*
*కం*
తనయులకై సంపదలిడి
ఘనకార్యము చేసినటుల గర్వించు జనుల్
ఘనమగు సంస్కారములను
కొనలేరని మరచిపోవు కునుకుచు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! పిల్లల కు సంపదలనిచ్చి ఘనకార్యము చేసినట్లు గర్వపడే తల్లిదండ్రులు ఆ సంపదలేవీ గొప్ప సంస్కారములను కొనలేవని మత్తులో మరచిపోవుదురు.
*సందేశం*:-- పిల్లల కు సంపదలివ్వకపోయినా పర్వాలేదు కానీ సంస్కారం ఇవ్వలేకపోవడమే పెద్ద తప్పు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి