దశిక రాము**
**మన సంస్కృతి సాంప్రదాయాలు**
మీరు కాశి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళారా? వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి.
కాకపోతే ఈ ఆలయం వేళలు ఉదయం 4:30 నుండి 8:30 వరకు మాత్రమే. కేవలం నాలుగు గంటలు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. తరువాత మూసేస్తారు. ఎందుకని అనేగా మీ సందేహం!
అమ్మవారు ఆ వారణాసి గ్రామదేవత. చీకటి పడింది మొదలు ఉదయం 3:30 వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తుంది. అందువలన అమ్మవారి ఆలయంలో 4 గంటల పాటు పూజ చేసి క్రింద రెండు కన్నాల లో నుండి దర్శనం ఇస్తారు. ఒక కన్నం లో నుండి చూస్తే అమ్మవారి ముఖ భాగం, రెండవ కన్నం లో నుండి చూస్తే పాదాలు దర్శనం ఉంటుంది.
అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ హారతి ఇచ్చేసి సెల్లార్ లో నుండి బయటికి వచ్చేస్తాడు. ఆ తరువాత ఆ కన్నాల లో నుండి దర్శనానికి అనుమతి ఇస్తారు. మొన్నీమధ్య జరిగిన ఓ సంఘటన ఇక్కడ చెప్పుకోవాలి.
క్రొత్తగా పెళ్ళైన జంట కొన్ని నెలల క్రితం అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ వారణాసి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించారు. పూజారి ఎప్పటిలాగే కన్నంలో నుండి చూడమని చెబితే వినలేదు. పైపెచ్చు మూర్ఖపు వాదనకి దిగారు. అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుంది! భక్తులని చూడనివ్వదు! అంటే
కాదు నాయనా! శాంత కళ, ఉగ్ర కళ అని రెండు ఉంటాయి. శాంత కళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. ఉగ్ర కళ అంటే దుష్ట సంహరార్థం ఎత్తిన అవతారం. ఆ కళ ని సామాన్యులు తట్టుకోలేరు. నేను వెళితేనే ఆ కళ తట్టుకోలేక త్వరగా ముగించి వచ్చేస్తాను.
సూర్యుడిని ఉదయం చూసినట్లు మధ్యాహ్నం చూడలేము. ఉదయం ఉన్నది ఆ సూర్యుడే. మధ్యాహ్నం ఉన్నది ఆ సూర్యుడే కదా అని చూస్తాను అంటే సాధ్యమేనా! కళ్ళు టపాసుల్లా పేల్లిపోతాయ్. దృష్టి పోతుంది. అలాంటిది దుష్ట శిక్షనార్థం ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు. చూడకూడదు. అని ఎంతో శ్రద్దగా చేబియే వినకుండా చూడనివ్వకపొతే కోర్ట్ కి వెళ్లి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకుంటాం. అని మొండి పట్టుపట్టారు. దీంతో పోయే కాలం వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది ప్రవర్తన అని సెల్లార్ లో ఉన్న అమ్మవారి వద్దకి ఆ కొత్త జంటని తీసుకెళ్ళాడు. క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చే లోపు ఇద్దరు కిందపడి మరణించారు.
ఈ మధ్య చాలామందిలో ఈ మొండితనం ఎక్కువైంది. శాస్త్రాలు ఇలా చెప్పాయి అంటే అలా ఎందుకు చెప్పాలి? మేము కోర్ట్ కి వెళ్లి వ్యతిరేకంగా తెచ్చుకుంటాం అంటున్నారు. దీనివలన ఎవరికీ నష్టం? మీతో పాటు మీవంశ నాశనం కూడ చేతులారా తెచ్చుకున్నట్లే.. మీవల్ల కేవలం మీవల్ల మీ వంశాలు తరతరాలు నాశనం అవుతున్నాయి. దుఃఖాల పాలై కష్టాల కడలిలో మునిగిపోతున్నారు. ఆనాడంటే జాతకాలు చూసి పూర్వికులు ఏమి చేయడం వలన ఏమి జరిగితుందో చెప్పేవారు. ఈనాడు అలాంటి జాతకాలు చూసి చెప్పేవారు లేరు. దీనివలన మూర్ఖత్వం ఎక్కువై పైశాచికంగా మారిపోతున్నారు. సమాజం మీద ద్వేషం పెంచుకుంటున్నారు. ఇది మీకు కాని మీ వంశానికి కాని మంచిది కాదు.
శాస్త్రం ఇలా చెప్పింది అంటే ఆలానే చేయాలి. ఎదురెళితే నష్టపోయేది మీరే మీ వంశంలోని వారే. దుష్టశక్తులను అంతం చేయాలంటే శాంతంగా ఉంటే దుష్టశక్తులు ఊరుకుంటాయా? మీరు శాంతంగా ఉన్నారు కాబట్టి మేము శాంతంగా ఉంటాం అంటాయా? ఇంకా రెచ్చిపోతాయి.
ఈ ఉగ్రవారాహి అమ్మవారిని పూజిస్తే దుష్టశక్తుల బెడద ఉండదు. ఎవరైనా దుష్ట ప్రయోగాలు మీమీద చేసినా వారికే బెడిసి కొడతాయి. కోర్ట్ కేసులు సమసిపోతాయి. అని శాస్త్రం.
🙏🙏🙏
సేకరణ
*ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి