శక్తి పదార్ధ రూపం దాల్చిన ప్రకృతి. ప్రకృతి యనగా జీవ లక్షణము. దీనికి మూలమైన శక్తి ఏడు రోజులకు అధిపతులైన గ్రహములు. వీటికి మూలమైన శక్తి రాహు కేతు శక్తి. శక్తి రూపం మారి పదార్ధరూపమై రంగు రస రూప లక్షణముగా మారి జీవ ప్రకృతిని శాసించుచున్నది. ప్రకృతికి ఎవరైనా లోబడి వుండాలి. లేదా వినాశనం. ప్రకృతిని సమపాళ్ళలో అనుభవమే జీవ లక్షణములతో కూడిన జీవితం. అది మార్పు చెందనియెడల మానవ మనుగడ ప్రశ్నార్ధకము? రాహు కేతువులను గ్రహములలో చేర్చియుండలేదు.ఏడు గ్రహముల ఏడు రోజులకు మూలం 7 గ్రహములకు కారణమైన మూల శక్తి తత్వము.ప్రుంచమంతా ఏడు రోజులే గణన. ఏ మతమును ఏ దేశమును రోజులగణనలో మార్పు లేదు. యిది వేద గణనీయమైన సిద్దాంతం కాల గణనకు.వీటికి గ్రహముల మూలం. వాటి పేర్లే వాటికి మూలం. భాషలో మార్పు తప్ప గ్రహ శక్తిలో మార్పు లేదు. రాహు కేతు శక్తిని మాత్రమే వేదము శక్త రూపముగా నిర్వచించి వాటిని మిగిలిన గ్రహముల చైతన్య శక్తి అనుసంధాన మునకు కారణంగా తెలియుచున్నది. ప్రతీ గ్రహములకు శక్తిని వివిధ చలన, రూప, రస, గంధ లక్షణ తత్వములును భూమి స్వీకరించుటవలననే మానవ జీవము ఆధారపడియున్నది.వీటివలననే వృక్ష ఫలములను క్షేత్ర శక్తి యైన భూమి తద్వారా ప్రకృతికి మూలము.రాహు కేతు వులు పూర్ణమైన పదార్ధ లక్ణణములు గలవైనచో వాటిని కూడా చేర్చి నవ తొమ్మిది రోజులుగా వుండవలెను.పేరుకి గ్రహములు మాత్రమే వాటి ప్రాధాన్యత వలననే మిగిలిన గ్రహచలనములకు మూలం. శక్తి చలనము వలననే ప్రకృతి మార్పు.రాహు కేతువులకు వాటికి సరియైన ప్రకృతి, రూపపదార్ధ లక్షణము లేని మూలంగా మిగిలినవాటిని 7 గ్రహములుగా మాత్రమే నిర్ణయించిరి.వీటికి కూడా నక్షత్ర కాంతి వలననే వీటి మనుగడ. వాటిలో గూడా రాహు కేతు సంబంధమైన 6 నక్షత్రాల శక్తిని మినహాయించి మిగిలిన వాటియెుక్క పదార్ధ లక్షణ కాంతిని మాత్రమే ప్రకృతిని ప్రభావితము చేయునట్టుగా దక్షునిచే వక కారణంగా చేయుట కార్యరూప నిర్ణయము. అందుకే అహంకారము. అదే పతనం. అశ్వనీ, మఘ,మూల ,కేతు నక్షత్ర శక్తి, మరియు ఆర్ద్ర, స్వాతి, శతభిషం రాహు శక్తిని వివిధ డిగ్రీలలో వాటి శక్తిని భూచలనమునకు వీలుగా యుండి వీటి శక్తిని మిగిలిన నక్షత్ర శక్తిని గ్రహముల ద్వారా ప్రభావితం చేసి మిగిలిన గ్రహముల ద్వారా మనకు అనగా భూమిపై గల జీవులకు సూర్య శక్తి ద్వారా ప్రభావితము చేయుచున్నవి. మిగిలిన ఏడు గ్రహములలో శివ శక్తి మూడు, విష్ణు శక్తికి మూడు,చంద్రుని మినహాయించి వాటి గమనమునకు మూలముగా చంద్రుని ద్వారా జీవ సృష్టి సాధనకు నిర్ణయం. మనకు దీనినే హరి హర తత్వంగా తెలియుచున్నది.రాహు కేతు తత్వమే హరిహర తత్వం. అవి రెండు విడిగా కనబడుచున్ననూ వకే శక్తి.నిర్గుణ శక్తి సగుణ శక్తిగా కనపడుట.ఏడుగ్రహముల పూర్తి లక్షణములు భౌతికంగా తెలియుటయను ప్రయత్నం వృధా.మానవుని యెుక్క వక జీవిత కాలము సరిపోదు భౌతికంగా. ఎందుకనగా పూర్ణమైన శక్తి తెలియుట అనగా నిత్య నూతనమైన యౌవన శక్తి పూర్ణ తత్వమునకు మూలము కనుక.భగవశ్శక్తి నిత్య నూతనమైన ప్రకృతి రూపం. లేని యెడల సృష్టి క్రమం ఆగిపోవును. యిక నక్షత్రములు వాటి లక్షణములు భౌతికంగా గ్రహించుట అసంభవమైన పని. వాటి శక్తి మానవ జీవనమును గమనమునకు వాటి మూల శక్తి లక్షణము భగవతత్త్వంగా తెలియుట ఙ్ఞానం. తెలియనిది అంతా దైవము. తెలిసినది ఏదీ లేదు. తెలిసినదీ అని అనుకోవడం అఙ్ఞానం అనే అహంకారం. ఏక వింశతి నక్షత్ర శక్తి 21 నక్షత్రము ద్వారా కలిగేశక్తి మాత్రమే ఏకవింశతి మహా దోషములుతోగూడియున్నదనిశాస్త్రము. యివి నిరోధించుటకు ఎవరికైనా అసంభవం. పూర్ణమైన భగవతత్వం పై దోషములకు అతీతం. మానవులకు వీటిని జయించుట అసంభవం. అన్ని అవతారములలో రామావతారము పూర్ణమైవుండి పూర్ణ లక్షణము తెలియక పోవుటయే దీనికి ఉదాహరణ. శ్రీరామ జనన గ్రహ గతి తిరిగి మరల వచ్చుట ఖగోళంలో అసంభవం. భౌతిక వాదులకు ఎన్ని సంవత్సరాలైన ఎవరికివారు వాళ్ళే ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ అలాంటి గ్రహగతులు శక్తిని భూమి స్వీకరించుటఅసంభవం మానవులకు కూడా.అవతారము ఆవిర్భావరూపము కూడా వుండదు.వకసారి పూర్ణ లక్షణమును నిరూపణ చేయుటయే దీని తత్వం. పదే పదే సార్లు యిట్టి పూర్ణ తత్వమును తెలుపుట అవసరం లేదు. మానవ పరిణామ క్రముము కూడా అంతే. వకే జీవి తిరిగి తిరిగి అదే జీవ లక్షణములుగా అదే ప్రదేశములో అదే గర్భంలో పుట్టుట ఎలా అసంభవమెూ అదే సృష్టియెుక్క మాయ రూపం. విలక్షణ మైనది విచిత్రమైనది కూడా. ఙ్ఞానము వలననే జీవ తత్వం అనే మాయ తత్వం తెలియుట.అనంతమైన ఙ్ఞానమును స్వచ్చమైన భక్తి అనే సూత్రము ద్వారానే. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి