11, ఆగస్టు 2023, శుక్రవారం

Panchang


 

Tamata uragaya

Tamaata uragaya



సీతారామాంజనేయ సంవాదము.*


*శ్రీ రామచన్ద పరబ్రహ్మణే నమః*


*సీతారామాంజనేయ సంవాదము.*


*ప్రథమాధ్యాయము*


*భాగము - 6*



ఉ. నన్నయభట్టు సాంధ్రకవి;నాథునిఁ దిక్కనసోమయాజినిం 

బన్నుగ సోమసత్కవిని ; భాస్కర బమ్మెరపోతరాజుల మున్ను ప్రసిద్ధిగాంచిన కవి;ముఖ్యుల నందఱ నెమ్మనంబులో 

నెన్ని నమస్కరించెద న; భీష్టఫలా ప్తి దనర్చునట్లుగాన్.


తాత్పర్యము: 


"నన్నయభట్టారకులు, తిక్కన, నాచన, బమ్మెర, భాస్కరు" లందరు దివ్య శక్తియుక్తులు, రామాయణ, భారత, భాగవతాదుల నాంధ్రీకరించి, 


మనల కొసగిన ఆథ్యాత్మికమూర్తులు, 

ఆ పుణ్యపురుషుల దివ్య 

"శ్రీ" చరణాలకు శతానీక వందనాలు.



క. శుద్ధపదయుక్తిఁ దొఱఁగి య

బద్ధమును నిబద్ధి గా ని; బద్ధి నొగి మహా బద్ధము గాఁ గనుకుకవుల నౌద్ధత్యము మానుకొఱకు; నభినందింతున్.


తాత్పర్యము: 


కొందరు చాలా చక్కగా అబద్ధాన్ని"నిబద్దంగా" (సత్యంగా) చమత్కరించి. చెబుతారు. ఇవి కాలక్షేపాలు. 


ఇవి శాశ్వతమని భ్రమింపచేసే ఆశాశ్వతాలు. ఇది కవిత్వం కాదు. వీటి గురించి ఆలోచించ పని లేదు. పై పద్యానికి దొక వ్యాఖ్యానము. 


మరో రకంగా చూస్తే  అశాశ్వతము (అబద్ధము) సంసారము దానిని ఎంతో అందంగా ఆశలు కలుపుతూ, అందమైన ప్రలోభాలతో, 


జీవులను పరదైవం వైపు సాగనీయకుండా, కొందరు  ఇహలోక దృష్టి భావనలచే సతమతమవుతుంటారు. 

వీరు కూడ జ్ఞాన పర దృష్టితో చూస్తే సమాజానికి నాశన స్వరూపులే.



*సేకరణ : సకల దేవత సమాచారం గ్రూపు.*



🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

బసవ పురాణం - 1 వ భాగము🙏

 🙏బసవ పురాణం - 1 వ భాగము🙏


🕉🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️


శ్రీరజతాచల

శిఖరం మీద శివ పార్వతులు వినోదంగా ముచ్చటిస్తూ వున్నారు. వారి పాదాల వద్ద ఉపమన్యుడు- భృంగి, నందికేశ్వరుడు మొదలైన ప్రమథులు శివునియందే తమ శుద్ధ మనస్సును కేంద్రీకరించి సేవిస్తూ వున్నారు. ఆ సమయంలో నారద మహాముని కైలాసానికి వచ్చాడు. రాగానే ఆదిదంపతులకు సాష్టాంగ నమస్కారం చేసి రెండు చేతులూ కట్టుకొని వినయంగా నిలబడ్డాడు. చంద్రశేఖరుడు తన వెనె్నల కంటితో నారదుణ్ణి చల్లగా చూచాడు. అంబికాదేవి, ‘నారదా, నీవు భూలోకానికి వెళ్లి వచ్చావు కదా! అక్కడి విశేషాలు స్వామివారికి విన్నవించు’ అన్నది.

అప్పుడు నారదుడు ‘స్వామీ! ఎందువల్లనో తెలియదు కానీ భూమిపై శివభక్తి సన్నగిల్లింది. కొందరు కేవలం శివాచారాలలో మునిగి శైవేతరులతో మాట్లాడటమే మానివేసి శివతత్వాన్ని ప్రచారం చేయడంలేదు. కొందరు కేవలం లౌకిక జీవనంలో మునిగిపోయారు.

మరికొందరు బ్రహ్మానందంలో మునిగి తమ్ము తాము మరిచి సమాజానికి ఉపయోగపడకుండా పోయారు. ఏమైతేనేమి తమ భక్తితత్వమ సంపూర్ణ సమాజానికి తెలియడంలేదు, అందువల్ల మానవులందరూ లింగస్థల, జంగమస్థల, ప్రసాదస్థలముల స్వీకరించి మహాభక్తులై ఉండే నిమిత్తం తమరొకసారి భూలోకంలో అవతరించక తప్పదు’.

మహాదేవుడైన పరమేశ్వరుడు అనురాగచిత్తుడై నారదుని మాటలు విని ఇలా అన్నాడు: ‘‘నారదా! నీ కోరిక ప్రకారం భూలోకంలో అవతరించవలసిందే. అయితే నాకూ నందీశ్వరునికీ రవ్వంత కూడా భేదం లేదు. ఆ కారణంగా నా పక్షాన నందిని భూలోకానికి పంపుతున్నాను’’.

పార్వతీదేవి ఈ మాటలు విని చిరునవ్వు నవ్వి ‘‘నాథా! మీరు ఇలా అనడంలోని ఆంతర్యమేమిటి?

నిజంగా నందీశ్వరుడూ మీరూ ఒక్కరేనా? లేక భక్తపరాధీనులు కాబట్టి- ‘నేనూ నా భక్తుడూ ఒకటే’ అన్న అర్థంలో ఈ మాట అన్నారా?’’ అని ప్రశ్నించింది.

అది విని పరమేశ్వరుడు నారదుడూ, పార్వతీదేవి వింటుండగా ఇలా అన్నాడు.

‘‘దేవీ! నీవు చెప్పింది నిజమే! భక్తుని శరీరమే నా శరీరం. నాకూ భక్తునికీ భేదం లేదు. అందుకని అలా అన్నాను. అంతేకాక ఇంకో కథ కూడా వుంది. పూర్వం కొన్ని యుగాలకింద శిలాదుడనే మహాముని శ్రీశైలానికి నైరుతీ భాగంలో కఠోర తపస్సు చేశాడు. ముందు కందమూలాలు ఆహారంగా తీసుకొని తపస్సు చేశాడు. తర్వాత అది మానివేసి రాళ్ళు తిని ఆకలి చంపుకొని ఘోర తపస్సు చేశాడు🙏

భార్య ఇంటికి ఆభరణం

 భార్య ఇంటికి ఆభరణం!!*  (నేడు ప్రపంచ వివాహ దినోత్సవం) * భరించేది భార్య, * బ్రతుకు నిచ్చేది భార్య, * చెలిమి నిచ్చేది భార్య  * చేరదీసేది భార్య  * ఆకాశాన సూర్యుడు    లేకపోయినా... ఇంట్లో  భార్య లేకపోయినా... అక్కడ జగతికి వెలుగుండదు, ఇక్కడ ఇంటికి వెలుగుండదు.  * భర్త  వంశానికి సృష్టికర్త  * మొగుడి అంశానికి మూలకర్త, *కొంగు తీసి ముందుకేగినా... * చెంగు తీసి మూతి తుడిచినా...ముడిచినా.. తనకు లేరు ఎవరు సాటి  * ఇల లో తను లేని ఇల్లు...  కలలో.... ఊహకందని భావన... * బిడ్డల నాదరించి... * పెద్దల సేవలో తరించి * భర్తని మురిపించి.. మైమరపించి... * బ్రతుకు మీద ఆశలు పెంచి...  * చెడు ఆలోచనలు త్రుంచి... * భ్రమరం  లా ఎగురుతూ... * భర్త ను భ్రమల నుండి క్రిందకు దించుతూ... * కళ్ళు కాయలు కాచేలా... * భర్త  జీవితాన పువ్వులు పూచేలా చేసిన జీతం లేని పని మనిషి.*   *జీవితాన్ని అందించే మన* *మనిషి* ...  ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం  ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప.  అదే  భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం * 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

తెలుగు వాడిగా పుట్టడం గర్వంగా

 ఒక తమిళ వ్యక్తి రాసిన వ్యాసాన్ని యధాతధంగా.....


నా మాతృ భాష తమిళ భాష. దాని అర్థం ఇతర భాషల ను గురించి తెలియదని కాదు. తెలుగు భాష గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను.

    తెలుగు మాతృ భాష గా ఎవరికి వున్నదో, తెలుగు భాష ను ఎవరు ప్రేమిస్తున్నారొ, తెలుగు గురించి ఎవరు తెలుసుకుందాము అనుకుంటున్నారో వారి కోసం కొన్ని విషయాలు.


1. తెలుగు భాష సుమారు క్రీ. పూ. 400 క్రితం నుండి  వుంది.


2. 2012 లో తెలుగు లిపి ప్రపంచం లోనే రెండవ గొప్ప లిపిగా "International Alphabet Association" ద్వారా ఎన్నుకోబడినది.

మొదటి లిపిగ కొరియన్ భాష.


3. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరం లో గల 72000 నాడులు వుత్తేజితమౌతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది. మిగిలన భాష ల కన్న ఇది చాలా చాలా ఎక్కువ.


4. శ్రీలంక లో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.


5. మయన్మార్ లో చాలా మంది తెలుగు మాట్లాడతారు.


6.  ఇటాలియన్ భాష లాగానే   తెలుగు భాష లో కూడా  పదాలు హల్లు శబ్దం తో అంతమౌతాయని 16 వ శతాబ్దంలో ఇటలీ కి  చెందిన  నికోలో డీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే  తెలుగు భాషను " ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్". అని అంటారు .


7. భారత దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు.

ఇది మన దేశంలో మూడవ స్థానాన్ని, ప్రపంచం లో 15 వ స్థానం ను పొందింది.


8. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెపుతారు. హిందూ పురాణాల ప్రకారం  త్రిలింగక్షేత్రాలు నైజం ప్రాంతం లోని కాళేశ్వరం, రాయలసీమ లోని శ్రీశైలం, కోస్తా లోని భీమేశ్వరమ్ ల మధ్యలో వుండడం వలన ఈ పేరు వచ్చిందని అంటారు.


9. ప్రపంచ ఉత్తర ప్రాంతంలో తెలుగు భాష లో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దం తో పూర్తి అవుతుంది.


10. తెలుగు భాష లో వున్న అన్ని సామెతలు, నుడికారాలు ఇంకా ఏ భాష లోన లేవు.


11. తెలుగు భాష ను పూర్వం తెనుంగు, తెలుంగు అని వ్యవహరించేవారు.


12. భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు.


13. 200 సం. ల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగు వారు మారిషస్ వెళ్ళారు. ప్రస్తుత మారిషస్ ప్రధాని వారి సంతతే.


14. రామాయణ మహభారతాలు లో దాదాపు 40 శ్లోకాలు కచిక పదాలతో కూడిన పద్యాలు వున్నాయి. ఈ విధంగా మరి ఏ భాష సాహిత్యం లో కూడా లేదు.

కచిక (palindrome words)పదాలు అనగా ఎటునుండి చదివిన వోకే రకంగా పలికేవి. ఉదాహరణకు వికటకవి, కిటికి, మందారదామం, మడమ వంటివి.


15. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని తెలుగలో వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పి తెలుగు ను  తన సామ్రాజ్యం లో అధికార భాష గా చేసాడు.


16. ఏకాక్షర పద్యాలు గల భాష తెలుగు మాత్రమే. 

తెలుగు భాష ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకత ను అందిస్తుంది ఆనడం లో ఏమాత్రం సందేహం లేదు.

 

పై విషయాలు అన్నీ వొక తమిళ వ్యక్తి  ఆంగ్లం లో  తెలియజేసిన విషయాల ను అనువదించారు. కానీ ఇది నిజం. ఇంత గొప్ప మన భాషను మన భవి తరాలవారికి సగర్వంగా అందించే బాధ్యత మన తరం పై వుంది. తెలుగు భాష ను చంపేసే తరం గా మనం వుండకూడదని నా భావన. 

ఏ భాష ప్రజలైన వారి మాతృ భాషలోనే మాట్లాడతారు. అందుకు వారు గర్వపడతారు. కానీ అది ఏమి దౌర్భాగ్యం, ఎక్కడినుండి వచ్చిన దరిద్రమో గానీ మనం మాత్రం ఆంగ్ల భాష లో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాం. అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ్మ, వంటి పదాలు పలకడానికి సిగ్గు పడుతున్నాం. కొన్నాళ్ళకు ఆపదాలు అంతరించిపోయే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇకనుంచి అయినా తెలుగు భాష పై స్వాభిమానం పెంచుకుందాం. తెలుగు లో మాట్లాడుదాం. 

 ఆంగ్లభాష బతుకుతెరువు కోసం నేర్చుకోవాలి. అందుకోసం మన తెలుగు భాష ను బలిచేయనవసరం లేదు. 


తెలుగు వాడిగా పుట్టడం గర్వంగా అనుభూతి పొందుదాం. 


ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి చేరవేయండి.

🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -16🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర  -16🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*ఆకాశరాజు వృత్తాంతము:*


పూర్వకాలములో సుధర్ముడనే చంద్రవంశపురాజు వుండేవాడు. ఆ రాజునారాయణపురము రాజధానిగా రాజ్యమేలుతుండేవాడు. ఆయనకు యిద్దరు కొడుకులు పెద్దకొడుకు ఆకాశరాజు, చిన్నకొడుకు తొండమానుడు, సుధర్ముడు ఆకాశరాజుకు పట్టాభిషేకము చేసి తపస్సునకు వెళ్ళిపోయాడు. 


ఆకాశరాజు భార్య ధరణీదేవి, వారికి అన్నీ వున్నా సంతాన లోపముండెను. సర్వవిధ పుణ్యకార్యములు వారు చేసిరి.


ఒకరోజున ఆకాశరాజు తన కులగురువయిన శుకమహర్షిని ఆహ్వానించి వారిని వుచిత రీతిని పూజించాడు. తరువాత సంతానము లేకపోవుటను, ఆ దిగులుచే తాను తన భార్య కృశించుటయు తెలియజేశాడు

 అంతా శ్రద్ధగా విని శుకముని ‘రాజా! పూర్వము దశరధుడు చేసిన విధముగా నీవున్నూ పుత్రకామేష్టి యజ్ఞము చేయుము. నీ కోరిక నెరవేరుతుందన్నాడు. యజ్ఞానికి ముహూర్తమును కూడా నిర్ణయించాడు.

పద్మావతి లభించుట

ఆకాశరాజు యజ్ఞము చేసే నేలను బంగారు నాలితో దున్నసాగాడు. దున్నుతుండగా నాగలి ఆగి క్రింద యేదో తగినట్లయినది. తీరా నేలలో చూస్తే ఒక పెట్టె కనబడింది. 


ఆ పెట్టెలో ఒక సహస్రకమల పుష్పమున్నూ, ఆ పుష్పము మధ్య అందాల పాపయు కనబడినది. 


ఇంతలో ఆకాశవాణి ‘ఓ ఆకాశరాజా! నీవు ధన్యుడవు. నీకు పూర్వజన్మాంతర సుకృతము కలదు, కనుకనే ఈ బిడ్డ నీకు దొరికినది. 


ఈమెను నీవు పెంచుకొనవలసియున్నది. నీ వంశము పునీతమగుటకు ఈమెను పెంచుకొనడము కారణమవుతుంది’ అని యన్నది ఆకాశరాజుకు అపరిమితమయిన ఆనందము కలిగినంది. 


నేటికి కదా! నా జన్మ, నా వంశము సార్ధకమయినవని అనుకున్నాడు. బుగ్గ పై చిరునవ్వు వికసించే ఆ పసిపాపను యెత్తుకొని తనివితీరా ముద్దాడినాడు. ఆ బిడ్డను ధరణిదేవి చేతికిచ్చి విషయము తెలిపినాడు. ఆమె ఆ పాప నెత్తుకొని అవ్యక్తానందము ననుభవించినది. ధరణీదేవి ఆ బిడ్డను తన ప్రాణముగా భావించుకొని పెంచసాగినది. సద్ర్బాహ్మణులులను రావించి, వారిని గౌరవించి, బిడ్డకు నామకరణ మహోత్సవ ముహూర్తము పెట్టుడనగా వారు ముహూర్తము పెట్టిరి. ఆ ముహూర్తమున సహస్ర పత్రకమలములో లభ్యమయిన కారణాన ఆ చిన్నారి పాపకు పద్మావతి అని పేరు పెట్టినది. 


లక్ష్మీదేవియే తమ యింట వెలసినట్లుగా భావించి ఆకాశరాజు, ధరణీదేవి ఆనందించుచుండిరి. ఆ పాప బోసి నవ్వులతో వారి హృదయానంద నందనవనములో పువ్వులా అల్లారు ముద్దుగా పెరగసాగింది

.

పద్మావతి పూర్వజన్మ వృత్తాంతము

పూర్వకాలమున వేదవతి అని ఒక అందమయిన కన్య వుండేది. ఆ కన్య అందచందాలను వినినవారయి, ఎందరెందరో రాజులు యామెను వివాహము చేసుకొనుటకు యిచ్చజూపుతూ రావడము, విఫలులై వెడుతూండడము జరుగుతూండేది. ఒక్క శ్రీహరిని తప్ప ఎవ్వరినీ వివాహము చేసుకోనని భీష్మించుకు కూర్చొంది వేదవతి. ఆమెకు తపస్సు యెడల అనురక్తి అంతా ఇంతా కాదు. 


ఒకనాడు వేదవతి తపస్సు చేస్తుండగా రావణుడు చూడడము జరిగింది. ఆమె అందానికి రావణాసురుడే ఆశ్చర్యపోయినాడు. చెంతకు వెళ్ళి ‘సుందరాంగీ నేను రావణుడను, పదునాలుగు లోకాలను అవలీలగా జయించిన వాడను, నేను కళ్ళెఱ్ఱజేస్తే సూర్యుడు వేడిమిని తగ్గించి చల్లగా ప్రకాశిస్తాడు. 


నేను రమ్మనమంటే, వెంటనే వచ్చి చంద్రుడు వెన్నెలను పసరిస్తాడు. ఇంద్రుడయినా సరే నా ముందు తలవంచవలసినదే. దేవతలందరూ నా సేవకులే. మూడు లోకాలకీ సర్వాధిపతినైన నేనే నిన్ను ప్రేమించుచున్నానన్నచో నీకు గర్వకారణము కాదా! నీవునూ నన్ను ప్రేమించుము. అందాలరాశివయిన నీకు కష్టతరమయిన తపస్సు అవసరమా! నీ యవ్వనము అంతా యీ విధముగా వ్యర్ధము చేసుకోవడము నీకు తగదు. చూస్తూ వూరుకోవడము నాకు తగదు. 


నా లంకారాజ్యానికి రాణివి కమ్ము! అన్నాడు. 


రావుణుని మాటలకు భయపడినది వేదవతి. ఎలాగో ధైర్యము చిక్కబట్టుకొని ‘దశాననా! రావణా! నేను ఒక్క శ్రీహరిని తప్ప యెప్పటికినీ, యెవరినీ వివాహము చేసుకొనను. అని లోగడనే శపధము చేసి వుంటిని. ఆ శ్రీహరి గూర్చియే తపస్సు చేస్తూయున్నాను. ఆ విష్ణుమూర్తి గనుక నా కోరిక కాదంటే ప్రాణాలయినా పోగొట్టుకుంటాను’ అని తన ధృఢ నిశ్చయాన్ని కోమలముగా చెప్పింది.


 అది విన్న రావణుడు హేళనగా నవ్వాడు నవ్వి ‘ఓసి అమాయకురాలా! ఎవరినీ? విష్ణువునా నీవు ప్రేమించడము! బాగుంది! ఆ విష్ణువు నా పేరు వింటేనే భయముతో గజగజలాడిపోతాడు. అటువంటి అల్పుడిని పెళ్ళాడతానంటావేమిటీ? నీకేమయినా మతిపోయిందా? అన్నాడు. ‘మీరు వేయి చెప్పండి, లక్ష చెప్పండి. నేను విష్ణువును తప్ప మరొకరు వారెంతవారయినా సరే వివాహము చేసుకోను. దయచేసి మీదారిన మీరు వెళ్ళండి’ అని గద్గద స్వరముతో చెప్పింది వేదవతి.


రావణునికి కోపము హెచ్చింది. నన్నే నిరాకరిస్తావా? అంటూ వేదవతిని సమీపించి పట్టుకోబోయాడు రావణుడు. మానభంగము చేస్తాడేమోనని భయపడి వేదవతి ‘అన్యకాంతాభిమానీ! కామాంధకారములో నీకు కళ్ళు కనబడుట లేదు ఇష్టము లేని నన్ను కష్టపెట్టి మానభంగము చేయబోతున్నందుకు ఇదే నా శాపాగ్నికి గురి యయ్యెదవుగాక! 


నేనిదే అగ్నిలో ఆహుతియయి భస్మమై పోతాను. నీ కారణముగా నేనిప్పుడీ దేహముతో నాశనమయిపోతున్నాను. గనుక నీవూ నీ వంశమూ, ఒక స్త్రీ మూలమున సర్వనాశనమై పోదురుగాక! నా వుసురు ననుభవించి తీరుదువుగాక!’ అని శపించినది. శపించి శక్తిమంతురాలైనది, కాబట్టి యోగాగ్నిని తనలో సృష్టించుకొని ఆ యోగాగ్ని వలన దగ్ధము అయి బూడిదగా మారిపోయినది.


చాలా సంవత్సరాల తర్వాత రావణుడు సీతను అపహరించడం జూచి అగ్ని ఆమెను రక్షించాలనుకున్నాడు. అగ్ని అడ్డు వెళ్ళి ‘రావణా! శ్రీరాముడు నిజమయిన సీతను నాచెంత దాచి, మాయ సీతనే ఆశ్రమమున వుంచినాడు.


 నీవు తీసుకొనిపోవుచున్నది మాయసీతనే’ అన్నాడు. అగ్నిదేవుని మాటలు నమ్మి రావణుడు ‘అయినచో వెంటనే అసలు సీతను యిచ్చి మాయసీతను నీ చెంత నట్లే పెట్టుకొను’ మనగా అగ్నితనయందు ఎప్పుడో దగ్డమయిన వేదవతిని రావణునికిచ్చి, అతని నుండి నిజమైన సీతను గ్రహించి తనలో దాచుకున్నాడు


. ఆ తరువాత రామరావణ యుద్ధము, రావణ సంహారము జరిగాయి. శ్రీరామచంద్రుడు సీతను అగ్నిప్రవేశం చేయించాడు. మాయసీతగా వున్న వేదవతి అగ్నిలో దూకినది. అగ్నిదేవుడు సీతనూ, వేదవతినీ, యిద్దరనూ తీసుకొనివచ్చి జరిగిన విషయము విశదీకరించి సీతాదేవితో పాటు, శీలవతి అయిన వేదవతిని కూడా ఏలుకోవలసినదిగాకోరాడు. ‘అగ్నీ! నేను ప్రస్తుతము ఈ అవతారములో ఏకపత్నీ వ్రతుడను కనుక, మరొక స్త్రీ నాకు భార్యయగుట యనునది జరుగుటకు వీలులేనిది. కలియుగమున యీ వేదవతిని వివాహమాడెదను’ అన్నాడు 


శ్రీరామచంద్రప్రభువు. అగ్ని సరే అన్నాడు. ఆకాశరాజునకు దొరికిన పద్మావతియే వేదవతి.


కస్తూరితిలక గోవిందా, కాంచనాంబర గోవిందా, గరుడవాహన గోవిందా; గానలోల గోవిందా; |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.||16||


శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

*ఓం నమో వెంకటేశాయ 🙏*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 9*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 9*


నరేంద్రుని విద్యాభ్యాసంలో తండ్రి విశిష్ట పాత్ర...  


ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య తాను పురోభివృద్ధి చెందడమే కాక తన చుట్టు వున్న వారి జీవితాలు పెంపొందింపజేస్తూవచ్చాడు.  ఆత్మగౌరవం ఉండాలి. కాని అదే సమయంలో వినమ్రతాభావం కూడా అందుకు జతజేరి ఉండాలని ఆయన ఆశించేవాడు. పిల్లలు తప్పు చేస్తే తిట్టడమూ, కొట్టడమూ పిల్లలను సరిదిద్దే విధానం కాదని ఆయన గట్టి నమ్మకం. 


ఒక సంఘటన....


మామూలు విషయాలలో సైతం నరేన్ తల్లితో పోట్లాడేవాడు. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ల గ్లాసును  కుడిచేతితోనే పుచ్చుకొని త్రాగడం వంగ దేశంలో రివాజు. కాని కుడిచేయి ఎంగిలిగా ఉన్నందున ఎడమ చేతితో త్రాగడమే సబబు అని నరేంద్రుడు వాదించాడు. తల్లీ కుమారుల మధ్య మాటా మాటా జరిగి వాగ్యుద్ధం మొదలయింది. చివరకు కోపంతో తల్లిని నరేంద్రుడు నానా దర్భాషలాడాడు. 


ఇదంతా విన్న విశ్వనాథుడు నరేంద్రుణ్ణి కోపగించుకోలేదు,. అతడి తప్పును ఎత్తి చూపించడానికి ఒక తెలివైన మార్గం కొన్నాడు. నరేంద్రుడు తన మిత్రులను కలుసుకొనే గది తలుపు మీద, నరేన్ ఈరోజు ఇలాంటి మాటలతో తల్లిని తిట్టాడు అని వ్రాసిపెట్టాడు. నరేంద్రుడికి అది చాలు. ఆ గదిలోకి మిత్రులు వచ్చినప్పుడల్లా అతడికి తలకొట్టేసినట్లు అనిపించింది. ఆ తరువాత పొరపాటుగా కూడా అతడు ఎన్నడూ తిట్టి ఎరుగడు.


మరొక రోజు విశ్వనాథుడు నరేంద్రుడితో, “నాయనా! దేనిని చూసీ ఆశ్చర్యం చెందకు"  జీవితంలో ఏవేవో జరుగవచ్చు, ఎన్నో మార్పులు. ఎదుర్కొనవలసి రావచ్చు; కాని దేనికీ విస్తుబోయి మ్రాన్పడిపోకూడదు. భగవంతుని రాజ్యంలో ఏమైనా జరగవచ్చునని గ్రహించి పురోగమించాలి. నరేంద్రుడికి జీవిత పర్యంతం మార్గదర్శకమైంది.🙏


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శ్రీ కాళహస్తీశ్వర శతకం - 63

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


*>>>>>>>>>>>ఓం<<<<<<<<<<<*




శ్రీ కాళహస్తీశ్వర శతకం  - 63




సంతోషించితినిఁ జాలుంజాలు రతిరాజ ద్వారసౌఖ్యంబులన్

శాంతిన్ బొందితిఁ జాలుఁజాలు బహురాజద్వార సౌఖ్యంబులన్

శాంతిం బొందెదఁ జూపు బ్రహ్మపద రాజద్వారసౌఖ్యంబు నిశ్చింతన్ శాంతుఁడ నౌదు నీ కరుణచే శ్రీ కాళహస్తీశ్వరా!



తాత్పర్యం:



శ్రీ కాళహస్తీశ్వరా! నేనింతవరకు రతిరాజగు మన్మధ రాజ ద్వారమువద్ద కామసుఖములకై యత్నములు చేసి ఎంతోకొంత సుఖించితిని. ఇక అవి చాలు చాలును. 


అనేక రాజుల ద్వారములవద్ద ఆశ్రయము లభించుటచే సౌకర్యములద్వారా ఎంతోకొంత శాంతి కలిగినది. ఆ సౌఖ్యములు చాలును. 


ఇకమీదట పరబ్రహ్మపదమను రాజుగారి ద్వారమున కలుగు సౌఖ్యము (మోక్షము) కోరుచున్నాను. 


నాకు ఆ అనుభవము చూపుము. దానిని అనుభవించి శాశ్వతమగు శాంతిని పొందెదను.



ఓం నమః శివాయ


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

Mirchi salan

https://youtu.be/4-sslag4118


 

ధరన మాయమ్మవే

 🌺🍃 -----------------------🍃 🌺 


అన్నమయ్య వాణి నా సంకీర్తనా బాణి - 178


( ఛందోరీతి -- ద్విరదగతిరగడ ) 


🌺🍃 -----------------------🍃 🌺


*కీర్తన ః-- // ధరన మాయమ్మవే దయకురూపంబువే //*


🌹🌹


*ధరన మాయమ్మవే దయకు రూపంబువే*

*హరియురము  పైమెరయు నలమేలు మంగవే*

 

*卐 --🌹 -- 卐 // ధరన మాయమ్మవే .. //*


*శ్రీనివాసుని జూచి చెన్నుగా నవ్వితివి*

*కానవచ్చి యతనిని కళ్యాణ మాడితివి*

*మా నడుమ మా తోడ మాధవుని జూపితివి*

*మానోములే పండె మాతగా వచ్చితివి*


*卐 --🌹 -- 卐 // ధరన మాయమ్మవే .. //*


*ఏడుకొండలవాని కిల్లాలి వోయమ్మ*

*ఏడేడు భువనాల కీప్సితము నీవమ్మ*

*ఈడు నెరుగక పరగె యిందిరవు నీవమ్మ*

*జాడ తెలిపితివిపుడు జయము నీ కోయమ్మ*


*卐 --🌹 -- 卐 // ధరన మాయమ్మవే .. //*


*భావించి జూచితే భాగ్యమనగా మాదె*

*యీవల కరుణ జూపు నిచ్చ యంతయు నీదె*

*చేవతో మముగాచు చిత్త మంతయు నీదె*

*యా వేంకటేశుడిల నలరు భారము నీదె*


*卐 --🌹 -- 卐 // ధరన మాయమ్మవే .. //*


✍️ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది  ( స్వీయ రచన )*


🌹🌹 


అమ్మా ! ఎంతటి దయగల దానవు . 🙏 


ఆ శ్రీహరినే మాకు నిల నందించుటకు , 

నీవే క్రిందికి దిగి వచ్చి తపస్సు చేసి , 

నొములు పండించుకుని , శ్రీనివాసుని పెండ్లాడి , 

మాకు తల్లి తండ్రులవలే ,

ఇక్కడే మాకొరకు వెలసి యున్నారు . 🙏 


ఇదంతా నీ వల్లనే కదా అమ్మా ! 🙏

 

ఇక *శ్రీ వేంకటేశ్వరుడు* సదా మంగళకరముగా ,

మాపట్ల ఉంచే భారము కూడా నీదే అమ్మ ! 🙏 


నికు విన్నవించుకుంటే చాలు మా కోరికలు అన్నీ నీవే ఆయనకు చెప్పి ఫలింప చేస్తావు !!🙏 🙏 


  🌹🙏🌹🙏🌹🙏🌹

జన్మరాహిత్యమైన స్థితియే మోక్షము

 ఈ శరీరమన్నది చూశారూ...

ఇదొక అద్దెకొంప. 

జీవుడు... అంటే ఆత్మ తన కర్మఫలాలను అనుభవించటానికి ఒక సాధనం కావాలి. ఎందుకంటే... జీవుడికి శరీరం లేదు. శరీరమనేది ఉంటేనే ఏదైనా అనుభవించటానికి ఈ భూలోకంలో వీలవుతుంది. 


అటువంటప్పుడు జీవుడు భూరోకంలోనే ఎందుకు జన్మను తీసుకోవాలి? ఇతరలోకాలలో జన్మను తీసుకోవచ్చుగా? 


మనకు ఉన్న అన్ని లోకాలలోనూ భూలోకం మాత్రమే కర్మలు చెయయటానికి కానీ అనుభవించటానికి కానీ నిర్దేశించబడినది. అందువలన కర్మఫలాలను అనుభవించటానికి జీవుడు భూలోకంలో జన్మను తీసుకోవటం జరుగుతుంది. 


ఆవిధంగా భూలోకంలో శరీరాన్ని పొందిన జీవుడు తన కర్మఫలం పూర్తి అవగానే శరీరాన్ని విడిచి వెళ్ళటం జరుగుతుంది. 


కర్మలను నివృత్తి చేసుకోవటానికి జీవుడికి ఈ శరీరం ఒక సాధనం. ఈ సాధనాన్ని ఉపయోగించుకొని జీవుడు మంచి కర్మలను చెడ్డ కర్మలను అన్నిటినీ వదిలించుకొని కర్మరహితుడై శరీరాన్ని విడిచినప్పుడు ఆ జీవుడు దేవుడిలో కలసిపోతాడు. ఇక మరలా జన్మించటం ఉండదు. ఆ జన్మరాహిత్యమైన స్థితియే మోక్షము.

రాశి ఫలాలు🌹*

 .       *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*

.  *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*శుక్రవారం, ఆగస్టు 11, 2023*

*శ్రీ శాలివాహన శకం: 1945*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*అధిక శ్రావణ మాసం - బహుళ పక్షం*

*తిధి*      :  *దశమి ఉ7.41* వరకు  


.                *🌹రాశి ఫలాలు🌹* 

 

*మేషం*


ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార విషయమై కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి.

---------------------------------------

*వృషభం*


దీర్ఘకాలిక రుణాలు నుండి బయట పడతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు విస్తృతమౌతాయి. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఆశించిన మార్పులుంటాయి. విలువైన  వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల స్థానచలనాలు కలుగుతాయి.

---------------------------------------

*మిధునం*


నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి. స్థిరాస్తి విషయాలలో సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగ ప్రయత్నలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------

*కర్కాటకం*


గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. 

---------------------------------------

*సింహం*


స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నలు ఫలిస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

*కన్య*


సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలుంటాయి. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

*తుల*


నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలుచేసి లాభాలు అందుకుంటారు. మిత్రులతో ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

---------------------------------------

*వృశ్చికం*


గృహమున సంతాన శుభకార్య విషయమైన చర్చలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

*ధనస్సు*


నిరుద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యావిషయాలలో శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

*మకరం*


దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.  వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు చెయ్యడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.

---------------------------------------

*కుంభం*


చిన్ననాటి మిత్రులతో ఒక విషయమై మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.   నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగ వ్యాపారములు అంతంత మాత్రంగా సాగుతాయి. 

---------------------------------------

*మీనం*


ఆప్తులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుచేసుకుని బాధపడతారు. గృహమున శుభకార్యాలకు ఖర్చులు చేస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు అందుకుంటారు. దాయదులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. 


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*

👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈                                                                   

*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻

*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻

*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻


🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -15🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -15🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*శ్రీమన్నారాయణుyడు వరాహస్వామిని దర్శించుట:* 


శ్రీమన్నారాయణుని తలకు గాయము తగిలినది కదా! అందువలన ఔషధమునకై అతడు శోధించుచుండెను. బృహస్పతికి ఆ విషయము తెలిసి శేషాచలానికి వెళ్ళి ‘మేడి చెట్టు పాలల్లో జిల్లేడు పత్తిని తడిపి, నీవు ఈ గాయము పై పట్టు వెయ్యాలి’ అని నారాయణునితో చెప్పి వెళ్ళిపోయాడు. 


మందు తయారు చేసికొనుటకై అతడు వస్తువుల గురించి కొండ పై నున్న అరణ్యము అంతా వెదకుచుండగా వరాహస్వామి ఆశ్రమముకనిపించినది. ఆశ్రమములోనికి ప్రవేశించాడు. వరాహస్వామి నారాయణుని గుర్తించి సకల మర్యాదలు చేశాడు.


వరాహస్వామి నారాయణుని ‘‘తాము సర్వ సంపదలు వీడి భూలోకమునకు యేల వచ్చితిరి. అని ప్రశ్నించాడు. 


నారాయణుడు భృగువు వైకుంఠానికి రావడము నుండి భూలోకములో తాను పుట్టలోనుండగా పశువుల కాపరి తనను గండ్రగొడ్డలితో తల పై కొట్టడము వరకూ పూసగ్రుచ్చినట్లు చెప్పాడు.


 నారాయణుడు తాను శేషాచలము పై నివసించ యిష్టపడుతున్నానని, కనుక ఆ పర్వతము పై తనకు కొంత స్థలము ఈయవలసిందని అడిగాడు.


 వరాహస్వామి క్రయధనము యిస్తే స్థలము ఇస్తానన్నాడు. శ్రీమన్నారయణుడు ప్రస్తుతం మీరు (పర్వతము) కలవారు, 


నేను సిరిలేని వాడను, నాకు మీరు స్థలము కనుక యిస్తే నాకు అనేకమంది భక్తులు వచ్చి కానుకలూ అవీ అర్పిస్తుంటారు. 


అలా వారు నాకొరకై వచ్చినప్పుడు మొట్టమొదట మిమ్ములనే దర్శించి మీకు కానుకలు యిచ్చి నా వద్దకు వచ్చే ఏర్పాటు చేసెదను అనగా, 


వరాహస్వామి అంగీకరించి నూరు అడుగుల స్థలాన్ని కొండ పై శ్రీమన్నారాయణునకిచ్చాడు. ఇచ్చి ‘‘నా వద్ద వకుళాదేవి అనే మహాభక్తురాలున్నది. ఆమెను నీ వెంట పెట్టుకొనుము. 

ఆమె నీకు అన్ని విధాల సేవలు చేయుచుండును’’ అని వకుళాదేవిని శ్రీహరికి వప్పజెప్పెను.


వకుళాదేవి శ్రీహరి చరిత్రను వినుట

శ్రీహరి ఒక పర్ణశాలను నిర్మించుకొన్నాడు. దానిలో తానున్నూ వకుళాదేవియు నివసింపసాగిరి. ఒకనాడు వకుళ, ‘నాయనా! అసలు నీ వృత్తాంతమేమిటి?’ అని ప్రశ్నించగా, నారాయణుడు తనకు – నా – అనువారెవరూ లేరు అనియునూ, తల పై గాయము విషయమున్నూ చెప్పినాడు. వకుళ తన విషయమూ చెప్పినది.


శ్రీహరి శ్రీనివాసుడగుట

వకుళ వనమూలికలూ అవీ తెచ్చి నారాయణుని తల పై గల గాయము పై మందువేసినది. పళ్ళూ అవీ తెచ్చి ఆహారము యిచ్చినది. వకుళ నారాయణుని శ్రీనివాసాయని పిలచి పరమానంద మొందేది. 


నారాయణుడు అంతటి నుండి శ్రీనివాసుడుగ వ్యవహరింపబడేవాడు.


*సాలగ్రామ గోవిందా, సహస్రనామా గోవిందా, లక్ష్మీవల్లభ గోవిందా, లక్ష్మణాగ్రజ గోవిందా; |*


*గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.||15||*


శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

అసలైన తోడు

 

*నీ ఈ జీవితంలో అసలైన తోడు ఎవరు?*

అమ్మనా?

నాన్ననా?

భార్యనా?

భర్తనా?

కొడుకా?

కూతురా?

స్నేహితులా?

బంధువులా ?


లేదు. ఎవరూ కాదు.!


నీ నిజమైన తోడు *నీ శరీరమే!*నీ శరీరం నీకు సహకరించని రోజున నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది డాక్టర్ లున్నా, జనాలు ఉన్న ఏమి చెయ్యలేరు సాగనంపడం తప్ప* 

ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!!

నువ్వు అవునన్నా, కాదన్నా, ఇది కఠిన నిజం.!!!

*నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు.* నీవు వాస్తవానికి ఆత్మ.

ఈ శరీరమే నీ అసలైన ఇల్లు. 

ఏదైతే నీ శరీరం కోసం బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.

*నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని  చూసుకుంటావో, నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది.*

నీవేమి తినాలి?

నీవేమి చేయాలి?

ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?

నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?

అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.

గుర్తించుకో !

నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా!

నీ శరీరమే నీ ఆస్థి, సంపద.

వేరే ఏదీ కూడా దీనికి తుల తూగదు.

నీ శరీరం నీ బాధ్యత...


డబ్బు వస్తుంది. వెళ్తుంది.

బంధువులు, స్నేహితులు శాశ్వతం కాదు.

గుర్తుంచుకో.!

నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు. ఒక్క నీవు తప్ప...!


ఊపిరితిత్తులకు-  *ప్రాణాయామం.*

మనసుకు- *ధ్యానము*

శరీరానికి- *యోగా.*

గుండెకు- *నడక.*

ప్రేగులకు- *మంచి ఆహారం.*

ఆత్మకు- *మంచి ఆలోచనలు.*

*సమాజం కోసం*- *మంచి పనులు.*


_*👆ఒకటికి రెండు సార్లు చదవండి. ఈ మంచి సందేశాన్ని అందరికీ పంపండి🙏*_

*కర్మ... ఫలితం!

 *కర్మ... ఫలితం!*


తెల్లవారి లేచినప్పటినుంచి మనం ఏదో ఒక సందర్భంలో  ‘కర్మ’  అనే మాటను వింటూనే ఉంటాం. 


ఇంతకీ కర్మ అంటే ఏమిటి? అది ఎన్ని రకాలు? వాటి ఫలితం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. 


‘కారణం లేకుండా కార్యం జరగదు!’ అన్నది కర్మ సిద్ధాంతానికి పునాది కాబట్టి బిల్‌గేట్స్‌ లేదా వారెన్‌ బఫెట్‌ ఉత్తినే ప్రపంచ కుబేరులు కాలేదు. గతజన్మల్లో ఈ ఫలితం వచ్చే పుణ్యకార్యాలు వారు చేసి ఉండబట్టే  ఈ జన్మలో వారు కుబేరులయ్యారు. ఏ ప్రకారం వ్యాపార నడక సాగిస్తే, వారు  ఆ స్థితికి చేరుకోగలరో ఆ నడకని వారికి స్ఫురింప చేసేది వారి గత జన్మకర్మలే. 


దీనినే అమెరికన్లు ‘సరైన మనిషి, సరైన ప్రదేశంలో, సరైన సమయంలో’ అని చెబుతారు. హిందూమతం దీనినే కర్మసిద్ధాంతరూపంలో వివరిస్తుంది. దీన్ని లౌకికులు అదృష్టం లేదా దురదృష్టంగా పిలుస్తుంటారు.


కర్మకోణం నుంచి చూస్తే– కారణం లేకుండా కార్యం జరగడం అన్నది లేనే లేదు. కాబట్టి ఓ మనిషికి జరిగే మంచి కాని, చెడుకానీ లేదా వీటి మిశ్రమకర్మలు కాని గత లేదా ప్రస్తుత జన్మల్లో చేసిన కర్మల ఫలితంగానే ప్రాప్తిస్తాయి.


మనం చేసే కర్మ చెడుదా లేదా మంచిదా అన్నది నిశ్చయించేది అది చేయడానికి వెనక గల భావనే అని మన సనాతన ధర్మం స్పష్టం చేస్తోంది. చూడడానికి బయటికి చెడుకర్మగా కనిపించినా, ఒక్కోసారి అది భావనని బట్టి సుకర్మ కావచ్చు. మనిషికి కర్మ చేయడానికి వెనక గల భావనని బట్టే అతనికి ఆ కర్మ తాలూకు ఫలితం లభిస్తుంది. 


మన భావనలన్నింటిని గ్రహించే దేవుడికి అందుకే భావగ్రాహి అనే పేరు ఋషులు పెట్టారు. ఇందుకే సద్భావాన్ని ప్రసాదించమని  ప్రార్థిస్తారు. 


కర్మ కీలకం తెలిసిన ఋషులు మా కళ్లు ఎప్పుడూ మంచినే చూచుగాక, మా చెవులు ఎప్పుడూ మంచినే వినుగాక, మా నాలుక ఎప్పుడూ మంచినే రుచి చూడుగాక అని ప్రార్థిస్తారు.


మన మనసుని సద్భావాలతో నింపుకుంటే– సత్కర్మలని, దుష్టభావాలతో నింపుకుంటే దుష్కర్మలని చేస్తాం. 


ఆశాపరుడు అత్యంత దుష్టుడు. ఎందుకంటే ఆశపడేవాడి మనసు నిండా చెడుభావాలే ఉంటాయి. వారు చేసిన దుష్కర్మలే సరైన సమయంలో వారికి తగిన ఫలితాలనిస్తాయి.


ఒకవేళ పూర్వజన్మలో వారు చేసిన సుకర్మలు ఈ జన్మలో అనుభవించాల్సిన అవసరం ఉంటే, అప్పుడు ఈ దుష్కర్మల ఫలితానుభవానికి పాత శుభకర్మల ఫలితానుభవం అడ్డుపడడంతో, అవి పై జన్మలకి వాయిదాపడి వచ్చే జన్మల్లో వారు దుర్భర కష్టాలు పడవచ్చు. కర్మ పని చేసే తీరు విషయంలో అజ్ఞానం గల సామాన్య ప్రజ ‘దుష్టులకే సుఖాలెందుకు? మంచివాళ్లకి కష్టాలెందుకు?’ అని ఆవేశంగా ఆలోచిస్తారు. 


దేవుడి మీద, కర్మ మీద నమ్మకాన్ని కోల్పోతారు. మనంచేసే ప్రతికర్మకి మనం జవాబుదారీ అన్న విశ్వాసం కలిగి ఉంటే చెడు చేయడానికి భయపడతారు. 


సమాజాన్ని దోపిడీ చేసేవారు కర్మ విషయంలో పూర్తిగా అజ్ఞానులు కాబట్టే, నిర్భయంగా చెడు పనులు చేస్తూ భవిష్యత్‌ జన్మలని అంధకార బంధురం చేసుకుని తమకి తాము అన్యాయం చేసుకుంటున్నారు.


నిష్కామ కర్మ ప్రతివారు చేయదగ్గ గొప్ప కర్మనివారిణి. 


నిష్కామకర్మలో ఐదు భాగాలున్నాయి.

1.పని చేయి 2. దాన్ని నీకోసం చేయకు 3.పరులకోసం చేయి 4.పని తాలూకు ఫలితాన్ని ఆశించకు 5. ఒకవేళ ఫలితం వస్తుందనుకుంటే దాన్ని దైవానికి సమర్పించు.


మన కర్మలకు మనమే కర్తలం. కర్మలలో నిష్కామ కర్మ చాలా గొప్పది. అంటే ఇతరులనుంచి ఏమీ ఆశించకుండా చేసేది. నిష్కామ కర్మ ప్రతివారు చేయదగ్గ గొప్ప కర్మనివారిణి. మనం చేసే దానధర్మాలు, పరోపకారం నిష్కామకర్మలు అవుతాయి. ఇవి ఎంత ఎక్కువ చేస్తే, మన పాపం అంతగా తొలగుతుంది. ముల్లుని ముల్లుతోనే తీసినట్లు మనం చేసిన దుష్కర్మని ఫలితాన్నివ్వకుండా నాశనం చేయడానికి నిష్కామకర్మ ఉపయోగిస్తుంది. 


చాలామంది దైవానికి మొక్కుకుంటారు. దానికన్నా మంచి పద్ధతి ఫలానా నిష్కామకర్మ చేస్తామని మొక్కుకోవడం. ‘మా అమ్మాయి పెళ్లయితే తిరుమల నడచి వస్తాము’ అనే మొక్కు కంటే ‘ఓ బీద కన్య వివాహానికి సహాయం చేస్తా’ అనుకుని చేయడం ఎక్కువ ఫలితాన్నిస్తుంది.  


మనకి ఉన్న అడ్డంకి(పాపాలు) తొలగడానికి పుణ్యక్షేత్ర సందర్శనతోబాటు దానధర్మాలని చేస్తారు.


క్రైస్తవంలో సేవాతత్పరతకి పెద్దపీట వేశారు. హిందూమతంలో భక్తికి పెద్దపీట. కాబట్టి గుళ్లూ గోపురాలకి వెళ్లడంతోనే సరిపెట్టుకుంటున్నారు తప్ప బీదవాళ్లకి సేవకోసం ఖర్చు చేయడం పెద్దగా అలవాటు లేదు.


నిష్కామకర్మ వల్ల స్వార్థం కరిగి, మనిషి ఉన్నతుడవుతాడు. మనం చేసిన కర్మఫలితాన్ని అనుభవించడానికి కారణం దాని విశిష్టతను మన అంతరాత్మ గ్రహించడానికే అని పెద్దలు చెబుతారు. ఒకరిని బాధిస్తే తిరిగి మనకి బాధ కలిగి వారెంత బాధ అనుభవించాల్సి ఉంటారో తెలుసుకోవడం ద్వారా మన అంతరాత్మ తిరిగి అలాంటి దుష్కర్మ చేయకూడదని నేర్చుకోవడం కోసం కర్మఫలితాన్ని మనం అనుభవిస్తాం.


ఇలా ప్రతి జన్మలో గతంలో చేసిన వివిధ కర్మల ఫలితాలని అనుభవిస్తూ, వాటినుంచి పాఠాలు నేర్చుకుంటూ ఓ ఉపాధి(జన్మ) నుంచి మరో ఉపాధికి జీవాత్మ ఎదుగుతూ, అంచెలంచెలుగా ఆధ్యాత్మికంగా ఎదిగి చివరికి పరిశుద్ధ ఆత్మ అవడమే ముక్తి అని, ఇందులో కర్మలు, కర్మఫలితానుభవాలు సోపానాలు అని కర్మ సిద్ధాంతం తెలియజేస్తోంది.


నిజానికి పాపం చేస్తున్నానన్న స్పృహ లేకుండా చాలా విషయాలలో పాపాన్ని మూటగట్టుకుంటారు. 


ఉదాహరణకు పక్కింటివారి చెట్టు నుంచి కరివేపాకు లేదా గోరింటాకు కోయడం, వృద్ధులు లేదా గర్భవతులు నిలబడి ఉంటే లేచి వారికి తను కూర్చునే ఆసనం ఇవ్వకపోవడం, నిజం తెలియకుండా నిందారోపణలు చేయడం, తను పని చేసే సంస్థకి సంబంధించిన గృహోపకరణాలను, వాహనాలని, సిబ్బందిని స్వప్రయోజనాలకు వాడుకోవడం, ఇతరులకి హాని కలిగేలా వాహనాన్ని మితిమీరిన వేగంతో నడపటం, ఎవరైనా పొరపాటున ఎక్కువ చిల్లర ఇస్తే తిరిగి ఇవ్వకపోవడం, రోడ్డుమీద చెత్త వెయ్యడం మొదలైన దుష్కర్మలు చేయకుండా స్వయం నియంత్రణను అలవరచుకోవాలి. లేకపోతే జీవితకాలంలో ఈ దుష్కర్మల భారం బాగా పెరుగుతుంది.


మనకి ఏ కష్టం వచ్చినా దానికి బాధ్యులుగా మనుషులు లేదా పరిస్థితులు కనిపించినా అది నిజం కాదని, వారు కేవలం మనం పూర్వం చేసిన దుష్కర్మల ఫలితాలని అనుభవించడానికి కారణాలు మాత్రమేనని గ్రహించి ఆ ఫలితాన్ని నిశ్శబ్దంగా స్వీకరించడం మంచిది.


ఇతరులకి ఏది  చేస్తే తను బాధపడతాడో అది ఏ మనిషీ చేయకూడదు. చేస్తే పాపంలో చిక్కుకుని దానికి సరిపడే కష్టాలని అనుభవించాకే ఆ పాపాన్ని అతను నిర్మూలించుకోవాల్సి వస్తుంది. కాబట్టి చెడు చేసి కష్టాలు అనుభవించి పాఠం నేర్చుకునేకంటే తెలివైన జీవి ముందుగానే పాఠం నేర్చుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగ గలుగుతుంది. ఇదే సుకర్మల ప్రయోజనం...


వేరొక సమూహము నుండి పంచుకొనబడినది.

ఉత్తమ ధర్మాచరణం

 🎻🌹🙏 ఉత్తమ ధర్మాచరణం..!!

           

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌸ధర్మం నాలుగు విధాలుగా తెలుపబడినది. 

సామాన్య ధర్మం, 

క్షేమ ధర్మం, 

విశేష ధర్మం, 

విశేషేతర ధర్మం 

అనేవి.


🌿తల్లితండ్రులను భార్యా పిల్లలను  ఆదరంగా చూసి  పోషించడం, 

ఓర్పు, సహనాలతో జీవించడం సామాన్య ధర్మం.శీరాముని ఆదర్శ జీవితం సామాన్య ధర్మంలోనే చేరుతుంది.  


🌸శ్రీ రామునికోసమే జీవించిన లక్ష్మణుడు  14 సంవత్సరాలు నిద్రాహారాలు  మాని శ్రీ రామునికి రక్షకునిగా వుండడం విశేష ధర్మం అంటారు. విశేష ధర్మంలో సామాన్యధర్మం కూడా లీనమై వుంటుంది.


🌿శ్రీ రాముని వెతుకుతూ వనములకు వెళ్ళి , రాముని పాదుకలు శిరము పై దాల్చుకుని వచ్చి శ్రీ రాముడే రాజ్యం పాలిస్తున్నట్టు  చిత్రకూటంలో రాజ్యాన్ని పరిపాలించడం  విశేష ధర్మం గా చెప్ప బడుతున్నది.


🌸ఆ విధంగానే  కర్ణుని కన్న తల్లి కుంతి , తన బిడ్డను పెంచే భాధ్యతైన సామాన్య ధర్మాన్ని వదలి , నదిలో వదలి పెట్టడం అధర్మం. కాని బిడ్డను  పెంచి  పెద్ద చేసిన రధసారధి భార్య  చేసినది విశేష ధర్మం.


🌿రావణుడు చేసిన తప్పులు అతనికి ఎత్తి చూపినా, వినిపించుకోని

అన్నగారికి  సహాయంగా వున్న కుంభకర్ణునిది సామాన్య ధర్మం లో చేరుతుంది. 


🌸కాని ,అన్నగారైన రావణుని తప్పులు ఎత్తి చూపిన విభీషణుడు , రాజ్యము నుండి రావణునిచే వెళ్ళ గొట్టబడి  , శ్రీ రాముని శరణుకోరడం విశేష ధర్మం.

ఆశ్రమంలోకి పరిగెత్తుకు వచ్చిన గోవుని  చూశాడుఋషి.  


🌿గోవు వెనకాల గోవుని చంపడానికి  వచ్చిన వారు, ఋషిని గోవు రావడం చూశావా అడుగగా , కళ్ళు చూసినవి.. నోరు చెప్పదునోరు చెప్పేది కళ్ళు చూడవు ..అని బదులిచ్చిన ఋషిని, 

'అడవిలో వున్న పిచ్చి వాడని ' ఎగతాళి చేసివెళ్ళి పోయారు. 


🌸సామాన్య ధర్మం అబధ్ధం 

చెప్పకూడదు..సత్యం చెప్పాలి.   కాని గోవుని  రక్షించడానికి  ఋషి చేసినది విశేష ధర్మం.బాలుడైన కృష్ణుని అల్లరి భరించలేని యశోద ,  కృష్ణుని పట్టుకుందుకి వచ్చినది. 


🌿ధధి భాండుడు అనేవాని  ఇంటిలో  ని పెద్ద బానలో దాగాడు బాలకృష్ణుడు.ధధి భాండా! కృష్ణుని చూశావా?  అని యశోద అడిగినదానికి, నేను కృష్ణుని చూసే చాలా రోజులైనదని అబధ్ధం చెప్పి యశోద నుపంపివేసిన   ధధి భాండుడుచేసినది విశేష ధ‌ర్మంగా

పెద్దలు  కీర్తిస్తారు.


🌸తండ్రి మాట వేద వాక్కుఅని సామాన్య ధర్మం తెలుపుతుంది. కాని ప్రహ్లాదుడు తన తండ్రి చెప్పినట్లు ,ఓం హిరణ్యాయ నమః అని అనకుండా ,  ఓం నమో నారాయణాయ నమః

అని జపించడం విశేష ధర్మం. 


🌿భక్తదాసులకు చేసే సేవ 

విశేషతర  ధర్మం గా తెలుప బడుతున్నది.శీరాముని కై జీవించిన భరతుని చరణాలు నమ్మినవాడు శతృఘ్నుడు.శబరి తన గురువుగారైనా మతంగముని ఉపదేశానుసారం జీవితాంతం శ్రీరామ మంత్రాన్నే జపిస్తూ వచ్చింది. 


🌸శ్రీ రాముడు శబరికి దర్శనమిచ్చాడు.శ్రీ రాముని దర్శనంకాగానేఆచార్యుడు చెప్పినట్టు

శబరికి ముక్తి లభించింది. శబరి గురుభక్తి ముక్తిని లభింప చేసింది. 


🌿ఆళ్వారులు  శతృఘ్నుడు,

శబరి, వీరంతా  దేవునిపట్ల గల భక్తి కంటే కూడా తమ ఆచార్యులయందు

కలిగిన భక్తిని  'విశేషేతర ధర్మం' గా  చెప్పారు. అన్ని ధర్మాలలోను ఉన్నతమైన  ధర్మం విశేషేతర ధర్మం...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

నారాయణ కవచ విశిష్టత

 🎻🌹🙏నారాయణ కవచ విశిష్టత - శ్లోకం భావన...!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🙏🌹మొత్తము 42 శ్లోకాలు..

ప్రతి రోజు కొన్ని శ్లోకాలు భావన 

పఠనం చేదం...🙏🌹


🙏🌹ఈరోజు 29 &,30 శ్లోకం భావన పఠనం చేదం..🌹🙏



🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿


    🌷శ్రీ విశ్వరూప ఉవాచ |🌷



🙏🌹29) వ శ్లోకం 🌹🙏


గరుడో భగవాన్ స్తోత్రస్తోభశ్ఛందోమయః ప్రభుః |

రక్షత్వశేషకృచ్ఛ్రేభ్యో విష్వక్సేనః స్వ నామభిః ||


🌹🙏భావము:🌹🙏


వేద రూపుడైన గరుత్మంతుడు భగవానుడు. ప్రభువు. సామముల

( వేదసంబంధమైన మంత్రములు సామములు.సామములకు ఆధారమైన ఋక్కుల సముదాయము స్తోమము) చేత కీర్తించబడిన వాడు .


అటువంటి గరుత్మంతుడు నన్ను కష్టముల నుండి రక్షించుగాక! విష్వక్సేనుడు తన నామముల చేత రక్షించుగాక!



🙏🌹30) వ శ్లోకం :🌹🙏


 సర్వాపద్భ్యో హరేర్నామరూపయానాయుధాని నః |

బుద్ధీంద్రియమనఃప్రాణాన్పాంతు పార్షదభూషణాః||


🌹🙏భావము :🙏🌹


శ్రీహరి యొక్క నామ రూపములు ,వాహనములు, ఆయుధములు ,అతని సేవకులు మా యొక్క బుద్ధులను ,ఇంద్రియములను, మనసులను, ప్రాణములను అన్ని ఆపదల నుంచి రక్షించుగాక!...🚩🌞🙏🌹🎻


🌹🙏జై శ్రీమన్నారాయణ..🙏🌷


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

రామాయణమ్ 287

 రామాయణమ్ 287

...

మేమందరము పలు విధాలుగా వెతుకుతూ దారితప్పి వింధ్యపర్వతము వద్దకు చేరగా పలు దినములు గడచిపోయినవి.

.

కార్యసాధనలో విఫలురమయినామన్న బాధ ఒక ప్రక్క ,మరొకప్రక్క గడువుదాటిన పిమ్మట తిరిగి వెళ్ళినచో సుగ్రీవుడు విధించు కఠినదండన మా మనస్సును నిలకడగా ఉండనీయక వేధింప ప్రారంభించినవి.

.

వేరే దారి ఏది కనపడక ప్రాణత్యాగమే శరణ్యమని నిశ్చయించుకొ‌ని ప్రాయోపవేశమునకు సిద్ధపడుతూ నిన్ను అపహరించినదాదిగా జరిగిన సంఘటనలను మాలో మేము ఏకరువు పెట్టుకొనుచుంటిమి .ప్రసంగవశమున జటాయువు ప్రస్తావన రాగా అది విని ఒక గొప్ప ముదుసలి గృధ్రరాజు అట కు ఏతెంచెను.

.

ఆయన ఎవరో కాదు జటాయువు సోదరుడు సంపాతి !

.

ఆవేశముగా మమ్ము ప్రశ్నించాడు సంపాతి .నా తమ్ముడిని ఎవ్వరు ఎక్కడ చంపి వేసినారు ? ఏ కారణము వలన అట్లు జరిగినదని మమ్ము ప్రశ్నించగా మేము ఆయనకు జరిగిన విషయమును ఎరుక పరచితిమి.

.

అంత సంపాతి నీ యొక్క జాడను మాకు తెలియ చెప్పెను. నీవు బందీవై రావణుని గృహములో ఉన్నావని చెప్పినాడు .తన దృష్టికి నీవు కనపడినావని కూడా మాకు తెలిపినాడు.

.

నీ జాడ తెలిసిన మాకు పోయిన ప్రాణములు తిరిగివచ్చినట్లాయెను .

.

నీ జాడ కనుగొనుట కొరకు నేను నూరుయోజనముల పొడవు గల సముద్రమును లంఘించి దుమికి లంకా పురి చేరినాను.

.

రావణలంకలో రాత్రిపూట ప్రవేశించి అంతటా వెతుకుతూ ఇచటికి చేరి దుఃఖసాగరములో మునిగియున్న నిన్ను కనుగొన్నాను తల్లీ!

.

ఓ పరమపావనీ !

 ఓ దోషరహితా ! 

ఓ పుణ్యచరితా

సీతామాతా ! 

అన్నివిషయములు నీకు ఎరుక పరచితినమ్మా ! 

నేను రావణుడను కాను రామునిబంటును హనుమంతుడు నాపేరు .

.

కేసరీ,అంజనాదేవి నా తల్లితండ్రులు వారికి వాయుదేవుని వరప్రసాదము వలన నేను జన్మించితిని.

 .

నా ఇష్టము వచ్చిన రూపములు ధరించగల శక్తి నాకున్నదమ్మా!

.

అమ్మా ! నా అదృష్టము బాగున్నది సముద్రలంఘనము వ్యర్ధము కాలేదు !

నిన్ను కనుగొంటినన్న కీర్తిపొందగలవాడను !

.

ఈ విధముగా మాటలాడిన హనుమ పలుకులను విశ్వసించి ఆతడు శ్రీరామదూతయే అని సీతమ్మ తెలుసుకొన్నదాయెను.

.

వూటుకూరు జానకిరామారావు 

.

నవగ్రహ పురాణం

 _*నవగ్రహ పురాణం - 21 వ అధ్యాయం*_


*చంద్రగ్రహ జననం - 3*


*"అదేమిటి స్వామీ , అలా అంటారు. నా సర్వస్వమూ మీరే. అది మీకు తెలుసుగా. పైగా ఇది వెన్నెల రాత్రి కాదు స్వామీ !”*


*“సరే... ఈరోజు ఒక మేడ ముందు ఆగి , భిక్ష అడగకుండా వచ్చేశావ్ ! ఎందుకు ?"* ఉగ్రశ్రవుడు శీలవతి మాటను వినిపించుకోనట్లు అన్నాడు.


*"ఆ ఇంట్లో భిక్ష తీసుకోవడం నాకు ఇష్టం లేదు స్వామీ...”*


*"కారణం !"* ఉగ్రుడు రెట్టించాడు. *"అది కలిగిన వారి ఇల్లులా కనిపించింది !".*


*"అవును...అయినా , ఆ ఇంట భిక్ష తీసుకోవడం దోషమని అనిపించింది ! నిజంగా అది దోషమే స్వామీ !"* అంది శీలవతి.


*"కారణం చెప్తావా లేదా ?"* ఉగ్రశ్రవుడు గద్దించాడు.


*"ఆ ఇల్లు ఒక వేశ్యది స్వామీ..."* శీలవతి మెల్లగా అంది. *"ఓహ్ ! మేడ మీద చందమామలా కనిపించింది , ఆ వేశ్య ముఖమన్నమాట !"* ఉగ్రశ్రవుడి కంఠం ఉత్సాహంగా ధ్వనించింది.


*"ఔను..."*


*"ఓహ్ ! చంద్రబింబంలాంటి ముఖం ! మెరుపు తీగలాంటి శరీరం ! అప్సరస కాబోలనిపించింది , చూస్తుంటే..."* ఉగ్రశ్రవుడు చెప్పుకుపోతున్నాడు.


*"పోనివ్వండి , స్వామీ ! ఆమె అందంతో మనకు అవసరమేమిటి ?"* శీలవతి సౌమ్యంగా అంది. *"హాయిగా నిద్రపోండి !"*


*"నాకు నిద్ర పట్టదు !"* ఉగ్రశ్రవుడు ఎటో చూస్తూ అన్నాడు. *"కంటికి కట్టిన ఆ వేశ్య సౌందర్యానుభవం వొంటికి పట్టేదాకా... నాకు నిద్ర పట్టదు !"*


*"స్వామీ... !"* శీలవతి కంఠంలో ఆశ్చర్యం పలికింది.  


*"ఏం ? అంత ఆశ్చర్యపోతున్నావేమిటే ! వేశ్యా సంగమం అంత కానిపనైతే... వేశ్యలు ఎందుకుంటారే ! నన్ను ఆ వేశ్య ఇంటికి తీసుకెళ్ళు !"* ఉగ్రశ్రవుడు ఆజ్ఞాపించాడు. 


*"స్వామి..."*


*"ఏం ? తీసుకెళ్ళలేవా ?"* ఉగ్రశ్రవుడు హూంకరించాడు. *"పతి ఆజ్ఞను ధిక్కరిస్తావా ?"*


*"చివరిసారిగా చెప్తున్నాను ! నన్ను ఈ క్షణంలోనే ఆ వేశ్య వద్దకు తీసుకెళ్ళాల్సిందే ! మోసుకెళ్ళాల్సిందే !"*


*"స్వామీ... దయచేసి శాంతంగా వినండి..."* శీలవతి దీనంగా అంది. *"వేశ్యలు ధనం లేని వారిని గడప తొక్కనివ్వరు... మన వద్ద ధనం...".*


*"లేదు - అది నాకు తెలుసు !"* ఉగ్రశ్రవుడు గర్జించాడు. *"మన వద్ద ధనమే కాదు. ధాన్యం కూడా లేదు ! అలాగని పస్తులుంటున్నామా ? ఏం చేస్తున్నావ్ ? నన్ను ఆ బుట్టలో కూలవేసి , ఎండలో ఎండిస్తూ , వానలో తడిపేస్తూ , కష్టపెడుతూ అడుక్కుతెస్తున్నావా లేదా ? అందర్నీ ధాన్య భిక్ష అడుగుతున్నావు ! ఆ వేశ్యను కూడా అడుగు ! ధనభిక్ష కాదు. ధాన్య భిక్ష కాదు. 'ప్రణయభిక్ష' అడుగు ! నీ పతి దేవుడికి ఇంత ప్రణయభిక్ష పెట్టమని ప్రార్ధించు !"*


*"స్వామీ...!"* శీలవతి నివ్వెరపోతూ అంది.


*"ఏమే ? స్వామి స్వామి అంటూ జపం చేస్తూ కూర్చుంటే మన కోరిక తీరదే పిచ్చిదానా ! నన్ను ఆ సౌందర్యరాశి ఇంటిముందుకు తీసుకెళ్ళు. దాని కాళ్ళు పట్టుకో. కన్నీళ్ళు పెట్టుకో. 'భిక్షం' సంపాదించు. లే ! బుట్ట తే !!"*


*"నా... ఆలోచన వినండి స్వామీ..."* శీలవతి ప్రాధేయపడుతూ అంది. *"మీ ఆరోగ్యం బాగాలేదు. లేవలేని స్థితిలో ఉన్నారు...".*


*"నోర్ముయ్ ! నిన్ను చూస్తూ ఇలా ఉండచుట్టుకుని పడి ఉన్నాను ! అంతే ! ఆ వేశ్య ముందుకెళ్ళగానే లేచి గంతులేస్తాను లేవే !"* అంటూ ఉగ్రశ్రవుడు తీక్షణంగా శీలవతి. మొహంలోకి చూశాడు. *"నేను రోగిష్టినయితేనేం ? చెప్పానుగా ! కాళ్ళు పట్టుకో ! కన్నీళ్లు పెట్టుకో ! కావాలంటే రేపూ మాపూ బిచ్చమెత్తి దానికి చెల్లిస్తానని మాట ఇచ్చుకో ! పద !"*


మంచం అంచుకి ఆవేశంగా జరుగుతున్న భర్తను నిస్సహాయంగా చూస్తూ , శీలవతి బుట్ట అందుకుంది. ఉగ్రశ్రవుణ్ణి బుట్టలోకి చేర్చి , ఆ బుట్టను తలమీదకి ఎత్తుకుంది. ఇంట్లోంచి అవతలకి నడిచింది...


శీలవతి భర్తను మోసుకుంటూ , చీకట్లో ఊరివైపు నడుస్తోంది. ఉగ్రశ్రవుడు బుట్టలో విలాసంగా వాలి కాళ్ళు ఆడిస్తూ , వేశ్య గురించి ఉత్సాహంగా ఏమిటేమిటో

చెప్తున్నాడు.


చీకట్లో శీలవతి నడకసాగుతోంది.


బుట్టలోంచి వెలికి సాగిన ఉగ్రశ్రవుడి పాదం ఆ చీకటి దారిలో ఎవరికో తాకింది. 


*"అబ్బా !" అంది తీరని బాధతో ఒక పురుష కంఠం.


శీలవతి అప్రయత్నంగా ఆగింది. పరిశీలనగా చూసింది. కటిక చీకటిలో కొంచెం ఎత్తులో ఏదో ఆకారం లీలగా కనిపిస్తోంది. 


*"నరకయాతన అనుభవిస్తున్న నన్ను తాకి , కదిలించి ఆ బాధను ఇనుమడింపచేసిన వారు ఎవరో -  సూర్యోదయం కాగానే మరణిస్తారు ! ఇది ఈ మాండవ్య మహర్షి శాపం !”* ఏదో పురుష కంఠం ఏడో కఠోర బాధను ఓర్చుకుంటూ కర్కశంగా పలికింది.


*"నా కాలు ఎవరికో తాకింది !" ఉగ్రశ్రవుడు వణికే గొంతుతో అన్నాడు. శీలవతి గుండె దడదడ కొట్టుకుంది ! ఎవరా శపించింది సూర్యోదయమైతే తన భర్త మరణిస్తాడా ?...*

అర్జున విషాద యోగః*🌼

 🌸 *ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః*🌸

    🌸🌸 *శ్రీమత్భగవద్గీత* 🌸🌸

🏵️ *అథ ప్రథమోధ్యాయః* 🏵️

🌼 *అర్జున విషాద యోగః*🌼


 *1 వ అధ్యాయం - 40 వ శ్లకం* 


 *కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా: సనాతనా: |* 

 *ధర్మే నష్టే కులం కృత్స్నమ్ అధర్మో భిభవత్యుత || 40* 


 *ప్రతి పదార్థం* 


కులక్షయే = కులక్షయ కారణముగ; సనాతనా:= సనాతనము లైన (పురం పరాగతమ లైన ) కుల దర్మా:= కులధర్మములు; ప్రశాశ్యం తి = నశించి పోవును; ధర్మి నష్టే = ధర్మము అంతరించిపోవుచుండగా; కృత్స్నన్ = సమస్తమైన (పూర్తిగా ); కులమ్ = వంశము (నందు); అధర్మ: ఉత= అధర్మమే; అభి భవతి=వ్యాపించును;


 *తాత్పర్యము* 


 కులక్షయము వలన సనాతనములైన కుల ధర్మములన్నియును నశించును. ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును.


 *సర్వేజనా సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

రామాయణమ్ 287

 రామాయణమ్ 287

...

మేమందరము పలు విధాలుగా వెతుకుతూ దారితప్పి వింధ్యపర్వతము వద్దకు చేరగా పలు దినములు గడచిపోయినవి.

.

కార్యసాధనలో విఫలురమయినామన్న బాధ ఒక ప్రక్క ,మరొకప్రక్క గడువుదాటిన పిమ్మట తిరిగి వెళ్ళినచో సుగ్రీవుడు విధించు కఠినదండన మా మనస్సును నిలకడగా ఉండనీయక వేధింప ప్రారంభించినవి.

.

వేరే దారి ఏది కనపడక ప్రాణత్యాగమే శరణ్యమని నిశ్చయించుకొ‌ని ప్రాయోపవేశమునకు సిద్ధపడుతూ నిన్ను అపహరించినదాదిగా జరిగిన సంఘటనలను మాలో మేము ఏకరువు పెట్టుకొనుచుంటిమి .ప్రసంగవశమున జటాయువు ప్రస్తావన రాగా అది విని ఒక గొప్ప ముదుసలి గృధ్రరాజు అట కు ఏతెంచెను.

.

ఆయన ఎవరో కాదు జటాయువు సోదరుడు సంపాతి !

.

ఆవేశముగా మమ్ము ప్రశ్నించాడు సంపాతి .నా తమ్ముడిని ఎవ్వరు ఎక్కడ చంపి వేసినారు ? ఏ కారణము వలన అట్లు జరిగినదని మమ్ము ప్రశ్నించగా మేము ఆయనకు జరిగిన విషయమును ఎరుక పరచితిమి.

.

అంత సంపాతి నీ యొక్క జాడను మాకు తెలియ చెప్పెను. నీవు బందీవై రావణుని గృహములో ఉన్నావని చెప్పినాడు .తన దృష్టికి నీవు కనపడినావని కూడా మాకు తెలిపినాడు.

.

నీ జాడ తెలిసిన మాకు పోయిన ప్రాణములు తిరిగివచ్చినట్లాయెను .

.

నీ జాడ కనుగొనుట కొరకు నేను నూరుయోజనముల పొడవు గల సముద్రమును లంఘించి దుమికి లంకా పురి చేరినాను.

.

రావణలంకలో రాత్రిపూట ప్రవేశించి అంతటా వెతుకుతూ ఇచటికి చేరి దుఃఖసాగరములో మునిగియున్న నిన్ను కనుగొన్నాను తల్లీ!

.

ఓ పరమపావనీ !

 ఓ దోషరహితా ! 

ఓ పుణ్యచరితా

సీతామాతా ! 

అన్నివిషయములు నీకు ఎరుక పరచితినమ్మా ! 

నేను రావణుడను కాను రామునిబంటును హనుమంతుడు నాపేరు .

.

కేసరీ,అంజనాదేవి నా తల్లితండ్రులు వారికి వాయుదేవుని వరప్రసాదము వలన నేను జన్మించితిని.

 .

నా ఇష్టము వచ్చిన రూపములు ధరించగల శక్తి నాకున్నదమ్మా!

.

అమ్మా ! నా అదృష్టము బాగున్నది సముద్రలంఘనము వ్యర్ధము కాలేదు !

నిన్ను కనుగొంటినన్న కీర్తిపొందగలవాడను !

.

ఈ విధముగా మాటలాడిన హనుమ పలుకులను విశ్వసించి ఆతడు శ్రీరామదూతయే అని సీతమ్మ తెలుసుకొన్నదాయెను.

.

వూటుకూరు జానకిరామారావు 

.

 *సనాతన హైందవ ధర్మాలు*

      🙏🙏🙏

*మహా భారత రచయిత శ్రీ వేద వ్యాస మహర్షి చేసిన కొన్ని అధ్భుత ప్రయోగాలు..*

         🔥🔥🔥

*1. కేవలం నీటి నుంచి సంతాన ఉత్పత్తి : భీష్ముడు జననం.*

          🐢🐍🦎

*2. నేతి కుండలలో పిండాల అభివృద్ధి = ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీ ల జననాలు = 100 మంది కౌరవులు ఏక కాల సంవత్సరంలో జననం.*

         🦆🪿🦇

*3. పంచ భూతాలు నుంచి, అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుంచి జననం :*

*పంచ భూతాలు+కుంతి= పాండవుల జననం..*

          🐗🐴🦄

*4. ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి : టెస్ట్ ట్యూబ్ బేబీలు, కృపాచార్యుడు, కృపి అనే అన్నా చెల్లెళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే.. కానీ ఈ ఇద్దరి టెస్ట్ ట్యూబ్ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక ద్వారా పిల్లలను కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్ గా ప్రయోగం చేశారు..తద్వారా అశ్వత్థామ జననం..*

          ☀️🌤️💥

*5. ఒక మనిషి , సూర్యునిలో ఉన్న తేజస్సుని గ్రహించి సూపర్ నాచురల్ ప్రొటెక్షన్ తో బిడ్డకు జన్మించటం : సూర్యుడు + కుంతి = కర్ణుని జననం..*

        🌞🌞🌞

*6. అగ్ని నుంచి వచ్చే తేజస్సు తో పిల్లలను కనటం : ద్రౌపది, దుష్టద్యుమ్నుల జననం..*

        🌎🌏🌍

*7. సాధారణ మానవునికి, ఒక అసాధారణ వనితకి వివాహం : భీముడు +  హిడింబి = ఘటోత్కచుడు..*


*8. ఆడదాన్ని మగ వాడిగా మార్చటం = శిఖండి gender transformation.*

         💧💦❄️

*9. మగ వాడిని ఆడదానిగా మార్చటం = చిత్ర రధుడు..*

          🌟⭐💥

*10. చేప కడుపున ఆడపిల్ల పుట్టటం : సత్యవతి..*

        🙈🙉🙊

*ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి..కేవలం ఒక్క మహా భారత గ్రంథంలోనే ఇన్ని ఉంటే, మన రామాయణ, భాగవతాలు, అష్టా దశ పురాణాలు, వేదాలు ఉపనిషత్తులలో ఇంకెన్ని రహస్యాలను, ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో?*

      🌼🌻🌞

*ఇవేమి,నేటి సైన్స్ కి అర్థం కాని ప్రశ్నలు..కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా లక్షల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయ గలిగి విజయం సాధించ గలిగారు?*

              🪷🌺🌸

 *ఇప్పటి మిడి మిడి జ్ఞానం ఉన్న మనలో కొంత మంది ఫేక్ అని కొట్టి పడేస్తారు..కానీ లక్షల సంవత్సరాల క్రితం ఆ ఊహ గొప్పదే కదా?*

         💐🌷🌹

*ఈ సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్.. అందులో పరిశోధన చేసే కొద్దీ అద్భుతాలు ఎన్నో బైటికి వస్తాయిఅని,స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు..*

        🦚🦜🦤

*కాబట్టి మనం పూజించే ప్రతి దైవం సైన్స్ కి ప్రతి రూపము. సైన్స్ ఉంది అంటే, ఖచ్చితంగా దాని existency ఉండి తీరుతుంది..*

       🎄🌲🌳

*ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్య ఫలితంగా ఈ మానవ జన్మ, అందులోనూ, భారత దేశంలో అందులోనూ హిందువుగా పుట్టటం, అందులోనూ, దైవం అంటే నమ్మకం ఉన్న వాడిగా పుట్టటం, అందులోనూ త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించటం ఒక వరం..మనకి మాత్రమే దక్కిన అరుదైన వరం..*


*హిందూ సాంప్రదాయం చాలా గొప్పది*

     👍👍👍

 *భారతీయులారా  మిత్రులారా  మీకు ఇవి తెలుసా?*

      🙏🙏🙏

*👉భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది  మనమే (ఆర్యబట్ట)*


*👉భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)*


*👉ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది మనమే (సుశ్రుతుడు)*


*👉 విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనమే (అగస్త్యుడు)*


*👉 విమాన శాస్త్రాన్ని అందించింది మనమే (భరద్వాజమహర్షి)*


*👉భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన  వరాహమిహిరుడు మనవాడే*


*👉గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన*


*వాల్మీకి మహర్షి మనవాడే*


*👉రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు*


*👉కాస్మోలజీ చెప్పిన కపిలుడు*


*👉అణువులు గురించి వివరించిన కణాదుడు*


*👉DNA గురించి చెప్పిన బోధిధర్మ*

*👉మేఘ శాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి*


*👉మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన ఉత్సమధుడు*


*👉సంగీతాన్ని (స.రి.గ. మ. ప) ప్రపంచానికి అందించిన స్వాతి ముని*

*ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు🙏*


 *ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.*

*నా దేశం గొప్పది నా "సనాతన ధర్మం" గొప్పది నా హైందవ ధర్మం గొప్పది*

🙏🙏🙏🙏*

ఉద్యోగాఽవకాశాలు

 బ్రాహ్మలకి అందునా వేద, స్మార్తములు అధ్యయనం చేసినవారికి ఎండోమెంట్ దేవాలయాలలో ఉద్యోగాఽవకాశాలు లేవు. 

ఉన్నవారికి సకాల వేతనాలూ లేవు..తిరుమలతిరుపతి దేవస్థానాలలో క్రొత్తగా వేదాధ్యయనం చేసిన వేదపండితులకి ఉద్యోగావకాశాలు లేవు ... 

సరికదా ఉన్నవాళ్ళకి జీతాల పెంపుదలా లేదు..ఈప్రభుత్వం ఇవేవీ చెయ్యకపోగా ప్రభుత్వాఽధికారులూ, నాయకులూ, వారి అనుచరులూ ఒక బ్రాహ్మణ వైధీకునికి కనీసం విలువ ఇవ్వకపోగా .. 

నిన్నటిరోజున భీమవరం పంచారామక్షేత్రంలో ఆలయ ఛైర్పర్సన్ భర్త, వైసిపి భీమవరం టౌన్ మాజీ అధ్యక్షుడు ఐనటువంటి అతను ఆ ఆలయ సహాయార్చకుడు “పవన్ కుమార్ శర్మ గారు” అనే బ్రాహ్మణుని భౌతికంగా హింసించి , కొట్టి .. యజ్ఞోపవీతంకూడా తెంపండం వంటిచర్యలా ??? 


ఏమిటీదారుణం ?? మనమెక్కడ బ్రతుకుతున్నామ్ ??అంతపనికిరానివారిగా కనిపిస్తున్నారా బ్రాహ్మణులు..


అసలు అధికారి అనేవాడు బ్రాహ్మణ్ణేకాదు భక్తుడంటేనే భగవత్స్వరూపమని తెలుసుకొని నడచుకోవాలి.. 

హిందూత్వానికి గానీ  .. అందునా బ్రాహ్మణునికిగానీ కనీసం విలువ చూపించలేని ఇలాంటి ప్రభుత్వాన్నా మనం ఆదరించేదీ, కోరుకునేదీ..తప్పు.. 


నేను భగవంతుణ్ణి నమ్ముకున్నాను సనాతన హిందూధర్మమే గొప్పది అని అనుకునే ప్రతిఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి .. 


సనాతన వైదికధర్మాన్ని ఆచరిస్తూ, తద్వారానిలబెడుతూ వస్తున్న కర్మభూమి ఐన మన “భారతదేశం” లో  అందునా మన “ఆంధ్ర”రాష్ట్రంలో హిందూ ధర్మానికీ , 


బ్రాహ్మణునికి విలువఇవ్వని పార్టీలకీ, 

భగవంతుడంటే కనీసం భయభక్తులు కూడా  లేని ప్రజాప్రతినిధులకూ


"ఓటు” అనే రత్నాన్ని ఇవ్వకుండా ఉండటమే సరైన గుణపాఠం..


సర్వ బ్రాహ్మణా సుఖినోభవంతు..


మీ .. హిందూ జన సంఘ్ 🙏🙏🙏

దయతో దగ్గరకు..*

 *దూరం కాదు..దయతో దగ్గరకు..*


"నమస్కారమండీ..నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను..చాలా రోజుల నుంచీ మా దంపతులము మొగిలిచెర్ల కు వచ్చి ఆ అవధూత దత్తాత్రేయ స్వామివారి మందిరాన్ని దర్శించాలని అనుకుంటున్నాము..మాకింకా ఆ దత్తుడు ఆజ్ఞ ఇవ్వలేదు..ఎన్నిసార్లు ప్రయాణం అయినా..చివరి నిమిషం లో ఏదో ఒక ఆటంకం ఎదురై..ఆ ప్రయాణం ఆగిపోతున్నది..నేను ఈ క్షేత్రం గురించి కనీసం పది పన్నెండు మందికి చెప్పానండీ..వాళ్లలో కొందరు అక్కడికి వచ్చి దర్శనం చేసుకొని తిరిగి వచ్చారండీ..అదేమి ప్రారబ్ధమో మమ్మల్ని మాత్రం ఆ స్వామి రానివ్వడం లేదండీ..ఏమైనా సరే ఈ శనివారం నాడు మాత్రం అక్కడికి రావాలని పంతం పట్టాను..బస్సుకు టికెట్ కూడా కొన్నాను..మీకు వీలైతే నాకూ, మా ఆవిడకూ ఒక రూమ్ ఉంటే తీసిపెట్టండి..మీరు పోస్టుల్లో వ్రాసినట్లు..ముందుగా ఆ మాలకొండ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని..అటునుంచి మొగిలిచెర్ల చేరుతాము..ఆరోజు పల్లకీసేవ లో పాల్గొని..ఆదివారం స్వామివారి సమాధి దర్శించుకొని తిరిగి వెళ్లిపోతాము.." అని ఫోన్ లో గబ గబా చెప్పారు..వారి వివరాలు అడిగి తెలుసుకున్నాను..


"అలాగేరండి..కానీ ప్రత్యేకంగా రూములు లేవు..ఉన్నవి ముందుగానే బుక్ చేసుకున్నారు..పైగా మీరు చెప్పే శనివారం ఎల్లుండే కదా..మీరిద్దరే కనుక..మంటపం లోనే పడుకోవచ్చు.." అన్నాను.."అయ్యా..ప్రాప్తం ఉండాలి..సరే..ఈసారికి ఇలా ఏర్పాటు చేశాడేమో ఆ దత్తుడు..శనివారం నాడు మిమ్మల్ని కలుస్తాను.." అని ఫోన్ పెట్టేసారు..


అనుకున్న విధంగానే..ఆ దంపతులు ఇద్దరూ శనివారం నాడు స్వామివారి మందిరానికి వచ్చారు..లోపలికి రాగానే..నేరుగా నా వద్దకు వచ్చారు..ఆయన బాగా పెద్దవారు..వయసు దాదాపు డెబ్భై ఏళ్ళు ఉంటాయి..ఈ వయసులో..ఇంత ఆర్తిగా..స్వామివారి సమాధి దర్శనానికి వచ్చారంటే..ఎంత భక్తిగా ఉన్నారో అర్థమై పోయింది నాకు..వారిని కూర్చోమని చెప్పాను..కూర్చున్నారు.."ప్రసాద్ గారూ..మీ ద్వారా ఈ అవధూత గురించి తెలుసుకోగలిగాము..ఇన్నాళ్లకు రాగలిగాము..ఈ వయసులో బస్ ప్రయాణం మాకు ఇబ్బంది అని తెలుసు..అయినా ఎలాగైనా దర్శనం చేసుకోవాలని టికెట్ కొన్నాను..కానీ చిత్రం చూసారా..ఇది మీరు తప్పక వినాలి..నిన్న సాయంత్రం మా మేనల్లుడు ఫోన్ చేసి.."మామయ్యా..నేను ఆఫీస్ పని మీద ఒంగోలు వెళుతున్నాను.." అన్నాడు..ఎప్పుడు వెళుతున్నావు? అని అడిగాను..శనివారం తెల్లవారుజామున బైలుదేరుతాను అన్నాడు..మమ్మల్ని తీసుకెళతావా అన్నానండీ.."అంతకంటేనా..తప్పక తీసుకెళతాను.." అన్నాడు..వెంటనే టికెట్లు క్యాన్సల్ చేసాను..మా వాడు నిన్న రాత్రే కారు తీసుకొని మా యింటికి వచ్చి..మా దగ్గరే పడుకొని..తెల్లవారుజామున మమ్మల్ని కారు ఎక్కించుకొని..నేరుగా మాలకొండ కు తీసుకువచ్చాడండీ..చూడండి మాకు ఏ కష్టం కలుగలేదు..మాలకొండ లో కూడా దర్శనం చాలా త్వరగా అయిపోయింది..మా మేనల్లుడు కూడా మాతోబాటే దర్శనం చేసుకొని..తిరిగి ఒంగోలు వెళ్ళాడు..అక్కడ దర్శనం తరువాత మరో చిత్రమైన సంఘటన జరిగింది..మాలకొండకు దర్శనానికి వచ్చారట నెల్లూరు వాళ్ళు..వాళ్ళూ ఇక్కడికే వస్తున్నారట..మమ్మల్ని చూసి..అడిగి మరీ వాళ్ళ టెంపో లో మమ్మల్ని ఎక్కించుకొని ఇక్కడ దింపారు..అంతా చిత్రంగా ఉంది.." అన్నారు..


"దత్తుడు మీకు తన దర్శనానికి ఆజ్ఞ ఇచ్చాడని ఇప్పటికైనా అర్ధం అయిందా.."?అన్నాను..పైకి చూసి ఒక నమస్కారం చేసుకున్నారు..సరిగ్గా ఆ సమయం లోనే.."ప్రసాద్ గారూ..మేము రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాము..నాపేరు సురేష్..మాకొఱకు ఒక రూమ్ బుక్ చేసుకున్నాము..మాకు ఇంట్లో ఇబ్బంది వచ్చింది..మేము రావటం లేదు.." అని ఫోన్ చేశారు..ఏదో ఒకరకంగా సర్దుకుంటామన్న ఆ దంపతులకు రూమ్ కూడా అమరింది..నాకూ చిత్రం అనిపించింది..ఆరోజు పల్లకీసేవ లో ఆ దంపతులు పూజ చేయించుకున్నారు..ఆ వయసులో కూడా ఆ భార్యా భర్తలు..అంతమంది భక్తుల మధ్య..పల్లకీ తోపాటు..మందిరం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసారు..


ప్రక్కరోజు ఉదయం 4.30 గంటలకు నేను మందిరం లోకి వచ్చాను..ఆ సరికే ఆ దంపతులు స్నానాదికాలు ముగించుకొని..సంప్రదాయబద్ధంగా తయారయ్యి..మంటపం లో కూర్చుని వున్నారు..అర్చకస్వాములు స్వామివారి సమాధికి చేసిన అభిషేకాలు..ఇచ్చిన హారతులూ అన్నీ భక్తిగా చూసారు..ప్రభాతసేవ పూర్తి కాగానే..అందరికంటే ముందుగా ఆ దంపతులనే స్వామివారి వద్దకు పంపాను..తమ పేరుతో అర్చన చేయించుకొని..స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..నా ప్రక్కకు వచ్చి కూర్చున్నారు.."ప్రసాద్ గారూ..అంతా సవ్యంగా జరిగిపోయింది..మా ఇద్దరినీ దత్తుడు దూరం పెట్టాడేమో అనుకున్నాను కానీ..ఇంత దగ్గరకు తీసుకోవడానికే..ఇంతకాలం ఆపాడు అని అర్ధం అయింది.." అంటూ ఉద్వేగంతో చెప్పారు..నిజమే అనిపించింది..ఈలోపల ఆయన గారి ఫోన్ మోగింది..ఆయన మేనల్లుడే చేసాడు..తనకు ఒంగోలు లో పని అయిపోయిందనీ..తానుకూడా మొగిలిచెర్ల వస్తున్నాననీ ఆ కాల్ సారాంశం..మరో రెండు గంటల్లో అతను రావడం..స్వామివారి దర్శనం చేసుకోవడం..అదే కార్లో..మళ్లీ ఆ దంపతులను ఎక్కించుకొని క్షేమంగా హైదరాబాద్ తీసుకెళ్లడం చక చకా జరిగిపోయాయి..


ఆ దంపతులు కొంతకాలం ముందు పడిన మనోవేదన మొత్తం ఈ ప్రయాణపు అనుభవం తో తుడిచిపెట్టుకు పోయింది..ఆ వయసులో దత్త కృప ను ప్రత్యక్షంగా అనుభవించారా దంపతులు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కొనలేరని మరచిపోవు

*

*కం*

తనయులకై సంపదలిడి

ఘనకార్యము చేసినటుల గర్వించు జనుల్

ఘనమగు సంస్కారములను

కొనలేరని మరచిపోవు కునుకుచు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! పిల్లల కు సంపదలనిచ్చి ఘనకార్యము చేసినట్లు గర్వపడే తల్లిదండ్రులు ఆ సంపదలేవీ గొప్ప సంస్కారములను కొనలేవని మత్తులో మరచిపోవుదురు.

*సందేశం*:-- పిల్లల కు సంపదలివ్వకపోయినా పర్వాలేదు కానీ సంస్కారం ఇవ్వలేకపోవడమే పెద్ద తప్పు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శాకాహారము చేతనె

 *1831*

*కం*

శాకాహారము చేతనె

లోకులు శాంతమ్మునొందు రోదన లేకన్.

ఆకులతిను మేకబలము

మేకలతిను మనిషికేది మేల్కొను సుజనా.

*భావం*:-- ఓ సుజనా! శాకాహారం చేత లోకులు రోదనలేకుండా శాంతమునొందును.ఆకులను తినే మేకబలము మేకలను తినే మనిషి కి ఎక్కడ ఉంది!!?? మేల్కొనుము(తెలుసుకొనుము).

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

సాధించలేనిది ఏదీ లేదు."🙏

 శ్లోకం:☝️

*ఉత్సాహో బలవానార్య*

  *నాస్త్యుత్సాహాత్పరం బలం |*

*సొత్సాహస్య చ లోకేషు*

  *న కించిదపి దుర్లభమ్ ||*

- వాల్మీకి రామాయణం 4.1.121


భావం: సీతావియోగ దుఃఖంలో వున్న  శ్రీరామునితో లక్ష్మణస్వామి ఇలా అన్నాడు, "ఆర్యా! ఉత్సాహమే పురుషుల బలం. ఉత్సాహాన్ని మించిన శక్తి లేదు. ఔత్సాహిక వ్యక్తికి ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు."🙏

పంచాంగం 11.08.2023 Friday,

 ఈ రోజు పంచాంగం 11.08.2023 Friday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాస కృష్ణ  పక్ష: ఏకాదశి తిధి భృగు వాసర: మృగశిర నక్షత్రం వ్యాఘాత యోగ: బవ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


ఏకాదశి ఈ రోజు పూర్తిగా ఉంది.

రోహిణి రేపు ఉదయం 06:02 వరకు.

సూర్యోదయం : 06:01

సూర్యాస్తమయం : 06:41

వర్జ్యం : పగలు 10:05 నుండి 11:49 వరకు.

దుర్ముహూర్తం: పగలు 08:33 నుండి 09:24 వరకు తిరిగి మధ్యాహ్నం 12:46 నుండి 01:37 వరకు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

సరిహద్దు అక్రమంగా దాటితే,

 🙊మీరు "దక్షిణ కొరియా" సరిహద్దు అక్రమంగా దాటితే,12 సంవత్సరాలు జైలులో

పెడతారు .... !!


 "ఇరాన్" సరిహద్దు అక్రమంగా దాటితే

నిరవధికంగా

అదుపులోకి తీసుకుంటారు .... !!


"ఆఫ్ఘనిస్తాన్" అయితే

చట్టవిరుద్ధంగా సరిహద్దును దాటండి

 మిమ్మల్ని చూడగానే షూట్ చేయండని ఆర్డర్

ఇవ్వబడుతుంది....!!


మీరు "చైనీస్" సరిహద్దును అక్రమంగా దాటితే

 మిమ్మల్ని కిడ్నాప్ చేస్తారు

మరియు మీరు

మళ్ళి కనపడరు .... !!


మీరు "క్యూబా" సరిహద్దు అక్రమంగా

దాటితే ... 

కుట్ర చేసినందుకు జైలు పాలైతారు...!!


మీరు "బ్రిటిష్" బోర్డర్ అక్రమంగా దాటితే, మీరు అరెస్టు చేయబడతారు

విచారణ జరుగుతుంది, జైలు శిక్ష పడుతుంది ...


మీరు పొరుగు దేశానికి చెందినవారై 

చట్టవిరుద్ధంగా భారత దేశ సరిహద్దు దాటి వస్తేనో.

అప్పుడు మీరు పొందుతారు.


1 ఒక రేషన్ కార్డు

2 పాస్పోర్ట్,

3 డ్రైవింగ్ లైసెన్స్,

4 ఓటరు గుర్తింపు కార్డు,

5 క్రెడిట్ కార్డులు,

6 ప్రభుత్వ రాయితీ అద్దె వసతి,

7 ఇల్లు కొనడానికి రుణాలు,

8 ఉచిత విద్య,

9 ఉచిత ఆరోగ్య సంరక్షణ,

10 న్యూ ఢిల్లీలో లాబీయిస్ట్,

11 ఒక టెలివిజన్.

మరో 12 మంది మానవ హక్కుల నిపుణులు, వామ పక్ష కార్మికుల సమూహంతో, కాంగ్రెస్

లౌకికవాదం ట్రంపెట్

హక్కు .....


💥మీరు ప్రజల్లో అవగాహన తీసుకురావాలనుకుంటే, పోస్ట్‌ను ఇతరులతో షేర్ చేయండి,

ప్రజల అవగాహన బాధ్యత నాపై మాత్రమే కాదు, మీపైన కూడా ఉంది.

ఏమి జరుగుతుందో చూడండి, ప్రారంభించండి.

😣😣😣.

పాలుతో ఔషదాలు తీసుకొనడం

 పాలుతో ఔషదాలు తీసుకొనడం వలన ఉపయోగాలు  - 


 *  లంఘనం ( ఉపవాసం ) చేత బలహీనుడు అయినవాడు క్షీరం పానం చేయడం వలన బలవంతుడు అగును. అట్టివానికి జ్వరం నశించును. 


 *  కాగి చల్లారిన పాలు , కొంచం ఉష్ణంగా ఉన్న పాలు కాలమునెఱిగి జ్వరపీడితుడు సేవించవలెను 

కాచబడినదియు , గోరువెచ్చగా ఉండని పాలను జ్వరపీడితుడు సేవించిన మృత్యుడు అగును.


 *  పాలయందు శొంటి , ఖర్జురపు కాయ , ద్రాక్ష వీటిలో ఏదైనను కాచి అందు చెక్కర  కాని , నెయ్యి గాని , తెనే కాని వేసి చల్లార్చి అనుపానంగా సేవించిన యెడల  దప్పిక , తాపము వీటిని నివర్తింప చేయును . 


 *  పాల యందు ద్రాక్ష , చిట్టాముదపు వేరు , యష్టిమధూకం , సుఘంద పాల వేరు , పిప్పిలి , చందనం వీటిచే కాచబడిన పాలు సేవించిన లేక పాలకు నాలుగింతలు నీరు పోసి పిప్పిలి వేసి నీరంతా ఇగురునటుల కాచి తగినంత వేడిగా ఉన్నప్పుడు లొపలికి తీసుకున్న జ్వరం నశించును. 


 *  జ్వరం గలవాడు పంచమూలములు పాలల్లో వేసి కాచి అనుపానంగా సేవించిన యొడల చిరకాల జ్వరం నశించుటయే కాక కాసాశ్వాస , తలనొప్పి , పార్శ్వపునొప్పి కూడా నశించును.


 *  పాలయందు ఆముదపు వేరు గాని లేక బిల్వపత్రములు గాని వేచి  కాచి అనుపానంగా సేవించిన జ్వరం , మలబద్దకం నశించును. 


 *  పాల యందు శొంటి , చిట్టాముదపు వేరు , వాకుడు , పల్లేరు , బెల్లము వీటిని వేసి కాచి అనుపానంగా సేవించిన రక్తపిత్తము , అతిసారం , దప్పికతో కూడిన నొప్పులు అన్ని నివర్తించును.


  

    నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


   

వేణుగానం



వేణుగానం!


"ఏది మరొక్కసారి,హృదయేశ్వర!,గుండెలు పుల్కరింపఁగా/

ఊదగదోయి!ఊదగదవోయి!సుధామయ యుష్మదీయ వే /

ణూదయ రాగడోలికల నూయలలూగుచు విస్మృతిలో విలీనమై /

పోదును; నాదుక్రొవ్వలపుపువ్వుల ముగ్ధపరీమళమ్ముతో;


కరణామయి-ఉదయశ్రీ-

జంధ్యాలపాపయ్యశాస్త్రి.


        ఈపద్యంవింటే రాధికయేగాదు మనంగూడా తన్మయులమైపోతాం.శాస్త్రిగారి కవితాశక్తియలాంటిది!

         హే హృదయేశ్వరా! కృష్ణా! మరోసారి వేణువూదవా! మరోసారి,ఆఁహః కాదుకాదు మరోసారి,బృందావనిలోనీవు వేణువూదుతుంటే,ఆవలపుగానంలో నాతనువూ మనసూ మరచి తన్మయస్ధితిలోలీనమై, నాతొలివలపుల తీయనియూహలు మదిలో నూగుచుండగా,నీకోసంఈ రాధపరవసిపోతుంది.నీకోసం పలవరిస్తుంది.

మరొక్కసారి వేణువు నూదవయ్యా!కృష్ణా! నాకోసం,కాదుకాదు, మనకోసం;

          ఇదీ ఈపద్యంలోని రాధపిలుపు.శాస్త్రిగారి పద్యంలో వలపు రవంతైనా మీకు అందించగలిగానా నాజన్మధన్యమే!

                             స్వస్తి!🙏

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం:44/150 


బ్రహ్మచారీ లోకచారీ 

సర్వచారీ విచారవిత్ I  

ఈశాన ఈశ్వరః కాలో 

నిశాచారీ పినాకభృత్ ॥ 44 ॥  


* బ్రహ్మచారీ = వేదమార్గమునందు సంచరించువాడు, 

* లోకచారీ = లోకమునందు సంచరించువాడు, 

* సర్వచారీ = సమస్త ప్రదేశములందు సంచరించువాడు, 

* విచారవిత్ = ఆలోచనా పరిజ్ఞానము కలవాడు, 

* ఈశానః = ఈశానుడు (శివుడు), 

* ఈశ్వరః = ఐశ్వర్యము కలవాడు, 

* కాలః = (కాల) మృత్యురూపము తానే అయినవాడు, 

* నిశాచారీ = రాత్రులందు సంచరించువాడు, 

* పినాకభృత్ = పినాకమనే ధనస్సును ధరించినవాడు. 


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

దుఃఖానికి కారణం

 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

       

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


               *_నేటి మాట_*


*మానవుని దుఃఖానికి కారణం ఏమిటి???*


"అపోహయే దుఃఖ హేతువు" అని శాస్త్ర వచనం...!!


ఒక సింహపు పిల్ల తప్పిపోయి, గొఱ్ఱెలు మేపు వారికి  దొరికింది...

వారు దానిని తన గొఱ్ఱెల మందలతో పాటు పెంచగా,  కొంచెం అది పెద్దదైంది. 

అది గొఱ్ఱెలలో తాను ఒక గొఱ్ఱెను అనే అనుకునేది...అలాగే ప్రవర్తించేది...

ఒకసారి అవన్నీ అడవిలో మేస్తుండగా, వేరే సింహం వచ్చి, ఈమందపై పడింది...


గొఱ్ఱెలన్నీ పారిపోయాయి, సింహం పిల్ల కూడ, వాటితో పాటు పారిపోసాగింది. 


అడవి సింహం దీనిని చూసి, ఆశ్చర్యపడి, ఎలాగో పరుగెత్తి దానిని ఆపింది.

"చిన్న గొఱ్ఱె ను నన్ను చంపకయ్యా"అంది వణికిపోతూ సింహం పిల్ల...


అడివి సింహం నవ్వి, దానిని ఓ కొలను వద్దకు తీసుకెళ్ళి నీటిలో తమ ప్రతి బింబాలను  చూపింది. 

మూతి పై మీసాలు చూపింది, పిల్ల సింహం గొఱ్ఱె ను కానని తెలుసుకుంది. 

తాను కూడా సింహమేనని, తలచి సింహంలా గర్జిస్తూ అలాగే సంచరించ సాగింది...


ఐతే ఇక్కడ సింహా నికి కొత్తగా వచ్చినది, స్వరూప జ్ఞానమేకాని, స్వరూపం కాదు... 


అందుకే మానవుని, దైవ స్వరూపులుగా భావిస్తారు, సంబోధిస్తారు, 

కాని మనం ప్రాకృతమైన జీవితానికి అలవాటు పడి, మనలో ఉన్న పరమాత్మను, విస్మరిస్తున్నాము...


జీవుడు,దేవుడు ఒకటే , మన స్వస్వరూపం , ఆత్మయే... అని తెలుసుకోవాలి ...

ఏదీ శాశ్వతం కాదు, అన్నీ నిమిత్త మాత్రమే అని భావించాలి, అశాశ్వతమైన వాటిపై ఆశ వదలాలి ... 


                *_🌹శుభమస్తు🌹_*

  🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

పురుషుడు ఎలా వుండాలి?*

 👉 *నీతికథలు-93* 👈



*పురుషుడు ఎలా వుండాలి?*

                ➖➖➖



*స్త్రీఎలా ఉండాలోఅనే కాదు, పురుషుడు ఎలా ఉండాలో   కూడా        ధర్మశాస్త్రం చెప్పింది.  ఎందుచేతో ఈ పద్యం   జన బాహుళ్యం లోకి  రాలేదు!*


*కార్యేషు యోగీ, కరణేషు దక్షః,  రూపేచ కృష్ణః , క్షమయాతు రామః,    భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః* *(కామందక నీతిశాస్త్రం)*


*1.  కార్యేషు యోగీ :*

*పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి!*


*2.  కరణేషు దక్షః :*

*కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనం తో వ్యవహరించాలి. సమర్ధుడైఉండాలి.*


*3.  రూపేచ కృష్ణః:*

*రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.*


*4.  క్షమయా తు రామః:*

*ఓర్పులో శ్రీ రామునిలాగా ఉండాలి.  పితృ వాక్య పరిపాలకుడైన శ్రీరాముని   వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.*


*5.  భోజ్యేషు తృప్తః:*

*భార్య/తల్లి వండినదాన్ని   సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.*


*6.  సుఖ దుఃఖ మిత్రం:*

*సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగాఉండాలి.మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.*


*ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు      ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడ బడతాడు.*                                     


🙌సర్వేజనాః సుఖినోభవంతు 🙌


శ్రీ ధర్మశాస్త సేవాసమితి 🐆 విజయవాడ 🏹 7799797799