శ్లోకం:☝️
*ఉత్సాహో బలవానార్య*
*నాస్త్యుత్సాహాత్పరం బలం |*
*సొత్సాహస్య చ లోకేషు*
*న కించిదపి దుర్లభమ్ ||*
- వాల్మీకి రామాయణం 4.1.121
భావం: సీతావియోగ దుఃఖంలో వున్న శ్రీరామునితో లక్ష్మణస్వామి ఇలా అన్నాడు, "ఆర్యా! ఉత్సాహమే పురుషుల బలం. ఉత్సాహాన్ని మించిన శక్తి లేదు. ఔత్సాహిక వ్యక్తికి ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు."🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి