🌺🍃 -----------------------🍃 🌺
అన్నమయ్య వాణి నా సంకీర్తనా బాణి - 178
( ఛందోరీతి -- ద్విరదగతిరగడ )
🌺🍃 -----------------------🍃 🌺
*కీర్తన ః-- // ధరన మాయమ్మవే దయకురూపంబువే //*
🌹🌹
*ధరన మాయమ్మవే దయకు రూపంబువే*
*హరియురము పైమెరయు నలమేలు మంగవే*
*卐 --🌹 -- 卐 // ధరన మాయమ్మవే .. //*
*శ్రీనివాసుని జూచి చెన్నుగా నవ్వితివి*
*కానవచ్చి యతనిని కళ్యాణ మాడితివి*
*మా నడుమ మా తోడ మాధవుని జూపితివి*
*మానోములే పండె మాతగా వచ్చితివి*
*卐 --🌹 -- 卐 // ధరన మాయమ్మవే .. //*
*ఏడుకొండలవాని కిల్లాలి వోయమ్మ*
*ఏడేడు భువనాల కీప్సితము నీవమ్మ*
*ఈడు నెరుగక పరగె యిందిరవు నీవమ్మ*
*జాడ తెలిపితివిపుడు జయము నీ కోయమ్మ*
*卐 --🌹 -- 卐 // ధరన మాయమ్మవే .. //*
*భావించి జూచితే భాగ్యమనగా మాదె*
*యీవల కరుణ జూపు నిచ్చ యంతయు నీదె*
*చేవతో మముగాచు చిత్త మంతయు నీదె*
*యా వేంకటేశుడిల నలరు భారము నీదె*
*卐 --🌹 -- 卐 // ధరన మాయమ్మవే .. //*
✍️ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది ( స్వీయ రచన )*
🌹🌹
అమ్మా ! ఎంతటి దయగల దానవు . 🙏
ఆ శ్రీహరినే మాకు నిల నందించుటకు ,
నీవే క్రిందికి దిగి వచ్చి తపస్సు చేసి ,
నొములు పండించుకుని , శ్రీనివాసుని పెండ్లాడి ,
మాకు తల్లి తండ్రులవలే ,
ఇక్కడే మాకొరకు వెలసి యున్నారు . 🙏
ఇదంతా నీ వల్లనే కదా అమ్మా ! 🙏
ఇక *శ్రీ వేంకటేశ్వరుడు* సదా మంగళకరముగా ,
మాపట్ల ఉంచే భారము కూడా నీదే అమ్మ ! 🙏
నికు విన్నవించుకుంటే చాలు మా కోరికలు అన్నీ నీవే ఆయనకు చెప్పి ఫలింప చేస్తావు !!🙏 🙏
🌹🙏🌹🙏🌹🙏🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి