శుక్రుడు రాక్షసులకు గురువు. భృగు పుత్రుడు, విష్ణుద్వేషి. స్త్రీ గ్రహం. తెలుపు వర్ణాన్ని సూచిస్తాడు. ఋతువు - వసంతం, జాతి -బ్రాహణ, అధి దేవత - ఇంద్రాణి. రుచులలో పులుపుకు ప్రతీక, 7 సంవత్సరాల వయసును సూచిస్తాడు. మనోహర శరీరం, నల్లని జుట్టు, సౌందర్యవంతులకు ప్రతీక. తత్వం-జలతత్వం, దిక్కు - ఆగ్నేయము, రత్నము - వజ్రం, లోహం -వెండి, దిక్బలం చతుర్ధ స్థానం, గుణము -రజోగుణం, ప్రదేశం -కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతం. శుక్రుడు భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ నక్షత్రాలకు అధిపతి. శరీరంలో సంతానోత్పత్తి వ్యవస్థ. వృషభం, తులా రాశులకు ఆధిపత్యం వహిస్తాడు. రవి, చంద్రులు శత్రువులు. శని, బుధులు మిత్రులు. కుజుడు, గురువులు సములు. శుక్ర దశా కాలం 20 సంవత్సరాలు. శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితిని, కన్య రాశిలో నీచ స్థితిని పొందుతాడు.
శుక్రలగ్నం 1 నుంచి 6వ స్థానం వరకు ఆధిపత్యం వహిస్తే శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. శుభానికి అధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఆధిపత్యం వహిస్తే ఆ జాతకులు ఆయుష్మంతంగా జీవిస్తారు. ధైర్యవంతులుగా ఉంటారు. ఇతరులను తమ ఆధీనంలోకి తీసుకుని అధికారం చెలాయించే సామర్థ్యం గలవారుగా ఉంటారు. ఎటువంటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.
శుక్రుడు రెండోస్థానంలో ఉంటే కుటుంబ బాధ్యతలను చేపడతారు. పెద్దలకు మర్యాద ఇవ్వటంలో, కుటుంబ సభ్యులతో ఆనందదాయకంగా గడుపుతారు. విద్యారంగంలో రాణిస్తారు. సాధు స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరులను ఆకర్షించే ఛాయను కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారని జ్యోతిష్కులు చెబుతున్నారు. భాగస్వాముల మధ్య అనుచరులుగా ఉంటారు. మూడో స్థానంలో శుక్రుడు ఆధిపత్యం వహిస్తే గట్టి పట్టుతో ఏ కార్యాన్నైనా సాధిస్తారు. కళలను ఆస్వాదించే వారుగా ఉంటారు. ప్రయాణాలలో ఆసక్తి చూపుతారు. భోజనప్రియులుగా ఉంటారు.
4వ స్థానంలో ఆధిపత్యం వహిస్తే పరిశోధనలో ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు. మంచి స్నేహితుల సహకారం అందుతుంది. 5వ స్థానంలో ఉంటే బుద్ధికుశలత కలిగి ఉంటారు. రాజకీయ ప్రవేశం చేయటం జరుగుతుంది. క్రీడలు వంటి వినోదాత్మక రంగాల్లో ఆసక్తి చూపుతారు. ఆరో స్థానంలో ఆధిపత్యం వహిస్తే జీవితంలో కష్టసుఖాలు సమపాళ్లలో లభిస్తాయి. యోగాలను లభించటం వంటివి జరుగుతాయి. శత్రువుల చెడును ఎదురించే పోరాడగలిగే యోధులుగా ఉంటారు.
శుక్ర కారణ వ్యాధులు
శుక్ర ప్రభావం వల్ల గర్భాశయ వ్యాధులు, మూత్ర పిండ వ్యాధులు, సుఖ వ్యాదులు ఏర్పడతాయి. కుజుడితో కలిసిన గొంతు నొప్పి. టాన్సిల్స్, గొంతు కాన్సర్, గొంతు వాపు మొదలైనవి. బుధుడితో కలిసిన నపుంసకత్వం, చర్మ వ్యాధులు, మధుమేహం, శనితో కలిసిన సుఖ వ్యాధులు, రాహువుతో కలిసిన గర్భ సంబంధిత వ్యాదులు, కేతువుతో కలిసిన సంతాన లేమి మొదలైన వ్యాధులకు శుక్రుడు కారకుడు.
శుక్ర గ్రహ నివారణ కోసం..
శుక్రగ్రహ నివారణ కోసం చేయాల్సిన కార్యక్రమాల్లో ఇది ఒకటి. మేడి చెట్టు శుక్రుని వృక్షము. ప్రతి శుక్రవారం ఉదయం అయిదున్న నుంచి ఆరున్నర లోపు చిన్న రాగి లేదా ఇత్తడి, స్టీల్..(ఇందులో ఏదైనా పర్వలేదు) చెంబు తీసుకుని దానిలో నీటిని పోసి గంధం కలిపి, ఆ నీటిని మేడి చెట్టుకు పోయాలి. అక్కడే దీపం వెలిగించాలి. దానిని పూజించి రావాలి. ఇలా చేసిన రోజు సాయంత్రం తెల్లటి గుడ్డ, అనుమాలు దానం ఇవ్వండి. ఇలా పదహారు వారాలు చేయాలి. ఇలా చేయడం వల్ల వారి శుక్ర దోషానికి పరిహారమగును. నిజానికి మేడి చెట్టు దేవాలయములకు అందుబాటలుఓ ఉంటుంది.
శుక్ర దోష నివారణా క్షేత్రం 'తిరునావలీశ్వరాలయం'
శుక్ర దోష నివారణ క్షేత్రంగా తిరునావలూరులోని తిరునావలీశ్వర ఆలయం ప్రతితి. శుక్రుడంతటి వాడికే శాప విమోచనం కలిగించిన క్షేత్రంగా విశ్వసించటంతో ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా అలరారుతోంది. విల్లుపురం జిల్లాలోని తిరునావలూరులో నెలకొన్న ఈ ఆలయానికి సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. మొదటి పరాంతక చోళుడి కుమారుడు రాజ ఆదిత్యన్ ఈ తిరునావలీశ్వర ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.
ఆలయంలోని మూల విరాట్టుకు భక్త జనేశ్వరుడు, తిరునావలీశ్వరుడు అనే పేర్లు ఉన్నాయి. తమిళంలో తిరు అనేది తెలుగు శ్రీ అనే పదానికి సమానార్థకం కాగా.. నావల్ అంటే నేరేడు చెట్లు అని అర్థం. ఈ ఆలయ ప్రాంగణంలో నేరేడు చెట్లు అధికంగా ఉండటంతో ఆ ప్రాంతానికి తిరునావలూరు అనే పేరు వచ్చినట్లు, ఊరి పేరు ప్రకారమే స్వామివారికి తిరునావలీశ్వరుడుగా పిల్చుకుంటున్నట్లు ప్రతీతి. ఆలయ స్థల వృక్షం కూడా నేరేడు చెట్టే...మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరి పీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి