30, జూన్ 2021, బుధవారం

#కథ ఇంతటితో అయిపోలేదు

 👩‍🦰ఒక మహిళ షాపింగ్‌కు వెళ్ళింది. అంతా పూర్తయ్యాక క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి, బిల్లు చెల్లించడానికి తన హేండ్ బ్యాగ్ తెరిచింది.

క్యాషియర్ ఆమె బ్యాగు లో

ఒక టీవీ రిమోట్ గమనించాడు.

అతను ఉండబట్టలేక ఆడిగేసాడు..

"మీరు ఏప్పుడూ మీ టీవీ రిమోట్‌ను మీతో తీసుకువెళతారా?" అని.

ఆమె "లేదండీ, ఎప్పుడూ ఇలా తీసుకురాను, అప్పుడప్పుడు మాత్రమే.. ఈరోజు మావారు క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పి నాతో పాటు షాపింగ్ కి రాలేదు అందుకే నేను రిమోట్ తీసుకుని వచ్చేసా..."

అంటూ తన క్రెడిట్ కార్డ్ ఇచ్చింది.


#నీతి : మీ భార్య మాట వినండి, ఆమెకు అవసరమైన పనుల్లో సహకారం అందించండి ..!


#కథ ఇంతటితో అయిపోలేదు ..!


క్యాషియర్ నవ్వుతూ ఆమె కొన్న వస్తువులన్నీ తిరిగి తీసుకున్నాడు. 

ఊహించని ఈ సంఘటన చూసి ఆమె నిర్ఘాంతపోయింది ..!


"ఏమైంది..!!??" అని క్యాషియర్ని అడిగింది.

అతను చెప్పాడు, “మీ భర్త మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేసారు...”


#నీతి : మీ భర్త అభిరుచులను ఎల్లప్పుడూ గౌరవించండి.


#కథ కొనసాగుతుంది ..!


భార్య ఈసారికి తన భర్త క్రెడిట్ కార్డును పర్స్ నుండి తీసి స్వైప్ చేసింది. దురదృష్టవశాత్తు అతను తన సొంత కార్డును బ్లాక్ చేయలేదు.


 #నీతి : మీ భార్య యొక్క శక్తిని మరియు జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయవద్దు ..!

 

#కథ ఇంకా అయిపోలేదు ..!


స్వైప్ చేసిన తర్వాత, ఆ యంత్రం, 


"మీ మొబైల్ ఫోన్‌కు పంపిన పిన్ను నమోదు చేయండి" అని సూచించింది ..!


 #నీతి : ఒక్కోసారి మనిషి ఓడిపోయినప్పుడు, సాంకేతికత కూడా రక్షిస్తుంది ‌..!


#కథ_కొనసా....గుతుంది ..!


ఆమె మరలా నవ్వి, తన పర్సులో మెసేజ్ శబ్దంతో మోగిన మొబైల్ ను  బయటకు తీసింది.


అది తన భర్త ఫోన్.


ఆమె దానిని రిమోట్ కంట్రోల్‌తో బాటుగా తీసుకుని వచ్చేసింది.

ఎందుకంటే, తన షాపింగ్ సమయంలో భర్త తనకు కాల్స్ చేసి విసిగించకుండా ఉండేందుకు. చివరకు ఆమె తన షాపింగ్ పూర్తి చేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. 

 

#నీతి : ఎప్పుడూ మీ భార్యని తక్కువ అంచనా వేయవద్దు ..! 


#కథ_కొనసాగుతుంది ..!


ఆమె ఇంటికి చేరుకునేసరికి ఇంటి బయట ఆమెకు తన భర్త కారు కనిపించ లేదు.


ఒక నోట్ తలుపు మీద అతికించబడి  ఉంది.

అందులో ఇలా రాసి ఉంది ..!


"రిమోట్ దొరకలేదు. మ్యాచ్ చూడటానికి ఫ్రెండ్స్ తోబాటు బయటకు వెళ్తున్నాను. నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నీకు ఏదైనా అవసరమైతే నా ఫోన్ కు కాంటాక్ట్ చెయ్యి ..! అని ఇంటి తాళాలు కూడా తనతోబాటే తీసుకుపోయాడు


#నీతి : మీ భర్తను నియంత్రించడానికి ప్రయత్నించవద్దు. 😋😂😆😉😁


#తెలివి_ప్రతిభ_అనేది_ఇకరి_సొత్తు_కాదు 🙈🙈🙈

*'ఓం'తో అలసట మాయం

 *'ఓం'తో అలసట మాయం..శాస్త్రీయంగా నిరూపించిన బాలిక*


ఓం శబ్దంతో శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలుగేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది. పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్‌లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్తలను అకట్టుకుంది. కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది. 


ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్‌పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది. అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు. 


అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన:పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి...ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియజేసింది. అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది. 


గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు. కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని అన్వేష నిరూపించిందని ఆయన తెలిపారు. 


ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు. ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్‌షాప్‌నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు. వర్క్‌షాప్‌లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్‌లో పర్యటించినపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్‌కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది. 


అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది. దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది. దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది. ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌన:పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది. 


17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది. ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష తెలిపింది.

ప్రశ్న పత్రం సంఖ్య: 3 --సాహిత్యానికి సంబందించిన క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి

 ప్రశ్న పత్రం సంఖ్య: 3              కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

సాహిత్యానికి సంబందించిన క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి 

1) ఆది కావ్యం అని దేనిని అంటారు' 

2) తెలుగులో ఆది కవి అని ఎవరిని అంటారు  

3) తెలుగులో వ్రాసిన ఆది కావ్యం ఏది 

4) వేదాలను విభజించిన మహర్షి ఎవరు 

5) వేదాలు ఎన్ని 

6) దక్షణ ఆసియా ఖండంలో తోలి నవల ఏది 

7) ఇతిహాసాలు అని వేటిని అంటారు 

8) పోతన వ్రాసిన గ్రంధం ఏది 

9) "ఉరక రారు మహాను బావులు" వ్రాసింది ఎవరు 

10) "భాస్కర శతకం" వ్రాసింది ఎవరు 

11) మనుచరిత్ర వ్రాసింది ఎవరు 

12) ప్రభంధంలో ఎన్ని ఆశ్వాసాలు ఉంటాయి 

13) "బారిస్టర్ పార్వతీశం" రచయిత 

14) " సాక్షి వ్యాసాలు " ఈయన వ్రాసాడు 

15) " చెరుకు తుద వెన్ను పుట్టిన" ఏ శతకము లోది  

16) రామ రాజభూషణుడు వ్రాసిన ప్రబంధం 

17)  శ్రీ శ్రీ అని ఎవరిని అంటారు 

18) రామాయణ కల్ప వృక్షం వ్రాసింది ఎవరు 

19) "కుమారసంభవం " ఎవరు వ్రాసారు 

20) ఏనుగు లక్ష్మణ కవి తర్జిమా చేసిన సుభాషితాలు 

21) "పాండురంగ మహత్యం" వ్రాసినది 

22) జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తనర్చు 

తాంతాయుధు కన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునం తొలగం ద్రోసె లతాంగి’ 

ఈ పద్యం ఏ గ్రంధంలోది 

23) రామాయణం తెలుగించిన  తోలి కవియిత్రి ఎవరు 

24) తిరుపతి వెంకట కవులు అనగానే గుర్తుకు వచ్చేది 

25) "చందమామ రావే జాబిల్లి రావే" రచయిత ఎవరు  

26) "శృంగార నైషధము " కవి ఎవరు


పాము కరిస్తే ఇలా చేయండి

 *పాము కరిస్తే ఇలా చేయండి చేయించండి*


ఎంతటి విషపు పాము కరిచినా….ఇలా చేసి ప్రాణాలు రక్షించవచ్చు. గుర్తుపెట్టుకోండి, షేర్ చేయండి.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య రెండు లక్షలని అంచనా.. మన దేశంలో దాదాపు 250 జాతుల పాములున్నప్పటకిీ వాటిలో 52 విష సర్పాలు ఉన్నాయి. మన ప్రాంతంలో మాత్రం 5 పాములు అత్యంత విషాన్ని కల్గిఉన్నవి. అవి కరిస్తే మ్యాగ్జిమమ్ 3 గంటల్లో మనిషి చనిపోతాడు.. ఏదైనా ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి, లేకపోతే పాము కరిచిన ఆ వ్యక్తి మనకు దక్కడు.

కరిచిన పాము విషపుదా, మామూళుదా….? అని తెల్సుకోవాలంటే అది కరిచిన చోట ఎన్నిగాట్లున్నాయో చూడాలి. ఒకటి లేదా రెండు గాట్లు ఉంటే కరిచింది విషపు పాము అని, మూడు అంతకంటే ఎక్కువ గాట్లు ఉంటే అది విషరహిత పాము అని గుర్తించాలి.

విషపు పాము కరిస్తే….కరిచిన చోట పాము విషం శరీరంలోకి వెళుతుంది. అక్కడి నుండి గుండెకు , గుండె నుండి అన్ని శరీరభాగాలకు చేరుతుంది….ఇలా విషం అన్ని శరీరభాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది ఆలోపు చికిత్స చేయకుంటే మనిషి బతికే అవకాశాలు దాదాపు శూన్యం.

విషపు పాము కరిచిన వెంటనే…. కాటు కు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి. సూదిలేని సిరంజీని తీసుకోని ఆ గాట్లలో ఓ గాటు దగ్గర పెట్టి రక్తాన్ని గుంజాలి….మొదటగా రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది అంటే అది విషతుల్యమైన రక్తం అని అర్థం…ఇలా రెండు మూడు సార్లు రెండు గాట్ల వద్ద చేయాలి. ఇలా చేశాక మనిషి సృహలోకి వస్తాడు.

వాస్తవానికి పాము తన కొరల్లో ఉంచుకునే విషం 0.5 ML నుండి 2 ML వరకు మాత్రమే.!

ప్రతి ఒక్కరి ఇంట్లో హోమియోపతి మెడిసిన్ అయిన NAJA-200 ను 5ML బాటిల్ ఉంచుకోవాలి దీని ఖరీదు 5/- నుండి 10 రూపాయలే.దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుక పై 10 నిమిషాలకోసారి 3 సార్లు వేస్తే…పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు.

తర్వాత డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.


*ఈ వర్షకాలం అందరికి ఉపయోగ పడే పోస్ట్...* కాబట్టి 

*షేర్ చేయండి*

ఏమండీ గారు*

 👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨


     ఏమండీ గారు*

   (భర్త సహాయం..)


         👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨

        

           ఏమోయ్ ఏమీ చేస్తున్నావు.!!.." ఎప్పుడు చూసినా వంట ఇంటిలో, లేదు మొక్కలు నీళ్ళు పోస్తూ ఉంటావు. కాసేపు ఇలా కూర్చుని టీవీ చూడవు పేపర్ చదవవు."


      "బాగుంది నేను పేపర్ చదువుతూ కూర్చుంటే ఇంట్లో పనులు ఎలా అవుతాయి."


      " సరే నేను ఇప్పుడు రిటైర్ అయ్యాను కదా! రేపు పొద్దున్నుంచి నీకు ఇంటి పనులలో సహాయం చేస్తాను. నువ్వు లేచినప్పుడు నన్ను కూడా లేపు. "


*తర్వాతి రోజు*


         "ఏమండీ లేవండి పొద్దున్నే లేచి నాకు పనులలో సహాయం చేస్తా అన్నారు కదా!!.."


         " అబ్బా రాత్రి క్రికెట్ మ్యాచ్ చూసి లేటుగా పడుకున్నా, ఒక్క గంటలో లేస్తాను."


       ఎవరికి తప్పినా ఇల్లాలికి తప్పదుగా!!... లేచి డికాక్షన్ తీసి పాలు పొయ్యమీద పెట్టి బయట ముగ్గు వేసి వచ్చాను.


        మా ఏమండీ గారు లేచి వచ్చారు. 

       హమ్మయ్య లేచారా రండి రండి మొక్కలకి మీరు నీళ్ళు పొయ్యండి, నేను పూజకు పువ్వులు కోసుకుంటాను. "


          " అబ్బా ముందు నీ చేతితో కాఫీ ఇవ్వవే. కాఫీ పడితేనే మిగతా విషయాలు "


          వరండాలో కూర్చుని కాఫీ తాగుతున్నాము, ఇంతలో పేపర్ బాయ్ మొహం మీద పడేటట్టుగా పేపర్ పడేసి పోయాడు. ఇంక ఏముంది కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టుగా ఏమండీ గారు ఒక గంట వరకూ పిలిచినా పలకరు పేపర్ పట్టుకొని.


           నేను కాస్త మొక్కలకి నీళ్ళు పోసి పువ్వులు కోసుకొని స్నాన పూజాదులు ముగించుకున్నాను.


            వంట ఇంటిలోకి వచ్చాను బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని. వెనకనే ఏమండీగారు వచ్చి" ఏమిటో ఈరోజు ఫలహారం?? "ఓహో ఇడ్లీనా కాస్త పల్లీ పచ్చడి చేద్దు అదీ కారం కారంగా!.. రెండు వెల్లుల్లి కూడవేయి. అంటూ స్నానానికి వెళ్లారు.


            ఏమండీ, సహాయం చేస్తా అన్నారు కదా! కాస్త వాటర్ ఫిల్టర్ నింపండి అన్నాను.

" ఇదిగో టీవీ లో మెయిన్ న్యూస్ చూసి వచ్చేస్తాను "అని వెళ్లారు… రెండుగంటలు ఏమండీగారు మాయం 😂


           బట్టలు వాషింగ్ మిషన్ లో నుంచి తీసి ఏమండిగారికి ఇచ్చాను కాస్త ఆరెయ్యమని " పక్కింటి వాళ్ళు ఎవరన్నా చూస్తే ఆడంగి వాడు అంటారు. నాకు సిగ్గు బాబు అంటూ తప్పించుకున్నారు. "


          "ఏమండీ కాస్త కూరలు తరిగి ఇస్తారా?? కూరలు చేసేస్తాను.."


       అబ్బా కూరగాయలలో పుచ్చులు, చచ్చులు ఉంటాయి నేను కొయ్యలేను బాబు అంటూ టీవీ లో మునిగి పోయారు.


           భోజనానికి వచ్చినప్పుడు టేబుల్ తుడిచి కంచాలు, మంచి నీళ్ళు పెట్టమన్నాను.


         టేబుల్ క్లీన్ గానే ఉంది. మంచినీళ్లు కిందా, మీద పోసాను అంటావు నువ్వే పెట్టేసుకో అంటూ కుర్చీలో ఛతికిల పడ్డారు.


           "అబ్బా ఏమీ రుచిగా చేస్తావో వంట, వద్దన్నా నాలుగు మెతుకులు ఎక్కువెళ్లి పోతాయి. కాస్త కునుకు తీసి వస్తాను."


          వంట ఇల్లు సద్దుకొని అన్ని తుచుడుచుకొని నడుము వాలుద్దాం అనేసరికి ఏమండీగారు లేచి వచ్చి...ఏమోయ్ ఏమిటో మబ్బులు మబ్బులుగా ఉన్నాయి. టీ తో పాటు రెండు ఉల్లి పకోడా వేస్తావేమిటి??


          పకోడీ తిని టీ తాగి "పద కాసేపు అలా నడిచి వద్దాము అన్నారు."


         రాత్రి….. " ఏమిటో నీవంట అమోఘం ఎంత వద్దన్నా  తిండి ఎక్కువ అయిపోతుంది. రాత్రికి కాస్త జావా కాచి దానిలోకి కొబ్బరి పచ్చడి, చిక్కగా చిలక్కోట్టిన మజ్జిగా చాలు."


         అన్ని సద్దుకొని అలసిన నేను పడుక్కోవడానికి వెళ్తుంటే ఏమిటో "ఎప్పుడు చూసినా నిద్ర అంటావు. కాసేపు నాతో టీవీ చూడవు. నాకు కాస్త ఎమన్నా పని చెప్పమంటే చెప్పవు.


       సరేలే నువ్వు వెళ్ళి పడుక్కో నేను ఈ క్రికెట్ మ్యాచ్ చూసి వస్తాను.. రేపటి నుంచి అయినా నాకు కాస్త పని చెప్పు అన్నారు.


       నాకు ఒక మళ్ళీ రేపు ఎలా ఉంటుందో కళ్ళముందు మెదిలింది. 😂😂


*మిత్రులారా చిన్న సూచన*


*ఈ ప్రపంచంలో ఆడ పని, మగ పని లేవు. మంచి‌పని, చెడ్డ పని మాత్రమే ఉన్నాయి. ఆలుమగలు ఒకరికొకరు అన్యోన్యంగా ఇంటి పనులు పంచుకుంటే ఆ గృహమే స్వర్గసీమ.‌*

*ఒక కుటుంబం ఆనందాల హరివిల్లుగా మారాలంటే రెండు చక్రాలు కలిసి ఒకే మాట, ఒక బాటగా నడవడంతో పాటూ పరస్పర సహకారం కూడా అవసరం. మనల్ని చూసే మన పిల్లలు స్త్రీ, పురుష సమానత్వాన్ని, కష్టాన్ని పంచుకునే తత్వాన్ని అలవరచుకుంటారు. ఈ కథ హాస్యానికే రాసినా, మంచి మార్పు సమాజంలో రావడానికి మన ఇంటి నుండే ప్రయత్నం మొదలుపెట్టాలని మిత్రులందరినీ కోరుతున్నాను. ప్రతి దంపతులూ అన్యోన్యంగా ఆనందంగా ఒకరికొకరు తోడూ నీడగా ఆనందంగా ఆరోగ్యంగా జీవన‌ప్రయాణం సాగించాలని, పరస్పరం గౌరవించుకుంటూ, ప్రేమను పంచుకుంటూ జీవిత గమనాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా అందరం "ఇగో"ను వదులుకుంటే మనందరికీ ఆనందాలు సొంతమవుతాయి....*

శ్రీరాఘవాష్టకం

 *శ్రీ ఆదిశంకరచార్య విరచితం శ్రీ రాఘవాష్టకం*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*1) రాఘవం కరుణాకరం ముని-సేవితం సుర-వందితం!*

    

 *జానకీవదనారవింద-దివాకరం గుణభాజనం!*


*వాలిసూను- హితైషిణం హనుమత్ప్రియం కమలేక్షణం!*

   

 *యాతుధాన-భయంకరం ప్రణమామి రాఘవకుంజరం!!*



*2) మైథిలీకుచ- భూషణామల-నీలమౌక్తికమీశ్వరం!*

      *రావణానుజపాలనం రఘుపుంగవం మమ దైవతం!*


*నాగరీ-వనితాననాంబుజ-బోధనీయ-కలేవరం!*

      *సూర్యవంశవివర్ధనం ప్రణమామి రాఘవకుంజరం!!*



*3)హేమకుండల-మండితామల-కంఠదేశమరిందమం!*

    

 *శాతకుంభ-మయూరనేత్ర-విభూషణేన-విభూషితం!*


*చారునూపుర-హార-కౌస్తుభ-కర్ణభూషణ-భూషితం!*

    

 *భానువంశ-వివర్ధనం ప్రణమామి రాఘవకుంజరం!!*



*4) దండకాఖ్యవనే రతామర-సిద్ధయోగి-గణాశ్రయం!*

    

 *శిష్టపాలన-తత్పరం ధృతిశాలిపార్థ-కృతస్తుతిం!*


*కుంభకర్ణ-భుజా భుజంగవికర్తనే సువిశారదం!*

    

 *లక్ష్మణానుజవత్సలం ప్రణమామి రాఘవకుంజరం!!*



*5) కేతకీ-కరవీర- జాతి-సుగంధిమాల్య-సుశోభితం!*


*శ్రీధరం మిథిలాత్మజాకుచ-కుంకుమారుణ-వక్షసం!*


*దేవదేవమశేష భూత-మనోహరం జగతాం పతిం!*

      *దాసభూతభయాపహం ప్రణమామి రాఘవకుంజరం!!*



*6)యాగదాన-సమాధి-హోమ-జపాదికర్మకరైర్ద్విజైః!*

      

*వేదపారగతైరహర్నిశమాదరేణ సుపూజితం!*


*తాటకావధహేతుమంగదతాత-వాలి-నిషూదనం!*

     

*పైతృకోదితపాలకం ప్రణమామి రాఘవకుంజరం!!*



*7) లీలయా ఖరదూషణాది-నిశాచరాశు-వినాశనం!*

      *రావణాంతకమచ్యుతం హరియూథ కోటి-గణాశ్రయం!*


*నీరజాననమంబుజాంఘ్రియుగం హరిం భువనాశ్రయం!*

    

*దేవకార్య-విచక్షణం ప్రణమామి రాఘవకుంజరం!!*



*8) కౌశికేన సుశిక్షితాస్త్ర-కలాపమాయత-లోచనం!*

    

 *చారుహాసమనాథ-బంధుమశేషలోక-నివాసినం!*


*వాసవాది-సురారి-రావణశాసనం చ పరాంగతిం!*

      *నీలమేఘ-నిభాకృతిం ప్రణమామి రాఘవకుంజరం!!*



*9)రాఘవాష్టకమిష్టసిద్ధిదమచ్యుతాశ్రయ-సాధకం!*

    

 *ముక్తి-భుక్తిఫలప్రదం ధన-ధాన్య-సిద్ధి-వివర్ధనం!*


*రామచంద్ర-కృపాకటాక్షదమాదరేణ సదా జపేత్!*


*రామచంద్ర- పదాంబుజద్వయ- సంతతార్పిత- మానసః!!*



*10) రామ రామ నమోఽస్తు తే జయ రామభద్ర నమోఽస్తు తే!*


*రామచంద్ర నమోఽస్తు తే జయ రాఘవాయ నమోఽస్తు తే!*


*దేవదేవ నమోఽస్తు తే జయ దేవరాజ నమోఽస్తు తే!*


*వాసుదేవ నమోఽస్తు తే జయ వీరరాజ నమోఽస్తు తే!!*


      *ఇతి శ్రీరాఘవాష్టకం సంపూర్ణం.*


🕉🌞🌏🌙🌟🚩

Man vs. Woman--+Human Brain Analysis :-

 MUST READ:


Human Brain Analysis :-


Man vs. Woman......!!



1. MULTITASKING:

Women - Multiple process

Women's brains designed to concentrate multiple task at a time.

Women can Watch a TV and Talk over phone and cook.

Men - Single Process

Men's brains designed to concentrate only one work at a time. Men can not watch TV and talk over the phone at the same time. they stop the TV while Talking. They can either watch TV or talk over the phone or cook.


2. LANGUAGE:

Women can easily learn many languages. But can not find solutions to problems. Men can not easily learn languages, they can easily solve problems. That's why in average a 3 years old girl has three times higher vocabulary than a 3 year old boy.


3. ANALYTICAL SKILLS:

Men's brains has a lot of space for handling the analytical process. They can analyze and find the solution for a process and design a map of a building easily. But If a complex map is viewed by women, they can not understand it. Women can not understand the details of a map easily, For them it is just a dump of lines on a paper.


4. CAR DRIVING.

While driving a car, mans analytical spaces are used in his brain. He can drive a car fast as possible. If he sees an object at long distance, immediately his brain classifies the object (bus or van or car) direction and speed of the object and he drives accordingly. Where woman take a long time to recognize the object direction/ speed. Mans single process mind stops the audio in the car (if any), then concentrates only on driving.


5. LYING

When men lie to women face to face, they get caught easily. Woman's super natural brain observes facial expression 70%, body language 20% and words coming from the mouth 10%. Men's brain does not have this. Women easily lie to men face to face.

So guys, do not lie face to face.


6. PROBLEMS SOLVING

If a man have a lot of problems, his brain clearly classifies the problems and puts them in individual rooms in the brain and then finds the solution one by one. You can see many guys looking at the sky for a long time. If a woman has a lot of problems, her brain can not classify the problems. she wants some one to hear that. After telling everything to a person she goes happily to bed. She does not worry about the problems being solved or not.


7. WHAT THEY WANT

Men want status, success, solutions, big process, etc... But Women want relationship, friends, family, etc...


8. UNHAPPINESS

If women are unhappy with their relations, they can not concentrate on their work. If men are unhappy with their work, they can not concentrate on the relations.


9. SPEECH

Women use indirect language in speech. But Men use direct language.



10. HANDLING EMOTION

Women talk a lot without thinking. Men act a lot without thinking.

know you are rich?*

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*How do you know you are rich?*


Amazing answer by Mr Awadhesh Singh, an ex student of IT-BHU (now IIT-BHU)


When I was doing my B Tech, there was a Professor Das Talukedar who used to teach us ‘Mechanics’.


His lectures used to be very interesting since he had an interesting way to teach and explain the concepts.


One day, in the class, he asked the following questions,


1. What is ZERO?

2.What is INFINITY?

3. Can ZERO and INFINITY be same?


We all thought that we knew the answers and we replied as following,


ZERO means *nothing*

INFINITY means *a number greater than any countable number*

ZERO and INFINITY *are opposite and they can never be same*


He countered us by first talking about infinity and asked, ‘How can there be any number which is greater than any countable number?’


We had no answers.


He then explained the concept of infinity in a very interesting way, which I remember even after more than 35 years.


He said that imagine that there is an illiterate shepherd who can count only upto 20.


Now, if the number of sheep he has less than 20 and you ask him how many sheep he has, he can tell you the precise number (like 3, 5 14 etc.). However, if the number is more than 20, he is likely to say “TOO MANY”.


He then explained that in science infinity means ‘too many’ (and not uncountable) and in the same way zero means ‘too few’ (and not nothing)


As an example, he said that if we take the diameter of the Earth as compared to distance between Earth and Sun, the diameter of earth can be said to zero since it is too small.


However, when we compare the same diameter of earth with the size of a grain, diameter of earth can be said to be infinite.


Hence, he concluded that the same thing can be ZERO and INFINITE at the same time, depending on the context, or your matrix of *comparison.*


The relationship between *richness and poverty* is similar to the relationship between infinity and zero.


It all depends on the scale of comparison with your wants.


If your income is more than your wants, you are *rich.*

If your wants are more than your income, you are *poor.*


I consider myself rich because my wants are far less than my income.


I have become rich not so much by acquiring lots of money, but by progressively *reducing* my wants and having friends like you. 


*If you can reduce your wants, you too can become rich at this very moment.*                                                                          *_Try for the Best_*

13.ఋచీక మహర్షి

 *🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏*

*13.ఋచీక మహర్షి* 

 ఆకాలంలో కృతవీర్యుడు అనే మహారాజు భృగువంశంలో బ్రాహ్మణుల్ని కులగురువులుగా పెట్టుకుని వాళ్ళకి చాలా సంపదలిచ్చాడు . ఆయన పిల్లలకి ఈ కారణంగా భృగువంశంలో బ్రాహ్మణుల మీద ఈర్ష్య వుండేది . అందుకని భృగువుల్ని చాలా కష్టాలు పెట్టడం మొదలు పెట్టారు . ఆడవాళ్లని కూడా తరిమి తరిమి కొట్టారు . అప్రవాన మహర్షి భార్య ఋచి గర్భవతి . ఆమె ప్రాణభయంతో పారిపోతూ వున్న సమయంలోనే ఒక గొప్ప తేజస్సునిండిన కొడుకును ప్రసవించింది . ఆ తేజస్సుకి రాజకుమారులకి కళ్లుపోయాయి . వాళ్ళ మీద దయతో వాళ్లకి కళ్ళు వచ్చేలా చెయ్యమని కొడుకుకి చెప్పింది ఋచి . రాజకుమారులు క్షమించమని అడిగి వెళ్ళిపోయారు . పేరు ఔర్వుడు . ఔర్వుడు పెళ్ళి చేసుకోకుండా తన తపశ్శక్తితో ఒక కొడుకుని , ఒక కూతుర్ని పొందాడు . ఆ కొడుకే మన ఋచీక మహర్షి 


ఋచీక మహర్షి బ్రహ్మచారిగా ఉండి గొప్ప తపశ్శక్తిని సంపాదించాడు . ఒకనాడు గాధి అనే రాజు కూతురు సత్యవతిని పెళ్ళి చేసుకునేందుకు నిశ్చయించుకొని గాధి రాజు దగ్గరికి వెళ్ళి తన కోరిక చెప్పాడు . పాపం గాధిరాజుగారికి ఋచీక మహర్షికి తన కూతురు సత్యవతినిచ్చి పెళ్ళి చేయ్యాలంటే బాధగా అనిపించింది . కాని ఏం చేస్తాడు ? మహర్షి అడగడానికి వచ్చాడంటే అదేదో భగవంతుడే సంకల్పించి వుంటాడనుకుని ఎందుకయినా మంచిదని ఒక షరతు పెట్టాడు . మహర్షీ ! నువ్వు వాయువేగంతో సమానమైన వేగం వున్నవీ , నల్లని చెవులు , తెల్లని శరీరాలు వున్న వెయ్యి గుర్రాలు తీసుకురా . అప్పుడు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు . ఋషీక మహర్షి సరేనని వెళ్ళిపోయాడు . ఋచీక మహర్షి ఇలాంటి గుర్రాలు ఎక్కడ ఉంటాయో తెలియక తిరిగి , తిరిగి , అవి వరుణదేవుడి దగ్గర ఉన్నాయని తెలుసుకున్నాడు . వెంటనే తన తపశ్శక్తితో వరుణలోకానికి వెళ్ళి వరుణుడికి వచ్చిన విషయం చెప్పాడు . వరుణదేవుడు ఋచీక మహర్షికి నమస్కారం చేసి , కబురు చేస్తే నేనే పంపించేవాడిని కదా ! అని చెప్పి ' తురంగతీర్థం'లో స్నానం చేయించి వెయ్యి గుర్రాలు ఇచ్చి పంపాడు .  వెయ్యి గుర్రాలు తీసుకుని గాధి మహారాజు కిచ్చి అతని కూతురు సత్యవతిని పెళ్ళి చేసుకున్నాడు ఋచీక మహర్షి .


ఋచీక మహర్షి భార్యను తీసుకుని ఒక ఆశ్రమంలో ఉంటూ సంతానం కలగడానికి వేదమంత్రాలతో అగ్ని దేవుడికి ఆహుతి చెయ్యడానికి తయారు చేసిన అన్నం ఋచీక మహర్షి తన భార్యల చేత తినిపించాలనుకున్నాడు . “ స్వామీ ! నా తల్లికి కూడ ఒక కొడుకుని ప్రసాదించండి అంది సత్యవతి . ఈ అన్నం మేమిద్దరం తింటాము అని చెప్పింది . ఋచీక మహర్షి ఇద్దరికి విడిగా పెట్టి పండ్లు మొదలయినవి తెచ్చుకోడానికి అడవికి వెళ్ళాడు . అప్పుడు సత్యవతి తల్లి సత్యవతితో అంటుంది , అమ్మా ! నీ మొగుడు నీకే మంచి అబ్బాయి పుట్టాలని నీకు ఇచ్చిన అన్నం మీద పవిత్రమయిన మంత్రజలం చల్లాడు . నా అన్నం మీద మామూలు మంత్రజలం చల్లాడు . అందుకే మనం ఇద్దరం మార్చుకుందాం అని అన్నం మార్చుకుని తినేశారు . ఋచీక మహర్షి ఇంటికి వచ్చి జరిగింది తెలుసుకుని భార్యని పిలిచి మంత్రజలం చల్లిన అన్నాన్ని , నేను చెప్పినట్లు కాకుండ మార్చుకుని తిన్నారు . నీకు క్షత్రియ ధర్మాలున్న కొడుకు , నీ తల్లికి వేదాంతవేది , మహాతపస్సంపన్నుడు అయిన కొడుకు పుడతారు అన్నాడు . సత్యవతి భయపడి క్షమించమని భర్తని వేడుకుంది . ఋచీక మహర్షి జరగవల్సింది జరిగిపోతుంది . ఇది దైవ నిర్ణయం ఇంక చెయ్యగలిగింది ఏమీ లేదు అన్నాడు .


కొంతకాలానికి సత్యవతికి జమదగ్ని అనే కొడుకు , ఆమె తల్లికి విశ్వామిత్రుడు అనే కొడుకు పుట్టారు . ఋచీక మహర్షి సంసారం వదిలి పెట్టేసి భగవంతుడిలో చేరిపోవడానికి బయలుదేరాడు . వెడుతూ వెడుతూ సత్యవతికి శాశ్వతంగా నదీరూపంలో ఉండేలా వరం ఇచ్చాడు . ఆ నదే కౌశికీ నది . గొప్ప పుణ్య తీర్థంగా పేరు పొందింది . చదివేశారా .... ఋచీక మహర్షి గురించి ! పెద్దవాళ్ళు చెప్పినట్టు చెయ్యకపోతే ఎన్ని అనర్ధాలు జరిగిపోతాయో చదివారు కదా ! 

*13.ఋచీక మహర్షి*



*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*🙏

పురాకృతం

 *పురాకృతం..* *(మొదటి భాగం)*


*ఎవరి ఇంట్లోనైనా చిన్నవాళ్లు మరణించడం కూతుర్లు లేచిపోవడం వ్యాపారంలో నష్టాలు రావడం మొదలైనవి జరిగినప్పుడు మత ప్రచారకులు ఆ ఇంటిని ముట్టడిస్తారు..   "మీ దేవుడు మిమ్ములను సరిగా పట్టించు కోడంలేదు. మామతంలోకి రండి. మేము మీకోసం ప్రార్ధనలు చేస్తాము. మీరేమీ కష్టపడకుండా మాదేముడు అన్నీ సవ్యంగా జరిపే టట్లుగా మేము చూసుకుంటాము" అని చెప్పి మతాలు మార్పిస్తుంటారు... కాస్త పరిశీలిస్తే ఆ మతంలో నైనా ఇవే పరిస్తితు లుంటాయి. ఏదైనా మతం లో మనుషులకు కష్టాలు రావు ..  చావు రాదు .. అనే ఏర్పాటు ఉంటే ప్రచారాలు అర్భాటాలు గట్రా లేకుండా అందరూ పొలో మని ఆ మతంలోకి దూకుతారు కదా. అట్లాటి సమాజమూ అట్లాంటి మతమూ ఎక్కడైనా ఉందా?*


ఒకరి జోలికి సొంటికి పోకుండా శాంతంగా ధర్మంగా బ్రతికే  వాళ్లు,  దరిద్రమూ, కష్టాలూ పడడమూ. వాళ్ళే డబ్బులున్న వాళ్లయితే పిల్లల విషయం లోనో, ఆరోగ్యం విషయం లోనో సమస్యలకు లోనవడమూ ఇట్లాటివి చూస్తుంటాము. చిన్న వాళ్ళు ముందుగా చచ్చి పోవడమూ. వీటి తోపాటు పాపాత్ములు దుర్మార్గులు అని మనం నిర్ణయించు కున్న వాళ్ళు  చాలా సుఖాలు అనుభవిస్తు న్నట్లుగా కనిపించడము చూస్తుంటాము. ఎవడో బాగా తాగి రాంగ్రూట్లో ఎదురుగా వచ్చి గుద్దితే మన కాళ్లు చేతులు విరగడమూ. దేవుడూ ధర్మమూ అని నమ్మ కాలున్న వాళ్లకు ఇవి కొంచం  ఇబ్బంది కలిగించే అనుభవాలు. మిగతా మతాల గురించి నాకు తెలియదు. హిందూమతంలో దీనికి సంబంధించి ఒక వివరణ ఉన్నది అది తెలియజేస్తున్నాను.


ప్రతి మనిషికి తన పూర్వ జన్మలో చేసుకున్న శుభాశుభ కర్మల ఫలాలను అంటే పాపము పుణ్యము కలిపి సంచితము (పురాకృతం) అని పిలుస్తారు. పురాకృతం అంటే ఇంతకు మునుపు చేసుకున్నది అని అర్థము. సంచితము అంటే కూడ పెట్టుకొని దాచిపెట్టు కున్నది అని అర్థము. ఈ సంచితాన్ని మొత్తంగా ఒకే జన్మలో అనుభవించడానికి వీలు పడదు. ఇందులో ఒక ఇబ్బంది కూడా ఉంది. పాపాల వల్ల పుణ్యాలు పుణ్యాల వల్ల పాపాలు పరస్పరము రద్దు కావు. చక్కెరవ్యాధి ఉన్నవాడు లడ్డూలు తిని అదే మోతాదులో ఆవకాయ, మిరపకాయ బజ్జీలు తిన్నా అవి రెండూ కడుపులోకి వెళ్లి చెడు చేస్తాయే కానీ పరస్పరం కొట్టుకొని రద్దు కావు. పాపపుణ్యాలు కూడా అలాగే. వేటికవే విడివిడిగా అనుభవించాలి. ఈ కారణం వల్ల మనిషి మళ్లీ మళ్లీ జన్మలెత్తాల్సి వస్తుంది.


మనిషి జన్మ ఎత్తినప్పుడు అతని సంచిత పాప  పుణ్యాలు రెండు భాగాలుగా  అవుతుంది.  ఒక భాగం ఆరబ్దము రెండవది అనారబ్దము. ఆరబ్దము అంటే ఈ జన్మలో ఆ మనిషి అనుభవించ వలసిన పుణ్య పాపాల మొత్తము. యత్నము ప్రయత్నము. మోదము ప్రమోదము. శాంతము ప్రశాంతము.  ఆ పదాల లాగే ఆరబ్దాన్నే ప్రారబ్దము అని కూడా అంటారు. కొన్ని పదాలకు "ప్ర" కలిపితే ఇంకాస్త మరికాస్త అనే అర్థం వస్తుంది. ప్రారబ్దాన్ని కర్మ అదృష్టము అని కూడా అంటారు. చెడ్డ వాటికి కర్మ మంచి వాటికి అదృష్టము అని వాడుతూ ఉంటాము.


ఇక రెండోదయిన అనారబ్దము తర్వాతి జన్మలో అనుభవించడానికి మిగిలిపోతుంది. ఈ జన్మలో మనం చేసే శుభాశుభ కర్మల కు మళ్ళీ కొంత పాపము పుణ్యము ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన పాపపుణ్యాలను ఆగామి పాపపుణ్యాలు అంటారు. ఈ ఆగామి వెళ్లి అనారబ్దములో కలుస్తుంది. తర్వాత జన్మకు ఈ రెండూ కలిసిన మొత్తం మళ్ళీ అప్పుడు సంచితం అవుతుంది.


మనం చేసే అన్ని పనులకూ పాపపుణ్యాలు ఏర్పడవు. కర్మలను ఆసక్తితో కానీ కర్తృత్వ భావనతో కానీ చేసినప్పుడే ఆ కర్మలకు ఫలితాలు వస్తాయి. ధర్మబద్ధంగా జీవించడం కోసం చేసే కర్మలకు పాపము రాదు. అధర్మ మైన నిషిద్ధమైన కర్మలకు పాపం వస్తుంది. పుణ్యం కోసం చేసే కర్మలకూ మంచి పనులకూ పుణ్యం వస్తుంది.  ఆసక్తి లేకుండా నేను చేస్తున్నాను అనే భావం లేకుండా కర్మ చేస్తే ఆ కర్మ కు ఫలితాలు రావు. అందువల్ల కర్మలన్నీ ఈశ్వరార్పణం గా అహంకార మమకారాలను వదిలిపెట్టి చేస్తే వాటివల్ల ఏ పాపము అంటదు. 


*పురాకృత మైన కర్మ ఫలితాన్ని రద్దు చేసుకునే అవకాశం మన మతంలో ఉన్నది..* 


అలా కర్మ రద్దు అవ్వడాన్ని కర్మ క్షయము అంటారు. కర్మ క్షయము జరిగితే జన్మ పరంపర నుంచి బయటపడవచ్చు. 


*పవని నాగ ప్రదీప్.*


రుద్ర ప్రశ్న జీవ లక్షణమును

 రుద్ర ప్రశ్న జీవ లక్షణమును ఎక్కడ వుంది అది ఏమిటని సూత్రమును ప్రశ్నించుచూ వివరించుచున్నది. కస్మై దేవాయ హవిషా  విధేమ.ఆత్మను విశ్వ వ్యాప్తిని అది ప్రశీషం యని తెలుపు చున్నది. ప్ర  శీ  ఉషం యని, ప్ర ప్రఙ్ఞానమని అది శివ రూపంలో వుండి మార్పు చెంది న కాంతి సర్వస్వము యని తెలుపు చున్నది. అది ఎలా నున్నదో యనగా మన నీడ లాగా వున్నది.నీ నీడే  మృత్యువులాగ వెన్నంటి రెడీగా వున్నది.  కనుక మృత్యువునుండి అమృతతత్వము యనగా ఎవరికీ తెలియని విడుదల  ప్రవేశము,  అమృతము యని దెలియుట. కస్మై, తస్మై లను పరిశీలించిన తస్మై యను తత్ పరిశీలన నీవే యనగా కస్మై జీవ రూపమని తెలియుచున్నది. తస్మైన్నమః నిన్ను నీవే పూజ చేయుట. అనగా సాధన చేయుట. నీ కొరకు నీవే సాక్షివై సాధన. వేరొకరు కుదరదు. నిన్ను నీవే ప్రకృతి నుండి రక్షించుకొనుట. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వూందాం.

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*సజీవ సమాధి..మంకుపట్టు..*


1975 వ సంవత్సరం మే నెల ఆఖరివారంలో శ్రీ స్వామివారు తాను సజీవ సమాధి చెందాలని భావిస్తున్నట్లు మా తల్లిదండ్రులైన శ్రీధరరావు నిర్మల ప్రభావతి గార్లతో చెప్పారు..శ్రీ స్వామివారు వెలిబుచ్చిన ఆ అభిప్రాయాన్ని అమ్మా నాన్న ఇద్దరూ తీవ్రంగా వ్యతిరేకించారు..ఆరోజు మొదలు వీలున్నప్పుడల్లా శ్రీ స్వామివారు తన కోరికను బైట పెడుతూనే వున్నారు కానీ..మా తల్లిదండ్రులే కాక, శ్రీ స్వామివారితో అత్యంత సన్నిహితంగా ఉండే శ్రీ చెక్కా కేశవులు గారు..ఆశ్రమం నిర్మించిన శ్రీ మీరాశెట్టి గారు..శ్రీ మెంటా మస్తాన్ రావు గార్లు కూడా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు..


శ్రీ స్వామివారు పదే పదే ఒక మాట అంటుండేవారు.."నాకు సమయం లేదు..నేను వచ్చిన కార్యం పూర్తి కావొస్తోంది..అది పూర్తి అయిన మరుక్షణం నేను ఈ భూమ్మీద ఉండకూడదు..అది దైవ నిర్ణయం..బోధ చేయడానికి నేను సజీవంగా ఉండాల్సిన అవసరం లేదు..నా సమాధి కూడా అనేక సందేహాలను తీరుస్తుంది..నా సమాధి అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది.." అని..


వేసవి సెలవులు అయిపోయి మళ్లీ దసరా నాటికి శ్రీ స్వామివారి నిర్ణయం లో మార్పురాలేదు.. సంక్రాంతికి   శ్రీ స్వామివారు తనను సజీవ సమాధి చేయమని వత్తిడి చేయడం ప్రారంభించారు..నా పరోక్షంలో జరిగిన విషయాలను అమ్మా నాన్న గార్ల ద్వారా తెలుసుకుంటూ వున్నాను..1976 వేసవి సెలవులు నాటికి (అప్పటికి నేను ఇంటర్ మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్షలు వ్రాసి వున్నాను) శ్రీ స్వామివారి సజీవ సమాధి విషయం సమస్యగా మారి..తీవ్ర రూపం దాల్చి ఉంది..అటు శ్రీ స్వామివారు తానొచ్చిన కార్యం పూర్తి కావొచ్చింది కనుక తనను సజీవ సమాధి చేయమని..ఇటు అమ్మా నాన్న ఆయనను ఆ ప్రయత్నం విరమించుకోమని శతవిధాలా బ్రతిమలాడుతూ వున్నారు..కారణం అంతు పట్టలేదు కానీ..శ్రీ స్వామివారు ఒకరకంగా చెప్పాలంటే మంకుపట్టు పట్టి ఉన్నారేమో అనిపించింది..


1976 ఏప్రిల్ నెల మూడవవారం లో నేను శ్రీ స్వామివారి ఆశ్రమానికి వెళ్ళాను..శ్రీ స్వామివారు ధ్యానం లో ఉన్న కారణంగా సుమారు రెండు గంటల సేపు వేచి చూసాను.కానీ శ్రీ స్వామివారి దర్శనం కాలేదు..ఉసూరుమంటూ వెనక్కు వచ్చేసాను..ఆ ప్రక్కరోజే మాగాణి కి వెళ్లి రమ్మని నాన్నగారు చెప్పడంతో ఉదయాన్నే బయలుదేరాను..శ్రీ స్వామివారి ఆశ్రమం దగ్గరకు వచ్చేసరికి ఆశ్చర్యకరంగా శ్రీ స్వామివారు ఆశ్రమం బైట వైపు నిలబడి వున్నారు..


నేను దగ్గరకు వెళ్ళేసరికి..పరీక్షగా చూసి..

"పొద్దున్నే ఇటొచ్చావు..మాగాణికి పోతున్నావా?.." అన్నారు..


అవునన్నాను.."నిన్న మిమ్మల్ని కలుసుకుండామని ఇక్కడిదాకా వచ్చాను..మీరు ధ్యానంలో ఉన్నట్టు వున్నారు..తిరిగి ఇంటికెళ్లిపోయాను.." అన్నాను..


పెద్దగా నవ్వారు..నవ్వి.."కొద్దిరోజుల్లో రోజూ నన్ను చూడొచ్చు.." అంటూ నా భుజం మీద అనునయంగా తట్టారు...నాకు అర్ధం కాలేదు..


(శ్రీ స్వామివారు ఆనాడు అన్న మాటలకు అర్ధం..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి ధర్మకర్త గా బాధ్యతలు చేపట్టిన రోజు తెలిసింది..శ్రీ స్వామివారి సమాధిని ఎప్పుడూ దర్శించుకుంటూనే వున్నాను..)


వెళ్ళొస్తానని చెప్పి మాగాణికి వెళ్ళిపోయాను..తిరిగి సాయంత్రంగా అదే దారిలో నడచి వస్తుంటే..ఆశ్రమం బైట మళ్లీ శ్రీ స్వామివారు నిలుచుని వున్నారు..నన్ను చూసి దగ్గరకు రమ్మని సైగ చేశారు..వెళ్ళాను..


"ఇంకొక వారం పాటు అమ్మా నాన్నలను గానీ..నువ్వు కానీ నా కోసం రావొద్దు.. ధ్యానం లో వుంటాను..ఇంట్లో చెప్పు.." అన్నారు..సరే అని వచ్చేసాను.. 


మరో వారం తరువాత అమ్మా నాన్న శ్రీ స్వామివారిని కలవడానికి వెళ్ళొచ్చారు..శ్రీ స్వామివారి నిర్ణయం లో ఎటువంటీ మార్పూ లేదని అనుకుంటూ వున్నారు..


ఏప్రిల్ 30 వ తేదీ ఉదయం నాన్నగారు స్వామివారి వద్దకు వెళుతూ..."నువ్వూ వస్తావా?" అని నన్నడిగారు.. "వస్తాను".. అన్నాను ఉత్సాహంగా.. అప్పటికి శ్రీ స్వామివారిని నేను చూసి పదిహేను రోజులవుతున్నది..నాన్నగారితో పాటు ఆశ్రమానికి వెళ్ళాను..


నాన్నగారు, నేను శ్రీ స్వామివారు ధ్యానం చేసుకునే గది బైట నిలుచున్నాము..మరో ఐదు నిమిషాల్లోనే శ్రీ స్వామివారు గది తలుపులు తీసుకొని బైటకు వచ్చారు..శ్రీ స్వామివారిని చూసి నేను అవాక్కయ్యాను..ఎందుకంటే..శ్రీ స్వామివారు బాగా చిక్కిపోయివున్నారు..ప్రశాంతంగా.. చిరునవ్వుతో... వున్న  శ్రీ స్వామివారి ముఖంలో ఏదో తెలియని అద్భుత వెలుగు కనబడుతోంది..అప్రయత్నంగానే చేతులు జోడించి నమస్కారం చేసాను..


సజీవ సమాధి గురించి శ్రీ స్వామివారితో నాన్నగారి సంభాషణ..పర్యవసానం..రేపు చదువుకుందాము..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ :523114..సెల్..94402 66380 & 99089 73699).

షట్కర్మచన్ద్రికాయాం

 ....షట్కర్మచన్ద్రికాయాం...

బ్రాహ్మే ముహూర్త ఉత్థాయ 

ధర్మమర్థంచ చిన్తయేత్।

విష్ణుంచచిన్తయేద్ధీమాన్

సగుణం నిర్గుణంతువా।।

శివంవాచిన్తయేన్మన్త్రం

జపేత్పఞ్చదశాక్షరం।

ఆదౌతుశివరామేతి

గోవిన్దేతితతఃపరమ్।।

నారాయణమహాదేవేత్యేషా

పఞ్చదశాక్షరీ।

"శివరామగోవిన్దనారాయణమహాదేవ"

ఇతి శ్రుతేః।।

సాష్టాంగ నమస్కారము

 ❤️అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటాం.

సాష్టాంగ నమస్కారము అంటే ఎనిమిది అంగాలతో నమస్కారము చేయడం.


💕ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః...


💕అష్టాంగాలు అంటే...


"ఉరసా" అంటే తొడలు,

"శిరసా" అంటే తల,

"దృష్ట్యా" అనగా కళ్ళు,

"మనసా" అనగా హృదయం,

"వచసా" అనగా నోరు,

"పద్భ్యాం" అనగా పాదములు,

"కరాభ్యాం" అనగా చేతులు,

"కర్ణాభ్యాం" అంటే చెవులు.


ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.


💕మనిషి సహజంగా ఈ ఎనిమిది అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని దేవునికి నమస్కరించి ఆయా అంగములు నేలకు తగిలించాలి.


💕ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికీ ధ్వజ స్తంభానికీ మధ్యలో కాకుండా 

ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి.


1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.


2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.


3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.


4) మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.


5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం.. అంటే.. నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని స్మరించాలి.


అంటే  "ఓం శ్రీ వేంకటేశాయ నమః”(ఇలా ఆయా దేవుళ్లను స్మరించుకోవాలి) అని అంటూ నమస్కారం చేయాలి.

*ప్రతీరోజూ రోజుకు నాలుగైదు ఆధ్యాత్మిక / వ్యక్తిత్వవికాస సంబంధమైన  విషయాలను తెలుసుకోగోరే జిజ్ఞాసువులు లింకు ద్వారా సత్సంగ సమూహములో చేరండి. మీ బంధుమిత్రులకూ, అన్ని What’s app, Facebook, Telegram గ్రూపులకూ forward చేయండి:-*

https://t.me/joinchat/TIg_72gwkenxfdct

~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి

6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


8) కర్ణాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చెవులను కూడా నేలకు తగులించాలి.


స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది.


పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి.


నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం.

~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి

శ్రీ మల్లికార్జున స్వామియే

 ఓం శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామియే నమః


ఇది హిమాచలప్రదేశ్ లోని జ్వాలముఖి దేవి ఆలయం... అష్టాదశ శక్తి పీఠాలలో ఒక అత్యంత ప్రముఖమైనది...ఈ గుడిలో 9 దీపాలు అమ్మవారి 9 రూపాలుగా భావిస్తారు. ఇక్కడ ఎటువంటి విగ్రహం ఉండదు. ఇవి ఏ విధంగా వెలుగుతున్నాయో అని చాలా మంది పరిశోధనలు చేశారు.. కానీ ఇప్పటికీ ఎటువంటి సమాధానం కనుక్కోలేకపోయారు....


ఈ వీడియో చుసిన భక్తులకి సమయం ఉంటే "శ్రీ మాత్రే నమః" అని కామెంట్ లో పెట్టండి


ఓం శ్రీ వీరధర్మజ మాత్రే నమః


ఓం గురుభ్యో నమః

పదాలను కనుక్కోండి అన్ని "ణి " అనే అక్షరంతోటె అంతమౌతాయి

 ప్రశ్న పత్రం సంఖ్య: 2.                                కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

ఈ క్రింది పదాలను కనుక్కోండి అన్ని "ణి " అనే అక్షరంతోటె అంతమౌతాయి 

1చదువుల తల్లి 

2. రాజుగారి పత్ని 

3. మొదటి కొనుగోలు 

4. చీరలో సగం 

5. కాళ్లకు పెట్టేది 

6. పావడ 

7. మునులు నిప్పు పుట్టెంచే సాధనం 

8. కుంకుమ ఉంచేది 

9. ఎండలు బాగా వుండే కార్తీ 

10 సీతమ్మ వారు హనుమంతుని కిచ్చిన నగ.

11. కాళ్ళకూరి నారాయణ రావు గారి ప్రసిద్ధ తెలుగు నాటకం

12. శంకరాచార్యుల ఒక  రచించిన 

13 శ్రీరామ చంద్రుడు

14. అన్నం, గంజి పులియ బెట్టి చేసే పదార్ధం.

15.  నరకం లోని ఏరు

16.  శ్రీ మహా విష్ణువు

17. దుర్గా మాత రెండవ అవతారం: 

18. ఇల్లాలు 

19. ధూప ద్రవ్య విశేషం

20. తుమ్మెద రెక్కల లాంటి వెంట్రుకలున్న స్త్రీ.

21. శ్రీ కృష్ణుని ఒక పత్ని 

22. భూతద్దం 

22. ఒక రాగం 

23. మంచి పలుకులు పలికే స్త్రీ 

24. పార్వతి దేవి ఒక పేరు 

25. నీ పద్దతి మార్చుకోవా లో పద్దతి 

26. భూమి 


పదాలను కనుక్కోండి అన్ని "ణి " అనే

ప్రశ్న పత్రం సంఖ్య: 2.                                కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

ఈ క్రింది పదాలను కనుక్కోండి అన్ని "ణి " అనే అక్షరంతోటె అంతమౌతాయి 

1చదువుల తల్లి 

2. రాజుగారి పత్ని 

3. మొదటి కొనుగోలు 

4. చీరలో సగం 

5. కాళ్లకు పెట్టేది 

6. పావడ 

7. మునులు నిప్పు పుట్టెంచే సాధనం 

8. కుంకుమ ఉంచేది 

9. ఎండలు బాగా వుండే కార్తీ 

10 సీతమ్మ వారు హనుమంతుని కిచ్చిన నగ.

11. కాళ్ళకూరి నారాయణ రావు గారి ప్రసిద్ధ తెలుగు నాటకం

12. శంకరాచార్యుల ఒక  రచించిన 

13 శ్రీరామ చంద్రుడు

14. అన్నం, గంజి పులియ బెట్టి చేసే పదార్ధం.

15.  నరకం లోని ఏరు

16.  శ్రీ మహా విష్ణువు

17. దుర్గా మాత రెండవ అవతారం: 

18. ఇల్లాలు 

19. ధూప ద్రవ్య విశేషం

20. తుమ్మెద రెక్కల లాంటి వెంట్రుకలున్న స్త్రీ.

21. శ్రీ కృష్ణుని ఒక పత్ని 

22. భూతద్దం 

22. ఒక రాగం 

23. మంచి పలుకులు పలికే స్త్రీ 

24. పార్వతి దేవి ఒక పేరు 

25. నీ పద్దతి మార్చుకోవా లో పద్దతి 

26. భూమి 


వాణి 

రాణి 

బోణి 

వోణీ 

పరికిణి 

పారాణి 

కాణి  

కాణిపాకం 

అరణి 

భరణి 

రోహిణి 

చూడా మణి : సీతమ్మవారు హనుమకు ఇచ్చిన నాగ 

చింతామణి : కాళ్ళూరి నారాయన రావు గారి నాటకం 


2. 
3. తమిళనాట మురుగన్ ఆలయం ఉన్న ఒక ఊరు.
4. .
5. చిరుగంట
6.
7.
8. 
9. 
10. : వైతరణి 
11. పార్వతి : 
12. సరస్వతి: వాణి 
13. శ్రీ మహాలక్ష్మి 
14. యముడు
15. ఒక రాగం
16. ఒక నక్షత్రం
17. భార్య: అలివేణి 
18. 
19. తలమానికం
20.  :  సాంబ్రాణి 
21. భూతద్దం : దుర్భిణి 
22. కోనేరు: పుష్కరణి 
23. సారాయి: వారుణి 
24. మంచి మాటలు మాట్లాడే స్త్రీ: సుభాషిణి 
25. పద్ధతి
26. తెలుగు వారి ఒక ప్రాచీన నృత్యం.: కొంకణి 
27. పావడ
28. చెల్లుబాటు 
29. నిలువు బొట్టు
30. సూర్యుడు.​

ఇచ్చిన ప్రశ్నలకు 'ణి' తో అంతమయ్యే జవాబులు .

1. సీతమ్మ వారు హనుమంతుని కిచ్చిన నగ. :- చూడామణి

2. కాళ్ళకూరి నారాయణ రావు గారి ప్రసిద్ధ తెలుగు నాటకం :- చింతామణి

3. తమిళనాట మురుగన్ ఆలయం ఉన్న ఒక ఊరు. :- పళణి, తిరుత్తణి

4. శంకరాచార్యులు రచించిన తత్వశాస్త్రం. :- వివేకచూడామణి

5. చిరుగంట :-  కింకిణి

6. శ్రీరామ చంద్రుడు :- కోదండపాణి

7. శ్రీ మహా విష్ణువు :- మోహిణి

8. అన్నం, గంజి పులియ బెట్టి చేసే పదార్ధం. :- తరవాణి

9. తుమ్మెద రెక్కల లాంటి వెంట్రుకలున్న స్త్రీ. :- నీలవేణి

10. నరకం లోని ఏరు :- వైతరణి

11. పార్వతి :- శర్వాణి, బ్రహ్మచారిణి, కళ్యాణి, వరుణి, స్వరూపిణి

12. సరస్వతి :- వాణి

13. శ్రీ మహాలక్ష్మి :- శ్రావణి, రుక్మిణి

14. యముడు :- దక్షిణాణి

15. ఒక రాగం :- కళ్యాణి, కీరవాణి

16. ఒక నక్షత్రం  :- భరణి

17. భార్య  :- సతీమణి, గృహిణి

18. దుర్గా మాత రెండవ అవతారం  :- కాత్యాయిణి

19. తలమానికం  :- శిరోమణి

20. ధూప ద్రవ్య విశేషం  :- సాంబ్రాణి

21. భూతద్దం  :- దర్శిణి

22. కోనేరు  :- పుష్కరిణి

23. సారాయి  :- మత్తుద్రావణి

24. మంచి మాటలు మాట్లాడే స్త్రీ  :- పద్మిణి

25. పద్ధతి  :- ధోరణి

26. తెలుగు వారి ఒక ప్రాచీన నృత్యం :- పేరిణి

27. పావడ  : పరికిణి

28. చెల్లుబాటు  :- చెలామణి

29. నిలువు బొట్టు  :-  నారాయణి

30. సూర్యుడు :- ద్యుమణి