17, అక్టోబర్ 2026, శనివారం

శ్రీల ప్రభుపాద ఉవాచ!

 శ్రీల ప్రభుపాద ఉవాచ!

🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

మృత్యుర్జన్మవతాం వీర

దేహేన సహ జాయతే ।

అద్య వాబ్ద-శతాంతే వా

మృత్యుర్వై ప్రాణినాం ధ్రువః ॥


అనువాదం:


ఓ మహావీరా! జన్మించిన ప్రతి జీవి తప్పకుండా మరణిస్తాడు. శరీరంతో పాటు మరణం కూడా పుడుతుంది. ఈరోజే కావచ్చు, వంద సంవత్సరాల తరువాత కావచ్చు—కానీ ప్రతి ప్రాణికీ మరణం అనివార్యం.


వసుదేవుడు కంసునికి ఒక గొప్ప సత్యాన్ని తెలియజేయాలనుకున్నాడు. మరణభయంతో ఒక  స్త్రీ అని కూడా చూడకుండా చంపాలని ప్రయత్నించడం వల్ల మరణాన్ని తప్పించుకోలేవని అతనికి బోధించాడు. మరణం అనివార్యమైనప్పుడు, తన కీర్తికీ తన వంశ ప్రతిష్ఠకీ మచ్చ తెచ్చే పాపకార్యాలు ఎందుకు చేయాలి?


భగవద్గీత (2.27)లో శ్రీకృష్ణుడు కూడా ఇలా ఉపదేశిస్తున్నాడు:


జాతస్య హి ధ్రువో మృత్యుర్

ధ్రువం జన్మ మృతస్య చ ।

తస్మాదపరిహార్యేఽర్థే

న త్వం శోచితుమర్హసి ॥


“జన్మించినవారికి మరణం నిశ్చయం; మరణించినవారికి మళ్లీ జన్మ నిశ్చయం. కాబట్టి తప్పించుకోలేని విషయాల కోసం శోకించకూడదు.”


అందువల్ల మనిషి మరణానికి భయపడకూడదు. బదులుగా, తదుపరి గమ్యానికి తనను తాను సిద్ధం చేసుకోవాలి. ఈ అమూల్యమైన మానవజన్మను జనన-మరణ చక్రాన్ని శాశ్వతంగా ముగించుకునేలా వినియోగించుకోవాలి. మరణాన్ని తప్పించుకోవాలనే భయంతో పాపకార్యాలలో చిక్కుకోవడం ఎన్నటికీ శ్రేయస్కరం కాదు.


(— శ్రీమద్భాగవతం 10.1.38)


హరే కృష్ణ 🙏

ఎల్లప్పుడూ మీ శ్రేయోభిలాషి

ముసుగులు లేని కవిత్వం

 ముసుగులు లేని కవిత్వం.. అకాలం.. సత్యభాస్కర్ కవిత్వం!!


అకాలం


సత్య భాస్కర్




 :జీవితమంతా వామపక్ష ఉద్యమాలకు అంకితమైన కామ్రేడ్... ఇక కొత్తతరానికి వారసత్వాన్ని అందిస్తున్నాడు. బాల్యన్ని.. యవ్వనం లో మోసిన అభ్యుదయాన్ని గుర్తుచేసుకుంటున్నాడు. తమ తరం చేసిన త్యాగాలను పోరును ప్రజల పక్షాన నిలిచిన తీరును కవిత్వం చేసాడు. తమ వ్యక్తిత్వం.. ఎర్ర జెండా స్వప్నలను నేటి తరం గుర్తిస్తుందా? అని ఆవేదన చెందుతూనే కొత్త తరం చూపే ధిక్కార స్వరాలను విని భవిత ఫై మరో స్వేచ్చా ప్రపంచం ఫై విశ్వాసం కుదురుతుంది. పేద ధనిక... పాలకులు పాలితులు.. యజమాని కార్మికుడు... మధ్య ఉండే వ్యత్యాసాల పట్ల ఆగ్రహం మార్పు కోసం ప్రగతిశీల భావనలు కవిత్వం లో ఒదిగాయి.. నగరం ఓ మాయా లోకమంటాడు కవి.. మహిళలకు రక్షణ లేదంటాడు... ఎర్ర కళ్ళ జోడు తీసేసి ప్రకృతి.. కాలం.. మృత్యువు.. లపై కవి స్పందించాడు.. సత్యభాస్కర్ ప్రగతి శీల కవి. కేవలం రచనలే కాకుండా ప్రజా.. సాహితీ ఉద్యమాలను నడిపిన కామ్రేడ్.. ఆయన ఓ నాయకుడు సాహితీ ఉద్యమ దళపతి.. అకాలం -స్వీయ కవిత్వాన్ని విలువరించాడు.. 40కవితలు ఈ పుస్తకం లో ఉన్నాయి. కవి స్పందించే తన సుకుమార హృదయాన్ని తన చేతులారా కలం తో గాయం చేసుకుంటున్నాడు. (పేజీ 14)–అని ఆవేదన చెందాడు. దీప స్తంబాల్లా వాళ్ళ జ్ఞానం మనకు వెలుగై మార్గదర్శకత్వం వహిస్తూనే ఉంటుంది (పేజీ 26)-అని ఆశ పడతాడు కవి.. నేటి తరం పాత తరం బాటలో నడవాలని కవి ఆశ... నోరెత్తి అడిగే వాళ్ళను వేటాడి వదించాల్సిందే (పేజీ 35).. లోకం పోకడపై కవి ఆగ్రహిస్తాడు. వసంతాన్ని రెండు చేతులా ఎందుకు ఆహ్వానించలేం (పేజీ 83)–ప్రకృతికి దూరం అవుతున్నామని కవి బాధను వ్యక్తం చేస్తున్నాడు.. చివరి రోజున తన కౌగిలిలో తీసుకున్న ఆ అభమాని మృత్యుదేవత కాదు కదా!? (పేజీ 40)..ఇలా వామపక్ష భావాలతో పాటు ఏ ముసుగులు లేకుండా జీవన సత్యాలను అన్వేషంచాడు కవి సత్యభాస్కర్!!




పుస్తక ప్రతుల కోసం కింది నెంబర్ ని సంప్రదించండి


+91 98483 91638

ముసుగులు

👉@#మిత్రులారా అందరి ముసుగులు తొలగిపోయాయి,, నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ లో బహిరంగంగానే చెప్పారు,, సుప్రీం కోర్టులో ఉగ్రవాదులకోసం వాదించే ప్రశాంత్ భూషణ్,, తుకుడే తుకుడే గ్యాంగ్ ల మద్దత్తు దారు జెస్ట్ అస్కింగ్ ప్రకాష్ రాజ్,CJP అభిజిత్ డిప్కే,, jnu బ్రాండ్ అర్బన్ నక్సల్ నేహా బోరా,, ఇక ఈ దేశంలో పార్లమెంట్ ప్రజాస్వామ్యం పనికిరాదు, వీధి పోరాటాల తోనే అధికారం లొకి రావాలి అని చెప్పే యోగింద్ర యాదవ్,,


1. దేశ వ్యతిరేక శక్తుల బహిరంగ ప్రచారం & నేతల వ్యాఖ్యలు

​దాగుడుమూతలు బంద్,, ఇప్పటివరకు ముసుగులో పనిచేసిన దేశ వ్యతిరేక శక్తులు ఇప్పుడు బహిరంగంగా మైదానంలోకి వచ్చాయి,,ఈ యోగేంద్ర యాదవ్ ఒకప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారికి సలహా దారు 

​ప్రశాంత్ భూషణ్: దేశంలో విప్లవం, రక్తపాతం అవసరమని ప్రశాంత్ భూషణ్ అంటాడు, ​యోగేంద్ర యాదవ్: దేశం ఇకపై పార్లమెంట్ నుంచి కాకుండా, వీధుల నుంచే నడుస్తుందని యోగేంద్ర యాదవ్ ఇదివరకే వ్యాఖ్యానించాడు 


​ధ్రువ్ రాఠీ,,జర్మనీ నుంచి భారత్ వ్యతిరేక ప్రచారం చేసే ధ్రువ్ రాఠీ ప్రస్తుతం భారత్‌కు వచ్చారని, "బాలీవుడ్,, నటులు పోలీసులు, సైన్యం వీధుల్లోకి వస్తే ప్రభుత్వం ఏం చేయగలదు?" అని సవాలు విసురుతున్నాడు 


​నేహా బోరా (AISHA) CPI(ML) విద్యార్థి విభాగం 'ఐషా' (AISHA) అధ్యక్షురాలు, రాహుల్ గాంధీకి అత్యంత ప్రియమైన నేత అయిన నేహా బోరా.. "బాంగ్లాదేశ్‌లో జరిగింది మనకు ఆదర్శం, భారత్‌లో కూడా అదే జరగాలి" అని అంటోందని చెప్పారు.


​2. రాజ్యాంగ వ్యవస్థలపై దాడి & ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాలు

​రాహుల్ గాంధీ వైఖరి,,] సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే పేరుతో రాహుల్ గాంధీ జన సమూహంతో దాడి తరహాలో వెళ్ళింది చూసాము అక్కడ తన పార్టీ కర్ణాటక ముఖ్యమంత్రిని పక్కకు నెట్టి, నేహా బోరా మరియు ప్రియాంకా వాద్రాల భుజాలపై చేతులు వేసి నడిచింది చూసాము 


​అరాచకత్వం పెరిగింది,, వీరికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం పోయింది .. వీధుల్లో అరాచకం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు 


​చట్టం అమలు సవాలు,,వీధుల్లో పోలీసులపై దాడులు జరగడం, వాటిని వీడియోలు తీసి వైరల్ చేయడం ఆగిపోవాలని, ప్రభుత్వం కఠినంగా చట్టాన్ని అమలు చేయాల్సిన సమయం వచ్చింది 


​మాజీ DGP విక్రమ్ సింగ్ వ్యాఖ్యలు,,UP మాజీ డీజీపీ డాక్టర్ విక్రమ్ సింగ్ "వీరికి సరిగ్గా బుద్ధి చెప్పలేదు" (లాతోం కే భాత్ సే నహీ మాన్తే)., ఈ పరిస్థితుల్లో ఆయన చెప్పిన మాటలే సరైనవి 


​సమాజ బాధ్యత : ----

అశుతోష్ రాంఖ , సౌరవ్ దాస్ వంటి వారిని అరెస్టు చేసినప్పటికీ సరైన సంకేతం ఇంకా వెళ్లలేదని, దేశ వ్యతిరేకులను ఎక్కడ చూసినా "మీరు దేశ వ్యతిరేకులు" అని నిలదీసి (Confront) సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది 


​3. విదేశీ నిధులు & కుట్రలు

​విదేశీ ఫండింగ్,,సౌరవ్ దాస్ వంటి వారికి అమెరికా నుంచి నిధులు అందుతున్నాయని ఓ అమెరికన్ సింగర్ బహిర్గతం చేసింది చూసాం 


​పాకిస్తాన్ సంబంధాలలు,,'ఆపరేషన్ సింధూర్' సమయంలో పాకిస్తాన్ అధికారి నుంచి డబ్బులు తీసుకుని వీడియోలు చేసిన ఒక యూట్యూబర్ పట్టుబడ్డాడు .


ఇప్పుడు ప్రజల ​స్పష్టమైన ఎంపిక ప్రస్తుతం భారతీయుల ముందు రెండే మార్గాలు ఉన్నాయి,,ఒకటి దేశానికి మద్దతు ఇవ్వడం, లేదా దేశ వ్యతిరేకులతో నిలబడటం. ఇందులో మధ్యస్థం లా గోడమీద పిల్లి లా చూస్తూ ఉండకూడదు..


​4. చరిత్ర పాఠాలు & అంతర్గత శత్రువులు

​తక్కువ సంఖ్యను తేలికగా తీసుకోవద్దు,, ఈ దేశం పై ముస్లిం దండయాత్రకులు, మొఘలులు, ఆంగ్లేయులు చాలా తక్కువ సంఖ్యలో వేలలోనే వచ్చి వెయ్యేళ్లు పాలించారు,,దేశద్రోహుల సంఖ్య తక్కువగా ఉందని నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు.

​సీతారాం ఏచూరి వ్యాఖ్య,, 2024 ఎన్నికల తర్వాత సీతారాం ఏచూరి స్పందిస్తూ "మాకు ఎంపీలు, ఎమ్మెల్యేలు లేకపోయినా దేశంలో నడిచే ఉద్యమాలు, వాటి 'నరేటివ్' మా వామపక్ష భావజాలo తో (కథనం) మేమే నిర్ణయిస్తాం" అన్నారు..


కోట ​లోపలి నుంచే తలుపులు తెరుచుకుంటాయి,, శత్రువు లోపలికి రావడానికి లోపల ఉన్నవారే తలుపులు తెరుస్తారు,, ఇది చరిత్ర చెప్పే పాఠం, ఇప్పుడు , అటువంటి వారిని ముందుగా గుర్తించాలి 


​5. చాణక్య నీతి & శ్రీకృష్ణుడి భగవద్గీతా సూత్రం :---

​ఆచార్య చాణక్య,,"శత్రువుకు ఒక అవకాశం ఇవ్వవచ్చు, మిత్రుడికి రెండు అవకాశాలు ఇవ్వవచ్చు.. కానీ దేశద్రోహికి,,ఏ ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదు" అని చాణక్యుడు చెప్పింది గుర్తు తెచ్చుకోవాలి,.


​మహాభారతంలో శ్రీకృష్ణుడు:------

భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకోవాలి 

​"క్రూరమైన, అధర్మ శక్తులు సత్యం మరియు ధర్మాన్ని నాశనం చేయడానికి తెగబడినప్పుడు.. కేవలం నైతికతల గురించి మాట్లాడటం అర్థరహితం. అక్కడ ముఖ్యమైనది విజయo కేవలం విజయo మాత్రమే 


​కలియుగ సవాలు:----------

 కలియుగంలో ఈ పరిస్థితులు మరింత క్లిష్టంగా మారతాయని కృష్ణుడు ముందే చెప్పారని, నేడు మన ముందున్న పరిస్థితి కూడా అదేనని తెలిపారు.


​6. అంతర్జాతీయ కుట్రలు & ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్

​గ్లోబల్ కుట్ర,,భారత్‌ను బాంగ్లాదేశ్ లేదా నేపాల్ లాగా మార్చాలని చూస్తున్నారు,,ఇతర దేశాలు భారత్ బలపడటం ఇష్టం లేక చూస్తూ ఊరుకుంటున్నాయి .


​అమెరికా పాత్ర:-------

అమెరికా లో ఒక మంత్రి పేరు గుర్తుకు రావడం లేదు ఓపెన్ స్టేట్మెంట్ "మేము చైనా విషయంలో తప్పు చేశాం, భారత్‌ను చైనాలా ఎదగనివ్వం" అని అన్నారు,. బాంగ్లాదేశ్‌లో షేక్ హసీనాను దించినట్లే, భారత్‌ను కూడా అస్థిరపరచాలని చూస్తున్నారు 


​ఫేక్ నరేటివ్స్ (ఓటర్ లిస్ట్ వివాదం),, US,, యూరప్ విదేశీ మీడియాలో "భారత్‌లో 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారు" అని అబద్ధ ప్రచారం చేస్తున్నారని, కానీ మరణించినవారు, వలస వెళ్లినవారి వివరాలను చెప్పకుండా విషప్రచారం చేస్తున్నారు 

​

ఇది ఏ ఒక్క నాయకుడు లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం కాదు,, దేశ అస్తిత్వం, సంస్కృతి, ఆత్మపై జరుగుతున్న దాడి. ఈ అబద్ధాల నెట్‌వర్క్‌ను, వారి అసలు ఉద్దేశాలను ప్రజల ముందు ఉంచి ముసుగు తొలగించడమే మన ముందున్న ఏకైక మార్గం..


🙏🌹మిత్రులారా దేశం లో కొందరిని చూస్తుంటే పౌరుల ప్రాధమిక హక్కులు, పత్రికా స్వేచ్ఛ కొద్దిగా ఎక్కువ అయిందేమో అనిపిస్తుంది,, ప్రకాష్ రాజ్ లాంటి వాడు తనకు నాలుగు చోట్ల ఓట్లు ఉన్నాయి అని బయట పడి కేసులు బుక్ అయి, ప్రస్తుతం బెయిల్ పై ఉన్న అతను కూడ ఎలక్షన్ కమిషన్ గురించి నోటికొచ్చినట్టు వాగుతున్నాడు,, ఒకసారి దేశలో ఏమార్జెన్సి విధించి 1975-77 లో స్వర్గీయ ఇందిరా గాంధీ గారు విధించినట్టు విధించి నియత్రుత్వం,,ఎలా ఉంటుందో రుచి చూస్తే అప్పుడు స్వేచ్ఛ యొక్క విలువ తెలుస్తుంది. నేను స్వయంగా ఏమర్జెన్సి భాదితుణ్ణి ఆ పోలీస్ హింస జైలు జీవితం అనుభవంతో చెపుతున్న.

    

             🙏🌹భారత్ మాతాకీ జై 🇮🇳🚩

దేవీ త్రిరాత్ర వ్రతదీక్ష....

దేవీ త్రిరాత్ర వ్రతదీక్ష.... 


 అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత పవిత్రమైనవి. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు జగన్మాతను తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. భక్తితో అమ్మవారిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.


త్రిరాత్ర వ్రతం అంటే ఏమిటి?


తొమ్మిది రోజుల పాటు నవరాత్రి వ్రతం ఆచరించలేనివారు సప్తమి, అష్టమి, నవమి మూడు రోజులు అమ్మవారిని పూజిస్తారు.

 ఈ మూడు రోజుల దీక్షనే దేవీ త్రిరాత్ర వ్రతము అంటారు.


దుర్గాష్టమి:

 అమ్మవారికి కుంకుమార్చన, సహస్రనామ పూజ, లలితా సహస్రనామ పారాయణం చేస్తారు.


మహానవమి:

 అమ్మవారిని విశేషంగా పూజించి, ఆయుధ పూజ నిర్వహిస్తారు.


విజయదశమి

 జమ్మి చెట్టుకు పూజ చేసి, శమీ పూజ లేదా అపరాజిత పూజ చేస్తారు.


ఈ నవరాత్రుల్లో నిత్య పూజలు, నైవేద్యాలు, కుంకుమార్చనలు, పుష్పాలంకరణలు, కుమారీ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. చిన్నపిల్లలకు పప్పు బెల్లాలు, శనగలు పంచి, ముత్తైదువులకు పసుపు కుంకుమలతో తాంబూలం అందిస్తారు.


శ్రీ మహాకాళీ – 

మహాలక్ష్మీ – 

మహాసరస్వతీ దేవతల అనుగ్రహం అందరికీ కలగాలి....


ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః*


  సమస్త లోకాః సుఖినో భవంతు ...

శ్రీ సద్గురు పీఠం.... .✍️

భారత ప్రస్తుత ఘన చరిత్ర 3*

 *


సభ్యులకు నమస్కారములు 


ఈ దేశం ఇంకా పురోగమించాలి. ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, పురోగమనంతో బాటు దేశంలోని సాంస్కృతిక, సాంప్రదాయ, శాంత, సౌజన్య మరియు సహకార స్వభావాలు కూడా పరిరక్షింపబడాలి మరియు పెంపొందాలి. భారతీయ ప్రాచీన శాస్త్రవిజ్ఞాన సంపద అధ్యయన, పరిశోధన *ప్రయోజనాల రూపంలో విస్తరించాలి*. పాఠ్య పుస్తకాల ప్రణాళికలు మారాలి. దేశ ఘన చరిత్రను, హైందవ మహనీయుల మరియు మహా వీరుల చరిత్రలను నేటితరం/బాల/ యువతరం తెలుసుకునేలా చేయాలి. అవినీతిని, అరాచకాలను రూపుమాపాలి. *ఇందుకు ప్రజలు, అధికారులు, నాయకులు సహకరించాలి*. ఈలాంటి ఎన్నో లక్ష్యాలు నెరవేరాలంటే *ప్రస్తుత ప్రధాన మంత్రి లాంటి వ్యక్తి పదికాలాల పాటు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశ ప్రేమికులైన ప్రతి ఒక్కరు కోరుకోవాలి*.


అన్నింటికి మించి ఒక యోగికి ఉండవలసిన స్థితప్రజ్ఞత, ఆధ్యాత్మిక దృష్టి, ధర్మ స్పృహ మెండుగా ఉండడం గొప్ప ఘనతగా ప్రపంచ నాయకులందరికి గోచరిస్తున్నది. *ప్రస్తుత భారత దేశ ప్రధాని* యొక్క నిస్వార్థమైన ఈ లక్షణం ఒక రాజ యోగిగానో, రాజర్షి గానో అభివర్ణించేలా చేస్తోంది. 


ఈలాంటి నాయకుని పాలనను అనుభవిస్తూ, కనిపిస్తున్న సత్యాన్ని స్పష్టంగా తోటివారికి చెప్పకుంటే నిస్సందేహంగా అది దోషమే అవుతుంది. *ఇది ఒక పార్టీకో, ఒక రాజకీయ సంస్థకో చెందిన అంశం కాదు. దేశంపై, ధర్మంపై అభిమానమున్న ప్రతి వ్యక్తి కర్తవ్యం, యావత్ భారత దేశ ప్రజల కర్తవ్యం*.


దేశాన్ని అల్లకల్లోలం చేయాలని, అధిక జనుల అభిమానమున్న బలవంతమైన ప్రభుత్వాన్ని చికాకు పర్చాలని, ఉద్యమాల పేరిట అనేక శక్తులు ఏకమవుతున్నాయి... *ఇక్కడే ఉంటూ, ఇక్కడే తింటూ భారత దేశాన్ని, హైందవత్వాన్ని నిందించడం*.. ఇందులో ఎందరో దేశద్రోహులు, నేరగాళ్లు. తస్మాత్ జాగ్రత్త.


రంధ్రాన్వేషణలు లేవు, నిందారోపణలు లేవు. వ్యక్తుల నామధేయాలు లేవు, పార్టీల ప్రస్తావనలు లేకుండా కూర్చబడిన రచన. ఇది ప్రస్తుత భారత దేశ నగ్న దృశ్యము.


ధన్యవాదములు

🙏🙏🙏

హోమియోపతి వైద్యం కొరకు

 ఆన్లైన్లో హోమియోపతి వైద్యం కొరకు సంప్రదించండి దీర్ఘకాల రోగములకు చక్కటి చికిత్స కలదు 




తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలలో ఏ భాషలోనైనా డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు.




మీ సమస్యని తెలుపుకొని చికిత్స తీసుకోగలరు.




మందులు మీ ఇంటికి ఆన్లైన్లో కొరియర్ ద్వారా పంపించబడును.


మందులు భారతదేశము మొత్తము ఆన్లైన్లో పంపించబడును.


వివరాలకు క్రింద పేర్కొన్న నెంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు . 




మీ పేరు, వయస్సు, లింగము మీ చిరునామా ముందుగా , ఇంగ్లీషులో పేర్కొని


తరువాత మీ సమస్యను క్లుప్తంగా వివరించండి మీరు పైన పేర్కొన్న ఏ భాషలో నాయనా డాక్టర్ గారి ని సంప్రదించవచ్చు తరువాత డాక్టర్ గారే మీకు ఫోను చేసి మీతో మాట్లాడగలరు.


 స్త్రీల రోగముల నిపుణురాలు


WhatsApp No. 9035231905

చెవిలొ చిల్లు బడిన చెవి

  చెవిలొ చిల్లు బడిన చెవి

చీము రక్తమూ

చెవిలొ శబ్దమైన చెవిని నొప్పి

ఆపరేష ననక నాదుకొను హోమియో

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: చెవి నుంచి దుర్వాసనతో నీరు, చీము, రక్తం లేదా నాడి కారుతున్నా, దురద పెడుతూ, చెవిలో నొప్పి, పోటు వస్తున్నా, విపరీతమైన శబ్దము చెవుల నుంచి వినిపిస్తున్నా, క్రమంగా చెవుడు ప్రవేశిస్తున్నా, అనవసరంగా ఇంగ్లీష్ స్పెషలిస్టుల చుట్టూ తిరుగుతూ, వాళ్ళు చెప్పినట్లు లేనిపోని ఆపరేషన్లు చేయించుకుంటూ, చెవిలోకి చుక్కల మందులు, ఏంటీబయోటిక్కులూ వాడేస్తూ, ఉన్న చెవులనూ, ఆరోగ్యాన్నీ పాడుచేసుకోవద్దు! మంచి హోమియో డాక్టర్ సహాయంతో, తియ్యని హోమియో బిళ్ళలతో మీ చెవులలో వచ్చే రంద్రాలను ఏ ఆపరేషన్లూ చేయకుండానే పూడ్చవచ్చు! చెవుల చీము, రక్తం పూర్తిగా ఆపవచ్చు, పూర్తిగా చెముడు అయిన వాళ్ళను సరిచేయలేకపోవచ్చు గానీ, ఇప్పుడిప్పుడే చెముడు మొదలైన చాలామందిని తిరిగి హోమియోతో నార్మల్ గా మార్చవచ్చు! చెవి నుంచి చిన్నప్పటినుండీ నాడి కారే సమస్య తిరిగి తిరిగి ఎంతగా వేదిస్తున్నా, చెవిలోకి ఎటువంటి చుక్కల మందులూ వాడకుండా, ఆపరేషన్లూ చేయకుండా, తీపి హోమియో బిళ్ళలు చప్పరిస్తూ, హాయిగా నయం చేసుకోవచ్చు! ప్రతీ అనారోగ్య సమస్యలకూ హోమియోలో ఖచ్చితంగా మందులు ఉంటాయి, మంచి డాక్టర్ ని పట్టుకొని అన్ని సమస్యలూ సంపూర్ణంగా కడిగేసుకోవడమే బెటర్! 


సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 



పంచాంగం 17.10.2026 Saturday

  ఈ రోజు పంచాంగం 17.10.2026 Saturday


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష సప్తమి తిథి స్థిర వాసర మూల నక్షత్రం అతిగండ యోగః గరజి కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు. 


శ్రాద్ధ కర్మ తిథి : సప్తమి.



 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        సప్తమోధ్యాయః

                    జ్ఞాన విజ్ఞాన యోగము


వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున ।

భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన ।। 26 ।।



ప్రతిపదార్థ;



 వేద — తెలుసును; అహం — నేను (నాకు); సమతీతాని — జరిగిపోయిన (భూతకాలం); వర్తమానాని — ప్రస్తుతం జరుగుతున్న (వర్తమాన కాలం); చ — మరియు; అర్జున — అర్జునా; భవిష్యాణి — జరగబోయే (భవిష్యత్ కాలం); చ — మరియు; భూతాని — సమస్త ప్రాణులు; మాం — నన్ను; తు — కానీ; వేద — తెలుసుకొనుట; న కశ్చన — ఎవరూ లేరు.




తాత్పర్యము:


 

అర్జునా! నాకు భూత, వర్తమాన, భవిష్యత్తు అంతా తెలుసు, మరియు సమస్త ప్రాణులు అన్నీ తెలుసు; కానీ నేను ఎవరికీ తెలియను.



వివరణ :


భగవంతుడు సర్వజ్ఞుడు. తాను ‘త్రికాల-దర్శి’ అని ఇక్కడ ప్రకటిస్తున్నాడు – జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి (భూత-వర్తమాన-భవిష్యత్) అన్నీ ఆయనకి తెలుసు. మనకు, కొద్ది గంటల క్రితం మనం ఏమి ఆలోచించామో మనకే గుర్తుండదు. కానీ, అసంఖ్యాకమైన ప్రతి ఒక్క జన్మలో, ప్రతి సమయంలో, విశ్వంలో అనంతమైన జీవుల యొక్క ఆలోచనలు, మాటలు, మరియు పనులు, అన్నీ భగవంతునికి గుర్తు ఉంటాయి. ఇవే ప్రతి జీవాత్మ యొక్క ‘సంచిత కర్మలు’ అంటే (అనంతమైన జన్మల నుండి ఉన్న కర్మల రాశి). కర్మ సిద్ధాంత రూపంలో ఫలాలను/న్యాయాన్ని జీవులకు అందించటానికి భగవంతుడు దీని లెక్క గణిస్తాడు. అందుకే, తనకు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు అన్నీ తెలుసు అంటున్నాడు. ముండకోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:


యః సర్వజ్ఞః సర్వవిద్యస్య జ్ఞానమయం తపః (1.1.9)


‘భగవంతుడు అన్నీ తెలిసినవాడు, సర్వసాక్షి మరియు సర్వజ్ఞుడు. ఆయన తపస్సు జ్ఞాన మయము”.


తనకు అన్నీ తెలిసినా, తాను మాత్రం ఎవ్వరికీ తెలియను అని ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు అంటున్నాడు. భగవంతుడు తన మహిమలు, కీర్తి, శక్తులు, గుణములు, మరియు వ్యాప్తి లలో అనంతుడు. మన బుద్ధి పరిమితమైనది, కాబట్టి అది సర్వేశ్వరుడైన భగవంతుడిని అర్థం చేసుకోలేదు. సకల వేద శాస్త్రాలు ఇలా పేర్కొంటున్నాయి.


నైషా తర్కేణ మతిరాపనేయా (కఠోపనిషత్తు 1.2.9)


“భగవంతుడు మన బుద్ధి యొక్క తర్కమునకు అతీతుడు”


యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ (తైత్తిరీయ ఉపనిషత్తు 2.9.1)


‘మన మనస్సు మరియు వాక్కు భగవంతున్ని చేరుకోలేవు.’


రామ అతర్క్య బుద్ధి మన బానీ, మత హమార అస సునహి సయానీ


(రామచరితమానస్)


‘భగవంతుడు, వాదనతో లేక భాషణతో లేక మనోబుద్ధులతో, విశ్లేషించబడలేడు’


ఒకే ఒక వ్యక్తిత్వం భగవంతుడుని తెలుసుకొనగలదు, అది భగవంతుడే. ఆయన ఏదేని ఒక జీవాత్మపై తన కృప చూపాలనుకుంటే, తన బుద్ధిని ఆ అదృష్ట జీవాత్మకు ప్రసాదిస్తాడు. భగవంతుని శక్తిని కలిగి ఉన్న ఆ సౌభాగ్యవంతమైన జీవాత్మ అప్పుడు భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతుంది. ఆ ప్రకారంగా, భగవంతుడిని తెలుసుకోగోరే ప్రక్రియలో కృప అనేది అత్యంత ప్రధానమైనది. ఈ విషయం 10.11వ మరియు 18.58వ శ్లోకాలలో ఇంకా విశదంగా వివరించబడినది.

17-10-2026 శనివారం రాశి ఫలితాలు

 శ్రీ మాత్రేనమః🙏

శ్రీ గురుభ్యోనమః 🙏

 17-10-2026 శనివారం రాశి ఫలితాలు


మేషం


దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి. తల్లి తరపు బందు వర్గంతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.        

---------------------------------------


వృషభం


అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.       

---------------------------------------


మిధునం


అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. గృహమున కొందరి ప్రవర్తన మానసిక ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.         

---------------------------------------


కర్కాటకం


ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల కష్టం ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. ఇంటా బయట మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. 

---------------------------------------


సింహం


భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.      

---------------------------------------


కన్య


కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఋణ సమస్యల నుండి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.       

---------------------------------------


తుల


పాత ఋణాలు తీర్చగలుగుతారు. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి.       

---------------------------------------


వృశ్చికం


వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు. సమాజంలో కీర్తి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం విద్యా విషయాలపై కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.        

---------------------------------------


ధనస్సు


బంధు మిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి పనులు పూర్తికావు.           

---------------------------------------


మకరం


ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. భూ క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.          

---------------------------------------


కుంభం


ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలను తీసుకుని ముందుకు సాగడం మంచిది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.               

---------------------------------------


మీనం

 

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. 

---------------------------------------