20, సెప్టెంబర్ 2020, ఆదివారం

ఆదివారం నాడు ఏం చేయకూడదో

 *ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన వేదాల లోని శ్లోకం.....*


అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే | 

సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||

 

స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |

న వ్యాధి శోక దారిద్ర్యం , సూర్యలోకం స గచ్చతి ||


తాత్పర్యం: 


మాంసం తినడం, 

మద్యం తాగడం, 

స్త్రీతో సాంగత్యం, 

తలకు నూనె పెట్టుకోవడం ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించిన కర్మలు ఇలా చేసినవాడు జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి వక్కాణించెయి దారిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు ఆనారోగ్యం కూడా


అలాంటి పవిత్రమైన రోజు తాగుబోతుల కి తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది.


మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు.


 ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి

ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యావందనాలు లాంటి హిందుకర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి.


ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రపాలు చేశారు.


మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ఎన్ని ఆచారాలు సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వన్నీ తెలిపేది మన హైందవ సంస్కృతి.


అది చూసి తట్టుకోలేక బ్రిటీషువాడు(Thomas Babington Macaulay ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే) ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు.


మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినే వారు కాదు మధ్యాన్ని తాగే వారు కాదు

కానీ ఇప్పుడు సీన్అంతా రివర్స్ అయ్యింది.


ఈ పోస్టు హిందూ సోదరులకు ఉత్సాహాన్ని మరియు నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది. దీన్ని పాటించడానికి ప్రయత్నించండి...


*|| ఓం నమః శివాయ ||*

Technology


 

**వారణాసి భూగృహంలో ఉగ్ర వారాహీ విచిత్ర దేవాలయం**

 దశిక రాము**


**మన సంస్కృతి సాంప్రదాయాలు**




మీరు కాశి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళారా? వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. 


కాకపోతే ఈ ఆలయం వేళలు ఉదయం 4:30 నుండి 8:30 వరకు మాత్రమే. కేవలం నాలుగు గంటలు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. తరువాత మూసేస్తారు. ఎందుకని అనేగా మీ సందేహం! 


అమ్మవారు ఆ వారణాసి గ్రామదేవత. చీకటి పడింది మొదలు ఉదయం 3:30 వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తుంది. అందువలన అమ్మవారి ఆలయంలో 4 గంటల పాటు పూజ చేసి క్రింద రెండు కన్నాల లో నుండి దర్శనం ఇస్తారు. ఒక కన్నం లో నుండి చూస్తే అమ్మవారి ముఖ భాగం, రెండవ కన్నం లో నుండి చూస్తే పాదాలు దర్శనం ఉంటుంది.


అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ హారతి ఇచ్చేసి సెల్లార్ లో నుండి బయటికి వచ్చేస్తాడు. ఆ తరువాత ఆ కన్నాల లో నుండి దర్శనానికి అనుమతి ఇస్తారు. మొన్నీమధ్య జరిగిన ఓ సంఘటన ఇక్కడ చెప్పుకోవాలి. 


క్రొత్తగా పెళ్ళైన జంట కొన్ని నెలల క్రితం అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ వారణాసి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించారు. పూజారి ఎప్పటిలాగే కన్నంలో నుండి చూడమని చెబితే వినలేదు. పైపెచ్చు మూర్ఖపు వాదనకి దిగారు. అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుంది! భక్తులని చూడనివ్వదు! అంటే

కాదు నాయనా! శాంత కళ, ఉగ్ర కళ అని రెండు ఉంటాయి. శాంత కళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. ఉగ్ర కళ అంటే దుష్ట సంహరార్థం ఎత్తిన అవతారం. ఆ కళ ని సామాన్యులు తట్టుకోలేరు. నేను వెళితేనే ఆ కళ తట్టుకోలేక త్వరగా ముగించి వచ్చేస్తాను.


సూర్యుడిని ఉదయం చూసినట్లు మధ్యాహ్నం చూడలేము. ఉదయం ఉన్నది ఆ సూర్యుడే. మధ్యాహ్నం ఉన్నది ఆ సూర్యుడే కదా అని చూస్తాను అంటే సాధ్యమేనా! కళ్ళు టపాసుల్లా పేల్లిపోతాయ్. దృష్టి పోతుంది. అలాంటిది దుష్ట శిక్షనార్థం ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు. చూడకూడదు. అని ఎంతో శ్రద్దగా చేబియే వినకుండా చూడనివ్వకపొతే కోర్ట్ కి వెళ్లి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకుంటాం. అని మొండి పట్టుపట్టారు. దీంతో పోయే కాలం వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది ప్రవర్తన అని సెల్లార్ లో ఉన్న అమ్మవారి వద్దకి ఆ కొత్త జంటని తీసుకెళ్ళాడు. క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చే లోపు ఇద్దరు కిందపడి మరణించారు.


ఈ మధ్య చాలామందిలో ఈ మొండితనం ఎక్కువైంది. శాస్త్రాలు ఇలా చెప్పాయి అంటే అలా ఎందుకు చెప్పాలి? మేము కోర్ట్ కి వెళ్లి వ్యతిరేకంగా తెచ్చుకుంటాం అంటున్నారు. దీనివలన ఎవరికీ నష్టం? మీతో పాటు మీవంశ నాశనం కూడ చేతులారా తెచ్చుకున్నట్లే.. మీవల్ల కేవలం మీవల్ల మీ వంశాలు తరతరాలు నాశనం అవుతున్నాయి. దుఃఖాల పాలై కష్టాల కడలిలో మునిగిపోతున్నారు. ఆనాడంటే జాతకాలు చూసి పూర్వికులు ఏమి చేయడం వలన ఏమి జరిగితుందో చెప్పేవారు. ఈనాడు అలాంటి జాతకాలు చూసి చెప్పేవారు లేరు. దీనివలన మూర్ఖత్వం ఎక్కువై పైశాచికంగా మారిపోతున్నారు. సమాజం మీద ద్వేషం పెంచుకుంటున్నారు. ఇది మీకు కాని మీ వంశానికి కాని మంచిది కాదు. 


శాస్త్రం ఇలా చెప్పింది అంటే ఆలానే చేయాలి. ఎదురెళితే నష్టపోయేది మీరే మీ వంశంలోని వారే. దుష్టశక్తులను అంతం చేయాలంటే శాంతంగా ఉంటే దుష్టశక్తులు ఊరుకుంటాయా? మీరు శాంతంగా ఉన్నారు కాబట్టి మేము శాంతంగా ఉంటాం అంటాయా? ఇంకా రెచ్చిపోతాయి. 


ఈ ఉగ్రవారాహి అమ్మవారిని పూజిస్తే దుష్టశక్తుల బెడద ఉండదు. ఎవరైనా దుష్ట ప్రయోగాలు మీమీద చేసినా వారికే బెడిసి కొడతాయి. కోర్ట్ కేసులు సమసిపోతాయి. అని శాస్త్రం.


🙏🙏🙏

సేకరణ


*ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏

*కొప్పరపు కవులు !* గొల్లపూడి మారుతీరావు



విదేశీయులకు నమ్మే అవకాశం ఎలాగూ లేదుకాని, స్వదేశీయుల్ని కూడా నమ్మించాల్సిన రోజులొచ్చేశాయి. ఎందుకంటే మన తెలివితేటలు ఎక్కువగా అక్కడినుంచే దిగుమతి అవుతున్నాయి కనుక. అయితే చూడాలనుకున్నవారికీ, తెలసుకోదలిచిన వారికీ ఈ వైభవం కనిపించే దాఖలాలు ఈ సంస్కృతిలో ఇంకా ఇంకా మిగిలే ఉన్నాయి. ఇంతకీ ఏమిటి ఆ వైభవం? ఈ దేశంలో విద్య, విద్వత్తు కేవలం పరిశ్రమతో మాత్రమే ఒడిసి పట్టుకునే 'సాధన' మాత్రమే కాదు. ఒక అనూహ్యమైన స్థాయిలో విద్వత్తు, పాండితీ ప్రకర్ష 'దర్శనం'. ఆది శంకరులు తన ఆరవయేట సాహితీ జగత్తులో మకుటాయమానంగా నిలవగల 'కనకధారా స్తోత్రాన్ని' చెప్పారు. (ఈ కాలమ్‌ రాస్తూ ఈ నిజాన్ని మరొక్కసారి రూఢి చేసుకోడానికి సామవేదం షణ్ముఖశర్మగారికి ఫోన్‌ చేశాను. ఆయన అనంతపురంలో ఇప్పుడే 'శంకర విజయం' ప్రవచనం చేసి అనుష్టానానికి కూర్చోబోతున్నారట. మీ ఫోన్‌ దైవికం అన్నారు). ఆటవికుడు కాళిదాసుకి అమ్మవారి దర్శనమయాక -అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అద్భుతంగా నిలిచే 'శ్యామలాదండకం' చెప్పారు. దండకం ఒకే వాక్యంతో సాగుతుంది. అటువంటి దండకం నభోతో నభవిష్యతి. ఒక పుట్టుమూగ చెవిటి అయిన మూక కవి దేవీకృపతో నోరిప్పి 500 శ్లోకాలు ఆశువుగా చెప్పి -మళ్లీ మూగకావాలనే వరాన్ని అమ్మ దగ్గర అనుగ్రహంగా పొందాడు. ఈ మూడు తార్కాణాలూ మన కళ్లముందున్నాయి. అయితే మనకి విశ్వాసం స్థాయిపోయి, సహేతుకమయిన స్థాయిలోనే ఆలోచనల్ని పరిమితం చేసుకొనే రోజులొచ్చాయి. ఆశ్చర్యం లేదు. మన ఋషులు ఆచరించి సాధించిన యోగశాస్త్రాన్ని అమెరికా పేటెంటు చేసింది. పతంజలి అటకెక్కాడు. సరే. ఇలాంటి వారికి విద్వత్తు ఉపాసనాబలమని మనతరం లోనే రుజువు చేసిన ఇద్దరు మహానుభావులు పుట్టారు. వారు కొప్పరపు కవులు. పెద్దాయన వేంకట సుబ్బరాయశర్మ. (1885 -1932). చిన్నాయన వేంకట రమణ శర్మ (1887 -1942). చిన్నాయనని చూసిన తరం ఇంకా మన మధ్య ఉన్నది.ఒక భారతీయ సాహిత్యంలోనే కవిత్వాన్ని వినోదంగా, క్రీడగా చేసుకునే స్థాయిని సాధించిన ఘనత కనిపిస్తుంది. అది అవధాన ప్రక్రియ. సంస్కృత సాహిత్యం ఇందుకు మూలం. ఎంతో కొంత కన్నడంలోనూ అవధాన ప్రక్రియ వుంది. అయితే దీన్ని సొంతం చేసుకొని అనూహ్యమైన పరిణతిని సాధించిన ఘనత తెలుగువారిదే. ఇప్పటికీ అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలూ చేసే పండితులు -ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఆనాడు కేవలం సభలో కూర్చుని ఆనందించడమే కాక సామాజికులు కూడా తమదైన ప్రతిభతో అవధానులమీద పద్యాలు చెప్పేవారు. అదొక సమగ్రమైన విందు. సుబ్బరాయ కవి తన 5వ యేట హనుమత్‌ కవచ రూప నక్షత్రమాల అనే 27 పద్యాలు చెప్పారట. కొప్పరపు కవులు తమ ఎనిమిదవ యేటే శతకాలు ఆశువుగా చెప్పారు. తమ 12వ యేట అష్టావధానాలు చేశారు. 16 వ యేట శతావధానాలు చేశారు. 20వ యేటికి గంటకి 300 పద్యాలు చెప్పే ధారని సాధించారు. తెలిసిన పద్యాలు -300 చదవడమే గగనం. అలాంటిది ఆశువుగా చెప్పేవారు. 1916 నాటికి అలా మూడు లక్షల పద్యాలు చెప్పారట. మన దురదృష్టం ఏమిటంటే ఆ రోజుల్లో రికార్డింగులూ, వీడియోలూ లేకపోవడం. ఆ వైభవాన్ని ఈ తరం చూసే అదృష్టం లేకపోయింది. తమ జీవితకాలంలో వారు ఎన్నో లక్షల పద్యాలు చెప్పారు.

ఇదంతా ఒక యెత్తు. ఈ విద్వత్తును మరో అనూహ్యమైన స్థాయికి తీసుకువెళ్లారు. ఒకసారి మార్టేరు సభలో ఎవరో పందెం వేయగా గంటకు 720 పద్యాలు చొప్పున కేవలం అరగంటలో 'మనుచరిత్ర'ను ఆశువుగా చెప్పారట. మరొక సంఘటన. ఇది ఇంకా విచిత్రం. అద్భుతం. ఇది సరిగ్గా వంద సంవత్సరాల క్రితం జరిగింది. గుంటూరులో అప్పటి ప్రముఖ న్యాయవాది పాటిబండ సూర్యనారాయణ గారు వారిని భోజనానికి ఆహ్వానించారు. ఇరవై ఆధరువులతో భోజనం వడ్డించి -తృప్తిగా భోజనం చేస్తూనే హనుమంతుని మీద శతకాన్ని చెప్పమన్నారట. ఏ పదార్థమూ వదిలి పెట్టకూడదన్నది కూడా ఒక నియమం. వారు నవ్వు కుని పరిషేచన చేసి ఆశువుగా ''నమస్కరింతు హనుమంతా నీ మహా శక్తికిన్‌'' అనే మకుటంతో 350 పైగా పద్యాలు చెప్పి ఉత్తరాపోశన చేశారు. ఇంతకూ వారి సాధన ఎలాంటిది? ప్రముఖ పాత్రికేయులు బూదరాజు రాధాకృష్ణగారి మాతామహులు పంగులూరి వారింట వారు అతిథులుగా ఉన్నప్పుడు ఆయన గమనించిన విషయమిది. ఈ కవులు ఉదయమే లేచి సాధనగా మహాభాగవతాన్ని ఆశువుగా చెప్పుకునేవారట! మరొక్కసారి. ఈ జాతిలో విజ్ఞానం విద్వత్తు -సాధన మాత్రమే కాదు, దర్శనమని నిరూపించిన ఉపాసకులు వీరు.

సాధారణంగా ఆశువుగా చెప్తున్నప్పుడు ధార సాగుతుంది కాని కవిత్వపు పలుకు కాస్తంత కొరవడే సందర్భాలుంటాయి. కొండొకచో అది ఆక్షేపణీయమూ కాదు. అయితే వారి పద్యాలు చదువుతున్నప్పుడు ఆ దోషం వారి పద్యాలకు ఏమాత్రమూ అంటదని మనకు బోధపడుతుంది. శబ్దగాంభీర్యం, అర్ధ సాంద్రత, ఆశుపటిమా పెనవేసుకొన్న చిక్కదనం వారి పద్యాలలో ద్యోతకమవుతుంది.

ఒకే ఒక్క ఉదాహరణ. ఒక శతావధానంలో సీతను రాముడు అరణ్యానికి ఎందుకు పంపాడో సమర్థిస్తూ పద్యం చెప్పమన్నారు. ఈ పద్యం ఆశువుగా చెప్పింది.

అలా లంకాపురి సీత సాధ్వియని వహ్న్యదుల్‌ దిశాధీశ్వరుల్‌

తెలుపం జేర్చితి నీయయోధ్య జనసందేహంబుపో దొంటిరీ

తుల దేవావళి తెల్పునంతవఱకిందున్నిల్పగాదంచు శ్రీ

నళినాక్ష్యంశజ సీత గాన కనిచెన్‌ రాముండు రాజాగ్రణీ!

'నళినాక్ష్యంశజ' అద్భుతమైన ప్రయోగం. ప్రాసస్థానంలో అర్ధగాంభీర్యంతో కూర్చున్న పదం ఇద్దరు ఉపాసకుల మేధాసంపత్తికి చిహ్నం.

కొప్పరపు కవుల్లో పెద్దవారైన వేంకటసుబ్బరాయ శర్మగారి దౌహిత్రుడు మాచవరం వేంకట చెంచురామ మారుతీ సుబ్బరాయశర్మ (మాశర్మ) తన మాతామహుల అవధాన వైభవాన్ని పునరుద్ధరించి గ్రంధస్తం చేసే కార్యక్రమానికి నడుంకట్టి (9-9-2002) కొప్పరపు కవుల కళాపీఠాన్ని స్థాపించాడు. మొదట వారి వైభవాన్ని ఆకళించుకోడానికి సాధికారికంగా పరిశోధన చేసిన వారిచేత ఆ సంపదను సేకరించి ఇప్పటికి అనేక గ్రంథాలు వెలువరించారు. ప్రతీయేటా ఆ ప్రక్రియలోనో, తదనుబంధమైన ప్రక్రియల్లోనో కృషి చేసిన లబ్దప్రతిష్టులను సత్కరిస్తున్నారు. ఈ ప్రణాళికలో భాగంగానే విశాఖ సముద్ర తీరంలో ఆ కవుల కాంశ్య విగ్రహాలను ఆవిష్కరింపజేశారు. ఇది వారు తీర్చుకుంటున్న పితృఱుణం.

మన సాహితీ వైభవాన్ని సుసంపన్నం చేసిన ఇటువంటి మహానుభావుల్ని స్మరించుకుని నివాళులర్పించడం జాతి తీర్చుకోవలసిన రుషి రుణం.నేడు మన జీవన సరళి -కేవలం ఉపాధికీ, సంపదకి, పదవులకీ పరిమితమైపోతున్న తరుణంలో వ్యక్తిశీలాన్ని మరింత ఉద్బుద్ధం చేసే ఇలాంటి వైభవాన్ని కనీసం తలచుకోవడమైనా చేయగలిగితే ఆ మేరకు జాతికి ఉపకారం జరుగుతుంది. ( కీ.శే గొల్లపూడి మారుతిరావుగారు గతంలో ఒక పత్రిక కోసం రాసిన వ్యాసం)-మాశర్మ

శ్రీ‌నివాసునికి స్న‌ప‌నం

 ఎండు ద్రాక్ష‌, వ‌క్క‌లు, ప‌సుపు కొమ్ముల‌ మాల‌ల‌తో వేడుక‌గా శ్రీ‌నివాసునికి స్న‌ప‌నం


         బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఆదివారం శ్రీ‌వారి ఆల‌యంలో ఎండు ద్రాక్ష‌, వ‌క్క‌లు, ప‌సుపు కొమ్ముల‌‌తో ప్ర‌త్యేకంగా రూపొందించిన మాల‌ల‌తో స్న‌ప‌న‌తిరుమంజ‌నం వేడుక‌గా జ‌రిగింది. రంగ‌నాయ‌కుల మండ‌పంలో ప్ర‌త్యేక వేదిక‌పై ఆశీనులైన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి వేద మంత్రాల న‌డుమ కంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ గోవిందాచార్యులు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.


         దాదాపు రెండు గంట‌ల పాటు జ‌రిగిన స్న‌ప‌న‌తిరుమంజ‌నంలో వివిధ‌ ర‌కాల మాల‌ల‌తో శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు భ‌క్తుల‌కు క‌నువిందు చేశారు. ప‌లు ర‌కాల సుగంధ ద్ర‌వ్యాల‌తో అభిషేకం చేస్తుండ‌గా, ప్ర‌త్యేక మాల‌ల‌ను అలంక‌రించారు. ఎండుద్రాక్ష‌, వ‌క్క‌లు, ప‌సుపుకొమ్మ‌లు, తుల‌సి గింజ‌లు, తామ‌ర గింజ‌లు, త‌మ‌ల పాకులు, రోజా పూల రేకులు మ‌రియు ప‌గ‌డపు పూల‌తో త‌యారు చేసిన మాల‌లు అలంక‌రించామ‌ని ఉద్యానవ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు తెలిపారు.


ఆకట్టుకున్న ఫల పుష్ప మండపం


         స్నపనతిరుమంజనం నిర్వహించే రంగ నాయ‌కుల మండపాన్నివివిధ ర‌కాల సాంప్ర‌దాయ పుష్పాలు, క‌ట్ ఫ్ల‌వ‌ర్స్‌, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలు, ఆస్ట్రేలియ బ‌త్త‌యి, ద్రాక్ష గుత్తుల‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. క‌మ‌నీయంగా సాగిన ఈ స్న‌ప‌న తిరుమంజ‌నాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.


           ఈ కార్య‌క్ర‌మంలో ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్ పాల్గొన్నారు. 

తిరుమల 2020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

                                           


చిన్నశేష వాహనంపై ముర‌ళి కృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప


      శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం 9.00 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమ‌లి పింఛం, పిల్ల‌న‌గ్రోవితో ముర‌ళి కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆల‌యంలోని ధ్వ‌జ‌స్థ‌భం వ‌ర‌కు స్వామివారిని చిన్న శేష వాహ‌నంపై ఏకాంతంగా ఊరేగించారు.  


చిన్న‌శేష వాహనం - కుటుంబ శ్రేయస్సు


       పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.


        రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.


        ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు స‌భ్యులు శ్రీ డిపి.అనంత‌, శ్రీ శివ‌కుమార్‌, శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు పాల్గొన్నారు.

తెలుగులో

 కరెంటు పోయి విసుగ్గా బాల్కనీ లో కూర్చుని ఉన్న భార్య ను చూసి అప్పుడే ఇంటికి వచ్చిన భర్త అక్కడేం చేస్తున్నావు అని అడిగాడు...


దానికి ఆమె...


"ఆలి పోయిన వాని ఆలిని వెతక బోయిన వాని తల్లి మగని కోసం కూచున్నా అంది,”


అర్థము కాక అయోమయంలొ ఉన్న భర్తతో భార్య ఈవిధంగా చెప్పింది ఏమిటంటే...


"ఆలి పోయిన వాడు శ్రీరామ చంద్రుడు,

"వెతక బోయిన వాడు హనుమంతుడు

"అతని తల్లి అంజనాదేవి,

 "ఆమె మొగుడు 🪁వాయుదేవుడు

అంటే గాలి కోసం, బాల్కనీ లో కూచున్నా అని విసనకర్ర తో విసురుతూ చెప్పింది భార్యామణి...


👌 తెలుగులో ఉన్న తిరకాసు మరే భాషలోనూ లేనిదీ ఇదే !

😊😊

అంతటా నిండిన పరమాత్మ

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam --3 by Pujya Guruvulu 

Brahmasri Chaganti Koteswara Rao Garu


అంతటా నిండిన పరమాత్మ ఒక అవతారము దాల్చడానికి ముందు దేవతలో, ఋషులో చేసిన స్తోత్రము, ప్రార్థనను మన్నించి ఒక రూపము పొందుతాడు. లలితాదేవి అలా ఒక స్వరూపమును పొంది ఆవిర్భవించింది. భండాసురుని సంహరించిన తరవాత – ‘మీకు కావలసినవి చేసిపెట్టాను. లోకములు ప్రశాంతతను, ఉత్సాహము, సంతోషమును పొందాయి. అన్ని జాతులు మళ్ళీ పెరుగుతాయి. నా నిజస్థావరమైన మణిద్వీపమునకు వెళతాను’ అంటే దేవతలు, ఋషులు అమ్మవారిని ప్రార్థన చేసి – ‘ అమ్మా! కష్టము ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నీ యొక్క గొప్ప అనుగ్రహమునకు కారణము అయింది. నువ్వు మేరుపర్వతము, నిషధపర్వతము, హేమకూటము, హిమాలయము, గంధమాదనము, నీలగిరి, మేషగిరి, శృంగగిరి, మహేంద్రగిరి, లవణసముద్రము, ఇక్షుసముద్రము, సురాసముద్రము, ఘృతసముద్రము, దధిసముద్రము, క్షీరసముద్రము, జలసముద్రము పదహారు చోట్లస్థిర నివాసముగా – కామేశ్వరీపురి, భగమాలినీపురి, నిత్యక్లిన్నాపురి, భేరుండాపురి, భక్తివాసినీపురి, మహావజ్రేశ్వరీపురి, శివదూతీపురి, త్వరితాపురి, కులసుందరీపురి, నిత్యపురి, నీలపతాకాపురి, విజయాపురి, సర్వమంగళాపురి, జ్వాలామాలినీపురి, చిత్రాపురి, మహానిత్యపురి ఈ పేర్లతో పదహారుచోట్ల భూమండలము మీద ఉండాలి. ఆ పురములను నిర్మించడానికి విశ్వకర్మను, మయుని పిలుస్తాము అన్నారు. అన్నిటికి శ్రీపురమనే పేరు. పదహారుపేర్లతో పదహారుప్రాంతములలో అమ్మవారు వెలిసి ఈ బ్రహ్మాండము అంతటినీ తన రక్షణకవచములోకి తీసుకున్నది. అలా ఆవిర్భవించిన దేవికి వాళ్ళు ‘లలిత’ అని పేరు పెట్టారు. వాళ్ళు దేవి అనుగ్రహమును పొంది వదిలి పెట్టలేదు. అందువలన మనకి లలితాసహస్రనామము వచ్చింది. అమ్మ ప్రధానతత్త్వము దయ. అమ్మవారు ఆవిర్భవించినప్పుడు దేవతలు ఈ నామములను చెప్పలేదు. దయాస్వరూపిణి అయిన లలితాదేవి నామములు విష్ణ్వంశలో ఉన్న హయగ్రీవుడు రహస్యనామములని అగస్త్యులవారికి ఉపదేశము చేసాడు. కుంభసంభవా! లలితాసహస్ర నామములకు అంత ప్రాధాన్యత, అంత శక్తి ఎందుకు వచ్చింది? ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? వీటిని గురించి నీకు చెపుతాను జాగర్తగా ఆలకించు. ఎంత తవ్వుకుంటే అన్ని మాణిక్యగనులయిన శ్రీలలితాసహస్ర నామములను అమ్మవారు వశిన్యాదిదేవతలతో చెప్పించింది. 


ఒకనాడు లలితాదేవి పెద్దసభ తీర్చింది. అమ్మవారిని సేవించడము కోసము అన్ని బ్రహ్మాండముల నాయకులు, కొన్ని కోట్లమంది రుద్రులు, కోట్లమంది బ్రహ్మలు, కోట్లమంది సరస్వతులు, కోట్లమంది విష్ణువులు, కోట్లమంది లక్ష్ములు వచ్చి సభలో కూర్చున్నారు. అమ్మవారు ఒక పెద్ద సింహాసనము మీద కూర్చుని ఉన్నది. సభలో– అరుణాదేవి, కామేశ్వరీదేవి, కౌళినీదేవి, జయనీదేవి, మోదినీదేవి, నళినీదేవి, విమలాదేవి, సర్వేశ్వరీదేవి ఎనిమిదిమంది వశిన్యాదిదేవతలు ఉన్నారు. వశినీదేవి పేరు కల దేవతను అన్వయము చేస్తూ వశిన్యాది దేవతలు అంటారు. వారిని వాగ్దేవతలని పిలుస్తారు. వాగ్దేవతా అనుగ్రహమును అమ్మవారి అనుగ్రహముగా భక్తులకు ప్రసరింప చేస్తారు. వారితో అమ్మవారు – ‘మీకు నా పట్ల అపారమైన భక్తి ప్రపత్తులు ఉన్నాయి కనుక మిమ్ములను అనుగ్రహిస్తూ ఉంటాను. నా శక్తి మీలో ప్రవేశిస్తుంది. మీరు మాట్లాడినట్టు కనపడుతుంది. మీలో ఉండి మాట్లాడుతున్నది నేనే అయి ఉంటాను. నాకు సంబంధించిన శ్రీచక్రముల రహస్యములు, నామముల వెనక ఉన్న అన్ని రహస్యములు మీకు తెలుసు. ఇవాళ నేను మీతో ఒకటి మాట్లాడించాలి అనుకుంటున్నాను’ అన్నది. ఈ నామములను వారిచేత పలికించి లోకమును కటాక్షించాలి. శ్రీచక్రరహస్యములు, స్తోత్ర రహస్యములు తెలియాలి అంటే ఈ నామముల ద్వారా తెలియాలి. శ్రీచక్రరహస్యము, స్తోత్ర రహస్యము తెలియకపోయినా పరవాలేదు. నామము చెప్పడము రావాలి. ఈ స్తోత్రమును చేస్తున్నవారికి వెంటనే నా పట్ల అపారమైన భక్తిని ఇస్తాను. వారి పట్ల ప్రీతి చెంది సమస్తకోరికలు తీరుస్తాను. మీ నోటివెంట అటువంటి ఓషధీ స్తోత్రము రావాలి. నామ స్తోత్రానికి చివర ‘అంకితం’ ప్రకటించండి. నా నామముతో స్తోత్రం వెళ్ళాలని ఆజ్ఞాపిస్తున్నాను’ అన్నది. అమ్మవారి నామము పక్కన శివస్పర్శ ఉంటుంది. శివ – శివాని, రుద్ర – రుద్రాణి అని ఉంటాయి. ఈ స్తోత్రములో అలా పిలవడము కష్టము. అందుకే ‘ఏవం లలితా నామ్యాం’ అనే పిలిచి లలితా నామములని చివర అంకితం చేసారు. 


శ్రీలలితాసహస్రనామస్తోత్రం వశిన్యాదిదేవతలు చెపితే అమ్మవారి అనుగ్రహముతో చెప్పారు. స్వరూపము అమ్మదే అయినా ‘శ్రీమాతా’ అని మొదలు పెట్టారు. అమ్మ ఎంత గొప్పదయినా పేరుతో మొదలు పెట్టకూడదు. ఆవిడ లలితాదేవి అయినా ఆమాట అనడానికి వశిన్యాదిదేవతలు సాహసించలేదు. ఆవిడ పరబ్రహ్మము అన్నిటినీ ఇవ్వగలదు. లలితాసహస్రనామస్తోత్రం చదివి అమ్మను కీర్తిస్తే ఇహములో సుఖము కలుగుతుంది, భోగములు కలుగుతాయి. గతజన్మలలో వచ్చిన పాపరాశిని ధ్వంసము చేసి ఉత్తరజన్మలు మంచివి కలిగేట్లు దిద్దుబాటు చేయకలదు. 

ఇది ఒక్క అక్షరము కూడా అవసరములేనిది ఉన్నదని నిరూపిద్దామంటే కుదరని గొప్ప లలితాసహస్రనామస్తోత్ర వైభవము. పెద్దలు ఇందులో లావణ్యలహరి, వైభవలహరి, భావనాలహరి, ఆనందలహరి, చైతన్యలహరి, సాలోక్యలహరి, సామీప్యలహరి, సారూప్యలహరి, సాయుజ్యలహరి అని తొమ్మిది లహరులను 182 శ్లోకములలో నడిపించారు. ఒక్కక్కలహరి ఇరవై శ్లోకములతో ఉంటుంది. ఒక్క నామముతో మనసారా పిలిస్తే చాలు అమ్మవారి అనుగ్రహం ఉత్తరక్షణములో కలుగుతుంది. బీజాక్షరములను పలికితే శౌచము, ఉచ్ఛారణ తెలియాలి. నామములోనే రహస్యముగా బీజాక్షరములు ఉంటాయి. బీజాక్షర సంపుటీకరణము చేత ఉత్తరక్షణములో అనుగ్రహము ప్రసరణ జరుగుతుంది.

హిందూ ధర్మం - 43

 దశిక రాము




పాపపుణ్యాలు అన్నవి అసలు ఉండవు, అన్నీ మన భావనలే, భగవంతుడే అన్నిటికి ప్రేరణం చేయిస్తున్నాడు అన్న భావన ఉంటే, మనం ఏం చేసినా పాపపుణ్యాలు అంటవు అంటూ ఎవరైనా చెప్తే అది తప్పు. ఈ లోకంలో అన్ని భగవత్ సంకల్పం వల్ల జరుగుతున్న మాట వాస్తవమే అయినా, అది ఆత్మజ్ఞానంతో పరబ్రహ్మంతో సమన్వయం చెందినవారికి గోచరించే సత్యం. దాన్ని పట్టుకుని, నేనే ఈ శరీరం అని భ్రాంతిలో ఉన్నవారు, ఆత్మానుభూతి పొందనివారు తమకు నచ్చినవన్ని చేస్తూ, ఎలా కావాలంటే అలా బ్రతుకుతూ, అన్ని భగవంతుడి ప్రేరణ వల్లనే జరుగుతున్నాయి అనడంలో అర్దంలేదు. ఒక వ్యక్తి అభివృద్ధిలోకి రావాలన్నా, పతనం కావాలన్నా, అది అతని బుద్ధిని ఉపయోగించడం మీదనే ఆధారపడి ఉంటుంది. నేను ఇచ్చిన బుద్ధిని సక్రమంగా వాడుకుని, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి అని గీతలో శ్రీ కృష్ణపరమాత్మ స్పష్టం చేశారు.


భగవంతుడిచ్చిన బుద్ధికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. ఆ బుద్ధి విషయంలో మనం అడిగేవరకు, సంపూర్ణశరణాగతి చేసేవరకు ఆయన కలగజేసుకోడు. మనం వేడుకుంటే మనకు సహాయం మాత్రం చేస్తాడు. అంతవరకు మనం చేసే ప్రతి కర్మలకు మనమే బాధ్యులం. మీరు మంచి చేసినా, చెడు చేసినా దాని ఫలితం అనుభవించవలసిందే. మనమే ఎప్పుడు ఏం చేయాలో, ఎలా బ్రతకాలో మనకు చెప్పడానికి శాస్త్రం ఉంది. మనిషి తన బుద్ధిని ఎంత సక్రమంగా వాడుకుందామన్న దాని మీద మనసు, పూర్వజన్మ వాసనల ప్రభావం పడుతుంది. అందుకే మనం మన బుద్ధిని సక్రమంగా వాడుకునే శక్తిని ఇమ్మని పరమాత్మను ప్రార్ధిస్తాం.


మనం వేదాలు గమనించినా, అందులో భగవంతుడిని ప్రార్ధిస్తూ 'నువ్వు మా బుద్ధిని ప్రచోదనం చేయి, మంచి మార్గంలో మా బుద్ధి నడిచేలా అనుగ్రహించు, మేము మంచి పనులే చేయుదుముగాకా, నువ్వు మా బుద్ధులను ప్రేరేపించెదవు గాకా' ఇలా నడిచిపోతుంది వైదిక ప్రార్ధన. అంతేకానీ, ఓ దేవుడా! నేను పాపిని, దుర్మార్గుడిని అంటూ సాగదు. నాతో అన్నీ నువ్వే చేయిస్తున్నావు, నేను తప్పు చేసినా, దొంగతనం చేసినా, అదంతా నీ ప్రేరణే అని ఉండదు. మీరు చేస్తున్న ప్రతి పనికి మీరే బాధ్యులు. ఏ పని చేస్తున్న బుద్ధిని సక్రమంగా ఉపయోగించి చేయాలి. అలా చేయడమే ధర్మం.


తరువాయి భాగం రేపు.......

🙏🙏🙏

సేకరణ

ధర్మము-సంస్కృతి

https://chat.whatsapp.com/LyeuNWbrRlW9fGDW4tOeNY


ధర్మో రక్షతి రక్షితః

🙏🙏🙏

https://chat.whatsapp.com/Hdv5PrMFoxX3I2TsoVErae


*ధర్మము - సంస్కృతి* గ్రూప్

 ద్వారా క్షేత్ర దర్శనాలు , పురాణాలు , ఇతిహాసాలు, దైవ లీలలు పోస్ట్ చేస్తూ అందరికీ మన సనాతన ధర్మ వైభవాన్ని తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాము.మీరు కూడా సహకరిస్తే అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.


హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


ధర్మో రక్షతి రక్షితః

🙏🙏🙏

శివలింగం నకు అభిషేకించేందుకు ఉత్తమ ద్రవ్యాలేవి?


             గంగాజలం అన్నిటికంటే శ్రేష్టమైనది. ఏ నీటినైనా గంగతో సమానంగా భావిస్తూ ఆ గంగాధరుణ్ణి అభిషేకించవచ్చు. విషాన్ని కంఠంలో దాచుకున్న శివుని శరీరంలో తాపం తగ్గించేందుకు శివునికి నీటితో అభిషేకం చేయాలంటారు. పంచామృతంలు తర్వాత వరుసలోనివి, కాగా చెఱకు రసం, మామిడి రసం వంటి ఉత్తమ జాతి పండ్లతో మహాదేవునికి అభిషేకం చేయవచ్చు. పూలు కలిపిన నీళ్ళు, భస్మం, చందనం, పన్నీరు, సెంటు వంటి ద్రవ్యాలు కలిపిన జలాలతో కూడా శివుణ్ణి అభిషేకం చేస్తారు. అలాగే అన్నాభిషేకం చేస్తారు. స్రుష్టిలో సమస్తాన్ని సాంబశివునికి ఆరాధనకు వినియోగించవచ్చును. ఒక్కో ద్రవ్యానికి ఒక్కో ఫలితాన్ని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన ఎక్కువగా ఇష్టపడేది మాత్రం జలాభిషేకమే.

*పాప, పుణ్యకార్యాలు*



🕉️🌺🌸🌼🌻🕉🌼🌸🌺🌻🕉🌻🌺🌸🌼


 *మానవులు ఎలాంటి పుణ్యకార్యాలనూ చేయడానికి ఇష్టపడరు. కాని పుణ్యఫలాన్ని మాత్రం ఆశిస్తారు. పాపఫలితాన్ని ఆశించరు. కాని పాపకార్యాలను మాత్రం ప్రయత్న పూర్వకంగానే చేస్తారు అని ధర్మనీతి శాస్త్ర నిర్వచనం. ఇంతకీ పాపం అంటే ఏమిటి? పుణ్యం అంటే ఏమిటి?* 


 *"పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం" అంటే ఇతరులకు చేసిన మేలు పుణ్యం అనీ, ఇతరులను పీడించడం వలన పాపం సంక్రమిస్తుంది అనీ శాస్త్రవచనం.* 


 *పూర్వజన్మల్లో చేసిన పాప దోషాల వల్లనే ఈ జన్మలో శారీరక, మానసిక వ్యాధులు వచ్చి పీడుస్తున్నాయి అని మనం గ్రహించాలి. పాపం వల్లనే దుఃఖాలు వస్తాయి. పాపం లేనప్పుడు ఆనందం కలుగుతుంది. ఏ కొంచెం దుఃఖం కలిగినా అది పాపఫలమే కాక వేరొకటి కాదు.* 


 *పాపదోషం అనుభవించితే తప్ప పోదు. అడవుల్లో ఉన్నప్పుడు, యుద్ధంలో శత్రువుల మధ్య, నీటి మధ్య, అగ్నిమధ్య ఉన్నప్పుడు, సముద్రంలో సాగుతున్నప్పుడు, పర్వత శిఖరాలను ఎక్కుతున్నప్పుడు, నిద్రలో, అజాగ్రత్తలో, సంకట పరిస్థితులలో మానవుడిని తాను పూర్వ జన్మలో చేసిన పుణ్యాలే కాపాడతాయి* 


 *"ఇతరులు తనయందు ఏ విధంగా ప్రవర్తిస్తే, తన మనస్సు కలత చెందుతుందో అదే విధమైన ప్రవర్తనను ఇతరుల యందు నీవు కలిగి ఉండకపోవడమే అన్ని ధర్మాల్లోకి కూడా ఉత్తమమైన ధర్మం" అని విదురవాక్కు. పుణ్యం చేయడం చేతకాకున్నప్పుడు ఈ ధర్మాన్ని ఆచరిస్తే చాలు.* 


 *ఈ లోకంలో పుణ్యం కాని, పాపం కాని, ఇతరుల నుంచి మనం తీసుకోలేం. తాను చేసిన పాపకర్మ వల్లనే దుఃఖం కలుగుతుంది. తాను చేసిన పుణ్యకర్మ వల్లనే సుఖం కలుగుతుంది. ఈనాడు మనం నవ్వుతూ చేసిన పాపకర్మకి రేపు ఏడుస్తూ దుఃఖాన్ని అనుభవించక తప్పదనే సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే అవకాశం ఉన్నప్పుడే సత్కర్మలు ఆచరించాలి. భగవంతుని అనుగ్రహం పొందాలి.* 


🕉️🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

**మహాభారతము**

 **దశిక రాము**




నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


88 - అరణ్యపర్వం.


ఇంద్రుని రథానికి, రధసారధి మాతలికి వీడ్కోలు పలికిన తరువాత, అర్జునుడు చాలా సేపు ధర్మరాజు మిగిలినవారితో, ఆత్మీయసంభాషణలు జరిపి, తాను పాశుపతాస్త్రము పరమేశ్వరునుండి పొందిన వైనం, మిగిలిన దేవతలు అనుగ్రహించి యిచ్చిన అస్త్ర శస్త్రాల గురించీ విపులంగా చెప్పాడు. పనిలోపనిగా ఊర్వశి తనకిచ్చిన శాపం గురించికూడా చెప్పి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాడు. అయితే అజ్ఞాతవాసంలో ఆ శాపమే వరంగా పరిణమిస్తుందని ఇంద్రుడు చెప్పిన విషయం కూడా చెప్పి, వారిని వ్యధకు లోనుకాకుండా చేశాడు. నకుల సహదేవులను రాత్రంతా తనతో వుంచుకుని, అనేక విషయాలు వారితో పంచుకున్నాడు.


మరునాడు, ధర్మజుని కోరిక మేరకు, తాను పొందిన అస్త్రాలను ప్రయోగించి తనవారిని ఆనందింప జేయాలని అర్జునుడు గాండీవధారియై పాశుపతం ధరించి ప్రయోగించ బోతుండగా, భూదేవి గజగజ వణికింది. ప్రకృతి అప్పటికే భయసూచకంగా పెద్దగాలి రూపంలో చెట్లను ఊపసాగింది. జంతువులు భీతితో అటూ యిటూ పరుగిడసాగాయి. ఆసమయంలోనారదులవారు యేతెంచి, ' అర్జునా ! నిష్కారణంగా, వినోదం కోసం అట్టి పవిత్రమైన శక్తివంతమైన ఆయుధాలు, శస్త్రాలు ప్రయోగించవద్దని నీకు పరమశివుడు, మిగిలిన దేవతలు ముందు చెప్పినమాట మరచినావా ! ' అని అతనిని అస్త్రవిద్య చూపే కార్యక్రమం నుండి విరమింప జెసి, ధర్మరాజుతో ఆ అస్త్రాలశక్తి రణ రఁగంలోనే చూడమని చెప్పి, నారదుడు, కుశల ప్రశ్నల అనంతరం, తిరిగి వెళ్ళి పోయాడు.


ఆ విధంగా నాలుగు సంవత్సరాలు వారు నాలుగురోజులలాగా, గంధమాదన పర్వత పరిసరప్రాంతాలలో గడిపారు. మొత్తం 11 సంవత్సరాల అరణ్యవాస కాలం ముగుస్తున్నది. స్థలమార్పు అవసరమని భావించి, అన్నిరోజులూ తమకు ఆశ్రయమిచ్చిన, చెట్లకు, సరోవరాలకు, మునులకు, ఋషులకు అభివాదం తెలిపి, అక్కడనుండి శలవు తీసుకుని, బదరికాశ్రమానికి చేరారు పాండునందనులు, పరివారంతో సహా.


బదరికాశ్రమంలో కొంతకాలం గడిపి, వృషపర్వుని ఆశ్రమంలో ఒకరాత్రి విశ్రమించి, విశాఖయూపవనం చేరారు పాండవులు. అక్కడ ఒక సంవత్సరం గడిపారు. అప్పుడే యమునోత్రిని కూడా దర్శించారు.


ఒకరోజు, అక్కడవనాలలో సంచరిస్తుండగా, భీమసేనుడు వేటకువెళ్లి, వీరోచితంగా క్రూరమృగాలను వేటాడుతూ, కంటబడిన విషసర్పాలను కూడా చంపివేస్తూ, అడవి అంతా కలయ తిరుగుతున్నాడు. అంతలో, అతి పెద్ద శరీరంతో, పర్వతభాగాన్ని పెనవేసుకుని, పసుపుపచ్చని రంగులో, యెర్రని అగ్నిగోళాల వంటి నేత్రాలతో, నాలుగు కోరలతో, గుహలాంటి నోరుతో వున్న అజగరము ( కొండచిలువ ) , భీముని చూడగానే, అమాంతం సమీపించి, భుజాలను కదలకుండా బంధించి వేసింది. ఒక్కసారిగా, కొండచిలువ స్పర్శ తగలగానే, జవసత్వాలు వుడిగిపోయినట్లై భీముడు, స్పృహ తప్పి పోతున్నాడు. ఏమి జరుగుతున్నదో అర్ధం గాని స్థితిలో వుండిపోయాడు.


యెంత ప్రయత్నించినా అజగరబంధము నుండి భీముడు బయట పడలేకపోతున్నాడు. అంతటి శక్తిని యెప్పుడూ చూడని, భీమసేనుడు, ' ఓ అజగరమా ! నేను పాండు తనయుడను, భీమసేనుడను. ధర్మజుని సోదరుడను. నాకు నాగదేవత వాసుకి వరం వలన, పదివేల ఏనుగుల బలం ప్రసాదింపబడినది, నా బాల్యంలోనే. అనేకమంది రాక్షసులు, క్రూరజంతువులను , ఒక్క పిడిగుద్దుకే చంపిన బలశాలిని. '


' నీవెవరు ? నీకింత బలం యెలావచ్చింది ? నీవు నిజంగా సర్పరాజువేనా ! లేక శాపవశాన వున్న దేవతవా ! ' అని వినయంగా అడిగాడు. ' ఓహో ! నీవేనా భీమసేనుడవు. నీవెప్పుడైనా నీ ముందు తరాలలోని పెద్దలలో నహుషుడు అనే పేరు విన్నావా ? నేనే నహుషుడను. ఒకప్పుడు మదించిన గర్వంతో, బ్రాహ్మణులను కించపరచి, అనాదరంగా చూసిన కారణంగా, నాకుఅగస్త్యమహర్షి యీవిధంగా అజగర శరీరం పొందమని శాపమిచ్చాడు.'


' భీమా ! నేను మిక్కిలి ఆకలిగా వున్నాను. నాకు ఒకప్రక్క, నా వంశీకుడిని చూసిన ఆనందము, ఇంకొకప్రక్క నా వంశజుడిని ఆహారంగా పొందవలసిన దుష్టితి చూసి బాధ కలుగుతున్నవి. కానీ శరీరం నిలుపుకొనడానికి ఆహారం ముఖ్యం కదా ! నా నుండి తప్పించుకొనవలెనన్న నీకు ఒకటే మార్గం. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే, నిన్ను నా బంధం నుండి విముక్తుడిని చేస్తాను. నేను నా శాపవిముక్తికై యెదురుచూస్తున్నాను. ' అని నహుషుడు భీమునితో చెప్పాడు.


' సర్పరాజమా ! నాకు నీపై కోపంలేదు. కానున్నది కాక మానదు. నీకొచ్చిన దుస్థితి వలెనే, అతి బలవంతుడనైనా , శక్తి కోల్పోయి, నీకు బందీనై వున్నాను. ఇది నేను పెద్దలను, తెలిసో తెలియకో, తూలనాడిన ఫలితమేమో ! సజ్జనుడు సుఖానికైనా, దుఖానికైనా కారణాలు ఆపాదించుకుని, పురుషప్రయత్నం చెయ్యడంలోనే కార్యసిద్ధి కలుగుతుంది. కానీ నా విషయంలో నేను అశక్తుడను. పురుషప్రయత్నం చెయ్య లేకున్నాను. ' అని అంటూ స్పృహతప్పి పడిపోయాడు. 


సరిగా, అదేసమయానికి, ధర్మరాజుకు దుశ్శకునాలు గోచరించాయి. ఆయన వామనేత్రం అదిరింది. ఆర్తనాదాలు వినిపించాయి. ధర్మరాజు ఆందోళనతో, అందరనూ రమ్మని పిలిచాడు. ఒక్క భీముడు తప్ప అందరూ సమావేశమయ్యారు. భీమసేనునికి యేదో కీడు వాటిల్లింది అని ధర్మరాజు భావించి హుటాహుటిన, ధౌమ్యుని వెంటబెట్టుకుని, ధర్మరాజు అడవులలోనికి వచ్చాడు. 


భీముని అడుగుజాడలు పరిశీలిస్తూ, కొంతదూరం జాగ్రత్తగా గమనిస్తూ పోగా, అక్కడ అజగరబంధంలో కళావిహీనుడై, స్పృహతప్పి పడివున్న భీమసేనుని చూసి బిగ్గరగా రోదిస్తూ, ఈ అజగర వృత్తాంతమేమిటని, ప్రక్కన వున్న ధౌమ్యునిఅడిగాడు, ధర్మరాజు. ధౌమ్యులవారు చెబుతున్నారు: నహుష చక్రవర్తి, అధికారగర్వంతో, కన్నుమిన్నుగానక, ఉత్తములైన, వేదవేదాంగ పారంగతులైన విప్రశ్రేష్ఠులను, గుర్రాలకు బదులుగా, తన రధవాహకులుగా నియమించుకుని హింసించడం అలవాటుగా చేసుకున్నాడు. అందువలన అగస్త్యుని శాపానికి గురయి, నహుషుడు యీ కొండచిలువ రూపంలో పడి వున్నాడు. ఈ నహుషుడు అడిగే ప్రశ్నలకు యెవరైనా సరిఅయిన సమాధానాలు చెప్పగలిగితే, భీముని ప్రాణము నిలుస్తుంది, నహుషుని శాపవిమోచనం అవుతుంది. 


ఈ వృత్తాంతము వినిన ధర్మరాజు, నహుషుని ప్రశ్నలకు తాను సమాధానం యిస్తానని ముందుకు వచ్చాడు. నహుషునిలో తనకు శాపవిముక్తి అవుతుందేమో అని ఆశ చిగురించింది. నహుషుడు మొదటి ప్రశ్నను సంధిస్తున్నాడు.


స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు

🙏🙏🙏

సేకరణ

*ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


*ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

హిందూ ధర్మం - 2

 దశిక రాము




మతం అంటే ఒక వ్యక్తి లేదా ఒక సమూహం యొక్క మనసు నుంచి పుట్టిన ఒక ఆలోచన. మనసు (మతి) నుంచి పుట్టినది కనుక మతం అన్నారు. 'మీ అభిమతం చెప్పండి' అన్న మాట వింటూ ఉంటాం. మీ అభిమతం చెప్పండి అంటే మీ అభిప్రాయం చెప్పండి అని అర్దం. ఇది ఇలా ఉంటే బాగుండు, ఇది ఇలా జరిగితే మంచిది అని మనకు అనిపిస్తుంది కదా, అది మన మతం అన్నమాట. క్రైస్తవం, ఇస్లాం, జైనం, భౌద్ధం మొదలైనవన్నీ మతాలు. మతానికి ప్రవక్తలు ఉంటారు, మూలపురుషులు ఉంటారు, మతం ప్రపంచ చరిత్రలో భాగం. హిందూ ధర్మం ఒక వ్యక్తి లేదా ఒక సమూహం యొక్క ఆలోచనా విధానం కాదు.


మతం మనసు నుంచి పుట్టుందనుకున్నాం కదా. ఈ మనసు కాలానికి, పరిమితులకు లోబడి ఉంటుంది. కనుక మనసుకు కలిగే ఆలోచనలు కూడా కాలానికి అతీతమైనవి కాలేవు, అపరిమితమై ఉండవు. మతం ఎప్పుడు కాలానికి, చరిత్రకు, పరిమితులకు లోబడి ఉంటుంది.


ఏసు క్రీస్తు క్రైస్తవానికి మూలపురుషుడు. ఏసుక్రీస్తు తన జీవత మధ్యభాగంలో ఇచ్చిన భోధనలతో క్రైస్తవం ప్రారంభమైంది. మహమ్మద్ ప్రవక్త తన జీవత సగభాగం గడిచిన తరువాత ఇచ్చిన భోధనలతో ఇస్లాం ప్రారంభమైంది. బుద్దుడి భోధనలతో భౌద్ద మతం వచ్చింది. అట్లాగే జైనమతం కూడా. అంటే ఈ మతాలకు మూలపురుషులు ఉన్నారు. వీళ్ళ గురించి చరిత్ర చెబుతుంది. చరిత్ర వీళ్ళ కాలం గురించి ప్రస్తావించింది. ఈ ప్రవక్తలు తమ మతాలను ప్రవచించకముందు, ఆయా మతాలు లేవు. మనం ఒక విషయం గమనిస్తే, ఈ ప్రవక్తలు తమ బాల్యంలో వేరొక సంస్కృతిలో పెరిగినవారే. వారి పూర్వీకులు వేరే ధర్మాలను పాటించారు.


కానీ హిందూ/సనాతన ధర్మం ఏ యొక్క వ్యక్తి వల్ల ప్రారంభించబడలేదు. దీనికి మూలపురుషులు లేరు. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు పుట్టకముందు ఈ ధర్మం ఉన్నది. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడి జీవితాలు గమనిస్తే, వారు పుట్టకతో హిందువులే. వారి పూర్వతరంవారు పరంపరాగతంగా పాటిస్తున్న వస్తున్న ధర్మాన్నే శ్రీ రాముడు పాటించాడు, శ్రీ కృష్ణుడు పాటించాడు. అంతే తప్ప కొత్తగా శ్రీ కృష్ణుడు చెప్పిందేమి లేదు. వీరు హిందూ జీవన వాహినిలో మైలురాళ్ళు మాత్రమే.


తరువాయి భాగం రేపు


హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


ధర్మో రక్షతి రక్షితః

🙏🙏🙏

https://t.me/SANAATANA


ధర్మో రక్షతి రక్షితః

🙏🙏🙏

https://chat.whatsapp.com/Iieurm6WILS6u4QsiHHq95


ధర్మో రక్షతి రక్షితః

🙏🙏🙏

https://www.facebook.com/groups/365624084602145/?ref=share

శుక్ర గ్రహం - దోష నివారణ

 


      శుక్రుడు రాక్షసులకు గురువు. భృగు పుత్రుడు, విష్ణుద్వేషి. స్త్రీ గ్రహం. తెలుపు వర్ణాన్ని సూచిస్తాడు. ఋతువు - వసంతం, జాతి -బ్రాహణ, అధి దేవత - ఇంద్రాణి. రుచులలో పులుపుకు ప్రతీక, 7 సంవత్సరాల వయసును సూచిస్తాడు. మనోహర శరీరం, నల్లని జుట్టు, సౌందర్యవంతులకు ప్రతీక. తత్వం-జలతత్వం, దిక్కు - ఆగ్నేయము, రత్నము - వజ్రం, లోహం -వెండి, దిక్బలం చతుర్ధ స్థానం, గుణము -రజోగుణం, ప్రదేశం -కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతం. శుక్రుడు భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ నక్షత్రాలకు అధిపతి. శరీరంలో సంతానోత్పత్తి వ్యవస్థ. వృషభం, తులా రాశులకు ఆధిపత్యం వహిస్తాడు. రవి, చంద్రులు శత్రువులు. శని, బుధులు మిత్రులు. కుజుడు, గురువులు సములు. శుక్ర దశా కాలం 20 సంవత్సరాలు. శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితిని, కన్య రాశిలో నీచ స్థితిని పొందుతాడు.


      శుక్రలగ్నం 1 నుంచి 6వ స్థానం వరకు ఆధిపత్యం వహిస్తే శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. శుభానికి అధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఆధిపత్యం వహిస్తే ఆ జాతకులు ఆయుష్మంతంగా జీవిస్తారు. ధైర్యవంతులుగా ఉంటారు. ఇతరులను తమ ఆధీనంలోకి తీసుకుని అధికారం చెలాయించే సామర్థ్యం గలవారుగా ఉంటారు. ఎటువంటి కార్యాన్నై‌నా పట్టుదలతో పూర్తి చేస్తారు.


      శుక్రుడు రెండోస్థానంలో ఉంటే కుటుంబ బాధ్యతలను చేపడతారు. పెద్దలకు మర్యాద ఇవ్వటంలో, కుటుంబ సభ్యులతో ఆనందదాయకంగా గడుపుతారు. విద్యారంగంలో రాణిస్తారు. సాధు స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరులను ఆకర్షించే ఛాయను కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారని జ్యోతిష్కులు చెబుతున్నారు. భాగస్వాముల మధ్య అనుచరులుగా ఉంటారు. మూడో స్థానంలో శుక్రుడు ఆధిపత్యం వహిస్తే గట్టి పట్టుతో ఏ కార్యాన్నైనా సాధిస్తారు. కళలను ఆస్వాదించే వారుగా ఉంటారు. ప్రయాణాలలో ఆసక్తి చూపుతారు. భోజనప్రియులుగా ఉంటారు.


4వ స్థానంలో ఆధిపత్యం వహిస్తే పరిశోధనలో ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు. మంచి స్నేహితుల సహకారం అందుతుంది. 5వ స్థానంలో ఉంటే బుద్ధికుశలత కలిగి ఉంటారు. రాజకీయ ప్రవేశం చేయటం జరుగుతుంది. క్రీడలు వంటి వినోదాత్మక రంగాల్లో ఆసక్తి చూపుతారు. ఆరో స్థానంలో ఆధిపత్యం వహిస్తే జీవితంలో కష్టసుఖాలు సమపాళ్లలో లభిస్తాయి. యోగాలను లభించటం వంటివి జరుగుతాయి. శత్రువుల చెడును ఎదురించే పోరాడగలిగే యోధులుగా ఉంటారు.


శుక్ర కారణ వ్యాధులు

శుక్ర ప్రభావం వల్ల గర్భాశయ వ్యాధులు, మూత్ర పిండ వ్యాధులు, సుఖ వ్యాదులు ఏర్పడతాయి. కుజుడితో కలిసిన గొంతు నొప్పి. టాన్సిల్స్, గొంతు కాన్సర్, గొంతు వాపు మొదలైనవి. బుధుడితో కలిసిన నపుంసకత్వం, చర్మ వ్యాధులు, మధుమేహం, శనితో కలిసిన సుఖ వ్యాధులు, రాహువుతో కలిసిన గర్భ సంబంధిత వ్యాదులు, కేతువుతో కలిసిన సంతాన లేమి మొదలైన వ్యాధులకు శుక్రుడు కారకుడు.


శుక్ర గ్రహ నివారణ కోసం..


శుక్రగ్రహ నివారణ కోసం చేయాల్సిన కార్యక్రమాల్లో ఇది ఒకటి. మేడి చెట్టు శుక్రుని వృక్షము. ప్రతి శుక్రవారం ఉదయం అయిదున్న నుంచి ఆరున్నర లోపు చిన్న రాగి లేదా ఇత్తడి, స్టీల్..(ఇందులో ఏదైనా పర్వలేదు) చెంబు తీసుకుని దానిలో నీటిని పోసి గంధం కలిపి, ఆ నీటిని మేడి చెట్టుకు పోయాలి. అక్కడే దీపం వెలిగించాలి. దానిని పూజించి రావాలి. ఇలా చేసిన రోజు సాయంత్రం తెల్లటి గుడ్డ, అనుమాలు దానం ఇవ్వండి. ఇలా పదహారు వారాలు చేయాలి. ఇలా చేయడం వల్ల వారి శుక్ర దోషానికి పరిహారమగును. నిజానికి మేడి చెట్టు దేవాలయములకు అందుబాటలుఓ ఉంటుంది.


శుక్ర దోష నివారణా క్షేత్రం 'తిరునావలీశ్వరాలయం'


శుక్ర దోష నివారణ క్షేత్రంగా తిరునావలూరులోని తిరునావలీశ్వర ఆలయం ప్రతితి. శుక్రుడంతటి వాడికే శాప విమోచనం కలిగించిన క్షేత్రంగా విశ్వసించటంతో ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా అలరారుతోంది. విల్లుపురం జిల్లాలోని తిరునావలూరులో నెలకొన్న ఈ ఆలయానికి సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. మొదటి పరాంతక చోళుడి కుమారుడు రాజ ఆదిత్యన్ ఈ తిరునావలీశ్వర ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.


ఆలయంలోని మూల విరాట్టుకు భక్త జనేశ్వరుడు, తిరునావలీశ్వరుడు అనే పేర్లు ఉన్నాయి. తమిళంలో తిరు అనేది తెలుగు శ్రీ అనే పదానికి సమానార్థకం కాగా.. నావల్ అంటే నేరేడు చెట్లు అని అర్థం. ఈ ఆలయ ప్రాంగణంలో నేరేడు చెట్లు అధికంగా ఉండటంతో ఆ ప్రాంతానికి తిరునావలూరు అనే పేరు వచ్చినట్లు, ఊరి పేరు ప్రకారమే స్వామివారికి తిరునావలీశ్వరుడుగా పిల్చుకుంటున్నట్లు ప్రతీతి. ఆలయ స్థల వృక్షం కూడా నేరేడు చెట్టే...మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరి పీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

14-26-గీతా మకరందము


        గుణత్రయవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - అచంచల భక్తితో తనను సేవించువాడు త్రిగుణములను దాటి బ్రహ్మసాక్షాత్కారమును బడయగలడని భగవానుడు వచించుచున్నారు-


మాం చ యోఽవ్యభిచారేణ 

భక్తి యోగేన సేవతే | 

స గుణాన్సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే || 

 

తాత్పర్యము:- ఎవడు (భగవంతుడగు)నన్నే అచంచలమైన భక్తియోగముచేత సేవించుచున్నాడో, అతడీగుణములన్నిటిని లెస్సగా దాటివైచి బ్రహ్మముగానగుటకు (జీవన్ముక్తు డగుటకొఱకు) సమర్థుడగుచున్నాడు.


వ్యాఖ్య:- త్రిగుణముల కవ్వల -- పరమాత్మకలడు. త్రిగుణములను దాటినచో భగవత్ప్రాప్తిసిద్ధించును. కాని వానిని దాటుటెట్లు? ఎంతయో విచారణ, మనోనిగ్రహము, సంయమము దాని కవసరము. కాని భక్తియొక్క సహాయమున్నచో ఈ జ్ఞానస్థితి సులభముగ లభింపగలదు. కనుకనే గీతాచార్యులు దాదాపు ప్రతి అధ్యాయమందును, ప్రతియోగమందును, ఈ భక్తిని గూర్చి చెప్పుచున్నారు. ఈ పదునాల్గవ అధ్యాయము అఖండమగు జ్ఞానోపదేశము గావింపబడిన సందర్భమైనప్పటికిని దీని చివరగూడ భక్తియోగముయొక్క ఆవశ్యకతను నిరూపించిరి. అయితే సామాన్యభక్తి చాలదనియు, అచంచలభక్తి, "అవ్యభిచారిణీ భక్తి”, అనన్యభక్తి యుండవలయుననియు బోధించిరి. అనగా, దృశ్యవిషయములందు విభజింపబడని ఏకాంతభక్తి అవసరమని భావము. భక్తిమార్గము సర్వులకును చాలసులభమైనది యగుటచే, అట్టి ఉత్తమ భక్తిని ప్రతివారును సంపాదించి తద్ద్వారా భగవత్కృపను, తద్ద్వారా బ్రహ్మజ్ఞానవ్యాప్తిని, దానిచే బ్రహ్మానుభూతిని బడయుటకు అనుకూలముగ నుండును. ఆ విషయమే ఇచట తెలుపబడినది.

బ్రహ్మత్వమును ఎవడు పొందగలడో, మోక్షసిద్ధి యేప్రకారము చేకూరగలదో ఈ శ్లోకమందు చక్కగ నిరూపింపబడినది. అచంచలభక్తికలవాడే మోక్షమునకు (ఆత్మానుభూతికి) అర్హతను సంపాదించగలడని స్పష్టముగ నిచట పేర్కొనబడినది. కావున యోగ్యతయే యిచట ప్రధానముగాని జాతిమతకులవర్ణాశ్రమాదులు కావు).

‘అతీత్య’ అని చెప్పక "సమతీత్య” అని చెప్పుటచే నిర్మలభక్తికలవాడు త్రిగుణములను లెస్సగ దాటగలడని తెలియుచున్నది.


‘కథం చైతాం స్త్రీన్గుణానతివర్తతే' - 'ఈ గుణము లెట్లు దాటబడును?' అను అర్జునుని ప్రశ్న కీ శ్లోకము సమాధానమైయున్నది. అచంచలభక్తిచేతనే (జ్ఞానప్రాప్తినిబడసి, తద్ద్వారా) మూడుగుణములను దాటి మనుజుడు బ్రహ్మైక్యమును బడయగల్గుచున్నాడని యిచ్చోట వచింపబడినది. కావున సులభతరమైనట్టి ఈ భక్తియోగము యొక్క సహాయముచే సాధకుడు ఆత్మజ్ఞాన మొుంది త్రిగుణములను దాటి ముక్తిని శీఘ్రముగ బడయవచ్చును.

రామాయణమ్.69

 

...

మూర్ఛనుండి తేరుకున్న దశరథ మహారాజు ప్రక్కనే ఉన్న సుమంత్రుని చూసి నీవు వీరి ప్రయాణమునకు కావలసిన ఉత్తమ అశ్వములు పూన్చిన రధాన్ని సిద్ధంచేయి,వీరిని మన దేశమునకు అవతల వున్న వనములలో విడిచిరా !అని ఆజ్ఞపించాడు

.

 గుణవంతుడైన వాడికి జరిగే సత్కారమిది ,రాముడికున్న మంచిగుణములకు కలిగే ఫలమిది ! అని అందరూ అనుకొంటున్నారు ( అని తనలో తనే అనుకున్నాడు దశరథుడు).

.

సుమంత్రుడు వెంటనే రధాన్ని సిద్ధం చేశాడు.

.

కోశాధికారిని పిలిచి కోడలికి పదునాల్గు సంవత్సరములకు అవసరమైన అమూల్యమైన దుస్తులు,ఆభరణములు (లెక్కకట్టిమరీ!) తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు దశరథుడు.

.

ఆ ఆభరణాలను చక్కగా అలంకరించుకొని ఉరకలేసే ఉత్సాహంతో ఉన్న సీతమ్మను దగ్గరకు తీసుకొని శిరస్సుపై ఆఘ్రాణించి, 

.

సీతా ! నేడు నాకొడుకు ధనములేని వాడని వాడిని అవమానించకమ్మా! .

.

లోకంలో చాలామంది స్త్రీలు భర్తచేత అంతకుమునుపు ఎన్ని సుఖాలు అనుభవించినప్పటికీ భర్తలకు కష్టకాలము దాపురించినప్పుడు అతనిని చులకనగా చూస్తారమ్మా! అవసరమైతే ఆ భర్తలను వదిలేస్తారు కూడా ! భర్తలపై అనురాగము వారిలో ఒక ఎండమావి! 

.

కానీ గాఢమైన శీలము కలిగిన స్త్రీలు సత్యమునందూ ,శాస్త్రమునందూ ,సద్గుణములయందు స్థిరచిత్తము కలిగినవారి హృదయములో భర్తకు మాత్రమే విశిష్టస్థానముంటుంది ,దానిని ఎప్పటికీ పదిలంగా ఉంచుకొంటారు!.

.

అత్తగారి మాటలు విన్న సీతమ్మ , ఆవిడకు నమస్కరిస్తూ ! పూజ్యురాలా! నా భర్తవిషయములో ఎలా ఉండవలెనో పెద్దలద్వారా విని ఉన్నాను .

.

నన్ను దుష్టస్త్రీల సరసన చేర్చకుమమ్మా! 

.

చంద్రుడినుండి కాంతివిడిపోతుందా ! 

చక్రములేని రధము నడుస్తుందా ! 

తీగలులేని వీణ మ్రోగుతుందా !

 మేమిరువురమూ "ఒకటి" ! 

.

తండ్రికానీ,తల్లిగానీ ,కొడుకుగానీ స్త్రీ కి ఇవ్వగలిగనది పరిమితము! 

.

భర్త ఒక్కడే అపరిమితముగా ఇవ్వగలవాడు ! 

.

ధర్మములోని సామాన్యవిషయములు,విశేషవిషయములు శ్రేష్ఠులైన వారి వద్దనుండి విని ఉండటమువలన నాకు వాటి పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నది...

నా భర్తను నేనెట్లా అవమానిస్తాను ! 

అని సవినయంగా బదులిచ్చింది జనకరాజపుత్రి!

.


జానకిరామారావు వూటుకూరు గారి 

సౌజన్యం తో ....


*ధర్మధ్వజం*

హిందు చైతన్య వేదిక

రామాయణమ్.68

 రామాయణమ్.68

..

ఆమె తండ్రి ఒక రాజర్షి! ఒక చక్రవర్తి

ఆమె మామగారు ధర్మాత్ముడు,ఇంకొక చక్రవర్తి.

ఆమె భర్త జగదేకవీరుడు ! 

అంతఃపురములోని జనులకు తప్ప ఎవరికంటాబడకుండా ఇన్నాళ్ళూ వైభవంగా జీవించింది.

.

మరి నేడో ! నారచీరకట్టటమేరాక భర్తసహాయంతో చుట్టుకొని పదుగురి ఎదుట నిలుచున్నది . 

వనవాసము చేయ సంకల్పించుకున్నది .

ఎంతకష్టం? ఎంతకష్టం? ఎండకన్నెరుగని రాకుమారికి ఎంతకష్టం?

ఎవరికి అపకారంచేసిందని ?ఆవిడకీ శిక్ష!

.

చూసేవారి హృదయం ద్రవించిపోతున్నది .

ఇది తలుచుకొని కైకను తిట్టనివాడులేడు .

.

దశరధుడు హృదయవిదారకంగా రోదిస్తున్నాడు .కైకను చూసి ,"పాపాత్మురాలా రాముని అడవికి పంపి పాపములు మూటకట్టుకుంటున్నావు అవి చాలలేదా నీకు . ఈ సీతను కూడా కష్టపెడుతున్నావు ! 

ఇన్ని పాపాలు అసలెందుకు చేస్తున్నావు?"అని అంటూ కడుదీనంగా విలపిస్తూ మూర్ఛపోతూ ,మరల తేరుకుంటూ ,మరలమరల కైకను తిడుతూ పిచ్చివానివలే ఉన్న తండ్రి సమీపంలోకి వచ్చి రాముడు ,...

.

....తండ్రీ ! నా తల్లి వృద్ధురాలైనది ,నిన్నెప్పుడూ పల్లెత్తమాటకూడ అని ఎరుగదు ,సాధుస్వభావురాలు ,నీచస్వభావమననేమో ఎరుగదు,అందరికీ వరాలిచ్చేవాడవు నా కొక్క వరాన్నీయవయ్యా! నన్నుచూసుకొని ఆవిడ బ్రతుకుతున్నది నేను దగ్గరలేకుంటే ఆవిడ మానసము శోకసముద్రమే ! ఆవిడను కాస్త ఆదరంతో చూసుకో తండ్రీ ! నీ ఆదరమే ఆమె ప్రాణాలు నిలుపుతుంది .అని వినయంగా పలికిన రాముని చూసి అతికష్టం మీద గొంతుపెగుల్చుకుంటూ విపరీతమైన దుఃఖము మనస్సును ,శరీరాన్ని ఆవహించగా అతికష్టం మీద "రామా " అని మాత్రం అనగలిగాడు దశరధుడు.

.


జానకిరామారావు వూటుకూరు గారి 

సౌజన్యం తో ....


*ధర్మధ్వజం*

హిందు చైతన్య వేదిక

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము**


 తృతీయ స్కంధం -24


బ్రహ్మణ ప్రశంస


ఈ ఇద్దరు జయుడు, విజయుడు అనే పేర్లు కల నా ద్వారపాలకులు. వీరు మిమ్మల్ని లెక్కచేయక, నా ఆజ్ఞను అతిక్రమించి చేసిన నేరానికి మీరు తగిన శిక్షే విధించారు. అది నాకు ఇష్టమే. అంతేకాక సేవకులు చేసే అపరాధం యజమానిదే అవుతుంది. కాని ఈ తప్పుకు మాననీయుడినైన నన్ను మన్నించి దయచూపండి. అంతేకాక...” అంటూ శ్రీహరి ఇంకా ఇలా అన్నాడు.

శరీరంలో పుట్టిన భయంకరమైన కుష్ఠరోగంచేత చర్మం చెడిపోయి రంగు మారే విధంగా సేవకులు చేసే చెడ్డ పనులు యజమానుల గొప్ప కీర్తిని, పేరుప్రతిష్ఠలను పోగొడతాయి. వారికి లోకంలో చెడ్డపేరు వస్తుంది. 

మీవల్ల నాకు లభించిన పుణ్యక్షేత్రం ఈ వైకుంఠం. ఇది ఎంతో పవిత్రమై, పొగడదగినదై, సుందరమై, అమృతమయమై, కీర్తివైభవంతో శోభిస్తూ అలరారుతున్నది. ఇది తన పేరు విన్నవారిని ఎటువంటి అపవిత్రులనైనా, కుక్క మాంసం తినే శ్వపచులనైనా పవిత్రులను చేస్తుంది.అటువంటి నేను మీవంటి సాధుజనులకు అపకారం చేసినవారు నాకు బాహువులవంటి వారైనా ఖండించడానికి వెనుకాడను. ఇంక ఇతరులను మీముందు లెక్కచేయడ మెక్కడిది?

బ్రాహ్మణోత్తముల సేవించడం వల్ల లభించినట్టిదీ, పాపాలను నాశనం చేసేదీ, అఖిలలోకాలను పవిత్రం చేసేది అయిన గంగ నా పాదపద్మాలనుండి ఉద్భవించింది. అటువంటి నన్ను...విరక్తునిగా తేలికగా భావింపక, శుభకరాలైన తన కటాక్షాలనే పూలదండలతో సకల సంపదల వైభవం కలిగిన లక్ష్మి నా వక్షస్థలాన్ని అలంకరించింది.ఆశలు లేనివాడై ధర్మమార్గంలో సంచరించే బ్రాహ్మణోత్తముడు తినే చిన్న అన్నంముద్ద వల్ల నా మనస్సుకు కలిగే సంతృప్తి యజ్ఞయాగాలలో నేతిలో ముంచి అగ్నిముఖంగా వ్రేల్చబడే హవిస్సును అందుకొని ఆరగించేటప్పుడు కూడా కలుగదు..ఎదురులేని యోగమాయావైభవంతో ఎల్లప్పుడూ ప్రసిద్ధుడనైన నేను బ్రాహ్మణుల పవిత్రమైన పాదపద్మ పరాగాలను భక్తితో నా నవరత్న ఖచిత సువర్ణ కిరీటంపై ధరిస్తాను. అటువంటి నా పాదపద్మాలలో జన్మించిన గంగాజలాన్ని తలపై ధరించి శివుడు మొదలైన దేవతలు వెంటనే పవిత్రు లవుతున్నార ఎవడైతే బ్రాహ్మణులు తనకు అపకారం చేసినా తిరిగి కోపగించడో, ఎవడైతే బ్రాహ్మణులను నన్నుగా భావిస్తాడో అటువంటివాడు ధర్మానుసారంగా నాకు మిక్కిలి ఇష్టమైనవాడు. ఎవరైతే గోవులను, బ్రాహ్మణులను, నన్ను, దీనజనులను భేదభావంతో చూస్తారో వారు అధోగతి పాలవుతారు. వారిని యమభటులు త్రాచుపాములవలె, భయంకరమైన గ్రద్దలవలె రోషంతో ముక్కులతో చీల్చుతారు. బ్రాహ్మణోత్తములు ఎన్ని విధాలుగా తమను అవమానించినా చిరునవ్వుతోను సంతోషంతోను నిత్యం వారిని పూజిస్తూ, తండ్రిని కన్నకొడుకులు అనురాగపూర్వకంగా పిలిచే విధంగా మంచిమాటలతో వారిని గౌరవిస్తూ పిలిచేవారు నాతో సమానులౌతారు.వినండి. అటువంటి పుణ్యాత్ములకు నేను ఎప్పుడూ ప్రియతముడనై అమ్ముడుపోతూ ఉంటాను. పూర్వం భృగుమహర్షి నన్ను తన్నినా కోపించకుండా మిక్కిలి సంతోషంతో ఆదరించాను 

కదా!మునులారా! నా హృదయకమలంలోని అభిప్రాయాన్ని వీళ్ళు తెలిసికొనలేక మీ ఆజ్ఞను మీరిన దోషానికి తగిలఫలాన్ని పొందారు. నా సంకల్పం కూడా ఇదే. వీళ్ళు భూమిపై పుట్టి కొద్దికాలంలోనే తిరిగి నా సమీపానికి వచ్చేటట్లు అనుమతించండి.” అని ఆ ముకుందుడు చెప్పగా విని సనకాది మునులు అతని సుకుమార వచనామృతాన్ని రుచిచూచి కూడా కోపాన్ని విడువలేనివారై...సనకాది మునిశ్రేష్ఠుల మనస్సులు తృప్తిచెందలేదు. పరిమితంగా, గంభీరంగా, వివిధార్థాలతో అవగాహన కందక అమృతంతో సమానమై మాధుర్యగుణంతో కూడి, దోషరహితమైన ఆ మహావిష్ణువు మాటలకు మనస్సులో సంతోషించి “మన ప్రభువు ఇప్పుడు స్నేహంతో మనలను అభినందిస్తున్నాడో లేక నిందిస్తున్నాడో లేక మనము విధించిన శిక్షకు సంకోచిస్తున్నాడో తెలియదు” అనుకొంటూ వితర్కించుకొని అంతలోనే... హరి తమపై దయ కలిగి ఉన్నాడని అర్థం చేసికొని, కుతూహలంతో పులకించిన శరీరాలు కలవారై ఉత్కంఠతో సంతోషించి నుదుట చేతులు జోడించి....స్వయంగా కల్పించుకున్న యోగామాయాప్రభావం వల్ల విలసిల్లే ఐశ్వర్యంతో పరాక్రమంతో సర్వోత్కృష్టుడైన విష్ణువుతో ఆ మునులు వినయంతో ఇట్లా అన్నారు. దేవా! తేజోవంతమైన నిత్యైశ్వర్యం కల నాయకుడవు, భగవంతుడవు, పుణ్యమూర్తివి. మేము చేసిన పని నీకు సమ్మతమే అన్నావు. నీ లీలలు తెలిసికొనడం ఎవరికి సాధ్యం?

దేవా! నీవు పరమపావనుడవు, సాధుజన రక్షకుడవు, సర్వజ్ఞుడవు. దేవతలందరికీ పరదేవతలైన బ్రాహ్మణుల ఆత్మలకు అధినాయడవైన నీకు ఆ బ్రాహ్మణులే అధిదేవత లైనారట. ఎంత చోద్యం! కమలనయనా! నీవలన ఉద్భవించిన ధర్మం నీ అవతారాల వల్ల కాపాడబడి సుస్థిరంగా ఉంటున్నది. దేవా! దయామయా! పాపవిమోచనా! మార్పు పొందని సత్యస్వరూపంతో ఉన్న నిన్ను గమనించిన పెద్దలు నీవే ఆ ధర్మానికి ఫలస్వరూపమనీ, ఆ ధర్మంలోని ప్రధాన రహస్యమనీ చెప్తూ ఉంటారు.దేవా! మంచి వివేకం కలవాడా! గుణభూషణా! లోకపాలకా! నిత్యవినోదీ! ఎవని సంపూర్ణ అనుగ్రహం పొంది మునీశ్వరులు కోరికలు లేనివారై మృత్యుభయాన్ని పోగొట్టుకుంటారో అటువంటి నీకు ఈ లోకంలో మరొకరి అనుగ్రహమా? ఎంత వింత! లక్ష్మీదేవి పాదపద్మాలు ఎల్లప్పుడు సంపదలను కోరుకునే భక్తుల శిరస్సులకు అలంకారాలు. పద్మకేసరాలనుండి స్రవించే మకరందం మీది ఆశతో వచ్చే తుమ్మెదవలె ఆ లక్ష్మీదేవి భక్తజనులు అర్పించిన తులసిమాలలు కల నీ పాదపద్మాలను భక్తితో సేవిస్తూ ఉండగా....కృపాకటాక్షములు పొంగిపొరలగా పొడచూపే భాగవతులమీద అనురక్తి యొక్క నీ మహిమ గమనించుటకు బహు విచిత్రమైనది. కమలాక్షా! నిత్యశుభాకారా! లక్ష్మీమనోహరా! నీ మహిమ చిత్రమైనది. దేవదేవా! నీవు శాశ్వతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడవు. అందమైన శ్రీవత్సమనే పుట్టుమచ్చతో అలరారేవాడవు. “ఈ శ్రేష్ఠులైన బ్రాహ్మణుల పాదాలకు అంటిన పుణ్యపరాగమే నా శరీరానికి ఆభరణం” అన్నావు. సమస్తలోకులకు బ్రాహ్మణుల గొప్పతనాన్ని తెలియజేయడానికే గదా పవిత్రమైన ఆ రూపు ధరించావు. అంతేకాకనీవు ధర్మమూర్తివి, సమస్త విశ్వానికి కర్తవు. అటువంటి నీవు రక్షింపదగినవారిని రక్షించకపోతే వేదాలలో చెప్పిన ధర్మమార్గం అధర్మమార్గం అవుతుంది. కనుక సత్త్వగుణాన్ని స్వీకరించినవాడవై ఈ ప్రాణుల క్షేమాన్ని తెలుసుకొని రక్షిస్తావు. ధర్మద్రోహులను నీ దైవశక్తిచేత దండించే నీకు వేదధర్మ... మార్గాన్ని నాశనం చేసే పద్ధతులు ప్రియంకావు. బ్రాహ్మణులపై దయ కలిగి వినయంతో పలికిన ఈ మాటలు భక్తవరుదుడవైన నీకు యుక్తమై ఉన్నాయి.ఆ విధంగా ఇతరులపట్ల వినయంతో మాట్లాడితే గౌరవానికి హాని అవుతుందని నీవు భావించినట్లైతే..విశ్వానికి కర్తవూ, విశ్వమూర్తివీ, విశ్వరక్షకుడవూ అయి విరాజిల్లే నీకు గౌరవహాని ఎక్కడిది? ఈ వినయాలు నీ లీలావిలాసాలు కదా!.మహానుభావా! మునులమైన మమ్ములను మిక్కిలి సంతోషంతో గౌరవించడం సజ్జనులను ఆదరించే నీ స్వభావం తప్ప మరొకటి కాదు. ఒక విన్నపం. ఈ జయ విజయులపై....మేము వీరిని శపించాము. దేవా! అంతకంటె కఠినంగా శిక్షించాలనుకుంటే నీ ఇష్టం. అలాకాక అధిక సంపదలిచ్చి రక్షించాలనుకుంటే 

రక్షించు.నీవు ఎలా చేసినా మాకు ఇష్టమే కనుక నిర్దోషులూ, నిష్కల్మష హృదయులూ ఐన ఈ జయవిజయులను మేము అనరాని మాటలు అని ఉంటే మమ్మల్నయినా నీ ఇష్టం వచ్చినట్లు శిక్షించు” అని చేతులు జోడించి నమస్కరించిన సనకాది మునులను దయతో చూచి.....పుణ్యాత్ముడైన భగవంతుడు ఇలా అన్నాడు “మునులారా! ఈ జయవిజయులు భూలోకానికి వెళ్ళి అక్కడ లోభమోహాలు కలవారై రాక్షసులై జన్మిస్తారు. దేవతలకు అపకారం చేస్తూ సర్వలోక కంటకులై జీవిస్తూ నాపట్ల వైరభావం కలవారై....ఎంతో సాహసంతో నన్నెదిరించి నాతో యుద్ధం చేసి నా సుదర్శన చక్రం చేత మరణించి తిరిగి సంతోషంతో నా సన్నిధికి చేరుతారు. అంతే కాక...నన్ను విరోధంచేతనైనా తమ మనస్సులలో భావించడంవల్లనూ, నా సమక్షంలో నా ముఖాన్ని చూస్తూ మరణించడం వల్లనూ వీళ్ళు పుణ్యాత్ములై నా ఆస్థానంలో నివస్తిస్తారు.ఓ మునులారా! వినండి. ఆ తరువాత ఎన్నటికీ వీళ్ళు భూమిమీద జన్మించరు. మీరు చెప్పినట్లే నేను ఆలోచించాను. కనుక ఇక మీమనస్సులలో....దీనికోసం చింతించకండి.” అని విష్ణువు చెప్పగా బ్రహ్మపుత్రులైన ఆ సనక సనందాదులు అనంతుడైన శ్రీహరి భావాన్ని తెలుసుకొని అధికమైన ఆనందంలో తేలి ప్రసన్న హృదయాలతో క్షీరసాగర శయనుడూ, ఆర్తజనులను రక్షించడమే అలంకారంగా గలవాడూ, పాపాలను రూపు మాపేవాడూ అయిన శ్రీహరిని స్తుతించారు.ఇంకా అప్పుడా సనకాదులు పులకింత మొలకెత్తగా, ఆనందబాష్ప ధారలు కనులవెంట ప్రవహించగా మునులు శరణు కోరే ఉత్తముడూ, ఇంతవాడని అంతవాడని లెక్కింపరానివాడూ, దేవతలలో శ్రేష్ఠుడూ అయిన విష్ణువుయొక్క దివ్యమంగళ శరీరాన్ని, అతని వైకుంఠ మందిరాన్ని సందర్శించి క్రొంగ్రొత్త తామర రేకులవంటి కన్నులు గల అతనికి నమస్కరించి...తాము మాట్లాడిన మాటలను విష్ణువు మాటలుగా భావిస్తూ స్నేహభావంతో విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవిని స్తుంతించి, ఆ శ్రీహరిచేత....అనుజ్ఞ పొందినవారై ఆ సనకాదులు తమ నివాసాలకు వెళ్ళారు. శ్రీనాథుడు జయవిజయులను దయతో చూసి వెంటనే ఇలా అన్నాడు. మీరు తప్పనిసరిగా రాక్షసజాతిలో పుట్టవలసి వచ్చింది. నేను అడ్డులేని శక్తిసామర్థ్యాలు ఉన్నవాడనైనా బ్రాహ్మణుల శాపాన్ని నివారించలేను.అందువల్ల మీరు వెంటనే రాక్షసులై జన్మించి నాకు శత్రువులై మీ మనస్సులలో ఎల్లప్పుడు నన్నే స్మరిస్తూ నాచేత మరణించి ఇక్కడికి వస్తారు. వెళ్ళండి” అని ఆజ్ఞాపించి వికసించిన పద్మపత్రాలవంటి కన్నులు కలవాడూ, ఇంద్రాది దిక్పాలకుల కిరీటాలలోని మణులచేత ప్రకాశించే పాదపీఠం కలవాడూ అయిన హరి లక్ష్మీదేవి వెంటరాగా సంతోషంతో తన నిర్మల పుణ్య మందిరానికి వెళ్ళాడు.

అప్పుడు...జయవిజయులు తమ తేజస్సును కోల్పోయి నిశ్చేష్టులై నేల కూలారు. ముల్లోకాలలోను, దేవతా విమానాలలోను హాహాకారాలు చెలరేగాయి.ఆ జయవిజయులే ఇప్పుడు దితి గర్భంలో ఉన్నారు. వారి సాటిలేని మేటి తేజస్సే మీ తేజస్సు లన్నిటినీ వమ్ము చేసింది.దీని కంతా ప్రధానకారణం ఆ హరి. ఆ శ్రీనాథుని లీలలు వింతగా ఉంటాయి. సమస్త జీవరాసుల వృద్ధిక్షయాలకు కారణమైనవాడూ, ఆది అంతం అనే వికారాలు లేనివాడూ, దయకు నిలయమైనవాడూ అయిన విష్ణువు మీకు మేలు చేస్తాడు. ఈ విచారం వదలిపెట్టి వెళ్ళండి. మీ కోరికలు తీరుతాయి.”అని బ్రహ్మదేవుడు చెప్పగా విని దేవతలు ఆ వృత్తాంతాన్ని అర్థం చేసుకొని స్వర్గలోకానికి వెళ్ళి పోయారు. దితి తన భర్త మాటలను తలచుకొని అసంతృప్తి చెందింది.

|| ఓం నమో భగవతే వాసుదేవాయ ||


|| ఓం | ఓం | ఓం || 

|| ఓం | శాంతిః శాంతిః శాంతిః || 

|| సర్వే జనా స్సుఖినో భవంతు. ||

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏

**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

**సౌందర్య లహరి**

 **దశిక రాము**




**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఐదవ శ్లోక భాష్యం - నాల్గవ భాగం


అంబిక తన కరుణ వలన కామాన్ని సృష్టించి మన్మథుని అధికారంలో ఉంచింది. జనులు ప్రయత్నం చేత జన్మరాహిత్యాన్ని పొందే అవకాశమీయడం ఆమె ఉద్దేస్యం. ధర్మార్థమోక్షములనే పురుషార్థములలో కామాన్ని కూడా చేర్చి ఒక వ్యవస్థ చేసింది. గృహస్థ దశలో క్రమశిక్షణతోనూ, నియంత్రణతోనూ శాస్త్రోక్తరీతిలో కామాన్ని అనుభవించాలి. జీవితాన్ని ఆ విధంగా గడుపుకొంటే కామం బారినుండి ఉద్దరించబడి, పవిత్రుడవయి, తరువాతిదైన సన్యాసదశకు చేరుకోవచ్చు. 


ప్రతి నిబంధనకు కొన్ని అపవాదాలుంటాయి. కొంతమంది, చాలా తక్కువమంది బ్రహ్మచర్యం నుండే నేరుగా సన్యాసులయి ఆజన్మాంతం అలా ఉండిపోతారు.


ఈ వివరణలన్నీ అలా ఉంచండి. జ్ఞానమూర్తి అయిన ఈశ్వరుడు కామంచేత ఎందుకు వికల్పం చెందాడు ? విజితేంద్రియులైన మునులు ఎందువల్ల ప్రమాదం పొందుతున్నారు. మరి ఇటువంటి పనికి కారణమయిన అంబిక పొగడబడుతున్నదేమి?? 


వారు కామమోహితులైనారన్నది కథకు అంతం కాదు. నిజానికి మళ్ళీ వారు పరిశుద్ధులైనారు. ఒకానోక సమయంలో వారు కామమోహితులైనారంటే అది లోకక్షేమం కోసం. హరిహరపుత్రుడు మాత్రమే తనను చంపగలడన్న వరమున్న రాక్షసుని సంహరించడానికి జన్మించాడు. విశ్వామిత్రునికి కామం లేనట్లయితే శకుంతల, భరతులు ఉండేవారే కాదు. మహాకవి అమరకావ్యమైన శాకుంతలముండేది కాదు. వ్యాసుడు ఘృతాచిని చూచి మరులు గొనకపోతే శుకబ్రహ్మవంటి మహావేదాంతి నైష్ఠిక బ్రహ్మచారి జనించేవాడే కాదు.


ఈ విషయాలన్నీ పరాశక్తి అనుగ్రహం, సహాయం లేకపోతే ఎంతట వారయినా పతనంకాక తప్పదన్న విషయం తెలియచేస్తాయి. మన స్వయంకృషితో మనమేదైనా సాధించగలమని విఱ్ఱవీగి పోరాదు. వినయంతో ఆమె కరుణకై అర్థించాలి.


మనమొక విషయం అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఒక వస్తువును సృష్టించే శక్తిగలవారో వారికే ఆ వస్తువును నాశనం చేసే శక్తి ఉంటుంది. చట్టసభకు చట్టం చేసే శక్తి ఉంటే దానిని సవరించే శక్తి దానికే ఉంటుంది. అంబిక ఈ ప్రపంచాన్ని, కామక్రోధాదులను సృష్టించింది. ఆమె ఒక్కతే మనను ఈ ప్రపంచం నుండి, అరిషడ్వర్గాల నుండి రక్షించగలదు. ఆమె మన్మథుని కామానికి అధిపతిగా చేసి మునులను కూడా ఆ పరిధిలోనికి తెచ్చింది. 


ఆమె ఆదేశంతో కొంతమందికి మన్మథుడు దూరంగా ఉంటాడు. మనకు సంబంధించినంత వరకు మన్మథుడు అధికారి. ఆమెకు దాసుడు. మనం మన్మథుని జయించినంత సమర్థులం కాదు. ఆమె ఆజ్ఞ ఉంటేనే అది సాధ్యమౌతుంది. ఈ శ్లోకంలో మునులు సైతం మన్మథుని పరిధిలో ఉంచబడినారని చెప్పడంతో, ఆమె అనుగ్రహం ఉంటేనే మన్మథుని బారినుండి తప్పించుకోగలమని, ఆమె అనుగ్రహంతోనే కామనాశనం జరుగుతుందనీ అర్థం వస్తోంది.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

**కుమారచరిత్ర**-7

 **దశిక రాము**


సంపుటి:7




పార్వతి తన అందాన్ని తానే నిందించుకుంది. సౌందర్యముతో సాధించలేనిది తపస్సుతో సాధిస్తానని శివుని కొరకై వ్రతము పూనింది. ముత్యాలహారాలు తీసి రుద్రాక్షమాలలు ధరించింది. ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో కమండలము పట్టి, రెండు చేతులు పైకెత్తి నమస్కార భంగిమతో తపస్సు ప్రారంభించెను. 


తల్లి మేనక ఆ తపస్సు వద్దని "ఉమా, ఉమా" అని పిలిచింది. నాటి నుండి పార్వతి "ఉమా" అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. 


ఎవరేమన్నా సరే శివుని సాక్షాత్కరింప చేసుకోవాలని తీవ్రమైన తపస్సు చేస్తోంది. కొంతకాలం ఆహారము తీసుకోవడం మానింది . మరికొంతకాలము పండ్లు తినటం మానివేసి, నీరు మాత్రం పుచ్చుకుంటూ తపమాచరించింది. 


కొంతకాలము ఆకులు, అలములు తింటూ తపస్సు చేసింది. చివరకు ఆకులు, అలములు తినటం మానివేసింది. పంచాగ్ని మధ్యములో ఒంటి కాలిపై నిలిచి తపస్సు చేస్తూఉంటే, 


దేవతలు ఆమెను "అపర్ణా, అపర్ణా" అంటూ పిలిచారు. పర్ణము అంటే ఆకు, పర్ణము కూడా తినలేదు కాబట్టి అపర్ణ అన్నారు. (అప గత ఋణ అపర్ణ అనగా ఋణములను పోగొట్టునది) 


తనకు నచ్చజెప్ప వచ్చిన తల్లిదండ్రులతో "మీరు నన్ను మార్చే ప్రయత్నం చేయడం తగదు. నేను పరమశివుని తప్ప, అన్యులను పరిణయమాడను. 


ఈసారి ఎలాగైనాసరే, నా ప్రయత్నంతో సఫలీ కృతురాలినవుతాను" అని నిశ్చయంగా చెప్పసాగింది.


ఆ శివుడ్ని చేపట్టలేని ఈ చక్కదనమేల?' అని అంతలోనే నిరాశకులోనయ్యేది. పరిపరి విధాల పలవరించిపోతూన్న పార్వతి అవస్థను, పైనుంచి చూస్తూనే ఉన్నారు దేవతలు.


ఇంద్రుడు, పార్వతికి ధైర్యం చెప్పి రమ్మని నారదుని పంపించాడు.


దేవతలందరి సంక్షేమార్ధం, ఇంద్రుడి ఆలోచన అనుసరణీయం అని, అవశ్యమే హిమరాజు సన్నిధికి బయల్దేరాడు నారదుడు. ముందుగా హిమవంతుడ్ని కలుసుకున్నాడు. అతడికి ధైర్యం చెప్పాడు.


ఆ తరువాత పార్వతి దగ్గర కొచ్చి "తల్లీ! నీవు అంబవు. ఆదిపరాశక్తి అపరావతారానివి. నీకు చెప్పదగినంత వాడిని కానుగాని, కాలచక్రరీత్యా చెప్పాల్సివస్తున్నది. 


సదాశివుడు తపస్సాధ్యుడు. భక్తవరదుడు. ఆయనను బాహ్యసౌందర్యంతో ఆకట్టుకోవాలనుకోవడం మన భ్రమ. దానికాయన లొంగడు. అంతః సౌందర్యంతోనే ఆయన సులభ సాధ్యుడు. 


కనుక నువ్వాయోగమూర్తి నిమిత్తం తపోదీక్ష పూనడం ఉత్తమం" అంటూ శివపంచాక్షరీ మంత్రం ఉపదేశించి, సెలవు పుచ్చుకున్నాడు నారదుడు. ఆ క్షణమే పార్వతి తపస్సమాధికి పూనుకొన్నది


హంసతూలికా తల్పాలపై శయనించే పార్వతి కటికనేలపై పరుండి, ప్రాతః సంధ్యలోనే మేల్కాంచి నిత్య శివదీక్షాపరురాలైంది.

ఉష్ణోదకస్నానం, షడ్రసోపేత భోజనం మానివేసి, చన్నీటి స్నానం కందమూల ఫలములను ఆహారంగా తన నిత్యకృత్యాల్లో చేర్చింది. కోమల శరీరాన, పసిడి వర్ణానికే మెరుగుపెట్టే ఆభరణాలు ధరించవలసినది.. అట్టిది విభూది రేఖలే అలంకారాలుగా చేసుకున్నది.


అయినా - ఆమెకు సదాశివ దర్శనం కరువే అయ్యింది. శివనిరీక్ష కంటె శివతపం ఉత్తమమనిభావించి, ఆ ప్రయత్నం చేపట్టింది. మండు వేసవిలో పంచాగ్ని మధ్యాన నిలిచి, సూర్యమండలంవైపు చూపు నిలిపి తపస్సు నాచరించడం చలివేళల వర్షధారల నాచరించడం;


ఆమెను చూసి - శతవృద్ధులు సైతం ఆశ్చర్యపోయేరీతిగా, కాల తీవ్రతలతో చెలిమిచేస్తూ తపోనిష్ఠా గరిష్ఠురాలు కావడం... ఆమె తపోగ్రతకు నిదర్శనాలైనాయి.


ఇంద్రాది దేవతలు సదాశివుని ప్రార్ధించి, పార్వతిని పరిణయ మాడి ప్రపంచాన్ని కాపాడమని వేడుకున్నారు. పార్వతియందు కుమారుడిని కని తారకుని పీడ తొలగించమని అభ్యర్ధించారు. వారిని కరుణించి, అట్లే జరుగుతుందని అభయం ఇచ్చి పంపేశాడు శివుడు.


సప్తర్షుల ద్వారా పార్వతి తపోగ్రత తెలిసినా, తానొకపరి, ఆమె మనోనిశ్చయాన్ని పరీక్షించ దలిచాడు శూలి.


నటన బ్రహ్మచారీ - నగరాజపుత్రీ ముఖాముఖి:


ఒకనాటి మధ్యాహ్న సమయాన, పార్వతి యధోచితమున నియమనిష్ఠలతో తపమాచరించు చుండగా అచ్చటికి ఒక బ్రహ్మచారి వచ్చాడు. సూర్యతేజంతో వెలుగుతున్న అతడు కృష్ణాజినము, జపమాల ధరించాడు. త్రిపుండ్రాంకితమైన అతని లలాటాన్ని చూసి సాక్షాత్తు శివయోగిగా భావించిన పార్వతి నమస్కరించగా, అతడు 'అభీష్ట సిద్ధిరస్తు' అని ధీవించాడు.


కుశల ప్రశ్నలడిగాడు. పార్వతి వంక పరిశీలనగా చూసి, "అమ్మాయీ! ఏదో ఫలాపేక్షతో భీషణ తపమాచరిస్తున్నట్లున్నావు. కాని , దేహం విషయంలో అశ్రద్ధ చేస్తున్నావు. అయినా, మేము యోగులము! స్త్రీలతో సంభాషించడమేమిటని ఆశ్చర్యపోతున్నావు కదూ! సంబంధం సాప్తపదీనం అంటారు...


నేను ఆ ప్రకారం నీకు ఆప్తుడ్ని కనుక అడుగుతున్నాను. నీవు చూస్తే మహోన్నత హిమవత్పర్వత రాజు కుమార్తెవు. సౌందర్యం, ఐశ్వర్యం, సౌఖ్యం అన్నీ నీకు అరచేత అమరినవే! ఆశ్చర్యమే మరి!" అంటూ, తన వాక్ సుధా రసం ప్రేమమీర వర్షించాడా వటువు.


పార్వతీదేవి ఏమీ మాట్లాడలేదు. మళ్లీ తన వాగ్ధోరణి కొనసాగించాడా బ్రహ్మచారి.


"సుందరీ! పుట్టింట నిన్నెవరూ అవమానించలేదు కద! అయినా, పాము పడగపైన చేతిని ఉంచేవాళ్లుంటారా ఎక్కడైనా? అదీగాక, నీవుపడుతున్న కష్టం చూస్తూంటే - తీరని కోరిక ఏదో నిన్ను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నట్లే ఉంది.


అట్టి కోరిక ఏమిటై ఉంటుందబ్బా? స్వర్గ సౌఖ్యమయి ఉండదు. స్త్రీకి పుట్టింటిని మించిన స్వర్గ సౌఖ్యమేడగలదు? మగని కోసం కాబోలును?


అయినా, నీవు నారీ శిరోరత్నానివి. రత్నాన్ని వెతుక్కుంటూ ఎవరైనా రావాలిగాని, రత్న లంతాను ఎవర్నని వెతుక్కొని వెళ్తుంది? నీ నిట్టూర్పుల వేడి చూస్తూంటే నువ్వు చాలా శ్రమ చెందినట్లుగా కనిపిస్తున్నావు. నిన్ను ఇంతగా కష్టపెట్టిన ఆ కఠినుడు ఎవడు?"


ఇంత సుదీర్ఘమైన సంభాషణకూ, ఒక్కటంటే ఒక్కపలుకు కూడ పార్వతి బదులీయక పోవడంతో, కొంచెం చొరవ చేసి ముందు కొచ్చి 


"ఇదిగో! అమ్మాయీ! నువ్వు చూస్తే కన్యవు. నేనా బ్రహ్మచారిని! మన కిద్దరికీ సరిజోడు కుదురుతుందనే నా నమ్మకం! ఏమంటావు! పోనీ! నీవు ప్రేమించిన వానికై నా తపస్సులో సగభాగం నీకు ఇప్పుడే ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాను"...అని ఆశ చూపించాడు.


ఆ వాగ్వైఖరి నచ్చక, పార్వతి చెలికత్తె వైపు కనుసైగ చేసి చూసింది. ఆమె వివరంగా పార్వతీదేవి ఎవరికోసం తపస్సు చేస్తున్నదో చెప్పింది.

అంతా విని గట్టిగా నవ్వాడా బ్రహ్మచారి. "భేషు! చాలా గొప్ప వరుడి కోసమే తపస్సు చేస్తున్నదే మీ రాజపుత్రి" అని మళ్లీ పక పక నవ్వాడు.


"ఏమి! శివుడికంటె ఉత్తమ వరుడున్నాడా?" అడిగిందా చెలికత్తె.


"అదలా వుంచు! ప్రస్తుతం మీ చెలి ఎవర్నయితే వరించ బూనుకొన్నదో అలాంటి వాడు ఈ పధ్నాలుగు లోకాల్లోనూ ఎక్కడా గాలించి వెతికినా కనబడడు.


ఒంటి నిండా బూడిద! మెడలో ఇంతింత కపాలాల మాల, వాటిని పెనవేసుకున్న పాములగోల, కట్టినదేమో జంతుచర్మం. అట్టలు కట్టిన జడలు...ఓహోహో! ఎవరైనా వింటే నవ్విపోతారు.


అంద చందాల్లో గానీ - ఐశ్వర్య భాగాలలో గాని పార్వతీదేవి ఎక్కడ? శ్శశానవాసి సాంబుడెక్కడ? ఐనా ఆవిడ కోరుకోదలిస్తే, దేవలోకంలో దేవతలు ఎంతమంది లేరు? భూలోకంలో రాజపుత్రు లెంతమంది లేరు? పోనీ!..అవన్నీ వదిలేయ్ ! మీ సఖికి నేను తగనా? కాస్త చెప్పిచూడు!


దీంతో చెలికెత్తె క్కూడా కోపం వచ్చింది. అయినా, బ్రాహ్మణులపై కోపం తగదని తెలిసిన ఇంగితజ్ఞురాలు కనుక - "అయ్యా! తాప సోత్తములకు తగని పలుకులను, మీ నోటి వెంట వినాల్సి వస్తున్నందుకు విచారంగా ఉంది. తాము ఎవర్ని కోరుతున్నారో, కాస్త ఆలోచించడం మంచిది" అన్నది కాస్త కటువుగానే.


"ఓహో! అదా సంగతి! అమ్మా! పార్వతీదేవి చెలీ! మీ సఖి పర్వతరాజు కూతురని నేను మర్చిపోయాననుకున్నావా? ఇలా ఎవరైనా మాట్లాడారంటే - ఉరితీయించేస్తారు! అంతేకదా!

తలపట్టుకుంది చెలికత్తె.


"అయ్యో! అది కాదయ్యా విప్రకుమారా! ఈమె ఏనాడో పరమ శివుని సొత్తు అయిపోయింది. ఇతరులీమెను ఆశించడం మహాపాపం!" అంది - ఇంకేం అనాలో తోచక.


"బాగుందమ్మా - ఈ వైనం! మనస్సును పరమశివునికి అంకితం చేసింది, సరే! ఆయనగా రీవిడ మానసాన్ని అంగీకరించాలా? వద్దా?"


"అతడు అంగికరిస్తాడో - లేదో నీకెందుకయ్యా ఆ సంగతి?"


"ఓహోహో! అంగీకరించేవాడే అయితే - ఇంత జాగు చేయనేల? నేటికీమె తపమాచరించుట మొదలిడి ఎన్నాళ్లుగడిచింది? నిజంగా ఈమెపై ప్రేమే ఉంటే, ఈ సుందరి ఈ రీతిన తపశ్చర్యలో నలిగిపోతూంటే, చూసి ఓర్చుకోగలడా? ఆ శివుడో పాషాణ హృదయుడు లయకారకుడు. ప్రేమ ఉంటుందని ఎలా భావించగలం?


రంగురంగుల వస్త్రాలున్నాయా? కస్తూరి సుగంధికారి లేపనాలున్నాయా? రత్నా భరణాలున్నాయా? ముసలెద్దు తప్ప సరైన వాహనమైనా లేదే! అవన్నీ అలా ఉంచు! మీ సఖి శివుడ్ని పెళ్లాడిందనుకో! దగ్గరగా నిలబడ్డప్పుడు ముఖం మీద పాము బుస్సన్న కోసమా ఈ తపస్సంతా?" అని పెద్ద పెట్టిన నవ్వేస్తూ, నోటి కొచ్చినట్టల్లా వాగాడతడు.


అంతవరకు శాంతచిత్తురాలై ఉన్న పార్వతి ఇంక సహించ లేకపోయింది.


"చెలీ! ఈ శివ దూషణను ఇక భరించడం నావల్ల గాదు. ఈతడిట్లు శివనింద చేయువాడని తెలియక గౌరవించాను. ఇట్టి శివద్వేషిని తక్షణం ఇటనుండి వెడలిపొమ్మని చెప్పు!" అని ముఖం అటు తిప్పుకోబోయింది.


ఆ తత్తరపాటులో పార్వతీ దేవి సన్నని వల్కలాంచలం అందంగా ఆమె చన్నుల పైనుంచి జారి వింతసొగసు లీనసాగింది. అది కూడా ఆమె గమనించక చరచరా నాలుగడుగులు నడిచి, రోషం నిండిన కళ్లతో ఒక్కసారి వెనక్కు తిరుగుతూ పైట సర్దుకుంది.


ఆ తిరగడంలో ఆమె కళ్లకు చంద్రశేఖర రూపం సాక్షాత్కరించింది. అంతవరకు నటన వేషధారిగా, బ్రహ్మచర్యదీక్షా పరుడిగా కనిపించిన ఆ వటువే ఈ శివుడని తెలిసి ఆమె సిగ్గులమొగ్గ అయింది. ఆమె చెలి కూడా ఆశ్చర్యపోయి; ఆవలకు తప్పుకున్నది.

"దేవాధిదేవా! ఈ దీనురాలిపై ఇంతకాలానిక్కాని తమకు దయ కలగలేదన్నమాట!" అని గబగబా దగ్గరకొచ్చి నిష్ఠురమాడింది - ప్రేమా స్పదమైన పార్వతి అలుకకు చిర్నవ్వే శివుని సమాధానం!


"ఏదయితేనేం! నేటికి నేను ధన్యురాలినైనాను. తల్లిదండ్రుల చాటు పిల్లని కదా! ఎంతగా మిమ్ములను ప్రేమించినా, లోకాచారరీత్యా తాము, మా పితృవరేణ్యులను అర్ధించి నన్ను అనుగ్రహించేందుకు తోడ్పడవలసింది" అని కోరింది పార్వతి.


"సరే! నే నేరీతిన అర్ధించాలో అదీ నువ్వే చెప్పు!" అన్నాడు సాంబశివుడు. "తమకు తెలియని రీతులా? సమస్త విషయగ్రహణ పారీణులు తాము" అంటూనే శలవు పుచ్చుకొని పార్వతి గృహోన్ముఖంగా కదిలింది. శివుడచటినుంచి అంతర్హితుడయ్యాడు


సశేషం:


ఆ దేవా దేవుని దివ్య లీలలలో 

మరి కొన్ని తదుపరి సంపుటి లో తెలుసుకుందాము.

🙏🙏🙏

సేకరణ


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

declaration

 దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి గా ఉంది కూడా, తమ పదవిని దుర్వినియోగం చేయకుండా Nov 20, 2003 లో హిందువుల మనోభావాలకు గౌరవం ఇచ్చి signature declaration ఇచ్చారు అబ్దుల్ కలాం గారు....


అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతి గా ఉన్న కాలంలో , ఒకసారి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రావడం జరిగింది. అక్కడ బందోబస్తు బలంగా ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణ వేళలో దర్శనం అయితే భక్తులకు ఆటంకం కలుగుతుందని వేకువజామున దర్శనానికి బయలుదేరారు. అక్కడ మంత్రులు మరియు వివిధ ప్రభుత్వ అధికారులతో ప్రధాన అర్చకులు ఆయనకు బంగారువాకిలి వద్ద స్వాగతం పలికారు. లాంఛనాలను సంతోషంగా స్వీకరించిన కలాం గారు బంగారు వాకిలి వద్దనే ఆగిపోయారు. ఎంత పిలిచినా రాలేదు. కొంత సేపటికి కలాం గారే అన్యమతస్థులు తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తే, ఆ దేవస్థానం విధి అనుసరించి ఒక నోట్బుక్ లో signature declaration చేయాలని, ఆ నోట్బుక్ తీసుకురావాలని అధికారులను కోరారు. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి గా ఉంది కూడా, తమ పదవిని దుర్వినియోగం చేయకుండా, హిందువుల మనోభావాలకు గౌరవం ఇచ్చి, ఆలయ సంస్కృతి సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకోవాలని అన్న ఆ మాటలను విన్న అధికారులు కలాం గారి అనుకువకు ఆశ్చర్య చెంది ప్రశంసించారు. Declaration చేసిన తరువాతనే స్వామి దర్శనార్థం ఆలయం లోనికి ప్రవేశించారు.🙏🙏🙏🙏

పోత‌న త‌ల‌పులో ....58


 కృష్ణ‌ప‌ర‌మాత్మ ద్వార‌కా న‌గ‌రాన్ని స‌మీపించాడు. పాంచ‌జ‌న్యాన్ని పూరించి ద్వార‌కాపురి ప్ర‌జ‌ల‌ను ధ‌న్యుల‌ను చేశాడు.


                            ***

జలజాతాక్షుఁడు శౌరి డగ్గఱె మహాసౌధాగ్రశృంగారకం,

గలహంసావృతహేమపద్మపరిఖా కాసారకం, దోరణా

వళిసంఛాదితతారకం, దరులతావర్గానువేలోదయ

త్ఫలపుష్పాంకుర కోరకన్, మణిమయప్రాకారకన్, ద్వారకన్.

                           ***

బంగారు కలశాలతో ప్రకాశించే ఎత్తైన మేడలు కలది; కలహంసలతో కాంచనవర్ణ కమలాలతో అలరారే అగడ్తలు చుట్టూ కలది; చుక్కలు తాకే చక్కని తోరణాలు, పండ్లు, పువ్వులు, చివుళ్లు, మొగ్గలుతో నిండిన లతాకుంజాలు, పంక్తులు పంక్తుల వృక్షాలు కలది; రత్నఖచిత ప్రాకారాలు కలది అయిన ద్వారకానగరాన్ని తామరరేకుల లాంటి కళ్ళున్న శ్రీకృష్ణుడు సమీపించాడు.

                               ***


అన్యసన్నుత సాహసుండు మురారి యొత్తె యదూత్తముల్

ధన్యులై వినఁ బాంచజన్యము, దారితాఖిలజంతు చై

తన్యమున్, భువనైకమాన్యము, దారుణధ్వని భీతరా

జన్యముం, బరిమూర్చితాఖిలశత్రుదానవసైన్యమున్.

                             ***

ఆత్మీయులే కాక అన్యులు సైతం అభినందించే ధైర్యసాహసాలు కల గోవిందుడు సమస్త ప్రాణులను నిశ్చేష్టులను చేసేడెది, లోకం ప్రశంసలు అందుకోగలిగినది, చెవులు బద్దలయ్యె శబ్దంతో రాజులను బెదరగొట్టేడిది, ప్రతిపక్షులైన రాక్షసయోధు లందరినీ మూర్ఛిల్లచేసేది అయిన పాంచజన్య మనే తన శంఖాన్ని పూరించాడు. మాన్యులైన యదుకులాగ్రగణ్యు లందరూ ఆ శంఖధ్వనిని విని ధన్యులైనారు.


  🏵️ పోత‌న ప‌ద్యం🏵️పాంచ‌జ‌న్య శంఖారావం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..

అన్నదమ్ములు..ఆస్తిపంపకం..


"మీకు తెలిసిన మంచి లాయర్ ను నాకోసం మాట్లాడతారా?..ఒక సలహా కావాలి.." అని నన్ను అడిగాడు రాజగోపాల్..


రాజగోపాల్ వాళ్ళ నాన్న గారు లక్ష్మీనరసారెడ్డి గారితో నాకు బాగా దగ్గర స్నేహం ఉన్నది..లక్ష్మీనరసారెడ్డి గారికి ఇద్దరూ మొగపిల్లలే..వివాహం జరిగిన ఏడు సంవత్సరాల దాకా పిల్లలు పుట్టకపోతే..మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి సమాధి వద్ద లక్ష్మీనరసారెడ్డి మొక్కుకున్నారు..ఆ మరుసటి సంవత్సరమే సంతానం కలిగింది..మొగపిల్లవాడు..అతనికి వేణుగోపాల్ అని పేరు పెట్టుకున్నారు..ఆ మరుసటి సంవత్సరం మళ్లీ మొగపిల్లవాడు పుట్టాడు..అతనికి రాజగోపాల్ అనీ పేరు పెట్టుకున్నారు..శ్రీ స్వామివారి దయవల్లే తనకు సంతానం కలిగిందని చాలా సార్లు చెప్పుకునేవారు లక్ష్మీనరసారెడ్డి.. ప్రతి సంవత్సరం శ్రీ స్వామివారి దర్శనానికి ఖచ్చితంగా వచ్చి వెళ్లేవారు లక్ష్మీనరసారెడ్డి..


లక్ష్మీనరసారెడ్డి వ్యవసాయం చేసేవారు..తల్లుదండ్రుల నుంచి సంక్రమించిన ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ..అంచెలంచెలుగా కష్టపడి దానిని పాతిక ఎకరాలకు పెంచుకోగలిగారు..ఇద్దరు కుమారులనూ ఉన్నంతలో బాగానే చదివించారు..ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు..పెద్దవాడు హైదరాబాద్ లో..రెండవవాడు బెంగళూరు లో వుంటున్నారు..ఇద్దరికీ వివాహాలు జరిగాయి..ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు..


లక్ష్మీనరసారెడ్డి గారు తనకున్న ఆస్తిని మూడు భాగాలు చేసి, తనకూ తన భార్యకు ఒక భాగం ఉంచుకొని..మిగిలిన రెండు భాగాలూ ఇద్దరు కుమారులకూ సమానంగా వచ్చేటట్లు వీలునామా వ్రాసారు.. చిన్నవాడైన రాజగోపాల్ తన అన్నయ్య వాటాకు వచ్చిన భూమి తనకు కావాలని..తన వాటాకు వచ్చిన దానిని అన్నయ్యకు ఇవ్వమని కోరాడు..ఈ చిన్న విషయం కారణంగా ఆ కుటుంబంలో మనస్పర్థలు వచ్చాయి..అన్నదమ్ములిద్దరూ పంతాలకు పోయారు..లక్ష్మీనరసారెడ్డి గారికి మనసుకు కష్టం వేసింది..


సరిగ్గా ఆ సమయంలోనే రాజగోపాల్ నన్ను సలహా అడిగాడు..అంతకుముందే లక్ష్మీనరసారెడ్డి నాతో చెప్పివున్నారు కనుక, అతనిని కూర్చోబెట్టి నచ్చచెప్ప బోయాను..కానీ ఆ పిల్లవాడు వినలేదు..తాను కోర్టుకు వెళతానని ఖరాఖండిగా చెప్పేసాడు..ఇక చేసేదేమీలేక మౌనంగా ఉండిపోయాను..


ఆ తరువాత ఆదివారం నాడు లక్ష్మీనరసారెడ్డి గారు భార్యతో సహా మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..శ్రీ స్వామివారి విగ్రహానికి పూజలు చేయించుకొని..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి.."స్వామీ!..సంతానం లేని నాడు నిన్ను వేడుకుంటే..నాకు సంతానాన్ని ప్రసాదించావు.. ఈనాడు ఆ సంతానమే నాకు మనోవేదన కలిగిస్తున్నారు..ఈ సమస్యను నువ్వే పరిష్కరించాలి..నా చేతుల్లో ఏమీ లేదు..నిన్నే నమ్ముకున్నాను..నా కుటుంబంలో వచ్చిన ఈ పొరపొచ్చాలు సమసిపోయి..అందరూ కలిసిమెలిసి ఉండేటట్లు నువ్వే అనుగ్రహించు.." అని వేడుకున్నారు..సమాధి మందిరం నుంచి బైటకు వచ్చి.."ఇక అంతా ఆ స్వామివారిదే భారం ప్రసాద్ గారూ..నేను పూర్తిగా ఆ మహానుభావుడి మీదే నమ్మకం పెట్టుకున్నాను.." అన్నారు..


మరో వారం గడిచింది..మళ్లీ ఆదివారం నాడు..లక్ష్మీనరసారెడ్డి గారు మందిరం లోపలికి వస్తూ కనిపించారు..నేరుగా నేను కూర్చున్న చోటుకు వచ్చి.."స్వామివారు నా మొర ఆలకించారు ప్రసాద్ గారూ..రెండురోజుల్లో సమస్య తీరిపోయింది..చిన్నవాడు మనసు మార్చుకున్నాడు..మొన్న బుధవారం నాకు ఫోన్ చేసి.."నాన్నగారూ మీ ఇష్టప్రకారమే పంపకాలు చేయండి..నాకేమీ అభ్యంతరం లేదు..ఇప్పుడే అన్నయ్య తో కూడా మాట్లాడాను..నేను శనివారం మన ఊరికి వస్తున్నాను..ఆదివారం అందరం కలిసి మొగలిచెర్ల వెళ్లి, శ్రీ స్వామివారిని దర్శించుకుని వద్దాము.." అన్నాడండీ.. వాడిలో ఈ మార్పు తీసుకొచ్చింది స్వామివారే.." అన్నారు..ఇంతలో లక్ష్మీనరసారెడ్డి గారి ఇద్దరు కుమారులూ, భార్యా..వచ్చేసారు..అందరూ కలిసి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొన్నారు..


నేను కుతూహలం పట్టలేక, రాజగోపాల్ ను ప్రక్కకు పిలచి, " లాయర్ సలహా కావాలన్నావు కదా..ఈలోపల ఏమి జరిగింది?.." అన్నాను..అతను ఏమీ మాట్లాడకుండా..శ్రీ స్వామివారి పటం వైపు చూపించి..ఒక నమస్కారం పెట్టాడు.."పోయిన సోమవారం రాత్రి నిద్ర పెట్టలేదండీ..ఎవరో వచ్చి నేను చేస్తున్నది తప్పు అని పదే పదే చెప్పినట్లు ఆలాపన వచ్చింది..ఆ ప్రక్కరోజూ అదే జరిగింది..తట్టుకోలేకపోయాను..బుధవారం నాడు అన్నయ్య తో..నాన్నగారితో మాట్లాడిన తరువాతే నాకు మనసుకు శాంతి కలిగింది..ఆస్తి కోసం పంతాలకు పోతే..అనుబంధాలు దెబ్బతింటాయని తెలిసొచ్చింది.." అన్నాడు..


లక్ష్మీనరసారెడ్డి గారికి సంతానాన్ని ప్రసాదించిన శ్రీ స్వామివారు..ఆ కుటుంబం లో వచ్చిన మనస్పర్ధలనూ దూరం చేశారు..ఆ మాటే లక్ష్మీనరసారెడ్డి గారు చెప్పుకుంటూ వుంటారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

పంచభూతాత్మకమైనది

 సం మా గ్నే వర్చసా సృజ సం ప్రజయా సం ఆయుషా/ విద్యను మే అస్య దేవా ఇన్ద్రో విద్యాత్ సహ ఋషిభిః.అని ఋక్కును పరిశీలన చేసిన సత్ ఎల్లప్పుడు యున్నది పూర్ణమైన అనగా సత్తు సం పూర్ణమై అగ్నిగా వర్చస్సు కాంతి లక్షణముగా కలిగి ప్రజయా ప్ర అనగా నీటి మూలమైన జీన్ జీవ లక్షణముగా మారి సం ఆయుషా పరిమితి గల తత్వమును అనగా కాల పరిమితిగల జీవుడు గా మారు కాంతి లక్షణముగా మారును. విద్ అనే ధాతువుగా విశేషమైన ద్రాం అగ్ని బీజ అక్షర మని విశేషమైన అనగా జీవసంబంధ అగ్ని తత్వం గా మారుట అది దేవా అనగా విశేషమైన వివరించు లక్షణము కలిగి ఇన్ద్రో పంచభూతాత్మకమైనది యిన్ద్ద్రియ జీవ లక్షణముగా మారుట యే యని తెలియుచున్నది. సహ ఋషిభిః సత్ హవిస్సు లక్షణముగా ఋతు ధర్మ ఉష కాంతిగా మారి భిః ప్రకాశించుచున్నది. యిదే ఆత్మ జీవ రూపంలో దేహంలో ప్రవేశించు తత్వమును తెలియుచున్నది. యిక్యక్కడ మరియెుక మంత్ర పరిశీలనలో ఆ జీవ శక్తి దేహంలో ప్రవే శించుటకు కూడా యీ క్రింది మంత్ర ముగా తెలియును. అప గూహ లం గుహా హితం. లం పంచభూతాత్మకమైనది జీవి గూహ గుహ అనే దేహములోనికి ప్రవేశించి అనగా తండ్రి లోపలికి ప్రవేశించి ఆ తండ్రికి మరియు వారికి మూలమైన తాత ఆత్మను హితము చేయుటకై ఉధ్దరించుటకై అనగా తండ్రి ఆత్మోధ్దరణకై తండ్రి అనే గుహ అనే దేహంలో కి ప్రవేశం. తెలుసుకుందాం ఆచరిచుదాం.

*మా ఊళ్ళో మహాశివుడు*

ఏళ్ల క్రితం వరంగల్ గుళ్లో మొదలుపెట్టిన అర్చకజీవితం పలు ఆలయాలు మారుతూ పదిహేడేళ్ళ క్రితం ఈ ఊళ్ళో కొచ్చినప్పుడు శివాలయం కమిటీ వాళ్లిచ్చిన జీతం నెలకు వెయ్యి రూపాయలు మహేశ్వర రావు గారికి..*


*గ్రామస్థులు మర్యాదస్తులు కావడంతో, అడపాదడపా పలకరించేవాళ్ళతో ఊరితో విడదీయరాని అనుబంధంగా మారింది అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు..* 


*ప్రత్యేకంగా ఏ మాన్యాలంటూ లేని ఆ పాత కాలం నాటి చిన్న శివాలయానికి నిత్య కైంకర్యాల నిమిత్తం ధూప దీప నైవేద్య పథకం కింద ప్రభుత్వం ఇచ్చే అయిదువేల రూపాయలే శరణ్యం గుళ్లో మహేశ్వరుడికి, ఆయన్నే నమ్ముకున్న మహేశ్వరళరావు గారికి..!!*


*రెండుపూటలా దీపం పెట్టి, అభిషేకం చేసి, స్వహస్తాలతో చేసిన తేలికపాటి నైవేద్యం తృప్తిగా నివేదించి, దర్శనానికొచ్చిన భక్తులకి అర్చనలు చేయిస్తూ కొనసాగిస్తోన్న సామాన్యజీవనమే పరమేశ్వర ప్రసాదితమని మనసారా నమ్మిన అమాయకుడాయన.. ఉన్నంతలో ఇద్దరి కూతుళ్ళకి పెళ్లిళ్లయ్యాయి.. గొప్పగా కాకపోయినా వాళ్ళ కాపురాలు చేసుకుంటున్నారు..*


*బియ్యప్పిండితో గీసిన నిలువుగీతలా పోతున్న ఆ ఊరి జీవితాల్లోకి కరోనా ప్రవేశించడంతో తొమ్మిది వందల జనాభాలో 175 కేసులొచ్చాయి..*


*గుడి మూతపడింది.. భక్తులు రావడం మానేశారు..!!*


*ప్రభుత్వం నుంచొచ్చే అయిదువేల రూపాయల నిధులు ఆగిపోయాయి.. కారణమడిగితే తిరుపతి దేవస్థానానికి భక్తులు రాక ఇట్లాంటి చిన్నగుళ్ళకి నిధులు ఆపమన్నారని కబురొచ్చిందట..!!*


*మహేశ్వరరావుగారు నవ్వుకున్నారు.. భక్తితో మారేడుదళం సమర్పించినా చాలంటారుగానీ తన స్వహస్తాలతో ఏదొకటి వండిపెడితేనే తప్ప నైవేద్యం కూడా ముట్టడు ఆ మహాశివుడు..!!* 


*ఇంకెక్కడి భుక్తి..??*


*గుడికి జనాలెవరూ రాకపోయినా లోపలున్న లింగానికి ఏకాంతంగానైనా విధిగా నిర్వహించాల్సిన నిత్యపూజలకి లోటు లేకుండా నెట్టుకొస్తున్నాడు..*


*వాటి కోసమని తను వయస్సులో ఉండగా వేలుమీదకొచ్చిన ఉంగరానికి ఇప్పుడు విడుదలొచ్చింది.. కాకుంటే బ్యాంకుకెళ్లింది..!!*


*భార్య ఉండగా బతుకు బాగుండిన రోజుల్లో ముచ్చటపడి చేయించిన గొలుసు కూడా ఉంగరం బాటే పట్టింది..!! భార్యే బ్యాంకు తాకట్టుకి పోతున్నట్టు తను గురైన ఆవేదన గురించి రోజూ పూజ లందుకునే శివుడికైనా తెలుసో లేదో..!!*


*ఆ డబ్బులు ఉన్నంత వరకూ సాగాడు.. తర్వాత కమిటీ పెద్దని కలిశాడు..*


*" మన రాష్ట్రంలో సంవత్సరాదాయం కనీసం 50వేలు కూడా లేకుండా 6(సీ) కేటగిరీలో ఉన్న 6709 చిన్న ఆలయాల్లో మనదొకటి..!!! ఏం చేస్తాం చెప్పండి..?? ఊ ఊ..!!"*


*"శివుడికి, నాకూ కూడా బతుకు కష్టంగా ఉందండీ.. పెద్దలేమైనా దయతలిస్తే.. దీనంగా అడిగాడు"*


*"హమ్మమ్మా అపచారం అపచారం.. మీబోటివారికి గౌరవభత్యం ఇచ్చేంతవాళ్ళమా.. మా దగ్గరేముంటాయండీ పంతులుగారూ.. అసలే కరోనాకాలం.. ఇన్నాళ్లనుంచీ తొమ్మిది వందల జనాభా ఉన్న ఈ గ్రామంలో తమ తమ శక్తి కొద్దీ సమర్పించుకోగా పళ్లెంలో పడిన చిల్లరంతా మీకేగా..!! కానివ్వండి కానివ్వండి.. ఆ.. ఆ..!!* వాటి గురించి *మే మేనాడైనా అడిగామా..??"*

  

*కమిటీ పెద్దగారి మాటల్లో వ్యంగ్యం అర్ధమైంది మహేశ్వరరావుగారికి.. గుడికొచ్చే బీదాబిక్కి జనం కార్తీకమాసాల్లో కాకుండా ప్రతీ సోమవారం పళ్లెంలో విదిల్చే చిల్లర ఎంతనేది చెప్పడానికి సిగ్గుపడేంత మొత్తాన్ని ఇట్లా అపార్ధం చేసుకుంటున్నందుకు లోతైన కళ్ళతో అంతకంటే లోతుగా నవ్వారు..*


*మహేశ్వరరావుగారికి ఇంకేం అడగాలనిపించలేదు.. ఏవన్నా ఉంటే గింటే శివుడ్ని తప్ప మనుషుడ్ని అడగటానికి సంకోచించే తత్వం మరీ ఎక్కువైపోయింది ఈ మధ్య..!!!*


*ఆ మధ్య నోరు విడిచి సర్పంచ్ గారిని ఇలాగే ఇళ్లపట్టాల గురించి అడగబోయారు..*


*"ఇళ్లేవో రాస్తున్నారంటున్నారు.. శిథిలావస్థకి చేరుకున్న ఆ రెండుగదుల ఇంట్లో ఉండటం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.. మరీ ముఖ్యంగా వర్షాలప్పుడు.. గుడి నానుకుని ఉండటంతో కోతుల బెడద కూడా ఎక్కువయ్యింది..!!"*


*"65 ఏళ్లొచ్చిన మీకు ఇప్పుడు ఇల్లు అవసరమా.. మీ తర్వాత ఎవరికిస్తారు..?? పైగా మీ ఇంట్లో మీదొక్కటే కదా ఓటు..!!" అని తుపాకీ పేలినట్టు నవ్వి హాస్యం చేసిన సర్పంచ్ గారు ఈ మధ్యే కరోనా సోకి ముదరబెట్టి 52 ఏళ్ళకే కాలం చేశాడు పాపం..!!* 


*"ఏంటో.. విధి విచిత్రం.. అంతా పరమశివుడి లీల..!!" అని సరిపెట్టుకున్నారు మహేశ్వరరావుగారు..*


*ఎందుకో ఆ మర్నాడు పొద్దున్న లేచాకా గొంతులో చేదుగా ఉండి, మర్నాటికి గరగరలాడి, వాసన తెలీనివ్వకుండా జలుబు, పట్టు విడవనంతగా జ్వరం వచ్చేసేసరికి టెస్టులక్కర్లేకుండానే కరోనాగా తేలింది..!!*


*నీరసంగా ఉన్న మహేశ్వరరావుగార్ని ఆ వార్డు వాలంటీరొచ్చి అంబులెన్సుని పిలిపించి ఎక్కించాడు..*


*హాస్పిటల్లో జరుగుబాటు బాగానే అయ్యి, దురలవాట్లు లేని క్రమశిక్షణా శరీరం కాబట్టి తొందరగానే కోలుకున్నారు..* *పదిహేనురోజుల తర్వాత మళ్లీ ఇంటి దగ్గర దింపించి రెండువేల రూపాయల రొక్కం చేతిలో పెట్టాడు హెల్త్ వాలంటీర్..*


*మరో పదిరోజుల పథ్యం తిరిగి గుడి తెరవడం ప్రారంభించి, బావినీటితో నిస్సత్తువగానే అభిషేకం జరిపి కాసేపు తువ్వాలు విసురుకుంటూ ఆ శివుడినే చూస్తూ కూర్చుని వచ్చేస్తున్నారీ మధ్యన.*


*పదిరోజులయ్యింది..*


*ఎవరి దాతృత్వం చేతనో కూరగాయల కవర్ అందివ్వడానికి ఇంటి గుమ్మం దగ్గరికొచ్చిన వాలంటీరుకి కళ్లతోనే కృతజ్ఞత చెప్పారు ముక్కుకి, మూతికి ఎర్రతుండు కట్టుకున్న మహేశ్వరరావుగారు..*


*నమస్కారం చెప్పి వెనుదిరగబోతోన్న వాలంటీరును ఆగమన్నారు మహేశ్వరరావు పంతులుగారు..* 


*"మన ఊరి గుడికి ఆదాయం టీటీడీ దేవస్థానం నుంచి వస్తోందట.. ఇప్పుడు కొండకొచ్చే భక్తులు లేక ఆదాయం తగ్గి తిరుపతి వెంకన్న బీదవాడయ్యాడుట..* *అంచేత గత ఐదునెలలుగా మా భృతి నిలిపివేశారు..!!"*


*గుమ్మానికి పదడుగుల దూరంలో నిలబడ్డ వాలంటీరు అలానే చూస్తున్నాడు విషయం అర్ధంగాక..* 


*ఎర్రతుండు చాటు దాగిన వణుకుతోన్న పెదవులతో మెల్లగా గొణిగారు పంతులుగారు..!!*


*"ఆ కరోనా వ్యాధి మళ్లీ వచ్చే అవకాశం ఉందా నాయనా..? వస్తే రెండువేలు మళ్లీ ఇస్తారా..?"*


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఇది కథ అయినా ప్రస్తుత పరిస్థితి కి నిలువుటద్దం.*


_*హైందవ ధర్మాన్ని ఆచరించే మిత్రులకు విజ్ఞప్తి*_


_*అన్ని ఆలయాలూ తిరుపతులు కావు. అందరు అర్చకులూ స్థితిమంతులు కాదు‌. మనం సాధ్యమైనంత వరకూ చిన్న ఆలయాలకే వెళదాం... వీలైతి మంచి దక్షిణ వేద్దాం. హుండీలో కాదు సుమా...మీకూ నచ్చితే ఆచరిస్తారు కదూ*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

నారీలలామ

 నారీలలామ! నీ పేరేమి చెపుమన్న?

        దమిమీర నెడమ నేత్రమును జూపె,

మత్తేభయాన! నీ మగని పేరేమన్న?

       దన చేతి జీర్ణ వస్త్రమును జూపె

కుటిల కుంతల! నీదు కులము నామం బన్న?

         బంజరంబున ను్న పక్షి జూపె

వెలది! నీకేమైన బిడ్డలా చెపుమన్న?

      కరమొప్ప మింటి చుక్కలను జూపె

ప్రభువు మీకెవ్వరన్న "గోప" కుని జూపె?

ధవుని వ్యాపారమేమన్న? "దండ" మిడియె

చతురమతులార! ఈ ప్రోడజాణతనము

దెలిసికొనరయ్య బుద్ధి కౌశలము మెరయ.


ఓ నిపుణమతులారా! ఒక ప్రౌఢయగు నాయిక యొక్క ఈ నేర్పరితనమును,

మీ బుద్ధిసూక్ష్మతను ఉపయోగించి,తెలిసికొని, ప్రత్యుత్తరమీయండి.


ఇందులో నారీలలామ, మత్తేభయాన, వెలది, కుటిలకుంతల -

అనేవన్నీ స్త్రీ సంబోధనా పదాలు.

ఇందులో ఆ వనిత నోటితో సమాధానం చెప్పకుండా

సంజ్ఞలతో చమత్కార చేష్టలతో సమాధానమిచ్చింది.


1. ఓ స్త్రీరత్నమా నీపేరు ఏదో చెప్పు?

   - తన ఎడమ కంటిని చూపింది - అంటే ఎడమ కంటిని

     వామ + అక్షి = వామాక్షి అని సంస్కృతంలో.

      కావున ఆమెపేరు వామాక్షి

2. ఓ మదగజగమనా నీ భర్త పేరేమి? -

   -చేతిలోని చిరిగిన వస్త్రం చూపింది.

    అంటే సంస్కృతంలో కుచేలము అంటే

    ఆయన పేరు కుచేలుడు.

3. ఓ వనితా నీకు పిల్లలెందరు?

   - ఆమె చేయెత్తి ఆకాశం చూపింది. -

     అంటే ఆకాశంలోని నక్షత్రాలు.

     మనకు నక్షత్రాలు 27

     (అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి..... మొ.)

     అనగా 27 మంది పిల్లలు.

4. ఓ ఉంగరాల జుత్తుగలదానా నీకులమేది?

   -పంజరంలోని పక్షిని చూపింది - అంటే పక్షిని

    సంస్కృతంలో ద్విజము అంటారు. కావున

    వారు ద్విజులు అంటే బ్రాహ్మణులు

5. మీకు ప్రభువు ఎవరు?

   - గోపకుని చూపింది - అంటే గోపాలుడు - కృష్ణుడు

6. నీభర్త ఉద్యోగమేమి?

   - దండం పెట్టింది. అనగా నమస్కారం చేస్తూ,

     "సీతారామాభ్యాం నమ:" (భిక్షను గ్రహించడం) లేక

     తపస్సు, పూజ చేసుకొని దండం పెట్టడం ఆయన వ్యాపారం.


దీనిలో నోటితో కాకుండా చేతితో సంజ్ఞల

రూపంలో సమాధానం గోప్యం(గూఢం) చేయబడింది

కావున ఇది "కరసంజ్ఞా గోపన చిత్రం."

తథాస్తు

 ఒకానొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి

ప్రసన్నంగా నవ్వుతూ "తథాస్తు" అన్నాడు. 


శిష్యుడు గురువు గారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు. 


" ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షం తో చెప్తుంటే నాకు వినబడి తథాస్తు అన్నాను." 


"ఏమిటా కోరిక గురువు గారూ" 


"తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని." 


"వచ్చే జన్మలోనా" 


"కాదు ఈ జన్మలోనే" 


శిష్యుడు పగలబడి నవ్వాడు, "గురువు గారూ ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ.. అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పనిలేదా? "


" అర్హతకేం నాయనా.. జీవితమంతా ప్రతఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవ రాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా" 


" అవుననుకోండి. కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది"


" ఏమో.. భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు."


ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహా వృక్షం నేలకూలింది. 


శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచి పోయాడు.


సంవత్సరం తరువాత. 


శిష్యుడు పరుగు పరుగున వస్తూ "గురువు గారూ.. ఈ వింత

విన్నారా….శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండీ పధ్నాలుగేళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట!!!" 


గురువు గారు నవ్వి, "చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు. అయింది కదా.." 


"అంటే.." 


అవున్నాయనా… ఆ మహా వృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు.. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో

ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహా వృక్షం పాదరక్షలు గా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. 


శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికివ్వడం, 

భరతుల వారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం జరిగాయి.

ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహా వృక్షం కోరిక నెరవేరింది." అని చెప్పిన గురువు గారికి సాష్టాంగ ప్రణామం 

చేశాడు శిష్యుడు. 


భగవంతుడి లీలలు మనకి అర్ధం కావు.

*గురువాక్కు యొక్కమహత్యం*:



ఒకానొకప్పుడు ఒక గురువు గారు, ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. 


ఇంతలో హఠాత్తుగా గురువుగారు ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ "తథాస్తు" అన్నారు. 


గురువు గారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు శిష్యుడు. 


" ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షం తో చెప్తుంటే నాకు వినబడి తథాస్తు అన్నాను." 


"ఏమిటా కోరిక గురువు గారూ" 


"తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని." 


"వచ్చే జన్మలోనా" 


"కాదు ఈ జన్మలోనే" 


శిష్యుడు పగలబడి నవ్వాడు, "గురువు గారూ ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ.. అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పనిలేదా? "


" అర్హతకేం నాయనా.. జీవితమంతా ప్రతఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవ రాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా" 


" అవుననుకోండి. కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది" అన్నాడు శిష్యుడు.


ఆది విని " ఏమో.. భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు." అన్నారు గురువుగారు.


ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహా వృక్షం నేలకూలింది. 


శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచి పోయాడు.


 " *సరిగ్గా, సంవత్సరం తరువాత..*"


ఒక్కరోజు ఆ శిష్యుడు పరుగు పరుగున వస్తూ "గురువు గారూ.. ఈ వింత విన్నారా…!


శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండీ పధ్నాలుగేళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట!!!" అన్నాడు.


దానికి గురువు గారు నవ్వి, "చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు. ఇప్పుడు అయింది కదా.." అన్నారు.


అంటే..?? అడిగాడు శిష్యుడు.


అవున్నాయనా… ఆ మహా వృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు.. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో

ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహా వృక్షం పాదరక్షలు గా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. 


శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికివ్వడం, 

భరతుల వారు 'పాదుకలకి పట్టాభిషేకం" చేయడం అంతా ఒక్కరోజులో జరిగిపోయింది.


ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహా వృక్షం కోరిక నెరవేరింది." 


అని చెప్పిన గురువు గారికి సాష్టాంగ ప్రణామం చేశాడు ఆ శిష్యుడు. 


" సద్గురువు వాక్కు సత్యం అయ్యి తీరుతుంది"., 


కాదు కాదు, ఆ భగవంతుడే మహాత్ముల నోటినుoచి వచ్చిన మాటలు నిజమయ్యేలాగా సoకల్పిస్తాడు.


ఆ భగవంతుడి లీలలు మనకి అర్ధం కావు..!. 


చెప్తున్న నా కళ్ళు భక్తి పారవశ్యంతో చెమ్మగిల్లాయి.

*రమణ మహర్షి దివ్య బోధ*



🤘మీరు ధనము ఎందుకు సంపాదించాలి అన్నది ఒకసారి మరల గుర్తుకు తెచ్చుకొండి .

ఎవరైన ధనము సంపాదించాలి ,అంటే తన భార్య కొరకు ,పిల్లలకొరకు ,లేదా కుటుంబం కొరకు సంపాదించాలి అంటారు .అది నిజమే ..కాని నీకొరకు సంపాదించాలి అంటే కొంతవరకు మాత్రమే వస్తుంది .అది ప్రకృతి సహజం .అదే ధనము కుటుంబం కోసం సంపాదించాలి అంటే మరికొంత ఎక్కువ వస్తుంది .అదే ధనము ప్రపంచ శ్రేయస్సుకోసం సంపాదించాలి అని అనుకుంటే అనంతమైన సంపదవస్తుంది .


నీ ఆలోచన ఎప్పుడు క్రిందస్థాయిలో ఆలోచించకు ,పై స్థాయిలో ఆలోచించు ,నీ స్టితి మారుతుంది .ఎంతసేపు నీగురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటే ,నిస్తితి మారదు .ఎదుటివారికి సహాయం చేయలని ఆలోచన పెట్టుకో ,నిస్థితి మారుతుంది .ఎందుకు చెపుతున్నాను అంటే ...


నీవు పూర్వ జన్మలో ధనికుడివై ఉండి దానిని వినియోగించడం రాక పాడుచేసి ఉన్నావు .అందుకని నీవు ఈ జన్మలో ధనవంతుడిగా పుట్టలెదు .పూర్వ జన్మలో నీవు ధనముని సద్వినియోగం చేసివుంటే నీకు ఈ విధమైన బాధలు వచ్చివుండేవికాదు .మరి నీవు ఈ జన్మలో ధనవంతుడిగా మరలి అంటే ఏ గుడి ,గోపురం తిరిగితే ధనవంతుడిగా మారవు .ఏ భగవంతుడు నిన్ను మార్చడు .ఎందుకంటే ఈ జన్మలో నీవు ధనములేకుండగా పుడతానికి కారణం ....నీవే .నీకర్మకు బాద్యుడవు నీవే ,అదేవిదంగా నీకర్మను మార్పు చేసుకోవలసినది,నీవే ...🤘


*నీతలరాతను నీవే మార్చుకోవాలి*


*U are the creater of u r own destiny*


         మీ

మురళీమోహన్

🌸 *అసలైన అందం* 🌸



🌹ప్రతి మనిషిలో ఒక అందం ఉంటుంది. ఆ అందానికి మెరుగులు దిద్దేది అలంకారం. 


🌹కానీ నిజమైన అందం అంటే ఇతరులను ఆకర్షించే విధంగా ఉండేది కాదు. అలాగే అలంకారం అంటే శరీరానికి రంగుల మెరుగులు అద్దడం కాదు.


🌹మనిషికి నిజమైన అందాన్ని ఇచ్చేది ఏమిటంటే మాట్లాడే మాటతీరు. 


🌹దానికి మెరుగులు దిద్దడం అంటే మాట్లాడే ప్రతి మాటను ఆలోచించి ఎదుటి వారి మనసును ఆకర్షించే విధంగా మాట్లాడటం. 


🌹అలా ఆలోచించకుండా, అర్థం లేకుండా మాట్లాడడం అంటే "గురి చూడకుండా బాణం వదలడం లాంటిది ".


🌹ఏదైనా ఒక మాట మాట్లాడితే, ఆ మాట మాట్లాడిన తరవాత తిరిగి ఆలోచించాల్సిన అవసరం రానే రాకూడదు. కాబట్టి ఏది మాట్లాడినా ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి.


 🌹నిజానికి మాట్లాడడం ఒక కళ. ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, మాట్లాడాలి అనేది కూడా ఒక అద్భుతమైన విద్య. నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే, అనేక విద్యలు అవలీలగా ఒంట పడతాయి. నోటిని అదుపులో పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ, పద్ధతిగా నడుచు కుంటూ ఉంటే అలాంటి వాడికి ఎక్కడైనా, ఎప్పుడైనా మంచే జరుగుతుంది. 


🌹చెట్టు యొక్క సారం పండులో వ్యక్తం అయినట్లుగా, మనిషి యొక్క సారం అతడి మాటలో తొంగి చూస్తూ ఉండాలి.


🌹ఎవరైతే మంగళ కరమైన మాట తీరును కలిగి ఉంటాడో, అది ఆ మనిషి సంస్కారానికి గీటురాయిగా నిలుస్తుంది.


🌹 ‘తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడ కూడదో తెలుసుకో గలిగినవాడు వివేకవంతుడు’.


🌹 ఎవరైతే తమ మాటల వల్ల, చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించ కుండా ఉంటారో వారే ఉత్తమ పురుషులు.


 🌹ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఆదరణ పూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ


🌹ఆకట్టుకునేలా మాట్లాడటం అనే ఓ కళ. అయితే ఆ మాటలను ఎప్పుడు, ఎలా మొదలు పెట్టాలో, ఎప్పుడు, ఎలా ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ. 


🌹మాటలే మంత్రాలు, మాటలు చురకత్తుల కన్నా చాలా పదునైనవి కనుక వాటిని జాగ్రత్తగా వాడాలి, లేదంటే ఎదుటి వారి సున్నితమైన మనసును మాటల రంపాలతో పరపర కోసినట్లే అవుతుంది. 


🌹ఈ మాటలు అనేవి మనసుపై వత్తిడి తెచ్చేంత బలమైనవి కనుక సున్నితంగా వాడాలి, ఈ మాటలనేవి ఆణి ముత్యాల కన్నా ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి.


🌹మాట్లాడటం అందరూ చేస్తారు. అయితే తను మాట్లాడే మాటలను అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు. 


🌹ఆ మాటలు మరింత ప్రభావ వంతంగా ఉండాలంటే, హృదయాంతరాల్లోని మనసుతో మాట్లాడాలి, అంతేకానీ కేవలం శరీరంలో ఉన్న మామూలు నోటితో కాదు.


🌹మనమాటే మన సంపదలకు మూలం. ఆ సంపదలే మానవ సంబంధాలకు మూలం. మనం మాట్లాడే మాటలే మనకు స్నేహితుల్ని సంపాదించి పెడతాయి, ఆ మాటలే మనకు శత్రువుల్నీ కూడా తయారు చేస్తాయి. 


🌹అందుకే అన్నారు ఎవరినీ 'నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ ' అని అన్నారు. అలాంటి వారికి శత్రువులే ఉండరు. 


🌹కటువైన మాటలు ఇతరుల హృదయాలను గాయపరచ గలవు, అలాగే కమ్మనైన తియ్యటి మాటలు మనసులోని గాయాలను నయం చేయనూగలవు. 


🌹కానీ తియ్యని మాటలతో గొంతులు కోసేవారు కూడా ఉన్నారు. అలాంటి వారి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. మన సరైన మాటతీరు మనల్ని చంపడానికి వచ్చిన శత్రువు యొక్క మనసును కూడా మార్చగలదు


🌹మాటలు, పదాలు అనేవి కమ్మగా వండిన పాయసంలో వేసిన జీడిపప్పు, కిస్మిస్లాగా ఉండాలి. మనం మాట్లాడే మాటల మధ్యలో సందర్భాను సారంగా మనం చెప్పే సామెతలు అనేవి జీడిపప్పు లాగా, మనం చెప్పే లోకోక్తులు పాయసంలోని కిస్మిస్ లాగ అతి మధురమైనవిగా ఉంటూ ఆ మాటల పదాలు, వినేవారికి మరింత మధురంగా, తియ్యగా, కమ్మగా, వినసొంపుగా అనిపిస్తాయి.


🌹ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఈ విషయంలో రామాయణంలో నాయకుడైన పురుషోత్తముడి వంటి శ్రీరామచంద్రుడిని, సుందరకాండకు నాయకుడైన సుందరమూర్తి హనుమంతుడిని మనం ఆదర్శంగా తీసుకావాలి.


🌹మనిషికి హావభావ వ్యక్తీకరణ గొప్ప ఆస్తి. ఏం చెప్పాలి అనేదాని కన్నా, ఎలా చెప్పారనే దాన్నిబట్టి భావ ప్రకటన మరింత ఆకర్షణీయంగా ఉండాలి. 


🌹మన హావభావ వ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటుందో దాని యొక్క ఫలితం కూడా అంత మహత్తరంగా ఉంటుంది.

🌸 *మనసు బుద్ది... మన జీవితంలో...* 🌸

 🍀🌸💖💚🧚‍♀️💚💖🌸🍀


  


   🌸 మన జీవితంలో ధ్యానసాధన మొదలైన తర్వాత ముందు మనసుయొక్క తొందరపాటు తగ్గటం గమనిస్తాము... తరువాత నిమిషానికి అనేకమైన ఆలోచలు చేయటం తగ్గి మనకు కావలసిన దానిమీద దృష్టి సారిస్తo.. ఇప్పుడు సమస్యలు అవకాశాలు గా మార్చటం బుద్ది చేస్తుంది... వీటికి సమయోచితంగా మన అంతర్గత శక్తి( హృదయం) కలుస్తుంది... అంటే మనం మన జీవితాన్ని మన చేతులలోకి తీసుకున్నాం అన్నమాట... ధ్యానసాధన మనకు చేసే మొదటి మేలు అనుకోవచ్చు... అసలు కథ ఇక్కడనుండే మొదలు...


   🌸 మనం ధ్యానం చేస్తున్న కొద్దీ మనలో అనేక మార్పులు చోటు చేసుకుంటు అనేక పాత అలవాట్లను వదిలించుకుంటాం.. ఇక్కడ నుండి భాహ్యమైన స్తితిలో పాత అలవాట్లు, మనం చేసిన బాసలు ఎదురుగా నుంచొని ఏమిటి సంగతి అని సంఘటనల రూపంలో అడుగుతాయి... అప్పుడు తెలియకుండానే ధ్యానంలో మనల్ని మనమే అడగటం జరుగుతుంది... అదే అసలైన మెలి మలుపు.. మన సెల్ఫ్ లేదా స్వయంని నిద్రలేపేస్తాం ధ్యానంద్వారా.. సెల్ఫ్ ఎప్పుడైతే బయటకు వస్తుందో.. అప్పుడు మనసు ఊహ శక్తిగాను... బుద్ది ఇచ్చశక్తిగాను మారిపోతాయి..


   

   🌸 ఈ రెండు కలిసేది ఆత్మ శక్తి ఆద్వర్యంలోనే అంటే సాధన పేరిగిన కొద్దీ సమస్యలు అవకాశాలుగా మార్చటమే కాకుండ వాటిని అనుకూలమైన స్థితికి తీసుకొస్తాయి.. ఇక్కడ సెల్ఫ్ లేదా స్వయానికి మనసు బుద్ధి కాళ్లుగా, చేతులుగా పని చేస్తాయి... మనసు, బుద్ది, సెల్ఫ్ మూడు కలసి మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతయి.. ధ్యానసాధన పెరిగే కొలది భౌతికమైన స్థితులు అన్ని చిన్న విషయాలుగా మార్చేస్తాయి..

మంచి చెడు, లాభం నష్టం అనే చట్రం నుండి బయటకు తీసుకొస్తాయి... ఎప్పుడైతే బయటకు వచ్చమో పూర్తిగా స్వేర్చా జీవితం మొదలు పెడతాం.. 


   🌸 ఇక్కడినుండి మనకు ఎరుక స్తితి ఉనికిలోకి వస్తుంది.. కారణం మనం మంచి చెడులు పట్టించుకోక పోతే మొదట సమాజానికి వ్యతిరేకంగా ఉన్నట్లు కనపడతాం... కానీ మన ధోరణి మారదు.. అందుకే ఎరుక మనల్ని మధ్యేమార్గం లోకి తీసుకువెళ్లే మార్గదర్శి గా దర్శినమిస్తుంది. ఎరుక మొదటినుండి ఉన్నప్పటికీ ఖచ్చితమైన గమనంలోకి వచ్చేది ఇంతకుముందు మనం చేసిన బాసలు నిలబెట్టుకునే క్రమంలోనే... ఎప్పుడైతే శ్వాసను పట్టుకుంటామో అప్పుడే జీవితాన్ని పండుగలా మర్చుంటున్నాం అని అర్ధమవుతుంది...


   *కూసింత శ్వాస కొండంత సంజీవని..*


    Thank you...🌸🌸🌸


🍀🌸💖💚🧚‍♀️💚💖🌸🍀

ఆద్యాత్మిక సాధన

 


ఆద్యాత్మిక సాధన చేసే వారు,  

వారిని వారు పరిశీలించు కుంటూ, 

కావలసిన మార్పులు చేసుకుంటు, 

వారిని వారు సంస్కరించుకుంటారు. 


దీనికి కావలసినది

శ్రద్ద, స్వప్రయత్నం, 

స్వయంక్రమశిక్షణ, స్వయంపరీశీలిన.  


మనకి ఏడూ శక్తి చక్రాలు ఉన్నయి. 

అవి వరసగా 

మూలాధారం, స్వాదిష్టానము, 

మణిపురకం, అనాహతం, 

విశుద్ది, ఆజ్ఞా సహస్రారము.


ఆరు చక్రాల స్థితి బట్టి, ఏడవ చక్రం స్థితి ఉంటుంది. పూర్తిగా ఈ ఆరు చక్రాలు శక్తివంతమైతే, అప్పుడు సహస్రారము శక్తివంతంగా ఉండి. ఆరుచక్రాలలో ఉన్న స్వభావం సహస్రారంలో కనిపిస్తుంది. అలాంటి వారిని Multi dimensional personality అంటాము.


ఈ శక్తి చక్రాలలో, శక్తి నిల్వ సమముగా ఉంటే ఒక లాగా, లేకపోతె ఇంకోలాగా ఉంటాము. 


దిని వల్ల మన శక్తి క్షేత్రాలలో శక్తి నిల్వలు ఏమాత్రం ఉంటాయో తెలుస్తుంది.


1) మూలాధార చక్రము


శక్తి నిల్వ లేక పోతే ఇలా ఉంటుంది


నాకు రక్షణ కావాలి, నా భౌతిక అవసరాలు ఎలా తీరుతాయో ఏమో అన్న భయం భయంగా ఉంటుంది. ఇదే స్వభావంగా ఉంటుంది.

 

శక్తి నిల్వ సమముగా ఉంటే ఇలా ఉంటుంది


నేను సరైన రక్షణలో ఉన్నాను. నా అవసరాలన్నీ చక్కగా సమకూరుతున్నాయి. నాకెలాంటి భయం లేదు' అన్నది స్వభావంగా ఉంటుంది.


2) స్వాదిష్టానము చక్రము


శక్తి నిల్వ లేక పోతే ఇలా ఉంటుంది


నా ఆరోగ్యం బాగుండదు. ఎప్పుడు విచారంగా నెగటివ్ ఆలోచనలతో ఉండడము అన్నది స్వభావంగా ఉంటుంది.


శక్తి నిల్వ సమముగా ఉంటే ఇలా ఉంటుంది 


'ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పంచే స్థితిని ఆహ్వానిస్తాను. వాటిని ఆసాంతం అనుభవిస్తాను' అన్నది స్వభావంగా ఉంటుంది.


3) మణి పురక చక్రము


శక్తి నిల్వ లేక పోతే ఇలా ఉంటుంది


నా వైఫల్యాలలకి బయట వ్యక్తులను బాధ్యత చేస్తాను. నామీద నాకు నియంత్రణ ఉండదు అన్నది స్వభావంగా ఉంటుంది.


శక్తి నిల్వ సమముగా ఉంటే ఇలా ఉంటుంది


నేను చేసే ప్రతి పనికీ నేనే బాధ్యుడను. నన్ను నేను అదుపు చేసుకోగలను' అన్నది స్వభావంగా ఉంటుంది.


4) అనాహతం చక్రము


శక్తి నిల్వ లేక పోతే ఇలా ఉంటుంది


ఎవ్వరిని ప్రేమించలేను, నా చుట్టు ఉన్నవారు నాకు ఎదో ఎదో ఇవ్వాలి అని తాపత్రయం ఉంటుంది. మంచి చెడుల పై నిర్లక్ష్యం ఉంటుంది అన్నది స్వభావంగా ఉంటుంది.


శక్తి నిల్వ సమముగా ఉంటే ఇలా ఉంటుంది


నేను అందరి ప్రేమనూ పొందగలను. నా చుట్టు ఉన్నవారికి ప్రేమను పంచుతాను. మంచి చెడులను ఏకరీతిన జీవితంలోకి ఆహ్వానిస్తాను అన్నది స్వభావంగా ఉంటుంది.


5) విశుద్ది చక్రము


శక్తి నిల్వ లేక పోతే ఇలా ఉంటుంది


ఆలోచనలలో స్పష్టత ఉండదు. గందరగోళంగా ఉంటుంది. చెప్పాలని ఉంటుంది కానీ చెప్పేది ఎదుటి వారికే కాదు, నాకు కూడా అర్థం కాదు అన్నది స్వభావంగా ఉంటుంది.


శక్తి నిల్వ సమముగా ఉంటే ఇలా ఉంటుంది


నేను ఏ విషయాన్నైనా కొత్తగా ఆలోచిస్తాను. దాన్ని నలుగురికీ ఆసక్తి కలిగేలా చెప్పగలను' అన్నది స్వభావంగా ఉంటుంది.


6) ఆజ్ఞా చక్రము


శక్తి నిల్వ లేక పోతే ఇలా ఉంటుంది


అనవసర బ్రమలలో ఉంటాను. అంతర్ సంభాషణని దివ్యాత్మల ప్రభోదం అని ప్రచారం చెయ్యాలి అన్నది స్వభావంగా ఉంటుంది.


శక్తి నిల్వ సమముగా ఉంటే ఇలా ఉంటుంది


అంతర్బుద్దిని, ఊహాశక్తిని పెంచుకొంటాను అన్న స్వభావంగా ఉంటుంది.


ఇలా మన స్వభావాలని గమనిస్తూ ఏ చక్రానికి శక్తి నిల్వ లేదో మనకు మనం పరీక్షించుకోవాలి.


చక్రాలు శుద్ధి చేసుకోవడానికి వేలైనంత వరకు ఉప్పు నీటితో (వేడినీటిలో రాళ్ళ ఉప్పు వేసుకొని) తల స్నానం చేయాలి. 


 ఆ తరువాత గుడ్డతో తుడుచుకోకండా దానంతట అది ఆరిపోవడానికి ఎదురు చూడాలి. 


ఇందువల్ల చక్రాలు శుద్ధి అయి ప్రకాశవంతంగా ఉంటాయి.


వీటికి అంటుకున్న నెగటివ్ వైబ్స్ లోపలికి చొరబడవు.


ఇతరుల దృష్టి మనని చేరదు. (దిష్టి తగిలింది అంటాం కదా) ఆ దిష్టి తగలదు. 


ఇదండీ ఆద్యాత్మిక సాధన.


ఏమంటారు

ఇంద్రియాలు మనసుని అనుసరిస్తాయి.

 మనసు ఇంద్రియాలకి ఆవల ఉంటుంది. అది తలచుకుంటే ఇంద్రియాలని నియంత్రించగలదు. ఇంద్రియాలు మనసుని అనుసరిస్తాయి. కానీ నీవు నీ మనసుని ఇంద్రియాల వెనుక వెళ్ళేలా అనుమతిస్తున్నావు. మనసు ఆవల బుద్ధి ఉంటుంది.. నీ మనసు ఏ పని చేస్తున్నా అక్కడ నీ బుద్ధి ఉండేలా చూడు. అప్పుడు మనసు వినయంగా ఉంటుంది. బుద్ధికి అతీతంగా ఆవల వుండే బ్రహ్మమే పరమ సత్యము. అదే బుద్ధికి మూలము. ఇంద్రియాలు, మనసుకి; మనసు, బుద్ధికి; బుద్ధి, పరమసత్యానికి సమర్పణ చేసుకోవాలి.


అహంకారం అనేదాన్ని సన్న్యసించిన వాని లోపలి నుండి పరమాత్మ మాట్లాడుతూ ఉంటాడు.


జీవితపు పరమ నియమాలలో, మరో నియమం ఏమిటంటే, దృశ్యం అదృశ్యం పైన, పదార్థం పరమాత్మ పైన ఆధారపడి ఉంటాయి.


సత్యం అనేది ఒక గొప్ప అతిధి. దాని కోసం అన్ని తలుపులూ ఎప్పుడూ తెరిచి ఉంచాలి. స్నేహంతో కూడిన శ్రద్ధ, భరోసా, విశ్వాసం లేకుంటే సత్యం గురించి చెప్పినా వినిపించుకోవడం జరుగదు. సత్యం గురించి వినాలి అంటే ఎదురుచూడాలి, వేచి ఉండాలి.


శరీరం మీద దృష్టి ఉన్నప్పుడు, శరీరానికి ఆవల ఉన్న వాటి మీద దృష్టి మరలదు.

*_🌹నేటి మంచిమాట🌹_*



*_మనం అర్ధం చేసుకున్నామనో,_*

*_అర్ధం చేసుకోలేదనో లోకం మారదు...?_*

*_దాని తీరూ మారదు.!_*

*_ఆచరణకి ఒకడుగైనా ముందుకేస్తే,_*

*_ఆ ఆలోచన మొదలెడితే,_*

*_కొండైనా,గోడపై బొమ్మైనా,_*

*_కదిలి నడక మొదలెడుతుంది.._*

*_అడుగుల్లో పడి అనుసరిస్తూ,_*

*_అటో..ఇటో ఏటో వైపుకి అర్ధాన్ని దిద్దుకుంటుంది...._*


*_తీస్తే...._*

*_ప్రతీ మనిషి జీవితం ఒక "బయోపిక్కే"_* 

*_పడ్డ అవమానాలు,_*

*_ఓడిపోయిన ప్రేమలు,_* 

*_కార్చిన కన్నీరు,_*

*_ఎగతాళి చేసే బంధువులు,_*

*_పక్కనే ఉంటూ దెబ్బకొట్టే శత్రువులు,_*

*_కొన్నిగెలుపులు,_*

*_ఎన్నో మలుపులు,_*

*_అతి కొన్ని సంతోషాలు_*

*_పడిపోతూనే పైకి లేచిన క్షణాలు..._*

*_ఎందరో పాత్ర (సూత్ర) దారులు...?_*


*_☘శుభోదయం🌹🦚_*

*_✡సర్వేజనాః సుఖినోభవంతు._*

*_🕉లోకాసమస్తా సుఖినోభవంతు_*   

*_☸శుభమ్ భుయాత్,_* 

*_శుభమస్తు_*.          

🌻🌻🌻🌻🌻

*_....✍️ మీ స్వామి_*

🌹. మంత్ర పుష్పం - భావగానం 🌹*

 *

రచన ✍️. శ్యామలారావు

📚. ప్రసాద్ భరద్వాజ 


హిందూ ఆలయాలలో పూజల చివరిలో పూజారి గారు అక్కడ ఉన్న అందరికి తలో ఒక పుష్పం ఇచ్చి వేదం లోని *మంత్రపుష్పం* చదువు తారు. ఆ తరువాత ఆ పుష్పాలను భక్తుల నుండి స్వీకరించి గర్భగుడి లోని దైవానికి సమర్పిస్తారు . వేదం లో భాగమైనది మంత్ర పుష్పం.

ఇది దైవం గురించి ఆయాన విశిష్టతను తెలుపు తుంది. మంత్ర పుష్పం మొత్తం 34 శ్లోకముల దైవ తత్వ మంత్రరాజము. 


*🌻. మంత్ర పుష్పం - 1*


*ఓం ధాతా పురస్తాద్య ముదా జహార*

*శక్రః ప్రవిద్వాన్ ప్రదిశః చతస్రః*

*తమేవం విద్వానమృతమిహ భవతి*

*నాన్యః పంథా అయనాయ విద్యతే*


*భావ గానం:*

అన్ని దిక్కుల నుండి రక్షించువానినోయి

ముందు బ్రహ్మ పూజించి సుఖించెనోయి

ఆ ఆది దైవమును తెలిసిన చాలునోయి

అదే అందరికి అమృత మార్గమ నోయి

వేరేది లేదని ఇంద్రుడు ప్రకటించె నోయి. 


*🌻. మంత్ర పుష్పం* 2.


 *సహస్ర శీర్షం దేవం*

*విశ్వాక్షం విశ్వశంభువం*

*విశ్వం నారాయణం దేవం*

 *అక్షరం పరమం పదం*


*భావ గానం:* 

అంతటా తలలున్న దేవమోయి

అంతటా కనులున్న దైవమోయి

అన్ని లోకాల శుభ దైవమోయి

విశ్వమంతానిండిన దైవమోయి

నశించని నారాయణుడోయి

ముక్తి నీయు పరంధాముడోయి.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 58 / Sri

Gajanan Maharaj Life History - 58 🌹*

✍️. దాసగణు స్వామి

📚. ప్రసాద్ భరద్వాజ


*🌻. 11వ అధ్యాయము - 6 🌻*


భాస్కరు ఆత్మ తిన్నగా వైకుంఠానికి వెళ్ళిపోయింది అని ఇప్పుడు కాకులకు తెలిసి అవి కోపంగా ఉన్నాయి, అటువంటి వాటి ప్రవర్తనతో, మాకుకూడా మిగిలిన ప్రజలమాదిరి భాస్కరు ప్రసాదం ఇవ్వవలసింది అని తెలియచేయడమే. 


కావున వాటిని బాణాలతో కొట్టకండి, నేను వాటికి చెపుతాను.....ఓకాకులారా నేను చెప్పేది వినండి. రేపటినుండి ఈస్థలానికి మరల రాకండి, ఎందుకంటే దానివల్ల మా భాస్కరు గౌరవం తగ్గించినట్టు అవుతుంది. ఈరోజు తనివితీరా ప్రసాదం తినండి, కానీ రేపటినుండి ఇక్కడికి రాకండి అని శ్రీమహారాజు అన్నారు. 


శ్రీమహారాజు అన్నది విని భక్తులందరూ సంతృప్తి చెందారు, కానీ కొంతమంది నమ్మకంలేనివారు ఇది అంతా ఒక రభస అని హేళణగా అన్నారు. మనుష్యుల ఆజ్ఞలను పక్షులు ఎలా పాటిస్తాయి ? అని వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు అనుకున్నారు. 


మరుసటి రోజు ఆ ప్రదేశానికి శ్రీమహారాజు అన్నమాటల ప్రభావం చూసేందుకు వెళ్ళారు కూడా. అక్కడ ఒక్క కాకి కూడా లేదు. వాళ్ళు ఆశ్ఛర్యపోయి శ్రీమహారాజుకు లొంగిపోయారు. 12 సంవత్సరాలవరకు ఆ స్థలానికి కాకులు తిరిగి రాలేదు. 


14 రోజులు తరువాత తమ మిగిలిన శిష్యులతో శ్రీమహారాజు షేగాం తిరిగి వచ్చారు. ఇప్పుడు మరొక కధ వినండి. ఆ సంవత్సరం దుష్కాలం అవడంవల్ల నీళ్ళకోసం బావి తవ్వడం పని కొనసాగుతోంది. 


సుమారు 10 అడుగులు తవ్వినతరువాత ఒక గట్టి నల్లరాయి తగలడం వల్ల ఇకముందు తవ్వడం అసంభవం అయింది. అందుకని విస్ఫోటకం కోసం గొట్టంలో 4 కన్నాలు చేసారు. ఒకచివరను కన్నంలోకి పోనిచ్చి, విస్ఫోటక సామాగ్రి దానిలో నింపారు. అవిస్ఫోటకాన్ని అంటించడంకోసం చిన్నచిన్న మండుతున్న చెక్కముక్కలను రెండవ చివరనుండి ఆ గొట్టంలోకి జారవిడుస్తారు. 


ఏదో కారణం చేత ఆ చెక్కముక్కలు క్రిందకు వెళ్ళకుండా అడ్డుకున్నాయి. క్రిందనున్న నీరు నెమ్మదిగా ఆవిస్ఫోటకాన్ని చెమ్మ చెయ్యడం మొదలు పెట్టింది. దీనితో ఆవిస్ఫోటకం ఇక పనికిరాకుండా అవుతుంది. ఎవరయినా వెళ్ళి ఆచెక్కముక్కలను గొట్టంలో ముందుకు తోసి పరిస్థితిని కాపాడాలి. 


కానీ ఎవరూ ఆవిధమయిన ప్రమాదమైన పనికి సాహసించడానికి తయారుగాలేరు. గణుజవర్యా అనే పనివాడిని అక్కడ ఉన్న కాంట్రాక్టరు వెంటనే క్రిందికి వెళ్ళమని అంటాడు. అతని బీదరికంవల్ల ఆ ఆజ్ఞ పాటించవలసిందే. అమాయకమైన గొర్రెలను మనం బలి ఇవ్వడం చూస్తాం. 


శ్రీమహారాజు మీద గణుకు అపారమైన విశ్వాసం, కావున ఆయన్ని తలుచుకుని గణు నూతిలోకి వెళ్ళి గొట్టంలో అడ్డుకున్న ఒకదానిని లాగుతాడు. అతను ఇంకొకటి లాగేలోపలే ఆ చెక్కముక్క జారి వెంటనే విస్పోటకం దగ్గరకు చేరింది. మొదటిది ప్రేలుతుంది. గణు నూతిలో ఇరుక్కుపోయాడు. తనని రక్షించవలసిందిగా శ్రీమహారాజును అతను తీవ్రంగా ప్రార్ధించాడు. 


మొత్తం నుయ్యి అంతా పొగతో నిండి పోయింది. రెండవ విస్ఫోటకం అయ్యేలోపల ఒకప్రక్క రాయిని గణు పట్టుకున్నాడు. దానిక్రింద సొరంగంలా ఉంది. గణు వెంటనే దానిలోకి జారిపోయాడు. ఒకదాని తరువాత ఒకటిగా మిగిలిన విస్ఫోటకాలతో చాలా రాళ్ళు బయటకు విసరబడ్డాయి. అక్కడ ఉన్న ప్రజలు గణు కూడా అదే విధంగా ముక్కలు అయిఉంటాడని అనుకున్నారు. 


కాంట్రాక్టరు అతని శరీరం కోసం చుట్టు ప్రక్కల వెతకమని మిగిలిన పనివాళ్ళని అడిగాడు. అదివిని, గణు ఆనూతిలోపలినుండి అరిచాడు. ఓ మి స్త్రీ గణు చనిపోలేదు, నూతిలో క్షేమంగా ఉన్నాడు. శ్రీగజానన్ మహారాజు కృపతో నేను ఒక సొరంగంలో ఉన్నాను. ఒక పెద్దరాయి నేను బయటకు రావడానికి అడ్డంగా ఉంది అని అన్నాడు. 


గణు మాటలు విన్న పనివాళ్ళు చాలా సంతోషించి, క్రిందికి వళ్ళి గునపాలతో ఆరాయిని తొలగించి గణును పైకితీసుకు వచ్చారు. వెంటనే గణు పరుగున శ్రీమహారాజు దగ్గరకు వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించాడు. ఆ సొరంగంలో కూర్చుని ఎన్ని రాళ్ళు నువ్వు బయటకు విసిరావు ? నువ్వు బయటకు రాకుండా అడ్డుపడ్డ ఆపెద్ద రాయే నిన్ను కాపాడింది, భవిష్యత్యులో ఎప్పుడూ కూడా ఇంక ఇటువంటి మండుతున్న గొట్టాలను ఒకసారి అవిక్రిందికి జారినతరువాత ముట్టుకోవడం వంటి సాహసం చెయ్యకు. 


ఒక గొప్పప్రమాదం నుండి నువ్వు రక్షించబడ్డావు, ఇక వెళ్ళు అని శ్రీమహారాజు అన్నారు. ఓ మాహారాజు ఆ విస్ఫోటకాలు ప్రేలినప్పుడు మీరే నాచెయ్య పట్టుకొని సురక్షితంగా ఆ సొరంగంలో పెట్టారు, నన్ను మృత్యవునుండి కాపాడారు అని గణు అన్నాడు. శ్రీమహారాజు గొప్పతనం అటువంటిది, దీనిని వర్ణించడానికి నాదగ్గర మాటలు లేవు. ఈ గజానన్ విజయగ్రంధం భక్తులందరికీ సుఖాన్ని తెచ్చుగాక ఇదే దాసగణు కోరికి. 


 శుభం భవతు 


 11. అధ్యాయము సంపూర్ణము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Gajanan Maharaj Life History - 58 🌹* 

✍️. Swamy Dasaganu 

📚. Prasad Bharadwaj


*🌻 Chapter 11 - part 6 🌻*


Now knowing that Bhaskar's soul has gone straight to heaven, the crows are angry and by such behavior, they only want to say that they too be given the Prasad of Bhaskar as was given to other people. So don't shoot at them. I will tell them. Crows listen to what I say; don't come to this place from tomorrow, as it may lower the prestige of My Bhaskar. 


Eat the prasad today to your heart content and don't come here from tomorrow.” All the devotees were pleased to hear Shri Gajanan Maharaj , but a few nonbelievers were sarcastic and said that it was all nonsense. 


“How can birds obey the orders of human beings?” said they to each other. Next day, they even went to that place to see effect of what Shri Gajanan Maharaj had said. There was not single crow there. 


They were surprised and then surrendered to Shri Gajanan Maharaj . The crows did not visit that place for twelve years.After 14 days Shri Gajanan Maharaj returned to Shegaon with his remaining disciples. 


Now listen to another story. It was a year of famine and so the work of digging a well was going on. Digging of about 10 feet was done and then came up a hard black rock making it impossible to dig further. 


So four holes were made for dynamites, and putting the end of string inside, gunpowder was packed in them. The other ends of the strings were taken up and through them were passed small burning wooden pipes, so that they would slide down and ignite the gunpowder.


Somehow, however, the wooden pipes got stuck on the string knots in between; they were not sliding down and the water in the well was about to enter the gunpowder holes, thereby making it ineffective to explode. Somebody had to go down and push the pipe down to save the situation, but nobody was ready to take such a risk. 


The contractor asked Ganu Lavarya to go down the well immediately. Because of his poverty, Ganu had to obey. It is always seen that a poor sheep is killed as an offering to God. 


Ganu had great faith in Shri Gajanan Maharaj and so, remembering Him, he went down the well and pulled one obstructed pipe, which immediately slid down and touched the gunpowder. Before he could pull another one, the first one exploded. Ganu Lavarya was caught inside the well. 


He fervently prayed to Shri Gajanan Maharaj to save him. The whole well got filled with smoke and before the next dynamite exploded, Ganu got hold of one rock on the side below which there was a cavern. Ganu immediately slid into that cavern. 


One after the other, all the remaining dynamites exploded and a lot of stones were thrown out. People thought that Ganu must have been split into pieces and thrown out. The contractor asked other workers to search for the body around. 


Ganu heard him and shouted from inside the well, “O mistry! Ganu is not dead! He is perfectly alive in the well. By the grace of Shri Gajanan Maharaj, I am safe in a cavern here, but there is a big rock obstructing me from coming out. 


People were rejoiced to hear the voice of Ganu and went down the well. They, removing the stones by spades, brought him up. Ganu at once went running to Shri Gajanan Maharaj and prostrated at His feet. 


Shri Gajanan Maharaj smilingly said, “Ganu, hiding inside the cavern, how many stones have you thrown out? It is the big stone, which obstructed you from coming out, that intact saved you. Don't repeat such feats again in the future and never touch an ignited pipe once it has slid down a string. 


Now go! You have been saved from a great disaster today. When people came to know about Ganu, he said O Maharaj! When the dynamite exploded, it was you who, holding my hand, put me inside that safe cavern and saved me from death. 


Such is the greatness of Maharaj for which I have no words to express 


||SHUBHAM BHAVATU||


 Here ends Chapter Eleven


Continues.... 

🌹 🌹 🌹 🌹 🌹