🎻🌹🙏 ఉత్తమ ధర్మాచరణం..!!
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌸ధర్మం నాలుగు విధాలుగా తెలుపబడినది.
సామాన్య ధర్మం,
క్షేమ ధర్మం,
విశేష ధర్మం,
విశేషేతర ధర్మం
అనేవి.
🌿తల్లితండ్రులను భార్యా పిల్లలను ఆదరంగా చూసి పోషించడం,
ఓర్పు, సహనాలతో జీవించడం సామాన్య ధర్మం.శీరాముని ఆదర్శ జీవితం సామాన్య ధర్మంలోనే చేరుతుంది.
🌸శ్రీ రామునికోసమే జీవించిన లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్రాహారాలు మాని శ్రీ రామునికి రక్షకునిగా వుండడం విశేష ధర్మం అంటారు. విశేష ధర్మంలో సామాన్యధర్మం కూడా లీనమై వుంటుంది.
🌿శ్రీ రాముని వెతుకుతూ వనములకు వెళ్ళి , రాముని పాదుకలు శిరము పై దాల్చుకుని వచ్చి శ్రీ రాముడే రాజ్యం పాలిస్తున్నట్టు చిత్రకూటంలో రాజ్యాన్ని పరిపాలించడం విశేష ధర్మం గా చెప్ప బడుతున్నది.
🌸ఆ విధంగానే కర్ణుని కన్న తల్లి కుంతి , తన బిడ్డను పెంచే భాధ్యతైన సామాన్య ధర్మాన్ని వదలి , నదిలో వదలి పెట్టడం అధర్మం. కాని బిడ్డను పెంచి పెద్ద చేసిన రధసారధి భార్య చేసినది విశేష ధర్మం.
🌿రావణుడు చేసిన తప్పులు అతనికి ఎత్తి చూపినా, వినిపించుకోని
అన్నగారికి సహాయంగా వున్న కుంభకర్ణునిది సామాన్య ధర్మం లో చేరుతుంది.
🌸కాని ,అన్నగారైన రావణుని తప్పులు ఎత్తి చూపిన విభీషణుడు , రాజ్యము నుండి రావణునిచే వెళ్ళ గొట్టబడి , శ్రీ రాముని శరణుకోరడం విశేష ధర్మం.
ఆశ్రమంలోకి పరిగెత్తుకు వచ్చిన గోవుని చూశాడుఋషి.
🌿గోవు వెనకాల గోవుని చంపడానికి వచ్చిన వారు, ఋషిని గోవు రావడం చూశావా అడుగగా , కళ్ళు చూసినవి.. నోరు చెప్పదునోరు చెప్పేది కళ్ళు చూడవు ..అని బదులిచ్చిన ఋషిని,
'అడవిలో వున్న పిచ్చి వాడని ' ఎగతాళి చేసివెళ్ళి పోయారు.
🌸సామాన్య ధర్మం అబధ్ధం
చెప్పకూడదు..సత్యం చెప్పాలి. కాని గోవుని రక్షించడానికి ఋషి చేసినది విశేష ధర్మం.బాలుడైన కృష్ణుని అల్లరి భరించలేని యశోద , కృష్ణుని పట్టుకుందుకి వచ్చినది.
🌿ధధి భాండుడు అనేవాని ఇంటిలో ని పెద్ద బానలో దాగాడు బాలకృష్ణుడు.ధధి భాండా! కృష్ణుని చూశావా? అని యశోద అడిగినదానికి, నేను కృష్ణుని చూసే చాలా రోజులైనదని అబధ్ధం చెప్పి యశోద నుపంపివేసిన ధధి భాండుడుచేసినది విశేష ధర్మంగా
పెద్దలు కీర్తిస్తారు.
🌸తండ్రి మాట వేద వాక్కుఅని సామాన్య ధర్మం తెలుపుతుంది. కాని ప్రహ్లాదుడు తన తండ్రి చెప్పినట్లు ,ఓం హిరణ్యాయ నమః అని అనకుండా , ఓం నమో నారాయణాయ నమః
అని జపించడం విశేష ధర్మం.
🌿భక్తదాసులకు చేసే సేవ
విశేషతర ధర్మం గా తెలుప బడుతున్నది.శీరాముని కై జీవించిన భరతుని చరణాలు నమ్మినవాడు శతృఘ్నుడు.శబరి తన గురువుగారైనా మతంగముని ఉపదేశానుసారం జీవితాంతం శ్రీరామ మంత్రాన్నే జపిస్తూ వచ్చింది.
🌸శ్రీ రాముడు శబరికి దర్శనమిచ్చాడు.శ్రీ రాముని దర్శనంకాగానేఆచార్యుడు చెప్పినట్టు
శబరికి ముక్తి లభించింది. శబరి గురుభక్తి ముక్తిని లభింప చేసింది.
🌿ఆళ్వారులు శతృఘ్నుడు,
శబరి, వీరంతా దేవునిపట్ల గల భక్తి కంటే కూడా తమ ఆచార్యులయందు
కలిగిన భక్తిని 'విశేషేతర ధర్మం' గా చెప్పారు. అన్ని ధర్మాలలోను ఉన్నతమైన ధర్మం విశేషేతర ధర్మం...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి