11, ఆగస్టు 2023, శుక్రవారం

ఉద్యోగాఽవకాశాలు

 బ్రాహ్మలకి అందునా వేద, స్మార్తములు అధ్యయనం చేసినవారికి ఎండోమెంట్ దేవాలయాలలో ఉద్యోగాఽవకాశాలు లేవు. 

ఉన్నవారికి సకాల వేతనాలూ లేవు..తిరుమలతిరుపతి దేవస్థానాలలో క్రొత్తగా వేదాధ్యయనం చేసిన వేదపండితులకి ఉద్యోగావకాశాలు లేవు ... 

సరికదా ఉన్నవాళ్ళకి జీతాల పెంపుదలా లేదు..ఈప్రభుత్వం ఇవేవీ చెయ్యకపోగా ప్రభుత్వాఽధికారులూ, నాయకులూ, వారి అనుచరులూ ఒక బ్రాహ్మణ వైధీకునికి కనీసం విలువ ఇవ్వకపోగా .. 

నిన్నటిరోజున భీమవరం పంచారామక్షేత్రంలో ఆలయ ఛైర్పర్సన్ భర్త, వైసిపి భీమవరం టౌన్ మాజీ అధ్యక్షుడు ఐనటువంటి అతను ఆ ఆలయ సహాయార్చకుడు “పవన్ కుమార్ శర్మ గారు” అనే బ్రాహ్మణుని భౌతికంగా హింసించి , కొట్టి .. యజ్ఞోపవీతంకూడా తెంపండం వంటిచర్యలా ??? 


ఏమిటీదారుణం ?? మనమెక్కడ బ్రతుకుతున్నామ్ ??అంతపనికిరానివారిగా కనిపిస్తున్నారా బ్రాహ్మణులు..


అసలు అధికారి అనేవాడు బ్రాహ్మణ్ణేకాదు భక్తుడంటేనే భగవత్స్వరూపమని తెలుసుకొని నడచుకోవాలి.. 

హిందూత్వానికి గానీ  .. అందునా బ్రాహ్మణునికిగానీ కనీసం విలువ చూపించలేని ఇలాంటి ప్రభుత్వాన్నా మనం ఆదరించేదీ, కోరుకునేదీ..తప్పు.. 


నేను భగవంతుణ్ణి నమ్ముకున్నాను సనాతన హిందూధర్మమే గొప్పది అని అనుకునే ప్రతిఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి .. 


సనాతన వైదికధర్మాన్ని ఆచరిస్తూ, తద్వారానిలబెడుతూ వస్తున్న కర్మభూమి ఐన మన “భారతదేశం” లో  అందునా మన “ఆంధ్ర”రాష్ట్రంలో హిందూ ధర్మానికీ , 


బ్రాహ్మణునికి విలువఇవ్వని పార్టీలకీ, 

భగవంతుడంటే కనీసం భయభక్తులు కూడా  లేని ప్రజాప్రతినిధులకూ


"ఓటు” అనే రత్నాన్ని ఇవ్వకుండా ఉండటమే సరైన గుణపాఠం..


సర్వ బ్రాహ్మణా సుఖినోభవంతు..


మీ .. హిందూ జన సంఘ్ 🙏🙏🙏

కామెంట్‌లు లేవు: