17, అక్టోబర్ 2026, శనివారం

దేవీ త్రిరాత్ర వ్రతదీక్ష....

దేవీ త్రిరాత్ర వ్రతదీక్ష.... 


 అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత పవిత్రమైనవి. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు జగన్మాతను తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. భక్తితో అమ్మవారిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.


త్రిరాత్ర వ్రతం అంటే ఏమిటి?


తొమ్మిది రోజుల పాటు నవరాత్రి వ్రతం ఆచరించలేనివారు సప్తమి, అష్టమి, నవమి మూడు రోజులు అమ్మవారిని పూజిస్తారు.

 ఈ మూడు రోజుల దీక్షనే దేవీ త్రిరాత్ర వ్రతము అంటారు.


దుర్గాష్టమి:

 అమ్మవారికి కుంకుమార్చన, సహస్రనామ పూజ, లలితా సహస్రనామ పారాయణం చేస్తారు.


మహానవమి:

 అమ్మవారిని విశేషంగా పూజించి, ఆయుధ పూజ నిర్వహిస్తారు.


విజయదశమి

 జమ్మి చెట్టుకు పూజ చేసి, శమీ పూజ లేదా అపరాజిత పూజ చేస్తారు.


ఈ నవరాత్రుల్లో నిత్య పూజలు, నైవేద్యాలు, కుంకుమార్చనలు, పుష్పాలంకరణలు, కుమారీ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. చిన్నపిల్లలకు పప్పు బెల్లాలు, శనగలు పంచి, ముత్తైదువులకు పసుపు కుంకుమలతో తాంబూలం అందిస్తారు.


శ్రీ మహాకాళీ – 

మహాలక్ష్మీ – 

మహాసరస్వతీ దేవతల అనుగ్రహం అందరికీ కలగాలి....


ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః*


  సమస్త లోకాః సుఖినో భవంతు ...

శ్రీ సద్గురు పీఠం.... .✍️

కామెంట్‌లు లేవు: