11, ఆగస్టు 2023, శుక్రవారం

నారాయణ కవచ విశిష్టత

 🎻🌹🙏నారాయణ కవచ విశిష్టత - శ్లోకం భావన...!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🙏🌹మొత్తము 42 శ్లోకాలు..

ప్రతి రోజు కొన్ని శ్లోకాలు భావన 

పఠనం చేదం...🙏🌹


🙏🌹ఈరోజు 29 &,30 శ్లోకం భావన పఠనం చేదం..🌹🙏



🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿


    🌷శ్రీ విశ్వరూప ఉవాచ |🌷



🙏🌹29) వ శ్లోకం 🌹🙏


గరుడో భగవాన్ స్తోత్రస్తోభశ్ఛందోమయః ప్రభుః |

రక్షత్వశేషకృచ్ఛ్రేభ్యో విష్వక్సేనః స్వ నామభిః ||


🌹🙏భావము:🌹🙏


వేద రూపుడైన గరుత్మంతుడు భగవానుడు. ప్రభువు. సామముల

( వేదసంబంధమైన మంత్రములు సామములు.సామములకు ఆధారమైన ఋక్కుల సముదాయము స్తోమము) చేత కీర్తించబడిన వాడు .


అటువంటి గరుత్మంతుడు నన్ను కష్టముల నుండి రక్షించుగాక! విష్వక్సేనుడు తన నామముల చేత రక్షించుగాక!



🙏🌹30) వ శ్లోకం :🌹🙏


 సర్వాపద్భ్యో హరేర్నామరూపయానాయుధాని నః |

బుద్ధీంద్రియమనఃప్రాణాన్పాంతు పార్షదభూషణాః||


🌹🙏భావము :🙏🌹


శ్రీహరి యొక్క నామ రూపములు ,వాహనములు, ఆయుధములు ,అతని సేవకులు మా యొక్క బుద్ధులను ,ఇంద్రియములను, మనసులను, ప్రాణములను అన్ని ఆపదల నుంచి రక్షించుగాక!...🚩🌞🙏🌹🎻


🌹🙏జై శ్రీమన్నారాయణ..🙏🌷


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

కామెంట్‌లు లేవు: