11, ఆగస్టు 2023, శుక్రవారం

సీతారామాంజనేయ సంవాదము.*


*శ్రీ రామచన్ద పరబ్రహ్మణే నమః*


*సీతారామాంజనేయ సంవాదము.*


*ప్రథమాధ్యాయము*


*భాగము - 6*



ఉ. నన్నయభట్టు సాంధ్రకవి;నాథునిఁ దిక్కనసోమయాజినిం 

బన్నుగ సోమసత్కవిని ; భాస్కర బమ్మెరపోతరాజుల మున్ను ప్రసిద్ధిగాంచిన కవి;ముఖ్యుల నందఱ నెమ్మనంబులో 

నెన్ని నమస్కరించెద న; భీష్టఫలా ప్తి దనర్చునట్లుగాన్.


తాత్పర్యము: 


"నన్నయభట్టారకులు, తిక్కన, నాచన, బమ్మెర, భాస్కరు" లందరు దివ్య శక్తియుక్తులు, రామాయణ, భారత, భాగవతాదుల నాంధ్రీకరించి, 


మనల కొసగిన ఆథ్యాత్మికమూర్తులు, 

ఆ పుణ్యపురుషుల దివ్య 

"శ్రీ" చరణాలకు శతానీక వందనాలు.



క. శుద్ధపదయుక్తిఁ దొఱఁగి య

బద్ధమును నిబద్ధి గా ని; బద్ధి నొగి మహా బద్ధము గాఁ గనుకుకవుల నౌద్ధత్యము మానుకొఱకు; నభినందింతున్.


తాత్పర్యము: 


కొందరు చాలా చక్కగా అబద్ధాన్ని"నిబద్దంగా" (సత్యంగా) చమత్కరించి. చెబుతారు. ఇవి కాలక్షేపాలు. 


ఇవి శాశ్వతమని భ్రమింపచేసే ఆశాశ్వతాలు. ఇది కవిత్వం కాదు. వీటి గురించి ఆలోచించ పని లేదు. పై పద్యానికి దొక వ్యాఖ్యానము. 


మరో రకంగా చూస్తే  అశాశ్వతము (అబద్ధము) సంసారము దానిని ఎంతో అందంగా ఆశలు కలుపుతూ, అందమైన ప్రలోభాలతో, 


జీవులను పరదైవం వైపు సాగనీయకుండా, కొందరు  ఇహలోక దృష్టి భావనలచే సతమతమవుతుంటారు. 

వీరు కూడ జ్ఞాన పర దృష్టితో చూస్తే సమాజానికి నాశన స్వరూపులే.



*సేకరణ : సకల దేవత సమాచారం గ్రూపు.*



🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

కామెంట్‌లు లేవు: