్ళికి ముందు తెలియదా? అమెరికాలో జీవనపరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోకుండానే పెళ్ళి చేసుకున్నావా? పదేళ్ళయింది నేను ఇక్కడకు వచ్చి! నేను అమెరికాలో పుట్టడం వలన నేను అమెరికన్ సిటిజన్ ను! నా ఉద్యోగం, నా ఫ్రెండ్స్, హాబీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను ఇండియా వచ్చి ఏం చెయ్యాలి? డోంట్ బీ రిడిక్యులస్!”


“ ఇండియాలో ఏం చెయ్యాలా? అదే ప్రశ్న నేనూ వేస్తే? నాకు ఇక్కడ ఏమీ లేదు. ఇద్దరి పేరెంట్స్ అక్కడే. నా ప్రాణప్రదమైన డాన్స్ అక్కడే! ఇక్కడ ఒక పంజరంలో చిలుకలా పడున్నా శౌరీ!”…. 


“ సాన్వీ ! అయిన దానికీ ,కాని దానికీ కన్నీరు పెట్టుకోకు. నాకు చిరాకు! అసలు మా అమ్మననాలి. నాకు ప్రొఫెషనల్ కావాలంటే, ఇలా డాన్సర్ ను కట్టిపెట్టింది. ఇప్పుడు ఆ డాన్సర్ ఏమో నా నెత్తి మీదెక్కి తోచట్లేదని , తైతక్కలాడుతోంది!”…. 


“ అంత క్రూయల్ గా మాట్లాడకు. నా డాన్స్ ప్రోగ్రామ్ చూసే నన్ను చేసుకున్నావు. అంటే… అందంగా ఉంది, తండ్రికి ఆస్థి ఉంది, ప్రొఫెషనల్ డిగ్రీ లేదు కనుక, అమెరికాలో వంటచేస్తూ, నీ సరదాలు తీరుస్తూ షోపీస్ లా పడుంటాననా చేసుకున్నావు?”


“ సాన్వీ రోజూ ఇదే వాదనతో బోర్ కొట్టించకు! ఇప్పటికే నీకోసం చాలా మార్చుకున్నా! నీకిష్టం లేదని అకేషనల్ నాన్ వెజ్, బూజ్ వదిలేసా! సరదాగా ఫ్రెండ్స్ తో చిల్ అవుట్ చేస్తూ… ఆడే పోకర్ గేమ్ వదిలేసా! ఆదివారం టెన్నిస్ లేదు, జిమ్ లేదు! క్లబ్ కు రమ్మంటే రావు! బయట ఫుడ్ ఎంజాయ్ చెయ్యవు. ఎంత సేపని నువ్వు నువ్వు నువ్వే అని కూర్చుంటా. నువ్వు కాదు … నేను ఉన్నది పంజరంలో! ఐ యాం గెటింగ్ సఫకేటెడ్! చాలా తప్పు చేసా ఈ పెళ్ళి చేసుకుని! “


“ ఇనఫ్ శౌరీ! చాలానే మాట్లాడావు. వాటెబౌట్ మై డ్రైవింగ్? ఎప్పుడు నేర్పిస్తావు? లైబ్రరీ కి తీసుకెళ్తానన్నావు? ఏదీ? నువ్వు నాకు ఇండిపెండెంట్ గా డీల్ చేసే ఏ స్కిల్సూ నేర్పించవు! కానీ నాతోనే టైమ్ అంతా వేస్ట్ అయిపోతుందని కంప్లయింట్! ఓకే! ఇకపై నిన్ను విసిగించను! నేనే మేనేజ్ చేసుకుంటా!”


ఈ విధంగా మొదటి ఆరునెలలూ, మనుషులు కూడా గడ్డకట్టే చలికాలంలో గడిచిపోయాయి. మెల్లగా మంచు కరగిపోయింది. క్షణాల్లో వచ్చిచేరిందా అనేనట్టు… అన్నివేపులా పచ్చదనం అలుముకుంది. జనాలు ఒళ్ళు వెచ్చబెట్టుకోడానికి… ఆరుబయళ్ళు ఆశ్రయించారు. ఆరోజు శౌరి ఆఫీసు నుండి ఐదింటికి తిరిగి వచ్చేసరికి… అతని బుర్ర తిరిగిపోయే దృశ్యం ఇంటి ముందు పచ్చికలో! 


         వనకన్యలా… పసుపుపచ్చని చీరకు ఆకుపచ్చ చెంగావి చీర, మోకాళ్ళ క్రిందదాకా… కట్టుకుని, గులాబీరంగు పాదాలకు సిరిమువ్వ గజ్జెలు తగిలించి, ఆమె ఒత్తయిన పొడుగాటి జడను జడకుప్పెల్లో బంధించి, అసలే విశాలమయిన మృగనయనాలకు నల్లని కాటుక రేకలు దిద్ది, నుదుటన నయాపైసంత బొట్టు పెట్టుకుని…. ఇంటిబయట పచ్చికలో….చెంగుచెంగున నృత్యం చేస్తూ సాన్వి!


    పక్కన లాప్ టాప్ లో నట్టువాంగం పెట్టుకుని, క్రిష్ణశబ్దం అద్భుతంగా అభినయిస్తూ… నాట్యం చేస్తోంది


" రఘువంశ సుధాంబుధి చంద్రా

రత్నాకర సమ గంభీరా

శతకోటి మన్మధాకారా

సురభుజబల రణశూర

నారీజన మానస చోరా

మహామేరు సమానాధీరా

కవిజన పోషక మందారా

పరరాజ శత్రు సంహారా....రారా స్వామి రారా!

యధువంశ సుధాంబుధి చంద్రా.....స్వామి రారా!..."

అంటూ.... లయబద్ధంగా కరచరణాలను కదిలిస్తూ….సాత్వికాభినయం చేస్తుంటే….వ్యాహ్యాళికి బయలుదేరిన.. ఆ కమ్యూనిటీలోని దొరలు, దొరసానులూ… ఆమె నృత్యపదర్శనకు ముగ్దులై నిలబడిపోయి ఉన్నారు. 


ఇరుగుపొరుగు …బయట లాన్లలో నిలబడే… వీక్షిస్తున్నారు. ఆమె నాట్యం ముగించడంతోనే అందరూ చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తూ… “సో గ్రేస్ ఫుల్, అమేజింగ్ టాలెంట్…”…అంటూ ప్రశంశిస్తూ వెళ్ళిపోయారు. శౌరికి … సాన్వి చేస్తున్న ఈ ఎక్సిబిషన్ కు చాలా కోపం వచ్చింది. “ ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని, బయటే ఎందుకు తైతక్కలాడడం? ఎంత పరువు తక్కువ. హౌ ఎంబారసింగ్! నైబర్ హుడ్ లో ఇలా పిచ్చి డాన్సులు చేస్తే, స్యూ చేస్తారు నన్ను!”…. అంటూ తలపట్టుకున్నాడు. సాన్వీ మాత్రం “ కే రే హుట్!”…. అన్నట్టు తలెగరేసి వూరుకుంది! 


       ఆరోజు నుండి… సాన్వీ మరే అడ్వంచర్ చెయ్యకుండా… పెందరాళే వచ్చేయడం… తనతో పాటూ తిప్పుకోవడం చేస్తున్నాడు. తనకిష్టమైన జాజ్ సంగీతం వినడం, టీవీలో ఇష్టమైన సీరీస్ చూడడం బాగా తగ్గిపోయాయి! పుస్తకపఠనానికి పూర్తిగా స్వస్థి! 


ఈలోపున సాన్వీకి కమ్యూనిటీలో కొందరు స్నేహితులయ్యారు. ఒకరోజు శౌరీ … ఆఫ్ తీసుకుని ఇంటికి రాగానే … సాన్వీ కనపడలేదు ఇంట్లో! సెల్లార్ లోంచి ఏవో శబ్దాలొస్తే… కిందకు దిగి వెళ్తే… అక్కడ సాన్వీ.. ఇద్దరు అబ్బాయిలకూ, ఇద్దరు అమ్మాయిలకూ సాల్సా డాన్స్ నేర్పిస్తోంది. 


ఈ కూచిపూడి అమ్మాయేంటి?… ఈ లాటిన్ డాన్స్ ఏంటి… అని పిచ్చెక్కింది శౌరికి! అతన్ని వెయిట్ చెయ్యమని చెప్పి…”2-3, 3-2…. నౌ 3-2… నౌ 1,3,5,7….. బీట్స్…. “…అంటూ రిధిమ్ కు తగ్గట్టు స్టెప్స్ వేయిస్తూ…” నౌ ద సెషన్ ఈజ్ ఓవర్”… అంటూ ముగించింది. వాళ్ళు శౌరికి షేక్ హాండ్ ఇచ్చి… “షి ఈజ్ టూ గుడ్”! అనుకుంటూ వెళ్ళిపోయారు! దీని విషయమై మరో చిన్న గాలీవాన భార్యాభర్తల మధ్య! వాళ్ళ వివరాలు, పుట్టుపూర్వోత్తరాలు తెలియకుండా, అలా ఇళ్ళల్లోకి రానివ్వకూడదని… వాళ్ళలో కొందరికి నేరచరిత్ర ఉంటుందని, వాళ్ళు ముందు ముందు ఇబ్బందులు పెడతారని… శౌరి వాదన! దాన్ని కొట్టిపడేస్తూ సాన్వి! 


వీళ్ళనే పట్టుకుని మెల్లగా… కార్ డ్రయివింగ్ నేర్చేసుకుంది సాన్వీ! డ్రైవర్స్ లైసెన్స్ టెస్ట్ తీసుకునే ముందురోజునతెలిసింది శౌరికి. శౌరి చాలా భయస్థుడు. నిదానస్థుడు! పరాయిదేశంలో ఉంటున్నపుడు వాళ్ళ పద్ధతులను, వాళ్ళ చట్టాలనూ గౌరవించాలని భావించే మనిషి. అతను భయపడ్డట్టే…సాన్వి ఆదరాబాదరా డ్రైవింగ్ నేర్చుకుని, లైసెన్స్ తెచ్చుకున్నా… పూర్తిగా ఆ నగరం గురించి అవగాహన లేకుండా డ్రయివ్ చెయ్యడం వలన… రెండుసార్లు టికెట్స్ కూడా వచ్చాయి. దాంతో….ఈ అమ్మాయి ఏరోజు ..ఏ తలనొప్పి తెస్తుందా అనే టెన్షన్ ఎక్కువయింది శౌరికి! 


         మెల్లగా తెలుగుసంఘాలతో పరిచయాలు చేసుకుంది సాన్వి! నాలుగయిదు చిన్నాచితకా డాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చింది. వాటి కోసం శౌరి తన ప్రాజెక్ట్ పనులన్నీ పక్కన పెట్టి… తిరగాల్సి వచ్చింది!రెండుసార్లు బోస్టన్ వెళ్ళాలంది, మరోసారి అట్లాంటా! ఓపిగ్గానే తిప్పుతున్నాడు కానీ, తనకంటూ పర్సనల్ స్పేస్ లేకుండా ఇలా ఎన్నాళ్ళో తెలియట్లేదు! 


శౌరి బేసికల్ గా మంచివాడే! స్త్రీలంటే గౌరవం ఉన్నవాడే! కానీ సాన్వీ కోరుకునే కళాకారిణి జీవితం అతని అనుభవంలో ఎక్కడా చూడలేదు. పరిచయాలు పెంచుకుంటూ… చకచకా ఆమె ఇతరులతో అల్లుకుపోయే తీరు… ఆ బిడియస్థుడికి కాస్త ఇబ్బందిగా ఉంటోంది. తెల్లనివన్నీ పాలూ, నల్లని వన్నీ నీళ్ళు కాదని ఈ అమ్మాయికి ఎలా చెప్పాలో తెలియడం లేదు. 


          వాళ్ళ జీవితంలో అతిపెద్ద అగడ్త సృష్టించినరోజు ఆరోజు! సాన్వీని తీసుకుని లైబ్రరీకి వెళ్ళాడు శౌరి! ఆమెను డ్రామా అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెక్షన్లో వదిలి… అతను క్లాసిక్స్ సెక్షన్ కు వెళ్ళిపోయాడు! తిరిగి వచ్చేప్పుడు తను మ్యూజియమ్  లో ఉన్నానని… సాన్వీ ఇచ్చిన మెస్సేజ్ చూసుకుని…మ్యూజియమ్ లోకి ప్రవేశించాడు. అక్కడ ఏ మాత్రం కొత్తా, తడబాటూ లేకుండా… సాన్వీ అక్కడ గుమికూడిన ఓ ఏభైమందికి… కూచిపూడి శైలిలో నవరసాలను అభినయిస్తూ… డెమాన్ స్ట్రేషన్ ఇస్తోంది! 


“ దిస్ ఈజ్ శ్రింగార్… ద లవ్ అండ్ డిలైట్… దిసీస్ హాస్య, ద లాఫ్టర్.. దిస్ ఈజ్ రౌద్రమ్, ద ఫ్యూరీ అండ్ ఏంగర్…. అంటూ అద్భుతంగా అభినయిస్తూ చూపిస్తోంది. ఇంతలో అనుకోకుండా గుంపులోంచి… ఒక భారతీయసంతతి వాడే… అస్థిరంగా తూలుతూ వచ్చి, సాన్వీ చెయ్యి పట్టుకున్నాడు! “ నాతో కలిసి డాన్స్ చెయ్యి! ఇద్దరం కలిసి డెమో ఇద్దాం!”…. అంటూ ఆమె నడుం చుట్టూ చెయ్యేసి, ఇబ్బంది పెడుతున్నాడు. సాన్వీ ఈ హఠాత్ సంఘటనకు బిత్తరపోయి, గింజుకోసాగింది! 


కోపం పట్టలేక శౌరి అతనిపై చెయ్యిచేసుకోడం, కాప్స్ రావడం , కొంత గొడవ తరువాత, వీళ్ళను విడిచిపెట్టడం జరిగింది. 

ఇన్నేళ్ళూ ఒక్కరోజు కూడా ఎలాంటి వివాదాల్లో చిక్కుకోని  శౌరి… ఈ సంఘటనతో చాలా చికాకుపడ్డాడు. ఈవార్త లోకల్ పేపర్లలో రావడం అతన్ని మరింత కలవర పరిచింది. భార్యాభర్తల మధ్య రేగిన గొడవ చిలికి చిలికి గాలివానయ్యి… సాన్వీ ఇండియా వెళ్ళిపోతానని మంకుపట్టు పట్టడంతో… ఆమెను ఇండియా తెచ్చి వదిలేయడానికి…పేరెంట్స్ కు నోటీస్ ఇవ్వకుండానే… ఇదిగో ఇలా వచ్చేసాడు! 


           **************************

“ ఇంత కధ నడిపిందమ్మా నీ కోడలు. పట్టుపట్టి చేసావు కదా! ఇప్పుడు ఈ మేరేజ్ ఎంత వరకూ నిలబడుతుందో కూడా అనుమానమే!”..అంటూ నిరసనగా మాట్లాడుతున్న కొడుకును చూసి భయం వేసింది సుజాతకు! 


“ ఇండియాలోనే ఉండిపో శౌరీ! ఏ గొడవా వుండదు!”…. ఈ మాటలు శౌరి తండ్రివి, ఎప్పుడొచ్చారో వాకింగ్ నుండి! అంతా విన్నట్టే ఉన్నారు! 


“ నాన్నా! అదెలా సాధ్యం?ఇప్పటికిప్పుడు అన్నీ ఎత్తిపెట్టుకుని ఇండియా ఎలా వచ్చేయాలి? “…. అన్నాడు శౌరి కాస్త కోపంగా! 


“ కుదరకపోతే రిజైన్ చేసేవోయ్! మన వ్యాపారంలో పార్ట్ తీసుకో! ఉన్న ఒక్కడివీ… అక్కడ సెటిల్ అవ్వడానికని పంపలేదు నిన్ను. ఇక్కడ ఏం తక్కువని? ఇక్కడ అమర్చిన ఆస్థిపాస్థులు ఎవరు అనుభవించాలి? నువ్వూ, సాన్వి విడిపోయే ప్రసక్తి లేదు! ఇద్దరూ ఒకేచోట ఉండి తీరాలి. దిస్ ఈజ్ ఫైనల్!”…. అని గట్టిగానే చెప్పి, లోపలికి వెళ్ళిపోయారు! 


         ఇంక సుజాత మొదలుపెట్టింది. “ బాబూ! ఆ పిల్లకు డాన్సే సర్వస్వంరా! 20 ఏళ్ళ నాట్యసాధన, కెరియర్ ఒక్కసారి ఎలా వదిలేసుకోగలదు? పాపం అమెరికా వెళ్ళనంటే… వాళ్ళ వాళ్ళు నువ్వు మంచిపిల్లాడివని…నయాన నచ్చచెప్పి పంపారు. తనకు తోచినట్టు తను అక్కడ తన నాట్యాన్ని తీర్చిదిద్దుకుందామని ప్రయత్నించింది! ఇక్కడకు మీరిద్దరూ…వచ్చేస్తే, తన వ్యవహారాలు వాళ్ళ గురువుగారూ, వాళ్ళ నాన్నగారూ చూసుకుంటారు! నీకు పెద్ద టెన్షన్ ఉండదు! నువ్వు కూడా ఇక్కడే మీ కంపెనీకి ట్రాన్స్ ఫర్ పెట్టుకో! మధ్యమధ్యలో…యుఎస్ వెళ్ళి… వస్తూ ఉండచ్చు ఇద్దరూ! “…. బుజ్జగించింది కొడుకును! 


“ మొత్తానికి ఇరికించేసారమ్మా! నా జీవితంలో ఏ మార్పూ ఉండదు. ఒక పంజరం నుండి ఇంకా పెద్ద పంజరంలోకి! అంతే కదా! “…. అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు శౌరి! 


                **********************


“ భామనే సత్యభామనే

వయ్యారి ముద్దుల… సత్యభామనే …

భామనే పదియారువేల కోమలూ లందరిలోనా….

లలనా చెలియా మగువా సఖియా…

రామరో గోపాలదేవుని ప్రేమనూ దోచినదానా… భామనే।। 


భామరో శృంగార జగదభిరామినే

ముఖవిజిత హేమాధామనే

ద్వారకాపురాఢ్యురామనే

వయ్యారి సత్యభామనే…. అంటూ సత్యభామ ఆహార్యంలో దేదీప్యమానంగా వెలిగిపోతోంది సాన్వి వేదికమీద! 


తన పొడవైన బంగారుజడను… అతిశయంగా కుడిచేత పట్టి….క్రిష్ణుని పట్ల తన ప్రేమలోని వివిధ పార్శ్వాలను అభినయిస్తోంది! క్రిష్ణుడికి దూరమై తనెంత విరహవేదన అనుభవిస్తోందో చెప్తూ.. తాము కలిసి వున్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో చెప్తూ… తన నాట్యాభినయంతో ప్రేక్షకులను ముగ్దుల్ని చేసింది సాన్వి! ప్రేక్షకుల్లో కూర్చున్న శౌరిని చూసినప్పుడల్లా… ఆమె మొహంలో చిరునవ్వుతో కూడిన మైమరుపు చూసి… శౌరి మనసు ఆమెపట్ల ,ప్రేమతో నిండిపోయింది! 


         “ఇంత గొప్ప కళాకారిణినా తను పంజరంలో బంధించబోయాడు. పైగా తనను బంధీ చేసిందని నేరారోపణతో…! కళలు దైవదత్తము! కళాకారుల ఆత్మ తమ కళలతో పెనవేసుకుని ఉంటుంది. ఆ కళను దాని సహజవాతావరణం నుండి లాక్కునిపోయి… బంధిస్తే.. ఆ కళాకారునికి ఏం చెయ్యాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అయ్యి… తన కళను రక్షించుకునే దిశలో ప్రయత్నిస్తాడు. సాన్వీ విషయంలో అదే అయ్యింది. ఆమె కళ భారతీయం, ఆమె ఆత్మ భారతీయం, ఆమె మూలాలు భారతీయం! భారతదేశపు నేలతో ఆమెకున్న అనుబంధం తను త్రుంచకూడదు! ఆమె కోసం, అమ్మానాన్నల కోసం…కష్టమైనా, నష్టమైనా… తను ఇక్కడే ఉండాలి! “…. అని మనసులో ధృఢనిశ్చయం చేసుకున్నాకా…అతనికి చాలా హాయిగా అనిపించింది. 


జీవనదిని వదిలి ,మరీచికల వెంట పరుగెట్టిన తనకు… శృంఖలాలు తెగి… స్వేచ్ఛ వచ్చిన భావన! 


         నాట్య ప్రదర్శనానంతరం… గ్రీన్ రూమ్ లో కోడలి… సత్యభామ బంగారుజడను సున్నితంగా జడ నుండి విడదీస్తోంది సుజాత! 


“ అత్తయ్యా! ఈ బంగారుజడ ఇకపై…అచ్చంగా నాదే కదూ!”…. అంది నవ్వుతూ సాన్వి! అర్ధం కానట్టు చూసింది సుజాత!


“ నా పెళ్ళిలో ఈ జడ నా చేతికిచ్చి , ఏమన్నారు మీరు? ఏడాదిలో… నా కొడుకు..ఈ జడ పట్టుకుని ఇండియా వచ్చేయాలి అన్నారా ? లేదా? “…. అంటూ … కిలకిలా నవ్వింది ఆధునిక సత్యభామ సాన్వి! 


ఆశ్చర్యంతో, ఆనందంతో నోరు పెగలని అత్తగారితో….


“ ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే

జాణతనమున సతులలో నెరజాణనై వెలిగేటిదాన! …. భామనే సత్యాభామనే!”….. 


అంటూ జడపట్టుకుని వయ్యారంగా అభినయిస్తున్న సాన్విని బుగ్గమీద గట్టిగా ముద్దుపెట్టుకుని…


.” అవును తల్లీ! శౌరి ఎప్పుడూ సత్యాపతే! మీరజాలగలడా నీ యానతి మరి! “… అంది అత్తగారు హాయిగా నవ్వేస్తూ! 


ధన్యవాదాలతో

శశికళా ఓలేటి!

ప్రకృతి యనగా జీవ లక్షణము

 శక్తి పదార్ధ రూపం దాల్చిన ప్రకృతి. ప్రకృతి యనగా జీవ లక్షణము. దీనికి మూలమైన శక్తి ఏడు రోజులకు అధిపతులైన గ్రహములు. వీటికి మూలమైన శక్తి రాహు కేతు శక్తి. శక్తి రూపం మారి పదార్ధరూపమై రంగు రస రూప లక్షణముగా మారి జీవ ప్రకృతిని శాసించుచున్నది. ప్రకృతికి ఎవరైనా లోబడి వుండాలి. లేదా వినాశనం. ప్రకృతిని సమపాళ్ళలో అనుభవమే జీవ లక్షణములతో కూడిన జీవితం. అది మార్పు చెందనియెడల మానవ మనుగడ ప్రశ్నార్ధకము? రాహు కేతువులను గ్రహములలో చేర్చియుండలేదు.ఏడు గ్రహముల ఏడు రోజులకు మూలం 7 గ్రహములకు కారణమైన మూల శక్తి తత్వము.ప్రుంచమంతా ఏడు రోజులే గణన. ఏ మతమును ఏ దేశమును రోజులగణనలో మార్పు లేదు. యిది వేద గణనీయమైన సిద్దాంతం కాల గణనకు.వీటికి గ్రహముల మూలం. వాటి పేర్లే వాటికి మూలం. భాషలో మార్పు తప్ప గ్రహ శక్తిలో మార్పు లేదు. రాహు కేతు శక్తిని మాత్రమే వేదము శక్త రూపముగా నిర్వచించి వాటిని మిగిలిన గ్రహముల చైతన్య శక్తి అనుసంధాన మునకు కారణంగా తెలియుచున్నది. ప్రతీ గ్రహములకు  శక్తిని వివిధ చలన, రూప, రస, గంధ లక్షణ తత్వములును  భూమి స్వీకరించుటవలననే మానవ జీవము ఆధారపడియున్నది.వీటివలననే వృక్ష ఫలములను క్షేత్ర శక్తి యైన భూమి తద్వారా ప్రకృతికి మూలము.రాహు కేతు వులు పూర్ణమైన పదార్ధ లక్ణణములు గలవైనచో వాటిని కూడా చేర్చి నవ తొమ్మిది రోజులుగా వుండవలెను.పేరుకి గ్రహములు మాత్రమే వాటి ప్రాధాన్యత వలననే మిగిలిన గ్రహచలనములకు మూలం. శక్తి చలనము వలననే ప్రకృతి మార్పు.రాహు కేతువులకు వాటికి సరియైన ప్రకృతి, రూపపదార్ధ లక్షణము లేని మూలంగా మిగిలినవాటిని  7 గ్రహములుగా మాత్రమే నిర్ణయించిరి.వీటికి కూడా నక్షత్ర కాంతి వలననే వీటి మనుగడ. వాటిలో గూడా రాహు కేతు సంబంధమైన 6 నక్షత్రాల శక్తిని మినహాయించి మిగిలిన వాటియెుక్క  పదార్ధ లక్షణ కాంతిని మాత్రమే ప్రకృతిని ప్రభావితము  చేయునట్టుగా దక్షునిచే వక కారణంగా చేయుట కార్యరూప నిర్ణయము. అందుకే అహంకారము. అదే పతనం.  అశ్వనీ, మఘ,మూల ,కేతు నక్షత్ర శక్తి, మరియు ఆర్ద్ర, స్వాతి, శతభిషం రాహు శక్తిని వివిధ డిగ్రీలలో వాటి శక్తిని భూచలనమునకు వీలుగా యుండి వీటి శక్తిని మిగిలిన నక్షత్ర శక్తిని గ్రహముల ద్వారా ప్రభావితం చేసి మిగిలిన గ్రహముల ద్వారా మనకు అనగా భూమిపై గల జీవులకు సూర్య శక్తి ద్వారా ప్రభావితము చేయుచున్నవి. మిగిలిన ఏడు గ్రహములలో శివ శక్తి మూడు, విష్ణు శక్తికి మూడు,చంద్రుని మినహాయించి వాటి గమనమునకు మూలముగా చంద్రుని ద్వారా జీవ సృష్టి సాధనకు నిర్ణయం. మనకు దీనినే హరి హర తత్వంగా తెలియుచున్నది.రాహు కేతు తత్వమే హరిహర తత్వం. అవి రెండు విడిగా కనబడుచున్ననూ వకే శక్తి.నిర్గుణ శక్తి సగుణ శక్తిగా కనపడుట.ఏడుగ్రహముల పూర్తి లక్షణములు భౌతికంగా తెలియుటయను ప్రయత్నం వృధా.మానవుని యెుక్క వక జీవిత కాలము సరిపోదు భౌతికంగా. ఎందుకనగా పూర్ణమైన శక్తి తెలియుట అనగా నిత్య నూతనమైన యౌవన  శక్తి పూర్ణ తత్వమునకు మూలము కనుక.భగవశ్శక్తి నిత్య నూతనమైన ప్రకృతి రూపం. లేని యెడల సృష్టి క్రమం ఆగిపోవును. యిక నక్షత్రములు వాటి లక్షణములు  భౌతికంగా గ్రహించుట అసంభవమైన పని. వాటి శక్తి  మానవ జీవనమును గమనమునకు వాటి మూల శక్తి లక్షణము భగవతత్త్వంగా తెలియుట ఙ్ఞానం. తెలియనిది అంతా దైవము. తెలిసినది ఏదీ లేదు. తెలిసినదీ అని అనుకోవడం అఙ్ఞానం అనే అహంకారం. ఏక వింశతి నక్షత్ర శక్తి 21 నక్షత్రము ద్వారా కలిగేశక్తి మాత్రమే ఏకవింశతి మహా దోషములుతోగూడియున్నదనిశాస్త్రము. యివి నిరోధించుటకు ఎవరికైనా అసంభవం. పూర్ణమైన భగవతత్వం పై దోషములకు అతీతం. మానవులకు వీటిని జయించుట అసంభవం. అన్ని అవతారములలో రామావతారము పూర్ణమైవుండి పూర్ణ లక్షణము తెలియక పోవుటయే దీనికి ఉదాహరణ. శ్రీరామ జనన గ్రహ గతి తిరిగి మరల వచ్చుట ఖగోళంలో అసంభవం. భౌతిక వాదులకు ఎన్ని సంవత్సరాలైన ఎవరికివారు వాళ్ళే ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ అలాంటి గ్రహగతులు శక్తిని భూమి స్వీకరించుటఅసంభవం మానవులకు కూడా.అవతారము ఆవిర్భావరూపము కూడా వుండదు.వకసారి పూర్ణ లక్షణమును నిరూపణ చేయుటయే దీని తత్వం. పదే పదే సార్లు యిట్టి పూర్ణ తత్వమును తెలుపుట అవసరం లేదు. మానవ పరిణామ క్రముము కూడా అంతే. వకే జీవి తిరిగి తిరిగి అదే జీవ లక్షణములుగా అదే ప్రదేశములో అదే గర్భంలో పుట్టుట ఎలా అసంభవమెూ అదే సృష్టియెుక్క మాయ రూపం. విలక్షణ మైనది విచిత్రమైనది కూడా. ఙ్ఞానము వలననే జీవ తత్వం అనే మాయ తత్వం తెలియుట.అనంతమైన ఙ్ఞానమును స్వచ్చమైన భక్తి అనే సూత్రము ద్వారానే. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

*10.ఉదంక మహర్షి.*

 *🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏*

*10.ఉదంక మహర్షి.*

    ఉదంక మహర్షి భృగువంశంలో పుట్టాడు . గౌతమ మహర్షి దగ్గర విద్య నేర్చుకున్నాడు . ఆ కాలంలో గురువుగారికి సేవచేస్తూ విద్య నేర్చుకునేవారు . గురువుగారు శిష్యుడ్ని పిలిచి శిష్యా ! నీ చదువు అయిపోయింది . ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు అంటే చదువయిపోయినట్లే . అంతే గానీ , ఇప్పట్లో సర్టిఫికెట్లు లాంటివి ఏమిలేవు . చాలా సంవత్సరాలు గడిచిపోయినా ఉదంక మహర్షి చదువయిపోయిందని గౌతమ మహర్షి చెప్పలేదు . ఉదంకుడు కూడ అలా సేవ చేస్తూనే ఉండిపోయాడు . ఒకసారి అడవినుంచి కట్టెల మోపు తీసికొచ్చి కిందపడేసినప్పుడు ఉదంకుడి జుట్టు దాంట్లో చిక్కుకుని కట్టె పుల్లలతో పాటు ఊడి వచ్చేసింది . ఆ ఊడిపోయిన జుట్టు తెల్లగా ఉండడం చూసి ఉదంకుడు అయ్యో ! నా బాల్యం , యౌవనం అంతా ఇక్కడే గడిచిపోయింది . నా చదువు ముసలితనం వచ్చినా పూర్తవలేదని బాధపడ్డాడు . గౌతమ మహర్షి ఉదంకుణ్ణి పిలిచి నాయనా ! బాధపడకు నీ గురుభక్తిని పరీక్షించాను . నీ ముసలితనం పోయేలా చేస్తాను . నాకూతుర్నిచ్చి పెళ్ళి చేస్తాను అన్నాడు . మరి గురువుగారి కూతుర్ని చేసుకోకూడదు కదా అని ఆలోచించకు నీ శరీరాన్ని మార్చినట్టే ఆమె శరీరాన్ని కూడా మార్చి పెళ్ళి చేస్తానని చెప్పి తన కూతుర్నిచ్చి పెళ్ళిచేశాడు గౌతమమహర్షి .

           మన ఉదంకుడు అంతటితో ఊరుకున్నాడా .... స్వామీ ! మీకు గురుదక్షిణ ఇస్తాను అన్నాడు . గౌతమ మహర్షి నీ గురుభక్తే నాకు గురుదక్షిణ . ఇంకేమీ వద్దు నాయనా ! అన్నాడు . ఉదంక మహర్షి ఊరుకోక గురువుగారి భార్యని అడిగాడు . ఆవిడ కూడ అదే చెప్పింది . కాని ఉదంకుడు ఏదో ఒకటి అడగమన్నాడు . అపుడు గురువుగారి భార్య మిత్రసహుడు అనే మహారాజు భార్యకి కుండలాలు ఉన్నాయి , అవి నాకు కావాలి అనడిగింది . ఉదంకుడు బయలుదేరి మిత్రసహుడనే రాజు దగ్గరకి వచ్చాడు . ఆ రోజుల్లో రాజుకి ఒక శాపం ఉంది . రాక్షసుడిగా తిరుగుతూ మనిషి మాంసం తినమని . ఉదంకుడిని చూడగానే రా ! రా ! వచ్చావా .. ఇప్పుడే నిన్ను తినేస్తా అన్నాడు . ఉదంకుడు మహారాజా ! నీ భార్య కుండలాలు నాకు ఇప్పించు . అవి నా గురువుగారి భార్యకిచ్చి మళ్ళీ వస్తాను , అప్పుడు నన్ను తినెయ్యి అన్నాడు . సరే నిన్ను చూస్తే మంచివాడిలా ఉన్నావు ఇప్పిస్తానని భార్యకి చెప్పి కుండలాలు ఇప్పించాడు రాజు . ఉదంకుడు ఆ కుండలాలు తీసుకుని , ఇవి గురువుగారి భార్యకిచ్చి వస్తాను నన్ను తింటానన్నావు కదా ! అప్పుడు తిను అన్నాడు . అన్నమాట ప్రకారం తిరిగివచ్చిన ఉదంకుని చూసి రాక్షసుడి మనసు కరిగిపోయింది . స్వామీ ! “ నన్ను క్షమించు ” అన్నాడు . ఉదంక ముహర్షి ఆకసుడి వీపు నిమిరి పరవాలేదులే , అన్నాడు . ఉదంక మహర్షి చెయ్యి తగలగానే


రాక్షసుడికి రాజు రూపం వచ్చేసింది . మిత్రసహమహారాజు ఉదంక మహర్షిని మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అన్నాడు . భోజనం చేస్తుండగా అన్నంలో తలవెంట్రుకలు వచ్చాయి . ఉదంక మహర్షి రాజుని గుడ్డివాడయిపోతావని శపించాడు . రాజు తిరిగి ఉదంక మహర్షిని శపించాడు . ఉదంక మహర్షి రాజుకిచ్చిన శాపం ఉపసంహరించుకుని వెళ్ళిపోయాడు . ఏమయినా మహరులకి కోపం ఉండకూడదు కదా .... ఉదంక మహర్షి కుండలాల్ని ఒక పట్టుబట్టలో చుట్టుకొని తీసికెడుతున్నాడు . మధ్యలో ఆకలికి ఆగలేక ఒక చెట్టెక్కి ఆ మూటని ఒక కొమ్మ మీద పెట్టి పండ్లు కోసుకుంటున్నాడు . ఆ మూట క్రింద పడిపోయింది . ఆ మూటని ఒక నాగరాజు తీసికుని పుట్టలోంచి పాతాళంలోకి వెళ్ళిపోయాడు . అప్పుడు ఉదంక మహర్షి ఆ పుట్టని తవ్వడం మొదలెట్టాడు . ఇది చూసి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఉదంకా ! ఆ కుండలాలు పాతాళలోకంలో ఉన్నాయి . నువ్వు పడుతున్నది అనవసర శ్రమన్నాడు . ఉదంకుడు ఎక్కడ ఉన్నా సరే అవి నా గురువుగారి భార్యకివ్వాల్సిందే అని సుళ్ళీ తవ్వడం మొదలు పెట్టాడు .


అప్పుడు ఇంద్రుడు ఉదంకుడు ఉపయోగిస్తున్న కర్రకి వజ్రాయుధానికి వున్నంత శక్తినిచ్చాడు . అలా తవ్వుతుంటే భూదేవి భయపడిపోయి పాతాళానికి దారిచ్చేసింది . పాతాళ లోకంలో కుండలాలు ఎక్కడ ఉన్నాయో తెలియక ఉదంకుడు నాగుల్ని ప్రార్థించాడు . ఉదంకుడు నలుపు తెలుపు దారాలతో బట్టలు వేస్తున్న ఇద్దరు ఆడవాళ్ళనీ , చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు కుమారులనీ , పెద్ద గుఱ్ఱమెక్కి ఉన్న ఒక గొప్ప పురుషుణ్ణి చూసి స్తోత్రం చేశాడు . వాళ్ళు నీకేం కావాలో అడగమన్నారు . ఉదంక మహర్షి ఈ నాగులన్నీ నాకు వశమయిపోవాలన్నాడు . అయితే నువ్వు ఈ గుఱ్ఱం చెవిలో ఊదమన్నాడు ఆ మహాపురుషుడు . ఉదంకుడు అలా చెయ్యగానే పాతాళలోకమంతా కూడ మంటలు వచ్చేశాయి . తక్షకుడు అనే పాము తక్షణమే కుండలాలు తెచ్చి ఉదంకుడకి ఇచ్చేసింది . ఉదంకుడికి గురువుగారి భార్య ఇచ్చిన గడువు ఆ రోజుతో అయిపోతుంది . అతడు బాధపడుంటే గుఱ్ఱం మీద ఉన్న ఆ దివ్య పురుషుడు ఈ గుర్రమెక్కి ఎక్కడికి వెళ్లాలో తల్చుకో అక్కడికి వెళ్ళిపోతావన్నాడు . ఉదంకుడు గుఱ్ఱం మీద కూర్చుని గౌతమ మహర్షి ఇంటికి వచ్చాడు . గురుపత్ని అహల్య కుండలాలు ధరించి పూజ పూర్తిచేసుకుని బ్రాహ్మణులకి భోజనం పెట్టింది.


ఉదంక మహర్షి గురువుగార్ని దివ్యపురుషుడు , ఆరుగురు కుమారులు , తెలుపు , నలుపు దారాలతో బట్టలు వేస్తున్న ఇద్దరు స్త్రీలు వీళ్ళందరూ ఎవరు స్వామీ ? అని అడిగాడు . గౌతమ మహర్షి నాయనా ! ఆ దివ్య పురుషుడు ఇంద్రుడు , ఆరుగురు కుమారులున్నారే వాళ్ళు ఆరు ఋతువులు , ఆడవాళ్ళని ఇద్దర్ని చూశావు కదా ! అది రాత్రి పగలు , ద్వాదశ చక్రం చూశావు కదా అది పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సర కాలం . ఇంద్రుడికి స్నేహితుడున్నాడే పర్జన్యుడు అతడే ఆ గజ్జం . ఇవన్నీ చూడగలిగిన నువ్వు ఎంతో అదృష్టవంతుడివి . ఇంక నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి నీ భార్యతో కలిసి వెళ్ళమన్నాడు . ఉదంక మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళినా కూడ నాగరాజు తక్షకుడు చేసిన అవమానం మర్చిపోలేక జనమేజయ మహారాజుతో సర్పయాగం చేయించాడు . అస్తీక మహర్షి వచ్చి ఆ యాగం ఆపించి నాగుల్ని రక్షించాడు . ఉదంక మహర్షి శివుడ్ని గురించి గొప్ప తపస్సు చేశాడు . శివుడు ప్రత్యక్షమై ఉదంకా ! నీకు ఏంకావాలో కోరుకో అన్నాడు . మన ఉదంకుడు డబ్బు కావాలి లేకపోతే మంత్రి పదవి కావాలి అని అడగలేదు . స్వామి ! నేను ఎప్పుడు ధర్మాన్ని విడవకుండా , నిజాన్నే మాట్లాడుతూ నీ మీద భక్తి కలిగి ఉండాలి అన్నాడు . శివుడు నువ్వు లోకం కోసం నుంచి పనులు చేస్తూ జీవించు అని దీవించాడు  ఉదంకుణ్ణి .



ఆ కాలంలో మధుకైటభులు అనే రాక్షసుల వంశంలో ధుంధుడు అనే వాడు పుట్టాడు . వాడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి వరం తీసుకుని దేవతల్ని , గంధర్వుల్ని . , రాక్షసుల్ని అందర్నీ చంపేస్తున్నాడు . సముద్రం దగ్గర పెద్ద గొయ్యి చేసుకుని దాంట్లో పడుకుంటూ వుండేవాడు . వాడు విడిచిన గాలి సంవత్సరానికి ఒకసారి పైకి వచ్చి పెద్దగాలి దుమారం లేపేది . అది వచ్చినప్పుడు ఏడు రోజులదాకా చెట్లు ఊగుతూనే ఉండేవి . అందరూ చాలా భయపడున్నారని ఉదంక మహర్షి బృహదశ్వుడు అనే రాజుకి చెప్పి ఆ రాక్షసుణ్ణి చంపించమని అడిగాడు . బృహదశ్వుడి కొడుకు కువలాశ్వుడు తండ్రి మాట ప్రకారం ఆ రాక్షసుణ్ణి చంపేశాడు .


 ఒకసారి శ్రీకృష్ణుడు హస్తినాపురం నుంచి ద్వారకానగరానికి వెడుతూ ఉదంక మహర్షి ఆశ్రమానికి వచ్చాడు . ఉదంక మహర్షి ఆయన్ని పూజించి స్వామీ ! నువ్వు సంధి చెయ్యకలిగి కూడ కౌరవులకీ , పాండవులకీ యుద్ధం జరిగేలా ఎందుకు చేశావు ? అని అడిగారు.


శ్రీకృష్ణుడు ఉదంక మహర్షితో సత్త్వరజ , తమోగుణాలు నావశంలో ఉంటాయి . మరుత్తులు , వసువులు అందరూ నాలోంచే పుట్టారు . ఓంకారంతో ఉన్న వేదాలు నేనే . నాలుగు ఆశ్రమాలు , అన్ని కర్మలు , అన్ని మోక్షాలు నావశంలో ఉంటాయి . మనస్సు చేసే ధర్మాలన్నింటికి కారణం నేనే . బ్రహ్మ , విష్ణువు , ఈశ్వరుడు ఈ మూడూ నేనే . లోక రక్షణకోసం అధర్మాన్ని జయించి ధర్మాన్ని కాపాడతాను . కౌరవులు అధర్మం గల పన్లే చేశారు , వాళ్ళని చంపడం కోసమే యుద్ధం జరిగేలా చేశానని చెప్పాడు . అప్పుడు ఉదంక మహర్షి విశ్వరూపం చూపించమని అడిగి విశ్వం అంతా వ్యాపించి ఉన్న ఆయన రూపాన్ని చూసి నా జన్మ ధన్యమైందని ఆనందించాడు . 


        *శ్రీకృష్ణుడు నీకు ఏం వరం కావాలో కోరుమన్నాడు . నేనుండే ప్రదేశంలో నీళ్ళు లేక అందరూ బాధపడుతున్నారు . నీరు ఇమ్మని అడిగాడు ఉదంకుడు . బ్రతికినంత కాలం నువ్వు తల్చుకోగానే వర్షాలు పడతాయని వరమిచ్చాడు శ్రీకృష్ణుడు . ఆ మేఘాన్ని ' ఉదంకమేఘం ' అంటారు . ఉదంకుడు బ్రతికినంతకాలం లోకాన్ని ఉద్ధరించడానికే బ్రతికి చివరకి మోక్షం పొందాడు . ఉదంక మహర్షి మనం గురుభక్తితో , స్వార్ధం లేకుండ అందరి కోసం మంచి పన్లు చెయ్యడం ఎలాగో తెలియచెప్పాడన్నమాట.*

*10.ఉదంక మహర్షి.*


*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*నిరంతర ధ్యానం..*


శ్రీ స్వామివారు సాధన చేసుకునే గది ముందు దాదాపు అరగంట నుంచీ నేను ఎదురు చూస్తూ వున్నాను..శ్రీ స్వామివారు బైటకు రాలేదు..చేసేదేమీ లేక, నా చేతిలో ఉన్న స్టీలు బాక్స్ ను ప్రక్కనున్న వంట గదిలో పెట్టి నేను తిరిగి మొగలిచెర్ల లోని మా ఇంటికి వెళ్ళిపోయాను..ప్రక్కరోజు ఉదయం మళ్లీ ఆహారం తీసుకొని వచ్చాను..ఆ గది తలుపులు మూసే ఉన్నాయి..శ్రీ స్వామివారు బైటకు రాలేదు..వంటగదిలో చూస్తే..నిన్న నేను తీసుకొచ్చిన అన్నపు డబ్బా అలానే ఉన్నది..కనీసం ఆ డబ్బా మూత కూడా తీసిన జాడలు లేవు..ఇలా సుమారు నాలుగు రోజుల పాటు..రోజూ నేను ఆహారం తీసుకు రావడం..ముందురోజు తెచ్చిన డబ్బానును పట్టుకొని ఇంటికి తిరిగి వెళ్లడం జరుగుతున్నది..


అమ్మతో ఈ విషయమే చెప్పాను.."అమ్మా!..నువ్వు రోజూ అన్నం పంపుతున్నావు..స్వామివారు తినడం లేదు..కనీసం ఆ గది నుంచి బైటకు కూడా వస్తున్నట్లు లేరు..ఈరోజు ఐదవ రోజు..ఇందాక నువ్విచ్చిన డబ్బా ను అక్కడ వంటగదిలో పెట్టి వచ్చాను..నిన్నటిది తీసుకొచ్చాను..ఆయనే వండుకుంటున్నారేమో తెలీదు..ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నేను గమనిస్తూనే వున్నాను..అన్నం తింటున్నట్లు లేదు..తపస్సులోనే ఉన్నారేమో తెలీదు".. అని.."అలాగా.." అన్నది అమ్మ .


ఆరోరోజు ఉదయం ఎనిమిది గంటల లోపే నేను ఆశ్రమానికి వెళ్ళిపోయాను..ఆరోజు శ్రీ స్వామివారికి ఆహారం ఇచ్చి..అటునుంచి మా పొలానికి వెళ్లి రమ్మని నాన్నగారు చెప్పారు.(మాగాణి గా పిలువబడే మా పొలం..మన్నేరు నది అవతల మఱ్ఱిగుంట గ్రామ సరిహద్దుల లో ఉన్నది..శ్రీ స్వామివారి ఆశ్రమం మీదుగానే వెళ్ళాలి..కాలినడకనే వెళ్లి వస్తుండే వాళ్ళము..) యధాప్రకారం నేను తెచ్చిన డబ్బాను ఆశ్రమం లోని వంటగదిలో పెట్టి..నేను మా పొలానికి వెళ్ళిపోయాను..అక్కడ పని చూసుకొని సాయంత్రం నాలుగు గంటల వేళ తిరిగి ఆశ్రమానికి వచ్చాను..శ్రీ స్వామివారి కోసం ఎదురుచూడకుండా నేరుగా వంటగది లోకి వెళ్లి, ఆ  డబ్బా చేతులోకి తీసుకొని బైటకు వచ్చాను..


ఇంతలో శ్రీ స్వామివారు తాను ధ్యానం చేసుకుంటున్న గది తలుపు తీసుకొని బైటకు వచ్చారు..నన్ను గమనించారో లేదో తెలీదు..నేరుగా బావి వద్దకు వెళ్లి..గబ గబా బావిలోంచి నీరు తోడుకొని..నెత్తిన పోసుకున్నారు..దాదాపు ఇరవై నిమిషాల పాటు అలా స్నానం చేస్తూనే ఉన్నారు..దగ్గరలోనే ఉన్న నన్ను పట్టించుకోలేదు సరికదా..నా వైపు కూడా చూడలేదు..


స్నానం పూర్తి అయ్యాక..నీళ్లు కారుతున్న ఆ దేహం తోనే ఐదారు నిమిషాల పాటు సూర్యుడికి అభిముఖంగా నిలబడ్డారు..ఆ తరువాత వెనక్కు తిరిగి లోపలికి వస్తూ..నన్ను చూసి ఆగి.."అన్నం తెచ్చావా?.." అన్నారు..

"ఉదయమే తెచ్చి ఇక్కడ పెట్టి మాగాణికి వెళ్ళాను స్వామీ..మీరు అప్పుడు లేరు..ఇప్పుడు వెనక్కు తీసుకెళదామని అనుకున్నాను.." అన్నాను..


ఒక్కక్షణం నన్ను తేరిపారా చూసి..నా చేతిలో ఉన్న డబ్బాను తీసుకొని..వంటగది ముందున్న బల్ల మీద కూర్చుని..అందులోని అన్నాన్ని తిన్నారు..బావి వద్దకు వెళ్లి చేయి కడుక్కుని.. నా దగ్గరకు వచ్చి..

"ఈరోజు తారీఖు ఎంత?.." అన్నారు..

చెప్పాను..


కళ్ళు మూసుకొని ఏవో లెక్కలు వేసుకొని..కళ్ళు తెరచి.."వారం రోజులు పూర్తి అయ్యాయి.." అని గొణుక్కున్నారు.. నావైపు తిరిగి .. "నువ్వు ఇంటికెళ్లు..రేపు ఎల్లుండి కూడా ఆహారం వద్దు..అమ్మా నాన్న గార్లను ఆ తరువాత రోజు రమ్మన్నానని చెప్పు.." అన్నారు..


సరే నన్నట్లుగా తలూపి..నేను వచ్చేసాను..జరిగిందంతా పూసగ్రుచ్చినట్లు అమ్మకు నాన్నకు చెప్పాను..


"వారం పాటు ధ్యానం లో ఉన్నారా?..ఎలా ఉన్నారో?..ఇలా ఏ ఆహారం తీసుకోకుండా వుంటే..ఆరోగ్యం క్షీణించి..ఏదైనా జరిగితే కష్టం కదండీ.." అని నాన్నగారితో అన్నది అమ్మ.


నాన్నగారు.."సరే ప్రభావతీ!..రెండు రోజుల తరువాత మనలను రమ్మన్నారు కదా..మనమే వెళ్ళొద్దాము..అప్పుడు అడుగుదాము" అన్నారు..


ఆ తరువాత మూడోరోజు అమ్మా నాన్న గార్ల సందేహానికి సమాధానం దొరికింది..


ఆ విషయ ప్రస్తావన రేపు తెలుసుకుందాము..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).