11, ఆగస్టు 2023, శుక్రవారం

రాశి ఫలాలు🌹*

 .       *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*

.  *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*శుక్రవారం, ఆగస్టు 11, 2023*

*శ్రీ శాలివాహన శకం: 1945*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*అధిక శ్రావణ మాసం - బహుళ పక్షం*

*తిధి*      :  *దశమి ఉ7.41* వరకు  


.                *🌹రాశి ఫలాలు🌹* 

 

*మేషం*


ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార విషయమై కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి.

---------------------------------------

*వృషభం*


దీర్ఘకాలిక రుణాలు నుండి బయట పడతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు విస్తృతమౌతాయి. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఆశించిన మార్పులుంటాయి. విలువైన  వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల స్థానచలనాలు కలుగుతాయి.

---------------------------------------

*మిధునం*


నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి. స్థిరాస్తి విషయాలలో సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగ ప్రయత్నలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------

*కర్కాటకం*


గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. 

---------------------------------------

*సింహం*


స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నలు ఫలిస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

*కన్య*


సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలుంటాయి. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

*తుల*


నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలుచేసి లాభాలు అందుకుంటారు. మిత్రులతో ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

---------------------------------------

*వృశ్చికం*


గృహమున సంతాన శుభకార్య విషయమైన చర్చలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

*ధనస్సు*


నిరుద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యావిషయాలలో శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

*మకరం*


దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.  వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు చెయ్యడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.

---------------------------------------

*కుంభం*


చిన్ననాటి మిత్రులతో ఒక విషయమై మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.   నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగ వ్యాపారములు అంతంత మాత్రంగా సాగుతాయి. 

---------------------------------------

*మీనం*


ఆప్తులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుచేసుకుని బాధపడతారు. గృహమున శుభకార్యాలకు ఖర్చులు చేస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు అందుకుంటారు. దాయదులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. 


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*

👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈                                                                   

*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻

*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻

*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻


🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు లేవు: