11, ఆగస్టు 2023, శుక్రవారం

జన్మరాహిత్యమైన స్థితియే మోక్షము

 ఈ శరీరమన్నది చూశారూ...

ఇదొక అద్దెకొంప. 

జీవుడు... అంటే ఆత్మ తన కర్మఫలాలను అనుభవించటానికి ఒక సాధనం కావాలి. ఎందుకంటే... జీవుడికి శరీరం లేదు. శరీరమనేది ఉంటేనే ఏదైనా అనుభవించటానికి ఈ భూలోకంలో వీలవుతుంది. 


అటువంటప్పుడు జీవుడు భూరోకంలోనే ఎందుకు జన్మను తీసుకోవాలి? ఇతరలోకాలలో జన్మను తీసుకోవచ్చుగా? 


మనకు ఉన్న అన్ని లోకాలలోనూ భూలోకం మాత్రమే కర్మలు చెయయటానికి కానీ అనుభవించటానికి కానీ నిర్దేశించబడినది. అందువలన కర్మఫలాలను అనుభవించటానికి జీవుడు భూలోకంలో జన్మను తీసుకోవటం జరుగుతుంది. 


ఆవిధంగా భూలోకంలో శరీరాన్ని పొందిన జీవుడు తన కర్మఫలం పూర్తి అవగానే శరీరాన్ని విడిచి వెళ్ళటం జరుగుతుంది. 


కర్మలను నివృత్తి చేసుకోవటానికి జీవుడికి ఈ శరీరం ఒక సాధనం. ఈ సాధనాన్ని ఉపయోగించుకొని జీవుడు మంచి కర్మలను చెడ్డ కర్మలను అన్నిటినీ వదిలించుకొని కర్మరహితుడై శరీరాన్ని విడిచినప్పుడు ఆ జీవుడు దేవుడిలో కలసిపోతాడు. ఇక మరలా జన్మించటం ఉండదు. ఆ జన్మరాహిత్యమైన స్థితియే మోక్షము.

కామెంట్‌లు లేవు: