🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 9*
నరేంద్రుని విద్యాభ్యాసంలో తండ్రి విశిష్ట పాత్ర...
ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య తాను పురోభివృద్ధి చెందడమే కాక తన చుట్టు వున్న వారి జీవితాలు పెంపొందింపజేస్తూవచ్చాడు. ఆత్మగౌరవం ఉండాలి. కాని అదే సమయంలో వినమ్రతాభావం కూడా అందుకు జతజేరి ఉండాలని ఆయన ఆశించేవాడు. పిల్లలు తప్పు చేస్తే తిట్టడమూ, కొట్టడమూ పిల్లలను సరిదిద్దే విధానం కాదని ఆయన గట్టి నమ్మకం.
ఒక సంఘటన....
మామూలు విషయాలలో సైతం నరేన్ తల్లితో పోట్లాడేవాడు. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ల గ్లాసును కుడిచేతితోనే పుచ్చుకొని త్రాగడం వంగ దేశంలో రివాజు. కాని కుడిచేయి ఎంగిలిగా ఉన్నందున ఎడమ చేతితో త్రాగడమే సబబు అని నరేంద్రుడు వాదించాడు. తల్లీ కుమారుల మధ్య మాటా మాటా జరిగి వాగ్యుద్ధం మొదలయింది. చివరకు కోపంతో తల్లిని నరేంద్రుడు నానా దర్భాషలాడాడు.
ఇదంతా విన్న విశ్వనాథుడు నరేంద్రుణ్ణి కోపగించుకోలేదు,. అతడి తప్పును ఎత్తి చూపించడానికి ఒక తెలివైన మార్గం కొన్నాడు. నరేంద్రుడు తన మిత్రులను కలుసుకొనే గది తలుపు మీద, నరేన్ ఈరోజు ఇలాంటి మాటలతో తల్లిని తిట్టాడు అని వ్రాసిపెట్టాడు. నరేంద్రుడికి అది చాలు. ఆ గదిలోకి మిత్రులు వచ్చినప్పుడల్లా అతడికి తలకొట్టేసినట్లు అనిపించింది. ఆ తరువాత పొరపాటుగా కూడా అతడు ఎన్నడూ తిట్టి ఎరుగడు.
మరొక రోజు విశ్వనాథుడు నరేంద్రుడితో, “నాయనా! దేనిని చూసీ ఆశ్చర్యం చెందకు" జీవితంలో ఏవేవో జరుగవచ్చు, ఎన్నో మార్పులు. ఎదుర్కొనవలసి రావచ్చు; కాని దేనికీ విస్తుబోయి మ్రాన్పడిపోకూడదు. భగవంతుని రాజ్యంలో ఏమైనా జరగవచ్చునని గ్రహించి పురోగమించాలి. నరేంద్రుడికి జీవిత పర్యంతం మార్గదర్శకమైంది.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి