✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌟. *10. ఇతర ఆధ్యాత్మిక చక్రాలు లేదా ఆరా చక్రాలు (5)*
🟤. *8. ఆరిక్ చక్రా:*
ఇది తలకు 18 అడుగుల ఎత్తులో ఉంటుంది. 8వ ప్రోగు DNA తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ చక్రాశక్తి ద్వారా ఆత్మ యొక్క మిషన్ కంప్లీట్ చేస్తాం. ఇది శరీరంలోని ఏడు చక్రాలతో అనుసంధానమై ఉంటుంది. ఈ చక్రాల ద్వారా దీనిని యాక్టివేట్ చేయవచ్చు.
🟢 *9. భూమి చక్రా:*
కాళ్ళకు అడుగున క్రింది భాగంలో ఉంటుంది. మన కుటుంబలైన్ ను కలిగి ఉంటుంది. తొమ్మిదవ ప్రోగు DNA తో కనెక్ట్ అయి ఈ చక్రం నడుము క్రింద ఉన్న లోయర్ తలాలకు సంబంధించిన చక్రాస్ తోనూ( అతల, వితర, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ చక్రాలు) వాటికి సంబంధించిన అవయవాలతోనూ కనెక్ట్ అయి ఉంటుంది.
ఈ చక్రంలో పూర్వీకుల కర్మలతో కనెక్ట్ చేయబడి ఉంటుంది. దీనిని యాక్టివ్ చేస్తే మిగిలిన చక్రాస్ ని యాక్టివేట్ చేయగలం. ఇది DNA తొమ్మిదవ ప్రోగుతో కనెక్ట్ అయి ఉంటుంది. దీనిని మన *"ఆకాషిక్ రికార్డ్ బ్లూప్రింట్"* అనవచ్చు.
🌞. *10. సూర్య చక్రా:*
మనం ఈ చక్రం ద్వారా మన యొక్క సూర్యుని తో కనెక్ట్ అయి ఉంటాం. ఈ చక్రం సూర్య కాంతి ద్వారా విశ్వ సమాచారాన్ని, శక్తిని మన DNA కి అందజేస్తుంది.
ఇది DNA లో 10వ ప్రోగుతో కనెక్ట్ అయి ఉంటుంది. మన సూర్యుని లాంటి ఎన్నో సూర్యులు విశ్వంలో ఉన్నాయి. వాటన్నింటితో కనెక్ట్ అయ్యేలా ఈ చక్రం చేస్తుంది.
🟣. *11. సోల్ స్టార్ చక్రా:*
ఈ చక్రం పూర్ణాత్మతో అనుసంధానం కలిగి ఉంటుంది.11వ ప్రోగు DNA తో కనెక్ట్ అయి ఉంటుంది. విశ్వంలోని అన్ని గెలాక్సీల జ్ఞానాన్ని అందజేస్తుంది.
🔵. *12. కాస్మిక్ స్టార్ చక్రా:*
దీనిని *"విశ్వ చక్రం"* అంటారు. ఇది విశ్వం యొక్క గుండె చక్రం. అన్ని సూర్యులకు *"సెంట్రల్ సన్ (ప్రధాన సూర్యుడు)"* ఒకరు ఉంటారు. వారితో మనల్ని కనెక్ట్ చేస్తుంది.
ఈ చక్రం DNA లోని 12వ ప్రోగుతో కనెక్ట్ అయి ఉంటుంది. విశ్వం యొక్క మూల చైతన్యం యొక్క సమాచారం ఎప్పటికప్పుడు మన DNA లోకి అందిస్తుంది.
ఆ విధంగా మనం కూడా ప్రకాశించేలా చేస్తుంది. ఈ 12 చక్రాలు, 12ప్రోగులు, 12 లోకాలతో, 12 సంభావ్యతలతో ,12 కొలతలు ( జ్యామితి గ్రిడ్లు)తో కనెక్ట్ అయి మనల్ని మల్టీ డైమెన్షనల్ బీయింగ్ (ఆత్మ) గా మార్చుతుంది.
సశేషం.....
🌹🌹🌹🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి